కనెకేస్ గ్రామంలో పనిలో నిమగ్నమైన బదూయీ తెగ నేత కార్మికురాలు; కనెకేస్ గ్రామంలోని నది ఒడ్డున ఆడుకుంటున్న చిన్నారులు
జకార్తా: స్మార్ట్ ఫోన్‌లు, సోషల్ మీడియాలొచ్చాక ప్రపంచమే మారిపోయింది. ఎప్పుడు ఎవరిని చూసినా అన్ని పనులు మానేసి తమ ఫోన్‌ల్లో తలదూర్చి కాలం గడిపేస్తున్నారు. ఈ ఆన్‌లైన్ ప్రపంచం జనంపై చూపిస్తున్న వ్యతిరేక ప్రభావం నుంచి తమని తాము కాపాడుకోవడానికి ఇండోనేసియాలోని జావా దీవుల్లో నివసించే ఒక స్థానిక తెగ అసలు ఇంటర్నెట్ వద్దని నినదిస్తోంది. బాంటెన్ ప్రావిన్స్‌లో 26 వేల మంది వరకు ఉండే బదూయీ అనే వర్గం ప్రజలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తమకి వద్దే వద్దని అంటున్నారు.
ఈ తెగ ప్రజలు మొత్తం మూడు గ్రామాల్లో నివసిస్తారు. తమ ప్రాంతంలో ఉండే టెలికాం టవర్లను తొలగించాలని అప్పుడు సిగ్నల్స్ రాక తాము ఆన్‌లైన్ ఉచ్చులో ఇరుక్కోమని వారి వాదనగా ఉంది. ఈ మేరకు గ్రామ పెద్దలు ప్రభుత్వ అధికారులకు ఒక లేఖ కూడా రాశారు. స్మార్ట్ ఫోన్ వల్ల దుష్ప్రభావాలు తమ జీవితంపై లేకుండా ఉండడానికే తాము ఈ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే యువత అందులో కూరుకుపోతారని, ఇది వారి నియమబద్ధమైన జీవితంపై ప్రభావం చూపిస్తుందని ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను గుర్తించిన లెబాక్ జిల్లా అధికారులు ఈ విషయాన్ని ఇండోనేసియా సమాచార శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజలు ఏం కోరుకుంటే అదే తాము ఇస్తామని, వారి సంప్రదాయాలు, స్థానికతను కాపాడడమే తన లక్ష్యమని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment