Pizza Delivery Boy
-
డెలివరీ బాయ్ నిర్వాకం.. మహిళకు పుడ్ డెలివరీ చేసి, ఆపై ఐ లైక్ యూ అంటూ..
మొబైల్ వాడకం, ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో ప్రతీది ఆన్‌లైన్‌లోకి మారుతోంది. తినే తిండి నుంచి ధరించే బట్టలు, కూరగాయలు ఇలా ఒకటేమిటి ఏది కావాలన్నా అర చేతిలో మొబైల్ అందులో సంబంధిత యాప్ ఉంటే చాలు.. ఆర్డర్ పెట్టిన వెంటనే మన ఇంటి ముందుకు వస్తున్నాయి. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది గానీ.. డెలవరీ కోసం మన ఇంటి అడ్రస్‌తో పాటు మొబైల్ నంబర్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని కంపెనీలకు అందిస్తున్నాం. అయితే కస్టమర్లు వాటిని డెలివరీ చేసే వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని ఓ సంఘటన రుజువు చేసింది. అసలేం జరిగిందంటే.. వివరాల్లోకి వెళితే.. ఓ మహిళ పిజ్జా ఆర్డర్ చేసింది. ఈ నేపథ్యంలో డొమినో డెలివరీ బోయ్ ఆమెకు ఫుడ్ డెలివరీ చేశాడు. అయితే అతను అంతటితో ఆగకుండా ఆ తరువాత... ‘నేను నిన్ను ఇష్టపడుతున్నాను’ అంటూ వాట్సాప్‌లో ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె షాకైంది. అనంతరం దీని నుంచి తేరుకుని తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని ట్విట్టర్లో షేర్ చేసింది. ఆ వ్యక్తి.. ‘క్షమించండి.. నా పేరు కబీర్, నిన్న మీకు పిజ్జా ఇవ్వడానికి వచ్చాను.. నేను అదే.. నేను నిన్ను ఇష్టపడ్డాను’ అంటూ ఆమెకు వాట్సాప్‌లో ఈ రకంగా మెసేజ్ వచ్చింది. దీంతో ఆ మహిళ ఈ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు జోక్యం చేసుకుని విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరో వైపు డొమినోస్ దీనిపై స్పందిస్తూ.. "ఈ సంఘటన గురించి విన్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థగా, డొమినోస్ ఇండియా ఏ విధమైన దుష్ప్రవర్తన లేదా వేధింపుల పట్ల జీరో-టాలరెన్స్ పాలసీకి నిస్సందేహంగా కట్టుబడి ఉంది. తక్షణమే ఈ ఘటనపై విచరణ జరిపి చర్యలు తీసుకుంటామని హామి’ ఇచ్చింది. చదవండి: గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాలు.. మహారాష్ట్ర బస్సు ప్రమాదానికి కారణాలేంటి? -
పోలీసులకు చుక్కలు చూపించిన దొంగ.. ఈ డెలివరి బాయ్ ఏం చేశాడంటే..
-
డెలివరీ బాయ్‌కు ఊహించని సర్ప్రైజ్
-
వైరల్: డెలివరీ బాయ్‌కు ఊహించని సర్ప్రైజ్
లండన్: కరోనా కష్టకాలంలోనూ ప్రజల ఆకలి తీర్చేందుకు కష్టపడుతున్నారు డెలివరీ బాయ్స్. ఈ క్రమంలో ఓ పిజ్జా డెలివరీ బాయ్‌కు కొంతమంది మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చారు. యూకేలో బాబ్ అనే వ్యక్తి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడున్న ఇద్దరు అమ్మాయిలతో పాటు ఓ అబ్బాయి అతడిని వంటగదిలోకి ఆహ్వానించారు. డబ్బులు చేతికివ్వమని, కప్ గేమ్ ఆడి కావాల్సినంత గెలుచుకోమన్నారు. ఈ ఆట ఏంటంటే బల్లపై 12 కప్పులు ఉంటాయి. అందులో ఏవైనా ఆరు ఎంపిక చేసుకోవాలి. వాటి కింద ఎంత డబ్బు ఉంటే అంత డెలివరీ బాయ్ సొంతం అవుతుంది. దీనికి సరేనన్న బాబ్ మొదట సందిగ్ధంగానే ఓ కప్పును తీసి చూశాడు. అందులో 20 డాలర్లు ఉన్నాయి. రెండో కప్పు కింద 5 డాలర్ల నోటు కనిపించింది. (జొమాటో బాయ్స్ దేశ భక్తికి సెల్యూట్!) మరి కొన్ని కప్పులు తీసేసరికే అతనికి రావాల్సిన బిల్లు వచ్చేసింది. అతను ఆరో ప్రయత్నంలో 100 డాలర్లు ఉన్న కప్పును తీయడంతో అక్కడున్న వారు ఎగిరి గంతేశారు. ఊహించని సర్ప్రైజ్కు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ డబ్బును తీసుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకోబోయాడు. కానీ 11 ఏళ్లుగా అదే వృత్తిలో సేవలందిస్తున్న బాబ్ను మరింత సంతోషపెట్టేందుకు మిగతా కప్పుల కింద మొత్తం డబ్బును తీసి అతని చేతికిచ్చారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న బాబ్ వారిని ఆత్మీయ ఆలింగం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. వీడియోను చూస్తున్నంతసేపు తమకు తెలియకుండానే భావోద్వేగానికి లోనవుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. ('తిక్క కుదిరింది.. ఇలా కావాల్సిందే') -
హమ్మయ్య.. వారికి కరోనా నెగెటివ్
సాక్షి న్యూఢిల్లీ: పిజ్జా డెలివరీ బాయ్(19)కు కరోనా వైరస్ సోకడంతో కలకలం రేగిన దక్షిణ ఢిల్లీకి ఊరట లభించింది. పిజ్జా డెలివరీ బాయ్‌తో క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్న 16 మందికి కరోనా లేదని తేలడంతో అధికారులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న ఈ 16 మందికి నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని దక్షిణ ఢిల్లీ మేజిస్ట్రేట్ బ్రిజ్ మిశ్రా సోమవారం వెల్లడించారు. మాలవీయ నగర్‌లోని సావిత్రి నగర్‌కు చెందిన పిజ్జా డెలివరీ బాయ్(19)కు కరోనా వైరస్ సోకినట్లు ఈనెల 14న నిర్ధారణ కావడంతో 72 కుటుంబాలను ప్రభుత్వ అధికారులు క్వారంటైన్లో ఉంచారు. అతడితోపాటు పనిచేసే మరో 17 మంది పిజ్జా డెలివరీ బాయ్‌లను కూడా క్వారంటైన్‌కు తరలించారు. అతడు పనిచేస్తున్న పిజ్జా ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. పిజ్జా డెలివరీ బాయ్ డయాలిసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లాడని, అక్కడే కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. కేంద్ర వైద్యారోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం.. ఢిల్లీలో ఇప్పటివరకు 2003 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 45 మంది మృతి చెందారు. హైవే ఎక్కుతున్నారా.. ఆలోచించండి! -
పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా..
సాక్షి న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో పిజ్జా డెలివరీ బాయ్(19)కు కరోనా వైరస్ సోకినట్లు తేలడంతో 72 కుటుంబాలను ప్రభుత్వ అధికారులు క్వారంటైన్లో ఉంచారు. అతడితోపాటు పనిచేసే మరో 17 మంది పిజ్జా డెలివరీ బాయ్‌లను కూడా క్వారంటైన్‌కు తరలించారు. మాలవీయ నగర్లో ఓ పిజ్జా ఔట్లెట్లో డెలివరీ బాయ్‌గా పనిచేసే యువకుడిలో కరోనా లక్షణాలు గత 20 రోజులుగా ఉన్నాయి. ఏప్రిల్ 14న కరోనా నిర్ధారణ పరీక్ష నివేదిక వచ్చింది. అతడు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆ డెలివరీ బాయ్ నుంచి గత 20 రోజుల్లో పిజ్జాలు అందుకున్న 72 కుటుంబాలను క్వారంటైన్లో ఉంచారు. ఆ పిజ్జా ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. పిజ్జా డెలివరీ బాయ్ డయాలిసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లాడని, అక్కడే కరోనా సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా..
-
పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా
న్యూఢిల్లీ: డెలివరీ బాయ్‌కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అతను ఫుడ్ డెలివరీ చేసిన 72 కుటుంబాలను క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు ఆదేశించారు. ఈ ఘటన బుధవారం ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రముఖ పిజ్జా సంస్థలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ నిత్యం పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనకు తాజాగా పరీక్షలు నిర్వహించగా మంగళవారం పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (ఆదివారం కదా అని పిజ్జా ఆర్డర్ చేస్తే..) మరోవైపు అధికారులు అతడితోపాటు పనిచేసిన మరో 16 మంది డెలివరీ బాయ్స్‌ను కూడా క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం అతను ఫుడ్ డెలివరీ చేసిన ఇళ్ల వివరాలను సేకరించారు. అలా మొత్తంగా 72 కుటుంబాలను గుర్తించి వారిని సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశించారు. అయితే డెలివరీ బాయ్స్ ముఖానికి మాస్కులతోనే విధులు నిర్వర్తించారని, కాబట్టి ఎక్కువగా భయపడాల్సిన పనిలేదని అధికారులు సూచిస్తున్నారు. (కోటి విద్యలు.. ప్రస్తుతం కొన్నే!) -
అడల్ట్ గ్రూప్స్‌లో నటి ఫోన్ నెంబర్
చెన్నై : డోమినోస్ పిజ్జా డెలివరీ బాయ్‌పై తమిళ నటి గాయత్రి సాయి బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయత్రి ఇంటికి పిజ్జా తీసుకువచ్చిన డెలివరీ బాయ్ ఆ తర్వాత ఆమె ఫోన్ నెంబర్‌ను వాట్సాప్‌లోని పలు అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేశాడు. దీంతో పలువురు ఆమెను వేధిస్తూ వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపడం, పోన్స్ చేయడం ప్రారంభించారు. వేధింపులతో ఆగ్రహానికి లోనైనా గాయత్రి.. తేనాంపేటలోని మహిళ పోలీస్ స్టేషేన్లో పిజ్జా డెలివరీ బాయ్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే ట్విటర్ వేదికగా తనకు ఎదురైన వేధింపులను వివరించారు. ‘ఫిబ్రవరి 9న చెన్నైలోని నా ఇంటికి డోమినోస్ డెలివరీ బాయ్ పిజ్జా తీసుకుని వచ్చాడు. పిజ్జా డెలివరీ చేసే సమయంలో అతడు మత్తులో ఉన్నాడు. అతడు నా ఫోన్ నంబర్‌ను పలు అడల్ట్ గ్రూప్స్‌లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించి అతని యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ.. అది పెండింగ్‌లోనే ఉంది. అతను నా నెంబర్ షేర్ చేయడంతో.. విపరీతమైన ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు వస్తున్నాయ’ని గాయత్రి తెలిపారు. అలాగే పిజ్జా డెలివరీ బాయ్ ఫొటోను కూడా షేర్ చేశారు. తనకు వస్తున్న వాట్సాప్ మెసేజ్‌లను స్ర్కీన్ షాట్లను ఆమె ట్విటర్లో ఉంచారు. అలాగే తనకు సాయం చేయాల్సిందిగా తమిళనాడు పోలీసులను కోరారు. ఆన్లైన్లో ఆన్లైన్ యాప్‌లు తమ నెంబర్లు ఇతరులకు షేర్ చేయకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తేనాంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. మరోవైపు గాయత్ని ఫిర్యాదుపై పోలీసులు స్పందిస్తూ.. పిజ్జా డెలివరీ బాయ్‌ను అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. కాగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన అంజలి చిత్రంతో గాయత్రి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచమయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటించారు. .@DrMRaviIPS1 commisioner called and said he is transferring the case to protection under women Sir. Hope other online apps do not share our numbers. Most of our orders these days are online. The complaint is lodged in Teynampet station sir https://t.co/0RiKZIo9es — Gayatri Sai (@gainsai) February 27, 2020 .@dominos_india this is how he spread it through Whatsapp @TNPOLICE_HQ please help pic.twitter.com/xePh7QsiGo — Gayatri Sai (@gainsai) February 26, 2020 -
డెలివరీ బాయ్.. అమేజింగ్ టాలెంట్
ఎవరిలో ఏం టాలెంట్ ఉంటుందో చెప్పలేం. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దని పెద్దలు సూచిస్తుంటారు. ఇందులో భాగంగానే అమెరికాకు చెందిన ఓ డెలివరీ బాయ్ అనూహ్య రీతిలో తన టాలెంట్‌ను ప్రపంచానికి చాటిచెప్పి శెభాష్ అనిపించుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మిచిగాన్ : అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రం డెట్రాయిట్ నగరానికి చెందిన వర్చెట్టి కుటుంబం కొన్నిరోజుల కిందట పిజ్జాలు ఆర్డర్ ఇచ్చింది. బ్రైస్ డుడల్ అనే 18 ఏళ్ల విద్యార్థి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. వర్చెట్టి ఇంటికి వెళ్లిన డుడల్ పిజ్జాను డెలివరీ చేశాడు. వారి ఇంట్లో పియానో చూసి ముచ్చటపడ్డ ఆ టీనేజర్ నేను ఒక్కసారి ప్లే చేయవచ్చా అని అడిగాడు. అందుకు జూలీ వర్చెట్టి ఆలోచిస్తూనే సరేనంది. వెంటనే పియానో ముందున్న బెంచ్‌పై కూర్చున్న డెలివరీ బాయ్ కొన్ని సెకన్లలోనే బటన్లపై చేతివేళ్లను వేగంగా కదిలించడం మొదలుపెట్టాడు. బీథోవెన్స్ ‘మూన్లైట్’ సొనాటాను చాలా అద్బుతంగా ప్లే చేశాడని ఆమె పొగడ్తల్లో ముంచేసింది. వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ.. చేసేది డెలివరీ బాయ్ జాబ్ కానీ అతడికి ఎంతో టాలెంట్ ఉందన్నారు జూలీ. ర్యాన్ వర్చెట్టి సైతం హర్షం వ్యక్తం చేశాడు. వీడియో గేమ్ ఆడుతున్న మా 10ఏళ్ల బాబు అది పక్కనపెట్టేసి మరీ పియానో ప్లే చేస్తున్నది ఎవరో చూసేందుకు వచ్చాడని తెలిపాడు. డెలివరీ బాయ్ డుడల్ పియానో వద్దకు వెళ్లగా.. అది పగలకొడతాడేమోనని అనిపించిందన్నాడు. చిన్నప్పటి నుంచీ పియానో ప్లే చేయడం అంటే ఇష్టమని, దాంతోపాటు బేస్‌బాల్ గేమ్ వల్ల తనకు స్కాలర్షిప్ వస్తుందని ఆగస్టులో మాకాంబ్ కమ్యూనిటీ కాలేజీలో చేరనున్నట్లు డెలివరీ బాయ్ తమకు చెప్పినట్లు ర్యాన్ వివరించాడు. అతడు పియానో ప్లే చేస్తుండగా వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేయగా భారీ లైక్స్, కామెంట్లతో అతడు పాపులర్ అయిపోయాడు. డెలివరీ బాయ్‌గా చేస్తున్నాడు కానీ.. ఈ టీనేజర్లో అమేజింగ్ టాలెంట్ ఉందని నెటిజన్లు కొనియాడుతున్నారు. -
20 మందికి పైగా ప్రాణాలు కాపాడిన పిజ్జా బాయ్!
ముంబై: నగరంలోని చండివాలి ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో శనివారం సాయంత్రం సంభవించిన అగ్ని ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం వాటిల్లికుండా అత్యంత ధైర్య సాహాసాలను ప్రదర్శించి శభాష్ అనిపించుకున్నాడో పిజ్జా బాయ్. అంథేరిలోని 21 అంతస్తుల భారీ భవనంలోని 14వ అంతస్తులో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో ఏడుగురు మృత్యువాత పడగా, 28 మంది గాయాలతో బయటపడ్డారు. వీరిని కాపాడటంలో పిజ్జా బాయ్ గా పనిచేసే జితేష్ ది కీలక పాత్ర. ఆ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కు 200 మీటర్ల దూరంలో ఉన్న ఈగల్ బాయ్స్ పిజ్జాలో జితేష్ డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. అయితే తాను ఆ కాంప్లెక్స్ కు పిజ్జాను తీసుకువెళ్లిన సమయంలో అగ్నిప్రమాదం జరగడాన్ని గమనించాడు. అప్పటికే అగ్ని ప్రమాదం జరిగిన అంతస్తులో ఉన్న వారు బాల్కనీలోకి వచ్చి పెద్ద ఎత్తున అరవడం ప్రారంభించారు.ఆ చుట్టుపక్కల వారు నీటితో మంటలను ఆర్పే యత్నం చేసినా.. ఈలోపు మంటలు తీవ్రంగా వ్యాపించి కొంతమంది సృహతప్పి పడపోయారు. దీంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ లను జితేష్ అప్రమత్తం చేశాడు. వారి సాయంతో 22 వ అంతస్తుకు చేరుకున్నాడు. అక్కడ్నుంచి ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించే యత్నం చేశారు. ఈ క్రమంలోనే 14 వ అంతస్తు నుంచి 22 వ అంతస్తుకు ప్రమాదంలో చిక్కుకున్న బాధితులను తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. ఇలా ఎనిమిదిసార్లు పైఅంతస్తు నుంచి కింది అంతస్తుకు దిగి దాదాపు 25 మంది ప్రాణాలను కాపాడాడు. ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆ 21ఏళ్ల పిజ్జా బాయ్ స్థానికంగా హీరోగా మారిపోయాడు. -
ఓ పిజ్జా అబ్బాయ్ ప్రేమకథ
ప్రిన్స్ ఈసారి పిజ్జా డెలివరీ బాయ్‌గా కనిపించనున్నారు. ప్రిన్స్, జ్యోతీ సేథీ జంటగా శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతా కంపై ఎల్. వేణుగోపాలరెడ్డి, పి. లక్ష్మీ నరసింహా రెడ్డి ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ‘కథ’, ‘ఒక్కడినే’ చిత్రాల దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రిన్స్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇదని, క్రైమ్ కామెడీ కథాంశంతో ప్రతి సన్నివేశమూ ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘యూత్‌కి, మాస్‌కి నచ్చే కథ ఇది. గత నెలలో చిత్రీకరణ మొదలుపెట్టాం. హైదరాబాద్ పరిసరాల్లో ఏకధాటిగా షూటింగ్ చేస్తున్నాం. ఈ వారంతో టాకీపార్ట్ పూర్తవుతుంది. ఇందులో నాలుగు పాటలుంటాయి’’ అని తెలిపారు. రావు రమేశ్, జయప్రకాశ్‌రెడ్డి, ఆశిష్ విద్యార్థి, సంపూర్ణేశ్‌బాబు, సప్తగిరి తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: కమ్రాన్, కెమెరా: చిట్టిబాబు, సమర్పణ: కృష్ణ బద్రి, శ్రీధర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: బాలాజీ శ్రీను, అక్కినేని శ్రీను, సహ నిర్మాతలు: హేమా వెంకట్, చిరంజీవి.