indian navy
-
ఆ‘పాత’ నావ
ఇదేమిటో తెలుసా? అలనాటి భారతీయ నౌకా పాటవానికి నిదర్శనం. వేల ఏళ్ల క్రితమే సముద్రాలపై రాజ్యం చేసిన వైనానికి తిరుగులేని గుర్తు. ఐదో శతాబ్దం దాకా సముద్రాలపై భారతీయులకు ఆధిపత్యం కట్టబెట్టిన విశాలమైన నావలివి. ఇనుము వాడకుండా కేవలం కలప దుంగలు, చెక్క, తాళ్లు తదితరాలతో వీటిని తయారు చేసేవారు. అయినా ఇవి అత్యంత ప్రతికూల వాతావరణాలను కూడా తట్టుకుంటూ సదూర సముద్రయానాలకు ఎంతో అనువుగా ఉండేవి. ఈ భారతీయ నావలకు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా యమ గిరాకీ ఉండేదట. ఇంతటి చరిత్ర ఉన్న పురాతన భారతీయ నావకు వాయుసేన, కేంద్ర సాంస్కృతిక శాఖ ఇప్పుడిలా ప్రాణం పోశాయి. వారి ఆలోచనలకు రూపమిస్తూ గోవాకు చెందిన నౌకా నిర్మాణ సంస్థ హోడీ ఇన్నొవేషన్స్ అచ్చం అలనాటి విధానంలోనే దీన్ని రూపొందించింది. బాబు శంకరన్ సారథ్యంలో కేరళకు చెందిన నిపుణులైన పనివాళ్లు అహోరాత్రాలు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. అప్పట్లో మాదిరిగానే ఈ నావను ముందుగా రెండు అర్ధ భాగాలుగా నిర్మించారు. తర్వాత కొబ్బరి నార నుంచి అల్లిన తాళ్ల సాయంతో ఒడుపుగా ఒక్కటిగా బిగించారు. సముద్ర జలాల్లో తడిసి పాడవకుండా నావ అడుగు, పక్క భాగాలకు అప్పటి పద్ధతుల్లోనే సార్డిన్ ఆయిల్ తదితరాలతో పూత పూశారు. మన్నిక కోసం టేకు, పనస వంటి చెక్కలు మాత్రమే వాడారు. ఈ తరహా భారతీయ నావల హవా క్రీస్తుశకం ఐదో శతాబ్ది దాకా ప్రపంచమంతటా నిరి్నరోధంగా సాగింది. ఆ ఘన వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదో ముందడుగని నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆ‘పాత’నావకు ఇంకా పేరు పెట్టాల్సి ఉంది. ఇది బుధవారం ఘనంగా జలప్రవేశం చేసింది. ఈ ఏడాది చివర్లో 15 మంది నేవీ అధికారులతో ప్రాచీన సముద్ర మార్గాల్లో ఈ నావ మస్కట్, ఇండొనేసియాలకు తొలి ప్రయాణం ప్రారంభించనుంది. దీన్ని నడిపే విధానం తదితరాలపై వారు ముందస్తు శిక్షణ కూడా పొందనున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ద్విగుణీకృతమైన సాగర పాటవం
ముంబై: భారత్ తిరుగులేని సాగరశక్తిగా ఆవిర్భవిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. మన దేశం అంతర్జాతీయంగా అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా మారిందని అభిప్రాయపడ్డారు. రెండు యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ను బుధవారం ముంబై నావల్ డాక్ యార్డులో ఆయన జాతికి అంకితం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కింద చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా రక్షణ ఉత్పత్తి, సముద్ర జలాల రక్షణ, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో భారత్ తిరుగులేని ప్రగతి సాధిస్తోందని ఈ సందర్భంగా అన్నారు. సాగర జలాలను డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, ఉగ్రవాదం వంటి జాఢ్యాల నుంచి కాపాడేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ మరింత చురుకైన భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. ‘‘మూడు యుద్ధనౌకలు ఒకేసారి అందుబాటులోకి రావడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. నౌకా నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేస్తుండటమే ఇందుకు కారణం. గత పదేళ్లలో మా హయాంలో 40 నౌకలు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఏకంగా 39 భారత్‌లోనే తయారవడం విశేషం. ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో నావికా దళానికి దేశీయ చిహా్నలను రూపొందించుకున్నాం. రూ.1.5 లక్షల కోట్లతో మరో 60 యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతోంది. సాగరగర్భంలో దాగున్న అపారమైన అవకాశాలను ఒడిసిపట్టే ప్రయత్నమూ జోరుగా సాగుతోంది. మన పరిశోధకులు 6,000 మీటర్ల లోతు దాకా వెళ్లే సముద్రయాన్ ప్రాజెక్టు ఊపందుకుంది’’ అని వివరించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం భాగస్వామ్య దేశాలన్నింటికీ సమాన స్థాయిలో అందుబాటులో ఉండాలని అభిప్రాయపడ్డారు. రెండు నెలల క్రితం జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి అధికారం నిలబెట్టుకున్నాక మోదీ మహారాష్ట్రలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా మహాయుతి ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మధ్యాహ్న భోజనం చేశారు.ఐఎన్ఎస్ నీలగిరి → ప్రాజెక్ట్ 17ఏ స్టెల్త్ ఫ్రి గేట్ కల్వరీ శ్రేణిలో ప్రధాన యుద్ధనౌక.→ శత్రువును ఏమార్చే అత్యాధునిక స్టెల్త్ టె క్నాలజీ దీని సొంతం.→ గత యుద్ధ నౌకల కంటే అధునాతన రాడార్ టెక్నాలజీ ఉంది. → ఎండీఎల్, నావికా దళానికి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో దీన్ని సంయుక్తంగా నిర్మించాయి. → ఐఎన్ఎస్ నీలగిరి 75 శాతం దేశీయంగా నిర్మితమైంది.→ ఎంహెచ్–60ఆర్ శ్రేణి హెలికాప్టర్లు కూడా దీన్నుంచి కార్యకలాపాలు సాగించగలిగేలా అధునాతన సౌకర్యాలు, పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు.ఐఎన్ఎస్ సూరత్ → ప్రాజెక్ట్ 15బి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ శ్రేణి ప్రాజెక్టులో నాలుగో, చివరి యుద్ధ నౌక. → ఇది నౌకాయాన చరిత్రలోనే అత్యంత భారీ, సంక్లిష్ట నిర్మాణంతో కూడిన యుద్ధ నౌక. → అత్యాధునిక ఆయుధ, సెన్సర్ వ్యవస్థలు, అధునాతన నెట్వర్క్ కేంద్రిత యుద్ధ పాటవం దీని సొంతం. → దీన్ని మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది. → 80% దేశీయంగా∙తయారవడం విశేషం.ఐఎన్ఎస్ వాఘ్షీర్ → ప్రాజెక్ట్ 75 స్కార్పియన్ శ్రేణిలో ఆరో జలాంతర్గామి. → దీని నిర్మాణంలో ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ కూడా పాలుపంచుకుంది. → యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్‌మరైన్ పోరాటాలు రెండింట్లోనూ ఉపయుక్తంగా ఉండేలా దీన్ని రూపొందించారు. → నిఘా సమాచార సేకరణలో కూడా ఇది చురుగ్గా పాలుపంచుకోనుంది. → అత్యాధునిక ఎయిర్–ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ దీని సొంతం. → డీజిల్, విద్యుత్‌తో నడిచే అత్యంత వైవిధ్యమైన, శక్తిమంతమైన, భారీ జలాంతర్గాముల్లో ఇదొకటి. → దీనిలో అధునాతన సోలార్ వ్యవస్థ, యాంటీ షిప్ మిసైళ్లు, వైర్ గైడెడ్ టార్పెడోలను మోహరించారు. → భావి సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసుకునే వెసులుబాటు.#WATCH | Mumbai: On the commissioning of three frontline naval combatants, PM Narendra Modi says, "...It is a matter of pride that all three frontline naval combatants are Made in India. Today's India is emerging as a major maritime power in the world." pic.twitter.com/DisB0t8oDY— ANI (@ANI) January 15, 2025 #WATCH | Mumbai, Maharashtra: Prime Minister Narendra Modi dedicates three frontline naval combatants INS Surat, INS Nilgiri and INS Vaghsheer to the nation(Source: ANI/DD) pic.twitter.com/0PI3kxlVT4— ANI (@ANI) January 15, 2025 -
నౌకాదళానికి అసలైన సంక్రాంతి
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం ఈ సంక్రాంతిని సువర్ణాక్షరాలతో లిఖించనుంది. స్వదేశీ పరిజ్ఞానం వినియోగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతూనే, నౌకాదళ సంపత్తి పెంపుతో ప్రపంచ దేశాలకు సవాల్ విసరనుంది. అత్యాధునికంగా రూపొందించిన రెండు యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి (సబ్‌మెరైన్)ని ఈ నెల 15న కేంద్ర రక్షణ మంత్రి జాతికి అంకితం చేయనున్నారు. విశాఖపట్నం క్లాస్‌లో చివరిదైన ఐఎన్ఎస్ సూరత్‌తో పాటు ఫ్రిగేట్ వార్ షిప్ ఐఎన్ఎస్ నీల్గిరి, అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ వాగ్షీర్ సబ్‌మెరైన్ భారత నౌకాదళ అమ్ములపొదిలో చేరబోతున్నాయి. ఈ మూడూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన నౌకలే. వీటి ద్వారా నౌకా నిర్మాణంలో చైనాకు భారత్ దీటుగా నిలిచింది. అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ, అధునాతన ఆయుధ వ్యవస్థలు, కార్యాచరణతో నౌకాదళం కొత్త బెంచ్‌మార్క్ చేరుకోనుంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు, శత్రు దేశాల కవి్వంపు చర్యల్ని సమర్ధంగా తిప్పికొట్టేందుకు నీలగిరి, సూరత్, వాగ్‌షీర్‌లు సిద్ధంగా ఉంటాయి. చైనాకు దీటుగా నౌకా నిర్మాణం నౌకా నిర్మాణంలో విదేశీ పరిజ్ఞానానికి స్వస్తి పలుకుతూ ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో విభిన్న యుద్ధ నౌకలు, సబ్మెరైన్లను భారత నౌకాదళం అందుబాటులోకి తెస్తోంది. హిందూస్థాన్ షిప్‌యార్డ్, మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ (ఎండీఎల్), గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ), కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ఎల్ అండ్ టీ వంటి ప్రైవేట్ సంస్థల సహకారంతో అధునాతన నౌకల్ని నిర్మిస్తోంది. ప్రపంచ నౌకా నిర్మాణంలో ఉన్న చైనా ఏటా సగటున 19 నౌకలు తయారు చేస్తుంటే.., దాన్ని తలదన్నేలా ఇప్పుడు భారత్ ఏటా సగటున 20 యుద్ధ నౌకలు నిర్మిస్తోంది. చైనాలో ఎక్కువగా వాణిజ్య నౌకా నిర్మాణం జరుగుతోంది. భారత్ యుద్ధ నౌకల నిర్మాణంలో ముందంజ వేస్తోంది. మొత్తంగా తక్కువ వ్యవధిలో ప్రపంచ స్థాయి యుద్ధ నౌకలను తయారు చేయగలమనే సంకేతాల్ని భారత్ పంపించింది.ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామి అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్షీర్. ముంబైలోని మజ్గావ్లో తయారైన వాగ్షీర్.. కల్వరి శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది. ఫ్రాన్స్ నుంచి బదిలీ చేసిన సాంకేతికతని దీని తయారీకి ఉపయోగించారు. 11 నెలల పాటు సముద్రంలో ప్రయోగాలు చేసిన తర్వాత జాతికి అంకితం చేస్తున్నారు. సామర్థ్యమిదీ.. బరువు – 1,780 టన్నులు పొడవు – 221 అడుగులు వెడల్పు – 20 అడుగులు ఎత్తు – 40 అడుగులు, డ్రాఫ్ట్ – 19 అడుగులు వేగం – ఉపరితలంపై గంటకు 20 కిమీ, సాగర గర్భంలో 37 కిమీ » సామర్థ్యం – ఉపరితలంపై ఏకధాటిగా 12 వేల కిమీ, సాగరగర్భంలో 1020 కిమీ ప్రయాణించగలదు. సముద్రంలో1,150 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. 50 రోజులు సాగర గర్భంలో దాక్కోగలదు. » సిబ్బంది – 8 మంది అధికారులు, 35 మంది సెయిలర్స్ » ఆయుధ సంపత్తి– 21 టార్పెడోలు, 18 ఎస్యూటీ టార్పెడోలు, ఎస్ఎం.39 యాంటీ షిప్ మిసైల్, 30 మైన్స్.ఐఎన్ఎస్ నీలగిరి నీలగిరి క్లాస్ స్టెల్త్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ వార్‌షిప్‌లకు ప్రధాన నౌక ఇది. 2019 సెప్టెంబర్‌లో నిర్మాణ పనుల్ని మజ్గావ్ షిప్‌యార్డ్ డాక్ లిమిటెడ్‌లో ప్రారంభించారు. 2024 ఆగస్టులో ట్రయల్ రన్ ప్రారంభించి.. అదే ఏడాది డిసెంబర్లో నేవీకి అప్పగించారు. నీలగిరి యుద్ధ నౌక సామర్థ్యమిదీ.. బరువు – 6,670 టన్నులు పొడవు – 488 అడుగులు వెడల్పు – 58 అడుగులు డ్రాఫ్ట్ – 17 అడుగులు లోతు – 32 అడుగులు వేగం – గంటకు 59 కిలోమీటర్లు రేంజ్ – ఏకధాటిగా 4,600 కిలోమీటర్లు ప్రయాణించగలదుసిబ్బంది– 35 మంది అధికారులతో కలిపి మొత్తం 226 మంది క్రాఫ్ట్ క్యారియర్– 2 ఆర్హెచ్ఐబీ బోట్లు » సెన్సార్లు, రాడార్లు – ఇంద్ర రాడార్, ఎల్ బ్యాండ్ ఎయిర్ సర్వైలెన్స్ రాడార్, బీఈఎల్ హంసా సోనార్ వ్యవస్థ, అత్యాధునిక కంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్ »ఎలక్ట్రానిక్ వార్ఫేర్ – డీఆర్డీవో శక్తి ఈడబ్ల్యూ సూట్, రాడార్ ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్, 4 కవచ్ డెకాయ్ లాంచర్స్, 2 ఎన్ఎస్టీఎల్ టార్పెడో సిస్టమ్స్ » ఆయుధ సంపత్తి – వీఎల్ఎస్ 8 సెల్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ 32 » బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైల్– 2, వరుణాస్త్ర ట్రిపుల్ ట్యూబ్ టార్పెడో లాంచర్లు – 2, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్ లాంచర్లు –2, 76 ఎంఎం ఓటీవో నేవల్ గన్ – 1, ఏకే 630 ఎం గన్–1 » ఎయిర్‌క్రాఫ్ట్ – హెచ్ఎఎల్ ధ్రృవ్ లేదా సీ కింగ్ హెలికాప్టర్ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక.. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్ – 15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారుచేస్తోంది. వీటికి దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లని పెట్టారు. ఈ క్లాస్‌లో చివరిది ఐఎన్ఎస్ సూరత్. ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్)లో తయారు చేశారు. శత్రువుకి సంబంధించిన లక్ష్యాన్ని దేన్నైనా, ఎక్కడ ఉన్నా ఛేదించగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ సూరత్.. శత్రువుల పాలిట సింహస్వప్నమే.యుద్ధ నౌక విశేషాలు..బరువు – 7,400 టన్నులు పొడవు – 535 అడుగులు బీమ్ – 57 అడుగులు డ్రాఫ్ట్ – 21 అడుగులు వేగం – గంటకు 56 కిమీ పరిధి – ఏకధాటిగా 15 వేల కి.మీ ప్రయాణం చేయగలదు గ్యాస్ టర్బైన్లు– 4 సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది» సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్, సర్ఫేస్ సెర్చ్ రాడార్లు » ఆయుధాలు – 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు » విమానాలు – రెండు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలు -
నేవీ సిబ్బందికి శుభాకాంక్షలు: వైఎస్ జగన్
సాక్షి,తాడేపల్లి:భారత నౌకాదళ దినోత్సవం సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం(డిసెంబర్ 4) ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు.‘నేవీలో అంకితభావం,నిస్వార్థ సేవతో పని చేస్తున్న మహిళలు,పురుషులు అందరికీ వందనం. సముద్ర సరిహద్దులను కాపాడటంలో వారు చూపుతున్న ధైర్యం అందరిలోనూ గర్వాన్ని నింపుతోంది. వారి త్యాగాలను గౌరవిస్తున్నాం. నేవీ సిబ్బంది శౌర్యాన్ని గుర్తు చేసుకుంటూ నేవీడేను ఘనంగా జరుపుకుందాం’అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.On Indian Navy Day, we salute the unwavering dedication and selfless service of the valiant men and women of the Indian Navy. Their courage in safeguarding our maritime frontiers fills us with immense pride.Today, we honor their sacrifices and the steadfast support of their…— YS Jagan Mohan Reddy (@ysjagan) December 4, 2024 -
ఫిషింగ్ బోట్లలో వందల కిలోల డ్రగ్స్.. పట్టుకున్న నేవీ
ముంబయి: అరేబియా సముద్ర జలాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సముద్రంలో రెండు ఫిషింగ్ బోట్లలో ఏకంగా 500 కిలోల డ్రగ్స్‌ను అక్రమరవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు ఇండియన్ నేవీ తెలిపింది. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో శుక్రవారం నేవీ ఒక పోస్టు చేసింది.‘శ్రీలంకకు చెందిన రెండు ఫిషింగ్ బోట్లలో అక్రమరవాణా చేస్తున్న 500 కిలోల డ్రగ్స్‌ను ఇండియన్ నేవీ సీజ్ చేసింది. శ్రీలంక నేవీ,ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ ఎప్పికప్పుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన ఇండియన్ నేవీ డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న బోట్లను అడ్డుకుంది.డ్రగ్స్ ఉన్న బోట్లను గుర్తించడానికి విస్తృత ఏరియల్ సెర్చ్ నిర్వహించాం. డ్రగ్స్ రవాణా చేస్తున్న రెండు బోట్లను, అందులో ఉన్న సిబ్బందిని శ్రీలంకకు అప్పగించాం’అని ఇండియన్ నేవీ ట్వీట్లో తెలిపింది. ఈ ఆపరేషన్ డ్రగ్స్ రవాణాను అరికట్టడంలో భారత్,శ్రీలంక మధ్య ఉన్న పటిష్ట సంబంధాలను తెలియజేస్తోందని పేర్కొంది. Narcotics Seizure - Combined Operation b/n #IndianNavy & @srilanka_navy.Based on information received from #SrilankaNavy regarding probable narcotics smuggling by Sri Lankan flagged fishing vessels, the @indiannavy swiftly responded through a coordinated operation to localise &… pic.twitter.com/dkpzNQonTF— SpokespersonNavy (@indiannavy) November 29, 2024 -
కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: అణు సామర్థ్యం కలిగిన కే4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి భారత నావికాదళం ఆధ్వర్యంలో బుధవారం ఈ పరీక్ష చేపట్టినట్లు అధికార వర్గాలు గురువారం తెలిపాయి. కే4 బాలిస్టిక్ క్షిపణి 3,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించగలదు. దేశంలో మొట్టమొదటిగా జలాంతర్గామి నుంచి నిర్వహించిన తొలి సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ ఇదే. ఈ క్షిపణి రాకతో మన దేశ అణ్వాయుధ సామర్థ్యం మరింత పెరిగినట్లు అధికారులు చెప్పారు. అణ్వాయుధ క్షిపణిని భూమి నుంచి, సముద్ర అంతర్భాగం నుంచి, నింగి నుంచి ప్రయోగించే సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల జాబితాలో భారత్ కూడా చేరడం విశేషం. బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించే అణు జలాంతర్గాములు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, రష్యా వద్ద ఉన్నాయి. ఇప్పుడు భారత్ కూడా వీటిని సమకూర్చుకుంది. -
గోవా తీరంలో జలాంతర్గామిని ఢీకొట్టిన పడవ
న్యూఢిల్లీ: గోవా తీరం నుంచి సముద్రంలో 70 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. భారత నావికా దళానికి చెందిన జలాంతర్గామిని మత్స్యకారుల పడవ ఢీకొట్టినట్లు అధికారులు శుక్రవారం వెల్లడించారు. గురువారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే ఈ పడవ పేరు మార్తోమా. ప్రమాద సమయంలో పడవలో మొత్తం 13 మంది ఉన్నారు. వారిలో 11 మందిని అధికారులు రక్షించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం ఆరు నౌకలను, హెలికాప్టర్లను రంగంలోకి దించినట్లు నావికా దళం అధికార ప్రతినిధి చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని పేర్కొన్నారు. ముంబైలోని మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్(ఎంఆర్సీసీ)తో కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. కోస్ట్ గార్డ్ సిబ్బంంది సేవలు కూడా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా, జలాంతర్గామిని పడవ ఢీకొన్న ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు నావికా దళం ఆదేశాలు జారీ చేసింది. -
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
NAVIKA SAGAR PARIKRAMA II: కడలి అలలిక వాళ్ల కాళ్ల కింద...
సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావాలంటే పెట్టి పుట్టాలి. పట్టిన పట్టు విడువని స్వభావంతో పుట్టాలి. ‘ఓషన్ సెయిలింగ్ అడ్వంచర్స్’లో ఇండియా ఉనికి ప్రపంచానికి తెలియాలంటే అందునా స్త్రీ శక్తి తెలియాలంటే ‘సర్కమ్నావిగేషన్’ (ప్రపంచాన్ని చుట్టి రావడం) ఒక్కటే మార్గమని నేవీ వైస్ అడ్మిరల్ మనోహర్ అవతి ఉద్దేశం. అందుకే ‘సాగర్ పరిక్రమ’ కార్యక్రమాన్ని ప్రతిపాదించాడు. అంటే సముద్ర మార్గాన ప్రపంచాన్ని చుట్టి రావడం. ఇప్పటికి భారతదేశం మూడు సాగర పరిక్రమలు విజయవంతంగా పూర్తి చేసింది. వీటిలో రెండింటిని పురుష ఆఫీసర్లు; ఒకదానిని మహిళా ఆఫీసర్లూ పూర్తి చేశారు. మహిళల కోసమే ‘నావికా సాగర్ పరిక్రమ’ను నేవీ ప్రవేశపెడితే 2017లో ఏడుగురు మహిళా నేవీ ఆఫీసర్లు ఆ పరిక్రమను పూర్తి చేసి జేజేలు అందుకున్నారు. ఆ తర్వాత ‘నావికా సాగర్ పరిక్రమ 2’ యత్నాలు మొదలయ్యాయి. ఏడుగురి స్థానంలో ఇద్దరినే ఉంచి సాహసవంతంగా పరిక్రమ చేయించాలని నేవీ సంకల్పించింది. ఇందుకు నేవీలో పని చేసే మహిళా ఆఫీసర్ల నుంచి స్వచ్ఛందంగా దరఖాస్తులు ఆహ్వానించగా చాలామంది స్పందించారు. వారిలో అనేక దశల వడ΄ోత తర్వాత ఇద్దరు ఆఫీసర్లు మిగిలారు. వారే రూపా, దిల్నా. గత మూడేళ్లుగా వారితో చేయించిన ట్రైనింగ్ ముగియడంతో అతి త్వరలో సాహసయాత్ర మొదలుకానుందని నేవీ తెలిపింది.→ ఆటల నుంచి సాగరంలోకి...‘నాకు చిన్నప్పటి నుంచి ఆటలంటే ఇష్టం. ఆటలు ఆడుతూనే 2014లో నేవీలోకి వచ్చాను’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ డెల్నా. కేరళకు చెందిన డెల్నా ఆర్మీలో పని చేస్తున్న తండ్రిని చూసి నేవీలో చేరింది. ‘నేవీలో లాజిస్టిక్స్ ఆఫీసర్‌గా పని చేస్తూ ఉండగా ‘నావికా సాగర్ పరిక్రమ 2’ సంగతి తెలిసింది. నేను అప్లై చేశాను. సెలెక్ట్ అయ్యాను. అయితే అప్లై చేసిన చాలామంది మధ్యలోనే కుటుంబ వొత్తిళ్ల వల్ల మానుకున్నారు. సముద్రం మీద సంవత్సరం పాటు కేవలం మరొక ఆఫీసర్ తోడుతోనే ఉండాలంటే ఎవరైనా భయపడతారు. కాని మా నాన్న, నేవీలోనే పని చేస్తున్న నా భర్త నన్ను ్ర΄ోత్సహించారు. నేవీలో పని చేయడం అంటే జీవితం సముద్రంలో గడవడమే. అయినా నేనూ నా భర్త శాటిలైట్ ఫోన్ ద్వారా కనెక్టివిటీలోనే ఉంటాం’ అని తెలిపింది డెల్నా.→ నన్ను నేను తెలుసుకోవడమే‘నేలకు దూరంగా సముద్రం మీద ఉండటం అంటే నన్ను నేను తెలుసుకోవడమే’ అంటుంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా. పాండిచ్చేరికి చెందిన రూప తండ్రి నేవీలోనే పని చేస్తుండటంతో 2017లో ఆమె నేవీలో చేరింది. ‘ముంబైలో నేవీ ఇన్స్పెక్టర్గా పని చేస్తుండగా నావికా సాగర్ పరిక్రమ 2లో పాల్గొనే అవకాశం వచ్చింది. సముద్రం అంటే నాకు ఇష్టం. నేలను ఒదిలి పెట్టి వచ్చిన మనిషిని సముద్రం ఎప్పుడూ నిరాశ పరచదు. అద్భుతమైన ప్రకృతిని సముద్రం మీద చూడవచ్చు. ఒక్కోసారి భయం వేస్తుంది. కాని అంతలో ముందుకు సాగే ధైర్యం వస్తుంది’ అంటోందామె.→ కఠిన శిక్షణ‘నావికా సాగర్ పరిక్రమ2’కు ఎంపికయ్యాక గత మూడు సంవత్సరాలుగా డెల్నా, రూపాలు శిక్షణ తీసుకుంటున్నారు. తారిణి అనే సెయిల్ బోట్లో వీరికి శిక్షణ జరుగుతోంది. ఇప్పటికే వీరు ఈ బోట్లో సముద్రం మీద 34 వేల నాటికల్ మైళ్లు తిరిగారు. బోట్‌ను నడపడం, దిశను ఇవ్వడం, రిపేర్లు చేసుకోవడం, వైద్యం చేసుకోవడం, శారీరక మానసిక దృడ్వం కలిగి ఉండటం... ఇవన్నీ శిక్షణలో నేర్పిస్తారు. ‘మేము ఇద్దరమే బోట్లో ఉంటాం. అంటే పని ఎక్కువ నిద్ర తక్కువ ఉంటుంది. ఊహించని తుఫాన్లు ఉంటాయి. ఒకేవిధమైన పనిని తట్టుకునే స్వభావం, ఓపిక చాలా ముఖ్యం. మేము అన్ని విధాలా సిద్ధమయ్యాము. ఇక ప్రయాణమే ఆలస్యం’ అన్నారు ఈ ఇద్దరు ధీరవనితలు. త్వరలో ్రపారంభం కానున్న వీరి సాగర పరిక్రమ కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆశిద్దాం. 56 అడుగుల సెయిల్ బోట్. 40000 కిలోమీటర్ల దూరం250 రోజుల ప్రయాణంరాకాసి అలలు... భీకరగాలులువీటన్నింటినీ ఎదుర్కొంటూ ఇద్దరే మహిళా నావికులు. స్త్రీలంటే ధీరలు అని నిరూపించడానికి ఇండియన్ నేవీ త్వరలో తన ఇద్దరు నావికులను సముద్రం మీద ప్రపంచాన్ని చుట్టి రావడానికి పంపనుంది. పాండిచ్చేరికి చెందిన రూపా కాలికట్కు చెందిన డెల్నా బయలుదేరనున్నారు. ఈ సాహస యాత్ర గురించి... -
ఆయుధ వ్యవస్థల ప్రదర్శనకు ‘తరంగ్ శక్తి’
రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న భారత్ వరుస విన్యాసాలకు వేదికగా నిలుస్తోంది. అందులో భాగంగా ఈ నెల ఆరో తేదీ నుంచి తమిళనాడులోని సూలూరులో ప్రారంభమైన ‘తరంగ్ శక్తి 2024’ మొదటిదశ యుద్ధవిన్యాసాలు రేపటితో ముగియనున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విన్యాసాల్లో 30 దేశాలకు పైగా పాల్గొన్నట్లు తెలిసింది. దేశీయంగా తయారు చేసిన ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించేందుకు ‘తరంగ్ శక్తి’ మంచి వేదికని మంగళవారం డీఆర్డీఓ ఛైర్పర్సన్ సమీర్ వి కామత్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘భారత వైమానిక దళం ఆధ్వర్యంలో జరుగుతున్న తరంగ్ శక్తి ఎక్సర్సైజ్ దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఉత్పత్తులను ప్రదర్శించేందుకు మంచి వేదిక. అవసరమైనప్పుడు దేశాన్ని రక్షించగల సామర్థ్యం ఉందని భారత ప్రజలకు తెలియజేసే అవకాశంగా ఈ కార్యక్రమం నిలిచింది. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఏఎంసీఏ ఫైటర్ జెట్(స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్) డిజైన్ పూర్తయింది. అభివృద్ధి ట్రయల్స్‌ను త్వరలో నిర్వహించి 2034 నాటికి దాన్ని సైన్యానికి అందిస్తాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను అభివృద్ధి చేసే అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి’ అని అన్నారు.ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!తరంగ్ శక్తి యుద్ధ విన్యాసాలు రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. మొదటి దశ ఆగస్టు 6 నుంచి 14వ తేదీ వరకూ తమిళనాడులో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో రెండో దశ విన్యాసాలు జరగనున్నాయి. భారత త్రివిధ దళాల అధిపతులతో పాటు జర్మనీ, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, జపాన్, నేపాల్, గినియా దేశాలకు చెందిన చీఫ్ ఆఫ్ ఎయిర్‌స్టాఫ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ విన్యాసాలకు ఈసారి రష్యా, ఇజ్రాయిల్ దూరంగా ఉంటున్నాయి. భారత వైమానిక దళంతో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఎఫ్–18, బంగ్లాదేశ్‌కు చెందిన సీ–130, ఫ్రాన్స్‌కు చెందిన రాఫెల్, జర్మనీకి చెందిన టైఫూన్, గ్రీస్‌కు చెందిన ఎఫ్–16, స్పెయిన్‌కు చెందిన టైపూన్, యూఏఈకి చెందిన ఎఫ్–16, యూకేకి చెందిన టైపూన్, యూఎస్ఏకి చెందిన ఏ–10, ఎఫ్–16, ఎఫ్ఆర్ఏ, సింగపూర్‌కు చెందిన సీ–130 యుద్ధ విమానాలు, బలగాలు విన్యాసాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. -
చమురు నౌక మునక: ఎనిమిది మంది భారతీయులు సురక్షితం
ఒమన్ తీరంలో మునిగిన చమురు నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయులలో ఎనిమిదిమందిని ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ ట్యాగ్ సురక్షింతగా బయటకు తీసుకువచ్చింది. ఈ చమురు నౌక సముద్రంలో మునిగిపోయినప్పుడు దానిలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులు. ఈ ప్రమాదంలో మునిగిన ఒక శ్రీలంక పౌరుడిని కూడా ఇండియన్ నేవీ రక్షించింది. మరో శ్రీలంక పౌరుని మృతదేహాన్ని వెలికితీసింది.ఒమన్ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్‌ను గుర్తించడానికి భారత్‌కు చెందిన యుద్ధనౌక ఐఎస్ఎస్ టెగ్ను రెస్క్యూ ఆపరేషన్‌కు పంపారు. ఒమన్‌లోని రాస్ మద్రాక్కు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో జులై 15న ఈ నౌక మునిగిపోయింది. ఒమన్ అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ అనే కార్గో నౌకలో 13 మంది భారతీయులు,ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమన్ మారిటైమ్ సేఫ్టీ సెంటర్ (ఎంఎస్సీ)పేర్కొంది. -
నావికా దళాధిపతిగా దినేశ్ త్రిపాఠీ
న్యూఢిల్లీ: భారత నావికా దళం నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠీ నియమితులయ్యారు. ప్రస్తుతం నేవీ స్టాఫ్ వైస్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వైస్ అడ్మిరల్ త్రిపాఠీ ఈ నెల 30వ తేదీ మధ్యాహ్నం నేవీ చీఫ్‌గా బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. 1964 మే 15వ తేదీన జన్మించిన వైస్ అడ్మిరల్ త్రిపాఠీ 1985 జులై ఒకటో తేదీన భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నిపుణుడిగా గత 30 ఏళ్లుగా బాధ్యతల్లో ఉన్నారు. -
భారత నేవీ మరో సాహసం.. 23 మంది పాకిస్థానీలను కాపాడి..
భారత నేవీ మరో సాహసం చేసింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన చేపల బోటులో ఉన్న 23 మంది పాకిస్థానీయులను కాపాడింది. కాగా, సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు భారీ నేవీ అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో దేశాలతో సంబంధం లేకుండా సముద్ర, నావికుల భద్రత విషయంలో ఎల్లప్పుడూ కట్టుబడిఉన్నట్లు నేవీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ఇతర దేశాల నౌకలు ఆపదలో ఉన్న ప్రతీసారి మేము ఉన్నామంటూ భారత నేవీ ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే నేవీ అధికారులు మరో సహాసం చేశారు. అరేబియాలోని గల్ఫ్ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీపసమూహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో గురువారం ఇరాన్‌కు చెందిన చేపల బోటు హైజాక్‌కు గురైంది. తొమ్మిది మంది సముద్ర పైరేట్స్ పడవను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. #IndianNavy Responds to Piracy Attack in the #ArabianSea. Inputs received on a potential piracy incident onboard Iranian Fishing Vessel 'Al-Kambar' late evening on #28Mar 24, approx 90 nm South West of Socotra. Two Indian Naval ships, mission deployed in the #ArabianSea for… pic.twitter.com/PdEZiCAu3t — SpokespersonNavy (@indiannavy) March 29, 2024 దీంతో, ఆ బోటును, సిబ్బందిని రక్షించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపడుతున్నట్లు భారత నేవీ శుక్రవారం రాత్రి ప్రకటించింది. దీంతో తొలుత ఐఎన్ఎస్ సుమేధా సముద్రపు దొంగల అదుపులో ఉన్న ‘ఏఐ కంబార్’ బోటును అడ్డగించింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ త్రిశూల్ నౌక దానికి తోడైంది. దాదాపు 12 గంటల ప్రత్యేక ఆపరేషన్ అనంతరం బోటులో ఉన్న పైరేట్లు లొంగిపోయారు. 23 మంది పాకిస్థానీయులు సురక్షితంగా బయటపడ్డట్లు నేవీ పేర్కొంది. ఇక, రక్షించిన బోటును సురక్షిత రక్షిత ప్రాంతానికి తరలించడానికి భారత్ నేవీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. -
విశాఖ పర్యటనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం
విశాఖపట్నం: టైగర్ ట్రయంఫ్లో భాగంగా తమ విశాఖపట్నం పర్యటనను, భారత నౌకాదళంతో సంయుక్తంగా జరిపిన విన్యాసాల గొప్ప అనుభవాన్ని తాము ప్పటికీ గుర్తుంచుకుంటామని యూఎస్ఎస్ సోమర్సెట్ నౌక సిబ్బంది పేర్కొన్నారు. విశాఖపట్నం పోర్టులో శనివారం మీడియాతో మాట్లాడారు. యూఎస్ఎస్ సోమర్సెట్ నౌక గురించి వివరించారు. డజన్ల కొద్దీ సైనిక వాహనాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ ఓడలో 1,000 మందికి పైగా నావికులు, మెరైన్లు ప్రయాణిస్తారని, పడవలను రిపేర్ చేసే వర్క్‌షాప్‌తో పాటు ఫ్లైట్ డెక్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు ల్యాండ్ అవుతాయని షిప్ పైలట్ ఆష్లే అంబుహెల్ తెలిపారు. “విశాఖపట్నంలో భారత నౌకాదళ సిబ్బందితో గడపడం ఆనందంగా ఉంది. మేము వారి నుండి చాలా నేర్చుకున్నాం. మంచి జ్ఞాపకాలు పొందాం” అని సోమర్సెట్లోని సర్ఫేస్ వార్ఫేర్ ఆఫీసర్ బ్రన్జిక్ చెప్పారు. -
దటీట్ భారత్ నేవీ.. 40 గంటల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
ఢిల్లీ: భారత నావికాదళం మరోసారి సత్తా చాటింది. అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన నౌకలో ఉన్న 17 మందిని ఎంతో సాహసోపేతంగా కాపాడింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ జరిపి నౌకలో ఉన్న 35 మంది సముద్రపు దొంగలను పట్టుకుంది. వివరాల ప్రకారం.. గతేడాది డిసెంబర్ 14న అరేబియా సముద్రంలో ఎంవీ రుయెన్ నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సముద్రంలో దోపిడీకి ఈ నౌకను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నౌనకు రక్షించేందుకు భారత నేవీ రంగంలోకి దిగింది. నౌక రక్షణ కోసం ఆపరేషన్ చేపట్టింది. సుమారు 40 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి నౌకను రక్షించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 35 మంది సముద్రపు దొంగలు లొంగిపోగా.. నౌకలోని 17 మంది సిబ్బంది సురక్షింతంగా ఉన్నట్టు నేవీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఐఎన్ఎస్ కోల్కత్తా, యుద్ధనౌక ఐఎన్ఎస్ సుభద్ర, ఆధునిక డ్రోన్లు, P8I పెట్రోలింగ్ విమానాలు ఉపయోగించినట్టు ఇండియన్ నేవీ తెలిపింది. హైజాక్‌కు గురైన ఎంవీ రుయెన్ పూర్తిగా భారత నావికాదళం ఆధీనంలో ఉన్నట్టు పేర్కొంది. Indian Navy warship INS Kolkata has taken 35 sea pirates in custody on board and started sailing towards the Indian west coast along with the 17 crew members of the merchant vessel MV Ruen. Indian Navy had forced the pirates to surrender after a major operation on high seas:… pic.twitter.com/CvZ6cC8NtR — ANI (@ANI) March 17, 2024 ఇదిలా ఉండగా.. ఈ నెల 15వ తేదీన భారత నేవీ ఆపరేషన్ చేపట్టే ముందు సముద్రపు దొంగలను లొంగిపోవాలని సూచించింది. లేకపోతే వారిపై దాడులు ప్రారంభించాలని మెరైన్ కమాండోలకు నేవీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సోమాలియా సముద్రపు దొంగలు నేవీ అధికారులపై కాల్పులు జరిపారు. అనంతరం ఏ మాత్రం బెదరకుండా రెస్క్యూ కొనసాగించిన నేవీ సముద్రపు దొంగలు లొంగి పోయేలా చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కూడా ఇండియన్ నేవీ రిలీజ్ చేసింది. #IndianNavy thwarts designs of Somali pirates to hijack ships plying through the region by intercepting ex-MV Ruen. The ex-MV Ruen, which had been hijacked by Somali pirates on #14Dec 23, was reported to have sailed out as a pirate ship towards conducting acts of #piracy on high… pic.twitter.com/gOtQJvNpZb — SpokespersonNavy (@indiannavy) March 16, 2024 ఇక,అంతకుముందు బంగ్లాదేశ్‌కు చెందిన ఓ నౌకను సైతం ఇండియన్ నేవీ రక్షించింది. భారత నావికాదళం అరేబియా సముద్రంలో జరిగిన సంఘటనలను తక్షణమే పరిష్కరించడం, వాణిజ్య నౌకలను రక్షించడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది. దీంతో, భారత నావికాదళంపై ప్రపంచదేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. -
విశాఖ సముద్ర జలాల్లో ఒళ్లు గగుర్పొడిచేలా యుద్ధ విన్యాసాలు (ఫొటోలు)
-
వినువీధిలో మిలాన్ మెరుపులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖ వేదికగా జరుగుతున్న మిలాన్–2024 విన్యాసాల్లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను గురువారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ఆర్కే బీచ్‌లో ప్రారంభించారు. యుద్ధ నౌకల ప్రదర్శనలు, మిగ్–29 ఎయిర్‌క్రాఫ్ట్‌ల గగుర్పొడిచే విన్యాసాలు, సీహాక్స్, చేతక్, ఏఎల్‌హెచ్ హెలికాఫ్టర్ల సమర ప్రదర్శనలకు విశాఖ ఆర్కే బీచ్ వేదికైంది. లక్షలాది మంది వీక్షకుల నడుమ మార్కోస్.. శత్రుమూకలతో చేసిన పోరాటాలు సాగర తీరాన్ని రణరంగంగా మార్చాయి. యుద్ధ విన్యాసాల అనంతరం.. మిలాన్‌లో పాల్గొన్న 51 దేశాల జాతీయ జెండాల ప్రదర్శన, నౌకాదళ సిబ్బంది పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శించిన నేవీ బ్యాండ్ ఉర్రూతలూగించగా.. కూచిపూడి, థింసా, గరగ, తప్పెటగుళ్లు, కొమ్ము నృత్యం, కోలాటం, గార్భా, దాండియా.. ఇలా వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్య ప్రదర్శనలు విదేశీయుల్ని సైతం మంత్ర ముగ్ధుల్ని చేశాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలతో ఏర్పాటు చేసిన శకట ప్రదర్శనకు విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. నేవీ బ్యాండ్‌తో ముగింపు పలకగా.. చివర్లో దేశ పరాక్రమాన్ని, ఇండియన్ నేవీ సామర్థ్యాన్ని ప్రస్ఫుటించేలా నిర్వహించిన లేజర్ షో అద్భుతంగా సాగింది. బాణసంచా పేలుళ్లతో కార్యక్రమాన్ని ముగించారు. సాగర జలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలు ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు వార్‌షిప్స్ జలాశ్వ, ముంబై, చెన్నై యుద్ధ నౌకలు విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వివిధ దేశాల నేవీ సిబ్బంది గౌరవ వందనాన్ని కేంద్ర మంత్రి అజయ్‌భట్ స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారానికి కృతజ్ఞతలు విశాఖలో నిర్వహించిన రెండు మిలాన్‌లు అతిపెద్ద విన్యాసాలుగా చరిత్రకెక్కాయి. తూర్పు నౌకాదళంతో కలిసి విశాఖ నగరం మేరీటైమ్ సిటీగా అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్‌లో నౌకాదళానికి విశాఖ నగరం కేంద్ర బిందువుగా మారనుంది. మిలాన్–2024 విన్యాసాల్లో భాగంగా నిర్వహించిన సిటీ పరేడ్ ద్వారా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ.. సముద్ర జలాల్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని అందించాలన్నదే లక్ష్యం. 51 దేశాల ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. – అజయ్‌భట్, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి విశాఖ నగరం అద్భుత ఆతిథ్యమిచ్చింది మిలాన్–2024 విన్యాసాలకు విశాఖ నగరం అద్భుతంగా ఆతిథ్యమిచ్చింది. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సహకరించినందుకు కృతజ్ఞతలు. విశాఖకు, నౌకాదళానికి అవినాభావ సంబంధం ఉంది. ఈస్ట్రన్ సీ బోర్డ్‌లో విశాఖ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే మిసైల్ డిస్ట్రాయర్ వార్ షిప్‌నకు.. ఐఎన్ఎస్ విశాఖపట్నంగా నామకరణం చేసి నగరానికి అంకితం చేశాం. ఇక్కడ నిర్వహించే ప్రతి నౌకాదళ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరిస్తున్న ప్రభుత్వానికి, విశాఖ ప్రజలకు కృతజ్ఞతలు. – అడ్మిరల్ ఆర్ హరికుమార్, భారత నౌకాదళాధిపతి -
మిలాన్ మెరుపులు
-
ఖతార్ లో గూఢచర్యం కేసులో అరెస్టయిన 8 మంది భారతీయుల విడుదల
-
భారతీయ నౌకాదళంలోకి INS సంధాయక్
-
ఇరాన్ నౌక హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’
ఇరాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకను ఇండియన్ నేవి సిబ్బంది రక్షించించినట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 700 నాటికల్ మైల్స్ దూరంలో ఇరాన్ దేశానికి చెందిన ఫిషింగ్ నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవి వెంటనే అప్రమత్తమై.. ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ యుద్ధనౌక సిబ్బందిని రంగంలోకి దింపింది. ఇరాన్ ఫిషింగ్ నౌకను సోమాలియా హైజార్ల నుంచి ‘ఐఎన్ఎస్ సుమిత్రా’ సిబ్బంది రక్షించినట్లు ఇండియన్ నేవీ పేర్కొంది. Indian Navy warship INS Sumitra is rescuing fishermen hijacked by Somali pirates 700 nautical miles west of Kochi in the Arabian Sea. The Iranian fishing vessel MV Iman with around 17 crew members was hijacked by Somali pirates: Indian Defence officials pic.twitter.com/EOEs7zgQHn — ANI (@ANI) January 29, 2024 అయితే.. సోమాలియా సముద్రపు దొంగల చేత హైజాక్‌కు గురైన ఇరాన్‌కు చెందిన ఎంవీ ఇమాన్ మత్స్యకార నౌకలో 17 మంది సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇక.. ఇటీవల ఇటువంటి ఘటనలు ఎర్ర సముద్రంతో పాటు అరేబియా సముద్రంలో వరుసుగా జరుగుతున్న విషయం తెలిసిందే. చదవండి: వారంలోగా దేశవ్యాప్తంగా సీఏఏ అమలు.. కేంద్రమంత్రి ప్రకటన -
భారత సిబ్బందితో ఉన్న నౌకపై దాడి.. రంగంలోకి ఐఎన్ఎస్ విశాఖ
ఎర్రసముద్రంలో నౌకలపై యెమెన్ దేశానికి చెందిన తిరుబాటుదారులు హౌతీ రెబల్స్ దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో సముద్రంలో ప్రయాణిస్తున్న బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్‌పై హౌతీ రెబల్స్ మిస్సైల్ దాడికి తెగపడ్డారు. దాడికి గురైన బ్రిటిష్ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ ఉద్యోగి ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ సహాయక చర్యలకోసం ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బందిని పంపించినట్లు శనివారం వెల్లడించింది. దాడి జరిగిన వెంటనే ఎంవీ మార్లిన్ లువాండా అనే బ్రిటిష్ నౌక నుంచి ఓ అత్యవసర సందేశం ఇండియాన్ నేవీ వచ్చింది. #IndianNavy's Guided missile destroyer, #INSVisakhapatnam, deployed in the #GulfofAden responded to a distress call from MV #MarlinLuanda on the night of #26Jan 24. The fire fighting efforts onboard the distressed Merchant Vessel is being augmented by the NBCD team along with… pic.twitter.com/meocASF2Lo — SpokespersonNavy (@indiannavy) January 27, 2024 ‘ఎంవీ మార్లిన్ లువాండా నుంచి వచ్చిన అత్యవసర సందేశంతో అప్రమత్తమైన సమీపంలోని ఐఎన్ఎస్ విశాఖపట్నం సిబ్బంది రంగంలో దిగారు. నౌకల భద్రతను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ ఇండియాన్ నేవి ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా పేర్కొంది. -
ఏడెన్ పోర్టు సమీపంలో నౌకపై డ్రోన్ దాడి
న్యూఢిల్లీ: ఏడెన్ సింధుశాఖ సమీపంలో మార్షల్ ఐల్యాండ్‌కు చెందిన వాణిజ్య నౌకపై బుధవారం అర్ధరాత్రి డ్రోన్ దాడి చోటుచేసుకుంది. బాధిత నౌక ఎంవీ గెంకో పికార్డీ నుంచి విపత్తులో ఉన్నామన్న సమాచారం అందుకున్న భారత నావికాదళం సత్వరమే స్పందించింది. హిందూ మహా సముద్రంలోని ఏడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నౌకలో 9 మంది భారతీయులు సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని నౌకలో మంటలను వెంటనే ఆర్పి వేసినట్లు అధికారులు తెలిపారు. ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర జలాల్లో ఇటీవలి కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంవీ గెంకో పికార్డీ నుంచి బుధవారం అర్ధరాత్రి 11.11 గంటలకు ప్రమాద సమాచారం అందిన వెంటనే నేవీకి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేసే నిపుణుల బృందంతో బయలుదేరింది. 12.30 గంటలకల్లా ఘటనా ప్రాంతానికి చేరుకుంది. నిపుణులు ఎంవీ గెంకో పికార్డీలో క్షుణ్నంగా తనిఖీలు జరిపారు. ఎలాంటి ప్రమాదం లేదని ధ్రువీకరించారు. దీంతో నౌక తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించిందని అధికారులు చెప్పారు. జనవరి 5న అరేబియా సముద్రంలో ఎంవీ లిలా నార్ఫోక్ అనే లైబీరియా నౌకను నేవీ సిబ్బంది హైజాకర్ల నుంచి కాపాడారు. డిసెంబర్ 23న ఎర్ర సముద్రంలో భారత్ వైపు చమురుతో వస్తున్న ఎంవీ చెక్ ప్లుటో అనే నౌకపై డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. -
తోకముడిచిన సోమాలియా పైరేట్లు
న్యూఢిల్లీ: భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియా సరుకు నౌకను హైజాక్ చేసేందుకు సోమాలియా సముద్రపు దొంగలు చేసిన ప్రయత్నాన్ని భారత నేవీ కమాండోలు చాకచక్యంగా తిప్పికొట్టారు. అందులోని 15 మంది భారతీయ సిబ్బంది సహా మొత్తం 21 మందిని కాపాడారు. ఎంవీ లిలా నార్ఫోక్ అనే ఓడను ఈ నెల 4వ తేదీన అరేబియా సముద్ర జలాల్లో ఉండగా సాయుధ దుండగులు హస్తగతం చేసుకున్నారు. ఆపదలో ఉన్నామని, ఆదుకోవాలంటూ ఓడ సిబ్బంది యునైటెడ్ కింగ్డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్(యూకేఎంటీవో)పోర్టల్‌కు సమాచారం అందించారు. అందులో 15 మంది వరకు భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలియడంతో భారత నేవీ అప్రమత్తమైంది. ఆ ప్రాంతానికి ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌకను హుటాహుటిన పంపించింది. పైరేట్లను లొంగిపోవాలని హెచ్చరికలు చేస్తూ ఎంవీ లిలా నార్ఫోక్ను శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఐఎన్ఎస్ చెన్నై అడ్డగించింది. సుశిక్షితులైన కమాండోలతో కూడిన అత్యాధునిక గస్తీ హెలికాప్టర్ పి–81ను సైతం అధికారులు సిద్ధంగా ఉంచారు. నౌకలోని పరిస్థితులను దగ్గర్నుంచి అంచనా వేసేందుకు అత్యాధునిక ఎంక్యూ9బీ ప్రిడేటర్ డ్రోన్‌ను రంగంలోకి దించారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పైఅధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే కమాండోలు ఎంవీ లిలా నార్‌ఫోక్‌లోకి మెరుపు వేగంతో ప్రవేశించారు. వారిని చూసి పైరేట్లు తోకముడిచారు. గస్తీ సిబ్బంది ఇచ్చిన గట్టి హెచ్చరికలతోనే వారు భయపడి, నౌకను హైజాక్ చేసే ప్రయత్నాన్ని విరమించుకుని, పలాయన మంత్రం పఠించారని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వాల్ చెప్పారు. నౌకలో విద్యుత్ వ్యవస్థను, చోదక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. అన్నీ పూర్తయ్యాక నౌక ప్రయాణాన్ని మళ్లీ కొనసాగించనుందన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల స్వేచ్ఛా యానానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ఇతర దేశాల భాగస్వామ్యంతో పనిచేసేందుకు నేవీ కట్టుబడి ఉంటుందని వివరించారు. సముద్ర దొంగల బారి నుంచి తమ నౌకను రక్షించిన భారత నేవీకి లిలా గ్లోబల్ సీఈవో స్టీవ్ కుంజెర్ ధన్యవాదాలు తెలిపారు. ఇలా ఉండగా, ఇజ్రాయెల్–హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావం నౌకా రవాణాపైనా పడింది. 21 మంది భారతీయ సిబ్బందితో కూడిన లైబీరియాకు చెందిన ఎంవీ చెమ్ ప్లుటో నౌకపై డిసెంబర్ 23న భారత పశ్చిమ తీరంలో డ్రోన్ దాడి జరిగింది. భారత్ వైపు చమురుతో వస్తున్న మరో నౌకపై ఎర్ర సముద్రంలో డ్రోన్ దాడి జరిగింది. మాల్టాకు చెందిన ఎంవీ రుయెన్ అనే నౌకను పైరేట్లు డిసెంబర్ 14న హైజాక్ చేశారు. -
భారత నేవీ డేరింగ్ ఆపరేషన్.. వాళ్లంతా సేఫ్
సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైన కార్గో(వాణిజ్య) నౌక 'ఎంవీ లిలా నార్ఫోక్'లో 15 మంది భారతీయులతో సహా మొత్తం 21మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. వీరందరిని రక్షించినట్లు భారత నావికాదళం శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి ఆ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. నౌకాదళానికి చెందిన ఎలైట్ మెరైన్ కమాండోలు ఓడలో శానిటైజేషన్ ఆపరేషన్లు నిర్వహించి.. హైజాకర్లు లేరని నిర్ధారించినట్లు పేర్కొంది కాగా లైబీరియా జెండాతో ఉన్న నౌక సోమాలియా తీరంలో(అరేబియన్ సముద్రం) హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ హైజాకింగ్ గురించి వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సిబ్బంది సందేశం పంపింది. గురువారం సాయంత్రం గుర్తుతెలియని సాయుధులు నౌకలోకి ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొంది. ఇందులో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భారత నౌకాదళం స్పందించింది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. తాజాగా హైజాక్‌కు గురైన నౌకలోని 21 మందిని రక్షించింది. The rescue operations of the hijacked vessel MV Lili Norfolk, by the Indian Navy warship INS Chennai, were seen live by the Indian Navy officials at the naval headquarters using the feed sent by the MQ-9B Predator drones of force. Soon after the piracy incident was reported last… pic.twitter.com/rzqP2ZulXm — ANI (@ANI) January 5, 2024 -
15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’
సోమాలియా సముద్ర తీరంలో లైబీరియా షిప్ హైజాక్ చేయబడినట్లు తెలుస్తోంది. ఎంవీ లీలా నార్ఫోక్(MV LILA NORFOLK) అనే లైబీరియన్ షిప్లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన సమాచారాన్ని అందుకున్న భారత నేవి అప్రమత్తమైంది. అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి ఐఎన్ఎస్ చెన్నైను పంపినట్లు ఇండియన్ నేవి పేర్కొంది. ఇడియన్ నేవి ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో హైజాక్ అయిన షిప్ కదలికలు గమనిస్తున్నామని నేవి అధికారులు పేర్కొన్నారు. హైజాక్ అయిన షిప్, అక్కడి పరిస్థితులకు తెలుసుకోవడానికి కమ్మూనికేషన్ లింక్‌ను సృష్టించామని తెలిపారు. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఇండియన్ నేవి పేర్కొంది. లైబీరియాన్ షిప్ హైజాక్ అయినట్లు గురువారం యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ పోర్టల్( UKMTO)కు సందేశం వచ్చిందని ఇండియాన్ నేవి తెలిపింది. ఆ షిప్లో ఐదు నుంచి ఆరు మంది గుర్తు తెలియని సాయుధులు ఉన్నట్లు పోర్టల్‌కు వచ్చిన సందేశంలో ఉన్నట్లు పేర్కొంది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఇండియన్ నేని.. ఎయిర్ క్రాఫ్ట్తో పర్యవేక్షిస్తూ ఐఎన్ఎస్ చెన్నైను సోమలియా సముద్ర తీరానికి పంపినట్లు తెలిపింది. చదవండి: అమెరికా హెచ్చరించినా.. వెనక్కి తగ్గని హౌతీలు -
అరేబియా సముద్రంలో నౌక హైజాక్ !
న్యూఢిల్లీ: మాల్టా దేశానికి చెందిన సరుకు రవాణా నౌక ఒకటి అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైంది. ఈ ఘటన జరిగినపుడు నౌకలో 18 మంది సిబ్బంది ఉన్నారు. హైజాక్ విషయం తెల్సుకున్న భారత నావికాదళాలు వెంటనే స్పందించి ఆ వైపుగా పయనమయ్యాయి. సముద్రపు దొంగలు ఆ నౌకను తమ అ«దీనంలోకి తీసుకుని నడుపుతుండగా భారత యుద్ధనౌక దానిని విజయవంతంగా అడ్డుకుంది. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నట్లు భారత నావికాదళం శనివారం తెలిపింది. ప్రస్తుతం నౌక సోమాలియా తీరం వైపుగా వెళ్తోంది. సంబంధిత వివరాలను ఇండియన్ నేవీ వెల్లడించింది. అరేబియా సముద్ర జలాల్లో గురువారం ‘ఎంవీ రుయెన్’ నౌకను ఆరుగురు సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. పైరేట్లు నౌకలోకి చొరబడుతుండగానే నౌకలోని సిబ్బంది ఆ విషయాన్ని బ్రిటన్ సముద్ర రవాణా పోర్టల్‌కు అత్యవసర సందేశం(మేడే)గా తెలియజేశారు. హైజాక్ విషయం తెల్సిన వెంటనే భారత నావికా దళాలు అప్రమత్తమయ్యాయి. అదే ప్రాంతంలో గస్తీ కాస్తున్న భారత గస్తీ విమానం, గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వద్ద విధుల్లో ఉన్న భారత నావికాదళ యాంటీ–పైరసీ పెట్రోల్ యుద్ధనౌకలు రంగంలోకి దిగాయి. హైజాక్‌కు గురైన నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అటుగా దూసుకెళ్లి ఆ నౌకను శనివారం ఉదయం విజయవంతంగా అడ్డుకున్నాయి. ‘ రవాణా నౌకల సురక్షిత ప్రయాణానికి భారత నావికాదళం కట్టుబడి ఉంది. అంతర్జాతీయ భాగస్వాములు, మిత్ర దేశాలకు సాయపడటంతో ఎప్పుడూ ముందుంటుంది’ అని భారత నేవీ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. -
గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తి
సాక్షి, విశాఖపట్నం: ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయ సాంకేతికతను అభివృద్ధి చేయడంలో భారత నౌకాదళం ముఖ్య భూమిక పోషిస్తోంది. గ్యాస్ టర్బైన్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తిని సాధించింది. విశాఖలోని ఇండియన్ నేవీ నేవల్ బేస్ ఐఎన్ఎస్ ఏకశిలలో ఈ సాంకేతికత అభివృద్ధి జరిగింది. గ్యాస్ టర్బైన్ కంప్రెసర్ బ్లేడ్ల తయారీ ఇకపై మేడ్ ఇన్ ఇండియాగా రానున్నట్లు ఇండియన్ నేవీ చీఫ్ మెటీరియల్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సందీప్ నత్వానీ తెలిపారు. డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావుతో కలిసి సందీప్ నత్వానీ ఐఎన్ఎస్ ఏకశిలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జీటీసీ బ్లేడ్ల తయారీకి సంబంధించిన డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఇకపై ఇతర ప్రాంతాలకు జీటీసీ బ్లేడ్లను ఎగుమతి చేసేందుకు అనుమతులు రాబోతున్నాయని వైస్ అడ్మిరల్ నత్వానీ తెలిపారు. -
నేవీలో 10వేల మందికి పైగా సిబ్బంది కొరత
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో కీలక విభాగమైన భారత నావికాదళంలో సిబ్బంది కొరత భారీస్థాయిలో ఉంది. ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా శుక్రవారం పార్లమెంట్లో కేంద్రం తెలిపిన వివరాల ఆధారంగా ఈ విషయం వెల్లడైంది. అక్టోబర్ 31వ తేదీ నాటికి నౌకాదళంలో మొత్తంగా 10,896 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిలో ఆఫీసర్ ర్యాంక్ పోస్టులే 1,777 దాకా ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. -
ఎవరీ ప్రేరణ దేవస్థలి? ఏకంగా యుద్ధ నౌకకే..!
మహిళలు ఏ రంగంలోనై అలవోకగా దూసుకోపోగలరు అని రుజువు చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని రంగాలు పురుషులు మాత్రమే నెగ్గుకు రాగలరు అన్న దృక్పథాన్ని మార్చి అత్యంత కఠినతరమైన పనును కూడా చేయగలమని నిరూపించారు చాలామంది మహిళామణులు. ఫైర్ ఫైటర్ దగ్గర నుంచి లారీ డ్రైవర్ వరకు వివిధ రంగాల్లో తామెంటో నిరూపించుకున్నారు. మహిళ తలుచుకుంటే దేన్నేనా సాధించగలదు. ఆఖరికి యుద్ధ రంగంలో కూడా పురుషుడితో సమానంగా దాడి చేయలగలదు అనే ఆలోచనకు తెర తీసింది. ఇప్పుడిప్పడే మహిళలకు సాయుధ రంగంలో అవకాశాలు వస్తున్నాయి. ఇక యుద్ధ నౌకలకు ఇప్పటి వరకు షురుషులే కమాండర్‌గా విధులు నిర్విర్తించగా, ఇప్పుడు ఆ అత్యనన్నత అధికారం ఓ మహిళ చేపట్టి అందరికి ప్రేరణగా నిలిచింది. వివరాల్లోకెళ్తే..భారత నావికదళ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిణిగా నిలిచింది 'ప్రేరణ దేవస్థలీ'. పేరుకు తగ్గట్టుగానే అందరికి ప్రేరణగా నిలిచింది. అంచెలంచెలుగా భారత నావికదళంలో ఉన్నత పదవులను అలంకరించింది. ఆమె ప్రస్తుతం చైన్నైలోని యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌కి ఫస్ట్ లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తోంది. ఆమె ఇప్పుడు ఓ యుద్ధ నౌకకే నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ఈ మేరకు వెస్ట్రన్ ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ ప్రవీణ్ నాయర్ నుంచి నియామక పత్రాన్ని అందుకున్నారు. ఇలా ఓ యుద్ధ నౌకకు నాయకత్వం వహించిన తొలి మహిళగా ప్రేరణ దేవస్థలి నిలిచింది. ఆమె ఇప్పుడు ఇండియన్ నేవీ వెస్ట్రన్ ఫ్లీట్‌లో వాటర్ జెట్ ఫ్యాక్ ఐఎన్ఎస్ ట్రింకాట్ కమాండింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించనుంది. ఆమె లెఫ్టినెంట్ కమాండర్ హోదాలో ఉండగా, టుపోలెవ్ టీయూ-42లో సముద్ర నిఘా విమానాల అబ్జర్వర్‌గా గుర్తింపు పొందారు. ఆమె 2009లో భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. ఆమె సోదరుడు, భర్త కూడా నావికదళ అధికారులే కావడం విశేషం. ప్రేరణ ఈ అత్యున్నత హోదాని దక్కించుకుని మహిళలు పురుషులకు ఎందులోనూ తీసిపోరు అని ప్రూవ్ చేసింది. Lt Cdr Prerna Deosthalee, First Lt #INSChennai, on being selected as Commanding Officer of Waterjet FAC #INSTrinkat, was presented the appointment letter by #FOCWF RAdm Praveen Nair. She would be the first woman officer of @indiannavy to command an Indian Naval Warship@IN_WNC pic.twitter.com/mPTS1UjpNd — The Sword Arm (@IN_WesternFleet) December 2, 2023 (చదవండి: అక్కాచెల్లెళ్ల హెల్త్ఫుల్ సప్లిమెంట్స్!) -
ఐఎన్ఎస్ డేగాను సందర్శించిన రాజస్థాన్ విద్యార్థులు
సాక్షి, విశాఖపట్నం: రాజస్థాన్‌కు చెందిన డైసీ డేస్ ఇంటర్నేషనల్ స్కూల్‌కు చెందిన 200 మంది విద్యార్థులు బుధవారం ఐఎన్ఎస్ డేగాను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఇండియన్ నేవీ ఎయిర్ స్క్వాడ్రన్ ఫాంటమ్స్ బృందం ముఖాముఖి నిర్వహించింది. నౌకాదళంపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడంతో పాటు భారత సాయుధ దళాల్లో చేరేలా చిన్నప్పటి నుంచే వారిని ప్రేరేపించేందుకు ఏటా ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తూర్పు నౌకాదళం అధికారులు చెప్పారు. -
యుద్ధనౌక సూరత్.. సిద్ధమైంది.!
సాక్షి, విశాఖపట్నం: తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది. అరేబియా సముద్ర జలాల్లో కీలకంగా ఉంటూ క్షిపణుల్ని తీసుకెళ్లడమే కాకుండా.. మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది. ఈ నౌక నిర్మాణంలో కీలకమైన క్రెస్ట్ (శిఖరావిష్కరణ) కార్యక్రమాన్ని సోమవారం సూరత్‌లో నిర్వహించనున్నారు. అనంతరం తుది దశ పరిశీలనల తర్వాత భారత నౌకాదళానికి అప్పగించనున్నారు. ముంబైలో తయారైన ఈ యుద్ధ నౌక గంటకు 56 కి.మీ. వేగంతో దూసుకుపోతూ శత్రు సైన్యంలో వణుకు పుట్టించగలదు. ప్రాజెక్టు–15బీలో చివరి యుద్ధ నౌక.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో రూ. 35,800 కోట్లతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లని పెట్టాలని నిర్ణయించారు. తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. 2011 జనవరి 28న ఈ ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఇప్పటికే ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌకలు భారత నౌకాదళంలో చేరాయి. తాజాగా చివరి నౌకగా ఐఎన్ఎస్ సూరత్ వార్ షిప్ కూడా విధుల్లో చేరేందుకు సిద్ధమైంది. ఈ షిప్‌కు సంబంధించి 2018 జూలైలో కీల్ నిర్మించగా.. 2022 మే 17న షిప్ తయారీ పనుల్ని బ్లాక్ కనస్ట్రక్షన్ మెథడాలజీ సాంకేతికతతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్) ప్రారంభించింది. ఈ నౌకకు తొలుత గుజరాత్లో ప్రధాన ఓడరేవు అయిన పోర్బందర్ పేరు పెట్టాలని నౌకాదళం భావించింది. తర్వాత.. రక్షణ మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు ఐఎన్ఎస్ సూరత్‌గా నామకరణం చేశారు. ఈ 4 షిప్స్‌ని 2024 కల్లా నౌకాదళానికి అప్పగించాలని ఒప్పందం. కాగా, తుదిదశకు ఐఎన్ఎస్ సూరత్ పనులు చేరుకున్న తరుణంలో ముఖ్యమైన క్రెస్ట్ (యుద్ధనౌకకు సంబంధించి ప్రత్యేకమైన సంప్రదాయ చిహ్నం. క్రెస్ట్ పూర్తయితే నౌక జాతికి అంకితం చేసేందుకు సిద్ధమైనట్లే.) ఆవిష్కరణ సూరత్‌లో జరగనుంది. అనంతరం తుది దశ ట్రయల్స్ నిర్వహించి నౌకాదళానికి అప్పగించనున్నారు. బ్రహ్మోస్‌ను మోసుకెళ్లగల సామర్థ్యం విశాఖపట్నం–క్లాస్ స్టెల్త్ గైడెడ్–మిసైల్ డిస్ట్రాయర్ యర్ నౌకల్లో ఆఖరిది ఐఎన్ఎస్ సూరత్. విశాఖపట్నం క్లాస్ యుద్ధ నౌకలన్నీ బ్రహ్మోస్ క్షిపణుల్ని మోసుకెళ్లగల సామర్థ్యంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోదగ్గ ఐఎన్ఎస్ సూరత్‌ను అత్యాధునిక ఆయుధ సెన్సార్లు, అధునాతన ఫీచర్లు, పూర్తిస్థాయి ఆటోమేషన్తో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించారు. ఈ యుద్ధనౌక భారత నౌకాదళ బలాన్ని మరింత పెంచుతుందనడంలో సందేహం లేదని రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌక విశేషాలు.. బరువు: 7,400 టన్నులు పొడవు: 163 మీటర్లు బీమ్: 17.4 మీటర్లు డ్రాఫ్ట్: 5.4 మీటర్లు వేగం: గంటకు 30 నాటికల్ మైళ్లు (56 కిమీ) స్వదేశీ పరిజ్ఞానం: 80 శాతం పరిధి: 45 రోజుల పాటు ఏకధాటిగా 8 వేల నాటికల్ మైళ్లు ప్రయాణం చేయగల సత్తా సిబ్బంది– 50 మంది అధికారులు, 250 మంది సిబ్బంది సెన్సార్స్, ప్రాసెసింగ్ వ్యవస్థలు– మల్టీ ఫంక్షన్ రాడార్, బ్యాండ్ ఎయిర్ సెర్చ్ రాడార్, సర్ఫేస్ సెర్చ్ రాడార్ ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు విమానాలు: రెండు వెస్ట్‌ల్యాండ్ సీకింగ్ విమానాలు లేదా రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాలు తీసుకెళ్లగలదు ఏవియేషన్ ఫెసిలిటీ: రెండు హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యే సౌకర్యం ఎల్రక్టానిక్ వార్ఫేర్: డీఆర్డీవో శక్తి సూట్, రాడార్ ఫింగర్ ప్రింటింగ్ సిస్టమ్ ఏర్పాటు, 4 కవచ్ డెకాయ్ లాంచర్లు, 2 కౌంటర్ టార్పెడో సిస్టమ్స్. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
సింథియా(విశాఖ పశి్చమ): భారత నావికాదళంలోని తూర్పు నావికా విభాగం బ్రహ్మోస్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. బంగాళాఖాతంలో పరీక్షలో భాగంగా నావికాదళానికి చెందిన విధ్వంసకనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఈ క్షిపణి నిర్దేశించిన కచి్చత పరామితులను అందుకుందని ఇండియన్ నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. పరీక్ష తాలూకు ఫొటోను భారత నేవీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసింది. -
ఎటువంటి ఆధారాలు లేవు..నేవీ మాజీ అధికారి సుగుణాకర్ బంధువు షాకింగ్ నిజాలు..!
-
మహేంద్రగిరి జల ప్రవేశం
ముంబై: భారత నావికాదళం సామర్థ్యాన్ని మరింత పెంచే మహేంద్రగిరి యుద్ధనౌక శుక్రవారం ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఈ యుద్ధనౌకను జలప్రవేశం చేయించారు. మహేంద్రగిరిని ప్రారంభించడం మన నావికాదళ చరిత్రలో కీలక మైలురాయిగా ధన్‌ఖడ్ సందర్భంగా అభివర్ణించారు. భారత సముద్ర నావికాశక్తికి రాయబారిగా మహా సముద్ర జలాల్లో త్రివర్ణపతాకాన్ని మహేంద్రగిరి సగర్వంగా రెపరెపలాడిస్తుందని ఆయన పేర్కొన్నారు. ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) మహేంద్రగిరిని తయారు చేసింది. ప్రాజెక్ట్ 17ఏ సిరీస్‌లో ఇది ఏడోదని అధికారులు తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతికి, ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు, సముద్ర జలాల్లో మన ప్రయోజనాలను రక్షించుకునేందుకు నావికాదళాన్ని ఆధునీకరణ చేయడం ఎంతో అవసరమన్నారు. హిందూమహా సము ద్ర ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయాలు, భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా కూడా ఈ అవసరం ఎంతో ఉందని చెప్పారు. మహేంద్రగిరిలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థల్లో 75 శాతం దేశీయంగా తయారైనవే కావడం గర్వకారణమని పేర్కొన్నారు. -
సిద్ధమైన యుద్ధనౌక
సింథియా: ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో ప్రాజెక్ట్ 17–ఏ ఫ్రిగేట్స్‌లో భాగంగా 7వ యుద్ధనౌక మహేంద్రగిరిని సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. అధునాతన ఆయుధాలు, సెన్సార్లు, ఫ్లాట్‌ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌తో సాంకేతికంగా అభివృద్ధి చెందిన యుద్ధనౌకగా రూపొందింది. పూర్తి స్వదేశీ రక్షణ సామర్థ్యంతో భవిష్యత్‌లో భారతదేశం గొప్ప నావికా వారసత్వానికి చిహ్నంగా నిలవనుందని తయారీదారులు అభివర్ణించారు. ప్రాజెక్ట్–17ఏ కింద మొత్తం 4 నౌకలు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ సారథ్యంలో నిర్మించగా.. మరో 3 నౌకలను జీఆర్ఎస్ఈ ద్వారా నిర్మిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ దృఢ నిబద్ధతకు అనుగుణంగా ఇండియన్ నేవీకి చెందిన వార్‌షిప్ డిజైన్ బ్యూరో ద్వారా షిప్ అంతర్గత నిర్మాణాలు రూపుదిద్దుకున్నాయి. దేశం గర్వించదగ్గ యుద్ధనౌకగా మహేంద్రగిరి రూపొందినట్టు ఇండియన్ నేవీ వర్గాలు తెలిపాయి. ఈ యుద్ధనౌకను ఉప రాష్ట్రపతి జయదీప్ ధన్కర్ భార్య సుదేశ్ ధన్కర్ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. -
దేశ భద్రతకు‘పంచ’ కవచాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటి వరకు షిప్ రిపేర్ హబ్‌గా మాత్రమే కొనసాగుతున్న విశాఖపట్నం హిందూస్థాన్ షిప్‌యార్డ్.. త్వరలోనే షిప్ బిల్డింగ్ హబ్‌గా అత్యుత్తమ సేవలందించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారించిన షిప్‌యార్డ్ అందుకోసం భారత నౌకాదళంతో కీలక ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ క్రమంలో రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దేశ చరిత్రలో ఏ షిప్‌యార్డ్ నిర్మించని విధంగా ఏకంగా 44 వేల టన్నుల షిప్స్‌ని నిర్మించనున్న హెచ్ఎస్ఎల్... 2027 ఆగస్ట్‌లో తొలి యుద్ధనౌకని ఇండియన్ నేవీకి అప్పగించనుంది. యుద్ధ విన్యాసాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా షిప్ డిజైన్లతో పాటు.. రక్షణ వ్యవస్థలోనే కాకుండా.. విపత్తు నిర్వహణకు వినియోగించేలా షిప్‌లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల విషయంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ అపవాదు మూటకట్టుకుని.. తొమ్మిదేళ్లకు పూర్తి చేయడంతో షిప్యార్డ్డ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఐఎన్ఎస్ సింధువీర్ మరమ్మతుల్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఆ మరకని తుడిచేసుకున్న షిప్‌యార్డ్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ.. ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హెచ్ఎస్ఎల్.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీ గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్ పనుల్ని ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. మొత్తంగా హిందుస్థాన్ షిప్‌యార్డ్ పనితీరుతో విశాఖ.. షిప్ బిల్డింగ్ కేంద్రంగా మారుతోంది. రూ.19 వేల కోట్లు.. 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,038 కోట్ల టర్నోవర్ సాధించిన షిప్‌యార్డ్ .. ఈ ఏడాది ఏకంగా రూ.19,048 కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్)ను భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు కోసం తయారు చేసేందుకు శుక్రవారం భారత రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.హైవాల్యూస్‌తో ఈ నౌకల నిర్మాణాలు చేపట్టనుంది. దేశంలోని ఏ షిప్‌యార్డ్‌లోనూ లేనివిధంగా ఏకంగా 44 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యమున్న నౌకల్ని తయారు చేయనుంది. ఈ నౌకల నిర్మాణాలతో 2023–24 నుంచి హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం రూ.1,038 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న íషిప్‌యార్డ్ .. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 నుంచి 2 వేల కోట్ల రూపాయలకు చేరుకోనుంది. 8 సంవత్సరాల కాల పరిమితితో ఈ షిప్స్‌ని తయారు చేయనుంది. తొలి షిప్‌ని 2027 ఆగస్ట్ 24న భారత నౌకాదళానికి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్లలో మరింత అభివృద్ధి.. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా.. షిప్‌యార్డ్‌ను ఆధునికీకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ.1,000 కోట్లతో యార్డుని రానున్న మూడేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్లిప్‌వేలు 190 మీటర్లుండగా వీటిని 230 మీటర్లకు పెంచనున్నారు. ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మరమ్మతులు, నౌకా నిర్మాణాలకు అనుగుణంగా రూ.5 వేల కోట్లతో మెటీరియల్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 364 వెండార్ బేస్డ్ ఎంఎస్ఎంఈల సహకారం తీసుకుంటున్నారు. లక్షల మందికి ఉపాధి టెండర్లు దక్కించుకోవడంలో దూకుడు పెంచాం. తాజాగా 50 టన్స్ బొలార్డ్ పుల్ టగ్ బాల్‌రాజ్ మరమ్మతులు పూర్తి చేసి నేవల్ డాక్‌యార్డు (విశాఖపట్నం)కు అందించాం. అందుకే.. ఆర్డర్లు కూడా పెద్ద ఎత్తున సొంతం చేసుకుంటున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం.. షిప్‌యార్డ్ భవిష్యత్తుని మార్చబోతోంది. ఈ ఎంవోయూ ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. విశాఖ భవిష్యత్తు కూడా మారబోతుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా.. మేక్ ఇన్ ఇండియాని చాటిచెప్పేలా షిప్స్ తయారు చేస్తాం. దేశీయ నౌకల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. సబ్మెరైన్ల నిర్మాణం, రీఫిట్‌కు సంబంధించిన సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పనతో మరింత ఆధునికీకరించుకునేందుకు రష్యాతోనూ సమగ్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. – కమోడోర్ హేమంత్ ఖత్రి, హిందుస్థాన్ షిప్‌యార్డు సీఎండీ -
క్షిపణుల డిజైన్‌లో స్టార్టప్‌లను భాగస్వాములను చేయాలి
సాక్షి, విశాఖపట్నం: క్షిపణుల మరమ్మతులు, డిజైన్లలో స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలను భాగస్వాములను చేస్తే ఆత్మ నిర్భర్ భారత్ దిశగా మరింత పురోగతి సాధించవచ్చని డీఆర్డీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ వై.శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం(ఈఎన్సీ) ప్రధాన కేంద్రానికి అనుబంధంగా ఉన్న ఐఎన్ఎస్ కళింగ బేస్‌లో గురువారం ‘అమృత్–2023’ పేరుతో మిసైల్ టెక్నాలజీ కాంక్లేవ్, సింపోజియం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ శ్రీనివాసరావు, ఈఎన్సీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సమీర్ సక్సేనా ప్రారంభించారు. డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ మిషన్‌కు అనుగుణంగా ఇండియన్ పబ్లిక్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, డీఆర్డీవో ల్యాబ్స్, అకాడమీ, ఇండియన్ నేవీ ముందుకువెళ్తుండటం శుభపరిణామమని చెప్పారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా రక్షణ పరిశ్రమ ప్రధాన సామర్థ్యాలను బలోపేతం చేయాలని సూచించారు. -
రక్షణ రంగానికి బ్రాండ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారేందుకు, నేవల్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి విశాఖపట్నంలో పుష్కల అవకాశాలున్నాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్ డా.వై శ్రీనివాసరావు అన్నారు. నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ(ఎన్ఎస్టీఎల్)లో శనివారం జరిగిన 54వ ల్యాబ్ రైజింగ్ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖపట్నంలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందితే అత్యవసర పరిస్థితుల్లో సహకారం అందించేందుకు అవసరమైన మానవ వనరులు, మెషినరీ అందుబాటులోకి వస్తాయి. నేవల్ డిఫెన్స్ అంటే విశాఖ గుర్తుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్తాన్ షిప్‌యార్డు, పోర్టులకు సంబంధించిన పరికరాలు, కమర్షియల్ నేవీ, ఇండియన్ నేవీకి ఏ పారిశ్రామిక సహకారం కావాలన్నా.. విశాఖ అత్యంత ముఖ్యమైన వనరు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తే.. విశాఖలో నేవల్ ఎకో సిస్టమ్ మరింత అభివృద్ధి చెందుతుంది. డాక్‌యార్డు, ఎన్ఎస్టీఎల్, నేవీ, షిప్‌యార్డుకు సహకారం అందించేలా బీఈఎల్ మాదిరిగా ఎల్అండ్టీ వంటి సంస్థలు వస్తే.. ఆ వెంటే ఎంఎస్ఎంఈలు కూడా ఏర్పాటవుతాయి. తద్వారా విశాఖ రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారే అవకాశముంది. విశాఖ సమీప ప్రాంతాల్లో పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, రాజమండ్రి ఎయిర్‌పోర్టు, రైల్వే వ్యవస్థ కూడా ఉన్నందున.. అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం పట్టదు. సొంతంగా సబ్మెరైన్లు, టార్పెడోలు.. సముద్ర గర్భంలోనూ సత్తా చాటే దిశగా అడుగులు పడుతున్నాయి. వరుణాస్త్ర విజయవంతమైంది. హెవీ వెయిట్, లైట్ వెయిట్ టార్పెడో ప్రయోగాలు విజయవంతమయ్యాయి. బ్యాటరీ ప్రొపల్షన్ టార్పెడోలు ప్రస్తుతం కీలకంగా మారాయి. క్షణాల్లో టార్పెడోలు దూసుకుపోయేలా బ్యాటరీల రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. టార్పెడోలను సమర్థంగా కంట్రోల్ చేసే వ్యవస్థ కూడా సిద్ధమవుతోంది. నౌకలు, సబ్మెరైన్ల మోడల్ టెస్టింగ్స్ కోసం ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు అన్ని షిప్‌యార్డులూ ఎన్ఎస్టీఎల్ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు సబ్మెరైన్లను సొంతంగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే యుద్ధ విమానాలు, సబ్మెరైన్లు, యుద్ధ నౌకల ఉనికిని శత్రుదేశాలు పసిగట్టకుండా అడ్డుకునే స్టెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నాం. శత్రుదేశాలు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా.. దాని నుంచి తప్పించుకునేందుకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకూ ప్రయోగాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు -
స్వావలంబనకు చిహ్నం ‘వింధ్యగిరి’
కోల్‌కతా: భారత నౌకాదళం కోసం దేశీయంగా నిర్మించిన యుద్ధ నౌక ‘వింధ్యగిరి’ దేశ స్వావలంబనకు చిహ్నమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చెప్పారు. గురువారం ఆమె కోల్‌కతాలోని హుగ్లీ తీరంలో ఉన్న గార్డెన్ రీచ్ షిప్‌యార్డులో వింధ్యగిరిని జలప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఆత్మనిర్భర్ భారత్‌కు, దేశం సముపార్జించిన సాంకేతిక ప్రగతికి ఇది నిదర్శనమన్నారు. సముద్ర జలాలపై భారత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఇదొక ముందడుగని చెప్పారు. కార్యక్రమంలో పశ్చిమబెంగాల్ గవర్నర్ ఆనందబోస్, సీఎం మమతా బెనర్జీ పాల్గొన్నారు. దేశీయంగా ఏడు యుద్ధ నౌకల తయారీ లక్ష్యంతో కేంద్రం 2019లో ‘ప్రాజెక్ట్ 17 ఆల్ఫా’చేపట్టింది. 2019–22 వరకు అయిదు యుద్ధ నౌకలను నిర్మించి, నేవీకి అప్పగించారు. ఈ ప్రాజెక్టులో వింధ్యగిరి ఆరోది. ఆధునిక ఈ నౌకలో వినియోగించిన పరికరాలు, వ్యవస్థలు 75 శాతం వరకు దేశీయంగా తయారైనవి. విస్తృత ట్రయల్స్ తర్వాత భారత నేవీకి అప్పగించనున్నారు. సుమారు 149 మీటర్ల పొడవైన పీ17ఏ రకం ఈ యుద్ధ నౌకల్లో గైడెడ్ మిస్సైల్స్ ఉంటాయి. భూమి, ఆకాశం, నీటి లోపలి నుంచి ఎదురయ్యే విపత్తులను గుర్తించి నిర్వీర్యం చేయగలవు. -
‘సాగర్ కవచ్’ కవాతు ప్రారంభం
సాక్షి,విశాఖపట్నం: దేశంలో రెండో అతి పెద్ద తీరాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ వెంబడి ఉన్న సముద్ర జలాల పరిధిలో సమగ్ర తీర భద్రతపై 2 రోజుల పాటు నిర్వహించనున్న ‘సాగర్ కవచ్’ కవాతు బుధవారం ప్రారంభమైంది. సముద్ర సంబంధిత భద్రతా వ్యవస్థలతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. 2008 నవంబర్ 26న ముంబై ఉగ్రదాడి తర్వాత తీర భద్రతపై దృష్టిసారించిన భారత్.. ప్రతి ఏటా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాల్లో సాగర్ కవచ్‌ని నిర్వహిస్తోంది. భారత నౌకాదళం, ఇండియన్ కోస్ట్‌గార్డ్, స్టేట్ మెరైన్ పోలీస్, కస్టమ్స్, మత్స్యశాఖ, పోర్టు అథారిటీలు, డీజీఎల్ఎల్తో పాటు ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు, ఏజెన్సీలు, మారీటైమ్ డొమైన్లో భాగస్వాములైన ఏజెన్సీలు ఈ సాగర్ కవచ్‌లో పాల్గొంటున్నాయి. సముద్ర జలాల్లో ఆయా కేంద్ర, రాష్ట్ర రక్షణ విభాగాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం, విభాగాల వారీగా బలబలాల్ని నిరూపించుకునేలా ఈ కార్యక్రమం జరుగుతుంది. వనరుల దోపిడీ జరగకుండా ఏవిధమైన భద్రతని పెంపొందించాలనే అంశాలపైనా ఆయా విభాగాలు చర్చించుకుంటాయి. ఏపీ తీరం వెంబడి పూర్తిస్థాయి భద్రత వలయాన్ని నిర్మించేందుకు మత్స్యకారుల నుంచి ఎలాంటి సహకారం అందుతుంది? వారిని ఎలా సుశిక్షుతుల్ని చేయాలనేదానిపైనా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ విన్యాసాల్ని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుండగా.. విశాఖలోని కోస్ట్‌గార్డ్ తూర్పు ప్రధాన కార్యాలయం నుంచి సమన్వయ సహకారం జరుగుతోంది. సముద్ర జలాల్లో ఏ చిన్న శత్రు సంబంధిత సమాచారం దొరికినా..పోలీస్(100) లేదా కోస్టల్ సెక్యూరిటీ పోలీస్‌కు సంబంధించి 1093 లేదా ఇండియన్ కోస్ట్‌గార్డు హెల్ప్‌లైన్ నంబర్ 1554కి సమాచారం అందించాలని రక్షణ విభాగాలు విజ్ఞప్తి చేశాయి. గురువారం సాయంత్రంతో సాగర్ కవచ్ ముగియనుంది. -
సత్తా చాటిన భారత నౌకాదళం
న్యూఢిల్లీ: ఇటీవలికాలంలో ఎన్నడూలేనంతగా భారత నౌకా దళం ఒకేసారి భారీ సంఖ్యలో నౌకలు, జలాంతర్గాములతో యుద్ధవిన్యాసం చేసి ఔరా అనిపించింది. అరేబియా సముద్రం ఇందుకు వేదికైంది. ట్విన్ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్(సీబీజీ) ఆపరేషన్స్ పేరిట నిర్వహించిన ఈ యుధ్ధవిన్యాసం నౌకాదళ పోరాట పటిమను ప్రపంచానికి మరోమారు తెలియజెప్పిందని భారత నౌకాదళ తర్వాత ఒక వీడియోను ట్విట్‌చేసింది. యుద్ధవిమాన వాహకనౌకలైన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్‌లుసహా పలు రకాల యుద్ధనౌకలు, జలాంతర్గాములు, 35కుపైగా యుద్ధవిమానాలను సమన్వయం చేసుకుంటూ ఏకకాలంలో ఈ ఆపరేషన్స్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు భారత నౌకాదళం ప్రకటించింది. మిగ్–29కే, ఎంహెచ్ 60ఆర్, కమోవ్, అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు సైతం ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయని నేవీ అధికారులు శనివారం చెప్పారు. అయితే ఈ ఆపరేషన్స్‌ను ఎప్పుడు నిర్వహించారో వెల్లడించలేదు. సముద్ర ఆధారిత గగనతల శక్తిసామర్థ్యాలు, హిందూమహా సముద్ర జలాలు, ఆవల సైతం భద్రతా భాగస్వామిగా భారత కీలకపాత్రను ఈ ఆపరేషన్ చాటిచెప్పిందని నేవీ ప్రతినిధి వివేక్ మథ్వాల్ వ్యాఖ్యానించారు. దేశీయ తయారీ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను సెప్టెంబర్‌లో విధుల్లోకి తీసుకున్నాక చేపట్టిన తొలి భారీ విన్యాసమిది. యుద్ధవిమాన వాహకనౌకలు, జలాంతర్గాములు, ఫ్రిగేట్, డెస్ట్రాయర్, ఇతర నౌకలు, హెలికాప్టర్లు, విమానాలు ఇలా అన్నింటి కలపుకుంటూ కదనరంగంలోకి దిగితే ఈ బృందాన్ని క్యారియర్ బ్యాటిల్ గ్రూప్(సీబీజీ)/ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు. -
ఎంనెక్–2023కు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ సాత్పురా
సాక్షి, విశాఖపట్నం: ఇండోనేసియాలో జరిగే మల్టీలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ కుమడో(ఎంనెక్)–2023లో పాల్గొనేందుకు తూర్పు నౌకాదళం నుంచి ఐఎన్ఎస్ సాత్పురా యుద్ధ నౌకను భారత నేవీ పంపించింది. సాత్పురాలో మకస్సర్ తీరానికి చేరుకున్న భారత నౌకాదళ బృందానికి అక్కడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ నెల 8 వరకు ఆసియా దేశాల ఆధ్వర్యంలో విన్యాసాలు జరగనున్నాయి. సోమవారం జరిగిన సిటీ పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాల్లో భారత నౌకాదళ బృందం పాల్గొంది. అలాగే ఇండోనేసియాలో త్వరలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో సమీక్ష నిర్వహించారు. ఇందులో సముద్ర భద్రతపై చర్చించారు. చదవండి: Tanguturi Prakasam Pantulu: పుష్పగుచ్చం ఇచ్చి సన్మానం.. పూలకు బదులు పండ్లు తెస్తే తినేవాడినంటూ -
బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించిన నేవీ
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. నేవీకి చెందిన గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ మర్ముగోవాపై నుంచి ప్రయోగించినట్లు ఆదివారం వెల్లడించారు. ఐఎన్ఎస్ మర్ముగోవాతోపాటు బ్రహ్మోస్ క్షిపణి కూడా దేశీయంగా తయారైనవేనని చెప్పారు. సముద్రజలాలపై మన నావికాదళ శక్తిని, దేశ ఆత్మనిర్భరతకు చాటిచెప్పే పరిణామమని వివరించారు. ధ్వని వేగం కంటే మూడు రెట్లు వేగంతో ఇది దూసుకెళ్లిందన్నారు. భారత్–రష్యా ఉమ్మడిగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూమిపై నుంచి సైతం ప్రయోగించేందుకు వీలున్న బ్రహ్మోస్ క్షిపణులను తయారు చేస్తోంది. -
ముమ్మరంగా 'ఆపరేషన్ కావేరి'.. సూడాన్ నుంచి మరో 135 మంది తరలింపు
సూడాన్ అంతర్గత యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కావేరి’ పేరుతో చర్యలు చేపట్టింది. భారత వాయుసేన, నావికా దళాల ద్వారా దశల వారీగా భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా పూడాన్ నుంచి మూడో బ్యాచ్ కూడా బయల్దేరింది. సూడాన్ నుంచి మరో 135 మంది భారతీయులతో రెండో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ C-130J విమానం సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నట్లు విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు మొదటి బ్యాచ్‌లో భాగంగా భారత నావికాదళానికి చెందిన ‘ఐఎన్ఎస్ సుమేధ’ ద్వారా 278 మంది ప్రయాణికులు సూడాన్ పోర్టు నుంచి సౌదీకి చేరుకున్నారని విదేశీ వ్యవహారాలశాఖ పేర్కొంది. రెండో భాచ్‌లో 148 మంది భారతీయులను తొలి విమానంలో స్వదేశానికి తరలించినట్లు తెలిపింది. అయితే వీరిలో 160 మంది భారతీయులు ఢిల్లీ చేరుకున్నారు. కాగా సూడాన్‌లో 3 వేల మందికిపైగా భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. Third batch comprising 135 Indians from Port Sudan arrived in Jeddah by IAF C-130J aircraft. Onward journey to India for all who arrived in Jeddah will commence shortly. #OperationKaveri pic.twitter.com/OHhC5G2Pg8 — V. Muraleedharan (@MOS_MEA) April 26, 2023 -
పర్లలో అధికారక లాంఛనాలతో గోవింద్ అంత్యక్రియలు
-
ధ్రువ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. సిబ్బంది సేఫ్
సాక్షి, ముంబై: భారత నౌకా దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి.. ముంబై తీరంలో బుధవారం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు. ధ్రువ్ హెలికాఫ్టర్ రొటీన్ డ్యూటీలో ఉండగానే.. ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు నేవీ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. అత్యాధునిక తేలికపాటి యుద్ధవిమానం అయిన ధృవ్.. ముంబై తీరంలో ఎమర్జెన్సీ ల్యాండ్ గురించి సమాచారం అందుకున్న వెంటనే నేవీ పెట్రోలింగ్ స్పందించింది. హెలికాఫ్టర్లోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు తెచ్చింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు నేవీ అధికారులు వెల్లడించారు. Indian Navy ALH on a routine sortie off Mumbai ditched close to the coast. Immediate Search and Rescue ensured safe recovery of crew of three by naval patrol craft. An inquiry to investigate the incident has been ordered. — SpokespersonNavy (@indiannavy) March 8, 2023 (చదవండి: మోదీ, షా, నడ్డా సమక్షంలో.. త్రిపుర సీఎంగా డాక్టర్ మాణిక్ సాహా ప్రమాణం) -
నిప్పులు చిమ్ముకుంటూ లక్ష్యానికి...
దొండపర్తి (విశాఖ దక్షిణ): దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయిని సాధించింది. ఐఎన్ఎస్ విశాఖ నుంచి మధ్య శ్రేణి నౌకా విధ్వంసక క్షిపణిని మంగళవారం ప్రయోగించింది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన మిసైల్ విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. అత్యంత వేగంతో దూసుకొచ్చే శత్రు దేశాల యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు, గైడెడ్ బాంబులు, క్రూయిజ్ క్షిపణులు, యుద్ధ నౌకలను సైతం నాశనం చేసే సామర్థ్యం ఈ మధ్యస్థ శ్రేణి క్షిపణికి ఉంది. నేలపై నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే(ఎంఆర్ఎస్ఏఎం) వ్యవస్థ దీనికి ఉంది. 70 కిలోమీటర్ల రేంజ్లో ఉన్న ల క్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల శక్షివంతమైన ఈ క్షిపణి వ్యవస్థను భారత రక్షణ పరిశోధన సంస్థ(డీఆర్డీఓ), ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్ (ఐఏఐ) సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వీటిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. మీడియం రేంజ్ సర్ఫేస్ –టు –ఎయిర్ మిస్సైల్ (ఎంఆర్ఎస్ఏఎం) ప్రత్యేకతలు పరిధి: 70 కిలోమీటర్లు మార్గదర్శకత్వం: డ్యూయల్ (కమాండ్ –యాక్టివ్ రాడార్ సీకర్ (ఆర్ఎఫ్) నియంత్రణ: టీవీఎస్ అండ్ ఏరోడైనమిక్ ప్రొపల్షన్: డ్యూయల్ పల్స్ –సాలిడ్ మోటార్ వార్ హెడ్: ప్రీ–ఫ్రాగ్మెంట్ ప్రయాణ సమయం: 230 సెకన్లు పొడవు: 4500 మిల్లీమీటర్లు వ్యాసం: 225 మిమీ బరువు: 275 కిలోలు లాంచర్: షిప్/వాహనం (నిలువు) లాంచ్. భారత రక్షణ దళం శక్తివంతం ‘ఆత్మనిర్భర్’లో భాగంగా భారత సైన్యం శక్తివంతమైన క్షిపణులను సిద్ధం చేసుకుంటోంది. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే మీడియం రేంజ్ క్షిపణిల తయారీ, అభివృద్ధికి బీడీఎల్‌తో 2017లో ఐఏఐతో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం ఎదురుగా వచ్చే విమానాలు, హెలికాఫ్టర్లు, మిస్సైళ్లను, యుద్ధ నౌకలను సైతం ధ్వంసం చేసేలా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటికే ఒకసారి ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి సుదూర శ్రేణిలో ఉన్న హైస్పీడ్ ఏరియల్ లక్ష్యాన్ని చేధించింది. తాజాగా పరీక్షించిన ఎంఆర్ఎస్ఏఎం వ్యవస్థలో దేశీయంగా అభివృద్ధి చేసిన డ్యుయల్ పల్స్ రాకెట్ మోటర్‌ను వాడారు. అత్యాధునిక రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ద్వారా శత్రు విమానాలు, హెలీకాఫ్టర్లు, యాంటీ షిప్ మిసైళ్లను ధ్వంసం చేస్తుంది. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారతీయ నావికా దళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ– డీఆర్డీఓ దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్ లాంచ్డ్ వెర్షన్‌ను అరేబియా సముద్రంలో పరీక్షించినట్లు సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. భారత్–రష్యా సంయుక్త భాగస్వామ్య బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, విమానాలు, ఓడలతోపాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిని భారత్ ఎగుమతి కూడా చేస్తోంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి యాంటీ షిప్ వెర్షన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో భారత్ విజయవంతంగా ప్రయోగించింది. -
INS Vikrant : తూర్పు నౌకా దళం చారిత్రాత్మక ముందడుగు
ఆత్మ నిర్భర భారత్ దిశ గా భారత్ సొంతంగా రూపొందించిన యుద్ద నౌక విక్రాంత్. ఐఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకా పై తొలి లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్‌ను దింపింది నేవీ సిబ్బంది. తద్వారా భారత రక్షణ రంగంలో నవశకానికి నాంది పలికింది. సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: రక్షణ రంగంలో పాటవ ప్రదర్శనలో భారత నౌకాదళం మరో కీలక అడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ ప్రదర్శనకు వేదికగా మారింది. భారత సముద్రజలాల్లో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా లైట్ కాంబోట్ ఎయిర్‌క్రాఫ్ట్స్(ఎల్సీఏ)ని నేవీ పైలట్లు సోమవారం వేర్వేరు ట్రయల్స్‌లో సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్‌పై స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడం శుభపరిణామమని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు అభినందనలు తెలిపాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకను పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది అతివేగంగా శత్రు లక్ష్యాలపై దాడి చేసే ఈ ఐ ఎన్ ఎస్ విక్రాంత్ యుద్ధనౌక పై అతి వేగంగా ప్రయాణించే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ అయ్యే సదుపాయం ఉంది. ఈ ప్రక్రియ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధనౌకలపై విమానాలు దిగే సాంకేతిక పరిజ్ఞానం భారత్ వినియోగిస్తుంది. ఇప్పుడు భారతదేశ తొలిసారిగా విమాన వాహక యుద్ధనౌకను సిద్ధం చేసుకోవడంపై భారతీయులు గర్వపడుతున్నారు. విక్రాంత్‌పై మిగ్–29కే రయ్..రయ్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా మిగ్–29కే యుద్ధ విమానాలు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. దీనికి సంబంధించిన పరీక్షల్ని సముద్ర జలాల్లో సోమవారం సాయంత్రం విజయవంతంగా నిర్వహించినట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. 2.5 సెకన్లలో 240 నుండి 0 కి.మీ సముద్ర ట్రయల్స్‌లో భాగంగా స్వదేశీ యుద్ధ విమానం తేజస్.. విజయవంతంగా బయలుదేరి విమాన వాహక నౌక ఫ్లైట్ డెక్‌పై ల్యాండ్ అయింది. ఈ నేవల్ వేరియెంట్ జెట్ మిషన్కి నేతృత్వం వహించారు కామ్రేడ్ జైదీప్ మావోలంకర్(రిటైర్డ్). చిన్న నౌక మీద ల్యాండ్ కావడం అంటే చాలా కష్టతరమైన వ్యవహారం. కేవలం 2.5 సెకండ్లలోనే గంటకు 240 కిలోమీటర్ల నుంచి సున్నాకు జెట్‌ను అదుపు చేయడం పైలట్లకు ఛాలెంజ్‌తో కూడిన వ్యవహారం. ఆ టైంలో ల్యాండింగ్‌పై నియంత్రణ కూడా కష్టమేనని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఐఎన్ఎస్ విక్రాంత్.. భారత నౌకాదళం కోసం కేరళలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (CSL) నిర్మించిన విమాన వాహక నౌక. 45,000 టన్నుల బరువున్న ఈ నౌకను.. ₹ 20,000 కోట్ల వ్యయంతో నిర్మించారు. గతేడాది సెప్టెంబర్‌లో ఇది రంగ ప్రవేశం చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్‌తో యుద్ధ విమానాల అనుసంధానం 2023 మే లేదంటే జూన్ నాటికి పూర్తవుతుందని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ గతంలో వెల్లడించారు. మరో విశేషం ఏంటంటే.. ఐఎన్ఎస్ విక్రమాదిత్యా డెక్ మీద తేలికపాటి యుద్ధవిమానం తేజస్ ప్రొటోటైప్‌ను కామ్రేడ్ మావోలంకర్ స్వయంగా ల్యాండ్ చేయడం గమనార్హం. తద్వారా అలాంటి ఘనత సాధించిన కొద్ది దేశాల సరసన భారత్ నిలిచినట్లయ్యింది. -
74th Republic Day: పరేడ్‌లో మహిళా శక్తి
74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగే రిపబ్లిక్ పరేడ్‌లో ఈసారి మహిళా శక్తికి విశేష ప్రాధాన్యం లభించింది. ఆర్మి, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లోనికవాతు బృందాలకు మహిళా ఆఫీసర్లు నాయకత్వం వహించనున్నారు. మొదటిసారి మహిళా ఒంటె దళం కవాతు చేయనుంది. డేర్ డెవిల్స్‌గా స్త్రీల బృందం మోటర్ సైకిల్ విన్యాసాలుచేయనుంది. అనేక శకటాలు మహిళా శక్తిని చాటనున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా స్త్రీ ప్రభావ శక్తికి ఈ పరేడ్ వేదిక కానుంది. గణతంత్ర దినోత్సవం నాడు మన దేశం తన సైనిక తేజాన్ని, సాంస్కృతిక సౌభ్రాతృత్వాన్ని, అంతర్గత వైవిధ్యాన్ని చాటుకుంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు జరిగే సైనిక కవాతు, రాష్ట్ర ప్రభుత్వాల శకటాల విన్యాసం, కళా బృందాల ఆట΄ాటలు. చూడటానికి కళ్లు చాలవు. ఇదంతా కలిసి మన దేశం... మనమంతా కలిసి మన శక్తి అనే భావన ఈ సందర్భంలో కలుగుతుంది. అయితే ఈసారి ఈ ‘మన శక్తి’లో స్త్రీ శక్తికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, త్రివిధ దళాలుప్రాధాన్యం ఇచ్చాయి. అందువల్ల ఈ పరేడ్ స్త్రీ శక్తికి నిదర్శనంగా నిలువనుంది. ముగ్గురు మహిళా సైనికాధికారులు పరేడ్‌లోపాల్గొనే త్రివిధ దళాల కవాతు బృందాలకు పురుష ఆఫీసర్లు నాయకత్వం వహించి ముందు నడవడం ఆనవాయితీ. ఈసారి ముగ్గురు మహిళా ఆఫీసర్లకు నాయకత్వ స్థానం దొరికింది. నావికా దళంలో నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్‌గా పని చేస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ (29) 144 మంది నావికులతో కూడిన కవాతు బృందాలకు నాయకత్వం వహించనుంది. బెంగళూరుకు చెందిన దిశ అమృత్ 2016లో నావికా దళంలో చేరక ముందు ఐటి రంగంలో పని చేసింది. ఎన్సిసి కాడెట్‌గా ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌పాల్గొంటున్న ఆమె ఈసారి ఈ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో మిగ్– 17 పైలెట్‌గా ఉన్న స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి తన దళం తరఫున 144 మంది గగన యోధులతో కవాతు నిర్వహించనుంది. ఇక మేడ్ ఇన్ ఇండియా ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌కు లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ నాయకత్వం వహించనుంది. ‘చిన్నప్పటి నుంచి టీవీలో చూసిన పరేడ్‌లో ఈసారి నేను పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని శర్మ అంది. ఈ ముగ్గురు కాకుండా లెఫ్టినెంట్ డింపుల్ భాటి మోటార్ సైకిల్ విన్యాసాల దళంలో, మేజర్ మహిమ ‘కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్’ బృందాల నాయకత్వంలోపాల్గొననున్నారు. మహిళా శకటాలు ఈసారి పరేడ్‌లో 17 రాష్ట్రాల నుంచి, 6 మంత్రిత్వ శాఖల నుంచి, త్రివిధ దళాల నుంచి శకటాలుపాల్గొననున్నాయి. ఇవి కాకుండా డిఆర్డివో శకటం ఉంటుంది. అయితే వీటిలో చాలా శకటాలు ఈసారి మహిళా శక్తికి ప్రాధాన్యం,ప్రాముఖ్యం ఇచ్చాయి. మూడు సైనిక దళాలు ఈసారి మహిళా కేంద్రిత శకటాలను నడుపుతున్నాయి. టూరిజంలోనూ, సేంద్రియ వ్యవసాయంలోనూ స్త్రీల భాగస్వామ్యంలో వారి స్వయం సమృద్ధికిపాటుపడతాం అనే థీమ్‌తో త్రిపుర శకటం ఉండనుంది. పశ్చిమ బెంగాల్ శకటం యునెస్కో గుర్తింపు పొందిన దుర్గా పూజను ‘మానవత్వానికి అమూర్త వారసత్వ సంపదగా’ అభివర్ణిస్తూ ముందుకు సాగనుంది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘సకల సజీవిత్వాలను సమృద్ధి చేసే అమృత స్త్రీతత్వం’ థీమ్‌తో శకటం నడపనుంది. కేంద్ర హోమ్ శాఖ అయితే ఆరు కేంద్ర బలగాలలో స్త్రీ పోరాట పటిమను ప్రదర్శించే శకటంను ఎంచుకుంది. కేరళ మహిళా సాక్షరత శకటాన్ని, కర్నాటక మహిళా స్వయం సమృద్ధి శకటాన్ని ఈ పరేడ్ దారుల్లో నడిపించనున్నాయి. కళకళలాడే నృత్యాలు వీరందరూ కాకుండా వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలలో విద్యార్థునులు, యువతలు, మహిళా కళాకరులు విశేష సంఖ్యలోపాల్గొననున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి మొదలు వీరంతా తమ సాంస్కృతిక విన్యాసాలను ప్రదర్శించనున్నారు. లెఫ్టెనెంట్ ఆకాష్ శర్మ, స్కాడ్రన్ లీడర్ సింధు రెడ్డి, లెఫ్టినెంట్ కమాండర్ దిశా అమృత్ చారిత్రక దృశ్యం దిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ నేత్రపర్వంగా ఉండటమే కాదు, దేశభక్తి భావాలు ఉ΄÷్పంగేలా కూడా చేస్తుంది. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రత్యేకత... సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) ‘క్యామెల్ కాంటింజెంట్’లో తొలిసారిగా ΄ాల్గొంటున్న మహిళా సైనికులు... దిల్లీలో ఘనంగా జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్)కు చెందిన ‘క్యామెల్ కాంటింజెంట్’ 1976 నుంచి భాగం అవుతోంది. ఈసారి జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌లో మహిళా సైనికులు ‘క్యామెల్ కాంటింజెంట్’లో భాగం కావడం చారిత్రక ఘట్టం కానుంది. గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు చెందిన ఇరవై నాలుగు మంది మహిళా సైనికులకు రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో క్యామెల్ రైడింగ్‌లో శిక్షణ ఇచ్చి పన్నెండు మందిని ఎంపిక చేశారు. ‘రిపబ్లిక్ డే పరేడ్‌లో ΄ాల్గొనడం ఒక సంతోషం అయితే క్యామెల్ కాంటింజెంట్‌లో భాగం కావడం మరింత సంతోషం కలిగిస్తుంది’ అంటుంది బృందంలో ఒకరైన అంబిక. ‘రిపబ్లిక్ డే ఉత్సవాల్లో క్యామెల్ రైడర్స్‌ను చూసి అబ్బురపడేదాన్ని. ఇప్పుడు నేను అందులో భాగం కావడం గర్వంగా ఉంది’ అంటుంది సోనాల్. విజయ్‌చౌక్ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్యపథ్ మీదుగా క్యామెల్ రైడర్స్ కవాతు నిర్వహిస్తారు. రిపబ్లిక్‌డే తరువాత జరిగే రీట్రీట్ సెరిమనీలో కూడా ఈ బృందం ΄ాల్గొనబోతోంది. అమృత్‌సర్‌లో జరిగిన బీఎస్ఎఫ్ రైజింగ్ డే పరేడ్‌లో ఈ బృందం ΄ాల్గొని ప్రశంసలు అందుకుంది. ఉమెన్ రైడర్స్ కోసం ఆకట్టుకునే యూనిఫాంను కూడా రూ΄÷ందించారు. ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ దీన్ని డిజైన్ చేశారు. మన దేశంలోని వివిధ ్ర΄ాంతాలకు చెందిన క్రాఫ్ట్ ఫామ్స్‌ను ఈ డిజైన్ ప్రతీకాత్మకంగా ప్రతిబింబిస్తుంది. రాజస్థాన్‌లోని మెవాడ్ సంప్రదాయానికి చెందిన తల΄ాగా మరో ఆకర్షణ. మన దేశంలో భద్రతావసరాలు, సాంస్కృతి కార్యక్రమాల్లో ఒంటెలను ఉపయోగిస్తున్న ఏకైక సైనిక విభాగం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సాంస్కృతిక కార్యక్రమాల్లో బీఎస్ఎఫ్ క్యామెల్ కాంటింజెంట్ కవాతులకు ప్రత్యేకత ఉంది. ఉమెన్ రైడర్స్ రాకతో కవాతులలో రాజసం ఉట్టిపడుతుంది. మేము సైతం: ఉమెన్ రైడర్స్, ఆకట్టుకునే యూనిఫాం: ప్రముఖ డిజైనర్ రాఘవేంద్ర రాథోడ్ డిజైన్ చేశారు. -
నేవీ అమ్ములపొదిలోకి వాగీర్.. జలాంతర్గామి విశేషాలివే..
