Employment
-
వ్యవసాయ రంగమే ఉపాధికి ఊతం
నగర ప్రాంతాలకు తరలి వస్తోన్న లక్షలాదిమంది ప్రధానంగా ఉపాధిని పొందుతోంది, నిర్మాణ రంగంలోనే. సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధికి రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవారంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు? నేటి ప్రపంచ పరిస్థితులలో సరుకు ఉత్పత్తి రంగం గానీ, సేవా రంగం గానీ కోట్లాది మంది నిరుద్యోగులకు బతుకుతెరువును చూపగల స్థితి లేదు. మిగిలిందల్లా, వ్యవసాయ రంగమే. వ్యవసాయం లాభసాటిగా ఉంటే గ్రామీణులు నగరాలకు రారు. అప్పుడు కారుచవకగా కార్పొరేట్లకు కార్మికులు దొరకరు. అందుకే వ్యవసాయం లాభసాటిగా లేకుండా ‘జాగ్రత్తపడటమే’ ఇప్పటి విధానం.దేశంలోని సుమారు 65% జనాభా 35 ఏళ్ల లోపువారు. వీరికి నిరుద్యోగం, చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం ప్రధాన సమస్యలు. కోవిడ్ అనంతరం సమస్య మరింత జఠిలం అయ్యింది. 2016లో మోదీ తెచ్చిపెట్టిన పెద్ద నోట్ల రద్దు, 2017లో హడావుడిగా ఆరంభమైన జీఎస్టీ వంటివి చిన్న, మధ్యతరహా పరిశ్రమలను దెబ్బతీసి నిరుద్యోగ సమస్యను మరింత పెంచాయి.దేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనే వాగ్దానం ఆసరాగా 2014లో బీజేపీ అధికారంలోకి రాగలిగింది. ఇదే నేపథ్యంలో, మోదీ ప్రభుత్వం సరుకు ఉత్పత్తి రంగాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక ఉపాధి కల్పనా రంగంగా... దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 25% స్థాయికి చేర్చే పేరిట ‘మేకిన్ ఇండియా’ కార్య క్రమాన్ని ఆరంభించింది. దశాబ్ద కాలం తర్వాత, వెనక్కిచూసుకుంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఈ రంగం వాటా 15– 17 శాతం మధ్య ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలిపోయింది. 2020లో ఆరంభమైన ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల’ పథకం కూడా సాధించింది నామ మాత్రమే.మేకిన్ ఇండియా కార్యక్రమం విజయవంతం అయ్యే అవకాశాలు లేవంటూ అప్పట్లోనే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురావ్‌ు రాజన్ చెప్పారు. చైనా ప్రపంచం యావత్తుకూ సరిపోయే స్థాయిలో, చవకగా సరుకులను ఉత్పత్తి చేస్తోంది గనుక ప్రపంచానికి మరో చైనా అవసరం లేదంటూ సున్నితంగా హెచ్చరించారు. ఈ రచయిత కూడా 2008 ఆర్థిక సంక్షోభం అనంతరం, అంతర్జాతీయంగా డిమాండ్ పతనం వంటి వివిధ కారణాలను పేర్కొంటూ మేకిన్ ఇండియా, దేశ సమస్య లకు పరిష్కారం కాదంటూ ఒక వ్యాసం రాసివున్నారు.దేశంలో నిరుద్యోగం పరిష్కారానికీ, వృద్ధి రేటు పెంపుదలకూ దారి ఏమిటనే చర్చ ముమ్మరంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, ఈ మధ్య రఘురావ్‌ు రాజన్ ‘బ్రేకింగ్ ద మౌల్డ్: రీ ఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్’ పేరిట రోహిత్ లాంబా అనే పెన్సి ల్వేనియా విశ్వవిద్యాలయ ఆచార్యునితో కలిసి ఒక పుస్తకం రాశారు. దీనిలో భాగంగా మేకిన్ ఇండియా, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానాలు ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సరుకు ఉత్పత్తి రంగంపై దృష్టిని కాస్తంత తగ్గించు కొని, భారతదేశం ఇప్పటికే ‘బలంగా’ వున్న సేవా రంగంపై దృష్టి పెట్టాలన్నారు. తద్వారా మెరుగైన ఉపాధి కల్పన, వృద్ధి రేటులను సాధించవచ్చనేది వారి వాదన. దీని కోసమై యువజనుల నిపుణతల స్థాయిని పెంచి వారిని సేవా రంగ ఉపాధికి సిద్ధం చేయాలన్నారు.రెండవ ప్రపంచ యుద్ధానంతరం కొరియా, జపాన్... అలాగే చైనా వంటి దేశాలు అనుసరించిన ఆర్థిక వృద్ధి నమూనా అయిన మొదటగా వ్యవసాయ రంగం నుంచి సరుకు ఉత్పత్తి రంగం దిశగా సాగడం... అనంతరం మాత్రమే సేవా రంగం వృద్ధి దిశగా పయనించడం అనివార్యం కాదని రాజన్ వాదిస్తున్నారు. అనేక ధనిక దేశాలలో ఇప్పటికే సేవా రంగం వాటా జీడీపీలో 70% మేర ఉందనీ, ఈ రంగంలో జీడీపీ వాటా సుమారు 60% పైన వున్న భారత్ కూడా పాత నమూనాని పక్కన పెట్టి మరింతగా సేవా రంగంలోకి వెళ్ళాలనేది రాజన్ తర్కం. సేవా రంగం వృద్ధి చెందాలంటే యువజనుల విద్యా నిపుణతల స్థాయి సరుకు ఉత్పత్తి రంగంలో కంటే అధికంగా ఉండాలి. ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా సేవా రంగం తాలూకు సాఫ్ట్వేర్ రంగంలో ప్రవేశించగలగడంలో ఎదుర్కొంటున్న సాఫ్ట్ స్కిల్స్ లోటును చూస్తున్నాం. సేవా రంగంలో ఆంగ్ల భాషా ప్రావీణ్యం అవసరం తెలిసిందే. దేశంలోని ఎంతమంది యువజనులకు ఈ రంగంలో ప్రవేశించగల స్థాయి ఆంగ్ల భాషా ప్రావీణ్యం ఉంది? దేశంలోని మొత్తం కార్మికులలో 70% మంది మాత్రమే అక్షరాస్యులు. వీరిలో కూడా 25% మంది ప్రాథమిక స్థాయి విద్యలోపే పాఠశాల చదువు మానివేసిన వారు. దేశంలోని 20% సంస్థలు మాత్రమే తమ ఉద్యోగులకు తగిన శిక్షణను ఇచ్చుకునే ఏర్పాట్లను కలిగి వున్నాయి (ప్రపంచ బ్యాంకు పరిశోధన). ఈ స్థితిలో, గ్రామీణ యువజనులను సేవా రంగం దిశగా ఇప్పటికిప్పుడు తీసుకెళ్ళగలమా? నేడు సాఫ్ట్వేర్ రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి పరిణామాలు అక్కడా ఉపాధికి గండికొడుతున్నాయి. ఈ స్థితిలో, ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి కోసం రఘురావ్‌ు రాజన్ వంటి వారు కూడా సేవా రంగాన్ని ఎందుకు పరిష్కారంగా చెప్పజూస్తున్నారు?దీనికి కారణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘బీయింగ్ డిటర్మిన్స్ కాన్షియస్నెస్’ (మన అస్తిత్వమే మన ఆలోచనలను నిర్ణయిస్తుంది) అనే కార్ల్ మార్క్ ్స ఉద్బోధన. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 2003 నుంచి 2007 వరకూ ప్రధాన ఆర్థిక సలహాదారుగా పని చేసిన రాజన్ కూడా దాటుకుని రాలేని నిజం. ఆయన అస్తిత్వం తాలూకు పరిమి తులే, ఆయనను వాస్తవాన్ని చూడనివ్వడం లేదు. నేటి ప్రపంచ పరిస్థితులలో అటు సరుకు ఉత్పత్తి రంగం గానీ, ఇటు సేవా రంగం గానీ, కోట్లాది మంది నిరుద్యోగ యువతకు బతుకుదెరువును చూప గల స్థితి లేదు. మిగిలిందల్లా, మన వ్యవసాయ రంగమే. ఈ రంగంలో ఇప్పటికే, అవసరాన్ని మించి మానవ వనరులు చిక్కుకు పోయి ఉన్నాయన్నది నిజం. ప్రస్తుత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాల ‘సంస్కరణల’ యుగంలో వ్యవసాయ రంగంపై చిన్న చూపు పెరిగింది. గ్రామీణ వ్యవసాయ రంగం, నగర ప్రాంత పారిశ్రామిక రంగాల మధ్యన ఉన్న సమీకరణం గ్రామీణ ప్రాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వ్యవసాయ రంగ సరుకులను కారు చవుకగా, నగర ప్రాంతాలలో అందుబాటులో ఉంచడమనేది పారిశ్రామిక కార్పొరేట్ వర్గాల అవసరం. గ్రామీణ రైతాంగానికి లాభసాటి ధరలను కల్పిస్తే ఆ సరుకుల ధరలు, నగర ప్రాంత మార్కెట్లలో అధికంగా ఉంటాయి. నగర ప్రాంత కార్మికులు, ఉద్యోగులకు అవి ఖరీదైనవి అవుతాయి. అప్పుడు వేతనాల పెంపుదల కోసం యజమానులపై ఒత్తిడి తెస్తారు. ఇది పారిశ్రామిక అశాంతిగా మారవచ్చు. ఒక మోస్తరు వేతనాలతోనే పని చేయించుకోగలగాలంటే రైతాంగ ఉత్పత్తులకు తక్కువ ధరలు ఉండేలా జాగ్రత్తపడడం కార్పొరేట్లకు అవసరం. గ్రామీణ రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా ఉంటే వారు నగరాలకు రారు. అప్పుడు నగర ప్రాంతాలలో కార్మికుల సరఫరా తగ్గుతుంది. కార్మికులకు డిమాండ్ పెరుగుతుంది. దీని వలన, పారిశ్రామికవేత్తలు అధిక వేతనాలను చెల్లించి పనిలో పెట్టుకోవలసి వస్తుంది. దీనికి కూడా పరిష్కారమే గ్రామీణ వ్యవసాయం లాభ సాటిగా లేకుండా ‘జాగ్రత్తపడడం’. ఈ కథలో సూత్రధారులు ప్రపంచీకరణ వంటి నయా ఉదారవాద విధానాaలను మన మీద రుద్దుతోన్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధులు. ఆ ఆలోచనా విధానం తాలూకు ప్రతినిధిగా రఘురావ్‌ు రాజన్ వ్యవసాయం ఊసు ఎత్తలేరు. దాన్ని దేశానికీ, ఉపాధి కల్పనకూ దారిగా చూపలేరు. రైతుకు వ్యవసాయం లాభసాటిగా ఉంటే అది అతని కొనుగోలు శక్తిని పెంచి తద్వారా నగర ప్రాంత పారిశ్రామిక సరుకులకు డిమాండ్‌ను కల్పిస్తుంది. దేశ జనాభాలోని 55% పైన ఉన్న రైతాంగం బాగుంటే, విదేశాలలోని డిమాండ్, కొనుగోలు శక్తి, ఎగుమతులతో నిమిత్తం లేకుండా దేశంలోనే డిమాండ్‌ను సృష్టించవచ్చు. ఈ పరిష్కారాన్ని చెప్పలేని మేధా దుర్బలత్వంతో రఘురావ్‌ు రాజన్ వంటివారు మిగిలిపోతున్నారు. డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్: 98661 79615 -
మన ముత్యానికి మెరుపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన పలు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ –జీఐ) సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆహారం, హస్తకళలు, వంగడాలు తదితర 17 రకాల ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. ఇప్పుడు మరిన్ని ఉత్పత్తులకు జీఐ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ జాబితాలో హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కలంకారీ, వరంగల్ మిర్చి తదితర ఉత్పత్తులు ఉన్నాయి. వీటికి జీఐ గుర్తింపు కోసం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని ‘కం్రప్టోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్’విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు సమర్పించింది. 30 ఉత్పత్తులకు జీఐ ట్యాగింగ్ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీఐ ట్యాగింగ్ జాబితాలో తెలంగాణకు చెందిన ఉత్పత్తులకు పెద్దగా చోటు దక్కలేదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో జీఐ టాగింగ్ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కనీసం 30 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ దక్కేలా చూడాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కళంకారీ, వరంగల్ చపాటా మిర్చీకి గుర్తింపు ఇవ్వాలని దరఖాస్తు చేసింది. వరంగల్ చపాటా మిర్చీ తరహాలోనే ఖమ్మం మిర్చికి కూడా జీఐ టాగింగ్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు కోరింది. తెలంగాణకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు జీఐ టాగింగ్ నోడల్ అధికారి శ్రీహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. – ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 17 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ లభించింది. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ వెండి ఫిలిగ్రీ, నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీమ్, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి ఇత్తడి కళాకృతులు, సిద్దిపేట గొల్లభామ చీరలు, బంగినపల్లి మామిడి, పోచంపల్లి ఇక్కత్ లోగో, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్, తేలియా రుమాల్, లక్క గాజులకు జీఐ గుర్తింపు లభించింది. – జీఐ చట్టం 1999 ప్రకారం భౌగోళిక ప్రత్యేకత, నాణ్యత, ప్రాముఖ్యత తదితరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వాటికి జీఐ గుర్తింపు ఇస్తారు. వారసత్వ, సాంస్కృతిక సంపదను కాపాడటం, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం, ఉత్పత్తుల నాణ్యత, ప్రత్యేకతను పరిరక్షించడం, ఉత్పత్తులను నకలు కొట్టకుండా నిరోధించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడం జీఐ టాగింగ్ లక్ష్యం. -
విదేశాల్లో మారిన పరిస్థితులు.. మనోళ్ల ఆశలు ఆవిరి!
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల విదేశీ విద్య ఆశలు ఆవిరైపోతున్నాయి. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియా, బ్రిటన్ లాంటి దేశాలకు ఎమ్మెస్‌కు వెళ్లాలనుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. ఆర్థిక సంక్షోభంతో అమెరికా తదితర దేశాల్లో ఐటీ రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే విదేశాల్లో చదువు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన వారు కూడా పునరాలోచనలో పడుతున్నారు. కొన్నాళ్లు వేచి చూడటమే మంచిదనే నిర్ణయానికి వస్తున్నారు. కొందరు ఆయా దేశాల్లో ఉన్న తమతోటి మిత్రులతో అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గురించిన వివరాలు కనుక్కుంటున్నారు. అమెరికా, కెనడా, ఆ్రస్టేలియాలో పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆయా దేశాల్లో ఉన్నవిద్యార్థులు చెబుతున్నారు. ఆ రోజులు పోయాయ్! విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో ఎమ్మెస్ చదువు చాలామంది విద్యార్థులకు ఓ కల. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేయగానే ఏదో ఒక వర్సిటీలో చదువుకోసం ప్రయతి్నంచేవారు. వీలైనంత త్వరగా ఎమ్మెస్ పూర్తి చేస్తే, ఫుల్‌టైమ్ జాబ్‌తో త్వరగా సెటిల్ అవడానికి వీలవుతుందని భావించేవారు. అప్పు చేసి మరీ విమానం ఎక్కేసేవారు. ఎమ్మెస్ చేస్తూనే ఏదో ఒక పార్ట్ టైమ్ జాబ్‌తో ఎంతోకొంత సంపాదించుకోవడానికి ఆసక్తి చూపేవారు.కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. పరిస్థితి అంత సాను కూలంగా లేదని కన్సల్టెన్సీలు, ఇప్పటికే అక్కడ ఉన్న విద్యార్థులు చెబుతున్నారు. 2021లో 4.44 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తే, 2022లో ఈ సంఖ్య 6.84 లక్షలుగా ఉంది. 2023లో కూడా పెరుగుదల నమోదైనా 2024కు వచ్చేసరికి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితిని, విద్యార్థుల నుంచి వస్తున్న ఎంక్వైరీలను బట్టి చూస్తే 2025లో ఈ సంఖ్య మరింత తగ్గే వీలుందని కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. వెళ్లినవారికి ఉపాధి కష్టాలు ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో విదేశాల్లో స్కిల్డ్ ఉద్యోగం దొరకడం గగనంగా మారుతోందని, అన్ స్కిల్డ్ ఉద్యోగాలకు కూడా విపరీతమైన పోటీ ఉందని అంటున్నారు. ఆర్థిక సంక్షోభంతో అమెరికా, కెనడా లాంటి దేశాల్లో ఉద్యోగాలు తీసివేసే పరిస్థితి నెలకొనడం, మరోవైపు భారత్ సహా ఇతర దేశాల నుంచి వచ్చినవారి సంఖ్య ఇప్పటికే గణనీయంగా పెరిగిపోవడం ఇందుకు కారణమని తెలుస్తోంది. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కూడా ప్రభావం చూపిస్తోందని అంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నా, ప్రయత్నాలు కొనసాగిస్తున్నా.. ఉద్యోగం రాకపోవడం మాట అలా ఉంచితే కనీసం ఇంటర్వ్యూకు పిలిచే పరిస్థితి కూడా ఉండటం లేదని తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళేందుకు అవసరమైన సెక్యూరిటీ మొత్తం, అక్కడి ఫీజులు ఖర్చుల కోసం ఒక్కో విద్యార్థి కనీసం రూ.40 లక్షల వరకు అవసరం. కాగా ఈ మేరకు అప్పు చేసి వెళ్లేవారి సంఖ్యే ఎక్కువగా ఉండేది. ఏదో ఒక పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ ఖర్చులకు సరిపడా సంపాదించుకోవడంతో పాటు రుణం తీర్చగలమనే ధీమా గతంలో ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. చాలా కంపెనీలు ఏడాది క్రితం ఆఫర్ లెటర్ ఇచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి అమెరికాలో కొనసాగుతోంది. తాజాగా నాస్కామ్ జరిపిన ఓ సర్వేలో ఇలాంటి వాళ్ళు అమెరికాలో 20 వేల మంది ఉన్నట్టు తేలింది. అస్ట్రేలియాలో ఇచ్చిన ఆఫర్లు వెనక్కు తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పు తీర్చలేక, ఇండియా రాలేక, అమెరికాలో ఉద్యోగం లేకుండా ఉండలేక విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు. దేశంలో ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఇండియా ఐటీ సెక్టార్‌పైనా ప్రభావం చూపించింది. పలు కంపెనీలు వరుసగా లే ఆఫ్‌లు ప్రకటించడంతో ఐటీ విభాగం కుదేలైంది. క్యాంపస్ నియామకాలు తగ్గాయి. దీంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు వెతుక్కోవాల్సి వస్తోంది. పోటీ తీవ్రంగా ఉండటంతో ఫ్రెషర్స్ పోటీని తట్టుకుని నిలబడటం కష్టంగా ఉంది. నైపుణ్యం సమస్య! దేశవ్యాప్తంగా ప్రతి ఏటా 12 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మార్కెట్లోకి వస్తున్నారు. వీరిలో కేవలం 8 శాతం మందికి మాత్రమే అవసరమైన నైపుణ్యం ఉంటున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వీళ్లే బహుళజాతి కంపెనీల్లో మంచి వేతనంతో ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొంటున్నాయి. స్వల్ప సంఖ్యలో విద్యార్థులు చిన్నాచితకా ఉద్యోగంతో సరిపెట్టుకుంటుండగా, ఎక్కువమంది అన్‌స్కిల్డ్ ఉద్యోగులుగా లేదా నిరుద్యోగులుగా కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంటోంది. తాజాగా అమెరికాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పరిస్థితిని మరింత దిగజార్చిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లినవారి సంఖ్య 2024లో గణనీయంగా తగ్గిందని అంటున్నారు. మంచి ఉద్యోగం మానుకుని అమెరికా వచ్చా బీటెక్ అవ్వగానే ఓ ఎంఎన్సీలో మంచి ఉద్యోగం వచ్చింది. రెండేళ్ళల్లో ప్రమోషన్లు కూడా వచ్చాయి. కానీ అమెరికా వెళ్ళాలనే కోరికతో అప్పు చేసి ఇక్కడికి వచ్చా. ప్రస్తుతం ఎంఎస్ పూర్తి కావొచ్చింది. కానీ జాబ్ దొరికే అవకాశం కని్పంచడం లేదు. ఇప్పటికీ డబ్బుల కోసం ఇంటి వైపే చూడాల్సి వస్తోంది. – మైలవరపు శశాంక్ (అమెరికా వెళ్ళిన ఖమ్మం విద్యారి్థ) రెండేళ్ళ క్రితం వరకూ అమెరికాలో ఎంఎస్ గురించి రోజుకు సగటున 50 మంది వాకబు చేసేవారు. ఇప్పుడు కనీసం పది మంది కూడా ఉండటం లేదు. కెనడాలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతుండటం, అమెరికాలో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం సన్నగిల్లడమే ఈ పరిస్థితికి కారణం. – జాన్సన్, యూఎస్ కన్సల్టింగ్ ఏజెన్సీ నిర్వాహకుడు అమెరికాలో ఐటీ రంగం పరిస్థితి ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. కొందరు ఉన్న ఉద్యోగాలు కోల్పోతున్నారు. భారతీయ విద్యార్థులు నూటికి కనీసం ఆరుగురు కూడా కొత్తగా స్కిల్డ్ ఉద్యోగాలు పొందడం లేదు. – అమెరికాలోని భారతీయ కన్సల్టెన్సీ సంస్థ ఎన్వీఎన్అప్పుచేసి అమెరికా వచ్చా. పార్ట్ టైం జాబ్ కూడా ఒక వారం ఉంటే ఇంకో వారం ఉండటం లేదు. కన్సల్టెన్సీలు కూడా చేతులెత్తేస్తున్నాయి. మరోవైపు ఎంఎస్ పూర్తి చేసిన నా స్నేహితులకు స్కిల్డ్ ఉద్యోగాలు దొరకడం లేదు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా ఉంటోంది. – సామా నీలేష్ (అమెరికా వెళ్ళిన హైదరాబాద్ విద్యార్థి) -
సైనిక విమాన తయారీకి ఊపు
మూడేళ్ల క్రితం యూరప్ కంపెనీ ‘ఎయిర్‌బస్’తో 56 సి–295 రవాణా విమానాలను కొనడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 16 స్పెయిన్‌లో తయారవుతాయి, మిగతా 40 ఇండియాలో ‘టాటా’(టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. సైనిక రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం ఉపాధికి కూడా తోడ్పడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద తొలి సి–295 విమానం 2026లో అందుబాటులోకి రానుంది. మొత్తం 40 విమానాలను 2031కల్లా అందించడం ద్వారా టీఏఎస్ఎల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.భారత వైమానిక దళానికి చెందిన పాత అవ్రో విమానాల స్థానంలో 56 సి–295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ లో రూ. 21,935 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. ‘ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లెలో దాని తుది అసెంబ్లింగ్ (విడిభాగాల కూర్పు) కేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉంది. మిగతా 40 విమానాలను భారత్, స్పెయిన్ కుదుర్చుకున్న పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. భారత్‌లో రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్ 30న గుజరాత్‌లోని వడోదరలో టీఏఎస్ఎల్ చివరి దశ విడిభాగాల కూర్పు సదుపాయానికి శంకు స్థాపన చేశారు. అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధురీకి 2023 సెప్టెంబర్ 13న స్పెయిన్‌లోని సెవిల్లెలో తొలి విమానాన్ని అందజేశారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ విమానం 2023 సెప్టెంబర్ 25న హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరింది. ‘రైనోస్’ అని కూడా పిలిచే ఐఏఎఫ్ 11 స్క్వాడ్రన్ ఇప్పటికే ఆరు సి–295 విమానాలను నడుపుతోంది.తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీసి–295 బహుళ ప్రాయోజక సైనిక రవాణా విమానంగా రుజువు చేసుకుంది. 9.5 టన్నుల పేలోడ్, 70 మంది ప్రయాణికులు లేదా 49 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శక్తిని గణనీయంగా పెంచింది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైమానిక దళాలు ఉప యోగిస్తున్నాయి. ఇంకా పలు సామర్థ్యాలు ఎయిర్‌బస్ సి–295 సొంతం. సైనిక రవాణా, ఆకాశమార్గంలో రవాణా, పారాట్రూపింగ్, వైద్య సహాయం కోసం తరలింపు, సముద్రప్రాంత గస్తీ, జలాంత ర్గాములను ఎదుర్కొనే యుద్ధ పరికరాలు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు పహారా, వాటర్ బాంబర్, గాలి పరంగా ముందస్తు హెచ్చరి కలు వంటి విస్తృత శ్రేణి మిషన్ లలో ఇది సమర్థంగా పని చేస్తుంది.స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం. మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసే తొలి సి–295 విమానం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది. చివరి విమానం 2031 ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ దేశంలో విమాన రంగ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్ఎంఈలు విమానాల విడి భాగాలను అందిస్తాయి. ఇప్పటికే 33 ఎంఎస్ఎంఈలను ఎయిర్‌బస్ గుర్తించింది. హైదరాబాద్‌లోని టీఏఎస్ఎల్ ప్రధాన కేంద్రంలో విమా నాల విడిభాగాల తయారీ ప్రారంభమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను ఇప్పటికే విమానంలో అనుసంధానం చేశారు. అయితే, ఒప్పంద చర్చల తుది దశలో ఎక్కువ కాలం జాప్యం కావడంతో వీటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. పెరిగే ఉపాధి కల్పనతాజా ప్రయత్నం వైమానిక రంగంలో ఉపాధి కల్పనను పెంచు తుందని రక్షణ శాఖ చెబుతోంది. దేశంలో ఏరోస్పేస్, రక్షణ రంగంలో 42.5 లక్షలకు పైగా పనిగంటలతో ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు, 3,000కు పైగా పరోక్ష ఉద్యోగాలకు, అదనంగా 3,000 మధ్యతరహా నైపుణ్య ఉపాధి అవకా శాలకు వీలు కలుగుతుంది. ఇతర ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ దారుల (ఓఈఎం) నుంచి ఎయిర్‌బస్ తెప్పించే ఏరో ఇంజిన్, ఏవి యానిక్స్ మినహా అధిక శాతం నిర్మాణ భాగాలు భారత్‌లోనే తయారవుతాయి. ఒక విమానంలో ఉపయోగించే 14,000 విడి భాగాలలో 13,000 భాగాలు దేశంలోని ముడిసరుకుతోనే తయారవుతాయి. అయితే టీఏఎస్ఎల్ సకాలంలో 40 విమానాలను తయారు చేయడమే అసలైన పరీక్ష. ఇప్పటివరకు చాలా కార్యకలాపాలు ఎయిర్‌బస్ ద్వారా జరుగుతున్నాయి. టీఏఎస్ఎల్ కేవలం వాటిని అమలు చేస్తోంది. భారత వైమానిక రంగ సుస్థిర వృద్ధి కోసం స్థానిక ఉత్పత్తి, డీజీ ఏక్యూఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎష్యూరెన్స్) ద్వారా నాణ్యత నియంత్రణ, ‘సెమిలాక్’ ద్వారా భవిష్యత్తు ధ్రువీకరణ, దేశీయ తనిఖీ పరీక్షలు, మూల్యాంకనంపై దృష్టి సారించాలి.రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదగడానికి గత పదేళ్లలో భారత ప్రభుత్వం చేసిన కృషి దోహదపడింది. రూ. 43,726 కోట్ల నుంచి రూ. 1,27,265 కోట్లకు పెరిగిన రక్షణ ఉత్పత్తుల్లో 21 శాతం వాటా ప్రైవేటు రంగానిదే. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమ తులు గత ఏడాది రూ. 21,000 కోట్లకు పైగా పెరిగాయి. కొన్ని విధాన సంస్కరణలతో పాటు మూలధన పరికరాల కొనుగోలు కోసం డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్ – 2020లో స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐడీడీఎం) కేటగిరీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ గణాంకాలను సాధించడానికి దోహదపడింది. కొత్తగా కేటాయించిన రక్షణ బడ్జెట్లో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల ద్వారా కొనుగోళ్లకు కేటాయించారు. జాయింట్ యాక్షన్ (శ్రీజన్) పోర్టల్ ద్వారా స్వయం సమృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, సానుకూల స్వదేశీకరణ జాబితాలు (పీఐఎల్), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడీఈఎక్స్) ఏర్పాటు, 2024 సెప్టెంబర్ నాటికి రూ. 50,083 కోట్ల పెట్టుబడి అంచనాతో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి అనేక ఇతర చర్యలను ప్రభుత్వం తీసుకుంది. 2013 మేలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేసిన తరువాత ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చు కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆరేళ్ళు పట్టింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి, ఒప్పందం తదుపరి చర్చలకు ఇంకా చాలా చేయాల్సి ఉంది.దేశంలో సి –295 సైనిక రవాణా విమానాల ఉమ్మడి తయారీలో ఎయిర్‌బస్ – టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భాగ స్వామ్యం ఇప్పటివరకు సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక రంగానికి ఆశ, ప్రేరణగా నిలుస్తోంది. అయితే సివిల్ సర్టిఫైడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ఎయిర్ క్రాఫ్ట్ వెర్షన్లను టీఏఎస్ఎల్ విస్తరిస్తుందో లేదో చూడాలి. ఈ భాగస్వామ్యం పూర్తి ప్రయోజనాలను పొందడానికి దేశంలో ఉత్పత్తి, భవిష్యత్తు ఎగుమ తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భరత సాధన దిశగా భవిష్యత్ ప్రయాణం క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఎయిర్‌బస్, టీఏ ఎస్ఎల్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా అడుగులు ముందుకు పడ్డాయి. టీఏఎస్ఎల్ నిర్ణీత సమయానికి 40 విమానాలను తయారు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ తరహా భాగస్వామ్యాల విషయంలో ప్రభుత్వ రంగం ఐఏఎఫ్ అంచనాలను అందుకోలేదన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠం. మరి ఈ ఒప్పందం సఫలమైతే దేశంలో ప్రైవేట్ రంగ భాగ స్వామ్యం మరింత ప్రబలమవుతుంది. వాటి సహకారం లేకుండా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కల నెరవేరదు.అనిల్ గోలానిఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్అడిషనల్ డైరెక్టర్ జనరల్ -
అడవే ఆధారం.. అభివృద్ధికి దూరం
చెట్లు చేమలే వారి నేస్తాలు.. బొడ్డు గుడిసెలే నివాసాలు.. ఆకులు, అలములు,కందమూలాలే ఆహారం.. అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. అడవే సర్వస్వంగా జీవిస్తున్నా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. అభ్యున్నతికి నోచక.. అనాగరిక జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులపై విశ్లేషణాత్మక కథనమిది. అచ్చంపేట: చెంచుల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్ప త్తుల సేకరణతో కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ భూ పంపిణీకి నోచుకోవడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి గణాంకాలకే పరిమితమైంది. వారికి ఉపాధి కల్పించేందుకు జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, తాగునీటి వసతి వంటివి అమలు కావడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఇళ్లు లేక రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మండల (నెగడి)తో కాలం వెళ్లదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను వైద్య, ఆరోగ్యశాఖ, ఐటీడీఏ పట్టించుకోక పోవడంతో చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో పాటు మలేరియా, క్షయ, పక్షపాతం, కడుపులో గడ్డలు, విషజ్వరాలు, రక్తహీనత, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవితాలు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు అందక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దుర్భరంగా బతుకులు..మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చెంచుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సున్నిపెంట (శ్రీశైలం)లో ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో సమీకృత గిరి జనాభివృద్ధి సంస్థను (ఐటీడీఏ ) ఏర్పాటు చేశారు. దీని పరిధి లో నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలు.. 4,041 చెంచు కుటుంబాలున్నాయి. 14,194 మంది గిరిజన జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటల్లో 2,595 కుటుంబాలుండగా.. 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలున్నారు. అభయారణ్యం పరిధిలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలుండగా.. 18 చెంచు పెంటలున్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్పీ, ఎస్టీలున్నారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏతో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. వీరి జీవన స్థితిగతుల మార్పు, సమస్యల పరిష్కారానికి చెంచు సేవా సంఘం ఆ«ధ్వర్యంలో ఎన్నోసార్లు పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకులు వెళ్లదీస్తున్నారు.ఫలాల సేకరణకు హద్దులు..చెంచులు ప్రధానంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు.. చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.చెట్ల పెంపకం అంతంతే..అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం.. చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో వారికి ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ.. ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఫలాలు ఇచ్చే చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.అటవీ ఉత్పత్తులు ఇవే..నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురుతో పాటు మరో పది రకాల ఉత్పత్తులు అడవిలో లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావం వల్ల సహజసిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వీటికోసం చెంచులు పెద్ద పులులు ఇతర క్రూరమృగాలతో పొంచి ఉన్న ముప్పును సైతం లెక్కచేయడం లేదు. అటవీ ఉత్పత్తులు సేకరించి, గిరిజన కార్పొరేషన్ సంస్థ జీసీసీ కేంద్రాల్లో విక్రయిస్తూ.. తమకు కావలసిన సరుకులు తీసుకెళ్తారు. ఇప్పటికే తీగలు, గడ్డలు అంతరించిపోవడంతో చెంచులకు ఉపాధి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించినా.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనె తుట్టెలు కనిపించడం లేదు. తేనెటీగల పెంపకంపై ప్రభుత్వం చెంచులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. చెంచులు ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే ఆధారపడి జీవిస్తున్నారు.ఉప్పుకైనా అప్పాపూరే..చెంచులకు జీసీసీ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. నల్లమలలోని చెంచులందరూ కాలినడకన అప్పాపూర్ చెంచుపెంటకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. అటవీ వస్తువులను విక్రయించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో బియ్యం, నూనె, పప్పు వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొన్ని సరుకులకు బయటి మార్కెట్ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. చెంచులకు నాసిరకం సరుకులు అంటగడుతున్నారు.బీమా కల్పించాలిప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వలేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. ఇప్పుడు అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. – బయన్న, మల్లాపూర్ చెంచుపెంటపక్కా ఇళ్లు లేవులోతట్టు చెంచులు నేటికి ఆనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే కాపురం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు. – నిమ్మల శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక ఉపాధి కల్పనకు చర్యలుచెంచుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్«మన్ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలను విడతల వారీగా చేపడుతున్నాం. చెంచుపెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్‌కార్డులు అందజేశాం. ప్రత్యేక వైద్య వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– రోహిత్‌రెడ్డి, ఇన్చార్జి ఐటీడీఏ పీవో -
మహిళకు నెట్టిల్లు మేలు!
మహిళకు నెట్టిల్లు మేలు ‘ఇంటర్నెట్ అందుబాటులో లేకపోతే ఏమవుతుంది?’ అనే ప్రశ్న ఒకప్పుడైతే అంత తీవ్రంగా ఆలోచించాల్సినంత ప్రశ్న కాకపోవచ్చు. ఇప్పుడు మాత్రం ఈ ప్రశ్నకు అధ్యయనకర్తలు అనేక కోణాలలో జవాబులు అన్వేషిస్తున్నారు...ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా దక్షిణాసియా కీలక దశలో ఉంది. మధ్యతరగతి అభివృద్ధిపథంలో ఉంది. అయితే ఈ పురోగతికి ఒక ఆటంకం ఉంది. అదే... డిజిటల్ జెండర్ డివైడ్. ఇంటర్నెట్ను ఉపయోగించడంలో స్త్రీ, పురుషుల మధ్య భారీ అంతరం ఉండడమే డిజిటల్ జెండర్ డివైడ్.ఇంటర్నెట్ అందుబాటులో లేని 260 కోట్ల మందిలో ఎక్కువగా మహిళలు, బాలికలే ఉన్నారు. దీనివల్ల మహిళలు ఉద్యోగ శిక్షణకు దూరం అవుతున్నారు. ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ పథకాల ఫలాలు అందుకోలేకపోతున్నారు. ఆరోగ్య, ఆర్థిక సేవలకు దూరం అవుతున్నారు.గత 25 ఏళ్లలో దక్షిణాసియా అంతటా డిజిటల్ యాక్సెస్ విపరీతంగా పెరిగింది. మన దేశం విషయానికి వస్తే గత దశాబ్దకాలంలో ఇంటర్నెట్ వినియోగం నాలుగు రెట్లు పెరిగింది. అయితే స్త్రీ, పురుషుల విషయంలో ఈ పురోగతి ఒకేరకంగా లేదు. కట్టుబాట్లు మొదలుకొని వ్యవస్థాగత కారణాలు, పేదరికం వరకు రకరకాల కారణాల వల్ల మహిళలు, బాలికలు ఇంటర్నెట్కు దూరం అవుతున్నారు.ప్రపంచంలోని మిగిలిన దేశాలతో పోలిస్తే దక్షిణాసియా దేశాలలో మహిళలు విద్య, ఉద్యోగాలలో వెనకబడిపోతున్నారు. ఇంటర్నెట్కు దూరం కావడం అనేది మహిళల కెరీర్ అవకాశాలను పరిమితం చేస్తుంది. మన దేశంలో 20–25 శాతం వ్యాపారాలు మహిళలు నిర్వహిస్తున్నప్పటికీ 2 శాతం కంటే తక్కువ మంది మాత్రమే మూలధనాన్ని సమీకరించుకోగలుగుతున్నారు.ఇక ‘స్టెమ్’ విషయానికి వస్తే దక్షిణాసియా అంతటా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో మహిళలు 25 శాతం మాత్రమే ఉన్నారు. ‘స్టెమ్’ ఫీల్డ్‌కు సంబంధించిన ఉద్యోగాలలో కూడా మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉంది. ‘డిజిటల్ జెండర్ డివైడ్ అనేది కేవలం సామాజిక సమస్య కాదు ఆర్థిక సమస్య కూడా’ అంటున్నారు నిపుణులు. ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ల మంది బాలికలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే కేవలం మూడేళ్లలో ఆయా దేశాల జీడిపీలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.‘మహిళలు ఇంటర్నెట్కు దగ్గరైతే ఉద్యోగ రంగంలో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగాల వల్ల కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది మహిళలకు వారి కుటుంబాల మెరుగైన జీవన నాణ్యత(క్వాలిటీ ఆఫ్ లైఫ్)కు దారి తీస్తుంది. మహిళలకు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. తరతరాలకు ఉపయోగపడే ఫలాలు ఇస్తుంది’ అంటున్నారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం డిజిటల్ ఇన్‌క్లూజన్ హెడ్ కెల్లీ ఓముడ్సెన్.2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ ఉద్యోగాల సంఖ్య 9.2 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఆ ఉద్యోగాలలో మహిళల ప్రాతినిధ్యం పెరగాలంటే వారు ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం అనేది అనివార్యం.(చదవండి: శారీ రన్! చీర కట్టులో కూడా పరుగు పెట్టొచ్చు..!) -
సూక్ష్మస్థాయి ఉపాధి ‘ఏఐ’ కంటే మేలు
టాటా సన్స్ కంపెనీ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆగస్టు 16న కలిశారు. అదే రోజు – ‘టాస్క్ ఫోర్స్ ఫర్ ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’ కో– చైర్మన్ చంద్రశేఖర్ అని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ముఖ్య మంత్రి దీనికి చైర్మన్. ‘రాబోయే ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబోతున్నది. ఇందులో అగ్రశ్రేణి ఇండస్ట్రీ ‘లీడర్లు’, నిపుణులు ఉంటారు’ అని పత్రికల్లో వార్తలొచ్చాయి. ఇది విన్నాక,ముందుగా ఈ విషయం చెప్పాలి అనిపించింది. ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ కంపెనీ ‘అమెజాన్’ తన రిక్రూట్మెంట్ విభాగంలో ఇకముందు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ (ఏ.ఐ.) వాడ వద్దని నిర్ణయం తీసుకుంది. ‘రిక్రూట్మెంట్’ కోసం దరఖా స్తులు ‘స్క్రూటినీ’ చేసేటప్పుడు, ‘జెండర్’ అని ఉండేచోట– ‘ఆడ’ అని ఉంటే, ‘ఏఐ’ వాటిని తిరస్కరిస్తున్నది. అది గమ నించాక, కంపెనీ దాని వాడడం వెంటనే ఆపేసింది. అటువంటి కంపెనీలే అంత బాధ్యతగా ఉంటున్నప్పుడు, ప్రజలు ఎంపిక చేసుకున్న ప్రభుత్వాలు యువతరం జీవితా లను ప్రభావితం చేసే ఉపాధి అంశాల విషయంలో ఎంత బాధ్యతగా ఉండాలనేది అవి గ్రహించాలి. టీడీపీ ప్రభుత్వం 2015లో ఇలాగే– ‘స్ట్రాటజిక్ ఇనిస్టిట్యూట్ ఫర్ ట్రాన్సా్ఫర్మింగ్ – ఏపీ’ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసినట్లుగా వార్త బయటకు వచ్చింది. ఆ తర్వాత, దానికి కొనసాగింపు కనిపించలేదు. ‘ఫేస్ బుక్’, ‘గూగుల్’ వంటి సామాజిక మాధ్యమాల బహుళ జాతీయ కంపెనీలు కొత్తగా అమరావతికి వస్తున్నాయి అంటున్నారు. ఇక్కడ ‘ఏఐ’ యూనివర్సిటీ వస్తుంది అని ఆ శాఖ మంత్రి అంటున్నారు. గతంలో ‘గేమ్స్ సిటీ’ అన్నారు. అయితే ఈ దిశలో ప్రభుత్వ స్థాయిలో జరగాల్సిన కసరత్తు ఇప్పటికే మొదలైతే, అది మంచిదే. అలాగే, వాటితోపాటు ఎన్నికల ముందు కూటమి వెల్లడించిన– ‘స్కిల్ సెన్సెస్’ వెంటనే పూర్తికావాలి. ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికలు తమ వద్ద లేవనుకున్నప్పుడు ఇదొక పద్ధతి. అలా కాకుండా తాము చేసింది ఏదైనా అది ఆ ప్రాంతానికీ, ప్రజలకూ కూడా శాశ్వత ప్రయోజనం కలగాలి. తామే అందుకు ప్రత్యామ్నాయాలు వెతకాలని ప్రభుత్వం అను కొన్నప్పుడు అది మరోలా ఉంటుంది. అప్పటి ముఖ్యమంత్రి డా‘‘ వైఎస్ రాజశేఖర రెడ్డి 2008లో ప్రారంభించిన ‘సెజ్’లో ఇప్పుడు ‘శ్రీసిటీ’గా అందరికీ తెలిసిన–‘సత్యవేడు రిజర్వ్ ఇన్ఫ్రా సిటీ’ (టౌన్ షిప్) ఉంది. అదిప్పుడు తిరుపతి జిల్లాలో ఉంది. రాష్ట్రానికి ఏ ప్రపంచ దిగ్గజ కంపెనీ వచ్చినా వాళ్లకు ప్రభుత్వాలు ఇప్పుడు చూపించేది– ‘శ్రీసిటీ’. సీఎమ్‌గా వైఎస్ మొత్తం 22 ‘సెజ్’లకు కేంద్రం నుంచి అనుమతి తెచ్చారు. నాన్న కృషికి కొనసాగింపు అన్నట్టుగా జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఖనిజ నిక్షేపాల విలువ పెంచడానికి కడప జిల్లా కొప్పర్తి వద్ద ‘మెగా ఇండస్ట్రియల్ హబ్’ కోసం 2020లో 3,155 ఎకరాలను కేటాయించారు. ఇది కర్నూల్ – రాణిపేట నేషనల్ హైవేకి, రైల్వే లైన్, కడప ఎయిర్ పోర్ట్‌కు సమీపాన ఉండడమే కాకుండా... రేణిగుంట అంతర్జాతీయ విమానా శ్రయానికి 145 కి.మీ దూరంలో ఉంది. ప్రభుత్వం ఇక్కడ కల్పిస్తున్న వసతులతో రూ. 25,000 కోట్ల మేర పెట్టు బడులు వస్తాయనీ, 2.5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనీ 2020 డిసెంబర్ నాటి ప్రభుత్వ అంచనా. కనీసం శ్రీసిటీ, కొప్పర్తి వంటి పారిశ్రామిక కూడళ్ళ వద్ద, అలాగే కొత్త జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పడే మార్కెట్ డిమాండ్ దృష్ట్యా సూక్ష్మ స్థాయిలో ‘సర్వీస్ సెక్టార్’లో ‘ఐటీఐ’, ‘పాలి టెక్నిక్’ స్థాయిలో ‘కరిక్యులం’ సమీక్ష అనేది ముందు... ‘స్కిల్ సెన్సెస్’ పూర్తి అయితే అప్పుడు వాటిని సరిచేసుకోవచ్చు. దానివల్ల ‘స్టార్ట్ అప్’లకు ‘ఎంఎస్ఎంఈ’లకు అవసరమైన కొత్త ‘మ్యాన్ పవర్’ దొరుకుతుంది. కానీ ఇవన్నీ ‘పెండింగ్’లో ఉంచి, అక్టోబర్ రెండు గాంధీ జయంతి రోజున –‘అంకుర యాత్ర’ పేరుతో భారీ బస్ ర్యాలీ అమరావతి నుంచి శ్రీసిటీ వరకు ప్రభుత్వం ‘ప్లాన్’ చేసింది. ఇందు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ‘ఎన్నారై’లు మన ‘స్టార్ట్ అప్’లను ప్రోత్సహించడానికి ఇక్కడికి వస్తున్నారని అంటున్నారు. అదలా ఉంటే, కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా ‘విజన్ డాక్యుమెంట్లు’ తయారుచేస్తారని వార్తలు వస్తున్నాయి. పరిపాలనలో ఇంత అనుభవం ఉన్న పార్టీ ప్రభుత్వానికి మళ్ళీ ఇటువంటి కసరత్తు అవసరమా? మరి ఏ ‘విజన్’ అనకుండానే గత ప్రభుత్వం ఉద్యానవనం, పరిశ్రమలు రెండింటినీ కలుపుతూ కొత్తగా ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ప్రారంభించింది. దాంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మొదటిసారి ఆ శాఖకు మంత్రిని నియమించింది. ఈ శాఖ ఏర్పాటుతో రైతులకు సంప్రదాయ పంటల సాగు కంటే ఉద్యా నవన ఉత్పత్తులకు మెరుగైన లాభాలు ఉంటాయి. ఇలా గత ప్రభుత్వం చూపించిన బాటలో కూటమి ప్రభుత్వం కొన సాగుతూ మైక్రో ఇరిగేషన్‌తో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 2029 నాటికి రెట్టింపు చేస్తాం అంటున్నారు. కేంద్ర–రాష్ట్రాలు కలిసి ప్రస్తుతం ఇస్తున్న 55% సబ్సిడీని ఇక ముందు 90% శాతానికి పెంచాలని నిర్ణయించారు. వాస్తవానికి అభివృద్ధి ప్రణాళికల అమలు పలు దొంత ర్లుగా ఉంటుంది. అదలా ఉన్నప్పుడే, సూక్ష్మ స్థాయి వరకు ఇంకి కొన్ని తరాలు పాటు ఆ మేలు చివరి ‘మైలు’ వరకు చేరు తుంది. ఇంతకూ ‘విజన్’ అంటే ఏమిటి? ఉమ్మడి ఏపీలో వైఎస్సార్ తాడేపల్లిగూడెం వద్ద హార్టీకల్చర్ యూనివర్సిటీ పెడితే, విభజిత ఏపీలో జగన్ ‘ఫుడ్ ఇండస్ట్రీ శాఖ పెట్టడం! ఫలితంగా ఈ ప్రభుత్వంలో దానికి కొత్తగా ఒక మంత్రి వచ్చి, పంట విస్తీర్ణం రెట్టింపు లక్ష్యంగా ప్రకటించడం. దానివల్ల ప్రయోజనాల వ్యాప్తి 26 జిల్లాలకు ఉంటుంది. అది మట్టిలో చేసే సాగుబడి నుంచి, ఆ ఉత్ప్పత్తులను ‘ఆన్ లైన్’లో మార్కె టింగ్ చేస్తూ ‘డెస్క్’ వద్దకు చేరింది! ప్రతి దశలోనూ ఇందులో యువత ప్రయోజనాలు పొందుతుంది. నిజానికి ఇది ‘ప్రాంతము– ప్రజలు’ కేంద్రిత అభివృద్ధి నమూనా.జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
అర్హతకు తగిన ఉపాధి లేకపోతే...
నేడు భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఒకటి అల్ప ఉద్యోగిత. అర్హత, నైçపుణ్యాలకు తగిన ఉద్యోగానికి బదులు... తక్కువ స్థాయి ఉద్యోగం లభించే స్థితినే అల్ప ఉద్యోగిత అంటారు. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉపాధి, శ్రామిక శక్తుల వినియోగానికి కొలమానం. అల్ప ఉద్యోగితకు అనేక కారణాలు ఉన్నాయి. పరిశ్రమల డిమాండ్‌లో మార్పుల కార ణంగా పాత నైపుణ్యాలు కలిగిన కార్మికులకు ఉపాధి దొరకదు. భౌగోళిక అసమానతలు ఉద్యోగ అవకాశాలను పరిమితం చేస్తాయి. లింగ, జాతి లేదా వయస్సు ఆధారంగా చూపే పక్షపాతం వ్యక్తులు తగిన ఉపాధిని పొందకుండా అడ్డుకుంటుంది. కొన్ని రంగాలలో అధిక పోటీ కారణంగా అర్హత కలిగిన అభ్యర్థులు తమ నైపుణ్యానికి సరి పోయే ఉద్యోగాలను పొందడం కష్టమవుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త రంగంలోకి మారి తగిన ఉద్యోగాలు సంపాదించాలన్నా... ఆ రంగా నికి అవసరమైన నైపుణ్యాల కొరత కారణంగా ఉద్యోగాలు పొందడం కష్టమవుతుంది. అల్ప ఉద్యోగిత వ్యక్తిగతంగానూ, సామాజిక పరంగానూ నష్టదాయకం. వ్యక్తులు తరచుగా ప్రాథమిక అవసరాలు తీరడానికి కూడా ఖర్చు చేయలేరు. అందువల్ల అప్పుల పాలవుతారు. ఆర్థిక అభద్రతకూ గురవుతారు. అల్ప ఉద్యోగిత ఎక్కు కాలం కొనసాగడం వల్ల వ్యక్తుల నైపుణ్యాలు క్షీణిస్తాయి. ప్రభుత్వ సహాయ కార్యక్రమాలపై ఎక్కువ ఆధారపడటానికి అల్ప ఉద్యోగిత దారి తీస్తుంది. ప్రజా వనరులపై భారం పడుతుంది. ఈ స్థితి ఆర్థిక అసమానతలను పెంచుతుంది. వ్యక్తుల నైపుణ్యాలు పూర్తిగా వినియోగించుకోలేని కారణంగా ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఉత్పాదకత క్షీణించవచ్చు. అల్ప ఉపాధి వల్ల తక్కువ ఆదాయం వస్తుంది కనుక వస్తు వినియోగం తగ్గి ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. నిరుద్యోగం లాగానే అల్ప ఉద్యోగిత కూడా ప్రపంచ దేశాల సమస్య. దేశాలు, ప్రాంతాలను బట్టి దీని తీవ్రత మారుతూ ఉంటుంది.ముఖ్యంగా స్పెయిన్, గ్రీస్, ఇటలీ దేశాలలో చాలా మంది నైపుణ్యం కలిగిన కార్మికులు తక్కువ జీతాలు పొందుతున్నారు లేదా పార్ట్‌టైమ్ ఉద్యో గాలు చేస్తున్నారు.కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో అల్ప ఉద్యోగిత 15–20 శాతం ఉన్నట్లు తేలింది. వివిధ రాష్ట్రాలకు సంబంధించి అందుబాటులో ఉన్న డేటాను బట్టి... కేరళలో 10–15%, తమిళ నాడులో దాదాపు 10–20%, గుజరాత్, మహా రాష్ట్రల్లో 10–15% వరకు అల్ప ఉద్యోగిత ఉందని అంచనా. ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయం ఎక్కువగా ఉండి ఉద్యోగాల కల్పన పరిమితంగా ఉన్నందున 20–30% అల్ప ఉద్యోగిత ఉంది. బిహార్‌లో వ్యవ సాయంపై ఆధారపడి ఉండటం, తక్కువ పారిశ్రా మిక వృద్ధి జరగడం వల్ల అక్కడ, బహుశా 30% కంటే ఎక్కువ అల్ప ఉద్యోగిత ఉంది. అనేక దేశాలు అల్ప ఉద్యోగితను తగ్గించే లక్ష్యంతో కొన్ని విధానాలను అమలు చేశాయి. అందుబాటులో ఉన్న ఉద్యోగాల కోసం కార్మికులు సన్నద్ధమయ్యారని నిర్ధారించుకోవడానికి వృత్తి శిక్షణ–నైపుణ్యాభివృద్ధిలో పెట్టుబడిని ప్రోత్సహించడం అందులో ఒకటి. ఉద్యోగ భద్రతను పెంచే విధానాలు చేపట్టడం, పని పరిస్థితులను మెరుగు పరచడం, న్యాయమైన వేతనాలను ప్రోత్సహించడం; గ్రాంట్లు, రుణాలు, శిక్షణ ద్వారా చిన్న వ్యాపార అభివృద్ధిని ప్రోత్సహించడం; పార్ట్ టైమ్ లేదా గిగ్ వర్క్‌కు మద్దతు ఇచ్చే విధానాలు రూపొందించడం వంటి విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. అల్ప ఉద్యోగితను పరిష్కరించడానికి తరచుగా నైపుణ్యాల శిక్షణ, ఆర్థిక మద్దతు, ఉద్యోగ సృష్టిని ప్రోత్సహించే బహు ముఖ విధానం అవసరం. ప్రభుత్వాలు ఈ దిశలో చర్యలు తీసుకుంటే కొంత పరిష్కారం లభిస్తుంది.డా‘‘ పి.ఎస్. చారి వ్యాసకర్త బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ మొబైల్: 83090 82823 -
స్కిల్స్ వర్సిటీలో భాగస్వాములు కండి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలతో పాటు పారిశ్రామికవేత్తలు తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, బోర్డు సభ్యులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు, కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఆయన స్కిల్స్ యూనివర్సిటీకి బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకం ఉందన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని తెలిపారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి, 2028 ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణ అందిస్తుందని చెప్పారు. పట్టాలు ముఖ్యం కాదు.. నైపుణ్యం కావాలి డిగ్రీ, పీజీ పట్టాలు ఉంటే సరిపోదని, ఏటేటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నప్పటికీ, అందరూ ఉద్యోగాలు సాధించలేక పోతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్షలాది మంది యువకులు ఒక ఉద్యోగం ఇప్పించమని తన వద్దకు వస్తున్నారంటూ తనకు ఎదురైన కొన్ని అనుభవాలను వివరించారు. ఇదే సమయంలో పరిశ్రమలు మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఈ అంతరాన్ని తొలిగించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ నెలకొల్పాలని, తద్వారా యువత ఉపాధికి ఢోకా ఉండదని భావించినట్లు తెలిపారు. ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్: శ్రీధర్‌బాబు స్కిల్స్ యూనివర్సిటీకి సంబంధించి పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్‌బాబు పారిశ్రామికవేత్తలకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతోందని, ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనతో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ లో కొత్త కోర్సులు ప్రారంభమవటం ఆనందంగా ఉందన్నారు. సీఎం ఆలోచనలో దార్శినికత ఉంది ఆనంద్ మహీంద్రా తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయమైన పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని భావించడంలో దార్శనికత ఉందని అన్నారు. అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ తెలంగాణలో ఉందని, ఇక్కడి నుంచే అమెరికాకు ఎక్కువ మంది వెళుతున్నారని తెలిపారు. కాగా యూనివర్సిటీలో వచ్చే నెల దసరా పండుగ తర్వాత కోర్సులు ప్రారంభించనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ సమావేశంలో బోర్డు కో చైర్మన్ శ్రీని రాజు, సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీష్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బోర్డు సభ్యులు మనీష్ సభర్వాల్, సంజీవ్ బిక్చందానీ, ఎంఎం మురుగప్పన్, డాక్టర్ కేపీ కృష్ణన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. -
తమ వాళ్ల కోసం సోషల్ మీడియా పోస్టులు
సాక్షి, అమరావతి: పార్టీ వారికి ఉపాధి కోసం ఏకంగా ప్రభుత్వంలో చంద్రబాబు సర్కారు సోషల్ మీడియా పోస్టులను సృష్టించింది. ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులను సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి. మంత్రుల పేషీల్లో పనిచేయడం కోసం మొత్తం 44 సోషల్ మీడియా పోస్టులను సృష్టించడమే కాకుండా వాటిని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు డిజిటల్ కార్పొరేషన్ లిమిడెట్ సోమవారం ఎంప్లాయ్మెంట్ నోటీసు జారీ చేసింది. 24 మంది మంత్రుల పేషీల్లో 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్‌ను, మరో 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్స్‌ను భర్తీచేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. ఔట్ సోర్సింగ్ విధానంలో వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక అంటేనే పార్టీకి చెందిన వారిని తీసుకుంటారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఇమేజ్ను పెంపొందించాలని, సోషల్ మీడియా ఖాతాలను, సంఘాలను నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ సందేశాలను, కార్యక్రమాలను బలంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంటుందని నోటీస్‌లో పేర్కొంది. వీసీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నత విద్యా కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈనెల 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 10ఏళ్ల పాటు ఆచార్యులు, సంబంధిత స్థాయిలో అనుభవం గడించిన వారు వైస్ చాన్సలర్లు పోస్టుల కోసం దరఖాస్తుకు అర్హులని తెలిపారు. మూడేళ్ల కాల పరిమితితో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. -
తగ్గుతున్న ఉద్యోగాలు.. అందరి చూపు అటువైపే!
నిరుద్యోగం అనేది భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒక సమస్యగా ఉంది. యూరప్ దేశమైన ఎస్టోనియాలో నిరుద్యోగం రేటు 2024 రెండో త్రైమాసికంలో 7.6 శాతం పెరిగిందని స్టాటిస్టిక్స్ ఎస్టోనియా సంస్థ 'టీ వాసిల్జెవా' (Tea Vassiljeva) వెల్లడించారు.టీ వాసిల్జెవా గణాంకాల ప్రకారం, 2023 రెండో త్రైమాసికంతో పోలిస్తే 2024 రెండో త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య 7,600 పెరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువ భాగం యువత ఉన్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే.. రెండవ త్రైమాసికంలో నిరుద్యోగుల సంఖ్య కొంత ఎక్కువే అని వాసిల్జెవా పేర్కొన్నారు.పెరిగిన స్వయం ఉపాధిఎస్టోనియాలో ఉద్యోగం రాలేదని ఎదురు చూడకుండా.. చాలామంది స్వయం ఉపాధివైపు అడుగులు వేశారు. దీంతో స్వయం ఉపాధి పెరిగింది, ఉపాధిలో ఉన్నవారి సంఖ్య వృద్ధి చెందింది. ఈ సంవత్సరం రెండో త్రైమాసికంలో ఉపాధిలో ఉన్న వ్యక్తుల నిష్పత్తి 10.6 శాతానికి చేరింది.రాబోయే రోజుల్లో (మూడో త్రైమాసికం) స్వయం ఉపాధి మరింత పెరిగే అవకాశం ఉందని వాసిల్జెవా వెల్లడించింది. ఇందులో 15 నుంచి 74 సంవత్సరాల వయసున్న వారు ఉన్నారు. వీరందరూ ఉద్యోగం కోసం వేచి చూడక సొంత పని ప్రారంభిస్తున్నారు. ఇది వారి ఆర్థిక వృద్ధికి దోహదపడుతోంది.ఇదీ చదవండి: మార్చి నాటికి భారత్‌లో 6 లక్షల ఉద్యోగాలు: యాపిల్లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాల ప్రకారం, ఎస్టోనియాలో శాశ్వత నివాసులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ తాత్కాలికంగా ఉండేవారు లేదా ఉక్రేనియన్ శరణార్ధుల సంఖ్య తక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇది కూడా ఎస్టోనియాలో స్వయం ఉపాధి పెరగటానికి ఓ కారణమనే చెప్పాలి. ఎందుకంటే తాత్కాలికంగా ఉండే ప్రజలు ఉద్యోగం లేకుంటే.. ఇతర దేశాలకు వెళ్ళిపోతారు. కానీ శాశ్వతంగా నివాసం ఉండేవారు అక్కడే ఉండాలని, ఉద్యోగం లేకపోతే స్వయం ఉపాధి చూసుకుంటున్నారు. ఇలా అక్కడ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ పెరుగుతోంది. ఇదే ఫార్ములా ఎక్కడైనా, ఏ దేశంలో అయినా ఉపయోగించవచ్చు. ఉద్యోగం రాలేదని ఎదురు చూడక, స్వయం ఉపాధి పొందవచ్చు. -
కాల్ చేస్తే కట్ చేయొచ్చు
సిడ్నీ: ఆఫీసులో పని ముగించుకొని, ఇంటికెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో యాజమాన్యం నుంచి ఫోన్లు, మెసేజ్‌లు వస్తే ఎలా ఉంటుంది? చాలా చిరాకు కలుగుతుంది కదా! ఆ్రస్టేలియాలో ఇలాంటి చిరాకు ఇకపై ఉండదు. ఎందుకంటే ‘రైట్ టు డిస్కనెక్ట్’ నిబంధన అమల్లోకి వచ్చింది. పని వేళలు ముగించుకొని ఇంటికెళ్లిన ఉద్యోగులకు యాజమాన్యాలు అనవసరంగా ఫోన్ చేస్తే జరిమానా విధిస్తారు. యాజమాన్యాలు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తే ఉద్యోగులు స్పందించాల్సిన అవసరం లేదు. మాట్లాడకపోతే శిక్షిస్తారేమో, ఉద్యోగం పోతోందేమో అనే భయం కూడా అవసరం లేదు. ఆఫీసు అయిపోయాక యాజమాన్యం ఫోన్ చేస్తే ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్‌డబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేయొచ్చు. అయితే, అత్యవసర పరిస్థితుల్లో యాజమాన్యం నుంచి ఫోన్ వస్తే ఉద్యోగులు స్పందించాల్సి ఉంటుంది. సరైన కారణం లేకుండా ఫోన్‌కాల్‌ను తిరస్కరించకూడదు. ఎఫ్‌డబ్ల్యూసీ నిబంధనలు అతిక్రమిస్తే యాజమాన్యాలకు 94 వేల డాలర్లు, ఉద్యోగులకు 19 వేల డాలర్ల జరిమానా విధిస్తారు. ఆఫీసులో పని ముగిశాక తమకు ఫోన్ చేయవచ్చా? లేదా? అనేది నిర్ణయించుకొనే అధికారాన్ని ఉద్యోగికి కట్టబెట్టారు. ఆ్రస్టేలియాలో ఆఫీసు టైమ్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగులు పని చేయడం మామూలే. ఒక్కో ఉద్యోగి ప్రతిఏటా సగటున 281 గంటలు అధికంగా ఆఫీసులో పని చేస్తున్నట్లు గత ఏడాది ఒక సర్వేలో వెల్లడయ్యింది. ఈ ఓవర్‌టైమ్ పనికి అదనపు వేతనం ఉండదు. -
ఉత్తుత్తి గ్రామసభలే!
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పనుల్లో ఏమేమి చేయాలో ముందే నిర్ణయించుకుని, వాటికి అధికార ముద్ర కోసం ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించడానికి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. శుక్రవారం (నేడు) రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తామంటూ ఆర్భాటం చేస్తోంది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు తూట్లు పొడుస్తూ గ్రామ సభల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సచివాలయాల భవనాలు, రైతుభరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణ పనులన్నింటినీ పక్కనపెట్టి, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరీ నిధులతో కొత్తగా గ్రామాల్లో అధికార పార్టీ నేతలకు పనులను కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ప్రస్తుతం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కేటగిరి నిధుల నుంచి ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 2 వేల కోట్ల మేర కొత్త పనులు గుర్తింపు ప్రక్రియ అంతా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో దాదాపు పూర్తయింది. నిజానికి.. ఉపాధి పథకంలో చేపట్టే ఏ పనైనా నిబంధనల ప్రకారం ముందుగా గ్రామసభ ఆమోదం పొందాలి.అందుకే కూటమి పెద్దలు తమ వాళ్లకి కట్టబెట్టే పనులకు ఆమోదం తెలపడానికి ఉత్తుత్తి గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఎందుకీ హడావుడి పవన్.. ఈ ఉత్తుత్తి గ్రామ సభల నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్-గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా ఎక్కడాలేని హడావుడి చేస్తుండడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు నిర్వహించాలని పక్షం రోజులుగా పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే అంశంపై ఆయన సోమవారం అన్ని జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు జరగడం కొత్త కాదని, ఏటా నాలుగు విడతలుగా (ఏప్రిల్ 24న, ఆగస్టు 15న, అక్టోబర్ 2న, జనవరిలో మరో విడత) గ్రామ సభలు జరుగుతూనే ఉంటాయని అధికారులు గుర్తు చేస్తున్నారు.ఇప్పుడే ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. 9.92 లక్షల పనులకు జనవరిలోనే ఆమోదం సాధారణంగా ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి ఆరు నెలల ముందు నుంచే.. పంచాయతీలో చేపట్టాల్సిన పనులు, పేదలకు పనిదినాల కల్పనకు ఉన్న అవకాశాలు గుర్తించే ప్రక్రియ మొదలు పెట్టి ఫిబ్రవరిలో పూర్తి చేస్తారు. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూడా గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి లేబర్ బడ్జెట్ రూపకల్పనతో గ్రామాల వారీగా పనుల గుర్తింపు, ఆ పనులకు గ్రామ సభలో ఆమోదం వంటి ప్రక్రియ కూడా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు కల్లా అధికారులు పూర్తి చేశారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూలీలకు కల్పించే పనులతో పాటు మెటీరియల్ నిధులతో చేపట్టే ఇతర అభివృద్ధి పనులన్నీ కలిపి మొత్తం 9.92 లక్షల పనులకు ఈ ఏడాది జనవరిలోనే గ్రామ సభల్లో ఆమోదం తీసుకొని, ఆ పనుల జాబితాను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పుడే అందజేశారు. అందులో దాదాపు 8.53 లక్షల పనులు పురోగతి దశలో ఉన్నాయి. అయితే, తమ నాయకులకు ఆర్థిక లబ్ధిని చేకూర్చే మట్టి రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణ పనులకు కొత్తగా అనుమతులు తెలిపేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయింది. -
ఉపాధి రహిత వృద్ధి వృథాయే!
కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల తరువాత ఎదురైన ఆర్థిక సవాళ్లను అధిగమించి ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడింది. కాబట్టి భవిష్యత్తులో భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నా యని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. స్థిరమైన వృద్ధిరేటుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనతోనే 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకో గలుగుతుంది.ఒక్క సంపద సృష్టితోనే ఏ ఆర్థిక వ్యవస్థా బలంగా ఎదగలేదు. సంపద వృద్ధితో పాటు మానవ వనరుల ప్రమాణాలను పెంచే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన తోనే ఏ ఆర్థిక వ్యవస్థ అయినా బలంగా ఎదుగుతుంది. కానీ ఆరు దశాబ్దాల ప్రణాళికా యుగంలో భారత దేశంలో వృద్ధిరేటు ఉపాధి రహితంగా మందకొడిగా కొనసాగింది. ఫలితంగా ఉద్యోగ అవకాశాల సృష్టిలో వెనకబడటం వలన దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర రూపం దాల్చింది. 1991 నుండి దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక వృద్ధిరేటు పెరిగినా అది కూడా ఉపాధి రహితంగానే కొనసాగిందనే చెప్పాలి.ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వజ్రోత్సవంలో పాల్గొన్న సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ... భారత దేశంలోని ఉద్యోగ ఉపాధి కల్పనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగాల కల్పనలో భారతదేశం జీ–20 దేశాల కంటే వెనకబడి ఉంది. అలాగే 2010– 20ల మధ్యకాలంలో దేశంలో సగటు వృద్ధిరేటు 6.6 శాతంగా ఉంటే ఉపాధి కల్పన రేటు మాత్రం కేవలం రెండు శాతం గానే ఉంది. అంటే ఇప్పటికీ భారతదేశంలో ఉపాధి రహిత వృద్ధి కొనసాగు తోందని గీతా గోపీనాథ్ కూడా భావిస్తున్నారని చెప్పాలి. సులభతర వ్యాపారం ద్వారా దిగుమతి సుంకాలను తగ్గించి మరింత ప్రైవేటు పెట్టబడులను ఆకర్షించటం ద్వారా ఉద్యోగాల సృష్టి జరగటానికి అవకాశం ఉంటుందని గీతా గోపీనాథ్ సూచిస్తున్నారు.2024– 25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతం నుండి 7 శాతం వరకు ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే భావిస్తోంది. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా భారత్ వార్షిక వృద్ధి రేటు 6.3 శాతంగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. కానీ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ఐఈ) రిపోర్ట్ ప్రకారంగా 2014లో 5.4 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు 2024 మొదటి త్రైమాసికానికి 9.2 శాతానికి పెరగటం, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా 15 ఏళ్లు పైబడిన వయసుగల వారిలో నిరుద్యోగిత రేటు 17 శాతంగా ఉండటం కూడా ఆందోళన కలిగించే అంశం.ఆర్థిక మందగమనం వలన ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ విధానాల వలన ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో జాప్యం వలన నిరుద్యోగ సమస్య తీవ్రత దేశంలో పెరుగుతుందని చెప్పాలి. 3,942 అమెరికన్ డాలర్ల జీడీపీగా ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్... గీతా గోపీనాథ్ చెప్తున్నట్లు 2027 నాటికి జర్మనీ, జపాన్‌లను కూడా అధిగమించి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగవచ్చు. కానీ ఆ ఎదుగుదల ఉపాధి ఉద్యోగాలను సృష్టించేదిగా ఉంటే యువ భారత్‌కి ఉపయోగకరంగా ఉంటుంది. – డాక్టర్ తిరునహరి శేషు, అసిస్టెంట్ ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం, 98854 65877 -
ఎకానమీకి అమెజాన్ చేసిందేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం కొనసాగించడానికే అమెజాన్ తాజా పెట్టుబడులు చేస్తుందని, ఇందులో సంబరపడాల్సిందేమీ లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెజాన్ తన పెట్టుబడులతో భారత్‌లోని సేవల రంగానికి, ఆర్థిక వ్యవస్థకు చేసిందేమీ లేదన్నారు. పనిలో పనిగా ఈ–కామర్స్ పరిశ్రమ లక్షలాది రిటైలర్ల ఉపాధిని దెబ్బతీస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అమెజాన్ చేసిన ప్రకటన పట్ల సంతోషించాల్సిందేమీ లేదన్నారు. భారత వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికే తాజా పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కొల్లగొట్టే ధరల విధానాన్ని ఈ నష్టాలు సూచిస్తున్నాయంటూ.. ఇది భారత్‌కు ఎంత మాత్రం మేలు చేయబోదని, చిన్న వర్తకులను దెబ్బతీస్తుందన్నారు. ‘ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సంక్షేమంపై ఈ–కామర్స్ రంగం చూపించే నికర ప్రభావం’ పేరుతో ఓ నివేదికను మంత్రి బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దేశంలో చిన్న రిటైలర్ల ఉపాధిని దెబ్బతీసే ఈ–కామర్స్ కంపెనీల వ్యాపార నమూనాను మంత్రి ప్రశ్నించారు.ఈ–రిటైలర్లతో 1.58 కోట్ల ఉద్యోగాలు ఆన్లైన్ వర్తకులు దేశంలో 1.58 కోట్ల మందికి ఉపాధి కల్పించినట్టు మంత్రి గోయల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో 35 లక్షల మంది మహిళలు ఉన్నట్టు, 17.6 లక్షల రిటైల్ సంస్థలు ఈ –కామర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదికను పహలే ఇండియా ఫౌండేషన్ (పీఐఎఫ్) విడుదల చేసింది. భారత్‌లో ఉపాధి కల్పన పరంగా, కస్టమర్ల సంక్షేమం పరంగా (మెరుగైన అనుభవం) ఈ–కామర్స్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ–కామర్స్ తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. టైర్–3 పట్టణాల్లోని వినియోగదారులు నెలవారీగా రూ.5,000కు పైనే ఆన్లైన్ షాపింగ్‌పై ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. ఉపాధిపై ఈ–కామర్స్ రంగం చూపిస్తున్న ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 2,062 మంది ఆన్లైన్ వర్తకులు, 2,031 ఆఫ్‌లైన్ వర్తకులు, 8,209 మంది వినియోగదారుల అభిప్రాయాలను పీఐఎఫ్ తెలుసుకుంది. -
వ్యవసాయం.. యువరైతు దూరం!
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో వ్యవసాయానికి యువరైతులు దూరమవుతున్నారు. వాతావరణ అనిశ్చిత పరిస్థితులు, తక్కువ దిగుబడులకు తోడు చిన్న భూ కమతాల సంఖ్య పెరగడంతో ఆ విస్తీర్ణంలో పండిన పంటకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోక ఈ రంగాన్నే వీడుతున్నారు. నగరీకరణకు అనుగుణంగా గ్రామాల్లోనూ జీవనోపాధి ఖర్చులు పెరగడంతో అంత మేర ఆదాయం పొందేందుకు ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మరలుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ యూనిట్, గ్లోబల్ డెవలప్మెంట్ ఇంక్యుబేటర్, ట్రాన్స్ఫార్మింగ్ రూరల్ ఇండియా సంస్థలు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. ఈ సంస్థలు ‘స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్–2024’ పేరుతో ఇటీవల నివేదికను విడుదల చేశాయి.వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లతో యువ రైతులు ఈ రంగాన్ని వీడి పట్టణాలు, నగరాల్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకొనేందుకు లేదా ఇతర రంగాలను ఎంచుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 60 శాతం మంది యువత సాగును వీడారని పేర్కొంది. చిన్న కమతాలు ఎక్కువే... : రాష్ట్రంలో సగటు భూకమతాల విస్తీర్ణం ఒక హెక్టార్ (2.47 ఎకరాలు) నుంచి 0.89 హెక్టార్ల (2.19 ఎకరాలు)కు తగ్గింది. కుటుంబాల విభజనతో భూముల పంపకంతోపాటు కొత్తగా సాగు, జీవనోపాధి కోసం సొంతంగా భూముల కొనుగోళ్లకు మొగ్గు చూపడం తదితర కారణాలతో చిన్న కమతాలు పెరిగాయి. 2.47 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం గల భూమిని సన్నకారు, 2.48 నుంచి 4.94 ఎకరాలను చిన్నకారు, 4.95 ఎకరాల నుంచి 9.88 ఎకరాలను పాక్షిక మధ్యతరహా, 9.89 నుంచి 24.77 ఎకరాలుంటే మధ్యతరహా, 24.78 ఎకరాలకన్నా పైన ఉంటే పెద్ద భూకమతంగా పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం, భద్రాద్రి జిల్లాల్లో 1.5, 1.4, 1.3 హెక్టార్ల విస్తీర్ణం సగటున ఉంటే కరీంనగర్, వరంగల్ జిల్లా, మెదక్ జిల్లాల్లో 0.75, 0.74, 0.60 హెక్టార్లుగా సగటు విస్తీర్ణం ఉంది. రాష్ట్రంలో చిన్న కమతాలతో సేద్యం ఎక్కువగా జరుగుతుందని ఇటీవల విడుదలైన తెలంగాణ సామాజిక, ఆర్థిక నివేదిక పేర్కొంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పెరికవేడు గ్రామానికి చెందిన ఇతని పేరు గారె రాజు. అతనికి వారసత్వంగా ఎకరం భూమి ఉంది. ఇది పంట సాగుకు సరిపోకపోవడంతో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, మొక్కజొన్న, పత్తి సాగు చేశాడు. ట్రాక్టర్ కూడా కొన్నాడు. 2020 నుంచి 2024 వరకు రూ. లక్షలు వెచ్చించి వ్యవసాయం చేసినా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాలేదు. దీంతో ఫొటోగ్రఫీని జీవనాధారంగా మార్చుకున్నాడు. వ్యవసాయంపై ప్రేమ ఉన్నా సాగు ఖర్చులకు తగ్గట్టు లాభాల్లేక సాగుకు దూరమైనట్లు చెప్పాడు. పెట్టుబడి ఖర్చుకు తగ్గ ఆదాయం రాక అవస్థలు » చిన్న భూకమతాలు, వాతావరణ అనిశ్చి తి, తక్కువ దిగుబడులూ కారణం » కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఉపాధి వైపు అడుగులు » స్టేట్ ఆఫ్ రూరల్ యూత్ ఎంప్లాయ్మెంట్–2024 నివేదికలో వెల్లడి » యువతకు నైపుణ్యాల పెంపుతో ఆదాయం పెంచొచ్చంటున్న నిపుణులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలివ్యవసాయానికి దూరమవుతున్న యువతకు బ్రేక్ వేయాలంటే విలువ ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలను ప్రోత్సహించాలి. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను విస్తృతంగా నెలకొల్పాలి. మొక్కజొన్నల నుంచి పేలాల తయారీ, మామిడి నుంచి గుజ్జు తీయడం, మిరపకాయ నుంచి కారం... ఇలా వివిధ పరిశ్రమలను గ్రామాల్లో నెలకొల్పాలి. అలాగే యువతకు శిక్షణ ఇచ్చి నైపుణ్యాలు పెంపొందించాలి. – ఉమారెడ్డి, ఏడీఆర్, వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రంట్రైనింగ్ కోర్సులు అందించాలి యువ రైతులకు పంటల సాగు పద్ధతులపై సరి్టఫికెట్ ట్రైనింగ్ కోర్సులు అందించాల్సిన అవసరం ఉంది. యాంత్రీకరణతో కూడిన యాజమాన్య పద్ధతులు తీసుకురావాలి. కస్టమ్ హైరింగ్ సెంటర్లను విస్తృతం చేయాలి. ఈ కేంద్రాల ద్వారా పనిముట్లను అద్దెకు ఇస్తే యువ రైతులపై ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ దిశగా ప్రభుత్వం ముందడుగు వేయాలి. అప్పుడే యువ రైతులకు మేలు జరుగుతుంది. – కె. భాస్కర్, సంచాలకుడు, జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం, మహబూబాబాద్ జిల్లా -
దేశంకాని దేశంలో.. తమది కాని యుద్ధంలో... సమిధలుగా మనోళ్లు
భవిష్యత్తు మీద బంగారు కలలతో ఆశలకు రెక్కలు కట్టుకొని ఆకాశంలోకి ఎగిరారు. ఉపాధి దొరికితే కొత్త ఉషోదయాలు చూస్తామనుకున్నారు. కానీం చివరకు తమది కాని యుద్ధంలో నిస్సహాయంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున తలపడుతున్న భారత యువకుల విషాదమిది. ఎందుకిలా జరుగుతోంది? తమది కాని దేశంలో, తమకు సంబంధమే లేని యుద్ధంలో వారు ఎందుకిలా బలవుతున్నట్టు...? అతని పేరు రవి మౌన్. హరియాణాకు చెందిన 22 ఏళ్ల యువకుడు. రష్యాలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ చెప్పాడు. నమ్మిన కుటుంబం భూమి తెగనమ్మి మరీ ఏజెంట్‌కు రూ.11.5 లక్షలు ముట్టజెప్పింది. తీరా జనవరి 13న రష్యాకు వెళ్లాక ఏజెంట్ మోసగించినట్టు అర్థమైంది. ఇప్పుడతని ముందు రెండే ఆప్షన్లు. పదేళ్ల జైలు. లేదంటే ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున పోరాటం. పదేళ్ల జైలు కంటే తనకిష్టం లేకున్నా యుద్ధ క్షేత్రాన్ని ఎంచుకున్నాడు రవి. ఈ విషయం కుటుంబానికి తెలియనివ్వలేదు. రష్యా సైనిక దుస్తుల్లో ఉన్న భారత యువకుల వీడియోలో అతన్ని చూశాకే వారికి తెలిసింది. చివరగా మార్చిలో కుటుంబంతో మాట్లాడాడు. అప్పటినుంచి వారికతని సమాచారమే లేదు. యుద్ధంలో మరణించిన వారి మృతదేహాలను పూడ్చేందుకు రాత్రంతా గోతులు, కందకాలు తవ్వడమే పని! నాలుగు నెలల తర్వాత యుద్ధభూమిలో ప్రాణాలొదిలాడు. రవి సోదరునితో పాటు రష్యాలోని భారత రాయబార కార్యాలయం కూడా సోమవారం దీన్ని ధ్రువీకరించింది. డ్రైవర్ ఉద్యోగం ఆశ చూపి యుద్ధానికి ఎలా బలి పెడతారన్న రవి కుటుంబం ప్రశ్నకు బదులిచ్చేదెవరు...? భారీ వేతనాలు ఎర చూపి... ఇది ఒక్క రవి కథే కాదు. ఎంతోమంది భారత యువకులకు భారీ వేతనంతో ఉద్యోగాలంటూ ఊరించి రష్యాకు తీసుకెళ్తున్నారు. చివరికిలా బలవంతంగా యుద్ధాన్ని నెత్తిన రుద్దుతున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్య చాలామంది భారతీయులు ఇలా రష్యా సైన్యంలో చేరారు. వారిక్కూడా అక్కడికి వెళ్లేదాకా ఆ సంగతి తెలియదు! 2023 డిసెంబర్లో హర్‡్ష కుమార్ అనే యువకున్ని బెలారస్కని చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ మధ్యలోనే వదిలేశాడు. రష్యా సైన్యానికి చిక్కడంతో యుద్ధంలో పాల్గొనాల్సి వచి్చంది. అమృత్‌సర్‌కు చెందిన తేజ్‌పాల్‌సింగ్ పరిస్థితీ అంతే. ఏజెంటుకు రూ.2 లక్షలు చెల్లించి మరీ ఉద్యోగం కోసం రష్యా వెళ్లి చివరకు సైన్యంలో తేలాడు. చివరగా మార్చి 3న కుటుంబంతో మాట్లాడారు. జూన్‌లో మరణించాడు. పశి్చమ బెంగాల్‌లోని కాలింపాంగ్‌కు చెందిన ఉర్గెన్ తమాంగ్ క్రిమియా యుద్ధ ప్రాంతం నుంచి మార్చిలో వీడియో పంపాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం, మంచి జీతం పేరిట ఏజెంట్ మోసగించాడని వాపోయాడు. 10 రోజులు నామమాత్ర ఆయుధ శిక్షణ ఇచ్చి బలవంతంగా వార్ జోన్లోకి నెట్టారని వెల్లడించాడు. తన యూనిట్‌లోని 15 మంది రష్యనేతర సైనికుల్లో 13 మంది ఎలా దుర్మరణం పాలయ్యారో వివరంగా చెప్పుకొచ్చాడు. ఏపీ నుంచి కూడా పలువురు యువకులు ఈ వలలో చిక్కి ఉక్రెయిన్ యుద్ధక్షేత్రానికి చేరినట్టు చెబుతున్నారు. నేరం నిరుద్యోగానిదే... సంపాదనకు విదేశీ బాట, ప్రవాస భారతీయుని హోదా మన సమాజంలో గౌరవ చిహ్నాలు. గ్రామీణ నిరుద్యోగిత మరీ ఎక్కువ ఉన్న పంజాబ్, హరియాణా యువత కెనడా, యూరప్ దేశాలకు విపరీతంగా వెళ్తుంటారు. కానీ ఆ దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేశాయి. రష్యన్ స్టాంప్ ఐరోపా దేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం చేస్తుందనే ఆశతో పంజాబ్, హరియాణా యువకులు రష్యా బాట పడుతున్నారు. తీరా వెళ్లాక ఏజెంట్ల చేతిలో మోసపోయి యుద్ధంలో తేలుతున్నారు. రష్యా సైన్యంలో మనోళ్లు 40 మంది దాకా ఉన్నట్టు విదేశాంగ శాఖ గణాంకాలు చెబుతున్నా వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. 8 మంది భారతీయుల మృతి: కేంద్రం విదేశీ యువతను రష్యా ఇలా ఉక్రెయిన్ యుద్ధానికి బలి పెడుతున్న నేపథ్యంలో తమ పౌరులు ఆ దేశాలకు వెళ్లకుండా పలు దేశాలు గట్టి చర్యలు తీసుకుంటున్నాయి. నేపాల్ వంటి చిన్న దేశాలు కూడా ఈ విషయంలో నిబంధనలను కఠినతరం చేశాయి. మన దేశంలో అలాంటి చర్యల ఊసే లేదు! కనీసం మోసగిస్తున్న ఏజెంట్లపైనా చర్యల్లేవు. సరికదాం, రష్యాలో ఉపాధి కోసం వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలనే ప్రకటనలతో కేంద్రం సరిపెడుతోంది! మన యువకులు ఉక్రెయిన్ యుద్ధంలో బలవుతున్న వైనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి రష్యా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రత్యేకంగా చర్చించినా లాభం లేకపోయింది. మనోళ్లను స్వదేశానికి పంపేందుకు రష్యా అధికారులు ససేమిరా అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధంలో 8 మంది భారతీయులు రష్యా తరఫున పోరాడుతూ మరణించినట్టు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తాజాగా గత గురువారం రాజ్యసభలో వెల్లడించారు. ‘‘12 మంది భారతీయులు ఇప్పటికే రష్యా సైన్యాన్ని వీడినట్టు సమాచారముంది. మరో 63 మంది కూడా సైన్యం నుంచి త్వరగా విడుదల చేయాలని రష్యా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు’’ అని వెల్లడించారు. రష్యా సైన్యం తరఫున యుద్ధక్షేత్రంలో పోరాడుతున్న భారతీయులను వెనక్కు పంపేలా ఆ దేశంతో అత్యున్నత స్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పారు.ఇలా మోసగిస్తున్నారు... నిరుపేద యువతను వారికే తెలియకుండా రష్యా సైన్యంలోకి పంపేందుకు ఏజెంట్లు ప్రధానంగా లక్షల్లో జీతం, మెరుగైన జీవితాన్ని ఎరగా చూపుతున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో సీబీఐ చేసిన దాడుల్లో భారీ మానవ అక్రమ రవాణా రాకెట్ వెలుగు చూసింది. దాని సభ్యులను విచారించగా ఈ వివరాలు బయటికొచ్చాయి. → ఈ ‘రష్యాలో ఉపాధి’ ప్రచారానికి వారు ప్రధానంగా సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. → ఒకసారి బాధితులు తమ వల్లో పడగానే స్థానిక ఏజెంట్లు రంగంలోకి దిగుతారు. రంగుల కల చూపి ఒప్పిస్తారు.→ పలు సందర్భాల్లో ఉన్నత విద్యను కూడా ఎర వేస్తున్నారు. → రష్యాలో దిగీ దిగగానే స్థానిక ఏజెంట్లు వాళ్ల పాస్‌పోర్టులు లాగేసుకుంటారు. → ఆనక బలవంతంగా రష్యా సైన్యంలో చేరక తప్పని పరిస్థితులు కల్పిస్తారు. ఇతని పేరు సయ్యద్ ఇలియాస్ హుసేనీ. కర్నాటకలోని కలబురిగి వాసి. వెనక ఉన్నది అతని మిత్రులు అబ్దుల్ నయీం, మహ్మద్ సమీర్ అహ్మద్. వీళ్లు, తెలంగాణలోని నారాయణపేటకు చెందిన మొహమ్మద్ సూఫియాన్ దుబాయ్ విమానాశ్రయంలో పని చేసేవారు. రష్యాలో సెక్యూరిటీ గార్డులు కావాలంటూ యూట్యూబ్‌లో ప్రకటనలు చూశారు. నెలకు లక్షకు పైగా జీతం వస్తుందన్న ఏజెంట్ మాటలు నమ్మి నలుగురూ గత డిసెంబర్లో రష్యా వెళ్లారు. వారిని బలవంతంగా సైన్యంలో చేర్చుకుని ఉక్రెయిన్ సరిహద్దులకు పంపారు. అక్కడి నుంచి ఇలియాస్ తమ దుస్థితిని ఇలా గోప్యంగా వీడియో తీసి పంపాడు. ఇలియాస్ తండ్రి నవాజ్ అలీ హెడ్ కానిస్టేబుల్. తన కొడుకును, అతని స్నేహితులను ఎలాగైనా సురక్షితంగా తీసుకు రావాలంటూ అప్పటినుంచీ అతను ఎక్కని గడప లేదు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
