tip
-
మందు మింగడానికి మీ ‘పప్పీ’ మారాం చేస్తోందా? ఇదిగో ఇంట్రస్టింగ్ టిప్
ఆధునిక కాలంలో ఇంట్లో పెంపుడు జంతువు (పెట్స్) పెంచుకోవడం ఒక అవసరంగా మారిపోయింది. వీటిల్లో కుక్క, పిల్లిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే జాగ్రత్తగా చూసుకోవడం, వాటి ఆరోగ్యం, ఆహారం, వ్యాయామం , శ్రద్ధ సంరక్షణ ఇవన్నీ యజమాని బాధ్యత. పెంపుడు జంతువుల బ్రీడ్ లేదా సైజుతో సంబంధం లేకుండా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడానికి సాధారణ వ్యాయామం, మానసిక ప్రేరణ అవసరం. ఇంట్లో , బయటా ఆడుకోవడానికి, పరిగెత్తడానికి అవకాశం ఉండేలా చూసుకోవాలి.Tip for giving medication to dogs, dip the syringe in something they like 📹 igotthissitpic.twitter.com/6yCsPxmIMR— Science girl (@gunsnrosesgirl3) June 10, 2024ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. మనుషుల మాదిరిగానే పోషకాలతో నిండిన,సమతుల్య ఆహారం చాలా అవసరం. వాటి బ్రీడ్ వయస్సుతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పశువైద్యుడిని సంప్రదించి టీకాలు వేయించాలి. గ్రూమింగ్, జనరల్ చెక్-అప్లు చేయించాలి. ఏదైనా అనారోగ్యం వస్తే సరైన చికిత్స చేయించాలి. అంతేకాదు పెంపుడు జంతువు వైద్య ఖర్చుల కోసం పెట్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా ఉన్నాయి.సాధారణంగా అనారోగ్యానికి గురైన కుక్కలకు మందులు వేయడం యజమానులకు ఒక పెద్ద టాస్క్అని చెప్పాలి. ఒక్క పట్టాన మాట వినవు. మారాం చేస్తాయి. ఈ నేపథ్యంలో వాటికి మందులు ఎలా వేయాలో చిన్న చిట్కా అంటూ ఒక వీడియో ఇంటర్ నెట్లో ఆసక్తికరంగా మారింది. చిన్ని పిల్లల్ని మాయ చేసి, మ్యాజిక్ చేసినట్టే.. పెట్స్‌కి కూడా వాటికిష్టమైన ఆహారంలో పెట్టి తినిపించేయడమే. అదెలాగో మీరూ చూసేయండి. -
అయింది వేలల్లో...వేసింది మాత్రం లక్షల్లో!
మనం రెస్టారెంట్‌కి వెళ్లితే బిల్ తోపాటు బాగా సర్వింగ్ చేసిన వ్యక్తికి కాస్త టిప్ ఇస్తాం. ఇది సహజం. కానీ ఇక్కడొక కస్టమర్ తాను బిల్లు చేసింది వేలల్లో అయితే టిప్పి మాత్రం ఏకంగా లక్షలు ఇచ్చాడు. ఎక్కడ జరిగిందంటే ఈ ఘటన.. ఈ ఆశ్చర్యకర ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. యూస్‌లోని మిచిగాన్‌లో ఉన్న ది మాసన్ జార్ కేఫ్ అనే రెస్టారెంట్‌కి మార్క్ అనే వ్యక్తి బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే అతడు అక్కడ తిన్న బ్రేక్ ఫాస్ట్‌కి అయ్యిన ఖర్చు కేవలం రూ. 2,500/- మాత్రమే అయ్యింది. కానీ అతను ఏకంగా రూ. 8 లక్షలు టిప్ చెల్లించాడు. దీంతో అవాక్కయిన సర్వర్ ఈ విషయం మేనేజర్‌కి చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు సదరు రెస్టారెంట్ ఈ విషయాన్ని ఫేస్బుక్లో వివరిస్తూ..ఆ వ్యక్తి విశాల హృదయానికి ధన్యావాదాలు తెలిపింది. అతను ఇచ్చిన డబ్బును సహోద్యోగులు సమంగా పంచుకున్నారని, ప్రతి ఒక్కరూ రూ. 90 వేల చొప్పున ఇంటికి తీసుకువెళ్లారని అన్నారు. ఆయన తన బిల్లు కంటే ముప్పై వేల రెట్టు చెల్లించాడని రెస్టారెంట్ మేనేజర్ అన్నారు. అతనికి ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు చెప్పినా అది తక్కువే అని భావోద్వేగంగా అన్నాడు. నిజానికి డిజిటల్ టిప్పింగ్ కల్చర్ సర్వే ప్రకారం..యూఎస్‌లోని వ్యక్తులు భోజనం చేసేటప్పుడు వారి బిల్లులో సగటున అంటే.. 16% టిప్పుగా ఇస్తారు. కానీ మార్క్ దాతృత్వం చాలా దయతో చేసిన చర్య అని కొనియాడారు. View this post on Instagram A post shared by Mason Jar Cafe (@masonjarcafe_) (చదవండి: ఫుల్‌గా తాగితే తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..?) -
శాండ్ విచ్ తిని, రూ. 6 లక్షల టిప్ ఇచ్చేసింది..!
అమెరికాకు చెందిన మహిళ పొరపాటున భారీ మొత్తంలో టిప్ ఇచ్చింది. ఆ తరువాత విషయం తెలిసి లబోదిబోమంది తప్పయిపోయింది నా డబ్బులు నాకు ఇప్పించండి మొర్రో అంటూ బ్యాంకును ఆశ్రయించింది. చివరికి ఏమైందంటే..! అమెరికాలోని ఇటాలియన్ సబ్ వే రెస్టారెంట్ కు వెళ్లిన కానర్ మహిళ శాండ్విచ్ (రూ. 628) ఆర్డర్ చేసింది. ఆ తరువాత బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అనుకోకుండా 7వేల డాలర్లు (రూ. 6 లక్షలకు పైగా) టిప్ ఇచ్చి వెళ్లిపోయింది. ఇది రెస్టారెంట్ సిబ్బంది తెగ సంతోషడిపోయారు. గొప్పమనసు అని పొడిగారు. కానీ ఆనక విషయం ఉసూరుమన్నారు. ఏం జరిగిందంటే కానర్ చెల్లించాల్సిన డబ్బును ఎంటర్ చేయాల్సిన చోట తన ఫోన్ నెంబర్లులోని చివరి అంకెల్ని ఎంటర్ చేసింది. దీంతో సంబంధం లేకుండానే బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్ పూర్తి అయింది. చివరికి బిల్లు చూసిన కార్నర్ గుడ్లు తేలేసింది. బ్యాంకుకు పరుగులు పెట్టింది. తన సొమ్మును తిరిగి ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను తొలుత తిరస్కరించారు. దీంతో చేసేదేమీ లేక కానర్ సబ్ వే మేనేజ్ మెంట్‌ను ఆశ్రయించింది. చివరికి పొరపాటున చెల్లించిన టిప్ మొత్తాన్ని తిరిగిచ్చేందుకు అంగీకరించింది. నెల రోజుల తరువాత క్లయింట్‌కు డబ్బును వాపసుకు అంగీకరించారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. దీని బతికాను రా దేవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకుంది. -
ఆ పని చేసినందుకు రూ.20 టిప్పు ఇచ్చారు: ఓయో ఫౌండర్
కెరియర్ తొలినాళ్లలో తాను పడిన ఇబ్బందులు, ఎదురైన అనుభవాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఓయో రూమ్స్ (OYO Rooms) ఫౌండర్ రితేష్ అగర్వాల్ (Ritesh Agarwal). కంపెనీకి బాస్‌గా మాత్రమే కాకుండా ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌గా, అవసరమైనప్పుడు క్లీనింగ్ స్టాఫ్‌గా కూడా పనిచేసినట్లు వెల్లడించారు. అప్పుడు ఓయో ఇంకా ప్రారంభ దశలో ఉంది. రితేష్ అగర్వాల్ థీల్ ఫెలోషిప్ పూర్తి చేసుకుని అప్పుడే తిరిగివచ్చారు. ఈ సమయంలో తన సంస్థ అభివృద్ధికి ఆయన చాలా కష్టపడ్డారు. హోటల్ సిబ్బందిగా పనిచేశారు. కస్టమర్ కేర్, ఫ్రంట్ డెస్క్ మేనేజర్‌గా అవసరమైనప్పుడు క్లీనింగ్ పని కూడా చేశారు. బిజ్ టాక్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రితేష్ అగర్వాల్ హోటల్ గదిని శుభ్రం చేయడానికి వెళ్లిన సందర్భాన్ని వివరించారు. రూం క్లీనింగ్ ఆలస్యం కావడంతో ఓ కస్టమర్ చాలా కోపంగా ఉన్నాడు. అతనికి సర్దిచెప్పడానికి వెళ్లిన రితేష్ అగర్వాల్‌ను క్లీనింగ్ సిబ్బందిగా భావించి ఆ కస్టమర్ ఎడాపెడా తిట్టేశాడు. చివరికి రితేష్ అగర్వాల్ స్వయంగా ఆ గదిని శుభ్రం చేశాడు. దీంతో సంతృప్తి చెందిన కస్టమర్ తనకు రూ. 20 టిప్ ఇచ్చాడని రితేష్ అగర్వాల్ గుర్తు చేసుకున్నారు. హాస్పెటాలిటీ రంగంలో హౌస్కీపర్లు, డెస్క్ మేనేజర్లు వంటి సిబ్బంది పాత్రను, గొప్పతనాన్ని వివరిస్తూ తొలినాళ్లలో తనకు ఎదురైన అభువాన్ని వెల్లడించిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు రితేష్ అగర్వాల్. హాస్పిటాలిటీ పరిశ్రమలో నిజమైన తారలు ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్లు, క్లీనింగ్ సిబ్బంది, రిసెప్షనిస్ట్‌లు, తెరవెనుక సిబ్బంది అంటూ అందులో రాసుకొచ్చారు. The real stars of the hospitality industry are the front office managers, cleaning crew, receptionists and behind-the-scenes staff who ensure guests have the best possible experience during their stay. Early on I got to experience this first-hand when a customer tipped me Rs… pic.twitter.com/M1Gre6NTUh — Ritesh Agarwal (@riteshagar) May 28, 2023 ఇదీ చదవండి: Prerna Jhunjhunwala: రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే.. -
ఒక్కసారిగా మైండ్ బ్లాక్!.. వెయిట్రస్‌కు కోట్ల విలువైన కారు టిప్‌గా ఇచ్చాడు
ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ మీస్టర్ బీస్ట్ అలియాస్ జిమ్మీ డొనాల్డ్సన్ ప్రపంచంలో అత్యధికంగా ఫాలోవర్లును సంపాదించుకున్నాడు. వెరైటీ కంటెంట్లతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు వినోదాన్ని పంచుతుంటాడు ఈ యూట్యూబర్. అందుకే తన ఫాలోవర్లు సంఖ్య 139 మిలియన్లకు పెంచుకోగలిగాడు. తన బిజినెస్ వెంచర్స్‌ను ప్రమోట్ చేసుకునేందుకు సరికొత్తగా ప్లాన్లు చేసే ఈ యూట్యూబర్ ఇటీవల ఓ వెయిట్రస్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చి ఆమె ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఊహించని టిప్.. రెస్టారెంట్‌కు వెళ్లిన ఆ యూట్యూబర్ అక్కడ పని చేస్తున్న వెయిట్రెస్‌తో.. ఇంత వరకు నువ్వు అత్యధికంగా ఎంత టిప్ తీసుకున్నావు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు, ఆమె 50 డాలర్లు అని సమాధానమిస్తుంది. దాంతో ఇప్పటివరకూ నీకు టిప్‌గా కారు ఎవరైన ఇచ్చారా అని అడుగుతూ తన కారు తాళాన్ని వెయిట్రెస్‌కు ఇస్తాడు. మొదట్లో ఆమె ఈ విషయాన్ని నమ్మదు గానీ తర్వాత ఆ యూట్యూబర్ తను కారును పార్క్ చేసిన ప్రదేశానికి వెయిట్రెస్‌ను తీసుకువెళ్లి సర్ప్రైజ్ చేస్తాడు. బ్లాక్ టయోటా కారును వెయిట్రెస్‌కు టిప్‌గా అందిస్తాడు ఆ యూట్యూబర్. టిప్‌గా ఇచ్చిన కారుపై తన చాక్లెట్ కంపెనీ ఫీస్టబుల్ లోగో కనిపిస్తుంది. కస్టమర్ నుంచి కోట్లు ఖరీదైన కారుని టిప్‌గా అందుకోవడంతో వెయిట్రెస్ ఆనందంలో మునిగి తేలిపోతుంటుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యూట్యూబర్ ఔదార్యాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by MrBeast (@mrbeast) -
ఎన్కౌంటర్లలో నేరస్తులు చనిపోకుండా ఉండాలంటే..
ఎన్కౌంటర్లో నేరస్తులు చనిపోకుండా ఉండాటానికి ఏం చేయాలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత శర్శ కొన్ని చిట్కాలను అందించారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే ఓటింగ్‌పై జరిగిన చర్చకు సీఎం సమాధానమిస్తూ.. దీని గురించి వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీసులు బుల్లెట్‌తో బుల్లెట్‌కి సమాధానం ఇస్తున్నారు. అందువల్లే రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని అన్నారు. నేరస్తులను కాల్చి చంపకుండా ఉండాలంటే ..క్రిమినల్స్ పట్టుబడ్డప్పుడూ చేతులు పైకెత్తాలని అన్నారు. అప్పుడూ పోలీసులు రివ్వాల్వర్‌కి పనికి చెప్పాల్సిన అవసరం ఉండదన్నారు. " మీరంతా ఎన్కౌంటర్లు గురించి అడుగుతున్నారు. తెలిసి ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తారా? అని ప్రశ్నించారు. మతహింస తెలిసి జరుగుతుందా..అలాగే ఎన్కౌంటర్ కూడా ఆలోచించి జరగదు. ఇప్పుడూ వారు పాత అస్సాం పోలీసులు కాదు. అందుకే వారు బుల్లెట్లతో సమాధానం ఇస్తున్నారని అందుకు తాను సంతోషిస్తున్నాను" అని అన్నారు. అయితే పోలీసులు కూడా చట్ట పరిధిలోనే ఉండాలని చెప్పారు. పోలీసు సిబ్బంది అతను లేదా ఆమె తప్పుచేసినప్పుడూ సీనియర్ అధికారి అయినప్పటికీ శిక్షార్హమైన చర్యలు ఎదర్కొనక తప్పదని ముఖ్యమంత్రి శర్మ అన్నారు. ఐతే అటవీ ప్రాంతాలలో జరగుతున్న అక్రమ కార్యకలాపాలు, బాల్యవివాహాలు, ఇతర నేర కార్యకలాపాలు వంటి వాటిపై తమ ప్రభుతం అణిచివేతను కొనసాగిస్తుందని, అలాగే ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడానికి సిగ్గుపడరని నొక్కి చెప్పారు. (చదవండి: మంత్రిని ప్రశ్నించినందుకు యూట్యూబర్ అరెస్టు..పైగా నేరస్తుడిలా..) -
వార్నీ.. రూ.650 టిప్ సరిపోలేదట! కస్టమర్‌కు షాకిచ్చిన డెలివరీ గర్ల్..
ఆన్లైన్ డెలివరీ యాప్‌లు రాకతో ఇంటి వద్దనే ఫుడ్‌ని తెప్పించుకోవడం ప్రజలకు అలవాటుగా మారింది. కరోనా నుంచి వీటికి జనాదరణ కూడా పెరిగిందనే చెప్పాలి. అయితే డెలివరీ బాయ్స్ కస్టమర్లకు ఫుడ్ డెలవరీ చేసే క్రమంలో పలు వింత ఘటనలు చోటు చేసుకోవడం చూస్తునే ఉన్నాం. తాజాగా ఓ డెలివరీ పార్టనర్ టిప్ సరిపోలేదని అసహనంతో కస్టమర్‌తో జరిపిన సంభాషణ వైరల్‌గా మారింది. ఆ టిప్ సరిపోలేదు.... ఇటీవల టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో చాలా పనుల కోసం బయటకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. ఇక చేతిలో మొబైల్, అందులో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు నిమిషాల్లో కొన్ని సేవలు ఏదైన మన ఇంటి ముందుకు వచ్చి ప్రత్యక్షమవుతున్నాయి. ఫుడ్ సంబంధించి కూడా ఆన్లైన్ యాప్‌ల రాకతో మనం కోరుకున్న ఫుడ్ జస్ట్ ఒక క్లిక్‌తో వచ్చేస్తుంది. తాజాగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు షాకిచ్చింది డెలివరీ పార్టనర్. అసలేం జరిగిందంటే.. డెలివరీ పార్ట్నర్ కస్టమర్ ఇంటి ముందుకు వచ్చి అతనితో మాట్లాడటం ప్రారంభించింది. ‘మీ ఫుడ్ ఆర్డర్ తీసుకువచ్చేందకు నేను పన్నెండున్నర మైళ్లు దూరం 40 నిమిషాల పాటు డ్రైవింగ్ చేసి వచ్చాను. అయితే మీరిచ్చిన టిప్ 8 డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.650) నేను సంతోషంగా లేనని’ ఆమె అతనికి చెబుతుంది. అయితే కస్టమర్ అదనంగా చెల్లించేందుకు నిరాకరిస్తాడు. దీంతో డెలివరీ పార్టనర్‌కు చిరెత్తుకురావడంతో ఫుడ్ ప్యాకెట్‌ను తీసుకొని కస్టమర్‌కు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. డ్రైవర్‌కు, కస్టమర్‌కు మధ్య జరిగిన పరస్పర సంభాషణ ప్రస్తుతం ఆన్లైన్లో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: Guinness Record: 24 గంటల్లో 8,008 పుల్ అప్స్.. గిన్నిస్ రికార్డు బద్దలు.. -
రూ.2.3లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. కేసు పెట్టిన రెస్టారెంట్
వాషింగ్డన్: రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసి హాయిగా తిన్నాడు. ఆ తర్వాత వెయిట్రెస్‌కు రూ.2.3లక్షలు(3వేల డాలర్లు) టిప్ ఇచ్చాడు. అంత భారీ మొత్తం తనకే అని తెలిసి ఆమె ఆశ్చర్యంతో పాటు ఆనందంలో మునిగిపోయింది. అమెరికా పెన్సిల్వేనియాలోని అల్ఫ్రెడోస్ పిజ్జా కేఫ్ రెస్టారెంట్లో ఈ ఘటన జరిగింది. టిప్ ఇచ్చిన కస్టమర్ పేరు ఎరిక్ స్మిత్ కాగా.. తీసుకున్న వెయిట్రెస్ పేరు మరియానా లాంబర్ట్. ఇంతవరకూ బాగానే ఉన్నా ఆ తర్వాతే అసలు ట్విస్ట్ ఇచ్చాడు కస్టమర్. తాను ఇచ్చిన టిప్‌ను తిరిగిచ్చేయాలన్నాడు. దీంతో రెస్టారెంట్‌తో పాటు వెయిట్రెస్ కూడా కంగుతింది. ఎరిక్ తన బిల్లుతో పాటు టిప్‌ను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాడు. టిప్ ఇస్తూ బిల్లుపై 'ఫర్ జీసస్'(జీసస్ కోసం) అని రాశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పేరుతో ఉద్యమం నడుస్తోంది. చాలా మంది ఇతరుల కోసం భారీ సాయం చేస్తున్నారు. దీంతో ఇది దేవుడు తనకోసం ఇచ్చిన కానుక అని వెయిట్రెస్ సంబరపడిపోయింది. కానీ కొన్ని గంటలకే ఆనందం ఆవిరైంది. తాను టిప్ ఇచ్చిన రూ.2.3లక్షలపై క్రెడిట్ కార్డు కంపెనీతో గొడవపడ్డాడు ఎరిక్. ఈ మొత్తాన్ని బిల్లులో చేర్చవద్దన్నాడు. దీంతో క్రెడిట్ కార్డు కంపెనీ ఈ విషయాన్ని రెస్టారెంట్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే ఏదో పొరపాటు జరిగి ఉంటుందని రెస్టారెంట్ యాజమాన్యం ఎరిక్‌ను సంప్రదించేందు ప్రయత్నించింది. ఫేస్బుక్లో సందేశాలు పంపింది. కానీ అతని నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఎరిక్‌పై కోర్టులో దావా వేసింది రెస్టారెంట్ యాజమాన్యం. రూ.2.3లక్షలను తాము అప్పటికే లాంబర్ట్‌కు ఇచ్చేశామని, ఇప్పుడు అంత మొత్తాన్ని తిరిగి ఇవ్వలేమని చెప్పింది. కస్టమరే స్వయంగా టిప్ ఇచ్చి మళ్లీ వెనక్కి ఇవ్వాలనడంపై అభ్యంతరం తెలిపింది. ఆ టిప్ తీసుకునేందుకు లాంబర్ట్‌కు పూర్తి అర్హత ఉందని, ఆమె చాలా కష్టపడి పనిచేస్తుందని చెప్పింది. చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
వెయిటర్ నిర్వాకం.. టిప్పు ఇవ్వలేదని యువకులపై దాడి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో ఒక వెయిటర్ కస్టమర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. టిప్పు ఇవ్వలేదన్న కోపంతో యువకులపై దాడికి తెగబడ్డాడు. శంషాబాద్ పరిధినిలోని ఎయిర్పోర్ట్ బావర్చీ హోటల్లో స్థానికంగా కొంత మంది యువకులు నిన్న(మంగళవారం) రాత్రి బిర్యానీ తినడానికి వచ్చారు. ఆ తర్వాత.. యువకులు బిల్లు చెల్లించి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో.. వెయిటర్ టిప్పు చెల్లించరా.. అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బందితో కలిసి యువకులపై దాడికి తెగబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను సముదాయించి హోటల్ నుంచి పంపించి వేశారు. గతంలోను ఇదే హోటల్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు బావార్చి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యువకులు వెయిటర్‌పై స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెయిటర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!
Waitress gets Rs 7 lakh in tips: సాధారణంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్లితే టిప్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎక్కువ మంది వంద రూపాయలలోపే టిప్పుగా ఇస్తారు. చాలా రేర్‌గా ఎవరో కొందరు మాత్రమే వేలు టిప్పుగా ఇస్తారు. కానీ ఇక్కడొక వెయిటర్‌కి లక్షల్లో టిప్పు లభించింది. (చదవండి: గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నా.. విమానాన్ని హైజాక్ చేస్తున్నా!) అసలు విషయంలోకెళ్లితే..విలయమ్స్ అనే మహిళ ఒక రోజు రెస్టారెంట్‌కి వెళ్లుతుంది. అయితే ఆ రెస్టారెంట్లో పనిచేసే జాజ్మిన్ కాస్టిల్లో అనే మహిళా వెయిటర్ విలయమ్స్కి ఆహారం సర్వ్ చేస్తుంది. అయితే విలియమ్స్‌కి సదరు వెయిటర్ పనితీరు నచ్చి ఆమె తను తిన్నదానికి 30 డాలర్లు(రూ. 2,271), ఆమెకు $40 డాలర్లు(3,082)లు టిప్పు ఇస్తుంది. అంతే వెయిటర్ కాస్టిల్లో సదరు కస్టమర్ ఉదారతకు ఉప్పొంగిపోతుంది. అంతేకాదు కాస్టిల్లో ఆమె రోజు ఇక్కడకు వచ్చి పనిచేయడం వల్ల తన కూతుర్ని డే కేర్‌లో పెట్టాల్సి వస్తుందని, పైగా తాను ఉద్యోగం మానేయలనకుంటున్నట్లు కూడా చెబుతుంది. ఈ మేరకు విలయమ్స్ సదురు వెయిటర్‌కి సాయం చేసి అక్కడితో వదిలేయదు. అంతేకాదు ఆ వెయిటర్ పేరు మీద క్యాష్ యాప్‌ని ఓపెన్ చేస్తుంది. అంతేకాదు సదరు వెయిటర్ గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఎవరికి వీలైనంత వారు సాయం చేయండి అంటూ కోరుతుంది. అయితే ఈ విషయాలు ఏమీ సదరు వెయిటర్‌కి తెలియవు. అయితే సదరు వెయిటర్‌కి అదేపనిగా డబ్లులు అకౌంట్లో పడినట్లుగా వస్తుంటుంది. ఆ వెయిటర్ తనకు క్యాష్ యాప్‌లాంటి వాటిల్లో తాను రిజస్టర్ చేసుకోలేదు కదా అనుకుంటుంది. ఈ మేరకు అలా మెసేజ్‌లు రావడం మాత్రం ఆగదు. దీంతో ఆమె ఒక్కసారిగా అనుమానంతో చెక్చేస్తుంది. అంతే ఆమె అకౌంట్లో అపరిచితుల నుంచి దాదాపు రూ. 7లక్షలు టిప్పు వస్తుంది. అంతే వెయిటర్ జాజ్మిన్ కాస్టిల్లో ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. తనకు డబ్బులు పంపిన వారందరికి కృతజ్ఞతలు తెలపడమే కాక తనకు ఇంత మంచి సాయం చేసిన సదరు కస్టమర్ విలయమ్స్కి చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది. (చదవండి: క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!) -
కస్టమర్ ఇచ్చిన టిప్ చూసి డెలివరీ బాయ్ షాక్!
ఫుడ్ డెలివరీ యాప్‌లు పెరిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున వాటికి ఆర్డర్లు ఇస్తున్నారు. కరోనా సమయంలో ఫుడ్ డెలివరీ చేసే వారిని కూడా వారియర్లుగా గుర్తించారు. డెలివరీ యాప్‌లకు సంబంధించిన వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా ఓ సంఘటన వైరల్‌గా మారింది. ఆర్డర్ పెట్టిన కస్టమర్‌కు ఫుడ్ డెలివరీ చేసిన బాయ్ టిప్ అడిగాడు. అయితే అప్పటికే కస్టమర్ వద్ద డబ్బులు లేవు. దీంతో ఆ డెలివరీ బాయ్‌కు ఊహించని టిప్ ఇచ్చాడు. దాన్ని తీసుకుని డెలివరీ బాయ్ వెళ్లిపోయాడు. సీసీ టీవీలో రికార్డయిన ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అమెరికాలో ఓ వ్యక్తి పిజ్జాహట్‌లో పిజ్జా ఆర్డర్ పెట్టాడు. పిజ్జాను తీసుకుని వచ్చి కస్టమర్ ఇంటి తలుపు తట్టాడు. టిప్ ఇవ్వాలని డెలివరీ బాయ్ అడగ్గా.. ‘నా దగ్గర డబ్బులు లేవు. పిజ్జాలో ఒక ముక్క (స్లైస్) తీసుకో’ అని కస్టమర్ చెప్పాడు. అయితే డెలివరీ బాయ్ ‘మీరేమైనా జోక్ చేస్తున్నారా’! అని ప్రశ్నించాడు. ‘లేదు లేదు నిజంగంటే డబ్బులు లేవు’ అని చెప్పడంతో డెలివరీ బాయ్ తెచ్చిన పిజ్జాలో ఓ ముక్క తీసుకుని తింటూ వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలను ఆ కస్టమర్ టిక్‌టాక్‌లో వీడియో అప్లోడ్ చేశాడు. ఈ సందర్భంగా అప్పుడు జరిగిన విషయాలన్నీ ఆ వీడియోలో టెక్ట్స్ రూపంలో వివరించాడు. ఈ భిన్నమైన స్పందన లభిస్తోంది. రింగ్డోర్బెల్ కంపిలేషన్ అనే టిక్‌టాక్ అకౌంట్లో ఈ వీడియో ఉంది. -
రూ.4 లక్షలు టిప్ ఇచ్చిన కస్టమర్..!
వాషింగ్టన్: పండుగల వేళ మనకున్నదాంట్లో పేదవారికి సాయం చేస్తే.. వారి ముఖాల్లో కూడా సంతోషం వెల్లివిరిస్తుంది. అందుకే చాలా వరకు పండుగ పూట ఇంటికి వచ్చిన వారికి తోచినంత దానం చేస్తారు. అమెరికాకు చెందిన ఓ కస్టమర్ కూడా ఇలానే భావించాడు. తాను భోజనం చేయడానికి వెళ్లిన రెస్టారెంట్ స్టాఫ్‌కి 4 లక్షల రూపాయలు టిప్ ఇచ్చి.. అందరిని సమంగా పంచుకోమన్నాడు. అతడి దాతృత్వానికి రెస్టారెంట్ సిబ్బంది తెగ సంబరపడ్డారు. ధన్యవాదాలు తెలిపారు. వివరాలు.. ఈ నెల 12న ఓ కస్టమర్ ఒహియోలోని సౌక్ మెడిటేరియన్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. డిన్నర్ చేశాడు. ఇక బిల్ తెచ్చివ్వగా.. బిల్‌తో పాటు 5,600 డాలర్లు (4,12,459 రూపాయలు) టిప్ ఇచ్చాడు. స్టాఫ్ అందరిని సమానంగా పంచుకోమని కోరాడు. మొత్తం 28 మందికి 200 డాలర్లు వచ్చాయి. ఇక క్రిస్టమస్ ముందు ఇంత భారీ మొత్తం టిప్‌గా లభించడంతో సిబ్బంది సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సదరు కస్టమర్‌కి కృతజ్ఞతలు తెలిపారు. (వైరల్: డెలివరీ బాయ్‌కు ఊహించని సర్ప్రైజ్) ఈ సందర్భంగా చీఫ్ కుక్ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది మా అందరి జీవితాల్లో కన్నీళ్లే ఉన్నాయి. పండుగ ఆనందం కూడా లేదు. ఆర్థికంగా ఎంతో కుంగిపోయాం. కేవలం రోజులు గడుస్తున్నాయి అంతే. ఇలాంటి పరిస్థితుల్లో ఓ అపరిచితుడు మమ్మల్ని తన కుటుంబ సభ్యులుగా భావించాడు. మా అందరికి భారీ మొత్తం టిప్‌గా ఇచ్చాడు. ఇది మాకు ఎంతో ఎక్కువ. అతడికి జీవితాంతం కృతజ్ఞతలు తెలుపుతాం’ అన్నారు. ఇక ఇంత మంచి పని చేసిన వ్యక్తి తన పేరు బయటకు వెల్లడించవద్దని కోరినట్లు సిబ్బంది తెలిపారు. -
బిల్లు రూ.15 వేలు.. టిప్పు రూ.3 లక్షలు
వాషింగ్టన్: సాధారణంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళితే టిప్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎక్కువ మంది వంద రూపాయలలోపే టిప్పుగా ఇస్తారు. చాలా రేర్‌గా ఎవరో కొందరు మాత్రమే వేలు టిప్పుగా ఇస్తారు. కానీ లక్షల రూపాయలు టిప్పుగా ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నారా లేదు కదా. కానీ ఈ సంఘటన వాస్తవంగా చోటు చేసుకుంది. ఓ వ్యక్తి వెయిట్రెస్కి ఏకంగా 500 డాలర్లు టిప్పుగా ఇచ్చాడు. మన కరెన్సీలో చెప్పాలంటే 3,67,287 రూపాయలన్న మాట. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెస్టర్లోని వైడెనర్ విశ్వవిద్యాలయంలో నర్సింగ్ చదవుతోన్న జియానా డి ఏంజెలో పెన్సిల్వేనియాలోని ఓ ఇటాలియన్ రెస్టారెంట్లో వెయిట్రెస్‌గా పార్ట్ టైం వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి రెస్టారెంట్‌కి వచ్చి.. ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నారు. బిల్లు 205 డాలర్లు(రూ.15,058)అయ్యింది. జియానా బిల్ తీసుకొచ్చి ఇవ్వగా సదరు కస్టమర్ 5,205 డాలర్లు టెబుల్ మీద పెట్టి వెళ్లాడు. జియానా వచ్చి చూడగా.. ఐదు వేల డాలర్లు అదనంగా కనిపించాయి. మర్చిపోయాడేమో అని భావించిన జియానా డబ్బులు తిరిగి ఇచ్చేసేందుకు చూసింది. కానీ కస్టమర్ అప్పటికే వెళ్లిపోయాడు. (ట్రెండింగ్: పొరపాటున 42 ఆర్డర్లను బుక్ చేసిన చిన్నారి) దాంతో అతడు ఆ డబ్బుని టిప్పుగా ఇచ్చాడని అర్థం అయ్యింది. దీని గురించి రెస్టారెంట్ యాజమాన్యానికి చెప్పగా వారు బిల్ పేపర్ని ఫేస్బుక్లో షేర్ చేశారు. ఇక దాని మీద బిలు దగ్గర 205 డాలర్లు ఉండగా.. టిప్పు దగ్గర 5,000 అని రాసి ఉంది. మొత్తం 5,205 డాలర్లుగా చూపిస్తుంది. ఇంత భారీ మొత్తాన్ని టిప్పుగా అందుకున్న జియానా ఆనందానికి హద్దులు లేవు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంత టిప్పు ఇచ్చిన వ్యక్తి ఈ రెస్టారెంట్‌కి రెగ్యులర్ కస్టమర్. ఎంతో మంచి మనసుతో నాకు ఇంత భారీ మొత్తాన్ని టిప్పుగా ఇచ్చాడు. దీన్ని నా స్వంత ఖర్చులకు వాడను. ఏదైనా మంచి పని కోసం వినియోగిస్తాను అని తెలిపింది. ప్రస్తుతం ఈ స్టోరి ఫేస్బుక్లో తెగ వైరలవుతోంది. మహమ్మారి సమయంలో అతడు తన మంచి మనసు చాటుకున్నాడని.. అతడి మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది అంటూ నెటిజనులు సదరు కస్టమర్‌ని ప్రశంసిస్తున్నారు. -
డెలివరీ బాయ్‌కు ఊహించని సర్ప్రైజ్
-
వైరల్: డెలివరీ బాయ్‌కు ఊహించని సర్ప్రైజ్
లండన్: కరోనా కష్టకాలంలోనూ ప్రజల ఆకలి తీర్చేందుకు కష్టపడుతున్నారు డెలివరీ బాయ్స్. ఈ క్రమంలో ఓ పిజ్జా డెలివరీ బాయ్‌కు కొంతమంది మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చారు. యూకేలో బాబ్ అనే వ్యక్తి పిజ్జా డెలివరీ చేయడానికి ఓ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడున్న ఇద్దరు అమ్మాయిలతో పాటు ఓ అబ్బాయి అతడిని వంటగదిలోకి ఆహ్వానించారు. డబ్బులు చేతికివ్వమని, కప్ గేమ్ ఆడి కావాల్సినంత గెలుచుకోమన్నారు. ఈ ఆట ఏంటంటే బల్లపై 12 కప్పులు ఉంటాయి. అందులో ఏవైనా ఆరు ఎంపిక చేసుకోవాలి. వాటి కింద ఎంత డబ్బు ఉంటే అంత డెలివరీ బాయ్ సొంతం అవుతుంది. దీనికి సరేనన్న బాబ్ మొదట సందిగ్ధంగానే ఓ కప్పును తీసి చూశాడు. అందులో 20 డాలర్లు ఉన్నాయి. రెండో కప్పు కింద 5 డాలర్ల నోటు కనిపించింది. (జొమాటో బాయ్స్ దేశ భక్తికి సెల్యూట్!) మరి కొన్ని కప్పులు తీసేసరికే అతనికి రావాల్సిన బిల్లు వచ్చేసింది. అతను ఆరో ప్రయత్నంలో 100 డాలర్లు ఉన్న కప్పును తీయడంతో అక్కడున్న వారు ఎగిరి గంతేశారు. ఊహించని సర్ప్రైజ్కు అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ డబ్బును తీసుకుని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అక్కడి నుంచి వీడ్కోలు తీసుకోబోయాడు. కానీ 11 ఏళ్లుగా అదే వృత్తిలో సేవలందిస్తున్న బాబ్ను మరింత సంతోషపెట్టేందుకు మిగతా కప్పుల కింద మొత్తం డబ్బును తీసి అతని చేతికిచ్చారు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న బాబ్ వారిని ఆత్మీయ ఆలింగం చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. వీడియోను చూస్తున్నంతసేపు తమకు తెలియకుండానే భావోద్వేగానికి లోనవుతున్నామని పలువురు పేర్కొంటున్నారు. ('తిక్క కుదిరింది.. ఇలా కావాల్సిందే') -
ఎఫ్బీ పోస్ట్; టిప్‌గా 32 వేల డాలర్లు!
కాలిఫోర్నియా : కరోనా వైరస్ వ్యాప్తితో మాస్కు ధరించడం అనివార్యంగా మారింది. బయటకు వెళ్లాలంటే తప్పని సరిగా మాస్క్ ఉండాల్సిందే. కొన్ని చోట్ల మాస్కు ధరించకుండా బహిరంగా ప్రదేశాలకు వచ్చే వారిపై జరిమాన సైతం విధిస్తున్నారు. ఈక్రమంలో ఓ రెస్టారెంట్‌కు మాస్కు ధరించకుండా వెళ్లిన మహిళకు వెయిటర్ సర్వ్ చేయని ఘటన కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో చోటుచేసుకుంది. అంతేగాక అతను చేసిన పని తనకు 32,000 డాలర్లను టిప్‌గా తెచ్చిపెట్టింది. వివరాలు.. అండర్ లిన్ గిల్లెస్ అనే మహిళ ఇటీవల స్టార్‌బక్స్ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేయగా, సదరు మహిళ ముఖానికి మాస్క్ ధరించనందున రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న లెనిన్ గుటిరెజ్ అనే వ్యక్తి ఆమెకు సర్వ్ చేసేందుకు నిరాకరించాడు. ఆమె ఎంత చెప్పినా వినకుండా మాస్క్ ఉంటేనే సర్వ్ చేయాలని, లేకుంటే చేయొద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని వెయిటర్ మొండి స్పష్టం చేశాడు. (భారత ఐటీపై హెచ్1బీ వీసాల రద్దు ప్రభావం?) దీంతో వెయిటర్‌పై కోపంతో ‘మాస్క్ వేసుకోనందుకు కాఫీ తీసుకు రాలేదు’ అంటూ మహిళ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుపై లక్ష మందిపైగా కామెంట్ చేయగా, 50 వేల మంది షేర్ చేశారు. వీరిలో అనేకమంది నెటిజన్లు గిల్లెస్కు వ్యతిరేకంగా స్పందించారు. వెయిటర్ తన పని తాను నిర్వహించాడని లెనిన్‌ను ప్రశంసించారు. అంతేకాదు 32 వేల డాలర్లను అతడికి టిప్‌గా ఇచ్చారు. కాగా మే 1 నుంచి శాన్‌డియాగో ప్రజలు తప్పని సరి మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు, పార్కులు, షాపింగ్, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్కు ఉండాలని ఆదేశించింది. (చీటీల పేరుతో రూ. 2 కోట్ల టోకరా! ) ఇదిలా ఉండగా గిల్లెస్ పోస్టును చూసిన మాట్ కోవిన్ అనే ఓ వ్యక్తి లెనిన్‌కు ఎదైనా సాయం చేయేఆలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ ‘లెనిన్ స్టాండింగ్ అప్ టు ఏ శాన్ డియాగో కరెన్’ పేరుతో డొనేషన్పేజిని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ చేసి ఆ మెత్తాన్ని టిప్ రూపంలో లెనిన్‌కు ఇవ్వాలని అనుకున్నాడు. జూన్ 22న మొదటు పెట్టిన ఈ ఫండింగ్ ద్వారా శుక్రవారం సాయంత్రం వరకు 32 వేల డాలర్లు వసూలు చేశాడు. ఈ మెత్తాన్ని కోవిన్ లెనిన్‌కు అందించాడు. దీనిపై లెనిన్ మాట్లాడుతూ.. ఫండ్ అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమకు అందిన టిప్‌తో ఏం చేయాలో ఓ ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఈ డబ్బుతో డ్యాన్స్ స్కూల్ పెట్టి ఇతరులకు డ్యాన్స్ నేర్పిస్తానని వెల్లడించారు. (‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా? ) -
వెయిటర్ టిప్ రూ.లక్షన్నర
ఇంటర్నెట్ చాలెంజ్ పుణ్యమా అని సొంతిల్లు లేని ఓ మహిళా వెయిటర్‌కు భారీ టిప్ చేతికొచ్చింది. ‘#2020టిప్చాలెంజ్’పేరిట నడుస్తున్న ఓ సవాల్లో భాగంగా అమెరికన్ గాయకుడు డానీ వాల్బెర్గ్.. అమెరికాలోని ఇల్లినాయిస్లోని ఓ హోటల్లో 2019 డిసెంబర్ 30న భోజనం చేసి 2020 డాలర్ల టిప్ ఇచ్చాడు. దీంతో ఆ మహిళా వెయిటర్ డానియెల్ ఫ్రాన్జోన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందరూ వాల్బెర్గ్లా ఉండరని, అయినా కొందరు మంచిగానే టిప్ ఇచ్చారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. -
బిల్‌గేట్స్ టిప్ ఫొటో ఫేక్
న్యూఢిల్లీ: అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ జీవితం.. భావితరాలకు స్పూర్తిదాయకం అంటూ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఒకటి నకిలీదని తేలింది. అపర కుబేరుడు బిల్‌గేట్స్.. రెస్టారెంట్ వెయిటర్‌కు టిప్ ఇస్తూ.. తాను ఒక సాధారణ వుడ్‌కట్టర్ (వడ్రంగి) కుమారుడినని తెలుపుతూ ఫేస్బుక్లో చాలామంది ఫార్వర్డ్ చేస్తున్న ఈ ఫొటోలో ఏమాత్రం నిజం లేదని.. ప్రముఖ మీడియా దిగ్గజం ఇండియా టుడే చేసిన నిజ-నిర్ధారణలో తేలింది. బిల్‌గేట్స్ తండ్రి వుడ్‌కట్టర్ (కలపను నరికే వ్యక్తి) కాదని స్పష్టం చేసింది. బిల్‌గేట్స్ బ్లాగ్ 'గేట్స్ నోట్స్' వివరాల ప్రకారం ఆయన తండ్రి విలియం హెచ్. గేట్స్ II.. సీటెల్ నగరంలో ఒక న్యాయవాది అని, తల్లి మేరీ గేట్స్ స్కూల్ టీచర్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో ఇలా ఉంటుంది. బిల్‌గేట్స్ ఒక రెస్టారెంట్‌కు వెళ్లి.. అక్కడ తిన్న తర్వాత వెయిటర్‌కు టిప్ కింద 5 డాలర్లు ఇస్తాడు. అది చూసి నోరెళ్లబెట్టిన వెయిటర్‌ను బిల్.. ఏమయింది అని ప్రశ్నిస్తాడు. కొద్దిసేపటి క్రితం ఇదే టేబుల్‌పై మీ కూతురు వచ్చి.. 500 డాలర్లు టిప్ ఇచ్చిందని.. మీరు కేవలం 5 డాలర్లు ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యానని చెబుతాడు. అప్పుడు బిల్‌గేట్స్ నవ్వి.. ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి కుమార్తె అని, కానీ తాను ఒక సాధారణ కలప నరికే వ్యక్తి కుమారుడిని అని చెప్పుకొస్తాడు. చివరగా.. గతాన్ని ఎప్పటికీ మరువకూడదు.. ఇట్స్ యువర్ బెస్ట్ టీచర్ అంటూ వచ్చే సందేశం వస్తుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. బిల్ తండ్రి ఒక న్యాయవాది అని ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ తేల్చింది. -
పులిపిర్లా... ఇలా ట్రై చెయ్యండి!
మన వంటి మీద అక్కడక్కడ పులిపిర్లు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇవి వాటంతటవే తగ్గిపోతాయి కానీ కొంతమందిలో ఏళ్ల తరబడి ఉండి, బాధిస్తాయి. ఇవి చేతులపైన, మెడమీద, ముఖం మీద ఎక్కువగా కనిపిస్తూ, అందవికారంగా మార్చేస్తాయి. పులిపిర్ల నివారణకు అనేక రకాల చికిత్సలు ఉన్నాయి కానీ, కొన్ని చిట్కాల ద్వారా కూడా వాటిని నివారించుకోవచ్చు. ∙ముఖంపైన, మెడ మీద పులిపిరి కాయలు ఉన్నవారు దాల్చిన చెక్కను కాల్చి ఆ బూడిదని కొంచెం సున్నంలో కలిపి, దానికి కొన్ని బొట్లు నూనె కలిపి, వాటిపైన రాస్తే అవి రాలిపోతాయి. ∙అల్లాన్ని సన్నగా చెక్కి, సున్నంతో అద్ది పులిపిరిపై పెడుతుంటే క్రమంగా రాలిపోతాయి. ∙కాలిఫ్లవర్‌ను గ్రైండ్ చేసి రసం తీసి, ఆ రసాన్ని వీలైనన్ని సార్లు పులిపిర్లపై రాస్తుంటే మచ్చలు, గుంటలు పడకుండా రాలిపోతాయి. ∙మందంగా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే సరి, అవి ఎండి రాలిపోతాయి. ∙రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి, దానికి సున్నపు నీటి తేటను కలిపి నిల్వ చేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి దాన్ని పులిపిరిపై రాస్తూ ఉంటే అవి రాలిపోతాయి. కొందరికి కొన్ని రోజులకే మంచి ఫలితం కనిపించవచ్చు. ఇంకొందరికి ఎక్కువకాలం పట్టొచ్చు. ప్రయత్నించి చూడండి. -
మంచినీళ్లు ఇచ్చినందుకే రూ.7 లక్షలా!!
హోటల్‌కి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించడం.. వారి నుంచి ఆర్డర్ తీసుకోవడం... తర్వాత బిల్ ఇవ్వడం.. తమ సేవలను మెచ్చి టిప్ ఇస్తే తీసుకోవడం.. ఇవీ సాధారణంగా హోటల్ బేరర్ల పనులు. నార్త్ కరోలినాకు చెందిన అలియానా కస్టర్ కూడా ఇవే పనులు చేసింది. అయితే బిల్‌తో పాటు తనకు వచ్చిన టిప్ చూసి షాకవ్వడం ఆమె వంతైంది. ఎందుకంటే.. ఆమెకు టిప్‌గా లభించింది పదో పరకో కాదు ఏకంగా 10 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 7 లక్షల 38 వేల రూపాయలు. ఇంతకీ అంత విశాలమైన హృదయం ఉన్న ఆ కస్టమర్‌కి అలియానా సర్వ్ చేసింది కేవలం రెండు గ్లాసుల మంచినీళ్లే. అవును కేవలం మంచినీళ్లు తాగి హోటల్‌ను వీడిన ఆ కస్టమర్.. ‘రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు’ అంటూ ఓ పేపర్‌పై రాసి అలియానాను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు మళ్లీ కాసేపటి తర్వాత తన సిబ్బందితో సహా తిరిగి వచ్చి అలియాకు ఓ హగ్ కూడా ఇచ్చి వెళ్లాడు. తనకు ఇన్ని స్వీట్ షాకులిచ్చిన ఆ కస్టమర్ యూట్యూబ్ స్టార్ మిస్టర్ బీస్ట్ అని తెలుసుకున్న అలియానా ఆనందంతో ఎగిరి గంతేసింది. సుమారు 8.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్న బీస్ట్, అలియానా భావోద్వేగాలను కూడా తన కెమెరాలో బంధించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. దీంతో.. తన జీవితంలో ఇదో మరపురాని సంఘటన అంటూ మురిసిపోయింది అలియానా. ఇక బీస్ట్ ఇచ్చిన టిప్‌తో తనతో పాటు పనిచేసే, ఆర్థిక ఇబ్బంది వల్ల చదువు ఆపేసిన విద్యార్థులకు తన వంతు సాయం చేస్తానంటూ పెద్ద మనసు చాటుకుంది. -
టిప్ 16 లక్షలు!
ఏథెన్స్: రెస్టారెంట్లలో బిల్‌తో పాటు టిప్ ఇవ్వడం సర్వసాధారణం. మనకు హోటల్ సిబ్బంది సర్వీస్ ఎంత నచ్చితే అంత ఎక్కువ టిప్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఓ హోటల్ సిబ్బందికి ఏకంగా 16 లక్షల భారీ టిప్ ఇచ్చాడు. ఈ ఊహకందని భారీ మొత్తం చూడటంతో సిబ్బందే ఆశ్చర్యానికి గురయ్యారు. రొనాల్డో మాత్రం వారి సేవకు మెచ్చే ఇచ్చానని పేర్కొన్నారు. ప్రస్తుతం రొనాల్డో ఇచ్చిన టిప్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. పోర్చుగల్ జట్టు రౌండ్-16లో ఉరుగ్వేపై ఓటమి చెందడంతో ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దీంతో దొరికిన ఖాళీ సమయంలో ఆటగాళ్లు సేదతీరుతున్నారు. పోర్చుగల్ కెప్టెన్ మాత్రం తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గ్రీస్‌లో సందడి చేస్తున్నాడు. సన్నిహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన రోనాల్డో అక్కడి సిబ్బంది మర్యాదలు నచ్చి భారీ మొత్తంలో టిప్ ఇచ్చాడు. ఇటీవలే స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్‌కు రొనాల్డో బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఒప్పదం ప్రకారం నాలుగేళ్ల పాటు యువెంటస్‌కు ఆడతాడు. చదవండి: ఆ మాజీ క్రికెటర్ రెస్టారెంట్ బిల్లు ఏడు లక్షలు -
టెర్రరిస్టుకు కూడా టిప్పు ఇవ్వాలా..!
టెక్సాస్ : హోటల్‌కి వచ్చిన వారికి సాదరంగా ఆహ్వానం పలకడం.. వారి నుంచి ఆర్డర్ తీసుకోవడం... భోజనం వడ్డించడం.. తర్వాత బిల్ ఇవ్వడం.. తాము చేసిన సేవలకు మెచ్చి టిప్ ఇస్తే తీసుకోవడం.. ఇవీ సాధారణంగా హోటల్ బేరర్ల పని. టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు చెందిన ఖలీల్ కేవిల్ అనే యువకుడు కూడా ఇదే పని చేశాడు. బిల్‌తో పాటు.. టిప్ కూడా తీసుకుందామని టేబుల్ దగ్గరికి చేరిన ఖలీల్‌కు ఊహించని షాకిచ్చాడు ఓ కస్టమర్. అసలు విషయమేమిటంటే.. ఖలీల్ పనిచేసే రెస్టారెంట్‌కి వచ్చిన ఓ కస్టమర్ 108 డాలర్ల బిల్ చెల్లించాడు. కానీ టిప్ ఇవ్వలేదు సరికదా.. ఖలీల్ పేరును బ్లాక్ ఇంక్‌తో రౌండప్ చేయడంతో పాటు... ‘మేము టెర్రరిస్టుకు టిప్ ఇవ్వము’ అంటూ రాశాడు. దీంతో కంగుతిన్న ఖలీల్.. తన పేరు చూసి ముస్లిం అనుకుని ఈవిధంగా రాసి ఉంటారని భావించాడు. విద్వేషం, జాతి వ్యతిరేక భావాలు గల వ్యక్తులు ఇలాగే స్పందిస్తారంటూ బిల్ స్లిప్ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఖలీల్ పోస్ట్‌ను షేర్ చేసిన నెటిజన్లు అతడికి మద్దతుగా నిలవడంతో పాటు కొంత డబ్బును కూడా పంపిస్తున్నారు. ఆయన పేరు మీదుగానే.. ఈ విషయమై స్థానిక మీడియాతో మాట్లాడిన ఖలీల్.. క్రిస్టియన్ అయిన తనకు ఖలీల్ అనే పేరు ఎలా వచ్చిందో తెలిపాడు. ‘మా నాన్న మిలిటరీలో పని చేశారు. ఆ సమయంలో ఆయనకు ఖలీల్ అనే వ్యక్తి పరిచయమయ్యారు. కాలక్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఎంతగానో బలపడింది. కానీ అకస్మాత్తుగా జరిగిన ఓ ఆక్సిడెంట్లో ఖలీల్ అంకుల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్నేహానికి గుర్తుగా నా పేరుకు ముందు ఖలీల్ అని చేర్చారని’ తన పేరు వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఖలీల్.. ‘డబ్బే ప్రధానం కాదు. మనిషిని మనిషిలాగే చూడాలంటూ’ సదరు కస్టమర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. -
బిల్లు 50 వేలు.. టిప్పు లక్ష రూపాయలు..!!
చికాగో, అమెరికా : హోటల్లో సర్వీస్ చేసినందుకు సాధారణంగా అందరం టిప్పు ఇస్తూ ఉంటాం. మరి సర్వీసు ఆహారం కంటే అధికంగా నచ్చి వచ్చిన బిల్లు కంటే ఎక్కువ డబ్బు టిప్పుగా ఇస్తే?. అదే జరిగింది అమెరికాలోని ఓ రెస్టారెంట్లో. భోజనం, సర్వీస్ నచ్చిందని బిల్లు కంటే ఎక్కువ డబ్బును టిప్పుగా ఇచ్చాడు ఓ వ్యక్తి. చికాగోలోని బొకా రెస్టారెంట్‌కి ఓ వ్యక్తి ఫ్యామిలీతో కలిసి డిన్నర్‌కి వెళ్లాడు. మొత్తం బిల్లు 759 డాలర్లు(రూ.49,786/-) అయింది. తొలుత బిల్లుతో పాటు 300 డాలర్లు టిప్పుగా ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తి కిచెన్‌లోకి వెళ్లి అక్కడి పని వాళ్లతో మాట్లాడారు. వారి కష్ట సుఖాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత ఒక్కరికి 100 డాలర్ల చొప్పున 17 మందికి 1700 వందల డాలర్లు(రూ.1,31,190/-) టిప్పుగా ఇచ్చారు. దీంతో అక్కడి పనివాళ్లు ఒక్కసారిగా షాకయ్యారు. సంతోషంతో ఆ వ్యక్తితో ఫోటో దిగారు. ఇంత మొత్తంలో టిప్పు ఎప్పుడూ రాలేదని, వంటకాలు, సర్వీస్‌లకు మెచ్చి టిప్పు ఇచ్చారని రెస్టారెంట్ యాజమాన్యం పేర్కొంది. -
‘టిప్’ ఇవ్వడం మంచిదా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: టిఫిన్ చేయడానికో, భోజనం చేయడానికో, సాయం సంధ్య వేళల్లో అలా అహ్లాదంగా కుటుంబ సభ్యులతో కలసి కాఫీలు, టీలు తాగడానికి హోటళ్లకు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు లేదా సరదాగా స్నేహితులతో కలసి బీరు తాగేందుకు బార్‌కు వెళ్లినప్పుడు అక్కడి సర్వర్లకు ఎంతో కొంత టిప్ చెల్లించడం మనకు అలవాటే. టిప్పులెంత అనేది వినియోగదారుల మనస్తత్వం, వారి జేబు బరువునుబట్టి ఉంటుంది. అంటే, కొంత మంది డబ్బున్న వాళ్లు డాంబికం కోసం టిప్ ఎక్కువగా ఇవ్వొచ్చు. కొంత మంది ఎంత డబ్బున్నాసరే తక్కువ టిప్‌తో సరిపెట్టవచ్చు. కొంత మంది అంతంత మాత్రమే డబ్బున్నా ఉదారంగా ఎక్కువ టిప్ ఇవ్వొచ్చు. మరికొందరు పక్కనే ఉన్న గర్ల్ ఫ్రెండ్ లేదా స్నేహితుల మెప్పు కోసం టిప్ ఎక్కువగా ఇవ్వొచ్చు. అసలు ఈ టిప్‌లు అంటే ఏమిటీ? ఈ సంస్కతి ఎక్కడ పుట్టింది? ఎందుకోసం పుట్టింది? దీని వల్ల లాభాలున్నాయా, నష్టాలున్నాయా? అన్న అంశాలపై మరోసారి ఇప్పుడు చర్చ మొదలైంది. టిప్ అంటే ‘టు ఇన్సూర్ ప్రామ్టిట్యూడ్’ అని చెబుతారు. అంటే సకాలంలో లేదా తక్షణమే ఆర్డర్ చేసినది అందించడానికని అర్థం. ఇప్పుడు పబ్స్‌గా వ్యవహరిస్తున్న ఒకప్పటి ఇంగ్లీషు హౌసెస్‌లో ఈ టిప్ సంస్కతి పుట్టిందట. సకాలంలో మంచి సర్వీసు అందించడం కోసం సర్వర్లకు టిప్ లివ్వడం మొదలైంది వాటిలోనే. అనతి కాలంలోనే ఈ సంస్కతి యూరప్ అంతటా వ్యాపించింది. 20వ శతాబ్దంలో ఉత్తర అమెరికాకు పాకింది. అక్కడి నుంచి వివిధ దేశాలకు విస్తరించింది. మనం ఇచ్చే టిప్‌లకు సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం ఉందా? ఉంటే ఎక్కువ టిప్ ఇచ్చిన వారికి ఎక్కువ సర్వీసు, తక్కువ టిప్ ఇచ్చిన వారికి తక్కువ సర్వీసు ఉంటుందా? ఇచ్చిన టిప్‌కు, చేసే సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం లేదని, అయితే సర్వర్ ఆశించే టిప్‌కు, చేసే సర్వీసుకు ప్రత్యక్ష సంబంధం ఉందని ఓ సర్వేలో తేలింది. ఓ కస్టమర్ ఎక్కువ టిప్ ఇస్తాడని ఆశించిన సర్వర్ ఆయనకు మంచి సర్వీసు అందించవచ్చు. ఆ..బేవార్స్ బ్యాచీ! టిప్ పెద్దగా ఇవ్వరని సర్వర్ భావిస్తే వారికి మంచి సర్వీసు అందించక పోవచ్చు. ధరించిన దుస్తులు, ముఖ కవలికలనుబట్టి ఎవరు ఎక్కువ ఇస్తారో, తక్కువ ఇస్తారో సర్వర్లు ఊహించవచ్చు. అప్పుడప్పుడు వారి ఊహలు తారుమారు కావచ్చు. ఇక్కడ మంచి సర్వీసంటే వేగంగా సర్వ్ చేయడమే కాకుండా, కస్టమర్లకు నచ్చిన చట్నీలనో, కూరలనో అడక్కముందే అందించడం, ఉన్నంతలో వారి అభిరుచులకు తగ్గట్టుగా ఆహార పదార్థాలను వేడి వేడిగా సర్వ్ చేయడం. తరచుగా వచ్చే కస్టమర్లు ఎక్కువ టిప్ ఇస్తారంటే మంచి సర్వీసు, ఇవ్వరనుకుంటే సర్వర్లు నింపాది సర్వీసు ఇవ్వొచ్చు. వాస్తవానికి ఈ టిప్‌ల వల్ల సర్వీసు దెబ్బతింటుందని, ఓ సర్వర్‌కు టిప్ వందొస్తే చాలనుకుంటే ఆ సర్వర్ వంద చేతిలో పడగానే పనిచేసే చోటు నుంచి వెళ్లిపోతాడని, దాని వల్ల సర్వీసుకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పిన వాళ్లు ఉన్నారు. సర్వర్లకు టిప్‌లు ఇవ్వడం వల్ల వారి యజమానులు వారి జీతాలను పెంచడం లేదని, అందుకని వినియోగదారులు టిప్‌లు ఇవ్వడం మానేస్తే యజమానులు చచ్చినట్లు సర్వర్ల జీతాలు పెంచుతారనే బలమైన వాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వాస్తవానికి ఈ వాదనను కూడా తప్పని తేల్చిన వారు ఉన్నారు. వినయోగదారుల నుంచి టిప్‌లు తగ్గిపోయాయన్న విషయాన్ని పరిగణలోకి తీసుకొని యజమానులు సర్వర్లకు జీతాలు పెంచాలని ఆలోచించరట. మార్కెట్లో సర్వర్లు ఎంతకు దొరుకుతున్నారనే అంశంపైనే ఆధారపడి ఉంటుందట వారి జీతభత్యాలు. ఇంకా టిప్‌లు రాకపోతే సర్వర్ ఉద్యోగం బాగాలేదని, మరో ఉద్యోగానికి సర్వర్లు వెళతారట. అలా సర్వర్ల కొరత ఏర్పడితే తప్పించి యజమానులు వారికి ఎక్కువ జీతాలు ఇవ్వడానికి ఇష్టపడరట! పైగా టిప్‌ల సంస్కతి వల్ల తినుబండారాల ధరలు స్థిరంగా ఉంటున్నాయనే వాదన కూడా ఉంది. సర్వర్ల జీతాలను వినియోగదారులు టిప్‌ల రూపంలో షేర్ చేసుకోవడం వల్లన యజమానులు తినుబండారాల ధరలను పెంచడం లేదట. సర్వర్లకు ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తే యజమానలు కచ్చితంగా తినుబండారాల ధరలను పెంచుతారనే విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో టిప్‌ల సంస్కతికి తిలోదకాలివ్వాలా, లేదా ? అన్న అంశంపై ‘టొరాంటో స్టార్ రీడర్స్’ ఇటీవల ఓ సర్వే నిర్వహించగా 85 శాతం మంది వీటికి గుడ్‌బై చెప్పాలని తేల్చారు. ఎలా గుడ్‌బై చెప్పాలి? వినియోగదారుల్లో చైతన్యం తీసుకరావాలా? యజమానుల వైఖరిలో మార్పు రావాలా? ఇరువురి వైఖరిలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే మార్పు సాధ్యమని, అదికూడా అంత సులువుకాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పాశ్చాత్య దేశాలతోపాటు, భారత్‌లో కూడా కొన్ని హోటళ్లు సర్వర్లకు టిప్‌లు ఇవ్వొద్దని, తామే బిల్లులో టిప్ వేసి సర్వర్లకు ఇస్తామని ముందుకు వచ్చాయి. కొన్ని హోటళ్లు టిప్‌ల స్థానంలో సర్వీసు చార్జీలను తీసుకొచ్చాయి. అయితే ఆ పద్ధతులు సక్కెస్ అయిన దాఖలాలు లేవు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫైల్ రెస్టారెంట్ గ్రూపైన ‘డాని మేయర్స్ యూనియన్ స్క్వేర్ హాస్పిటాలిటీ గ్రూప్’ టిప్‌లను నిర్ద్వంద్వంగా రద్దు చేసింది. సత్ఫలితాలు కాకుండా మిశ్రమ ఫలితాలు వచ్చాయని ఆ గ్రూప్ తెలియజేసింది. -
నిగనిగలాడే కురుల కోసం
బ్యూటిప్స్ సౌందర్య పోషణలో అతివల జుట్టుకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నామో మన జుట్టుని చూసి చెప్పవచ్చు. ఒత్తయిన నిగనిగలాడే జుట్టు ఆరోగ్యానికి సంకేతం. వాతావరణ కాలుష్యం వల్ల, సరైన పోషణ లేక జుట్టు పొడిబారిపోయి రాలుతుంది. ఈ చిట్కాలతో దీన్ని అరికట్టి మెరిసే జుట్టు మీ సొంతం చేసుకోండి ఇలా... ఒక టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీస్పూన్ నిమ్మరసం కలిపిన మిశ్రమంలో కోడిగుడ్డులోని తెల్లసొనని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి కుదుళ్ల నుండి పట్టించాలి. 20 నిమిషాల తరవాత తల స్నానం చెయ్యాలి. ఒక కప్పు కొబ్బరినూనె, ఒక కప్పు ఆవాల నూనె కలపాలి. ఈ మిశ్రమంలో ఒక కప్పు కరివేపాకుల్ని వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో పోసి చిన్న మంట పై వేడి చేయాలి. కరివేపాకు కాస్త వేగగానే నూనె మిశ్రమంలోంచి తీసేయాలి. ఆ తరువాత దింపేసి మూడు కర్పూరం బిళ్లలు వేయాలి. చల్లారిన తరువాత నూనె మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి జుట్టుకంతా పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు తలస్నానం చేయా లి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్లు పెరుగు, అర కప్పు నిమ్మరసం తీసుకుని హెన్నా పౌడర్‌లో వేసి కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీటిని కలుపుకోవచ్చు. తయారయిన పేస్ట్‌ని మాడుకు, కేశాలకు పట్టించి అరగంటపాటు ఉంచుకోవాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.