ముంబై: అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే దమ్ము ఉన్న నూతన జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగీర్ లాంఛనంగా భారత నావికాదళంలో చేరింది. సోమవారం ముంబైలోని నావల్ డాక్‌యార్డ్ ఇందుకు వేదికైంది. కల్వరీ శ్రేణి జలాంతర్గాముల్లో చివరిది, ఐదవది అయిన వాగీర్‌ను నావికా దళ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ లాంఛనంగా భారత నేవీలోకి ప్రవేశపెట్టారు. ‘వాగీర్ రాకతో సముద్రజలాల్లో శత్రువుల బారి నుంచి దేశ ప్రయోజనాలను మరింతగా సంరక్షించవచ్చు. ఇంటెలిజెన్స్, నిఘా, మొహరింపు విభాగాల్లో నేవీ సామర్థ్యాన్ని వగర్ పరిపుష్టంచేస్తుంది’ అని ఈ సందర్భంగా భారత నేవీ ప్రకటించింది. ఎలాంటి జంకు లేకుండా దాడి చేసే ఇసుక షార్క్ చేప(వాగీర్) పేరును దీనికి పెట్టారు. 24 నెలల వ్యవధిలో నేవీ చేరిన మూడో సబ్‌మరైన్ ఇది. మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ సంస్థ దీనిని తయారుచేసింది. ఫ్రాన్స్ నుంచి బదిలీచేసిన సాంకేతికతను ఇందులో వినియోగించారు. 11 నెలలపాటు సముద్రంలో పలు రకాల ప్రయోగ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాక సోమవారం నేవీలోకి తీసుకున్నారు. జలాంతర్గామి విశేషాలు ► ప్రపంచంలోనే అత్యత్తుమ సెన్సార్లను దీనిలో అమర్చారు. ► వైర్ ఆధారిత టోర్పెడోలున్నాయి. ► దీని ద్వారా సముద్ర అంతర్భాగం నుంచి క్షిపణులను సముద్రజలాల మీది లక్ష్యాలపైకి ప్రయోగించవచ్చు ► స్పెషల్ ఆపరేషన్స్‌లో మెరైన్ కమెండోలను శత్రు స్థావరాలలోకి చడీచప్పుడుకాకుండా తరలించగలదు. ► శక్తివంత డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ► శత్రు టోర్పెడోలను ఏమార్చే నూతన స్వీయ రక్షణ వ్యవస్థతో దీనిని బలోపేతం చేశారు -
భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక.. ‘మర్ముగోవా’ జల ప్రవేశం
ముంబై: భారత నౌకాదళంలోకి మరో యుద్ధనౌక చేరింది. శత్రుదుర్భేద్యమైన మిసైల్ విధ్వంసక యుద్ధనౌక ‘మర్ముగోవా’ జలప్రవేశం చేసింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఐఎన్ఎస్ మర్ముగోవాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రితో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, గోవా గవర్నర్ పీఎస్ శ్రీధరన్ పిల్లయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ‘ఈరోజు స్వదేశీ యుద్ధనౌకల నిర్మాణ చరిత్రలో మరో మైలురాయిని చేరుకున్నాం. ఏడాది క్రితమే మనం సిస్టర్ షిప్ విశాకపట్నంను భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టాం. గత దశాబ్దకాలంలో యుద్ధనౌకల డిజైన్, నిర్మాణంలో ఈ విజయం గొప్ప పురోగతిని సూచిస్తుంది. ఈ నౌకలకు నగరాల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని కొనసాగించాం.’ అని తెలిపారు నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్. మర్ముగోవా విశేషాలు.. ► ఈ యుద్ధనౌక రెండోతరానికి చెందిన స్టీల్త్ గైడెడ్ మిసైల్ విధ్వంసక నౌక. ► ప్రాజెక్టు 15బీ కింద ఈ యుద్ధ నౌకను రూపొందించారు. గోవాలోని ప్రముఖ పోర్టు సిటీ మర్ముగోవా నగరం పేరును ఈ వార్‌షిప్‌కు పెట్టారు. ► ఈ నౌక పొడవు 163 మీటర్లు, వెడల్పు 17 మీటర్లు కాగా.. బరువు సుమారు 7,400 టన్నులు. అత్యధికంగా 30 నాటిక్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుందు. ►భారత నౌకాదళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 4 విశాఖపట్నం క్లాస్ విధ్వంసక నౌకల్లో ఇది రెండోది. దీనిని మజాగాన్ డాక్ నౌకానిర్మాణ సంస్థ నిర్మించింది. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
అమెరికా కంటే మిన్నగా.. దేశ రక్షణకు భారత నేవీ కీలక అడుగులు
సాక్షి, విశాఖపట్నం: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న భారత నౌకాదళం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది. అండర్ వాటర్ డొమైన్ అవేర్‌నెస్‌లో పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మానవ రహిత సాంకేతికత, వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు చర్యలు చేపట్టింది. డీఆర్డీవో సాయంతో సముద్ర గర్భంలోనూ పహారా కాసే మానవ రహిత వాహనాలను తన అమ్ములపొదిలో చేర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. డీఆర్డీవో తయారు చేసిన మానవ రహిత విమాన ప్రయోగాలు ఇటీవలే విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్మ్యాన్డ్ పవర్‌ను మరింత పెంపొందించే దిశగా భారత రక్షణ దళం సిద్ధమైంది. నీటి అంతర్భాగంలో కూడా దూసుకెళ్లే మానవ రహిత వాహనాలు తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేవలం నిఘాకు మాత్రమే కాకుండా యుద్ధ సమయంలోనూ సత్తా చాటే విధంగా డిజైన్ చేస్తున్నారు. అమెరికా కంటే మిన్నగా.. ఇప్పటికే అమెరికా నౌకాదళం రిమోట్‌తో నడిచే మానవ రహిత అండర్ వాటర్ వెహికల్స్‌ను రూపొందించి అగ్రస్థానంలో నిలిచింది. దానికంటే మిన్నగా వాహనాలను తయారు చేసేందుకు భారత్ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం ఉన్న టార్పెడో ట్యూబ్ సముద్ర గర్భంలో 2 రోజుల పాటు, హెవీ వెయిట్ ట్యూబ్ 3 నుంచి 4 రోజుల పాటు ఉండగలవు. కానీ త్వరలో అభివృద్ధి చేయనున్న అటానమస్ అన్మ్యాన్డ్ వెహికల్స్(ఏయూవీ) కనీసం 15 రోజుల పాటు సముద్ర గర్భంలో ఉండి పహారా కాయగలవు. ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థ అదమ్య, అమోఘ్ పేరుతో ఏయూవీలను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. ఈ నేపథ్యంలో డీఆర్డీవో తయారు చేసిన అండర్ వాటర్ లాంచ్డ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి.. కీలక కార్యకలాపాలకు ఉపయోగించాలని నిర్ణయించారు. మజ్గావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. తొలి దశలో జలాంతర్గాముల పర్యవేక్షణ కోసం, తర్వాత శత్రు సబ్మెరైన్ల రాకను పసిగట్టేలా, తుది దశలో సైనిక దాడులకు కూడా ఈ మానవ రహిత సముద్రగర్భ వాహనాలు ఉపయోగపడేలా తీర్చిదిద్దనున్నారు. -
రక్షణ శాఖ ఇలాకా.. విశాఖ
సాక్షి, విశాఖపట్నం: శత్రు దేశమైన పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే.. ఆ యుద్ధంలో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడితే.. ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖ వేదికైతే.. ఎంత గర్వంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ 4వ తేదీన భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు. జాతి గర్వించదగ్గ గెలుపునకు గుర్తుగా బీచ్ రోడ్లో ‘విక్టరీ ఆఫ్ సీ’ స్థూపం నిర్మించారు. 75 ఏళ్లలో భారత నౌకాదళం ప్రపంచంలోనే అతి పెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకా దళం మారింది. దేశానికి తూర్పు తీరం వ్యూహాత్మక రక్షణ ప్రాంతం. సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రు దేశాలకు సుదూరంగా ఉండటం తూర్పు నౌకాదళం ప్రత్యేకత. అందుకే రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్ పాలకులు విశాఖపట్నాన్ని కీలకంగా భావించారు. ఇందులో భాగంగానే విశాఖలో తూర్పు నావికా దళం ఏర్పాటైంది. 1923 డిసెంబర్లో విశాఖను తూర్పు తీరంలో వ్యూహాత్మక కేంద్రంగా గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలమైన 1942–45 మధ్య కాలంలో విశాఖ తీరాన్ని ప్రధానంగా వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచే బర్మాకు ఆయుధాలను రవాణా చేశారు. స్వాతంత్య్రానంతరం 1954లో విశాఖ నేవీ పోస్ట్‌ను కమాండర్ హోదాకు పెంచుతూ.. బేస్ రిపేర్ ఆర్గనైజేషన్ కార్యకలాపాలు ప్రారంభించారు. 1962లో ఇండియన్ నేవీ హాస్పిటల్ సర్వీసెస్(ఐఎన్హెచ్ఎస్) కల్యాణి ప్రారంభమైంది. 1967 జూలై 24న కమాండర్ హోదాను రియర్ అడ్మిరల్ హోదాకు అప్‌గ్రేడ్ చేయడంతో పాటు తూర్పు తీరంలో ఫ్లాగ్ ఆఫీసర్స్ పోస్టులను మంజూరు చేశారు. 1968 మార్చి 1న విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం (ఈఎన్సీ) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1971 మార్చి 1న ఈఎన్సీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్సీ విస్తరించింది. 1971 నవంబర్ 1 నుంచి ఈఎన్సీ ఫ్లీట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి ఈఎన్సీ చీఫ్‌గా రియర్ అడ్మిరల్ కేఆర్ నాయర్ నియమితులయ్యారు. రక్షణలో వెన్నెముక పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి వరకూ 2,600 కి.మీ. నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే.. 6 లక్షల చ.కి.మీ. పరిధిలో ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ విస్తరించి ఉంది. ఈ తీరంలో 13 మేజర్ పోర్టులున్నాయి. భారత సర్కారు లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత.. సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది. దీంతోపాటు డీఆర్డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. పలు క్షిపణులు తయారు చేసే నేవల్ సైన్స్ అండ్ టెక్నొలాజికల్ లేబొరేటరీస్(ఎన్ఎస్టీఎల్) విశాఖలోనే ఏర్పాటైంది. ఇలా ఈఎన్సీ విస్తరించుకుంటూ బలీయమైన శక్తిగా మారింది. తీర ప్రాంత రక్షణలో వెన్నెముకగా ఉన్న ఈఎన్సీ.. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్ నేవీ.. ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ.. శత్రుదుర్బేధ్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్లున్నాయి. అస్త్ర పరీక్షల కేంద్రం నౌకాదళ ఆయుధ పరీక్షలకు విశాఖ కేంద్ర బిందువుగా మారనుంది. ప్రధానంగా సముద్రంలో జరిగే యుద్ధాల్లో వినియోగించే ఆయుధాల పరీక్ష కేంద్రాన్ని రక్షణ శాఖ నెలకొల్పుతోంది. ఇలాంటి కేంద్రం దేశంలో విశాఖలోనే ఏర్పాటు కానుండటం గమనార్హం. అలాగే క్షిపణులు, రాకెట్ల పరీక్ష కేంద్రం కూడా ఇక్కడ నిర్మితమవుతోంది. దేశంలోనే తొలిసారిగా భారీ టార్పెడోలు, అండర్ వాటర్ వెపన్స్ పరీక్షా కేంద్రాన్ని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) భీమిలిలో నిర్మించనుంది. తొలి కాంపోజిట్ ఇండోర్ షూటింగ్ రేంజ్ సెయిలర్స్లో ఫైరింగ్ స్కిల్స్ పెంపొందించడం కోసం భారత నౌకాదళం అత్యాధునిక సాంకేతికతతో లైవ్ ఫైరింగ్ సిస్టమ్‌ను నిర్మించింది. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో ఈ సౌకర్యాన్ని ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా దీన్ని నిర్మించారు. చదవండి: Viral: సీఎం జగన్ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్ -
మలబార్ యుద్ధ విన్యాసాలు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక 30వ మలబార్ యుద్ధ విన్యాసాలు జపాన్‌లో గురువారం ప్రారంభమయ్యాయి. జపాన్‌లోని యెకొసోకు సాగరతీరంలో ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించనున్న యుద్ధ విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన యుద్ధనౌకలు పాల్గొంటున్నాయి. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నేవిగేషన్ వ్యవస్థలను పరిరక్షించడంతోపాటు ఈ ప్రాంతంలో ఆధిపత్యం కోసం చైనా కుటిల ప్రయత్నాలకు చెక్ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా భారత నౌకాదళంతోపాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ(ఆర్ఏఎన్) నౌకాదళం సంయుక్తంగా యుద్ధ విన్యాసాలను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో భాగంగా యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలు ప్రదర్శిస్తాయి. భారతదేశం తరఫున ఐఎన్ఎస్ కమోర్తా, ఐఎన్ఎస్ శివాలిక్ యుద్ధ నౌకలు, మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లతోపాటు మెరైన్ కమాండోలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భారత నౌకాదళ ఈస్ట్రన్ ఫ్లీట్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండ్ రియర్ అడ్మిరల్ సంజయ్ భల్లా, యూఎస్ఏ నేవీ కమాండర్ వైస్ అడ్మిరల్ కార్ల్ థామస్, ఆస్ట్రేలియా ఫ్లీట్ కమాండర్ రియర్ అడ్మిరల్ జోనాథన్, జపాన్ ఫ్లీట్ కమాండర్ వైస్ అడ్మిరల్ యూసా హెడికీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఓపెన్ ఫ్రీగా మార్చాలన్నదే మలబార్ విన్యాసాల ప్రధాన ఉద్దేశమని ఆయా దేశాల ప్రతినిధులు ప్రకటించారు. క్వాడ్ దేశాలతో (భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా) పాటు మలబార్‌లోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని వెల్లడించారు. భారత్–అమెరికాతో మొదలు... ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నేవిగేషన్ వ్యవస్థల పరిరక్షణ కోసం భారత్–అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా 1992లో మలబార్ విన్యాసాలు ప్రారంభించాయి. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం రెండు దేశాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు కొనసాగిస్తున్నాయి. ఈ రెండు దేశాలతో 2015లో జపాన్ కూడా చేరడంతో అప్పటి నుంచి మూడు దేశాలు పాల్గొంటున్నాయి. 2020లో రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో ప్రస్తుతం నాలుగు దేశాల నౌకాదళాలు కలిసి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. -
గోవా తీరంలో కుప్పకూలిన మిగ్-29కే ఫైటర్ జెట్
పనాజీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్-29కే ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. గోవా తీరంలో సాధారణ పెట్రోలింగ్‌కు వెళ్లి నేవీ బేస్‌కు తిరిగి వస్తున్న క్రమంలో సముద్రంలో కుప్పకూలిపోయింది. యుద్ధవిమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే కూలిపోయినట్లు నౌకదళం వెల్లడించింది. అయితే, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. మిక్-29కే యుద్ధ విమానం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించింది నేవీ. 2019 నుంచి మిగ్-29కే ప్రమాదానికి గురికావటం ఇది నాలుగోది. ఫైటర్ జెట్‌లో రష్యా తయారు చేసిన కే-36డీ-3.5 జెట్ నుంచి విడిపోయే సీటు ఉంది. ఈ సాంకేతికత ప్రపంచంలోనే అత్యాధునికమైనదిగా చెబుతారు. హ్యాండిల్ లాగగానే ముందుగా వెనుక సీట్లో ఉన్న పైలట్, ఆ తర్వాత ముందు సీటులోని పైలట్ జైట్ నుంటి బయటపడతారు. ఇదీ చదవండి: ‘మాకు 5జీ ఫోన్లు కావాలి’, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు -
2047 నాటికి నేవీకి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం
సాక్షి, విశాఖపట్నం: భారత నావికాదళం 2047 నాటికల్లా పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానాన్ని సముపార్జించుకుంటుందని నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ చెప్పారు. ఆ తర్వాత ఆత్మనిర్భర్‌తో నూరు శాతం స్వదేశీ పరిజ్ఞానం ద్వారా యుద్ధనౌకలు, జలాంతర్గాముల నిర్మాణం చేపట్టవచ్చని తెలిపారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(హెచ్ఎస్ఎల్) స్వదేశీ పరిజ్ఞానంతో రూ.2,230 కోట్లు వెచ్చించి నిర్మించిన రెండు డైవింగ్ సపోర్టు వెసల్స్(డీఎస్వీల) జల ప్రవేశం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారత సముద్ర జలాల్లో దేశ రక్షణకు పెద్దపీట వేస్తున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా కొత్తగా 45 యుద్ధ నౌకలు, జలాంతర్గాములను నిర్మించాల్సి ఉండగా.. ప్రస్తుతం దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 43 నిర్మాణంలో ఉన్నాయన్నారు. నౌకా నిర్మాణ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగినట్టు తెలిపారు. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ డీఎస్‌వీలను తొలిసారిగా నేవీ కోసం విశాఖ హిందుస్తాన్ షిప్‌యార్డు నిర్మించిందని, వీటికి అవసరమైన పరికరాలను దేశంలోని 120 ఎంఎస్ఎంఈలు సమకూర్చినట్టు చెప్పారు. జలాంతర్గాముల్లో సమస్యలు తలెత్తినప్పుడు సరిచేసేందుకు, రెస్క్యూ ఆపరేషన్ ద్వారా సిబ్బందిని రక్షించేందుకు కొత్త డీఎస్వీ వెసల్స్ ఉపయోగపడతాయని తెలిపారు. ఇవి అందుబాటులోకొచ్చాక డీప్ సీ డైవింగ్ ఆపరేషన్లలో కొత్త శకం ఆరంభమవుతుందన్నారు. హెచ్ఎస్ఎల్ సీఎండీ హేమంత్ ఖాత్రి మాట్లాడుతూ తమ నౌకా నిర్మాణం కేంద్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు 200 నౌకలను నిర్మించిందని, 2000 నౌకలకు మరమ్మతులు చేసిందని వెల్లడించారు. 2021–22 ఆరి్థక సంవత్సరంలో రూ.755 కోట్ల టర్నోవర్ సాధించి, రూ.51 కోట్ల లాభాలనార్జించిందని వివరించారు. నిస్తార్, నిపుణ్‌లుగా నామకరణం కొత్తగా నిర్మించిన డీఎస్‌వీలకు నిస్తార్, నిపుణ్‌లుగా భారత నావికా దళాధిపతి సతీమణి కళాహరికుమార్ నామకరణం చేశారు. తొలుత ఆమె రెండు వెసల్స్‌కు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం నేవీ చీఫ్ హరికుమార్‌తో కలిసి ఆమె రిమోట్ కంట్రోల్ ద్వారా నిస్తార్, నిపుణ్‌లపై జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆ వెంటనే వాటిని హర్షధ్వానాల మధ్య జలప్రవేశం చేయించారు. కార్యక్రమంలో తూర్పు నావికాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ బి.దాస్‌గుప్తా, నేవీ, షిప్‌యార్డు ఉన్నతాధికారులు, హెచ్ఎస్ఎల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. -
అత్యాధునిక డీప్ సీ డ్రైవింగ్ నౌకలను ప్రారంభించిన నేవీ
-
INS విక్రాంత్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
-
నేవీ చేతికి విక్రాంత్
న్యూఢిల్లీ: భారత నావికా దళం కొత్త శక్తిని సముపార్జించుకుంది. దేశీయంగా తయారైన మొట్టమొదటి యుద్ధ విమాన వాహక నౌక ‘విక్రాంత్’ను కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గురువారం నేవీకి అందజేసింది. షెడ్యూల్ ప్రకారం విక్రాంత్‌ను ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నేవీ విధుల్లోకి చేర్చుకుంటారు. హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న వేళ విక్రాంత్ చేరికను కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. రూ.20 వేల కోట్లతో నిర్మించిన విక్రాంత్ నాలుగో, తుది దశ సీ ట్రయల్స్‌ను మూడు వారాల క్రితం విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో, యుద్ధ విమాన వాహక నౌకలను దేశీయంగా డిజైన్ చేసి, నిర్మించుకునే సామర్థ్యం సొంతం చేసుకున్న అరుదైన ఘనతను దేశం సొంతం చేసుకుంది. దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న సమయాన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విమాన వాహకనౌక(ఐఏసీ) అందడం చారిత్రక సందర్భమని నేవీ పేర్కొంది. ‘త్వరలో నావికాదళంలోకి ప్రవేశించే ఈ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌తో హిందూ మహాసముద్ర ప్రాంతం (ఐఓఆర్)లో భారతదేశం స్థానం మరింత సుస్థిరం అవుతుంది’అని నేవీ పేర్కొంది. ఐఏసీలో 76% దేశీయంగా తయారు చేసిన సామగ్రినే వినియోగించారు. విక్రాంత్‌లో మెషినరీ ఆపరేషన్, నేవిగేషన్, సర్వైవబిలిటీ గరిష్ట స్థాయి ఆటోమేషన్తో రూపొందాయి. ఫిక్స్డ్ వింగ్, రోటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు అనుగుణంగా దీని డిజైన్ ఉందని నేవీ వివరించింది. ఐఏసీ నుంచి మిగ్–29కే యుద్ధ విమానాలతోపాటు కమోవ్–31 హెలికాప్టర్లు, ఎంఐఐ–60ఆర్ మల్టీ రోల్ హెలికాప్టర్లను కలిపి మొత్తం 30 వరకు నిర్వహించవచ్చు. ఐఏసీలో 2,300 కంపార్టుమెంట్లుండగా 1,700 మంది సిబ్బంది పనిచేసేందుకు, ముఖ్యంగా మహిళా అధికారులకు ప్రత్యేక సౌకర్యాలతో డిజైన్ చేశారు. దీని సాధారణ వేగం 18 నాట్స్ కాగా, గరిష్ట వేగం 28 నాట్స్. ఇది 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు. -
మూడు దశాబ్దాలకు పైగా సేవలు..సెలవిక.. అగ్రజా!
పదేళ్ల క్రితమే దీని పనైపోయిందన్నారు. మరమ్మతులకు వచ్చిన ప్రతిసారి స్క్రాప్ అని హేళన చేశారు. కానీ.. వయసుతో సంబంధం లేదంటూ దేశ రక్షణ కోసం పడి లేచిన ప్రతిసారి తన సత్తా చాటింది. సముద్రంలో చిక్కుకున్న సబ్ మెరైన్లలోని సైనికుల్ని కాపాడే అతి పెద్ద ప్రయోగానికి కేంద్ర బిందువుగా మారింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న అనేక జలాంతర్గాములకు దిక్సూచిగా నిలిచింది. మూడున్నర దశాబ్దాల పాటు సుదీర్ఘ సేవలందించి సలాం అంటూ నిష్క్రమించింది. సాక్షి, విశాఖపట్నం: ఐఎన్ఎస్ సింధు ధ్వజ్.. ప్రపంచంలోనే అత్యంత సాధారణ సంప్రదాయ జలాంతర్గామి. దీనిని కిలో క్లాస్ సబ్మెరైన్గా పరిగణిస్తారు. 35 ఏళ్ల క్రితం రష్యా నుంచి కొనుగోలు చేసిన దీనిని అత్యంత పటిష్టమైన సబ్మెరైన్గా భారత్ తీర్చిదిద్దింది. స్వదేశీ సోనార్, స్వదేశీ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్‌తో పాటు స్వదేశీ టార్పెడో ఫైర్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంతో సింధు ధ్వజ్ తన సామర్థ్యాన్ని మరింత పెంపొందించుకుంది. భారత నౌకాదళం ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా తయారు చేస్తున్న ప్రతి సబ్‌మెరైన్ డిజైన్ వెనుక.. సింధు ధ్వజ్‌ని స్ఫూర్తిగా తీసుకుంటుండటం విశేషం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇన్నోవేషన్ ఫర్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ రోలింగ్ ట్రోఫీని పొందిన ఏకైక జలాంతర్గామిగా చరిత్రలో నిలిచింది. మలబార్ విన్యాసాల్లో సత్తా సింధు ధ్వజ్ భారత నౌకాదళంలో చేరిన తర్వాత సాగర గర్భంలో నిర్విరామంగా శత్రు సేనల రాకను పసిగట్టేందుకు ‘స్పెషల్ ఐ’గా విధులు నిర్వర్తించింది. తరచుగా మరమ్మతులకు గురవుతుండటంతో పదేళ్ల క్రితమే డీ కమిషన్ చెయ్యాలని భావించారు. (ఉపసంహరించాలని) అయితే.. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా నిర్వహించే మలబార్ విన్యాసాల్లో భాగంగా 2015లో జరిగిన ఎడిషన్‌లో దీని అసలు బలం ప్రపంచానికి తెలిసింది. అమెరికా తన సరికొత్త లాస్ ఏంజిల్స్ క్లాస్ న్యూక్లియర్ సబ్‌మెరైన్ యూఎస్ఎస్ సిటీ ఆఫ్ కార్పస్ క్రిస్టీ(ఎస్ఎస్ఎన్–705)తో విన్యాసాల్లో తలపడింది. ఈ విన్యాసాల్లో అప్పటికే పలుమార్లు మరమ్మతులకు గురైన సింధు ధ్వజ్ మట్టికరవడం ఖాయమనుకున్నారు. కానీ.. అందరి అంచనాల్ని తల్లకిందులు చేస్తూ.. అత్యాధునిక సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేసినంత పని చేసి.. అందరి దృష్టి తన వైపు తిప్పుకుంది. చారిత్రక విజయంలో కీలక పాత్ర మహా సముద్రాల లోతుల్లో చిక్కుకుపోయే సబ్ మెరైన్లలో సిబ్బందిని కాపాడే అతి క్లిష్టమైన పరీక్షని భారత నౌకాదళం విజయవంతంగా పూర్తి చేసిన ప్రయోగంలోనూ సింధు ధ్వజ్ ముఖ్య భూమిక పోషించింది. 2019లో బంగాళాఖాతంలో నిర్వహించిన పరీక్షల్లో ఐఎన్ఎస్ సింధు ధ్వజ్‌ను వినియోగించారు. సముద్రం అడుగున ఉన్న సింధు ధ్వజ్ వద్దకు డీప్ సబ్ మెరైన్ రెస్క్యూ వెహికల్ (డీఎస్ఆర్వీ)ను నేవీ పంపించగా.. డీఎస్ఆర్వీని సింధు ధ్వజ్ సేఫ్‌గా సముద్ర ఉపరితలానికి తీసుకొచ్చింది. ఈ విజయంతో డీఎస్ఆర్వీ వినియోగంలో అగ్ర నౌకాదళాల సరసన ఇండియన్ నేవీ చేరింది. అనేక విజయాల్లో కీలక భూమిక పోషించిన సింధు ధ్వజ్ సబ్‌మెరైన్ 35 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత విధుల నుంచి నిష్క్రమించింది. దేశ రక్షణకు నిర్విరామంగా అందించిన సేవలకు గాను తూర్పు నౌకాదళం సింధు ధ్వజ్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. -
గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు
-
టూరిజం డెస్టినీ.. పీఎన్ఎస్ ఘాజీ
విశాఖ మహా నగరాన్ని ఎన్నిసార్లు సందర్శించినా.. టూరిస్టులు మరోసారి వచ్చేందుకు మొగ్గు చూపుతుంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త పర్యాటక ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా విభిన్న టూరిస్ట్ స్పాట్లు కనువిందు చేస్తున్నాయి. సువిశాల సాగరతీరం.. సబ్‌మెరైన్ మ్యూజియం, ఎదురుగా టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం.. కొత్తగా సిద్ధమవుతున్న సీ హారియర్.. ఇలా ఎన్నో విశిష్టతలతో అలరారుతోంది. ఇప్పుడు కాస్త శ్రమిస్తే అదే జాబితాలో మరో బెస్ట్ స్పాట్ సిద్ధంగా ఉంది. 1971 ఇండో పాక్ యుద్ధ సమయంలో తూర్పు నావికాదళ ప్రధాన స్థావరమైన విశాఖను దెబ్బతీసేందుకు ప్రయత్నించి జలసమాధి అయిన పాకిస్తాన్ సబ్‌మెరైన్ పీఎన్ఎస్ ఘాజీ.. భిన్నమైన అంతర్జాతీయ టూరిస్ట్ స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు సమాలోచనలు జరుగుతున్నాయి. –సాక్షి, విశాఖపట్నం అసలేం జరిగిందంటే.. 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన ఈ యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసి.. భారత్ పాకిస్తాన్ మధ్య తక్కువ రోజుల్లో జరిగిన అతిపెద్ద యుద్ధమిది. బంగ్లాదేశ్ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుతం పాకిస్తాన్) నుంచి తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుతం బంగ్లాదేశ్) విడిపోయి స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. తూర్పు పాక్‌కు భారత్ మద్దతు ప్రకటించడంతో పాకిస్తాన్.. మన దేశంపై దాడులకు పాల్పడింది. భారత్, పాక్ బలగాలు తూర్పు, పశ్చిమ దిక్కుల్లో తలపడ్డాయి. పశ్చిమ ప్రాంతం వైపు డిసెంబర్ 4, 5 తేదీల్లో ఆపరేషన్ ట్రై డెంట్ పేరుతో భారత నావికా దళం కరాచీ ఓడరేవుపై చేసిన దాడిలో డిస్ట్రాయర్ పీఎన్ఎస్ ఖైబర్, పీఎన్ఎస్ మహాఫిజ్ మునిగిపోగా, పీఎన్ఎస్ షాజహాన్ పాక్షికంగా దెబ్బతింది. మరోవైపు.. భారత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను విశాఖలో రంగంలోకి దించారు. పాకిస్తాన్ అత్యంత శక్తిమంతమైన జలాంతర్గామి పీఎన్ఎస్ ఘాజీని పంపింది. విషయం తెలుసుకున్న భారత్ నావల్ కమాండ్.. ఐఎన్ఎస్ రాజ్‌పుత్ జలాంతర్గామిని రంగంలోకి దించింది. రాజ్‌పుత్ రాకను పసిగట్టిన ఘాజీ కుయుక్తులతో రాజ్‌పుత్‌ను మట్టికరిపించేందుకు దాడికి పాల్పడ్డారు. అయితే, దాడిలో పాక్షికంగా దెబ్బతిన్న రాజ్‌పుత్‌లోని నావికాదళం ఘాజీపై సర్వశక్తులూ ఒడ్డి ఘాజీని విశాఖ తీరంలోని సాగరగర్భంలో కుప్పకూల్చారు. బంగాళాఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్ నేవీ ఆధీనంలోకి తెచ్చుకుంది. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే. ఘాజీని సందర్శించేందుకు ఇలా తీసుకెళ్తారు.. సాగర గర్భంలోనే ఘాజీ.. విశాఖ తీరంలో ఐఎన్ఎస్ రాజ్‌పుత్ ధాటికి సైనికులతో సహా పీఎన్ఎస్ ఘాజీ జలసమాధి అయ్యింది. ఆ సమయంలో ఘాజీ నుంచి లభ్యమైన కొన్ని శకలాల్ని మాత్రమే విజయానికి గుర్తుగా తూర్పు నావికాదళం తీసుకొచ్చి భద్రపరచుకుంది. తర్వాత ఘాజీని అలాగే సాగర గర్భంలోనే విడిచిపెట్టేశారు. అనంతరం దాని గురించి పట్టించుకోలేదు. ఇన్నాళ్ల తర్వాత ఘాజీని పర్యాటక ప్రాంతంగా వినియోగించుకునేందుకు నేవీ, టూరిజం శాఖ సమాలోచనలు చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం టీయూ–142 యుద్ధ విమానాన్ని నేవీ అధికారులు ప్రభుత్వానికి అప్పగించిన సమయంలో మరికొన్ని ప్రాజెక్టుల గురించి చర్చించినప్పుడు ఘాజీ ప్రతిపాదన వచ్చింది. తర్వాత దీనిపై కదలిక లేదు. ఇటీవల మరోసారి ఘాజీ అంశం తెరపైకి వచ్చింది. పర్యాటకానికి కొత్త చిరునామా ఆర్కే బీచ్ నుంచి డాల్ఫిన్ నోస్ మధ్య ప్రాంతంలో 1.8 నాటికల్ మైళ్ల దూరంలో సముద్ర తీరంలో ఘాజీ జల సమాధి అయ్యింది. దాదాపు 30 మీటర్ల లోతులో ఘాజీ ఉన్నట్లు ఇటీవల గుర్తించారు. దీని వద్దకు వెళ్లి ఘాజీని నేరుగా చూసే అవకాశం పర్యాటకులకు కల్పించనున్నారు. ఘాజీ ఎక్కడ ఉందో అన్వేషించేందుకు గతంలో టూరిజం శాఖ నేవీని సంప్రదించింది. దీనిపై స్పందించిన నావికా దళం ఇందుకోసం ఓ కెప్టెన్ సహా ఇద్దరు నేవీ అధికారులు, మరో ఇద్దరు టూరిజం అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖలో పలు అడ్వెంచర్, బీచ్ టూరిజానికి సంబంధించిన ప్రాజెక్టులను టేకప్ చేసిన నగరానికి చెందిన ఓ సంస్థను ఈ కన్సల్టెన్సీ కోసం పర్యాటక శాఖని సంప్రదించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం వెలువడనుందని టూరిజం వర్గాల సమాచారం. స్పెషల్ సర్టిఫికెట్ ఉండేలా.. పీఎన్ఎస్ ఘాజీని ఓపెన్ టూరిస్ట్ స్పాట్‌గా చేయబోతున్న తరుణంలో దీన్ని చూసేందుకు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. అయితే, తీరం నుంచి కొంత దూరం వెళ్లాక అక్కడి నుంచి 30 మీటర్ల లోతుకి వెళ్లాలంటే సాహసంతో పాటు ధైర్యం ఉండాలి. ముందుగా దీన్ని చూసేందుకు సర్టిఫైడ్ సందర్శకులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆఫ్ డైవింగ్ ఇన్స్ట్రక్టర్స్ (పాడీ) సంస్థ అం దించే అడ్వాన్స్డ్ ఓపెన్ ఆర్డర్ డైవర్ సర్టిఫి కెట్ పొందే వారికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వా లని భావిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటక శాఖ కు ఈ అంశంపై మరోసారి లేఖ రాసినట్లు కన్సల్టెన్సీ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టు పట్టాలపైకి వెళ్తే.. విశాఖ పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుంది. -
Agnipath Scheme: అగ్నివీరుల్లో 20 శాతం మహిళలే!
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద ఈ ఏడాది నేవీలో చేపట్టే నియామకాల్లో 20 శాతం మంది మహిళలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. నేవీలో ఈసారి మూడువేల మందిని ఎంపికచేస్తారు. అగ్నిపథ్ ద్వారా నేవీ తొలిసారిగా మహిళా నావికులను నౌకాదళంలోకి తీసుకోనుంది. అన్ని విభాగాల అప్లికేషన్లు జూలై 30వ తేదీ దాకా తీసుకుంటారు. ఉద్యోగ నియామకాల కోసం ఇప్పటివరకు 10 వేల మందిపైగా మహిళా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలంటూ మంగళవారం సుప్రీంకోర్టులో మాజీ సైనికాధికారి రవీంద్రసింగ్ షెకావత్ పిటిషన్ దాఖలుచేశారు. (క్లిక్: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. చాయ్‌వాలా నామినేషన్) -
వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం పరీక్ష సక్సెస్
బాలసోర్: ఒడిశా తీరం చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి శుక్రవారం చేపట్టిన వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్ఆర్ఎస్ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. నేవీ షిప్ నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఛేదించిందని అధికారులు తెలిపారు. ఈ ఆయుధ వ్యవస్థ అత్యంత సమీపంలోని వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకుంటుందని, రాడార్ తదితరాలకు దొరక్కుండా తప్పించుకునే వాటిని కూడా ఎదుర్కొంటుందని వెల్లడించారు. ఈ క్షిపణి హై స్పీడ్ ఏరియల్ టార్గెట్‌ను ఛేదించడాన్ని అంచనా వేసేందుకు పలు ట్రాకింగ్ వ్యవస్థలను వినియోగించినట్లు చెప్పారు. ఈ ప్రయోగం డీఆర్డీవో, నేవీ ఉన్నతాధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిందన్నారు. పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన డీఆర్డీవో, నేవీలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. ఈ విజయంతో భారత నావికాదళం గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్విట్టర్లో పేర్కొన్నారు. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ నేవీ, డీఆర్డీవో బృందాల కృషిని ప్రశంసించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న బృందాలను డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్ రెడ్డి అభినందించారు. భారత నావికా దళం సామర్థ్యాన్ని ఈ ఆయుధ వ్యవస్థ ఇనుమడింప జేస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ‘‘ఆత్మనిర్భర్ భారత్’’లో ఇది మరో మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. -
జైహింద్ స్పెషల్: ఐ.ఎన్.ఎస్. విక్రాంత్
ఇండియన్ నేవీ షిప్ విక్రాంత్ భారత నౌకాదళానికి చెందిన మెజెస్టిక్–క్లాస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. సంస్కృతంలో విక్రాంత్ అంటే ‘ధైర్యవంతుడు‘ అని అర్థం. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ రాయల్ నేవీ కోసం హెచ్.ఎం.ఎస్. హెర్క్యులస్గా దీని నిర్మాణం ప్రారంభించారు. ఆలోపు యుద్ధం ముగియడంతో ఆ యుద్ధనౌక నిర్మాణం పనులు ఆగిపోయాయి. భారతదేశం 1957లో ఆ అసంపూర్ణ విమాన వాహక నౌకను కొనుగోలు చేసింది, 1961లో నిర్మాణం పూర్తయింది. విక్రాంత్ భారత నావికాదళం మొదటి విమాన వాహక నౌకగా ఆ ఏడాదే రంగంలోకి దిగింది. 1971 ఇండో–పాకిస్తాన్ యుద్ధంలో తూర్పు పాకిస్థాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేయడంలో కీలక పాత్ర పోషించింది. తరువాతి సంవత్సరాలలో 1997 జనవరిలో విక్రాంత్ ఆపరేషన్లను నిలిపివేయడానికి ముందు విక్రాంత్‌ను ఆధునిక విమానాల పార్కింగ్ కోసం భారీ స్థాయిలో పునర్నిర్మించారు. విక్రాంత్ 2012 వరకు ముంబైలోని కఫ్ పరేడ్‌లో మ్యూజియం షిప్‌గా భద్రపరిచారు. సుప్రీంకోర్టు తుది అనుమతి అనంతరం 2014 జనవరిలో ఆన్లైన్ వేలం ద్వారా ప్రభుత్వం విక్రాంత్‌ను విక్రయించింది. -
ఈశాన్య బంగాళాఖాతంలో నౌకాదళ విన్యాసాలు
గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): బంగ్లాదేశ్‌లోని పోర్టు మోంగ్లాలో భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక నౌకా విన్యాసాలు ఈ నెల 24న ప్రారంభమయ్యాయి. ఇవి ఈ హార్బర్లో 24, 25వ తేదీల్లో, ఈశాన్య బంగాళాఖాతంలో 26, 27 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ ద్వైపాక్షిక విన్యాసాల్లో రెండు దేశాల నైపుణ్యాలు, సముద్ర తీర ప్రాంతం సామర్థ్యాలు ప్రదర్శించబడతాయి. భారత నౌకాదళం నుంచి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మిస్సైల్ కరవెట్ కోరా నౌక, ఆఫ్ షోర్ గస్తీ నౌక సుమేధా ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. బంగ్లాదేశ్ నుంచి బీఎన్ఎస్ అబు ఉబైదా, ఆలీ హైదర్ అనే నౌకలు పాల్గొంటున్నాయి. -
భారత్–బంగ్లా ‘కార్పాట్’ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం, బంగ్లాదేశ్ నేవీ సంయుక్తంగా నిర్వహించే కోర్డినేటెడ్ పెట్రోల్ (కార్పాట్) ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ప్రారంభమైంది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (ఐఎంబీఎల్) వెంబడి 2018 నుంచి ప్రతి ఏటా ఇరుదేశాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుంటాయి. అక్టోబర్ 2020లో నిర్వహించిన అనంతరం కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు కార్పాట్ జరగలేదు. నాలుగో ఎడిషన్‌ని భారత్, బంగ్లాదేశ్ నౌకాదళాలు రెండేళ్ల విరామం తర్వాత ప్రారంభించాయి. భారత్ తరఫున గైడెడ్ మిసైల్ షిప్ ఐఎన్ఎస్ కోరా, ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ ఐఎన్ఎస్ సుమేధతో పాటు మారీటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ గస్తీలో పాల్గొనగా.. బంగ్లాదేశ్ తరఫున బీఎన్ఎస్ అలీ హైదర్, బీఎన్ఎస్ అబూ ఉబైదాలు కార్పాట్లో పాలుపంచుకున్నాయి. సోమవారంతో ఈ గస్తీ కార్యక్రమం ముగియనుంది. -
నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష సక్సెస్
బాలాసోర్(ఒడిశా): శత్రు దేశ యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) బుధవారం ప్రకటించింది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో సముద్రతీర ప్రాంతంలో భారత నావికా దళం, డీఆర్డీవో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. నావికాదళ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించిన ఈ కొత్త యాంటీ–షిప్ మిస్సైల్ అత్యంత ఖచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. హెలికాప్టర్ అవసరాల కోసం దేశీయంగా తయారుచేసిన లాంచర్‌ను ఈ క్షిపణిలో వినియోగించారు. క్షిపణిని విజయవంతంగా పరీక్షించినందుకు సంబంధిత శాస్త్రవేత్తలను డీఆర్డీవో చైర్మన్ జి.సతీష్ రెడ్డి అభినందించారు. -
బలం పెరగాలి బ్రదర్!
దేశ రక్షణ సామర్థ్యాలను పెంచుకొనే ప్రయత్నంలో భారత్ మరో అడుగు ముందుకేసింది. కరోనా దెబ్బతో నిర్మాణం ఆలస్యమైన దేశీయ జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ వాగ్షీర్’ బుధవారం ముంబయ్‌లోని మజగావ్ డాక్స్‌లో జలప్రవేశం చేసింది. ‘మేకిన్ ఇండియా’ మాటలకు మచ్చుతునకగా నిలిచింది. హిందూ మహాసముద్రంలోని విలక్షణ మత్స్యజాతి పేరు పెట్టుకొన్న ఈ మెరైన్ అనేక కఠిన పరీక్షలు, ప్రయోగాల తర్వాత వచ్చే ఏడాది చివరలో భారత నౌకాదళంలో భాగం కానుంది. పెరుగుతున్న సరిహద్దు పరిస్థితులు, మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సముద్ర తీర భద్రతలో ఎక్కడ ఉన్నామో పునరాలోచించుకొనేందుకు ఇది సరైన సమయం. అందుకోవాల్సిన లక్ష్యాలను పునశ్చరణ చేసుకొనేందుకు చక్కని సందర్భం. విదేశీ సంస్థల నుంచి సాంకేతిక పరిజ్ఞానం తీసుకొని, దేశీయంగా మెరైన్ల నిర్మాణానికి మన దేశం ఎప్పుడో ప్రణాళిక వేసుకుంది. 1999లో ఆమోదం పొందిన ఆ ప్రణాళికలో భాగంగా ‘పి–75’, ‘పి–75ఐ’ అనే రెండు వేర్వేరు శ్రేణుల మెరైన్లను సిద్ధం చేస్తూ వస్తున్నాం. ‘పి–75’ ప్రాజెక్ట్ కింద మన దేశం సమకూర్చుకుంటూ వచ్చిన ఫ్రెంచ్ స్కార్పీన్ శ్రేణి జలాంతర్గాములలో ఆరవదీ, ఆఖరుదీ – ఈ కొత్త ‘ఐఎన్ఎస్ వాగ్షీర్’. 2005 అక్టోబర్‌లో కుదుర్చుకున్న 375 కోట్ల డాలర్ల ఒప్పందంలో భాగంగా నేవల్ గ్రూప్ నుంచి మనకు సాంకేతిక పరిజ్ఞాన బదలీ జరిగింది. ఆ పరిజ్ఞానంతో మన దగ్గరే మజగావ్ డాక్స్‌లో రూపొందిన ‘ఐఎన్ఎస్ కల్వరి’– 2017 డిసెంబర్లో, ‘ఖండేరీ’– 2019 సెప్టెంబర్‌లో, ‘వాగిర్’– 2020 నవంబర్‌లో, ‘కరంజ్’– గత ఏడాది మార్చిలో, ‘వేలా’– నవంబర్‌లో కమిషనింగ్ జరుపుకొన్నాయి. చివరిగా ఇప్పుడు ‘వాగ్షీర్’వచ్చింది. ఈ డీజిల్ యుద్ధ జలాంతర్గామి ప్రత్యర్థి మెరైన్లపై పోరుకూ, నిఘా సమాచార సేకరణకూ, మందుపాతరలు పెట్టడానికీ, ప్రాంతీయ నిఘాకూ తోడ్పడుతుంది. అయితే, ‘వాగ్షీర్’ చేతికి అంది రావడానికి మరో ఏణ్ణర్ధం పడుతుంది. ఏణ్ణర్ధం క్రితం జలప్రవేశం చేసిన ‘వాగిర్’ సైతం ఇంకా ట్రయల్స్‌లోనే ఉంది. వెరసి, మన సామర్థ్యం ఇనుమడించిందని అలసత్వం వహించడానికి వీల్లేదు. నిజం చెప్పాలంటే, మన దేశ జలాంతర్గాముల దళం కొంత వెనుకబడిందని గత ఏడాది చివరలో సైతం వార్తలు వచ్చాయి. నౌకాదళంలో, మరీ ముఖ్యంగా జలాంతర్గాముల సామర్థ్యంలో మన కన్నా చైనా ఎంతో ముందుకు దూసుకు పోయింది. జలాంతర్గాముల ఆధునికీకరణలో మనం కనీసం ఓ దశాబ్ద కాలం వెనుకబడ్డామని నిపుణుల కథనం. ఈ పరిస్థితుల్లో మన సముద్రతీర భద్రత రీత్యా మరిన్ని సబ్మెరైన్లను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న కాలంలో హిందూ మహాసముద్రంలో చైనా మరిన్ని నౌకలు, సబ్మెరైన్లను మోహరించనున్న నేపథ్యంలో అది మరింత అవసరం. అలాగే, మన ప్రత్యర్థి పాకిస్తాన్‌కు 8 సబ్మెరైన్లు, 4 యుద్ధ విధ్వంసక నౌకలను చైనా కట్టబెడుతోంది. వాటన్నిటినీ చైనాకు బినామీగా పాక్ వాడే ప్రమాదం ఉంది. పాతవాటి స్థానంలో కొత్తవి చేర్చుకుంటూ ఏ క్షణంలోనైనా కనీసం 65 నుంచి 70 సబ్మెరైన్లు అందుబాటులో ఉండేలా చైనీస్ నౌకాదళం చూసుకుంటోందని అమెరికన్ నిఘా సంస్థ నివేదిక. పైగా, గడచిన 15 ఏళ్ళలో చైనా 12 అణు జలాంతర్గాముల్ని నిర్మించుకోవడం గమనార్హం. సాంప్రదా యిక సబ్మెరైన్ల కన్నా నీటిలో చాలా వేగంగా వెళ్ళగల ఈ న్యూక్లియర్ సబ్మెరైన్లు ఆకాశంలో ఫైటర్ జెట్ల లాంటివి. ఇవి బ్యాటరీలతో నడవవు కాబట్టి, సిబ్బందికి కావాల్సిన సరుకుల కోసమే తప్ప, ఛార్జింగ్ చేసుకోవడానికని నీటి నుంచి పైకి రావాల్సిన పని ఉండదు. ఎంతకాలమైనా నీటిలోనే ఉండగలవు. ఎస్ఎస్ఎన్లుగా పేర్కొనే ఈ మెరైన్లున్న 6 దేశాల్లో భారత్ కూడా ఒకటి. మిగతావి – అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా. 1987లోనే రష్యా నుంచి తొలి ఎస్ఎస్ఎన్ను తెచ్చుకున్న మనం దేశ రక్షణ అవసరాల రీత్యా మరిన్ని అణు జలాంతర్గాముల్ని సమకూర్చుకోవాల్సి ఉంది. దేశీయంగా రూపొందిస్తున్న 12 మెరైన్లలో సగం ఎస్ఎస్ఎన్లనే చేయాలని ప్రభుత్వం ఆ మధ్య మంచి నిర్ణయమే తీసుకుంది. అంతా అనుకున్న విధంగా జరిగి, ప్రాజెక్ట్ వేగంగా సాగినప్పటికీ, 2035 –40కి కానీ మన తొలి దేశవాళీ ఎస్ఎస్ఎన్ బరిలోకి దిగదని అంచనా. ఈలోగా రష్యా నుంచి 2 ఎస్‌ఎస్‌ఎన్‌లను మనం లీజు మీద తీసుకుంటున్నాం. కానీ, అందులో మొదటిది కూడా 2025 నాటికి కానీ మన చేతికి రాదు. ఉక్రెయిన్ యుద్ధవేళ అది మరింత ఆలస్యమైనా ఆశ్చర్యం లేదు. ఈ పరిస్థితులన్నిటి రీత్యా దేశీయంగా రక్షణ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవడం కీలకం. మన నేవీ సైతం ‘కల్వరి’ మొదలు ఈ స్కార్పీన్ శ్రేణి మెరైన్లన్నిటినీ రీఫిట్ చేసేటప్పుడు ‘ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్’ (ఏఐపి) మాడ్యూల్‌ను పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నదీ అందుకే! దేశీయంగా ఏఐపి మాడ్యూల్‌ను అభివృద్ధి చేసేందుకు మన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) చేస్తున్న కృషి ఇప్పుడు గణనీయమైన పురోగతి సాధించడం విశేషం. ఈ మార్చి నాటి ప్రాథమిక వ్యయ నివేదిక ప్రకారం దేశ రక్షణ శాఖ గత ఆర్థిక సంవత్సరంలో సైన్యానికి కేటా యించిన బడ్జెట్లో 99.5 శాతాన్ని వినియోగించడం గమనార్హం. కానీ, ఇప్పటికీ ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 11 శాతం మనదే. అతి పెద్ద ఆయుధ దిగుమతి దేశమైన మనం ఆ కథను తిరగ రాయాల్సి ఉంది. ‘మేకిన్ ఇండియా’ అంటూ ఇటీవల రూ. 47 వేల కోట్ల విలువైన 9 విదేశీ ఆయుధ ఒప్పందాలను పక్కనపెట్టిన మనం త్వరితగతిన ఆ కలను సాకారం చేసుకోవడం అవసరం. -
శత్రువులకు సింహస్వప్నం.. సైలెంట్ కిల్లర్ 'వాగ్షీర్'.. ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: సముద్రం లోతుల్లో ప్రయాణిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే జలాంతర్గామి. దాని పేరు ఐఎన్ఎస్ వాగ్షీర్. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా.. అని శత్రువు సైతం ఆశ్చర్యపోయేలా చేసే సైలెంట్ కిల్లర్. ప్రాజెక్టు–75లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్‌మెరైన్ వాగ్షీర్ ఈ నెల 20న జలప్రవేశం చేయనుంది. మన దేశ సముద్ర సరిహద్దుని శత్రు దుర్బేధ్యంగా నిలిపేందుకు ముంబైలోని మజ్గావ్ డాక్‌యార్డులో పీ–75 స్కార్పెన్ ప్రాజెక్ట్ కింద నిర్మితమైన అల్ట్రామోడ్రన్ సబ్‌మెరైన్ (ఆరో జలాంతర్గామి)గా.. చిట్టచివరిదిగా ‘వాగ్షీర్’ రూపొందింది. ప్రాజెక్ట్–75లో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా భారత నౌకాదళంలో ప్రవేశించగా.. ఐఎన్ఎస్ వగీర్ సీట్రయల్స్ పూర్తి చేసుకుంది. కాగా, వాగ్షీర్ జలాంతర్గామి కల్వరి తరగతికి చెందిన చిట్టచివరిది కావడం విశేషం. ఇది భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తర్వాత.. తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సముద్రంలో మందుపాతర పేల్చగలదు ఇప్పటివరకూ ఉన్న సబ్మెరైన్లలో వాగ్‌షీర్‌ని అత్యంత భయంకరంగా, శక్తిమంతంగా తయారు చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్‌మెరైన్‌లో అమర్చారు. ఇందులో 533 మి.మీ. వైశాల్యం గల 6 టార్పెడో ట్యూబ్‌లు ఉన్నాయి. ఏదైనా భారీ ఆపరేషన్ సమయంలో ఈ సైలెంట్ కిల్లర్ 18 టార్పెడోలు లేదా ఎస్ఎం39 యాంటీ–షిప్ క్షిపణులను మోసుకెళ్లగల సత్తా దీని సొంతం. శత్రు జలాంతర్గాములను, యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు సముద్రంలో మందుపాతరలను పేల్చగల సామర్థ్యం కూడా దీనికున్న ప్రత్యేకత. ఏకకాలంలో దాదాపు 30 మందుపాతరలను పేల్చగలదు. సైలెంట్ కిల్లర్ వాగ్‌షీర్‌ని సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఇందులోని అధునాతన వ్యవస్థ శబ్దం లేకుండా సముద్రంలో దూసుకుపోతుంది. స్టెల్త్ టెక్నాలజీ కారణంగా శత్రు నౌకలు లేదా సబ్మెరైన్లు రాడార్ సాయంతో కూడా వాగ్షీర్ ఎక్కడుందో కనుక్కోలేరు. ఈ జలాంతర్గామిలో రెండు అధునాతన పెరిస్కోప్‌లను అమర్చారు. ఆధునిక నావిగేషన్, ట్రాకింగ్ సిస్టమ్‌లతో కూడిన ఈ సబ్‌మెరైన్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తన పని తాను చేసుకుపోగలదు. -
బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో పాసయ్యారా? ఈ జాబ్‌కు అప్లై చేశారా?
ఇండియన్ నేవీలో 155 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులు ఇండియన్ నేవీ 2023 జనవరి(ఎస్టీ 23) కోర్సు.. వివిధ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 155 » బ్రాంచ్‌ల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్–93, ఎడ్యుకేషన్ బ్రాంచ్ (ఎడ్యుకేషన్)–17, టెక్నికల్ బ్రాంచ్–45. » ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్: విభాగాలు:జనరల్ సర్వీస్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్, అబ్జర్వర్, పైలట్, లాజిస్టిక్స్. అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత టెక్నికల్ నైపుణ్యాలు ఉండాలి. » ఎడ్యుకేషన్ బ్రాంచ్(ఎడ్యుకేషన్): అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణులవ్వాలి. » టెక్నికల్ బ్రాంచ్: విభాగాలు: ఇంజనీరింగ్ బ్రాంచ్(జనరల్ సర్వీస్), ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్). అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 02.01.1998 నుంచి 01.07.2003 మధ్య జన్మించి ఉండాలి. » ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.03.2022 » వెబ్సైట్: joinindiannavy.gov.in -
మిలాన్ - 2022 : దూసుకొచ్చిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు.. నీటిలో పేలిన బాంబులు (ఫోటోలు)
-
Milan 2022: శభాష్.. నావికా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆదివారం సాయంత్రం 5.30 గంటలు.. సుందర సంద్రం ఎదురుగా జనసంద్రం.. సాగరంలో అలల సవ్వడి సందడి చేస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా వేదికపైకి చేరుకున్నారు.. జనసంద్రంలో కేరింతలు.. అందరికీ సీఎం అభివాదం చేసి ఆశీనులయ్యారు.. ఆహ్లాదకర వాతావరణం మధ్య వీనుల విందుగా సంగీతం వినిపించింది.. కొద్ది నిమిషాల వ్యవధిలో పెద్ద పేలుడు.. సందర్శకులతో పాటు సాగరతీరం ఉలిక్కిపడింది.. ఒక్కసారిగా అలజడి రేగింది.. ఏం జరిగిందో అర్థం కాకముందే.. రయ్‌మంటూ డోర్నియర్ విమానాలు జనం పై నుంచి.. బంగాళాఖాతం వైపు దూసుకెళ్లి మాయమైపోయాయి.. ఎక్కడికి వెళ్లాయోనని ఆదుర్దాగా ఎదురు చూస్తుండగా.. మబ్బుల్ని చీల్చుకుంటూ వివిధ విన్యాసాలతో తిరిగి దూసుకొచ్చాయి.. ఈ షాక్ నుంచి సందర్శకులు తేరుకోకముందే ఆకాశంలో రంగు రంగుల పక్షుల్లా మెరైన్ కమాండోలు ప్యారాచూట్ల సాయంతో స్కై డైవింగ్ చేస్తూ జాతీయ పతాకాన్ని, భారత నావికాదళం జెండాను చేతబట్టుకుని నేలకు దిగారు.. వారికి సీఎం వైఎస్ జగన్ మెమోంటో అందజేశారు.. ఇంతలో.. మిగ్ 29 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.. సాగరాన్ని చీల్చుకుంటూ యుద్ధ నౌకల విన్యాసాలు, నింగీ, నేల, నీరు ఏకం చేసేలా సాగిన హెలికాఫ్టర్లు, చేతక్‌ల కదన కవాతు ఒళ్లు గగుర్పొరిచేలా సాగింది.. దివిపై.. భువిపై నౌకాదళ సిబ్బంది.. శత్రు సైన్యంపై పోరుని తలపించేలా 25 నిమిషాల పాటు సాగిన ఎన్నో అద్భుత విన్యాసాలకు విశాఖ తీరం వేదికైంది.. విశాఖ వాసులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశాక నేవీ అధికారులతో సీఎం జగన్ విన్యాసాలు అద్భుతం గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి సీఎం జగన్ దంపతులకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సతీసమేతంగా స్వాగతం పలికారు. ఆర్కే బీచ్ వద్ద మెరైన్ కమెండోలు 84 ఎంఎం రాకెట్ వాటర్ బాంబు పేల్చి సీఎంను స్వాగతించారు. 25 నిమిషాల పాటు వివిధ రకాల విన్యాసాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆరు వేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్‌ల నుంచి పారాజంపింగ్ చేసిన స్కైడైవర్లు గాల్లో ప్యారాచూట్ల సహాయంతో విన్యాసాలు చేస్తూ వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా దిగారు. అనంతరం వారు వేదికపైకి వచ్చి ముఖ్య అతిథి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, గంటకు ఆరు వేల కిలోమీటర్ల వేగంతో పయనించగల మిగ్ 29 విమానాలు పల్టీలు కొడుతూ బాంబుల వర్షం కురిపిస్తూ దూసుకుపోవడం, మార్కోస్‌ను సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా మరో చోటుకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఒడ్డున ఉన్న శత్రువులపై మోటారు బోట్లపై దూకుడుగా వచ్చి తుపాకులతో కాల్పు?లు జరపడం వంటివి ప్రత్యక్షంగా యుద్ధాన్ని చూసిన అనుభూతిని కలిగించాయి. నేవీ విజిటర్స్ బుక్‌లో సంతకం చేస్తున్న సీఎం ఈ విన్యాసాల్ని చూసేందుకు నౌకాదళాధికారులు, ప్రజా ప్రతినిధులు, సెయిలర్స్, నేవీ కుటుంబ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు. అద్భుతమైన రీతిలో విన్యాసాలు చేశారని నౌకాదళ బృందాన్ని ముఖ్యమంత్రి ప్రశంసించారు. విన్యాసాలు చేస్తున్న వివిధ విభాగాల పనితీరు, సామర్థ్యం గురించి ముఖ్యమంత్రికి నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ వివరించారు. విన్యాసాలు ముగిసిన తర్వాత బంగాళాఖాతంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్ దీపాలంకరణలో ధగధగ మెరిసిపోతుండగా.. సాగిన లేజర్ షో చూపరులకు కనువిందు చేసింది. సిటీ పరేడ్ ముగింపు సందర్భంగా మిరుమిట్లు గొలిపేలా నౌకాదళం బాణసంచా కాల్చింది. వేలా జలాంతర్గామి నమూనాను పరిశీలిస్తున్న సీఎం దంపతులు హైలైట్‌గా నిలిచిన నవరత్నాల శకటం యుద్ధ విన్యాసాల అనంతరం ఆస్ట్రేలియా, అమెరికా, శ్రీలంక, వియత్నాం, బంగ్లాదేశ్, సీషెల్స్, మలేషియా, మయన్మార్ దేశాలకు చెందిన నౌకాదళం, రక్షణ శాఖ బృందాలు మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నాయి. వీటికి తోడుగా.. రాష్ట్రానికి చెందిన బృందాల సాంస్కృతిక ప్రదర్శనలు, నౌకాదళ బ్యాండ్ ప్రదర్శన, శకటాల ప్రదర్శన.. ఎన్సీసీ, సీ కేడెట్ కారŠప్స్ కవాతులు ఆద్యంతం అలరించాయి. గరగలు డ్యాన్స్, కూచిపూడి నృత్యం, థింసా నృత్యం, కొమ్ముకోయ, డప్పు నృత్యం, పులివేషం ప్రదర్శనలు, చెక్క భజన, అమ్మవారి వేషాలు, కోలాటం, తప్పెట గుళ్లు, బుట్టబొమ్మల జానపద నృత్య ప్రదర్శనలు అలరించాయి. ‘మిలాన్’లో భాగంగా విశాఖ తీరంలో బాంబుల వర్షం కురిపిస్తున్న యుద్ధ విమానాలు.. శకటాల ప్రదర్శనలో జాతీయ పక్షి నెమలి శకటం, విశాఖపట్నం స్మార్ట్ సిటీ శకటం ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలని ప్రతిబింబించేలా ప్రదర్శించిన శకటం సిటీ పరేడ్‌కు హైలైట్‌గా నిలిచింది. పరేడ్ ముగిసిన అనంతరం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు అందరికీ అభివాదం చేస్తూ.. బీచ్ రోడ్డు నుంచి రాత్రి 7.25 గంటలకు విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి 8 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్స, కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, బీవీ సత్యవతి, జి.మాధవి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వరుదు కల్యాణి, ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, తిప్పల నాగిరెడ్డి, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, పెట్ల ఉమాశంకర్ గణేష్, అదీప్ రాజ్, భాగ్యలక్ష్మి, చెట్టిఫాల్గుణ, వాసుపల్లి గణేష్, కలెక్టర్ మల్లికార్జున, సీపీ మనీశ్ కుమార్ సిన్హా తదితరులు పాల్గొన్నారు. నౌకాదళ అధికారులు, సిబ్బందితో సీఎం జగన్ దంపతులు నౌకాదళ అధికారులు, సిబ్బందితో సీఎం మాటామంతి ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేసిన అనంతరం.. సతీమణి వైఎస్ భారతితో కలసి ఆద్యంతం పరిశీలించారు. భారత నౌకాదళ సంపత్తిని చూసి గర్వంగా ఫీలయ్యారు. యుద్ధ నౌకలో ఏ ఏ భాగాలు ఏ విధంగా ఉపయోగపడతాయన్న వివరాల్ని నౌకాదళాధికారులు సీఎం దంపతులకు వివరించారు. ఈ యుద్ధ నౌక పై నుంచే ఇటీవల బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైందని చెప్పారు. విశాఖ యుద్ధ నౌక కెప్టెన్‌తో పాటు సెయిలర్స్‌తో సీఎం దంపతులు కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత అత్యాధునిక ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్ (జలాంతర్గామి)ను సందర్శించారు. దాని పనితీరును అధికారులు వారికి వివరించారు. సాహసోపేతంగా సముద్ర అంతర్భాగంలో ప్రయాణిస్తూ.. దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సబ్‌మెరైన్ క్రూ కు వైఎస్ భారతి హ్యాట్సాఫ్ చెప్పారు. భారత నౌకాదళం హ్యాట్ ధరించిన వైఎస్ జగన్‌ను చూసి.. సతీమణి భారతి మురిసిపోయారు. ఆ తర్వాత ఐఎన్ఎస్ విశాఖపట్నం వార్ షిప్, ఐఎన్ఎస్ వేలా సబ్‌మెరైన్ సిబ్బంది, నౌకాదళ ప్రధానాధికారులతో షిప్ డెక్‌పై ముఖ్యమంత్రి దంపతులు గ్రూప్ ఫొటో దిగారు. సంప్రదాయం ప్రకారం.. నేవల్ విజిటర్స్ బుక్‌లో సీఎం వైఎస్ జగన్ దంపతులు సంతకం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ జ్ఞాపిక అందించారు. నేవీ అధికారులు, సిబ్బందితో సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి యుద్ధ నౌకలు, నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు -
మిలాన్-2022 కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు (ఫోటోలు)
-
విశాఖలో మిలాన్-2022 నిర్వహించడం గర్వకారణం: సీఎం జగన్
అప్డేట్స్: ► సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన ముగించుకుని సాయంత్రం 8 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయల్దేరారు. ► ఐఎన్ఎస్ విశాఖపట్నం మీద డాల్ఫిన్ లైట్‌హౌస్, డాల్ఫిన్ నోస్, కృష్ణజింకను ముద్రించినందుకు సీఎం వైఎస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ది సిటీ ఆఫ్ డెస్టినీ అని అన్నారు. ► సిటీ పరేడ్‌లో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని సీఎం జగన్ తెలిపారు. ఇది అరుదైన వేడుక, విన్యాసాల పండగ అని అన్నారు. ఇటీవల తూర్పు నౌకాదళ స్థావరంలో ఐఎన్ఎస్ విశాఖ చేరిందని తెలిపారు. ఈ విన్యాసాల్లో పాల్గొన్న అందరికీ సీఎం జగన్ అభినందనలు తెలియజేశారు. ► మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. విశాఖపట్నంలో మిలాన్-2022 నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. విశాఖ చరిత్రలో ఇవాళ గర్వించదగ్గ రోజు అని అన్నారు. ► మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో పరేడ్ ప్రారంభమైంది. సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను ప్రదర్శించారు. సముద్రతీరంలో నావికా దళం అబ్బురపరిచే విన్యాసాలు: 6000 అడుగుల ఎత్తులో 6 మంది ఆకాశంలో త్రివర్ణ పతకంతో విన్యాసాలు చేశారు. యుద్ధ విమానాలు గర్జనల, నావికా సిబ్బంది యుద్ధ విన్యాసాలు, నావికదళ సిబ్బంది రీస్క్యు ఆపరేషన్, ప్రమాదంలో ఉన్నవారిని రక్షించే సాహసాలు, యుద్ద విమానాలు చక్కర్లు, సముద్రంలో బాంబుల మోతా, ఆపదలో ఉన్నవారిని కాపాడే సాహసం, సముద్రం తీరంలో వాహనాలతో శత్రువులపై ఛేజింగ్, మిషన్ గన్స్‌తో శత్రువులను వెంటాడే విధానం, శత్రువులు వెన్నులో వణుకు పుట్టించె విధంగా ధైర్యసాహసాల ప్రదర్శన, మిత్ర దేశాలతో పరస్పరం సహకరించుకొనే విధంగా విన్యాసాలు, యుద్ద నౌకల నుంచి గురి తప్పని టార్గెట్, సముద్ర తీరంలో హెలికాప్టర్ల గస్తీ విన్యాసాలును ప్రదర్శించారు. ► ఆర్కే బీచ్‌లో నేవీ ఆధ్వర్యంలో సాయంత్రం పరేడ్ జరగనుంది. మిలాన్-2022 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. గంటన్నరపాటు జరిగే సముద్ర యుద్ధ విన్యాసాలు, గగనతల వాయుసేన విన్యాసాలను సీఎం జగన్ వీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధనౌకల సిబ్బంది పాల్గొంటారు. ► ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. ► నేవల్ డాక్‌యార్డ్‌లో ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని సీఎం వైఎస్ జగన్ సందర్శించారు. ► విశాఖపట్నంలోని తూర్పు నావికాదళ కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ దంపతులు చేరుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌కు తూర్పు నావికా దళం గౌరవ వందనం చేసింది. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు. మిలాన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. సాక్షి, విశాఖపట్నం: అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్–2022లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను బీచ్ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సిటీ పరేడ్‌ను ప్రారంభించనున్నారు. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్‌లో ఇండియన్ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖలో నౌకల పండుగ.. ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): అలలతో పోటీపడుతూ భారత నావికా దళ సామర్థ్యాల్ని ప్రదర్శించే వేడుకకు విశాఖ నగరం సిద్ధమైంది. అంతర్జాతీయ విన్యాసాల వేదిక మిలాన్–2022లో కీలకమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ను బీచ్ రోడ్డులో ఘనంగా నిర్వహించేందుకు నౌకాదళం, జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లుచేశాయి. కార్యనిర్వాహక రాజధాని నగరం పేరుతో రూపుదిద్దుకున్న ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేయనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఈ సిటీ పరేడ్‌ను ప్రారంభించనున్నారు. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలాన్‌లో ఇండియన్ నేవీ సహా 39 దేశాలు పాల్గొంటున్నాయి. ఇందులో ముఖ్యఘట్టమైన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ఆదివారం జరగనుంది. వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తాయి. ఈ యుద్ధవిన్యాసాల సంరంభాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఇలా.. బీచ్ రోడ్డులో కోలాహలంగా జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌ని ప్రారంభించేందుకు సీఎం వైఎస్ జగన్ విశాఖ నగరానికి ఆదివారం రానున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మ. 2.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నేవల్ డాక్ యార్డ్‌కి చేరుకుంటారు. 3.10 గంటలకు ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌకను జాతికి అంకితం చేస్తారు. అనంతరం నౌకాదళ సిబ్బందితో కలిసి దానిని పరిశీలిస్తారు. సా.4.10 గంటలకు నేవీ అధికారులతో గ్రూపు ఫొటో దిగుతారు. 4.20 నుంచి 4.40 వరకు ఇటీవలే నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని సందర్శిస్తారు. అనంతరం ప్రభుత్వ సర్క్యూట్ హౌస్‌లో బస చేస్తారు. సా.5.30 గంటలకు ఆర్కే బీచ్‌కు చేరుకుని మిలాన్ విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. 6.04 గంటలకు సిటీపరేడ్‌ను ప్రారంభించి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ దేశాల నౌకాదళ రక్షణ సిబ్బంది నిర్వహించే మార్చ్ పరేడ్‌ను తిలకిస్తారు. సా.6.50కు విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.15 గంటలకు ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి గన్నవరం బయలుదేరుతారు. సాగర తీరంలో విద్యుత్ కాంతులతో నౌకలు ప్రత్యేక ఆకర్షణగా యుద్ధ విన్యాసాలు ఇక భారతీయ నావికాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన్షనల్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. యుద్ధనౌకల అత్యంత వేగవంతమైన విన్యాసాలు, మెరైన్ కమాండోల బహుముఖ కార్యకలాపాలు, యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్ విన్యాసాలు వీక్షకుల్ని ఆకట్టుకోనున్నాయి. ఇలా వివిధ రకాల విమానాలు, వైమానిక శక్తి ప్రదర్శనలు ప్రపంచ దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించనున్నాయి. ఘనంగా మిలాన్–2022 ప్రారంభం నౌకా యానంలో భారత్‌కు ఐదువేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, పశ్చిమ తీరం ద్వారా 80 దేశాలతో వర్తకం సాగిస్తున్నామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్‌భట్ అన్నారు. ఆయన శనివారం విశాఖలో మిలాన్–2022ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1995లో భారత్‌తో పాటు నాలుగు దేశాలతో మొదలైన మిలాన్ ఇప్పుడు 39 దేశాలకు విస్తరించటం అభినందనీయమన్నారు. మిలాన్ ద్వారా మారిటైం రంగంలో అక్రమ ఆయుధ రవాణా, టెర్రరిజం, సముద్ర దొంగలు, స్మగర్లకు అడ్డుకట్ట వేయటంపై చర్చించుకునేందుకు వేదిక కానుందన్నారు. ప్రపంచ అంతా ఒక కుటుంబం అనే నినాదంతో ఒకరికొకరం సహాయం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మిలాన్ లోగో, స్పెషల్ కవర్‌ను అజయ్‌భట్ ఆవిష్కరించారు. ఇక్కడ మిలాన్–22 నిర్వహించటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత భారీ ఎత్తులో కార్యక్రమాన్ని విజయవంతం చేయటంలో అంధ్రప్రదేశ్ రాష్ట్రం సహకారం ఆమోఘమని ఆయన కొనియాడారు. అనంతరం వివిధ రకాల స్టాల్స్‌తో కూడిన మిలాన్ విలేజ్‌ను ఆయన ప్రారంభించారు. -
మిలన్... యుద్ధ నౌకల సమాహారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ మహానగరం మరో అంతర్జాతీయ విన్యాసాలకు సిద్ధమైంది. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించి సత్తా చాటిన మహా నగరం.. ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూని ఘనంగా నిర్వహించింది. నాలుగు రోజుల వ్యవధిలోనే ప్రతిష్టాత్మకమైన మిలన్–2022 అంతర్జాతీయ విన్యాసాలకు ముస్తాబైంది. నౌకాదళ విభాగంలో కీలకమైన మిలన్ కోసం ఇండియన్ నేవీ 46 దేశాలను ఆహ్వానించగా, 39 దేశాలు పాల్గొంటున్నాయి. శుక్రవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు వివిధ దేశాల నౌకాదళాలు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించనున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 27న బీచ్‌రోడ్డులో నిర్వహించే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 11వ మిలన్కు విశాఖ ఆతిథ్యం రెండేళ్లకోసారి నిర్వహించే మిలన్ విన్యాసాలు 1995లో ప్రారంభమయ్యాయి. తొలిసారి విన్యాసాల్లో భారత్‌తో పాటు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్ మాత్రమే పాల్గొన్నాయి. 2005లో సునామీ కారణంగా మిలన్‌ను రద్దు చేశారు. 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కారణంగా మిలన్ విన్యాసాలు జరగలేదు. 2010 వరకు 8 దేశాలు పాల్గొన్నాయి. 2012లో ఏకంగా 16 దేశాలు పాల్గొన్నాయి. 2014, 2018లో జరిగిన విన్యాసాల్లో 17 దేశాలు పాల్గొన్నాయి. ఇప్పటి వరకూ 10 సార్లు మిలన్ విన్యాసాలు జరిగాయి. 11వ మిలన్కు విశాఖ ఆతిథ్యమిస్తోంది. మిలన్‌ను మినీ ఐఎఫ్ఆర్గా పిలుస్తారు. కానీ.. ఈసారి జరిగే మిలన్ – 2022లో ఐఎఫ్ఆర్కు దీటుగా 39 దేశాలు పాల్గొనడం విశేషం. రెండు దశల్లో విన్యాసాలు మిలన్లో పాల్గొనేందుకు ఇప్పటికే 10 దేశాలకు చెందిన అధికారులు, యుద్ధ నౌకలు విశాఖ చేరుకున్నాయి. శుక్రవారం మిగిలిన దేశాల ప్రతినిధులు హాజరవుతారని నౌకా దళాధికారులు వెల్లడించారు. ఈ విన్యాసాలు రెండు దశల్లో జరుగుతాయి. 25 నుంచి 28 వరకు హార్బర్ ఫేజ్‌లో, మార్చి 1 నుంచి 4 వ తేదీ వరకూ సీఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. 26వ తేదీన మిలన్ విలేజ్ ప్రారంభిస్తారు. 27న బీచ్ రోడ్డులో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా క్రీడా పోటీలు, విదేశీ సందర్శకుల కోసం ఆగ్రా, బోధ్గయకు చెందిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 28న సముద్ర జలాల వినియోగం, భద్రతలో సామూహిక సహకారం అనే అంశంపై వివిధ దేశాల ప్రతినిధులతో సదస్సు నిర్వహిస్తారు. మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు సముద్ర జలాల్లో యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలతో విన్యాసాలు జరుగుతాయి. సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా.. మిలన్లో కీలకమైనది 27న జరిగే ఇంటర్నేషనల్ సిటీ పరేడ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ దేశాల నౌకాదళ అధికారులు సహా మొత్తం 5 వేల మంది అతిథులు హాజరవుతారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర జరిగే పరేడ్‌ని తిలకించేందుకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మిలన్కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, సీనియర్ బ్యూరోక్రాట్లు, వివిధ దేశాలకు చెందిన 150 మంది ఉన్నతాధికారులు హాజరవుతారని భావిస్తున్నారు. ఇందు కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 5 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించారు. ఇతర జిల్లాల నుంచి సివిల్ పోలీస్, ఆర్మ్డ్ రిజర్వ్, స్పెషల్ పోలీస్‌ను రప్పిస్తున్నారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి తీవ్రవాద నిరోధక దళాలతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, మార్కోస్ వంటి కేంద్ర భద్రతా దళాలతో కూడిన సుమారు 3,500 మందిని నగరంలో మోహరించనున్నారు. అణువణువూ అండర్ కంట్రోల్! సిటీ పరేడ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అణువణువూ పోలీసుల పర్యవేక్షణలో ఉండనుంది. విన్యాసాలు తిలకించేందుకు అతిథుల కోసం 10 ఎన్క్లోజర్లు, సాధారణ ప్రజలు వీక్షించేందుకు 32 ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్డులోని ఈవెంట్ ప్రాంతంలోకి ప్రజలను అనుమతించడానికి దాదాపు 16 మార్గాలు ఖరారు చేశారు. ప్రజలు విన్యాసాల్ని స్పష్టంగా తిలకించేందుకు బీచ్ రోడ్లో, ఎన్క్లోజర్ల వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీవీఐపీ మార్గంలో, బీచ్ రోడ్లో 400 సీసీ కెమెరాలు అమర్చనున్నారు. 18 క్విక్ రియాక్షన్ టీమ్‌లు శాంతి భద్రతల్ని పర్యవేక్షించనున్నాయి. వీరితో పాటు 400కి పైగా అత్యంత శక్తివంతమైన బాంబు నిర్వీర్య బృందాలు, 25 స్నిఫర్ డాగ్‌లతో 450 మంది సాయుధ పోలీసులను ఆ ప్రాంతంలో మోహరించనున్నారు. మిలన్ అంటే.. హిందీలో సమావేశం అని అర్థం. వివిధ దేశాల మధ్య సహృద్భావ వాతావరణంలో స్నేహ పూర్వక సత్సంబంధాల్ని మెరుగు పరచుకోవడంతో పాటు శత్రు సైన్యానికి బలం, బలగం గురించి నిత్యం తెలియజేసేందుకు ఈ విన్యాసాలు నిర్వహిస్తుంటారు. మిలన్ బహుపాక్షిక విన్యాసాలకు భారత నౌకాదళం సారధ్యం వహించనుంది. ఈ ఏడాది ‘స్నేహం–సమన్వయం–సహకారం’ థీమ్‌తో ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు నౌకాదళం ప్రకటించింది. -
మన శక్తిని చాటిచెప్పారు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘సముద్ర జలాల్లో ఎదురవుతున్న సమస్యల్ని తిప్పికొట్టేందుకు స్నేహపూర్వక దేశాలతో కలిసి భారత నౌకాదళం రాజీలేని పోరాటం చేయాలి. హిందూ మహా సముద్రంలో ప్రధాన భద్రతా భాగస్వామిగా భారత్ వ్యవహరించాలి’ అని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్షించారు. విశాఖపట్నం సముద్ర జలాల్లో సోమవారం ఉదయం నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి పాల్గొన్నారు. భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రయాణిస్తూ.. లంగరు వేసిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములను ఆయన సమీక్షించారు. ‘‘70 శాతం నౌకలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. ఇది శుభపరిణామం. కోవిడ్ సమయంలో భారత నావికాదళం చేసిన సేవలు అమోఘం. స్నేహపూర్వక దేశాలకు అవసరమైన మందులను సముద్రసేతు, మిషన్ సాగర్ వంటి కార్యక్రమాల ద్వారా వారికి చేరవేసింది. వైజాగ్ అని పిలిచే విశాఖ నగరం అందమైన చారిత్రక నగరం. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుత సహకారం అందించింది’’ అని రాష్ట్రపతి కొనియాడారు. నౌకాదళంతో పాటు జాతినుద్దేశించి ప్రసంగించిన రామ్నా«థ్ కోవింద్ ఇంకా ఏమన్నారంటే.. ఆనందం కలిగించింది.. ఈరోజు మీతో కలిసి ప్రయాణించడం చాలా సంతోషంగా ఉంది. నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, హెలికాప్టర్లు మొదలైన భారత నౌకాదళ సంపత్తి సామర్థ్యాన్ని సమీక్షించడం చాలా ఆనందం కలిగించింది. పీఎఫ్ఆర్ సందర్భంగా నిర్వహించిన విన్యాసాలు, కవాతు, ఇతర అంశాలన్నీ సముద్ర జలాల్లో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని, దేశానికి ఇండియన్ నేవీ అందిస్తున్న సేవల్ని ప్రతిబింబిస్తున్నాయి. అకస్మాత్తుగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భారత నౌకాదళం ఎంత సంసిద్ధతతో ఉంటుందో ఇవి ప్రస్ఫుటిస్తున్నాయి. వైజాగ్.. ఓ అందమైన నగరం వైజాగ్.. అని పిలిచే విశాఖపట్నం అందమైన నగరం. శతాబ్దాల కాలంగా ముఖ్యమైన ఓడరేవుగా గుర్తింపు పొందింది. దేశాల మధ్య వాణిజ్య, వ్యాపారాలకు ఇది కీలక ప్రాంతం. ఆరో శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకూ పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థకు విశాఖపట్నం ముఖ్యమైన కేంద్రం. రానున్న రోజుల్లో కూడా ఇది కొనసాగాలి. ఇక్కడ ఏర్పాటైన తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం ఈ విషయాలన్నింటికీ సాక్షీభూతంగా ఉంది. 1971లో పాకిస్థాన్ యుద్ధ సమయంలో వైజాగ్ అద్భుతమైన సహకారం అందించింది. ఈ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘ది గోల్డెన్ స్వర్ణిమ్ విజయ్’ వేడుకలు ఇటీవలే ముగిశాయి. ఈ విజయోత్సవాలు తూర్పు నౌకాదళం పాటవాల్ని గుర్తుచేస్తుంటాయి. పాకిస్థాన్ జలాంతర్గామి ’ఘాజీ’ని సముద్రంలో జలసమాధి చేయడమనేది పాక్‌కు నిర్ణయాత్మక దెబ్బ. ఈ ఘటన తర్వాతే 1971 యుద్ధం దేశ చరిత్రలో అత్యంత బలమైన విజయాలలో ఒకటిగా నిలిచింది. నౌకాదళ సేవలు ప్రశంసనీయం సముద్ర భద్రతని పటిష్టపర్చుకుంటూ.. దేశంలోని అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అందరికీ భద్రత కల్పించేందుకు నౌకాదళం దృష్టి కేంద్రీకరించాలి. మిత్ర దేశాలతో సహకార చర్యలు కొనసాగించాలి. ప్రపంచ వాణిజ్యంలో సింహభాగం శాసిస్తున్న హిందూ మహా సముద్ర ప్రాంతం భద్రతాపరంగా చాలా కీలకం. ఇక్కడ ఏ చిన్న సంఘటన ఎదురైనా సత్వరమే స్పందిస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న భారత నౌకాదళ సేవలు ప్రశంసనీయం. ముఖ్యంగా.. కోవిడ్ కష్ట కాలంలో భారత నౌకాదళం అందించిన సేవలు శ్లాఘనీయం. ఔషధాలను సరఫరా చేయడంతోపాటు వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో కీలకంగా వ్యవహరించింది. హిందూ మహా సముద్రంలో ఏ సమస్య తలెత్తినా.. ‘ప్రాధాన్య భద్రతా భాగస్వామి’గానూ. ‘మొట్టమొదట స్పందించే దేశంగానూ భారత్ ముందు వరుసలో నిలబడాలని కాంక్షిస్తున్నాను. ఏపీ ప్రభుత్వానికి అభినందనలు ఇండియన్ నేవీ స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపుతో ముందంజలో ఉంటూ ఇటీవల కాలంలో తయారుచేస్తున్న యుద్ధ నౌకలు, జలాంతర్గాముల్లో 70 శాతం స్వదేశీ పరిజ్ఞానం ఉండటం భారత్ గర్వించదగ్గ విషయం. అణు జలాంతర్గాముల్నీ నిర్మిస్తున్నాం. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్లు తయారుచేస్తున్న అగ్రదేశాల సరసన భారత్ నిలవడం గర్వకారణం. ఐఎన్ఎస్ విక్రాంత్ నిర్మాణంతో ఇది సాధ్యమైంది. గతేడాది డిసెంబర్లో నా కొచ్చి పర్యటనలో ‘విక్రాంత్’ను పరిశీలించాను. ’ఆత్మనిర్భర్ భారత్’ నిర్మాణానికి ఇది నాంది పలుకుతోంది. ద్వైపాక్షిక మరియు బహుపాక్షిక విన్యాసాల్ని నిరంతరం నిర్వహిస్తుండటం ద్వారా.. స్నేహపూర్వక దేశాలతో సత్సంబంధాలు పటిష్టం చేసుకుంటూ ఇంటర్ ఆపరేబిలిటీని మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. సముద్ర సమస్యలను పరిష్కరించడానికి పరస్పర సహకార భాగస్వామ్యాన్ని నిర్మించుకోవాలి. ఈ విషయంలో త్వరలో నిర్వహించనున్న మిలాన్–2022 విజయవంతం కావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చారిత్రాత్మకమైన విన్యాసాలకు ఆహ్వానం పలుకుతున్న భారత నౌకాదళాన్ని అభినందిస్తున్నాను. అలాగే, పీఎఫ్ఆర్, మిలాన్–2022 వేడుకల్ని ఘనంగా నిర్వహించే విషయంలో పూర్తి సహకారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను. పీఎఫ్ఆర్ విజయవంతం చేసేందుకు మద్దతు పలికిన జిల్లా అధికారులు, విశాఖ ప్రజలకు ధన్యవాదాలు. ఈరోజు ఎంతో సంతృప్తినిచ్చింది. భారత నౌకాదళాన్ని చూసి దేశం గర్విస్తోంది. భారతదేశ జాతీయ ప్రయోజనాలను పరిరక్షిస్తున్న భారత నౌకాదళానికి శుభాకాంక్షలు చెబుతున్నాను.. అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని ముగించారు. -
ఉప్పొంగిన తూర్పుతీరం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారతదేశ నౌకాదళ శక్తి సామర్థాల్ని చూసి సంద్రం ఉప్పొంగింది. త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. దేశ రక్షణ విషయంలో అగ్రరాజ్యాలతో పోటీపడుతూ.. తన పాటవాన్ని భారత నౌకాదళం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. సమరానికి ఏ క్షణమైనా సన్నద్ధమంటూ సంద్రంలో సవాల్ చేస్తూ నాలుగు వరుసల్లో నిలుచున్న యుద్ధ నౌకలు.. త్రివర్ణ పతాకానికి సగర్వంగా సెల్యూట్ చేస్తూ శత్రు సైన్యాన్ని జలసమాధి చేసేందుకు సిద్ధమంటూ సబ్మెరైన్లు.. గాలికంటే వేగంగా దూసుకెళ్తూ మిగ్ విమానాలు హోరెత్తించాయి. గగన తలంలో దేశ గర్వానికి ప్రతీకలుగా యుద్ధ విమానాల విన్యాసాలు.. సముద్ర కెరటాలతో పోటీపడుతూ చేతక్ హెలికాప్టర్లు అలరించాయి. యుద్ధమైనా, సహాయమైనా క్షణాల్లో వాలిపోతామంటూ మెరైన్ కమాండోలు చేసిన విన్యాసాలు.. వెరసి భారత నౌకాదళ సర్వ సంపత్తి ఒకేచోట చేరి నిర్వహించిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాలు మొత్తం విశాఖ వైపు చూసేలా చేసింది. మొత్తంగా త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నిర్వహించిన భారత యుద్ధ నౌకల సమీక్ష ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్–2022) ఆద్యంతం ఆకట్టుకుంది. గౌరవ వందనం భారతదేశ చరిత్రలో ఇది 12వ ఫ్లీట్ రివ్యూ. దేశ తూర్పు తీరంలో మూడో సమీక్షగా విశాఖలో జరుగుతున్న పీఎఫ్ఆర్ సోమవారం జరిగింది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు ఆదివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. సోమవారం ఉదయం రాష్ట్రపతి హార్బర్‌కు రాకముందు 150 మంది సెయిలర్స్ గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించారు. 9 గంటలకు రాష్ట్రపతి హార్బర్ చేరుకున్నారు. ఈయనకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, నాలుగు నౌకాదళ కమాండ్ల చీఫ్‌లు వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్, వైస్ అడ్మిరల్ హంపిహోలి, లెఫ్టినెంట్ జనరల్ అజయ్ సింగ్ తదితరులు స్వాగతం పలికారు. ముందుగా 21 తుపాకులతో భారత నౌకాదళం సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించిన రాష్ట్రపతి.. ప్రెసిడెన్షియల్ యాచ్‌గా సిద్ధంగా ఉన్న ఐఎన్ఎస్ సుమిత్ర యుద్ధనౌకలో సతీసమేతంగా సమీక్షకు బయలుదేరారు. నౌక ముందుభాగంలో ప్రత్యేకంగా సిద్ధంచేసిన డెక్‌పై రాష్ట్రపతి దంపతులు ఆశీనులు కాగా.. రెండువైపులా రక్షణ మంత్రి, గవర్నర్, నౌకాదళాధిపతి కూర్చున్నారు. నౌకాదళ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్. చిత్రంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి హరికుమార్ నౌకాదళ పాటవాల్ని సమీక్షించిన రాష్ట్రపతి ఈ ఏడాది పీఎఫ్ఆర్కు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా సమన్వయకర్తగా వ్యవహరించారు. రాష్ట్రపతిని తీసుకుని ప్రెసిడెన్షియల్ యాచ్ ఐఎన్ఎస్ సుమిత్ర ముందుకు సాగుతుండగా.. సుమిత్ర కాన్వాయ్‌గా ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ సావిత్రి, టాంగో–39, టాంగో–40 యుద్ధనౌకలు బయల్దేరాయి. బంగాళాఖాతం సముద్ర జలాల్లో నాలుగు వరుసల్లో లంగరు వేసిన యుద్ధనౌకల మధ్యగుండా సాగుతూ వాటిపై నుంచి నౌకాదళ సిబ్బంది సమర్పించిన గౌరవ వందనాన్ని త్రివిధ దళాధిపతి స్వీకరించారు. యుద్ధ నౌకల సిబ్బంది ప్రతి వార్ షిప్ ముందు నిల్చుని టోపీలని చేతితో తిప్పుతూ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. మొత్తం షిప్‌లను సమీక్షించిన తర్వాత సబ్‌మెరైన్ కాలమ్‌లో ఉన్న ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ సింధుకీర్తి, ఐఎన్ఎస్ సింధురాజ్ జలాంతర్గాముల్ని ఆయన సమీక్షించారు. అబ్బురపరిచిన విన్యాసాలు ఇక రెండు గంటలకు పైగా సాగిన నౌకాదళ సమీక్షలో ఇండియన్ నేవీ.. తన సామర్థ్యాల్ని ఘనంగా ప్రదర్శించింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన చేతక్ హెలికాప్టర్లతో పాటు సీకింగ్స్, కామోవ్, యుటిలిటీ హెలికాఫ్టర్ (యూహెచ్)–త్రీహెచ్, అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఎఎల్‌హెచ్)లతో పాటు డార్నియర్స్, మిగ్–29కే, హాక్స్, మల్టీ మిషన్ మేరీటైమ్ ఎయిర్క్రాఫ్టŠస్ పీ8ఐ, ఐఎల్ 38 మొదలైన యుద్ధ విమానాలు నిర్వహించిన విన్యాసాలు ఉత్కంఠగా సాగాయి. యుద్ధ నౌకల సమీక్ష అనంతరం ఒకేసారి అన్ని ఎయిర్‌క్రాఫ్ట్‌లు గాల్లోకి దూసుకుపోతూ ఫ్లై పాస్ట్ నిర్వహించాయి. ఈ యుద్ధ విమానా విన్యాసాలు సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. ఈ సందర్భంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ల డెమోతో మెరైన్ కమాండోలు నిర్వహించిన వాటర్ పారా జంప్స్, విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తపాలా బిళ్ల విడుదల చేసిన రాష్ట్రపతి ప్రతి పీఎఫ్ఆర్ లేదా ఐఎఫ్ఆర్ నిర్వహించిన తర్వాత దాని పేరుతో పోస్టల్ స్టాంప్, కవర్ విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా సోమవారం పీఎఫ్ఆర్–2022 జ్ఞాపకార్థం తపాలా శాఖ రూపొందించిన స్టాంప్, పోస్టల్ కవర్ని నేవల్ బేస్‌లో రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర కమ్యునికేషన్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ జె చౌహాన్, భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్, తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
విశాఖలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి పాటవాలను సమీక్షించేందుకు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేరుకున్నారు. ఆదివారం ఆయనకు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం (21వ తేదీ) విశాఖలో జరగనున్న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్)లో పాల్గొనేందుకు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగకు చేరుకున్నారు. అంతకుముందే విశాఖకు చేరుకున్న గవర్నర్, సీఎంలు ఆయనకు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అనంతరం సాయంత్రం 6.25 గంటలకు సీఎం జగన్ తాడేపల్లికి బయలుదేరారు. విశాఖ తీరంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు సందడి చేస్తున్నాయి. సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే పీఎఫ్ఆర్లో ప్రెసిడెన్షియల్ యాచ్‌గా ఉన్న ఐఎన్ఎస్ సుమిత్ర నుంచి మొత్తం 60 యుద్ధనౌకలను త్రివిధ దళాధిపతి హోదాలో రాష్ట్రపతి సమీక్షించనున్నారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో పైకి ఎగిరి రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పిస్తాయి. పీఎఫ్ఆర్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఏపీ గవర్నర్, అండమాన్ నికోబార్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పాల్గొంటున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు కన్నబాబు, మేకతోటి సుచరిత, ముత్తంశెట్టి శ్రీనివాస్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి ఉన్నారు. ‘ఐఎన్ఎస్ విశాఖ’కు అరుదైన గౌరవం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై మొదటిసారిగా విశాఖకు వచ్చిన ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకకు అరుదైన గౌరవం దక్కనుందని తెలుస్తోంది. పీఎఫ్ఆర్ ప్రారంభమైన వెంటనే ప్రెసిడెన్షియల్ యాచ్ నుంచి బయలుదేరనున్న రాష్ట్రపతి తొలుత ఈ యుద్ధ నౌక వద్దకు చేరుకుంటారు. అక్కడ నౌకాదళ అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం చేస్తారు. ఈ నౌకను గతేడాది నవంబర్ 21న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. ప్రాజెక్ట్–15బి పేరుతో పూర్తి దేశీయంగా నాలుగు స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలను తయారు చేయాలన్న భారత నౌకాదళ నిర్ణయంలో భాగంగా ఈ నౌకను తయారు చేశారు. 2013లోనే ఈ నౌక తయారీ పనులను ముంబయిలో ప్రారంభించారు. ఈ యుద్ధ నౌక క్షిపణులను తీసుకెళ్లడమే కాకుండా మిసైల్ డిస్ట్రాయర్గా సేవలందించనుంది. ప్రస్తుతం ఇది విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం పరిధిలో చేరింది. దీంతో పాటు వివిధ నావికాదళాల 60 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు పీఎఫ్ఆర్లో పాలుపంచుకుంటున్నాయి. ప్రధానంగా ముంబయి కేంద్రంగా ఉన్న పశ్చిమ నావికాదళం నుంచి ఐఎన్ఎస్ చెన్నై, అండమాన్ నికోబార్ కమాండ్ నుంచి ఐఎన్ఎస్ ఢిల్లీ, విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నావికాదళం నుంచి ఐఎన్ఎస్ సాయద్రీ, కొచ్చి కేంద్రంగా ఉన్న దక్షిణ నావికాదళం నుంచి ఐఎన్ఎస్ సాపుత్ర పాల్గొంటున్నాయి. శివాలిక్ క్లాస్ కింద ఉన్న 4 నౌకలు, కమోర్టా క్లాస్‌లో ఉన్న 3 నౌకలు, చేతక్, ఏఎల్‌హెచ్, సీ కింగ్స్ హెలికాప్టర్స్‌తో పాటు కామోవ్స్, డార్నియర్స్, ఐఎల్–38ఎస్డీ, పీ8ఐ, హాక్స్, మిగ్ 29 కే యుద్ధ విమానాలు కూడా పీఎఫ్ఆర్లో విన్యాసాలు చేయనున్నట్టు భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ వెల్లడించారు. పీఎఫ్ఆర్కు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. కాగా, ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకపై నుంచే ఈ నెల 18న బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. -
సబ్‌మెరైన్ పేలినా.. సెకన్లలో అదుపులోకి..
