Pizza
-
పిజ్జా సువాసన గల పెర్ఫ్యూమ్..!ఎక్కడ దొరకుతుందంటే..
పిజ్జా అంటే ఇష్టపడేవాళ్లకు నచ్చుతుందేమో ఈ పెర్ఫ్యూమ్. ఆహార పదార్థాల ఘుమ ఘుమల వాసనతో కూడిన ఫెర్ఫ్యూమ్ ఏం బాగుంటుందనే సందేహం అందిరలోనూ కలుగుతోంది. కానీ పిజ్జాలకు ప్రస్ధిగాంచిన డొమినోస్ మాత్రం వాలెంటైన్స్‌డే సందర్భంగా ఈ వెరైటీ పెర్ఫ్యూమ్ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. పైగా తన పిజ్జా కస్టమర్లకు ఇది కచ్చితంగా నచ్చుతుందని ధీమాగా చెబుతోంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే..ఈ వాలెంటైన్స్ డేకి పిజ్జా దిగ్గజం.. పెప్పరోని పిజ్జా లాంటి వాసన వచ్చే పెర్ఫ్యూమ్ను విడుదల చేసింది. పిజ్జా బాక్స్‌లో ఉన్న అనుభూతి కలుగుతుందట. ఈ ఫెర్ఫ్యూమ్ లాంఛ్‌కి సంబంధించిన వీడియోడని కూడా నెట్టింట షేర్ చేసింది డొమినోస్. అంటే ఇది పిజ్జా లాగిద్దామనే కోరిక పెంచుతుందేమో మరీ..!. ఇది తినాలనే కోరికను కలిగించేలా ఉంటుందే తప్ప ప్రేమికుల రోజున ఆహ్లాదాన్ని అందించి, ఒక్కటయ్యేలా ఫీల్‌ని ఎలా తెప్పిస్తుందని నెటిజన్లు సందేహాలు లేవెనెత్తారు. అయితే డొమినెస్ మాత్రం ఈ పెర్ఫ్యూమ్ని పెప్పరోని ప్యాషన్ పిజ్జా నుంచి ప్రేరణ పొందినట్లు తెలుపుతోంది. ఈ పెర్ఫ్యూమ్ స్పైసీ, పెప్పరీ నోట్స్ , వెచ్చని వుడీ అండర్టోన్లతో రూపొందించారట. ఇది పేరుకి తగిన విధంగా పిరమిడ్ ఆకారపు బాటిల్లో పిజ్జా ముక్కలను పోలి ఉంటుంది. అయితే ఇది కొనుగోలుకు అందుబాటులో లేదట. డొమినోస్ ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు దీన్ని 65 మంది లక్కీ విన్నర్స్కి గిఫ్ట్‌గా ఇవ్వనుందట. వారంతా ఆ 30 ఎంఎల్ పిజ్జా సెంట్‌ని బహుమతిగా పొందుతారట. ఇది కేవలం యూకే, ఐర్లాండ్‌ల్లో ఉండే ప్రజలకే ఈ అవకాశం దక్కుతుందని పేర్కొంది. నెటిజన్లు మాత్రం ఇదేం వెర్రీ ఇలాంటి పెర్ఫ్యూమ్లను లాంఛ్ చేస్తారా..? అంటూ తిట్టిపోస్తున్నారు. అంతేగాదు డొమినెస్లో పనిచేసేవాడికి ఆ సువాసన ఎల్లప్పుడూ ఉచితంగానే దొరుకుతుంది కదా అని సెటైర్లు వేస్తున్నారు. View this post on Instagram A post shared by Luke Debono 🇲🇹 (@lukedebono1) (చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!) -
రెండే రెండు పిజ్జాలు.. రూ. 8 వేల కోట్లు
ఒక బిట్‌కాయిన్ ధర ఈ రోజు సుమారు రూ. 80 లక్షల కంటే ఎక్కువే. కాబట్టి ఎవరైనా 10,000 బిట్కాయిన్లను కలిగి ఉంటే.. అతడు పెద్ద సంపన్నుడనే చెప్పాలి. అయితే కొన్ని సంవత్సరాలకు ముందు ఓ వ్యక్తి 10వేల బిట్కాయిన్లు (Bitcoins) చెల్లించి కేవలం రెండు పిజ్జాలను కొనుగోలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.అమెరికాకు చెందిన ఐటీ ప్రోగ్రామర్ 'లాస్లో హనిఎజ్' (Laszlo Hanyecz) 2010 మే 17న తన దగ్గరున్న 10వేల బిట్కాయిన్లను డాలర్లలోకి మార్చుకున్నాడు. ఆ డాలర్లతో 2 డామినోస్ పిజ్జాలను ఆర్డర్ చేసుకుని తినేసాడు. ఆ బిట్కాయిన్ల విలువ నేడు రూ. 8వేల కోట్లు. అయితే హనిఎజ్ ఇప్పుడు పశ్చాతాప పడిన ఏం ప్రయోజనం లేదు.బిట్‌కాయిన్2010లో ఒక బిట్‌కాయిన్ విలువ 0.05 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.29 రూపాయలకు సమానమన్నమాట. అయితే ఈ రోజు ఒక బిట్‌కాయిన్ విలువ రూ. 80 లక్షల కంటే ఎక్కువ. దీన్ని బట్టి చూస్తే బిట్‌కాయిన్ విలువ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.అమెరికా ఎన్నికల్లో 'డొనాల్డ్ ట్రంప్' (Donald Trump) గెలిచిన తరువాత బిట్‌కాయిన్ విలువ భారీగా పెరిగింది. కొన్నాళ్ల కిందట తక్కువ ధరకే అందుబాటులో ఉన్న ఇప్పుడు లక్ష డాలర్ల మార్కుని దాటేసింది. కాగా ఇటీవల కాలంలో బిట్‌కాయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ట్రంప్ గెలుపు తరువాత బిట్‌కాయిన్ విలువ తగ్గడం ఇదే మొదటిసారి. -
ఈ సినిమాలు చూస్తే గజగజ వణకడమే! ఏది ఏ ఓటీటీలో ఉందంటే?
చాలామందికి చీకటంటే భయం. కానీ హారర్ సినిమాలు చూడటానికి రెడీ. మరికొందరు అర్థరాత్రి ఒంటరిగా ఇలాంటి మూవీస్ చూడాలని కోరిక. అలాంటి వాళ్ల కోసమే ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న 12 బెస్ట్ హారర్ మూవీస్ లిస్టుతో వచ్చేశాం. వీటిని చూస్తుంటే ఓవైపు థ్రిల్లింగ్ మరోవైపు భయం గ్యారంటీ. ఇంతకీ ఈ సినిమాలేంటి? ఇవి ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయ్?(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)ఓటీటీల్లో బెస్ట్ హారర్ మూవీస్మణిచిత్ర తాళు (1993) - మనకు బాగా తెలిసిన 'చంద్రముఖి' చిత్రానికి ఇది ఒరిజినల్. మలయాళంలో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.13బీ (2009) - ఇదో డబ్బింగ్ సినిమా. ఓ ఇంట్లో జరిగిన వింత సంఘటనల ఆధారంగా తీశారు. హాట్‌స్టార్‌లో అది కూడా తెలుగులోనే ఉంది.అరుంధతి (2009) - స్వీటీ అనుష్క శెట్టి నటించిన తెలుగు హారర్ మూవీ ఇది. బొమ్మాళీ అని అప్పట్లో అందరినీ భయపెట్టింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.భ్రమయుగం (2024) - తెలుగులో డబ్బింగ్ అయిన మలయాళ హారర్ మూవీ ఇది. కేవలం మూడు పాత్రలతో పాడుబడ్డ ఇంటిలో జరిగిన స్టోరీతో తీశారు. సోనీ లివ్ ఓటీటీలో ఉంది.పిజ్జా (2012) - విజయ్ సేతుపతికి స్టార్డమ్ తీసుకొచ్చిన సినిమా ఇది. పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తికి ఎదురైన వింత అనుభవాలే కథ. హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.భూతకాలం (2022) - దెయ్యాన్ని ఏ మాత్రం చూపించకుండా భయపెట్టిన సినిమా ఇది. మలయాళ సినిమానే కానీ తెలుగు డబ్బింగ్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.మసూద (2022) - అంచనాల్లేకుండా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన తెలుగు సినిమా. ఆహా ఓటీటీలో ఉంది. చూస్తే ప్యాంట్ తడిసిపోవడం గ్యారంటీ.హౌస్ ఆఫ్ సీక్రెట్స్ (2021) - ఇది మూడు ఎపిసోడ్స్ ఉన్న డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ ఇది. నిజ జీవిత సంఘటనలతో తీశారు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనే ఉంది.తుంబాడ్ (2018) - అత్యాశ మనిషిని ఎలా నాశనం చేస్తుందో అనే కాన్సెప్ట్‌కి హారర్ జోడించి తీసిన సినిమా ఇది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.కౌన్ (1999) - రాంగోపాల్ వర్మ తీసిన హిందీ సినిమా ఇది. డిఫరెంట్ సౌండ్స్‌తో తీసిన ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లోనే ఉంది.గృహం (2017) - సిద్ధార్థ్ నటించిన ఈ సినిమా.. వెన్నులో వణుకు పుట్టేలా భయపెడుతుంది. జియో సినిమా ఓటీటీతో పాటు యూట్యూబ్‌లోనూ తెలుగులోనే అందుబాటులో ఉంది.డీమోంటే కాలనీ (2015) - బంగ్లాలో జరిగే కథతో తీసిన క్రేజీ థ్రిల్లర్ మూవీ. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులోనే ఉందండోయ్!(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!) -
పిజ్జాలు పంపించి.. రూ.కోట్ల డీల్స్ పట్టాడు!
కంపెనీలు తమ వ్యాపారం కోసం క్లయింట్లను ఆకర్షించడానికి చాలా చేస్తుంటారు. అయితే ఒక స్టార్టప్ సీఈఓ క్లయింట్లకు ఫుడ్ ట్రీట్ ఇచ్చి కోట్ల రూపాయల డీల్స్ దక్కించుకున్న సంగతి మీకు తెలుసా? ఈ డీల్స్ ద్వారా ఆ స్టార్టప్‌కు ఊహించనంత ఆదాయం వచ్చింది.న్యూయార్క్‌కు చెందిన టెక్ స్టార్టప్ యాంటిమెటల్ కో ఫౌండర్, సీఈవో మాథ్యూ పార్క్‌హస్ట్ గత ఏప్రిల్ నెలలో వెంచర్ క్యాపిటల్ సంస్థలు, టెక్ ఇన్ఫ్లుయన్సర్లతో సహా పలువురికి పిజ్జాలను కొనుగోలు పంపించారు. ఇందు కోసం 15,000 డాలర్లు (సుమారు రూ.12.5 లక్షలు) ఖర్చు పెట్టారు. బీటా దశలో తమ కంపెనీ గురించి అవగాహన పెంచడమే ఈ ట్రీట్ ఉద్దేశం.కేవలం రెండు నెలల్లోనే యాంటిమెటల్ తన ఖర్చులను లాభదాయక ఒప్పందాలుగా మార్చి ఒక మిలియన్ డాలర్లకు పైగా (రూ.8.3 కోట్లు) ఆదాయాన్ని ఆర్జించింది. పిజ్జాతో ట్రీట్ చేసిన 75 కంపెనీలు పార్క్ హస్ట్ క్లయింట్లుగా మారాయి. ఈ విషయాన్ని సీఈవో పార్క్‌హస్ట్ సీఎన్‌బీసీ మేక్ ఇట్తో స్వయంగా వెల్లడించారు. నిజానికి 'పిజ్జా' తమ ఫస్ట్ ఛాయిస్ కాదని చెప్పారు. షాంపైన్ పంపించాలనుకున్నామని, అయితే దానికి చాలా ఖర్చవుతుందని, పిజ్జాను ఎంచుకున్నట్లు పార్క్‌హస్ట్ వివరించారు. -
పిజ్జా లవ్ : ఇద్దరమ్మాయిలు చేసిన పని తెలిస్తే షాక్ అవుతారు
పిజ్జా అంటే చెప్పలేనంత ప్రేమ ఇద్దరు స్నేహితులు చేసిన తెలిస్తే షాక్ అవుతారు. ఒకరోజు సెలవుపెట్టి ఏకంగా విమానంలో వెళ్లి మరీ పిజ్జా ఆరగించి వచ్చారు. దీనికి ఎంత ఖర్చయిందో తెలుసా? మాంచెస్టర్ ఈవెనింగ్ న్యూస్ ప్రకారం, యూకేకుచెందిన మోర్గాన్ బోల్డ్, ఆమె స్నేహితురాలు జెస్ వుడర్ ఇద్దరూ "ఎక్స్ట్రీమ్ డే ట్రిప్"ని ప్లాన్ చేసారు. అంటే ఒక్క రోజులోనే తిరిగి ఆఫీసుకు వచ్చేసేలా అన్నమాట. దీని ప్రకారం ఇద్దరు స్నేహితులు లివర్‌పూల్ నుండి పిసాకు (ఇటలీలో) మాంచెస్టర్ విమానాశ్రయంలో విమానంలో వెళ్లారు. డే రిటర్న్ ఫ్లైట్లను బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 24న ఉదయం 6 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరుకోవడం విశేషం. ఈ సుడిగాలి పర్యటనలో షాపింగ్ చేసుకొని, తమకిష్టమైన పిజ్జాను ఆస్వాదించారు.బోల్డ్, వుడర్ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ముందు ఫోటోలు తీసుకున్నారు. గూగుల్ మ్యాప్‌లో మంచి పిజ్జాతో రెస్టారెంట్లకు వెతుక్కున్నారు. విమానచార్జీలు, విమానాశ్రయం పార్కింగ్, ఫుడ్ కలిపి మొత్తం పర్యటనకు 170 పౌండ్లు (రూ. 17,715) వెచ్చించామని తెలిపారు. లివర్పూల్నుంచి లండన్‌కి ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. పైగా అక్కడ పిజ్జా ఇతర డ్రింక్స్ ఖరీదు చాలా ఎక్కువ. దాదాపు అదే డబ్బుతో వేరే దేశం వెళలి వచ్చామంటూ చెప్పుకొచ్చారు. పిసా టవర్‌ను చూస్తూ పిజ్జా తినడం అద్భుతం. ఇక్కడఆహార ధరలు రీజనబుల్‌గానే ఉన్నాయంటూ వెల్లడించారు. వచ్చిన విమానంలోనే తిరిగి ఇంటికి వెళ్లడం ఇంకా బావుందంటూ తెగ సంబరపడిపోయారు. -
ఆరేళ్లుగా పిజ్జా లాగించేస్తున్నాడు..కానీ అతను..!
పిజ్జా, బర్గర్లు వంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు పదేపదే యువతను హెచ్చరిస్తుంటారు. అదీగాక పిజ్జా, బర్గర్లాంటివి ఎక్కువగా తింటే ఒబెసిటీ వచ్చే సమస్య ఎక్కువ కూడా. కానీ ఈ వ్యక్తికి పిజ్జాలంటే విపరీతమైన పిచ్చి. అతనికి అవంటే అలాంటి ఇలాంటి ఇష్టం కాదు. రోజంతా పిజ్జా ఉంటే చాలు వాటితోనే లంచ్, డిన్నర్లు కానిచ్చేస్తాడు మనోడు. ఇలా ఆరేళ్లుగా లాగించేస్తున్నాడట పిజ్జాలని. మరీ ఇంతలా తింటున్నాడు కదా అతడి ఫిట్నెస్ ఎలా ఉంటుందా..? అనే కదా సందేహం. అతడెలా ఉంటాడంటే..?అమెరికాకు చెందిన కెన్నీ వైల్డ్స్కి పిజ్జా అంటే మహా ఇష్టం. ఈ ఇటాలియన్ వంటకం అంటే కెన్నీకి ఎంతగా ఇష్టమంటే కనీసం రోజులో ఒక్కస్లేసు పిజ్జా లేకుండా గడవదు. అంతేగాదు అతడు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లో పిజ్జా ఉంటే చాలు హాయిగా దానితోనే గడిపేస్తాడు. అతనికి అది అస్సలు బోరుగా అనిపించందట. ఈ విషయంలో అతడి భార్య కూడా సపోర్ట్ చేయడం విషయం. ఆమె కూడా అతడికి ఇష్టమైన పిజ్జాలు అతడి భోజనంలో ఉండేలా చూస్తుందట. ఆఖరికి ఆఫీస్‌లో కూడా పిజ్జాలు ఉండాల్సిందేట. చాలామంది తనలా పిజ్జాలు ఇంతలా తినలేరని ఛాలెంజ్ విసురుతున్నాడు కూడా. అంతేగాదు ఇన్‌కేస్ ఏదైనా కారణం చేత కేఫ్‌లు క్లోజ్ అయితే తన ఇంటికి చాలా దూరంలో ఉండే కేఫ్‌లు వద్దకు వెళ్లి మరీ పిజ్జాలు తింటాడట. ఇంతలా పిజ్జాలు లాగించేస్తున్న కెన్నీ చూడటానికి మాత్రం అ స్సలు లావుగా ఉంటాడు. మంచి స్మార్ట్‌గా ఫిట్నెస్గా కనిపిస్తాడు. ఇలా అతడు ఆరేళ్ల నుంచి పిజ్జాలను పిచ్చి పిచ్చిగా తినేస్తున్నా.. తాను ఫిట్‌గా హెల్తీగా ఉన్నానని ధీమాగా చెబుతున్నాడు. అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవట. వినడానికి చాలా ఆశ్చర్యం ఉంది కదూ!. "అతి సర్వత్ర వర్జయేత్" అన్న నానుడి ఇతడి విషయంలో పనికిరానిదిగా ఉంది కదా..!. నచ్చిందని అతిగా తింటే శరీరం అంగీకరించక పలు సమస్యలు రావడం జరగుతుంది. ఇతడి విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం అనేది నమ్మలేని నిజంలా ఉంది. కొన్ని సర్వేల్లో కూడా మనిషి ఇష్టమైన ఆహారం ఆరోగ్య రీత్యా సరిపడనిది అయినా ఏం చేయదని విన్నాం. బహుశా ఇదే కెన్నీ విషయంలో జరుగుతుందేమో..!.(చదవండి: వడదెబ్బ నుంచి రక్షించే మహాభారత కాలం నాటి మజ్జిగ పానీయాలు ఇవే..!) -
మూడే నిమిషాల్లో వేడి వేడి పిజ్జా: పిజ్జా ఏటీఎం, ఎక్కడో తెలుసా?
సాధారణంగా నగదు లావాదేవీలకుపయోగించే ఏటీఎంలతోపాటూ గతంలో గోల్డ్ ఏటీఎంను కూడా చూశాం. తాజాగా పిజ్జా ఏటీఎం కూడా వచ్చేసింది. కేవలం మూడే మూడు నిమిషాల్లో వేడి వేడి పిజ్జా మనకందించే ఏటీఎం. ఈ పేరు వింటుంటేనే.. మీచుట్టూ పిజ్జా అరోమా నిండిపోయి, నోరూరుతోంది కదా? మరి ఎక్కడ? ఏంటి? ఎలా? ఈ వివరాలు కావాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.. ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి స్పీడీ పిజ్జా మెషిన్ ఇది. చండీగఢ్‌లోని సుఖ్నా సరస్సు సమీపంలో ఇది కొలువు దీరింది. యమ్మీ యమ్మీ పిజ్జా కేవలం 3 నిమిషాల్లో డెలివరీ అవుతుంది. చక్కటి ప్రకృతి అందాలకే కాదు రుచికరమైన పిజ్జా కేంద్రంగా ఇపుడు సుఖ్నా సరస్సు నిలుస్తోంది. పర్యాటకులకు హాట్‌స్పాట్‌గా ఉన్న సుఖ్నా సరస్సు వివిధ వంటకాలకు పాపులర్. ఇపుడిక పిజ్జా వెండింగ్ మెషీన్ మరింత ఎట్రాక్షన్ అని చండీగఢ్ ఇండస్ట్రియల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు. (మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ఈ ప్రత్యేకమైన ఆలోచన ఫ్రాన్స్ ప్రేరణగా వచ్చిందని ఐమ్యాట్రిక్స్ వరల్డ్ వైడ్ లైసెన్స్ పొందిన డాక్టర్ రోహిత్ శర్మ వెల్లడించారు. తమ మొహాలీ ఆధారిత ఫ్యాక్టరీలో యంత్రాన్నితయారు చేయాలని నిర్ణయించుకున్నారట. గత నెలలో దీన్ని ఇన్స్టాలేషన్ చేసినప్పటినుంచీ విపరీతమైన ప్రజాదరణ పొందిందన్నారు ఆయన. ప్రస్తుతం రోజుకు సగటున 100 దాకా ఆల్ వెజిటేరియన్ పిజ్జాలను సిద్ధం చేస్తోంది. వారాంతాల్లో, ఈ సంఖ్య 200-300 మధ్య ఏదైనా పెరుగుతుంది. ఇది కేవలం మొట్టమొదటిది, కొత్తదనంతో కూడుకున్నది మాత్రమే కాదని, డొమినోస్, పిజ్జా హట్ లాంటి వాటితో పోలిస్తే దాదాపు 35శాతం తక్కువ ధరకే అందిస్తున్నామన్నారు. త్వరలోనే మరిన్ని ప్రధాన నగరాల్లో దీన్ని ఇన్స్టాల్ చేస్తామని చెప్పారు. దీంతో పిజ్జా ప్రియులందరికీ ఇది వీకెండ్ డెస్టినేషన్‌గా మారిపోనుంది. Pearl Kapur మూడు నెలల్లోనే రూ. 9800 కోట్లు : ఎలా బ్రో..?! మెషిన్లోకిఎంట్రీ ఇచ్చి తమకిష్టమైన పిజ్జాను నమోదు చేయగానే ఒక రోబోటిక్ చేయి అవసరమైన టాపింగ్‌తో పిజ్జా బేస్‌ని ఎంచుకొని, దానిని కాల్చి, కేవలం మూడు నిమిషాల్లో సర్వ్ చేస్తుందట. అంతేకాదు ఏకకాలంలో టాపింగ్స్‌తో ఏడు పిజ్జా బేస్‌లను సిద్ధం చేసే సామర్థ్యం దీని సొంతం. iMatrix వరల్డ్ వైడ్ గతంలో ముంబై రైల్వే స్టేషన్లో ఇలాంటి ఏటీఎంను లాంచ్ చేసింది. కానీ కోవిడ్ ప్రభావం కారణంగా మూసివేయాల్సి వచ్చింది. -
పిజ్జాతో రికార్డ్ బ్రేక్, ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా..
పిజ్జా.. చాలామంది యంగ్‌స్టర్స్‌కి ఫేవరెట్ రెసిపి. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు? అందుకే సరికొత్త ప్రయోగాలతో పిజ్జా లవర్స్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వరల్డ్ రికార్డ్ కోసం ఇద్దరు ఫ్రెంచ్ చెఫ్‌లు చీజీ మాస్టర్ పిజ్జాను తయారు చేశారు. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని విధంగా 1,001 చీజ్‌లతో పిజ్జా తయారు చేసి సరికొత్త రికార్డ్‌ను సృష్టించారు. వివరాల ప్రకారం.. బెనాయిట్ బ్రూయెల్,ఫాబియన్ మోంటెల్లానికో, సోఫీ హటాట్ రిచర్ట్-లూనా, ఫ్లోరియన్ ఆన్ఎయిర్లు కలిసి ఈ రెసిపీని రెడీ చేశారు. ఇంతకుముందు అత్యధికంగా 834 చీజ్‌లతో తయారు చేసిన పిజ్జా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఇప్పడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ వెయ్యి చీజ్‌లతో క్రేజీ పిజ్జాను తయారు చేశారు. ఇందుకోసం సుమారు 5 నెలలు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా వెరైటీ చీజ్‌లను వెతికి సంపాదించారు. ఇందులో దాదాపు 940 రకాలు ప్రాన్స్‌కి చెందినవి కాగా, మిగిలినవి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సమకూర్చారు. ప్రతి చీజ్ నుంచి రెండు గ్రాముల మోతాదులో చీజ్‌ను పిజ్జాపై టోపింగ్ చేసి ఈ వెరైటీ డిష్‌ను అందించారు. -
Zomato Orders 2023: వీళ్లు తిన్న నూడిల్స్‌తో భూమిని 22 సార్లు చుట్టిరావొచ్చు!
పాతొక రోత.. కొత్తొక వింత. పాశ్యాత్య సంస్కృతుల్ని, ఆహార సంప్రదాయాల్ని మనవాళ్లు ఇష్టపడుతుండడం కొత్త కాకపోవచ్చు. ఇప్పటికే వస్త్రధారణలో వెస్ట్రన్ కల్చర్‌ను దాటేసి పోయారు. తినే తిండిలోనూ అదే ధోరణిని కనబరుస్తున్నారు. సాక్ష్యం ఏంటంటారా?.. దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో అందుకు సమాధానాలు ఇస్తోంది. 2023 మరికొన్నిరోజుల్లో ముగియనున్న తరుణంలో ఆయా ఫుడ్ డెలివరీ సంస్థ ఏడాది మొత్తం మీద ఏ ఫుడ్ ఐటమ్‌ను ఎక్కువగా డెలివరీ చేశామని విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇటలీలో పుట్టిన పిజ్జా భారతీయులు అమితంగా ఇష్టపడే ఆహార వంటకంగా ప్రసిద్ధికెక్కుతోంది. ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో నివేదిక ప్రకారం.. 2023లో భోజన ప్రియులకు అత్యంత ఇష్టమైన ఆహార పదార్ధాలలో బిర్యానీ, పిజ్జాలు వరుస స్థానాల్ని దక్కించుకున్నాయి. ►తన ప్లాట్‌ఫామ్ మీద 10.09 కోట్ల బిర్యానీల కోసం ఆర్డర్ పెట్టుకుంటే, రెండో స్థానంలో ఉన్న పిజ్జాను 7.45 కోట్ల ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో తెలిపింది. ►తద్వారా ఈ ఏడాదిలో పెట్టిన బిర్యానీ ఆర్డర్లతో ఢిల్లీలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను, కోల్‌కతాలో ఉన్న ఐదు కంటే ఎక్కువ ఈడెన్ గార్డెన్ స్టేడియంలతో సమానమైన పిజ్జాలను ఫుడ్ లవర్స్ ఆర్డర్ పెట్టినట్లు పేర్కొంది. ► మూడవ స్థానంలో 4.55 కోట్ల నూడిల్స్ ఆర్డర్ పెట్టారు. ఫుడ్ లవర్స్ పెట్టిన ఆ నూడిల్స్ ఆర్డర్‌తో భూమిని 22 సార్లు చుట్టడానికి ఇది సరిపోతుందని డెలివరీ దిగ్గజం వెల్లడించింది. ►స్విగ్గీలో ఎక్కువగా కేక్‌లు ఆర్డర్ రావడంతో బెంగళూరు కేక్ కేపిటల్‌గా అవతరించింది. ఫుడ్ లవర్స్ ఈ ఏడాది అత్యధికంగా జొమాటోలో బ్రేక్ ఫాస్ట్‌ను ఆర్డర్ పెట్టుకోగా, ఢిల్లీకి చెందిన వినియోగదారులు ఎక్కువ మంది అర్ధరాత్రి ఆర్డర్ చేసుకున్నారు. ►జొమాటోకి ఈ ఏడాదిలో అత్యధికంగా బెంగళూరు నుంచి ఫుడ్ ఆర్డర్లు వచ్చాయి. ఒక్క ఆర్డర్ ఖరీదు అక్షరాల రూ.46,273. అదే సమయంలో రూ.6.6లక్షల విలువ చేసే 1389 గిఫ్ట్ ఆర్డర్లు పెట్టారు. ఆ తర్వాత ముంబై వాసులు ఒక్కరోజే 121 ఆర్డర్లు పెట్టారు. నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో నేషన్ బిగ్గెస్ట్ ఫూడీ జాబితాలో ముంబై నిలిచింది. ఈ ప్రాంతం నుంచి ఏడాది మొత్తం వరకు 3,580 ఆర్డర్లు రాగా.. రోజుకి కనీసం 9 ఆర్డర్లు పెట్టినట్లు జొమాటో హైలెట్ చేసింది. బిర్యానీకి తిరుగులేదు వరుసగా 8వ సంవత్సరం సైతం స్విగ్గీలో ఎక్కువ బిర్యానీ ఆర్డర్ పెట్టినట్లు ఆ సంస్థ తన ఇయర్ ఎండర్ 2023 రిపోర్ట్‌లో తెలిపింది. ప్రతి సెకనుకు 2.5 బిర్యానీ ప్యాకెట్ల ఆర్డర్ ఇక దేశీయంగా ఉన్న ఫుడ్ లవర్స్ ప్రతి సెకండ్‌కు 2.5 బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్ పెట్టారు. వారిలో హైదరాబాద్‌కి చెందిన ఓ వ్యక్తి ఏడాది మొత్తం మీద 1633 బిర్యానీ ఆర్డర్లు పెట్టాడు. దీంతో బిర్యానీని ఎక్కువగా తినే ఫుడీల జాబితాలో హైదారబాద్ వాసులు నిలిచారు. స్విగ్గీ ఆర్డర్లో ప్రతి 6వ ఆర్డర్ ఇక్కడే నుంచే రావడం గమనార్హం. 2023లో ముంబైకి చెందిన ఓ ఫుడ్ లవర్స్ రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
ఫుడ్ లవర్స్‌కి బెస్ట్ ఛాయిస్.. నిమిషాల్లో వంట రెడీ
పిజ్జాను ఎవరైనా ఇష్టపడాల్సిందే. తాజా కూరగాయ ముక్కలు పరచుకుని, మసాలా పొడులు జల్లుకుని, సాస్, చీజ్‌లతో గార్నిష్ చేసుకుని.. బేక్ చేసుకుని తింటే తస్సదియా అదిరిపోతుంది అంటుంటారు పిజ్జా లవర్స్. ప్రతి ఇంట ఇలాంటి డివైస్ ఒకటుంటే చాలు.. కోరుకునే పిజ్జా రుచులను నిమిషాల్లో ఆరగించొచ్చు. చిత్రంలోని ఈ డివైస్.. థర్మోస్టాట్ ఉన్న ఎలక్ట్రిక్ పిజ్జా ఓవెన్ అని చెప్పుకోవాలి. దీని హీటింగ్ ఎలిమెంట్ 1200 వాట్ల వరకు శక్తిని కలిగి ఉంటుంది. దీనిలోని ఫైర్‌ప్రూఫ్ స్టోన్ బేస్.. పిజ్జాను సమానంగా బేక్ చేయడానికి సహకరిస్తుంది. ఇందులో పిజ్జాలతో పాటు కేకులు, బేకింగ్ ఐటమ్స్, టోస్ట్ ఐటమ్స్ ఇలా చాలానే తయారు చేసుకోవచ్చు. అయితే గోపురం ఆకారపు క్రోమ్ పూతతో కూడిన స్టీల్ మూత లోపల వేడిని పెంచి, వేగంగా బేక్ అయ్యేలా చేస్తుంది. దీని అటాచ్డ్ మూతపైన ఉన్న ట్రాన్స్పరెంట్ గ్లాస్.. లోపలున్న ఆహారాన్ని చూపించడానికి యూజ్ అవుతుంది. దాంతో దీనిలో కుకుంగ్ ఈజీ అవుతుంది. ధర 90 డాలర్లు (రూ.7,496) . -
పాము పిజ్జాలు అమ్ముతున్న రవళి
-
ఇంట్లోనే పిజ్జా చేసుకునేలా సరికొత్త మేకర్!
ఈ రోజుల్లో ఇంట్లోనే పిజ్జా మేకర్ ఉండాలని కోరుకుంటున్నారు పిజ్జా లవర్స్. ఈ ప్రొఫెషనల్ ఓవెన్ వంటగదిలో ఉంటే.. ఇష్టమైన పిజ్జాలను నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. మెషిన్ దిగువన ఉండే డ్యూయల్ హీటింగ్ ఎలిమెంట్స్ పైనున్న సిరామిక్ పిజ్జా ట్రేని వేడి చేస్తాయి. ఈ బేకింగ్ స్టోన్ పిజ్జాని వేగంగా గ్రిల్ చేస్తుంది. లో, హై, మీడియం అనే ఆప్షన్స్‌తో రూపొందిన ఈ మేకర్.. ఉపయోగించడం చాలా సులభం. పై మూడు ఆప్షన్స్‌తో టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనిలో సుమారుగా 11 అంగుళాల పిజ్జాను తయారు చేసుకోవచ్చు. ఇదే మోడల్లో కలర్స్, ఆప్షన్స్ వేరువేరుగా ఉండే డివైస్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. (చదవండి: డబుల్ సైడ్ మల్టీమేకర్! నూనె లేకుండా..) -
ఉద్యోగం నుంచి పొమ్మన్న బాస్.. ప్రైవేట్ వీడియోతో ప్రతీకారం తీర్చుకున్న యువతి!
పంజాబ్‌లోని జలంధర్‌లో అశ్లీల వీడియో వైరల్ అయిన ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. స్థానికంగా పిజ్జాషాప్ నిర్వహిస్తున్న ఒక జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ వీడియో ఫేక్ అని, దానిని ఎడిట్ చేశారని ఆ దంపతులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ యువతి గతంలో ఇదే పిజ్జాషాపులో పనిచేసేది. ఆ యువతి యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇటువంటి పనిచేసిందని పోలీసులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొన్ని నెలల క్రితం జలంధర్‌కు చెందిన ఒక జంట పిజ్జా షాప్ ప్రారంభించింది. అయితే ఇటీవల ఈ జంటకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దుకాణదారు తమ ప్రైవేట్ వీడియోను ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సొమ్ము ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య నాలుగు వీడియోలు వైరల్ చేశారని, వాటిలో ఒక వీడియో అభ్యంతరకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోలీసులు ఒక యువతితోపాటు, ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితురాలిని తనీషాగా గుర్తించామని, ఆమెను అరెస్టు చేశామని తెలిపారు. ఆమె గతంలో ఒక పిజ్జా షాపులో పనిచేసేదని, ఆమె పనితీరు నచ్చకపోవడంతో యజమాని ఆమెను పనిలో నుంచి తీసేశారని, దీంతో ఆమె యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, ఆ దుకాణయజమాని దంపతులకు చెందిన ప్రైవేట్ వీడియో వైరల్ చేసిందని తెలిపారు. అలాగే రూ. 20 వేలు కావాలంటూ డిమాండ్ చేసిందన్నారు. కేసు దర్యాప్లు చేస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’.. వంటలక్క చైనా తమ్ముడివా? -
పిజ్జా యాప్ సాయంతో ప్రియుడి అరెస్ట్.. ఇలా కూడా చేయచ్చా? అంటున్న యూజర్లు!
అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన చెరిల్ ట్రెడ్‌వే అనే మహిళను ఆమె ప్రియుడు కొంతకాలంగా బంధించి ఉంచాడు. అయితే ఆమె తాజాగా పిజ్జా హట్ యాప్‌ని ఉపయోగించి పిజ్జా ఆర్డర్ చేసేందుకు అతనిని బెదిరించి ఒప్పించింది. ఆర్డర్‌లోని ప్రత్యేక అభ్యర్థన కోసం కేటాయించిన స్థలంలో ‘దయచేసి సహాయం చేయండి. పోలీసులకు విషయం తెలియజేయిండి’ అని రాసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను బంధవిముక్తురాలిని చేశారు. ఫ్లోరిడాకు చెందిన ఆమె తన ప్రియుడిని కత్తితో బెదిరించి, ఫోను తన చేతిలోకి తీసుకుని, పిజ్జా డెలివరీ యాప్‌లో ఆర్డర్ ప్లేస్ చేస్తూ, తనకు సహాయం చేయాలని కోరిందని పోలీసులు తెలిపారు. పిజ్జా హట్ నుండి ఆర్డర్ చేయడానికి చెరిల్ ట్రెడ్‌వే అనే మహిళ ఈ ప్రయత్నం చేసిందని ఫ్లోరిడా పోలీసులు తెలిపారు. పెప్పరోనితో పాటు స్మాల్ క్లాసిక్ పిజ్జాను ఆర్డర్ చేసిన ఆమె పిజ్జా హట్ సిబ్బందికి.. పోలీసు అధికారుల సహాయం కావాలని మెసేజ్ చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు హైలాండ్స్ కౌంటీలోని ట్రెడ్‌వే ఇంటికి చేరుకున్నారు. పోలీసుల రాకతో ఆమె ఒక చిన్న పిల్లవాడిని పట్టుకొని బయటికి పరిగెత్తింది. ట్రెడ్‌వే బాయ్‌ఫ్రెండ్, 26 ఏళ్ల ఈతాన్ ఎర్ల్ నికెర్సన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా తాము ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఉదంతం చూడలేదని ఆర్డర్ తీసుకున్న రెస్టారెంట్ మేనేజర్ క్యాండీ హామిల్టన్ మీడియాకు తెలిపారు. తాను ఈ సంస్థలో 28 సంవత్సరాలుగా పనిచేస్తున్నానని, ఇలాంటి విచిత్ర ఉదంతం ఎన్నడూ చూడలేదని అన్నారు. కాగా పోలీసులు నికెర్సన్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ట్విట్టర్లో షేర్ అయిన ఈ ఉదంతాన్ని చూసిన నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు యూజర్లు పిజ్జా యాప్ ద్వారా ఇలా కూడా చేయచ్చా? అని అంటుండగా మరికొందరు దీనికి బిల్లు ఎవరు చెల్లిస్తారని ప్రశ్నిస్తున్నారు. మరో యూజర్ ఆమె ధైర్యాన్ని మెచ్చుకోవాలని రాయగా, ఇంకొకరు పోలీసులే ఆ పిజ్జాను డెలివరీ చేస్తే ఇంకా బాగుండేదని అంటున్నారు. అలాగే.. ‘డెలివరీ బాయ్‌కు టిప్ ఇచ్చారా?’.. ‘ఇంతకీ ఆమె పిజ్జా అందుకుందా?’ ‘పెప్పరోనీ పిజ్జా నా ఫేవరెట్’.. అంటూ రకరకాలుగా యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘హలాల్ హాలిడే’ అంటే ఏమిటి? ముస్లిం యువతులకు ఎందుకంత ఇష్టం? In 2015, a Florida woman named Cheryl Treadway was held hostage by her boyfriend, but she convinced him to let her order a pizza using the Pizza Hut app. In the space for special request, she wrote' "Please help. Get 911 to me. 911 hostage help!" Police arrived at the location… pic.twitter.com/LkmSKRAWPW — Morbid Knowledge (@Morbidful) August 25, 2023 -
చికెన్, పిజ్జా, వేడి ఆహారం కావాలంటూ ఖైదీల ఆందోళన.. జైలు గార్డును బంధించి..
జైలులోని ఖైదీలకు మంచి ఆహారం ఇవ్వరనే ఆరోపణలను వింటుంటాం. ఖైదీలు దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటారని కూడా చాలామంది చెబుతుంటారు. అయితే ఇటీవల మిచిగన్‌లోని ఒక జైలులో ఖైదీలకు అందించే ఆహారం విషయంలో ఆందోళన చెలరేగింది. ఇక్కడి సెయింట్ లూయీస్ ఫెసిలీటీలోని ఖైదీలు మంచి ఆహారం కోసం హడలెత్తించే పనిచేశారు. ఖైదీలంతా కలసి 70 ఏళ్ల గార్డును బంధించారు. తరువాత జరిగిన పరిణామాల అనంతరం ఆ గార్డుకు ఎటువంటి హాని తలపెట్టకుండా, మర్నాటి ఉదయం విడిచిపెట్టారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పోలీసులు జైలును తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ జైలులో మొత్తం 700 మంది ఖైదీలు ఉన్నారు. వీరు తమకు ఆహారంలో చికెన్, పిజ్జాలు కావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతీరోజూ వేడి ఆహారం వడ్డించాలని కోరారు. వీటిని తక్షణం నెరవేర్చాలని కోరుతూ 70 ఏళ్ల గార్డును బంధించారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా ఈ జైలులో గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2021లో ఇక్కడి ఖైదీలు అల్లర్లకు పాల్పడి, జైలులోని కిటికీలను ధ్వంసం చేశారు. ఈ నేపపద్యంలో జైలు ఉన్నతాధికారి డేల్ గ్లాస్ రాజీనామా చేశారు. ఇది కూడా చదవండి: అడ్రస్ అడిగిన డెలివరీ బాయ్‌పై దాడి.. గంటపాటు మహిళ హైడ్రామా! -
హారర్ థ్రిల్లర్
అశ్విన్ కాకుమణి, పవిత్ర మరిముత్తు, గౌరవ్ నారాయణన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పిజ్జా 3’. మోహన్ గోవింద్ దర్శకత్వంలో సీవీ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 28న తమిళంలో విడుదలై, హిట్ సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో కనెక్ట్ మూవీస్ ఎల్‌ఎల్‌పీపై ఎంఎస్ మురళీధర్ రెడ్డి, ఆశిష్ వేమిశెట్టి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ‘‘హారర్ అండ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘పిజ్జా 3 ’’ అన్నారు నిర్మాతలు. -
విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతికి కథానాయకుడిగా మంచి విజయాన్ని అందించిన చిత్రం పిజ్జా. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రమ్య నంబీషన్ ప్రధాన పాత్రలు పోషించారు. రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగువారిని కూడా విశేషంగా ఆకట్టుకుని, ఘన విజయం అందుకుంది. కాగా పిజ్జా చిత్రం సక్సెస్‌తో ఆ తర్వాత దానికి సీక్వెల్‌గా పిజ్జా –2 విల్లా చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే సంస్థలో సీవీ కుమార్ ఇటీవల నిర్మించిన చిత్రం పిజ్జా –3 దిమమ్మీ . నటుడు అశ్విన్ కాక్కుమను కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో రవీనా దాహా, సుభిక్ష తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. మోహన్ గోవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత నెల 28వ విడుదలై విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. (ఇదీ చదవండి: కోకాపేట ఆంటీ ఎప్పుడో చెప్పింది.. ఆ ఏరియా చాలా రిచ్ అని!) దీంతో పిజ్జా– 4 చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు నిర్మాత సీవీ కుమార్ మీడియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తాను ఇంతకు ముందు హారర్ర్, సస్పెన్స్ నేపథ్యంలో రూపొందించిన పిజ్జా చిత్రం మూడు సీక్వెల్స్ ను ప్రేక్షకులు మంచి విజయాన్ని అందించి వైవిధ్య భరిత కథా చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుందని నిరూపించారన్నారు. వారు ఇచ్చిన నమ్మకంతోనే పిజ్జా –4 చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన దర్శకుడు, నటినటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెళ్లడించనున్నట్లు నిర్మాత సీవీ కుమార్ చెప్పారు. -
పిజ్జా మేకర్.. వెకేషన్‌కు పర్ఫెక్ట్, ధర ఎంతో తెలుసా?
ఎన్ని రుచులున్నా పిజ్జా రుచి దేనికీ రాదంటుంటారు పిజ్జా లవర్స్. రకరకాల ఇన్‌గ్రీడియెంట్స్‌తో నచ్చిన విధంగా పిజ్జాలు చేసుకోవాలన్నా.. టూర్స్‌లో కూడా ఓన్ ఫ్లేవర్ పిజ్జా తినాలన్నా.. ఇలాంటి మేకర్ వెంట ఉండాల్సిందే. దీన్ని సులభంగా ఆరుబయటనైనా, ఇంటి బాల్కనీలోనైనా పెట్టుకోవచ్చు. ఏ పార్కులోనో, ఏ రివర్ సైడ్ ఖాళీ స్థలంలోనో.. స్నేహితులతో కానీ బంధువులతో కానీ బాతాఖానీ కొడుతూ చక్కగా ఇందులో నచ్చిన పిజ్జాలను తయారు చేసుకోవచ్చు. దీన్ని క్యాంపింగ్‌కి వెంట తీసుకెళ్లొచ్చు. కుడివైపు ఆప్షన్స్‌తో పాటు రెగ్యులేటర్స్ ఉంటాయి. దానికే గ్యాస్ కరెక్టర్ అమర్చి ఉంటుంది. పిజ్జా కటర్, పిజ్జా పీల్, పిజ్జా మెనూ బుక్ వంటివి మెషిన్‌తో పాటు లభిస్తాయి. డివైస్ కింద అటోమేటిక్ రోటరింగ్ సిస్టమ్ బాక్స్ అటాచ్ అయ్యి ఉంటుంది. డివైస్‌కి ఇరువైపులా అవసరమైన ఉప్పు, కారం డబ్బాలు పెట్టుకునేందుకు.. కొద్దిగా ప్లేస్ ఉంటుంది. ఇక మెషిన్ ఆన్‌లో ఉన్నప్పుడు, లోపలుండే పిజ్జా స్టోర్ 360 డిగ్రీలు తిరుగుతూ బేక్ అవుతుంది. ఈ పిజ్జా మేకర్ ధర 299 డాలర్లు (రూ.24,605) -
ఈ పిజ్జా చాలా ఫేమస్.. దీని చరిత్ర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!
ఇటలీకి చెందిన పిజ్జా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఖండఖండాంతరాల్లో చాలామంది అభిమానించే పిజ్జా వంటకం పద్దెనిమిదో శతాబ్దిలో ఇటలీలోని నేపుల్స్ ప్రాంతంలో పుట్టిందని చెబుతారు. పిజ్జా గురించి ఇప్పటి వరకు తెలిసిన చరిత్ర ఇదే! అయితే, పిజ్జా అంతకంటే పురాతనమైనదేననేందుకు తాజా ఆధారం లభించింది. నేపుల్స్కు చేరువలోని పోంపే నగరంలో రోమన్ కాలానికి చెందిన పురాతన శిథిల భవనంలో గోడలపై ఉన్న కుడ్యచిత్రాల్లో పిజ్జా చిత్రం కూడా ఉంది. ఇటీవల పురాతత్త్వ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. సహజమైన రంగులతో చిత్రించిన ఈ కుడ్యచిత్రంలో వెండిపళ్లెంలో పిజ్జాను తలపించే రొట్టె, పండ్లు, మధుపాత్ర ఉన్నాయి. ఈ చిత్రంలోని రొట్టె పిజ్జాకు తొలిరూపం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోమన్ నాగరికత కాలానికి చెందిన ఈ భవంతి క్రీస్తుపూర్వం మూడో శతాబ్దికి చెందినదని వారు చెబుతున్నారు. ఇక్కడకు చేరువలోని మౌంట్ వెసూవియస్ అనే అగ్నిపర్వతం క్రీస్తుశకం 79లో బద్దలైనప్పుడు పాంపే, ఆప్లాంటిస్ నగరాలు లావాలోను, బూడిదలోను కూరుకుపోయాయి. ఇటీవల అక్కడ జరిపిన తవ్వకాల్లో ఈ పురాతన భవంతి, అందులోని పిజ్జా కుడ్యచిత్రం బయటపడటం విశేషం. చదవండి America PPP Fraud: ప్రపంచంలోనే అత్యంత ఘరానా మోసం.. అమెరికా సర్కార్కే షాక్! -
రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!
