Indian Navy Notification 2021, Apply For 50 SSC Officer Posts - Sakshi
Sakshi News home page

ఇండియన్‌ నేవీలో 50 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు

Published Wed, Jun 16 2021 7:38 PM | Last Updated on Wed, Jun 16 2021 8:22 PM

Indian Navy SSC Recruitment 2021: Apply Online, Eligibility, Selection Process - Sakshi

ఇండియన్‌ నేవీ.. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ).. ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.

► మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌(ఎస్‌ఎస్‌సీ)–50(ఎస్‌ఎస్‌సీ జనరల్‌ సర్వీస్‌(జీఎస్‌/ఎక్స్‌)–47, హైడ్రో కేడర్‌–03).

► కోర్సు ప్రారంభం: జనవరి 2022
శిక్షణ కేంద్రం: ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఐఎన్‌ఏ), ఎజిమళ, కేరళ.

అర్హత: కనీసం 60శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఎంపిక విధానం: కోవిడ్‌–19 కారణంగా ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించకుండా.. అకడమిక్‌ మెరిట్‌ ద్వారా షార్ట్‌లిస్టింగ్‌ చేయనున్నారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.06.2021
► వెబ్‌సైట్‌: joinindiannavy.gov.in

మరిన్ని నోటిఫికేషన్లు:
ఇండియన్‌ కోస్ట్‌గార్డులో 350 ఖాళీలు

డేటా అనలిస్టులకు ఎంఎన్‌సీల బంపర్‌ ఆఫర్స్‌

తెలంగాణ పోలీస్‌ విభాగం, భరోసా సొసైటీలో ఖాళీలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement