మంచినీళ్లు ఇచ్చినందుకే రూ.7 లక్షలా!! | Waitress Received Huge Amount As Tip After Serving Water | Sakshi
Sakshi News home page

మంచినీళ్లు ఇచ్చినందుకే రూ.7 లక్షలా!!

Published Tue, Oct 23 2018 11:04 AM | Last Updated on Tue, Oct 23 2018 2:36 PM

Waitress Received Huge Amount As Tip After Serving Water - Sakshi

హోటల్‌కి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించడం.. వారి నుంచి ఆర్డర్‌ తీసుకోవడం... తర్వాత బిల్‌ ఇవ్వడం.. తమ సేవలను మెచ్చి టిప్‌ ఇస్తే తీసుకోవడం.. ఇవీ సాధారణంగా హోటల్‌ బేరర్‌ల పనులు. నార్త్‌ కరోలినాకు చెందిన అలియానా కస్టర్‌ కూడా ఇవే పనులు చేసింది. అయితే బిల్‌తో పాటు తనకు వచ్చిన టిప్‌ చూసి షాకవ్వడం ఆమె వంతైంది. ఎందుకంటే.. ఆమెకు టిప్‌గా లభించింది పదో పరకో కాదు ఏకంగా 10 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 7 లక్షల 38 వేల రూపాయలు.

ఇంతకీ అంత విశాలమైన హృదయం ఉన్న ఆ కస్టమర్‌కి అలియానా సర్వ్‌ చేసింది కేవలం రెండు గ్లాసుల మంచినీళ్లే. అవును కేవలం మంచినీళ్లు తాగి హోటల్‌ను వీడిన ఆ కస్టమర్‌.. ‘రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు’  అంటూ ఓ పేపర్‌పై రాసి అలియానాను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు మళ్లీ కాసేపటి తర్వాత తన సిబ్బందితో సహా తిరిగి వచ్చి అలియాకు ఓ హగ్‌ కూడా ఇచ్చి వెళ్లాడు.

తనకు ఇన్ని స్వీట్‌ షాకులిచ్చిన ఆ కస్టమర్‌ యూట్యూబ్‌ స్టార్‌ మిస్టర్‌ బీస్ట్‌ అని తెలుసుకున్న అలియానా ఆనందంతో ఎగిరి గంతేసింది. సుమారు 8.9 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్న బీస్ట్‌, అలియానా భావోద్వేగాలను కూడా తన కెమెరాలో బంధించి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. దీంతో.. తన జీవితంలో ఇదో మరపురాని సంఘటన అంటూ మురిసిపోయింది అలియానా. ఇక బీస్ట్‌ ఇచ్చిన టిప్‌తో తనతో పాటు పనిచేసే, ఆర్థిక ఇబ్బంది వల్ల చదువు ఆపేసిన విద్యార్థులకు తన వంతు సాయం చేస్తానంటూ పెద్ద మనసు చాటుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement