Shark
-
ఈత నేర్పే షార్క్..!
ఫొటోలో కనిపిస్తున్న ఈ షార్క్ బొమ్మ పిల్లలకు ఈత నేర్పుతుంది. అది కూడా చాలా సులువుగా. ఈ స్విమ్మింగ్ కిక్బోర్డులోని మోటార్స్‌ను పిల్లలు ఈత నేర్చుకునేలా డిజైన్ చేశారు. కేవలం దీని హ్యాండిల్స్‌ను కంట్రోల్ చేస్తూ ఎంత దూరమైన ఈత కొడుతూ వెళ్లొచ్చు.ఇందులోని స్పీడ్ కంట్రోల్ ఆప్షన్‌తో వేగాన్ని నియంత్రించుకోవచ్చు. బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. పిల్లల వయసు బట్టి ఈ డివైజ్ సైజు ఉంటుంది. వాటిని బట్టే ధర. ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలుంది. -
భార్యను రక్షించడానికి షార్క్‌తో అండర్ టేకర్ మల్లయుద్ధం..!
డబ్ల్యూడబ్ల్యూఈ అడ్డాలో అండర్ టేకర్ పేరు తెలియని వారుండరు. రింగ్‌లోకి దిగాక ఆయన పిడిగుద్దులకు ఎదురు నిలిచేవారుండరు. ఎంత మంది ఎదురొచ్చినా నిలిచి కొట్లాడే ధైర్యశాలి. అయితే.. వారి ధైర్య సాహసాలు కేవలం రింగ్‌కే పరిమితం కాదని నిరూపించాడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ అండర్ టేకర్. బీచ్‌లో సొరచేప నుంచి తన భార్యను కాపాడాడు. అవసరం ఎదురైనప్పుడు మనుషులతోనే కాదూ.. క్రూర జంతువులతో కూడా పొట్లాడగల ధీరత్వం రెజ్లర్ సొంతమని చెప్పకనే చెప్పాడు అండర్ టేకర్. సన్డే ఇజ్ ఫన్ డే.. ఎవరైనా కాస్త విశ్రాంతిని కోరుకుంటారు. ఉల్లాసంగా గడపాలనుకుంటారు. అలాగే అండర్ టేకర్ దంపతులు కూడా బీచ్‌కి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన భార్య మిచెల్ మెక్కూల్ సముద్రంలోకి దిగారు. అండర్ టేకర్ బీచ్ ఒడ్డున ఓ పుస్తకం చదువుతున్నారు. ఈ సమయంలో మెచెల్కు సమీపంగా ఓ సొరచేప వచ్చింది. ఒక్కసారిగా భయపడిన ఆమె.. భర్త వైపు చూసి కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన టేకర్.. సముద్రంలోకి దిగారు. సొరచేప గమనానికి అడ్డుగా నిలబడ్డారు. కానీ ఆ సొరచేప వీరి వైపు రాకుండా దూరంగా వెళ్లిపోయింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న మిచెల్.. భర్తపై ప్రశంసలు కురిపించారు. 'మీరుండగా.. నాకు ఏం భయం. మీరుంటే ఆ ధైర్యమే వేరు. సమస్య నా వద్దకు రావాలంటే ముందు అది మిమ్మల్ని దాటి రావాలి' అంటూ భర్తపై ఉన్న నమ్మకాన్ని కొనియాడారు. తన భర్త బలాన్ని చూసి ఎప్పుడూ ఆశ్యర్యపోతుంటానని చెప్పారు. మిచెల్ మెక్కూల్.. అండర్ టేకర్(58) 2010లో వివాహం చేసుకున్నారు. ఆమె కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో పలు విజయాలు సాధించారు. డివా ఛాంపియన్‌ను రెండు సార్లు గెలిచారు. డబ్ల్యూడబ్ల్యూఈ మహిళల ఛాంపియన్‌గా రెండు సార్లు నిలిచారు. 'నేను ఇప్పటివరకు చూసిన వాళ్లలో అండర్ టేకర్ వంటి మానసిక దృఢత్వాన్ని ఎవ్వరిలో చూడలేదు. ఆటలోకి దిగాక చాలా ప్రభావవంతగా ఆడగలరు. ఏది ఏమైనా నేనున్నాని చెబుతాను. తనతో కలిసి వర్క్ అవుట్ చేస్తాను. మంచి ఆహారాన్ని వండి పెడతాను. అండర్ టేకర్ మానసికంగా, శారీరకంగా బలంగా ఉండటానికి కావాల్సిన పనులు చేస్తాను' అని మిచెల్ మెక్కూల్ చెప్పారు. ఇదీ చదవండి: Nepal Chopper Crash: ఎవరెస్టు సమీపంలో కూలిన హెలికాఫ్టర్.. ఆరుగురు టూరిస్టులు మృతి.. -
సముద్రంలో పర్యాటకుల సయ్యాటలు.. సడన్‌గా షార్క్ దూసుకురావడంతో..
అమెరికాలోని ఫ్లోరిడా సముద్రతీరంలో ఆ క్షణంలో భయానక వాతావరణం ఏర్పడింది. సముద్రంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా స్నానం చేస్తున్న వారి మధ్యలోకి ఉన్నట్టుండి ఒక భారీ షార్క్ ప్రత్యక్షమయ్యింది. దీంతో వారంతా నీటిలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ భారీ షార్క్ నీటి మీద తేలియాడుతూ సముద్రంలో సేద తీరుతున్నవారి దిశగా దూసుకువచ్చింది. ఈ షార్క్‌ను బీచ్‌లో నుంచి చూసినవారు సముద్రంలో సయ్యాటలాడుతున్న వారిని హెచ్చరిస్తూ బయటకు వచ్చేయండంటూ గట్టిగా కేకలు పెట్టారు. గతంలో న్యూయార్క్‌లోని ఫైర్ ఐలాండ్‌ను 15 ఏళ్ల కుర్రాడిని షార్క్ చంపేసినప్పటి నుంచి జనాలకు షార్క్‌లంటే విపరీతమైన భయం పట్టుకుంది. తాజాగా ఫ్లోరిడా బీచ్‌లో కనిపించిన షార్క్ భారీ ఆకారంతో ఉండటంతో అక్కడున్న వారంతా భయపడిపోయారు. ఆ క్షణంలో అక్కడ ఆందోళనకర వాతావారణం ఏర్పడింది. గతంలో షార్క్ దాడిలో బాలుడు మృతి చెందడం, దీనికి ముందు షార్క్ దాడిలో కొందరు గాయపడటాన్ని స్థానికులు మరోమారు గుర్తుచేసుకున్నారు. ‘అది ఆకలితో ఉన్నట్టుంది’ ఫ్లోరిడాలో ఆ సమయంలో సముద్రతీరంలో సేదతీరిన క్రిస్టీ కాక్స్ మాట్లాడుతూ తాను ఆ షార్క్‌ను చూసినప్పుడు అది ఆహరపు వేటలో ఉన్నట్లు అనిపించిదన్నారు. అందుకే అది వేగంగా కదులుతూ మనుషులవైపు వచ్చిందన్నారు. దానిని చూడగానే అక్కడున్న వారంతా నిశ్చేష్టులైపోయారన్నారు. ఎలాగోలా అందరూ దారి బారి నుంచి తప్పించుకున్నారన్నారు. కాగా గతంలో పలువురిపై షార్క్ దాడులు జరగగా, వారిలో కొందరు వికలాంగులుగా మారిపోయారు. ఇది కూడా చదవండి: ‘ఇదేం పువ్వు రా బాబూ.. ముక్కు పేలిపోతోంది’ -
జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్..
ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. పార్కులో ఓ జాలరిపై సొరచేప దాడి చేసింది. పడవలో వెళుతున్న క్రమంలో అతన్ని నీళ్లలోకి లాగేసింది. చేయి కడుక్కోవడానికి పడవ నుంచి నీళ్లలోకి వంగిన క్రమంలో సొరచేప లాగేసినట్లు స్థానికులు తెలిపారు. పడవలో చేపల వేటకు వెళ్లారు జాలరి. ఈ క్రమంలో చేయి కడుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది. అనుకోకుండా పడవ నుంచి వంగి నీళ్లలో చేతి కడుక్కోవాలనుకున్నాడు. ఇంతలోనే నీటిలో ఉన్న సొరచేప జాలరి చేతిని కరిచేసింది. అంతటితో ఆగకుండా నీటిలోకి లాగేసింది. పడవపై నుంచి ఒక్కసారిగా నీళ్లలో పడిపోయాడు జాలరి. కానీ పక్కనే ఉన్న అతని స్నేహితుడు వెంటనే బాధితున్ని పడవపైకి లాగాడు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. View this post on Instagram A post shared by THEQUALIFIEDCAPTAIN (@thequalifiedcaptain) ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయింది. వీడియో చూసిన వీక్షకులు రకరకాలుగా స్పందించారు. పడవపై ప్రయాణిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. అయితే.. ఎవర్గ్లేడ్స్ నేషనల్ పార్క్‌లో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుంటాయి. గత ఏడాదే 57 ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అందులో 5గురు మరణించారు. ఇదీ చదవండి: 'ఒకే దేశంలో రెండు చట్టాలా..?' ప్రతిపక్షాలకు ప్రధాని స్ట్రాంగ్ కౌంటర్.. -
సముద్రంలో సరదాగా సొరతో ఫుట్‌బాల్ ఏజెంట్ కొట్లాట.. వీడియో వైరల్..
ఎవరైనా సరదాకి చిన్న జంతువులతో ఆటలాడుతారు. ఇంట్లో ఉండే కుక్క, పిల్లులతోనే కాలక్షేపం చేస్తారు. కొన్నిసార్లు వాటితో సరదాగా పోట్లాడుతారు. ఏవో నవ్వుకునే పనులు చేస్తుంటారు. కానీ ఎవరైనా ప్రమాదకరమైన జంతువులతో పెట్టుకుంటారా? తెలివి ఉన్నవారు ఎవరూ అలా చేయరు కదా..! కానీ ఓ ఫుట్‌బాల్ ఏజెంట్ ఏకంగా సొరచేపతో సరదాగా ఫైట్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అమెరికాకి చెందిన నేషనల్ ఫుట్‌బాల్ లీగ్(ఎన్ఎఫ్ఎల్) ఏజెంట్ డ్రూ రోసెన్హాస్ సొరచేపతో ఫైటింగ్ చేశారు. స్నేహితులతో సరదాగా చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన రోసెన్హాస్.. ఓ చిన్న సొరచేపను చూశారు. అది వారి బోటుకు దగ్గరికి రావడంతో వారంతా మరింత ఆసక్తిని కనబరిచారు. కాసేపు బోటులో నుంచే దానితో ఆటలాడారు. కానీ రోసెన్హాస్ మాత్రం సముద్రంలోకి దూకి సొరచేపతో ఆటలాడారు. దాని తోకను పట్టుకుని కాసేపు ఫైటింగ్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సొరతో 45 నిమిషాలు పోట్లాడినట్లు చెప్పుకొచ్చారు. Went fishing with @cheetah today and decided to get up close to this Dusky Shark pic.twitter.com/P1jIWKEuef — Drew Rosenhaus (@DrewJRosenhaus) June 20, 2023 ఈ వీడియో క్షణాల్లోనే నెట్టింట తెగ వైరల్ అయింది. నెటిజన్ల స్పందనలతో కామెంట్స్ బాక్స్ నిండిపోయింది. రోసెన్హాస్ తీరుపై పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనిమల్స్(పీఈటీఏ) మండిపడింది. జంతువులతో అలా ప్రవర్తించడంపై ఆక్షేపించింది. సొరచేపతో అటలాడటాన్ని కొందరు విమర్శించారు. కాలుష్యంతో ఇప్పటికే సముద్ర జంతువులు చాలా ఇబ్బంది పడుతున్నాయ్.. ఇక నేరుగా కూడా దాడి చేస్తారా? అంటూ కామెంట్లు పెట్టారు. ఇదీ చదవండి: ఎంత దారుణం! పుట్టిన పసిపిల్లలని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టిన తల్లి.. కొన్నాళ్ల తర్వాత -
అందం కోసం కొత్త దంతాలు.. ‘షార్క్’లా మారిన యువకుడు!
ప్రపంచంలో చాలామంది అందం కోసం విపరీతంగా తాపత్రయపడుతుంటారు. ఇందుకోసం ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంటారు. కొందరు తమ దంతాలు సరిగా లేవంటూ, వాటికి హంగులు సమకూరుస్తారు. ఇటువంటి సందర్బాల్లో చికిత్స చేయించుకున్న కొందరి ముఖాలు భయంకరంగా మారిపోవడాన్ని మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇటువంటి మరో తాజా ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవలే డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్న ఒక యువకునికి ఎదురైన చేదు అనుభవం గురించి ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వివరించాడు. జాక్ జేమ్స్ కెమెరాలో అందంగా కనిపించాలనే ఉద్దేశంతో నకిలీ దంతాలు పెట్టించుకోవాలనుకున్నాడు. ఇందుకోసం బ్రిటన్ నుంచి టర్కీకి వెళ్లాడు. £3,000( సుమారు రూ. 3 లక్షలు) వెచ్చించి నకిలీ దంతాలు పెట్టించుకున్నాడు. మొదట్లో ఈ దంతాలు అతని ముఖానికి ఎంతో అందాన్నిచ్చాయి. అయితే కొద్ది రోజుల తరువాత అతని దంతాల నుంచి రక్తం కారసాగింది. అలాగే నోటు నుంచి దుర్వాసన కూడా వెలువడసాగింది. దీంతో జాక్ జేమ్స్.. మాంచెస్టర్‌లోని ఒక డెంటిస్ట్‌ను సంప్రదించాడు. ఆ దంతవైద్యుడు పలుపరీక్షలు చేసిన అనంతరం అతని దంతాలు పూర్తిగా పాడయిపోయాయని చెప్పాడు. ఇన్ఫెక్షన్ సోకిందని తెలిపాడు. ఆ దంతాలను తిరిగి సరిగా చేసేందుకు £20,000(సుమారు రూ. 20 లక్షలు) ఖర్చవుతాయని తెలిపాడు. ఇంగ్లండ్‌లో ఈ చికిత్సకు ఇంత భారీగా ఖర్చవుతుందని తెలుసుకున్న అతను తిరిగి గతంలో తనకు చికిత్స చేసిన టర్కీలోని డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ డెంటిస్ట్ అతనితో దంత చికిత్సలో తప్పేమీ జరగలేదని, అయితే తిరిగి దంతాలను సరి చేసుకోవాలంటే, మరోమారు చికిత్స చేయించుకోవాలని, ఇందుకు మరింత ఖర్చవుతుందని తెలిపాడు. మరో మార్గంలేక జాక్ అందుకు అంగీకరించాడు. నకిలీ దంతాలను తొలగించుకుని ఇన్ఫెక్షన్ దూరమయ్యేందుకు చికిత్స తీసుకున్నాడు. తరువాత కొత్తగా టెంపరరీ దంతాలను పెట్టించుకున్నాడు. అయితే అతను ఈ టెంపరరీ దంతాలను శుభ్రం చేసుకుంటున్నప్పుడు, అసలు దంతాలు షార్క్ దంతాలుగా మారిపోవడాన్ని గమనించాడు. అన్ని దంతాల మధ్య గ్యాప్ ఉండటాన్ని గుర్తించాడు. జాక్ తన దంతాలు చూసుకున్నప్పుడల్లా ఏదో హర్రర్ ఫిల్మ్‌లోని క్యారెక్టర్లా ఉన్నానని భావిస్తాడట. దీంతో అతనికి ఈ షార్క్ దంతాలను కూడా తొలగించుకోవాలని అనిపిస్తుందట. ఇందుకోసం మరో వైద్యుడిని సంప్రదించాలని అనుకుంటున్నానని జాక్ తెలిపాడు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ట్రాన్స్ ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆ రోజు జరిగిందిదే! -
ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట!
