ఫ్లోరిడా : సముద్రజలాల్లో జీవించే అతి పెద్ద జలచరాల్లో ‘షార్క్’ కూడా ఒకటి. వీటిని చాలా మంది జంతు ప్రేమికులు ఏ డిస్కవరీ లేక జియోగ‍్రఫీ చానల్‌లోనో చూసుంటారు. దగ్గరి నుంచి చూడాలన్నా కొంతమంది భయపడుతుంటారు. కానీ ఎలియట్ సుడాల్‌కు మాత్రం షార్క్ చేపలను వేట వెన్నతో పెట్టిన విద్య. ఈ మధ్యే ఫ్లోరిడా బీచ్‌లో పట్టుకున్న రెండు హ్యామర్‌హెడ్ షార్క్ చేపల(షార్క్‌లలో ఒక జాతి చేపల ముఖాలు అచ్చు ‘సుత్తి(హ్యామర్)’ని పోలి ఉంటాయి)కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
సుడాల్ పట్టుకున్న షార్క్ చేపలలో ఒకటి 12 అడుగుల పొడుగుతో అతి భయంకరంగా ఉంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కొందరు అది నిజమయిన షార్క్ చేపలు కావని అంటుంటే, మరికొందరు ఈ సముద్ర ప్రాంతంలో మేము ఎప్పుడూ షార్క్ చేపలు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సుడాల్ మాత్రం షార్క్ చేపలు పట్టుకొని వాటిని పరిశీలించి, వాటిన జాగ్రత్తగా సముద్రంలోకి తిరిగి వదిలేయటమే తన పని అని పేర్కొన్నాడు.
ఇప్పటివరకూ 500 లకు పైగా షార్క్ చేపలను పట్టుకున్నట్లు, గత ఏడాదిలోనే 200లకు పైగా ఇలాంటి జలచరాలను వేటాడినట్లు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సుడాల్ తెలిపారు. అంతేకాకుండా అతను వేటాడిన షార్క్ చేపలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో షేర్ చేయడం ఆయన హాబీ. వాటి జీవనం, ప్రయాణం, ఎలాంటి సముద్ర జలాల ఉష్ణోగ్రత వద్ద వాటి జీవనం బాగుంటుందో పరిశీలించడమే పని అంటూ సుడాల్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment