ఎనీటైమ్‌.. ఎనీవేర్‌..: ఇండియన్‌ నేవీ | Indian Navys Message With Warship Visuals At Arabian Sea, Says Anytime Anywhere Anyhow | Sakshi
Sakshi News home page

ఎనీటైమ్‌.. ఎనీవేర్‌..: ఇండియన్‌ నేవీ

Published Sun, Apr 27 2025 5:17 PM | Last Updated on Sun, Apr 27 2025 6:46 PM

Indian Navys Message With Warship Visuals

న్యూఢిల్లీ:  ఎనీటైమ్(ఎప్పుడైనా).. ఎనీవేర్(ఎక్కడైనా).. ఎనీహౌ(ఏమైనా సరే) సందేశం పంపింది ఇండియన్ నేవీ. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై కఠినమైన ఆంక్షలకు సిద్ధమైన భారత్.. ఆ మేరకు చర్యలను వేగవంతం చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.  భారత ఆర్మీని రెచ్చగొట్టే  ప్రయత్నంలో భాగంగా ఎల్ఓసీ(నియంత్రణ రేఖ) వెంబడి పాకిస్తాన్  పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. 

ఈ దాడులను భారత్ సమర్ధవంతం‍గా తిప్పికొడుతూ పాకిస్తాన్ దుశ్చర్యలపై  ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంకా ఏమైనా హద్దు మీరితే గట్టిగానే బదులివ్వడానికి భారత్‌ సిద్ధమైంది.  దీనిలో భాగంగా భారత యుద్ధనౌకలు అరేబియా సముద్రంలో  సైనిక విన్యాసాలను ఆరంభించాయి.  ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న క్రమంలో నేవీ సిద్ధమైంది.  లాంగ్ రేంజ్ కచ్చితమైన దాడులకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు నేవీ స్నష్టం చేసింది. దేశ ప్రయోజనాలను కాపాడటానికి తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని  ఇండియన్ నేవీ.. పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది.  ఎనీటైమ్.. ఎనీవేర్.. ఎనీహౌ అంటూ నేవీ తన ‘ ఎక్స్’ ద్వారా ఒక మెస్సేజ్ ను పంపింది.

గత మంగళవారం(ఏప్రిల్ 22వ తేదీ) పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో టూరిస్టులు 26మంది వరకూ  ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ సహకారంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని పసిగట్టిన భారత్.. అందుకు అనుగుణంగా స్ట్రాంగ్ మెస్సేజ్ పంపింది. సింధూ జలాలను నిలిపివేతతో పాటు పాకిస్తాన్ జాతీయులు దేశం నుంచి విడిచి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించింది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement