Viral Video: Baby Shark With Human Face Caught By Indonesian Fisherman - Sakshi
Sakshi News home page

వింత షార్క్‌ పిల్ల.. అదృష్టం తెస్తుందంట!

Published Wed, Feb 24 2021 10:27 AM | Last Updated on Wed, Feb 24 2021 3:40 PM

Indonesian Fisherman Caught Deformed Shark Baby - Sakshi

వింత షార్క్‌ పిల్ల

జకార్తా : షార్క్‌ కడుపులోని పూర్తిగా ఎదగని పిల్ల ఓ మత్స్యకారుడ్ని సెలెబ్రిటీని చేసింది. వింత ఆకారంలో ఉన్న ఆ షార్క్‌ పిల్ల తనను అదృష్టవంతుడ్ని చేస్తుందన్న నమ్మకంతో దాన్ని అమ్మకుండా తన దగ్గరే పెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఇండోనేషియాకు చెందిన అబ్ధుల్లా నురెన్‌ అనే వ్యక్తి ఫిబ్రవరి 21వ తేదీ చేపలు పట్టడానికి ఈస్ట్‌ నుసా టెంగ్గరలోని రోట్‌ న్డాడోకు వెళ్లాడు. చేపలకోసం వల విసరగా అందులో ఓ షార్క్‌ పడింది. మరుసటి రోజు షార్క్‌ పొట్టను కోసి చూడగా అందులో రెండు షార్క్‌ పిల్లలు మరో వింత జంతువు కనిపించింది. అది ఏంటో తెలియక తికమకకు గురయ్యాడు అబ్ధుల్లా. ముఖం ఏలియన్‌లాగా, కింద కొంత శరీరం మత్స్య కన్యలాగా.. మిగిలిన కింద భాగం చేపలాగా ఉంది. అది పూర్తిగా ఎదగని షార్క్‌ పిల్ల అని తెలుసుకోవటానికి కొంత సమయం పట్టింది. ( భార్యకు వాలెంటైన్స్‌ డే గిఫ్ట్‌గా ఓ ప్రాణం )

తర్వాత ఆ వింత షార్క్‌ పిల్లను ఇంటికి తీసుకెళ్లాడు. షార్క్‌ విషయం టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. దీనిపై అబ్ధుల్లా మాట్లాడుతూ.. ‘‘షార్క్‌ పిల్లను చూడటానికి వచ్చే జనంతో మా ఇళ్లు కిక్కిరిసిపోయింది. చాలా మంది దాన్ని కొనుక్కుంటామని అడుగుతున్నారు. నేను అమ్మకుండా దాచుకోవాలనుకుంటున్నాను. అది నాకు అదృష్టం తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను’’ అని అన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement