పిజ్జాతో ఆమె నిశ్చితార్థం! | Single woman does engagement photo shoot with a pizza | Sakshi
Sakshi News home page

పిజ్జాతో ఆమె నిశ్చితార్థం!

Published Sun, Nov 1 2015 10:59 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

పిజ్జాతో ఆమె నిశ్చితార్థం! - Sakshi

పిజ్జాతో ఆమె నిశ్చితార్థం!

యవ్వనం తోడు కోరుకుంటుంది. యుక్త వయస్సుకు రాగానే సహజంగానే చాలామంది ప్రేమలో పడుతుంటారు. అదేవిధంగా 19 ఏళ్ల నికోల్ లార్సన్ కూడా ప్రేమలో పడింది. అయితే యువకుడితో కాదు పిజ్జాతో.. అవును వినడానికి ఇది విచిత్రంగానే ఉన్నా.. కెనడాలోని అల్బెర్ట్‌కు చెందిన ఈ అమ్మాయి 'పిజ్జా హట్'తో నిశ్చితార్థం చేసుకుంది. అంతేకాకుండా '2015 దంపతుల ఫొటోలు' పేరిట పిజ్జాతో వివిధ ఫోజుల్లో దిగిన ఫొటోలను ఫేస్‌బుక్‌లో పెట్టింది.

పిజ్జాపై తన ప్రేమను చాటుతూ మొత్తం 16 ఫొటోలను పెట్టింది. ఇది ఫేస్‌బుక్‌లో హల్‌చల్ సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ పోస్టుకు 12వేల లైకులు, 30వేల షేర్‌లు వచ్చాయి. యవ్వనంలోకి వచ్చాక కూడా ఒంటరిగా ఉండటమే లార్సన్‌కు ఇష్టమట. అందుకే తనకు ఇష్టమైన పిజ్జాతో ప్రేమగా ఫొటోలు తీసుకుంది. 'ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిని వెతుక్కునే తొందరలో ఉన్నారు. అంతకన్నా మన రోజును మెరుగుపరిచే వాటిపై దృష్టిపెట్టడం మేలు అని నేను సూచిస్తాను' అని ఆమె చెప్తున్నది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement