
ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. పార్కులో ఓ జాలరిపై సొరచేప దాడి చేసింది. పడవలో వెళుతున్న క్రమంలో అతన్ని నీళ్లలోకి లాగేసింది. చేయి కడుక్కోవడానికి పడవ నుంచి నీళ్లలోకి వంగిన క్రమంలో సొరచేప లాగేసినట్లు స్థానికులు తెలిపారు.
పడవలో చేపల వేటకు వెళ్లారు జాలరి. ఈ క్రమంలో చేయి కడుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అనుకోకుండా పడవ నుంచి వంగి నీళ్లలో చేతి కడుక్కోవాలనుకున్నాడు. ఇంతలోనే నీటిలో ఉన్న సొరచేప జాలరి చేతిని కరిచేసింది. అంతటితో ఆగకుండా నీటిలోకి లాగేసింది. పడవపై నుంచి ఒక్కసారిగా నీళ్లలో పడిపోయాడు జాలరి. కానీ పక్కనే ఉన్న అతని స్నేహితుడు వెంటనే బాధితున్ని పడవపైకి లాగాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. వీడియో చూసిన వీక్షకులు రకరకాలుగా స్పందించారు. పడవపై ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అయితే.. ఎవర్‌గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. గత ఏడాదే 57 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అందులో 5గురు మరణించారు.
ఇదీ చదవండి: 'ఒకే దేశంలో రెండు చట్టాలా..?' ప్రతిపక్షాలకు ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్..