indonesia
-
ఇండియా–ఇండోనేసియాది తరాల బంధం: మోదీ
న్యూఢిల్లీ: భారత్, ఇండోనేసియాల మధ్యనున్నది కేవలం భౌగోళికరాజకీయం సంబంధం కాదని ప్రధాని మోదీ చెప్పారు. రెండు దేశాలది వేల ఏళ్లుగా పెనవేసుకుపోయిన బంధమని చెప్పారు. రెండు దేశాల భిన్నత్వంలో ఏకత్వమనే సంప్రదాయం కొనసాగుతోందని తెలిపారు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో సనాతన ధర్మ ఆలయంలో ఆదివారం జరిగిన మహా కుంభాభిషేకం సందర్భంగా వర్చువల్‌గా ప్రధాని మోదీ ప్రసంగించారు. జకార్తాలోని మురుగన్ ఆలయంలో అభిషేక ఉత్సవాల్లో పాలుపంచుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రజలు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్కంధ షష్ఠి కవచం ప్రజలను అన్ని వేళలా కాపాడాలని ఆకాంక్షించారు. మురుగన్ ఆలయంలో తిరుప్పుగల్ శ్లోకాలతో పూజలు కొనసాగాలన్నారు. ‘మనమంతా మురుగన్, శ్రీరాముడు, బుద్ధుని సంబం«దీకులమని చెప్పారు. -
ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఉద్యోగం ఇదే..!
‘నేను ఉద్యోగం మానేస్తా.. మానేస్తా..’ అని మీరు చేస్తున్న ఉద్యోగమే కష్టమైందని అనుకుంటున్న వారంతా ఇక్కడ ఓ లుక్ వేయండి. జీవనోసాధి కోసం కొందరు ప్రాణాలనే పణంగా పెట్టి, ఆపదతో కూడిన ఉద్యోగాలెన్నో చేస్తుంటారు. అలాంటి వాటిలో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన, ప్రమాదకరమైన ఉద్యోగం ఒకటి ఉందని ప్రముఖ యూట్యూబర్ దారా తహ్ చెప్పాడు. ‘ఇండోనేషియాలోని మౌంట్ ఇజెన్ అగ్ని పర్వతం దగ్గర పనిచేసే గని కార్మికులు అగ్నిపర్వతం నుంచి వెలువడే విష వాయువులతో రోజూ పోరాడాల్సి ఉంటుంది. ఆ వాయువుల్లో కొన్ని తక్షణమే చంపగలవు. అక్కడి వాయు మేఘాలు ఒక్కసారిగా కమ్ముకొచ్చి, ఊపిరి తీసే ప్రమాదం ఉంది. అక్కడి గంధకం గనికి వెళ్లే మార్గంలో ఒక యాసిడ్ సరస్సు ఉంది. ఇది చూడటానికి చక్కగా స్నానానికి అనువుగా అనిపిస్తుంది కాని, ప్రపంచంలోనే ప్రమాదకరమైన సల్ఫ్యూరిక్ యాసిడ్ సాంద్రత ఎక్కువగా ఉన్న సరస్సుల్లో ఇదీ ఒకటి. ప్రతిరోజూ వివిధ ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల కోసం ఉపయోగించే సల్ఫర్‌ను ఇలాంటి ప్రదేశాల నుంచే సేకరిస్తారు. ‘ఇక్కడ ఒక అరగంట కూడా నేను ఉండలేకున్నా, నా జీవితంలో చూసిన అత్యంత ప్రమాదకర ఉద్యోగం ఇదే’ అంటూ తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. (చదవండి: నాటి బాలకార్మికురాలు..ఇవాళ లీడ్ స్టార్!) -
బలమైన బంధం దిశగా..!
భౌగోళికంగానే కాదు... సంస్కృతి, నాగరికతల్లోనూ శతాబ్దాలుగా సన్నిహితమైన రెండు దేశాల మధ్య సహకారం సహజం. ఉమ్మడి ప్రయోజనాలూ అనేకం. ప్రయాణ, వాణిజ్యాలు చిరకాలంగా ఉన్నా, ఇప్పటి దాకా ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో వెనుకబడ్డ భారత, ఇండొనేసియాలు దాన్ని చక్కదిద్దుకొనే పనిలో పడ్డాయి. ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో 4 రోజులు భారత్‌లో పర్యటించి, భారత 76వ గణతంత్ర దినోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడం బలమైన బంధానికి పునరంకితమయ్యే వీలు కల్పించింది. అన్నీ సాకల్యంగా చర్చించు కొనే విలువైన అవకాశం వచ్చింది. మొత్తం 55 పేరాల తాజా ఉమ్మడి ప్రకటనలో ఇరుపక్షాలూ విస్తృత ద్వైపాక్షిక, అంతర్జాతీయ సహకారంపై ఏకస్వరంతో మాట్లాడడం అందుకు నిదర్శనం. భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా భారత్‌తో ఇండొనేసియా అను బంధం బలమైనది. చిత్రమేమిటంటే చిరకాలంగా బలమైన బంధమున్నా అది భారీ స్థాయిలో ప్రతి ఫలించినట్లు కనిపించదు. అగ్రరాజ్యాల అధికార రాజకీయాలకు వ్యతిరేకతతో, అలీనోద్యమంతో ఆది నుంచి ముడిపడిన ఈ ఉభయ దేశాలూ వలస పాలనానంతర ఆసియా ఖండంలో ద్వైపాక్షికంగానూ, నాయకత్వంలోనూ కలసి అడుగేయాల్సింది. అయితే, ప్రచ్ఛన్న యుద్ధకాలంలో ఢిల్లీ, జకార్తాలు దూరం జరిగాయి. ఈ నేపథ్యంలో ఇండొనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో తాజా ఢిల్లీ పర్యటన ఆశావహ పరిణామం. ఉభయదేశాల మధ్య అనుబంధానికి అవసరమైన వ్యూహాత్మక ప్రేరణను ఈ పర్యటన అందించింది. భారత గణతంత్ర దినోత్సవ కవాతుకు ముఖ్య అతిథిగా ఇండొనేసియా అధ్యక్షులు హాజరవడం ఇది నాలుగోసారి. భారత్ తొలిసారి జరుపుకొన్న రిపబ్లిక్ డే వేడుకలకు 1950లో సైతం ఇండొనేసియా అధ్యక్షుడే (సుకర్ణో) ముఖ్య అతిథి. ఆపైన సుసిలో బమ్బాగ్ యుధొయోనో (2011), జోకో విడోడో (2018), ఇప్పుడు సుబియాంటో! గమనిస్తే, ఆగ్నేయాసియా దేశాలతో బలమైన స్నేహం 1990ల నుంచి భారత ప్రయత్నం.అందులో భాగంగా జకార్తా, ఢిల్లీల మధ్య దూరం క్రమంగా తగ్గసాగింది. చైనా వ్యూహాత్మక ప్రాబల్యానికి పగ్గం వేసేలా ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను పెంపొందించుకోవాలని భారత్ ‘ప్రాచ్యానికి ప్రాధాన్య విధానం’ (యాక్ట్ ఈస్ట్ పాలసీ) చేపట్టింది. ఇండో – పసిఫిక్ ప్రాంతం కీలకమని గుర్తించింది. అయినా, ఇరు దేశాల భాగస్వామ్యం ఉండాల్సినంత లేదు. సుమత్రా, జావా... ఇలా 17 వేలకు పైగా ద్వీపాలతో కూడిన ఇండొనేసియా 28 కోట్లకు పైగా ప్రజలతో జనసంఖ్యలో ప్రపంచంలో నాలుగోది. దాదాపు 1.4 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థిక వ్యవస్థతో వచ్చే 2030 నాటి కల్లా ప్రపంచంలోని 10 అగ్రశ్రేణి ఎకానమీల్లో ఒకటిగా నిలవడానికి ఉరకలు వేస్తోంది. ఈ దేశ వేలాది ద్వీపాలు హిందూ, పసిఫిక్ మహా సముద్రాల మధ్య వారధుల లాంటివి. ఇండొనేసియా సముద్ర జలాలు భారత్ సహా ఈ ప్రాంతంలో పలు దేశాల ప్రపంచ వాణిజ్యానికి ఆయువుపట్టు. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ అతి పెద్ద ద్వీపసమూహ దేశంతో బంధం భారత ఆర్థికప్రగతికి కీలకమనీ, బంధాన్ని బలోపేతం చేసుకోవాలంటున్నది అందుకే!అధ్యక్షుడి తాజా పర్యటనలో ఆరోగ్యం, సాంప్రదాయిక వైద్యం, సముద్రయాన భద్రత, డిజిటల్ అభివృద్ధి, సాంస్కృతిక సహకారంపై 5 అవగాహనా ఒప్పందాలు (ఎంఓయూలు) కుది రాయి. అలాగే, రక్షణ సహకారాన్ని పటిష్ఠం చేసుకోవాలన్న మాట ఉమ్మడి ప్రకటనలోనూ ప్రస్తావించారు. అయితే, భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థను ఇండొనేసియా కొననున్నదంటూ పర్యట నకు ముందు వార్తలు గుప్పుమన్నా, ఆ రకమైన ఒప్పందమేదీ జరగలేదు. ఇండో– పసిఫిక్‌లో అమెరికా– చైనా శత్రుత్వం, దక్షిణ– తూర్పు చైనా సముద్రాల్లో చైనా బిగిస్తున్న పట్టు లాంటి సున్నిత అంశాలు, వాటి భౌగోళిక రాజకీయ ప్రభావాలు చర్చకు వచ్చిందీ, లేనిదీ తెలియలేదు. ఆర్థికాభివృద్ధిలోనూ ఇరుపక్షాలూ చేయాల్సింది చాలా ఉంది. ప్రస్తుతం 3 వేల కోట్ల డాలర్లే ఉన్న రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని ద్విగుణం, బహుళం చేయాలి. రెంటి మధ్య రాకపోకలు, ఆదానప్రదానాల పెంపుదల, పారిశ్రామిక భాగస్వామ్యాలను పెంచుకోవాలి. అధ్యక్షుడి వెంట దాదాపు 100 మంది సభ్యుల వ్యాపార బృందం వచ్చినందున ఆ రంగంలో పురోగతి కనిపిస్తుందని ఆశించవచ్చు. ఇండో–పసిఫిక్ ప్రపంచ వివాదానికి కేంద్రమవుతున్న వర్తమాన పరిస్థితుల్లో ద్వైపాక్షిక,ప్రాంతీయ సహకారానికి ఉభయ దేశాలూ నడుంకట్టాలి. గత అక్టోబర్‌లో ఇండొనేసియా అధ్యక్షు డిగా పదవీ బాధ్యతలు చేపట్టి, ప్రస్తుతం ఆ దేశంలో అమితమైన ప్రాచుర్యం ఉన్న సుబియాంటో గద్దెనెక్కిన కొద్దికాలానికే భారత్‌లో పర్యటించడం ద్వైపాక్షిక సంబంధాలకు ఉత్ప్రేరకమే. ఇరు దేశాలు సన్నిహిత మిత్రులుగా, భాగస్వాములుగా కొనసాగాలని ఆయన అభిలషించడం గమనార్హం. ‘ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య’కు మూలస్తంభమైన ఇండొనేసియా ప్రాంతీయ ఆర్థిక సమన్వయానికి, రాజకీయ, భద్రతా అంశాలకూ ముఖ్యమైనది. ఆ సంగతి భారత్ గమనంలో ఉంచుకోవాలి. బీజింగ్ కళ్ళతో, భౌగోళిక రాజకీయాల కోణం నుంచే జకార్తాతో బంధాన్ని చూడరాదు. ఇండొనేసియా సైతం ఆది నుంచీ అగ్ర దేశాలతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ సంగతి గుర్తించి, ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారం వెల్లివిరిసేలా భారత్ కృషి చేయాలి. ఆసియాలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనేలా చూడాలి. పర్యటనతో రాజకీయ నాయకత్వం చొరవ చూపినందున ఇప్పుడిక అధికార యంత్రాంగం, దౌత్యవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములు ఆచరణలో ముందుకు తీసుకుపోవాలి. -
Republic Day: ఇండోనేషియా ప్రతినిధి బృందం నోట ‘కుచ్ కుచ్ హోతాహై’ పాట
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారత్ వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందులో ఇండోనేషియా ప్రతినిధి బృందం పాల్గొంది.ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రతినిధి బృందం బాలీవుడ్ సినిమా 'కుచ్ కుచ్ హోతా హై'లోని పాటను ఆలపించింది. ఈ ప్రతినిధి బృందంలో ఇండోనేషియా సీనియర్ మంత్రులు ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు భారత 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. #WATCH | Delhi: A delegation from Indonesia sang Bollywood song 'Kuch Kuch Hota Hai' at the banquet hosted by President Droupadi Murmu in honour of Prabowo Subianto, President of Indonesia at Rashtrapati Bhavan. The delegation included senior Indonesian ministers. The… pic.twitter.com/VH6ZHRTbNS— ANI (@ANI) January 25, 2025కాగా భారతదేశం-ఇండోనేషియా రక్షణ, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో విస్తృతంగా చర్చలు జరిపారు. రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, రక్షణ తయారీ తదితర రంగాల్లో సంయుక్తంగా పనిచేయడానికి అంగీకరించాయి.ఇది కూడా చదవండి: దేశ ప్రజలకు ప్రధాని మోదీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
భారత్‌కు ఇండోనేషియా అధ్యక్షుడు.. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
ఢిల్లీ: ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో(Prabowo Subianto) శనివారం భారత్‌కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ (PM Modi) ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సమావేశం అయ్యారు. రాజకీయ భద్రత, రక్షణ, వాణిజ్య సహకారం, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో నాలుగో వ్యక్తి.భారత్, ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, తీవ్రవాద నిర్మూలన రంగాలలో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని ఇరు దేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. సమావేశం అనంతరం ఇరుదేశాల నేతలు మీడియాతో మాట్లాడారు.భారత్‌కు ఇండోనేషియా కీలక భాగస్వామి అన్న మోదీ.. 10 సభ్య దేశాలు కలిగిన ఆసియాన్‌తో పాటు ఇండో పసిఫిక్ కూటమిలో ఇండోనేషియాకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకునేందుకు ఇండోనేషియా కూడా సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు సుబియాంటో అన్నారు. ఫిన్‌టెక్, ఏఐ, ఐవోటీ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: Republic Day 2025: 942 మందికి శౌర్య పురస్కారాలు -
గణతంత్ర వేడుకలకు అతిథిగా ఇండోనేసియా అధ్యక్షుడు
ఢిల్లీ: రిపబ్లిక్ డే-2025 వేడుకలకు ముఖ్యఅతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరుకానున్నారు రిపబ్లిక్ డే పరేడ్‌లో ఇండోనేషియా బృందం పాల్గొనుంది. యుద్ధ వీరుల స్మారక స్తూపం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించనున్నారు. 300 మంది కళాకారులతో సారే జహాసే అచ్చా సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన 31 శకటాలను ప్రదర్శించనున్నారు.స్వర్ణీం భారత్ విరాసత్ ఔర్ వికాస్ అనే థీమ్‌తో శకటాల ప్రదర్శన నిర్వహించనున్నారు. 75 ఏళ్ల రాజ్యాంగానికి సంబంధించిన రెండు ప్రత్యేక శకటాలను రూపకల్పన చేశారు. కర్తవ్య పత్‌లో 11 నిమిషాల పాటు జయ జయ భారతం సాంస్కృతిక నృత్య ప్రదర్శన, ఈనెల 29న విజయ్ చౌక్‌లో బీటింగ్ రిట్రీట్, వివిధ బెటాలియన్లకు సంబంధించిన మ్యూజిక్ బ్యాండ్ ప్రదర్శన, భారతీయ మ్యూజిక్ బ్యాండ్‌ను బెటాలియన్లు ప్రదర్శించర్శించనున్నారు. -
అక్కడ స్నాక్‌గా స్నేక్‌లు..!
మాములుగా మన దేశంలో చిరుతిండిగా వీధి స్టాల్స్‌లో సమోసాలు, బజ్జీలు, పకోడిలు నోరూరించేలా కనువిందు చేస్తుంటాయి. కానీ ఈ దేశంలో స్నాక్‌గా ఏం ఉంటాయో తెలిస్తే వామ్మో అని నోరెళ్లబెడతారు. మనిషికి అత్యంత హానికరమైన దాంతోనే వంటకం, అదే అక్కడ ఫేమస్ కూడా. ఇంతకీ ఏంటా రెసిపీ అంటే..ఫుడ్ వ్లాగర్లు(Food vloggers) ఇతర దేశాల్లో ఉండే వైవిధ్యభరితమైన వంటకాల విశేషాల గురించి చెప్పడమే గాక ఆసక్తిని రేకెత్తిస్తుంటారు. అలానే ఒక భారతీయ వ్లాగర్ తన ఇండోనేషియా(Indonesia) పర్యటనలో వీధి దుకాణల్లో అమ్మే ఫేమస్ వంటకాన్ని గురించి తెలసుకుని కంగుతిన్నాడు. చిరుతిండిగా క్రోబ్రా(cobra)తో చేసిని వంటకాన్నే తింటారట. ఆ వంటకం అంటే అక్కడ పడిచస్తారట. అందుకు తగ్గట్టుగానే వరుస దుకాణాల్లో బోనుల్లో అప్పటికప్పుడు తాజాపాముతో ఈ వంటకాన్ని రెడీ చేయడం తదితరాలను చూసి నోటి మాట రాలేందుంటూ అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ముఖ్యంగా ఆ వంటకం కోసం క్యూలో నిలబడటం చూసి మతిపోయిందని ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు ఫుడ్ వ్లాగర్. అంతేకాదండోయ్ ఇండోనేషియ వాసులు కోబ్రాతో చేసిన వంటక తినడం వల్ల చర్మఆరోగ్యానికి, వ్యాధి నిరోధక శక్తినికి మంచిదని బలంగా నమ్ముతారట. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవ్వడమే గాక దాదాపు 4 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోని చూసిన నెటిజన్లు అక్కడ పప్పు, బియ్యంతో వంటలు ఎలా వండాలో నేర్పిస్తానని ఒకరూ, మనిషి కంటే ప్రమాదకరమైన జంతువు ఇంకొకటి లేదని మరొకరు రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Akash Chaudhary (@kaash_chaudhary) (చదవండి: న్యూ ఇయర్ పార్టీ జోష్: ఫస్ట్ డే తలెత్తే హ్యాంగోవర్‌ని హ్యాండిల్ చేయండిలా..!) -
గాలిలో ప్రాణాలు
దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో వైమానిక భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గత ఐదారేళ్లుగా అత్యంత ఘోరమైన ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది... టేకాఫ్ అయిన కాసేపటికే... గత ఐదేళ్లలో అత్యంత విషాదకరమైన, చర్చనీయమైన విమాన ప్రమాదం లయన్ ఎయిర్ ఫ్లైట్ 610. 2018 అక్టోబర్ 29న ఇండోనేసియాలోని జకార్తా నుంచి పాంగ్‌కల్ పినాంగ్‌కు బయలుదేరిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం టేకాఫ్ అయిన కాసేపటికే జావా సముద్రంలో కూలిపోయింది. 189 మంది ప్రయాణికులతో పాటు సిబ్బంది చనిపోయారు. విమానంలోని ఆగ్మెంటేషన్ సిస్టమ్ (ఎంసీఏఎస్)లో లోపమే ప్రమాదానికి కారణమని తేలింది. బోయింగ్ విమానాల రూపకల్పన, ఏవియేషన్ రెగ్యులేటర్లు, ముఖ్యంగా ఫెడరల్ ఏవియేషన్ అడ్మిని్రస్టేషన్ (ఎఫ్ఏఏ) పర్యవేక్షణలో తీవ్ర లోపాలను ఈ దుర్ఘటన ఎత్తిచూపింది. ఐదు నెలలకే మరోటి... లయన్ ఎయిర్ ప్రమాదం జరిగిన ఐదు నెలలకే మరో బోయింగ్ 737 మ్యాక్స్ కూలిపోయింది. 2019 మార్చి 10న ఇథియోపియా ఎయిర్‌లైన్స్ విమానం 302 అడిస్ అబాబా నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 157 మంది చనిపోయారు. దీనికీ ఎంసీఏఎస్ వ్యవస్థే కారణమని తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన అధికారులు మాక్స్‌ను నిలిపివేశారు. బోయింగ్ చట్టపరమైన, ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంది. సముద్రంలో కూలిన విమానం... 2021 జనవరి 9న ఇండోనేషియాలోని జకార్తాలో విమాన ప్రమాదం జరిగింది. సోకర్నో–హట్టాలో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పాంటియానాక్కు బయలుదేరిన బోయింగ్ 737–500 విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సముద్రంలో కూలిపోవడంతో అందులో ఉన్న 62 మంది చనిపోయారు. ఇండోనేషియాలో ఇటీవలి కాలంలో జరిగిన అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇది. యాంత్రిక వైఫల్యం, మానవ తప్పిదం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విమానంలోని ఆటోథ్రోటిల్ సిస్టమ్‌లో లోపం వల్ల విమానం ఇంజన్లు అసమతుల్యం కావడంతో అదుపు తప్పి కూలిపోయింది. పైలట్ పరిస్థితికి తగిన విధంగా స్పందించడంలో విఫలమయ్యారని తేలింది. ఈ ప్రమాదం పాత విమానాల నిర్వహణలో అప్రమత్తతను, విమానాల అప్‌గ్రేడేషన్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పింది. యాంత్రిక వైఫల్యాలు తలెత్తినప్పుడు ప్రతిస్పందించడానికి విమానయాన సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వాలని ఉద్ఘాటించింది.ఇళ్లపైనే కూలిన విమానం.. 2020 మే 22న పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) ఫ్లైట్ 8303, ఎయిర్‌బస్ ఎ 320 కరాచీలోని ఇళ్లపై కూలిపోయింది. లాహోర్ నుంచి బయలుదేరిన ఈ విమానంలో 99 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 41 మంది మృతి చెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. ల్యాండింగ్ సమయంలో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ల్యాండింగ్ గేర్‌లో తలెత్తిన సమస్యల కారణంగా విమానం రన్ వేపైకి దూసుకెళ్లడంతో ఇంజన్లు ధ్వంసమయ్యాయి. చివరకు అదుపు తప్పిన విమానం నివాస ప్రాంతంలోకి దూసుకెళ్లింది. పైలట్లుప్రామాణిక అత్యవసర విధానాలను పాటించలేదని విమానం బ్లాక్ బాక్స్ వెల్లడించింది. ఈ ప్రమాదం పైలట్ల శిక్షణ, నియంత్రణ పర్యవేక్షణలో లోతైన లోపాలను బహిర్గతం చేసింది. పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలో శిక్షణ నాణ్యతపై విచారణకు దారితీసింది, రన్‌వే నుంచి జారి లోయలో పడి... గత ఐదేళ్లలో భారత్‌లో జరిగిన అత్యంత ఘోర విమాన ప్రమాదం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం 1344ది. దుబాయ్ నుంచి వచి్చన ఈ విమానం 2020 ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతుండగా కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది మొత్తం 165 మంది ఉండగా.. 21 మంది మరణించారు. భారీ వర్షాల కారణంగా రన్‌వే తడిసిపోయి ఉంది. ఇక్కడ రన్‌వే పొడవు కూడా తక్కువగా ఉండటంతో ల్యాండ్ అయిన విమానం జారి లోయలో పడిపోయింది. వాతావరణ పరిస్థితులు, మానవ తప్పిదం, రన్ వే మౌలిక సదుపాయాల సరిగా లేకపోవడం వల్ల జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదం తరువాత దేశంలోని విమానాశ్రయాల మౌలిక సదుపాయాలను సమీక్షించారు. రన్‌వే నుంచి జారి..నేపాన్‌లోని ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పొఖారాకు బయల్దేరిన విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలింది. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సిబ్బందితో సహా 19 మంది ఉన్నారు. 18 మంది మృతి చెందగా, పైలట్ కెపె్టన్ ఎంఆర్ షాక్యా తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. రన్‌వే దక్షిణం వైపు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా, రెక్కల కొన భూమిని తాకడంతో ఒక్కసారిగా పలీ్టలు కొట్టింది. దీంతో వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి.మంచు కారణంగా... ఈ సంవత్సరం బ్రెజిల్ విమానయాన సంస్థకు చెందిన వోపాస్ 2283, ఏటీఆర్ 72 ట్విన్ఇంజన్ టర్బోప్రాప్ ఆగస్టు 9న కూలిపోయింది. 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో సావోపాలో అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం.. సావోపావో సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారంతా మరణించారు. విమాన ప్రమాదానికి మంచు కారణమని తేలింది. పండుగ రోజున ప్రమాదం.. ఇటీవలే.. క్రిస్మస్ పర్వదినాన అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి ప్రమాదం జరిగింది. అజర్బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బాకు నుంచి రష్యాలోని గ్రోజీ్నకి వెళ్తుండగా కాస్పియన్ సముద్ర సమీపంలో కూలిపోయింది. విమానంలో 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా 38 మంది మరణించారు. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులను తిప్పికొడుతున్న రష్యా వైమానిక రక్షణ దళాలు విమానాన్ని కూలి్చవేశాయని రష్యా అంగీకరించింది. దాడి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్ క్షమాపణ చెప్పారు. వీడని మిస్టరీ.. చైనాలో జరిగిన అత్యంత విషాద ఘటనల్లో ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఎంయూ 5735 కుప్పకూలడం ఒకటి. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737–800.. 2022 మార్చి 21న దక్షిణ చైనాలోని పర్వతాల్లో కూలిపోయింది. ప్రయాణికులు, సిబ్బంది సహా విమానంలో ఉన్న 132 మంది మరణించారు. విమానం ఎత్తునుంచి కిందికి దించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని తాత్కాలిక దర్యాప్తులో తేల్చారు. విమానం వేగంగా, ఉద్దేశపూర్వకంగా ల్యాండ్ చేసినట్లు బ్లాక్ బాక్స్ డేటా వెల్లడించింది. ఈ ప్రమాదం యాంత్రిక వైఫల్యమా, మానవ తప్పిదమా అనే విషయంపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఈ విపత్తుకు అసలు కారణం మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరణశిక్ష నుంచి ఎట్టకేలకు విముక్తి
