బిల్లు కట్టమన్నందుకు.. వెయిటర్‌ను కారులో ఈడ్చుకెళ్లిన కస్టమర్లు | Video: Waiter Asked For Money Dragged By Car For 1 km | Sakshi
Sakshi News home page

బిల్లు కట్టకపోవడమే కాకుండా.. వెయిటర్‌ను కారులో ఈడ్చుకెళ్లిన కస్టమర్లు

Published Wed, Sep 11 2024 4:16 PM | Last Updated on Wed, Sep 11 2024 5:48 PM

Video: Waiter Asked For Money Dragged By Car For 1 km

ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా తిన్న ఆహారానికి బిల్లు తప్పక చెల్లించాల్సిందే. ఇంకా అదనంగా చాలామంది ఫుడ్‌ సర్వ్‌ చేసినందుకు వెయిటర్‌లకు టిప్‌ కూడా ఇస్తుంటారు. కానీ ఓ చోట హోటల్‌లో ఫుల్‌గా తిని.. బిల్లు చెల్లించకుండా పరారరయ్యారు కొంతమంది. డబ్బులు కట్టమని అడిగేందుకు వెయిటర్‌ వారి వెంట కారు వద్దకు పరుగెత్తుకెళ్లగా.. అతన్ని కారులో కిలోమీటర్‌ వరకులాక్కెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. 

బీడ్‌ జిల్లాలోని మెహకర్‌-పంధర్‌పూర్‌ పాల్ఖి రహదారిపై రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లో శనివారం ముగ్గురు వ్యక్తులు భోజనం చేసేందుకు వచ్చాడు. హోటల్‌ బయట కారు పార్క్‌ చేసి భోజనం చేశారు. మొత్తం తిన్న తర్వాత ముగ్గురు వ్యక్తులు బిల్లు కట్టకుండానే కారు వద్దకు తిరిగి వచ్చారు.  ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేసేందుకు క్యూర్‌ కోడ్‌ స్కానర్‌ను తీసుకురావాలని వెయిటర్‌ను కోరారు.
చదవండి: స్కూటర్‌ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు

వెయిటర్‌ స్కానర్‌ తీసుకొచ్చే క్రమంలో ముగ్గురు తమలో తాము గొడవపడుతున్నట్లు నటింది. కారులోకి ఎక్కి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో వెయిటర్‌ కారు డోర్‌ తెరిచాడు. ఇంతలోనే దుండగులు కారును రివర్స్‌ తీసి వెయిటర్‌ డోర్‌కు వేలాడుతూనే అతడిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లాడు.  

ఇంతలో మరో హోటల్‌​ సిబ్బంది కారును వెంబడించాడు. కానీ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అనంతరం కారును ఎవరూ లేని ప్రదేశంలో ఆపి.. వెయిటర్‌ను కొట్టి అతని జేబులోని రూ. 11,500ను లాక్కున్నారు.  అతని కళ్లకు గంతలు కట్టి రాత్రి అంతా బందించి ఉంచారు మరుసటి రోజు ఉదయం అతన్ని విడిచిపెట్టారు. ఇక దీనిపై హోటల్‌ యాజమాన్యం దిండ్రూడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement