
పిజ్జా అంటే ఇష్టపడేవాళ్లకు నచ్చుతుందేమో ఈ పెర్ఫ్యూమ్. ఆహార పదార్థాల ఘుమ ఘుమల వాసనతో కూడిన ఫెర్ఫ్యూమ్ ఏం బాగుంటుందనే సందేహం అందిరలోనూ కలుగుతోంది. కానీ పిజ్జాలకు ప్రస్ధిగాంచిన డొమినోస్ మాత్రం వాలెంటైన్స్‌డే సందర్భంగా ఈ వెరైటీ పెర్ఫ్యూమ్‌ని విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. పైగా తన పిజ్జా కస్టమర్లకు ఇది కచ్చితంగా నచ్చుతుందని ధీమాగా చెబుతోంది. ఇది ఎక్కడ దొరుకుతుందంటే..
ఈ వాలెంటైన్స్ డేకి పిజ్జా దిగ్గజం.. పెప్పరోని పిజ్జా లాంటి వాసన వచ్చే పెర్ఫ్యూమ్‌ను విడుదల చేసింది. పిజ్జా బాక్స్‌లో ఉన్న అనుభూతి కలుగుతుందట. ఈ ఫెర్ఫ్యూమ్ లాంఛ్‌కి సంబంధించిన వీడియోడని కూడా నెట్టింట షేర్ చేసింది డొమినోస్. అంటే ఇది పిజ్జా లాగిద్దామనే కోరిక పెంచుతుందేమో మరీ..!. ఇది తినాలనే కోరికను కలిగించేలా ఉంటుందే తప్ప ప్రేమికుల రోజున ఆహ్లాదాన్ని అందించి, ఒక్కటయ్యేలా ఫీల్‌ని ఎలా తెప్పిస్తుందని నెటిజన్లు సందేహాలు లేవెనెత్తారు.
అయితే డొమినెస్ మాత్రం ఈ పెర్ఫ్యూమ్‌ని పెప్పరోని ప్యాషన్ పిజ్జా నుంచి ప్రేరణ పొందినట్లు తెలుపుతోంది. ఈ పెర్ఫ్యూమ్ స్పైసీ, పెప్పరీ నోట్స్ , వెచ్చని వుడీ అండర్‌టోన్‌లతో రూపొందించారట. ఇది పేరుకి తగిన విధంగా పిరమిడ్ ఆకారపు బాటిల్‌లో పిజ్జా ముక్కలను పోలి ఉంటుంది. అయితే ఇది కొనుగోలుకు అందుబాటులో లేదట.
డొమినోస్ ఫిబ్రవరి 10 నుంచి 17 వరకు దీన్ని 65 మంది లక్కీ విన్నర్స్‌కి గిఫ్ట్‌గా ఇవ్వనుందట. వారంతా ఆ 30 ఎంఎల్ పిజ్జా సెంట్‌ని బహుమతిగా పొందుతారట. ఇది కేవలం యూకే, ఐర్లాండ్ల్‌లో ఉండే ప్రజలకే ఈ అవకాశం దక్కుతుందని పేర్కొంది. నెటిజన్లు మాత్రం ఇదేం వెర్రీ ఇలాంటి పెర్ఫ్యూమ్‌లను లాంఛ్ చేస్తారా..? అంటూ తిట్టిపోస్తున్నారు. అంతేగాదు డొమినెస్‌లో పనిచేసేవాడికి ఆ సువాసన ఎల్లప్పుడూ ఉచితంగానే దొరుకుతుంది కదా అని సెటైర్లు వేస్తున్నారు.
(చదవండి: ట్రూ హార్ట్స్..వన్ హార్ట్..! 'కళ' కలిపిన ప్రేమ జంటలు..!)
Comments
Please login to add a commentAdd a comment