ఆధునిక పాశ్చాత్య వంటకం అయిన పిజ్జా గురించి ప్రస్తుతం తెలియని వారు ఉండరు.నేటి జనరేషన్ తెగ ఇష్టంగా ఆస్వాదించే వంటకం. ఐతే ఆ వంటకం వేల ఏళ్ల క్రిందటే ఉందట. ఆ విషయాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వారు జరిపిన తవ్వకాల్లో దీన్ని కనుగొన్నారు. పురావస్తు శాస్త్రవేత్తలు పురాతన రోమన్ నగరమైన పాంపీలో చేపట్టిన తవ్వకాల్లో ఓ గోడ బయటపడింది. ఆ గోడపై ఉన్న పెయింటింగ్‌లో పిజ్జాని పోలే ఓ వంటకం ఉంది. ఆ గోడపై ఉన్న పెయింటింగ్‌లో ఓ వెండి ప్లేటులో వైన్ గ్లాస్, దానిమ్మ పళ్లు, పిజ్జా వంటకం ఉంది. ఇది ఆనాటి కాలంలో ఎంత లగ్జరీగా ఉండేవారు అని చెప్పేందుకు ఆ వెండి ప్లేటే ఒక ఉదాహరణ. ఇక ఆ ప్లేటులో ఉన్న పిజ్జా మాదిరిగా ఉన్నా ఆ పదార్థం బట్టి ఆ కాలంలో చెఫ్‌లు దీన్ని తయారు చేసేవారని తెలుస్తుంది. పిజ్జా అనేది ఇటలీలో పుట్టిన పేద వంటకం. చెఫ్ నియాపోలిటన్ సాంప్రదాయ కళగా చెబుతుంటారు. ప్రస్తుతం ఆ పిజ్జా ప్రజలు ఇష్టంగా ఆస్వాదించే వంటకంగానే కాకుండా స్టార్ రెస్టారెంట్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న వంటకంగా కూడా నిలిచింది. (చదవండి: ఆ ఏడు 'పిల్లుల పేర రూ. 2.4 కోట్ల ఆస్తి! తీసుకునేందుకు ఎగబడుతున్న జనం..) -
పిజ్జా సైజ్ ఎందుకు తగ్గిందంటే..
-
‘వెన్న తెచ్చిన తంటా’, ఉద్యోగుల తొలగింపు.. స్టార్టప్ మూసివేత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టూల్స్ చాట్‌జీపీటీని విడుదలైన రెండు నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వాడటం మొదలుపెట్టారు. దీంతో ఏఐ టెక్నాలజీ ముంచుకొస్తుంది. సమీప భవిష్యత్‌లో కృత్రిమ మేధ ఆధారిత చాట్ జీపీటీ చాట్బోట్లతో భర్తీ చేస్తాయోమోనన్న భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ తరుణంలో ‘మానవాళి మనుగడకు టెక్నాలజీ ముప్పు’ అనే భయం నుంచి కాస్త ఉపశమనం కలిగించే ఘటన జరిగింది. కొన్నేళ్ల క్రితం ఏఐ టెక్నాలజీతో పనిచేసే రోబోట్ ఫిజ్జా డెలివరీ స్టార్టప్ 500 అమెరికన్ డాలర్ల ఫండ్‌ను సేకరించింది. కానీ, ఇప్పుడు ఆ సంస్థ దివాళా తీసింది. అందుకు కారణం ఏఐ ఆధారిత రోబోట్ టెక్నాలజీ కారణమని తెలుస్తోంది. అమెరికన్ టెక్ మీడియా సంస్థ ‘ది ఇన్ఫర్మేషన్’ కథనం మేరకు..కొన్నేళ్ల క్రితం పిజ్జాలను తయారు చేసేందుకు రోబోట్లను ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన పిజ్జా తయారీ నిర్వాహకుల మదిలో మెదిలింది. కానీ టెక్నాలజీ పరంగా అనే ఒడిదుడుకులు ఎదురువుతాయనే అంచనాతో అనేక సంస్థలు తమ ఆలోచనల్ని ఆచరణలో పెట్టలేకపోయాయి. అదే సమయంలో 2015లో జుమే (Zume) సంస్థ ఏఐ ఆధారిత రోబోట్‌తో పిజ్జాలను తయారు చేసేందుకు ముందుకు వచ్చింది. నిర్వహణకోసం ఇన్వెస్టర్ల నుంచి కావాల్సిన నిధుల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అనూహ్యంగా సాఫ్ట్ బ్యాంక్ కంపెనీతో సహా, పెట్టుబడిదారులు జుమేలో పెట్టుబడులు పెట్టేందుకు పోటీపడ్డారు. వెరసీ 500 మిలియన్ డాలర్లను సమీకరించింది. మార్కెట్లో కృత్రిమ మేధ ఊహించని పురోగతి సాధించినప్పటికీ పిజ్జాను తయారు చేయడంలో విఫలమైంది. పిజ్జా తయారీ కోసం వెన్నను వినియోగించాలి. అయితే, తయారు చేసిన పిజ్జాను ముక్కలు, ముక్కలుగా చేసుకొని తినే సమయంలో అందులోని వెన్న కరిగిపోకుండా, అలాగే జారిపోకుండా నిరోధించేందుకు అనేక కంపెనీలు విఫలమవుతూ వచ్చాయి. వాటిల్లో జుమే ఒకటి. రోబోట్లతో పిజ్జాలను తయారు చేసే సమయంలో తలెత్తే ఈ సమస్యకు జుమే సైతం పరిష్కారం చూపలేకపోయింది. దీంతో ఇన్వెస్టర్లు ఫండింగ్ ఇవ్వడం ఆపేశారు. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు సగానికిపైగా ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా, సంస్థ దివాళా తీసింది. ఈ తరుణంలో ప్రస్తుత మార్కెట్లో ఏఐపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ సామర్ధ్యం పూర్తి స్థాయిలో ఉపయోగంలోకి రావాలంటే కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని, అందుకు షట్ డౌన్ చేసిన జుమే సంస్థేనని చెబుతున్నారు. అప్పటి వరకు మానవాళి మనుగడకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంచనా వేస్తున్నారు. చదవండి👉 ‘మాకొద్దీ ఉద్యోగం’..టీసీఎస్‌కు షాకిస్తున్న మహిళా ఉద్యోగులు! -
డబ్బు కోసం ఆ పని కూడా చేయాల్సి వచ్చింది: ప్రముఖ నటి
టాలీవుడ్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెరపై తల్లి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి సోషల్ మీడియాలో విభిన్నమైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. పలు వీడియోలతో తన ఫాలోవర్లను అలరిస్తోంది. ఆమె వర్క్ అవుట్ చేస్తూ, డ్యాన్స్ చేస్తున్న వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి, పెళ్లికి ముందు తాను అనుభవించిన కష్టాల గురించి ప్రగతి చెప్పు కొచ్చింది. (ఇదీచదవండి: ట్రోలర్స్‌కు ఫోటోలతో కౌంటర్ ఇచ్చిన 'భీమవరం' బ్యూటీ) ఇంట్లో ఊరికే తింటున్నావ్ అనేలా తన అమ్మ చేసిన కామెంట్లు నచ్చేవి కావని ఆమె తెలిపింది. దాంతో పిజ్జా షాపులో పని చేశానని ఆమె పేర్కొంది. అంతే కాకుండా డబ్బు కోసం ఎస్టీడీ బూత్‌లో కూడా పని చేశానని ప్రగతి తెలిపింది. నేను ఆ సమయంలో లడ్డూలా ఉండే దానిని, అందువల్ల ఒక యాడ్ చేయమని కొందరు అడిగారని తెలిపింది. అలా మోడలింగ్‌లోకి వచ్చాక హీరోయిన్గా కూడా అవకాశాలు వచ్చాయి. వాటిని సరిగ్గా వినియోగించుకోలేకపోయానని చెప్పు కొచ్చింది. ఆ సమయంలో హీరో కమ్ నిర్మాతతో ఏర్పడిన వివాదం వల్ల సినిమాలే చేయకూడదని నిర్ణయించుకుని 20 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. ఆ తర్వాత కొంత కాలానికి తన భర్తతో విభేదాలు రావడం వల్ల విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పింది. ప్రగతి వెల్లడించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
ఇండియాకు కేఎఫ్సి, పిజ్జా హట్ రావడానికి కారణం ఇతడే..!
యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, మాస్టర్ కార్డ్ మాజీ సీఈఓ 'అజయ్ బంగా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన 2023 జూన్ 02 నుంచి వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అజయ్ బంగా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ బ్యాంకు కొత్త అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించనున్న అజయ్ బంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టభద్రుడయ్యాడు. చదువు పూర్తయిన తరువాత 1981లో నెస్లేతో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత పెప్సికోలో కూడా పనిచేశారు. 2010లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్‌లో ప్రెసిడెంట్ బాధ్యతలను, ఆ తరువాత సీఈఓగా నియమితులయ్యారు. 2020లో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ జనరల్ అట్లాంటిక్‌లో వైస్ చైర్మన్‌గా ఉన్నారు. (ఇదీ చదవండి: 1998లో ప్రభంజనం సృష్టించిన టాటా ఇండికా - అరుదైన వీడియో) భారతదేశానికి కేఎఫ్సి, పిజ్జా హట్ వంటివి రావడం వెనుక అజయ్ బంగా హస్తం ఉందని కొంతమంది భావిస్తున్నారు. నివేదికల ప్రకారం అజయ్ బంగా మొత్తం ఆస్తుల విలువ 2021లో 206 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 1689 కోట్లకంటే ఎక్కువ. అంతే కాకుండా 11,31,23489 విలువైన మాస్టర్ కార్డ్ స్టాక్లను కలిగి ఉన్నట్లు సమాచారం. మాస్టర్ కార్డ్‌లో ఆయన జీతం రోజుకి 52 లక్షలు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: ఈ ప్లాన్ కింద 5జీబీ డేటా ఫ్రీ - కేవలం వారికి మాత్రమే!) పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన అజయ్ బంగా తండ్రి భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్. ఈ కారణంగానే దేశంలో చాలా ప్రాంతాలను తిరగాల్సి వచ్చింది. మొత్తానికి ఈ రోజు భారతదేశం మొత్తం గర్వించే స్థాయికి ఎదిగాడు. ప్రపంచ బ్యాంక్ అజయ్ బంగాతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ సందేహాలను, అభిప్రాయాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఛీ.. యాక్! ఈ ఫొటో చూశారంటే పిజ్జా తినలేరు.. వైరల్ ఫొటో
ఇటీవల కాలంలో బయట తినడం ప్రజలకు అలవాటుగా మారింది. రుచితో పాటు కాస్త శుచిగా ఉంటే చాలు ఆ పుడ్‌ని తెగ లాగించేస్తుంటారు భోజన ప్రియులు. ఈ తరహా నిబంధనలు పాటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న జాబితాలో డోమినాస్ పిజ్జా, కేఎఫ్‌సీ వంటి విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఎంత ఫేమ్ ఉన్న కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థకున్న మంచి పేరు, గుర్తింపు కూడా ఒక్క సెకనులో పొగుట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక ఫోటో వల్ల ఓ ప్రముఖ సంస్థ పేరు నెట్టింట నెగిటివ్‌గా మారింది. ఆ ఫోటోలో ఏముంది.. పిజ్జా అంటే గుర్తుకు వచ్చే పేరు డొమినోస్. టేస్ట్‌తో పాటు క్వాలిటీ కూడా మెండుగా ఉంటుందని కస్టమర్లు అక్కడికి ఎగబడుతుంటారు. అయితే బెంగళూరులోని డొమినోస్ ఫ్రాంచైసీ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థ పేరును మసక బారేలా చేస్తోంది. హోసా రోడ్లో ఉన్న డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిబ్బంది పిండి తయారు చేశారు. కాకపోతే ఆ పిండిపై నిర్లక్ష్యంగా టాయిలెట్ బ్రష్‌లు, ఫ్లోర్ క్లీనింగ్ వస్తువును ఉంచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. ఇదేనా మీ క్వాలిటీ పుడ్ అని డొమినోస్ సంస్థ పై మండిపడుతున్నారు. కఠిన చర్యలు తప్పవు ఈ ఘటనపై స్పందిస్తూ.. డొమినోస్ ఎప్పుడూ పుడ్ విషయంలో అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రత, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రపంచస్థాయి ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ రెస్టారెంట్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. Photos from a Domino's outlet in Bengaluru wherein cleaning mops were hanging above trays of pizza dough. A toilet brush, mops and clothes could be seen hanging on the wall and under them were placed the dough trays. Please prefer home made food 🙏 pic.twitter.com/Wl8IYzjULk — Tushar ॐ♫₹ (@Tushar_KN) August 14, 2022 చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు -
ఫ్రీగా పిజ్జాలు..జొమాటో, స్విగ్గీలకు భారీ షాక్?
డొమినోస్ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ జొమాటో, స్విగ్గీలకు భారీ షాకివ్వనుంది. దశల వారీగా జొమాటో,స్విగ్గీల ద్వారా పిజ్జా డెలివరీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త బిజినెస్ వ్యూహాన్ని అమలు చేసింది. డొమినోస్ పిజ్జా సంస్థ 'జూబిలెంట్' జులై 19న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను ఆశ్రయించింది. రెస్టారెంట్ భాగస్వాముల నుంచి దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్‌లైన స్విగ్గీ, జొమాటోలు పెద్దమొత్తంలో కమిషన్ వసూలు చేస్తూన్నాయంటూ సీసీఐకి ఓ రహస్య ఫైల్లో వెల్లడించినట్లు రాయింట్స్ తెలిపింది. దీంతో సీసీఐ రెస్టారెంట్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత.. స్విగ్గీ, జొమాటోలపై చర్యలు తీసుకోనుంది. ఈ తరుణంలో స్విగ్గీ, జొమాటో భాగస్వామ్యం నుంచి విడిపోయేందుకు డొమినోస్ పిజ్జా మాస్టర్ ప్లాన్ వేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన పిజ్జాల కోసం స్విగ్గీ, జొమాటోల్ని ఆశ్రయించే అవసరం లేకుండా నేరుగా డొమినోస్ సెంటర్‌కు వచ్చేలా మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా డొమినోస్ ఫ్రాంఛైజీలో కస్టమర్ ఆరు పిజ్జాలు కొనుగోలు చేస్తే మరో పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. డొమినోస్ ఆఫర్‌పై జూబిలెంట్ సంస్థ సీఎఫ్‌వో ఆశిష్ గోయాంక్ మాట్లాడుతూ.. మేం దీనిని ఒక ఓమ్నీచానల్ ప్రోగ్రామ్ గా చేస్తున్నాము. తద్వారా కస్టమర్ ఎంట్రీ పాయింట్‌తో సంబంధం లేకుండా ప్రయోజనాల్ని పొందవచ్చని అన్నారు. -
మంటల్లో కాలిపోతున్న ఇల్లు.. హీరోలా పిల్లల్ని కాపాడిన పిజ్జా డెలివరీ బాయ్
వాషింగ్టన్: అర్ధరాత్రి మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి ప్రాణాలకు తెగించి వెళ్లాడు ఓ పిజ్జా డెలివరీ బాయ్. అందులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ఈ క్రమంలో అద్దాలు పగలగొట్టి మరీ మొదటి అంతస్తు నుంచి దూకి చేతికి గాయం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ యువకుడు చేసిన సాహసాన్ని పోలీసులు సహా స్థానికులు కొనియాడారు. పిజ్జా డెలివరీ బాయ్ హీరో అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అమెరికా లఫయెట్టెలో ఈ ఘటన గతవారం జరిగింది. హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యువకుడి పేరు నికోలస్ బోస్టిక్. వయసు 25 ఏళ్లు. పిజ్జాలు డెలివరీ చేసి అర్ధరాత్రి ఇంటికి తిరిగివెళ్తున్నప్పుడు ఓ ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించాడు. వెంటనే పెద్దగా అరుస్తూ ఆ ఇంటి బ్యాక్ డోర్ నుంచి లోపలికి వెళ్లాడు. ఇతని అరుపులు విని ఇంట్లో మొదటి అంతస్తులో నిద్రపోతున్న నలుగురు పిల్లలు లేచారు. బోస్టిక్ వాళ్ల దగ్గరకు వెళ్లి కిందకు తీసుకొస్తుండగా.. మరో ఆరేళ్ల చిన్నారి లోపలే ఉన్నట్లు వాళ్లు చెప్పారు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బోస్టిక్ మంటల్లోనే గదిలోపలికి వెళ్లాడు. అయితే ఆ పిల్లాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఏడుస్తూ కన్పించాడు. దీంతో కిటికీ అద్దాలను చేతితోనే పగలగొట్టి కిందకు దూకాడు బోస్టిక్. ఆరేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ప్రాణాలతో బయటపడ్డవారిలో 18 ఏళ్లు, 13 ఏళ్లు, ఏడాది వయసున్న చిన్నారి కూడా ఉన్నారు. బోస్టిక్ సహసాన్ని పోలీసులు కొనియాడారు. అతను నిస్వార్థంగా ఆలోచించి ఐదుగురి ప్రాణాలను కాపాడాడని ప్రశంసించారు. అతను రియల్ హీరో అని పొగడ్తలతో ముంచెత్తారు. పోలీసు శాఖ తరఫున అతనికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోనూ ట్విట్టర్లో షేర్ చేశారు. Here’s the video to go along with the story. pic.twitter.com/TvZ5wzCg1f — LafayetteINPolice (@LafayetteINPD) July 15, 2022 చదవండి: రన్ వేపై దిగుతూ మరో విమానాన్ని ఢీకొట్టిన ఫ్లైట్.. నలుగురు మృతి -
గూగుల్‌లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా?
Google Doodle Celebrating Pizza: ఇవాళ గూగుల్ ఓపెన్ చేశారా? చేస్తే.. డూడుల్‌లో ఉన్న పిజ్జా మార్క్‌ను చూశారా?.. కనీసం క్లిక్ చేసి చూశారా?.. ప్రపంచంలో మోస్ట్ పాపులర్ డిష్ అయిన పిజ్జాకు ఇదేరోజున ఓ అరుదైన గుర్తింపు దక్కింది. 2017 డిసెంబర్లో పిజ్జా సంప్రదాయ తయారీ విధానం Neapolitan "Pizzaiuolo"(నేపుల్స్-ఇటలీ)కు యునెస్కో తరపున అరుదైన గుర్తింపు దక్కింది. అందుకే గూగుల్ డూడుల్ ద్వారా మినీ గేమ్‌ను నిర్వహిస్తోంది. ఈ మినీ పజిల్ గేమ్ ఉద్దేశం ఏంటంటే.. పిజ్జాను కట్ చేయడం. సాధారణంగా పిజ్జాలను వాటిలోని వెరైటీల ఆధారంగా డిఫరెంట్ షేప్స్‌లో కట్ చేసి(కస్టమర్ల సంఖ్యకు తగ్గట్లుగానే).. సర్వ్ చేస్తుంటారు. అయితే ఈ గేమ్ ఆడేవాళ్లు అక్కడ చూపించే పిజ్జా వెరైటీని సరిగ్గా అక్కడ చూపించే నెంబర్స్‌కి.. సరిపోయేలా సరైన విధానంలో చేయాలి. కరెక్ట్‌గా కట్ చేస్తేనే పాయింట్లు(స్టార్స్) దక్కుతాయి. అలా లెవెల్స్‌ను దాటుకుంటూ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ►పిజ్జా.. ఇటాలియన్ డిష్ అనే ప్రచారం వందల ఏళ్ల నుంచి ఉంది. ఎందుకంటే ఆ డిష్ పుట్టింది ఇటలీలోనే అని నమ్ముతారు కాబట్టి!(ఈజిప్ట్ అనే ప్రచారం కూడా ఉంది). ►నెపోలిటన్ పిజ్జాయ్‌యువొలొ.. అనేది పిజ్జాను సంప్రదాయ పద్దతిలో(నాలుగు దశల్లో) కట్టెలతో కాల్చే ఒవెన్ ద్వారా తయారు చేయడం. ►నేపుల్స్(కాంపానియా రీజియన్ రాజధాని)లో 3 వేలమంది పిజ్జా తయారీదారులు ఉన్నారు. ►పిజ్జాను తయారు చేసే వ్యక్తిని ‘పిజ్జాయ్‌యువొలొ’ అంటారు. ►పిజ్జా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో బిలియన్ డాలర్ల బిజినెస్ చేస్తుంటుంది. ►2020 పిజ్జా గ్లోబల్ బిజినెస్‌లో.. వెస్ట్రన్ యూరప్ వాటా అత్యధికంగా ఉంది. ఏకంగా 49.3 బిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది. ►ఉత్తర అమెరికా 48.6 బిలియన్ డాలర్లు. ►ఆసియా దేశాల్లో 11.7 బిలియన్ డాలర్లు ►ఆస్ట్రేలియా పరిధిలో అతితక్కువగా 1.9 బిలియన్ డాలర్ల బిజినెస్ చేసింది. ►ప్రతీ ఏడాది ఐదు బిలియన్ల పిజ్జాలు అమ్ముడుపోతుంటాయి (సెకనుకి ఒక్క అమెరికాలోనే 350 పిజ్జాల ఆర్డర్) వెళ్తుంటాయి. ►2019 నుంచి పిజ్జా మార్కెటింగ్ గ్లోబల్ వైడ్‌గా విపరీతంగా జరుగుతోంది. ►2023 నాటికి పిజ్జా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 233.26 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందనేది ఒక అంచనా. ►సోషల్‌మీడియా అడ్వర్టైజింగ్ కీలక పాత్ర వహించబోతోందని మార్కెటింగ్ నిపుణుల అంచనా. ►నార్వే, స్వీడన్లలో ఫ్రొజెన్, గ్లూటెన్ పిజ్జాలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది ఇప్పుడు. ►యూరప్, నార్త్ అమెరికా, ఆసియా-ఫసిఫిక్, లాటిన్ అమెరికా ఖండాల రీజియన్లను పరిశీలిస్తే.. ఇటలీ, యూకే, జర్మనీ, కెనడా, చైనా, భారత్, బ్రెజిల్.. పిజ్జా మార్కెట్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లనున్నాయి. ►భారత్‌లో కరోనా సీజన్లోనూ కిందటి ఏడాది పిజ్జా బిజినెస్ మార్కెట్ వాల్యూ 1.52 బిలియన్ డాలర్లు దాటేసింది. ► యువత, పిల్లలు, మధ్య, ఎగువ తరగతి వర్గాల ప్రజల నుంచి పిజ్జాకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతంలో ఆర్డర్లు ఎక్కువగా వస్తుంటాయి. ►మొత్తం భారత్ పిజ్జా మార్కెట్లో డొమినోస్ వాటా 55 శాతంగా ఉంటోంది. పైగా డొమినోస్ 70 శాతం హోం డెలివరీలతోనే ఆదాయం వెనకేసుకుంటోంది. ►ఈ ఏడాది జూన్ 1వ తేదీ నాటికి భారత్‌లో 45 మిలియన్ల మంది పిజ్జా డెలివరీ యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్నారు. ►అయితే భారత్‌లో బ్రాండెడ్ పిజ్జా బిజినెస్‌తో పోలిస్తే.. స్ట్రీట్ పిజ్జా మార్కెట్ బిజినెస్ విపరీతంగా నడుస్తోంది. ఆ ఆదాయం లెక్కలోకి తీసుకుంటే బ్రాండెడ్ పిజ్జా మార్కెట్‌కు మూడు రెట్లు ఎక్కువే ఉంటుందనేది నిపుణుల అంచనా. ►ఎదురయ్యే ఛాలెంజ్.. పిజ్జా తయారీలో వాడే ముడిసరుకుల ధరలు ఆకాశాన్ని అంటడం.. ఇండిపెండెంట్ ఆపరేటర్లతో పాటు ఔట్లెట్లు, ఫ్రాంఛైజీలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లు. -సాక్షి వెబ్‌స్పెషల్ -
వైరల్: తొలిసారి పిజ్జా తిన్న బామ్మ.. ‘అబ్బే బాలేదురా మనవడా’..
