మొబైల్ వాడకం, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రతీది ఆన్‌లైన్‌లోకి మారుతోంది. తినే తిండి నుంచి ధరించే బట్టలు, కూరగాయలు ఇలా ఒకటేమిటి ఏది కావాలన్నా అర చేతిలో మొబైల్ అందులో సంబంధిత యాప్ ఉంటే చాలు.. ఆర్డర్ పెట్టిన వెంటనే మన ఇంటి ముందుకు వస్తున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ.. డెలవరీ కోసం మన ఇంటి అడ్రస్‌తో పాటు మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలకు అందిస్తున్నాం. అయితే కస్టమర్లు వాటిని డెలివరీ చేసే వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని ఓ సంఘటన రుజువు చేసింది. అసలేం జరిగిందంటే..
వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ పిజ్జా ఆర్డర్ చేసింది. ఈ నేపథ్యంలో డొమినో డెలివరీ బోయ్ ఆమెకు ఫుడ్ డెలివరీ చేశాడు. అయితే అతను అంతటితో ఆగకుండా ఆ తరువాత... ‘నేను నిన్ను ఇష్టపడుతున్నాను’ అంటూ వాట్సాప్‌లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె షాకైంది. అనంతరం దీని నుంచి తేరుకుని తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆ వ్యక్తి.. ‘క్షమించండి.. నా పేరు కబీర్, నిన్న మీకు పిజ్జా ఇవ్వడానికి వచ్చాను.. నేను అదే.. నేను నిన్ను ఇష్టపడ్డాను’ అంటూ ఆమెకు వాట్సాప్‌లో ఈ రకంగా మెసేజ్ వచ్చింది.
దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు జోక్యం చేసుకుని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో వైపు డొమినోస్ దీనిపై స్పందిస్తూ.. "ఈ సంఘటన గురించి విన్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా, డొమినోస్ ఇండియా ఏ విధమైన దుష్ప్రవర్తన లేదా వేధింపుల పట్ల జీరో-టాలరెన్స్ పాలసీకి నిస్సందేహంగా కట్టుబడి ఉంది. తక్షణమే ఈ ఘటనపై విచరణ జరిపి చర్యలు తీసుకుంటామని హామి’ ఇచ్చింది.
చదవండి: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు.. మహారాష్ట్ర బస్సు ప్రమాదానికి కారణాలేంటి?
Comments
Please login to add a commentAdd a comment