waiter
-
బిల్లు కట్టమన్నందుకు.. వెయిటర్‌ను కారులో ఈడ్చుకెళ్లిన కస్టమర్లు
ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా తిన్న ఆహారానికి బిల్లు తప్పక చెల్లించాల్సిందే. ఇంకా అదనంగా చాలామంది ఫుడ్ సర్వ్ చేసినందుకు వెయిటర్లకు టిప్ కూడా ఇస్తుంటారు. కానీ ఓ చోట హోటల్లో ఫుల్‌గా తిని.. బిల్లు చెల్లించకుండా పరారరయ్యారు కొంతమంది. డబ్బులు కట్టమని అడిగేందుకు వెయిటర్ వారి వెంట కారు వద్దకు పరుగెత్తుకెళ్లగా.. అతన్ని కారులో కిలోమీటర్ వరకులాక్కెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బీడ్ జిల్లాలోని మెహకర్-పంధర్పూర్ పాల్ఖి రహదారిపై రోడ్డు పక్కన ఉన్న హోటల్లో శనివారం ముగ్గురు వ్యక్తులు భోజనం చేసేందుకు వచ్చాడు. హోటల్ బయట కారు పార్క్ చేసి భోజనం చేశారు. మొత్తం తిన్న తర్వాత ముగ్గురు వ్యక్తులు బిల్లు కట్టకుండానే కారు వద్దకు తిరిగి వచ్చారు. ఆన్లైన్ పేమెంట్ చేసేందుకు క్యూర్ కోడ్ స్కానర్‌ను తీసుకురావాలని వెయిటర్‌ను కోరారు.చదవండి: స్కూటర్ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడువెయిటర్ స్కానర్ తీసుకొచ్చే క్రమంలో ముగ్గురు తమలో తాము గొడవపడుతున్నట్లు నటింది. కారులోకి ఎక్కి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో వెయిటర్ కారు డోర్ తెరిచాడు. ఇంతలోనే దుండగులు కారును రివర్స్ తీసి వెయిటర్ డోర్‌కు వేలాడుతూనే అతడిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లాడు. ఇంతలో మరో హోటల్ సిబ్బంది కారును వెంబడించాడు. కానీ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అనంతరం కారును ఎవరూ లేని ప్రదేశంలో ఆపి.. వెయిటర్‌ను కొట్టి అతని జేబులోని రూ. 11,500ను లాక్కున్నారు. అతని కళ్లకు గంతలు కట్టి రాత్రి అంతా బందించి ఉంచారు మరుసటి రోజు ఉదయం అతన్ని విడిచిపెట్టారు. ఇక దీనిపై హోటల్ యాజమాన్యం దిండ్రూడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.#Maharashtra: बीड में एक #Waiter खाने के बाद #Scanner लेकर #Car के पास आया और #Bill देकर पैसे की मांग की, लेकिन बिल का भुगतान करने की बजाय कार सवार उसे पकडकर एक किलोमीटर तक घसीटता ले गए. वेटर को पूरी रात बंधक बनाकर रखा और पिटाई भी की.#Maharashtracrime #maharashtranews pic.twitter.com/CF6wqnOC5S— Delhi Uptodate News (@DelhiUptodate) September 11, 2024 -
మాంసాహారం వడ్డన.. వందేభారత్ రైలులో వెయిటర్‌పై దాడి
కలకత్తా: వందేభారత్ రైల్లో ఇటీవల అనుకోని ఘటన జరిగింది. భోజనం అందించిన వెయిటర్‌పై ఓ ప్రయాణికుడు దాడికి దిగాడు. కొద్ది రోజుల క్రితం ఓ వృద్ధుడు పశ్చిమ బెంగాల్‌లోని హవ్డా నుంచి రాంచీకి వందేభారత్ రైలులో ప్రయాణించాడు. భోజనం కోసం థాలీ ఆర్డర్ చేశాడు. అయితే ఒక వెయిటర్ పొరబాటున మాంసాహారం వడ్డించారు. ఆ వృద్ధ ప్రయాణికుడు కొద్దిసేపటికి అది నాన్-వెజ్ భోజనం అని గుర్తించాడు. Kalesh b/w a Passenger and Waiter inside Vande Bharat over A person slapped a waiter for mistakenly serving him non-vegetarian foodpic.twitter.com/Oh2StEthyX— Ghar Ke Kalesh (@gharkekalesh) July 29, 2024 శాకాహారి అయిన తనకు మాంసాహారాన్ని వడ్డించాడన్న ఆగ్రహంతో వెయిటర్‌పై దాడికి దిగాడు. ఎంతమంది అడ్డుకున్నా ఆగకుండా వెయిటర్‌పై చేయి చేసుకున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ప్రయాణికుడి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఈ ఘటనపై తూర్పు రైల్వే స్పందించింది. ‘అవును, పొరబాటు జరిగింది. అంగీకరిస్తున్నాం. సమస్యను పరిష్కరించాం’అని క్లారిటీ ఇచ్చింది. -
స్ట్రీట్ కేఫ్‌లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా
రోబోలను పలు రంగాల్లో తీసుకొచ్చి పనిచేయించడాన్ని చూశాం. వాటిని మాల్స్, ఆస్పత్రి, పోలీస్, తదితర శాఖల్లో ప్రవేశ పెట్టి చూపించారు. అలాగే ఇటీవల బెంగుళూరు, నోయిడా, చెన్నె కోయింబత్తూర్ రోబోట్ నేఫథ్య రెస్టారెంట్లను ప్రారంభించి కస్టమర్లను ఆకర్షించింది. పైగా ఇవి అత్యంత ప్రజాధరణ పొందాయి కూడా. ఇప్పుడూ ఏకంగా స్ట్రీట్ కేఫ్ సెంటర్ల్లోకి కూడా ఆ సాంకేతికత వచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో అహ్మదాబాద్‌లోని స్ట్రీట్ కేఫ్ పాప్ అప్ ట్రక్ వినియోగదారులకు రోబోట్ వెయిటర్ ఐస్ గోలాను సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు రుచిగల ఐస్ గోలాలను చక్కగా సర్వ్ చేస్తుంది. ఈ రోబో పేరు ఐషా, ధర రూ. 1,35,000/-. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ బ్లాగర్ కార్తీక్ మహేశ్వరి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణను చూసి నెటిజన్లు వాహ్! అంటూ ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు. కాగా, నిజం చెప్పాలంటే ఈ రోబోటిక్ సాంకేతికతపై మహమ్మారి సమయంలో చైనా ఎక్కువగా ఆధారపడింది. అఖరికి భద్రతా ప్రోటోకాల్‌లను నిర్వహించడానికి కూడా రోబోట్లతోనే మోహరించింది. View this post on Instagram A post shared by Kartik Maheshwari (@real_shutterup) (చదవండి: ఆస్కార్ వేడుకల్లో హైలెట్‌గా మెస్సీ డాగ్! ఏం చేసిందంటే..!) -
చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్‌గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!
బొమన్ ఇరానీ తెలుగువారికి సైతం పరిచయం అక్కర్లేని పేరు. పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ అత్తారింటికి దారేదీ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. 2003లో డర్నా మనా హై చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన బొమన్ ఇరానీ.. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కించిన మున్నా భాయ్ ఎంబీబీఎస్ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2009లో విడుదలైన 3 ఇడియట్స్ సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళంలో చాలా చిత్రాల్లో నటించారు. టాలీవుడ్లో అత్తారింటికీ దారేదీ మూవీతో ఫేమస్ అయ్యారు. అయితే సినీ ఇండస్ట్రీలోకి రాకముందు ఆయన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ మూవీ డంకీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాల్లోకి రాకముందు ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ వివరాలేంటో చుద్దాం. మధ్య తరగతి పార్సీ కుటుంబంలో జన్మించిన బోమన్ ఆరు నెలల వయస్సులోపే తండ్రిని కోల్పోయాడు. ముంబయిలో పుట్టిన పెరిగిన బొమన్ ఇరానీ.. ఆయన కుటుంబం కోసం చిన్న చిన్న పనులు కూడా చేశారు. బాలీవుడ్‌లోకి రాకముందు బొమన్ ఇరానీ తాజ్ మహల్ హోటల్లో వెయిటర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఆయన తల్లికి చిన్నపాటి చిరుతిళ్ల దుకాణం ఉండేది. అందులోనూ బొమన్ ఇరానీ పనిచేస్తూ తన తల్లికి అండగా నిలిచారు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్‌గా కూడా పనిచేసినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతే కాకుండా తాను డైస్లెక్సియా అనే వ్యాధితో పోరాడినట్లు తెలిపారు. (ఇది చదవండి: 'నా ఇష్టం.. నేను అలాంటి సినిమాలే చేస్తా': నెటిజన్స్‌కు ఇచ్చిపడేసిన ఏక్తా కపూర్) వెయిటర్‌గా.. బోమన్ ఇరానీ మాట్లాడుతూ..' నాకు చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. పదో తరగతి పాసయ్యాక వెయిటర్ కోర్సు చేశాను. వెయిటర్‌గా 6 నెలల కోర్సులో చేరా. వెయిటర్ ఉద్యోగం కోసం తాజ్ మహల్ హోటల్‌కు వెళ్లా. ఆ తర్వాత హోటల్లో ఆరు నెలల పాటు రూమ్ సర్వీస్‌లో పనిచేసి.. ఏడాదిన్నర తర్వాత వెయిటర్‌గా మారానని' తెలిపారు. తల్లి కోసం తన ఉద్యోగాన్ని వదిలి.. బోమన్ తల్లి ప్రమాదానికి గురికావడంతో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి తమ దుకాణాన్ని నడపాలని నిర్ణయించుకున్నాడు. అలా 14 ఏళ్లపాటు బోమన్ దుకాణాన్ని నడిపాడు. అదే సమయంలో వివాహం చేసుకున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. కానీ జీవితంలో ఏదో కోల్పోయినట్లు ఉండేదని..తాను అనుకున్న లక్ష్యం కోసం శ్రమించాడు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) ఫోటోగ్రాఫర్ నుంచి నటుడిగా.. బోమన్‌కు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అతని తండ్రి కూడా ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. దీంతో బోమన్ ఫోటోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. చాలా రోజుల తర్వాత బోమన్ సక్సెస్స అయ్యారు. ఆ సమయంలో ఒక స్నేహితుడు అతన్ని యాడ్‌లో నటించమని అడిగాడు. దీంతో అప్పటి నుండి అతను దాదాపు 180కి పైగా యాడ్స్‌లో కనిపించారు. ఆ తర్వాత ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించడానికి కూడా ఆఫర్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశాన్ని నిర్మాత విధు వినోద్ చోప్రా చూశారు. ఇరానీ నటనను చూసి ఆయనకు మున్నా భాయ్ ఎంబీబీఎస్‌లో అవకాశమిచ్చారు. అలా ఆయన తన సినీ ప్రయాణం ప్రారంభించారు. ఈ మూవీ కోసం బోమన్ ఇరానికి రూ.2 లక్షలు ఆఫర్ చేశారు. ఆ తర్వాత బొమన్ ఇరానీ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ దృష్టిలో పడ్డారు. అందివచ్చిన అవకాశంతో బాలీవుడ్లో నో ఎంట్రీ, ఖోస్లా కా ఘోస్లా, డాన్, లగే రహో మున్నా భాయ్, 3 ఇడియట్స్, హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్, జాలీ ఎల్ఎల్బీ,ఉంచాయ్ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో డుంకీ చిత్రంలో కనిపించనున్నారు. తెలుగులోనూ అత్తారింటికీ దారేది, బెంగాల్ టైగర్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అజ్ఞాతవాసి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. -
వెయిటర్‌గా మారిన 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోని
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని ఇటీవలె బిచ్చగాడు-2 సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ సక్సెస్ అయిన బిచ్చగాడు మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వం వహించడమే కాకుండా హీరోగా నటించారు. కావ్య థాపర్ ఇందులో హీరోయిన్గా నటించింది. మే 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా విజయ్ ఆంటోనీ వెయిటర్‌గా మారారు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు విచ్చేసి వెయిటర్‌గా సర్వ్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
Das Ka Dhamki : ‘దాస్ కా ధమ్కీ’ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వెయిటర్‌గా మారిన విశ్వక్ సేన్.. అసలు కారణం ఇదే!
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ 'దాస్ కా ధమ్కీ' సినిమాతో సినీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. నివేదా పేతురాజు ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఇప్పటికే విశ్వక్ సేన్ ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. అందులో భాగంగా కొత్త అవతారంలో కనిపించిన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. వెయిటర్‌గా మారిన విశ్వక్ సేన్ విశ్వక్ సేన్ ఉన్నట్టుండి ఒక్కసారిగా హోటల్లో వెయిటర్ అవతారమెత్తాడు. ఇదేంటీ అనుకుంటున్నారా? అవునండి మీరు విన్నది నిజమే? ఎందుకంటే ఉగాదికి రిలీజవుతున్న దాస్ కా ధమ్కీ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ హోటల్‌కెళ్లి వెయిటర్ పాత్ర పోషించారు. కస్టమర్లను అడిగి ఆర్డర్లు తీసుకుని సర్వ్ చేశారు. ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ పెట్టుకుని కస్టమర్లకు సర్వ్ చేశారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు కారణం ఇదే విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీ చిత్రంలో వెయిటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఏకంగా వెయిటర్ అవతారమెత్తి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు. సాధారణ వెయిటర్‌గా హోటల్‌కు వచ్చిన వారికి వడ్డించారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకున్న కస్టమర్లు విశ్వక్సేన్తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. చాలామంది గుర్తు పట్టలేకపోయామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏకంగా హీరో వచ్చి సర్వ్ చేయడం చాలా సర్ప్రైజ్గా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. దాస్ కా ధమ్కీ మూవీ ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్లలో సందడి చేయనుంది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో రావు రమేశ్, పృథ్విరాజ్, హైపర్ ఆది ప్రధాన పాత్రలు పోషించారు. లియోన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. -
వెయిటర్ నిర్వాకం.. టిప్పు ఇవ్వలేదని యువకులపై దాడి
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లో ఒక వెయిటర్ కస్టమర్ల పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. టిప్పు ఇవ్వలేదన్న కోపంతో యువకులపై దాడికి తెగబడ్డాడు. శంషాబాద్ పరిధినిలోని ఎయిర్పోర్ట్ బావర్చీ హోటల్లో స్థానికంగా కొంత మంది యువకులు నిన్న(మంగళవారం) రాత్రి బిర్యానీ తినడానికి వచ్చారు. ఆ తర్వాత.. యువకులు బిల్లు చెల్లించి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో.. వెయిటర్ టిప్పు చెల్లించరా.. అంటూ వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బందితో కలిసి యువకులపై దాడికి తెగబడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను సముదాయించి హోటల్ నుంచి పంపించి వేశారు. గతంలోను ఇదే హోటల్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు బావార్చి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యువకులు వెయిటర్‌పై స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెయిటర్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
వామ్మో!... రూ. 7 లక్షలు టిప్పా!!... షాక్‌కి గురైన వెయిటర్!
Waitress gets Rs 7 lakh in tips: సాధారణంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లకి వెళ్లితే టిప్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఎక్కువ మంది వంద రూపాయలలోపే టిప్పుగా ఇస్తారు. చాలా రేర్‌గా ఎవరో కొందరు మాత్రమే వేలు టిప్పుగా ఇస్తారు. కానీ ఇక్కడొక వెయిటర్‌కి లక్షల్లో టిప్పు లభించింది. (చదవండి: గ్రహాంతరవాసులను చూసేందుకు వెళ్తున్నా.. విమానాన్ని హైజాక్ చేస్తున్నా!) అసలు విషయంలోకెళ్లితే..విలయమ్స్ అనే మహిళ ఒక రోజు రెస్టారెంట్‌కి వెళ్లుతుంది. అయితే ఆ రెస్టారెంట్లో పనిచేసే జాజ్మిన్ కాస్టిల్లో అనే మహిళా వెయిటర్ విలయమ్స్కి ఆహారం సర్వ్ చేస్తుంది. అయితే విలియమ్స్‌కి సదరు వెయిటర్ పనితీరు నచ్చి ఆమె తను తిన్నదానికి 30 డాలర్లు(రూ. 2,271), ఆమెకు $40 డాలర్లు(3,082)లు టిప్పు ఇస్తుంది. అంతే వెయిటర్ కాస్టిల్లో సదరు కస్టమర్ ఉదారతకు ఉప్పొంగిపోతుంది. అంతేకాదు కాస్టిల్లో ఆమె రోజు ఇక్కడకు వచ్చి పనిచేయడం వల్ల తన కూతుర్ని డే కేర్‌లో పెట్టాల్సి వస్తుందని, పైగా తాను ఉద్యోగం మానేయలనకుంటున్నట్లు కూడా చెబుతుంది. ఈ మేరకు విలయమ్స్ సదురు వెయిటర్‌కి సాయం చేసి అక్కడితో వదిలేయదు. అంతేకాదు ఆ వెయిటర్ పేరు మీద క్యాష్ యాప్‌ని ఓపెన్ చేస్తుంది. అంతేకాదు సదరు వెయిటర్ గురించి ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఎవరికి వీలైనంత వారు సాయం చేయండి అంటూ కోరుతుంది. అయితే ఈ విషయాలు ఏమీ సదరు వెయిటర్‌కి తెలియవు. అయితే సదరు వెయిటర్‌కి అదేపనిగా డబ్లులు అకౌంట్లో పడినట్లుగా వస్తుంటుంది. ఆ వెయిటర్ తనకు క్యాష్ యాప్‌లాంటి వాటిల్లో తాను రిజస్టర్ చేసుకోలేదు కదా అనుకుంటుంది. ఈ మేరకు అలా మెసేజ్‌లు రావడం మాత్రం ఆగదు. దీంతో ఆమె ఒక్కసారిగా అనుమానంతో చెక్చేస్తుంది. అంతే ఆమె అకౌంట్లో అపరిచితుల నుంచి దాదాపు రూ. 7లక్షలు టిప్పు వస్తుంది. అంతే వెయిటర్ జాజ్మిన్ కాస్టిల్లో ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. తనకు డబ్బులు పంపిన వారందరికి కృతజ్ఞతలు తెలపడమే కాక తనకు ఇంత మంచి సాయం చేసిన సదరు కస్టమర్ విలయమ్స్కి చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతుంది. (చదవండి: క్రిస్మస్ చెట్టుని అలకరించాలనుకుంటున్నారా!.... తస్మాత్ జాగ్రత్తా!!) -
ఎఫ్బీ పోస్ట్; టిప్‌గా 32 వేల డాలర్లు!
కాలిఫోర్నియా : కరోనా వైరస్ వ్యాప్తితో మాస్కు ధరించడం అనివార్యంగా మారింది. బయటకు వెళ్లాలంటే తప్పని సరిగా మాస్క్ ఉండాల్సిందే. కొన్ని చోట్ల మాస్కు ధరించకుండా బహిరంగా ప్రదేశాలకు వచ్చే వారిపై జరిమాన సైతం విధిస్తున్నారు. ఈక్రమంలో ఓ రెస్టారెంట్‌కు మాస్కు ధరించకుండా వెళ్లిన మహిళకు వెయిటర్ సర్వ్ చేయని ఘటన కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో చోటుచేసుకుంది. అంతేగాక అతను చేసిన పని తనకు 32,000 డాలర్లను టిప్‌గా తెచ్చిపెట్టింది. వివరాలు.. అండర్ లిన్ గిల్లెస్ అనే మహిళ ఇటీవల స్టార్‌బక్స్ రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ ఫుడ్ ఆర్డర్ చేయగా, సదరు మహిళ ముఖానికి మాస్క్ ధరించనందున రెస్టారెంట్లో వెయిటర్‌గా పనిచేస్తున్న లెనిన్ గుటిరెజ్ అనే వ్యక్తి ఆమెకు సర్వ్ చేసేందుకు నిరాకరించాడు. ఆమె ఎంత చెప్పినా వినకుండా మాస్క్ ఉంటేనే సర్వ్ చేయాలని, లేకుంటే చేయొద్దని తమకు ఆదేశాలు ఉన్నాయని వెయిటర్ మొండి స్పష్టం చేశాడు. (భారత ఐటీపై హెచ్1బీ వీసాల రద్దు ప్రభావం?) దీంతో వెయిటర్‌పై కోపంతో ‘మాస్క్ వేసుకోనందుకు కాఫీ తీసుకు రాలేదు’ అంటూ మహిళ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుపై లక్ష మందిపైగా కామెంట్ చేయగా, 50 వేల మంది షేర్ చేశారు. వీరిలో అనేకమంది నెటిజన్లు గిల్లెస్కు వ్యతిరేకంగా స్పందించారు. వెయిటర్ తన పని తాను నిర్వహించాడని లెనిన్‌ను ప్రశంసించారు. అంతేకాదు 32 వేల డాలర్లను అతడికి టిప్‌గా ఇచ్చారు. కాగా మే 1 నుంచి శాన్‌డియాగో ప్రజలు తప్పని సరి మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు, పార్కులు, షాపింగ్, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్కు ఉండాలని ఆదేశించింది. (చీటీల పేరుతో రూ. 2 కోట్ల టోకరా! ) ఇదిలా ఉండగా గిల్లెస్ పోస్టును చూసిన మాట్ కోవిన్ అనే ఓ వ్యక్తి లెనిన్‌కు ఎదైనా సాయం చేయేఆలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఆ పోస్టును ట్యాగ్ చేస్తూ ‘లెనిన్ స్టాండింగ్ అప్ టు ఏ శాన్ డియాగో కరెన్’ పేరుతో డొనేషన్పేజిని ఏర్పాటు చేసి ఫండ్ రైజింగ్ చేసి ఆ మెత్తాన్ని టిప్ రూపంలో లెనిన్‌కు ఇవ్వాలని అనుకున్నాడు. జూన్ 22న మొదటు పెట్టిన ఈ ఫండింగ్ ద్వారా శుక్రవారం సాయంత్రం వరకు 32 వేల డాలర్లు వసూలు చేశాడు. ఈ మెత్తాన్ని కోవిన్ లెనిన్‌కు అందించాడు. దీనిపై లెనిన్ మాట్లాడుతూ.. ఫండ్ అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తమకు అందిన టిప్‌తో ఏం చేయాలో ఓ ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని ఈ డబ్బుతో డ్యాన్స్ స్కూల్ పెట్టి ఇతరులకు డ్యాన్స్ నేర్పిస్తానని వెల్లడించారు. (‘అలా చేస్తే.. చైనా ఆక్రమణలు తొలగిస్తారా? ) -
వెయిటర్ టిప్ రూ.లక్షన్నర
ఇంటర్నెట్ చాలెంజ్ పుణ్యమా అని సొంతిల్లు లేని ఓ మహిళా వెయిటర్‌కు భారీ టిప్ చేతికొచ్చింది. ‘#2020టిప్చాలెంజ్’పేరిట నడుస్తున్న ఓ సవాల్లో భాగంగా అమెరికన్ గాయకుడు డానీ వాల్బెర్గ్.. అమెరికాలోని ఇల్లినాయిస్లోని ఓ హోటల్లో 2019 డిసెంబర్ 30న భోజనం చేసి 2020 డాలర్ల టిప్ ఇచ్చాడు. దీంతో ఆ మహిళా వెయిటర్ డానియెల్ ఫ్రాన్జోన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అందరూ వాల్బెర్గ్లా ఉండరని, అయినా కొందరు మంచిగానే టిప్ ఇచ్చారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. -
బిల్‌గేట్స్ టిప్ ఫొటో ఫేక్
న్యూఢిల్లీ: అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ జీవితం.. భావితరాలకు స్పూర్తిదాయకం అంటూ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఒకటి నకిలీదని తేలింది. అపర కుబేరుడు బిల్‌గేట్స్.. రెస్టారెంట్ వెయిటర్‌కు టిప్ ఇస్తూ.. తాను ఒక సాధారణ వుడ్‌కట్టర్ (వడ్రంగి) కుమారుడినని తెలుపుతూ ఫేస్బుక్లో చాలామంది ఫార్వర్డ్ చేస్తున్న ఈ ఫొటోలో ఏమాత్రం నిజం లేదని.. ప్రముఖ మీడియా దిగ్గజం ఇండియా టుడే చేసిన నిజ-నిర్ధారణలో తేలింది. బిల్‌గేట్స్ తండ్రి వుడ్‌కట్టర్ (కలపను నరికే వ్యక్తి) కాదని స్పష్టం చేసింది. బిల్‌గేట్స్ బ్లాగ్ 'గేట్స్ నోట్స్' వివరాల ప్రకారం ఆయన తండ్రి విలియం హెచ్. గేట్స్ II.. సీటెల్ నగరంలో ఒక న్యాయవాది అని, తల్లి మేరీ గేట్స్ స్కూల్ టీచర్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో ఇలా ఉంటుంది. బిల్‌గేట్స్ ఒక రెస్టారెంట్‌కు వెళ్లి.. అక్కడ తిన్న తర్వాత వెయిటర్‌కు టిప్ కింద 5 డాలర్లు ఇస్తాడు. అది చూసి నోరెళ్లబెట్టిన వెయిటర్‌ను బిల్.. ఏమయింది అని ప్రశ్నిస్తాడు. కొద్దిసేపటి క్రితం ఇదే టేబుల్‌పై మీ కూతురు వచ్చి.. 500 డాలర్లు టిప్ ఇచ్చిందని.. మీరు కేవలం 5 డాలర్లు ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యానని చెబుతాడు. అప్పుడు బిల్‌గేట్స్ నవ్వి.. ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి కుమార్తె అని, కానీ తాను ఒక సాధారణ కలప నరికే వ్యక్తి కుమారుడిని అని చెప్పుకొస్తాడు. చివరగా.. గతాన్ని ఎప్పటికీ మరువకూడదు.. ఇట్స్ యువర్ బెస్ట్ టీచర్ అంటూ వచ్చే సందేశం వస్తుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. బిల్ తండ్రి ఒక న్యాయవాది అని ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ తేల్చింది. -
రెస్టారెంట్ రసీదులో ‘భయపెట్టె పాప’
సాధారణంగా పిల్లలను, కుటుంబ సభ్యులను తీసుకొని రొటీన్‌కు భిన్నంగా ఏదైనా రెస్టారెంట్‌కు పసందైన భోజనం కోసం వెళ్లతారు. అలా రెండేళ్ల తన పాపను కింబర్లీస్జే అనే మహిళ న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చ్‌లోని కాఫీసుప్రీం రెస్టారెంట్‌కు వెళ్లింది. కానీ ఆమెకు ఊహించని విధంగా ఆ రెస్టారెంట్లో చేదు అనుభవం ఎదురైంది. వివరాలు.. రెస్టారెంట్లో పని చేసే సిబ్బంది సదరు మహిళలకు టేబుల్ నంబర్‌ను కేటాయింటే రసీదుపై కింబర్లీస్జే కూతురును ఉద్దేశిస్తూ ‘భయపెట్టే పాప’ అని టైప్ చేసి ఇచ్చారు. ఆ రసీదు చూసి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రెస్టారెంట్ సిబ్బంది తన కుమార్తె మీద ఉద్దేశపూర్వకంగా అలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండటమే కాకుండా రసీదు మీద రాయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ రసీదు ఫోటోను ఆమె తనఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసి.. క్రైస్ట్‌చర్చ్‌లోని కాఫీసుప్రీం రెస్టారెంట్ సిబ్బంది తన కూతురిని అగౌవరపరిచారని వాపోయారు. అదే విధంగా సదరు రెస్టారెంట్ యాజమాన్యం తమ సిబ్బందికి కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలనే విషయంలో సరైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ‘నా కూతురు ఎప్పుడూ ఎవరిని భయపెట్టలేదు. ఎలాంటి సమస్యలు కలిగించలేదు. ఈ రోజు రెస్టారెంట్‌కి వచ్చిన చాలా మంది నా కూతురిని చూసి చాలా క్యూట్‌గా ఉందని మురిసిపోయారు’ అని కింబర్లీస్జే వివరించారు. ఈ ఉద్దేశపూర్వక చర్యతో రెస్టారెంట్ యాజమాన్యం తరచూ వచ్చే కస్టమర్లను కోల్పోయిందని తెలిపారు. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో తమ సిబ్బంది చేసిన తప్పుకు చింతిస్తున్నామని పాప తల్లి కింబర్లీస్జేకి రెస్టారెంట్ యాజమాన్యం క్షమాపణలు తెలిపింది. -
మంచినీళ్లు ఇచ్చినందుకే రూ.7 లక్షలా!!
హోటల్‌కి వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించడం.. వారి నుంచి ఆర్డర్ తీసుకోవడం... తర్వాత బిల్ ఇవ్వడం.. తమ సేవలను మెచ్చి టిప్ ఇస్తే తీసుకోవడం.. ఇవీ సాధారణంగా హోటల్ బేరర్ల పనులు. నార్త్ కరోలినాకు చెందిన అలియానా కస్టర్ కూడా ఇవే పనులు చేసింది. అయితే బిల్‌తో పాటు తనకు వచ్చిన టిప్ చూసి షాకవ్వడం ఆమె వంతైంది. ఎందుకంటే.. ఆమెకు టిప్‌గా లభించింది పదో పరకో కాదు ఏకంగా 10 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు 7 లక్షల 38 వేల రూపాయలు. ఇంతకీ అంత విశాలమైన హృదయం ఉన్న ఆ కస్టమర్‌కి అలియానా సర్వ్ చేసింది కేవలం రెండు గ్లాసుల మంచినీళ్లే. అవును కేవలం మంచినీళ్లు తాగి హోటల్‌ను వీడిన ఆ కస్టమర్.. ‘రుచికరమైన నీళ్లు ఇచ్చినందుకు కృతఙ్ఞతలు’ అంటూ ఓ పేపర్‌పై రాసి అలియానాను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అంతేకాదు మళ్లీ కాసేపటి తర్వాత తన సిబ్బందితో సహా తిరిగి వచ్చి అలియాకు ఓ హగ్ కూడా ఇచ్చి వెళ్లాడు. తనకు ఇన్ని స్వీట్ షాకులిచ్చిన ఆ కస్టమర్ యూట్యూబ్ స్టార్ మిస్టర్ బీస్ట్ అని తెలుసుకున్న అలియానా ఆనందంతో ఎగిరి గంతేసింది. సుమారు 8.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్న బీస్ట్, అలియానా భావోద్వేగాలను కూడా తన కెమెరాలో బంధించి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు. దీంతో.. తన జీవితంలో ఇదో మరపురాని సంఘటన అంటూ మురిసిపోయింది అలియానా. ఇక బీస్ట్ ఇచ్చిన టిప్‌తో తనతో పాటు పనిచేసే, ఆర్థిక ఇబ్బంది వల్ల చదువు ఆపేసిన విద్యార్థులకు తన వంతు సాయం చేస్తానంటూ పెద్ద మనసు చాటుకుంది. -
టెర్రరిస్టుకు కూడా టిప్పు ఇవ్వాలా..!
టెక్సాస్ : హోటల్‌కి వచ్చిన వారికి సాదరంగా ఆహ్వానం పలకడం.. వారి నుంచి ఆర్డర్ తీసుకోవడం... భోజనం వడ్డించడం.. తర్వాత బిల్ ఇవ్వడం.. తాము చేసిన సేవలకు మెచ్చి టిప్ ఇస్తే తీసుకోవడం.. ఇవీ సాధారణంగా హోటల్ బేరర్ల పని. టెక్సాస్‌లోని ఓ రెస్టారెంట్‌కు చెందిన ఖలీల్ కేవిల్ అనే యువకుడు కూడా ఇదే పని చేశాడు. బిల్‌తో పాటు.. టిప్ కూడా తీసుకుందామని టేబుల్ దగ్గరికి చేరిన ఖలీల్‌కు ఊహించని షాకిచ్చాడు ఓ కస్టమర్. అసలు విషయమేమిటంటే.. ఖలీల్ పనిచేసే రెస్టారెంట్‌కి వచ్చిన ఓ కస్టమర్ 108 డాలర్ల బిల్ చెల్లించాడు. కానీ టిప్ ఇవ్వలేదు సరికదా.. ఖలీల్ పేరును బ్లాక్ ఇంక్‌తో రౌండప్ చేయడంతో పాటు... ‘మేము టెర్రరిస్టుకు టిప్ ఇవ్వము’ అంటూ రాశాడు. దీంతో కంగుతిన్న ఖలీల్.. తన పేరు చూసి ముస్లిం అనుకుని ఈవిధంగా రాసి ఉంటారని భావించాడు. విద్వేషం, జాతి వ్యతిరేక భావాలు గల వ్యక్తులు ఇలాగే స్పందిస్తారంటూ బిల్ స్లిప్ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఖలీల్ పోస్ట్‌ను షేర్ చేసిన నెటిజన్లు అతడికి మద్దతుగా నిలవడంతో పాటు కొంత డబ్బును కూడా పంపిస్తున్నారు. ఆయన పేరు మీదుగానే.. ఈ విషయమై స్థానిక మీడియాతో మాట్లాడిన ఖలీల్.. క్రిస్టియన్ అయిన తనకు ఖలీల్ అనే పేరు ఎలా వచ్చిందో తెలిపాడు. ‘మా నాన్న మిలిటరీలో పని చేశారు. ఆ సమయంలో ఆయనకు ఖలీల్ అనే వ్యక్తి పరిచయమయ్యారు. కాలక్రమంలో వారిద్దరి మధ్య స్నేహం ఎంతగానో బలపడింది. కానీ అకస్మాత్తుగా జరిగిన ఓ ఆక్సిడెంట్లో ఖలీల్ అంకుల్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్నేహానికి గుర్తుగా నా పేరుకు ముందు ఖలీల్ అని చేర్చారని’ తన పేరు వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఖలీల్.. ‘డబ్బే ప్రధానం కాదు. మనిషిని మనిషిలాగే చూడాలంటూ’ సదరు కస్టమర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. -
వెయిటర్ సలహాతోనే మెరుగుపడ్డా: సచిన్
న్యూఢిల్లీ:ప్రపంచ దిగ్గజ క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా క్రికెట్ ను శాసించిన సచిన్ ఎన్నో మైలురాళ్లను అందుకున్నాడు. తన క్రికెట్ ప్రస్థానంలో చిరస్మణీయమైన రికార్డులతో తనదైన ముద్ర వేశాడు. వంద అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఏకైక క్రికెటర్ గా సచిన్ గుర్తింపు పొందాడు. అయితే తన ఆట తీరు మెరుగుపడ్డానికి ఒక వెయిటర్ ఇచ్చిన సలహానే ప్రధాన కారణమని సచిన్ తాజాగా తెలిపాడు.. ' ఒకానొక సమయంలో చెన్నైలో నా వద్దకు వచ్చిన ఒక వెయిటర్ సలహా ఇచ్చాడు. నా ఎల్బో గార్డ్‌ను మార్చుకుంటే మీ బ్యాటింగ్ మెరుగుపడుతుందని అతను సూచించాడు. అతను చెప్పింది వంద శాతం నిజం. నేను తీసుకునే ఎల్బోగార్డ్ తో బ్యాటింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉండేది. ఆ విషయం నాకు చాలాసార్లు అనిపించింది కూడా.అయితే సదరు వెయిటర్ సలహా చెప్పిన పిదప నా ఎల్బోగార్డ్లో మార్పులు చేసుకున్నాను. ఆ సలహాతోనే నా బ్యాటింగ్ మరింత మెరుగపడింది'అని సచిన్ తెలిపాడు. మనకు ఎవ్వరూ సలహా చెప్పినా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నాడు. మంచి సలహా అనేది ఆ వ్యక్తి హోదాను బట్టి ఉండదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని సచిన్ పేర్కొన్నాడు. మన దేశంలో పాన్వాలా దగ్గర్నుంచి కంపెనీ సీఈవో వరకూ అంతా సలహాలు ఇస్తారని, వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలన్నాడు. -
నీటిగుంటలో పడి ఇద్దరు బాలుర మృతి
గంపలగూడెం మండలం వినగడప పంచాయతీ లంబాడీతండాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన రాజశేఖర్(14), తిరుపతి రావు(12) అనే ఇద్దరు బాలురు నీటి గుంటలో పడి మృతిచెందారు. ఒకరి రక్షించబోయి మరొకరు మృతిచెందినట్లు స్థానికులు చెబుతున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెయిటర్ స్థాయి నుంచి ఒలింపిక్స్ వరకూ..
న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన రియో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన పతకాలు రెండు. ఒకరు రజత పతక విజేత పీవీ సింధు అయితే, మరొకరు రెజ్లర్ సాక్షి మాలిక్. ఈ రెండు పతకాలు భారత పరువును నిలబెట్టగా, తృటిలో పతకాన్ని కోల్పోయిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా భారతీయుల మనసుల్ని గెలుచుకుంది. అయితే రియో రేస్ వాకింగ్‌లో ఆకట్టుకున్న భారత అథ్లెట్ మనీష్ సింగ్ రావత్ ప్రదర్శనను కూడా ఏమాత్రం తక్కువ అనలేం. రేస్ వాకింగ్ ఫైనల్లో భాగంగా 20 కిలో మీటర్ల వాకింగ్ ను ఒక గంటా 20 నిమిషాల 21 సెకెండ్లలో పూర్తి చేసి 13వ స్థానంలో నిలిచాడు. కాగా, ఇది కాంస్య పతకం సాధించే క్రమంలో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ నమోదు చేసిన సమయం కంటే నిమిషం తక్కువ. దీంతో పతకం సాధించాలనుకున్న మనీష్ ఆశలను ఆ నిమిషం మింగేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సాగర్ గ్రామానికి మనీష్ సింగ్ రావత్.. పేదరికంలోనే పుట్టాడు. దీనికి తోడు మనీష్ తండ్రి కూడా చిన్నతనంలోనే చనిపోవడంతో అతని కష్టాలకు అధికమయ్యాయి. దాంతో కుటుంబాన్ని పోషించడానికి వెయిటర్ అవతారం ఎత్తాడు. బద్రినాథ్‌లోని కృష్ణ హోటల్ వెయిటర్ గా తన జీవిత ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. అయితే అతని చిన్ననాటి కల మాత్రం రేస్ వాకర్‌గా సత్తాచాటాలనే. తన బలమైన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి తెల్లవారుజామునే నిద్రలేచి బద్రీనాథ్ రోడ్లపై ప్రాక్టీస్ చేసేవాడు. ఆ క్రమంలో అతని రేస్ వాక్‌ను చూసి రోడ్డుపై చాలా మంది నవ్వుకునే వారు. కానీ వాటిని ఏమీ లెక్క చేసేవాడు కాడు. వాకింగ్ చేయడంతో పాటు, వెయిటర్ గా డ్యూటీ చేయడమే తనకు తెలిసిన పనులు. అలా రేస్ వాక్ ను ప్రారంభించిన మనీష్ జాతీయ అథ్లెట్‌గా ఎదిగాడు. అనంతరం గతేడాది బీజింగ్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటుకుని రియోకు అర్హత సాధించాడు. ఒక వెయిటర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి రియో ఒలింపిక్స్ వరకూ వెళ్లిన మనీష్ జీవితం అందరికీ ఆదర్శమే కదా. -
50కిలోల గంజాయి స్వాధీనం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీసులు సోమవారం మధ్యాహ్నం 50 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు .. రాజశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
హన్సిక నడుంపై దిష్టి చుక్క
దిష్టి చుక్కను ఎవరైనా బుగ్గపై పెడతారు. మరేంటి హన్సిక నడుంపై దిష్టి చుక్క అంటున్నారనేగా మీ ఉచ్చుకత.ఆ ముచ్చటైన సంగతేమిటో చూద్దాం. సాధారణంగా అందమైన అమ్మాయిల్ని పాలరాతి బొమ్మగా వర్ణించడం చూస్తుంటాం. నటి హన్సిక మాత్రం ఇక్కడ తైలంతో తయారైన బొమ్మలా నిగ నిగలాడుతూ కాంతులీనుతుంది. అలాంటి అందం కంటి ముందు కదలాడితే దాన్ని సిల్వర్ స్క్రీన్‌పై మరింత వన్నెతో ఆవిష్కరించి ఊరు ఊరంతా మైమరచేలా చేయడమేగా దర్శకుడి నైపుణ్యం. ఆ పనే చేశారు దర్శకుడు ఏఆర్.రాజశేఖర్.ఈయన దర్శకత్వం వహించిన చిత్రం ఉయిరే ఉయిరే. ఇందులో నాయకి అందాల భరిణి హన్సిక. ఆమెకు జంటగా సీనియర్ నటి జయప్రద కొడుకు సిద్ధు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దీన్ని నటి జయప్రద నిర్మించడం విశేషం. ఈ చిత్రంలోని అందమైన ప్రేమ దృశ్యాన్ని దర్శకుడు ప్రేమజంట అంటే ఇలా ఉంటారా? అని యువతే ఈర్శ్యపడేలా చిత్రీకరించారు. అది ముంబై నుంచి చెన్నైకి వెళ్లే విమానం. మధ్యలో గోవాలో ఆగింది. అక్కడ మంచి వయసులో ఉన్న అందాల భామ హన్సికకు చార్మింగ్ కుర్రాడు సిద్ధుకు మధ్య పరిచయం స్నేహంగా మారి గమ్మత్తుగా ప్రేమ చిగురించింది. ఈ దృశ్యాలను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. ఆ ప్రేమ పక్షులు అనూహ్యంగా ఒక వివాహ వేడుకలో పాల్గొంటారు. అప్పటి వరకూ మోడ్రన్ దుస్తులే ధరించిన హన్సికను చీర ధరించమని సిద్ధు రిక్వెస్ట్ చేస్తాడు.ప్రియుడి కోరికను మన్నించిన హన్సిక చీరతో సింగారించుకుని వస్తుంది.అందులో ఆమె అందాన్ని హీరో సిద్ధునే కాదు అక్కడున్న వారంతా మైమరచిపోతారు. దీంతో తేరుకున్న సిద్ధు పరుగెత్తుకుంటూ వెళ్లి హన్సిక కంటికి వేసుకున్న కాటుకను దిష్టి చుక్కగా ఆమె నడుంపై పెడతాడు. బుగ్గపైన దిష్టి చుక్క పెట్టేది అని మీరు అనవచ్చు.అయితే అక్కడి వారి దృష్టి అంతా హన్సిక నవ నవలాడే నడుంపైనే పడిపోవడంతో సిద్ధు దిష్టి చుక్కను అక్కడ పెట్టారు.ఉయిరే ఉయిరే చిత్రంలో ఈ అందాల సన్నివేశాలు చూసి మీరు మైమర చిపోవాలంటే ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. చిత్రం ఏప్రిల్ ఒకటో తేదీన తెరపైకి రానుంది. -
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ను గుర్తుపట్టిన సాక్షి!
ముంబై: 12 ఏళ్ల క్రితం నాటి 'హిట్ అండ్ రన్' కేసులో ఆరోపణలెదుర్కొంటున్న సల్మాన్ ఖాన్ ను ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు చెందిన బార్ వెయిటర్ కోర్టులో గుర్తించారు. సల్మాన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి వచ్చి మద్యం సేవించారని కోర్టులో మోలే బాగ్ వెయిటర్ తన వాగ్మూలాన్ని ఇచ్చారు. అయితే తన స్నేహితులతో వచ్చిన సల్మాన్ మద్యం సేవించారా లేదా అనే విషయం తనకు గుర్తు లేదని వెయిటర్ తెలిపారు. బార్ లో మసక చీకటి ఉంది. సల్మాన్ మద్యం సేవించారా అనేది చూడలేదు. కాని ఆయన స్నేహితులందరికి మద్యం సరఫరా చేశాను అని క్రాస్ ఎగ్జామినేషన్ లో బెయిటర్ కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ నివాసం వద్ద పనిచేసే లక్ష్మణ్ మోరే అనే సెక్యూరిటీ గార్డు సాక్ష్యాన్ని కోర్టు రికార్డు చేసింది. సల్మాన్, సొహైల్ లిద్దరూ 'రెయిన్ బార్'కు వెళ్లారు. అర్ధరాత్రి మూడు గంటల తర్వాత సొహైల్ తిరిగివచ్చారు. మరో గంటల తర్వాత ఓ వ్యక్తి సల్మాన్ ప్రమాదం జరిగిందని చెప్పారు అని లక్ష్మణ్ మోరే కోర్టుకు వివరించారు.