పిజ్జా.. ఈ పేరు వింటేనే భోజన ప్రియులకు నోరూరుతుంది. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు. ఆన్లైన్ ఫుడ్ యాప్‌లు వచ్చి తర్వాత చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఘుమఘుమలాడే పిజ్జా నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. వెజ్, నాన్‌వెజ్ అంటూ చిన్న నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. చదవండి: మట్టి ముంతలో స్పెషల్ పిజ్జా.. నెటిజన్లకు నోరూరిస్తోంది తాజాగా ఓ బామ్మ తొలిసారి పిజ్జాను రుచి చూసింది. దీనిని ఆమె మనవడు గ్రీష్ భట్ వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఇంకేముంది ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో.. బామ్మ పిజ్జాలోని ఒక ముక్కను తీసుకొని తింటుంది. అయితే అది ఆమెకు అంతగా నచ్చలేదేమో.. వెంటనే అదో రకంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ముసిమసిగా నవ్వుతుంది. ‘మొదటిసారి పిజ్జా తింటున్న నాన్నమ్మ రియాక్షన్’ అనే క్యాప్షన్‌తో ఫేర్ చేసిన ఈ వీడియో ఇప్పటికే లక్షల వ్యూవ్స్ సంపాదించింది. పిజ్జా రుచి చూసిన ఆ భామ్మ ఇచ్చిన హవభావాలు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. ‘అయ్యో బామ్మకు పిజ్జా నచ్చలేదనుకుంటా.. ఆమె రియాక్షన్ చూస్తుంటే అబ్బే బాలేదురా మనువడా.. ఎలా తింటారు దీన్ని.. అనేలా ఉంది. పిజ్జా తినేప్పుడు నాని చూపించిన ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి’. అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి మీరు కూడా చూసేయండి. View this post on Instagram A post shared by Greeshbhatt (@greesh_bhatt_) -
మట్టి ముంతలో స్పెషల్ పిజ్జా.. నెటిజన్లకు నోరూరిస్తోంది
ఎప్పుడూ ఒకే రకమైన ఆహారం తింటుంటే బోర్ కొట్టడం ఖాయం. అందుకే రోజూ కొత్త కొత్త వంటలు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల సోషల్‌మీడియలో కొత్త వంటకాల హవా పెరిగిందనే చెప్పాలి. పిజ్జా అంటే తెలియని వాళ్లే కాదు తినని వాళ్లు కూడా ఉండరేమో, అంతలా నచ్చుతుంది మనకి ఆ వంటకం. ఇక ఇందులో బోలెడు వెరైటీలు కూడా ఉన్నాయి. అయితే మనం రెగ్యులర్‌గా తినే విదేశీ పిజ్జా లాంటిది కాకుండా చిన్న మట్టి కప్పులో అదిరపోయే పిజ్జాను తయారు చేస్తామంటున్నారు సూరత్‌కు చెందిన ఫుడ్ స్టాల్. తాజాగా ఆ పిజ్జా మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో మొక్కజొన్న, టమాటా, వెన్న, సాస్ వంటివి కుండలో వేసి... మైక్రోవేవ్ ఓవెన్లో వేడి చేసి... ముంత పిజ్జాను తయారుచేస్తున్నారు. దానికే కుల్లడ్ పిజ్జా లేదా కుల్హడ్ పిజ్జా అనే పేరు పెట్టారు. కుల్లడ్ అంటే మట్టితో చేసిన పాత్ర అని అర్థం. ఈ పిజ్జాని తయారీని ఓ వీడియోలో చిత్రీకరించగా దాన్ని ఆమ్చీ ముంబై ఛానెల్ సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం అది నెటింట చక్కర్లు కొడుతూ నెటిజన్ల నోరూరిస్తోంది. చదవండి: బిల్ అడిగితే చిల్లర ఇచ్చాడు.. తీరా ఆర్డర్ చూసి షాక్ అయ్యాడు! -
ఆ దేశ అధ్యక్షుడిని హోటల్లోకి అనుమతించలేదు.. ఎందుకంటే..
బ్రసిలియా: ఐరాస సర్వసభ సమావేశంలో పాల్గొనేందుకు అమెరికాకు వెళ్లిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారోకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రపంచదేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ ఒక్కటే మహమ్మారిని అడ్డుకోగలదని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని, అలా వేసుకోని వాళ్లని పలు ప్రాంతాల్లోకి కూడా వారిని రానివ్వడం లేదు. తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో బృందం న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. అయితే ఆయనకు టీకా సర్టిఫికేట్ లేదని ఆ హోటల్ యాజమాన్యం వారిని లోపలికి రావివ్వలేదు. దీంతో చేసేదేమిలేక బొల్సొనారో, ఇద్దరు క్యాబినెట్ మంత్రులు ఆదివారం రాత్రి రోడ్డు పక్కనే నిల్చుని పిజ్జా తిన్నారు. అయితే దీనిపై బోల్సోనారో మద్దతుదారులు మాన్హాటన్ హోటల్ సమీపంలోని వీధిలో పిజ్జా తినడం సంతోషంగా ఉన్న తమ నాయకుడి సింప్లిసిటీకి ఇది నిదర్శమని కామెంట్లు పెడుతున్నారు. న్యూయార్క్ మేయర్ నగరంలో జరిగే ఐరాస సమావేశానికి హాజరయ్యే ముందు అందురూ టీకాలు వేయించుకోవాలని "ముఖ్యంగా బొల్సొనారోతో సహా ప్రపంచ నాయకులకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి కారణంగా కొంతమంది నాయకులు మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేమని వీడియో స్టేట్మెంట్ను పంపుతున్నారు. చదవండి: Bitcoin: అదృష్టమంటే ఇదేనేమో...! తొమ్మిదేళ్లలో రూ. 6 లక్షల నుంచి రూ. 216 కోట్లు...! -
కోన్ పిజ్జా ఎప్పుడైనా చూశారా..! ఇప్పుడిదే వైరల్!!
నోరూరించే వంటకాలు ఎన్నిఉన్నా పిజ్జా రుచుల ప్రత్యేకతే వేరు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా పిజ్జా దర్శనమిస్తూనే ఉంటుంది. సాధారణంగా పిజ్జా అంటే గోధుమ లేదా మైదాతో తయారుచేసిన గుండ్రటి రొట్టెపైన ట్యాంగీ మారినారా సాస్, ఊజింగ్ చీజ్ కాంబినేషన్‌తో, రకరకాల వెజిటబుల్స్ ముక్కలతో అలంకరించబడి రుచికే కాకుండా చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. రకరకాల రుచుల్లో దొరికే పిజ్జాలని తినడానికి ఏ సమయంలోనైనా రెడీ అంటారు భోజన ప్రియులు. ఐతే ఈ వీడియోలో ఉన్న పిజ్జా మాత్రం అందుకు పూర్తిగా భిన్నమైంది. అందుకే ఇప్పుడిది వైరల్ అవుతోంది. అదే పిజ్జా కోన్.. సాధారణ రూపానికి భిన్నంగా, కోనికల్ స్ట్రక్చర్‌లో, సాస్, చీజ్ కూరిన ఈ ప్రత్యేకమైన పిజ్జా వైపు మనమూ ఓ లుక్కేద్దాం! యాక్ట్ నార్మల్ ఆర్ ఎల్స్ అనే యూజర్ ట్వీట్ చేసిన ఈ వీడియోలో మొదట పిజ్జా తయారు చేసే పిండితో కోన్‌ను రూపొందించారు. తర్వాత మారినారా సాస్, చీజ్‌తో ఫిల్ చేసి పూర్తిగా ఉడికేలా బేక్ చేశారు. ఇదొక పిజ్జాకోన్ వెరైటీ. చీజ్ కలిపిన టోస్డ్ వెజిటబుల్స్‌తో ఫిల్ చేసిన పిజ్జాకోన్ మరొకటి. ఈ రెండు రకాలైన పిజ్జాలకు ట్విట్టర్ యూజర్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు దీనిని ప్రయత్నిస్తామని కోరుకుంటే, ఈ విధమైన వంటకాన్ని మొదటి స్థానంలో ఉంచవలసిన అవసరం లేదని మరికొందరు పెదవి విరిచారు. కోన్లోపల ఫిల్ చేసినవి వేడిగా ఉంటాయని, నోరు కాలుతుందేమోనని కూడా చాలామంది యూజర్లు ఆరోపించారు. కాగా ఇప్పటికే ఈ వీడియోకి వేల వ్యూస్ వచ్చాయి. చదవండి: చిల్లీ మష్రూమ్స్ ఎలా తయారు చేయాలో తెలుసా? every couple of years someone tries to make the pizza cone a thing. i don't think they're ever going to really pull off making the pizza cone a thing pic.twitter.com/i2j3jQk1vR — lauren (@ActNormalOrElse) August 30, 2021 -
వైరల్: గాల్లో ఎగురుతున్న పిజ్జాలు.. తినేందుకు పడరాని పాట్లు
వ్యోమగామిగా ఉండటం కష్టమైన ఉద్యోగాలలో ఒకటిని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే వారు భూమికి దూరంగా వేలాది మైళ్లు ప్రయాణించి తమకిచ్చిన పనిని పూర్తి చేస్తుంటారు. ఓ రకంగా చెప్పాలంటే రిస్క్‌తో కూడుకున్న జాబ్ అనే చెప్పాలి. టెక్నాలజీ పుణ్యమా అని స్పేస్ ప్రయాణం కూడా ముందున్నంత కష్టంగా లేవనే చెప్తున్నారు వ్యోమగామలు. తాజాగా ఓ వ్యోమగాముల బృందం అంతరిక్షంలో పార్టీ చేసుకున్న వీడియో వైరల్‌గా మారింది. అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లలో రోజులు కాదు నెలల కొద్దీ గడిపేలా శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల అంతర్జాతీయ స్పేస్ స్టేషన్లో ఉన్న కొందరు వ్యోమగాములు అక్కడ సరదాగా పిజ్జా పార్టీ చేసుకున్నారు. ఈ వీడియోను ఫ్రెంచ్ ఆస్ట్రోనాట్.. థామస్ పెస్క్వెట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. స్నేహితులతో కలిసి ఓ తేలియాడే పిజ్జా నైట్, మరోలా చెప్పాలంటే మాకిది భూమిపై శనివారం జరుపుకునే పార్టీలా అనిపిస్తుందని క్యాప్షన్‌గా పెట్టాడు. ఆ వీడియోలో.. స్పేస్ షిప్లో ఉన్న కొందరు వ్యోమగాములు పిజ్జాలు గాలిలో ఎగురుతుంటే.. తమ నోటితో పట్టుకొని తింటున్నారు. అక్కడ ఏ వస్తువు అయినా అలా ఎగురుతూనే ఉంటాయి. స్పేస్‌లో గ్రావిటీ ఉండదనే సంగతి తెలిసిందే. ఏదైనా సరే గాల్లో గింగిరాలు కొట్టాల్సిందే. అంతెందుకు స్పేస్ స్టేషన్లో ఉన్నప్పుడు మనుషులు కూడా గాలిలో ఎగురుతూనే ఉంటారు. అందుకే.. స్పేస్‌లో ఉండటం చాలా కష్టం. మొత్తానికి.. వ్యోమగాములు పిజ్జా పార్టీ.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యపరచడంతో పాటు ఆకట్టుకుంది. View this post on Instagram A post shared by Thomas Pesquet (@thom_astro) చదవండి: Italy Fire Accident: ఎత్తైన బిల్డింగ్.. అగ్నికీలలతో సుందర భవనం ఎలా మారిందంటే.. -
బ్రెడ్ పిజ్జా ఎలా తయారు చేయాలో తెలుసా?
బ్రెడ్ పిజ్జా కావలసినవి: బ్రెడ్ స్లైసెస్ – 6, టొమాటో సాస్ – పావు కప్పు, చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, మిరప కారం – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, క్యాప్సికమ్, టొమాటో, ఉల్లిపాయ – ఒక్కొక్కటి చొప్పున, స్వీట్ కార్న్ – 2 టేబుల్ స్పూన్లు (ఉడికించినవి), మొజరెల్లా చీజ్ తురుము – 2 టేబుల్ స్పూన్లు, బటర్ – సరిపడా, ఆలివ్ ముక్కలు – కొన్ని తయారీ: ముందుగా టొమాటో సాస్‌లో చిల్లీ సాస్, మిరప కారం, గరం మసాలా వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అనంతరం ప్రతి బ్రెడ్ స్లైస్ మీద ఒక్కో స్పూన్ టొమాటో సాస్ మిశ్రమాన్ని రాయాలి. వాటిపైన కొద్దికొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, స్వీట్ కార్న్ వేసుకోవాలి. పైన మొత్తం చీజ్ తురుముతో ఫిల్ చేసుకుని.. పైన ఆలివ్ ముక్కలు వేసుకోవాలి. అనంతరం కళాయిలో కొద్దిగా బటర్ కరిగించి దోరగా 2 నిమిషాల పాటు మూత పెట్టి బేక్ చేసుకోవాలి. పాస్తా– చికెన్ పకోడా కావలసినవి: బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (క్లీన్ చేసి, ఉడికించి, తురుము చేసుకుని పెట్టుకోవాలి), పాస్తా – 1 కప్పు (ఉడికించినది), టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు – 4 టేబుల్ స్పూన్లు చొప్పున (చిన్నగా కట్ చేసుకోవాలి), కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, ధనియాల పొడి – 1 టీ స్పూన్ చొప్పున, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, చిల్లీ సాస్ – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, శనగపిండి, బియ్యప్పిండి – పావు కప్పు చొప్పున, నూనె – డీప్ ఫ్రైకి చాలినంత తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పాస్తా, చికెన్ తురుము, టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము, జీలకర్ర, ధనియాల పొడి, కారం, తగినంత ఉప్పు, శనగపిండి, బియ్యప్పిండి వేసుకుని నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. అందులో చిల్లీ సాస్ వేసుకుని మరోసారి కలుపుకుని.. నూనెలో పకోడాలా వేసుకుని దోరగా వేయించుకోవాలి. కాజున్ స్పైసీ పొటాటోస్ కావలసినవి: బేబీ పొటాటో – 20 (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక ఒక్కో పొటాటోను వడ మాదిరి ఒకటే సారి చేత్తో ఒత్తాలి), మాయొనైజ్(మార్కెట్లో దొరుకుతుంది) – 3/4 కప్పు, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్, తేనె, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, డ్రై థైమ్, ఒరెగానో – 1 టీ స్పూన్ చొప్పున, మిరప కారం – ఒకటిన్నర టీ స్పూన్+గార్నిష్‌కి కూడా మిరియాల పొడి – అర టీ స్పూన్, పాలు – 3 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 3 టేబుల్ స్పూన్లు, మైదా పిండి – 2 టేబుల్ స్పూన్లు, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, కొత్తిమీర తురుము – గార్నిష్‌కి తయారీ: ముందుగా ఒక చిన్న బౌల్లో మొక్కజొన్న పిండి, మైదా పిండి, కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో వడలా ఒత్తిన ఒక్కో పొటాటో ముంచి, బాగా పట్టించి నూనెలో డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం.. మాయొనైజ్, టొమాటో సాస్, తేనె, ఆనియన్ పౌడర్, గార్లిక్ పౌడర్, డ్రై థైమ్, ఒరెగానో, మిరప కారం, మిరియాల పొడి, పాలు, ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుని ఆ మొత్తం మిశ్రమాన్ని వేయించిన పొటాటో వడలపై వేసుకుని సర్వ్ చేసుకునే ముందు.. కొద్దిగా మిరప కారం, కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సేకరణ: సంహిత నిమ్మన -
కస్టమర్ ఇచ్చిన టిప్ చూసి డెలివరీ బాయ్ షాక్!
ఫుడ్ డెలివరీ యాప్‌లు పెరిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున వాటికి ఆర్డర్లు ఇస్తున్నారు. కరోనా సమయంలో ఫుడ్ డెలివరీ చేసే వారిని కూడా వారియర్లుగా గుర్తించారు. డెలివరీ యాప్‌లకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ సంఘటన వైరల్‌గా మారింది. ఆర్డర్ పెట్టిన కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేసిన బాయ్ టిప్ అడిగాడు. అయితే అప్పటికే కస్టమర్ వద్ద డబ్బులు లేవు. దీంతో ఆ డెలివరీ బాయ్‌కు ఊహించని టిప్ ఇచ్చాడు. దాన్ని తీసుకుని డెలివరీ బాయ్ వెళ్లిపోయాడు. సీసీ టీవీలో రికార్డయిన ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అమెరికాలో ఓ వ్యక్తి పిజ్జాహట్‌లో పిజ్జా ఆర్డర్ పెట్టాడు. పిజ్జాను తీసుకుని వచ్చి కస్టమర్ ఇంటి తలుపు తట్టాడు. టిప్ ఇవ్వాలని డెలివరీ బాయ్ అడగ్గా.. ‘నా దగ్గర డబ్బులు లేవు. పిజ్జాలో ఒక ముక్క (స్లైస్) తీసుకో’ అని కస్టమర్ చెప్పాడు. అయితే డెలివరీ బాయ్ ‘మీరేమైనా జోక్ చేస్తున్నారా’! అని ప్రశ్నించాడు. ‘లేదు లేదు నిజంగంటే డబ్బులు లేవు’ అని చెప్పడంతో డెలివరీ బాయ్ తెచ్చిన పిజ్జాలో ఓ ముక్క తీసుకుని తింటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను ఆ కస్టమర్ టిక్‌టాక్‌లో వీడియో అప్లోడ్ చేశాడు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన విషయాలన్నీ ఆ వీడియోలో టెక్ట్స్ రూపంలో వివరించాడు. ఈ భిన్నమైన స్పందన లభిస్తోంది. రింగ్డోర్బెల్ కంపిలేషన్ అనే టిక్‌టాక్ అకౌంట్లో ఈ వీడియో ఉంది. -
నాన్‌వెజ్ పిజ్జా ఇస్తావా? రూ.కోటి ఇవ్వాల్సిందే
కొందరు శాఖాహారులకు మాంసం వాసనే గిట్టదు. అలాంటిది ఏకంగా వారు తినేదాంట్లో మాంసం కలిపేస్తే ఊరుకుంటారా? ఛాన్సే లేదు. ఇదిగో ఇక్కడ చెప్పుకునే దీపాళి త్యాగి అనే మహిళ కూడా శుద్ధ శాఖాహారి. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నివాసముండే ఆమె గతేడాది హోలి పండగ రోజు ఆకలితో ఉన్న తన పిల్లలకోసం అమెరికన్ పిజ్జా రెస్టారెంట్ నుంచి వెజ్ పిజ్జాను ఆర్డర్ చేసింది. కానీ చెప్పిన సమయాని కన్నా అరగంట ఆలస్యంగా డెలివరీ తన ఇంటి ముందుకు వచ్చింది. పోనీలేనని, తనకు తాను సర్ది చెప్పుకుని ఆ డెలివరీ బాక్స్ ఓపెన్ చేసి గబగబా తిన్నారు. ఈ క్రమంలో పిజ్జాలో మాసం ముక్కలు పంటికి తగులడంతో అది మాంసాహార పిజ్జా అని అర్థమైంది. దాన్ని క్షుణ్ణంగా చూస్తే పుట్టగొడుగుల స్థానంలో మాంసం ముక్కలు ఉన్నాయని స్పష్టమైంది. దీంతో ఖంగు తిన్న మహిళ సదరు రెస్టారెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. సంప్రదాయాలు, ఆచారాలు, మత విశ్వాసాలను పాటించే నన్నే మోసం చేస్తావా? అంటూ రెస్టారెంట్‌ను కోర్టుకు లాగింది. నాన్‌వెజ్ పిజ్జా ఇచ్చి చీట్ చేశారంటూ ఇందుకు తనకు కోటి రూపాయల పరిహారం చెల్లించాల్సిందేనంటూ వినియోగదారుల వివాద పరిష్కార కోర్టుకెక్కింది. అయితే దీనిపై ఆమె అదే ఏడాది మార్చి 26న కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా.. మేనేజర్ ఉచితంగా వెజ్ పిజ్జాను పంపుతానని ఆఫర్ చేసినట్లు తెలిపింది. కానీ ఇది అంత చిన్న విషయం కాదని, తన సంప్రదాయాలను దెబ్బతీయడమేనని పేర్కొంది. తనను మానసిక క్షోభకు గురి చేసినందుకుగానూ కోటి రూపాయలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేసింది. మహిళ ఫిర్యాదుపై స్పందించాలంటూ ఢిల్లీలోని జిల్లా వినియోగదారుల పరిష్కార కమిషన్ సదరు పిజ్జా సంస్థను ఆదేశించింది. అనంతరం దీనిపై ఈ నెల 17న విచారణ జరపనున్నట్లు తెలిపింది. చదవండి: ఫ్రిజ్‌లో ఎలా కూర్చున్నాడబ్బా?! -
పిజ్జా వెనుకున్న పెద్ద చరిత్ర తెలుసా?