2013 ఆగస్ట్ 13.. నౌకాదళ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని ఘోర దుర్ఘటన సంభవించింది. ముంబై కొలాబా డాక్‌యార్డులో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో అర్ధరాత్రి వరస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 18 మంది సిబ్బంది మృత్యువాత పడ్డారు. పేలుళ్లతో చాలా భాగం దెబ్బతిన్న సబ్‌మెరైన్ సముద్రంలో సగం వరకు మునిగిపోయింది. దుర్ఘటన జరిగిన సమయంలో సబ్‌మెరైన్‌లో టార్పెడోలు, క్షిపణులు సహా పూర్తిస్థాయిలో ఆయుధాలు ఉన్నాయి. సబ్‌మెరైన్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న పేలుడు శబ్దాలు రెండు కిలోమీటర్ల వరకు వినిపించాయి. యుద్ధ నౌకలో గానీ.. సబ్‌మెరైన్‌లో గానీ.. చిన్నపాటి ప్రమాదం సంభవిస్తే.. అది భారీ విపత్తుగా మారుతుంది. అగ్నిమాపక వ్యవస్థ ఉన్నప్పటికీ.. క్షణాల్లో వ్యాపించే ప్రమాదాన్ని మాత్రం నియంత్రించలేకపోతుంది. సింధు రక్షక్‌లో ప్రమాదం తర్వాత.. ఆధునిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన భారత నౌకాదళం.. రష్యా, అమెరికా వంటి దేశాల వ్యవస్థను మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడా పరిస్థితిని అధిగమించి..అగ్రరాజ్యాల సరసన నిలిచేలా అత్యాధునిక మ్యాగజైన్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్(ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్)ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: ప్రపంచంలో అత్యంత కీలకమైన నౌకా దళాల్లో అగ్రభాగాన ఉన్న దేశాల సరసన ఉన్న భారత్‌లో రోజు రోజుకూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దానికనుగుణంగా వ్యవస్థలోనూ అత్యాధునిక మార్పులు తీసుకొచ్చేందుకు రక్షణ వ్యవస్థ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రక్షణ సేవల రంగంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న క్రౌన్ గ్రూప్(డిఫెన్స్ ఇంజినీరింగ్ డివిజన్) ఇప్పుడు ఎంఎఫ్ఎఫ్ఎస్ను భారత నౌకాదళంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. మ్యాగజైన్ ఇక సురక్షితం ప్రతి యుద్ధ నౌక, సబ్‌మెరైన్‌లో మ్యాగజైన్ అనే కంపార్ట్మెంట్ ఉంటుంది. ఇందులో పేలుడు పదార్థాలు, యుద్ధ సామగ్రిని సురక్షితంగా నిల్వ చేస్తారు. ఈ కంపార్ట్మెంట్ను అత్యంత సురక్షితంగా డిజైన్ చేస్తారు. ఆయా యుద్ధ సామగ్రికి అవసరమైన ఉష్ణోగ్రత, పీడనం, రేడియేషన్‌లో మార్పులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు. ఏ చిన్న సమస్య ఉత్పన్నమైనా.. మొత్తం యుద్ధనౌకతో పాటు పొరపాటున డాక్లో యాంకరేజ్ అయి ఉంటే.. పక్కన ఉన్న నౌకలు కూడా ప్రమాదం బారిన పడతాయి. అందుకే వీటిలో ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయ్యే అగ్నిమాపక వ్యవస్థలు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో క్రౌన్ గ్రూప్ ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటుకు రక్షణ వ్యవస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ వ్యవస్థ ఏర్పాటైతే.. సింధు రక్షక్ సబ్‌మెరైన్‌లో మాదిరిగా పేలుడు సంభవిస్తే.. సెకన్ల వ్యవధిలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకురాగలరు. విశాఖలో షిప్ బిల్డింగ్‌కు సన్నాహాలు డిఫెన్స్ సర్వీస్ సెక్టార్లో ప్రధాన పాత్రధారిగా ఉన్న క్రౌన్ గ్రూప్ విశాఖపట్నంలో తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా షిప్ బిల్డింగ్ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే నగరంలో వర్క్‌షాప్ కార్యకలాపాలు ప్రారంభించిన క్రౌన్ సంస్థ.. తూర్పు నౌకాదళ అవసరాలకు అనుగుణంగా నిర్వహణ, రీఫిట్, ఆపరేషనల్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. విశాఖ తీరంలో షిప్ బిల్డింగ్ సెంటర్ ఏర్పాటుకు కూడా రక్షణ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతోంది. ఇప్పటికే హిందూస్థాన్ షిప్‌యార్డు విశాఖలో ఉంది. ఇప్పుడు మరో షిప్‌యార్డు వస్తే.. యుద్ధ నౌకల తయారీలో విశాఖ నగరం కీలకంగా మారనుంది. యుద్ధ నౌకలు.. సబ్‌మెరైన్‌లో... ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫ్యాక్చర్స్(ఓఈఎం) సహకారంతో నౌకాదళంలోని యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లో ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ ఏర్పాటుకు అవసరమైన సామర్థ్యాన్ని సిద్ధం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం భారత నౌకాదళంలో మొత్తం 150 యుద్ధ నౌకలు, సబ్మెరైన్లుండగా.. రానున్న ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య 180 వరకు చేరుకోనుంది. ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల్లో భాగంగా 30 వరకూ యుద్ధ నౌకలు ఆయా షిప్‌యార్డుల్లో తయారవుతున్నాయి. వీటన్నింటిలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. షిప్లో మ్యాగజైన్ కంపార్ట్మెంట్ రక్షణ రంగంలో కీలకంగా వ్యవహరిస్తాం విశాఖ తీరం ఎంతో అభివృద్ధి చెందడానికి కీలకంగా ఉంది. అందుకే ఇక్కడ షిప్ బిల్డింగ్ సంస్థ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే పశ్చిమ తీరంలో వ్యూహాత్మక షిప్‌యార్డ్‌లను కొనుగోలు చేయడం లేదా.. భాగస్వామిగా జతకట్టాలని భావిస్తున్నాం. తూర్పు తీర ప్రధాన కేంద్రంగా ఉన్న వైజాగ్‌కు దక్షిణ భాగంలో షిప్‌యార్డ్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఐఎన్ఎస్ జలాశ్వ, విమాన వాహక నౌక విక్రమాదిత్యకు మరమ్మతులు, సర్వీసింగ్, మెయింటెనెన్స్ వంటి సవాళ్లతో కూడిన పనిని విజయవంతంగా పూర్తి చేసి.. పీఎఫ్ఆర్, మిలాన్ విన్యాసాలకు సిద్ధం చేశాం. భవిష్యత్‌లో అన్ని యుద్ధనౌకలకు ఎంఎఫ్‌ఎఫ్‌ఎస్ అత్యవసరం కాబట్టి ఈ టెక్నాలజీని దేశంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాం. – కమాండర్ రాకేష్ ఆనంద్, క్రౌన్ మెరైన్ డివిజన్ హెడ్ -
కడలిలో కదన రంగం
సాక్షి, విశాఖపట్నం: నీలి కెరటాలలో నౌకా దళ యుద్ధ విన్యాసాలకు విశాఖ తీరం సిద్ధమవుతోంది. అంతర్జాతీయంగా స్నేహపూర్వక వాతావరణం, సమన్వయం, సహకారంతో మహా సముద్రాల మధ్య బంధాల్ని బలోపేతం చేసే ప్రధాన ఘట్టాలకు విశాఖలోని తూర్పు నౌకాదళం ఆతిథ్యమిస్తోంది. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్), వివిధ దేశాల నౌకా దళాల యుద్ధ విన్యాసాలతో మిలాన్ – 2022కి ఏర్పాట్లు చేసింది. ఈ రెండు ప్రతిష్టాత్మక విన్యాసాల కోసం నౌకాదళం చేస్తున్న రిహార్సల్స్‌తో విశాఖ సాగర తీరం సందడిగా కనిపిస్తోంది. మిలాన్–2022, ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూల వివరాల్ని నౌకాదళం గురువారం విడుదల చేసింది. ఈ నెల 21న పీఎఫ్ఆర్ జరగనుంది. ఈ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి, త్రివిధ దళాధిపతికి వందనం సమర్పించడంతో పాటు భారత నౌకాదళ సత్తాని ప్రపంచానికి చాటి చెప్పనుంది. అనంతరం.. 25 నుంచి మార్చి 4 వ తేదీ వరకు మిలాన్–2022 పేరుతో అంతర్జాతీయ విన్యాసాలు నిర్వహిస్తోంది. 60 యుద్ధ నౌకలు.. 55 యుద్ధ విమానాలు ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూలో ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్‌కి చెందిన 60 యుద్ధ నౌకల్లో 10 వేల మంది సిబ్బందిని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమీక్షిస్తారు. రాష్ట్రపతి కోసం ఐఎన్ఎస్ సుమిత్ర ప్రెసిడెంట్ యాచ్‌గా రూపుదిద్దుకుంది. ఆ నౌక నుంచి రాష్ట్రపతి విశాఖ తీరంలో లంగరు వేసిన 44 యుద్ధ నౌకల్ని పరిశీలిస్తారు. అనంతరం నౌకాదళానికి చెందిన 55 యుద్ధ విమానాలు గగనతల విన్యాసాలు చేస్తాయి. సబ్‌మెరైన్ – షిప్ ఫార్మేషన్ స్టీమ్ పాస్ట్, ఎలైట్ మెరైన్ కమాండోస్ ద్వారా వాటర్ పారా జంప్‌లు, సముద్రంలో సెర్చ్ అండ్ రెస్క్యూ ప్రదర్శన, హాక్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ఏరోబాటిక్స్తో పాటు ప్రఖ్యాత ఐఎన్ఎస్వీ మహాదేయ్ సహా బోట్ల కవాతు అలరించనున్నాయి. సమీక్ష అనంతరం ఫ్లీట్ రివ్యూకి సంబంధించిన పోస్టల్ కవర్, స్మారక తపాలా బిళ్లని రాష్ట్రపతి విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దేవుసింహ్ జె చౌహాన్ కూడా పాల్గొంటారు. 45 దేశాలతో మిలాన్–2022 రికార్డు ఫిబ్రవరి 25 నుంచి జరగనున్న మిలాన్–2022లో 45కి పైగా దేశాలు పాల్గొంటాయని నౌకాదళం వెల్లడించింది. ఇప్పటివరకూ 17 దేశాలు పాల్గొన్న అతి పెద్ద మిలాన్ రికార్డుని తిరగ రాస్తున్నట్లు తెలిపింది. మిలాన్–22లో 15 కంటే ఎక్కువ విదేశీ యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. 11 మంది విదేశీ నౌకాదళాలు, కోస్ట్ గార్డ్ల చీఫ్‌లు, 120 కంటే ఎక్కువ మంది విదేశీ ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ – హిందూ ఓషన్ రీజియన్ (ఐఎఫ్సీఐఓఆర్) నివేదిక ప్రకారం వివిధ దేశాల నుంచి 30 కంటే ఎక్కువ మంది డిఫెన్స్, నేవల్ అధికారులు, 2000కు పైగా విదేశీ నౌకాదళ సిబ్బంది విదేశీ యుద్ధ నౌకలు, విమానాలలో బయలుదేరినట్లు సమాచారం. 27న జరిగే ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌లో 35 బృందాలతో విన్యాసాలు, అంతర్జాతీయ సిబ్బంది ఫ్లైపాస్ట్ జరుగుతాయి. సిటీ పరేడ్‌ను నాలుగు లక్షలకు పైగా ప్రజలు తిలకిస్తారని అంచనా వేస్తున్నట్లు నౌకాదళం వెల్లడించింది. -
సర్వాంగ సుందరంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న నౌకాదళ విన్యాసాలకు ఆహ్వానం పలుకుతున్న విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్), 25 నుంచి మార్చి 4 వరకూ మిలాన్ విన్యాసాలకు విశాఖ నగరం ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను సీఎస్ శనివారం సమీక్షించారు. బీచ్‌రోడ్డు, తూర్పు నౌకాదళ పరిధిలో రహదారులు, పోర్టు పరిసరాలు, వీవీఐపీలు ప్రయాణించే మార్గాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పైలాన్‌ను సమీర్‌శర్మ, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్లో తూర్పు నౌకాదళ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టరేట్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు, జీవీఎంసీ.. పరిశ్రమలు, టూరిజం, కస్టమ్స్ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నాటికి నగరంలో అన్ని పనులూ పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో పారిశుధ్యం, రహదారులు, బ్యూటిఫికేషన్‌పై దృష్టిసారించాలన్నారు. ఘనంగా మిలాన్ ఏర్పాట్లు అదేవిధంగా 25 నుంచి ప్రారంభమయ్యే మిలాన్‌కు కూడా ఏర్పాట్లు ఘనంగా ఉండాలని సీఎస్ సూచించారు. మిలాన్–2022కి సుమారు 46 దేశాలకు చెందిన 900 మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని వారికి పరిచయం చేసి.. ఆంధ్ర సంప్రదాయానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 27న బీచ్ రోడ్డులో జరిగే ఇంటర్నేషనల్ పరేడ్ కార్నివాల్‌ని తిలకించేందుకు సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా, నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ, వీఎంఆర్డీఏ కమిషనర్ వెంకటరమణారెడ్డి, జేసీ వేణుగోపాల్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నౌకా విన్యాసాలకు సర్వం సన్నద్ధం
సాక్షి, విశాఖపట్నం: మరికొద్ది రోజుల్లో నగరంలో జరగనున్న రెండు భారీ నౌకాదళ విన్యాసాలకు విశాఖపట్నం వేదిక కాబోతోంది. ఇందుకోసం సాగర తీరం సర్వహంగులతో సన్నద్ధమవుతోంది. ఈనెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, 25 నుంచి మార్చి 4 వరకు మిలాన్–2022 అంతర్జాతీయ నావికా విన్యాసాలతో విశాఖ అంతర్జాతీయ పటంలో మరోసారి మెరుపులు మెరిపించనుంది. ఈ నేపథ్యంలో.. భారత నౌకాదళం ఆధ్వర్యంలో జరిగే విన్యాసాల కోసం విశాఖ తీరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఫ్లీట్ రివ్యూ ఎందుకంటే.. 1971లో పాకిస్తాన్‌లోని కరాచీ పోర్టుపై దాడిచేసి విజయపతాక ఎగురవేసిన చరిత్ర ఈ దళానిది. అప్పటి నుంచి భారతీయ నౌకాదళంలో ఈఎన్సీకి ప్రత్యేక గుర్తింపు లభించింది. అందుకే ప్రధాన విన్యాసాలకు కేంద్రంగా.. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలకు వేదికగా విశాఖ నిలుస్తోంది. 2006లో మొదటిసారిగా ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ నిర్వహించి సత్తాచాటిన విశాఖ నగరం.. 2016లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూతో ప్రపంచమంతా నగరం వైపు చూసేలా కీర్తి గడించింది. ఇప్పుడు రెండో పీఎఫ్ఆర్తో మొట్టమొదటిసారిగా మినీ ఐఎఫ్ఆర్గా పిలిచే మిలాన్–2022కి ముస్తాబవుతోంది. 20న రాష్ట్రపతి రాక ఈనెల 21న జరిగే పీఎఫ్ఆర్ కోసం 20వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విశాఖకు చేరుకోనున్నారు. ఆయనకు సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా సాదర స్వాగతం పలుకుతారు. ఈఎన్సీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్రపతి బసచేస్తారు. 21న ఉ.9 గంటలకు ఫ్లీట్ రివ్యూ మొదలుకానుంది. 11.45 వరకూ జరిగే ఈ రివ్యూలో నేవీతో పాటు కోస్ట్‌గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన సుమారు 60 నౌకలతోపాటు సబ్ మెరైన్లు, 50కిపైగా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లని నాలుగు వరుసల్లో నిలుపుతారు. వీటిని త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి యుద్ధనౌకలో నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని సమీక్షిస్తారు. చివరిగా భారతీయ నౌకాదళాలకు చెందిన యుద్ధ విమానాలన్నీ ఏకకాలంలో తమ గౌరవ వందనాన్ని అందజేసేందుకు పైకి ఎగురుతూ రాష్ట్రపతికి సెల్యూట్ చేస్తాయి. అనంతరం పీఎఫ్ఆర్కు సంబంధించిన తపాలా బిళ్లని, పోస్టల్ కవర్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు. 25 నుంచి మిలాన్ మెరుపులు.. ఇక పీఎఫ్ఆర్ తర్వాత.. 25వ తేదీ నుంచి వివిధ దేశాల నౌకాదళాల మధ్య స్నేహపూర్వక సత్సంబంధాలను బలోపేతం చేసేలా మిలాన్–2022 విన్యాసాలు ప్రారంభమవుతాయి. మార్చి 4 వరకూ జరిగే ఈ విన్యాసాల్లో 46కి పైగా దేశాల నౌకలు, యుద్ధ విమానాలు పాల్గొంటాయి. నిజానికి.. 1995లో మిలాన్ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్లకోసారి నిర్వహించే మిలాన్‌లో ఏటా దేశాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2014లో 17 దేశాలు పాల్గొని అతిపెద్ద ఫ్లీట్ రివ్యూగా చరిత్రకెక్కింది. 27న ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ మరోవైపు.. 25న అన్ని దేశాలకు చెందిన ప్రతినిధులు విశాఖ చేరుకుంటారు. 26న కేంద్ర రక్షణ శాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధికారికంగా మిలాన్ విన్యాసాల్ని ప్రారంభిస్తారు. ► 27, 28 తేదీల్లో అంతర్జాతీయ మారీటైమ్ సెమినార్ జరుగుతుంది. ఈ సదస్సులో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా. ఎస్ జయశంకర్ హాజరవుతారు. ► 27 సా.4.45కు విశాఖ బీచ్‌రోడ్డులో జరిగే ఆపరేషనల్ డిమాన్స్ట్రేషన్, ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ► ఈ సందర్భంగా యుద్ధనౌక ఐఎన్ఎస్ విశాఖని సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేస్తారు. షెడ్యూలు, ఏర్పాట్లు ఇలా.. ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ: ఫిబ్రవరి 21 మిలాన్–2022 ప్రారంభం: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్: ఫిబ్రవరి 27 సా.4.45 నుంచి ముఖ్య అతిథి: సీఎం వైఎస్ జగన్ పాల్గొనే దేశాలు: సుమారు 46 విదేశీ అతిథులు: 900 మంది ఆతిథ్యానికి సిద్ధంచేసిన హోటళ్లు: 15 బందోబస్తుకు సిద్ధంచేసిన పోలీస్ సిబ్బంది: 5,000 హాజరయ్యే వారు: సుమారు 2 లక్షలు కేటాయించిన మొత్తం: రూ.22.27 కోట్లు తిలకించేందుకు ఏర్పాట్లు: 25 వీడియో సిస్టమ్‌లు, బీచ్‌రోడ్‌లో 3 కిమీ మేర 40 ఎల్ఈడీ స్క్రీన్లు బీచ్‌రోడ్డులో జరిగే కార్యక్రమాలు: గరగల డ్యాన్స్, కూచిపూడి నృత్యాలు తదితర సంప్రదాయ నృత్యాలు స్టాల్స్: ఏటికొప్పాక బొమ్మలు, పొందూరు ఖద్దరుతో పాటు 13 జిల్లాల్లోని ప్రసిద్ధమైన వస్త్రాల స్టాల్స్ విదేశీ అతిథులకు తెలుగు రుచులు: ఆంధ్ర పిండి వంటలు, రాయలసీమ రుచులు, కృష్ణా గుంటూరు వంటకాలు. మాడుగుల హల్వా, నాటుకోడి కూర, గుత్తివంకాయ, రాయలసీమ రాగిసంకటి, నెల్లూరు చేపల పులుసు, రొయ్యల వేపుడు, కాకినాడ కాజాలు, బొంగు బిర్యానీ మొదలైనవి. విదేశీయులకు ఇచ్చే బహుమతులు: ఏటికొప్పాక బొమ్మలు, రాజమండ్రి రత్నం పెన్నులు, ఇతర కళాఖండాలు. -
INS రణ్వీర్ నౌకలో పేలుడు.. ముగ్గురు మృతి
సాక్షి, విశాఖపట్నం: ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. ముంబై డాక్ యార్డ్‌లో నిలిచి ఉన్న ఐఎన్ఎస్ రణ్వీర్ యుద్ధనౌకలో మంగళవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు నేవీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు భారత నౌకాదళాధికారులు ధ్రువీకరించారు. మరో 11 మంది వరకూ గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రుల్ని ముంబైలోని ఐ.ఎన్.ఎస్. అశ్విన్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. ఐఎన్ఎస్ రణ్వీర్లోని ఇంటర్నల్ కంపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఘటన జరగ్గానే నౌకలోని ఇతర సిబ్బంది తక్షణమే స్పందించి.. పరిస్థితులను చక్కదిద్దడంతో పెను ప్రమాదం తప్పింది. అదేవిధంగా నౌకలో కీలక మెటీరియల్ ఏమీ దెబ్బతినలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే మృతి చెందిన సెయిలర్స్ వివరాల్ని నౌకాదళం ఇంకా వెల్లడించలేదు. ఈ పేలుడు ప్రమాదవశాత్తూ సంభవించిందేనని ప్రాథమికంగా నిర్ధారించిన నేవీ అధికారులు.. ప్రమాదానికి కారణాలను సమగ్రంగా అన్వేషించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా రణ్వీర్ సేవలు ఐఎన్ఎస్ రణ్వీర్ విశాఖ కేంద్రంగా తూర్పు నౌకాదళంలో సేవలందిస్తోంది. 1986 అక్టోబర్ లో భారత నౌకాదళంలో చేరిన రణ్వీర్ యుద్ధనౌక సోవియట్ యూనియన్‌లో నిర్మితమైంది. 35 మంది అధికారులు సహా మొత్తం 320 మంది సిబ్బంది ఈ నౌకలో విధులు నిర్వర్తిస్తుంటారు. రాజ్‌పుత్ క్లాస్ డిస్ట్రాయర్గా విధుల్లో చేరిన ఈ యుద్ధనౌక గంటకు 35 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకెళ్తుంది. దీనిపై పలు రకాల మిసైల్స్‌ను అమర్చారు. సముద్ర జలాల్లో గస్తీ కాయడం, సముద్ర దొంగలను, ఉగ్రవాదులను అడ్డుకోవడం, నావికా దౌత్యం, జలమార్గ కమ్యూనికేషన్స్ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలను ఈ నౌక నిర్వహిస్తోంది. 2008లో శ్రీలంకలో జరిగిన 15వ సార్క్ దేశాల సదస్సులో పాల్గొన్న ప్రధాని భద్రత వ్యవహారాల్లోనూ, సింగపూర్, ఇండోనేషియా దేశాల ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొని ఇరుదేశాల నౌకాదళాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడంలో రణ్వీర్ ముఖ్య భూమిక పోషించింది. క్రాస్ కోస్ట్ ఆపరేషన్స్ కోసం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ నేతృత్వంలో రణ్వీర్ పని చేస్తోంది. వివిధ ఆపరేషన్లలో భాగంగా 2021 నవంబర్‌లో విశాఖ నుంచి బయలుదేరింది. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ బేస్ అయిన విశాఖపట్నానికి ఈ నౌక మరికొద్ది రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ సమయంలో ప్రమాదం సంభవించిందని నేవీ అధికారులు చెబుతున్నారు. -
దేశం గర్వించతగ్గ ఘటన.. ఆ చిరస్మరణీయ విజయానికి విశాఖ వేదికైంది..
పాకిస్తాన్.. దాయాది దేశం పేరు వింటనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటి శత్రుదేశంతో యుద్ధం జరిగితే.. ఆ యుద్ధంలో మన త్రివర్ణపతాకం రెపరెపలాడితే.. ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదా. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. జాతి గర్వించదగిన గెలుపునకు గుర్తుగా బీచ్‌రోడ్‌లో ‘విక్టరీ ఆఫ్ సీ’ స్థూపం నిర్మించారు. భారత నౌకాదళం ప్రపంచంలోనే అతి పెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం అభివృద్ధి చెందింది. నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నం కావడం మరో విశేషం. సాక్షి, విశాఖపట్నం: దేశానికి తూర్పు తీరం వ్యూహాత్మక రక్షణ ప్రాంతం. సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రుదేశాలకు సుదూరంగా ఉండటం తూర్పు నౌకాదళం ప్రత్యేకత. అందుకే రక్షణఅవసరాల దృష్ట్యా బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని కీలకంగా భావించారు. ఇందులో భాగంగానే తూర్పు నావికా దళం ఏర్పాటైంది. 1923 డిసెంబర్లో విశాఖను తూర్పు తీరంలో వ్యూహాత్మక కేంద్రంగా గుర్తించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలమైన 1942–45 మధ్య కాలంలో విశాఖ తీరాన్ని ప్రధానంగా వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచే బర్మాకు ఆయుధాలను రవాణా చేశారు. స్వాతంత్య్రానంతరం 1954లో విశాఖ నేవీ పోస్ట్‌ను కమాండర్ హోదాకు పెంచుతూ, బేస్ రిపేర్ ఆర్గనైజేషన్ కార్యకలాపాలను ప్రారంభించారు. 1962లో ఇండియన్ నేవీ హాస్పిటల్ సర్వీసెస్ (ఐఎన్హెచ్ఎస్) కల్యాణి ప్రారంభమైంది. అనంతరం 1967 జూలై 24న కమాండర్ హోదాను రియర్ అడ్మిరల్ హోదాకు అప్‌గ్రేడ్ చేయడంతో పాటు తూర్పు తీరంలో ఫ్లాగ్ ఆఫీసర్స్ పోస్టులను కూడా మంజూరు చేశారు. చివరిగా 1968 మార్చి 1న విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం( ఈఎన్సీ ) కార్యకలాపాలు ప్రారంభమై చరిత్రకు శ్రీకారం చుట్టింది. 1971 మార్చి1న ఈఎన్సీ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్సీ విస్తరించింది.1971 నవంబర్ 1 నుంచి ఈఎన్సీ ఫ్లీట్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి ఈఎన్సీ చీఫ్‌గా రియర్ అడ్మిరల్ కేఆర్ నాయర్ నియమితులయ్యారు. ప్రస్తుతం 29వ చీఫ్‌గా వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. రక్షణలో వెన్నెముక మయన్మార్‌లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహా సముద్రం వరకూ ఈస్ట్రన్ నేవల్ కమాండ్ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్బన్ నుంచి దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ విస్తరించి ఉంది. 2,600 కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే 6 లక్షల చ.కిమీ పరిధిలో ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ విస్తరించి ఉంది. ఈ తీరంలో 13 మేజర్ పోర్టులున్నాయి. భారత సర్కారు లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది. దీంతో పాటు డీఆర్డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. పలు క్షిపణులు తయారు చేసే నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీస్ (ఎన్ఎస్టీఎల్) కూడా విశాఖలోనే ఏర్పాటైంది. డిసెంబర్ 4 విజయానికి నాంది ఘాజీ కాలగర్భంలో కలిసిపోవడంతో బంగాళఖాతంలోని జలప్రాంతాలన్నీ ఇండియన్ నేవీ.. తన ఆధీనంలోకి తెచ్చుకుంది. భారత్ ముప్పేట దాడితో పాకిస్తాన్ తలవంచక తప్పలేదు. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద సైనిక లొంగుబాటు జరిగిన యుద్ధమిదే.ఈ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం లభించింది. డిసెంబర్ 16న యుద్ధం ముగిసినా దానికి కారణం డిసెంబర్ 4న అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచీపై చేసిన మెరుపుదాడేనని చెప్పుకోవచ్చు. అందుకే 1971 యుద్ధంలో మన నౌకాదళం ప్రదర్శించిన సాంకేతిక ప్రతిభా పాటవాలు, వ్యూహాలు, ధైర్య సాహసాలకు గుర్తుగా డిసెంబర్ నాలుగో తేదీన భారత నౌకాదళ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. తీర ప్రాంత రక్షణలో వెన్నెముకగా ఉన్న ఈఎన్సీ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్ నేవీ ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 52 వరకు యుద్ధ నౌకలు, సబ్మెరైన్లు, హెలికాఫ్టర్లు, యుద్ధ విమానాలున్నాయి. యుద్ధ నౌకల పనితీరు, పరిజ్ఞానం బట్టి వాటిని వివిధ తరగతులుగా విభజించారు. అదే విధంగా సబ్మెరైన్లను కూడా వాటి సామర్థ్యం, పనితీరు బట్టి వివిధ తరగతులుగా విభజించారు. భారత నౌకాదళంలో ఉన్న షిప్స్ పేర్లన్నీ ఐఎన్‌ఎస్‌తో మొదలవుతాయి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ ఢిల్లీ క్లాస్, రాజ్‌పుత్, గోదావరి, తల్వార్, కోల్‌కతా, శివాలిక్, బ్రహ్మపుత్ర, ఆస్టిన్, శార్దూల్, దీపక్, మగర్, కుంభీర్, కమోర్తా, కోరా, ఖుక్రీ, అభ్య, వీర్, పాండిచ్ఛేరి, అస్త్రధరణి, సరయు, సుకన్య, కార్ నికోబార్, బంగారం, త్రికర్ట్.. ఇలా విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. సబ్మెరైన్ల విషయానికొస్తే.. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్లను అరిహంత్, చక్ర(అకుళ–2) క్లాస్‌లుగా, కన్వెన్షనల్లీ పవర్డ్ సబ్మెరైన్లను సింధుఘోష్, శిశుమార్ క్లాస్ సబ్‌మెరైన్లుగా విభజించారు. ఇటీవల ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకతో పాటు పలు హెలికాఫ్టర్లు, అడ్వాన్స్డ్ యుద్ధ విమానాల రాకతో ఈఎన్సీ బలం మరింత పెరిగింది. సాయుధ సంపత్తికి కీలకం.. రజాలీ ఈస్ట్రన్ నేవల్ కమాండ్‌కు అత్యంత వ్యూహాత్మక, కీలకమైన ఎయిర్‌స్టేషన్ రజాలీ. ఇది తమిళనాడులోని అరక్కోణం జిల్లాలో ఉంది. ఇది ఈఎన్సీకే కాదు.. భారత నౌకాదళానికీ కీలకమైన ఎయిర్‌స్టేషన్. 2,320 ఎకరాల విస్తీర్ణంలో అతి పొడవైన, వెడల్పైన రన్‌వే కలిగిన రజాలీ.. ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్‌స్టేషన్‌గా గుర్తింపు పొందింది. తూర్పు, దక్షిణ తీరాల మధ్యలో భూ ఉపరితల, సముద్ర మార్గాల ద్వారా దాడి చేసేందుకు వచ్చే శత్రుదేశాల తుదిముట్టేంచేందుకు కావల్సిన ఆయుధ సంపత్తి అంతా రజాలీలోనే నిక్షిప్తమై ఉంది. 1985లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆధీనంలోకి ఈ ఎయిర్‌స్టేషన్ వచ్చింది. ఆ తర్వాత భారత నౌకాదళం రజాలీని వ్యూహాత్మక ఎయిర్‌స్టేషన్‌గా తీర్చిదిద్దింది. 1992 మార్చి 11న అప్పటి రాష్ట్రపతి వెంకటరామన్ ఈ ఎయిర్ స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. ఈఎన్సీకి చెందిన స్థావరాలు మొత్తం 15 ఉండగా.. ఇందులో ఏడు నేవల్ బేస్‌లు విశాఖలోనే ఉన్నాయి. నేవల్ బేస్ ఐఎన్ఎస్ వర్ష రాంబిల్లిలో నిర్మితమవుతోంది. నౌకాదళానికి, ప్రజలకు వారధి.. నేవీడే తూర్పు నౌకాదళం అత్యంత ప్రధానమైన కమాండ్. దేశ రక్షణలో అశువులు బాసిన నావికులు చేసిన సేవలు శ్లాఘనీయం. లుక్ ఈస్ట్, టేక్ ఈస్ట్ విధానాలతో తూర్పు నౌకాదళానికి ప్రాధాన్యం పెరిగింది. మిషన్ డిప్లాయ్స్ ఆపరేషన్స్ అనే విధానాన్ని ప్రస్తుతం నేవీ అనుసరిస్తోంది. ఈ విధానం వల్ల అనుకున్న సమయానికి అనుకున్న ప్రదేశంలో అందుబాటులో సిబ్బంది ఉండగలుగుతున్నారు. హెలికాఫ్టర్లు, యుద్ధ నౌకల ద్వారా దాయాదిదేశాలకు చెందిన వాటిని గుర్తించి ఎదుర్కొనేందుకు నిత్యం పహారా కాస్తున్నాం. ఒకవేళ అలాంటివి ఎదురైనా.. వాటిని తిప్పికొట్టేందుకు సమర్థంగా ఉన్నాం. కోవిడ్ కారణంగా ఈ ఏడాది కూడా విన్యాసాలు చేపట్టలేకపోతున్నాం. – వైస్ అడ్మిరల్ బిస్వజిత్‌దాస్ గుప్తా, తూర్పు నౌకా దళాధిపతి చదవండి: మిలాన్ మెరుపులు..46 దేశాలకు ఆహ్వానం! -
ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొడతాం
న్యూఢిల్లీ: దేశ భద్రతకు ఎలాంటి సవాలు ఎదురైనా తిప్పికొట్టే పూర్తి సమర్థత భారత నావికాదళానికి ఉందని చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ హరి కుమార్ చెప్పారు. త్రివిధ దళాలల్లో ప్రభుత్వం తలపెట్టిన సంస్కరణలను ఆయన సమర్థించారు. మారిటైమ్ థియేటర్ కమాండ్ ఏర్పాటు చేయాలనుకోవడం మంచి ఆలోచన అని చెప్పారు. శుక్రవారం నావికాదళ దినోత్సవం(నావీ డే) సందర్భంగా హరికుమార్ మీడియాతో మాట్లాడారు. దేశంలో కోవిడ్–19 మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సమయంలోనే ఉత్తర సరిహద్దుల్లో భద్రతపరంగా సంక్లిష్టమైన పరిస్థితులు తలెత్తాయని గుర్తుచేశారు. అవి ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇది మనకు పరీక్షా సమయమని, అందుకే తీర ప్రాంత భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. హిందూ మహాసముద్రంలో చైనా నావికాదళం కదలికలను నిశితంగా గమనిస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సిద్ధంగా ఉందని తెలిపారు. మన నావికాదళానికి అవసరమైన 72 ప్రాజెక్టులను రూ.1.97 లక్షల కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. ఇందులో రూ.1.74 లక్షల కోట్ల విలువైన 59 ప్రాజెక్టులను దేశీయంగానే అమలు చేయనున్నట్లు వివరించారు. మారిటైమ్ థియేటర్ కమాండ్ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని, మరో ఆరు నెలల్లో ఖరారు కానుందని అడ్మిరల్ హరికుమార్ పేర్కొన్నారు. యుద్ధ నౌకల్లో కీలకమైన విధుల్లో మహిళలను సైతం నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐఎన్ఎస్ విక్రమాదిత్యతోసహా 15 భారీ యుద్ధనౌకల్లో 28 మంది మహిళా అధికారులను నియమించామన్నారు. ఈ సంఖ్య మరింత పెరగనుందని వెల్లడించారు. -
నావికాదళంలోకి ఐఎన్ఎస్ వేలా
ముంబై: భారతా నావికాదళం మరింత శక్తిమంతమయ్యేలా మరో అస్త్రం వచ్చి చేరింది. ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి గురువారం నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ చేతుల మీదుగా ముంబై తీరంలో జలప్రవేశం చేసింది. ప్రాజెక్టు 75లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ జలాంతర్గామిని తయారు చేశారు. 2005లో భారత్, ఫ్రాన్స్ 375 కోట్ల డాలర్లతో ఆరు స్కార్పెన్ క్లాస్ జలాంతర్గాముల్ని తయారు చేయాలని ఒప్పందం కుదిరింది. అందులో ఇది నాలుగవది. ఈ సందర్భంగా కరమ్‌బీర్ సింగ్ మాట్లాడుతూ ఐఎన్ఎస్ వేలా అత్యంత సమర్థవంతమైనదని, జలంతార్గాముల ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రస్తుతం సరిహద్దుల్లో భద్రతాపరమైన సవాళ్లు నెలకొన్న నేపథ్యంలో ఐఎన్ఎస్ వేలాకి భారత నావికాదళ ప్రయోజనాలను పరిరక్షించే సత్తా ఉందని అన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ఎస్, భారత్‌కు చెందిన మాజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ కంపెనీలు ఈ జలాంతర్గామి తయారీలో భాగస్వామ్యులుగా ఉన్నాయి. అయితే ఫ్రాన్స్ సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపులో జాప్యం చేయడంతో ఈ ప్రాజెక్టులు ఆలస్యమవుతూ వచ్చాయి. 2017లో ఐఎన్ఎస్ కల్వారి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరాంజ్‌లు కూడా విధుల్లో చేరాయి. అయితే కరోనా కారణంగా ఐఎన్ఎస్ వేలా మరింత ఆలస్యమైంది. 1973 నుంచి 2010 వరకు నావికాదళంలో సేవలు అందించిన ఒకప్పటి జలాంతర్గామి వేలా పేరునే దీనికీ పెట్టారు. సోవియెట్ రష్యా తయారు చేసిన ఆ సబ్‌మెరైన్ మన దేశం నిర్వహించిన ఎన్నో కీలక ఆపరేషన్లలో పాల్గొంది. నేవీలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన వేలాని 2010లో నావికాదళం నుంచి విరమించారు. పాక్‌కు చైనా ఎగుమతులు చైనా నుంచి పాకిస్తాన్‌కు మిలటరీ హార్డ్‌వేర్ ఎగుమతులు అధికమయ్యాయని, ఇది అంతిమంగా భారత్ భద్రతకు ముప్పు కలిగిస్తుందని నేవీ చీఫ్ అడ్మిరల్ కరమ్‌బీర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. నౌకలు, జలాంతర్గాముల ఎగుమతులు పెరిగాయని, అన్నింటికి భారత్ సిద్ధంగా ఉండాలన్నారు. ప్రత్యేకతలు.. ► వేలా సబ్‌మెరైన్ 67.5 మీటర్లు పొడవు, 12.3 మీటర్ల ఎత్తు, 6.2 మీటర్ల వెడల్పు ఉంటుంది. ► ఈ జలాంతర్గామి నీట మునిగినప్పుడు 20 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. ► ఐఎన్ఎస్ వేలా సీ303 యాంటీ టార్పెడో కౌంటర్మెజర్ వ్యవస్థ కలిగి ఉంది. ఈ సబ్‌మెరైన్‌లో 18 టార్పెడోలను, లేదంటే యాంటీ షిప్ క్షిపణుల్ని అత్యంత సమర్థవంతంగా ప్రయోగించగలదు. ► ఎనిమిది మంది అధికారులు, 35 మంది సిబ్బందిని మోసుకుపోగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ► స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన వేలాలో తొలిసారిగా బ్యాటరీ వ్యవస్థను ప్రవేశపెట్టారు. డీజిల్, ఎలక్ట్రిక్ శక్తితో ఇంజిన్లు పని చేస్తాయి. -
తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం
భారత తీరప్రాంత రక్షణ కోసం ప్రత్యేకించి హిందూ మహాసముద్ర ప్రాంతంలో రక్షణ కోసం దేశీయంగా నిర్మించిన అధునాతనమైన క్షిపణి విధ్వంస వాహక నౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ ఆదివారం జలప్రవేశం చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముంబై తీరంలో ఈ ఆధునిక యుద్ధనౌకను ప్రారంభించారు. శత్రు రాడార్లు గుర్తించలేని ఈ యుద్ధనౌక ద్వారా ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి కూడా క్షిపణులను ప్రయోగించవచ్చు. ‘ఐ.ఎన్.ఎస్. విశాఖపట్టణం’ పేరుతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ మెజగావ్ డాక్ యార్డ్ లో రూ. 35 వేల కోట్లతో అత్యంత ఆధునిక హంగులతో క్షిపణి విధ్వంస వాహకనౌకను నిర్మించింది. అమెరికా చీఫ్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ అడ్మిరల్ మైఖేల్ గిల్డే విశాఖపట్టణం నేవల్ డాక్ యార్డ్ నుంచి మన రక్షణశాఖ అధికారులతో కలిసి, గత నెలలో బంగాళాఖాతంలో జరిగిన ‘మలబార్–2’ యుద్ధ నౌకా విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇది జరిగిన నెలరోజుల్లోనే, నేరుగా ఒక క్షిపణి విధ్వంసక నౌక– ‘ఐ.ఎన్.ఎస్. విశాఖపట్టణం’ పేరుతో అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించడం, భారత రక్షణశాఖ ‘మ్యాప్’లో పెరిగిన విశాఖపట్టణం నగరం ప్రాధాన్యతను తెలియచేస్తున్నది. అయితే, విశాఖ నగరంపై అంతర్జాతీయ ‘ఫోకస్’ పెట్టడం అనేది ఇప్పటి మాట కాదు. బరాక్ ఒబామా ప్రభుత్వం ఇండియాలో ‘స్మార్ట్ సిటీలు’గా అభివృద్ధి చేయడానికి, జనవరి 2015లో భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో– అజ్మీర్, అలహాబాద్, విశాఖపట్టణం నగరాలు ఉన్నాయి. అయితే, డోనాల్డ్ ట్రంప్ హయాంలో అది ఆగిపోయింది. అంతే కాదు, ట్రంప్ నిర్లక్ష్యంతో అమెరికా–ఇండో–ఫసిఫిక్ విధానా నికి ‘ఆసియాన్’ దేశాల్లో ఐదేళ్ళు స్తబ్దత తప్పలేదు. జనవరిలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడుగా వచ్చాక, ఈ ఏడాది చివరి నాటికి ఈ అంశంపై కొత్త కదలిక మొదలవడం తెలిసిందే. (చదవండి: ఇప్పుడు గుర్తొచ్చిన జాతీయ ప్రయోజనం!) అంతర్జాతీయ విపణిపై చైనా పట్టును నిలువరించడం అగ్ర రాజ్యాల అవసరం అయ్యాక, జరుగుతున్న ప్రతి పరిణామా నికి ఆసియా కేంద్రంగా మారింది. ఒకప్పటి ‘ప్రచ్ఛన్నయుద్ధం’ స్థానంలోకి విశ్వ వాణిజ్యం లక్ష్యంగా – భౌగొళిక ప్రాతిపదిక రాజకీయాలు... నూతన దౌత్య ప్రత్యామ్నాయాలు అయ్యాయి. గత దశాబ్దంలో ‘యూపీఏ–2’ చొరవతో ‘ఆసియాన్’ సభ్యదేశా లతో జరిగిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంతో ఆ జాబితాలోకి అలా చేరినదే కేరళ రబ్బరు, మన అరకు – ‘గిరిజన్ కాఫీ’. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరిస్తున్న క్షిపణి విచ్చిన్న యుద్ధ నౌకకు ‘ఐ.ఎన్.ఎస్. విశాఖ పట్టణం’ అని నామకరణం చేస్తున్నట్లు నవంబర్ 16న ఢిల్లీలో నేవీ వైస్–చీఫ్ వైస్ ఎడ్మిరల్ ఎస్, ఎన్. ఘోర్మాడే ప్రకటిం చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మన నౌకానిర్మాణ యార్డుల్లో 39 యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. త్రివిధ దళాల బలగాలను ఒక్కటిగా సమీకృతం చేసి, మన పోరాట శక్తిని పెంచుకునే వ్యూహం అమల్లో ఉందని, దాని ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు ఘోర్మాడే. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం) ఇకముందు ‘విశాఖపట్టణం’ నగరం పేరు ఇలా ఆసియా ‘మారిటైమ్’ పటంపై కనిపించడం తెలుగు ప్రజలకు ప్రతిష్ఠా త్మకమైన అంశం. అయినా ఇలా విశాఖ నగరం కీలకం కావడం ఇది మొదటిసారి కాదు. పన్నెండేళ్ల క్రితం అప్పట్లో భారతీయ నౌకాదళం అధునికీకరణలో భాగంగా– ‘సీక్రెటివ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెస్సల్ ప్రాజెక్ట్’ కింద ఐదు స్వదేశీ నిర్మాణ జలాం తర్గాములను మనదేశం నిర్మించాలని తలపెట్టింది. అప్పుడు కూడా ఇదే విశాఖపట్టణం నేవల్ డాక్ యార్డ్‌లోనే 26 జూలై 2009న వాటిలో మొదటి సబ్–మెరైన్– ‘ఐ.ఎన్.ఎస్. అరి హంత్’ను నాటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ అవిష్కరించారు. అప్పటినుండి 2016 ఫిబ్రవరి వరకు ‘అరిహంత్’ సామర్థ్యంపై సముద్ర జలాల్లో విస్తృత పరీక్షలు జరిగాక, 2018 నుంచి మన నౌకాదళంలో ‘అరిహంత్’ భాగం అయింది. ఈ పరిణామాల మధ్యలోనే, 2014లో ఉమ్మడి రాష్ట్ర విభ జన, ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ మార్పు రెండూ జరి గాయి. మరి దేశానికీ, తూర్పుతీరంలో రక్షణ శాఖకూ ఇంతగా ప్రాధాన్యత వున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వంతంగా నిలదొక్కు కోవడానికి, చేయూత అందించే విషయంలో– ‘విభజన చట్టం’ లోని అంశాల అమలు పరిధులు దాటి కేంద్రం చూపించిన చొరవ కనిపించదు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రాజకీయ ప్రయోజనం లేకపోవడం, అనే ఒక్క కారణం తప్ప దీనికి మరో కారణం ఇప్పటికీ కనిపించదు. అయితే, ప్రభుత్వాల దేశీయ అంశాల ప్రాధాన్యతలు ఎలావున్నప్పటికీ, దేశ ప్రాదేశిక సరిహద్దుల భద్రతకు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే విషయంలో, రక్షణశాఖ ప్రాధాన్యతలు మాత్రం అలా ఉండ వని– ‘ఐ.ఎన్.ఎస్. విశాఖపట్టణం’ నామకరణంతో స్పష్టం అవుతున్నది. - జాన్సన్ చోరగుడి వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
నేవీ కొత్త చీఫ్‌గా హరికుమార్
న్యూఢిల్లీ: భారత నావికాదళం కొత్త అధిపతిగా వైస్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ మంగళవారం తెలిపింది. హరికుమార్ ప్రస్తుతం వెస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్‌గా ఉన్నారు. ఈనెల 30వ తేదీన రిటైర్ కానున్న నేవీ ప్రస్తుత అధిపతి, అడ్మిరల్ కరంబీర్ సింగ్ నుంచి అదే రోజు మధ్యాహ్నం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. కేరళకు చెందిన హరికుమార్కు కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షనల్ సంబంధ విధుల్లో దాదాపు 39 ఏళ్ల అనుభవం ఉంది. -
Warship: ఐఎన్ఎస్ విశాఖపట్నం.. ఆ పేరెందుకు పెట్టారంటే..
