మమతామోహన్‌దాస్
తమిళసినిమా: అరుంధతి నేనే అవ్వాల్సిందని అని నటి మమతామోహన్‌దాస్ పేర్కొంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ బహుభాషా నటిగా రాణించిన మమతా మంచి గాయని కూడా. తెలుగులో నాగార్జున వంటి స్టార్‌తో జత కట్టి స్టార్ హీరోయిన్‌గా రాణించిన మలయాళీ భామ ఆ తరువాత అనూహ్యంగా వెనుకబడింది. అరుంధతి చిత్రాన్ని నటి అనుష్క జీవితంలో మరచిపోలేదు. తెలుగు సినీ చరిత్ర పుటల్లో ఆ చిత్రానికి కచ్చితంగా ఒక పేజీ ఉంటుంది.
అంత ఘన విజయం సాధించిన చిత్రం అరుంధతి. నటి అనుష్కకు అంత పేరును ఆపాదించి పెట్టిన ఆ చిత్రం మమతను దాటి అనుష్కకు వచ్చిందట. దీని గురించి మమత ఒక భేటీలో తెలుపుతూ మొదట్లో తాను నటనపై ఆసక్తి చూపలేదని అంది. తొలి నాలుగేళ్లలో వచ్చిన అవకాశాలను చేసుకుంటూ పోయాను కానీ, చాలా అయోమయంలో ఉండిపోయానని చెప్పింది. మంచి కథా పాత్రలను ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనేలేదని అంది.
అరుంధతిలో నటించే అవకాశం తొలుత తనకే వచ్చిందని, చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ఆ అవకాశాన్ని వదులుకున్నానని చెప్పింది. ఆ తరువాత ఆ చిత్రంలో అనుష్క నటించడం ఆమెకా చిత్రం స్టార్‌డమ్ తెచ్చిపెట్టడం గురించి తెలుసుకున్నానని తెలిపింది. ఆ తరువాతే చిత్రాలపై అవగాహన పెరిగిందని, ఆ తరువాత రెండు నెలల్లోనే జీవితంలో పెద్ద షాక్‌కు గురయానని చెప్పింది. కేన్సర్‌తో తన ఆరోగ్యం దెబ్బతిందని చెప్పింది. దీంతో సినిమా కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత నివ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని మమతామోహన్‌దాస్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment