ఎవరైనా సరదాకి చిన్న జంతువులతో ఆటలాడుతారు. ఇంట్లో ఉండే కుక్క, పిల్లులతోనే కాలక్షేపం చేస్తారు. కొన్నిసార్లు వాటితో సరదాగా పోట్లాడుతారు. ఏవో నవ్వుకునే పనులు చేస్తుంటారు. కానీ ఎవరైనా ప్రమాదకరమైన జంతువులతో పెట్టుకుంటారా? తెలివి ఉన్నవారు ఎవరూ అలా చేయరు కదా..! కానీ ఓ ఫుట్‌బాల్ ఏజెంట్ ఏకంగా సొరచేపతో సరదాగా ఫైట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
అమెరికాకి చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(ఎన్‌ఎఫ్‌ఎల్) ఏజెంట్ డ్రూ రోసెన్‌హాస్ సొరచేపతో ఫైటింగ్ చేశారు. స్నేహితులతో సరదాగా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రోసెన్‌హాస్.. ఓ చిన్న సొరచేపను చూశారు. అది వారి బోటుకు దగ్గరికి రావడంతో వారంతా మరింత ఆసక్తిని కనబరిచారు. కాసేపు బోటులో నుంచే దానితో ఆటలాడారు. కానీ రోసెన్‌హాస్ మాత్రం సముద్రంలోకి దూకి సొరచేపతో ఆటలాడారు. దాని తోకను పట్టుకుని కాసేపు ఫైటింగ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సొరతో 45 నిమిషాలు పోట్లాడినట్లు చెప్పుకొచ్చారు.
Went fishing with @cheetah today and decided to get up close to this Dusky Shark pic.twitter.com/P1jIWKEuef
— Drew Rosenhaus (@DrewJRosenhaus) June 20, 2023
ఈ వీడియో క్షణాల్లోనే నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్ల స్పందనలతో కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. రోసెన్‌హాస్ తీరుపై పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్(పీఈటీఏ) మండిపడింది. జంతువులతో అలా ప్రవర్తించడంపై ఆక్షేపించింది. సొరచేపతో అటలాడటాన్ని కొందరు విమర్శించారు. కాలుష్యంతో ఇప్పటికే సముద్ర జంతువులు చాలా ఇబ్బంది పడుతున్నాయ్.. ఇక నేరుగా కూడా దాడి చేస్తారా? అంటూ కామెంట్లు పెట్టారు.
ఇదీ చదవండి: ఎంత దారుణం! పుట్టిన పసిపిల్లలని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన తల్లి.. కొన్నాళ్ల తర్వాత
Comments
Please login to add a commentAdd a comment