లండన్: కరోనా కష్టకాలంలోనూ ప్రజల ఆకలి తీర్చేందుకు కష్టపడుతున్నారు డెలివరీ బాయ్స్. ఈ క్రమంలో ఓ పిజ్జా డెలివరీ బాయ్‌కు కొంతమంది మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చారు. యూకేలో బాబ్ అనే వ్యక్తి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడున్న ఇద్దరు అమ్మాయిలతో పాటు ఓ అబ్బాయి అతడిని వంటగదిలోకి ఆహ్వానించారు. డబ్బులు చేతికివ్వమని, కప్ గేమ్ ఆడి కావాల్సినంత గెలుచుకోమన్నారు. ఈ ఆట ఏంటంటే బల్లపై 12 కప్పులు ఉంటాయి. అందులో ఏవైనా ఆరు ఎంపిక చేసుకోవాలి. వాటి కింద ఎంత డబ్బు ఉంటే అంత డెలివరీ బాయ్ సొంతం అవుతుంది. దీనికి సరేనన్న బాబ్ మొదట సందిగ్ధంగానే ఓ కప్పును తీసి చూశాడు. అందులో 20 డాలర్లు ఉన్నాయి. రెండో కప్పు కింద 5 డాలర్ల నోటు కనిపించింది. (జొమాటో బాయ్స్ దేశ భక్తికి సెల్యూట్!)
మరి కొన్ని కప్పులు తీసేసరికే అతనికి రావాల్సిన బిల్లు వచ్చేసింది. అతను ఆరో ప్రయత్నంలో 100 డాలర్లు ఉన్న కప్పును తీయడంతో అక్కడున్న వారు ఎగిరి గంతేశారు. ఊహించని సర్‌ప్రైజ్‌కు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ డబ్బును తీసుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకోబోయాడు. కానీ 11 ఏళ్లుగా అదే వృత్తిలో సేవలందిస్తున్న బాబ్‌ను మరింత సంతోషపెట్టేందుకు మిగతా కప్పుల కింద మొత్తం డబ్బును తీసి అతని చేతికిచ్చారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న బాబ్ వారిని ఆత్మీయ ఆలింగం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది. వీడియోను చూస్తున్నంతసేపు తమకు తెలియకుండానే భావోద్వేగానికి లోనవుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. ('తిక్క కుదిరింది.. ఇలా కావాల్సిందే')
Comments
Please login to add a commentAdd a comment