మనీలా: డ్రగ్స్ తరలించారన్న ఆరోపణలపై అరెస్టయి గత 15 సంవత్సరాలుగా జైళ్లో మగ్గిపోతున్న అమాయక ఫిలిప్పీన్స్ మహిళకు ఎట్టకేలకు ఇండోనేసియా జైలు నుంచి తాత్కాలిక విముక్తి లభించింది. ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇకపై ఆమె జీవితకాల జైలు శిక్షను ఇండోనేసియాకు బదులు సొంతదేశం ఫిలిప్పీన్స్‌లోని మహిళల కారాగా రంలో అనుభవించనుంది. ఇండోనేసియా విధించిన శిక్ష ప్రకారం 2015 ఏడాదిలోనే ఫిలిప్పీన్స్ పోలీసుల తుపాకీ గుళ్లకు బలికావాల్సిన మేరీ జేన్ వెలోసో అనూహ్యంగా ఆ దారుణ శిక్ష అమలు నుంచి తప్పించుకున్నారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో తనకు క్షమాభిక్ష పెట్టాలని త్వరలో దేశాధ్యక్షుడిని వేడుకుంటానని 39 ఏళ్ల మేరీ చెప్పారు. బుధవారం ఉదయం ఆమె ఇండోనేసియా నుంచి బయల్దేరి స్వదేశం ఫిలిప్పీన్స్‌లోని మనీలా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. తమ తల్లి రాకతో ఇద్దరు కుమారులు, మేరీ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఎనిమిది మందిపై బుల్లెట్ల వర్షం2010లో బతుకుదెరువు కోసం పనిమనిషిగా ఇండోనేసియాలో అడుగుపెట్టిన ఆమెను ఎయిర్‌పోర్ట్‌లోనే పోలీసులు అరెస్ట్‌చేశారు. వెంట తెచ్చిన సూట్‌కేసులో 2.6 కేజీల నిషేధిత హెరాయిన్ మాదకద్రవ్యం ఉండటంతో ఆమెపై కఠిన డ్రగ్స్ ట్రాఫికింగ్ చట్టాలు మోపి మరణశిక్ష విధించారు. ఆ సూట్‌కేసుతో తనకేం సంబంధం లేదని, ఇండోనేసియాలో ఇంటి పనిమనిషిగా పని కుదిర్చిన ఏజెంట్ మారియా క్రిస్టినా సెర్గీ ఆ సూట్‌కేసు ఇచ్చాడని, అందులో ఏముందో తనకు నిజంగా తెలీ దని ఆమె ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదు. ఐదే ళ్ల తర్వాత షూట్ చేసి చంపేయాలని తీర్పు వెలువడింది. అక్రమంగా డ్రగ్స్ తెచ్చారంటూ మేరీసహా ఆస్ట్రే లియా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఘనా, నైజీరియాలకు చెందిన మొత్తం తొమ్మిది మందిని 2015 ఏడాదిలో ఒక ద్వీపకారాగారానికి తీసుకెళ్లారు. మేరీ తప్ప మిగతా ఎనిమిది మందిపై ఫైరింగ్ స్క్వాడ్ పోలీసులు తుపాకీ గుళ్ల వర్షం కురిపించి చంపేశారు. ఈమెను కూడా చంపేసేవారే. కానీ ఈమెను ఇండోనేసియాకు పంపిన ఏజెంట్ సెర్గీ కేవలం రెండ్రోజుల ముందు ఫిలిప్పీన్స్‌లో అరెస్టవడం, తానే ఆమెకు ఆ సూట్‌కేసు ఇచ్చి పంపాన ని ఒప్పుకోవడంతో ఈమె శిక్ష అమలు ఆఖరి నిమిషంలో ఆగిపోయింది. అయితే ఎవరు తెచ్చినా డ్రగ్స్ తమ భూభాగానికి తేవడం మాత్రం నేరమే కాబట్టి ఈమెను నిర్దోషిగా వదిలేది లేదని ఇండోనేసియా కరాఖండీగా చెప్పింది. దీంతో మేరీ విడుదలకు ఫిలిప్పీన్స్‌లో పెద్ద ఉద్యమమే మొదలైంది. చివరకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం చొరవ తీసుకుని ఖైదీల బదిలీ ఒప్పందం చేసుకుంది. మేరీ మిగతా శిక్షాకాలం సొంత దేశంలో అనుభవించేలా డీల్ కుదిరింది. ఈ ఒప్పందం మేరకు ఆమెను ఇండోనేసియా బుధవారం వదిలేసింది. -
బాలిలో డబుల్ ఇస్మార్ట్ బ్యూటీ చిల్.. బీచ్ ఒడ్డున అలా!
-
ఊరికే కూర్చోకు భయపడకు
దట్టమైన పొగ, ధారాళమైన దుర్భాషలతో నిండి ఉండే మగ రూప కాఫీ రెస్టారెంట్లే ఈ ప్రపంచం నిండా! ఇండోనేషియా కూడా అందుకు భిన్నంగా ఏమీ ఉండదు. అయితే అక్కడి ఏసా ప్రావిన్సు రాజధాని పట్టణమైన బాందా ఏసాలో ఒక మహిళ పొగలు కక్కే మంచి కాఫీని తప్ప.. సిగరెట్ పొగలకు, చెత్త మాటలకు స్థానం లేని కేఫ్‌ను నడుపుతున్నారు! అది పూర్తిగా ఆడవాళ్ల అడ్డా. అక్కడ వాళ్లు కాఫీ తాగొచ్చు. కబుర్లు చెప్పుకోవచ్చు. చర్చలు పెట్టుకోవచ్చు. మగవాళ్లు కూడా వచ్చి కాఫీ తాగి వెళ్లిపోవచ్చు కానీ, అక్కడ కూర్చోటానికి లేదు. ఆ కాఫీ కేఫ్ పేరు ‘మార్నింగ్ మామా’. ఆ కేఫ్ యజమాని ఖుర్రేటా అయుని. 28 ఏళ్ల ముస్లిం యువతి. ఆమె దగ్గర పనిచేసే నలుగురు ‘బరిస్టా’లు (కాఫీ తయారు చేసి, సర్వ్ చేసేవారు) కూడా మహిళలే. పూర్తిగా మహిళలే నడిపే ‘మార్నింగ్ మామా’ వంటి కాఫీ కేఫ్‌లు ఏ దేశంలో అయినా ఉండేవే. అందులో కొత్తేమీ లేదు. ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లిం జనాభా ఉండే ఇండోనేషియాలో కూడా ‘ఓన్లీ ఉమన్ ’ కాఫీ కేఫ్‌లు అరకొరగానైనా లేకుండాపోవు. అయితే ఏసా ప్రావిన్సులో ఒక మహిళ బయటికి రావటం, బిజినెస్ చేయటం అన్నది కలకలం రేపే విషయం. కొరడా దెబ్బలకు దారి తీసే సాహసం. ఇండోనేషియాలోని మొత్తం 38ప్రావిన్సులలో ఏసాప్రావిన్సు ఒక్కటే ఇప్పటికీ మారకుండా నియమాల శిలలా ఉండిపోయింది. మహిళల పట్ల నేటికీ కఠినమైన ఆంక్షలు, సంప్రదాయాలు కొనసాగుతున్న ప్రదేశం అది. అలాంటి చోట కాఫీ కేఫ్ తెరిచారు ఖుర్రేటా! అయితే అందుకోసం ఆమె సంప్రదాయాలను ధిక్కరించలేదు. ఆంక్షల్ని కాస్త సడలింపజేసుకుని, హిజాబ్‌ను ధరించి, ఇతర మతపరమైన కట్టుబాట్లకు లోబడి కేఫ్‌ను నిర్వహిస్తున్నారు. ఖుర్రేటా కాఫీ కేఫ్ప్రారంభించిన ఏసా ప్రావిన్సు రాజధాని పట్టణం బాందా ఏసాకు ‘1001 కాఫీ షాపులున్న పట్టణం’గా పేరు. వాటికి ఇప్పుడు ‘మార్నింగ్ మామా’కూడా జత కలిసింది. ఆడవాళ్లు బయటికి వచ్చి మగవాళ్లలా పని చేయటం అనే ‘దైవ దూషణ వంటి’ ఆ ధిక్కారాన్ని చూసి మొదట్లో కన్నెర్ర చేసిన స్థానిక పురుషులు.. మెల్లమెల్లగా ఇప్పుడు ఆమె కేఫ్‌కే ప్రత్యేకమైన నురగలు కక్కే చిక్కని పాల శాంగర్ ‘లాటే’ కాఫీకి అలవాటు పడుతున్నారు. పొగ, శబ్దం లేకుండా హాయిగా, ప్రశాంతంగా ఉండే అక్కడి వాతావరణాన్ని మరింతగా ఇష్టపడుతున్నారు. ‘మహిళలు సైతం సొంతంగా వ్యాపారాలు చేసుకోవచ్చు. నిర్ణయాలు తీసుకోవచ్చు. నాయకత్వం వహించవచ్చు’ అని ఖుర్రేటా ఇస్తున్న స్టేట్మెంట్కు ప్రతీక ఆమె కాఫీ కేఫ్. -
నాకు తెలుసు.. మీరు చాలా ఫేమస్: జైశంకర్‌తో ఇండోనేషియా అధ్యక్షుడు
బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో G20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకరర్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్, ఇండోనేషియా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.ఇండోనేషియా క్షుడు జైశంకర్ తనను తాను పరిచేయం చేసుకున్నారు. ఈ క్రమంలో సుబియాంటో కరచాలనం చేస్తూ ‘నువ్వు నాకు తెలుసు, నువ్వు చాలా ఫేమస్’ అంటూ పేర్కొన్నారు. దీంతో అక్కడున్న మోదీ వారి వైపు చూస్తూ చిరునవ్వులు చిందించారు. మరోవైపు ఇండోనేషియా అధ్యక్షుడితో జరిగిన భేటీలో ప్రధాని మోదీ వాణిజ్యం, వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఎన్నికైన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి."I know you, you are very famous", Indonesia Prez Prabowo tells EAM Dr S Jaishankar after the latter introduces himself. Location : Ahead of PM Modi, Indonesia Prez Prabowo bilateral at Brazil G20 summit Vdo Source: Indonesia Govt pic.twitter.com/fqXb3ZeA86— Sidhant Sibal (@sidhant) November 19, 2024కాగా మంగళవారం జరిగిన జీ 20 సదస్సులో భాగంగా చైనా విదేశాంగమంత్రి మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య నేరుగా విమానాలు నడపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్రను కూడా..తిరిగి ప్రారంభించాలని ఇరుదేశాల ప్రతిపాదించాయి. తూర్పు లద్దాఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం. -
10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు
ఇండోనేషియా బాలీలో అగ్నిపర్వతం బద్దలవ్వడంతో బూడిద కమ్ముకుని పలు విమానాలు రద్దయ్యాయి. బాలీలోని ‘మౌంట్ లెవోటోబి లకీ-లకీ’ అనే అగ్నిపర్వతం రెండోసారి పేలడంతో దాదాపు 10 కిలోమీటర్ల(32,808 అడుగులు) ఎత్తులో దట్టంగా బూడిద కమ్ముకుందని అధికారులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణాలు ప్రమాదకరమని చెప్పారు. దాంతో కొన్ని సంస్థలు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపేసినట్లు పేర్కొన్నారు.బాలీలోని ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో ఉన్న మౌంట్ లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం నవంబర్ 3న మొదట విస్ఫోటనం చెందింది. తిరిగి మంగళవారం పలుమార్లు భారీ స్థాయిలో బద్దలవ్వడంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఇండిగో ప్రకటన విడుదల చేసింది. ‘బాలీలో ఇటీవలి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాంతో వాతావరణంలో భారీగా బూడిద మేఘాలు ఏర్పడ్డాయి. దానివల్ల ఆ ప్రాంతానికి వచ్చిపోయే విమానాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నాం. ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం’ అని తెలిపింది. ఇండిగో సంస్థ బెంగళూరు నుంచి ఇండోనేషియా బాలీకి రోజువారీ సర్వీసు నడుపుతోంది.ఢిల్లీ-ఇండోనేషియా మధ్య ప్రయాణించే రోజువారీ విమానాలను రద్దు చేస్తున్నట్లు ఎయిరిండియా ధ్రువీకరించింది. అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా బుధవారం ఇండోనేషియాకు ప్రయాణించే విమాన ప్రయాణాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.ఇదీ చదవండి: గుడ్‌బై విస్తారా! విమాన సిబ్బంది భావోద్వేగ ప్రకటనబాలీ నుంచి దాదాపు 800 కి.మీ దూరంలో ఈస్ట్ నుసా టెంగ్గారా ప్రావిన్స్‌లో నవంబర్ 3న లెవోటోబి లకీ-లకీ అగ్నిపర్వతం మొదట విస్ఫోటనం చెందింది. దానివల్ల తొమ్మిది మంది మరణించారు. తాజాగా మంగళవారం మళ్లీ పలుమార్లు విస్ఫోటనం చెందింది. మొదటిసారి ఘటన జరిగిన సమయంలో నవంబర్ 4 నుంచి 12 వరకు సింగపూర్, హాంకాంగ్, కొన్ని ఆస్ట్రేలియన్ నగరాల నుంచి బాలీకి ప్రయాణించే 80 విమానాలు రద్దు చేశారు. -
ఇండోనేషియాలో పేలిన అగ్ని పర్వతం.. ఆరుగురు మృతి
జకర్తా: ఇండోనేషియాలో అగ్ని పర్వతం పేలింది. ఇక్కడి ఫ్లోర్స్ ద్వీపంలోని మౌంట్ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ విపత్తులో పలు ఇళ్లు దగ్ధమయ్యాయని, ఆరుగురు మృతి చెందారని ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ మీడియాకు తెలిపింది.ఫ్లోర్స్ ద్వీపంలో అగ్నిపర్వత విస్ఫోటనం కారణంగా బూడిద దాదాపు 2000 మీటర్ల ఎత్తు వరకూ వ్యాపించింది. సమీపంలోని గ్రామాన్ని వేడి బూడిద చుట్టుముట్టింది. ఈ ఘటనలో పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఆరుగురు మృతిచెందారు. ఈ పర్వత విస్ఫోటనం కారణంగా సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇండోనేషియా విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రమాదంలో కూలిన ఇళ్ల కింద కొందరు సమాధి అయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.వులాంగిటాంగ్ జిల్లాలో సంభవించిన ఈ అగ్నిపర్వతం పేలుడు కారణంగా సమీపంలోని పులులారా, నవోకోటే, హోకెంగ్ జయ, క్లాటన్లో, బోరు కెడాంగ్ గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఇండోనేషియాలో గత రెండు వారాల్లో ఇది రెండవ అగ్నిపర్వత విస్ఫోటనం. అక్టోబర్ 27న జరిగిన విస్ఫోటనంలో దట్టమైన బూడిద ఉవ్వెత్తున్న ఎగసిపడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.ఇది కూడా చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో సూపర్ యాప్ -
గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
న్యూఢిల్లీ: భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు విదేశీ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించే సంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. దీనిలో భాగంగా 2025 జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించనున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.సుబియాంటో భారతదేశం-ఇండోనేషియా సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. భారత్‌కు చెందిన బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు చేయడంతోపాటు పలు రక్షణ ఒప్పందాలపై ఆయన దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారైతే ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన రెండో దేశంగా ఇండోనేషియా అవతరిస్తుంది.1950లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాటి ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్ణో మొదటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసారి ప్రబోవో భారత గణతంత్ర వేడుకలకు హాజరైన పక్షంలో ఇండోనేషియా సైనిక బృందం కూడా రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొంటుంది. ఈ నెలాఖరులో బ్రెజిల్లో జరగనున్న జీ-20 సదస్సు సందర్భంగా ప్రబోవో, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య భేటీ జరిగే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్ -
ఇండోనేసియా అధ్యక్షుడిగా సుబియాంతో
జకార్తా: ఇండోనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబొవో సుబియాంతో(73) ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం పార్లమెంట్ భవన సముదాయంలో జరిగిన కార్యక్రమంలో సుబియాంతో తోపాటు ఉపాధ్యక్షుడిగా గిబ్రాన్ రకబుమింగ్ రకా(37) ప్రమాణం చేశారు. మాజీ అధ్యక్షుడు విడొడొ కుమారుడైన రకా సుకార్తా మేయర్‌గా సైతం పనిచేశారు. ప్రమాణ స్వీకారం ఓపెన్ టాప్ వ్యాన్‌లో వచ్చిన సుబియాంతోకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రజలతో పార్లమెంట్ భవనం, అధ్యక్ష భవనం రహదారి కిక్కిరిసింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన ముందుకు సాగారు. సుబియాంతో ఖురాన్ సాక్షిగా ప్రమాణం చేశారు. -
న్యూజిలాండ్ పైలట్‌కు 19 నెలల తర్వాత విముక్తి
జకార్తా: న్యూజిలాండ్ పైలట్‌ను ఏడాదిన్నర క్రితం నిర్బంధంలోకి తీసుకున్న ఇండోనేసియాలోని పపువా ప్రాంత వేర్పాటువాద గ్రూపు శనివారం విడిచిపెట్టింది. క్రైస్ట్‌చర్చ్ వాసి ఫిలిప్ మార్క్ మెహర్టెన్స్(38) ఇండోనేసియాకు చెందిన సుశి ఎయిర్ విమానయాన సంస్థలో పైలట్‌గా ఉన్నారు. మారుమూల పపువా ప్రాంతంలోని విమానాశ్రయంలో ఉన్న ఫిలిప్‌ను రెబల్స్ 2023 ఫిబ్రవరి 7వ తేదీన నిర్బంధంలోకి తీసుకున్నారు. 2023 ఏప్రిల్‌లో మెహర్టెన్స్ను విడిపించేందుకు ప్రయతి్నంచిన ఇండోనేసియా సైనికులు ఆరుగురిని రెబల్స్ చంపేశారు. దీంతో, అప్పటి నుంచి చర్చి మధ్యవర్తిత్వంతో ఇండోనేసియా ప్రభుత్వం, ఇతర విభాగాలు రెబల్స్‌తో చర్చలు జరుపుతూ వచ్చాయి. ఎట్టకేలకు చర్చలు సఫలమై మెహర్టెన్స్ బయటకు రాగలిగారు. ఇది చాలా క్లిష్టమైన వ్యవహారమంటూ ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో సైతం వ్యాఖ్యానించడం గమనార్హం. మెహర్టెన్స్ విడుదలకు సంబంధించిన వివరాలను ఎవరూ బహిర్గతం చేయలేదు. రెబల్స్ చెర నుంచి విముక్తి లభించిన అనంతరం మెహర్టెన్స్ పపువాలోని తిమికా నుంచి జకార్తాకు చేరుకున్నారు. అతడి కుటుంబం బాలిలో ఉంటోంది. ఇండోనేసియా సంస్కృతి, జాతిపరంగా పపువా ప్రజలు విభిన్నంగా ఉంటారు. న్యూ గినియాలోని పశ్చిమ భాగమైన పపువా గతంలో డచ్ పాలకుల చేతుల్లో ఉండేది. 1969లో ఐరాస సారథ్యంలో పపువాలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి ఇండోనేసియా కలిపేసుకుంది. ఇదంతా బూటకమంటున్న వేర్పాటువాదులు స్వతంత్రం కోసం సాయుధ పోరాటం సాగిస్తున్నారు. గతేడాది నుంచి ఈ పోరాటం తీవ్రరూపం దాలి్చంది. -
ఇండోనేషియా నగదు నోటుపై గణపతి చిత్రం
హిందువుల తొలిపూజలు అందుకునే గణపతి చిత్రం ఇతర దేశాల నగదు నోటుపై ముద్రించడం విశేషమే. ఇండోనేషియా దేశంలోని రూ. 20 వేల నోటుపై గణపతి చిత్రం ముద్రించి ఉండటం మనకు ఆసక్తి కలిగించే అంశమే. ఆ దేశం ఒక ఇస్లామిక్ దేశం. ఇప్పటి వివరాల ప్రకారం ఆ దేశంలో 88 శాతంపైగా ముస్లింలు ఉండగా మూడు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు ఆ దేశం హిందూ మతానికి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా వెలుగొందింది. అక్కడవున్న ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పటికీ దేశ, విదేశీయులకు ప్రముఖ దర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి.ఒకటవ శతాబ్దం నుంచి ఆ దేశంలో ఎక్కువగా హిందూ మతం ఉన్నదని భావిస్తారు. ఆ దేశానికి చెందిన రూ. 20వేల (రూపియా) కరెన్సీ నోటు మీద జ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన గణపతి చిత్రాన్ని చిహ్నంగా ముద్రించబడి ఉంటుంది. అదే నోటు మీద ఆ దేశంలోని పిల్లలందరికీ విద్య అందించడానికి విశేష కృషి చేసిన ఇండోనేషియా జాతీయ విద్యా పితామహుడిగా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హజర్ దేవంతర చిత్రం ప్రచురించబడి వుంటుంది. తదనంతర క్రమంలో (1950) ఆయన ఆ దేశ విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఆయన పుట్టినరోజును జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నారు.ఈ విధంగా ఆ నోటుపై జ్ఞానాన్ని అందించే విద్యాగణపతి, విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుని చిత్రాలతోపాటు, ఆ నోటు వెనుక తరగతి గదిలో వున్న పిల్లల చిత్రం ముద్రించబడి వుండటం విశేషం. -
ఇండోనేషియాలో బిగ్ బాస్ బ్యూటీ జిల్ జిల్ జిగా.. (ఫొటోలు)
-
‘గోల్డెన్ వీసా’ నిబంధనలు!
విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇండోనేషియా ప్రత్యేక వీసా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ‘గోల్డెన్ వీసా’ను అందుకోవాలంటే ఇన్వెస్టర్లు కనీసం 3,50,000 డాలర్ల(రూ.2.9 కోట్లు) నుంచి 50 మిలియన్ డాలర్లు(రూ.410 కోట్లు) వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిబంధనలను అనుసరించి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఈ వీసా చెల్లుబాటు అవుతుందని ఇండోనేషియా ప్రభుత్వం పేర్కొంది.ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఇండోనేషియా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఐదేళ్లు, పదేళ్ల కాలపరిమితికిగాను ‘గోల్డెన్ వీసా’లను ప్రవేశపెట్టింది. ఐదేళ్ల వీసా పొందడానికి వ్యక్తిగత పెట్టుబడిదారులు ఆ దేశంలో కనీసం 2.5 మిలియన్ డాలర్ల(రూ.20 కోట్లు)తో కంపెనీని స్థాపించాలి. పదేళ్ల వీసా కోసం 5 మిలియన్ డాలర్లతో(రూ.40 కోట్లు) సంస్థ ప్రారంభించాలి. కంపెనీ స్థాపించడానికి ఆసక్తి లేని వారు ఐదేళ్ల కోసం 3,50,000 డాలర్లు(రూ.2.9 కోట్లు), పదేళ్లకోసం రూ.5.8 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. ఈ నిధులను ఇండోనేషియా ప్రభుత్వ బాండ్లు, పబ్లిక్ కంపెనీ స్టాక్‌లు లేదా డిపాజిట్‌ల్లో పెట్టుబడి పెట్టాలి.కార్పొరేట్ ఇన్వెస్టర్లు మాత్రం ఐదు సంవత్సరాల వీసా పొందేందుకు 25 మిలియన్ డాలర్లు(రూ.205 కోట్లు), పదేళ్ల కోసం 50 మిలియన్ డాలర్ల(రూ.410 కోట్లు) పెట్టుబడి పెట్టాలి. ఇదే తరహా వీసా పథకాలను గతంలో కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు అందించాయి. కానీ ఈ పథకాలు సమర్థవంతంగా ఉద్యోగాలను సృష్టించలేవని, ఊహాజనిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటాయని ఆయా దేశాలు నిర్ధారించాయి.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!ఇండోనేషియా ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి గత సంవత్సరం ట్రయల్ దశ ప్రారంభించింది. దాదాపు 300 మంది దరఖాస్తుదారులకు గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది. దీని ద్వారా 123 మిలియన్ డాలర్ల(రూ.1,029 కోట్లు) పెట్టుబడులు సమకూరాయి. ఇండోనేషియా సంతతికి చెందిన విదేశీ పౌరులకు ప్రత్యేక హోదాను మంజూరు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే భారత్‌లోని కార్పొరేట్లు ఈ పథకాన్ని పరిశీలించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌లోనూ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్యక్రమం అమలులో ఉంది. దీని ప్రకారం భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఇండియాలో తాత్కాలికంగా నివసించడానికి, స్థానికంగా పని చేయడానికి, ప్రయాణించడానికి అనుమతులున్నాయి. -
ఇండోనేషియాలో అత్యంత సంపన్న కుటుంబం ఇదే..
ఆసియాలో అత్యంత సంపన్నుడు ఎవరు అంటే.. అందరూ చెప్పే సమాధానం ముకేశ్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ఈయన నికర విలువ 120.3 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని తెలుస్తోంది. నీతా అంబానీ, అంబానీ వారసులు అందరూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నారు. ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం ఏదనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.ఆసియాలో రెండో అత్యంత సంపన్న కుటుంబం హార్టోనో ఫ్యామిలీ అని తెలుస్తోంది. వీరి నికర విలువ 38.8 బిలియన్ డాలర్లు అని సమాచారం. వీరి కుటుంబ ఆదాయం జార్మ్ గ్రూప్‌తో ప్రారంభమైంది. ప్రస్తుతం వీరు సిగరెట్ పరిశ్రమలోని అగ్రగాములలో ఒకరుగా ఉన్నారు.హార్టోనో సోదరుల కూడా వ్యాపార రంగంలో గణనీయమైన వృద్ధి సాధించారు. వీరు ఇండోనేషియాలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. హార్టోనో కుటుంబానికి ఎలక్ట్రానిక్స్, ప్రాపర్టీ, అగ్రిబిజినెస్ వంటి వ్యాపారాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: అన్నింటా రికార్డులే.. నిర్మలమ్మ ఖాతాలో మరో ఘనతహార్టోనో ఫ్యామిలీ అధీనంలో జకార్తాలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ పాలిట్రాన్ అండ్ ప్రైమ్ రియల్ ఎస్టేట్ ఉన్నాయి. వీరి కుటుంబ వ్యాపారం ఇండోనేషియాలో ఆర్థిక వృద్ధికి గణనీయంగా దోహదపడింది. దీన్ని బట్టి చూస్తే వీరి సంపద ఎంత ఉంటుందనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
బంగారం గనిలో ప్రమాదం.. 11 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలోని ఓ బంగారు గనిలో ఆదివారం(జులై 7) ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాల కారణంగా గనిపై కొండచరియలు విరిగిపడి 11 మంది కార్మికులు మృతి చెందారు. గోరంటా ప్రావిన్స్‌లోని రిమోట్‌బోన్ బొలాంగో జిల్లాలో ఉన్న బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 33 మంది స్థానిక కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కొండచరియలు విరిగి కార్మికులపై పడ్డాయని రెస్క్యూ బృందం ప్రతినిధులు తెలిపారు. 33 మంది కార్మికుల్లో కేవలం ఒక్కరినే రక్షించారు. ఇప్పటివరకు గనిలో నుంచి 11 మంది మృతదేహాలను బయటికి తీశారు. మిగిలిన 21 మంది జాడ తెలియాల్సి ఉంది. ఇండోనేషియాలో బంగారం కోసం అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతుండడం గమనార్హం. -
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం.. కార్డియాక్ అరెస్ట్‌తో యువ షట్లర్ మృతి
బ్యాడ్మింటన్ కోర్టులో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ షట్లర్ కోర్టులోనే ప్రాణాలు వదిలాడు. ఇండొనేషియాలో జరుగుతున్న ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 17 ఏళ్ల ఝాంగ్ జిఝి ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్ టోర్నీలో భాగంగా జపాన్‌కు చెందిన కజుమా కవానోతో తలపడ్డాడు. మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుండగా.. ఝాంగ్ జిఝి ఒక్కసారిగా కుప్పకులిపోయాడు.పక్కనే ఉన్న సిబ్బంది ఝాంగ్ జిఝిను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఝాంగ్ జిఝిను అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఈ విషయం తెలిసి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. इंडोनेशिया में एक टूर्नामेंट के दौरान कोर्ट पर गिर जाने के बाद 17 वर्षीय चीनी बैडमिंटन खिलाड़ी झांग झिजी की हृदयाघात से मौत हो गई।#ZhangZhijie #CardiacArrest pic.twitter.com/UoEx2ypjGf— Naval Kant Sinha | नवल कान्त सिन्हा (@navalkant) July 2, 2024 -
ఇలాంటి జిమ్ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!
ఇటీవల ఫిట్నెస్ మీద దృష్టిసారిస్తోంది యువత. అందుకోసమని యోగా, ఏరోబిక్, జిమ్ వంటి పలు రకాల సెంటర్లకి వెళ్లి మరీ వర్కౌట్లు చేస్తున్నారు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే.. ఆ జిమ్ సెంటర్ ఫేమస్? కాదా అన్నది చూస్తారు గానీ ఆ సెంటర్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది గమనించారు. పాపం అలానే ఇక్కడొక మహిళ జిమ్ సెంటర్ పరిస్థితిని గమనించకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని జిమ్‌లో 22 ఏళ్ల మహిళ మూడో అంతస్తులో ఉన్న ట్రెడ్‌మిల్‌పై నుంచి జారిపడి.. నేరుగా కిటికిలోంచి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని కాలిమంటన్‌లోని పోంటియానాక్లో జూన్ 18న చోటు చేసుకుంది. ఆ మహిళ ట్రెడ్మీల్పై నడుస్తూ ఉండగా అనూహ్యంగా బ్యాలెన్స్ కోల్పోయింది. అయితే వెనుక ఎంతో మేర ప్రదేశం లేకపోవడం ..దీనికి తగ్గట్టు అక్కడ ఉన్న గోడ మాదిరి అద్దంలాంటి విండో తెరిచి ఉండటంతో వెంటనే నేరుగా పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అయక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదం ఆమె తన ప్రియుడితో కలిసి జిమ్ చేసేందుకు వచ్చినప్పుడూ చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియ పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..ట్రెడ్‌మిల్‌కి కిటికి మధ్య దూరం కేవలం 60 సెంటిమీటర్ల దూరం ఉన్నట్లు తేలింది. పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా తలకు తీవ్ర గాయలవ్వడంతోనే మృతి చెందిదని పేర్కొంది. నిజానికి ట్రెడ్‌మిల్‌పై ఎవరైనా కిందపడిపోవటం కామన్ అని, అయితే తగురీతిలో అక్కడ భద్రత లేకపోవడమే బాధకరమని అన్నారు ఇండోనేషియా పోలీసులు.అలాగే సదరు జిమ్ యజామనిని ఇలా ఎందుకు ఏర్పాట్లు చేశారని ప్రశ్నించగా..అద్దానికి వ్యతిరేకంగా చేస్తే దృష్టి మరలదని ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. అలాగే విండోలు క్లోజ్ చేసేలా వ్యక్తిగత పర్యవేక్షకులు పరివేక్షిస్తుంటారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడూ ఒకరూ లీవ్‌లో ఉండటంతోనే ఇది జరిగిందని చెప్పాడు సదరు యజమాని. ప్రస్తుతం పొలీసులు సదరు జిమ్ నిర్వహణ అనుమతిపై కూడా విచారణ చేపడుతున్నారు.(చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!) -
ఘోరం: వివాహిత మిస్సింగ్, మూడురోజల తర్వాత..
మూడురోజులైనా ఆమె ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కనిపించకుండా పోయిన తన భార్యను వెతికే క్రమంలో.. ఆ భర్తకు గుండె బద్ధలయ్యే దృశ్యం కనిపించింది. కొండచిలువకు తన భార్య ఆహారంగా మారిందని తెలిసి కన్నీరుమున్నీరయ్యాడు. ఇండోనేషియాలో తాజాగా జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ సులవేసీ ప్రావిన్స్‌లోని కాలేంపాంగ్ గ్రామంలో ఫరీదా అనే 45 వివాహిత మూడు రోజులుగా కనిపించకుండా పోయింది. గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె మళ్లీ తిరిగిరాలేదు. దీంతో, గ్రామస్థులు, పోలీసుల సాయంతో మహిళ భర్త పరిసరాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించిన వస్తువులు అడవిలో ఓ చోట కనిపించడంతో వారు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టగా ఓ చోట 5 మీటర్ల పొడవున్న భారీ కొండ చిలువ భారమైన పొట్టతో కదల్లేని పరిస్థితిలో కనిపించింది. అనుమానంతో దాని పొట్ట చీల్చి చూడగానే ఓ మహిళ తలభాగం బయటపడింది. వెంటనే ఆ మృతదేహాన్ని బయటకు తీసి చూడగా.. అది ఫరీదాగా నిర్ధారణ అయ్యింది. ఒంటిపై దుస్తులు అలాగే ఉండడంతో ఆమెను గుర్తు పట్టిన భర్త కన్నీటి పర్యంతం అయ్యాడు. నిపుణులు ఏం చెప్తున్నారంటే.. సాధారణంగా కొండచిలువలు జంతువులను తప్ప మనుషులపై పెద్దగా దాడులు చేయవు. కానీ, ఇండోనేషియాలో ఈ మధ్యకాలంలో మనుషులపై దాడుల ఘటనలు పెరిగిపోయాయి. కిందటి ఏడాది ఓ రైతును ఊపిరాడకుండా చేసి తినేందుకు ప్రయత్నిస్తున్న కొండచిలువను గుర్తించి.. దానిని చంపి అతన్ని రక్షించారు. కొన్నాళ్ల కిందట ఏడు మీటర్ల పొడవున్న కొండచిలువ 54 ఏళ్ల మహిళను చంపి తినేసింది. అయితే అది జీర్ణించుకోలేకపోవడంతో.. ఆ మృతదేహం కొన్నాళ్లకు బయటపడింది. -
ఇండోనేసియాలో వరదలు.. 37 మంది మృతి
జకార్తా: ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 37 మంది మృతి చెందగా మరో 18 మంది వరకు కనిపించకుండా పోయారు. మరాపి అగ్నిపర్వతం నుంచి రాళ్లు, లావా కలిసి కొండచరియలు విరిగిపడ్డాయి. దీనికి తోడు, శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఎగువ నుంచి వచ్చిన బురద ప్రవాహం నాలుగు జిల్లాల పరిధిలోని నివాసప్రాంతాలను తుడిచిపెట్టింది. వందకు పైగా నివాసాలు, భవనాలు వరదలో మునిగిపోయాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను చేపట్టినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. -
తెలివైన కోతి : శాస్త్రవేత్తలు సైతం ఫిదా
ప్రకృతి అపూర్వమైన సంపద, మూలికలకు నిలయం. ప్రకృతిలో మమేకమైన పక్షులకు జంతువులే ఈ విషయాన్ని ఎక్కువగా పసిగడతాయి. మనుషులే కాదు అడవుల్లో జీవించే జంతువులు కూడా మొక్కలు, మూలికలతో వాటికవే వైద్యం చేసుకుంటాయి అనడానికి నిదర్శనంగా ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఒకటి వెలుగులో వచ్చింది. ఇండోనేషియాలో పరిశోధకులు తొలిసారిగా ఈ విషయాన్ని రికార్డు చేశారు.వివరాలు ఇలా ఉన్నాయిసుమత్రన్ ఒరాంగుటాన్స్ అనే జాతికి చెందిని రాకుస్ అనే మగ కోతి (ఒరంగుటాన్) తనకు తనే వైద్యం చేసుకుంది. సుమత్రన్ ఒరంగుటాన్ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోని గునుంగ్ ల్యూజర్ నేషనల్ పార్క్‌లో ఈ దృశ్యాలను రికార్డుచేశారు. ఇండోనేషియాలోని నేషనల్ యూనివర్సిటీ, జర్మనీలోని మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్ సంస్థలకు చెందిన పరిశోధకులు కొన్ని రోజులుగా ఈ తోక లేని కోతులపై అధ్యయనం చేస్తున్నారు.సైంటిఫిక్ రిపోర్ట్స్‌లోని ఒక అధ్యయనం ప్రకారం ఒక మగ కోతికి మరో కోతితో జరిగిన కొట్లాటలో ముఖానికి గాయమైంది. ఒక చెట్టు ఆకులోని ఔషధ గుణాలను గుర్తించింది రాకూస్. ఫైబ్రేరియా టింక్టోరియా" అనే శాస్త్రీయ నామంతో పిలిచే మొక్కల ఆకులతో వైద్యం చేసుకున్నది. ఈ ఆకులు నమిలి, వాటి పసరును దవడ గాయంపై రాసుకుంది. తర్వాత నమిలిన ఆకులను గాయంపై పెట్టుకుంది. అంతేకాదు గాయం మానేందుకు ఈ కోతి ఎక్కువ సేపు నిద్రపోయిందని కూడా పరిశోధకులు గుర్తించడం విశేషం.ఒక అడవి జంతువు చాలా శక్తివంతమైన ఔషధ మొక్కను నేరుగా గాయానికి పూయడాన్ని గమనించడం ఇదే తొలిసారి అని జర్మనీలోని కాన్స్టాంజ్లోని మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బిహేవియర్, జీవశాస్త్రవేత్, ఈ స్టడీ సహ రచయిత ఇసాబెల్లె లామర్ వ్యాఖ్యానించారు. కాగా, ఈ మొక్కలో నిజంగానే ఔషధ గుణాలు ఉంటాయని, మలేరియా, విరేచనాలు, డయాబెటిస్ చికిత్సలో ఈ మొక్కలు వాడుతారని పేర్కొన్నారు. -
ఇండోనేషియాలో భారీ వరదలు.. 14 మంది మృతి!
భారీ వరదలు, విరిగిపడిన కొండచరియలు ఇండోనేషియాలో విధ్వంసం సృష్టించాయి. ఇక్కడి సులవేసి దీవిలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 14 మంది మృతి చెందారు. వివిధ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.అక్కడి అధికారులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ సులవేసి ప్రావిన్స్‌లోని లువు జిల్లాలో గురువారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇండోనేషియాలో ఇప్పటి వరకు 13 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ టీమ్ రబ్బరు పడవలు, ఇతర వాహనాలను ఉపయోగించి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 100 మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.ఇండోనేషియా కంటే ముందు బ్రెజిల్లో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ రాష్ట్రం రియో గ్రాండే దో సుల్లో 37 మంది మృతి చెందారు. అల్ జజీరా నివేదిక ప్రకారం విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 37. 74 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాలు, కొండచరియలు విరిగిపడడంతో జన జీవనం అస్తవ్యస్తమయ్యింది. కూలిన ఇళ్లు, వంతెనలు, రోడ్ల శిథిలాల మధ్య చిక్కుకున్న బాధితులను అదుకునేందుకు ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ ఎడ్వర్డో లైట్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రెసిడెంట్ లూయిస్ ఇనాసియో ప్రభావిత ప్రాంతాలకు సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. -
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
బాలి: ఇండోనేసియా టీనేజ్ బౌలర్ రొమాలియా మహిళల అంతర్జాతీయ టి20ల్లో అసాధారణ రికార్డును లిఖించింది. మంగోలియాతో జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో 17 ఏళ్ల స్పిన్నర్ రొమాలియా (7/0) అసలు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 7 వికెట్లు పడగొట్టి... అనామక జట్ల మధ్య జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లో చరిత్ర పుటలకెక్కింది. తద్వారా 2021లో నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడరిక్ ఓవర్డిక్ (7/3) ఫ్రాన్స్‌పై నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. మొదట ఇండోనేసియా మహిళల జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 151 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన మంగోలియా 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. రొమాలియా (3.2–3–0–7) వేసిన 3.2 ఓవర్లలో 3 మెయిడిన్లు కావడం విశేషం. ఆమె స్పిన్ ఉచ్చులో పడి ఏకంగా ఐదుగురు బ్యాటర్లు ఎర్డెనెసుడ్ (0), అనుజిన్ (0), నమూంజుల్ (0), నరంజెరెల్ (0), ఎన్క్జుల్ (0) ఖాతానే తెరవలేకపోయారు. -
పొట్టి క్రికెట్లో పెను సంచలనం
పొట్టి క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. మహిళల టీ20ల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇండోనేషియా బౌలర్ రొహ్మాలియా రొహ్మాలియా పరుగులేమీ ఇవ్వకుండా ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టింది. అంతర్జాతీయ టీ20ల్లో (పురుషులు, మహిళలు) ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఐసీసీ గుర్తింపు పొందిన ఏ జట్టు తరఫున ఇలాంటి గణాంకాలు నమోదు కాలేదు.పురుషుల క్రికెట్లో (టీ20ల్లో) అత్యుత్తమ గణాంకాలు స్యాజ్రుల్ ఇద్రుస్ (4-1-8-7) పేరిట ఉండగా.. మహిళల క్రికెట్లో రొహ్మాలియాకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ క్రికెటర్ ఫ్రెడ్రిక్ ఓవర్డిక్ (4-2-3-7) పేరిట ఉండింది. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఏ బౌలర్ పరుగులేమీ ఇవ్వకుండా 7 వికెట్లు తీసిన దాఖలాలు లేవు. రొహ్మాలియా తన కెరీర్లో రెండో టీ20 మ్యాచ్‌లోనే ఎవరికీ సాధ్యంకాని గణాంకాలు నమోదు చేయడం మరో విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. బాలీ బాష్‌గా పిలువబడే టోర్నీలో ఇండోనేషియా, మంగోలియా జట్లు తలపడ్డాయి. ఈ సిరీస్‌లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో రొహ్మాలియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఇండోనేషియా ఇన్నింగ్స్‌లో నందా సకారిని (61) అర్దసెంచరీతో రాణించింది. మంగోలియా బౌలర్లలో ఎంక్జుల్ 4 వికెట్లు పడగొట్టింది. View this post on Instagram A post shared by Persatuan Cricket Indonesia (@cricket_ina) 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. రొహ్మాలియా (3.2-3-0-7) ధాటికి 16.2 ఓవర్లలో 24 పరుగులకే కుప్పకూలింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా కనీసం రెండంకెల మార్కు తాకలేకపోగా.. ఎక్స్‌ట్రాలు టాప్ స్కోర్ (10) కావడం విశేషం. మంగోలియా ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరుగురు డకౌట్లు అయ్యారు. -
పేలిన అగ్ని పర్వతం.. సునామీ ముప్పు?
ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం పేలడంతో స్థానికుల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. ఈ పేలుడు దరిమిలా సునామీ ముప్పు పొంచివుంది. పేలుడు కారణంగా అగ్నిపర్వతంలోని కొంత భాగం సముద్రంలో పడిపోనున్నదని, ఫలితంగా 1871లో సంభవించిన మాదిరిగా భారీ సునామీ వచ్చే అవకాశం ఉందని స్థానిక అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో హైఅలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియాలోని రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్‌గా ఉంది. బూడిద, పొగను వెదజల్లుతోంది. అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా మారిందని, అది ఎప్పుడైనా సముద్రంలో పడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది జరిగితే, ఇది భారీ సునామీ సంభవిస్తుందని, ఇది సమీపంలోని తీర ప్రాంతాలలో భారీ విధ్వంసం కలిగించవచ్చని స్థానిక అధికారులు అంటున్నారు. ALERT: Indonesia volcano eruption sparks tsunami fears, alert level raised to highest — Officials worry that part of the volcano could collapse into the sea and cause a tsunami, as happened in 1871. pic.twitter.com/idTYAjuImo — Insider Paper (@TheInsiderPaper) April 17, 2024 సునామీ ముప్పు నేపధ్యంలో తీర ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. అలాగే బీచ్‌లను సందర్శించడం, సముద్రంలోకి వెళ్లడం లాంటి పనులు చేయకూడదని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రభుత్వం, విపత్తు నిర్వహణ సంస్థలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నాయి. -
గ్రిల్డ్ కోకోనట్ ఎపుడైనా ట్రై చేశారా? ధర ఎంతో తెలుసా?
వేసవిలో కొబ్బరి బొండాంకున్న ప్రాధాన్యతే వేరు.సహజసిద్ధంగా ఏర్పడిన కొబ్బరి నీళ్లలో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అయితే మీరెపుడైనా స్పైసీ గ్రిల్డ్ లేదా రోస్టెడ్ కొబ్బరిని టేస్ట్ చేశారా? ఇండోనేషియాలో ఈ స్ట్రీట్ డ్రింక్ చాలా ఫ్యామస్. అంతేకాదు ఆక్రమణదారులనుంచి దేశాన్ని కాపాడేందుకు, శారీరక బలం కోసం దీన్ని అక్కడి రాజులు దీన్ని ఎక్కువగా తాగేవారట. ఇండోనేషియాలో స్పైస్ గ్రిల్డ్ కోకోనట్ చాలా ఖరీదైంది కూడా. ఒక్కో బోండాం ధర 10వేలకు పైమాటేనట. Roast coconut street food , Indonesia pic.twitter.com/ZaJcxt7h8g — Science girl (@gunsnrosesgirl3) April 14, 2024 పచ్చి కొబ్బరి కాయను సుమారు 1-2 గంటల పాటు కాల్చుతారు. స్పెషల్‌గా ఏర్పాటు చేసిన గ్రిల్మీద జాగ్రత్తగా కాల్చుతారు. ఆతరువాత పైన పీచు వలిచేసి,లోపల ఉన్న లేత కొబ్బరితో సహా నీళ్లను సేవిస్తారు. దీన్ని వేడి వేడిగా, లేదా చల్లగా ఎలాగైన తినవచ్చు. ఇలా కాల్చడం వల్ల కొబ్బరి టేస్ట్‌తోపాటు పోషక విలువలుకూడా మరింత పెరుగుతాయని ఇక్కడి వారి నమ్మకం. కాల్చిన కొబ్బరి నీళ్లు, స్థానిక సుగంధ ద్రవ్యాలతోపాటు కొద్దిగా షుగర్‌ను కలిపి తాగుతారు. ఒక రోజులో కనీసం 30 కొబ్బరికాయలు అమ్ముడవుతాయి. -
అందం కోసం పాము రక్తమా? ఎక్కడో తెలుసా!
మనం పాములను దేవతగా పూజిస్తాం. చంపేందుకు కూడా వెనకడతాం. ఎంతో పరిస్థితి సివియర్‌గా ఉంటేనే గానీ వాటి జోలికి వెళ్లం, హాని తలపెట్టం. అలాంటిది ఒక దేశంలో ఏకంగా వాటి రక్తాన్ని టీ, కాఫీలు తాగినట్టు తాగేస్తారట. పైగా ఎందుకుని ఇలా తాగుతారో వింటే గుండెఝల్లుమంటుంది. అందుకోసం వీటి రక్తాన్ని తాగాలా అని అసహ్యంచుకుంటారో కూడా. ఇంతకి ఎక్కడ ఇలా చేస్తారు? దేని కోసం అంటే. విష సర్పాన్ని చూసి అల్లంతా దూరానికి పరిగెడతాం. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం లొట్టలేసుకుంటూ వాటి రక్తాన్ని తాగేస్తారు. వాటి రక్తం తాగితే శరీరాన్ని ఫిట్‌గా అందంగా ఉంటుందని వారు ప్రగాఢం నమ్ముతారట. పాము రక్తం కోసం దుకాణాల్లో రద్దీ కూడా ఓ రేంజ్లో ఉంటుందట. ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం అనేది అత్యంత సాధారణ విషయం. ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ మాదిరిగా పాము రక్తాన్ని విక్రయించడం విశేషం. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు పాము రక్తాన్ని తప్పక తాగుతారట. అంతేకాదు జకర్తాలో ఈ పాము రక్తానికి మంచి డిమాండ్, ట్రెండ్ కూడా ఉంది. దీని కారణంగా ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట ప్రజలు. అయితే ఈ రక్తాన్ని తాగిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగ గంటల వరకు టీ, కాఫీలను తాగకూడదట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆఫీస్‌లు, కాలేజీల్లో టీ, కాఫీలు ఎలా తాగుతామో అలా అక్కడ పాము రక్తం తాగేస్తారట వాళ్లు. ఎందుకు తాగుతున్నారంటే.. ఇండోనేషియా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. ముఖ్యంగా అక్కడి స్త్రీలు తమ అందం పెంచుకునేందుకు తప్పనిసరిగా ఈ పాము రక్తం తాగుతారట. పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుందట. ఆరోగ్యం బాగుంటుందట. ఇలా పాము రక్తం తాగే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఇండోనేషియన్ వాసులకు అనాదిగా వస్తుందట. అయితే వాళ్లు ఇలా పాము రక్తాన్ని తాగడమే కాదు వాటిని ఆహారంగా తింటారట కూడా. వాటిని చక్కగా నిమ్మగడ్డితో ఉడకబెట్టి వేయించి మరీ తింటారట. (చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!) -
కొండచరియలు విరిగిపడి 19 మంది మృతి!
ఇండోనేషియాలోని సుమత్రా దీవులు ప్రకృతి విలయానికి అతలాకుతలమవుతున్నాయి. కుండపోత వర్షాలు ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 19 మంది మృతి చెందగా, ఏడుగురు గల్లంతయ్యారు. ఇండోనేషియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం సుమత్రా దీవుల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. విపత్తు నిర్వహణ ఏజెన్సీలు ఘటనా స్థలంలో సహాయ చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ప్రమాద ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా తరలించారు. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. టన్నుల కొద్దీ మట్టి, రాళ్లు, నేలకూలిన చెట్లు నివాస ప్రాంతాల్లోకి చేరుకున్నాయని స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధిపతి డోనీ యుస్రిజల్ తెలిపారు. పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని పెసిసిర్ సెలాటాన్ జిల్లాలో పలు చోట్ల కొండచరియలు విరిగిపడి గ్రామాల్లో విధ్వసం సృష్టించాయి. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 19 కి చేరుకుంది. వరదలతో పాటు కొండచరియలు విరిగిపడినకారణంగా 14 గృహాలు నేలమట్టమయ్యాయి. 80 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
భారత్, ఇండొనేసియా మధ్య స్థానిక కరెన్సీలోనే వాణిజ్యం
ముంబై: ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీలను స్థానిక కరెన్సీలోనే నిర్వహించుకోవడంపై భారత్, ఇండొనేíసియా దృష్టి పెట్టాయి. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇండోనేసియా ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, బ్యాంక్ ఇండోనేసియా గవర్నర్ పెర్రీ వార్జియో దీనిపై సంతకాలు చేశారు. సీమాంతర లావాదేవీలను భారతీయ రూపాయి (ఐఎన్ఆర్), ఇండొనేషియా రూపియా (ఐడీఆర్) మారకంలో నిర్వహించడాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడానికి ఇది ఉపయోగ పడనుంది. -
ఇండొనేసియాలో కొత్త ఏలిక
సర్వేలన్నీ జోస్యం చెప్పినట్టు బుధవారం జరిగిన ఇండొనేసియా దేశాధ్యక్ష ఎన్నికల్లో రక్షణమంత్రి, వివాదాస్పద మాజీ సైనికాధికారి జనరల్ ప్రబోవో సుబియాంటో విజయం సాధించారు. అభ్యర్థుల్లో మిగిలినవారితో పోలిస్తే ఓటర్లకు బాగా పరిచయమున్న నేత గనుక తొలి రౌండులో ముందంజలో ఉంటాడని అందరూ అంచనా వేశారు. కానీ నెగ్గటానికి అవసరమైన 50.1 శాతం కనీస ఓట్ల వరకూ వెళ్లగలరని ఎవరూ అనుకోలేదు. ఇండొనేసియా ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థుల్లో ఎవరికీ కనీస ఓట్లు లభించకపోతే తిరిగి పోలింగ్ నిర్వహించకతప్పదు. గతంలో అధ్యక్ష పదవికి రెండు దఫాలు పోటీచేసి ఓడిన సుబియాంటోకు తాజా ఎన్నికల్లో సానుభూతితోపాటు యువత మద్దతు పుష్కలంగా దొరికింది. అందుకే ఆయనకు 60 శాతం ఓట్లు పోలయ్యాయి. సుబియాంటో చరిత్ర ఏమంత ఘనమైనది కాదు. దేశాన్ని దీర్ఘకాలం పాలించిన తన సొంత మామ, నియంత జనరల్ సుహార్తో ప్రాపకంతో సైన్యంలో ఉన్నత పదవులకు ఎగబాకి లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. 1997 నాటి విద్యార్థి ఉద్యమాన్ని దారుణంగా అణిచేయటంలో కీలకపాత్ర పోషించారు. ఆ సమ యంలో దాదాపు 20 మంది విద్యార్థి నేతల అపహరణలకు సుబియాంటోయే కారణమన్న ఆరోపణ లున్నాయి. వారందరూ సైన్యం చిత్రహింసలకు బలైవుంటారని మానవ హక్కుల సంఘాలు ఆరో పించాయి. చిత్రమేమంటే ఆ తర్వాత మరో ఏడాదికే సుహార్తోను గద్దెదించటానికి సుబియాంటో తోడ్పడ్డారు. ఆ తర్వాత తానే ఆ పీఠాన్ని అధిష్టించాలని ఉవ్విళ్లూరినా అది సాధ్యపడలేదు. కనీసం సైనిక దళాల చీఫ్ కావాలని కలలుకన్నా సుహార్తో స్థానంలో అధ్యక్షుడైన బీజే హబీబి అందుకు ససేమిరా అంగీకరించలేదు. దాంతో ఆయనపై ఆగ్రహించి కొందరు సైనికులను వెంటబెట్టుకుని అధ్యక్ష భవనంపై దాడికి సిద్ధపడ్డారు. కానీ అది వికటించి సైన్యం నుంచి ఉద్వాసన తప్పలేదు. ఆ తర్వాత జోర్డాన్ పరారై వ్యాపారవేత్తగా అవతరించారు. 2009 అధ్యక్ష ఎన్నికల నాటికి సొంతంగా ఒక పార్టీ స్థాపించి మాజీ దేశాధ్యక్షురాలు మేఘావతి సుకర్ణోపుత్రితో కూటమికట్టి ఉపాధ్యక్షుడిగా పోటీచేశారు. కానీ ఆ కూటమి ఓటమి చవిచూసింది. 2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసినా ఓటర్లు తిరస్కరించారు. ఆ తర్వాతే సుబియాంటోకు జ్ఞానోదయమైంది. రెండుసార్లూ తనపై గెలిచిన అధ్యక్షుడు జోకోవితో సంధి చేసుకుని రక్షణమంత్రి అయ్యారు. ఈసారి సైతం జోకోవియే పోటీచేసేవారు. కానీ అధ్యక్ష పదవికి వరసగా రెండుసార్లు మించి పోటీ చేయకూడదన్న నిబంధన కారణంగా ఆయన రంగం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలోనే ఇండొనేసియా మూడో అతి పెద్ద ప్రజాతంత్ర దేశం. జనాభా రీత్యా ముస్లింలు అత్యధికంగా వున్న దేశం. ఆగ్నేయాసియాలో అతి పెద్ద పారిశ్రామిక దేశంగా ఒకప్పుడున్నా 1997లో వచ్చిన ఆర్థిక సంక్షోభంలో దెబ్బతింది. ఆ తర్వాత క్రమేపీ వృద్ధి సాధిస్తూ 2012 నాటికి జీ–20 దేశాల్లో ఆర్థికాభివృద్ధి వైపు దూసుకుపోతున్న నాలుగో అతి పెద్ద దేశంగా ఎదిగింది. 2020లో కోవిడ్ బారిన పడటమేకాక, ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంది. ఇప్పుడిప్పుడే తిరిగి పుంజుకుంటున్నా నిరు ద్యోగం, అధిక ధరలు వేధిస్తూనే వున్నాయి. దానికితోడు దక్షిణ చైనా సముద్రంలో చైనాతో సరిహద్దు తగాదాలున్నాయి. అయితే ఇరు దేశాల ఆర్థిక సంబంధాలకూ ఆ వివాదం అడ్డురాలేదు. అటు అమె రికా, భారత్‌లతో సాన్నిహిత్యం సాగిస్తూ ఇండొనేసియా ఆర్థికంగా పుంజుకుంటోంది. విదేశీ పెట్టు బడులను ఆకర్షిస్తోంది. అయితే దీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతూ, ఉద్యమ చరిత్రగల ఇద్దరు నేతలను కాదని మాట నిలకడ, సిద్ధాంత నిబద్ధత లేని సుబియాంటోకు ఈ స్థాయిలో ప్రజలు నీరాజనాలు పట్టడం ఆశ్చర్యకరమే. యువతలో సుబియాంటో పేరు మారుమోగటానికి టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాలు దోహదపడ్డాయి. సర్వే నిర్వహించిన సంస్థలకు ఓటర్లు... మరీ ముఖ్యంగా యువ ఓటర్లు ఆయన గత చరిత్ర తమకు అనవసరమని చెప్పటం సుబియాంటోకున్న జనాకర్షణను తెలియజేస్తుంది. గతంలో దేశాధ్యక్ష పదవికి పోటీచేసిన రెండుసార్లూ తన సైనిక గతాన్ని ఘనంగా చెప్పుకున్న సుబియాంటో ఈసారి ఆ జోలికి పోలేదు. సైనికాధికారిగా పనిచేసిన కాలంలో తూర్పు తైమూర్‌లో స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నవారిని హతమార్చటం, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఉద్యమించిన విద్యార్థి నేతలను మాయం చేసి వారి ప్రాణాలు తీయటంవంటి అంశాల్లో అమెరికా, ఆస్ట్రేలియా గతంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఆయనపై నిషేధం కూడా విధించాయి. మూడో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన ఇండొనేసియాలో క్రమేపీ వ్యవస్థలు బలహీనపడు తుండటం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది. ఈసారి సుబియాంటో తరఫున ఉపాధ్యక్ష పదవికి నిలబడిన 36 ఏళ్ల గిబ్రాన్ నేపథ్యమే ఈ సంగతి చెబుతుంది. కనీసం 40 ఏళ్లుంటే తప్ప ఉపాధ్యక్ష పదవికి పోటీచేయటానికి వీల్లేదని ఎన్నికల నిబంధనలు చెబుతున్నా రాజ్యాంగ న్యాయ స్థానం చీఫ్ జస్టిస్‌గా వున్న గిబ్రాన్ మామ ఈ నిబంధనను సవరించి అతనికి సాయపడ్డాడు. దీనిపై ఆందోళన చెలరేగి చీఫ్ జస్టిస్ రాజీనామా చేయాల్సివచ్చినా, ఆ తీర్పు మాత్రం రద్దుకాలేదు. 20 కోట్ల మంది ఓటర్లలో అత్యధికుల మనసు గెలుచుకున్న సుబియాంటో అంతంతమాత్రంగా వున్న వ్యవస్థలను మరింత బలహీనపరుస్తారని ఆయన ఎన్నికల ప్రసంగాలే చెబుతున్నాయి. మానవ హక్కుల చార్టర్, రాజ్యాంగ న్యాయస్థానం వంటివి కనుమరుగైతే ఇండొనేసియా తిరిగి నియంతృత్వంలోకి జారుకుంటుంది. ఆర్థికాభివృద్ధి దెబ్బతింటుంది. ప్రజల అప్రమత్తతే ఆ ప్రమాదాన్ని నివారించాలి. -
Indonesia election 2024: ఒకే రోజు... ఐదు ఎన్నికలు
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన ఇండోనేసియాలో పార్లమెంట్, స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దేశ జనాభా 27 కోట్లు కాగా, 20 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 17 ఏళ్లు నిండినవారంతా ఓటు వేయడానికి అర్హులే. ఈ నెల 14వ తేదీన జరిగే ఎన్నికల్లో విజయం కోసం ప్రధానంగా మూడు పారీ్టలు హోరీహోరీగా తలపడుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితోపాటు నేషనల్, ప్రావిన్షియల్, రీజినల్, రిజెన్సీ, సిటీ స్థాయిల్లో ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. మొత్తం ఐదు బ్యాలెట్ పేపర్లపై ఓటు వేయాల్సి ఉంటుంది. జాతీయ, స్థానిక ఎన్నికలు ఒకే రోజు జరగడం ఇండోనేసియా ప్రత్యేకత. అయితే, ఈ ఎన్నికల్లో ఓటు వేయడం తప్పనిసరి కాదు. అయినా ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 81 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. దేశంలో 575 పార్లమెంట్ స్థానాలు ఉండగా, 18 జాతీయ పారీ్టలు ఎన్నికల బరిలో నిలిచాయి. వివిధ స్థాయిలో మొత్తం 20,616 పదవులకు 2,58,602 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అధ్యక్షుడి పదవీ కాలం ఐదేళ్లు. అమెరికా అధ్యక్షుడి తరహాలో రెండుసార్లు మాత్రమే పదవిలో కొనసాగడానికి అర్హత ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు జొకో విడొడో(జొకోవి) వరుసగా రెండుసార్లు గెలిచారు. పదేళ్లపాటు పదవిలో కొనసాగారు. ఆయన రెండు టర్మ్‌లు పూర్తయ్యాయి. కాబట్టి పది సంవత్సరాల తర్వాత ఈసారి మార్పు తప్పనిసరి కాబోతోంది. మొత్తం జనాభాలో 90 శాతం మంది ముస్లింలే ఉన్న ఇండోనేíÙయాలో పోలీసులకు, సైనికులకు ఎన్నికల్లో ఓటు వేసే హక్కు లేదు. 40 కొత్త నగరాలు నిర్మిస్తాం అనీస్ బాస్వెదాన్ జకార్తా మాజీ గవర్నర్, విద్యావేత్తగా పేరుగాంచిన అనీస్ బాస్వెదాన్(54) స్వతంత్ర, ప్రతిపక్ష అభ్యరి్థగా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఆయన అమెరికాలో విద్యాభ్యాసం చేశారు. స్వదేశంలో తొలుత విద్యారంగంలోకి, తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. విద్యాశాఖ మంత్రిగానూ వ్యవహరించారు. ఇక అనీస్ సహచరుడిగా ఉపాధ్యక్ష పదవికి నేషనల్ అవేకెనింగ్ పార్టీ నేత, పీపుల్స్ రిప్రిజెంటేటివ్ కౌన్సిల్ డిప్యూటీ స్పీకర్ ముహైమిన్ ఇస్కాందర్(57) బరిలో ఉన్నారు. వీరికి మరో రెండు పార్టీలు మద్దతిస్తున్నాయి. ఎన్నికల్లో తమను గెలిపిస్తే దేశవ్యాప్తంగా 40 కొత్త నగరాలు నిర్మిస్తామని అనీస్ బాస్వెదాన్, ఇస్కాందర్ హామీ ఇస్తున్నారు. యువత కోసం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెబుతున్నారు. సుబియాంటోకు విజయావకాశాలు! ఇండోనేసియా ఎన్నికల్లో అధ్యక్ష పదవిపై ప్రధానంగా ముగ్గురు నేతలు కన్నేశారు. ఇండోనేషియా జాతీయవాద పార్టీ అయిన గెరిండ్రా పార్టీ నుంచి మాజీ సైనికాధికారి ప్ర»ొవో సుబియాంటో(72) పోటీలో ఉన్నారు. ఇదే పార్టీ నుంచి ఉపాధ్యక్ష పదవికి జొకో విడొడో తనయుడైన 36 ఏళ్ల గిబ్రాన్ రాకాబుమింగ్ రాకా బరిలో నిలిచారు. 2014, 2019 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి సుబియాంటో పోటీపడ్డారు. రెండుసార్లు ఓటమి పాలయ్యారు. మూడోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. జొకోవి ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా పనిచేసిన సుబియాంటోపై పలు తీవ్ర అభియోగాలు ఉన్నాయి. 1990వ దశకంలో సైనికాధికారిగా పని చేస్తున్న సమయంలో 20 మందికిపైగా ప్రజాస్వామ్య ఉద్యమ కార్యకర్తలను కిడ్నాప్ చేయించినట్లు ప్రచారం జరిగింది. వారిలో 10 మందికిపైగా ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. సుబియాంటో ఈస్ట్ తిమోర్, పపువా న్యూ గినియా దేశాల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. 1998లో సైన్యం నుంచి తప్పుకున్నారు. 2020 వరకు తమ దేశంలో ప్రవేశించకుండా ఆయనపై అమెరికా నిషేధం విధించింది. గిబ్రాన్ రాకాబుమింగ్ కూడా వివాదాస్పదుడే. ప్రస్తుతం సురకర్తా సిటీ మేయర్‌గా పనిచేస్తున్నాడు. తమను గెలిపిస్తే దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని, ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తామని సుబియాంటో, గిబ్రాన్ హామీ ఇస్తున్నారు. గెరిండ్రా పారీ్టకి ఇతర చిన్నాచితక పారీ్టలు మద్దతిస్తున్నాయి. ఇప్పుడు అంచనాలను బట్టి చూస్తే ప్ర»ొవో సుబియాంటో తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అధ్యక్ష బరిలో విద్యావేత్త ప్రనొవో మెగావతి సుకర్నోపుత్రి సారథ్యంలోని ఇండోనేషియన్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగుల్ నుంచి అధ్యక్ష పదవికి గాంజార్ ప్రనొవో(55), ఉపాధ్యక్ష పదవికి మహ్ఫుద్ ఎండీ(66) పోటీలో ఉన్నారు. ప్రనొవో గతంలో సెంట్రల్ జావా గవర్నర్‌గా సేవలందించారు. మహ్ఫుద్ ఎండీకి గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ స్ట్రగుల్‌తో మరో మూడు పార్టీలు జట్టుకట్టాయి. ఇద్దరు అభ్యర్థులపై ఎలాంటి అరోపణలు, వివాదాలు లేకపోవడం కలిసివచ్చే అంశంగా భావిస్తున్నారు. సామాన్య ప్రజల సమస్యలు తమకు తెలుసని, అధికారం అప్పగిస్తే వారి సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తామని ప్రనొబో, మహ్ఫుద్ విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ప్రజలకు సామాజిక సాయం పంపిణీ చేస్తామని, ఉద్యోగుల వేతనాలు పెంచుతామని అంటున్నారు. కీలక ప్రచారాంశాలు? ► ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్నట్లుగానే ఇండోనేíÙయాలోనూ ఎన్నో సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఆర్థిక వృద్ధి 2022లో 5.3 శాతం కాగా, 2023లో అది 5.05 శాతానికి పడిపోయింది. ► దేశంలో ప్రజల జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబాలను పోషించుకోవడం కష్టతరంగా మారింది. ► నిరుద్యోగ సమస్య వేధిస్తోంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కరువైపోయాయి. ఉద్యోగులు, కారి్మకులకు వేతనాలు తగ్గిపోయాయి. మొత్తం ఓటర్లలో సగానికి పైగా ఓటర్లు 40 ఏళ్లలోపు యువతే ఉన్నారు. వారే నిర్ణయాత్మక శక్తిగా తీర్పు ఇవ్వబోతున్నారు. ► దేశంలో మానవ హక్కుల హననం, ప్రజాస్వామ్య వ్యవస్థ పతనమవుతుండడంపై యువత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయన్న నమ్మకం తమకు లేదని చెబుతున్నారు. అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. అందరూ చూస్తుండగానే కబలించిన మృత్యువు
ఫుట్‌బాల్ మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ ఆటగాడిని మృత్యువు కబలించింది. పిడుగుపాటుకు గురై ఓ ఫుట్‌బాలర్ మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని పశ్చిమ జావాలో జరిగింది. స్థానిక జట్ల మధ్య జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఈ విషాదం సంభవించింది. This happened during a football match in Indonesia 🇮🇩 pic.twitter.com/JHdzafaUpV — Githii (@githii) February 11, 2024 మ్యాచ్ జరుగుతుండగా 35 ఏళ్ల ఫుట్‌బాలర్‌పై పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటిదాకా చురుగ్గా కదిలిన సహచరుడు ఒక్కసారిగా నిశ్రేష్ఠుడిగా మారడంతో ఆటగాళ్లలో దుఖం కట్టలు తెంచుకుంది. ఈ ఘటన చూసి ఆటగాళ్లతో పాటు మైదానంలో ఉన్నవారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఏడాదికాలంలో ఇండోనేషియాలో ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురికావడం ఇది రెండోసారి. గతంలో తూర్పు జావాలోని ఓ యువ ఫుట్‌బాలర్ ఇలాగే పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగుపాటు కారణంగా ఆ ఫుట్‌బాలర్‌కు గుండెపోటు వచ్చింది. అయితే అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. క్రీడా మైదానాల్లో ఇలాంటి దుర్ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. 25 సంవత్సరాల క్రితం కాంగోలో ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ జరగుతుండగా పిడుగుపడి జట్టు మొత్తం ప్రాణాలు కోల్పోయింది,. -
నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..
మన ఊహకే అందని విచిత్రాలు ఈ ప్రకృతి సొంతం. ఎంతలా ఏఐ వంటి మహత్తర టెక్నాలజీల వచ్చినా కొన్ని విచిత్రాలు ఇప్పటకీ ఓ పట్టాన అర్థం కావు. ఎందువల్ల ఇలా జరిగిందనేది మేధావుల మెదడుకు అందదు. కానీ అవి ఓ మనిషి నువ్వు ఎన్ని కనిపెట్టిన మమ్మల్ని అందుకోలేవు అన్నట్లు ప్రకృతి తన వైవిధ్యాన్ని, గొప్పతనాన్ని ఎప్పటికప్పుడూ చెంపదెబ్బ కొట్టినట్లు చెబుతూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడూ నా అధీనుడవే అంటుంది. అహం చూపించావో అంతం చేసేస్తా అన్నట్లు కన్నెర జేస్తుంది ప్రకృతి. ఎప్పటికీ నీ శక్తికి, వైవిధ్యానికి దాసోహం అంటే అన్ని అర్థమయ్యేలా అమ్మలా వివరిస్తుంది. 'దటీజ్ నేచర్' అని చెప్పకనే చెబుతుంది. ఈ నాటి ఆసక్తికర విశేషాలేంటో చూద్దామా! ►నాట్య భంగిమల్లా కనిపించే ఈ నిలువెత్తు వృక్షాలు ఇండోనేసియాలోని సుంబా దీవి మడ అడవుల్లోనివి. ఉప్పునీరు పుష్కలంగా ఉండే చోట ఈ చెట్లు పెరుగుతాయి. సుంబా దీవిలోని వలాకిరి బీచ్‌లో ఈ చెట్లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాల్లో బంధించాలనుకునే ఫొటోగ్రాఫర్లు తరచుగా ఇక్కడకు వస్తుంటారు. సూర్యోదయ, సూర్యాస్తమ వేళల్లో ఈ చెట్ల ఫొటోలు తీస్తుంటారు. ►మనుషులు మొట్టమొదటగా మచ్చిక చేసుకున్న జంతువులు మేకలు. మనుషులు మేకలను పదివేల ఏళ్ల కిందటే మచ్చిక చేసుకుని, పెంపుడు జంతువులుగా మార్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి. ►కొందరికి ఎలుకలంటే చచ్చేంత భయం. ఎలుకల పట్ల ఉండే ఈ భయాన్ని వైద్య పరిభాషలో ‘మ్యూరోఫోబియా’ అంటారు. ►ఏదో మాట వరసకు గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోగలం గాని, దాని చేత నీళ్లు తాగించలేం అంటుంటారు. అదంతా అపోహ మాత్రమే! గుర్రాలకు నీళ్లు తాగడం బాగా ఇష్టం. ఒక గుర్రం రోజుకు సగటున ముప్పయి నుంచి అరవై లీటర్ల వరకు నీటిని అవలీలగా తాగేయగలదు. (చదవండి: పసికందులు ఎందుకు ఏడుస్తున్నారో ఠక్కున చెప్పేసే డివైజ్!) -
Indonesia Talaud Islands Earthquake: ఇండోనేషియాలో భూకంపం
జకర్తా: ఇండోనేషియాలోని తలాడ్ దీవుల సమీపంలో భూకంపం సంభవించింది. రిక్ట్కార్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. మంగళవారం తెల్లవారుజామున 2.18 నిమిషాలకు భూమి కంపించింది. Earthquake of Magnitude:6.7, Occurred on 09-01-2024, 02:18:47 IST, Lat: 4.75 & Long: 126.38, Depth: 80 Km ,Location: Talaud Islands,Indonesia for more information Download the BhooKamp App https://t.co/Ughl0I9JG3 @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 @KirenRijiju @Ravi_MoES — National Center for Seismology (@NCS_Earthquake) January 8, 2024 అయితే ఈ భూకంపం ద్వారా ఎటువంటి ఆస్తీ, ప్రాణ నష్టం జరగనట్లు తెలుస్తోంది. ఇటీవల జపాన్‌లో చోటుచేసుకున్న భూకంపం తీవ్ర నష్టం కలిగించిన విషయం తెలిసిందే. చదవండి: ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’ -
విదేశీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ యంగ్ హీరో..!
దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వ కార్తికేయ. జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాలతో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయకు జోడిగా ఆయుషి పటేల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో వీరిద్దరు క్రేజీ ఆఫర్ పట్టేశారు. ‘శూన్యం చాప్టర్ -1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–సుమీత్ జోడీ
గువాహటి: స్వదేశంలో జరుగుతున్న గువాహటి మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి (భారత్) జోడీ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో తెలంగాణకు చెందిన సిక్కి–సుమీత్ ద్వయం 20–22, 21–15, 21–16తో రఫ్లీ రమంద–ఇందా సరి జమీల్ (ఇండోనేసియా) జంటను ఓడించింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21–14, 17–21, 7–21తో కువో కువాన్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో... తరుణ్ 11–21, 14–21తో జియా జెంగ్ జేసన్ (సింగపూర్) చేతిలో... ప్రణయ్ 12–21, 17–21తో కార్తికేయ (భారత్) చేతిలో ఓడిపోయారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హైదరాబాద్ అమ్మాయి సామియా 21–12, 21–11తో తెలంగాణకే చెందిన గద్దె రుత్విక శివానిపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. -
అగ్ని పర్వతం విస్పోటనం.. 11 మంది పర్వతారోహకులు మృతి
జకర్తా: ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. ఈ ఘటనలో దాదాపు 11 మంది పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సుమత్రా ద్వీపంలో 2,891 మీటర్ల (9,484 అడుగులు) ఎత్తున్న మౌంట్ మెరాపి అగ్ని పర్వతం ఆదివారం విస్పోటనం చెందింది. ఈ ఘటనతో చుట్టుపక్కల కిలోమీటర్ల మేర బూడిద మేఘాలు కమ్మేశాయి. పేలుడుతో దాదాపు 3,000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మిందిని అధికారులు తెలిపారు. "అగ్ని పర్వతం విస్పోటనం జరిగిన సమయంలో దాదాపు 75 మంది పర్వతారోహకులు అక్కడ ఉన్నారు. 49 మంది పర్వతం నుంచి కిందికి దిగివచ్చారు. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించాం. 11 మంది మృతి చెందారు. 12 మంది ఆచూకీ తెలియలేదు." అని సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ తెలిపారు. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వారాంతంలో పర్వతారోహకులు ట్రెక్కింగ్ చేసే సమయంలో అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దీంతో ప్రాణ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే నాసా కంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్..! కానీ.. -
ఇదో అద్భుత హెటల్: ఇక్కడ అన్నీ ఉంటాయి,, కానీ..!
ఇండోనేషియాలోని ఒక అద్భుతం కట్టడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అత్యంత తక్కువ స్థలంలో ఆరు అంతస్తుల్లో నిర్మించిన ఒక హోటల్ ఇపుడు హాట్ టాపిక్. సెంట్రల్ జావాలోని సలాటిగా టౌన్లో ఉన్న ‘‘పిటురూమ్స్’’ హోటల్ ప్రపంచంలోనే అత్యంత తక్కువ స్థలంలో నిర్మించిన అతి పెద్ద భవంతిగా రికార్డు సాధించింది. ఇండోనేషియా ఆర్కిటెక్ట్ ఆరీ ఇంద్ర, సహబత్ సెలోజెనే రూపొందించిన అతి సన్నని హెటల్ కేవలం 110 ఇంచుల వెడల్పు అంటే నమ్ముతారా. కాని ఇదే నిజం. సలాటిగా 2022లో నిర్మితమైన ఈ హోటల్ గరిష్ట ఎత్తు 17 మీ (55 అడుగులు) పొడవు 9.5 మీ (31 అడుగులు). ఇంటీరియర్ లేఅవుట్ గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. మొత్తం ఏడు దులు, ఒక చిన్న లాంజ్, ఒక ఎంట్రన్స్ లాబీ, భవనం పైభాగంలో చిన్న అవుట్డోర్ టెర్రస్ ఏరియాలో బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. హోటల్ గదులు మధ్య క్రిస్క్రాసింగ్ మెట్లు, వస్తువులు, ఇంకా వికలాంగుల కోసం చిన్న ఎలివేటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ ఏడు గదులలో ఒక్కోటి ఒక్కో రంగులో ఒక్కో ధీమ్‌తో ఉంటాయి. డబుల్ బెడ్, టీవీ, షవర్, సింక్ , టాయిలెట్‌తో కూడిన బాత్రూమ్ లాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. కేవలం 9.1 x 9.8 x 7.8 అడుగులతో కాంపాక్ట్ రూమ్స్‌లో అన్ని ఎమినిటీస్, ఇంటీరియర్‌తో, వివిధ ఒరిజినల్ ఆర్ట్‌వర్క్‌లతో, విభిన్న థీమ్‌తో, ప్రతీమూల ఒక పెర్సనల్ టచ్‌తో అత్భుతమైన అనుభవాన్నిస్తుందని సహబత్ సెలోజీని తెలిపారు. ఈ కాంపాక్ట్ రూములను కలిపేలా ఫ్లోటింగ్ స్టెప్స్, 90 సెంటీమీటర్ల (2.9 అడుగుల) నారో క్యారిడార్లు కారిడార్‌తో ఫ్లోరింగ్‌గా అమర్చినట్టు తెలిపారు. ధర ఎంతో తెలుసా? జపనీస్ భాషలో పిటూ అంటే ఏడు అని అర్థం. సెంట్రల్ జావాలో ఉన్న హోటల్లో ఏడు గదులు ఉండడంతో పిటూరూమ్స్ అని పిలుస్తారట. మరి ఈ PituRoomsలో ఒక రాత్రి బస చేయాలనుకుంటే ఒక్కో రాత్రికి సుమారు రూ. 5వేలు ఖర్చు అవుతుంది. -
శివపదం గీతాలకు ఇండోనేషియా బాలిలో నృత్య ప్రదర్శన
శివపదం గ్లోబల్ ఫ్యామిలి భారతీయ నృత్య ప్రదర్శనకు సరిహద్దులు లేవని చాటిచెప్పారు. అమెరికాలో పుట్టి పెరిగిన 45 మంది భారతీయ విద్యార్థులు ఇండోనేషియా బాలిలో కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ వంటి సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. శివపదం గీతాలకు వాణి గుండ్లాపల్లి (నో యువర్ రూట్స్, యూ. ఎస్. ఏ.), దినేష్ కుమార్ (సంగమం అకాడమీ, ఇండియా) నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. డా.సామవేదం షణ్ముఖ శర్మ రచించిన శివపదం సాహిత్య పద్యాలతో పాటు త్యాగరాజు, అన్నమయ్య, మైసూర్ వాసుదేవాచార్యులు రచించిన సాహిత్యాలకు నృత్య ప్రదర్శన చేశారు. అలాగే శివాష్టకం, దుర్గా దేవిస్తోత్రం వంటి వేద స్తోత్రాలను అనేక నృత్య కళారూపాలలో ప్రదర్శించారు.మైత్రీమ్ భజత అనే గీతాన్ని కూడా అందమైన నృత్య రూపంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా నవీన్ మేఘ్వాల్ (బాలిలోని ఐ.సి.సి.ఆర్ – ఎస్.వి.సి.సి డైరెక్టర్), డైరెక్టర్: ప్రొఫెసర్ డా. ఐ వాయన్ అద్న్యానా ఇసి, డెన్పాసర్లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళలకు ఎల్లలు లేవని చాటిచెప్పడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. -
ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూ ప్రకంపనలు
శక్తివంతమైన భూ ప్రకంపనలతో ఇండోనేషియా ఉలిక్కిపడుతోంది. తాజాగా.. రిక్టర్ స్కేల్‌పై దాదాపు 6.9 తీవ్రతతో ప్రకంపనలు నమోదు అయ్యాయి. మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు. ది నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 10 గంటల సమయంలో బాందా సముద్ర ప్రాంతంలో శక్తివంతమైన ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రత నమోదు అయ్యింది. అంబోన్‌కు 370 కిలోమీటర్ల దూరంలో.. 146 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. బాందా సముద్రంలో టానింబర్ దీవులకు దగ్గర్లో భూకంప కేంద్ర నమోదు అయ్యిందని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం ప్రకటించింది. ఈ దీవి జనాభా లక్షా 27 వేలు. అయితే సునామీ హెచ్చరికలు జారీ చేయని ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక విభాగం.. మరిన్ని ప్రకంపనలు సంభవిస్తాయని మాత్రం హెచ్చరించింది. ఏడాది వేల భూకంపాలు ఇండోనేషియా జనాభా 27 కోట్లను పైనే. ‘రింగ్ ఆఫ్ ఫైర్’గా పిలిచే అగ్నిపర్వతాల జోన్లో ఈ దేశం ఉంది. పసిఫిక్ మహాసముద్రాన్ని చుట్టుముట్టిన టెక్టోనిక్ ప్లేట్ల బెల్ట్‌గా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ను చెబుతుంటారు. ఈ కారణంగానే అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలలో ఒకటిగా ఇండోనేషియా ఉంది. అందుకే ఆ దేశాన్ని భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వత విస్ఫోటాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2004లో 9.1 తీవ్రతతో ఏర్పడిన భూకంపంతో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ అనేక దేశాల్లో తీవ్ర విషాదం నింపింది. ఒక్క ఇండోనేషియాలోనే దాదాపు 2.3లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక.. గడిచిన 24 గంటల్లో ఇండోనేషియాలో మూడు భూకంపాలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై వరుసగా 7, 6.9, 5.1 తీవ్రతతో నమోదు అయ్యాయి. గత వారంగా 15సార్లు భూమి కంపించింది. నెల వ్యవధిలో 68 సార్లు భూమి కంపించగా.. ఏడాది కాలంగా 782సార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై 1.5 తీవ్రతతో చిన్నపాటి ప్రకంపనల నుంచి శక్తివంతమైన ప్రకంపనలే వాటిల్లాయి ఇక్కడ. 2020లో ఇండోనేషియాలో 8,260సార్లు భూకంపాలు సంభవించాయి. కానీ, అంతకు ముందు ఏడాదిలో 11,500 సార్లు భూమి కంపించింది. -
ఇండోనేసియాలో భూకంపం
జకార్తా: ఇండోనేసియా ఆగ్నేయప్రాంతంలో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైంది. ఈస్ట్ నుసా తెంగ్గారా ప్రావిన్స్ రాజధాని కుపంగ్‌కు 21 కిలోమీటర్ల దూరంలో భూమికి 36 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. దీని తీవ్రతతో కుపంగ్ నగరంలోని ఇళ్లు, ఇతర భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొంది. -
ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి మహిళకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ కమలా షిరిన్ లఖ్ధీర్‌ను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. లఖ్ధీర్‌కు దాదాపు 30 సంవత్సరాలు విదేశాంగ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2017 నుంచి 2021 వరకు మలేషియాలో అమెరికా అంబాసిడర్‌గా పనిచేయడానికి ముందు, ఆమె రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా కొనసాగారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తర ఐర్లాండ్‌లో అమెరికా కాన్సుల్ జనరల్‌గా ఆమె పనిచేశారు. 1991లో ఫారిన్ సర్వీస్‌లో చేరిన లఖ్దీర్.. సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీలో మొదట పనిచేశారు. మారిటైమ్ ఆగ్నేయాసియా వ్యవహారాల కార్యాలయానికి డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాల బ్యూరోలో తైవాన్ కోఆర్డినేషన్ స్టాఫ్‌కు డిప్యూటీ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన లఖ్ధీర్.. హార్వర్డ్ కళాశాల నుంచి బీఏ, నేషనల్ వార్ కళాశాల నుంచి ఎమ్ఎస్ పట్టా పొందారు. చైనీస్, ఇండోనేషియాతో సహా పలు భాషలపై ఆమెకు పట్టు ఉంది. ఇదీ చదవండి: శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు -
పొగలు కక్కే క్యాండీ తింటున్నారా? పేగులు చిల్లులు పడతాయి జాగ్రత్త
పొగలు కక్కే మిఠాయి కొద్దికాలంగా ఇండోనేషియాలో వేలంవెర్రిగా మారింది. రంగురంగుల్లో నోరూరించే ఈ మిఠాయిపేరు ‘చికి ఎంగెబుయి’. ఇది సాదాసీదా క్యాండీలాంటి మిఠాయే! అయితే, పొగలు కక్కుతూ కనిపించేందుకు దీనిపై లిక్విడ్ నైట్రోజన్ చల్లి తినడానికి అందిస్తారు. దట్టమైన ఆవిరిలాంటి పొగలు కక్కుతూ ఉండటంతో దీనికి ‘డ్రాగన్ బ్రీత్’ అని ముద్దుపేరు కూడా పెట్టుకున్నారు. ఇక ఇండోనేసియాలో ఈ క్యాండీ పెద్ద తంటానే తెచ్చిపెట్టింది. దీనిని తినడం వల్ల పశ్చిమ జావా ప్రాంతంలో దాదాపు ముప్పయిమంది పిల్లలు గతంలో ఆస్పత్రిపాలయిన సంగతి తెలిసిందే. పొగలు కక్కే ఈ చిరుతిండి కడుపులోకి వెళ్లాక, పేగులు చిల్లులు పడేలా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై గగ్గోలు చెలరేగడంతో పశ్చిమ జావా గవర్నర్ రిద్వాన్ కామిల్ జనవరి 10న ఈ చిరుతిండిపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. View this post on Instagram A post shared by Cool. Yogurt. Roll. (@coyoro) View this post on Instagram A post shared by Cool. Yogurt. Roll. (@coyoro) ఇండోనేసియాలోని మిగిలిన ప్రాంతాల్లోనూ ఈ పొగలు కక్కే మిఠాయి వల్ల పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారని, దేశవ్యాప్తంగా దీనిని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మన దేశంలోనూ అక్కడక్కడా కొన్నిరకాల చిరుతిళ్లపై లిక్విడ్ నైట్రోజన్ చల్లుతున్నారు. మన ప్రభుత్వాలు దీనిపై ఎప్పుడు దృష్టిసారిస్తాయో చూడాలి మరి! -
తల తీయడం మొదలు తుపాకీతో కాల్చడం వరకూ.. ఏ దేశంలో ఎటువంటి మరణశిక్ష?
ప్రపంచంలోని వివిధ దేశాలలో ఒకే రకమైన నేరానికి వేర్వేరు శిక్షల నిబంధన కనిపిస్తుంది. చిన్న నేరాలకు సైతం కొన్ని నెలలు లేదా సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే దేశాలు అనేకం ఉన్నాయి. హత్య, అత్యాచారం, వికృత హింస వంటి తీవ్రమైన నేరాలకు మరణశిక్ష విధించే నిబంధన చాలా దేశాలలో అమలులో ఉంది. అయితే ప్రపంచంలోని వివిధ దేశాలు మరణశిక్షకు సంబంధించి వివిధ పద్ధతులను అనుసరిస్తాయి. భారతదేశంలో ఉరి ద్వారా మరణశిక్ష విధిస్తారు. ఈ శిక్ష విధించినప్పుడు దోషిని జైలులోనే ఉరితీస్తారు. తుపాకీతో కాల్చి.. బీబీసీ నివేదిక ప్రకారం ప్రపంచంలోని 58 దేశాల్లో మరణశిక్ష పడిన ఖైదీలకు ఉరి తీస్తారు. అయితే మరణశిక్ష విధించేందుకు కొన్ని దేశాలలో తుపాకులను ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోని 73 దేశాల్లో ఉరిశిక్షపడిన దోషులను తుపాకీతో కాల్చి మరణశిక్ష విధిస్తున్నాయి. కొన్ని దేశాల్లో మరణశిక్ష విధించడానికి పలు విధానాలు ఉన్నాయి. పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి.. ఆఫ్ఘనిస్తాన్, సూడాన్‌తో సహా మొత్తం 6 దేశాల్లో దోషులను రాళ్లతో కొట్టి చంపుతారు. లేదా తుపాకీతో కాల్చడం ద్వారా మరణశిక్ష విధిస్తారు. యెమెన్, బహ్రెయిన్, చిలీ, థాయిలాండ్, ఇండోనేషియా, ఆర్మేనియా వంటి దేశాల్లో కాల్పుల ద్వారా మరణశిక్ష విధిస్తారు. చైనా, ఫిలిప్పీన్స్‌తో సహా ప్రపంచంలోని ఐదు దేశాలలో పాయిజన్ ఇంజెక్షన్ ద్వారా మరణశిక్ష విధిస్తారు. ప్రపంచంలోని మూడు దేశాల్లో శిరచ్ఛేదం ద్వారా మరణశిక్ష విధిస్తారు. ఇదిలావుంటే ప్రపంచంలోని చాలా దేశాలు మరణశిక్ష నిబంధనను రద్దు చేశాయి. ఈ జాబితాలో 97 దేశాలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: రైలు కదిలేముందు జర్క్ ఎందుకు? న్యూటన్ నియమంతో సంబంధం ఏమిటి? -
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు నమోదైంది. ఏషియన్ గేమ్స్ వుమెన్స్ క్రికెట్లో మంగోలియా జట్టు 15 పరుగులకే ఆలౌటైంది. ఇండోనేషియాతో ఇవాళ (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో మంగోలియన్లు ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోర్‌గా రికార్డైంది. ఇదే ఏడాది స్పెయిన్‌తో జరిగిన పురుషుల టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌటై, అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. ఇండోనేషియా-మంగోలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ రత్న దేవీ అర్ధసెంచరీతో (48 బంతుల్లో 62; 10 ఫోర్లు) రాణించగా.. మరో ఓపెనర్ నందా సకరిని (35), మరియా వొంబాకీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మంగోలియా బౌలర్లలో మెండ్‌బయార్, నముంజుల్, జర్గల్సై ఖాన్, గన్సుఖ్ తలో వికెట్ పడగొట్టారు. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. ఆరియాని (3-0-8-4), రహ్మావతి (3-2-1-2), రత్న దేవీ (2-0-4-2) ధాటికి 10 ఓవర్లలో 15 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఇండోనేషియా 172 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడుగురు డకౌట్లు కాగా.. ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో, ఓపెనర్ బత్జర్గల్ చేసిన 5 పరుగులే మంగోలియన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్స్‌గా నిలిచాయి. కాగా, ఆసియా క్రీడల్లో మొట్టమొదటిసారిగా క్రికెట్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళలతో పాటు పురుషుల విభాగంలోనూ ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ కూడా పాల్గొంటుంది. -
పరస్పర సహకారంతో ప్రగతి పథంలో దూసుకెళ్దాం: మోదీ
-
వచ్చే వారం ఇండోనేషియాకు మోదీ
న్యూఢిల్లీ: ఏషియాన్, ఈస్ట్ ఆసియా సదస్సుల్లో పాల్గొనడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6, 7 తేదీల్లో ఇండోనేషియాకు వెళ్లనున్నారు. రాజధాని జకార్తాలో జరిగే ఈ సమావేశాలకు ఏషియాన్ చైర్ హోదాలో ఇండోనేషియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఏషియాన్లోని సభ్యదేశాలతో వ్యాపార, భద్రతా సంబంధాల బలోపేతంపై మోదీ దృష్టి సారించనున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహా్వనం మేరకు ప్రధాని మోదీ 6, 7వ తేదీల్లో జకార్తాకు వెళుతున్నారని విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
ఇండోనేషియా: భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల్లేవ్
బాలీ: ఇండోనేషియా తీరం వెంట భారీ భూకంపం సంభవించింది. బాలీ సముద్ర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున 1.25 గంటల సమయంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు అయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. మటారమ్కు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైందని వెల్లడించింది. ఇక భూ అంతర్భాగంలో 518 కిలోమీటర్లు దిగువన కదలికలు సంభవించాయని సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. అయితే ఇది శక్తివంతమైన భూకంపమే అయినా.. సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. మరోవైపు యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం భూకంప తీవ్రత 7.1గా పేర్కొంది. ఇక.. సముద్ర గర్భంలో చాలా లోతులో కదలికలు సంభవించడంతో సునామీ (Tsunami) వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. Notable quake, preliminary info: M 7.1 - Bali Sea https://t.co/nBlmJ2rQia — USGS Earthquakes (@USGS_Quakes) August 28, 2023 ఇదిలా ఉంటే.. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ (NCS) పేర్కొంది. అలాగే.. మంగళవారం వేకువజామున 3.50 గంటలకు అండమాన్ సముద్రంలో (Andaman Sea) కూడా భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. దీని తీవ్రత 4.3గా నమోదయిందని, భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. Earthquake of Magnitude:4.1, Occurred on 29-08-2023, 10:13:33 IST, Lat: 28.95 & Long: 83.26, Depth: 10 Km ,Location: 244km NW of Kathmandu, Nepal for more information Download the BhooKamp App https://t.co/xaeC85fU3v@Dr_Mishra1966@KirenRijiju@ndmaindia@Indiametdept pic.twitter.com/cTUd6bvz6h — National Center for Seismology (@NCS_Earthquake) August 29, 2023 -
అక్కడ అదే ఆచారం.. చిన్న పిల్లల మృతదేహాలను తీసుకెళ్లి
భూమి మీద పుట్టిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు మరణించక తప్పదు. చనిపోయిన వాళ్లు గురించి తలుచుకుని కొందరు బాధపడుతుంటారు. మరొకొందరు వారి గుర్తుగా దానధర్మాలు వంటివి చేస్తుంటారు. ఏదేమైన మనకిష్టమైన వాళ్లని పోగొట్టుకుంటే అది బాధ అని చెప్పడం కంటే నరకమనే చెప్పాలి. అందుకే దీని నుంచి కాస్తైన ఉపశమనం పొందేందుకు ఇండోనేసియా ప్రజలు ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు. సాధారణంగా ఎవరైన చనిపోతే.. వాళ్లుని శాస్త్ర ప్రకారం దహనం చేసి అంత్యక్రియలను పూర్తి చేస్తారు. కానీ ఇండోనేసియాలో చనిపోయిన పిల్లలను చెట్ల వేరు కింద పాతిపెడతారంట. వినడానికి వింతగా ఉన్నా ఈ ఆచారాన్ని అక్కడి ప్రజలు ఎన్నో ఏళ్లుగా పాటిస్తున్నారట. ఇలా చేయడం వెనుక ఒక కారణం ఉందని ఆ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. ఇండోనేషియాలోని తానా తరోజాలో గ్రామంలో ఎవరి ఇంట్లో అయినా చిన్న పిల్లలు చనిపోతే వాళ్లకు అంత్యక్రియలు నిర్వహించరు. దహన సంస్కారాలు చేపట్టరు. ఎందుకంటే పిల్లలు చనిపోతే.. ఆ తల్లిదండ్రులకు ఎంతగానో బాధను మిగిలుస్తుంది. అది వర్ణనాతీతమనే చెప్పాలి. అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ చిన్నారుల మృతదేహాల్ని చెట్టు కింద మొదలు వేరు బాగంలో పాతిపెడతారు. చనిపోయిన పిల్లవాడు క్రమంగా ఈ చెట్టులోనే భాగమైపోతాడు. ఇలా చేయడం వల్ల ఈ లోకాన్ని విడిచిపెట్టిన చిన్న పిల్లవాడు చెట్టు రూపంలో శాశ్వతంగా జీవిస్తున్నట్లుగా వారి కుటుంబ సభ్యులు భావిస్తారు. ఇది ఇక్కడి విచిత్రమైన సంప్రదాయం. అయితే పెద్దలు చనిపోయినప్పుడు సాధారణ అంత్యక్రియలు నిర్వహిస్తారు. చదవండి దుబాయ్‌లో భారత ఆర్కిటెక్ట్ జాక్‌పాట్.. 25 ఏళ్లపాటు, నెలకు రూ.5.59 లక్షలు.. -
ఘోరం.. జిమ్‌లో మెడ విరిగి ట్రైనర్ మృతి
చావు చెప్పి రాదు. అయితే.. దానిని కెలికి మరీ ఆహ్వానించడం ఎంత వరకు సబబు?.. పాముల్ని పట్టేవాడు దాని కాటుకే బలవుతాడని ఎవరో అన్నారు. వెతుక్కుంటూ వెళ్లి మరీ మృత్యువును పలకరించే ఘటనలు తరచూ మనం చూస్తుంటాం కూడా. అలాంటిదే ఇది.. జిమ్ ట్రైనర్.. అదీ అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించుకున్న బాడీ బిల్డర్.. దానికి తోడు ఫిట్నెస్ ప్రియులకు జాగ్రత్తలు చెప్పే ట్రైనర్.. వెయిట్‌లిఫ్టింగ్Squat చేస్తూ మరణిస్తే?.. ఇండోనేషియా బాడీబిల్డర్, అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్న ఫిట్నెస్ ఇన్ఫ్లూయెన్సర్ జస్టిన్ విక్కీ(33) Justyn Vicky కెమెరా సాక్షిగా ప్రాణం విడిచాడు. సుమారు 400 పౌండ్ల బరువును(210 కేజీలు) ఎత్తే క్రమంలో మెడ విరిగి తీవ్రంగా గాయపడి చనిపోయాడతను. ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని.. జులై 15వ తేదీన ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా ఛానెల్స్ కథనాలు ప్రచురించాయి. మెడ విరగడంతో పాటు గుండెకు, లంగ్స్(కాలేయం) నరాలు దెబ్బతిని అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. అతి బరువు ఎత్తే రిస్క్ చేయడం.. ఆ క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించకపోవడమే అతని మరణానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ట్విటర్లో కనిపిస్తోంది. -
ట్రాక్ దాటుతున్న ట్రక్కును ఢీకొట్టిన రైలు..
జకార్తా: ఇండోనేషియాలో రైల్వే గేటు వద్ద రైలు వచ్చే సమయంలో ట్రాక్ దాటేయాలన్న ఉద్దేశ్యంతో పట్టాలు మీదకి దూసుకు వచ్చిన ట్రక్కును పాసింజరు రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. భారీగా మంటలు చెలరేగడంతో రైలులోని ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇండోనేషియాలోని సెమరాంగ్ పట్టణంలో జులై 18న ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ప్యాసింజర్ రైలు బ్రంతాస్ 112 వస్తోన్న నేపథ్యంలో ఆపరేటర్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ట్రక్కు డ్రైవర్ అదేమీ పట్టించుకోకుండా ఈలోపే ట్రాక్ దాటేయవచ్చన్న తాపత్రయంలో ముందుకు వెళ్ళాడు. రెప్పపాటులో రైలు వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల దూరానికి ట్రక్కును ఈడ్చుకుంటూ వెళ్ళగా భారీగా మంటలు కూడా చెలరేగాయి. ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారికి గానీ, వీడియోలో చూసినవారికి గానీ ప్రాణనష్టం కూడా భారీగానే జరిగి ఉంటుందనిపించక మానదు. కానీ అదృష్టవశాత్తు ట్రక్కు డ్రైవర్, రైలు లోకో పైలెట్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు సరికదా క్షేమంగా బయటపడ్డారు. కానీ పెద్ద ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో రైలు నుంచి దూకేసిన ఒక ప్రయాణికుడికి మాత్రం గాయాలయ్యాయి. The Brantas 112 Train collided with a truck in the Semarang West Flood Canal in Madukuro, Central Java, Indonesia, resulting in dramatic explosions and massive flames engulfing the area. pic.twitter.com/Fnsg3WTyp1 — Ericssen (@EricssenWen) July 18, 2023 ఇది కూడా చదవండి: పెళ్ళిలో అపశ్రుతి.. భర్తను కాకుండా మామను పెళ్లాడిన వధువు.. -
లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?
ప్రముఖ సీనియర్ నటుడు ఆశిష్ విద్యార్థి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, బెంగాలీ సహా సుమారు 11 భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించాడు. పోకిరీ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లో విలన్ పాత్రలతో గుర్తింపు పొందిన ఆయన.. ఇటీవలే దాదాపు 57 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకు చెందిన 33 ఏళ్ల ఫ్యాషన్ ఎంటర్ప్రెన్యూర్ రూపాలి బరువాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అయితే ఇప్పటికే మొదటి భార్యకు ఓ కుమారుడు కూడా ఉన్నారు. కోల్‌కతాలో జరిగిన వీరి పెళ్లికి అత్యంత సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు. (ఇది చదవండి: Bigg Boss Telugu 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది.. మేకర్స్ ఏం చెప్పారంటే) అయితే ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ట్రిప్‌లో ఉన్నారు. ఇండోనేషియాలో బాలిలో ఈ జంట చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలను రూపాలి బరువా తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. పచ్చదనం, ఆహ్లాదకరమైన కొండల మధ్య దిగిన ఫోటోను షేర్ చేశారు. గత నెలలో కూడా ఈ జంట సింగపూర్‌లో విహారయాత్రకు వెళ్లినట్లు సమాచారం. అయితే లేటు వయసులో పెళ్లి చేసుకోవడంతో ఆశిష్ విద్యార్థి ట్రోల్స్‌కు గురయ్యారు. ఆ వయసులో అవసరమా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేశారు. కాగా.. ఆశిష్ విద్యార్థి మొదటి భార్య పిలూకు 2022లో విడాకులిచ్చారు. ప్రస్తుతం ఆశిష్ తదుపరి చిత్రం ఖుఫియాలో కనిపించనున్నారు. (ఇది చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్) View this post on Instagram A post shared by Rupali Barua (@ru.pa.li.73) -
అది నిగూఢ రహస్యాన్ని దాచుకున్న సరస్సు.. రాత్రి కాగానే..
ప్రపంచంలో అంతుచిక్కని వింతలెన్నో ఉన్నాయి. వీటి రహస్యాల ముడి విప్పాలని శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయినా ఫలితం లేకపోతోంది. అలాంటి అత్యంత వింత సరస్సు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వింతలు, విశేషాలు అందరినీ ఇట్టే ఆకర్షిస్తుంటాయి. ఈ కోవలోకి వచ్చే ఒక వింత సరస్సు అటు పరిశోధకులను, శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆ సరస్సులోని నీటి రహస్యం గురించి తెలుసుకోవాలని ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను నిరంతరం కొనసాగిస్తూనే ఉన్నారు. రాత్రయ్యే సరికి ఆ సరస్సులోని నీరు నీలి రంగులోకి ఎందుకు మారిపోతున్నదో ఇంతవరకూ ఎవరికీ అంతుచిక్కలేదు. ఈ నేపధ్యంలో పలువురు శాస్త్రవేత్తలు తమ వాదనలు వినిపించినా, అవి ఇప్పటివరకూ పూర్తిస్థాయి సమాధానాన్ని ఇవ్వలేదు. అదరగొట్టే ఉష్ణోగ్రత.. ఈ సరస్సు ఇండోనేషియాలో ఉంది. దీనిని కవాహ్ ఇజేన్ లేక్ అని అంటారు. ఇది చూసేందుకు ఇతర సరస్సుల మాదిరిగానే కనిపిస్తుంది. ఈ సరస్సులోని నీరు ఎంతో ఉప్పగా ఉంటుందని చెబుతారు. ఈ నీరు 200 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగివుండటం విశేషం. ఉదయం వేళలో ఈ సరస్సులోని నీరు సాధారణంగానే కనిపిస్తుంది. మధ్యరాత్రి సమయానికి గాఢమైన నీలిరంగులోకి మారిపోతుంది. అలాగే మెరుస్తూ కనిపిస్తుంటుంది. ఇది ఎంతో ఆకర్షించే విషయమైనప్పటికీ, టూరిస్టులు ఇక్కడికి రాకపోవడం విశేషం. సరస్సులోని వేడి నీటి కారణంగా ఇక్కడికి వచ్చేవారెవరూ ఎక్కువసేపు ఇక్కడ ఉండలేరు. శాస్త్రవేత్తలు కూడా ఈ కారణంగానే తమ పరిశోధనలు ముందుకు సాగడం లేదని చెబుతుంటారు. ఇది కూడా చదవండి: ఒడిశా రైలు ప్రమాద బాధితుల వింత ప్రవర్తన రసాయన వాయువులే కారణమా? పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ సరస్సుపై లెక్కలేనన్ని పరిశోధనలు సాగించారు. అయితే ఇప్పటి వరకూ ఈ నీటి వెనుకనున్న రహస్యాన్ని ఎవరూ కనుగొనలేకపోయారు. ఈ సరస్సుకు సమీపంలో పలు అగ్నిపర్వతాలు ఉన్నాయని, అవి అప్పుడప్పుడు పేలు తుంటాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతంలో భూకంపాలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అగ్నిపర్వతాలు పేలడం వలన హైడ్రోజన్ ఫ్లోరైడ్, సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ తదితర వాయువులు వెలువడతాయి. ఈ వాయువుల రియాక్షన్ కారణంగానే సరస్సులోని నీటి రంగు మారుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. అయితే ఈ విధంగా నిరంతరం వాయువులు వెలువడినప్పుడు ఉదయం వేళలో నీటి రంగు మారకుండా, రాత్రివేళలో మాత్రమే నీటి రంగు ఎందుకు మారుతున్నదనే ప్రశ్న అలానే మిగిలిపోయింది. మరి దీనికి సమాధానం ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: ‘తాజ్’ యమ క్రేజ్.. ఆదాయంలో టాప్ వన్! -
ఈ ఇంటర్నెట్ మాకొద్దు బాబోయ్..!
జకార్తా: స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియాలొచ్చాక ప్రపంచమే మారిపోయింది. ఎప్పుడు ఎవరిని చూసినా అన్ని పనులు మానేసి తమ ఫోన్ల్లో తలదూర్చి కాలం గడిపేస్తున్నారు. ఈ ఆన్లైన్ ప్రపంచం జనంపై చూపిస్తున్న వ్యతిరేక ప్రభావం నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఇండోనేసియాలోని జావా దీవుల్లో నివసించే ఒక స్థానిక తెగ అసలు ఇంటర్నెట్ వద్దని నినదిస్తోంది. బాంటెన్ ప్రావిన్స్‌లో 26 వేల మంది వరకు ఉండే బదూయీ అనే వర్గం ప్రజలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమకి వద్దే వద్దని అంటున్నారు. ఈ తెగ ప్రజలు మొత్తం మూడు గ్రామాల్లో నివసిస్తారు. తమ ప్రాంతంలో ఉండే టెలికాం టవర్లను తొలగించాలని అప్పుడు సిగ్నల్స్ రాక తాము ఆన్లైన్ ఉచ్చులో ఇరుక్కోమని వారి వాదనగా ఉంది. ఈ మేరకు గ్రామ పెద్దలు ప్రభుత్వ అధికారులకు ఒక లేఖ కూడా రాశారు. స్మార్ట్ ఫోన్ వల్ల దుష్ప్రభావాలు తమ జీవితంపై లేకుండా ఉండడానికే తాము ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యువత అందులో కూరుకుపోతారని, ఇది వారి నియమబద్ధమైన జీవితంపై ప్రభావం చూపిస్తుందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను గుర్తించిన లెబాక్ జిల్లా అధికారులు ఈ విషయాన్ని ఇండోనేసియా సమాచార శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు ఏం కోరుకుంటే అదే తాము ఇస్తామని, వారి సంప్రదాయాలు, స్థానికతను కాపాడడమే తన లక్ష్యమని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. -
ఎంనెక్–2023కు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురా
సాక్షి, విశాఖపట్నం: ఇండోనేసియాలో జరిగే మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ కుమడో(ఎంనెక్)–2023లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం నుంచి ఐఎన్ఎస్ సాత్పురా యుద్ధ నౌకను భారత నేవీ పంపించింది. సాత్పురాలో మకస్సర్ తీరానికి చేరుకున్న భారత నౌకాదళ బృందానికి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 8 వరకు ఆసియా దేశాల ఆధ్వర్యంలో విన్యాసాలు జరగనున్నాయి. సోమవారం జరిగిన సిటీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారత నౌకాదళ బృందం పాల్గొంది. అలాగే ఇండోనేసియాలో త్వరలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో సమీక్ష నిర్వహించారు. ఇందులో సముద్ర భద్రతపై చర్చించారు. చదవండి: Tanguturi Prakasam Pantulu: పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం.. పూలకు బదులు పండ్లు తెస్తే తినేవాడినంటూ -
అయిదంతస్తుల గుడిసెలివి
-
Indonesia Earthquake: జావాను కుదిపేసిన భూకంపం
జకార్తా: భారీ భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఉత్తర ప్రాంతం వైపుగా జావా ద్వీపాన్ని భారీ ప్రకంపనలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్‌పై 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే(USGS) ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. శుక్రవారం సాయంత్రం భారీ ప్రకంపనలు జావా చుట్టుపక్కల కుదిపేశాయి. అయితే.. భూకంప కేంద్రం 594 కి.మీ లోతులో కేంద్రీకృతం కావడంతో సునామీ హెచ్చరికలు మాత్రం జారీ చేయలేదు. ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అధికారులు చెప్తున్నారు. అయితే.. సురబయ, టుబాన్, డెన్‌పాసర్, సెమరాంగ్‌లలో ప్రకంపనల తీవ్రత స్పష్టంగా కనిపించిందని ఇండోనేషియా విపత్తు ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో నష్టంపై పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారాయన. ఇదిలా ఉంటే.. USGS భూకం తీవ్రత 7గా నమోదు చేయగా.. మరోవైపు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మో లాజికల్ సెంటర్ (EMSC) భూకంపం 592 కిమీ (368 మైళ్ళు) లోతుతో 6.5 తీవ్రతను నమోదు చేసింది. -
Spain Masters 2023 Final: సింధుకు నిరాశ
మాడ్రిడ్: ఈ ఏడాది ఫైనల్ చేరిన తొలి టోర్నీలో విజేతగా నిలిచి తొలి టైటిల్ సాధించాలని ఆశించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్ గ్రెగోరియా మరిస్కా తున్‌జంగ్ (ఇండోనేసియా) కేవలం 29 నిమిషాల్లో 21–8, 21–8తో సింధును ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. గతంలో సింధుతో ఆడిన ఏడుసార్లూ ఓడిపోయిన మరిస్కా ఎనిమిదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. ఫైనల్లో సింధు ఏదశలోనూ మరిస్కాకు పోటీనివ్వలేకపోయింది. విన్నర్ మరిస్కాకు 15,750 డాలర్లు (రూ. 12 లక్షల 93 వేలు), రన్నరప్ సింధుకు 7,980 డాలర్లు (రూ. 6 లక్షల 55 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
ఇండోనేసియాకు కొత్త రాజధాని.. రాజధానిని మార్చిన దేశాలివే..!
ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి తరలిపోతోంది. బోర్నియో ద్వీపంలో నుసంతర పేరిట కొత్త రాజధాని నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. దీన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని రేయింబవళ్లు పనులు కొనసాగిస్తోంది. ఈ కొత్త రాజధాని జకార్తాకు ఈశాన్యంగా 2 వేల కిలోమీటర్ల దూరంలో బోర్నియో ద్వీపంలో పచ్చని అటవీ ప్రాంతమైన కాలిమాంటన్లో కొలువుదీరనుంది. దీన్ని కాలుష్యరహిత, సతత హరిత నగరంగా రూపొందిస్తున్నారు. అయితే దీనిపై పర్యావరణవేత్తల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్త రాజధాని నిర్మాణంతో ఆ ప్రాంతంలో అటవీ సంపద తరిగిపోయి వన్యప్రాణులకు నిలువ నీడ లేకుండా పోతుందని, పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుందని వారంటున్నారు. జకార్తా ఇసుకవేస్తే రాలనంత జనాభాతో కిటకిటలాడుతోంది. రాజధానిలో కోటి మందికి పైగా జనాభా నివసిస్తారు. మెట్రోపాలిటన్ ప్రాంతాన్నీ కలిపితే 3 కోట్ల దాకా ఉంటారు. భరించలేని కాలుష్యం రాజధాని వాసుల్ని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో జకార్తా అగ్ర భాగంలో ఉంటోంది. ఇక అత్యంత వేగంగా కుంగిపోతున్న నగరాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2050 నాటికి జకార్తాలో మూడింట ఒక వంతు సముద్రంలో మునిగిపోతుంది. దీనికి తోడు ఇండోనేసియాకు భూకంపాల ముప్పు ఉండనే ఉంది. అన్నింటి కంటే రాజధాని మార్పుకు మరో ముఖ్య కారణం అడ్డూ అదుపు లేకుండా భూగర్భ జలాల వెలికితీయడం. దీనివల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడి వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఏటా 450 కోట్ల డాలర్లు నష్టం వాటిల్లితోంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని జకార్తా నుంచి బోర్నియోకు రాజధానిని మార్చేయాలని అధ్యక్షుడు జోకో విడొడొ గతేడాది ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించారు. పర్యావరణవేత్తలు ఏమంటున్నారు? కొత్త నగర నిర్మాణ ప్రాంతం అరుదైన వృక్షజాలం, జంతుజాలానికి ఆలవాలం. ఇప్పుడు వాటి ఉనికి ప్రమాదంలో పడనుంది. నగర నిర్మాణానికి చెట్లను కూడా భారీగా కొట్టేస్తున్నారు. రాజధాని కోసం ఏకంగా 2,56,142 హెక్టార్ల అటవీ భూమిని సేకరిస్తున్నారు. ఇవన్నీ పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపేవే. పైగా ఈ అడవుల్లో దాదాపుగా 100 గిరిజన తెగలు నివాసం ఉంటున్నాయి. వారందరికీ పునరావాసం, నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో అన్నీ సరిగ్గా అమలయ్యే అవకాశం లేదన్న ఆందోళనలున్నాయి. రాజధానిని మార్చిన దేశాలివే..! గతంలో ఎన్నో దేశాలు పలు కారణాలతో రాజధానుల్ని మార్చాయి... ► రాజధాని దేశానికి నడిబొడ్డున ఉండాలన్న కారణంతో బ్రెజిల్ 1960లో రియో డిజనిరో నుంచి బ్రెసీలియాకు మార్చింది. ► 1991లో నైజీరియా లాగోస్ నుంచి అబూజాకు రాజధానిని మార్చుకుంది. ► 1997లో కజకిస్తాన్ కూడా అల్మటి నుంచి నూర్–సుల్తాన్‌కు రాజధానిని మార్చింది. కానీ ఇప్పటికీ అల్మటీయే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ► మయన్మార్ రంగూన్ నుంచి రాజధానిని నేపిడాకు మార్చింది. కొత్త రాజధాని ఎలా ఉంటుంది? కొత్త రాజధాని నిర్మాణాన్ని అధ్యక్షుడు విడొడొ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒక సుస్థిర నగరంలో అందరూ కొత్త జీవితాల్ని ప్రారంభించాలని ఆయన ఆశపడుతున్నారు. ఫారెస్ట్ సిటీ కాన్సెప్ట్‌తో హరిత నగరాన్ని నిర్మించనున్నారు. నగరంలో 65% ప్రాంతంలో ఉద్యానవనాలే ఉంటాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని స్మార్ట్ నగరంగా కూడా తీర్చిదిద్దనున్నారు. సౌర విద్యుత్, జల సంరక్షణ విధానాలు, వ్యర్థాల నిర్వహణ వంటివన్నీ కొత్త సాంకేతిక హంగులతో ఉంటాయి. ప్రస్తుతానికి ఐదు గిరిజన గ్రామాలను ఖాళీ చేయించి నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ ఏడాది 184 ప్రభుత్వ భవనాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొత్త రాజధాని నుసంతరను అటవీ నగరం కాన్సెప్ట్‌తో ప్రణాళికాబద్ధంగా కడుతున్నాం. 65% ప్రాంతం పచ్చదనానికే కేటాయిస్తున్నాం. 2024 ఆగస్టు 17 స్వాతంత్య్ర దిన వేడుకలను కొత్త రాజధానిలో జరిపేలా సన్నాహాలు చేస్తున్నాం. – బాంబాంగ్ సుసాంటొనొ, నుసంతర నేషనల్ కేపిటల్ అథారిటీ చీఫ్ అధ్యక్ష భవనం నమూనా కొత్త రాజధాని నిర్మాణ అంచనా వ్యయం: 3,200 కోట్ల డాలర్లు రాజధాని నిర్మాణంలో ప్రైవేటు పెట్టుబడులు: 80% ఈ ఏడాది నిర్మాణం జరుపుకునే భవనాలు: 184 ప్రస్తుతం నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు: 7 వేలు తొలి దశలో తరలివెళ్లే ప్రజలు సంఖ్య: 15 లక్షలు అధ్యక్ష భవనం నిర్మాణం పూర్తయ్యేది: 2024 ఆగస్టు 17 (దేశ స్వాతంత్య్ర దినోత్సవం) రాజధాని నుసంతర నిర్మాణం పూర్తయ్యేది: 2045 ఆగస్టు 17 (దేశ వందో స్వాతంత్య్ర దినం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఓడ ప్రయాణం.. అంతా చూస్తుండగా భార్యని సముద్రంలోకి విసిరేసిన భర్త!
సముద్రంలో ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి తన భార్యని ఫెర్రీలో నుంచి తోసేసిన ఘటన ఇండోనేషియాలో జరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఇండోనేషియా పోలీసులు విడుదల చేశారు. సుండా స్ట్రెయిట్ గుండా ప్రయాణించే ఫెర్రీ ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసులు షేర్ చేసిన వీడియోలో... ఫెర్రిలో ప్రయాణిస్తున్న ఓ మహిళ బ్యాగ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఆమె భర్త తన వెనుక వచ్చి నిల్చుంటాడు. అతనికి ఏమైందోగానీ హఠాత్తుగా ఆమెను ఎత్తుకొని అందరి కళ్లు ముందు ఓవర్‌బోర్డ్‌లో నుంచి సముద్రంలోకి విసిరేస్తాడు. అయితే అదృష్టవశాత్తు, ఆ మహిళ సముద్రంలో పడకుండా తప్పించుకుంటుంది. కింద పడ్డ ఆమె ఫెర్రిలోని రెయిలింగ్‌పై ఉన్న కడ్డీలకు అతుక్కుపోవడంతో ప్రాణాలతో బయటపడింది. తోటి ప్రయాణికుల సహాయంతో ఆమె భర్తని పోలీసులకు అప్పగిస్తారు. మరో వైపు.. ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో అతనిపై కేసు నమోదు చేయనట్లు సమాచారం. ఎందుకంటే.. ఆ వ్యక్తి మానసిక స్థితి కొంతకాలంగా సరిగా లేదని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు మహిళ కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: సంక్షోభంతో అల్లాడుతున్న పాక్‌కు షాక్: మరో ప్లాంట్ షట్‌డౌన్ -
ఇండోనేషియా పాపువా గినియా దీవులలో 3 కిలోల బరువున్న అరటిపండు
-
Indonesia: మంటల్లో ప్రాణాలు
Indonesia Fire Accident: ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిహేను మందికి పైగా మృతి చెందారు. శుక్రవారం రాత్రి పెర్టామినా ప్రభుత్వం నిర్వహించే ఓ ఫ్యూయెల్ స్టోరేజ్‌లో మంటలు ఎగసిపడి ఈ ఘోరం సంభవించింది. ఇండోనేషియా జకార్తా భారీ అగ్నిప్రమాదంలో ఇప్పటిదాకా 16 మంది మృతి చెందారు. పదుల సంఖ్యలో (50 మందికిపైనే) తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పెద్ద ఎత్తున్న ఎగసి పడి శరవేగంగా చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించాయి. స్థానికులు ఆర్తనాదాలు చేస్తూ.. తప్పించుకునేందుకు యత్నించారు. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ సిబ్బంది పలువురిని రక్షించారు. ప్రమాద తీవ్రత కారణంగా మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. మంటల్ని అదుపు చేయడానికి యాభైకిపైగా ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. పరిస్థితి అదుపులోకి రావడానికి గంటల తరబడి సమయం పట్టింది. మిలిటరీ చీఫ్ అబ్దురచ్మన్ స్వయంగా దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టరు స్కేలుపై తీవ్రత ఎంతంటే..?
జకర్తా: ఇండోనేషియాలో శనివారం భారీ భూకంపం సంభవించింది. రిక్టరు స్కేలుపై 6.0 తీవ్రత నమోదైంది. తలాడ్ ఐలాండ్స్ సమీపంలో 11 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు ఇండోనేషియా జియోగ్రఫీసిక్స్ ఏజెన్సీ బీఎంకేజీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. #Gempa Dirasakan Magnitudo: 6.0, Kedalaman: 11 km, 11 Feb 2023 15:55:06 WIB, Koordinat: 3.67 LU-126.76 BT (Pusat gempa berada di Laut 37 km Tenggara Melonguane) #BMKG https://t.co/OiHiTwvX8x — BMKG (@infoBMKG) February 11, 2023 అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదు. దీని వల్ల సునామీ వచ్చే ప్రమాదం కూడా లేదని అధికారులు తెలిపారు. చదవండి: టర్కీ విధ్వంసం.. నాలుగు రోజులు మూత్రం తాగి బతికిన యువకుడు.. -
మన గడ్డపై ఇండోనేసియా బూడిద!
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఇండోనేసియా పరిధిలోని సుమత్రా దీవుల్లో సుమారు 80 వేల ఏళ్ల కిందట ఓసారి, దాదాపు 75 వేల ఏళ్ల క్రితం మరోసారి అతిభీకరమైన పేలుళ్లతో రెండు సూపర్ వోల్కనోలు బద్దలయ్యాయి. వాటిలో రెండోసారి బద్దలైన టోబా అగ్నిపర్వతం రేపిన ఈ ధూళిని ‘యంగర్ టోబా టఫ్–2’గా ప్రపంచ పరిశోధకులు నామకరణం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆ దుమ్ము, ధూళి, బూడిద రేణువులు వాతావరణంలో వ్యాపించి కొన్నేళ్లపాటు ప్రయాణించి క్రమంగా భూమిపైకి చేరాయి. సముద్రంలో కొన్ని రేణువులు మేటలు వేయగా నదుల్లో పడ్డప్పుడు నీటి ప్రవాహంలో ముందుకు సాగి కొన్ని ప్రాంతాల్లో పేరుకుపోయాయి. ఏపీలోని బనగానపల్లి వద్ద జుర్రేరు సమీపంలోని జ్వాలాపురం, సాగిలేరు, తెలంగాణాలోని ఖమ్మం సమీపంలోని ముర్రేరు, మంజీరా పరీవాహక ప్రాంతాల్లో పేరుకున్నాయి. తాజాగా హస్తాల్‌పూర్‌లో కనిపించినవి అందులో భాగమే. రంగంలోకి దిగిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం... గతంలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు చేపట్టి ఈ తరహా సుద్దమేటల రహస్యాన్ని ఛేదించగా తాజాగా తెలంగాణ పరిధిలోని హస్తాల్‌పూర్‌లో అదే తరహా సుద్దమేటల రహస్యం వెలుగులోకి వచ్చింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు భద్ర గిరీశ్ ఈ సుద్ద నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరిశీలించగా కిలో సుద్దలో దాదాపు 5 మిల్లీగ్రాముల దాకా గంధకం ఉన్నట్లు తేలింది. అలాగే అగ్నిపర్వత లావాకు సంబంధించిన సూక్ష రేణువులు కనిపించాయి. ఇందులో కర్బనం లేకపోవడంతో ఇది సాధారణ బూడిద కాదని స్పష్టమైంది. ఈ విషయాన్ని జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరక్టర్ చకిలం వేణుగోపాల్ దృష్టికి తీసుకువెళ్లగా ఇది సుమత్రా దీవుల్లో దాదాపు 75 వేల ఏళ్ల క్రితం బద్దలైన అగ్నిపర్వతం నుంచి వెలువడిన ధూళికణాలతో ఏర్పడ్డ మేటలేనని నిర్ధారించారు. ఇవి బూడిద మేటలు.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం హస్తాల్పూర్ ప్రాంతంలో అర కిలోమీటర్ మేర మేట వేసిన సుద్ద ముద్దలు. మంజీరా తీరంలో ప్రవాహం కోతకు గురైన ప్రాంతంలో ఈ మేటలు కనిపిస్తున్నాయి. ఇందులో పెద్ద విశేషం ఏముందంటారా? ఇక్కడే విస్తు గొలిపే, ఆసక్తిరేపే నేపథ్యం దాగి ఉంది. ఇవి వేల ఏళ్ల కిందట నాటివి!! పైగా సుమారు 3,200 కి.మీ. దూరం నుంచి గాలివాటానికి తరలి నీటి ప్రవాహంలో కొట్టుకొచ్చాయి!! -
Hyderabad: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లి సముద్రంలో మునిగి నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలు డివిజన్ బండ్లగూడ అజయ్నగర్లో నివాసం ఉండే రాముని రవీందర్ చిన్న కుమారుడు వంశీకృష్ణ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో పక్క గ్రూప్–1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23న కర్మన్‌ఘాట్‌కు చెందిన యువతితో వివాహమైంది. ఈ నెల 13న భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహారయాత్రకు వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. ఈ నెల 22న ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. అతను సముద్రంలోకి వెళ్లే సమయంలో అక్కడి నిర్వాహకులు సూచించిన ప్రకారం కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ వంశీకృష్ణ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు. భార్య అతని రాకకోసం చాలాసేపు ఎదురు చూసినా పైకి రాలేదు. దీంతో సముద్రంలో గల్లంతైనట్లు భావించి అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలికి బయలుదేరి వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీకృష్ణ (ఫైల్) -
ఇండోనేసియా బొగ్గు గని ప్రమాదంలో 10 మంది మృతి
జకార్తా: ఇండోనేసియా పశ్చిమ సుమత్రా ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో జరిగిన పేలుడులో 10 మంది కార్మికులు మరణించారు. మరో నలుగురిని సహాయ బృందం కాపాడింది. ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన గనిలో ప్రమాదకరమైన మిథేన్ వంటి వాయువుల కారణంగానే పేలుడు సంభవించిందని అధికారులు వెల్లడించారు. విషవాయువులు పీల్చడం వల్ల కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 800 అడుగుల పొడవున్న గని కావడంతో సహాయ చర్యలు కాస్త సంక్లిష్టంగా మారాయి. మరణించిన వారిలో ఎక్కువ మందికి కాలిన గాయాలతో పాటు ఊపిరి సమస్యలు తలెత్తడంతో ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు చెప్పారు. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై రష్యా కొత్త ఎత్తుగడ.. వీధి కుక్కల సాయంతో.. -
India's G20 Presidency: భారత్‌కు అందివచ్చిన గొప్ప అవకాశం
ఈ డిసెంబర్ 1 నుంచి జీ20 దేశాల కూటమికి నాయకత్వం వహించే బాధ్యత భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ భుజ స్కంధాలపై పడింది. ప్రపంచం లోని 20 అగ్రదేశాల కూటమికి భారత్ నేతృత్వం వహించే అవకాశం లభించడం గౌరవమే కాదు.. ఓ గొప్ప అవకాశం కూడా! 1999లో జీ20 దేశాల కూటమి ఏర్పాటయింది. బలమైన ఆర్థిక వ్యవస్థల్ని అనుసంధానించి పరస్పర సహకారం, ప్రోత్సాహంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్నది కూటమి ప్రధాన లక్ష్యం. జీ20 కూటమిలో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ భాగ స్వామిగా ఉంది. కూటమి ఏర్పడింది 1999లో అయినా తొలి శిఖరాగ్ర సదస్సు జరిగింది మాత్రం 2008లో వాషింగ్టన్ డీసీలో. ఆ సమయంలోనే చోటుచేసుకొన్న ‘ఆసియా ఆర్థిక సంక్షోభం’ నుంచి బయటపడడానికి జీ20 దేశాల కూటమి కృషి చేసింది. అప్పటి నుంచి అంత ర్జాతీయ స్థాయిలో శక్తిమంతమైన సంస్థలలో ఒకటిగా జీ20 అవతరించింది. 2016లో చైనాలో జరిగిన జీ20 కూటమి శిఖరాగ్ర సభలలో ‘సమ్మిళిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ’ కోసం కృషి చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత జీ20 కూటమిలో సభ్యత్వం లేని దేశాలతో కూడా వర్తక, వాణిజ్య సంబంధాలు ముమ్మరం అయ్యాయి. గత ఏడెనిమిది సంవత్సరాలలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించ డంలో జీ20 కూటమి దేశాలతో భారత్ నెరపిన దౌత్య, వర్తక, వాణిజ్య సంబంధాలు కీలకంగా దోహదం చేశాయి. ఇటీవల, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడంలో అగ్రరాజ్యాలు విఫలం అయ్యాయి. రష్యాపై పలు ఆంక్షలు విధించినా భారత్ తన చమురు అవసరాల కోసం ఇప్పటికీ రష్యాపైనే ఆధారపడుతూ పెద్ద ఎత్తున చమురును దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిణా మాల దృష్ట్యా జీ20 కూటమికి భారత్ నేతృత్వం వహిం చడంవల్ల ఒరిగేదేమిటన్న ప్రశ్నలు అనివార్యంగా ఎదురవుతున్నాయి. ఇండోనేసియాలోని బాలిలో జరిగిన 2022 జీ20 శిఖరాగ్ర సదస్సులో, ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా వైదొలగాలన్న పిలుపును కొన్ని దేశాలు గట్టిగానే విన్పించాయి. అంతకుముందే రష్యా అధినేత పుతిన్‌కు ‘నేటి యుగం యుద్ధాలది కాదు’ అంటూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఎటువంటి శషబిషలు లేకుండా కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పడంతో భారత్ తన వాణిజ్య అవసరాల కోసం మాత్రమే రష్యాతో సంబంధాలు నెరపుతున్నదే తప్ప, ఆ దేశం ప్రదర్శిస్తున్న యుద్ధోన్మాదాన్ని ఏమాత్రం ఉపేక్షించడం లేదన్న సంకేతం బలంగానే వెళ్లింది. అంతేకాదు... అంతర్జాతీయ సదస్సులలో చేసిన తీర్మానాలకు కట్టుబడటంలో భారత్ చిత్తశుద్ధితో వ్యవ హరిస్తోందన్న వాస్తవం కూడా తేటతెల్లం అయింది. ఉదాహరణకు క్యోటో ప్రోటోకాల్, పారిస్ కాప్ 21, అంతకుముందు రియో, కోపెన్ హెగన్ సదస్సులలో చేసిన తీర్మానాలకు అనుగుణమైన చర్యలు తీసుకోవడంతో పర్యావరణ పరిరక్షణ, భూతాప నియంత్రణలలో 63 దేశాల పనితీరుపై వెలువడ్డ నివేదికలో భారత్‌కు 8వ స్థానం లభించగా... చైనాకు 51, అమెరికాకు 52వ స్థానాలు లభించాయి. భారతదేశం తను అనాదిగా నమ్మే ‘వసుధైక కుటుంబం’ (ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం) అనే భావనను ముందుకు తెచ్చి పరస్పర సహకారం, భాగస్వామ్యం అత్యంత అవశ్యం అని చాటి చెబుతోంది. కలిసికట్టుగా సమస్య లను ఎదుర్కోనట్లయితే... కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలుగుతుందనేది భారత్ చెప్పే మాట. కానీ, చైనా వంటి కొన్ని దేశాలు ‘నేను నా దేశం’ (గ్రూప్ జీరో) ముఖ్యం అనే ధోరణిలోనే సొంత ప్రయోజనాల కోసం ఇతర దేశాల ప్రయోజనాలను దెబ్బతీసే విధం గానూ, అంతిమంగా ప్రపంచ మానవాళికి ముప్పు కలి గించే విధంగానూ ముందుకు సాగుతున్నాయి. జీ20 కూటమికి నేతృత్వం వహించడం వల్ల భారత్‌కు సమీప భవిష్యత్తులో కొన్ని సానుకూలతలు అందివస్తాయి. అందులో ప్రధానమైనది అంతర్జాతీయ ఉగ్రవాదానికి అందుతున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయించగలగడం లేదా తగ్గించగలగడం. అలాగే దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా నుంచి అక్రమ చొరబాట్లు, ఆక్రమణలను నివారించడం; హిందూ మహా సముద్రంలో చైనా సైనిక పాటవ వ్యాప్తిని తగ్గించగలగడం, ముడిచమురు చౌకగా లభించే దేశాల నుండి దిగుమతి చేసుకోవడం. డిజిటల్ రంగంలో తను సాధించిన ప్రగతినీ, సాంకేతిక పరిజ్ఞానాన్నీ ఇతర దేశాలకు అందించడం; ఆహార భద్రత, పోషకాహార పంపిణీలకు సంబంధించి పేద దేశాలకు బాసటగా నిలవడం... తదితర రంగాలలో భారత్ కీలకమైన పాత్ర పోషించబోతోంది. కోవిడ్ టీకాతో సహా వివిధ రకాల టీకాలను విస్తృతంగా అభివృద్ధి పరుస్తున్న భారత్ నుంచి సహాయ సహకారాలు ఆశిస్తున్న దేశాల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. ఈ రంగంలో తాను సాధించిన ప్రగతిని ఆసియాలోని ఇతర దేశాలతోపాటు ఆఫ్రికా దేశా లతో పంచుకోవడంతో అంతర్జాతీయంగా భారత్ పేరు ప్రతిష్ఠలు గణనీయంగా పెరిగాయి. శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ నివారణలో భారత్ పోషించిన పాత్ర, ఆ దేశానికి అందించిన ఆర్థిక సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలకు నోచుకొంది. సాధిస్తున్న అభివృద్ధికి సమాంతరంగా పాత, కొత్త సవాళ్లు ఉమ్మడిగా భారత్‌కు ఎదురవుతున్నాయి. ‘ఇది యుద్ధాల శకం’ కాదని నరేంద్ర మోదీ రష్యా–ఉక్రెయిన్ ల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకొని వాఖ్యానించినప్పటికీ... యుద్ధం అన్నది అనేక రూపాలలో భారత్‌ను అస్థిరపరుస్తూనే ఉంది. తూర్పున అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దులలో చైనా దురాక్రమణ నిరాఘాటంగా జరుగుతూనే ఉంది. కశ్మీర్ బోర్డర్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం చేస్తున్న యుద్ధం ఆగలేదు. ఇంకా, కంటికి కనిపించని సైబర్‌వార్, ఇన్ఫ ర్మేషన్ వార్ వంటివి ఎటూ ఉండనే ఉన్నాయి. వీటికితోడు వాతా వరణ మార్పుల వల్ల ఏర్పడే విపత్తులు, మానవాళి మనుగడను ప్రశ్నిస్తున్న కొత్తకొత్త వైరస్ల విజృంభణ తదితర సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమైన మార్గదర్శనం చేయా ల్సిన అవసరం భారత్‌పై ఉంది. నూతన పదబంధాలను సృష్టించడంలో మన ప్రధాని నరేంద్ర మోదీని మించిన వారెవరున్నారు? ఆయన సృష్టిం చిన పదబంధమే ‘ఎకానమీ విజన్’. జీ20 కూటమి దేశాల మధ్య పరస్పర అనుసంధానత, బాధ్యతల భాగస్వామ్య విధానమే ప్రధాని మోదీ ప్రతిపాదించిన ‘ఎకానమీ విజన్ విధానం. ‘నేను నా దేశం’ (గ్రౌండ్ జీరో) అనే విధానానికి పూర్తిగా విరుద్ధమైనదే ఇది. ప్రపంచం అంతా ఒకే భూమి. ప్రపంచ జనాభా అంతా ఒకటే కుటుంబం. ఒకప్పుడు దీనిని ‘యుటోపియన్ థియరీ’గా అభివర్ణించేవారు. ‘అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి’ అనే భారత ప్రాచీన ధర్మం ఇమిడి ఉన్న విధానాలతో నరేంద్ర మోదీ జీ20 దేశాల కూటమికి దిశానిర్దేశం చేయనున్నారు. శిలా జాల ఇంధనాల వాడకాన్ని నిరోధించి హరిత ఇంధనాలను పెద్దఎత్తున వినియోగంలోకి తీసుకురావడం, సూర్య రశ్మి (సోలార్ ఎనర్జీ)ని విరివిగా ఉపయోగించుకోవడం; పవన విద్యుత్ వినియోగం పెంచడం వంటి చర్యల ద్వారా పటిష్ట కార్యాచరణకు ప్రధాని సమాయత్తం అవుతున్నారు. నరేంద్ర మోదీ తన నాయకత్వ పటిమను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించే ఓ మహత్తర అవకాశం నేడు లభించింది. గతంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయిలకు ఏవిధంగానైతే వారి విశిష్ట నాయ కత్వానికి వివిధ సందర్భాలలో అంతర్జాతీయ ఖ్యాతి లభించిందో... అలాగే నేడు ప్రధాని నరేంద్ర మోదీకి మరింత ఖ్యాతి దక్కడానికి జీ20 దేశాల నాయకత్వం అందివచ్చిన ఓ చక్కటి అవకాశం. దానిని ఆయన ఫల ప్రదం చేసి దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేస్తారని ఆశించవచ్చు. (క్లిక్ చేయండి: సుప్రీం స్వతంత్రతే దేశానికి రక్ష) - సి. రామచంద్రయ్య శాసన మండలి సభ్యులు, ఏపీ -
Semeru: నిప్పులు కక్కిన రాకాసి పర్వతం
జకార్తా: ద్వీప దేశాల్లో అగ్ని పర్వతాలు బద్ధలు కావడం తరచూ చూసేది. అయితే.. పసిఫిక్ రీజియన్‌లోని అగ్నిపర్వతాలు బద్ధలు కావడం తరచూ తీవ్రతకు దారి తీస్తుంటాయి కూడా. అందునా రాకాసి అగ్నిపర్వతంగా పేరున్న సెమెరూ వల్ల జరిగే నష్టం మరీ తీవ్రంగా ఉంటోంది. తాజాగా.. ఇండోనేషియా జావా తూర్పు ప్రాంతంలోని గునుంగులో హైఅలర్ట్ ప్రకటించారు. దాదాపు 3,676 మీటర్ల ఆదివారం సెమెరూ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో.. వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించారు అధికారులు. కిందటి నెలలో అగ్నిపర్వతం ధాటికి 300 మంది దాకా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఇప్పుడు అగ్నిపర్వత ముప్పుపై అక్కడ ఆందోళన నెలకొంది. Pyroclastic flow footage from the Semeru volcano in East Java, Indonesia. Imagine seeing that thing coming toward you. Terrifying. (footage sped up 5x) pic.twitter.com/84D4Dr6IIr — Nahel Belgherze (@WxNB_) December 4, 2022 తూర్పు జావాలో అతిపొడవైన అగ్నిపర్వంగా సెమెరూకి పేరుంది. సోమవారం భారీ శబ్ధం చేసుకుంటూ నిప్పులు కక్కింది ఈ రాకాసి అగ్నిపర్వతం. లావా భారీగా పల్లపు ప్రాంతానికి వస్తోంది. ఈ ప్రభావంతో ఎనిమిది కిలోమీటర్ల మేర జనాలను తిరగనివ్వకుండా జోన్‌గా ప్రకటించారు అధికారులు. హుటాహుటిన రంగంలోకి దిగి ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #Gunung #Semeru volcano Java Indonesia, eruption with pyroclastic flow, 04.12.20022, 11:41 local time, realtime speed my prayers are with the people living there pic.twitter.com/YRh7Hd3rOA — Rita Bauer (@wischweg) December 4, 2022 👉TELEGRAM: https://t.co/JDDUrdyqRt 🌋On the island of East Java in Indonesia🇮🇩, the eruption of the volcano Semeru with a height of 3,676 meters began.#Indonesia #Semeru #volcano #Java #eruption #NEWS #indonesia #semeru #gunungberapi #jawa #letusan #berita pic.twitter.com/9vWD4KkylR — DISASTERS IN THE WORLD (@WRLD_disasters) December 4, 2022 #Semeru #Volcano #Indonesia Eruption 2022.12.04 Plume in motion 📸🛰#Landsat8-9 Footage(without motion) : @USGSLandsat @sentinel_hub pic.twitter.com/qAYZtxMZGo — 🛰🗺🌋❄️🌪🌊🔥👀 (@ar_etsch) December 4, 2022 Personel Polsek Pasirian Lumajang Jawa Timur sigap bantu evakuasi warga akibat Awan Panas Guguran Gunung Semeru Lumajang Doa kami menyertai untuk saudara-saudara yang di Lumajang dan sekitarnya moga semuanya diberikan keselamatan#TerusBerikanManfaat Melindungi Dari Bencana pic.twitter.com/qMKdRkrNO8 — Polres Trenggalek (@1trenggalek) December 5, 2022 WATCH: #BNNIndonesia Reports Mount #Semeru, Indonesia's tallest #volcano, erupted on Sunday, sending a massive column of ash into the sky and lava rivers down steep slopes. pic.twitter.com/TVnpAbYDcn — Gurbaksh Singh Chahal (@gchahal) December 4, 2022 అయితే తేలికపాటి వర్షం.. ప్రమాద తీవ్రత నుంచి కొంత ఉపశమనం ఇవ్వొచ్చని భావిస్తున్నారు. ప్రమాద తీవ్రత గురించి ఇంకా సమాచారం అందాల్సి ఉంది. ఇదే రాకాసి అగ్నిపర్వతం కిందటి ఏడాది బద్ధలైన ఘటనలో.. యాభై మందిదాకా పొట్టనబెట్టుకుంది. వేల మందిని అక్కడి నుంచి తరలిపోయేలా చేసింది. ఇదిలా ఉంటే..పసిఫిక్ తీరంలో చిన్న ద్వీప సమూహాలున్న ఇండోనేషియా.. భూమిపై అత్యంత విపత్తు సంభవించే దేశాలలో ఒకటి. ఈ అగ్నిపర్వతం బద్ధలుకు సంబంధించిన కొన్ని భయానక ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. భయంతో జనాలు పరుగులు పెడుతుండగా.. గాయపడిన కొందరిని చికిత్సకు తరలిస్తున్నవి వైరల్ అవుతున్నాయి. -
Indonesia: వివాహానికి ముందే శృంగారమా? అయితే..
జకార్తా: చాలా దేశాల్లో డేటింగ్, పెళ్లికి ముందే పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనడం లాంటి వ్యవహారాలను చాలా తేలికగా తీసుకుంటున్నారు. అయితే.. ఇస్లాం దేశమైన ఇండోనేషియా.. అలాంటివి సహించడం కుదరని అంటోంది. వివాహానికి ముందే శృంగారాన్ని నేరంగా పరిగణించాలని నిర్ణయించుకుంది. తాజాగా ఇండోనేషియా కొత్త క్రిమినల్ కోడ్‌ను తీసుకురాబోతోంది. దీని ప్రకారం.. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొంటే శిక్షించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ క్రిమినల్ కోడ్‌ను త్వరలో జరగోబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతుందట. వివాహానికి ముందే శృంగారంలో పాల్గొన్నా.. లేకుంటే వివాహేతర సంబంధం కొనసాగించినా?.. ఏడాదిపాటు కారాగార శిక్ష విధించాలని, అదే విధంగా జరిమానా కూడా విధించాలని సదరు డ్రాఫ్ట్ పేర్కొంది. అయితే.. ఇది అమలు కావాలంటే ఒకటి వివాహేతర సంబంధం విషయంలో బాధిత భార్య లేదంటే బాధిత భర్త.. ఎవరో ఒకరు ఫిర్యాదు చేయాలి. అలాగే.. వివాహం కాకముందు శృంగారంలో గనుక పాల్గొంటే.. వాళ్ల తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చు. ఆర్టికల్ 144 ప్రకారం.. కోర్టులో విచారణ ప్రారంభం కాకముందు ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. వాస్తవానికి ఈ డ్రాఫ్ట్ వచ్చి మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ప్రజావ్యతిరేకతతో ఇంతకాలం ఇది అమలుకు నోచుకోలేదు. ప్రపంచంలోనే అత్యధిక ఇస్లాం జనాభా ఉన్న ఇండోనేషియాలో.. మహిళలను, మైనారిటీలను, ఎల్జీబీటీక్యూలను అణగదొక్కేందుకు వందల సంఖ్యలో నియంత్రణ చట్టాలు అమలు అవుతున్నాయి. ఇక కొత్తగా రాబోయే క్రిమినల్ కోడ్.. ఇండోనేషియా ప్రజలతో పాటు విదేశీయులకు కూడా వర్తించనుంది. అయితే ఇది టూరిజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
ఇండోనేసియా భూకంపం.. 268కి చేరిన మృతులు
జకార్తా: ఇండోనేసియాలోని జావా దీవిలో సోమవారం వచ్చిన భూకంపంలో మృతుల సంఖ్య 268కి పెరిగింది. మరో 151 మంది జాడ తెలియాల్సి ఉందని, 1,083 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. వారిలో 300 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు. మృతుల్లో ఎక్కువ మంది పాఠశాల విద్యార్థులేనని పశ్చిమ జావా గవర్నర్ చెప్పారు. 13 వేల నివాసాలు దెబ్బతిన్నాయని చెప్పారు. మరిన్ని ప్రకంపనలు సంభవించవచ్చనే భయాందోళనల మధ్య ప్రజలు రోడ్లపైనే చీకట్లో గడిపారు. మంగళవారం దేశాధ్యక్షుడు జోకో విడొడొ సియంజుర్‌లో పర్యటించారు. చదవండి: ఘోర అగ్ని ప్రమాదం.. 38 మంది సజీవదహనం -
బాధాకరం, అండగా భారత్..: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భూకంపం ధాటికి ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. సోమవారం ఇండోనేషియాలో భూకంపం దాటికి 150పైగా మంది దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. వందల మంది క్షతగాత్రులు కాగా, నష్టం ఊహించని స్థాయిలోనే చోటు చేసుకుంది. ఇక ఈ విపత్తుపై భారత ప్రధాని మోదీ మంగళవారం ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘ఇండోనేషియాలో సంభవించిన భూకంపం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం బాధాకరం. బాధితులకు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దుఃఖ సమయంలో ఇండోనేషియాకు భారత్ అండగా నిలుస్తుంది’’ అని భారత ప్రధాని ట్వీట్ ద్వారా తెలిపారు. Saddened by the loss of lives and damage to property from the earthquake in Indonesia. Deepest condolences to the victims and their families. Wish a speedy recovery to the injured. India stands with Indonesia in this hour of grief. @jokowi — Narendra Modi (@narendramodi) November 22, 2022 ఇండోనేషియా జావా కేంద్రంగా రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో ప్రకంపనలు కుదిపేశాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించగా.. ప్రాణ నష్టం కూడా నమోదు అయ్యింది. ఇదీ చదవండి: అత్యాచార బాధితురాలి నుంచి లంచం వసూలు -
ఇండోనేషియాలో భారీ భూకంపం.. 162 మంది దుర్మరణం
జకార్తా: ఇండోనేసియాలోని జావా ద్వీపం సోమవారం భారీ భూకంపం ధాటికి చిగురుటాకులా వణికిపోయింది. డజన్ల కొద్దీ భవంతులు పేకమేడల్లా నేల మట్టమయ్యాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. భవంతులు కూలిన ఘటనల్లో మొత్తంగా 162 మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ జావా గవర్నర్ రిద్వాన్ కమిల్ చెప్పారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. మరణాల సంఖ్య భారీగానే ఉండొచ్చని గవర్నర్ అన్నారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉండటం అందర్నీ కలచివేస్తోంది. సియాంజుర్ పట్టణంలో ఇస్లామిక్ బోర్డింగ్ స్కూళ్లు, మసీదులు ఎక్కువ. ఇక్కడి ఇస్లామిక్ స్కూళ్లలో డే క్లాసులు పూర్తయ్యాక అదనపు క్లాసుల కోసం చాలా మంది విద్యార్థులు స్కూళ్లలోనే ఉండిపోయారు. అదేసమయంలో భూకంపం రావడంతో పాఠశాల భవంతులు కూలి ఎక్కువ మంది చిన్నారులు విగతజీవులయ్యారు. ప్రకంపనల ధాటికి జనం ఇళ్లు, కార్యాలయాలు వదిలి బయటకు పరుగులుపెట్టారు. చాలా మంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నారు. కిక్కిరిసిన ఆస్పత్రులు.. జాతీయ విపత్తు దళం వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యల్లో నిమగ్నమైంది. పెద్ద సంఖ్యలో ఉన్న క్షతగాత్రులను స్థానికులు పికప్ ట్రక్కులు, బైక్‌లపై ఆస్పత్రులకు తరలించారు. అధిక జనాభా ఉన్న జావా పట్టణంలో చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకి చేరి భయంతో బిక్కుబిక్కుమంటూ కనిపించారు. ఆగకుండా వస్తున్న క్షతగాత్రులతో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులను రోడ్లపైనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్నారు. ఆరుబయట పార్కింగ్ ప్రాంతాల్లోనే చికిత్సచేస్తున్నారు. రక్తమోడుతున్న చిన్నారులను ఆస్పత్రికి తీసుకొస్తున్న దృశ్యాలతో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఆస్పత్రి, పాఠశాల సహా పలు భవంతులు నేలకూలాయి. ఆస్పత్రి కూలి ఎక్కువ మంది చనిపోయారని వార్తలొచ్చాయి. సోమవారం మధ్యాహ్నం వేళ రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రతతో వచ్చిన భూకంపం పశ్చిమ జావాలోని సియాంజుర్ రీజియన్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఆ దేశ జాతీయ విపత్తు సంస్థ వెల్లడించింది. సియాంజుర్‌లో పలు చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. ‘మూడుసార్లు భూమి కంపించింది. మొదటిసారి ఆగకుండా పది సెకన్లపాటు కుదిపేసింది’ అని స్థానికురాలు దేవి రిస్మా చెప్పారు. ‘భవంతి ఊగిపోతున్నపుడు 14వ అంతస్థులో ఉన్నాను. మెట్లు దిగి కిందికొచ్చేటపుడు పై ప్రాణాలు పైనే పోయాయి’ అని మహిళా లాయర్ మయాదిత చెప్పారు. భూకంపం తర్వాత సైతం 1.8 నుంచి 4 తీవ్రతతో దాదాపు 25 సార్లు ప్రకంపనలు కనిపించాయని ఆ దేశ భూకంపాలు, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. ఇళ్లు ధ్వంసమై నిరాశ్రయులైన 13,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిజేదిల్ గ్రామంలో శిథిలాల కింద 24 మంది చిక్కుకుని సాయంకోసం అరి్థస్తున్నారు. 27 కోట్ల జనాభా గల ఇండోనేసియాలో భూకంపాలు, అగి్నపర్వతాలు బద్ధలవడం, సునామీలు సర్వసాధారణం. 2004లో హిందూ మహా సముద్రం అడుగున ఏర్పడి విలయం సృష్టించిన భారీ భూకంపం వెనువెంటనే సునామీ ధాటికి 2.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చదవండి: న్యూజిలాండ్‌లో 16 ఏళ్లకే ఓటు హక్కు -
ఇండోనేషియాలో భారీ భూకంపం.. 56 మంది మృతి
జకార్తా: ఇండోనేషియాలోని పశ్చిమ జావా ద్వీపంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ససియాంజూర్ ప్రాంతంలో 49 సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం దాటికి 56 మంది మృతి చెందగా, వందల సంఖ్యలో గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.9 నుంచి 5.6 మధ్య నమోదైంది. భూకంపం కారణంగా వేలాది ఇళ్లు నేలకొరిగాయి. భవనాలు కుంగిపోగా, ఓ పాఠశాల ధ్వంసమైంది. భయంతో జనాలు రోడ్లపైకి పరుగులు తీశారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
భారత్‌తో సాధ్యమైనంత త్వరగా ఎఫ్‌టీఏ: రిషి సునాక్
లండన్: భారత్‌తో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఈ ఒప్పందంపై చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించాలని భావిస్తున్నామని తెలిపారు. రిషి సునాక్ తాజాగా యూకే పార్లమెంట్ దిగువ సభలో మాట్లాడారు. ఇండోనేషియాలో జీ–20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఎఫ్‌టీఏ పురోగతిపై సమీక్షించానని వెల్లడించారు. భారత్‌తో ఒప్పందాన్ని ఎప్పటిలోగా కుదుర్చుకుంటారో చెప్పాలని ప్రతిపక్ష లేబర్ పార్టీతోపాటు అధికార కన్జర్వేటివ్ ఎంపీలు కోరారు. ఒప్పందంపై ప్రధాని మోదీతో ఇప్పటికే మాట్లాడానని, ఈ విషయంలో భారత్–యూకే మధ్య చర్చలకు సాధ్యమైనంత త్వరగా విజయవంతమైన ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. వాస్తవానికి అక్టోబర్ ఆఖరులోనే ఇరు దేశాల చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కొన్ని అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి ఉందని, పరస్పరం సంతృప్తికరమైన పరిష్కారం కనుక్కొంటామన్నారు. భారత్–యూకే బంధం వాణిజ్యానికి పరిమితమైందని కాదని, అంతకంటే విస్తృతమైనదని సునాక్ తేల్చిచెప్పారు.