చాలామందికి చీకటంటే భయం. కానీ హారర్ సినిమాలు చూడటానికి రెడీ. మరికొందరు అర్థరాత్రి ఒంటరిగా ఇలాంటి మూవీస్ చూడాలని కోరిక. అలాంటి వాళ్ల కోసమే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న 12 బెస్ట్ హారర్ మూవీస్ లిస్టుతో వచ్చేశాం. వీటిని చూస్తుంటే ఓవైపు థ్రిల్లింగ్ మరోవైపు భయం గ్యారంటీ. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఇవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయ్?
(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)
ఓటీటీల్లో బెస్ట్ హారర్ మూవీస్
మణిచిత్ర తాళు (1993) - మనకు బాగా తెలిసిన 'చంద్రముఖి' చిత్రానికి ఇది ఒరిజినల్. మలయాళంలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
13బీ (2009) - ఇదో డబ్బింగ్ సినిమా. ఓ ఇంట్లో జరిగిన వింత సంఘటనల ఆధారంగా తీశారు. హాట్‌స్టార్‌లో అది కూడా తెలుగులోనే ఉంది.
అరుంధతి (2009) - స్వీటీ అనుష్క శెట్టి నటించిన తెలుగు హారర్ మూవీ ఇది. బొమ్మాళీ అని అప్పట్లో అందరినీ భయపెట్టింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
భ్రమయుగం (2024) - తెలుగులో డబ్బింగ్ అయిన మలయాళ హారర్ మూవీ ఇది. కేవలం మూడు పాత్రలతో పాడుబడ్డ ఇంటిలో జరిగిన స్టోరీతో తీశారు. సోనీ లివ్ ఓటీటీలో ఉంది.
పిజ్జా (2012) - విజయ్ సేతుపతికి స్టార్‌డమ్ తీసుకొచ్చిన సినిమా ఇది. పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవాలే కథ. హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.
భూతకాలం (2022) - దెయ్యాన్ని ఏ మాత్రం చూపించకుండా భయపెట్టిన సినిమా ఇది. మలయాళ సినిమానే కానీ తెలుగు డబ్బింగ్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
మసూద (2022) - అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా. ఆహా ఓటీటీలో ఉంది. చూస్తే ప్యాంట్ తడిసిపోవడం గ్యారంటీ.
హౌస్ ఆఫ్ సీక్రెట్స్ (2021) - ఇది మూడు ఎపిసోడ్స్ ఉన్న డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ఇది. నిజ జీవిత సంఘటనలతో తీశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే ఉంది.
తుంబాడ్ (2018) - అత్యాశ మనిషిని ఎలా నాశనం చేస్తుందో అనే కాన్సెప్ట్‌కి హారర్ జోడించి తీసిన సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
కౌన్ (1999) - రాంగోపాల్ వర్మ తీసిన హిందీ సినిమా ఇది. డిఫరెంట్ సౌండ్స్‌తో తీసిన ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లోనే ఉంది.
గృహం (2017) - సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా.. వెన్నులో వణుకు పుట్టేలా భయపెడుతుంది. జియో సినిమా ఓటీటీతో పాటు యూట్యూబ్‌లోనూ తెలుగులోనే అందుబాటులో ఉంది.
డీమోంటే కాలనీ (2015) - బంగ్లాలో జరిగే కథతో తీసిన క్రేజీ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనే ఉందండోయ్!
(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)
Comments
Please login to add a commentAdd a comment