సాక్షి, విశాఖపట్నం: పాకిస్తాన్ పీచమణిచి.. 1971 యుద్ధంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడిన చిరస్మరణీయ విజయానికి విశాఖ కీలక వేదికగా నిలిచింది. భారత జాతి గర్వించదగ్గ గెలుపును అందించిన విశాఖ పేరు వింటేనే ఉత్తరాంధ్ర వాసులకే కాదు.. యావత్ తెలుగు ప్రజల గుండె ఉప్పొంగుతుంది. అలాంటిది.. సముద్ర రక్షణలో శత్రువుల్ని సమర్థంగా ఎదుర్కొనే యుద్ధ నౌకకు విశాఖపట్నం పేరు పెడితే ఆ ఆనందం సాగరమంత అవుతుంది. అందుకే.. నౌకాదళ అధికారులు ఐఎన్ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఆ ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక విశేషాలివీ. (చదవండి: పసిడికి పెట్టింది పేరు.. నరసాపురం గోల్డ్ మార్కెట్) విశాఖపట్నం పేరెందుకు పెట్టారంటే.. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిౖసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు. చదవండి: పర్యాటకానికి 'జల'సత్వం ముంబైలో తయారీ 2011 జనవరి 28న ఈ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్, ఇండియన్ నేవీకి చెందిన అంతర్గత డిజైన్ సంస్థలు షిప్ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్ తయారీకి వై–12704 పేరుతో ముంబైలోని మజ్గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్) శ్రీకారం చుట్టింది. 2015 నాటికి హల్‌తో పాటు ఇతర కీలక భాగాలు పూర్తి చేసింది. తయారు చేసే సమయంలో పలుమార్లు ప్రమాదాలు కూడా సంభవించాయి. 2019 జూన్‌లో షిప్‌లోని ఏసీ గదిలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించాడు. అయితే.. షిప్ తయారీలో మాత్రం ఎక్కువ నష్టం వాటిల్లలేదు. 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను అక్టోబర్ 28న అప్పగించారు. డిసెంబర్లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు. శత్రువుల పాలిట సింహస్వప్నమే ఇది సముద్ర ఉపరితలంపైనే ఉన్నా.. ఎక్కడ శత్రువుకు సంబంధించిన లక్ష్యాన్నైనా ఛేదించి మట్టుబెట్టగలదు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ విశాఖను శత్రువుల పాలిట సింహస్వప్నంగా చెప్పుకోవచ్చు. యుద్ధ నౌక విశేషాలివీ.. బరువు 7,400 టన్నులు పొడవు 163 మీటర్లు బీమ్ 17.4 మీటర్లు డ్రాఫ్ట్ 5.4 మీటర్లు వేగం గంటకు 30 నాటికల్ మైళ్లు స్వదేశీ పరిజ్ఞానం - 75 శాతం పరిధి - ఏకధాటిన 4 వేల నాటికల్ మైళ్ల ప్రయాణం సెన్సార్స్ ,ప్రాసెసింగ్ వ్యవస్థలు- మల్టీ ఫంక్షన్ రాడార్, ఎయిర్ సెర్చ్ రాడార్ ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు విమానాలు: రెండు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదు రెండు హెచ్ఏఎల్ ధృవ్ విమానాల్ని తీసుకెళ్లగలదు -
భారత నేవీకి ఎలక్ట్రిక్ యుద్ధ నౌకలు అందిస్తాం: రోల్స్‌రాయిస్
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ యుద్ధనౌకలను అభివృద్ధి చేయడానికి సంబంధించి భారత నౌకాదళంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంపై ఏరో ఇంజిన్స్ తదితర ఉత్పత్తుల తయారీ దిగ్గజం రోల్స్–రాయిస్ ఆసక్తి వ్యక్తం చేసింది. భారత నేవీకి యుద్ధ నౌకలు మొదలైన వాటిని ఆధునికీకరించేందుకు అపార అనుభవం తమకుందని కంపెనీ నేవల్ సిస్టమ్స్ విభాగం చీఫ్ రిచర్డ్ పార్ట్రిడ్జ్ తెలిపారు. నౌకలను హైబ్రిడ్ ఎలక్ట్రిక్, పూర్తి ఎలక్ట్రిక్ విధానంలో నడిపించేందుకు అవసరమైన ఉత్పత్తులను తాము అందించగలమని వివరించారు. బ్రిటన్ నేవీ కోసం ప్రపంచంలోనే తొలి హైబ్రిడ్–ఎలక్ట్రిక్ నేవల్ సిస్టమ్ డిజైనింగ్ నుంచి తయారీ దాకా తామే చేసినట్లు రిచర్డ్ పేర్కొన్నారు. త్వరలో నిర్వహించే క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ టూర్లో తమ సామర్థ్యాలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. -
ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు
ఇండియన్ నేవీ ఫిబ్రవరి 2022 బ్యాచ్ కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోర్తుంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 2500 ► పోస్టుల వివరాలు: ఆర్టిఫిషర్ అప్రెంటిస్(ఏఏ), సీనియర్ సెకండరీ రిక్రూట్స్(ఎస్ఎస్ఆర్). అర్హతలు ► ఆర్టిఫిషర్ అప్రెంటిస్: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ► సీనియర్ సెకండరీ రిక్రూట్స్: కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణులై ఉండాలి. ► వయసు: 01.02.2002 నుంచి 31.01.2005 మధ్య జన్మించి ఉండాలి. ► వేతనం: శిక్షణ కాలంలో నెలకు రూ.14600 చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ ప్రకారం–రూ.21700–రూ.69100 అందిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 25.10.2021 ► వెబ్సైట్: www.joinindiannavy.gov.in/en -
కొనసాగుతున్న మలబార్ విన్యాసాలు
దొండపర్తి(విశాఖ దక్షిణ): అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో నిర్వహిస్తున్న మలబార్ రెండో దశ విన్యాసాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం జరిగిన ప్రదర్శనలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ రన్విజయ్(డీ55), ఐఎన్ఎస్ సత్పుర (ఎఫ్ 48) నౌకలు పాల్గొన్నాయి. వీటితో పాటు యూఎస్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ యూఎస్ఎస్ కారల్ విన్సన్, జపనీస్ హెలికాఫ్టర్ కారియర్ జేఎస్.. ఇలా తొమ్మిది యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో భాగస్వామ్యమయ్యాయి. యూఎస్ నేవీ ఆపరేషన్స్ చీఫ్ అడ్మిరల్ మైఖిల్ గిల్డే సతీసమేతంగా బుధవారం తూర్పు నావికాదళం ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. మూడు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా విశాఖకు వచ్చిన ఆయన తూర్పునావికాదళపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. -
క్యాడెట్ ఎంట్రీ స్కీమ్; సెలెక్ట్ అయితే చదువుతో పాటు జాబ్ పక్కా
త్రివిధ దళాల్లో కొలువు.. దేశంలో ఎంతోమంది యువత కల.ఎందుకంటే..సవాళ్లతోపాటు దేశ సేవలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగ భద్రత,ఆకర్షణీయ వేతనాలు, కెరీర్లో ఎదిగేందుకు ఎంతో అవకాశం ఉంటుంది. అలాంటి చక్కటి కొలువును చిన్న వయసులోనే అందుకునే వీలు కల్పిస్తోంది.. ఇండియన్ నేవీ. ఇటీవల 2021 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ నేవీ 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సు 2022 జనవరిలో ప్రారంభమవుతుంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 35 (ఎడ్యుకేషన్ బ్రాంచ్–05, ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్–30). అర్హతలు ► ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌తో ఇంటర్మీడియెట్/10+2లో కనీసం 70 శాతం మార్కులు సాధించాలి. దీంతోపాటు పదో తరగతి లేదా ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు స్కోర్ చేయాలి. ► వయసు: 02.07.2002 నుంచి 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి. ► అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ► వీటితోపాటు జేఈఈ మెయిన్–2021(బీఈ/బీటెక్)కు హాజరై ఉండాలి. ఇందులో సాధించిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపిక విధానం ► జేఈఈ మెయిన్–2021 ర్యాంకు ద్వారా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఈ సమాచారాన్ని ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తారు. ► ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలను బెంగళూరు/భోపాల్/కోల్‌కతా/విశాఖపట్నంల్లో ఏదోఒకచోట నిర్వహిస్తారు. ► ఈ ఇంటర్వ్యూలు 2021 అక్టోబర్/నవంబర్‌ల్లో జరిగే అవకాశం ఉంది. ► ఎస్ఎస్బీ ఇంటర్వ్యూలు మొత్తం ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు. ► తొలి రోజు స్టేజ్–1 ఉంటుంది. ఇందులో ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. వీటిలో విజయం సాధించిన వారికే స్టేజ్ 2కు అనుమతిస్తారు. ► స్టేజ్ 2 నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఇందులో సైకలాజికల్ టెస్ట్‌లు, గ్రూప్ ఎక్సర్సైజ్లు, ముఖాముఖి పరీక్షలు నిర్వహిస్తారు. స్టేజ్ 2లోనూ ప్రతిభ చూపిన వారికి మెడికల్ టెస్టులు ఉంటాయి. ఇందులోను గట్టెక్కితే తుది విజేతగా ప్రకటిస్తారు. శిక్షణ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ప్రక్రియలో విజయం సాధించి.. తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులను ఇండియన్ నేవల్ అకాడెమీ, ఎజిమాల(కేరళ)లో బీటెక్ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ఈ శిక్షణ సమయంలో చదువుతోపాటు భోజనం, వసతి, బుక్స్, యూనిఫారం మొత్తం ఉచితంగా అందిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి జేఎన్‌యూ బీటెక్ డిగ్రీ ప్రదానం చేస్తుంది. అనంతరం సబ్ లెఫ్ట్నెట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. కెరీర్ స్కోప్ ఎంచుకున్న కోర్సును అనుసరించి వీరికి ఎగ్జిక్యూటివ్ అండ్ టెక్నికల్ లేదా ఎడ్యుకేషన్ బ్రాంచ్ విధులు కేటాయిస్తారు. ఉద్యోగంలో చేరితే ప్రారంభంలో లెవెల్–10 మూల వేతనం అంటే రూ.56100 అందుతుంది. దీంతోపాటు మిలిటరీ సర్వీస్ పే కింద రూ.15000 ఇస్తారు. అలాగే డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. ఈ సమయంలో అన్ని కలిపి నెలకు రూ.లక్ష వరకూ వేతనం అందుకునే అవకాశ ఉంది. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021 వెబ్సైట్: www.joinindiannavy.gov.in -
గూఢచారి ‘ధ్రువ్’ వచ్చేస్తోంది.. ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన గూఢచారి నౌక ఐఎన్ఎస్ ధ్రువ్‌ను ఈ నెల 10న జాతికి అంకితం చేయనున్నట్లు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ ప్రకటించారు. విశాఖలోని హిందుస్థాన్ షిప్‌యార్డులో ఈ నౌకని రూపొందించారు. 2015లో నౌక నిర్మాణం ప్రారంభించగా 2020 అక్టోబర్‌లో పూర్తయింది. మొత్తం రూ.1,500 కోట్లతో ధ్రువ్ నిర్మితమైంది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్ నేవీ ఇంజనీర్లు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్ఎస్ఎల్) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రు క్షిపణుల్ని సమర్థవంతంగా గుర్తించగల సామర్థ్యంతోపాటు అనేక ప్రత్యేకతలు ఈ నౌకకు ఉన్నాయి. శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్లతో పాటు ఇతర భూభాగాల నుంచి క్షిపణులను ప్రయోగిస్తే వాటిని ధ్రువ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. అంతేకాకుండా మనకు నష్టం జరగకుండా శత్రు క్షిపణులను ఏ ప్రాంతంలో ధ్వంసం చేయాలన్న విస్తృత సమాచారాన్ని సైతం అందించగల సామర్థ్యం ధ్రువ్ సొంతం. సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్ మిసైల్స్ జాడల్ని కూడా ఇది సులభంగా గుర్తిస్తుంది. ధ్రువ్ నౌక మరిన్ని ప్రత్యేకతలివే.. ►దేశాన్ని మొత్తం నిశిత పరిశీలన చేసే శాటిలైట్ మానిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ►ఈ నౌక రాకతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్ చేరింది. ►ఇందులో సెన్సార్లతో కూడిన త్రీ డోమ్ షేప్డ్ సర్వైలెన్స్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే రాడార్స్ టెక్నాలజీని వాడారు. ►అందుకే భారత నౌకాదళం ఐఎన్ఎస్ ధ్రువ్‌ని ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ అని పిలుస్తోంది. ►అంతేకాకుండా.. దీని ద్వారా 14 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. సాగరతీరంలో విజయ జ్వాల బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పాక్‌తో 1971లో జరిగిన యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న వార్షికోత్సవం స్వర్ణిమ్ విజయ్ వర్ష్‌లో భాగంగా వెలిగించిన విక్టరీ ఫ్లేమ్ శుక్రవారం ఈఎన్సీకి చేరుకుంది. ఈ విక్టరీ ఫ్లేమ్‌ను అధికారికంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, ఈఎన్సీ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ తీసుకున్నారు. విక్టరీ ఫ్లేమ్ రాక సందర్భంగా శుక్రవారం బీచ్‌రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద వేడుకలు జరిగాయి. నేవీ సిబ్బంది నిర్వహించిన కవాతు అందర్నీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 1971 యుద్ధంలో పాల్గొన్న వారి అనుభవాలను హోంమంత్రి తెలుసుకున్నారు. విక్టరీ ఫ్లేమ్‌ను స్వీకరిస్తున్న హోంమంత్రి సుచరిత, ఈఎన్సీ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ యుద్ధంలో అమరులైన వారిని స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. 1971లో విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ వార్ మెమోరియల్ వద్ద 2020 డిసెంబర్ 16న నాలుగు విజయ జ్వాలలను వెలిగించారు. ఇవి దేశవ్యాప్తంగా ప్రయాణిస్తున్నాయి. దక్షిణ కార్డినల్ కోసం విక్టరీ ఫ్లేమ్ ఐఎన్ఎస్ సుమిత్రలో పోర్ట్ బ్లెయిర్ నుంచి విశాఖపట్నం చేరుకుంది. ఇది నగరంలోని వివిధ పాఠశాలలకు వెళ్తుంది. అనంతరం రాజమహేంద్రవరం, విజయవాడ, నల్గొండ మీదుగా హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ ఏడాది డిసెంబర్ 16న ఈ నాలుగు విజయ జ్వాలలు కలుస్తాయి. ఇవీ చదవండి: వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్ -
‘విక్రాంత్’ వచ్చేస్తోంది
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్ (ఐఏసీ) సేవలందించేందుకు సిద్ధమవుతోంది. బుధవారం నిర్వహించిన సీట్రయల్స్ విజయవంతం కావడంతో.. విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ నిలిచింది. 40 వేల టన్నుల బరువైన విక్రాంత్‌లో రెండు టేకాఫ్ రన్వేలు, ఒక ల్యాండింగ్ స్ట్రిప్ ఏర్పాటు చేశారు. అన్ని హంగులూ పూర్తి చేసుకొని 2022 మార్చినాటికల్లా తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్ సేవలందించనుంది. సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగంలో అగ్రశ్రేణి దేశాల సరసన నిలిచిన భారత్.. యుద్ధ విమాన వాహక యుద్ధ నౌకల విషయంలో వెనకబడి ఉందన్న గీతని చెరిపేసేలా ఐఏసీ విక్రాంత్ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత నౌకాదళంలో యుద్ధ విమానాల కోసం రూపొందించిన మొట్టమొదటి విక్రాంత్ క్లాస్ నౌక ఇది. 1997లో విక్రాంత్ సేవల నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు అదే పేరుతో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ పేరుతో విక్రాంత్ యుద్ధ విమాన వాహక నౌక సన్నద్ధమైంది. విక్రాంత్ నిర్మాణం పదేళ్ల కిందటే ప్రారంభమైంది. పూర్తిస్థాయి భారతీయ పరిజ్ఞానంతో నిర్మిస్తున్న ఈ యుద్ధ నౌకలో అత్యంత ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. 1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్ సంస్థ నౌక డిజైన్ మొదలు పెట్టగా.. కొచ్చి షిప్‌యార్డులో 2009లోనే కీలక భాగాల్ని పూర్తి చేశారు. 2011లో డ్రైడాక్ నుంచి విక్రాంత్‌ని బయటికి తీసుకొచ్చారు. 2015 జూన్ 10న కొచ్చిలో జల ప్రవేశం చేసింది. ఏడాది క్రితం బేసిన్ ట్రయల్స్ పూర్తి చేశారు. తొలిసారిగా సముద్ర విహారం ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత మొదటిసారిగా విక్రాంత్ సీట్రయల్ నిర్వహణ కోసం బుధవారం సముద్రంలోకి తీసుకొచ్చారు. 2 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. సముద్రంలో మొదటి ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఎల్ఎం 2500 గ్యాస్ టర్బైన్లు 4, ప్రధాన గేర్ బాక్స్‌లు, షాఫ్టింగ్, పిచ్ ప్రొపైల్లర్ కంట్రోలర్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సిస్టమ్, సెంట్రిఫ్యూజన్, 60 క్రిటికల్ పంప్స్, విద్యుత్ ఉత్పత్తి, అంతర్గత కమ్యూనికేషన్ పరికరాలను ఈ ట్రయల్‌రన్‌లో పరిశీలించారు. చరిత్రాత్మక ఘటనగా భారత నావికాదళం అభివర్ణన న్యూఢిల్లీ: భారత్‌లో నిర్మించిన తొలి యుద్దవిమాన వాహక నౌక (ఇండిజినస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్–ఐఏసీ) విక్రాంత్.. సామర్థ్య పరీక్షలు మొదలయ్యాయి. సముద్రంలో ఐఏసీ విక్రాంత్ ట్రయల్స్ ప్రారంభమవడం చరిత్రాత్మకమని భారత నేవీ బుధవారం వ్యాఖ్యానించింది. సొంతంగా యుద్ధవిమాన వాహక నౌకను డిజైన్ చేసి, నౌకను నిర్మించి, సైన్యంలోకి తీసుకునే సత్తా ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా నిలిచిందని నేవీ ప్రకటించింది. భారీ యుద్ధనౌకకు 50 ఏళ్ల క్రితం 1971లో పాకిస్తాన్‌తో పోరులో అద్భుత సేవలందించిన విక్రాంత్ నౌక పేరునే పెట్టారు. ఈ నౌక అన్ని స్థాయిల్లో సామర్థ్య పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసుకున్నాక వచ్చే ఏడాదిలో భారత నావికాదళంలో చేరనుంది. భారత్‌లో నిర్మించిన అతి పెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదేనని నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మథ్వాల్ చెప్పారు. యుద్ధవిమానాల మోహరింపులో ఐఎన్ఎస్ విక్రమాదిత్య మాత్రమే అవసరాలను తీరుస్తోంది. కీలక బాధ్యతలు నిర్వర్తించనున్న విక్రాంత్ రక్షణపరంగా, రవాణా పరంగా ఎంతో కీలకమైన హిందూ సముద్రంలో ఆధిపత్యం కోసం మనదేశంతో పాటు చైనా, అమెరికా మొదలైన దేశాలన్నీ విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో పైచేయి సాధించేందుకు భారత్ సిద్ధం చేసిన బ్రహ్మాస్త్రమే ఐఏసీ విక్రాంత్. విక్రాంత్ రాకతో రక్షణ పరంగా దుర్భేద్యంగా నిలవనుంది. విక్రాంత్ సేవలు వచ్చే ఏడాది నుంచి మొదలు కానున్నాయని ఆశిస్తున్నాం. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన విక్రాంత్ కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. – వైస్ అడ్మిరల్ అజేంద్ర బహుద్దూర్ సింగ్, తూర్పు నౌకాదళాధిపతి -
సీఎం జగన్‌ను కలిసిన తూర్పు నావికా దళం అధికారి
సాక్షి, అమరావతి: తూర్పు నావికా దళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్‌సింగ్ మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు విషయాలు ముచ్చటించారు. -
ఇండోనేషియాకు కోవిడ్‌పై పోరాటంలో భారత్ భారీ సాయం
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్‌పై పోరాటం చేయడానికి ఇండోనేషియాకు భారత్ భారీ సాయం అందించింది. ఈ నేపథ్యంలో ఇండోనేషియా రాజధాని జకార్తాకు భారత నౌక ఐఎన్ఎస్ ఐరావత్ చేరుకుంది. ఆ నౌకలో100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సామర్థ్యంతో 5 క్రయోజనిక్ ట్యాంకర్లు,300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను పంపింది. భారత్, ఇండొనేషియా దేశాల మధ్య సాంస్కృతిక, వ్యాపార ద్వైపాక్షిక సంబంధాలు కలిగి వున్నాయి. -
శత్రు దేశాలకు దడ పుట్టించేలా, విశాఖ తీరానికి అడ్వాన్స్డ్ భద్రత
సాక్షి, విశాఖపట్నం: తీర రక్షణలో రెప్ప వాల్చకుండా నిమగ్నమైన తూర్పు నౌకాదళం తన శక్తి సామర్థ్యాల్ని పెంపొందించుకుంటూ దుర్బేధ్యమైన శక్తిగా మారుతోంది. తాజాగా అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు నౌకాదళ అమ్ముల పొదిలో చేరడంతో తూర్పు తీర భద్రత మరింత పటిష్టమైంది. గంటకు 280 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ హెలికాఫ్టర్లు బంగాళాఖాతంలో నిరంతరం పహారా కాయనున్నాయి. విశాఖ స్థావరంగా.. రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్ పాలకుల హయాం నుంచే తూర్పు తీరం కీలకమైన ప్రాంతం. తూర్పు నౌకాదళం విశాఖపట్నం ప్రధాన స్థావరంగా ఏర్పాటైంది. మయన్మార్‌లోని కొండ ప్రాంతం మినహా దక్షిణ హిందూ మహాసముద్రం వరకూ ఈస్ట్రన్ నేవల్ కమాండ్ పరిధిలో సురక్షితంగా ఉంది. ఉత్తరాన సుందర్బన్ నుంచి దక్షిణాన గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకూ విస్తరించి ఉంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి వరకూ విస్తరించి ఉంది. 2,600 కి.మీ నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే 6 లక్షల చ.కి.మీ పరిధిలో ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్ విస్తరించి ఉంది. తీరంలో 13 మేజర్ పోర్టులున్నాయి. కేంద్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది. డీఆర్డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. క్షిపణులు తయారు చేసే నేవల్ సైన్స్ అండ్ టెక్నలాజికల్ ల్యాబొరేటరీస్ కూడా విశాఖలోనే ఏర్పాటైంది. యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు.. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో భారతీయ నౌకాదళం ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్లున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో కిల్తాన్, ధ్రువ్ మొదలైన యుద్ధ నౌకల్ని సమకూర్చుకుంటూ దేశ రక్షణలో తూర్పు నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోంది. తాజాగా మూడు సూపర్ ఫాస్ట్ హెలికాఫ్టర్లు చేరడంతో భద్రత వ్యవస్థ మరింత పటిష్టంగా మారింది. గంటకు 280 కి.మీ వేగంతో... నిఘా వ్యవస్థలో రాటుదేలేందుకు కొత్తగా ఆధునిక పరిజ్ఞానంతో దేశీయంగా నిర్మించిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాఫ్టర్లు మూడింటిని భారత నౌకాదళం విశాఖకు కేటాయించింది. ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌లో ఏఎల్‌హెచ్ ఎమ్కే–3 పేరిట ఈ హెలికాఫ్టర్లని తయారు చేశారు. నేవీ, కోస్ట్‌గార్డ్‌లు ఇప్పటి వరకూ ఎమ్కే–1 వేరియంట్ హెలికాఫ్టర్లని వినియోగిస్తున్నాయి. ఎమ్కే–3 వేరియంట్స్‌తో రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. ఏఎల్‌హెచ్ ఎమ్కే–3 హెలికాఫ్టర్లలో గ్లాస్ కాక్‌పిట్ మాత్రమే కాకుండా హిందూస్థాన్ ఏరోనాటికల్స్‌కు చెందిన ఇంటిగ్రేటెడ్ ఆర్కిటెక్చర్ డిస్ప్లే సిస్టమ్(ఐఎడీఎస్) ఉంది.ఇందులో శాఫ్రాన్ ఆర్డిడెన్ 1హెచ్1 ఇంజిన్స్ ఉండటంతో గంటకు 280 కి.మీ. వేగంతో దూసుకెళతాయి. ఎమ్కే–3లో అధునాతన ఏవియానిక్స్ ఉండటం వల్ల వాతావరణానికి అనుగుణంగా పనితీరు మార్చుకొని ప్రయాణం చేయగలవు. వీటికి ఆధునిక నిఘా రాడార్, ఎలెక్ట్రో ఆప్టికల్ పరికరాలు అమర్చారు. దీనివల్ల పగటి పూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ సుదూర శోధన, శత్రుమూకల నుంచి రక్షణ అందిస్తూ సముద్ర నిఘా వ్యవస్థని పటిష్టం చేయనున్నాయి. ఎమ్కే–3లో భారీ మెషీన్‌గన్ కూడా అమర్చారు. అత్యవసరాల కోసం మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఎమ్కే–3లో ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల్ని ఎయిర్‌లిఫ్ట్ చేసి ఆస్పత్రులకు తరలించేందుకు ఇది దోహదపడుతుంది. -
ఇండియన్ నేవీలో ఎస్ఎస్సీ ఆఫీసర్ ఉద్యోగాలు
ఇండియన్ నేవీ.. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ).. ఆఫీసర్ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 50 ► పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్(ఎస్ఎస్సీ)–50(ఎస్ఎస్సీ జనరల్ సర్వీస్(జీఎస్/ఎక్స్)–47, హైడ్రో కేడర్–03). ► కోర్సు ప్రారంభం: జనవరి 2022 ► శిక్షణ కేంద్రం: ఇండియన్ నేవల్ అకాడమీ(ఐఎన్ఏ), ఎజిమళ, కేరళ. ► అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ► ఎంపిక విధానం: కోవిడ్–19 కారణంగా ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించకుండా.. అకడమిక్ మెరిట్ ద్వారా షార్ట్‌లిస్టింగ్ చేయనున్నారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021 ► వెబ్సైట్: joinindiannavy.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఇండియన్ కోస్ట్‌గార్డులో 350 ఖాళీలు డేటా అనలిస్టులకు ఎంఎన్సీల బంపర్ ఆఫర్స్ తెలంగాణ పోలీస్ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు -
ఆక్సిజన్ సగమే చాలు: కరోనా పేషెంట్లకు నేవీ ‘ఓఆర్ఎస్’
సెంట్రల్ డెస్క్, సాక్షి: కరోనా విజృంభణతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. శ్వాస సమస్యలు తలెత్తడంతో వేలాది మందికి ఆక్సిజన్ అవసరం పడుతోంది. ఇది తీవ్ర కొరతకు దారి తీసింది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ను రీసైకిల్ చేస్తూ, ఎక్కువ సేపు వినియోగించుకునేలా భారత నావికా దళం ‘ఆక్సిజన్ రీసైక్లింగ్ సిస్టం (ఓఆర్ఎస్)’ను అభివృద్ధి చేసింది. కరోనా పేషెంట్లకు మాత్రమే కాదు.. ఆక్సిజన్ అవసరమైన అందరికీ ప్రయోజనం కలిగించే ఈ ఓఆర్ఎస్ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? వృథాను అరికడుతూ.. సాధారణంగా మనం పీల్చే గాలి నుంచి కొంత ఆక్సిజన్‌ను మాత్రమే ఊపిరితిత్తులు పీల్చుకుంటాయి. మిగతా ఆక్సిజన్, ఇతర వాయువులకు కార్బన్డయాక్సైడ్ అదనంగా తోడై బయటికి వెళ్లిపోతాయి. అంటే చాలా వరకు ఆక్సిజన్ వృథా అవుతున్నట్టే. ఈ వృథాను అరికట్టేలా ‘ఓఆర్ఎస్’ను రూపొందించారు. ఓఆర్ఎస్ వ్యవస్థతో వినియోగిస్తే.. ప్రస్తుతమున్న మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లనే రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ సమయం పాటు వాడుకోవచ్చు. డిజైన్ చేసింది ఎవరు? నావికా దళంలో.. నీటిలోకి లోతుగా వెళ్లి, ఎక్కువసేపు మునిగి ఉండటం (డైవింగ్)పై శిక్షణ ఇచ్చే నేవీ డైవింగ్ స్కూల్‌కు చెందిన లెఫ్టినెంట్ కమాండర్ మయాంక్ శర్మ ‘ఓఆర్ఎస్’ను డిజైన్ చేశారు. దీనిపై నేవీ పేటెంట్ కూడా పొందింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న ఈ పరికరం ఆపరేషనల్ ప్రొటోటైప్ (పూర్తిస్థాయిలో పనిచేయగల తొలి నమూనా)ను రూపొందించారు. తర్వాత పలు మార్పులతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. ఎలా పనిచేస్తుంది? పేషెంట్లు ఆక్సిజన్‌ను శ్వాసించి వదిలినప్పుడు అందులో కొంత మాత్రమే వినియోగం అవుతుంది. మిగతా ఆక్సిజన్, శరీరంలో ఉత్పత్తయ్యే కార్బన్డయాక్సైడ్ బయటికి వెళ్లిపోతాయి. వీటిలో ఆక్సిజన్‌ను తిరిగి వినియోగించుకుని, కార్బన్ డయాక్సైడ్ను మాత్రం బయటికి పంపడమే ‘ఓఆర్ఎస్’ వ్యవస్థ చేసే పని. ‘ఓఆర్ఎస్’లో పేషెంట్లకు అమర్చే మాస్కుకు మరో పైపును అదనంగా ఏర్పాటు చేశారు. దానికి ఒక తక్కువ ప్రెషర్ ఉండే మోటార్‌ను అమర్చారు. పేషెంట్లు శ్వాసించి వదిలిన గాలిని ఆ మోటార్ లాగేస్తుంది. అందులో కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించి, ఆక్సిజన్‌ను తిరిగి వినియోగించేలా ఏర్పాటు ఉంటుంది. ఎలా పరీక్షించారు? నేవీ అధికారులు 250 లీటర్ల ద్రవ ఆక్సిజన్ సిలిండర్‌కు ప్రత్యేకంగా రూపొందించిన వేపరైజర్ను, ఆక్సిజన్‌ను నేరుగా పేషెంట్లకు వినియోగించగలిగేలా ప్రెషర్ వాల్వులు, లీక్ ప్రూఫ్ పైపులతో కూడిన ఔట్‌లెట్‌ను అమర్చారు. అంటే నేరుగా ద్రవ ఆక్సిజన్ సిలిండర్ నుంచే ఆక్సిజన్ పీల్చుకునేలా ఏర్పాటు ఉంటుంది. సాధారణంగా ద్రవ ఆక్సిజన్‌ను నేరుగా వినియోగించడానికి వీలు ఉండదు. దానిని వేపరైజర్, ఇతర పరికరాలతో ఇతర ట్యాంకుల్లో నింపుతారు. వాటి నుంచి పైపులు అమర్చి వినియోగిస్తారు. నేవీ చేసిన ఏర్పాటులో.. ద్రవ ఆక్సిజన్ సిలిండర్ నుంచే నేరుగా వాడుకోవచ్చు. తయారీకి ఖర్చు పది వేలే.. నేవీ తయారు చేసిన ‘ఓఆర్ఎస్’ ప్రాథమిక నమూనాకు అయిన ఖర్చు రూ.10 వేలు మాత్రమే. దీనిని అమర్చి, ఆక్సిజన్‌ను రీసైకిల్ చేయడం ద్వారా.. సుమారు రోజుకు రూ.3 వేల వరకు ఆదా చేయవచ్చని అంచనా. అంటే పేషెంట్లపై గణనీయ స్థాయిలో ఖర్చు తగ్గుతుంది. ఎన్నో రంగాలకు ప్రయోజనం ‘ఓఆర్ఎస్’ పరికరంతో కేవలం ఆక్సిజన్ అవసరమైన పేషెంట్లకు మాత్రమే కాకుండా ఎన్నో రంగాల వారికి ప్రయోజనం కలుగనుంది. హిమాలయాలు వంటి పర్వతాలను అధిరోహించేవారు, ఎత్తైన ప్రాంతాల్లో పనిచేసే సైనికులు, జలంతర్గాముల్లో, సముద్రాల లోతుల్లో అన్వేషణలు జరిపేవారు.. ఇలా చాలా మందికి ఆక్సిజన్ అవసరం ఉంటుంది. ఇందుకోసం వారు బరువైన సిలిండర్లను భుజాన మోయాల్సి వస్తుంది. నేవీ పరికరంతో అలాంటి వారికి సిలిండర్ల బరువు, ఆక్సిజన్ ఖర్చు తగ్గిపోనుంది. చదవండి: 4 గంటలు శ్రమించి.. బ్లాక్ ఫంగస్ తొలగించి.. -
‘పీ 305’ ప్రమాదంలో 49 మంది మృతి
ముంబై: భీకర టౌటే తుపాను కారణంగా సముద్రంలో మునిగిపోయిన పీ–305 బార్జ్‌లోని సిబ్బందిలో మరో 26 మంది ఆచూకీ తెలియలేదని నౌకాదళం గురువారం పేర్కొంది. బార్జ్‌లో ఉన్న మొత్తం 261 మందిలో 49 మంది చనిపోయారని, మిగతా 186 మందిని రక్షించామని తెలిపింది. వరప్రద టగ్ బోట్ నుంచి మరో ఇద్దరిని కాపాడామని పేర్కొంది. అందులోని మరో 11 మంది కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపింది. సెర్చ్లైట్ల సాయంతో రాత్రింబవళ్లు గాలింపు జరుపుతున్నామని, ప్రమాదం జరిగి నాలుగు రోజులైనందున గల్లంతైన వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువేనని పేర్కొంది. టౌటే తుపాను ప్రభావంతో సముద్రంలో కొట్టుకుపోయిన పీ–305 బార్జ్ సోమవారం మునిగిపోయిన విషయం తెలిసిందే. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన నౌకాదళ విపత్తు సహాయ బృందం గాలింపు, రక్షణ చర్యలు ప్రారంభించింది. యుద్ధనౌకలు ఐఎన్ఎస్ కొచి, ఐఎన్ఎస్ కోల్‌కతా, ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ తేజ్‌లతో పాటు పీ–81 నిఘా విమానం, ఇతర నౌకాదళ హెలికాప్టర్లు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకున్నాయి. మొత్తంగా 600 మందికిపైగా ఓఎన్జీసీ సిబ్బందిని కాపాడామని నౌకాదళ అధికార ప్రతినిధి వెల్లడించారు. పశ్చిమతీరంలోని చమురు వెలికీతీత కేంద్రాల్లోని మొత్తం 6,961 ఉద్యోగులు, ఇతర సిబ్బంది క్షేమంగా ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కెప్టెన్ తేలిగ్గా తీసుకున్నాడు టౌటే తుపాను హెచ్చరికను పీ–305 బార్జ్ కెప్టెన్ బల్విందర్ సింగ్ తేలికగా తీసుకున్నారని దాని చీఫ్ ఇంజనీర్ రహమాన్ షేక్ ఆరోపించారు. గాలుల వేగం పెద్దగా ఉండదని, తుపాన్ ప్రభావం గంటసేపు మాత్రమే ఉంటుందని చెబుతూ... హెచ్చరికలను తేలికగా తీసుకొని ఇంత పెద్ద ఎత్తున ప్రాణనష్టానికి కారణమయ్యారని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రహమాన్ ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశారు. కెప్టెన్ బల్విందర్ గల్లంతైన వారిలో ఉన్నారు. -
INS Rajput: ‘రాజ్‌పుత్’కు వీడ్కోలు
సాక్షి, విశాఖపట్నం: ‘రాజ్ కరేగా రాజ్‌పుత్...’ అనే నినాదంతో నాలుగు దశాబ్దాల పాటు సాగర జలాల్ని భద్రతా వ్యవహారాల్లో పాలించిన ఐఎన్ఎస్ రాజ్‌పుత్ సేవల నుంచి నిష్క్రమించనుంది. భారత నౌకాదళానికి చెందిన మొట్టమొదటి డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ రాజ్పుత్ని విశాఖ నేవల్ డాక్‌యార్డులో శుక్రవారం డీ కమిషన్ చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 41 ఏళ్ల పాటు అవిశ్రాంత సేవలు అందించిన రాజ్‌పుత్‌కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు చేసింది. నాదెజ్నీ(ఆశ) పేరుతో 1961లో సోవియట్ యూనియన్‌లోని నికోలావ్ (ప్రస్తుతం ఉక్రెయిన్ ఉంది)లో ఐఎన్ఎస్ రాజ్‌పుత్ నిర్మాణాన్ని చేపట్టారు. 1977, సెప్టెంబర్ 17న సేవలు ప్రారంభించగా.. 1980, మే 4న తేదీన జార్జియాలోని యూఎస్ఎస్ఆర్లో భారత రాయబారి ఐ.కె.గుజ్రాల్ సమక్షంలో ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌గా పేరు మార్చి.. భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టి... జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి భారత సముద్ర జలాల్లో తిరుగులేని శక్తిగా మారింది. మొట్టమొదటి గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్గా 41 ఏళ్ల పాటు రాజ్‌పుత్ సుదీర్ఘ సేవలందించింది. పలు ఆపరేషన్లలో... దేశాన్ని ఎల్లపుడూ సురక్షితంగా ఉంచే లక్ష్యంతో ఐఎన్ఎస్ రాజ్‌పుత్ అనేక కార్యకలాపాల్లో పాల్గొంది. ఐపీకేఎఫ్‌కు సహాయంగా ఆపరేషన్ అమన్, శ్రీలంక తీరంలో పెట్రోలింగ్ విధుల కోసం ఆపరేషన్ పవన్, మాల్దీవుల బందీ పరిస్థితులను పరిష్కరించేందుకు అపరేషన్ కాక్టస్, లక్షద్వీప్‌కు చెందిన క్రోవ్‌నెస్ట్ ఆపరేషన్‌లో రాజ్‌పుత్ పాల్గొంది. వివిధ సందర్భాల్లో ద్వైపాక్షిక, బహుపాక్షిక విన్యాసాల్లో పాల్గొంది. 41 ఏళ్ల ఐఎన్ఎస్ రాజ్‌పుత్ ప్రస్థానంలో 31 మంది కమాండింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించారు. ►బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణికి ట్రయల్ ప్లాట్‌ఫామ్‌గా రాజ్‌పుత్ సేవలందించింది. ►2005లో ధనుష్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని కూడా రాజ్‌పుత్ నుంచి ట్రాక్ చేశారు. ►2007 మార్చిలో పృథ్వి–3 క్షిపణిని ఈ యుద్ధ నౌక నుంచి పరీక్షించారు. డాక్‌యార్డులో వీడ్కోలు నౌకాదళానికి అవిశ్రాంత సేవలం దించిన.. రాజ్‌పుత్‌కు ఘన వీడ్కోలు పలకను న్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విశాఖలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగే ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించనున్నారు. సూర్యాస్తమయ సమయంలో భారత నావికాదళం నుంచి ఐఎన్ఎస్ రాజ్‌పుత్ నిష్క్రమించనుంది. రాజ్‌పుత్‌లో విధులు నిర్వర్తించిన పలువురు అధికారుల్ని సత్కరించేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
Cyclone Tauktae: కడలి కబళించింది
ముంబై: టౌటే తుపాను కారణంగా సముద్రంలో కొట్టుకుపోయి, మునిగిపోయిన పీ 305 బార్జ్‌లోని సిబ్బందిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 49 మంది ఆచూకీ తెలియరాలేదు. 186 మందిని నౌకాదళం రక్షించింది. సముద్రంలో అత్యంత తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ నౌకాదళ సభ్యులు ఈ సహాయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ బార్జ్‌పై మొత్తం 261 మంది (తొలుత 273 మంది అని ప్రకటించినా దీనిని నిర్వహిస్తున్న కంపెనీ 261 మందే ఉన్నారని బుధవారం తెలిపింది) సిబ్బంది ఉన్నారు. ‘గల్లంతైన వారిని గుర్తించి, రక్షించే కార్యక్రమం కొనసాగుతోంది. అయితే సమయం గడుస్తున్న కొద్దీ వారిని రక్షించే అవకాశాలు సన్నగిల్లుతాయి’ అని నౌకాదళ అధికార ప్రతినిధి బుధవారం తెలిపారు. సముద్రంలో కొట్టుకుపోయిన మరో రెండు బార్జ్‌లు, ఒక ఆయిల్ రిగ్‌లోని సిబ్బంది సురక్షితంగా ఉన్నారన్నారు. జీఏఎల్ కన్స్ట్రక్టర్ బార్జ్‌లోని మొత్తం 137 మంది సిబ్బందిని మంగళవారమే నేవీ, కోస్ట్‌గార్డ్స్ రక్షించిన విషయం తెలిసిందే. ఎస్ఎస్ (సపోర్ట్ స్టేషన్) 3 బార్జ్‌లోని 196 మంది సిబ్బంది, సాగర్ భూషణ్ ఆయిల్ రిగ్‌పై ఉన్న 101 మంది సురక్షితంగా ఉన్నారని నేవీ వెల్లడించింది. చనిపోయిన 26 మంది మృతదేహాలను ఐఎన్ఎస్ కొచి యుద్ధనౌకలో ముంబైకి తీసుకువచ్చారు. ఐఎన్ఎస్ తేజ్, ఐఎన్ఎస్ బెట్వా, ఐఎన్ఎస్ బియాస్, ఐఎన్ఎస్ తల్వార్, పీ 81 యుద్ధ విమానం, సీ–కింగ్ చాపర్లు సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నాయి. ఓఎన్జీసీ, ఎస్సీఐ వినియోగిస్తున్న నౌకలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పీ 305 బార్జ్ సోమవారం సాయంత్రం నుంచి సముద్రంలో మునగడం ప్రారంభమయింది. గత నాలుగు దశాబ్దాల్లో ఇది అత్యంత క్లిష్టమైన గాలింపు, సహాయ కార్యక్రమమని డెప్యూటీ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ మురళీధర్ సదాశివ్ పవార్ వ్యాఖ్యానించారు. సహాయం కోరుతూ అభ్యర్థన వచ్చిన వెంటనే రంగంలోకి దిగామని, సోమవారం నుంచి సమన్వయంతో, సముద్రంలో నెలకొన్న దారుణమైన ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ గాలింపు, సహాయ చర్యలు కొనసాగిస్తున్నామని తెలిపారు. సహాయ చర్యలపై పీఎం ఆరా టౌటే తుపాను వల్ల అరేబియా సముద్రంలో మునిగిపోయిన బార్జ్ పీ 305లోని సిబ్బందిని రక్షించే సహాయ చర్యలపై బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. నేవీ సీనియర్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం బార్జ్ మునిగిపోతోంది. మరో మార్గం లేదు... అరేబియా సముద్రంలోకి దూకేయడమే. చుట్టూ చిమ్మచీకటి, 15 మీటర్ల ఎత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు. బలమైన గాలులు. లైఫ్ జాకెట్లు వేసుకున్నా... కల్లోల కడలిలో ఏం జరుగుతోందోననే భయం. ఎవరైనా సాయానికి వస్తారా? ఎప్పటికి చేరుకుంటారు? అసలు బతికి బట్టకడతామా? జలసమాధి కావాల్సిందేనా? ఎన్నెన్నో ప్రశ్నలు. భయాలు. ఏకంగా 12 గంటలపాటు జీవన్మరణ పోరాటం... చివరకు మంగళవారం ఉదయం నేవీ రక్షణ బృందాలు అక్కడికి చేరుకున్నాయి. రక్షించిన వారిలో 125 మందిని ఐఎన్ఎస్ బుధవారం ముంబైకి తీసుకొచ్చింది. ముంబైకి నైరుతి దిశలో 70 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో హీరా ఆయిల్‌ఫీల్డ్ ఉంది. ఇందులో పనిచేసే వారికోసం పీ–305 బార్జ్పైన తాత్కాలిక నివాసాలున్నాయి. టౌటే తుపాను తీవ్రతకు సోమవారం దీని లంగరు తెగిపోయి సముద్రంలోకి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. రాత్రికి మునిగిపోయింది. అప్పుడు దీనిపై 261 మంది ఉన్నారు. వీరిలో 186 మందిని నేవీ రక్షించింది. అచ్చు టైటానిక్ దృశ్యాలే ‘‘టైటానిక్ ఓడ మునిగిపోవడం, అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో నీళ్లలో దూకేయడం, చుట్టూ శవాలు, వాటి మధ్యలో కొందరి జీవన్మరణ పోరాటం... ఇవన్నీ ప్రజలు సినిమాలో చూసుంటారు. కానీ మా కళ్ల ముందే ఇదంతా జరిగింది. టైటానిక్ కంటే దారుణంగా ఉండింది పరిస్థితి. చుట్టూ నీళ్లపై మా సహచరుల మృతదేహాలు తేలియాడుతున్నాయి. లైఫ్‌జాకెట్ సహాయంతో 14 గంటలు అలా నీళ్లపై తేలుతూ ఉన్నాను. ఏమీ కాదు.. బతుకుతామని ఒకరికొకరం ధైర్యం చెప్పుకున్నాం. చివరకు నేవీ సిబ్బంది దేవుళ్లలా వచ్చి కాపాడారు’ అని 28 ఏళ్ల విశ్వజీత్ బంద్‌గార్ తెలిపారు. ‘అత్యంత భీతావహ పరిస్థితి. ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్నాం. బతికి బయటపడతానని అనుకోలేదు. ఏడు, ఎనిమిది గంటల పాటు అలా నీళ్లలో ఈదుతూ ఉన్నాను. చివరికి నేవీ వచ్చి రక్షించింది.’ అని మనోజ్ గీతే తెలిపాడు. కొల్హాపూర్‌కు చెందిన 19 గీతే నెలరోజుల కిందటే హెల్పర్‌గా ఆయిల్రిగ్పై పనికి కుదిరాడు. పీడకల లాంటి అనుభవం తర్వాత మళ్లీ తాను రిగ్‌పైకి వెళ్లబోనని తేల్చిచెప్పాడు. ‘బతికున్నాను... అదే సంతోషం’ అన్నాడు. తుపాను దెబ్బకు తన డాక్యుమెంట్లు, మొబైల్ ఫోన్ సముద్రంలో కలిసిపోయాయన్నాడు. నేవీ వల్లే బతికాం.. లేకపోతే ఏమయ్యేదో... అంటూ ఉబికివస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పాడు మరో కార్మికుడు. -
Cyclone Tauktae: మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో ‘తౌక్టే’ పెను విధ్వంసం
ముంబై, న్యూఢిల్లీ, అహ్మదాబాద్: గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు, 3 మీటర్లకు పైఎత్తున లేస్తున్న భీకర అలలు, అతి భారీ వర్షాలతో అత్యంత తీవ్ర తుపాను ‘‘తౌక్టే’’ సోమవారం రాత్రి గుజరాత్‌లోని పోరుబందర్ – మహువా మధ్య తీరం దాటింది. ‘రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని గంటల పాటు కొనసాగుతుంది’ అని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. గుజరాత్ సీఎం రూపానీ కూడా దీన్ని ధ్రువీకరించారు. తీరప్రాంత జిల్లాలైన అమ్రేలి, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, భావ్‌నగర్ జిల్లాలో తీవ్ర ప్రభావం ఉంటుందని, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఆయన తెలిపారు. 23 ఏళ్ల తర్వాత గుజరాత్‌ను తాకుతున్న అత్యంత భీకరమైన తుపాను ‘తౌక్టే’ ను పరిగణిస్తున్నారు. అరేబియా సముద్రంపై అల్లకల్లోలం సృష్టిస్తూ దూసుకువచ్చిన ‘టౌటే’ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసానికి కారణమైంది. పెనుగాలులు, అలల ధాటికి రెండు బార్జ్‌లు (యంత్ర సామగ్రి రవాణాకు వినియోగించే భారీ బల్లపరుపు పడవలు) సోమవారం సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వాటిలోని సుమారు 410 మంది సిబ్బందిని రక్షించడానికి నౌకాదళం రంగంలోకి దిగింది. సోమవారం అర్ధరాత్రికి వీరిలో 60 మందిని రక్షించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో సోమవారం పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిశాయి. పోర్ట్ల్లో ప్రమాద హెచ్చరికలు గుజరాత్‌లోని పోరు బందరు, మహువా (భావ్‌నగర్ జిల్లా)ల మధ్య సోమవారం ‘తౌక్టే’ తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కిమీ నుంచి 165 కి.మీ.ల వేగంతో పెనుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గుజరాత్లో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. సముద్రం మంగళవారం ఉదయం వరకు అల్లకల్లోలంగా ఉంటుందని, పరిస్థితి కొంత కుదుటపడుతుందని తెలిపింది. తుపాను మార్గంలో ఉన్న నౌకాశ్రయాల్లో అత్యంత ప్రమాద పరిస్థితిని సూచించే 9 లేదా 10 ప్రమాద హెచ్చరికలను జారీ చేయాలని వాతావరణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోరమ సూచించారు. గుజరాత్లో లోతట్లు ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు. 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు. రంగంలోకి నేవీ బాంబే హై ప్రాంతంలోని హీరా ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ‘పీ 305’ బార్జ్ కొట్టుకుపోతోందన్న సమాచారంతో నౌకాదళం రంగంలోకి దిగింది. యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ కొచ్చి’లో సహాయ సిబ్బంది ‘పీ 305’లో ఉన్న 273 మంది సిబ్బందికి కాపాడేందుకు బయల్దేరారు. మరో యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ తల్వార్’ ఈ సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటోంది. ముంబై తీరానికి ఈ ఆయిల్ ఫీల్డ్స్ 70 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. తుపాను సహాయ చర్యల కోసం ఇతర నౌకలను సిద్ధంగా ఉంచినట్లు నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ తెలిపారు. ‘సహాయం కోరుతూ జీఏఎల్ కన్స్ట్రక్టర్ బార్జ్ నుంచి సమాచారం వచ్చింది. ముంబై తీరానికి 8 నాటికన్ మైళ్ల దూరంలో అది ఉంది. ఆ బార్జ్‌లో 137 మంది సిబ్బంది ఉన్నారు. వారిని కాపాడడం కోసం ఐఎన్ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక బయల్దేరి వెళ్లింది’ అని ఆయన వెల్లడించారు. గుజరాత్‌లోని మహువాలో భీకరగాలుల ధాటికి చెట్లు కూలడంతో నిలిచిన ఆక్సిజన్ సిలిండర్ల ట్రక్కు వణుకుతున్న గుజరాత్ భారీ వర్షాలు, పెనుగాలులు గుజరాత్‌ను వణికిస్తున్నాయి. ‘తౌక్టే’ తీరాన్ని దాటిన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. జునాగఢ్, అమ్రేలి, గిర్ సోమనాథ్, నవ్సారి జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను టౌటేను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, విద్యుత్, రహదారులు సహా సంబంధిత శాఖల సిబ్బందితో సహాయ బృందాలను ఏర్పాటు చేశామని గుజరాత్ సీఎం రూపానీ తెలిపారు. సీఎంలతో ప్రధాని సమీక్ష తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం మాట్లాడారు. తుపాను పరిస్థితిని, సహాయ చర్యల సన్నద్ధతను వారితో చర్చించారు. సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వారికి హామీ ఇచ్చారు. తుపానుపై మహారాష్ట్ర సీఎం ఠాక్రే, గుజరాత్ సీఎం రూపానీ, గోవా సీఎం సావంత్, డయ్యూడామన్ ఎల్జీ ప్రఫుల్‌తో ప్రధాని సమీక్ష జరిపారు. మహారాష్ట్రలో బీభత్సం మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో ‘తౌక్టే’ తుపాను విధ్వంసం సృష్టించింది. ముంబై, థానెలను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రోజంతా బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను సోమవారం రాత్రి 8 గంటల వరకు నిలిపివేశారు. 55 విమానాలు రద్దు అయ్యాయి. లోకల్ ట్రైన్ సర్వీస్‌కు అంతరాయం కలిగింది. తుపాను పరిస్థితిని సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమీక్షించారు. తీర ప్రాంతం నుంచి దాదాపు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో చిక్కుకుపోయిన 12 మంది మత్స్యకారులను ఆదివారం రాత్రి కోస్ట్‌గార్డ్ దళం రక్షించింది. ముంబైలోని కొలాబాలో సోమవారం ఉదయం 8.30 నుంచి ఉదయం 11 గంటల మధ్య 79.4 మిమీల వర్షపాతం నమోదైంది. తుపాను కారణంగా కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు రాయ్‌గఢ్‌లో, ఇద్దరు నవీ ముంబైలో, ఒకరు సింధు దుర్గ్‌లో వేర్వేరు తుపాను సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. బాంద్రా– వర్లీ సీ లింక్‌ను తాత్కాలికంగా మూసేశారు. రాయ్‌గఢ్, పాల్ఘార్, రత్నగిరి, థానే ప్రాంతాల్లో దాదాపు గంటకు 100 కిమీల వేగంతో గాలులు వీచాయి. ఈ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై సహా పలు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, నేవీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మరోవైపు, రెండు బోట్లు మునిగిపోయిన ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు. రాయ్‌గఢ్‌లో దాదాపు 2 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి. -
INS Dhruv: ఇండియన్ జేమ్స్‌బాండ్.. ‘ధ్రువ్’
సాక్షి, విశాఖపట్నం: శత్రుదేశం ఎక్కుపెట్టిన క్షిపణి ఏదైనా సరే.. అదెక్కడ ఉంది.. ఎంత దూరంలో ఉంది.. దాన్ని ఛేదించేందుకు ఏం చేయాలనే వివరాల్ని రక్షణ రంగానికి చేరవేయగల సత్తాతో భారత్ అమ్ముల పొదిలో ‘ధ్రువ్’తార త్వరలో చేరబోతోంది. విభిన్న సాంకేతికతతో అత్యంత రహస్యంగా రూపొందించిన ఈ క్షిపణి (మిసైల్)గ్రాహక యుద్ధ నౌక త్వరలోనే భారత నౌకాదళంలో సేవలందించనుంది. విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డు (హెచ్ఎస్ఎల్)లో రూ.1,500 కోట్ల వ్యయంతో ‘ఐఎన్ఎస్ ధ్రువ్’ రూపుదిద్దుకుంది. అధునాతన సాంకేతికతతో రూపొందించిన ఈ సముద్ర నిఘా గూఢచారి నౌక వీసీ–11184ను నిర్మించారు. అనేక ప్రత్యేకతలు, శత్రు క్షిపణుల్ని గుర్తించగల అరుదైన సామర్థ్యం గల ఈ నౌకను రక్షణ శాఖ త్వరలోనే జాతికి అంకితం చేయనుంది. అణు క్షిపణుల్ని సైతం.. ధ్రువ్.. అనేక మిషన్లను ఒంటిచేత్తో పూర్తి చేయగల సామర్థ్యం దీని సొంతం. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) శాస్త్రవేత్తలు, ఇండియన్ నేవీ ఇంజినీర్లు, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్టీఆర్వో) శాస్త్రవేత్తలు, హిందుస్థాన్ షిప్‌యార్డు (హెచ్ఎస్ఎల్) నిపుణులు ఈ నౌక నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. శత్రుదేశాలైన చైనా, పాకిస్తాన్‌తో పాటు ఇతర భూభాగాల నుంచి మిసైల్స్ ప్రయోగిస్తే.. వాటిని ధ్రువ్ ద్వారా ట్రాక్ చేయవచ్చు. వాటి లక్ష్యాన్ని అక్షాంశాలు, రేఖాంశాల సహాయంతో ఇది సులువుగా కనిపెట్టేస్తుంది. వీటిని ఏ ప్రాంతంలో ధ్వంసం చేస్తే.. దేశానికి మేలు జరుగుతుందన్న విస్తృత సమాచారాన్ని రక్షణ శాఖకు అందించగల సామర్థ్యం దీని సొంతం. సాధారణ మిసైల్స్‌తో పాటు న్యూక్లియర్ మిసైల్స్ జాడల్ని కూడా సులభంగా గుర్తించేలా ధ్రువ్‌లో సాంకేతికతను అమర్చారు. ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ దేశం మొత్తం ఎప్పటికప్పుడు నిశిత పరిశీలన చేసే శాటిలైట్ మోనిటర్లను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ నౌక నిర్మాణంతో అత్యాధునిక అధునాతన సముద్ర నిఘా వ్యవస్థలున్న పీ–5 దేశాల సరసన భారత్ చేరింది. ఇప్పటివరకూ ఈ తరహా టెక్నాలజీ నౌకలు అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ఉన్నాయి. అందుకే భారత నౌకాదళం ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ యుద్ధనౌకను ‘ఈసీజీ ఆఫ్ ఇండియన్ ఓషన్’ అని పిలుస్తున్నారు. దీని తయారీని 2015లో ప్రారంభించారు. 2020 అక్టోబర్‌లో నౌక నిర్మాణం పూర్తయింది. హిందుస్థాన్ షిప్‌యార్డులో నిర్మితమైన అతి భారీ నౌక ఇదే కావడం విశేషం. అత్యంత రహస్యంగా దీని నిర్మాణం పూర్తి చేశారు. ఇందులో సెన్సార్లతో కూడిన ‘త్రీ డోమ్ షేప్డ్ సరై్వలెన్స్ సిస్టమ్’ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే రాడార్స్ టెక్నాలజీ వినియోగించారు. దీని ద్వారా 14 మెగావాట్ల విద్యుత్‌ను సైతం ఉత్పత్తి చేయొచ్చు. నౌక నిర్మాణం పూర్తయిన తర్వాత 6 నెలల పాటు రహస్యంగా షిప్‌యార్డు డ్రై డాక్‌లోనే ఉంచారు. ఇటీవలే ప్రయోగాత్మకంగా విధుల్లోకి తీసుకొచ్చారు. త్వరలోనే అధికారికంగా జాతికి అంకితం చేయనున్నారు. -
రూ.3,000 కోట్ల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం
కొచ్చి: అరేబియా సముద్రంలో భారత నేవీ రూ.3వేల కోట్ల విలువైన మత్తుపదార్థాలను పట్టుకున్నట్లు రక్షణశాఖ సోమవారం వెల్లడించింది. చేపలు పట్టే ఓ పడవలో మత్తుపదార్థాలను గుర్తించినట్లు పేర్కొంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత నేవీకి చెందిన సువర్ణ షిప్ పాట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వారికొక చేపలు పట్టే పడవ కనిపించింది. అందులోని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో నేవీ అధికారులు అందులోకి దిగి సోదాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారికి 300 కేజీల మత్తు పదార్థాలు కనిపించాయి. దీంతో బోటులోని వ్యక్తు లను కొచ్చి తీరానికి తరలించి విచారణ జరుపు తున్నారు. బోటులోని అయిదుగురు శ్రీలంకు చెందినవారు. ఆ బోటు శ్రీలంకకు చెందినదని, పాకిస్తాన్ నుంచి బయలుదేరి భారత్, శ్రీలంక వైపుగా పయనిస్తుండగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుకున్న మత్తు పదార్థాల విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ. 3 వేల కోట్లు ఉంటుందని వెల్లడించారు. తదుపరి విచారణను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ)కి అప్పగించనున్నారు. -
బ్రేకింగ్: రూ. 3 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
న్యూఢిల్లీ: భారత నావికా దళం సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో చేపలు పట్టే ఓ నౌక నుంచి 300 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్ నేవి న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐకి వెల్లడించింది. వీటి విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తోన్న ఐఎన్ఎస్ సువర్ణ ఈ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఐఎన్ఎస్ సువర్ణ.. చేపలు పట్టే నౌక ఒకటి సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని గమనించింది. వెంటనే రంగంలోకి దిగి.. సదరు నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడమే కాక నౌకలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో షిప్లో 300 కేజీలకు పైగా డ్రగ్స్ ఉండటం గమనించింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవడమే కాక.. విచారణ నిమిత్తం నౌక, దానిలో ఉన్న సిబ్బందిని కేరళ కొచ్చి తీరానికి తరలించింది. ఈ నౌక ఎవరికి సంబంధించింది.. దీనిలో రవాణ చేస్తున్న డ్రగ్స్ ఎవరికి సంబంధించినవి తదితర వివరాలను రాబట్టనుంది. చదవండి: సంచలనం: బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులు -
ఐఎన్ఎస్ విరాట్ విచ్ఛిన్నంపై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: భారత నావికా దళ విమాన వాహక నౌక ‘ఐఎన్ఎస్ విరాట్’ను విచ్ఛిన్నం చేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. జాతి ప్రయోజనాల రీత్యా నావికాదళ నౌకని విచ్ఛిన్నం చేయరాదని, ఈ చారిత్రక నౌకను భద్రపరచాలని కోరుతూ ఓ ప్రైవేటు కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. ఈ నౌకను ప్రస్తుత యజమాని నుంచి కొనుగోలు చేసి, సముద్ర మ్యూజియంగా మార్చాలని భావిస్తోన్న ఎంఎస్ ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. గత ఏడాది జరిగిన వేలంపాటలో దాదాపు రూ.65కోట్లకు శ్రీరాం షిప్ బ్రేకర్స్ దీన్ని కొనుగోలు చేసింది. గుజరాత్‌లోని అలంగ్ బీచ్‌లో ఈ నౌకను విచ్ఛిన్నంచేయనుంది. రూ. 100 కోట్లకు కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు ఎన్విటెక్ సంస్థ తెలిపింది. దీనిపై స్పందించాల్సిందిగా హోం శాఖను, నౌక ప్రస్తుత యజమానిని కోర్టు కోరింది. ఈ నౌకను తమకు ఇవ్వాల్సిందిగా కోరుతూ గతంలో బాంబే హైకోర్టుని ఎన్విటెక్ మెరైన్ కన్సల్టెంట్స్ కంపెనీ అభ్యర్థించింది. నౌకను కొనుగోలు చేసేందుకు ఎన్ఓసీ కోరిన ప్రైవేటు కంపెనీ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిందిగా గత ఏడాది నవంబర్ 3న, జస్టిస్ నితిన్ జామ్దార్, జస్టిస్ మిలిండ్ జాధవ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది. -
యూనిఫామ్ ఆమె తొడుక్కుంటారు
2019 ఏప్రిల్‌లో భారత నావికాదళం వారి ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం జరిగి లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ మరణించేనాటికి అతనికి పెళ్లయ్యి నలభై రోజులు. భార్య కరుణ సింగ్ అతని వీర మరణాన్ని తొణకక స్వీకరించారు. అత్తగారింటి బాధ్యతలను తల్లి ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు. అంతటితో ఆగలేదు. భర్త స్ఫూర్తిని కొనసాగించడానికి అతి కష్టమైన ఎస్ఎస్బి (సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్) పరీక్షను పాసయ్యి ఆర్మీలో శిక్షణకు ఎంపికయ్యారు. జనవరి 7 నుంచి చెన్నైలో ఆమె శిక్షణ మొదలవుతోంది. ఆమె పరిచయం. ఏప్రిల్ 26, 2019. కర్వర్ హార్బర్. కర్ణాటక. మరికొన్ని గంటల్లో సముద్రంలో ఉన్న ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్య తీరానికి చేరుకుంటుంది. నావికాదళ యుద్ధనౌక అది. కాని ఈలోపే దానిలో మంటలు అంటుకున్నాయి. అందులో ఉన్న నావికాదళ అధికారులు ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. ఇద్దరు ఆఫీసర్లు ఆ పోరాటంలో చనిపోయారు. వారిలో ఒకరు లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్. అప్పటికి అతనికి పెళ్లయ్యి కేవలం నలభై రోజులు. అతని భార్య కరుణ సింగ్‌కు ఆ వార్త అందింది. అత్తగారింట్లో ఉండగా... కరుణ సింగ్ ఆగ్రాలోని దయాల్బాగ్ యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె ఒక మేట్రిమొని కాలమ్ ద్వారా ధర్మేంద్ర సింగ్ చౌహాన్‌ను వివాహం చేసుకున్నారు. ‘వివాహానికి సంబంధించి నేనూ అందరిలాగే ఎన్నో కలలు కన్నాను’ అన్నారు కరుణ. ధర్మేంద్ర సింగ్‌ది మధ్యప్రదేశ్‌లోని కర్తాల్. ‘ఆయన మరణవార్త నాకు చేరేసరికి నేను మా అత్తగారి ఇంట్లో ఉన్నాను. నేను నా పదవ తరగతిలోపే మా నాన్నను కోల్పోయాను. ఇప్పుడు పెళ్లయిన వెంటనే భర్తను కోల్పోయాను. దేవుడు నా జీవితం నుంచి ఏదైనా ఆశించే ఈ పరీక్షలు పెడుతున్నాడా అనిపించింది’ అన్నారు కరుణ. స్త్రీలే బలం ‘నా భర్త మరణవార్త విని నేను కొన్ని రోజులు దిగ్భ్రమలో ఉండిపోయాను. అయితే మా అత్తగారు టీనా కున్వర్, మా అమ్మ కృష్ణా సింగ్ నాకు ధైర్యం చెప్పారు. చెట్టంత కొడుకును కోల్పోయిన మా అత్తగారు, కూతురి అవస్థను చూస్తున్న మా అమ్మ... ఇద్దరూ ధైర్యం కూడగట్టుకుని నాకు ధైర్యం చెప్పారు. ఈ ఇంటికి గాని ఆ ఇంటికి గాని నేనే ఇప్పుడు ముఖ్య సభ్యురాలిని అని అర్థమైంది. ఇరు కుటుంబాల బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉండిపోయాను’ అన్నారు కరుణ సింగ్. ఆర్మీలో చేరిక ‘అసోసియేట్ ప్రొఫెసర్‌గా నాకు మంచి ఉద్యోగం ఉంది. కాని నా భర్త మరణం తర్వాత అతని స్ఫూర్తిని సజీవంగా ఉంచాలని నాకు అనిపించింది. దేశమంతా తిరుగుతూ దేశానికి సేవ చేయాలని అనుకున్నాను. నేవీలో పని చేసే అధికారులు నన్ను నేవీలో చేరమన్నారు. కాని నేను ఆర్మీని ఎంచుకున్నాను. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షకు హాజరవుదామనుకున్నాను. అయితే సైనిక వితంతువులకు రిటర్న్ టెస్ట్ ఉండదు. నేరుగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఐదు రోజుల పాటు వివిధ దశల్లో ఇంటర్వ్యూ సాగుతుంది. నేను సెప్టెంబర్‌లో ఇంటర్వ్యూకు హాజరయ్యాను. కాని మొదటి రోజునే పంపించేశారు. తిరిగి అక్టోబర్‌లో హాజరయ్యి ఫిజికల్ టెస్ట్‌లలో పాసయ్యాను. ఆ తర్వాత మౌఖిక ఇంటర్వ్యూ సుదీర్ఘంగా సాగింది. నాకు మంచి ఉద్యోగం ఉన్నా ఆర్మీలో ఎందుకు చేరాలనుకుంటున్నానో అడిగారు. నాకు దేశసేవ చేయాలనుందని చెప్పాను. ఎంపికయ్యాను. ఆఫీసర్‌గా చెన్నైలో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో జనవరి నుంచి నా ట్రైనింగ్ మొదలయ్యి 11 నెలలు సాగుతుంది’ అని చెప్పారు కరుణ. ఆమె దేశం కోసం పని చేసే గొప్ప సైనిక అధికారి కావాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
వీరుడా వందనం
న్యూఢిల్లీ : త్రివిధ బలగాల్లో సేవలందించి ప్రత్యేకత చాటుకున్న ఒకే ఒక్క భారతీయుడు, రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సాహసికుడు, ప్రీతిపాల్ సింగ్ గిల్ 100 ఏళ్ల పుట్టిన రోజు పండుగని కుటుంబ సభ్యుల మధ్య వేడుకగా జరుపుకున్నారు. ఆర్మీలో కల్నల్‌గా రిటైర్ అయిన ప్రీతిపాల్ సింగ్ గిల్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం తన నూరవ పుట్టిన రోజు నాడు బొటనవేలు పైకెత్తి చూపిస్తూ ప్రీతిపాల్ పోస్టు చేసిన ఫొటోకి నెటిజన్లు చెయ్యెత్తి జై కొట్టారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట జిల్లా పాఖీ గ్రామానికి చెందిన ప్రీతిపాల్ కుటుంబం తరతరాల నుంచి సైన్యంలోనే పనిచేస్తోంది. 1920 డిసెంబర్ 11న పాటియాలాలో పుట్టిన ప్రీతిపాల్ సింగ్ 1942లో భారత వాయుసేనలో చేరారు. అయితే ఆయన తండ్రి తన కుమారుడు విమానం కూలి ఎక్కడ మరణిస్తాడో అన్న భయంతో నేవీకి పంపించారు. కార్గో నౌకలకు ఎస్కార్ట్‌గా ప్రీతిపాల్‌సింగ్ రెండో ప్రపంచ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. కొన్నేళ్ల తర్వాత ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆర్మీకి బదిలీ చేశారు. గ్వాలియర్ మౌంటెన్ రెజిమెంట్‌లో సేవలు అందిస్తూ 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ సెక్టార్ కమాండర్‌గా పని చేస్తూ 1970లో రిటైర్ అయ్యారు. పదవీ విరమణ తర్వాత తన స్వగ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన భార్య ప్రమీందర్ కౌర్‌కి ఇప్పుడు 95 ఏళ్లు. వారిద్దరికీ ఒకే ఒక్క కుమారుడు ఉన్నారు. సింగ్ శరీరానికే వయ సు వచ్చిందే తప్ప ఆయన మనసు ఎప్పు డూ నిత్య యవ్వనంతో ఉరకలేస్తూ ఉంటుం దని ప్రీతిపాల్ మనవడు అభయ్‌పాల్ చెప్పారు. టెన్నిస్, బ్యాడ్మింటన్ ఆడడం అం టే ఆయనకి చాలా ఇష్టం. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్‌తో పాటు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. -
సాహస యాత్రకు సబల సిద్ధం
సముద్రమంత తెగువ.. అవధులు లేని ఆత్మవిశ్వాసం.. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన.. సాగరం చిన్నబోయేలా.. సంకల్పం తలవంచేలా.. అలల ఆటుపోట్లు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తూ.. తిమిరంతో సమరం చేస్తూ కదన రంగంలోనూ సరిలేరు మాకెవ్వరంటూ భారత నౌకాదళం లో తమ శకాన్ని లిఖిస్తున్నారు మహిళలు. నౌకాదళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వర్తింపజెయ్యాలన్న దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అప్పటినుంచి నౌకాదళంలో మహిళా శకం మొదలైంది. లింగసమానత్వానికి సరికొత్త నిర్వచనాన్ని తిరగరాస్తూ.. యుద్ధనౌకల్లో మహిళా అధికారుల్ని నియమించి కొత్త అధ్యాయానికి భారత నౌకాదళం తెరతీసింది. తొలి మహిళా పైలట్‌గా శివాంగి నియామకంతో సముద్రమంత ఉత్సాహం మహిళల్లో నెలకొంది. ఆ తర్వాత కొద్ది కాలానికే... యుద్ధ నౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితీసింగ్‌లు అడుగు పెట్టడంతో.. ఆత్మ విశ్వాసం రెట్టింపైంది. నౌకాదళం అమ్ముల పొదిలో చేరిన అత్యాధునిక ఎంహెచ్–60 ఆర్ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి నియామకంతో సైన్యంలో మహిళలకు సమ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపించారు. ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలపై మహిళా అధికారులు మోహరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా... ఇప్పటి వరకూ నిర్మించిన ఏ యుద్ధ నౌకలోనూ మహిళలకంటూ ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చెయ్యలేదు. కనీసం మహిళల కోసం ఏ ఒక్క యుద్ధ నౌకలోనూ ప్రత్యేక టాయిలెట్స్ లేవంటే.. తమకు యుద్ధ నౌకల్లో పని చేసే అర్హత లేదన్నట్లుగా భావించారన్న అనుమానాలు మహిళాలోకంలో వ్యక్తమవుతున్నాయి. అయితే.. మారుతున్న కాలానికనుగుణంగా నౌకా నిర్మాణంలోనూ మార్పులు రానున్నాయని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ ఏకే జైన్ నేవీ డే సందర్భంగా స్పష్టం చేశారు. ఇప్పటికే.. యుద్ధ నౌకల్లో మహిళల ప్రవేశం లాంఛనమైన నేపథ్యంలో.. వారికి కావల్సిన సౌకర్యాలతో నౌకల్ని సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. తరిణి స్ఫూర్తితో బుల్ బుల్.... గోవా నుంచి కేప్‌టౌన్‌కు సెయిలింగ్ బోట్లో వెళ్లి తిరిగి దేశానికి చేరుకుంటూ.. భారతీయ మహిళా శక్తిని ప్రపంచానికి చాటిచెప్పిన ఐఎన్ఎస్వీ తరిణి మహిళా బృందం చేసిన సాహసయాత్ర.. నౌకాదళంలోని మహిళలకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. సుమారు 21 వేల నాటికల్ మైళ్ల దూరం.. ఐదు మహా సముద్రాలు, ఐదు అంచెల ప్రయాణం.. ఆరుగురు మహిళలు కలిసి... భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటిచెప్పడమే లక్ష్యంగా సాగిన ‘నావికా సాగర్ పరిక్రమ’.. ఆసియాలోనే తొలిసారిగా కేవలం ఆరుగురు మహిళలతో కూడిన సెయిలింగ్ బోట్ సాహస యాత్ర ఇది. ఇండియన్ నేవీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల్లో 20 మందిని వివిధ పరీక్షల అనంతరం ఈ యాత్రకోసం ఆరుగురిని ఎంపిక చేశారు. తరిణికి సారధిగా లెఫ్టినెంట్ కమాండర్ వర్తికా జోషి వ్యవహరించగా లెఫ్టినెంట్ కమాండర్ ప్రతిభా జమ్వాల్, లెఫ్టినెంట్ కమాండర్ పాతర్లపల్లి స్వాతి, లెఫ్టినెంట్లు విజయదేవి, లెఫ్టినెంట్ పాయల్‌గుప్తా, లెఫ్టినెంట్ ఐశ్వర్య బొడ్డపాటికి అవకాశం దక్కింది. స్వాతి విశాఖ అమ్మాయి కాగా, ఐశ్వర్య హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. ఈ యాత్ర అందించిన స్ఫూర్తి.. నౌకాదళంలో మహిళలకు సముచిత స్థానం కల్పించడంలో కీలక పాత్ర పోషించింది. తరిణి సాహస యాత్రని స్ఫూర్తిగా తీసుకొని.. మరో యాత్రకు మహిళల్ని పంపించేందుకు భారత నౌకాదళం సమాయత్తమవుతోంది. ఈ సాహస యాత్రకు బుల్బుల్ అని పేరు పెట్టినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సాహసయాత్రకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొదలైందనీ.. త్వరలోనే బుల్బుల్ యాత్ర ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. ఈ యాత్ర ద్వారా.. నౌకాదళంలో మహిళ పాత్ర అత్యవసరం.. ఆవశ్యకం అని చాటి చెప్పనున్నారు. మహిళల అంకితభావానికి హ్యాట్సాఫ్ ‘లింగభేదాన్ని సమూలంగా చెరిపేసేందుకు నౌకాదళం మహిళలకు పెద్ద పీట వేస్తోంది. యుద్ధనౌకల్లో క్రమంగా మహిళల ప్రాధాన్యం పెరిగే రోజులు సమీపంలోనే ఉన్నాయి. ఇప్పటికే వివిధ శాఖల్లో 9 నుంచి 10 మంది మహిళా అధికారులను శాశ్వతంగా నియమించే ప్రక్రియ మొదలైంది. అయితే సముద్రంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు యుద్ధనౌకల్లో మహిళలకు సరైన మౌలిక వసతులు లేవు. ఇప్పుడా మచ్చ చెరిగిపోతుంది. వారికి కావాల్సిన అన్ని రకాల వసతులు, వనరులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. కేవలం వృత్తిపరంగానే కాకుండా.. సాహసయాత్రల్లోనూ వారిది పై చేయి ఉండాలని సంకల్పించాం. ఇప్పటికే ఐఎన్ఎస్వీ తరిణి సాహస ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇదే స్ఫూర్తితో త్వరలో బుల్బుల్ ప్రారంభం కానుంది. మహిళా అధికారులు నౌకాదళంలో తమ ఉనికిని చాటుకునేందుకు ప్రదర్శిస్తున్న అంకిత భావానికి హ్యాట్సాఫ్ – వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్, తూర్పు నౌకాదళాధిపతి – కరుకోల గోపీకిశోర్‌రాజా సాక్షి, విశాఖపట్నం -
నిరాడంబరంగా నేవి డే
విశాఖ : పాకిస్తాన్‌పై భారత్ విజయానికి సూచికగా ఏటా నిర్వహించే నేవీ డే విన్యాసాలు ఈ ఏడాది నిరాడంబరంగా జరుగుతున్నాయి. తూర్పు తీరం నుంచి బయలుదేరిన యుద్ధనౌకలు కరాచీ పోర్టును స్వాధీనం చేసుకోవడంతో 1971 డిసెంబర్ 4న భారత్ విజయం సాధించింది. దీనికి గుర్తుగా ఏటా విశాఖ తెరువు తూర్పు నౌకాదళం ఇండియన్ నేవీ డే విన్యాసాలు భారీ ఎత్తున జరుగుతుంటాయి. కానీ ఈ ఏడాది కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఎలాంటి విన్యాసాలు నిర్వహించలేదు. కేవలం ఇవాళ సాయంత్రం శుక్రవారం) విశాఖ తీరంలో యుద్ధ నౌకలపై విద్యుద్దీపాలు అలంకరించి నేవీ డే కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. ఈ దశలో విశాఖ బీచ్‌లో ఉండే విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద తూర్పు నౌకా దళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ జైన్ పూలమాలవేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. శత్రుదేశాలతో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు నావే ఎప్పుడు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. (ఇది మనసున్న ప్రభుత్వం) -
బోటులో వంద కేజీల హెరాయిన్
సాక్షి, చెన్నై/మల్కాపురం (విశాఖ పశ్చిమ): శ్రీలంకకు చెందిన ఓ బోటు ద్వారా పాకిస్తాన్‌కు రవాణా చేస్తున్న వంద కేజీల హెరాయిన్‌ను భారత తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది. తమిళనాడులోని తూత్తుకుడి సమీపంలో ఈ నెల 17 నుంచి తొమ్మిది రోజుల పాటు నావికాదళ విన్యాసాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విన్యాసాలలో భాగంగా భారత నావికాదళం ఒక శ్రీలంక బోటును గుర్తించింది. అనుమానం వచ్చి ఆ బోటును పట్టుకొని అందులో ఉన్న ఆరుగురు సిబ్బందిని ప్రశ్నంచగా.. వారు హెరాయిన్‌ను పాకిస్తాన్‌కు తీసుకువెళ్తున్నట్టు చెప్పారు. వీటిని పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు అమ్ముతారని తెలిసింది. 99 ప్యాకెట్ల హెరాయిన్‌ను, 20 చిన్న పెట్టెల సింథటిక్ డ్రగ్స్‌ను, ఐదు 9 ఎంఎం పిస్టళ్లను, ఒక శాటిలైట్ ఫోన్ సెట్‌ను గస్తీ దళం స్వాధీనం చేసుకొని విచారణ జరుపుతోంది. -
పాకిస్థాన్ డ్రగ్స్‌ను పట్టుకున్న భారత్
చెన్నై: తూత్తుకుడికి దక్షిణ ప్రాంతం నుంచి శ్రీలంక వెళ్తున్న పడవ నుంచి 100 కిలోల హెరాయిన్‌తో సహా మాదకద్రవ్యాలను భారతీయ కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. నిఘా వర్గాల సమాచారం మేరకు, నవంబర్ 17 నుంచి సుదీర్ఘమైన, నిరంతర ప్రయత్నాలు చేసి పట్టుకున్నామని అధికారులు బుధవారం చెప్పారు. కరాచీ నుంచి శ్రీలంకకు మాదకద్రవ్యాలను ఎగుమతి చేసి, అక్కడి నుంచి పాశ్చాత్య దేశాలకు, ఆస్ట్రేలియాకు ఎగుమతి చేస్తున్నారు. పాకిస్తాన్ జిహాద్‌తోపాటు మాదకద్రవ్యాలను కూడా ఎగుమతి చేస్తుంది. ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడానికే ఈ ఎగుమతులు చేస్తున్నారని ఒక అధికారి తెలిపారు. 99 ప్యాకెట్ల హెరాయిన్ (100 కేజీలు), 20 చిన్న బాక్సులలో సింథటిక్ డ్రగ్స్, ఐదు 9 ఎంఎం పిస్టల్స్, ఒక తురాయ సెట్‌ను ఖాళీ ఇంధన ట్యాంక్ లోపల ఉంచి ఐసిజి షిప్ ద్వారా ఎగుమతి చేస్తున్నారని మరో అధికారి తెలిపారు. పడవ కెప్టెన్‌తో సహా ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విచారణలో శ్రీలంక నావికాదళం నుంచి ఒక సందేశం కూడా వచ్చిందని ఒక అధికారి తెలిపారు. ఈ పడవ శ్రీలంకకు పశ్చిమ తీరంలో ఉన్న నెగోంబోలోని అలెన్సు కుట్టిగే సిన్హా దీప్తా సాని ఫెర్నాండోకు చెందినదిగా గుర్తించారు. -
భారత నౌక దళానికి కొత్త బలం ‘వగీర్’
ముంబై: ఇండియన్ నౌక దళానికి కొత్త శక్తి తోడైంది. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారు చేసిన 5వ శ్రేణి స్కార్పిన్ జలంతర్గామి ‘వగీర్’ని నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అరేబియా సముద్రంలోని మజగావ్ డాక్ వద్ద రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపద్ నాయక్ వీడియో కాన్సరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. ఫ్రెంచి నౌక రక్షణ సంస్ధ డీసీఎన్ఎస్ భాగస్వామ్యంతో భారత నౌక దళ ప్రాజెక్ట్-75లో ప్రభుత్వ రక్షణ రంగ సంస్థ మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఈ వగీర్ జలంతర్గామిని నిర్మించింది. భారత నౌక దళ అవసరాలకు అనుగుణంగా ఆరు స్కార్పిన్ జలంతర్గాములను నిర్మించడానికి మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్‌కు బాధ్యతలను అప్పగించింది. వీటిలో ఐఎన్ఎస్ కల్వరీని 2015లో మొదట ప్రారంభించగా, 2017 నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆ తర్వాత ఖాందేరీ, కరంజ్, వేలా జలంతర్గాములను ప్రారంభించారు. (చదవండి:మలబార్ డ్రిల్‌లో ఆస్ట్రేలియా ) ‘వగీర్’ సేవలను వచ్చే సంవత్సరం నుంచి ఉపయోగించుకోవచ్చునని పశ్చిమ నౌక దళ వైస్ ఆడ్మిరల్ ఆర్బి పండిట్ అన్నారు. ‘ఇప్పటికే ఉన్న రెండు కల్వరీ జలంతర్గాములు చురుగ్గా పని చేస్తున్నాయి. మిగిలిన నాలుగు కూడా ఇందులో భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉందని’ ఆయన అన్నారు. ఈ రకం జలంతర్గాములు భూమిపైన, లోపల జరిగే యుద్ధాలలో సేవలు అందిచడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. దేశాన్ని ముందుకు నడిపించే యుద్ధ నౌకల నిర్మాణంలో మజగావ్ డాక్ సంస్థ ముందుంటుంది. ఇప్పటి వరకు ఈ సంస్థ గోదావరి యుద్ధ నౌకలు, రేస్ కార్లు, మిసైల్ బోట్స్ ఇతరేతర శత్రు వినాశనిలను తయారు చేసింది. -
యుద్ధ వాతావరణం.. నౌకా విన్యాసం!
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో జరుగుతున్న 24వ మలబార్ విన్యాసాలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. భారత యుద్ధ నౌకలు మరోసారి తమ సత్తా చాటాయి. అండమాన్ సముద్ర జలాల్లో నిర్వహించిన విన్యాసాల్లో భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్)తో పాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్)కి చెందిన నౌకలు చేసిన విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించింది. ముఖ్యంగా భారత్‌కు చెందిన ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్మెరైన్లు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ అద్భుత ప్రదర్శన కనబర్చాయి. -
మలబార్ 2020 విన్యాసాలు
-
చైనాకు 'చెక్' లక్ష్యంగా..
సాక్షి, విశాఖపట్నం: ఇండో–పసిఫిక్ రీజియన్‌పై పట్టు సాధిస్తూ.. శత్రు దేశం చైనా కుటిల యత్నాలకు, దాని దూకుడుకు చెక్ చెప్పేందుకు భారత్ వేస్తున్న ప్రతి అడుగూ విజయం దిశగా సాగుతోంది. రెండున్నర దశాబ్దాలుగా భారత్, యూఎస్, జపాన్ దేశాలు కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మలబార్ యుద్ధ విన్యాసాల్లో ఈసారి రాయల్ ఆస్ట్రేలియా నౌకాదళం జత కలిసింది. మంగళవారం ప్రారంభమైన 24వ మలబార్ విన్యాసాల్లో పాల్గొనేందుకు నాలుగు దేశాల యుద్ధ నౌకలు బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల ఉత్తర సముద్ర తీరానికి చేరుకున్నాయి. ఈ నెల 6వ తేదీ వరకూ తొలి దశ యుద్ధ విన్యాసాలు జరగనున్నాయి. ఆ తరువాత ఇదే నెల 17 నుంచి 20వ తేదీ వరకూ మలబార్ రెండో దశ విన్యాసాలను అరేబియా సముద్రంలో నిర్వహించనున్నట్టు భారత నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. భారత నౌకాదళంతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మేరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జెఎంఎస్‌డీఎఫ్)తోపాటు తొలిసారిగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్) నౌకాదళం పాల్గొన్నాయి. కోవిడ్–19 నేపథ్యంలో తొలిసారిగా ‘నాన్ కాంటాక్ట్–ఎట్ సీ’ పద్ధతిలో విన్యాసాలు చేపట్టారు. ఇండో–పసిఫిక్ సముద్ర జలాల్లో స్వేచ్ఛ, ఓపెన్ నావిగేషన్ వ్యవస్థల్ని పరిరక్షించడం, ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనా కుటిల యత్నాలకు చెక్ చెప్పడమే ప్రధాన లక్ష్యంగా ఈ కూటమి జత కట్టినట్టు ఆయా దేశాల నౌకాదళ వర్గాలు పరోక్ష హెచ్చరికలు జారీ చేశాయి. ఐఎన్ఎస్ రణ్విజయ్, ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ శక్తి, ఐఎన్ఎస్ సుకన్యతో పాటు సింధురాజ్ సబ్మెరైన్లు భారత్ తరఫున విన్యాసాల్లో పాల్గొన్నాయి. యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన యూఎస్ఎస్ జాన్ మెక్‌కైన్, హెచ్‌ఎంఎఎస్ బలారత్, జపాన్‌కు చెందిన జేఎస్ ఒనామీతో పాటు రాయల్ ఆస్ట్రేలియన్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు తొలి రోజు విన్యాసాల్లో కనువిందు చేశాయి. యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్, క్రాస్‌డెక్ ల్యాండింగ్స్, సీమ్యాన్ షిప్ విన్యాసాలతో సత్తా చాటాయి. నాలుగు దేశాల యుద్ధ నౌకలు సముద్ర జలాల్లో కలియ తిరుగుతూ.. విన్యాసాలకు తెర తీశాయి. భారత్–అమెరికా నౌకాదళాలు సంయుక్తంగా తొలిసారిగా 1992 నుంచి మలబార్ విన్యాసాలు ప్రారంభించాయి. 2015లో జపాన్ కూడా చేరడంతో అప్పటి నుంచి మూడు దేశాలు పాల్గొంటున్నాయి. తాజాగా రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ చేరడంతో.. ఈ సంఖ్య నాలుగుకు చేరింది. గతేడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4 వరకూ జపాన్ తీరంలో మలబార్ విన్యాసాలు నిర్వహించారు. -
నేటి నుంచి మలబార్–2020 ఎక్సర్సైజ్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఇండో–పసిఫిక్ సముద్ర ప్రాంతంలో సమన్వయాన్ని పెంపొందించడానికి భారత నావికాదళం తన సముద్ర మిత్ర దేశాలతో కలిసి మంగళవారం నుంచి జరిగే మలబార్–2020 ఉమ్మడి నావికాదళ వ్యాయామంలో పాల్గొననుంది. 2 దశల్లో జరగనున్న ఈ ఎక్సర్సైజ్లో యూఎస్ నేవీ (యూఎస్‌ఎన్), జపాన్ మారిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ (జేఎంఎస్‌డీఎఫ్), రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ (ఆర్ఏఎన్)లతో కలిసి సంయుక్తంగా భారత నావికాదళం సముద్రంలో కసరత్తులు చేయనుంది. మలబార్–2020 మొదటి దశ ఈనెల 3 నుంచి 6 వరకు విశాఖ తీరంలో జరగనుంది. -
క్షిపణి ప్రయోగం సక్సెస్.. నేవీ ట్వీట్
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళం శుక్రవారం చేసిన మరో క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. తూర్పు నౌకాదళ పరిధిలో బంగాళాఖాతంలో క్షిపణి సామర్ధ్య యుద్ధనౌక ఐఎన్ఎస్ కోరా నుంచి ప్రయోగించిన నౌకా విధ్వంసక క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ‘ఇది గరిష్ట దూరంలోని తన లక్ష్యాన్ని సమర్ధవంతంగా ఛేదించింది. క్షిపణి ఢీకొట్టడంతో నౌక ధ్వంసమైంది. క్షిపణి ప్రయోగం విజయవంతం అయింది..’ అని ప్రయోగం అనంతరం భారత నౌకాదళం ట్వీట్ చేసింది. ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోని నేవీ వర్గాలు విడుదల చేశాయి. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వరుసగా క్షిపణి ప్రయోగాలు చేస్తోంది. (చదవండి: అందుకే ఆర్మీ చీఫ్‌కు చెమటలు పట్టాయి: ధనోవా) ఇటీవల అరేబియా సముద్రంలో ఐఎన్ఎస్ ప్రబల్ యుద్ధనౌక నుంచి ప్రయోగించిన యాంటీ షిప్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశా తీరంలో వీలర్ ఐలాండ్‌లో ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమానిస్ట్రేషన్ వెహికల్ని ప్రయోగించింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, న్యూక్లియర్ పవర్ కలిగిన శౌర్య సూపర్ సోనిక్ మిస్సైల్, మిస్సైల్ సహాయక టార్పెడో.. మొదలైన ప్రయోగాలు కూడా విజయవంతం కావడంతో నౌకాదళవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత సమర్థమైన మిసైల్స్‌ని దేశీయంగా తయారు చేయడంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. #IndianNavy #MissionDeployed & #CombatReady.#StrikeFirst #StrikeHard #StrikeSure#हरकामदेशकेनाम https://t.co/hf8cn3IkXL pic.twitter.com/Q7gb1sov5y — SpokespersonNavy (@indiannavy) October 30, 2020 -
గగన నేత్రాలు.. ముగ్గురు మహిళా పైలట్లు
మారిటైమ్ రికానిసెన్స్! పెద్ద బాధ్యత. సముద్ర గగనతలం నుంచి నలు దిక్కుల్లో నిఘా! అంతటి కీలకమైన విధుల్లోకి గురువారం ముగ్గురు మహిళా లెఫ్టినెంట్లు కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ (ఎస్.ఎన్.సి.) నుంచి శిక్షణ పూర్తి చేసుకుని వచ్చారు. ఆ ముగ్గురూ దివ్యాశర్మ, శుభాంగి స్వరూప్, శివాంగి. నేవీ ఫస్ట్ బ్యాచ్ మహిళా పైలట్లు. ‘డోర్నియర్ ఆపరేషనల్ ఫ్లయింగ్ ట్రైనింగ్’ (డి.ఓ.ఎఫ్.టి.)ను విజయవంతంగా పూర్తి చేసిన ఈ మహిళల చేతికి నేవీ ఇప్పుడు డోర్నియర్ నిఘా విమానాలు నడిపే బాధ్యతను అప్పగించబోతోంది! ‘పాసింగ్ అవుట్ పరేడ్’ కు ముఖ్య అతిథిగా హాజరైన రియర్ అడ్మిరల్ ఆంటోనీ జార్జి.. ‘నేవీకి ఇది చరిత్రాత్మకమైన రోజు’ అని దివ్య, శుభాంగి, శివాంగిలను అభినందించారు. నేవీ పైలట్లుగా దివ్య (ఢిల్లీ), శుభాంగి (యు.పి.), శివాంగి (బిహార్) మొదట ఎయిర్ ఫోర్స్ నుంచి ప్రాథమిక శిక్షణ పొందారు. గత ఏడాది డిసెంబరులో శివాంగి, ఈ ఏడాది ఆరంభంలో మిగతా ఇద్దరు ఎయిర్ ఫోర్స్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. అనంతరం నేవీ ఈ ముగ్గురిని కొచ్చిలో డి.ఓ.ఎఫ్.టి. శిక్షణకు పంపింది. వీళ్లతోపాటు మరో ముగ్గురు పురుషులు ఆ ట్రైనింగ్ తీసుకున్నారు. నెల రోజులు గ్రౌండ్ ట్రైనింగ్, ఎనిమిది నెలలు ఫ్లయింగ్ ట్రైనింగ్. గ్రౌండ్ ట్రైనింగ్‌లో లెఫ్టినెంట్ శివ, ఫ్లయిట్ ట్రైనింగ్‌లో లెఫ్టినెంట్ దివ్య ప్రథమ స్థానంలో నిలిచారు. ఎయిర్‌ఫోర్స్‌లో ముందుగా శిక్షణ పూర్తి చేసుకున్న శివాంగి స్వస్థలం ముజఫర్‌పుర్. తండ్రి ప్రభుత్వ పాఠశాలలో హెడ్మాస్టర్. తల్లి గృహిణి. శివాంగి మెకానికల్ ఇంజినీరింగ్ చేసి, ఎంటెక్‌లో చేరారు. నేవీలో అవకాశం రావడంతో మధ్యలోనే ఆపేశారు. శుభాంగి స్వరూప్ స్వస్థలం యూపీలోని బరేలీ. భారత నౌకాదళంలో తొలి మహిళా పైలట్. 2017లో ఎళిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ఆఫీసర్స్ ట్రైనింగ్ తీసుకున్నారు. తమిళనాడులోని వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోటెక్నాలజీ ఇంజినీరింగ్ చేశాక, హైదరాబాద్‌లోని ఎయిర్స్‌ఫోర్స్ అకాడమీ నుంచి శిక్షణ పొంది, తర్వాత నేవీలోకి మారారు. కరాటే ఛాంపియన్ కూడా. శుభాంగి తండ్రి నేవీ అధికారి. తల్లి నేవీ స్కూల్లో టీచర్. దివ్య, శుభాంగి, శివాంగి.. ఈ ముగ్గురు పైలట్లు డోర్నియర్ బాధ్యతలను స్వీకరించనుండటంతో నేవీలో సందడి నెలకొంది. గత నెలలో కూడా రితీసింగ్, కుముదినీ త్యాగీ అనే నేవీ సబ్లెఫ్టినెంట్లు ‘అబ్జర్వర్’ కోర్సును పూర్తి చేసి యుద్ధనౌకల్లోని ఫైటర్ హెలికాప్టర్ల తొలి మహిళా పైలట్‌గా చరిత్ర సృష్టించారు. -
‘స్మార్ట్’ విజయవంతం
బాలాసోర్(ఒడిసా): భారత నావికా దళం అమ్ములపొదిలోకి మరో కీలక అస్త్రం చేరనుంది. దేశీయంగానే అభివృద్ధి చేసిన సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో(స్మార్ట్) వ్యవస్థను సోమవారం విజయవంతంగా పరీక్షించారు. యాంటీ–సబ్‌మెరైన్ యుద్ధ తంత్రంలో ఇదొక కీలక మలుపు అని డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి చెప్పారు. ‘స్మార్ట్’తో భారత నావికాదళం సామర్థ్యం మరింత పెరిగిందని రక్షణ శాఖ తెలియజేసింది. సోమవారం ఉదయం 11.45 గంటలకు ఒడిశా తీరంలో ఏపీజే అబ్దుల్‌కలాం ఐలాండ్(వీలర్ ఐలాండ్)లో ‘స్మార్ట్’ను పరీక్షించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుం డా పరీక్ష పూర్తిస్థాయిలో విజయవంతమైంది. ‘స్మార్ట్’పరీక్ష నిర్వహించిన డీఆర్డీవో శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. -
భారత నౌకా దళంలో తొలిసారిగా..
సాక్షి, న్యూఢిల్లీ : భారత నౌకాదళంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. లింగసమానత్వాన్ని పునర్నిర్వచిస్తూ యుద్ధనౌకల్లో తొలి మహిళా అధికారులుగా సబ్ లెఫ్టినెంట్లు కుముదిని త్యాగి, రితిసింగ్‌లు అడుగుపెట్టనున్నారు. భారత నౌకా దళంలో పలు ర్యాంకుల్లో ఎంతోమంది మహిళా అధికారులున్నా యుద్ధనౌకల్లో వీరి నియామకం ఇదే తొలిసారి. ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉండటం, సిబ్బంది క్వార్టర్లలో ప్రైవసీ ఇబ్బందులు, మహిళలు, పురుషులకు ప్రత్యేక బాత్రూంల కొరత వంటి పలు కారణాలతో ఇప్పటివరకూ యుద్ధ నౌకల్లో మహిళా అధికారులను నియోగించలేదు. ఈ ఇద్దరు మహిళా అధికారులు వివిధ అంశాల్లో శిక్షణ పొందారు. నౌకాదళం అమ్ములపొదిలో చేరనున్న అత్యాధునిక ఎంహెచ్-60ఆర్ హెలికాఫ్టర్లలో వీరు విధులు నిర్వహిస్తారని భావిస్తున్నారు. ఎంహెచ్-60ఆర్ హెలికాఫ్టర్లు శత్రు దేశాల నౌకలు, సబ్మెరైన్లను గుర్తిస్తాయి. 2018లో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ లాక్‌హీడ్-మార్టిన్ నిర్మించిన ఈ హెలికాఫ్టర్ల కొనుగోలు ఒప్పందాన్ని ఖరారు చేశారు. కాగా రఫేల్ యుద్ధవిమానాలకు ఎంపిక చేసిన పైలట్లలో ఓ మహిళా పైలట్‌ను ఐఏఎఫ్ నియమించేందుకు సన్నద్ధమైన నేపథ్యంలో నేవీలో ఇద్దరు మహిళా అధికారుల నియామకం సైన్యంలో మహిళలకు సమ ప్రాతినిథ్యం దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలు పంపింది. చదవండి : విశాఖ గూఢచర్యం కేసు.. మరొకరి అరెస్ట్ -
సానుకూల దృక్పథమే సరైన మార్గం
ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘గుంజన్ సక్సేనా’ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఆ సినిమాకు ప్రేరణగా నిలిచి నిజజీవితంలోనూ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న భారతీయ వాయుసేన రిటైర్డ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా ఆ సినిమాలో తన పాత్ర చిత్రీకరణ గురించి వివరణ ఇచ్చారు. సంస్థగా వాయుసేనలో మహిళాధికారులుగా తామెన్నడూ వివక్షను ఎదుర్కోలేదని, కొంతమంది అధికారుల చిన్నచూపును చవిచూశామన్నారు. వారితో పోటీపడుతూనే వాయుసేనలో సమున్నత స్థానానికి చేరగలిగామని, మహిళలుగా అనేక అవకాశాలు పొందామని చెప్పారు. తన జీవితాన్ని, తన ప్రయాణాన్ని, తన కలలను, తాను సాధించిన చిన్న విజయాలను చిత్రిక పట్టడమే సినిమా ఉద్దేశమని చెప్పారు. శక్తివంతమైన పుకార్లు, పచ్చి అబద్ధాలు రాజ్యమేలుతూ మీ ఉనికిని సందేహాల ధూళిలో కనుమరుగు చేసే సమయాలు కూడా ఉంటాయి. గత కొన్ని రోజులుగా ఇలాంటి తుపానులో నేను చిక్కుకుపోయాను. అది సోషల్ మీడియా కావచ్చు, ముద్రణా మాధ్యమం కావచ్చు.. కొంతమంది వ్యక్తులు నా ఉనికి, మనుగడకు సంబంధించిన మౌలిక విలువలను ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నది వాస్తవం. ఈ దుమారాన్ని రూపుమాపవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. పాఠకులకు ఒక విషయం చెప్పనివ్వండి. గుంజన్ సక్సేనా చిత్ర నిర్మాతలు నా జీవితం ఆధారంగా తీసిన సినిమాలో సినిమాటిక్ స్వేచ్ఛను తీసుకున్నప్పటికీ వారు తప్పించనిది, అతిశయోక్తులు చెప్పనిది అయిన ఒక అంశం ఉంది. అదేమిటంటే నేనే.. నిజమైన గుంజన్ సక్సేనాని. సినిమాలో చిత్రించినదాని కంటే నేను మరింత ఉక్కుసంకల్పంతో, దృఢ చిత్తంతో ఉంటూ వచ్చానని చెప్పగలను. వాయుసేనలో నా ఎనిమిదేళ్ల స్వల్ప కెరీర్లో నేను నా సీనియర్లు, జూనియర్లు, కొలీగ్స్ నుంచి పొందగలిగిన అమూల్యమైన అంశం ఏదంటే గౌరవం, ఆరాధన మాత్రమే. ఎంతో కష్టపడి సాధించిన ఈ ప్రతిష్టను కొద్దిమంది వ్యక్తుల బృందం అసందర్భ వ్యాఖ్యలతో మలినపర్చడం చూస్తూంటే నా హృదయం బద్దలవుతోంది. భారతీయ వాయుసేనలో నా తొలి సంవత్సరాల్లో ఎన్నో అంశాల్లో నేను ప్రథమురాలిగా ఉండగలిగి నందుకు నేను ఎంతో అదృష్టవంతురాలిని అనే చెప్పాలి. వాటిలో కొన్నింటిని పేర్కొనాలంటే.. నా ప్రాథమిక శిక్షణలో, హెలికాప్టర్ శిక్షణలో కూడా నేనే ప్ర«థమురాలిగా ఉన్నాను. యుద్ధరంగంలో హెలికాప్టర్ నడిపిన తొలి మహిళను నేనే (లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులలో ఇది నమోదైంది కూడా). మహిళా హెలికాప్టర్ పైలట్లలో మొదటి బిజి (ప్రథమ శ్రేణి ఫ్లైయింగ్ కేటగిరీ) నాదే. అడవుల్లో, మంచులో ఎలా బతకాలో నేర్పే కోర్సు చేసిన మొట్టమొదటి మహిళా అధికారిని కూడా నేనే. ఇంకా మరెన్నో చిన్న విజయాలు ఉన్నాయి కానీ నా ఈ కథనానికి సంబంధించి వాటికేమంత ప్రాధాన్యత లేదు. ప్రశాంతంగానూ, రిజర్వుడ్గానూ ఉండే నా లాంటి వ్యక్తి ఇలా నా సొంత డబ్బా కొట్టకుండా ఉండటానికి కారణం ఉంది. ఈ వాస్తవాలను తారుమారు చేయడానికి ప్రయత్నించే ఎవరినైనా బహిరంగంగా సవాల్ చేయడమే నా ఉద్దేశం. నేను సాధించిన ఈ ప్రథమ రికార్డులన్నీ ఐఏఎఫ్ చరిత్రలో నమోదై ఉన్నాయి కూడా. అవన్నీ నా విశ్వసనీయతకు, నా విజయాలకు సంబంధించినవి. స్వార్థ ప్రయోజనాలు కలిగిన ఏ ఒక్కరినీ నా ప్రతిష్టపై వేలెత్తి చూపడాన్ని నేను అంగీకరించను. నిపుణురాలిగా చెప్పుకునే ఒకరయితే.. నేను కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్టమొదటి మహిళాధికారిని కాదని కూడా చెప్పేశారు. ఈ అసంబద్ధ ప్రచారాన్ని చదువుతున్న, పచ్చి అబద్ధాలను చూస్తున్న వారందరికీ నేను వినమ్రంగా ఒక విషయం చెబుతున్నాను. రహస్య ఎజెండాలో భాగంగా తాము ఐఏఎఫ్ ప్రతిష్టను కాపాడుతున్నట్లు చెప్పుకుంటున్న వారు కార్గిల్ యుద్ధం తర్వాత 1999లో వాయుసేన దృక్పథానికి చెందిన సాధికారతనే ప్రశ్నిస్తున్నారు. నేను స్వభావరీత్యా రిజర్వుడ్‌గా ఉంటాను. కానీ భారతీయ వాయుసేన నా విజయాలను మొత్తంగా మీడియా ముందు విప్పి చెప్పేసింది. ఇప్పుడే కాదు ఎప్పుడూ నేను మీడియా ముందుకు రావడాన్ని అసౌకర్యంగానే భావిస్తాను. కానీ కార్గిల్ యుద్ధ కాలంలో చక్కటి విజయాలు సాధించిన మహిళాధికారిగా నాకు సంబంధించిన వాస్తవాన్ని ఎవరైనా ఎలా తోసిపుచ్చగలరు? నేను కానీ, చిత్ర నిర్మాతలు కానీ నేను శౌర్యచక్ర అవార్డు గ్రహీతనని ఎన్నడూ చెప్పుకోలేదు. కార్గిల్ యుద్ధం తర్వాత ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఒక పౌర సంస్థ నాకు శౌర్య వీర్ అనే అవార్డు బహూకరించింది. కానీ ఇంటర్నెట్ వార్తల మీడియాకు చెందిన కొందరు బహుశా వీర్ పదాన్ని చక్రగా మార్చేసి ఉండవచ్చు. సినిమా ప్రమోషన్లలో భాగంగా నేను మీడియాతో మాట్లాడిన ప్రతిసారీ ఈ విషయాన్ని నేను స్పష్టం చేస్తూ వచ్చాను. నేను పొందని శౌర్య చక్ర అవార్డు విషయంలో నన్ను నిందించడం ఎంతవరకు సబబు? ‘గుంజన్ సక్సేనా’ సినిమా విడుదలయ్యాక సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న మరొక అంశం ఏదంటే లింగ వివక్ష. నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదలయింది మొదలుకుని భారత వాయుసేన ప్రతిష్టపై దాడిగా అభివర్ణిస్తూ కవచధారులైన అనేకమంది వీరులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. వీళ్లందరికీ నేను చెప్పేదొకటే. ఐఏఎఫ్ అనేది అతి పెద్ద సంస్థ. ఏ వివాదం కూడా దానికి కాసింత మరకలు కూడా పడనీయనంత ప్రతిష్టాత్మక సంస్థ. లింగపరంగా కానీ, మరే రకంగానైనా సరే.. ఒక సంస్థగా ఐఏఎఫ్ సంస్థాగత వివక్షకు చోటివ్వదు. నేను వాయుసేనలో చేరినప్పుడు సంస్ధాగతంగా దాంట్లో ఎలాంటి వివక్షా ఉండేది కాదు. కానీ.. వ్యక్తిగతంగా చూస్తే ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకే విధంగా ఉండరు. కొంతమంది వ్యక్తులు ఇతరుల కంటే బాగా మార్పును స్వీకరించగలరు. వివక్ష అనేది సంస్థాగతం కాదు కాబట్టి మహిళాధికారుల అనుభవాలు కూడా విభిన్నంగానే ఉంటాయి. దీన్ని నిరాకరించడం అంటే అది భూస్వామ్య మనస్తత్వాన్నే చూపుతుంది. అంతే కాకుండా మహిళాధికారులు ఎదుర్కొన్న సమస్యలను పలుచన చేస్తుంది. వాయుసేనలోని కొందరు వ్యక్తుల్లోని దురభిప్రాయాలు, వివక్షకు చెందిన సమస్యలతో ఒక స్త్రీగా నేను కూడా పోరాడాను. కానీ అది సంస్థాగతంగా ఎన్నడూ ఉండేది కాదు కాబట్టే నేను అన్ని సమయాల్లోనూ సమాన అవకాశాలనే పొందాను. వాయుసేనలో చేరిన నా ప్రారంభ సంవత్సరాల్లో మహిళలకు ప్రత్యేక టాయ్‌లెట్, మహిళలు దుస్తులు మార్చుకునే చోటు విషయంలో మౌలిక వసతులకు సంబంధించి ఎలాంటి ఆరోపణనూ నేను చేయలేదు. ఇక నెలరోజులపాటు సర్వైవల్ కోర్సును పూర్తి చేసిన సమయంలో నేను ఒకే టెంటులో పురుష అధికారులతో కలిసి ఉండేదాన్ని. అనేక సందర్భాల్లో అడవుల్లో ఆరుబయట తెల్లారకముందే నేను కాలకృత్యాలు తీర్చుకునేదాన్ని. ఈ విషయంలో నేను ఎలాంటి మినహా యింపులు అడగలేదు. వాయుసేనలోని పురుషుల్లాగే నేను సర్వైవల్ కోర్సును ముగించాలని కోరుకున్నాను. ఇలాంటి స్వల్పాతిస్వల్పమైన అంశాలకు నా ఐఏఎఫ్ కెరీర్లో ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదనే చెబుతున్నాను. సినిమాలో కూడా నా పాత్ర టాయ్లెట్లు లేకపోవడంపై ఆరోపించలేదు కదా. అది ముఖ్యమే కావచ్చు కానీ ఒక విషయానికి మరీ ప్రాధాన్యత ఇవ్వడం అనవసరం. సినిమాలో వాస్తవ విరుద్ధ అంశాల గురించి ఒక సీనియర్ జర్నలిస్టు ఎత్తి చూపినట్లు నేను విన్నాను. అవును. వాటిని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో ఘటనల పర్యవసానాలు నాకు తెలుసు. నేను వాటిని ఎన్నడూ తోసిపుచ్చలేదు. లేదా వాస్తవమని అంగీకరించలేదు. ఒకటి మాత్రం నిజం. సినిమా ఉద్దేశం తమ స్వప్నాలను ఆశాభావంతో, సానుకూల దృష్టితో ఎదుర్కోవాలని వ్యక్తులను ప్రభావితం చేయడమే. నేను కూడా అలాగే ఎదుర్కొన్నాను. మొత్తం సినిమా కథ అంతా నా జీవిత గమనం ఎలా సాగింది, నా స్వప్నాలు ఎలా సాకారమయ్యాయి అని చూపించడమే. కార్గిల్ యుద్ధంపై డాక్యుమెంటరీ తీయాలని ఈ సినిమా ఉద్దేశం కాదని నా భావం. నా జీవి తాన్ని, నా ప్రయాణాన్ని, నా కలలను, నేను సాధించిన చిన్న విజయాలను చిత్రిక పట్టడమే సినిమా ఉద్దేశం. నేను కానీ, చిత్ర దర్శకుడు శరణ్ శర్మ కానీ భారత వాయుసేనను అవమానించాలని అనుకోలేదు. నిజానికి వాయుసేన యూనిఫాం, నేను మెలిగిన తీరు, సైనిక కార్యాలయాల స్వరూపం, ఫ్లైయింగ్‌కు చెందిన సాంకేతిక పదాల సాధికారతపై నన్ను వాళ్లు ఫోన్ ద్వారా కానీ, నేరుగా కానీ సంప్రదించేవాళ్లు. చివరగా, మరొక విషయం చెప్పదలిచాను. ఈ సెలబ్రిటీ స్థాయి అనేది నా జీవితంలో అడుగుపెట్టిన కొత్త వైరస్ లాంటింది. నా మౌలిక విలువలను ఇది ఎన్నటికీ ముట్టలేదు. చెరపలేదు. ఎందుకంటే నా హృదయంలోనూ, మనస్సులోనూ ఒక విశ్వాసం ఉండేది. నేను పుట్టిన రోజు మొదలుకుని నా జీవితంలోని ప్రతి క్షణంలోనూ సైనిక దుస్తులు ధరించి ఉన్న వారి మధ్యే జీవించాను. నా సోదరుడు, నేను ఇద్దరం సాయుధ బలగాల్లోనే మా కెరీర్లను నిర్మించుకున్నాం. నా యూని ఫారం విడిచిపెట్టిన తర్వాత కూడా, ఒక అధికారి భార్యగా నేను వాయుసేన ఆవరణలోనే జీవించడం కొనసాగించాను. సాయుధ బలగాలకు సంబంధించి నా జ్ఞానం లేక జ్ఞాన లేమికి సంబంధించి ఎవరి ప్రబోధాలూ నాకు అవసరం లేదు. వ్యక్తిగతంగా కానీ, వృత్తి రంగంలో కానీ నేను సాధించిన అతి కొద్ది విజయాలు కూడా వాయుసేన నుంచే పొందాను. మిగిలిన విషయాలు అంటారా.. వాటిని మీ తీర్పుకు, మీ విజ్ఞతకే వదిలేస్తాను. (ఎన్డీటీవీ సౌజన్యంతో...) వ్యాసకర్త రిటైర్డ్ ఫ్లైట్ లెఫ్టినెంట్, హెలికాప్టర్ పైలట్, భారతీయ వాయుసేన గుంజన్ సక్సేనా -
వలపు వల
-
హనీట్రాప్ కేసులో కీలక వ్యక్తి అరెస్ట్
సాక్షి, విజయవాడ: విశాఖ నౌకాదళ హనీట్రాప్ కేసులో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఇదే కేసుకు సంబంధించి 14 మందిని అరెస్ట్ చేయగా.. తాజాగా శుక్రవారం రోజున ముంబయికి చెందిన అబ్దుల్ రెహ్మాన్‌ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఇండియన్ నావీకి చెందిన నౌకలు, సబ్మెరైన్ల లోకేషన్లను హనీట్రాప్‌లో పడ్డ అధికారులు షేర్ చేసినట్లు గుర్తించారు. హనీట్రాప్ ద్వారా అధికారుల నుంచి కీలక సమాచారం సేకరించి పాకిస్థాన్‌కు చేరవేసినట్లు గుర్తించారు. పాకిస్తాన్లో వ్యక్తుల సూచన మేరకు సమాచారం ఇచ్చిన వారి ఖాతాల్లోకి అబ్దుల్ రహమాన్ నగదును బదిలీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. కాగా గతంలో ఇతనిపై 120బి, 121ఏ, ఐపీసీ సెక్షన్ 17, 18 మరియు సెక్షన్ 3యాక్ట్ కిందన ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. అరెస్ట్ సమయంలో రహమాన్ నుంచి డిజిటల్ డివైజ్‌లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని కీలక సమాచారం కోసం విచారణ కొనసాగుతున్నట్లు ఎన్ఐఏ అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి: హనీట్రాప్‌లో మరో ముగ్గురు నేవీ ఉద్యోగులు కాగా.. భారత నావికులకు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి వీడియోలు తీసిన పాక్ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై సమాచారంతో నిఘా వర్గాలు నెల రోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గతంలో 11 మంది నావీ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
కరోనా యోధులకు నౌకాదళం సంఘీభావం..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న యోధులకు భారత నౌకాదళం సంఘీభావం ప్రకటించింది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన పోర్టులలో నౌకలకు ప్రత్యేకంగా దీపాలంకరణ చేశారు. ముంబై, విశాఖ, చెన్నై, కొచ్చిలలో నౌకలకు దీపాలంకరణ చేసి వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావం ప్రకటించారు. కాగా, కరోనా యోధులకు సంఘీభావం ప్రకటిస్తూ ఈ రోజు ఉదయం వాయుసేన దేశవ్యాప్తంగా కోవిడ్ ఆస్పత్రులపై పూలవర్షం కురిపించిన సంగతి తెలిసిందే. కరోనా పోరాటానికి రాత్రి, పగలు తేడా లేకుండా అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసు, వైద్యులు, పారామెడికల్, పారిశుద్య సిబ్బందికి వాయుసేన హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ తమ సంఘీభావం ప్రకటించింది. చదవండి : కరోనా యోధులకు గౌరవ వందనం -
విశాఖ రెడ్ జోన్ ఏరియాలో ఇండియన్ నేవీ సేవలు
-
26 మంది నేవీ సిబ్బందికి కరోనా
న్యూఢిల్లీ: ముంబైలోని వ్యూహాత్మక పశ్చిమ నావికా కమాండ్‌లో 26 మంది నేవీ సిబ్బందికి కరోనా వైరస్ సోకింది. భద్రతాదళాల్లో కరోనా వైరస్ సోకడం ఇదే తొలిసారి. ఐఎన్ఎస్ ఆంగ్రేలో పనిచేస్తోన్న వీరంతా నేవీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఐఎన్ఎస్ ఆంగ్రే పరిసరప్రాంతాల్లో ఉన్న వారందరికీ కోవిడ్ పరీక్షలు జరిపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయాలను రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ఉన్నతాధికారులకీ తెలియజేశారనీ, వారు ఈ పరిస్థితిపై దృష్టిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. వెస్ట్రన్ నావెల్ కమాండ్ అనేది అరేబియా సముద్రం, హిందూమహాసముద్ర తీర రక్షణకు సంబంధించిన వ్యూహాత్మక విభాగం.. భద్రతాదళాల రక్షణకు చర్యలు పదిహేను లక్షల భద్రతాదళాల రక్షణకు పటిష్ట చర్యలు చేపడతామని సైనికవర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే త్రివిధ దళాల్లోని కీలకమైన విభాగాలు మినహా, అన్ని యూనిట్లలో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతున్నట్టు వారు తెలిపారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం, కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఏప్రిల్ 19 నుంచి మే3 వరకు 50 శాతం సిబ్బందితోనే పనిచేసేలా చర్యలు చేపడుతున్నట్టు ఆదేశాలు జారీచేశారు. -
భారత నావికాదళంలో కరోనా కలకలం
-
21 మంది నావికులకు కరోనా పాజిటివ్
ముంబై: భారత నావికాదళంలో కరోనా కలకలం రేపింది. 21 మంది నావికాదళ సిబ్బందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వారందరినీ నగరంలోని ఐఎన్హెచ్ఎస్ అశ్వినీ నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐఎన్ఎస్ అంగ్రే నావల్ బేస్‌లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి ఏప్రిల్ 7 న కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అతని ద్వారానే తాజాగా మిగతా వారికి కరోనా వ్యాప్తి జరిగినట్టు నేవీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. నేవీలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఐఎన్ఎస్ అంగ్రేను లాక్డౌన్ చేశారు. (చదవండి: చైల్డ్ లైన్‌కి 4.6 లక్షల ఫోన్‌కాల్స్) మిగతా సిబ్బందికి కరోనా వ్యాపించకుండా భారత నావికాదళం చర్యలు తీసుకుంటోంది. బాధిత సెయిలర్లు ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నది తేలాల్సి ఉంది. భారత త్రివిధ దళాలకు కరోనా వ్యాప్తి చెందలేదు అనుకునే లోపే.. ఇండియన్ ఆర్మీలో 8 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఇండియన్ నేవీలో ఏకంగా 21 మందికి మహమ్మారి సోకింది. కాగా, 3,205 కేసులతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,835 కు చేరుకుంది. వారిలో 452 మంది ప్రాణాలు విడువగా.. 1766 మంది కోలుకున్నారు. 21 serving personnel tested positive for #COVID19 within naval premises at Mumbai. This number includes 20 sailors of INS Angre, a shore establishment at Mumbai. Most of these are asymptomatic & have been traced to a single sailor who was tested positive on 7th April: Indian Navy pic.twitter.com/msYJ0zp5Rv — ANI (@ANI) April 18, 2020 -
నేవీలో మహిళా అధికారులకు న్యాయం
సాక్షి, న్యూఢిల్లీ : నేవీలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని సర్వోన్నత న్యాయస్ధానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఆర్మీలో మహిళలకు శాశ్వత కమిషన్ లభించగా, ఇప్పుడు నేవీలోనూ మగువకు సరైన స్ధానం లభించింది. పురుషుల తరహాలోనే మహిళలు అదే సామర్థ్యంతో పనిచేస్తారని, వీరి పట్ల వివక్ష తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భారత నౌకాదళంలో పురుష, స్ర్తీ అధికారులను ఒకేలా చూడాలని ఆదేశించింది. నేవీలో పనిచేసే మహిళా అధికారులకు మూడు నెలల్లోగా శాశ్వత కమిషన్ వర్తింపచేయాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దేశం కోసం నేవీలో సేవలందిస్తున్న మహిళలకు శాశ్వత కమిషన్‌ను వర్తింపచేయకపోవడం అసంబద్ధమని స్పష్టం చేసింది. నేవీలో ప్రస్తుతం మహిళలను పది సంవత్సరాల పాటు స్వల్పకాలిక సేవలకే పరిమితం చేస్తుండగా వారిని రిటైర్ అయ్యే వరకూ సేవల్లో కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.కాగా ఆర్మీలో పనిచేసే మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ వర్తింప చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. చదవండి : కరోనా: సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం! -
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే..
పణాజి : భారత నావికాదళానికి చెందిన మిగ్-29 యుద్ధవిమానం గోవాలో ఆదివారం ఉదయం కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. రొటీన్ ట్రైనింగ్‌లో భాగంగా టేకాఫ్ అయిన విమానం అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదం నుంచి పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదంపై భారత ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. గోవాలోని వాస్కో వద్దగల ఐఎన్ఎస్ హంస బేస్ నుంచి ఈ విమానం ఎగిరింది. రెండు ఇంజన్లు, సింగిల్ సీటర్ గల ఈ విమానం.. సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదానికి గురైనట్టు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, 2019 నవంబర్, 2018 జనవరి నెలల్లో కూడా రెండు మిగ్-29 విమానాలు కుప్పకూలాయి. ఆ ప్రమాదాల్లోంచి పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. -
యుద్ధనౌకపై తేజస్ ల్యాండింగ్ విజయవంతం
న్యూఢిల్లీ: భారత నేవీ కోసం సిద్ధమవుతున్న తేజస్ ‘ప్రయోగదశ’ విమానం.. యుద్ధవిమాన వాహకనౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించింది. దీంతో యుద్ధ విమాన వాహక నౌకలపై యుద్ధ విమానాలను దించగల అతికొన్ని దేశాల జాబితాలో భారత్ చేరింది. ఈ నావికాదళ తేజస్‌ను భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ), ఏర్‌క్రాఫ్ట్ రీసెర్చ్ అండ్ డిజైన్ సెంటర్ హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, సీఎస్ఐఆర్ తదితర సంస్థలు కలసి అభివృద్ధి చేశాయి. తీర ప్రాంత పరీక్ష సౌకర్యాలపై పరీక్షించిన అనంతరం ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై శనివారం ఉదయం 10 గంటల 2 నిమిషాలకు తేజస్ యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయించినట్లు డీఆర్డీవో ప్రతినిధి తెలిపారు. నావికాదళానికే సంబంధించిన తేజస్ లైట్ ఇంకా అభివృద్ధి దశలో ఉంది. భారత యుద్ధ విమానాల అభివృద్ధి కార్యక్రమంలో ఇదో గొప్ప మెట్టు అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. -
హనీట్రాప్‌లో మరో ముగ్గురు నేవీ ఉద్యోగులు
-
హనీట్రాప్‌లో మరో ముగ్గురు నేవీ ఉద్యోగులు
సాక్షి, విశాఖపట్నం: పాక్ గూఢచారి విభాగం పన్నిన హనీట్రాప్ వలలో చిక్కుకుని భారత నౌకాదళ సమాచారాన్ని అందించిన కేసులో తాజాగా మరో ముగ్గురు నేవీ ఉద్యోగుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందం అదుపులోకి తీసుకుంది. భారత నావికులకు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్ వీడియోలు తీసిన పాక్ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై ఉప్పందడంతో నిఘా వర్గాలు నెల రోజులపాటు నిర్వహించిన ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’లో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు గత నెల 20న ఏడుగురు ఇండియన్ నేవీ సెయిలర్స్(నావికులు)తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్ చేయడం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగిస్తున్న ఎన్ఐఏ బృందం రెండు రోజులక్రితం విశాఖకు వచ్చింది. ఈ కేసుపై తూర్పు నౌకాదళ ఉన్నతాధికారులతో చర్చించి.. పూర్తి వివరాలు రాబడుతోంది. ఈ క్రమంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్(ఈఎన్సీ)లో 2015లో విధుల్లోకి చేరిన రాజేష్, నిరంజన్, లోక్‌నందాలను అరెస్ట్ చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. వీరితో కలపి ఇప్పటివరకు ఈ కేసులో పది మంది నేవీ సెయిలర్స్‌ను అరెస్ట్ చేసినట్లయింది. ఈ వ్యవహారంలో ఇంకా మరికొందరు నేవీ సెయిలర్స్ కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఆ దిశగా ఎన్ఐఏ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. -
నేవీలో స్మార్ట్ఫోన్లు, ఫేస్‌బుక్‌లపై నిషేధం
న్యూఢిల్లీ: సమాచారం శత్రుదేశాలకు చేరుతున్న నేపథ్యంలో ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలు, స్మార్ట్ఫోన్ల వాడకంపై నావికాదళం నిషేధం విధించింది. నేవీ సిబ్బంది మొత్తం నౌకలు, నావిక కేంద్రాల్లో వీటిని వాడకూడదు. యుద్ధవిమానాలు, జలాంతర్గాముల రాకపోకల సమాచారాన్ని పాకిస్తానీ ఏజెంట్లకు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై పది రోజుల క్రితం నిఘా సంస్థలు ఏడుగురు నేవీ సిబ్బందిని, ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్ చేయడం తెల్సిందే. ముంబై, విశాఖపట్నం, కార్వారల నుంచి వీరిని అరెస్ట్ చేశారు. నౌకల్లో, నౌకా స్థావరాల్లో ఇకపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితరాల వాడకం ఉండదని నేవీ అధికారి తెలిపారు. నావికాదళ సమాచారం ప్రత్యర్థులకు లీక్ అవుతున్న సంఘటనలపై జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. ఇప్పటివరకూ ఈ కేసు ఏపీ పోలీసుల చేతుల్లో ఉండగా ఇప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాన్ని ఎన్ఐఏకు బదిలీ చేసిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. -
సిబ్బందిపై నౌకాదళం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: భారత నౌకాదళం తన సిబ్బందికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నేవి సిబ్బంది సోషల్ మాధ్యమాలు అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్‌లు వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు ఉత్తర్వులు జారీ చేసింది. భారత నౌకాదళానికి చెందిన బోర్డు నౌకలు, వైమానిక స్థావరాల్లో సిబ్బందికి స్మార్ట్ఫోన్లను కూడా అనుమంచమని ఓ ప్రకటనలో భారత నైకాదళం పేర్కొంది. ఇటీవల భారత నౌకాదళంలో హనీ ట్రాప్‌లో చికుకున్న ఏడుగురు నేవీ సెయిలర్స్ నౌకాదళ భద్రతకు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్‌కి చేరవేస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వారిని విశాఖపట్నం పోలీసు ఆరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ముంబైకి చెందిన ఒక హవాలా ఏజెంట్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత నేవి సోషల్ మాధ్యమాలను సిబ్బంది ఉపయోగించటంపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలతో పలు భద్రత సమస్యలు రావటంతో భారత నేవి ఈ నిర్ణయం తీసుకుంది. కాగా భారత నౌకాదళం కూడా ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలను ఉపమోగిస్తుంది. కానీ.. వాటిలో నౌకాదళం సాధించిన విజయాలు, విపత్తుల సమయంలో అందించిన మానవ సహాయం, సంబంధిత విభాగాల్లో ఉద్యోగాల భర్తీ కోసం పలు నోటిఫికేషన్లకు చెందిన ప్రకటనలు వెల్లడిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: భారత నావికులకు వలపు వల -
భారత నావికులకు వలపు వల
ఈ ఏడాది జనవరిలో.. ఫేస్బుక్లో అనితా చోప్రా అనే పాక్ యువతి వేసిన వలలో ఆర్మీ జవాన్లు చిక్కుకుని మన సైనిక సమాచారాన్ని శత్రు దేశానికి చేరవేసిన ఘటన ప్రకంపనలు సృష్టించింది. దాయాది దేశమైన పాకిస్తాన్ భారత నౌకాదళ సమాచారాన్ని దోచుకున్న వైనం తాజాగా వెలుగు చూసింది. భారత నావికులకు ఫేస్బుక్ ద్వారా అమ్మాయిల్ని పరిచయం చేసి.. వారితో ఏకాంతంగా ఉన్నప్పటి సెక్స్ వీడియోలు తీసిన పాక్ గూఢచారి విభాగం.. వాటితో బెదిరింపులకు పాల్పడి.. నౌకాదళ సమాచారం సేకరిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడింది. దీనిపై ఉప్పందడంతో నిఘా వర్గాలు నెల రోజుల పాటు నిర్వహించిన ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఏడుగురు ఇండియన్ నేవీ సెయిలర్స్ (నావికులు)తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను అరెస్ట్ చేశారు. హనీట్రాప్ ఇలా! నౌకాదళ సమాచారాన్ని తెలుసుకునేందుకు శత్రు దేశమైన పాకిస్తాన్ కుట్ర పన్నింది. ఇందుకు 2017లో భారత నావికులను లక్ష్యంగా చేసుకుంది. ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుని కొందరు యువతులతో హనీ ట్రాప్ (వలపు వల) వేసింది. ఇలా కొందరు యువతులు ఫేస్బుక్ ద్వారా నావికులతో పరిచయం పెంచుకున్నారు. తాము వ్యాపార వేత్తలమంటూ వారు నావికుల్ని నమ్మించి వారితో శారీరక సంబంధం వరకు వెళ్లారు. నావికులతో ఏకాంతంగా గడుపుతున్న సమయంలో పాక్ ఏజెంట్లు ఆ దృశ్యాలను రహస్యంగా వీడియోలు చిత్రీకరించారు. వాటిని చూపించి పాక్ గూఢచర్య విభాగం భారత నావికుల్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టింది. భారత నౌకాదళ సమాచారం తమకు చేరవేయాలని, ఇందుకు ప్రతిఫలంగా హవాలా ద్వారా సొమ్ము కూడా ఇస్తామని ఆశ చూపడంతో నేవీ సెయిలర్స్ వారికి లొంగిపోయారు. ఏడాది నుంచి సమాచారం ఈ సెయిలర్స్ 2018 అక్టోబర్ నుంచి పాకిస్తాన్‌కు సమాచారం అందించడం ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తిం చాయి. యుద్ధ నౌకలు, సబ్మెరైన్ల సమాచా రాన్ని శత్రు దేశానికి చేరవేసినట్లు సమాచారం. ఏ యుద్ధ నౌక ఎక్కడ ఉంది, వివిధ జలాంతర్గాముల ప్రెజెంట్ స్టేటస్ ఏమిటి.. తదితర కీలక సమాచారం సెయిలర్లు దాయాది దేశానికి చేరవేశారు. సమాచారం ఇచ్చిన ప్రతి నెలా వారికి పాక్ ఏజెంట్లు హవాలా రూపంలో డబ్బులు అందజేసేవారు. ఇందుకోసం ఒక హవాలా ఆపరేటర్‌ను సైతం నియమించారు. ఒకరికి తెలియకుండా మరొకరి ద్వారా ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు. ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’తో బట్టబయలు భారత నౌకాదళంలో కొందరు దేశద్రోహులున్నారని అధికారిక వర్గాలకు రహస్య సమాచారం అందింది. నౌకాదళ నిఘా వర్గాలు 4 నెలల క్రితం ఓ సెయిలర్ ఫోన్ మాట్లాడుతుండగా.. రహస్య సమాచారాన్ని చేరవేస్తున్నట్లు గుర్తించాయి. దీనిపై దర్యాప్తు చేపట్టాయి. మిగిలిన వారిపైనా నిఘా పెంచగా.. ఏడుగురు నావికులు వేర్వేరు మహిళలతో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. వారి ఫేస్బుక్ సంభాషణల్నీ గమనించారు. దీంతో ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ), ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ మొదలు పెట్టాయి. హవాలా ద్వారా డబ్బులు తీసుకుంటున్న సమయంలో నావికుల్ని వివిధ ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నారు. 7 నేవీ సెయిలర్స్‌తో పాటు ఒక హవాలా ఆపరేటర్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. వీరిని గూఢచర్యం కేసులో అరెస్ట్ చేసి.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరు, ముంబైకి చెందిన ఇద్దరు, విశాఖకు చెందిన ముగ్గురు నౌకాదళ సిబ్బందితోపాటు ముంబైకి చెందిన ఒక హవాలా ఏజెంట్ ఉన్నారు. మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. నిందితుల్ని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టుకు తరలించగా.. జనవరి 3 వరకూ రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. వీరి నుంచి పెద్ద మొత్తం లో హవాలా సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
శత్రుదుర్భేద్యం భారత నౌకాదళం!
త్రిశక్తిరూపాలై సువిశాల భారతాన్ని కాపాడుతున్న త్రివిధ దళాలలో నౌకదళానిది ప్రత్యేకమైన పాత్ర. పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్దంలో విజయానికి ప్రధాన కారణం భారత నావికాదళం. డిసెంబర్ 4వ తేదీన కరాచీలోని అతిపెద్ద పాకిస్తానీ నౌకశ్రయాన్ని ధ్వంసం చేసిన కారణంగానే ఆ యుద్ధంలో భారత్ విజయం సాధించగలిగింది. ఆ విజయానికి గుర్తుగానే ప్రతి యేడాది డిసెంబర్ 4వ తేదీన నేషనల్ నేవీ డేగా జరుపుకుంటున్నాం. భారత నేవీ విజయాలను, ఆయుధ సంపత్తి, విశిష్టతల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి. -
శత్రుదుర్భేద్యం.. తూర్పు నౌకాదళం
సాక్షి, విశాఖపట్నం : పాకిస్తాన్.. దాయాది దేశం పేరు వింటేనే పౌరుషం పొంగుకొస్తుంది. అలాంటిది.. శత్రు దేశమైన పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే.. అందులో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడితే.. ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖే వేదికైతే.. ఇంకెంత గర్వంగా ఉంటుందో కదూ! ఈ విజయానికి గుర్తుగానే.. అప్పట్నుంచి ఏటా డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగే ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. కాగా, 75 ఏళ్లలో భారత నౌకాదళం.. ప్రపంచంలోనే అతిపెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం ఆవిర్భవించింది. అంతేకాదు.. ఈ నౌకాదళ దినోత్సవం నిర్వహించుకోడానికీ కేంద్ర బిందువు కూడా విశాఖపట్నమే కావడం మరో విశేషం. పెరిగిన నౌకా సంపత్తి.. తీర ప్రాంత రక్షణకు వెన్నెముకగా ఉన్న ఈఎన్సీ (ఈస్ట్ నేవల్ కమాండ్).. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్ నేవీ.. ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ శత్రుదుర్భేద్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్మెరైన్లున్నాయి. ఇక్కడి నౌకల పేర్లన్నీ ఐఎన్‌ఎస్‌తో మొదలవుతాయి. ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవల్ షిప్. వీటిల్లో విభిన్న తరగతుల యుద్ధ నౌకలున్నాయి. అలాగే, సబ్మెరైన్లు కూడా. ఇదీ నేవీ డే కథ.. భారత్-పాక్ మధ్య 1971 డిసెంబర్ 3 సాయంత్రం మొదలైన యుద్ధం డిసెంబర్ 16న పాకిస్తాన్ ఓటమితో ముగిసింది. బంగ్లాదేశ్ విమోచన అంశం ఈ యుద్ధకాండకు ప్రధాన కారణం. తూర్పు పాక్ (బంగ్లాదేశ్)కు భారత్ మద్దతు ప్రకటించడంతో.. పాకిస్థాన్ మన దేశంపై దాడులకు పాల్పడింది. కరాచీ ఓడరేవుపై భారత్ చేసిన దాడితో పాక్ నావికాదళం చతికిలపడింది. అంతేకాక.. పాక్ జలాంతర్గామి ఘాజీని విశాఖ తీరం సమీపంలోనే సాగర గర్భంలోనే కుప్పకూల్చారు. దీంతో.. పాక్ నావికాదళం 80 శాతం నష్టపోయింది. అనంతరం.. బంగాళాఖాతంలోని జల ప్రాంతాలన్నింటినీ ఇండియన్ నేవీ తన ఆధీనంలోకి తెచ్చుకుంది. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోతున్నట్లు ప్రకటించడంతో.. భారత్ కాల్పుల విరమణ ప్రకటించింది. డిసెంబర్ 16న యుద్ధం ముగిసినా.. డిసెంబర్ 4న కరాచీలోని అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం ధ్వంసం కారణంగానే ఆ రోజును భారత నౌకాదళ దినోత్సవంగా ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. దీనికి గుర్తుగానే విశాఖ సముద్ర తీరాన విక్టరీ ఎట్ సీృ1971 స్థూపాన్నీ నిర్మించారు. నేడే విశాఖలో ‘నేవీ డే’ పాకిస్తాన్‌తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయానికి ప్రతీకగా ఏటా నిర్వహించే నౌకాదళ దినోత్సవం బుధవారం విశాఖలో వైభవంగా జరగనుంది. పాక్ ఓటమిలో తూర్పు నావికాదళం కీలకపాత్ర పోషించడంతో ఏటా ఈ ఉత్సవాన్ని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా నగరంలోని ఆర్కే బీచ్ వద్ద నౌకాదళ సిబ్బంది చేసే విన్యాసాలు అందరినీ అబ్బురపరుస్తాయి. యుద్ధంలో మరణించిన అమరవీరులకు నేవీ డేలో భాగంగా ఉ.7 గంటలకు నావికా దళ అధికారులు విక్టరీ ఎట్ సీ వద్దకు వచ్చి నివాళులర్పిస్తారు. మ.3.30 గంటల నుంచి యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్స్, హెలికాప్టర్లతో నేవీ సిబ్బంది సాహస విన్యాసాలను ప్రదర్శిస్తారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్ వార్ మెమోరియల్ సందర్శన అనంతరం నేవీ హౌస్‌లో ఉన్నతాధికారులు, అతిథులకు తేనీటి విందు ఇస్తారు. ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్ నౌకాదళ దినోత్సవానికి ఈసారి ముఖ్య అతి«థిగా సీఎం వైఎస్ జగన్ హాజరుకానున్నారు. ఆయన మ.3.10గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుని 3.40గంటలకు సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్తారు. సా.4 గంటలకు ఆర్కే బీచ్‌కు బయల్దేరుతారు. 5.30గంటల వరకు అక్కడ విన్యాసాలను తిలకిస్తారు. అనంతరం నేవీ హౌస్‌లో ‘ఎట్ హోం’ పేరిట నిర్వహించే తేనీటి విందులో సీఎం పాల్గొంటారని జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వెల్లడించారు. -
అమెరికాతో భారత్ భారీ ఆయుధ డీల్
వాషింగ్టన్: అమెరికా నుంచి భారత్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేయనుంది. ఈ ఆయుధ ఒప్పందం విలువ రూ. 7 వేల కోట్లు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు సమాచారం అందించారు. భారత నౌకాదళానికి 13 ఎమ్కే45, 5 ఇంచ్/62 కేలిబర్ (మోడ్ 4) నావల్ గన్స్ అమ్ముతున్నట్లు ట్రంప్ చెప్పారు. వీటిని బీఏఈ సిస్టమ్స్ అండ్ ఆర్మామెంట్స్ సంస్థ తయారుచేస్తోంది. ఈ ఆయుధాల ద్వారా భారత్ పొరుగు దేశాల నుంచి తనకున్న ప్రమాదాలను ఎదుర్కోగలదని ట్రంప్ అధికార కార్యాలయం తెలిపింది. ఈ డీల్ ద్వారా అత్యాధునిక ఆయుధాలు కలిగిన దేశంగా భారత్ మారిందని చెప్పింది. -
నౌకా దళంలో చేరిన 'సైలెంట్ కిల్లర్'
సాక్షి, ముంబై: భారత నౌకాదళం అమ్ములపొదిలోకి స్కార్పిన్ తరగతికి చెందిన మరో జలాంతర్గామి ఐఎన్ఎస్ ‘ఖండేరీ’ చేరింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో శనివారం దీన్ని సముద్రంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రక్షణమంత్రి రాజ్‌నాథ్ నేవీ అధికారులను ఉద్దేశించి ‘దేశం వారిపై ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా వ్యవహరిస్తారని తాను విశ్వసిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా పాకిస్తాన్‌కు ఆయన ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చారు. ఖండేరి లాంటి జలాంతర్గాములతో పాక్‌కు గట్టి సమాధానం ఇవ్వగలమన్నారు. జమ్ము కశ్మీర్ అంశంపై భారత్‌కు ప్రపంచ దేశాల మద్దతు లభిస్తోందని, అయితే పాకిస్తాన్ మాత్రం కావాలనే రచ్చ చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ దుయ్యబట్టారు. శత్రు నౌకలకు అంతుచిక్కని ఖండేరి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఐఎన్ఎస్ ఖండేరీని 'సైలెంట్ కిల్లర్' అని కూడా పిలుస్తారు. శత్రు నౌకలకు అంతుచిక్కని ఖండేరి పొడవు 67.5 మీటర్లు. శక్తిమంతమైన నాలుగు ఎంటీయూ 12వీ 396, ఎస్ఈ84 ఇంజిన్లు సొంతం. సముద్ర ఉపరితలం నుంచి రోజుల తరబడి ఏకధాటిగా సముద్రంలో ప్రయాణించగల ఈ జలాంతర్గామిలో భారీ సామర్థ్యమున్న 360 బ్యాటరీలు ఉంటాయి. కాగా 2017 డిసెంబరులో ముంబైలో మజగావ్ డాక్ నౌకా నిర్మాణ కేంద్రం నుంచి ఖండేరి జలాంతర్గామిని జల ప్రవేశం చేయించారు. శత్రువుల నిఘాకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ జలాంతర్గామి నుంచి శత్రు లక్ష్యాలపై విధ్వంసక దాడి చేయవచ్చు. అలాగే ట్యూబుల ద్వారా నౌకా విధ్వంసక క్షిపణులను ప్రయోగించవచ్చు. ఐఎన్ఎస్ ఖండేరీలో ఐదురుగురు నేవీ అధికారులుతో పాటు 35 మంది నావికా సిబ్బంది ఉంటారు. ఖండేరీ... ఒకప్పటి మరాఠా దళం పేరు 17వ శతాబ్దంలో సముద్రంపై ఆధిపత్య పోరులో ప్రముఖ పాత్ర పోషించిన మరాఠా దళం ఖండేరీ పేరును దీనికి పెట్టారు. ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్ కంపెనీ నిర్మిస్తోన్న స్కార్పియో జలాంతర్గాములు డీజిల్–ఎలక్ట్రిక్ ఇంధనంగా పని చేస్తాయి. మజగవా డాక్స్‌లో ఆరు జలాంతర్గాములను తయారు చేస్తుండగా, ఐఎన్ఎస్ ఖండేరీ రెండోది కావడం విశేషం. ముంబయికి చెందిన మజగావ్ డాక్ లిమిటెడ్ సంస్థ దీన్ని నిర్మించింది. ఉష్ణ మండల ప్రాంతాల్లో కూడా ఏ సమస్యలు లేకుండా పనిచేస్తుంది. నౌకాదళంలోని ఇతర విభాగాల నుంచి కూడా ఆపరేట్ చేసేలా కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. -
కశ్మీర్‌పై భారత్‌కు రష్యా మద్దతు
మాస్కో/న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలకు రష్యా మద్దతు ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడం వంటివి భారత రాజ్యాంగానికి లోబడే జరిగాయని స్పష్టం చేసింది. భారత్, పాక్‌ల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి రావాలని కోరుతున్నాం. ఇందుకోసం రెండు దేశాలు తమ మధ్య ఉన్న విభేదాలను సిమ్లా ఒప్పందం, లాహోర్ ప్రకటనపాతిపదికన రాజకీయంగా, దౌత్యపరంగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాం’ అని రష్యా విదేశాంగ శాఖ తెలిపింది. నేవీలో హై అలర్ట్ భారత నేవీలో శనివారం హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి సముద్ర దాడులనైనా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము అప్రమత్తంగా ఉన్నట్లు నావికాదళం తెలిపింది. ‘తీర ప్రాంత భద్రతా చర్యలు వేగవంతమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఉండేందుకు భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నాయి’అని నావికాదళ సిబ్బంది డిప్యూటీ చీఫ్ మురళీధర్ పవార్ వెల్లడించారు. ‘సముందరి జిహాద్’పేరుతో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు సముద్రంలో దాడులు చేసేందుకు తమ కేడర్‌కు శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అన్ని నేవీ స్టేషన్లలో హై అలర్ట్ విధించారు. లాహోర్–ఢిల్లీ బస్ సర్వీసులు నిలిపివేత లాహోర్–ఢిల్లీల మధ్య నడుస్తున్న బస్ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. జాతీయ భద్రతా సంఘం నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, పోస్టు సేవల మంత్రి మురద్ సయీద్ అన్నారు. కరాచీ నుంచి వచ్చే థార్ ఎక్స్‌ప్రెస్ 165 మంది ప్రయాణికులతో శనివారం భారత్ సరిహద్దుకు చేరుకుంది. అక్కడి నుంచి మరో లింకు రైలు ద్వారా ప్రయాణికులను భారత్ తీసుకొచ్చారు. దీనికి ముందు ఈ రైలును సరిహద్దు వరకు తీసుకురావడానికి పాక్ అనుమతించింది. -
భారత నౌకదళం అమ్ముల పొదిలోకి మరో అస్త్రం
-
ఉరి.. సరి కాదు
ద హేగ్: అంతర్జాతీయ వేదికపై భారత్‌కు విజయం. నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)కు పాకిస్తాన్ విధించిన మరణ శిక్షను ఆ దేశం తప్పనిసరిగా పునఃసమీక్షించాలని నెదర్లాండ్స్‌లోని ద హేగ్‌లో ఉన్న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఐసీజే అధ్యక్షుడు, జడ్జి అబ్దుల్ఖవీ అహ్మద్ యూసఫ్ నేతృత్వంలోని 16 మంది న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు చెబుతూ జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని, ఆయనకు విధించిన శిక్షను పాక్ పునఃసమీక్షించాలని ఆదేశించింది. ఈ తీర్పును ఈ ఏడాది ఫిబ్రవరి 21నే కోర్టు రిజర్వ్‌లో ఉంచి బుధవారం వెలువరించింది. ఇండియా తరఫున న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. పాకిస్తాన్ సైనిక కోర్టుల విశ్వసనీయతను ఆయన ప్రశ్నించారు. జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించకుండా ఇండియాకు ఉన్న రాయబార హక్కులకు పాక్ భంగం కలిగించిందన్న వాదనను 15 మంది న్యాయమూర్తులు అంగీకరించగా, ఒక్కరు మాత్రమే వ్యతిరేకించారు. ‘నిర్బంధంలో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్‌ను కలిసేందుకు, ఆయనకు న్యాయపరమైన సహాయం అందించేందుకు భారత అధికారులను పాక్ అనుమతించకపోవడం ద్వారా, ఇండియా హక్కులను పాక్ కాలరాసింది. వియన్నా ఒప్పందం ప్రకారం జాధవ్ అరెస్టు, నిర్బంధం గురించిన సమాచారాన్ని భారత్‌కు వెంటనే తెలియజేయాల్సిన బాధ్యత పాక్‌కు ఉంది’ అని జడ్జి యూసఫ్ పేర్కొన్నారు. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ ‘జాధవ్ కేసులో భారత విధానం సరైనదేనని ఈ చరిత్రాత్మక తీర్పు స్పష్టం చేస్తోంది. జాధవ్‌ను వీలైనంత త్వరగా విడుదల చేయించి భారత్‌కు తీసుకొచ్చేందుకు మేం మా పనిని కొనసాగిస్తాం’ అని పేర్కొంది. వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించింది.. జాధవ్‌ను నిర్బంధించిన విషయాన్ని భారత్‌కు పాక్ మూడు వారాలు ఆలస్యంగా తెలియజేయడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని తీర్పులో జడ్జి యూసఫ్ ప్రస్తావించారు. జాధవ్‌ను కలిసేందుకు తమ అధికారులను అనుమతించాల్సిందిగా అనేకసార్లు పాక్‌ను భారత్ కోరినా అందుకు ఆ దేశం అంగీకరించలేదన్న విషయం సుస్పష్టమవుతోందని పేర్కొన్నారు. గూఢచర్యం, ఉగ్రవాదం నేరాలపై జాధవ్‌కు పాక్ మిలిటరీ కోర్టు 2017 ఏప్రిల్‌లో మరణ శిక్ష విధించగా, ఆ శిక్ష అమలును నిలిపివేయాలంటూ భారత్ ఐసీజేను ఆశ్రయించడం తెలిసిందే. సమస్యాత్మక బలూచిస్తాన్ ప్రావిన్సులోకి జాధవ్ ఇరాన్ నుంచి ప్రవేశించారనీ, 2016 మార్చి 3న ఆయనను తమ భద్రతా దళాలు పట్టుకున్నాయనీ, జాధవ్ గూఢచర్యం, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనేది పాక్ వాదన. అయితే ఈ అంశంలో భారత్ వాదన మరోలా ఉంది. నౌకాదళం నుంచి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం జాధవ్ ఇరాన్లో వ్యాపారం చేసుకుంటుండగా, పాక్ అక్కడి నుంచి ఆయనను అపహరించి బలూచిస్తాన్‌కు తీసుకొచ్చిందని భారత్ ఆరోపిస్తోంది. సైనిక కోర్టులో రహస్య విచారణ జరిపిన అనంతరం 2017 ఏప్రిల్‌లో పాక్ ఆయనకు మరణ శిక్ష విధించగా, ఆ తీర్పును సవాల్ చేస్తూ అదే ఏడాది మే నెలలో భారత్ ఐసీజేను ఆశ్రయించింది. దీంతో తుది తీర్పు చెప్పే వరకు జాధవ్‌కు శిక్ష అమలును నిలిపివేయాలని అప్పట్లో ఐసీజే మధ్యంతర తీర్పు చెప్పింది. తర్వాత 2017 డిసెంబర్ నెలలో ఇస్లామాబాద్‌లో జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు, తల్లికి పాక్ అనుమతి ఇచ్చింది. భారత్‌కు భారీ విజయం: బీజేపీ నేతలు జాధవ్ కేసులో ఐసీజేలో భారత్‌కు భారీ విజయం లభించిందని పలువురు బీజేపీ నేతలు అంటున్నారు. ‘ఐసీజే తీర్పు భారత్‌కు లభించిన భారీ విజయం’ అని రాజ్‌నాథ్ అన్నారు. జాధవ్ కుటుంబ సభ్యలకు త్వరలోనే తగిన పరిహారం దక్కుతుందని విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు. తీర్పు తమకు లభించిన విజయమని పాక్ చెప్పుకోవడంపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఓ ట్వీట్ చేస్తూ ‘అలా అనుకోవడం మీ తప్పు కాదు. ఎందుకంటే తీర్పును ఇంగ్లీష్‌లో చెప్పారు కదా’ అని వ్యంగ్యంగా అన్నారు. పలువురు ఇతర బీజేపీ నేతలు ఐసీజే తీర్పును స్వాగతించారు. మూడేళ్ల నాలుగు నెలలుగా... ► 2016, మార్చి 3: కుల్‌భూషణ్ జాధవ్‌ను అరెస్ట్ చేసిన పాక్ భద్రతా దళాలు. ► మార్చి 24: భూషణ్ భారత గూఢచారి అనీ, ఆయనను బలూచిస్తాన్‌లో అరెస్టు చేశామని ప్రకటించిన పాక్. ► మార్చి 26: పాక్ ఆరోపణను తోసిపుచ్చిన భారత్. ఆయన నౌకాదళ విశ్రాంత అధికారి అనీ, ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని ప్రకటన. ► మార్చి 29: జాధవ్‌ను కలవడానికి రాయబారులను అనుమతించాలంటూ 16వ సారి పాక్‌ను కోరిన ఇండియా. అయినా ఒప్పుకోని పాకిస్తాన్. ► 2017, ఏప్రిల్ 10: పాక్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నారంటూ కుల్‌భూషణ్‌కు మరణ శిక్ష విధించిన పాకిస్తాన్ సైనిక కోర్టు. ► మే 8: పాక్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) ఆశ్రయించిన భారత్. ► మే 9: మరణ శిక్ష అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చిన ఐసీజే. ► మే 15: జాధవ్ కేసు విచారణలో ఐసీజేలో పరస్పరం ఆరోపణలు చేసుకున్న భారత్, పాక్. ► మే 18: తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు జాధవ్ మరణ శిక్షను వాయిదా వేయాలని పాక్‌ను ఆదేశించిన ఐసీజే. ► జూన్ 22: పాకిస్తాన్ సైన్యాధిపతికి జాధవ్ క్షమాబిక్ష దరఖాస్తు చేసుకున్నారని సైనిక ప్రతినిధి వెల్లడి. ► నవంబర్ 10: జాధవ్‌ను కలిసేందుకు ఆయన భార్యకు అనుమతి ఇచ్చిన పాకిస్తాన్. ► డిసెంబర్ 25: జాధవ్‌ను కలిసిన ఆయన భార్య, తల్లి. ► 2019, ఫిబ్రవరి 18: జాధవ్ కేసులో నాలుగు రోజులు బహిరంగ విచారణను ప్రారంభించిన ఐసీజే. ► ఫిబ్రవరి 21: బహిరంగ విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ఐసీజే. ► జులై 17: జాధవ్ మరణశిక్షపై పునఃమీక్ష జరపాలని, అంత వరకు శిక్ష అమలును నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు. సిగ్గరి.. మంచివాడు కులభూషణ్‌పై అనెవాది గ్రామస్థుల భావన మహారాష్ట్రలోని అనెవాది గ్రామానికి చెందిన కుల్‌భూషణ్ చిన్నతనంలో పరేల్ గ్రామంలో పెరిగారు. కుల్‌భూషణ్ బిడియంతో ఉండేవాడనీ, ఎవరి జోలికీ వెళ్లేవాడు కాదని, తనపనేదో తాను చూసుకునే వాడని అనెవాది గ్రామస్థులు అంటున్నారు. ఏటా రెండు సార్లు స్వగ్రామానికి వచ్చేవాడనీ, రోజులో ఎక్కువ సమయం పొలాల్లోనే గడిపేవాడని వారు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకునే కుల్‌భూషణ్ పట్ల అందరికీ సదభిప్రాయమే ఉంది. కుల్‌భూషణ్ చదువులో, ఆటల్లోనూ ప్రతిభ కనబరిచేవాడని ఆయన బాల్య స్నేహితుడు తులసీరామ్ పవార్ చెప్పారు. ఏ సమయంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా తానున్నానంటూ ముందుకెళ్లేవాడని ప్రశంసించారు. నౌకాదళం నుంచి కుల్‌భూషణ్ పదవీ విరమణ చేశాక ఇరాన్లో వ్యాపారం చేసుకునే వారని వారు అంటున్నారు. జాధవ్‌ను అన్యాయంగా నిర్బంధించిన పాక్, ఆయనకు ఉరి శిక్ష విధించడం ఎంత మాత్రమూ సరికాదని అనెవాది గ్రామస్థులంటున్నారు. భారత్‌కు ఒక్క రూపాయి, పాక్‌కు 20 కోట్లు ఐసీజేలో తమ వాదనలు వినిపించేందుకు భారత్ కేవలం ఒక్క రూపాయి ఖర్చు పెట్టగా, పాక్ ఇందుకు రూ. 20 కోట్లు వ్యయం చేసింది. ఈ కేసు వాదించడానికి హరీశ్ సాల్వే కేవలం ఒక్క రూపాయిని ఫీజుగా తీసుకుటున్నారని 2017 మే 15న నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. సాధారణంగా అయితే కేసులు వాదించేందుకు హరీశ్ సాల్వే ఒక్కో రోజుకి రూ. 30 లక్షలను ఫీజుగా తీసుకుంటారని సమాచారం. పాక్ తరఫున బ్రిటన్‌కు చెందిన లాయర్ ఖురేషీ వాదనలు వినిపించారు. జాధవ్ కేసును వాదించేందుకు ఫీజుగా ఆయనకు రూ. 20 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. సత్యం, న్యాయం నిలిచాయి: మోదీ కుల్‌భూషణ్ జాధవ్ కేసులో భారత్‌కు అనుకూలంగా ఐసీజే తీర్పును ఇవ్వడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్వాగతించారు. సత్యం, న్యాయం నిలిచాయని మోదీ పేర్కొన్నారు. ప్రతీ భారతీయుడి సంక్షేమం, భద్రత కోసం తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ పనిచేస్తుందని మోదీ వెల్లడించారు. ‘ఐసీజే ఈ రోజు ఇచ్చిన తీర్పును మేం స్వాగతిస్తాం. న్యాయం, సత్యం నిలిచాయి. వాస్తవాలను విస్తృతంగా పరిశీలించి ఈ తీర్పు చెప్పినందుకు ఐసీజేకు అభినందనలు’ అని మోదీ బుధవారం ఓ ట్వీట్లో తెలిపారు. జాధవ్‌కు తప్పక న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిర్దోషిగా తేల్చలేదు: పాక్ ఐసీజే ఇచ్చిన తీర్పు పాక్‌కే అనుకూలంగా ఉందని ఆ దేశం అంటోంది. తాము ఇప్పుడు ఐసీజే తీర్పును అనుసరించి చట్టం ప్రకారం ముందుకెళ్తామని పాక్ వెల్లడించింది. పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేస్తూ ‘అంతర్జాతీయ సమాజంలో బాధ్యత గల సభ్యదేశంగా ఈ కేసులో తొలి నుంచీ మా వైఖరికి మేం కట్టుబడి ఉన్నాం. కోర్టు తీర్పును విన్నాం. పాకిస్తాన్ ఇప్పుడు చట్టం ప్రకారం ముందుకెళ్తుంది. జాధవ్‌ను నిర్దోషిగా ప్రకటించాలనీ, విడుదల చేయాలని భారత్ ఐసీజేలో కోరింది. కానీ భారత వాదనను ఐసీజే పట్టించుకోకుండా, కేవలం పాక్ విధించిన మరణశిక్షను, జాధవ్‌ను దోషిగా తేల్చడాన్ని పునఃసమీక్షించాలని మాత్రమే తీర్పు చెప్పింది. వీసా లేకుండా, భారత పాస్పోర్టుతో, హుస్సేన్ ముబారక్ పటేల్ అనే మారుపేరుతో జాధవ్ పాక్‌లోకి ప్రవేశించారని మేం పునరుద్ఘాటిస్తున్నాం’ అని పేర్కొంది. పాకిస్తాన్ మానవహక్కుల శాఖ మంత్రి షిరీన్ మజారీ మాట్లాడుతూ ‘పునఃసమీక్షలు పూర్తయ్యే వరకే జాధవ్‌కు మరణ శిక్ష అమలు చేయకుండా ఉండేలా పాక్‌ను ఐసీజే నివారించింది. ఈ తీర్పు పాక్‌కి అనుకూలంగా ఉంది. కేవలం జాధవ్‌ను కలిసేందుకు భారత అధికారులను అనుమతించలేదన్న విషయంలో మాత్రమే భారత్‌కు అనుకూలంగా ఈ తీర్పు ఉంది. మిగిలిన అన్ని అంశాలు/కోణాల్లోనూ భారత్ ఈ కేసులో ఓడిపోయిందనే చెప్పాలి. పునఃసమీక్షలు పూర్తయ్యే వరకు మాత్రమే మరణ శిక్ష అమలుకాదు’ అని పేర్కొన్నారు. ముంబైలో స్వీట్లు తినిపించుకుంటున్న జాదవ్ స్నేహితులు