జగనన్న మహిళా మార్టులకు జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని మహిళలకు ఉపాధి చూపడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసి న సంస్కరణలకు మరోసారి జాతీయ స్తాయి గుర్తింపు లభించింది. ‘దీన్ దయాళ్ అంత్యోదయ యోజ న–జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్’ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకుగా ను పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)ను అ వార్డులు వరించాయి. 2023–24 సంవత్సరానికి గా ను సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ (స్పార్క్) అవార్డు, పెర్ఫార్మెన్స్ రికగ్నేషన్ ఫర్ యాక్సెస్ టు ఫైనాన్సియల్ ఇంక్లూజన్ అండ్ స్ట్రీట్ వెండోర్స్ ఎంపవర్మెంట్ (ప్రయిస్) పురస్కారం వచ్చాయి.ఈ అవార్డులు మెప్మాకు రావడం వరుసగా ఇది నాలుగోసారి కావడం విశేషం. గురువారం న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సహాయమంత్రి తోఖాన్ సాహు చేతుల మీదుగా మెప్మా మిషన్ డైరెక్టర్ వి.విజయలక్ష్మి అవార్డులను అందుకున్నారు. స్టేట్ మిషన్ మేనేజర్లు ఆది నారాయణ, రంగాచార్యులు, ఎన్ఎన్ఆర్ శ్రీనివాస్, ప్రభావతి పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం కృషితో..సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందించే నగదుతో మహిళలను స్వయం ఉపాధి వైపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రోత్సహించింది. మెప్మా ఆధ్వర్యంలో పట్టణ ప్రాంత మహిళలను ప్రోత్సహించి 2 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ సభ్యుల భాగస్వామ్యంతో జగనన్న మహిళా మార్టులను 15 మునిసిపాలిటీల్లో ఏర్పాటు చేసింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలే పెట్టుబడిదారులు, ఉద్యోగులు, నిర్వాహకులు, వాటాదార్లుగా ఉన్న ఈ మార్టులు దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది లాభాలను ఆర్జిస్తున్నాయి. మార్టులు ఏర్పాటు చేసిన అతితక్కువ కాలంలోనే రూ.60 కోట్లకు పైగా వ్యాపారం చేయడం గమనా ర్హం. వీటి నిర్వహణ పనితీరును పరిశీలించిన కేంద్రం స్పార్క్ అవార్డు ప్రదానం చేసింది. ఆర్థిక చేయూత, సాధికారత సాధించడంలో మెప్మా విభాగం అత్యుత్తమ పనితీరు కనబర్చింది. వీధి వ్యాపారులకు సరైన సమయంలో ఆర్థిక సాయం అందించడంతో పాటు వారు సరైన మార్గంలో వ్యాపారాలు చేసేలా ప్రోత్సహించినందుకుగాను ప్రయిస్ అవార్డును ప్రదానం చేశారు. -
‘100 శాతం ఉద్యోగాలు కన్నడిగులకే’.. పోస్టు డిలీట్ చేసిన సీఎం
ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్ తప్పనిసారి చేస్తూ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కొత్త బిల్లును ఆమోదించింది. అయితే కేబినెట్ ఆమోదించిన ఈ బిల్లుపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ఆయన ట్వీట్ ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పరిశ్రమల్లోని గ్రూప్ సీ, డీ గ్రేడ్ ఉద్యోగాల్లో వంద శాతం కన్నడిగుల నియామకాన్ని తప్పనిసరి చేస్తూ రూపొందించిన బిల్లును రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించిందని సీఎం పేర్కొన్నారు.కన్నడిగులు తమ రాష్ట్రంలో సంతోషంగా జీవించేందుకు అవకాశం కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ఉద్ధేశ్యమని సీఎం పేర్కొన్నారు. సొంత రాష్ట్రంలో ఉద్యోగానికి వారు దూరం కాకూడదని తెలిపారు. కన్నడిగుల సంక్షేమమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు. అయితే పోస్టుపై అనేక విమర్శలు వెల్లువెత్తడంతో.. తరువాత ఆయన దానిని డిలీట్ చేశారు. అనంతరం మళ్లీ సరిచేసి ట్వీట్ చేశారు.ರಾಜ್ಯದ ಖಾಸಗಿ ಕೈಗಾರಿಕೆಗಳು ಹಾಗೂ ಇತರೆ ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿ ಕನ್ನಡಿಗರಿಗೆ ಆಡಳಿತಾತ್ಮಕ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.50 ಹಾಗೂ ಆಡಳಿತಾತ್ಮಕವಲ್ಲದ ಹುದ್ದೆಗಳಿಗೆ ಶೇ.75 ಮೀಸಲಾತಿ ನಿಗದಿಪಡಿಸುವ ವಿಧೇಯಕಕ್ಕೆ ಸೋಮವಾರ ನಡೆದ ಸಚಿವ ಸಂಪುಟ ಸಭೆಯು ಒಪ್ಪಿಗೆ ನೀಡಿದೆ.ಕನ್ನಡಿಗರು ಕನ್ನಡದ ನೆಲದಲ್ಲಿ ಉದ್ಯೋಗ ವಂಚಿತರಾಗುವುದನ್ನು ತಪ್ಪಿಸಿ, ತಾಯ್ನಾಡಿನಲ್ಲಿ… pic.twitter.com/Rz6a0vNCBz— Siddaramaiah (@siddaramaiah) July 17, 2024 తాజాగా దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీల్లోని నాన్ మెనేజ్మెంట్ ఉద్యోగాల్లో స్థానికులకు (కన్నడిగులకు) 70 శాతం.. మేనేజ్మెంట్ ఉద్యోగాల్లో 50 శాతం స్థానికులకు రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ పేర్కొన్నారు. అయితే బిల్లులో గ్రూప్ సీ, డీ పోస్టుల్లో మొత్తం 100 శాతం స్థానికులకే కేటాయిస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు.అదే విధంగా ఉద్యోగానికి అర్హతలు, నైపుణ్యం ఉన్న స్థానికులు లేకపోతే.. కంపెనీలు.. ఇతర రాష్ట్రాల వారిని నియమించుకోవచ్చిని పేర్కొన్నారు. ‘ఉద్యోగానికి తగిన నైపుణ్యాలు కలిగిన కన్నడిగులలో లేకపోతే వాటిని అవుట్సోర్సింగ్ ఇవ్వవచ్చు. నైపుణ్యం కలిగిన కార్మికులలను వెలికి తీసీ..స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చే చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో ప్రతిభకు కొదవలేదని మంత్రి వెల్లడించారు. "కర్ణాటకలో తగినంత నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్ ఉందని.. చాలా ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయన్నారు. కన్నడిగులకు 70 శాతం పని ఇవ్వాలని తాము కంపెనీలను అడుగుతున్నామని ఒకవేళ ఇక్కడ తగిన ప్రతిభ లేకపోతే బయట నుంచి తీసుకోవచ్చని అన్నారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు తప్పుబడుతున్నారు. ఈ బిల్లు వల్ల అనేకమంది ప్రతిభ, నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉండకపోవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు. కర్ణాటకలో ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలు, కర్మాగారాల్లో ఇక ఇతర రాష్ట్రాలవారికి ఉద్యోగాలు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.ఈ బిల్లు వివక్షాపూరితమైనది, తిరోగమనపూరితమైనది, ఫాసిస్ట్ బిల్లు అంటూ మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ఛైర్మన్ మోహన్‌దాస్ పాయ్ ఎక్స్‌లో అన్నారు. మరోవైపు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్-షా ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తూనే.. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం మంచిదే అని, కానీ నైపుణ్యం ఉన్న వారిని ఇతరులను ప్రమాదం ఉందని హెచ్చరించారు.ఎవరు స్థానికులు?కర్ణాటకలో జన్మించినవారు.. 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలోనే నివసిస్తున్నవారు.. కన్నడ భాషలో మాట్లాడే, చదివే, రాసే నైపుణ్యం ఉండి.. రాష్ట్ర నోడల్ ఏజెన్సీ నిర్వహించే అర్హత పరీక్షలో నెగ్గినవారిని స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. కన్నడం ఓ భాషగా ఉన్న ఎస్‌ఎ్‌ససీ సర్టిఫికెట్‌ను ఉద్యోగార్థులు కలిగి ఉండాలి. లేదంటే ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నిర్వహించే కన్నడ ప్రావీణ్య పరీక్షలో పాసవ్వాలి. అర్హతలున్న స్థానిక అభ్యర్థులు దొరక్కపోతే.. చట్ట నిబంధనల సడలింపునకు ప్రైవేటు పరిశ్రమలు, సంస్థలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. తగు విచారణ తర్వాత ప్రభుత్వం సముచిత ఉత్తర్వులు జారీచేస్తుంది. -
రైతులకు లాభాలు తేలేమా?
ఇరవై ఏళ్లలో బ్రెడ్ ధర రెండింతలు పెరిగింది, కానీ గోధుమల ధర సగానికి తగ్గింది. రైతులను మినహాయిస్తే అందరినీ సంతోషపెట్టే ఏర్పాటు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఓవైపు రైతుల ఆదాయం పడిపోతుంటే, మరోవైపు కార్పొరేట్లు మాత్రం లాభార్జన చేస్తున్నాయి. భారత దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. 45.5 శాతం మంది శ్రామిక శక్తికి ఉపాధి కల్పిస్తూ, వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చడం ఈ కాలపు అవసరం. 2024–25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాయత్తమవుతున్న తరుణంలో, వ్యవసాయాన్ని పునర్నిర్మించే రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరమో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.‘పంజాబ్ ఫార్మర్స్ అండ్ ఫార్మ్ వర్కర్స్ కమిషన్’ మాజీ చైర్పర్సన్ అజయ్ వీర్ జాఖడ్ ఇటీవల ట్వీట్ చేస్తూ, ‘ఇరవై ఏళ్ల క్రితం, స్విట్జర్లాండ్‌లో బ్రెడ్ ధర 2.5 స్విస్ ఫ్రాంకులు, గోధుమ ధర కిలోకు 110 స్విస్ ఫ్రాంకులు ఉండేది. ఇప్పుడు బ్రెడ్ ధర 4 ఫ్రాంకులు కాగా, గోధుమల ధర కిలోకు 50 ఫ్రాంకులు అయింది’ అన్నారు. కొంతకాలం క్రితం, నేను కూడా కెనడా నుండి ఒక ఉదాహరణను షేర్ చేశాను. గత 150 సంవత్సరాలుగా కెనడాలో గోధుమ ధరలు పడిపోతున్నాయి, కానీ గత నాలుగు దశాబ్దాలుగా బ్రెడ్ ధరలు పెరుగుతూ వచ్చాయి. వ్యవసాయ ఉత్పాదక ధరల తగ్గుదలకు సంబంధించి ఈ ఆందోళనకరమైన ధోరణి స్విట్జర్లాండ్, కెనడాకు మాత్రమే కాదు, కాస్త ఎక్కువ లేదా తక్కువగా ప్రపంచమంతటా ఇలాగే ఉంటోంది. ఒక శతాబ్దానికి పైగా, వ్యవసాయ ధరలు బాగా పడిపోతున్నాయి. ఇది రైతులను ఆత్మహత్యలకు లేదా వ్యవసాయాన్ని వదిలేసేలా పురిగొల్పుతోంది. ఇది ఆహార అసమానత్వమే.స్థోమత లేని పోషకులుఆహారాన్ని ఉత్పత్తి చేసేవారు నిరంతరం పేదరికంలో జీవిస్తున్నారు. తరచుగా, వ్యవసాయ ధరలు తక్కువగా ఉండటమే కాకుండా ఉత్పత్తి ఖర్చు కూడా రైతులకు దక్కడం లేదు. విషాదమేమిటంటే, మన పళ్లేల దగ్గరికి ఆహారం తెచ్చేవారికి తమను తాము పోషించుకునే స్థోమత ఉండటం లేదు. తమను ‘అన్నదాత’లు అని పిలిచినప్పుడు రైతులు సులభంగా ఉప్పొంగిపోతారు; వ్యవసాయ సరఫరా గొలుసులోని ఇతర వాటాదారులు మాత్రం లాభాల్లో మునిగితేలుతారు. రైతులు కష్టాల్లో కూరుకుపోతూ, గ్రామీణ వేతనాలు స్తబ్ధుగా ఉంటున్నప్పడు కూడా విచ్ఛిన్నమైన ఆహార వ్యవస్థ వినియోగదారులను మాత్రం సంతోషంగా ఉంచింది. ఆహార ధరలను ఉద్దేశపూర్వకంగా తక్కువగా ఉంచడం, ఏటికేడూ వాటి ధరలను ఇంకా తగ్గించి వేయటం... అదే సమయంలో అధిక లాభాలను పొందడం (దీనిని విక్రేత లాభమని ఇప్పుడు పిలుస్తున్నారు) అనేది వ్యవసాయ వ్యాపార సంస్థలను సంతోషంలో ముంచెత్తుతోంది. పెరుగుతున్న వేతనాలు, ధరల వల్ల సరఫరా వ్యవస్థకు అడ్డంకులు పెరుగుతాయని కార్పొరేట్లు నిందించినప్పటికీ, అమెరికాలో ఉదాహరణకు, 2023 సంవత్సరం రెండవ, మూడవ త్రైమాసికాల్లో, కార్పొరేట్ లాభాలు ద్రవ్యోల్బణంలో 53 శాతానికి ఆజ్యం పోశాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంకా, కోవిడ్ మహమ్మారి తర్వాత కార్పొరేట్ లాభాలు మరింతగా పెరిగాయి. 2023 చివరి త్రైమాసికం నాటికి ఇది రికార్డు స్థాయికి చేరుకుంది. మహమ్మారికి ముందు నాలుగు దశాబ్దాలలో, ద్రవ్యోల్బణానికి కార్పొరేట్ లాభాల సహకారం కేవలం 11 శాతం మాత్రమే.ఒకటిన్నర శతాబ్దానికి పైగా, మన ఆర్థిక విధానాల రూపకల్పన రైతులకు సరైన ధరలను నిరాకరించింది. వ్యవసాయ రంగంలో ముదిరిపోతున్న సంక్షోభం పట్ల విధాన నిర్ణేతలు కళ్ళుమూసుకోవడంతో, గ్రామీణ ప్రాంత ఆగ్రహం ఎన్నికల సీజన్ లో మాత్రమే నొక్కి చెప్పబడుతోంది. ‘భారత ప్రభుత్వం రైతులకు రాయితీలు ఇస్తున్నట్లు ప్రకటిస్తుంటుంది, కానీ వాస్తవానికి వారినే బాధపెడుతుంది’ (ది ఎకనామిస్ట్, 2018 జూలై 12) అనే కథనం ఆసక్తికరమైన అంతర్దృష్టిని అందిస్తుంది.ధనిక వాణిజ్య కూటమి అయిన ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) దేశాలు ఉత్పత్తిదారులకు వ్యవసాయ ఆదాయంలో 18 శాతానికి సమానమైన మొత్తాన్ని అందజేస్తుండగా, భారతదేశం వాస్తవానికి వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించడంతో సరిపెట్టింది.