కైరో: మమ్మీఫైయింగ్ ద్వారా ఈజిప్ట్ ఫారో చక్రవర్తులను, రాణులను భద్రపర్చడం.. వాటిని పిరమిడ్ల కింద మమ్మీలుగా బయటకు తీస్తుండడం తెలిసిందే కదా. ఈజిప్ట్‌లో, ప్రపంచంలోని పలు దేశాల మ్యూజియంలో మమ్మీలను చూడడం షరామామూలే కావొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ ఒక కిల్లర్ షార్క్‌ను మమ్మీఫైయింగ్ చేసి ప్రదర్శన కోసం ఉంచనున్నారు. ఈజిప్ట్ నగరం హుర్ఘదా ఎర్ర సముద్ర పరిధిలో ఉన్న ఓ రిసార్ట్ తాజాగా జరిగిన ఘోరం గురించి తెలిసే ఉంటుంది. 23 ఏళ్ల రష్యన్ యువకుడిని అతని తండ్రి సమక్షంలోనే దాడి చేసి.. చంపి తినేసింది ఓ షార్క్(టైగర్ షార్క్). సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటన ఆ తండ్రితో సహా అక్కడున్నవాళ్లందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ టైంలో తనను రక్షించమంటూ ఆ వ్యక్తి కేకలు వేయడం గమనించొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది కూడా. అయితే.. ఆ తర్వాత ఆ షార్క్‌ను చంపేశారు కూడా. అది పక్కా కమర్షియల్ రిసార్ట్. ఎప్పుడూ బోట్లు సంచరిస్తూనే ఉంటాయి. అలాంటి చోట ఈ ఘటన జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కళ్లు మూసి తెరిచేలోపే ఘోరం జరగడం.. నీళ్లలోకి లాక్కెళ్లి మరీ 20 సెకండ్లలోనే అతన్ని చంపి మింగేయడం లాంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక మృతుడి శరీర భాగాలను జాలర్లు నీటి నుంచి సేకరించగా.. మరికొన్ని భాగాలు షార్క్ పొట్టలో దొరికాయి. ఇదిలా ఉంటే.. ఆ టైగర్షార్క ప్రవర్తన గురించి పరిశోధకుల్లో ఆసక్తి నెలకొంది. అంత వేగంగా అది దాడి చేసి చంపినందుకు నరమాంసభక్షకిగా అభివర్ణిస్తున్నారు వాళ్లు. అంతేకాదు దానిని పరిశీలించేందుకు ఇప్పుడొక అవకాశం దొరికిందని.. అందుకే దానిని భద్రపర్చాలని నిర్ణయించుకున్నట్లు మెరైన్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్, రెడ్సీ రిజర్వ్స్ వాళ్లు చెబుతున్నారు. సోమవారం నుంచి ఆ షార్క్ బాడీకి ఎంబామింగ్ చేయడం ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే.. ఆ షార్క్‌ను ఇనిస్టిట్యూట్‌లోని మ్యూజియంలో భద్రపరుస్తారట. దాని ప్రవర్తనకు అధ్యయనం చేసేందుకు దానిని భద్రపరుస్తున్నామని, తర్వాతి తరాలకు ఆ కిల్లర్ షార్క్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు దొరికిన భాగాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఆ తండ్రి.. పుట్టెడు దుఖంతో ఆ అస్తికలను తీసుకుని రష్యాకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: శవపేటిక నుంచి సౌండ్ రావడంతో.. -
కొద్దిలో తప్పించుకున్నాడు కానీ.. షార్క్ నోట్లో కిళ్లీ పాన్ అయ్యేవాడు
ఆయుష్షు మిగిలి ఉందంటే ఇదేనేమో. అమెరికాకు అల్లంత దూరంలో ఉండే హవాయి ద్వీపం సమీపంలో చేపలు పట్టుకునేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఇప్పుడు ఆయుష్షు అంటే ఏంటో తెలిసివచ్చింది. ఎందుకంటే, మృత్యుఘంటికల శబ్దం విని మరీ వెనక్కొచ్చాడు ఘనుడు. స్కాట్ హరగుచ్చి అనే వ్యక్తి ఇదే ప్రాంతంలో చాన్నాళ్లుగా చేపలు పడుతుంటాడు. "అప్పుడే ఓ చేపను పట్టుకున్నాను. ఇంతలోనే ఓ భయానక శబ్దం వినిపించింది. ఎంతలా అంటే నా గుండె జారిపోయేంత. తిరిగి చూస్తే.. ఓ గోధుమ రంగు టైగర్ షార్క్ నా బోటుపై దాడి చేసింది. నేను ఇవతలివైపు ఉన్నాను కాబట్టి తృటిలో తప్పించుకోగలిగాను." - స్కాట్ హరగుచ్చి, కయాకర్, ఫిషర్ మన్ పసిఫిక్ మహా సముద్రంలో అమెరికాకు పశ్చిమాన 3200 కిలోమీటర్ల దూరంలో ఉండే 137 దీవులను కలిపి హవాయి ఐలాండ్స్ అంటారు. దాదాపు 1200 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉండే ఈ దీవుల సమీపంలో నీళ్లు చాలా శుభ్రంగా కనిపిస్తాయి. ఈ నీటిలో ఇలాంటి సంఘటనలు అంతగా జరగవు. ఏడాది మొత్తమ్మీద నాలుగయిదు ఘటనలు కూడా ఉండవు. అయితే అప్పుడప్పుడు దారి తప్పి వచ్చే టైగర్ షార్క్‌లు మాత్రం ఇలాంటి దాడులకు దిగుతాయి. సాధారణంగా షార్క్‌లు బోటుపై దాడి చేయవు. అయితే స్కాట్ హరగుచ్చి దానికి కొద్దిసేపటి ముందు ఓ చేపను పట్టుకున్నాడు. దాన్ని వల నుంచి విడదీసే సమయంలో బ్లీడింగ్ జరిగింది. బహుశా రక్తం వాసనను పసిగట్టిన షార్క్ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. A kayaker was fishing over a mile offshore in Windward Oahu, Hawaii, when a tiger shark slammed into his boat. https://t.co/d0QzzJODZT pic.twitter.com/P7GStEQvRx — CNN (@CNN) May 16, 2023 -
సొరచేప గ్రద్దకి దొరికితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూడండి
-
చావుతో భీకర పోరాటం.. చివరికి ఏమైందంటే!
Shark Attack On Woman: షార్క్ చేపలను సముద్రంలో దూరం నుంచి చూస్తేనే భయపడిపోతాం! కానీ షార్క్ చేప తన కాలును పట్టేసినా భయపడకుండా ఓ మహిళ అత్యంత చాకచక్యంతో దాన్నుంచి తప్పించుకుంది. హీదర్ వెస్ట్ అనే మహిళ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సముద్రంలోకి ఈత కొట్టడానికి దిగింది. ఆమె సముద్రంలోకి దిగగానే.. క్షణాల్లో ఓ షార్క్ చేప ఆమె కాలును గట్టిగా పట్టేసి సముద్రంలోకి లాక్కునే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన ఆమె షార్క్ చేప నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. కాళ్లు, చేతులు గట్టిగా ఆడిస్తూ.. దాని తలపై బలంతో కొడుతూ దాడి చేసి తప్పించుకుంది. ఈ విషయాన్ని హీదర్ వెస్ట్ స్వయంగా వెల్లడించారు. షార్క్ చేపతో దాదాపు 35 సెకన్ల పాటు భీకరంగా పోరాడినట్లు తెలిపారు. బలంగా కొట్టడంతో షార్క్ చేప తనను వదిలేసిందని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by 🌵 Heather West 🌵 (@wildwitchofthew3st) -
ఆ షార్క్ చేప వాంతి చేసుకోవడంతోనే మిస్టరీగా ఉన్న హత్య కేసు చిక్కుముడి వీడింది!!
Tiger Shark Vomited Human Arm In An aquarium: కొన్ని కేసులు ఎంతలా పోలీసులు ప్రయత్నించినప్పటికీ వాటిని చేధించడం చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఒక పట్టాన ఆధారాలు దొరకవు. దీంతో పోలీసులకు ఆ కేసులు ఎప్పటికి పరిష్కారం కానీ ఒక మిస్టరీ కేసులుగా కనిపిస్తుంటాయి. అచ్చం అలాంటి ఒక అపరిష్కృత కేసును ఒక షార్క్ చేప సాయంతో చేధించగలిగారు. (చదవండి: అఫ్ఘాన్ బాలికలు విద్యనభ్యసించేలా బలమైన యూఎస్ మద్దతు కావాలి!) అసలు విషయంలోకెళ్లితే...ఆస్ట్రేలియాలో సిడ్నీలోని కూగీ అక్వేరియంలో ఒక పెద్ద షార్క్ చేప ఒకరోజు అనూహ్యంగా వాంతులు చేసుకోవడం మొదలు పెట్టింది. దీంతో అక్వేరియంలో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్‌కి గురవుతారు అయితే ఆ షార్క్ చేప తొలుత మొదటగా ఒక ఎలుకను, పక్షిని వాంతి చేసుకుంది. ఆ తర్వాత ఒక తెగిపడిన మానవ చేతిని వాంతి చేసుకుంటుంది. దీంతో ఆస్ట్రేలియాను పట్టి పీడిస్తున్న 1935 నాటి ఒక హత్య కేసు పోలీసులు చేధిస్దారు. అసలేం జరిగిందంటే ఆ షార్క్ చేప వాంతి చేకున్న చేయి జిమ్మీ స్మిత్ అనే మాదక ద్రవ్యాల స్మగ్లర్ది. పైగా ఆ చేతిపై ఇద్దరూ బాక్సర్లు చెలరెగిపోతున్న ఒక పచ్చబొట్టు ఉంటుంది, అంతేకాదు ఆ చేయి మణికట్టుకు ఒక తాడు ఉంటుంది. అయితే ఈ స్మిత్ మాజీ సైనికుడు ప్యాట్రిక్ బ్రాడీతో కలిసి తమ క్లైయింట్లను ఫోర్జరీ చేసిన నకిలీ చెక్‌లతో మోసం చేస్తుండేవారు. అ తర్వాత కొన్నాళ్లకి ఆ ఫోర్జరీ కేసు నుంచి ఇద్దరూ ఏదో విధంగా బయటపడ్డారు. ఈ మేరకు కొంతకాలం తర్వాత స్మిత్ బ్రాడిని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. అయితే ఆ ఇద్దరూ చివరిసారిగా ఒక హోటల్ కలిసి మధ్యం సేవించినట్లు వారి కదలికలను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత రోజే స్మిత్ హత్యకు గురవ్వడంతో పోలీసులు అనుమానంతో బ్రాడీని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే స్మిత్ మృతదేహ కనిపించకపోవడంతో పోలీసులు ఆ కేసును చేధించలేక తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో కూగీ అక్వేరియం యజమాని బ్రెట్ హాబ్సన్ షార్క్ చేప వాంతులు చేసుకన్న వీడియోలతో పాటు ఎలా వాంతులు చేసుకుందో వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు ఆ షార్క్ చేప వాంతి చేసుకున్న మానవ చేయి ఆధారంగా ఈ కేసును చేధించారు. అయితే విచారణలో షార్క్ చేప స్మిత్‌పై దాడి చేయలేదని పోలీసులు నిర్థారించారు. (చదవండి: పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..) -
చేప కోసం వలేస్తే షార్కే పడింది
ఓ వ్యక్తి చేపల కోసం వలేస్తే షార్కే పడింది. అయినా షార్క్ అంత ఈజీగా పడుతుందా అంటారా.. కచ్చితంగా కాదు. ఆ వ్యక్తిని ముప్పుతిప్పలు పెట్టింది. గంట సేపు ప్రాణాలకు తెగించి పోరాడాడు. చివరకు బోట్లోకి చేర్చాడు. దాని కొలతలు తీసుకున్నాక తిరిగి సముద్రంలోకి వదిలేశాడు. ఇంగ్లండ్‌లోని నార్తాంప్టన్‌షైర్‌కు చెందిన సైమన్ డేవిసన్ ఎప్పటిలాగే సముద్రంలో వేటకు వెళ్లాడు. వలేశాడు. లాగి చూశాడు. చాలా బరువుగా ఉంది. ఉత్సాహం పెరిగింది. మరింత గట్టిగా ప్రయత్నం చేయగా భారీ షార్క్ బయటకు వచ్చింది. దాన్ని చూసిన డేవిసన్ గుండె గుభేలంది. మరో ఆరుగురి సహాయంతో దాన్ని బోట్లోకి చేర్చే ప్రయత్నం చేశాడు. భారీ పోర్బీగుల్ షార్క్.. ఒక్కసారిగా సముద్రంలోకి లాగింది. ఆ ధాటికి బోట్ 600 మీటర్లు ముందుకుపోయింది. ఇలా గంటసేపు పోరాటం తర్వాత అతి కష్టం మీద ఆ చేపను బోట్‌పైకి తెచ్చారు. దాని కొలతలు తీశారు. 7 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, దాదాపు 249 కిలోలు బరువు ఉన్న ఈ షార్క్‌ను చూసి కాసేపు సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత దానికి ఉన్న బంధనాలు తొలగించి, జాగ్రత్తగా మళ్లీ సముద్రంలోకి వదిలేశారు. చదవండి: (కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!) ఎందుకంటే.. చాలా మంది జాలర్లు షార్క్‌లను పట్టుకోరు. ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో పట్టుబడ్డ ఈ తరహా షార్క్‌లలో ఇదే అతి పెద్దది కావడం విశేషం. ఇంత భారీ చేపలు వలకు చిక్కడం చాలా అరుదని జాలర్లు చెబుతున్నారు. గతంలో క్రిస్ బెన్నెట్ అనే జాలరికి ఇటువంటి 230 కిలోల షార్క్ దొరికింది. ఆ తర్వాత ఇదే భారీ షార్క్. ఇంత పెద్ద షార్క్ వలలో పడటం తన జీవితంలోనే మొదటి సారి అని డేవిసన్ చెప్పాడు. ఈ భారీ షార్క్‌తో పెద్ద పోరాటమే చేశామని, అటువంటి దానిని పట్టుకోవడం ఆనందం కలిగించిందని అన్నాడు. చదవండి: (ఇమ్రాన్‌తో బైడెన్ ఎప్పుడు మాట్లాడేదీ చెప్పలేం) -
వింత షార్క్ పిల్ల.. అదృష్టం తెస్తుందంట!
జకార్తా : షార్క్ కడుపులోని పూర్తిగా ఎదగని పిల్ల ఓ మత్స్యకారుడ్ని సెలెబ్రిటీని చేసింది. వింత ఆకారంలో ఉన్న ఆ షార్క్ పిల్ల తనను అదృష్టవంతుడ్ని చేస్తుందన్న నమ్మకంతో దాన్ని అమ్మకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన అబ్ధుల్లా నురెన్ అనే వ్యక్తి ఫిబ్రవరి 21వ తేదీ చేపలు పట్టడానికి ఈస్ట్ నుసా టెంగ్గరలోని రోట్ న్డాడోకు వెళ్లాడు. చేపలకోసం వల విసరగా అందులో ఓ షార్క్ పడింది. మరుసటి రోజు షార్క్ పొట్టను కోసి చూడగా అందులో రెండు షార్క్ పిల్లలు మరో వింత జంతువు కనిపించింది. అది ఏంటో తెలియక తికమకకు గురయ్యాడు అబ్ధుల్లా. ముఖం ఏలియన్‌లాగా, కింద కొంత శరీరం మత్స్య కన్యలాగా.. మిగిలిన కింద భాగం చేపలాగా ఉంది. అది పూర్తిగా ఎదగని షార్క్ పిల్ల అని తెలుసుకోవటానికి కొంత సమయం పట్టింది. ( భార్యకు వాలెంటైన్స్ డే గిఫ్ట్‌గా ఓ ప్రాణం ) తర్వాత ఆ వింత షార్క్ పిల్లను ఇంటికి తీసుకెళ్లాడు. షార్క్ విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దీనిపై అబ్ధుల్లా మాట్లాడుతూ.. ‘‘షార్క్ పిల్లను చూడటానికి వచ్చే జనంతో మా ఇళ్లు కిక్కిరిసిపోయింది. చాలా మంది దాన్ని కొనుక్కుంటామని అడుగుతున్నారు. నేను అమ్మకుండా దాచుకోవాలనుకుంటున్నాను. అది నాకు అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను’’ అని అన్నాడు. -
వలలో సొర చేప.. జాలర్లకు అరుదైన ఘనత
తీరువనంతపురం: కేరళకు చెందిన మత్స్యకారులు తమ వలకు చిక్కిన సొరచేపను తిరిగి సముద్రంలో విడిచిపెట్టి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేగాక అంతరించిపోతున్న సొరచేప పట్ల బాధ్యయుతంగా వ్యవహరించిన వారందరూ అటవీ శాఖ నుంచి అరుదైన ఆవార్డును అందుకోనున్నారు. తిరువనంతపురంలోని షాంఘుముఖం బీచ్ సమీపంలో శుక్రవారం వేటకు వెళ్లిన మత్సకారులకు అంతరించిపోతున్న అరుదైన జాతి సొరచేప చిక్కింది. అయితే ఆ సోరచాప సజీవంగా ఉండటంతో మత్స్యకారులు దాన్ని తిరిగి సముద్రంలో విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే దానిని సముద్రంలో విడిచిపెట్టారు. అయితే ఇదంతా తన ఫోన్లో రికార్డు చేసిన అజీత్ అనే స్థానిక వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో అంతరించిపోతున్న తిమింగలం జాతిని కాపాడేందుకు బాధ్యయుతంగా వ్యవహరించిన మత్స్యకారులపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ఆ ప్రిన్సిపల్ ఇలా చేశారంటే నమ్మబుద్ధి కావట్లేదు!) అయితే దీనిపై మత్స్యకారులు మాట్లాడుతూ.. ‘వాతావరణ అధికారులు సలహా మేరకు మేమంతా సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం. దీంతో తీరం నుంచే చేపలు పట్టే పనిలో పడ్డాం. ఈ క్రమంలో షాంఘుముఖం తీరం ఒడ్డున మా వలలో ఓ పెద్ద సొరచేప చిక్కింది. ఇక అందరం వలను బయటకు లాగి చేపను బయటకు తీశాం. అయితే ఇలాంటి సొరచేపను మేము ఎప్పుడు చూడలేదు. ఇది అంతరించి పోతున్న అరుదైన జాతి సొరచేపగా గుర్తించాం. ఇక అది ప్రాణాలతో ఉండటంతో తిరిగి సముద్రంలోకి వదిలాం’ అని చెప్పుకొచ్చారు. అయితే ఇవి సముద్రంలో మధ్యలో ఉంటాయని, ఇటీవల కురిసిన వర్షాలకు, వాతావరణంలో వచ్చిన మార్పు కారణంగా ఇది తీరానికి వచ్చి ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. దీంతో వన్యప్రాణి పట్ల బాధ్యయుతంగా వ్యవహరించిన సదరు మత్స్యకారుల తీరు ప్రశంసనీయమని, వారందరిని చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ ఆవార్డుతో సత్కరించాలని అటవీ శాఖ అధికారులు నిర్ణయించారు. (చదవండి: దినసరి కూలీకి భారీ షాక్.. చివరికి..) -
జస్ట్ మిస్: సొర చేపకు స్నాక్ అయ్యేవాడు
ఫ్లోరిడా : పారే నదిలో ఈత కొట్టడం అంటే ఎవరికి సరదా ఉండదు. కానీ ఈ సరదా కొన్నిసార్లు అపాయాలను కూడా తెచ్చి పెడుతుంది. ఫ్లోరిడాలోని మిలామీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా సముద్రంలోనే స్విమ్మింగ్ చేస్తున్నాడు. అతడికి తోడుగా ఓ సొర చేప కూడా అదే సంద్రంలో ఈత కొడుతోంది. స్వేచ్ఛగా తనకు నచ్చినదారిలో ఈదుకుంటూ వెళ్తూ నెమ్మదిగా మనిషి సమీపంలోకి వెళ్లింది. దీంతో దానికి దారిస్తూ పక్కకు తప్పుకున్నాడు. అయినా సరే.. ఆ సొర చేప అతడిని వెంటాడుతూ సమీపంలోకి వెళ్లింది. దగ్గరకు రానిచ్చే ప్రసక్తే లేదన్నట్టుగా ఆ వ్యక్తి లోపల భయంగానే ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ మరింత దూరం జరుగుతున్నాడు. (చదవండి: 3 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేసింది!) హారర్ సినిమాను తలపిస్తున్న ఈ దృశ్యాన్ని డ్రోన్ సాయంతో చిత్రీకరించగా ఈ వీడియోను స్థానిక ఫొటోగ్రాఫర్ జేసన్ మెకింటోష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సొర చేప మాత్రమే కనిపించినప్పుడు మామూలుగా ఉన్న మ్యూజిక్.. షార్క్‌కు దగ్గరలో మనిషి ప్రత్యక్షం కాగానే డేంజర్ బెల్స్ మోగించినట్లుగా ప్రతిధ్వనించే సంగీతం గుబులు పెట్టిస్తోంది. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా అతడి గుండెధైర్యాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. జస్ట్ మిస్.. లేదంటే సొర చేపకు స్నాక్ అయ్యేవాడంటూ మరికొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. అతడి చుట్టూ చక్కర్లు కొట్టిన సొర చేప సదరు మనిషిని గాయపర్చలేదని మెకింటోష్ స్పష్టం చేశాడు. (చదవండి: ఐ ఫోన్ కోసం కిడ్నీ అమ్మాడు, చివరికి..) View this post on Instagram A post shared by JMac (@jasonmac7) -
ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న మహిళ
ఫ్లోరిడా: భారీ సైజులో ఉండే సొర చేపను చూస్తే సాధారణంగానే భయం వేస్తుంది. అలాంటిది దాని దగ్గర వెళ్లి ఈత కొట్టాలంటే ఇంకెలా ఉంటుంది? గుండె ఆగినంత పనవుతుంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఇసో మచాడో తన కుటుంబం, స్నేహితులతో కలిసి సముద్రంలో షికారుకు వెళ్లింది. ఆ తర్వాత అక్కడి పడవలో నుంచి ఎంతో ఉత్సాహంగా సముద్రంలోకి దూకింది. కానీ ఆమె సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. పడవకు, ఆమెకు మధ్యలో సొరచేప ప్రత్యక్షం కావడంతో పడవలో ఉన్న ఆమె కొడుకు ఆంథోని భయంతో అరుస్తూ సంకేతాలు ఇచ్చాడు. దీంతో అక్కడున్న జీవిని చూసేసరికి ఆమె ప్రాణం గతుక్కుమంది. (ఇలాంటి అద్భుతాలు అరుదుగా జరుగుతాయి) అయితే ఆమె ప్రాణభయంతో ఎలాంటి కేకలు పెట్టకుండా నిశ్శబ్ధంగా ఉండటంతో ఎనిమిది అడుగుల పొడవున్న ఆ సొర చేప మహిళకు దగ్గరగా వెళ్లినట్లే వెళ్లి తిరిగి తన దారిన అది వెళ్లిపోయింది. దీంతో ఆమె బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "చావును చాలా దగ్గర నుంచి చూసింది", "టైం బాగుంది కాబట్టి సరిపోయింది", "పెద్ద ప్రమాదం నుంచే తప్పించుకున్నావు" అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు) -
నీకు పిచ్చా.. షార్క్‌తో పెట్టుకుంటావా?..
వాషింగ్టన్ : షార్క్‌లు ఎంత ప్రమాదకరమైన జీవులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటిని దూరం నుంచి చూస్తేనే చాలు కొంతమందికి జడుసుకుని జ్వరం వచ్చేస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి షార్కుతో గేమ్స్ ఆడుకున్నాడు. ఈ సంఘటన అమెరికాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, డెలావేర్కు చెందిన ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం అక్కడి కేప్ హెన్లోపెన్ స్టేట్ పార్క్ బీచ్‌కు వెళ్లాడు. సముద్రంలో ఈత కొడుతుండగా అతడికి ఓ షార్క్ కనిపించింది. మామూలుగా అయితే ఎవరైనా దాన్ని చూడగానే భయపడతారు. కానీ, అతడు మాత్రం దాని తోకపట్టుకుని లాగి కొద్దిగా పైకి ఎత్తాడు. (అబ్రకదబ్ర.. సెలబ్రిటీ అయిపోయింది!) అనంతరం కొన్ని క్షణాల పాటు దాని నోరు తెరిచిపట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను రాచెల్ ఫాస్టర్ అనే యువతి తన ఫేస్బుక్ ఖాతాలో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘‘ అతడో మహాబలుడు... షార్క్‌తో గేమ్స్ వద్దు శాల్తీలు లేచిపోతాయి... నీకు పిచ్చా! షార్క్‌తో పెట్టుకుంటావా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు) -
క్షణం ఆలస్యమైతే దానికి చిక్కేవారే..!
ఫ్లోరిడా : అదృష్టం బాగుండబట్టి ఆ పిల్లలు ప్రాణాలతో మిగిలారు. లేదంటే క్షణకాలంలో ఆ యమకింకరి వారి ఉసురుతీసేది. దేవుడిలా అక్కడే ఉన్న తండ్రి యుముడిలా దూసుకొస్తున్న షార్క్ బారినుంచి కుంటుంబాన్ని రక్షించాడు. ఫ్లోరిడాలోని న్యూ స్మిర్నా బీచ్‌కి కుటుంబంతో కలిసివెళ్లిన డానియెల్ వాట్సన్ ఒడ్డున కూర్చుని తన డ్రోన్ కెమెరాతో నీటిలో కేరింతలు కొడుతున్న తన పిల్లలు, భార్య ఫోటోలు షూట్ చేస్తున్నాడు. ఆ సమయంలో వారి వైపునకు ఏదో నల్లని ఆకారం కదులుతూ వస్తోంది. కెమెరా ఇంకొంచెం క్లారిటీ చేయడంలో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. మనుషుల్ని మింగే షార్క్ తన కుటుంబం వైపునకు దూసుకొస్తోంది. వెంటనే తన భార్యను అప్రమత్తం చేశాడు. నీటిలో నుంచి బయటికి రావాలని కేకలు వేశాడు. భర్త అరుపుల్ని విన్న ఆ మహిళ కాసింత లోపలికి వెళ్లి ఆడుకుంటున్న పిల్లల్ని తీసుకొని క్షణాల్లో ఒడ్డుకు చేరింది. డానియెల్ ఊపిరిపీల్చుకున్నాడు. అనంతరం వారికి నీటిలో దాగున్న షార్క్ ఫొటోలను చూపించాడు. సరిగ్గా షార్క్ వారం క్రితం అదే బీచ్‌లో ఓ 18 ఏళ్ల యువకున్ని అదే షార్క్ పొట్టనబెట్టుకోవడం గమనార్హం. షార్క్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. View this post on Instagram See that dark shadow making its way straight for the shore & those people? That was my view this weekend while flying my Mavic 2 Pro… and oh, 3 of those people are my kids! Swipe to see the next image that resulted from my yelling to get out of the water and the unmistakable outline of a shark. Definitely too close of an encounter for my liking! Link in my profile to check out more info & footage from the drone!!! Thinking my @djiglobal drone is now coming with me to every beach day!!! #dji #mavic2pro #polarpro @polarpro A post shared by Dan Watson (@learningcameras) on Jun 24, 2019 at 12:16pm PDT -
అంతరించిపోతున్న సొర చేపలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అరేబియా సముద్రంలో సొర చేపలు (షార్క్స్) నశించిపోతున్నాయి. ప్రధానంగా వేట వల్లనే ఈ పరిస్థితి వస్తున్నట్లు నిపుణులు తెలియజేస్తున్నారు. సొర చేపలను వేటాడంలో ప్రపంచంలోనే ఇండోనేసియా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. సొర చేపల్లోని ప్రతి అవయంతోని ఉపయోగం ఉండడమే అందుకు కారణం. సొర చేప చర్మాన్ని పాద రక్షలు, బ్యాగుల తయారీకి ఉపయోగించడం, దాని లివర్ నుంచి వచ్చే నూనెకు డిమాండ్ ఎక్కువగా ఉండడం, దానిలోని మదులాస్థిని ఔషధాల్లో ఉపయోగించడం లాంటి ఉపయోగాలెన్నో. మానవులకన్నా, వక్షాలకన్నా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే, అంటే దాదాపు 35 కోట్ల క్రితం నుంచి జీవిస్తున్న సొర చేపల్లో 153 రకాల సొర చేపలు ఉన్నాయి. వాటిలో ఇప్పటికే 50 శాతం రకాలు అంతరించిపోయినట్లు డాక్టర్ రిమా జమాడో తెలియజేశారు. ఆయనతోపాటు పలు దేశాలకు చెందిన 24 మంది బయోలాజిస్టులు 2017లో ఆరేబియా సముద్రంతోపాటు పక్కనే ఉన్న ఎర్ర సముద్రం, ఓమన్ సముద్రంతోపాటు 20 దేశాలకు ఆనుకున్న సముద్రాల్లో వారు సొర చేపల మనుగడపై అధ్యయనం చేశారు. వారిలో భారత్‌కు చెందిన బయోలాజిస్టు కూడా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిషరీస్ కారణంగానే సొర చేపలకు ముప్పు వస్తోందని బయోలాజిస్టుల అధ్యయనంలో తేలింది. వాణిజ్యపరంగా డిమాండ్ ఉన్న ఇతర చేపల లక్ష్యంగా ఫిషరీస్ విభాగాలు వేటాడుతుంటే సొరచేపలు ఎక్కువ పడుతున్నాయి, వాటిని మళ్లీ నీటిలోకి వదలకుండా వాటి అవయవాలకు కూడా డిమాండ్ ఉండడంతో అవి ఎక్కువ ఎగుమతి అవుతున్నాయి. అన్ని సొర చేపల లివర్ ఆయిల్‌కు డిమాండ్ ఉండదు. వెయ్యి అడుగుల లోతుల్లో తిరుగాడే సొర చేపల లివర్ ఆయిల్‌కే డిమాండ్ ఉంటుంది. వాటిలోనే ఔషధ గుణాలు ఉంటాయన్న నమ్మకం. ఇంతకుముందు మాల్దీవుల్లో, ఇప్పుడు జపాన్ ఈ లివర్ ఆయిల్‌ను ఉత్పత్తి చేసే పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి. -
తల తెంచి.. నోట్లో సిగరెట్ పీకలు
ఉదయాన్నే ఆఫీస్‌కు వచ్చిన వారికి గేటు దగ్గరే ఒళ్లు గగ్గురుపొడిచే దృశ్యం దర్శనమిచ్చింది. ఓ మూగ జీవిని అతి క్రూరంగా చంపి, దాని తలను గేటును వేలాడదీశారు. సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్ కాగా, తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం, వైల్డ్ లైఫ్ విభాగాలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని ఘటనపై దర్యాప్తు చేపట్టాయి. సిడ్నీ: సౌత్ సిడ్నీకి 100 కిలోమీటర్ల దూరంలోని షెల్ హార్బర్ మెరైన్ రెస్క్యూ ఆర్గనైజేషన్ కార్యాలయం. ఆదివారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బందికి భయానక దృశ్యం దర్శనమిచ్చింది. కార్యాలయం బయట ఉన్న ఫెన్సింగ్‌కు ఓ షార్క్ తల గుచ్చి ఉంది. దాని నోట్లో సిగరెట్ పీకలు.. సముద్రంలోని చెత్తను కుక్కారు. దిగ్భ్రాంతికి గురైన సిబ్బంది వెంటనే విషయాన్ని వైల్డ్ లైఫ్ అధికారులకు తెలియజేశారు. సుమారు 70 కేజీల బరువు ఉన్న ఆ జీవిని దుండగులు వేటాడి చంపి ఆపై దానిని తలను వేరు చేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు రక్తపు మరకల ఆధారంగా ఘటన జరిగి 24 గంటలు కూడా దాటి ఉండకపోవచ్చని, బహుశా శనివారం రాత్రిపూట దానిని వేటాడి ఉంటారని అంచనా వేస్తున్నారు. సీసీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా క్లూస్ సంపాదించే పనిలో అధికారులు ఉన్నారు. జంతు ప్రేమికుల ఆవేదన.. కాగా, ఆ ఫోటోను ఆర్గనైజేషన్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘మనిషి మృగంగా మారి మూగజీవాన్ని పొట్టనబెట్టుకున్నాడు’ అంటూ ఓ సందేశం ఉంచింది. నిందితులెవరైనా తెలిస్తే సమాచారం ఇవ్వాలని, జీవితంలో ఇలాంటి తప్పును మరోసారి చేయకుండా వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సరదా కోసం ఇలాంటి చేష్టలకు దిగుతున్న వారిని.. అదే స్థాయిలో దండిచాలని పలువురు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లాస్టిక్ రాకాసి.. ప్లాస్టిక్ బ్రహ్మ రాక్షసి మూలంగా జల చర జీవులు మృత్యువాత పడుతున్న ఘటనలు ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. తాజాగా ఓ తిమింగలం శవ పరీక్షలో భారీ ఎత్తున్న ప్లాసిక్ట్ సంచులు బయటపడ్డ ఘటన థాయ్‌లాండ్‌లో చోటు చేసుకుంది.(పూర్తి కథనం)... నిన్నగాక మొన్న అరుదైన తాబేలు కడుపులోనూ భారీ ఎత్తున్న ఫ్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. సముద్ర నీటిని కలుషితం చేయటం మూలంగా జీర్ణ వ్యవస్థ నాశనం అయి జలచరాలు మృత్యువాతపడుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
షార్క్ చేపల వేట : వైరల్
ఫ్లోరిడా : సముద్రజలాల్లో జీవించే అతి పెద్ద జలచరాల్లో ‘షార్క్’ కూడా ఒకటి. వీటిని చాలా మంది జంతు ప్రేమికులు ఏ డిస్కవరీ లేక జియోగ్రఫీ చానల్లోనో చూసుంటారు. దగ్గరి నుంచి చూడాలన్నా కొంతమంది భయపడుతుంటారు. కానీ ఎలియట్ సుడాల్కు మాత్రం షార్క్ చేపలను వేట వెన్నతో పెట్టిన విద్య. ఈ మధ్యే ఫ్లోరిడా బీచ్‌లో పట్టుకున్న రెండు హ్యామర్‌హెడ్ షార్క్ చేపల(షార్క్‌లలో ఒక జాతి చేపల ముఖాలు అచ్చు ‘సుత్తి(హ్యామర్)’ని పోలి ఉంటాయి)కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సుడాల్ పట్టుకున్న షార్క్ చేపలలో ఒకటి 12 అడుగుల పొడుగుతో అతి భయంకరంగా ఉంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు అది నిజమయిన షార్క్ చేపలు కావని అంటుంటే, మరికొందరు ఈ సముద్ర ప్రాంతంలో మేము ఎప్పుడూ షార్క్ చేపలు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సుడాల్ మాత్రం షార్క్ చేపలు పట్టుకొని వాటిని పరిశీలించి, వాటిన జాగ్రత్తగా సముద్రంలోకి తిరిగి వదిలేయటమే తన పని అని పేర్కొన్నాడు. ఇప్పటివరకూ 500 లకు పైగా షార్క్ చేపలను పట్టుకున్నట్లు, గత ఏడాదిలోనే 200లకు పైగా ఇలాంటి జలచరాలను వేటాడినట్లు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుడాల్ తెలిపారు. అంతేకాకుండా అతను వేటాడిన షార్క్ చేపలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ చేయడం ఆయన హాబీ. వాటి జీవనం, ప్రయాణం, ఎలాంటి సముద్ర జలాల ఉష్ణోగ్రత వద్ద వాటి జీవనం బాగుంటుందో పరిశీలించడమే పని అంటూ సుడాల్ స్పష్టం చేశారు. -
క్రూర మృగాన్నే అతి దారుణంగా చంపారు
న్యూయార్క్ : మృగాలుగా మారిన కొందరు పాల్పడిన దుశ్చర్యకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్లో వైరల్ అవుతోంది. ఓ షార్క్‌ను బోట్ కు కట్టేసి ఈడ్చుకెళ్లి మరీ చంపిన ఘటన కలవరపాటుకు గురిచేస్తోంది. ఫ్లోరిడాకు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ సమ్మర్లో ఈ ఏడాది జూన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మోటర్ బోట్‌కు తాడుతో దాని తలకు గాలం వేశారు. ఆపై ఆ అరడుగుల మూగజీవిని కట్టేసి ఈడ్చుకెళ్లారు. పైగా ఈ ఘటనను స్నాప్‌ఛాట్‌లో పోస్ట్ చేశారు కూడా. పైగా అది విలవిల కొట్టుకుంటుంటే నవ్వుతూ ఆనందించారు. ఈ క్రమంలో పలువురు కామెంట్లు చేయగా.. వారితో సంవాదానికి కూడా దిగారు. చివరకు మోటర్ చక్రంలో పడి అది రెండు ముక్కలైంది. అనంతరం ఒడ్డుకు చేరాక అతికర్కశంగా ముక్కలైన దాని మృతదేహాన్ని చూపిస్తూ ఫోటోలు దిగారు. జంతు పరిరక్షణ సంఘాల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు. విచారణ అనంతరం ముగ్గురిని అరెస్ట్ చేశారు. మైకేల్ వెంజెల్, అతని ముగ్గురు స్నేహితులు పార్టీ చేసుకునేందుకు వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. మరోకరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. పార్టీ కోసం వెళ్లి మూగజీవిపై దుశ్చర్య -
పార్టీ కోసం వెళ్లి మూగజీవిపై దుశ్చర్య
-
షార్క్ తోక పట్టుకులాగాడు.. అంతే!
దారి తప్పి బీచ్ తీరానికి వచ్చిన చిన్న టైగర్ షార్క్ చేపను పట్టుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. తోక పట్టుకునేందుకు ప్రయత్నించిన అతని చేతిని షార్క్ కొరికేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటన నార్త్ కరోలినాలోని వ్రైట్స్విల్లే బీచ్‌లో చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితులు టైగర్ షార్క్‌ను పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. దారి తప్పి లోతు తక్కువగా ఉన్న ప్రాంతంలోకి వచ్చిందో టైగర్ షార్క్ చేప పిల్ల. తిరిగి లోతు ప్రాంతానికి వెళ్లడానికి యత్నిస్తున్న దాన్ని చూసిన ఇద్దరు స్నేహితులు పట్టుకునేందుకు ప్రయత్నించారు. నడుము లోతు ఉన్న నీటిలోకి దిగి షార్క్ తోక పట్టుకున్నాడు ఇద్దరి స్నేహితుల్లో ఒక వ్యక్తి. అంతే ఒక్కసారిగా వెనక్కు మళ్లిన షార్క్ అతని చేతిని కొరికేసింది. దీంతో అతని చేతికి తీవ్రగాయమై రక్తం స్రావం కావడం మొదలైంది. ఉబికి వస్తున్న రక్తాన్ని మరో చేత్తో అదిమి పట్టుకున్న వ్యక్తి ఒడ్డుకు పరుగెత్తాడు. ఆ తర్వాత ఎలాగో షార్క్‌ను పట్టుకుని తిరిగి సముద్రంలోకి వదిలేశారని తెలిసింది. గాయాలైన వ్యక్తి పరిస్ధితి ఎలా ఉందనే విషయంపై సమాచారం లేదు. -
కొన్నాళ్లకు షార్క్‌లు కనపడవు
శోధన షార్క్ చేపల్లో ఇంతవరకూ తెలిసి 21 రకాలు ఉంటే వాటిలో 16 జాతులు అంతరించిపోతున్నాయని తాజా పరిశోధనల్లో వెల్లడయింది.సముద్రజలాల్లో షార్క్, రే జాతులలోని గ్రేట్ వైట్ షార్క్, వేల్ షార్క్, క్రొకడైల్ షార్క్, బిగ్ ఐ థ్రెషర్స్, బాస్కింగ్ షార్క్స్, షార్ట్ఫిన్ మాకోస్, లాంగ్‌ఫిన్ మాకోస్, సల్మోన్ షార్క్స్, సిల్క్ షార్క్స్, సిల్కీ షార్క్స్ వంటి జాతులెన్నో ఉన్నాయి. అయితే, షార్క్ చేపల మొప్పల కోసం, మాంసం కోసం ఇటీవల వాటిని క్రూరంగా వేటాడుతున్నారని తేలింది. షార్క్ మొప్పల (ఫిన్) తో చేసిన సూప్ ఆసియా దేశాలలో కొత్త క్రేజ్. షార్క్ చేపలు, రేస్ వంటివి పిల్లల్ని ఉత్పత్తి చేయడానికి ఎక్కువ కాలం తీసుకుంటాయి. అందువల్ల వాటిని భారీగా వేటాడటం వల్ల అనేక షార్క్ జాతులు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉందని ఐయుసిఎన్ షార్క్ స్పెషలిస్ట్ గ్రూప్ వెల్లడించింది. వివిధ దేశాలకు చెందిన 15 మంది సైంటిస్టులు ఈ పరిశోధనల్లో పాల్గొన్నారు.జీవరాశి కాలక్రమంలో అంతరించిపోవడానికి సహజంగా చాలా కాలం పడుతుంది. అంతరించిపోతున్న ఇతర జీవులతో పోలిస్తే షార్క్ జాతి క్షీణత వంద రెట్లు వేగంగా జరుగుతుండటం పర్యావరణవేత్తలను కలవరపెడుతోంది. షార్క్ జాతి పరిరక్షణకు ఐయుసిఎన్ పరిశోధకులు కొన్ని సూచనలు చేస్తున్నారు. శాస్త్ర సంబంధమైన పరిశోధనలకు మాత్రమే సొరచేపలను పట్టుకోవాలి. వాటి మాంసాన్ని, మొప్పలను తొలగించిన తరువాత వాటి శరీరాన్ని సముద్రంలో వదిలివేస్తున్నారు. సొర చేపల వేటగాళ్లను నియంత్రించాలి. ఎప్పటికప్పుడు సొరచేపల గణాంకలను సేకరిస్తుండాలి. సముద్రతీర దేశాలన్ని షార్క్‌ల పట్ల బాధ్యతను వహించాలని పరిశోధకులు కోరుతున్నారు. -
షార్క్..ఓ అమేజింగ్ వీడియో
ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి అమేజింగ్ వీడియో నొకదాన్ని అనూహ్యంగా దొరకపుచ్చుకున్నారు. ఒక షార్క్ మరొక షార్క్ ను సగానికి కొరికి పారేసిన వైనం ఈ వీడియోలో రికార్డ్ అయింది. వెస్ జోన్స్ అనే మత్సకారుడు భయానకమైన ఫుటేజ్ ను సాధించాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో బ్లూమార్లిన్ చేప ఫిషింగ్ చేస్తుండగా ఈ వీడియోను రికార్డు చేసినట్టు చెప్పారు. -
షార్క్..ఓ అమేజింగ్ వీడియో
-
మెక్సికోలో ఏలియన్ చేప!
మెక్సికోలో ఓ అరుదైన చేప జాలర్ల చేతికి చిక్కింది. ఇంతకుముందు అల్బినో షార్క్ జాతికి చెందిన ఇలాంటి చేపలను ఎక్కడా చూడకపోవడంతో అరుదుగా కనిపించిన ఈ వింత ఆకారాన్ని గ్రహాంతర జీవిగా వారు భావించారు. అందుకే దాన్ని ఏలియన్ ఫిష్ అని పిలుస్తున్నారు. మనిషి చర్మాన్ని పోలిన చర్మం, కొంతవరకు మానవ శరీరాకృతిలో కనిపిస్తున్న అల్బినో షార్క్‌ను మెక్సికోలోని ఓ ప్రాంతంలో నీటి అడుగు భాగాన గుర్తించారు. తెలుపు, గులాబీ రంగుల కలయికతో ఉన్న చర్మం... అటు చేప, ఇటు మానవ శరీరాకృతులను పోలి ఉన్న అల్బినో ఫిష్‌ను కాబో సమీపంలో వేటకు వెళ్లిన జామీ రెన్డాన్ ఓడలోని ఓ జాలరి గుర్తించాడు. ఆకురాయిలా గరుకుగా ఉన్న చర్మంతోనూ, మూడు వరుసల పళ్లతోనూ, తలకు ఇరువైపులా మూడు గ్రిల్స్ లాంటి రంధ్రాలతోనూ ఈ వింత చేప శరీరం ఉందని రెన్డాన్ తెలిపాడు. ఆ చేప కనిపించగానే ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యానని, నిజంగా దాని కళ్లు మనిషి కళ్లలా చాలా విచిత్రంగా ఉన్నాయని అతడు ప్రిస్సెస్ స్పార్ట్ ఫిషింగ్ ఫ్లీట్ పేరున కొనసాగుతున్న ఓ బ్లాగ్‌కు షార్క్ వివరాలను వెల్లడించాడు. అనంతరం నిపుణులు ఈ తెల్లని చేపను అల్బినో స్వెల్ షార్క్‌గా గుర్తించారని, ఈ గ్రహాంతర జీవి ప్రమాదంలో ఉండటంతోనే బయటకు వచ్చి ఉంటుందని భావిస్తున్నారని రెన్డాన్ తెలిపాడు. తమకు చిక్కిన ఆ ఏలియన్ చేపను నిపుణులు గుర్తించిన తర్వాత తిరిగి జాగ్రత్తగా నీటిలోకి పంపించినట్లు జాలర్లు చెబుతున్నారు. ఈ చేపలు మనుషులకు ఎలాంటి హాని కలిగించవని, వాటికి హాని కలిగిస్తారనుకున్న జీవులు కానీ, మనుషులు కానీ కనిపించినపుడు ప్రాణరక్షణ కోసం అవి కడుపు నిండా నీటిని నింపి ఆకారాన్ని అతి పెద్దగా మార్చుకుంటాయని నిపుణులు తెలిపారు. -
షార్క్‌ను ఈడ్చి.. ఫోటోకు పోజిచ్చి
ఫ్లోరిడా: సెల్ఫీ పిచ్చితో అర్జెంటీనాలో ఓ బేబీ డాల్పిన్కు ఊపిరి ఆడకుండా చేసి దాని చనిపోయేలా చేసిన ఘటన మరువక ముందే అలాంటి ఘటన మరొకటి చోటుచేసుకుంది. సముద్రపు అలలకు ఒడ్డుకు వచ్చిన ఓ సొర చేప పిల్లను గుర్తు తెలియని వ్యక్తులు ఫొటోల పిచ్చితో ఈడ్చి పూర్తిగా ఇసుకలో పడేశారు. అనంతరం దానిని అమాంతం అణిచిపట్టి దాదాపు 30 సెకన్లపాటు వివిధ రకాల భంగిమల్లో ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ తర్వాత వీడియో తీశారు. ఇది ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో చోటుచేసుకుంది. ఈ తతంగాన్ని ఓ జర్నలిస్టు వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టగా ఆ వ్యక్తులపై నెటిజన్లు ఆ ఫొటోలు తిగిన వ్యక్తిపై భగ్గుమంటున్నారు. -
సో... సొరచేపలకు థ్యాంక్స్!
సైన్స్ సొరచేపలు సముద్రంలో ఏంచేస్తాయి? అనే ప్రశ్నకు- ‘‘ఏం చేస్తాయండీ...తమ పనేదో తాము చేసుకుంటాయి’’ అనే సరదా సమాధానమైతే రావచ్చుగానీ, వాటి గురించి మాట్లాడుకోవడానికి సీరియస్ విషయాలే ఉన్నాయి. తమ పనేదో తాము చేసుకోవడమే కాదు మానవాళికి అవసరమైన మంచి పని కూడా చేసి పెడుతున్నాయి. వివిధ స్థాయులలో నీటి ఉష్ణోగ్రతలను తెలుసుకోవడానికి గత దశాబ్దకాలంగా యూనివర్శిటీ ఆఫ్ మియామి(అమెరికా) పరిశోధకులు సొరచేపలను ఉపయోగించుకుంటున్నారు. వాటికి ఏర్పాటు చేసిన శాటిలైట్-లింక్డ్ ట్యాగ్ల ద్వారా సమాచార సేకరణ సాధ్యమవుతోంది. తాజా విశేషం ఏమిటంటే, కేవలం నీటి ఉష్ణోగ్రతలు మాత్రమే కాదు... గాలివానలు, తుపానుల గురించి తెలుసుకునే వీలుందని చెబుతున్నారు పరిశోధకులు. సొరచేపలు అందించే సమాచారంలో ఎన్నో హెచ్చరికలు నిక్షిప్తమై ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఒకవేళ ప్రమాదవశాత్తు సొరచేపలకు అమర్చిన ట్యాగ్లు వాటి నుంచి విడిపోయినా... అప్పటివరకు అది సేకరించిన సమాచారం మాత్రం మాయం కాదు. దానికి సంబంధించిన డాటా రికార్డ్ అవుతూనే ఉంటుంది. ‘‘కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడంలో వాటికి మించి సాధనాలు లేవు. ఆధునిక పరికరాలు చేయలేని పనిని కూడా అవి చేసి పెడుతున్నాయి. ఖచ్చితమైన సమాచారమే కాదు కీలక సమాచారాన్ని ఇస్తున్నాయి’’ అంటున్నాడు సముద్రజీవజాల శాస్త్రవేత్త జెరాల్డ్ ఆల్ట్. సొరచేపల నుంచి సేకరించిన సమాచారం తుపానుల బలాబలాలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ‘‘ఇది ప్రారంభం మాత్రమే... సొరచేపలు మనకు అందించే సమాచారంతో విపత్తుల గురించి తెలుసుకోవడమే కాదు.. ఎన్నో కొత్త విషయాలు కూడా తెలుసుకోవచ్చు’’ అంటున్నారు పరిశోధకులు.