dragging
-
బిల్లు కట్టమన్నందుకు.. వెయిటర్‌ను కారులో ఈడ్చుకెళ్లిన కస్టమర్లు
ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా తిన్న ఆహారానికి బిల్లు తప్పక చెల్లించాల్సిందే. ఇంకా అదనంగా చాలామంది ఫుడ్ సర్వ్ చేసినందుకు వెయిటర్లకు టిప్ కూడా ఇస్తుంటారు. కానీ ఓ చోట హోటల్లో ఫుల్‌గా తిని.. బిల్లు చెల్లించకుండా పరారరయ్యారు కొంతమంది. డబ్బులు కట్టమని అడిగేందుకు వెయిటర్ వారి వెంట కారు వద్దకు పరుగెత్తుకెళ్లగా.. అతన్ని కారులో కిలోమీటర్ వరకులాక్కెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. బీడ్ జిల్లాలోని మెహకర్-పంధర్పూర్ పాల్ఖి రహదారిపై రోడ్డు పక్కన ఉన్న హోటల్లో శనివారం ముగ్గురు వ్యక్తులు భోజనం చేసేందుకు వచ్చాడు. హోటల్ బయట కారు పార్క్ చేసి భోజనం చేశారు. మొత్తం తిన్న తర్వాత ముగ్గురు వ్యక్తులు బిల్లు కట్టకుండానే కారు వద్దకు తిరిగి వచ్చారు. ఆన్లైన్ పేమెంట్ చేసేందుకు క్యూర్ కోడ్ స్కానర్‌ను తీసుకురావాలని వెయిటర్‌ను కోరారు.చదవండి: స్కూటర్ రిపేర్‌లో జాప్యం.. ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడువెయిటర్ స్కానర్ తీసుకొచ్చే క్రమంలో ముగ్గురు తమలో తాము గొడవపడుతున్నట్లు నటింది. కారులోకి ఎక్కి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని ఆపే ప్రయత్నంలో వెయిటర్ కారు డోర్ తెరిచాడు. ఇంతలోనే దుండగులు కారును రివర్స్ తీసి వెయిటర్ డోర్‌కు వేలాడుతూనే అతడిని అక్కడి నుంచి ఈడ్చుకెళ్లాడు. ఇంతలో మరో హోటల్ సిబ్బంది కారును వెంబడించాడు. కానీ కారు వేగంగా దూసుకెళ్లింది. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అనంతరం కారును ఎవరూ లేని ప్రదేశంలో ఆపి.. వెయిటర్‌ను కొట్టి అతని జేబులోని రూ. 11,500ను లాక్కున్నారు. అతని కళ్లకు గంతలు కట్టి రాత్రి అంతా బందించి ఉంచారు మరుసటి రోజు ఉదయం అతన్ని విడిచిపెట్టారు. ఇక దీనిపై హోటల్ యాజమాన్యం దిండ్రూడ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.#Maharashtra: बीड में एक #Waiter खाने के बाद #Scanner लेकर #Car के पास आया और #Bill देकर पैसे की मांग की, लेकिन बिल का भुगतान करने की बजाय कार सवार उसे पकडकर एक किलोमीटर तक घसीटता ले गए. वेटर को पूरी रात बंधक बनाकर रखा और पिटाई भी की.#Maharashtracrime #maharashtranews pic.twitter.com/CF6wqnOC5S— Delhi Uptodate News (@DelhiUptodate) September 11, 2024 -
జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్..
ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. పార్కులో ఓ జాలరిపై సొరచేప దాడి చేసింది. పడవలో వెళుతున్న క్రమంలో అతన్ని నీళ్లలోకి లాగేసింది. చేయి కడుక్కోవడానికి పడవ నుంచి నీళ్లలోకి వంగిన క్రమంలో సొరచేప లాగేసినట్లు స్థానికులు తెలిపారు. పడవలో చేపల వేటకు వెళ్లారు జాలరి. ఈ క్రమంలో చేయి కడుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అనుకోకుండా పడవ నుంచి వంగి నీళ్లలో చేతి కడుక్కోవాలనుకున్నాడు. ఇంతలోనే నీటిలో ఉన్న సొరచేప జాలరి చేతిని కరిచేసింది. అంతటితో ఆగకుండా నీటిలోకి లాగేసింది. పడవపై నుంచి ఒక్కసారిగా నీళ్లలో పడిపోయాడు జాలరి. కానీ పక్కనే ఉన్న అతని స్నేహితుడు వెంటనే బాధితున్ని పడవపైకి లాగాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. View this post on Instagram A post shared by THEQUALIFIEDCAPTAIN (@thequalifiedcaptain) ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. వీడియో చూసిన వీక్షకులు రకరకాలుగా స్పందించారు. పడవపై ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అయితే.. ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. గత ఏడాదే 57 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అందులో 5గురు మరణించారు. ఇదీ చదవండి: 'ఒకే దేశంలో రెండు చట్టాలా..?' ప్రతిపక్షాలకు ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్.. -
ఏందిరబ్బీ..ఈ యవ్వారం..తిక్క కుదిరిండ్లా!
-
ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా కారులోకి..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన జరిగింది. 19 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి బలవంతంగా కారులోకి లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అయినా యువతి భయపడకుండా కారు ఎక్కేందుకు నిరాకరించింది. దీంతో అతడు ఆమెను కారు దగ్గరకు ఈడ్చుకెళ్లాడు. వాహనంలోకి ఎక్కించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో యువతికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పాండవ్ నగర్లో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలో వరుసగా దారుణాలు జరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. జనవరి 1న అంజలి అనే యువతి స్కూటీని ఢీకొట్టి ఆమెను కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జనవరి 2న ఆదర్శ్ నగర్లో జరిగిన మరో దారుణ ఘటనలో శివకుమార్ అనే 20 ఏళ్ల యువకుడు 21 ఏళ్ల యవతిని కత్తితో పలుమార్లు పొడిచాడు. ఇద్దరూ స్నేహితులే అయినప్పటీకీ ఏదో విషయంలో గొడవపడి అతడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చదవండి: అయ్యో అంజలి.. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు -
‘రక్తమోడుతున్నా ఈడ్చుకెళ్లారు’.. ఢిల్లీ దారుణంపై ప్రత్యక్ష సాక్షి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో యువతిని స్కూటీతో పాటు కారు కింద కిలోమీటర్ల మేరకు ఈడ్చి పొట్టన పెట్టుకున్న దారుణ ఘటనకు సంబంధించి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కారు ఢీకొనడంతో చక్రాల కింద ఇరుక్కుని, కాపాడండంటూ ఆర్తనాదాలు చేస్తున్నా కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా ఈడ్చుకెళ్లారని నిధి అనే ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. మృతురాలు అంజలీ సింగ్‌కు ఆమె స్నేహితురాలే. ఘటన జరిగినప్పుడు అదే స్కూటీపై అంజలీ వెనక కూచొని ఉంది. స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. షాక్‌తో ఘటన వివరాలను ఆమె ఇంతవరకూ బయట పెట్టలేదు. స్కూటీపై మరో మహిళ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో గుర్తించిన పోలీసులు ఆరా తీసి ఆమె వాంగ్మూలం నమోదుచేశారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి జరిగిన దారుణం గురించి నిధి వెల్లడించారు. ‘‘మా పరిచయమై 15 రోజులే అయినా మంచి స్నేహితులమయ్యాం. కొత్త ఏడాది వేడుక కల్సి చేసుకుందామనుకున్నాం. హోటల్లో పార్టీ తర్వాత 2 గంటలపుడు బయటకొచ్చి స్కూటీపై వెళ్తున్నాం. ఎదురుగా వస్తున్న కారు హఠాత్తుగా మమ్మల్ని ఢీకొట్టింది. నేను పడిపోయా. కానీ అంజలీ కారు చక్రాల్లో ఇరుక్కుని రక్తమోడుతూ సాయం కోసం అరిచింది. అయినా వాళ్లు వేగంగా అలాగే ఆమెను కారుతో పాటుగా ఈడ్చుకెళ్లారు. వెంటనే ఆపితే ఆమె కచ్చితంగా బ్రతికేది. చక్రాల్లో ఆమె ఇరుక్కుందని తెలిసీ నిర్దయగా అలాగే వెళ్లిపోయారు. ఆ దారుణాన్ని చూసిన షాక్‌లో ఈ విషయం ఎవరికీ చెప్పలేదు’’ - నిధి, బాధితురాలి స్నేహితురాలు, ప్రత్యక్ష సాక్షి అయితే స్కూటీ ఎక్కడానికి ముందు హోటల్ బయట వారిద్దరూ గొడవ పడుతున్నట్టు మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. నిధి నుంచి ఏదో లాక్కోవడానికి అంజలి ప్రయత్నిస్తున్నట్టు అందులో కనిపిస్తోంది. బహుశా స్కూటీని ఎవరు నడపాలనే విషయమై వారు వాదించుకున్నారని భావిస్తున్నారు. కాగా ఈ కేసులో అత్యాచారం ఆనవాళ్లు లేవని పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడైంది. తల, వెన్నెముక, మొండెం కింది అవయవాలకు తీవ్ర గాయాలవడంతో అంజలీ మరణించినట్టు నివేదిక పేర్కొంది. నిందితులు ఆమెను రేప్ చేసి చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో మెడికల్ బోర్డు పర్యవేక్షణలో పోస్ట్‌మార్టం జరిగిందని ఢిల్లీ పోలీస్ స్పెషల్ కమిషనర్ సాగర్ ప్రీత్ హూడా చెప్పారు. ఝౌంతీ గ్రామంలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం, నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకోవడం తెల్సిందే. కేసును నీరుగారుస్తున్నారు: ఆప్ దర్యాప్తు వేగంగా ముగించి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ‘ఆప్’ ఎమ్మెల్యేల బృందం వినతిపత్రం ఇచ్చింది. మృతురాలి కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. కేంద్రం సీరియస్ ఘటనపై కేంద్రం సీరియస్‌గా ఉంది. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దాంతో స్పెషల్ కమిషనర్ శాలినీ సింగ్ నేతృత్వంలో ఢిల్లీ పోలీస్ విభాగం దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఘటన సమయంలో ఇద్దరు నిందితులు తాగి ఉన్నట్లు వార్తలొచ్చాయి. వారి రక్త నమూనాలను పరీక్షకు పంపారని, రిపోర్టులు రావాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కుటుంబానికి ఏకైక దిక్కు మృతురాలు అంజలి తన కుటుంబానికి ఏకైక పెద్ద దిక్కు. తండ్రి ఎనిమిదేళ్ల క్రితమే మరణించాడు. అక్కకు పెళ్లయింది. దాంతో అమ్మ, ఇద్దరు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లను ఆమే పోషిస్తోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తూ వారికి ఆసరాగా నిలుస్తోంది. మూత్రపిండాలు దెబ్బ తిన్న తల్లికి తరచూ డయాలసిస్ అవసరం. ఇదీ చదవండి: ఢిల్లీ సుల్తాన్‌పురి ఘటన: అంజలితో పాటు మరో యువతి కూడా!.. పోలీసులు పట్టించుకోలేదా? -
ఇంత దారుణమా? చలానా కట్టమన్నందుకు 4 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు
భోపాల్: డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటమే కాకుండా ప్రశ్నించిన ట్రాఫిక్ పోలీసు పట్ల దురుసుగా ప్రవర్తించాడు ఓ వ్యక్తి. చలాన్ కట్టమన్నందుకు కారు బానట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను 4 కిలోమీటర్లు లాక్కెళ్లాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో జరిగింది. ఇండోర్ నగరంలోని సత్య సాయి జంక్షన్ వద్ద ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ శివ సింగ్ చౌహాన్(50) విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే కారులో వచ్చిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తూ కనిపించాడు. ఫోన్ మాట్లాడటం తప్పు అని చెప్పి జరిమానా కట్టాలని సూచించాడు కానిస్టేబుల్. దీంతో ఆగ్రహించిన కారు డ్రైవర్.. కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. జరిమానా తప్పించుకునేందుకు కానిస్టేబుల్ అడ్డుగా ఉన్నప్పటికీ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ పోలీసు కారు బానట్పైకి దూకాడు. అయినప్పటికీ.. కారును ఆపకుండా అలానే 4 కిలోమీటర్లు కారు నడిపాడు. ఈ క్రమంలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు ఉన్నతాధికారులు తెలిపారు. కారు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 279, 332 కింద కేసు నమోదు చేసినట్లు లసుదియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ఎస్ దండోతియా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఓ పిస్తోల్, ఓ రివాల్వర్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే, అవి లైసెన్స్‌తో తీసుకున్నవని నిందితుడు తెలిపాడన్నారు. ग्वालियर के केशव उपाध्याय ने इंदौर में गाड़ी चलाने के दौरान फोन पर बात करते हुए ट्रैफिक तोड़ा और रोकने पर ट्रैफिक कांस्टेबल शिव सिंह चौहान को चार किलोमीटर तक अपने बोनट पर टांग कर ले गए। बताया जा रहा है के FIR कर छोड़ दिया गया।pic.twitter.com/PXEhQ3lm31 — काश/if Kakvi (@KashifKakvi) December 12, 2022 ఇదీ చదవండి: మూన్‌లైటింగ్ కూలీ: రాత్రి పూట రైల్వే స్టేషన్లో.. మరి పగటి పూట! -
ఒడిశాలో మంటగలిసిన మానవత్వం
-
శ్రద్ధా, పర్హాన్ లకు ఏమైంది?
ముంబై: బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రముఖ నటుడు ఫర్హాన్ అక్తర్ లపై వచ్చిన తాజా పుకార్లపై, శ్రద్ధ తండ్రి, సీనియర్ నటుడు శక్తి కపూర్ స్పందించారు. ఫర్హాన్ ఇంటినుంచి తన కూతురిని బయటకు లాక్కొచ్చేశాడన్నవార్తలను రూమర్లని కొట్టిపారేశాడు. ఇది పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇదే విషయంలోతనను ఫోన్ లో కూడా ప్రశ్నించారని.. ఇలాంటి వదంతులను నమ్మొద్దని పేర్కొన్నారు. తాను 35 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమలోఉన్న తను అలా ప్రవర్తించనని శక్తి స్పష్టం చేశారు. అయితే బాలీవుడ్ మూవీ ఆషికి తో యూత్ లో యమ క్రేజ్ సంపాదించిన శ్రద్ధా కపూర్, ఫర్హాన్ అక్తర్ లపై వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడ్డంలేదు. రాక్ 2 సినిమా మొదలు శ్రద్ధా, అక్తర్‌ల ప్రేమ వ్యవహారం దుమారం రేపుతోంది. ఈ భాగ్ మిల్కా భాగ్ నటుడితో పీకల్లోతు ప్రేమలో పడిన శ్రద్ధాకపూర్, ఏకంగా అతని నివాసానికే తన మకాం కూడా మార్చేసిందన్నది బీ టౌన్ టాక్. ఈ విషయం తెలుసుకున్న శక్తికపూర్ ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చేశారని వార్తలు చెలరేగాయి. వీరిద్దరి ప్రేమ వ్యవహారం నచ్చక పోవడం వల్లే ఈ సంఘటన జరిగిందన్న వాదనలు వినిపించాయి. కాగా మరో హీరోయిన్, వాజిర్ మూవీలో కలిసి నటించిన అదితిరావు, ఫర్హాన్ అక్తర్ సంబంధాలపై అప్పట్లో బాలీవుడ్ గుప్పుమంది. మరోవైపు సహజీవన వార్తలను శ్రద్ధా-ఫర్హాన్ ఇప్పటికే ఖండించిన సంగతి తెలిసిందే.