Dominos
-
పిజ్జా ప్రియులకు శుభవార్త.. సగానికి తగ్గిన ధరలు - కారణం ఇదే!
ఆధునిక కాలంలో పిజ్జాలకు ఎంత డిమాండ్ ఉందో అందరికి తెలుసు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ పిజ్జా బ్రాండ్ డొమినోస్ (Domino’s) విపరీతమైన ధరలకు విక్రయిస్తోంది. కాగా తాజాగా కంపెనీ ధరలను దాదాపు 50 శాతం వరకు తగ్గించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిజానికి భారతదేశంలోని క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) మాత్రమే కాకుండా టాసిన్, గోపిజ్జా, లియోస్ పిజ్జేరియా, మోజోపిజ్జా, ఓవెన్‌స్టోరీ, లా పినోజ్ వంటి సంస్థలు పుట్టుకురావడం, తక్కువ ధరలకే పిజ్జాలను అందించడంతో క్రమంగా డొమినోస్ ఆదరణ తగ్గుముఖం పట్టింది. కానీ పోటీ ప్రపంచంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి డొమినోస్ సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే ధరలను తగ్గించడం జరిగింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, మారుతున్న వినియోగదారుల అవసరాలను తీర్చడానికి డొమినోస్ కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగానే వెజిటేరియన్ లార్జ్ పిజ్జా ధరలను రూ. 799 నుంచి రూ. 499కి తగ్గించింది. అదే సమయంలో లార్జ్ నాన్‌వెజ్ పిజ్జా ధరలను రూ. 919 నుంచి రూ. 549కి దగ్గించింది. ఇదీ చదవండి: మొబైల్ బ్యాంకింగ్ కొత్త యాప్.. రూ.5 లక్షల వరకు లోన్! తక్కువ చెల్లించి ఎక్కువ పిజ్జా పొందండి అంటూ కంపెనీ పిజ్జా ప్రియులకు శుభవార్త చెప్పింది. భారతదేశంలో 1800కి పైగా డొమినోస్ పిజ్జా కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటిని డొమినోస్ మాతృ సంస్థ 'జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్' నిర్వహిస్తోంది. ఈ కంపెనీ డొమినోస్ కంపెనీతో పాటు డంకిన్ రెస్టారెంట్లను, పాప్ఐస్ ఔట్ లెట్లను నిర్వహిస్తోంది. భారతదేశంలో కేవలం డొమినోస్ మాత్రమే కాకుండా, పిజ్జా హట్, మెక్ డొనాల్డ్స్ వంటి కంపెనీలు తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి ధరలను తగ్గించనున్నాయి. కాగా దేశీయ మార్కెట్లో పిజ్జా చైన్స్ కూడా ఎక్కువ కావడంతో కస్టమర్లు తక్కువ ధరకు పిజ్జా అందించే సంస్థల నుంచే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి చిన్న సంస్థల దెబ్బకు డొమినోస్ దిగి వచ్చినట్లు స్పష్టమవుతోంది. -
బెంగుళూరు ట్రాఫిక్ జామ్‌లో టైమ్‌కి పిజ్జా డెలివరీ..
బెంగళూరు: లాంగ్ వీకెండ్ కావడంతో బెంగళూరు టెకీలు ఒక్కసారిగా ఇంటిబాట పట్టారు. దీంతో గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు బెనాలూరు ప్రధాన రహదారుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ సమయంలో ట్రాఫిక్‌లో ఇరుక్కున్న ఓ వ్యక్తి డామినోస్ పిజ్జా ఆర్డర్ చేయగా అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా సమయానికి డెలివరీ చేశాడు డెలివరీ బాయ్. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సదరు వ్యక్తి. ఆన్‌టైమ్ డెలివరీ.. ఎలాగూ ట్రాఫిక్ జామ్ అయ్యింది కాబట్టి ఇప్పట్లో గమ్యానికి చేరుకోలేమని భావించి రిషివత్స అనే వ్యక్తి డామినోస్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసి లైవ్ లొకేషన్ ఇచ్చాడు. కానీ అతడిని ఆశ్చర్యానికి గురిచేస్తూ డామినోస్ పిజ్జా డెలివరీ బాయ్ అంత ట్రాఫిక్ జామ్‌లో కూడా ప్రామిస్ చేసినట్టుగా ట్రాఫిక్ ఉండగానే అర్ధగంటలో డెలివరీ చేశాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు విశేష స్పందన రాగా కామెంట్లలో నెటిజన్లు డామినోస్పై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు. When we decided to order from @dominos during the Bangalore choke. They were kind enough to track our live location (a few metres away from our random location added in the traffic) and deliver to us in the traffic jam. #Bengaluru #bengalurutraffic #bangaloretraffic pic.twitter.com/stnFDh2cHz — Rishivaths (@rishivaths) September 27, 2023 బారులు తీరిన వాహనాలు.. ఈరోజు మిలాద్-ఉన్-నబీ, రేపు కావేరీ జల వివాదం కారణంగా కర్ణాటక బంద్, ఎల్లుండి శనివారం, తర్వా ఆదివారం, సోమవారం గాంధీ జయంతి ఇలా బెంగుళూరు వాసులకు వరుసగా ఐదు రోజులు సెలవులు దొరికాయి. దీంతో అత్యధిక సంఖ్యలో ఉద్యోగస్తులు సుదీర్ఘ వారాంతాన్ని ఎంజాయ్ చేయడానికి సొంతూళ్ళకు బయలుదేరారు. ఒక్కసారిగా అందరూ రోడ్లపైకి రావడంతో సాయంత్రం 5 నుంచే బెంగళూరు మహానగరంలో రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. కిలోమీటర్ల మేర బారులుతీరిన వాహనాలన్నీ గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో అయితే వాహనాలు చాలా వరకు నిలిచిపోయాయి. వర్షం కారణంగా ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం వలన కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెబుతున్నారు ట్రాఫిక్ పోలీసులు. This is every day before a long weekend in Bangalore, it's same 3-8pm today. Karnataka taking highest tax on liquor (83%) if can utilize even 10% of that can make proper roads and infra. #BangaloreTraffic #bangalore #longweekendhttps://t.co/XlOarOY6hj pic.twitter.com/goU6PIR9ae — nsrivastava.eth (@nitinkr1991) September 27, 2023 #bangaloretraffic Yesterday I saw most my friends in bangalore tweet about massive traffic jam. 2 hours for 8-10 kms and even more..when we are gonna diversify companies to other parts of KA? Bangalore has almost choked bec of political greed,ppl are suffering..feels sorry!! pic.twitter.com/caOvvfTRx7 — North karnataka Rises (@NorthKA_Rises) September 28, 2023 ఇది కూడా చదవండి: లోకోపైలట్ నిర్వాకం..రైలును ప్లాట్ఫారం ఎక్కించేశాడు.. -
తాత్కాలికంగా బంద్.. కస్టమర్లు మన్నించాలి.. మెక్‌డొనాల్డ్, సబ్వే షాకింగ్ నిర్ణయం!
న్యూఢిల్లీ: ఇటీవల కొన్ని వారాలుగా ఎక్కడ విన్నా, ఏ వార్త చూసిన టమోట పేరే వినపడుతోంది. ఈ ఏడాది ఎన్నడూ లేనంతగా రికార్డ్ ధరలు పలకడంతో ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. దీని ధరలు దడపుట్టిస్తుండడంతో సామాన్య ప్రజలు వంటలో టమోటాకు ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నారు. తాజాగా ఇంటర్నెషనల్ సంస్థలైన సబ్వే, మెక్‌డొనాల్డ్ కూడా టమోట దెబ్బను తట్టుకోలేక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాయి. భారత్‌లో పలు సబ్వే అవుట్లెట్లు తమ సలాడ్స్, శాండ్‌విచ్‌ల్లో టమాటలను జోడించడం నిలిపివేశాయి. నాణ్యతా పరమైన అంశాలతో పాటు అధిక ధరల కారణంగా సబ్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల పలు కారణాల వల్ల కిచెన్‌లోకి కావాల్సిన ప్రధానమైన వస్తువుల ధరలు 400 శాతానికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా టమోట ధరలు కన్నీళ్లను తెప్పిస్తోంది. మరో వైపు ప్రభుత్వం జోక్యం చేసుకున్నప్పటికీ కొన్ని మార్కెట్లలో రికార్డు స్థాయికి దారితీసింది. ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్‌లోని ఒక సబ్వే అవుట్లెట్ ఓ బోర్డులో ఇలా రాసుంది. " కస్టమర్లు మన్నించాలి. తాత్కాలికంగా టమోటాలు అందుబాటులో లేదని తెలిపింది. వీలైనంత త్వరగా టమోట సరఫరాలను పునరుద్ధరించడానికి తాము చురుకుగా పని చేస్తున్నామని అవుట్లెట్ కస్టమర్లకు హామీ ఇచ్చింది. భారతదేశంలోని సబ్వే అవుట్లెట్లలో దాదాపు వందల సంఖ్యల్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం ద్వారా ప్రభావితమైన అవుట్లెట్ల ఖచ్చితమైన సంఖ్య అస్పష్టంగానే ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా మరికొన్ని సబ్వే అవుట్‌లెట్స్‌లో టమాటాలను సర్వ్ చేయడం కొనసాగుతోంది. సబ్వే, మెక్‌డొనాల్డ్స్ బాటలోనే డామినోస్, కేఎఫ్‌సీ టమాటాల వాడకం తగ్గించాయి. చదవండి: ఐదేళ్లకు లక్ష్మీదేవీ తలుపు తట్టింది.. కొన్ని రోజుల్లో ఆయన లక్షాధికారి! -
డెలివరీ బాయ్ నిర్వాకం.. మహిళకు పుడ్ డెలివరీ చేసి, ఆపై ఐ లైక్ యూ అంటూ..
మొబైల్ వాడకం, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రతీది ఆన్‌లైన్‌లోకి మారుతోంది. తినే తిండి నుంచి ధరించే బట్టలు, కూరగాయలు ఇలా ఒకటేమిటి ఏది కావాలన్నా అర చేతిలో మొబైల్ అందులో సంబంధిత యాప్ ఉంటే చాలు.. ఆర్డర్ పెట్టిన వెంటనే మన ఇంటి ముందుకు వస్తున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ.. డెలవరీ కోసం మన ఇంటి అడ్రస్‌తో పాటు మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలకు అందిస్తున్నాం. అయితే కస్టమర్లు వాటిని డెలివరీ చేసే వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని ఓ సంఘటన రుజువు చేసింది. అసలేం జరిగిందంటే.. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ పిజ్జా ఆర్డర్ చేసింది. ఈ నేపథ్యంలో డొమినో డెలివరీ బోయ్ ఆమెకు ఫుడ్ డెలివరీ చేశాడు. అయితే అతను అంతటితో ఆగకుండా ఆ తరువాత... ‘నేను నిన్ను ఇష్టపడుతున్నాను’ అంటూ వాట్సాప్‌లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె షాకైంది. అనంతరం దీని నుంచి తేరుకుని తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ వ్యక్తి.. ‘క్షమించండి.. నా పేరు కబీర్, నిన్న మీకు పిజ్జా ఇవ్వడానికి వచ్చాను.. నేను అదే.. నేను నిన్ను ఇష్టపడ్డాను’ అంటూ ఆమెకు వాట్సాప్‌లో ఈ రకంగా మెసేజ్ వచ్చింది. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు జోక్యం చేసుకుని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో వైపు డొమినోస్ దీనిపై స్పందిస్తూ.. "ఈ సంఘటన గురించి విన్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా, డొమినోస్ ఇండియా ఏ విధమైన దుష్ప్రవర్తన లేదా వేధింపుల పట్ల జీరో-టాలరెన్స్ పాలసీకి నిస్సందేహంగా కట్టుబడి ఉంది. తక్షణమే ఈ ఘటనపై విచరణ జరిపి చర్యలు తీసుకుంటామని హామి’ ఇచ్చింది. చదవండి: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు.. మహారాష్ట్ర బస్సు ప్రమాదానికి కారణాలేంటి? -
డోమినోస్‌కు లాభాల పంట, క్యూ2లో రూ. 131 కోట్ల ప్రాఫిట్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఫాస్ట్ ఫుడ్ చైన్ దిగ్గజం జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ పటిష్ట ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 131 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 120 కోట్లు ఆర్జించింది. డోమినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ కంపెనీ ఆదాయం 17 శాతం ఎగసి రూ. 1,301 కోట్లను తాకింది. అయితే మొత్తం వ్యయాలు 20 శాతం పెరిగి రూ. 1,154 కోట్లకు చేరాయి. ఈ కాలంలో 76 డోమినోస్ స్టోర్లను కొత్తగా ప్రారంభించింది. -
ఇంటర్వ్యూలో ఆమె వయసు అడిగినందుకు... పరిహారంగా రూ. 3 లక్షలు..
అమ్మాయి వయసు మగాడి జీతం అడగకూడదని పెద్దలు అంటుంటారు. బహుశా ఇందుకేనేమో పాపం ఆ కంపెనీ ఇంటర్వ్యూలో అమ్మాయి వయసు అడిగినందుకు పరిహారంగా ఏకంగా రూ. 3లక్షలు చెల్లించుకోవాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే...డోమినోస్ పిజ్జా డెలివరీ డ్రైవర్ ఉద్యోగ ఇంటర్వ్యూలో నార్తర్న్ ఐర్లాండ్‌లోని జానిస్ వాల్ష్ అనే మహిళ ఒక చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. జానిస్ వాల్ష్ అనే మహిళ ఇంటర్వ్యూ సంభాషణలో ఆమె వయసు గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. వాస్తవానికి వాల్ష్ ఈ ఇంటర్వ్యూలో ఎంపికైంది కానీ ఆమె వయసు కారణంగా తిరస్కరణకు గురైనట్లు తెలుసుకుని తీవ్ర ఆవేదనకు గురైంది. అదీగాక 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న యువకులనే తీసుకుంటారని తెలుసుకున్న తర్వాత తాను లింగ వివక్షతకు గురైనట్లు తెలుసుకుంది. దీంతో వాల్ష్ తాను ఇంటర్వ్యూలో వయసు వివక్షత కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయానని వివరిస్తూ... డోమినోస్ స్టోర్ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. వెంటనే ఇంటర్వ్యూ చేసిన సదరు వ్యక్తి క్విర్క్ ఆమెకు క్షమాపణలు చెప్పడమే గాక వయసు గురించి అడగకూడదని తనకు తెలియదని వివరణ ఇచ్చాడు. కానీ ఆ కంపెనీ మాత్రం పిజ్జా డెలీవరీ జాబ్స్ ప్రకటనను ఇస్తూనే ఉండటంతో...వాల్ష్ మరింత దిగులు చెందింది. తనకు డ్రైవింగ్ వచ్చినప్పటికీ కేవలం మహిళను కావడం వల్లే ఈ ఉద్యోగం రాలేదని భావించి వాల్ష్ కోర్టు మెట్లెక్కింది. ఐతే ఆమెకు ఐర్లాండ్ ఈక్వాలిటీ కమీషన్ మద్దతు లభించింది. వ్యాపారాలు యువతకు ఉపాధిని కల్పించడం తోపాటు సమానత్వాన్ని పాటించాలని, అలా లేనప్పుడు ఉద్యోగులు హక్కులు ఎలా రక్షింపబడతాయని సదరు కంపెనీని కోర్టు ప్రశ్నించింది. వాల్ష్కు సదరు డోమినోస్ కంపెనీ దాదాపు రూ. 3.7 లక్షలు పరిహారం చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది. (చదవండి: వెరైటీ వెడ్డింగ్ కార్డు! హర్ష గోయెంకా మనసును దోచింది!) -
ఛీ.. యాక్! ఈ ఫొటో చూశారంటే పిజ్జా తినలేరు.. వైరల్ ఫొటో
ఇటీవల కాలంలో బయట తినడం ప్రజలకు అలవాటుగా మారింది. రుచితో పాటు కాస్త శుచిగా ఉంటే చాలు ఆ పుడ్‌ని తెగ లాగించేస్తుంటారు భోజన ప్రియులు. ఈ తరహా నిబంధనలు పాటిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తున్న జాబితాలో డోమినాస్ పిజ్జా, కేఎఫ్‌సీ వంటి విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే ఎంత ఫేమ్ ఉన్న కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థకున్న మంచి పేరు, గుర్తింపు కూడా ఒక్క సెకనులో పొగుట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక ఫోటో వల్ల ఓ ప్రముఖ సంస్థ పేరు నెట్టింట నెగిటివ్‌గా మారింది. ఆ ఫోటోలో ఏముంది.. పిజ్జా అంటే గుర్తుకు వచ్చే పేరు డొమినోస్. టేస్ట్‌తో పాటు క్వాలిటీ కూడా మెండుగా ఉంటుందని కస్టమర్లు అక్కడికి ఎగబడుతుంటారు. అయితే బెంగళూరులోని డొమినోస్ ఫ్రాంచైసీ నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంస్థ పేరును మసక బారేలా చేస్తోంది. హోసా రోడ్లో ఉన్న డొమినోస్ అవుట్‌లెట్‌లో పిజ్జా తయారీ కోసం సిబ్బంది పిండి తయారు చేశారు. కాకపోతే ఆ పిండిపై నిర్లక్ష్యంగా టాయిలెట్ బ్రష్‌లు, ఫ్లోర్ క్లీనింగ్ వస్తువును ఉంచారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు.. ఇదేనా మీ క్వాలిటీ పుడ్ అని డొమినోస్ సంస్థ పై మండిపడుతున్నారు. కఠిన చర్యలు తప్పవు ఈ ఘటనపై స్పందిస్తూ.. డొమినోస్ ఎప్పుడూ పుడ్ విషయంలో అత్యున్నత ప్రమాణాల పరిశుభ్రత, ఆహార భద్రతను నిర్ధారించడానికి ప్రపంచస్థాయి ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉంటుందని తెలిపారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ రెస్టారెంట్‌పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. Photos from a Domino's outlet in Bengaluru wherein cleaning mops were hanging above trays of pizza dough. A toilet brush, mops and clothes could be seen hanging on the wall and under them were placed the dough trays. Please prefer home made food 🙏 pic.twitter.com/Wl8IYzjULk — Tushar ॐ♫₹ (@Tushar_KN) August 14, 2022 చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు -
ఫ్రీగా పిజ్జాలు..జొమాటో, స్విగ్గీలకు భారీ షాక్?
డొమినోస్ పిజ్జా ఇండియా ఫ్రాంచైజీ జొమాటో, స్విగ్గీలకు భారీ షాకివ్వనుంది. దశల వారీగా జొమాటో,స్విగ్గీల ద్వారా పిజ్జా డెలివరీలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త బిజినెస్ వ్యూహాన్ని అమలు చేసింది. డొమినోస్ పిజ్జా సంస్థ 'జూబిలెంట్' జులై 19న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను ఆశ్రయించింది. రెస్టారెంట్ భాగస్వాముల నుంచి దేశీయ ఫుడ్ ఆగ్రిగ్రేటర్‌లైన స్విగ్గీ, జొమాటోలు పెద్దమొత్తంలో కమిషన్ వసూలు చేస్తూన్నాయంటూ సీసీఐకి ఓ రహస్య ఫైల్లో వెల్లడించినట్లు రాయింట్స్ తెలిపింది. దీంతో సీసీఐ రెస్టారెంట్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత.. స్విగ్గీ, జొమాటోలపై చర్యలు తీసుకోనుంది. ఈ తరుణంలో స్విగ్గీ, జొమాటో భాగస్వామ్యం నుంచి విడిపోయేందుకు డొమినోస్ పిజ్జా మాస్టర్ ప్లాన్ వేసింది. కస్టమర్లు తమకు కావాల్సిన పిజ్జాల కోసం స్విగ్గీ, జొమాటోల్ని ఆశ్రయించే అవసరం లేకుండా నేరుగా డొమినోస్ సెంటర్‌కు వచ్చేలా మాస్టర్ ప్లాన్ వేసింది. ఇందులో భాగంగా డొమినోస్ ఫ్రాంఛైజీలో కస్టమర్ ఆరు పిజ్జాలు కొనుగోలు చేస్తే మరో పిజ్జా ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. డొమినోస్ ఆఫర్‌పై జూబిలెంట్ సంస్థ సీఎఫ్‌వో ఆశిష్ గోయాంక్ మాట్లాడుతూ.. మేం దీనిని ఒక ఓమ్నీచానల్ ప్రోగ్రామ్ గా చేస్తున్నాము. తద్వారా కస్టమర్ ఎంట్రీ పాయింట్‌తో సంబంధం లేకుండా ప్రయోజనాల్ని పొందవచ్చని అన్నారు. -
టూర్‌కెళ్లాలి.. డబ్బులు లేవు.. అందుకని
న్యూఢిల్లీ : విహరయాత్రకు వెళ్లాలని భావించిన ఓ వ్యక్తి అందుకు కావాల్సిన డబ్బు కోసం ఏకంగా పని చేస్తోన్న కంపెనీకే కన్నం వేయాలని ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. వివరాలు.. సోను(20) ఢిల్లీలోని ఓ డోమినోస్ ఔట్లెట్లో స్వీపర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి మనాలి వెళ్లి ఎంజాయ్ చేయాలనుకున్నాడు. అయితే అందుకు కావాల్సిన సొమ్ము సంపాదించడం కోసం పని చేస్తోన్న షాప్‌కే కన్నం వేయాలని ప్లాన్ చేశాడు. ముందుగా ఈ పనిలో తనకు సహకరించడం కోసం ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత స్టోర్ తాళం చెవులు దొంగతనం చేసి వారికి ఇచ్చాడు. తాళం చెవి తీసుకున్న వ్యక్తులు సోను స్నేహితుడు బంటితో కలిసి డోనాల్డ్స్ ఔట్‌లెట్‌కి వెళ్లారు. అక్కడ పని చేస్తోన్న ఉద్యోగుల తలకు తుపాకీ గురి పెట్టి క్యాష్ కౌంటర్లో ఉన్న 1.70 లక్షల రూపాయల సొమ్మును తీసుకుని వెళ్లిపోయారు. అనంతరం సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసిన పోలీసులు.. ఔట్లెట్లో పని చేస్తోన్న ఉద్యోగులను విచారించగా సోను మీద అనుమానం వచ్చాంది. అతన్ని పూర్తి స్తాయిలో విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. విహారయాత్రకు వెళ్లాలని భావించిన సోను.. అందుకు కావాల్సిన సోమ్ము కోసం స్నేహితులతో కలిసి దొంగతనానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం సోను, అతనికి సహకిరంచి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
దుమ్మురేపిన జుబిలంట్ ఫుడ్స్
న్యూఢిల్లీ: డామినోస్ పిజ్జా, డంకిన్ డోనట్స్ పేరుతో రిటైల్ స్టోర్లను నిర్వహించే జుబిలంట్ ఫుడ్‌వర్క్స్ లిమిటెడ్ జూన్ త్రైమాసికం ఫలితాల్లో అదరగొట్టింది. స్టోర్ల వారీ విక్రయాల్లో మంచి వృద్ధి ఉండడంతో లాభం మూడు రెట్లు దూసుకుపోయి రూ.74.67 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం కేలం రూ.23.84 కోట్లు. ప్రస్తుత స్టోర్ల వారీగా అమ్మకాల్లో వృద్ధి 25.9 శాతంగా ఉండడమే ఈ స్థాయి లాభాలకు దోహదపడినట్టు కంపెనీ తెలిపింది. మొత్తం ఆదాయం సైతం 26 శాతం వృద్ధితో రూ.681 కోట్ల నుంచి రూ.862 కోట్లకు చేరింది. ‘‘అద్భుతమైన ఉత్పత్తులు, డబ్బుకు తగ్గ విలువను అందించడం, డిజిటల్ తోడ్పాటు వల్లే డామినోస్ విక్రయాల్లో బలమైన వృద్ధి సాధ్యమైంది. దీనికితోడు డంకిన్ డోనట్స్ విభాగాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి బ్రేక్ ఈవెన్ (లాభ, నష్ట రహిత స్థితి) దశకు తీసుకురావడంపై దృష్టి పెట్టినందున లాభాల వృద్ధి కొనసాగుతుంది’’ అని జుబిలంట్ ఫుడ్స్ చైర్మన్ శ్యామ్ ఎస్ భర్తియా, కో చైర్మన్ హరి ఎస్ భర్తియా తెలిపారు. ప్రస్తుతం కంపెనీ 1,144 డామినోస్ పిజ్జా అవుట్లెట్లను, 37 డంకిన్డోనట్ అవుట్లెట్లను నిర్వహిస్తోంది. జూన్ త్రైమాసికంలో కొత్తగా కంపెనీ 13 డామినోస్ పిజ్జా స్టోర్లను ప్రారంభించగా, మూడు చోట్ల దుకాణాలను మూసేసింది. డంకిన్ డోనట్స్ విషయంలో ఒకటి మూసేసి, మరో చోట ఇంకో స్టోర్‌ను తెరిచింది. ఫలితాల నేపథ్యంలో జుబిలంట్ స్టాక్ ఒకదశలో 3 శాతానికి పెరిగి రూ.1490ని చేరుకున్నా... చివరకు లాభాల స్వీకరణ కారణంగా 2.5 శాతం నష్టపోయి రూ.1,400 వద్ద క్లోజ్ అయింది. -
పిజ్జా ఆర్డర్ చేస్తే.. నోట్ల కట్ట వచ్చింది!
సాధారణంగా ఏదైనా వస్తువు ఆర్డర్ చేసినప్పుడు అది మనకు సకాలంలో రాకపోతే ఎంతో చిరాకు పడుతుంటాం. అయితే తనకు వచ్చిన పార్శిల్ చాలా ఆలస్యంగా వచ్చినా ఓ మహిళా కస్టమర్ ఓపిక పట్టింది. అయితే ఆ ఆర్డర్ లో తనకు కావాల్సిన వస్తువు లేదు.. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే.. ఐదు వేల డాలర్ల విలువైన నోట్లు ఉన్నాయి. ఈ విషయాలన్ని ఆ సంస్థకు చెప్పి, డబ్బు వెనక్కు తీసుకోవాలని సూచించింది. ఆమె నిజాయితీని మెచ్చిన ఆ సంస్థ కస్టమర్ కు ఓ ఏడాది పాటు పిజ్జా ఫ్రీగా అందిస్తామంటూ ప్రకటించింది. కాలిఫోర్నియాకు చెందిన సెలెనా అవలోస్ ఓ రోజు డోమినోస్ కు ఫోన్ చేసి పిజ్జా ఆర్డర్ చేసింది. అయితే తనకు రావాల్సిన పిజ్జా కాస్త ఆలస్యంగా వచ్చింది. పార్శిల్ ఓపెన్ చూసి చూడగా పిజ్జా బదులుగా ఐదువేల డాలర్ల నగదు ఉన్నట్లు గుర్తించింది. కస్టమర్ సెలెనా వెంటనే డోమినోస్ వారికి ఫోన్ చేసి పిజ్జా రాలేదని, పార్శిలో బాక్స్ లో డబ్బులు ఉన్నాయని చెప్పింది. ఆ కస్టమర్ నిజాయితీని డోమినోస్ వారు అభినందించారు. ఒక ఏడాది పాటు సెలెనాకు పిజ్జా ఫ్రీగా అందిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మేనేజర్ ఈ విషయం తెలుసుకుని వారం రోజుల పాటు ఆమెకు సెలవు ఇచ్చారు.