న్యూఢిల్లీ: పిజ్జా.. ఈ పేరు వింటేనే తిండి ప్రియులకు నోరూరుతుంది. క్యాప్సికమ్, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, చీజ్‌తో టాపింగ్ చేసే ఇటాలియన్ వంటకం పిజ్జాను ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు. ఆన్లైన్ ఫుడ్ యాప్‌లు వచి్చన తర్వాత చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఘుమఘుమలాడే పిజ్జా నేరుగా ఇంటికే వచ్చేస్తోంది. నోరూరుంచే ఈ పిజ్జా వెనుక పెద్ద చరిత్రే ఉంది. విశ్వవ్యాప్తమైన పిజ్జాకు కూడా ఓ రోజుంది తెలుసా... ఫిబ్రవరి 9 ప్రపంచ పిజ్జా దినోత్సవం. ఈ సందర్భంగా ఆ విశేషాలు ఓసారి చూద్దాం. పదో శతాబ్దానికి చెందిన ఓ లాటిన్ కథలో పిజ్జా ప్రస్తావన ఉంది. ఈ కథ దక్షిణ ఇటలీ ప్రాంతంలోని గాయిటా పట్టణానికి సంబంధించినది. అయితే రిపోర్టుల ప్రకారం 1500వ సంవత్సరంలో పిజ్జాను కనుగొన్నారు. చవుకగా లభించే ఈ పిజ్జాను నేపుల్స్కు చెందిన దిగువ తరగతి ప్రజలు వండుకుని తినేవారు. చీజ్‌కు తోడు టమోటా ముక్కలు పిజ్జా రొట్టెపై టాపింగ్ చేసుకుని వారు ఆరగించేవారు. 18వ శతాబ్దం చివర్లో నేపుల్స్‌లోని పోర్ట్ అలబాలో ఓ పిజా షాప్ తెరిచినట్లు రికార్డులు చెబుతున్నాయి. పిజ్జాలు తొలుత చతురస్రాకారంలో ఉండేవట. తర్వాత అవి గుండ్రటి ఆకారంలోకి మారాయి. పిజ్జాను తయారు చేసేవారిని ఇటాలియన్లో పిజ్జాయిలో అంటారట. రెండో ప్రపంచ యుద్ధ కాలం వరకూ అమెరికన్లను పిజ్జా గురించి తెలియదు. ఆ యుద్ధంలో పాల్గొన్న అమెరికా సిపాయిలు పిజ్జా టేస్ట్‌కు ఫిదా అయి.. ఆ వంటకాన్ని అమెరికాకు తెచ్చారు. ఆ తర్వాత అది అమెరికన్లకు ప్రీతిపాత్రమైంది. ప్రపంచంలో అన్ని చోట్లా బేక్ చేసిన పిజ్జా లభిస్తుంది. అయితే స్కాట్లాండ్లో మాత్రం డీప్ ఫ్రై పిజ్జా దొరుకుతుంది. వ్యోమగాముల ఫుడ్ కోసం నాసా తయారు చేసిన 3డి ప్రింటర్లో పిజ్జాకు కూడా చోటు దక్కింది. చవకగా దొరికే పిజ్జాలతో పాటు అత్యంత ఖరీదైనవి కూడా దొరుకుతాయి. ఇప్పటి వరకూ అత్యంత ఖరీదైన పిజ్జా ధర రూ. 7,93,880గా ఉంది. 2013లో డోమినోస్ రూపొందించిన డీవీడీ.. పిజ్జా వాసన రావడం విశేషం ప్రపంచంలోనే అత్యంత వేగంగా పిజ్జాను తయారు చేసేదిగా పేరున్న డోమినోస్‌కు మూడు పెద్ద పిజ్జాలను చేయడానికి కేవలం 47.56 సెకన్లు మాత్రమే పడుతుందట. ఓ అధ్యయనం ప్రకారం వారానికి ఓ పిజ్జాను తిన్న వారికి కేన్సర్ సోకే అవకాశం తక్కువగా ఉంటుందట. కొత్త సంవత్సరం రోజు నిమిషానికి 4100 పిజ్జా ఆర్డర్లు వచ్చాయని జొమాటో సీఈవో దీపీందర్ గొయెల్ చెప్పడాన్ని బట్టి చూస్తే భారత్‌లో కూడా పిజ్జాకు ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది. -
పిజ్జాలతో వేడుక
‘నా పెళ్లాం పుట్టిన రోజు. అంటే నాకు సెలవులు’ అంటున్నారు రానా. రానా భార్య మిహికా బజాజ్ పుట్టిన రోజు శనివారం. ఈ సందర్భంగా ఆమెకు నచ్చిన పిజ్జాలను ఆర్డర్ చేసి, అర్ధరాత్రి బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు రానా. పుట్టినరోజున మిహికా అడిగితేనే వర్క్‌నుంచి రానా బ్రేక్ తీసుకున్నారు. ఈ విషయాన్ని మిహికా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఈ ఇద్దరూ కలసి శనివారం చిన్న హాలిడేకి వెళ్లారు. -
అతను పిజ్జా ఎందుకు తినకూడదు?
దేశంలో కొత్తగా వచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమంలో పిట్ట కథలాగా పిజ్జా కథ కూడా చోటు చేసుకుంది. దీని మీద మాటల బాణాలు, వ్యంగ్యపు విసుర్లు జోరుగా సాగుతున్నాయి.ఇంతకూ ఏం జరిగిందీ?అంటే పంజాబ్ నుంచి ఈ ఉద్యమంలో ఎక్కువ మంది రైతులు పాల్గొంటున్నారు కనుక ఆ రాష్ట్రం నుంచి మద్దతుదారులు రెగ్యులర్‌గా కార్లేసుకొని వచ్చి రైతులకు సహాయం చేసి వెళుతున్నారు. కొందరు తిండి, కొందరు దుప్పట్లు, కొందరు మందులు ఇలా ఇచ్చి పోతున్నారు. మొన్నటి శనివారం తెల్లవారుజామున అమృత్సర్ నుంచి ఇలాగే ఐదు మంది మిత్రులు ఢిల్లీలో ఉన్న రైతులకు ఏదైనా ఆహారం అందిద్దామని బయలు దేరారు. కాని ఆలస్యమయ్యేసరికి హర్యాణాలోని ఒక మాల్ దగ్గర ఆగి రెగ్యులర్ సైజ్ పిజ్జాలు భారీగా కొని ఢిల్లీ చేరుకున్నారు. వెంటనే వాటిని అవెన్‌లో తయారు చేసి రైతులకు ఉచితంగా పంచారు. దాదాపు 400 పిజ్జాలను వారు పంచారు. సిక్కుల ఉచిత భోజన పంపక కేంద్రాలను ‘లంగర్’లని అంటారు. దానివల్ల వీరిది ‘పిజ్జా లంగర్’ అయ్యింది. వెంటనే ఇది ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. చాలా మంది ప్రశంసించారు. కొందరు ప్రభుత్వ విధానాల మద్దతుదారులు విమర్శించారు. ‘చూశారా... రైతులట... పిజ్జాలు తింటున్నారట’ అని విమర్శించారు. వెంటనే అలాంటి విమర్శలకు గట్టి బదులు లభించింది. ‘రైతు పిజ్జా తయారీకి పిండి ఇస్తాడు. ఏం.. అతను పిజ్జా ఎందుకు తినకూడదు?’ అని ఆ పిజ్జా లంగర్‌ను నిర్వహించిన ఒక సభ్యుడు అన్నాడు. రైతులు పైజామాలను వదిలి జీన్స్ ప్యాంట్లలోకి మారారని తెలుసుకోండి అని కూడా అన్నారు. ‘రైతులు విషం తింటుంటే పట్టించుకోని వారు పిజ్జా తింటే విమర్శిస్తున్నారు’ అని పంజాబ్ నటుడు దిల్జిత్ అన్నాడు. పంజాబ్ అమ్మాయిలు కూడా తక్కువ తినలేదు. ‘నేను రైతు కూతురిని. నాకు ఇంగ్లిష్ కూడా వచ్చు’ అని వ్యంగ్య బాణాలు విసిరారు. ‘రైతులు ఎంతసేపు నూనె లేని రొట్టె, ఎర్ర కారం తింటూ ఉండాలా? మాకు పిజ్జా చేసుకు తినడం కూడా వచ్చు’ అని మరికొంతమంది స్త్రీలు ఫేస్బుక్లో రియాక్ట్ అయ్యారు. మీరు ఇక్కడ చూస్తున్న ఫొటో అదే. -
వారిపై జీవితాంతం నిషేధం విధించండి!
పిజ్జా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దాని రుచికి ఫిదా అవ్వని వారు లేరంటే అతిశయోక్తి కాదు!. రోజుకు ఒక పిజ్జా అయినా తినే వారు ఉండనే ఉన్నారు. అయితే పిజ్జా లవర్స్‌ను ఓ ఫొటో తెగ ఇబ్బంది పెట్టేస్తోంది. సగం తిన్న ఆ పిజ్జా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిజ్జా లోపల బాగాన్ని తినేసి, చుట్టూరా ఉన్న ప్రదేశాన్ని వదిలేశారు. దాన్ని ఫొటో తీసి హెచ్‌సీ సౌర్డో పిజ్జా అనే ట్విటర్ ఖాతాలో ఉంచారు. ( ‘జాదూకీ జప్పీ’.. హ్యాట్సాఫ్ డాక్టర్! ) ‘2020, మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు?’ అనే శీర్షికను ఉంచారు. దీనిపై పిజ్జా అభిమానులు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘‘వారిని కనిపెట్టి, పిజ్జా తినకుండా జీవితాంతం వారిపై నిషేధం విధించండి... అది చట్టరిత్యా నేరం... పిజ్జాను కత్తి, పోర్క్‌తో తినే వారిని ఎప్పటికీ నమ్మకండి’’ అని కామెంట్లు చేస్తున్నారు. -
ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ ఉండదిక
లండన్: ఒక పిజ్జా కొంటే రెండో పిజ్జా ఫ్రీ, ఒక బిర్యానీ కొంటే ఇంకో బిర్యానీ ఫ్రీ వంటి ఆఫర్లను మనం చూసే ఉంటాం. అయితే బ్రిటన్‌లో ఇలాంటి ఆఫర్లకు అడ్డుకట్ట పడబోతోంది. అంతేకాదు ప్రతి ఆహారం వల్ల ఎంత కేలరీల శక్తి వస్తుందో ఆయా వివరాలను కూడా రెస్టారెంట్లు మెనూలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న ఊబకాయాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇలాంటి ఆలోచనలు బ్రిటిష్ ప్రభుత్వానికి కొత్తేం కాదు. గతంలోనూ ఇలాంటి ఆలోచనలు చేశారు. అయితే ప్రస్తుతం కోవిడ్ కారణంగా కూర్చొని తినేవారి సంఖ్య పెరగడం, దాంతో ఊబకాయం కూడా పెరగడంతో ప్రభుత్వం ఈ దిశగా అడుగులేస్తోంది. ఐసీయూకు వచ్చే వారిలో 8 శాతం మంది ఊబకాయంతో ఉన్నవారేనని సమాచారం. యువకుల్లో మూడింటి రెండొంతుల మంది అధిక బరువుతో బాధ పడుతున్నారని, 28 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని ప్రభుత్వం అంటోంది. బరువు తగ్గడం కష్టమే అయినా చిన్న చిన్న మార్పులతో ఫిట్‌గా ఉండొచ్చని ప్రధాని జాన్సన్ అన్నారు. -
కాంటాక్ట్ లెస్ పిజ్జా డెలివరీ
సాక్షి, సిటీబ్యూరో: ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగరవ్యాప్తంగా ఉన్న పిజ్జా ప్రియుల కోసం కాంటాక్ట్ లెస్ డెలివరీ, కాంటాక్ట్ లెస్ టేక్ అవే పద్ధతులను ప్రవేశపెట్టినట్టు నగరానికి చెందిన పిజ్జా హట్ నిర్వాహకులు తెలిపారు. తమ యాప్, ఎమ్.సైట్, వెబ్‌సైట్స్‌తో పాటు విభిన్న మార్గాల్లో పిజ్జా ఆర్డర్లు ఇచ్చిన వారికి 240 సెల్సియస్ డిగ్రీల వేడిలో కనీసం 6 నిమిషాల పాటు బేక్ చేసి అందిస్తామన్నారు. -
అమ్మకు ప్రేమతో...
‘‘లాక్ డౌన్ పూర్తయ్యేసరికి గిటార్ నేర్చుకుంటా’’ అని గిటార్ నేర్చుకుంటున్న ఫొటోను ఇటీవల పూజా హెగ్డే షేర్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. పనిలో పనిగా తనలోని చెఫ్‌ను నిద్రలేపి వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారు. ఇటీవల హల్వా చేసిన పూజ ఇప్పుడు తన తల్లి (లత) కోసం పిజ్జా చేశారు. ‘‘మా చిన్నతనంలో అమ్మ మా కోసం పిజ్జా చేసి పెట్టేది. ఇప్పుడు అమ్మ కోసం నేను పిజ్జా చేయగలుగుతున్నానని చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పూజా. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రభాస్ ‘ఓ డియర్’ (ప్రచారంలో ఉన్న టైటిల్), అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు పూజ. అలాగే ‘కబీ ఈద్ కబీ దీవాలీ’ అనే హిందీ సినిమాలో సల్మాన్ సరసన నటించే చాన్స్ కొట్టేశారు. వీటితో పాటు తమిళంలో ఓ రెండు సినిమాల కథలను వినాల్సి ఉందని ఇటీవల సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు పూజ. -
ఊరుకోండి.. ఆమ్లెట్‌ను పాన్కేక్ అంటారేంటి?
-
మా ఊరి మహా వంటగత్తె
బిగెస్ట్ స్పెషల్ పిజా గ్రాండ్ మా ఈ అవ్వ ప్రత్యేకంగా తయారుచేసిన అతి పెద్ద పిజ్జాను ఇప్పటి వరకు 72,45,705 మంది చూశారు. ఈ అవ్వేమీ సెలబ్రిటీ కాదు. వయసు తొంభై పైమాటే. మట్టి పాత్రలు, కట్టెల పొయ్యి, ఇనుప వస్తువులు, ఆరుబయట ప్రకృతిలో పక్షుల కిలకిలల మధ్య, ఆకుల గలగలల మధ్య అతి సామాన్యంగా అవలీలగా కిలోలుకిలోలు వండుతుంది. సెలబ్రిటీలకు ధీటుగా ఉంటారు ఈ అవ్వ వంటలకు ప్రేక్షకులు. బోసి నవ్వుల అవ్వ ఎంతో రుచికరంగా తయారు చేసిన వంటను తనే రుచి చూసుకుంటూ చిరునవ్వులు చిందిస్తుంది. అవ్వ తయారుచేసిన వంట కంటె, అవ్వను చూస్తే, ‘ఈవిడ మన అవ్వ అయితే బాగుంటుంది’ అనిపిస్తుంది. చికెన్ డ్రమ్‌స్టిక్ మస్తానమ్మ మస్తానమ్మ చేసిన చికెన్ డ్రమ్‌స్టిక్ రెసిపీని 66,58, 359 మంది చూశారు. మాంసాహారపు వంటకాలను ప్రత్యేకంగా తయారుచేసిన మస్తానమ్మ 105 సంవత్సరాలు జీవించారు. ఆ వయసులోనూ ఐదు కేజీల బరువును మోశారు. ఆరుబయట కట్టెల పొయ్యి ముందు కూర్చుని, స్వయంగా అన్నీ తరుగుతూ, ఎంతో ఓపికగా వంటలు చేశారు. ఈ తాతమ్మ వంటలను లక్షలమంది మాంసాహార ప్రియులు చూస్తున్నారు. అన్నిటి కంటె చికెన్ డ్రమ్‌స్టిక్ వంటకాన్ని ఎక్కువ మంది చూశారు. కుడి వైపు పమిటతో ఉన్న మస్తాన్మ వంటకాలను ఎంతో ప్రేమగా వండింది. వయసుతో సంబంధం లేకుండా తయారుచేసుకున్న వంటకాలను ఎంతో సరదాగా రుచి చూశారు మస్తానమ్మ. దంతాలు లేకపోతేనేం, చిగుళ్లు ఉన్నాయిగా రుచి చూడటానికి అనే మస్తానమ్మ 105 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. మ్యాగీ నూడుల్స్ , బ్రెడ్ ఆమ్లెట్ న్యూఢిల్లీ రైల్వేస్టేషన్, తేజ్ మండీ చౌక్ దగ్గర ఈ అవ్వ వేగంగా మ్యాగీ నూడుల్స్, బ్రెడ్ ఆమ్లెట్ తయారుచేస్తూ కనిపిస్తారు. వాటిని తినటానికి ఎంతో మంది ఓపికగా నిరీక్షిస్తుంటారు. ఈ అవ్వ వంటకాలను వీడియోలో బంధించి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. రెండు నెలల కాలంలోనే 11,15,975 మంది వీక్షించారు. కుటుంబాన్ని పోషించుకోవటం కోసం వీటిని తయారుచేçస్తున్న ఈ అవ్వ చేతి వంటను ఇష్టపడనివారు ఉంటారా. అందునాతల్లిదండ్రులకు దూరంగా, ఉద్యోగాల కోసం నగరాలకు వస్తున్నవారికి ఇంటి భోజనం, ఇంటి ఆప్యాయతలు తలపించేలా ప్రేమతో నిండిన ఆహారం దొరికితే విడిచిపెడతారా. అవ్వ ఇచ్చేవరకు ఓపికగా నిరీక్షిస్తున్నారు ఇక్కడకు వచ్చేవారంతా. అవ్వను హడావుడి పెట్టకూడదని వారికి తెలుసుగా. వేగంగా రగడా కవితకు నిండా ముప్పై సంవత్సరాలు లేవు. పనిలో చాలా చురుకు. ముంబైలోని చించ్‌పోక్లీ స్టేషన్‌కి సమీపంలో కవిత రగడా పట్టీస్ పావ్ వేగంగా తయారుచేస్తూ హుషారుగా కనిపిస్తారు. కవిత రగడాలు తయారుచేయటంలోనే కాదు, ప్యాకింగ్ చేయడంలోనూ అత్యంత వేగం చూపుతారు. ఈమె పని నైపుణ్యాన్ని వీడియో తీసి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ఆరు నెలలకే 33,31,272 మంది చూశారు. ఎంతో చురుకుగా అలసట కనపడనీయకుండా, అతి వేగంగా రగడా తయారుచేసి అందిస్తూ, మరో వైపు పార్సిల్స్ కడుతూ ఎవ్వరినీ ఎక్కువసేపు నిరీక్షించకుండా పని చేస్తున్న కవిత, ‘మేం సామాన్య మహిళలం కాదు, మేం కూడా సెలబ్రిటీ లమే’ అంటున్నట్లుగా అనిపిస్తారు. నందిని వంట హైదరాబాద్ చందానగర్ స్వాగత్ హోటల్ పక్కన, రోడ్డు మీద చికెన్ బోటీని అతి తక్కువ ధరకు అందిస్తున్నారు మూడు పదులు కూడా నిండని నందిని. వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ తాను ఒక్కర్తే స్వయంగా తయారుచేసి, పన్నెండు గంటలకు వంటకాలను మోసుకొచ్చి, ఆకలితోఉన్నవారికి సాయంత్రం నాలుగు గంటల వరకు అతి తక్కువ ధరలో భోజనం పెడుతున్నారు నందిని. ఆమెను వీడియోలో బంధించి అప్లోడ్ చేశారు. ఆమె చలాకీగా వంటలు వడ్డించటం, వచ్చిన వారిని నవ్వుతూ పలకరించటాన్ని ఇప్పటి వరకు 40,48,611 మంది చూశారు. ఇందులో ఒక్కరూ సెలబ్రిటీలు కాదు. సంపన్న కుటుంబాల వారు కాదు, అందంగా అలంకరించుకుని, మేకప్ వేసుకుని కూడా ఉండరు. మన ఇంట్లో ఉండే అమ్మ, అవ్వ, అక్క, వదిన, చెల్లి వంటివారు వీరందరిలో నిండుగా కనిపిస్తారు. వీరంతా కుటుంబాలను చక్కగా పోషించుకుంటున్న స్వాభిమానులు. శక్తిమూర్తులు, ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నవారు. కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా, ఆకలితో ఉన్న ఎంతోమందిని సంతృప్తులను చేస్తున్నారు. -
ఆదివారం కదా అని పిజ్జా ఆర్డర్ చేస్తే..
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసిన టెకీకి చుక్కలు కనిపించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం కదా అని..పిజ్జా తిందామని ఆశపడి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఓ ఐటీ ఉద్యోగి ఏకంగా రూ.95వేలు పోగొట్టుకున్నాడు. రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమార్కులు ఈ మొత్తాన్ని కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కోరమంగళ 1వ బ్లాక్‌లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగి షేక్ డిసెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం ఓ ఫుడ్ డెలివరీ యాప్‌లో పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే ఎంత సేపటికీ పిజ్జా రాకపోవడంతో ఆ యాప్‌కు చెందిన కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేశాడు. అంతే అదే ఆయన చేసిన తప్పయిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వైపు తాము పిజ్జాలను ఆన్లైన్లో డెలివరీ చేయడం లేదని, కావాలంటే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తామని నమ్మబలికాడు. ఇందుకు ఒక లింక్‌ను కూడా షేర్ చేశాడు. సదరు లింక్‌ను ఓపెన్ చేసి ఫోన్‌పే, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయమని చెప్పాడు. ఆ మోసగాడి వలలో పడిన షేక్ తూ.చ తప్పకుండా అతడు చెప్పినట్టే చేశారు. సరిగ్గా ఈ అదనుకోసం చూస్తున్న కేటుగాళ్లు షేక్‌కు చెందిన హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి రూ.45వేలు, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.50వేలు మొత్తం రూ.95వేలను కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన షేక్ స్థానిక మడివాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు ఇలాంటి కేసులు తమ వద్దకు చాలా వస్తున్నాయనీ, నకిలీలింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మడివాలా పోలీసులు సూచించారు. -
‘సిల్లీ ప్రశ్న.. సూపర్బ్ రియాక్షన్స్’
కెనడా టెన్నిస్ ప్లేయర్ యూజిని బౌచర్డ్ ఆట పరంగా కాకుండా ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తారు. బౌచర్డ్ ఆట కన్నా అందంతోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. దీంతో బౌచర్డ్‌కు ట్విటర్లో తెగ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె చేసే పోస్ట్‌లకు అభిమానులు క్షణాల్లోనే రియాక్ట్ అవుతుంటారు. అయితే కొన్నిసార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. గతంలో సరదాగా చేసిన ఓ ట్వీట్ తెలియని వ్యక్తితో డేట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇచ్చిన మాట ప్రకారం పందెంలో ఓడిపోవడంతో అపరిచిత వ్యక్తితో డేట్‌కు వెళ్లింది. ఈ వార్త అప్పట్లో తెగ హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ట్విటర్ వేదికగా బౌచర్డ్ అడిగిన సిల్లీ ప్రశ్నకు నెటిజన్ల నుంచి ఊహించని రియాక్షన్స్ వచ్చాయి. దీంతో ఈ టెన్నిస్ భామ తెగ ఉబ్బితబ్బిబవుతోంది. ఇంతకీ ఈ అమ్మడు పోస్ట్ చేసిందేమిటంటే. ‘ఆర్డర్ చేయడానికి బెస్ట్ పిజ్జా ఏంటి?’అని పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్ల నుంచి భారీగానే స్పందన వచ్చింది. కొందరు నిజాయితీగా తమకు నచ్చిన పిజ్జాలను సూచించారు. అయితే చాలా మంది నెటిజన్లు బౌచర్డ్‌పై ఉన్న ప్రేమ, అభిమానాన్ని వ్యక్తం చేయగా ఆమె ఓపిగ్గా లైక్‌లు కొట్టారు. మరి కొందరు వ్యంగ్యంగా కామెంట్ పెడుతున్నారు. పిజ్జాలు పక్కకు పెట్టి.. ముందు ఆటపై దృష్టి పెట్టు అని కొందరు నెటిజన్లు కామెంట్ చేయగా.. మరికొందరు ముందు ఒక్క టోర్నీనైనా గెలువు అని సలహాలు ఇస్తున్నారు. ‘నువ్వు టోర్నీ గెలిచి ఎంతకాలమైందో తెలుసా?’అంటూ మరికొందరు కామెంట్ చేశారు. సంచలనాలకు మారుపేరైన బౌచర్డ్ 2012లో జూనియర్ వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించి తొలిసారి వార్తల్లోకి ఎక్కింది. అనంతరం 2014లో డబ్ల్యూటీఏ టోర్నీ గెలిచి మరో సంచలనం సృష్టించింది. అదే ఏడాది యూఎస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరడంతో భవిష్యత్ టెన్నిస్ ఆమెదే అని అందరూ భావించారు. కానీ అంచనాలకు మించి ఆడకపోవడంతో కెరీర్లో ఒడిదుడుకులను ఎదుర్కొంది. అయితే ప్రతీ టోర్నీలో ఏదో ఒక స్టార్ క్రీడాకారిణిని మట్టికరిపిస్తోంది. గతేడాది మాడ్రిడ్ ఓపెన్‌లో రష్యా స్టార్ ప్లేయర్ మరియా షరపోవాను ఓడించటంతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిందని అందరూ భావించారు. కానీ ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఒక్క టోర్నీలో కూడా ఆమె మెరుగైన ప్రదర్శన చేయలేదు. అయినప్పటికీ ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. -
టీవీ లైవ్‌లో అలా బుక్ అయ్యాడు
వివిధ సందర్భాల్లో టీవీ చానెళ్లు, వాటి వ్యవహారంపై దుమారం రేగుతూనే ఉంటుంది. మరికొన్ని బ్లూఫర్స్లా నవ్వు పుట్టిస్తాయి కూడా. తాజాగా అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకవైపు లైవ్ టెలికాస్ట్ అవుతుండగా, మరోవైపు ఆత్రంగా పిజ్జా తింటూ అడ్డంగా బుక్కయిపోయాడో ఉద్యోగి. పని ఒత్తిడి, క్షుద్బాధకు ఓర్వలేక అలా కక్కుర్తి పడ్డాడో ఏమోగానీ , ఈ వీడియోతో మాత్రం పిజ్జా మ్యాన్ లక్షలాది వ్యూస్‌తో ఇంటర్నెట్ హీరో అయిపోయాడు. తాజా ఘటనలో చానెల్ లైవ్‌లో రిపోర్టర్ రిపోర్టింగ్ చేస్తుండగా.. చానెల్‌కు చెందిన మరో ఉద్యోగి పిజ్జా తింటూ లైవ్‌లో కనిపించాడు. దొంగచాటుగా తింటూ.. సడన్‌గా అలా లైవ్ లో ప్రత్యక్షమయ్యే సరికి అతగాడు బిక్క చచ్చిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా నిలిచింది. సీబీఎస్ఎన్ చానెల్లో ఈ ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు హాల్వే పిజ్జా గై అనే నిక్ నేమ్‌తో ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. tfw you go to eat your hallway pizza and get told you’re in the live shot pic.twitter.com/ppkq9PJraO — Mike Uehlein (@MikeUehlein) February 27, 2019 Poor thing...Bless his heart....he's probably starving.😁 — kawfytawk (@kawfytawk) February 27, 2019 -
జంక్ ఫుడ్‌తో మనసుకూ నష్టమే
కేకులు..పిజ్జా బర్గర్లతో రోజులు గడిపేస్తూంటే.. కొంచెం జాగ్రత్త. ఈ జంక్‌ఫుడ్ మీ ఒంటికే కాదు.. మనసుకూ చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు మాంఛెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కొలెస్ట్రాల్, సంతప్త కొవ్వులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మనో వ్యాకులత (డిప్రెషన్) వచ్చే అవకాశాలు 40 శాతం వరకూ పెరుగుతాయని వీరు జరిపిన అధ్యయనం ఒకటి చెబుతోంది. పదహారేళ్ల నుంచి 72 ఏళ్ల మధ్యవయస్కులు దాదాపు లక్ష మందిపై జరిగిన పదకొండు అధ్యయనాల ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాక వచ్చినట్లు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ బ్రాడ్‌బర్న్ తెలిపారు. అమెరికాతోపాటు యూరప్, ఆస్ట్రేలియా, మధ్యాప్రాచ్య దేశాల్లోని స్వచ్ఛంద కార్యకర్తలతో ఈ అధ్యయనం జరిగిందని మనోవ్యాకులత లేదా దాని లక్షణాలు ఉన్న వారి ఆహారపు అలవాట్లను సేకరించి.. అవి శరీరంలో మంట/వాపు కలిగించేందుకు ఉన్న అవకాశం ఆధారంగా ఒక సూచీ సిద్ధం చేశామని వివరించారు. సూచీలో ఎక్కువ స్థాయిలో ఉన్న వారు వారి వయసు, ప్రాంతాలతో సంబంధం లేకుండా జంక్‌ఫుడ్ తీసుకుంటున్నట్లు స్పష్టమైందని అన్నారు. డిప్రెషన్‌కు సరికొత్త ఆహారం ఆధారంగా చికిత్స పద్ధతులను అభివద్ధి చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు క్లినికల్ న్యూట్రీషన్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
‘నాలుగేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించాం’
సాక్షి, న్యూఢిల్లీ : 30 వేల రూపాయల పిజ్జా తినే వారికి నెలకు 12 వేల రూపాయల జీతం ఇచ్చే ఉద్యోగం ఉద్యోగంలా కనిపించదు అంటూ కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పత వ్యాఖ్యలు చేశారు. సబర్మతి నది తీరాన ఉన్న పార్క్‌లో ‘ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్’ వారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి గిరిరాజ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ.. ‘ఈ నాలుగేళ్ల పాలనలో మేము 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చాము. వారిలో దాదాపు 70శాతం మంది నెల జీతం 12 వేల రూపాయలు. ప్రస్తుతం ప్రపంచం నైపుణ్యాలు కలిగిన యువత కోసం చూస్తుంది. మన దేశంలో నైపుణ్యం ఉన్న యువత కేవలం 5 శాతం మాత్రమే. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశంలో నైపుణ్యాభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. నైపుణ్య శిక్షణ గురించి తొలిసారి బీజేపీ ప్రభుత్వమే మాట్లాడింది. 30 వేల రూపాయల విలువ చేసే పిజ్జా తినే వారికి నెలకు 12 వేల రూపాయల జీతం లభించే ఉద్యోగం ఉద్యోగంలా కనిపించకపోవడంలో వింతేముంది’ అన్నారు. ‘ముద్రా’ పథకం కింద తమ మంత్రిత్వ శాఖ 10 కోట్ల మందికి ఉపాధి కల్పించిందన్నారు. 2010 - 2014 మధ్య కాలంలో యూపీఏ హయాంలో 11 లక్షల మంది నూతన పారిశ్రామిక వేత్తలు ఉంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 16 లక్షల మంది నూతన పారిశ్రామిక వేత్తలను తయారుచేశామని తెలిపారు. టెక్స్టైల్, హస్త కళల పరిశ్రమలను మినహాయించి ఇంతమంది పారిశ్రామికవేత్తలను తయారు చేసామన్నారు. ఇక ఆ రెండు శాఖలను కూడా కలుపుకుంటే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మహాత్మగాంధీ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆయన విధానాలను ఖూనీ చేసిందని గిరిరాజ్ సింగ్ విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దేశవ్యాప్తంగా చరఖా గురించి మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. సబర్మాతి నదీ తీరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా స్టీల్ చరఖాను ఆవిష్కరించారు. -
జంక్‌ఫుడ్ ఎందుకు తినకూడదంటే..?
టీనేజీ పిల్లల క్రేజ్ అంతా జంక్‌ఫుడ్డే. అలా నిలబడి త్వరత్వరగా తినడానికి అది అనువుగా ఉంటుంది. చేతికేమీ అంటకుండా ఫ్రెండ్స్ అంతా కలిసి తినేయడానికి వీలుగానూ ఉంటుంది. అందుకే టీనేజీ పిల్లలు వాటిని ఎగబడి తింటుంటారు. పిజ్జా, బర్గర్, పఫ్స్ వంటివాటికి ప్రాణం పెడుతుంటారు. కానీ వాటి గురించి టీనేజ్ పిల్లలకు కాస్త అవగాహన కల్పిస్తే వారు వీటికి దూరమయ్యే అవకాశం ఉంటుంది. ఆ వయసు లో వారిలో శారీరకంగా ఎదుగుదల కనిపిస్తుంది. మానసిక వికాసం చోటు చేసుకుంటూ ఉంటుంది. వారికి వ్యక్తిత్వ నిర్మాణమూ కొనసాగుతుంటుంది. వీటన్నింటినీ జంక్‌ఫుడ్ దెబ్బకొడుతుంది. జంక్‌ఫుడ్‌తో అనర్థాలివే... బేకరీ ఐటమ్స్, పిజ్జా, బర్గర్, బాగా పాలిష్ చేసిన ధాన్యాలతో తయారు చేసే పదార్థాలు వంటి జంక్‌ఫుడ్ ఎందుకు అనారోగ్యాన్ని తెచ్చిపెడతాయో తెలుసుకుంటే, వాటి నుంచి దూరంగా ఎందుకుండాలో కూడా తెలుస్తుంది. ఫైబర్ చాలా తక్కువ : జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంలో పీచుపదార్థాల (ఫైబర్) భూమిక ఎంతో ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, క్యాన్సర్‌ను నివారించడం, మలబద్దకాన్ని దూరం చేయడానికి పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. అయితే జంక్‌ఫుడ్‌లో మాత్రం ఆహారాన్ని పేగుల్లో సాఫీగా కదిలేలా చేసే పీచుపదార్థాలు చాలా తక్కువగా ఉంటుంది. ∙హానికారక ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ: జంక్‌ఫుడ్ చాలా కాలం పాటు నిల్వ ఉండటానికి వీలుగా వాటి తయారీకి హైడ్రోజెనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే నూనెలను ఎక్కువగా ఉపయోగిస్తారు. కాని వాటి వల్ల భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ∙చెడు కొవ్వులూ ఎక్కువే : రుచి పెరగడానికి వాడే కొన్ని కొవ్వు పదార్థాల వల్ల... ఈ ఆహారం కారణంగా ఒంట్లో చాలా త్వరగా అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్ పేరుకుపోయేందుకు అవకాశాలు ఎక్కువ ∙దీర్ఘకాలం నిల్వ ఉండేలా చేసేందుకు ఉప్పు ఎక్కువగా వాడతారు. అది భవిష్యత్తులో హైపర్‌టెన్షన్ (హైబీపీ) వంటి ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. -
ఒక పిజ్జా ఇవ్వండి..!
‘డబ్బులు చెట్లకు కాస్తాయా ఏమన్నా’.. ఈ సామెత మనం చాలా సార్లే వింటుంటాం.. అయితే ఈ ఫొటోలో ఉన్న కుక్కకు మాత్రం అలా కాదు.. దీనికి డబ్బులు చెట్లకే కాస్తాయి.. అదెలా అనుకుంటున్నారా..? దీని పేరు నీగ్రో.. దీనికి ఏదైనా తినాలనిపిస్తే చాలు దుకాణానికి వెళ్లి చెట్ల ఆకులు ఇస్తుంది. వెంటనే ఆ దుకాణదారుడు దానికి కావాల్సింది ఇచ్చేస్తారు. నీగ్రో కొలంబియాలోని కాసనేర్ మాంటెర్రీ అనే యూనివర్సిటీలో ఉంటుంది. నీగ్రోను అక్కడి టీచర్లు దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు నీగ్రో అంటే చాలా ఇష్టం. దీంతో వారంతా అప్పుడప్పుడు తినుబండారాలు కొనిస్తూ ఉంటారు. వారు డబ్బులిస్తూ దుకాణంలో కొనడం చూసిన మన నీగ్రోకు ఓ ఐడియా వచ్చింది. విద్యార్థులు తినుబండారాలు కొనివ్వనప్పుడు తాను కూడా తినుబండారాలను కొనుక్కోవాలని డిసైడ్ అయింది. విద్యార్థులు ఏదో ఇచ్చి కొనడం క్షుణ్నంగా పరిశీలించిన నీగ్రో.. చెట్ల ఆకులు తీసుకెళ్లి ఇస్తూ ఉండేది.. దుకాణదారులు కూడా ముచ్చట పడి ఏదో ఒకటి ఇస్తుంటారు. ప్రతి రోజూ బిస్కెట్ల కోసం వస్తూ ఉంటుందని గ్లాడిస్ బరెటో అనే దుకాణదారుడు చెబుతున్నాడు. నీగ్రో చాలా తెలివైన కుక్కండీ బాబోయ్ అని అక్కడి వారంతా తెగ సంబరపడతారు.. -
పి ఫర్ పూజా కాదు
స్కూల్ డేస్‌లో పీ ఫర్ పీకాక్ అని చదువుకుంటాం. పెద్దయ్యాక పి ఫర్కి మనకు అనిపించిన పదాలు చెబుతాం. ఒక్కోసారి మన పేరు కూడా చెబుతాం. అలాగే పూజా హెగ్డే కూడా అప్పుడప్పుడూ సరదాగా ‘పి’ ఫర్ ‘పూజా’ అంటుంటారు. ఒక్కోసారి వేరే చెబుతారు. ఇప్పుడు మాత్రం ‘పి’ ఫర్ ‘పిజ్జా’ అంటున్నారు. కానీ సిల్వర్ స్క్రీన్‌పై మెరుపు తీగలా కనిపించాలంటే పిజ్జాలు, బర్గర్లు లాగిస్తే కుదరదు. అందుకే చాలామంది కథానాయికలు అయిష్టంగానే వాటికి దూరంగా ఉంటారు. పూజా మాత్రం అలా నోరు కట్టేసుకోని కూర్చోలేను అంటున్నారు. పిజ్జా అంటే ఆమెకు అంత ఇష్టం. పిజ్జా మీద ప్రేమ గురించి పూజా హెగ్డే చెబుతూ– ‘‘ఫిట్‌గా ఉండాలని నచ్చిన ఫుడ్ తినకుండా ఉండటం నా వల్ల కాదు. ముఖ్యంగా పిజ్జా విషయంలో అస్సలు కాదు. నా ఉద్దేశంలో నిజమైన ప్రేమంటే పిజ్జానే. పిజ్జాతో విడదీయలేని ప్రేమ నాది. జిమ్‌లో ఇంకొంచెం సేపు వర్కౌట్ చేస్తాను కానీ పిజ్జాను చూస్తే మాత్రం తినకుండా ఉండలేను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ భామ ఎన్టీఆర్–త్రివిక్రమ్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. వాటితో పాటు మహేశ్‌బాబు, ప్రభాస్ నెక్ట్స్ సినిమాల్లో కూడా కనిపించనున్నారు. -
ప్రేమతో పిజ్జా!
.. చేసిపెట్టారట అందాల ముద్దుగుమ్మ ఇలియానా. ఎవరికోసమో తెలుసా? ఇంకెవరి కోసం ప్రియుడు ఆండ్రూ కోసం. ప్రియురాలు చేసి పెట్టిన పిజ్జాని ఆండ్రూ ప్రేమగా ఆరగించారట. అది చూసి ఈ గోవా బ్యూటీ తెగ మురిసిపోతున్నారు. ఇటీవల హిందీ చిత్రాలు ‘ముబారకాన్, బాద్షాహో’ చిత్రాల్లో నటించిన ఇలియానా కొంత రిలాక్సేషన్ కోరుకున్నారు. అంతే.. ఆండ్రూతో హాలిడే ట్రిప్‌కి వెళ్లారు. ముంబై తిరిగొచ్చాక.. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఇలియానాను ‘మీకు వంట వచ్చా?’ అని ఓ జర్నలిస్ట్ అడిగితే – ‘‘నేనెంత బాగా తింటానో అంతే బాగా వండుతాను. నేను చేసే పిజ్జా అంటే ఆండ్రూకి చాలా ఇష్టం. కుక్కీస్ కూడా బాగా చేస్తాను. రీసెంట్గా యాపిల్ చిప్స్ చేశాను. అవి నా ఫేవరెట్. ఆండ్రూ కూడా వంట చాలా బాగా చేస్తాడు. అతనిదో డిఫరెంట్ స్టైల్. నేను వంట చేయడాన్ని మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. రిలాక్స్ అవ్వడానికి వంట చేయడం ఓ మంచి అలవాటు. బయట పుడ్ ఆర్డర్ చేసుకుని తినడానికి అలవాటు పడినవాళ్లు ఓసారి ఇంట్లో వంట ట్రై చేసి చూడండి. వండటంలో మజా ఏంటో తెలుస్తుంది’’ అన్నారు ఇలియానా. అంతా బాగానే ఉంది. మీకు వంట వచ్చా? అనడిగితే... ఆండ్రూ కూడా వండుతాడని చెప్పడం హైలైట్ అయింది. అడగకపోయినా ఆండ్రూ గురించి మాట్లాడుతున్నారంటే.. అతని గురించి మాట్లాడటం ఇలియానాకు ఆనందంగా ఉంటోందని పరిశీలకులు అంటున్నారు. ఈ మధ్యే ఆండ్రూని ‘బెటరాఫ్’ అని ఇలియానా పేర్కొన్న విషయం గుర్తుండే ఉంటుంది. -
పిజ్జా లవర్స్‌కి ఓ షాకింగ్ వీడియో
-
పిజ్జా లవర్స్‌కి ఓ షాకింగ్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: పిజ్జా ప్రియులకు మైండ్ బ్లాక్ అయ్యే షాకింగ్ వీడియో ఒకటి హల్చల్ చేస్తోంది. డామినోస్ పిజ్జా ఆర్డర్ చేసినపుడు తనకు ఎదరైన చేదు అనుభవాన్ని ఢిల్లీకి చెందిన రాహుల్ అరోరా సోషల్ మీడియాలో షేర్ చేశారు. పిజ్జా తిని తాను అనారోగ్యానికి గురయ్యానని ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం పిజ్జా ఆర్డర్ చేసిన రాహుల్ ఎంచక్కా దాన్ని లాగించేశారు. అయితే స్వల్పంగా అనారోగ్యానికి గురి కావడంతో, మర్నాడు ఉదయం పిజ్జా వాళ్లు ఇచ్చిన మసాలా ప్యాకెట్‌ను విప్పి పరిశీలించాడు. ఈ ప్యాకెట్ నుండి న డామినోస్ ఒరెగానో పాకెట్లో పురుగులు దర్శనమివ్వడంతో షాకయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోను పిజ్జా ప్రియులారా తస్మాత్ జాగ్రత్త! అంటూ సెప్టెంబర్ 10న ఫేస్బుక్లో ఈ విడియోను షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. మసాలా ప్యాకెట్లో ఉండేపురుగులు ఎక్కువ కదలకుండా ఉంటాయని, మసాలా దినుసుల్లానే కనిపిస్తూ..మోసం చేస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు పిజ్జా తినేటపుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వ్యవహారంలో స్థానిక పిజ్జా ఔట్ లెట్ క్షమాపణ చెప్పిందని చెప్పారు. అయితే దీనిపై వినియోదారుల ఫోరానికి ఫిర్యాదు చేసినట్టు రాహుల్ పేర్కొన్నారు. ఇదే అమెరికాలో అయితే ఏం జరిగేది.. భారతీయ వినియోగదారుల పట్ల చల్తా హై ధోరణికి ముగింపు పడాలని వ్యాఖ్యానించారు. ఘటనపై స్పందించిన డొమినోస్ పిజ్జా.. వినియోగదారులకు అందించే తమ ప్రొడక్టులు అన్ని పరిశుభ్రంగా ఉంటాయని తెలిపింది. రెస్టారెంట్ల ఇచ్చే సాచెట్లను పలుమార్లు పరిశీలించిన అనంతరమే పంపుతామని హామీ ఇచ్చింది. -
ఎంత తిన్నావన్నది కాదన్నయ్యా...ఎంత సేపు కూర్చున్నావన్నదే..!
ఉచితం ఇక్కడ పిజ్జా ఉంది. పాస్తా ఉంది. రిసాటో ఉంది. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో పీపుల్స్ అండ్ కో అనే ఒక రెస్టారెంట్‌కి వెళితే ఈ మూడు ఐటమ్స్‌లో మనకు ఇష్టమైన దాన్ని తినొచ్చు. ఇష్టమైతే మూడూ తినొచ్చు! ఇందులో విషయం ఏముందీ?! ఉంది. ఇవి మూడూ అక్కడ ఫ్రీ! ఉచితం!! అయితే చిన్న కండిషన్. సోమ, మంగళ వారాల్లో మాత్రమే ఉచితం. అయితే ఏంటి? కుమ్మేయడానికి ఆ రెండు రోజులు చాలవా? చాల్తాయి. కానీ ఇంకో కండిషన్ కూడా ఉంది. ఫుడ్డుకి బిల్లు కట్టేక్కర్లేదు కానీ, రెస్టారెంట్లో కూర్చున్న టైమ్‌కి బిల్లు కట్టాలి! ఎంతంటే.. నిమిషానికి 15 రూపాయలు. ఆఫర్ బాగుందా? టైమ్ లెక్కేసుకుని తింటే బాగానే ఉంటుంది. -
నాలుగేళ్లు... 24 సినిమాలు... అన్నీ వెరైటీనే!
తమ్మారెడ్డి భరద్వాజ ‘‘విజయ్ సేతుపతి నటించిన ‘పిజ్జా’ చిత్రాన్ని నేను, సురేశ్ కొండేటి తెలుగులో విడుదల చేసి హిట్ సాధించాం. చేసే ప్రతి చిత్రంలో ఏదో ఒక కొత్తదనం ఉండాలని విజయ్ సేతుపతి కోరుకుంటాడు.. లేకపోతేతను చేయడు. నాలుగేళ్లలో 24 వైవిధ్యచిత్రాలు చేయడం గ్రేట్’’ అని దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఇప్పుడు విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా రంజిత్ జయకొడి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘పురియాద పుదిర్’ చిత్రాన్ని లత సమర్పణలో ‘పిజ్జా 2’ పేరుతో డి.వెంకటేశ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. శామ్ సి.ఎస్ స్వరాలు అందించగా, తెలుగులో ‘మంత్ర’ ఆనంద్ సంగీత పర్యవేక్షణ చేశారు. ఈ చిత్రం పాటల సీడీని తమ్మారెడ్డి రిలీజ్ చేసి నిర్మాత బెల్లంకొండ సురేశ్‌కు ఇచ్చారు. డి. వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ఆధునిక టెక్నాలజీని వాడుకొని కొందరు సమాజంలోని అమాయక మహిళలను ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? అనే అంశంతో థ్రిల్లర్‌గా నిర్మించిన చిత్రమిది. తెలుగు, తమిళాల్లో ఒకేసారి విడుదల చేయనున్నాం’’ అన్నారు. రంజిత్ జయకొడి, గాయత్రి, నిర్మాతలు సుదర్శన్ రెడ్డి, మల్కాపురం శివకుమార్, శోభారాణి పాల్గొన్నారు. -
‘పిజ్జా’కు తాత్కాలిక విముక్తి
బీజింగ్: ధ్రువపు ఎలుగుబంటి 'పిజ్జా'కు కష్టాలు తాత్కాలికంగా తప్పాయి. బందిఖానా నుంచి స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'ప్రపంచంలోనే దారుణ విషాదాన్ని చవిచూస్తోన్న ఎలుగుబంటి'గా ముద్రపడిన 'పిజ్జా'కు విముక్తి లభించింది. ఉత్తర చైనాలోని ఝంగ్షూ పట్టణంలో ఉన్న గ్రాండ్ వ్యూ షాపింగ్ మాల్ నుంచి దాన్ని బయటికి తరలించారు. ఆదివారం వీడ్కోలు విందు తర్వాత దాన్ని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఎక్కడికి తరలించారనేది షాపింగ్ మాల్ నిర్వాహకులు వెల్లడించలేదు. ‘ఫేర్ వేల్ పార్టీ తర్వాత బందోబస్తు నడుమ అక్వేరియం నుంచి పిజ్జాను తరలించామ’ని తెలిపారు. ‘పిజ్జా’ జన్మస్థలం టియన్ జిన్ కు దాన్ని తరలించివుంటారని చైనా మీడియా పేర్కొంది. షాపింగ్ మాల్ లోని మిగతా అరుదైన జంతువులకు విముక్తి లభించలేదు. అయితే జంతువులను ఉంచిన ఎన్ క్లోజర్లు నవీకరిస్తున్నామని, ఈ పనులు పూర్తైన తర్వాత ‘పిజ్జా’ను తిరిగి తీసుకొస్తామని షాపింగ్ మాల్ నిర్వాహకులు ప్రకటించారు. అరుదైన జంతువులను వ్యాపార ప్రయోజనాల కోసం ఇరుకైన గదుల్లో బంధించి హింసించడం పట్ల జంతు ప్రేమికులు ఆందోళన చేయడంతో షాపింగ్ మాల్ నిర్వాహకులు దిగివచ్చారు. ‘పిజ్జా’కు తాత్కాలిక ఉపశమనం కలిగించారు. చదవండి: చైనాలో మరో వ్యాపార వికృతం -
చైనాలో మరో వ్యాపార వికృతం
బీజింగ్: చైనాలో మరో వ్యాపార వికృతం వెలుగులోకి వచ్చింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు షాపింగ్ మాల్ లో జంతువులను తీవ్రంగా హింసిస్తున్నారు. చిన్నిచిన్న గదుల్లో అరుదైన జంతువులను బంధించి వాటిని చూపిస్తూ కాసులు దండుకుంటున్నారు. ఈ పోకడను గర్హిస్తూ జంతుప్రేమికులు పెద్ద ఎత్తున పోరాటానికిదిగారు. వీడియోలో కనిపిస్తోన్న ధృవపు ఎలుగుబంటి పేరు 'పిజ్జా'. 'ప్రపంచంలోనే దారుణ విషాదాన్ని చవిచూస్తోన్న ఎలుగుబంటి'గా దీనిని అబివర్ణిస్తున్నారు. ఎక్కడో ధృవప్రాంతంలో స్వేచ్ఛగా తిరగాల్సిన పిజ్జా.. ఉత్తర చైనాలోని ఝంగ్షూ పట్టణంలోని ఒక షాపింగ్ మాల్ లో బందీగా పడిఉంది. క్షణమైనా కూర్చోకుండా బయటికి పోయే దారిని వెతుక్కుంటూ పిజ్జా పడే బాధలు చూస్తే.. మనిషనేనేవాడు కరిగిపోతాడు. కానీ.. పిజ్జా సహా మరికొన్ని అరుదైన జంతువులను చెరలో బంధించిన వ్యాపారులు మాత్రం వాటిని వదిలిపెట్టే సమస్యేలేదంటున్నారు. ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇంచ్చిందని వాదిస్తున్నారు. దీంతో కొందరు జంతు ప్రేమికులు వాటి విడుదల కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. పిజ్జా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా సంతకాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఉద్యమం ఊపందుకుంది. ఈ ప్రచారానికి మీరు కూడా మద్దతు పలికితే పిజ్జా చేత.. 'ఏం మనుషులురా బాబూ..' అని తిట్లు తప్పించుకున్నవాళ్లవుతారు. (తప్పక చదవండి: చైనాలో వ్యాపార వికృతం) -
పొడవా....టి పిజ్జా
-
మార్కెట్లో 'బ్రెడ్' దుమారం
ముంబై: మ్యాగీ నూడుల్స్ లో మోతాదుకు మించి లెడ్ వాడుతోందన్న వివాదం మ్యాగీ నూడుల్స్ ప్రియులను దిగ్భ్రాంతికి లోను చేసింది. తాజాగా సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) చెప్పిన విషయాలు మరింత దుమారాన్ని రాజేశాయి. బ్రెడ్, పిజ్జా, కొన్ని రకాల బిస్కట్లలో కాన్సర్ కారక రసాయనాలను కనుగొన్నామని (చదవండి....బ్రెడ్డు తింటే కేన్సర్ ఫ్రీ!) సీఎస్ నిన్న ప్రెస్ మీట్ లో వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. దీంతో మంగళవారం నాటి మార్కెట్ లో ఫూడ్ సెక్టార్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా జూబ్లియంట్ ఫుడ్ వర్క్, దాదాపు10 శాతం , బ్రిటానియా 2శాతం నష్టపోయింది. వెస్ట్ లైఫ్ డెవలప్ మెంట్ కూడా ఇదే బాటలోఉంది. అసలే అంచనాలకు మించని ఫలితాలు, పతంజలి దెబ్బతో కుదేలైన బ్రిటానియాకు సీఎస్ ఈ రిపోర్టు అశనిపాతంలా తగిలింది. అయితే సీఎస్ఈ రిపోర్టును మెక్ డోనాల్డ్ , బ్రిటానియా తీవ్రంగా ఖండించాయి. తాము బ్రెడ్ , పిజ్జా తయారీలో పొటాషియం ఐయోడేట్ పొటాషియం బ్రోమేట్ తమ ఉత్పత్తుల్లో వాడటం లేదని వాదించాయి. సీఎస్ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవి మెకొ డోనాల్డ్ కొట్టిపారేసింది. భారత ఆహార ఎఫ్ ఎస్ ఎస్ ఏ నిబంధనల ప్రకారంమే బ్రెడ్ లోని ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామని వివరణ ఇచ్చాయి. ఈ వివాదంలో పిజ్జాహట్, కెఎఫ్సీ తదితర ఆహార ఉత్పత్తుల కంపెనీలు ఇంకా ఉన్నాయి. కాగా బ్రెడ్, పిజ్జా, బర్గర్లలో కెమికల్స్‌ను గుర్తించినట్లు సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) అధ్యయనంలో తేలింది. బ్రెడ్‌తో పాటు బర్గర్, పిజ్జా వంటి ఫాస్ట్ ఫుడ్‌లో పొటాషియం బ్రొమేట్ (కేబీఆర్ఓ) లేదా పొటాషియం ఐయోడేట్ (కేఐఓ3)ల శాతం అధికంగా ఉందని, బ్రెడ్, పిజ్జా, బర్గర్లు, బేకరీ ఉత్పత్తుల్లో 84 శాతం పైన పేర్కొన్న రసాయనాలు ఉన్నట్లు శాంపిల్స్ ద్వారా తేటతెల్లమైంది. వీటి ద్వారా క్యాన్సర్ ఏర్పడే అవకాశాలున్నాయని సీఎస్ఈ వెల్లడించడం ఆందోళన రేపిన సంగతి తెలిసిందే. -
క్షణాల్లో పిజ్జా స్వాహా
తిక్క లెక్క సుతిమెత్తని మిఠాయిలను, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఐస్‌క్రీములను శరవేగంగా స్వాహా చేసేయవచ్చు. దంతాలకు పని కల్పించే పిజ్జాలాంటి పదార్థాన్ని క్షణాల్లో స్వాహా చేయడమంటే మాటలా..? నమలడంలో దంతాలకు, దవడలకు వ్యాయామం కల్పించే పిజ్జాను క్షణాల్లో స్వాహా చేసి పారేశాడు ఈ ఫొటోలో కనిపిస్తున్న కెనడియన్ పెద్ద మనిషి. ఇతడు తిన్న పిజ్జా సైజు చిన్నదేమీ కాదు. ఏకంగా పన్నెండంగుళాల వ్యాసంతో పద్ధతిగా తయారు చేసిన పిజ్జా అది. మరో ఇద్దరితో కలసి పందెంలో పాల్గొన్న పీటర్ జెర్వెన్స్కీ అనే ఈ కెనడియన్ బకాసురుడు కేవలం 32.28 సెకండ్లలోనే ప్లేటులో పెట్టిన పిజ్జాను ఖాళీచేసేసి బ్రేవ్‌మని తేన్చాడు. ఈ ఘనకార్యంతో గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కాడు. -
బొజ్జ బాగోతం
సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది. ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు. ఈ తిప్పలన్నీ దేనికంటారు? జానెడు పొట్ట కోసం కాదూ! అన్ని రుచులూ తృప్తిగా ఆరగించకపోతే ఈ దిక్కుమాలిన సంపాదనంతా దేనికోసమంటారు? లోకంలో ఎవరేమనుకుంటే నాకేం..? ఎవరెలా పోతే నాకేం..? చిన్ని నా బొజ్జకు శ్రీరామరక్ష! ఇదిగో! ఇలా అనుకోవడం వల్లనే చాలామంది జానెడు పొట్టను బానలా పెంచేసుకుపోతారు. పెళ్లయిన కొత్తలో కొసరి కొసరి వడ్డించే భార్య ‘చిరుబొజ్జే సింగారం’ అంటుంటే తెగ మురిసిపోతూ రెచ్చిపోయి మరీ భోజన ప్రతాపాన్ని ప్రదర్శిస్తారు. కొన్నేళ్లు గడిచాక చూసుకుంటే ఏముంటుంది? బానెడు పొట్ట... ఆ పొట్టతో పాటు వచ్చే నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, సుగర్, బీపీ... వగైరా వగైరా ఉచిత బహుమతులు. అసలే ఉచితంగా వచ్చిన బహుమతులాయె! వదిలించుకుందామనుకున్నా ఒక పట్టాన వదిలి చావవు. పుట్టినప్పుడు పొట్ట అందరికీ దాదాపు ఒకేలా ఉంటుంది. ఎదిగే క్రమంలోనే మార్పులు వస్తాయి. అలాగని జానెడు పొట్ట గాలి నింపిన బెలూన్లా అమాంతం ఒకేసారిగా ఉబ్బిపోదు. జిహ్వచాపల్యం ఆపుకోలేక దొరికినదల్లా నమిలి మింగేస్తూ ఉంటేనే... ఇంతై ఇంతింతై అన్నట్లుగా బానపొట్ట తయారవుతుంది. అదేపనిగా కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయని హెచ్చరించిన పెద్దలు ఆ పని వల్ల పొట్ట బానలా పెరిగిపోతుందని, అది ఒక పట్టాన తరగదని హెచ్చరించకపోవడం నిజంగా ఒక చారిత్రక అపరాధం. పెద్దల మాట చద్దిమూట అంటారు గానీ, ఈ రోజుల్లో పెద్దల మాటలు, చద్ది మూటలు ఎవరికి రుచిస్తున్నాయి గనుక? పిజ్జా బర్గర్ల కాలం వచ్చిపడ్డాక స్కూళ్లకు వెళ్లే పిల్లకాయలు కూడా బొజ్జగణపయ్యల్లా తయారవుతున్నారు. అసలు బొజ్జగణపయ్యకు తొలిపూజలు చేయడం ఆచారంగా వస్తున్నందు వల్లే మన దేశంలో బొజ్జకు గ్లామర్ పెరిగిందేమోనని అనుమానం! బానపొట్టల సమస్య మన దేశానికి మాత్రమే పరిమితం కాదు, అన్ని దేశాల్లోనూ ఉన్నదే. అమెరికాది అగ్రరాజ్యాల్లో ఈ సమస్య మరీ ఎక్కువ. అగ్రరాజ్యాలు ఇప్పుడిప్పుడే ఈ సమస్యను గుర్తించి, పొట్టలు కరిగించే దిశగా చర్యలు ప్రారంభిస్తున్నాయి. మన దేశంలో మాత్రం ఈ సమస్యపై ఏలినవారు ఇంకా కళ్లు తెరవలేదు. అఫ్కోర్స్, మన దేశంలో బానపొట్టలకు రెట్టింపు సంఖ్యలో వీపులను అంటుకుపోయే సైజ్‌జీరో పొట్టలూ ఉన్నాయనుకోండి. సైజ్‌జీరో పొట్టల్లో ముఖ్యంగా రెండురకాలు కనిపిస్తాయి. గ్లామర్ కోసం కష్టపడి కడుపు మాడ్చుకుని సాధించేవి కొన్నయితే, తప్పనిసరి పస్తుల వల్ల మలమలమాడి ఎండిన పొట్టలు మరికొన్ని. మాడిన పొట్టల్లో కాస్త ఆహారం నింపితే చాలు ఆరోగ్యంగా కోలుకుంటాయి. అయితే, బానపొట్టలను కరిగించి ఆరోగ్యకరంగా ఆరుపలకలతో అలరారేలా తీర్చిదిద్దడం అంత వీజీ కాదు గురూ! అసలే మగజన్మలకు బతుకే పెనుభారం. చిన్నప్పుడు చదువుల భారం. చదువు పూర్తయ్యాక ఉద్యోగ భారం. ఉద్యోగ భారం ఇంకా అలవాటు కాకముందే పెళ్ళయ్యాక మీదపడే సంసార భారం. అలాంటిది జానెడున్న పొట్ట కాస్త బానెడుగా విస్తరిస్తే, ఆ నడమంత్రపు అదనపు భారాన్ని తట్టుకోవడం అంత తేలిక కాదు. అడుగు తీసి అడుగు వేయడమే కష్టమవుతుంది. ఎలాగోలా శక్తి కూడదీసుకుని గునగునమని వీధిలో నడుస్తూ ఉంటే గమనించే కుర్రకారు ‘కొబ్బరిబొండాం’ వంటి బిరుదులతో బహిరంగ రహస్యంగా సత్కరించేస్తారు. తెల్లారగట్లే వాకింగ్‌కు వెళ్దామనే ఉంటుంది. వీధిలో పాడు కుక్కలు వెంటపడితే పరుగు లంఘించుకునే శక్తి ఉండదు కదా! అందుకే ఆ కార్యక్రమానికి వాయిదా పడుతుంది. ఆరుపలకలేం అక్కర్లేదు గానీ, చదునైన ఏకపలక పొట్ట దక్కితే చాలురా భగవంతుడా! అని మొరపెట్టుకోని రోజు ఉండదు. జిమ్‌లో చేరాలనే ఉంటుంది. బరువులను చూస్తే భయం, గుండెదడ మొదలవుతాయి. అయినా తెగించి, బరువులెత్తితే ఆయాసం ముంచుకొస్తుంది. పొట్ట కరగడం దేవుడెరుగు! ఒంటినొప్పులు మొదలవుతాయి. సిరిసంపదలకు చిరుబొజ్జే ఆనవాలు అనే నమ్మకం నానా నాగరికతల్లో అనాదిగా ఉన్నదే. తరాలు మారినా, యుగాలు మారినా ఈ నమ్మకంలో పెద్దగా మార్పు రాలేదు. అలాగని ఇదేమీ మూఢనమ్మకంలాంటిది కాదు. సిరిసంపదలకు అనులోమానుపాతంగా ‘మగా’నుభావుల పొట్టపెరగడం ఒక సహజ పరిణామం. కొందరు పుడుతూనే నోట్లో వెండిచెమ్చాతో పుడతారు. వాళ్లకు బాల్యావస్థలోనే బొజ్జపెరగడం మొదలవుతుంది. ఇంకొందరు యవ్వనదశలోనూ చువ్వల్లా చురుగ్గానే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఢక్కామొక్కీలు తిని ఉంటారు. అవకాశం, అదృష్టం కలిసొస్తే ఇక విజృంభిస్తారు. ఆబగా సిరిసంపదలను పోగేసుకుంటారు. బ్యాంకులో డబ్బును దాచుకున్నంత భద్రంగా ఒంట్లో కొవ్వును దాచుకుంటారు. వాళ్లకు సంప్రాప్తించిన నడమంత్రపు సిరిలాగానే, వాళ్ల నడమంత్రపు బొజ్జ కూడా అంతకంతకూ పెరిగిపోతూ ఉంటుంది. బొజ్జబాబులందరూ బొజ్జలు కరగాలని కోరుకుంటూ ఉంటారు. నానా దేవుళ్లకీ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఇందులో వింతేమీ లేదు. ఈ ‘పైసా’చిక లోకంలో కొందరు మాత్రం దేశంలో బొజ్జలు వర్ధిల్లాలంటూ బొజ్జగణపయ్యకు పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకైనా మంచిదని భారీ బొజ్జతో అట్టహాసాన్ని చిందించే లాఫింగ్ బుద్ధుడిని కూడా ఆరాధిస్తూ ఉంటారు. బొజ్జలు కరిగించడమే వాళ్ల వ్యాపారం. జిమ్ పరికరాలతో కొందరు, లిపోసక్షన్స్ అంటూ ఇంకొందరు పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలతో ఊదరగొట్టేస్తూ ఉంటారు. సిటింగుకు ఐదు కిలోల చొప్పున అరడజను సిటింగుల్లోనే ఎంతటి భారీ బొజ్జలనైనా అవలీలగా కరిగించేస్తామంటూ నమ్మబలుకుతూ ఉంటారు. బొజ్జలోనే కాదు, ఒంట్లో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా రిటైల్‌గా, హోల్‌సేల్‌గా కరిగించేస్తాం అంటూ టీవీ ప్రకటనల్లో బొద్దుగుమ్మల చేత చెప్పిస్తారు. బొర్ర తప్ప బుర్ర పెరగని బకరాలు అలాంటి ప్రకటనలను అమాయకంగా నమ్మేస్తారు. అక్కడికి వెళితే పొట్ట కరిగినా కరగకపోయినా, పర్సు కరగడం మాత్రం ఖాయం. మరీ ఆత్రపడి, కొవ్వు తొలగించుకోవడానికి కోతలకు సిద్ధపడితే ప్రాణాల మీదకు వచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు. - పన్యాల జగన్నాథ దాసు -
ఈ పిజ్జా మూడేళ్లయినా పాడవదు!
వాషింగ్టన్: మనం ఎంతో ఇష్టంగా తినే పిజ్జా కాస్త మిగిలిపోతే మరుసటి రోజు బయట పడేయాల్సిందే. ఎందుకంటే ఎంత ప్రిజ్‌లో పెట్టినా మహాఅయితే రెండ్రోజులకు మించి పిజ్జా పాడవకుండా ఉండడం కష్టం. కానీ అమెరికా తయారు చేసిన పిజ్జా మాత్రం ఏకంగా మూడేళ్లపాటు నిల్వ ఉంటుందట. మరి మూడేళ్లపాటు పాడవని పిజ్జా ఎందుకు తయారు చేశారో తెలుసా? ఆ దేశ సైన్యం కోసం. అమెరికాలోని మారుమూల ప్రాంతాలు, సుదూర ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికుల కోసం ఈ పిజ్జాను తయారు చేశారు. దీనికి ‘ఎంఈఆర్ 37’గా నామకరణం కూడా చేశారు. ఏ ఆహార పదార్థమైనా బ్యాక్టీరియా కారణంగానే పాడైపోతుంది. అయితే బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా హర్షిల్ టెక్నాలజీతో అమెరికా ఆర్మీ ల్యాబ్‌లో ఈ పిజ్జాను సిద్ధం చేశారు. -
ఆయనతో నో ప్రాబ్లం
నటుడు విజయ్‌సేతుపతితో నటించడం నాకేప్పుడూ కంఫర్టబులే అంటోంది నటి రమ్యానంబీశన్. బహుభాషా నటి అయిన ఈ కేరళకుట్టి తమిళంతో పాటు మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలోనూ తన ముద్రను వేసుకుంది. అయితే తమిళంలో ప్రముఖ హీరోయిన్ స్థానం కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. అవకాశాలు కూడా అడపాదడపానే అందుతున్నాయి. అవీ వర్ధమాన కథానాయకులతోనే అన్నది గమనార్హం. తాను కంఫర్టబుల్ జోన్లోనే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానంటున్న రమ్యానంబీశన్ తాజాగా విజయ్‌సేతుపతికి జంటగా సేతుపతి అనే చిత్రంలో నటిస్తోంది. విషయం ఏమిటంటే ఇంతకు ముందు ఈ జంట పిజ్జా అనే హిట్ చిత్రంలో నటించారు. ఆ తరువాత మళ్లీ కలిసి నటిస్తున్న చిత్రం సేతుపతినే. రమ్యానంబీశన్ మాట్లాడుతూ సేతుపతి చిత్రంలో తాను చిత్ర కళాకారిణిగా నటిస్తున్నానంది. ఇదే కాదు మలయాళం, కన్నడం భాషల్లోనూ ప్రస్తుతం తాను కంఫర్టబుల్ జోన్లోనే పాత్రలను ఎంపిక చేసుకుంటున్నానని చెప్పింది. విజయ్‌సేతుపతి గురించి చెప్పాలంటే పిజ్జా చిత్రం తరువాత మళ్లీ ఇప్పుడే ఆయన్ని కలిశానని తెలిపింది. ప్రస్తుతం విజయ్‌సేతుపతి ఎదుగుతున్న హీరో అనీ అయినా ఆయనలో ఎలాంటి మార్పు లేదని అంది. విజయ్‌సేతుపతితో నటించడం తనకెప్పుడూ కంఫర్టబులేనని రమ్యానంబీశన్ వ్యాఖ్యానించింది. -
పిజ్జా చూపిస్త మావా...
తిక్క లెక్క సాధారణంగా మనకు తెలిసి పిజ్జా ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. లాంగ్షాట్లో చూస్తే పూర్ణచంద్ర బింబంలా ఉంటుంది. అలాగని పిజ్జా ఇదే ఆకారంలో ఉండాలనే నిబంధనేమీ లేదనుకోండి. ఆకారానిది ఏముంది? పదార్థమే ప్రధానం అనుకున్నారు ఇటాలియన్ పాక నిపుణులు. అనుకున్నదే తడవుగా అత్యంత భారీ స్థాయిలో పిజ్జా తయారీకి నడుం బిగించారు. ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్లకు పైగా పొడవున పిజ్జాను తయారు చేశారు. శాంటే లుడోవికోలో గత ఏడాది వీరు ప్రదర్శించిన పిజ్జా పొడవు 1595.45 మీటర్లు మాత్రమే. దీని విస్తీర్ణం 15 ఫుట్‌బాల్ మైదానాల కంటే ఎక్కువ. ఇది ఇదివరకటి గిన్నెస్ రికార్డును బద్దలు కొట్టింది. -
పిజ్జా పుట్టిన ప్రాంతంలో పొల్యూషన్ రగడ..!
నేను యాంటీ పిజ్జా మేయర్‌ని అంటున్నాడు... ఇటలీ శాన్ విటలియానో లో సివిక్ లీడర్ గా మారిన ఓ డాక్టర్. ప్రజారోగ్యమే తనకు ముఖ్యమని, అందుకు తనవంతు ప్రయత్నాన్ని ప్రారంభించానని చెప్తున్నాడు. నీపోలిటన్ హింటర్ ల్యాండ్ లోని ఓ చిన్న పట్టణానికి మేయర్ అయిన ఆయన.. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ధ్యేయంగా పనిచేస్తున్నాడు. అందుకు టాక్సిక్ ఎయిర్ పొల్యూషన్ కలిగించే కట్టెల పొయ్యిల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు కూడ జారీ చేశాడు. అయితే పిజ్జా పుట్టిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఆ ప్రాంతంలో కట్టెల పొయ్యిల నిషేధం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కట్టెల పొయ్యిలను వాడే కుటుంబాలు, పిజ్జాలు తయారు చేసే బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపారస్తులు ఇప్పుడు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ వెంటనే రాజీనామా చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్లు కూడ వెల్లువెత్తాయి. అయితే చైనా రాజధాని నగరమైన బీజింగ్ లో ఇప్పటికే కాలుష్య పొగమంచుపై రెడ్ అలర్ట్ ప్రకటించారని, ముందు జాగ్రత్త చర్యగానే తాను ఆ నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ చెప్తున్నారు. వాయుకాలుష్యంపై అత్యవసర చర్యలు చేపట్టడంలో భాగంగా... చట్ట పరిమితులు దాటి కాలుష్యాన్నిసృష్టించడాన్ని ఫాల్కోన్ వ్యతిరేకిస్తున్నారు. అయితే ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గించడంలో భాగంగా ఇప్పటికే ఒక్కోరూ ఒక్కో పద్ధతిని అమల్లోకి తెస్తూనే ఉన్నారు. రోమ్ 'ఆడ్ ఆర్ ఈవెన్ నెంబర్స్' ను ప్రవేశ పెట్టగా... మిలాన్ వారంలో మూడు రోజులపాటు వాహనాల వాడకాన్నేనిషేధించింది. తమవంతు బాధ్యతగా మిలాన్ తో పాటు చాలా నగరాలు న్యూ ఇయర్ వేడుకల్లో టపాసుల వినియోగాన్ని కూడ నిషేధించాయి. అయితే వాయు కాలుష్యంలో యూరప్ లోనే ఇటలీ.. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతమని పర్యావరణవేత్తలు చెప్తున్నారు. ఇటలీలో సంవత్సరానికి సుమారు 30 వేలమంది దాకా కాలుష్యంతో మరణిస్తున్నట్లు 2015 ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో శీతాకాలంలో పెరిగే కాలుష్యాన్నినిషేధించేందుకు పురపాలక సంఘాలు కాలుష్య మూలాల నిషేధాన్ని అమల్లోకి తెచ్చాయి. జాతీయ వాతావరణ శాఖామంత్రి పర్యావరణంపై పురపాలక సంఘాల ప్రతినిధులతో రోమ్ లో అత్యవసర సమావేశం కూడ నిర్వహించారు. ఇళ్ళలో, కార్యాలయాల్లో థర్మోస్టాట్ల వాడకాన్నినిషేధించారు. నగరాల్లో స్పీడ్ లిమిట్ ను అమల్లోకి తెచ్చారు. పాత కార్ల వాడకానికి స్వస్తి పలికి, ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహించాలని ఆదేశించారు. పొగ గొట్టాల వాడకంపై కూడ పరిమితులు విధించారు. అయితే చట్టాలు, నిషేధాలతో పొల్యూషన్ ను నియంత్రించడాన్ని అమలు చేస్తున్న లక్షల ప్రాంతాల్లో ఇటలీ ఒకటి. పొల్యూషన్ సమూలంగా నిర్మూలించాలంటే ఇటువంటి బాధ్యతను సక్రమంగా అమలు చేయడం ఫాల్కోన్ వంటి ప్రతి మేయర్ పైనా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక పిజ్జా విక్రయదారులు, వ్యాపారస్తులు ఫిబ్రవరి 29 నాటికి ఓవెన్లకు తగిన పొల్యూషన్ ఫిల్టర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. మార్చి 1 నుంచి ఇనస్పెక్లర్లు తనిఖీలు ప్రారంభిస్తారని, ఫిల్టర్లు లేని రెస్టారెంట్లు, పిజ్జా తయారీదారుల లైసెన్సులు రద్దు చేస్తారని హెచ్చరించారు. కాగా ప్రాణాంతకమైన పొల్యూషన్ నియంత్రణపై అవగాహన అనంతరం పిజ్జా విక్రయదారులు కూడ మేయర్ కు సహకరించేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. అయితే ఇటువంటి పెద్ద సమస్యను మిణుగురు పురుగువంటి తమ చిన్న పట్టణంలో అమలు చేస్తే సరిపోదని, మిగిలిన నగరాల మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. -
పిజ్జా లేటయిందేంటి అన్నందుకు పొడిచేశాడు!
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో డొమినోస్ పిజ్జాకు చెందిన ఓ డెలివరీ ఉద్యోగి వినియోగదారున్ని కత్తితో పొడిచాడు. పిజ్జా ఆలస్యంగా తీసుకురావడంపై గొడవ జరగడంతో అతను దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కాలిఫోర్నియాలోని గ్లెన్ డోరాకు చెందిన మైఖేల్ చార్లెస్ (31)ను పోలీసులు అరెస్టు చేశారు. పిజ్జా డెలివరీ లేట్ అయినందుకు గొడవ జరగడంతో అతను 20 ఏళ్ల వ్యక్తిని పొడిచాడని పోలీసులు తెలిపారు. దీంతో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయని, అయితే ప్రాణాపాయం లేదని చెప్పారు. కాలిఫోర్నియాలోని కొవిన్ లో శనివారం ఈ ఘటన జరిగింది. మెడపై, మణికట్టుపై గాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అరెస్టైన నిందితుడు 30వేల డాలర్ల పూచీకత్తు బెయిల్ పై విడుదలయ్యాడు. అతనిపై మార్చ్ 21న పోలీసులు అభియోగాలు నమోదుచేయనున్నారు. -
ఐటీ దాడి... పిజ్జా గోల!
సెంట్రల్ ముంబైలోని ఓ డాక్టర్ తన ఇంట్లో నుంచి దాదాపు 16 లక్షల రూపాయల విలువ చేసే నగలు పోయాయని, పనిమనిషి రామ్చౌదరిపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ఎన్ఎం జోషి మార్గ్ పోలీసుస్టేషన్ సిబ్బంది రామ్చౌదరిని బిహార్‌లోని అతని స్వస్థలంలో అరెస్టు చేశారు. నగలకు రికవరీ చేసుకున్నారు. అయితే రామ్‌చౌదరి, అతని సహచరుడు అనిల్ కామత్‌లను విచారించగా... పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. బాలీవుడ్లో చాలామంది స్టార్లకు సన్నిహితుడైన ఈ డాక్టర్ ఇంటిపై రెండువారాల కిందట ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేశారు. తనిఖీలు కొనసాగుతుండగా... డాక్టర్ భార్యకు ఓ ఆలోచన తట్టింది. తమ కుటుంబసభ్యులతో పాటు ఐటీ అధికారులకు పిజ్జాలు ఆర్డర్ చేసి తెప్పించారు. వాటిని తిన్నాక... ఐటీ అధికారులకు ఎలాంటి అనుమానం రాకుండా ఖాళీ పిజ్జా బాక్సుల్లో నగలు నింపి... వాటిని బయటపడేసి, వాటిపై ఓ కన్నేసి అక్కడే ఉండమని పనిమనిషి రామ్ చౌదరికి ఆమె పురమాయించారు. నగలతో కూడిన పిజ్జా బాక్సులతో బయటికి వెళ్లిన రామ్ చౌదరి... వాటితో ఉడాయించాడు. అరెస్టయ్యాక అతను చెప్పిన విషయాలు విని పోలీసులు కంగుతిన్నారు. వెంటనే విషయాన్ని ఐటీ అధికారులకు చెప్పడం నోరు వెళ్లబెట్టడం వాళ్ల వంతు అయ్యిందట. -
పిజ్జాతో ఆమె నిశ్చితార్థం!
యవ్వనం తోడు కోరుకుంటుంది. యుక్త వయస్సుకు రాగానే సహజంగానే చాలామంది ప్రేమలో పడుతుంటారు. అదేవిధంగా 19 ఏళ్ల నికోల్ లార్సన్ కూడా ప్రేమలో పడింది. అయితే యువకుడితో కాదు పిజ్జాతో.. అవును వినడానికి ఇది విచిత్రంగానే ఉన్నా.. కెనడాలోని అల్బెర్ట్‌కు చెందిన ఈ అమ్మాయి 'పిజ్జా హట్'తో నిశ్చితార్థం చేసుకుంది. అంతేకాకుండా '2015 దంపతుల ఫొటోలు' పేరిట పిజ్జాతో వివిధ ఫోజుల్లో దిగిన ఫొటోలను ఫేస్బుక్లో పెట్టింది. పిజ్జాపై తన ప్రేమను చాటుతూ మొత్తం 16 ఫొటోలను పెట్టింది. ఇది ఫేస్బుక్లో హల్చల్ సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ పోస్టుకు 12వేల లైకులు, 30వేల షేర్లు వచ్చాయి. యవ్వనంలోకి వచ్చాక కూడా ఒంటరిగా ఉండటమే లార్సన్‌కు ఇష్టమట. అందుకే తనకు ఇష్టమైన పిజ్జాతో ప్రేమగా ఫొటోలు తీసుకుంది. 'ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిని వెతుక్కునే తొందరలో ఉన్నారు. అంతకన్నా మన రోజును మెరుగుపరిచే వాటిపై దృష్టిపెట్టడం మేలు అని నేను సూచిస్తాను' అని ఆమె చెప్తున్నది. -
రికార్డు రేటు పిజ్జా...!
తిక్క లెక్క ఎంతపెద్ద పిజ్జా అయితే మాత్రం ధర ఎంత ఉంటుందేం..? మన రూపాయల్లో చెప్పుకుంటే కొన్ని వందల్లోనే ఉంటుందనుకుంటున్నారా..? ఈ ఫొటోలోని పిజ్జాను చూడండి. దీని ధర తెలుసుకుంటే గుడ్లు తేలేయడం ఖాయం! దీని ధర కేవలం 178 డాలర్లు (రూ.11,535) మాత్రమే. ఇప్పటి వరకు ఇదే ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన పిజ్జాగా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. లండన్‌లోని గార్డన్ రామ్సే జాయింట్ దీనిని తయారు చేస్తోంది. దీని స్పెషాలిటీ ఏమంటారా? ఆనియన్ టాపింగ్‌తో అలంకరించడమే దీని ప్రత్యేకత. బహుశ అందుకేనేమో దీనికి ఇంత ధర పలుకుతోంది. -
పిజ్జా పిలుస్తోంది!
విశేషం ఎక్కడి పిజ్జా..? ఎక్కడ లండన్..? ఇటలీలో పుట్టిన పిజ్జా ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దేశ దేశాల్లో పిజ్జా అభిమానులు ఉన్నారు. బ్రిటన్ రాజధాని లండన్‌లోనైతే పిజ్జాకు వీరాభిమానులూ ఉన్నారు. ఇలాంటి వీరాభిమానులకు పిజ్జా పండుగ ఘనంగా జరుపుకోవాలనే ఆలోచన వచ్చిందీ మధ్య. ఆలోచన వస్తే ఆచరణలోకి రావడం ఎంతసేపు? అది కూడా లండన్ వారికి. అందుకే అక్కడి పిజ్జా వీరాభిమానులంతా కార్యాచరణకు చకచకా రంగం సిద్ధం చేసేశారు. వారి కోరిక మేరకు ఫుడ్ ఈవెంట్ కంపెనీ అయిన ‘యంగ్ అండ్ ఫుడిష్’... సెప్టెంబర్ 13న లండన్‌లో తొలిసారిగా పిజ్జా పండుగ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. లండన్‌లోని బరో మార్కెట్ జూబ్లీ ప్లేస్‌లో జరగ నున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించింది. పిజ్జా పండుగలో పాల్గొనా లంటే 8 పౌండ్లు ప్రవేశ రుసుము చెల్లించాలి. వెరైటీ వెరైటీ పిజ్జాలు తిని ఆనందించాలంటే మాత్రం 30 పౌండ్లు సమర్పించుకోవాల్సిందే. ఆ మొత్తం చెల్లిస్తే ఏ రకానివైనా ఆరు పిజ్జాలు హ్యాపీగా లాగించేయవచ్చు. ఈ వార్త వినగానే పిజ్జా ప్రియులు అప్పుడే నోళ్లు చప్పరిస్తున్నారు! -
పిజ్జా కోసం..
లండన్: పిల్లలు తమకు కావాల్సింది సాధించుకోవడంకోసం వారి మంకుపట్లు, పేచీలు అందరికీ తెలిసిన విషయమే. కానీ లండన్‌లో 11 ఏళ్ల పిల్లాడు పిజ్జా కోసం తల్లిదండ్రులకు చుక్కలు చూపించాడు. తాను అడిగిన పిజ్జా కొనివ్వలేదనే కోపంతో లోపల గడియ వేసుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా తలుపు తీయలేదు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి పిల్లాడిని బతిమలాడి, బామాలితే తప్ప తలుపు తీయలేదు. వివరాల్లోకి వెడితే లంచ్‌లోకి తనకు పిజ్జా కావాలని అడిగాడో గడుగ్గాయి. అయితే వాళ్లమ్మ పిజ్జాకు బదులుగా పాస్తా చేసి పెట్టింది. దీంతో పిల్లాడు నాకు పిజ్జానే కావాలంటూ పేచీ మొదలుపెట్టాడు. ఎంత బుజ్జగించినా వినిపించుకోలేదు. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు కొద్దిసేపు బయటికి వెళ్లారు. అంతే లోపల్నించి తలుపు తాళం వేసుకున్నాడు. మిమ్మల్ని లోపలికి రానీయంటూ మంకు పట్టు పట్టాడు. పిల్లాడితో తలుపు తీయించేందుకు ప్రయత్నించి విఫలమైన తల్లిదండ్రులు చివరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెల్లిగా బాల్కనీలోకి ప్రవేశించిన పోలీసులు బాలుడిని ఒప్పించి తలుపు తీయించారు. -
పిజ్జా పొడవు.. కిలోమీటర్ పైనే
గుండ్రంగా, చతురస్రాకారంలో ఉండే పిజ్జాలకు ఈ పిజ్జా పూర్తిగా భిన్నం. దారి పొడవునా సందర్శకులను తెగ ఆకట్టుకున్న దీని పొడవు 1,595.45 మీటర్లు. అంటే దాదాపు మైలు పొడవు. 1.5 టన్నుల చీజ్, 2 టన్నుల టొమాటొ సాస్ సహా మొత్తం ఐదు టన్నుల ముడిసరుకులతో దీన్ని 60 మంది పాకశాస్త్ర ప్రవీణులు తయారుచేశారు. శనివారం ఇటలీలోని మిలాన్ సిటీ సమీపంలో నిర్వహించిన ఓ వేడుకలో దీన్ని ప్రదర్శించారు. ప్రపంచంలోనే అతి పొడవైన పిజ్జాగా గిన్నిస్ రికార్డును సైతం బద్దలుగొట్టడం దీని మరో ప్రత్యేకత. -
పిజా తింటూ క్రికెట్ చూస్తున్నారు!
ముంబై: భారతీయులు ఫుడ్, క్రికెట్ పట్ల అనురక్తి చూపుతారని సర్వేలో వెల్లడైంది. పిజా తింటూ క్రికెట్ చూడడానికి ప్రాధాన్యత ఇస్తారని తేలింది. గ్రూపాన్ ఇండియా వెబ్ సైట్ 'ఫుడ్ ప్రీమియర్ లీగ్' పేరుతో సరదా సర్వే నిర్వహించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని వివిధ నగరాల్లో ఈ సర్వే చేపట్టింది. క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు కూకింగ్ కంటే పిజా ఆర్డర్ చేయడానికి ఎక్కువ మంది(48 శాతం) ఆసక్తి చూపిస్తున్నారని సర్వేలో వెల్లడైంది. బర్గర్, పాస్టస్ కంటే పిజావైపే అధిక శాతం మంది మొగ్గుచూపారు. ఇక 63 శాతం మంది ఫుడ్ ఐటెమ్స్ డిస్కౌంట్ల కోసం ఆన్ లైన్ లో జల్లెడ పడుతున్నట్టు తేలింది. క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఫుడ్, డ్రింక్స్ కోసం రూ.300 నుంచి రూ. 500 వరకు ఖర్చు చేస్తున్నారని సర్వే వెల్లడించింది. -
జూన్‌లో ‘ఉరుమీన్’
ఉరుమీన్ చిత్రం వేరే ట్యూన్లో ఉంటుందంటున్నారు ఆ చిత్ర హీరో బాబిసింహా. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన పేరు బాబిసింహా చేసింది నాలుగే నాలుగు చిత్రాలు. వీటికి జాతీయస్థాయి గుర్తింపు. ఇది నిజంగా అరుదైన అంశమే. పిజ్జాతో నటనకు శ్రీకారం చుట్టిన ఈ యువ నటుడు ఆ తరువాత నేరం, సూదుకవ్వుం చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. నాలుగవ చిత్రం జిగర్తండా బాబిసింహా పేరును జాతీయస్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో నటనకుగాను బాబి ఉత్తమ సహాయనటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ప్రస్తుతం హీరోగా పలు చిత్రాలతో బిజీగా ఉన్న బాబిసింహా నటించిన మరో విభిన్న కథా చిత్రం ఉరుమీన్. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత డి.ఢిల్లీబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శక్తివేల్ పెరుమాళ్స్వామి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రేష్మిమీనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం గురించి బాబిసింహా తెలుపుతూ ఇది ఒక థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. లవ్, యాక్షన్‌తో పాటు చిన్న ఫాంటసీ సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయన్నారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక యువకుడు గ్రామం నుంచి చెన్నై మహానగరానికి వస్తాడని అక్కడ అతను ఎదుర్కొనే సమస్యలే చిత్ర కథ అని తెలిపారు. ఈ చిత్రంలో అన్ని అంశాలు వేరే ట్యూన్లో ఉంటాయని చెప్పారు. చిత్రాన్ని జూన్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత వెల్లడించారు. దీనికి అచ్చు రోజామణి సంగీతాన్ని అందిస్తున్నారు. -
విజయ్ సేతుపతితో మరోసారి..
పిజ్జా చిత్రంతో సూపర్‌హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న జంటగా విజయ్ సేతుపతి, రమ్యానంబీశన్ చాలా గ్యాప్ తరువాత వీరిద్దరూ కలసి మరోసారి వెండితెరపై రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఈ క్రేజీ చిత్రాన్ని నూతన నిర్మాణ సంస్థ వాసన్ మూవీస్ నిర్మించనుంది. ఈ చిత్ర వివరాలను ఆ సంస్థ అధినేత షాన్ సుదర్శన్ వెల్లడిస్తూ విజయ్‌సేతుపతి, రమ్యానంబీశన్ హీరో హీరోయిన్లుగా ఒక కొత్త కాన్సెప్ట్‌తో చిత్రాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. ఇంతవరకు చాలా పోలీసు కథలు వచ్చాయన్నారు. అయితే వాటికి భిన్నంగా ఖాకీ దుస్తులకు గౌరవాన్ని, ఆ వృత్తికి గంభీరాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. విజయ్ సేతుపతి పోలీసు అధికారిగా ఒక కొత్త డైమన్షన్‌లో కనిపిస్తారని తెలిపారు. ఈ చిత్రం సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందని తెలిపారు. ఇంతకుముందు విజయ్ సేతుపతి హీరోగా పణ్ణయారుం పద్మినియుం చిత్రాన్ని తెరకెక్కించిన ఎస్యు అరుణ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని తెలిపా రు. చిత్రం త్వరలో ప్రారంభం కానుందని చెప్పారు. చిత్రానికి నివాస్ కె.ప్రసన్న సంగీతాన్ని, దినేష్ కృష్ణన్ ఛాయాగ్రహణం, పోరాట సన్నివేశాల బాధ్యతలను అన్భ్రివులు నిర్వహిస్తున్నారని, నిర్మాత షాన్ సుదర్శన్ వెల్లడించారు. -
ఆల్బమ్‌కు సిద్ధం..
రెంటికీ చెడ్డ రేవడిలా అయిపోయింది రమ్యానంబీశన్ పరిస్థితి. తొలి రోజుల్లో రామన్ తేడియ సీతై లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి ఆ తరువాత మలయాళ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ అవకాశాలను మిస్ చేసుకుంది. ఆ తరువాత పిజ్జా చిత్రంతో సక్సెస్‌ను అందుకున్న రమ్యానంబీశన్‌కు మళ్లీ అవకాశాలు రావడం మొదలెట్టడంతోపాటు విశాల్ చిత్రం పాండియనాడులో పాడే అవకాశం వచ్చింది. పై పై పై అనే ఆ పాట విశేష ప్రజాదరణ పొందడంతో గాయనిగాను రాణించాలనే కోరికను పెంచుకుంది. దీంతో హీరోయిన్ అవకాశం తలుపు తట్టినప్పుడు పాడే అవకాశం ఇస్తేనే నటిస్తానంటూ షరతులు విధించడం మొదలెట్టింది. దీంతో నటిగా వచ్చే అవకాశాలు వెనక్కి పోయాయి. చక్కని అందం, అభినయం వున్నా ఆమె కోరికే ఇప్పుడామెకు శత్రువుగా మారింది. ఇలాగుంటే ప్రస్తుతం తమ చిత్రంలో ఒక్క పాట పాడు అనే దర్శక నిర్మాతలేగానీ నటిగా మాత్రం అవకాశాలివ్వడం లేదని వాపోతోంది రమ్యానంబీశన్. ఇక చేసేదేమీ లేక ఈ మలయాళీ బ్యూటీ పాటలనే నమ్ముకోవాలని నిర్ణయించుకుందట. ఇప్పుడా అవకాశాలు రాకపోవడంతో తన సొంతంగా ఒక ఆల్బమ్ తయారు చేయడానికి సిద్ధమైందని సమాచారం. ముందుగా ఒక పాట పాడి దాన్ని విడుదల చేసి సంగీత ప్రియుల ఆదరణ చూసి ఆ తరువాత మరిన్ని పాటలు పాడాలనుకుంటున్నారట. పాటల ఆల్బమ్ రూపొందించడం అంత సులభం కాదని అయినా తన స్నేహితులు, సోదరుడి సహకారంతో ఈ ఆల్బమ్‌ను పూర్తి చేయడానికి సిమైనట్లు రమ్యానంభీశన్ పేర్కొంది. -
పిజ్జా చేయడం కష్టమేమీ కాదిక!
పిజ్జా... కొన్నేళ్ల క్రితం వరకూ మన పిల్లలకు ఈ పేరు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఏం తింటావ్ అని అడగ్గానే ముందు చెబుతోంది దీని పేరే. పిజ్జా పేరు చెబితే చాలు... వాళ్లకి ఎక్కడ లేని హుషారూ వచ్చేస్తుంది. చెప్పలేనంత ఆకలీ వేసేస్తుంది. కాబట్టి మన పిల్లల కోసం పిజ్జా చేయడం నేర్చుకోక తప్పదు. అందుకుగాను ఈ పిజ్జా అవెన్ని తెచ్చుకోకా తప్పదు. పిజ్జా బాగుండాలంటే పిండితో చేసే బేస్ సరిగ్గా ఉండాలి. దాని మీద కూరగాయ ముక్కలు వేస్తామా, చికెన్-మటన్ వేస్తామా అన్నది మన ఇష్టం. అయితే ఏది వేసినా బేస్ సరిగ్గా ఉంటేనే పిజ్జా సరిగ్గా వస్తుంది. అది సరిగ్గా రావాలి అంటే అవన్ ఉండి తీరాలి. అందుకే డెనీ కంపెనీవారు ఈ అవెన్ని తయారు చేశారు. కాకపోతే మన మార్కెట్లోకి కొత్తగా వచ్చింది కాబట్టి రేటు ఎక్కువగా ఉంది (రూ. 10,924 - ఈబే సైట్లో). అయితే అంతకంటే తక్కువ ధరకే మైక్రో అవన్ వచ్చేస్తోంది. అన్ని రకాలుగానూ ఉపయోగపడుతుంది కూడాను. అలాంటప్పుడు కేవలం పిజ్జాకి మాత్రమే పనికొచ్చే అవన్కి అంత పెట్టడానికి ఎవరూ ఇష్టపడకపోవచ్చు. కాబట్టి ముందు ముందు రేటు తగ్గుతుందేమో చూడాలి మరి!