సాయం చేయని సాంకేతికత2024–25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సమాయత్తమవుతున్న తరుణంలో, రైతులలో పెరుగుతున్న ఆగ్రహాన్ని చల్లార్చడమే కాకుండా వ్యవసాయాన్ని పునర్నిర్మించే రోడ్‌మ్యాప్‌ను రూపొందించేందుకు ఎలాంటి ఆర్థిక విధానాలు అవసరమో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా, ఆర్థికవేత్త జీన్ డ్రేజ్ పేర్కొన్న ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ‘‘భారతదేశంలో రాజకీయ చర్చలు సాధారణంగా ప్రత్యేకాధికారులు, శక్తిమంతులు నిర్దేశించిన కొన్ని సరిహద్దుల్లోనే జరుగుతాయి. మీరు ఈ సరిహద్దులను అధిగమించినట్లయితే, ఇబ్బందిని ఎదుర్కొంటారు’’. వ్యవసాయానికి ‘అవుటాఫ్ ద బాక్స్ థింకింగ్’ అవసరం. అయితే అది పాలించే ఉన్నత వర్గాన్ని చాలావరకు కలవరపెట్టవచ్చు.ఈ అన్ని సంవత్సరాలలో, సాంకేతిక జోక్యాలకు మరింత బడ్జెట్ మద్దతును అందివ్వడమే వ్యవసాయ ఆదాయాలను పెంచడానికి ప్రధాన మార్గంగా ఉంటూ వచ్చింది. డిజిటలీకరణ, కృత్రిమ మేధ, రోబోటిక్స్, కచ్చితమైన వ్యవసాయం వైపు అడుగులు వేస్తూ, తద్వారా వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ ఒడిలోకి తీసుకువస్తున్నప్పటికీ, వ్యవసాయం చుట్టూ ఉన్న పరిశ్రమకు ఇటువంటి బడ్జెట్ మద్దతుతో అపారమైన ప్రయోజనం ఉంది. అదే సమయంలో రైతులు మరింత దుఃస్థితిలోకి కూరుకుపోవడం కొనసాగుతోంది. హరిత విప్లవం సాగిన 60 ఏళ్ల తర్వాత కూడా వ్యవసాయ ఆదాయాలు పిరమిడ్‌లో అట్టడుగునే కొనసాగితే, వ్యవసాయ విప్లవం 4.0 వైపు సాంకేతిక పరివర్తనను చేపడతామని చేస్తున్న వాగ్దానాన్ని, వ్యవసాయాన్ని పట్టి పీడిస్తున్న అన్ని రుగ్మతలకు దివ్యౌషధంగా చూడలేము. ఎప్పటిలాగే, విధాన నిర్ణేతలు మరోసారి వ్యవసాయ కష్టాలకు నిజమైన కారణాన్ని (వ్యవసాయ ఆదాయాలు పడిపోవడం), సాంకేతిక జోక్యాలు ఆదాయాన్ని పెంచుతాయనే లోపభూయిష్ట ఆలోచనతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నారు.‘ప్రపంచం వేడెక్కిపోతున్న’ స్థితిలో, పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతుల నుండి స్థితిస్థాపక వ్యవసాయం వస్తుంది. కృత్రిమ మేధస్సు కంటే ముందుగా అందుబాటులో ఉన్న సహజ మేధస్సును ఉపయోగించుకోవడం అవసరం. వ్యవసాయ సామర్థ్యాన్ని పెంపొందించడంలో, వ్యవసాయంలో నిమగ్నమైన మానవ జనాభా సామర్థ్యాన్ని పెంచడానికి మొదటగా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. దేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయమే. 45.5 శాతం మంది శ్రామికశక్తికి ఉపాధి కల్పిస్తూ, వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చడం ఈ కాలపు అవసరం. వ్యవసాయ ఆదాయాన్ని పెంచడంలో తోడ్పడే పరిశ్రమకు సహాయం చేయాలనే సాంప్రదాయిక ఆలోచన (ట్రికిల్–డౌన్ సూత్రానికి అనుగుణంగా) ఇప్పుడు పని చేసే అవకాశం లేదు.ఆహార అసమానతలను తొలగించడానికి, తాజా ఆలోచనలు అవసరం. ముందుగా, ఎంఎస్ స్వామినాథన్ సూత్రం ప్రకారం వ్యవసాయ ధరలకు హామీ ఇవ్వడానికి చట్టపరమైన యంత్రాంగాన్ని అందించాలి; రెండవది, బడ్జెట్లో 50 శాతాన్ని జనాభాలో దాదాపు సగం మందికి కేటాయించేలా ఆర్థిక మంత్రి చూడాలి. దీనికోసం, వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతి సంవత్సరం మొత్తం బడ్జెట్లో 10 శాతం పెంచడం ప్రారంభించాలి. ప్రస్తుతం ఇది 3 శాతం కంటే తక్కువగా ఉంది.- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com- దేవీందర్ శర్మ -
Sahithi chiluveru: టెకీ ఉద్యోగం నుంచి టేస్టీ ఫుడ్ బిజినెస్ వరకు
ఒక అందమైన ఆలోచనను సక్రమంగా అమలులో పెడితే పల్లెటూరు నుంచి కూడా విదేశాలకు విస్తరించవచ్చు అని నిరూపిస్తుంది చిలువేరు సాహితి. చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలేసి పాకశాస్త్ర ప్రావీణ్యంతో ఉపాధిని సృష్టిస్తోంది. 26 ఏళ్ల వయసులో తనతోపాటు మరో ఇరవై మంది మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలో వ్యవసాయాధారిత జీవనాల మధ్య వెలుగుతున్న సాహితిని పలకరిస్తే విజయావకాశాన్ని వంటలతో అందిపుచ్చుకుంటున్నానని వివరిస్తుంది.‘‘నాకు రుచికరమైన ఆహారం అంటే చాలా ఇష్టం. అయితే ఆ ఇష్టం నాకో ఉపాధిని కల్పిస్తుంది అని మాత్రం ఊహించలేదు. బీటెక్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ టీసీఎస్ కంపెనీలో నాలుగేళ్లు ఉద్యోగం చేశాను. కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ రావడంతో ఊరు వచ్చేశాను. ఆ టైమ్‌లో మా అమ్మ కన్యాకుమారి చేసే వంటలను ఆస్వాదిస్తూ ఉండేదాన్ని. ఖాళీ సమయంలో సరదాగా తీసుకున్న వంటల ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ పేజీ క్రియేట్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఆ పోస్టులకు లైకులు వెల్లువెత్తుతుండేవి. ఒకటి నుంచి మొదలు.. ఓరోజున ఉన్నట్టుండి ఒక ఫాలోవర్ నుంచి ‘మాకు స్వీట్స్ చేసి పంపుతారా’ అంటూ ఒక పోస్ట్ వచ్చింది. కాదనటమెందుకులే, ఒకసారి ప్రయత్నం చేసి చూద్దాం అని... ఆ ఆర్డర్ పూర్తిచేసి, కొరియర్ ద్వారా పంపించాం. ఆ తర్వాత మరో రెండు ఆర్డర్లు వచ్చాయి. అలా నెలకు ఒకటి రెండు ఆర్డర్లు రావడం మొదలయింది. క్రమంగా ఆర్డర్లు పెరిగాయి. నా వంటలకు మంచి డిమాండ్ ఉందని అర్థమైంది. దానినే ఉపాధిగా ఎందుకు చేసుకోకూడదూ అని... చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, ఫుడ్ తయారీనే వ్యాపారంగా ఎంచుకున్నాను. ముందు మా ఇంటివరకే పనులు ఉండేవి. తర్వాత పనులు పెరగడంతో ఊళ్లోనే ఉన్న మా చుట్టుపక్కల మహిళలను ఫుడ్ తయారీకి నియమించుకున్నాం. స్నాక్స్, ఊరగాయలు, స్వీట్లు, మసాలా పొడులతో పాటు మిల్లెట్ ఉత్పత్తులు, ఇన్స్టంట్ మిక్స్‌లు తయారు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు నెలకు 30 నుంచి 40 ఆర్డర్లు వస్తున్నాయి.మరో 20 మందికి...పదిహేనేళ్లుగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఒక ఉద్యోగికి వచ్చే ప్యాకేజీని ఇప్పుడు నా వ్యాపారం ద్వారా పొందుతున్నాను. నాతోపాటు మరో 20 మంది మహిళలకు ఉపాధి కల్పించే స్థితికి చేరుకున్నాను. వీరిలో పదిమంది తమ ఇళ్ల నుంచే పచ్చళ్లు, పొడులు, ఇతర పిండి వంటలు తయారు చేసి వాటిని అందంగా ΄్యాక్ చేసి ఇస్తారు. మా ఇంటి మొదటి అంతస్తులోని రెండు గదులను నా కంపెనీ ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’కి కేటాయించుకున్నాను. పదిహేను రకాల పచ్చళ్లు, 40 రకాల పిండి వంటలు, ఇన్స్టంట్ ఫుడ్ మిక్సర్లు, మసాల పొడులు.. దాదాపు 70 ర కాల వంటకాలు తయారు చేస్తుంటాం. మన దేశంలోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ.. దేశాలలో ఉండే మన తెలుగువారికి కొరియర్ ద్వారా పచ్చళ్లు, పొడులు పంపిస్తున్నాను.ఎక్కడా ప్లాన్ లేదు.. ఏ మాత్రం ప్లాన్ లేకుండా నా వ్యాపారం వృద్ధి చెందుతూ వస్తోంది. ఇంట్లో పెట్టిన ఆవకాయతో ఆరంభమైన ఈ బిజినెస్‌లో వచ్చిన ఆర్డర్ల ప్రకారం పెట్టుబడి పెడుతూ, ఆదాయాన్ని పొందుతున్నాను. ఫుడ్ బిజినెస్ కాబట్టి ఏడాది క్రితం లైసెన్స్ కూడా తీసుకున్నాను. మా ఊరికి మరింత పేరుతెచ్చేలా ‘ఫ్లేవర్స్ ఆఫ్ తెలుగు’ బ్రాండ్ ఉత్పత్తులను విస్తరించాలనుకుంటున్నాను. కానీ, తయారీ మాత్రం మా ఊరి నుంచి, మా ఇంటి నుంచే చేస్తుంటాను.సవాళ్లను అధిగమిస్తూ.. రుచికరమైన వంటకాల తయారీలో పదార్థాలు కూడా అంతే నాణ్యమైనవి ఉండాలి. సరైన శుభ్రత పాటించాలి. ముఖ్యంగా ఆర్గానిక్ ఉత్పత్తులను సేకరించడం, వాటిని సమయానుకూలంగా తయారీలో వాడటం పెద్ద సవాల్‌గానే ఉంటోంది. అలాగే, సీజనల్‌గా ఉండే సమస్యల్లో ముఖ్యంగా వర్షాకాలం ΄్యాకింగ్లు తడవడం వంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు తిరిగి రీప్లేస్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటాను. చాలా మందితో డీల్ చేయాలి, కస్టమర్స్ అందరూ ఒకేలా ఉండరు కాబట్టి సహనంతో ఉండాలి. ఈ ప్రయాణం నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ఉపయోగపడుతుంది. ‘చిన్న అమ్మాయివే కానీ, మా ఇంట్లో బామ్మలు చేసిన వంటకాల రుచి చవి చూస్తున్నాం’ అంటూ మా వంటకాలను రుచి చూసినవారు నాకు ఫోన్ల ద్వారా, మెసేజ్‌ల ద్వారా ప్రశంసలు తెలియచేస్తుంటారు. నాణ్యత ద్వారా వారి ఆశీస్సులను, అభిమానాన్ని, మద్దతును ఎప్పటికీ అలాగే నిలబెట్టుకుంటాను అంటూ ఆనందంగా వివరిస్తుంది సాహితి.– నిర్మలారెడ్డి -
వీరి వీరి గుమ్మడి విజయానికి చూపే దారి ఇది
వ్యాపారానికి సామాజిక బాధ్యత తోడైతే ఎలా ఉంటుందో చెప్పకనే చెబుతుంది చెన్నైకి చెందిన పంప్కిన్ టేల్స్. ఆల్–ఉమెన్ టీమ్ రెస్టారెంట్‌గా ప్రత్యేకతను సాధించిన‘పంప్కిన్ టేల్స్’ అమ్మాయిలలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించే బడి. చల్లగా చూసే అమ్మ ఒడి.‘పంప్కిన్ ఉపాధి ఇవ్వడమే కాదు. ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త విషయాలు ఎన్నో నేర్చుకునేలా సహాయపడుతుంది’ అంటారు ఉద్యోగులు.ఉద్యోగం కోసం తాను ఉంటున్న డార్జిలింగ్ నుంచి గోవాకు వెళ్లాలనుకున్న అనూష మింజ్ విధివశాత్తు చెన్నైకి వచ్చింది. అక్కడి వాతావరణం ఆమెకు బాగా నచ్చింది.‘నా కొలీగ్స్‌తో ఎన్నో విషయాలు చర్చించే అవకాశం దొరికింది’ అంటుంది అనూష.‘మహిళలు కేఫ్‌లను నిర్వహించలేరు’లాంటి అపోహలకు అడ్డుకట్ట వేయడం కోసం చింది వరదరాజులు, జె.భువనేశ్వరి, ఆర్. రాజేశ్వరి అనే మహిళలు 2017లో ‘పంప్కిన్ టేల్స్’ప్రారంభించారు. రెస్టారెంట్, బేకరి, కేటరింగ్ విభాగాల్లో మంచి పేరు తెచ్చుకుంది... పంప్కిన్ టేల్స్.టేబుల్స్‌ను సెట్ చేయడం నుంచి కస్టమర్లతో ఇంటరాక్ట్ కావడం, ఆర్డర్లు తీసుకోవడం, టేక్ అవేలను రెడీ చేయడం వరకు ఎన్నో పనులు చేస్తుంది ఈ ఆల్–ఉమెన్ టీమ్.‘ఉద్యోగంలో చేరే సమయంలో రెస్టారెంట్లో పనికి సంబంధించి వారిలోప్రాథమిక జ్ఞానం ఉంటుంది. ఆ తరువాత టేబుల్ సెట్ చేయడం నుంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడం వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఆ వెంటనే వారిలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది’ అంటారు కంపెనీ డైరెక్టర్లు భువనేశ్వరీ, రాజేశ్వరి.ఉదాహరణకు ‘పంప్కిన్’ వందమందికి పైగా మహిళల కుటుంబాలకు ఉ΄ాధి కల్పిస్తోంది. రెస్టారెంట్ ప్రారంభమైనప్పుడు షిల్లాంగ్‌కు చెందిన మోనిక వెయిటర్‌గా చేరింది. ఇప్పుడు ఆమె రెస్టారెంట్‌కు సంబంధించిన సమస్త విషయాలలోప్రావీణ్యం సాధించింది.‘ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ల మీద నిలబడుతున్నందుకు గర్వంగా ఉంది. మా అమ్మాయి చెన్నైలో పనిచేస్తోంది. నెల నెలా నాకు డబ్బులు పంపిస్తుంది అని నా గురించి అమ్మ గర్వంగా చెప్పుకుంటుంది’ అంటుంది మోనిక.మోనిక ఏదో ఒకరోజు ఎక్కడో ఒకచోట సొంతంగా రెస్టారెంట్ ్ర΄ారంభించవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయం సాధించవచ్చు. స్థూలంగా చె΄్పాలంటే ‘పంప్కిన్ టేల్స్’ అనేది అనే ఉ΄ాధి కేంద్రమే కాదు, ఉజ్వల భవిష్యత్‌కు ఉపయోగపడే కేంద్రం కూడా. -
Lok Sabha Election 2024: ఎన్నికల ఉపాధి... 9 లక్షల మందికి!
లోక్‌సభ ఎన్నికలు ఎంతోమంది ఆకలి బాధ తీరుస్తున్నాయి. తాత్కాలికంగానైనా ఉపాధి కల్పిస్తున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 దాకా ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండడం తెలిసిందే. ఈ ఎన్నికల సీజన్లో దేశవ్యాప్తంగా కనీసం 9 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు లభిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా పలు రకాల అవసరాలను తీర్చే విధంగా ఉద్యోగాలుంటాయని ‘వర్క్ ఇండియా’ సీఈవో సహ వ్యవస్థాపకుడు నీలేశ్ దుంగార్వాల్ తెలిపారు. ప్రధానంగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు, బ్యాక్ ఆఫీస్, డెలివరీ, డ్రైవర్లు, కంటెంట్ రైటింగ్, సేల్స్ వంటి రూపాల్లో ఉపాధి లభిస్తోంది. ఏప్రిల్ 19న తొలి విడత దశ పోలింగ్ నాటికే 2 లక్షల తాత్కాలిక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచి్చనట్టు సీఐఈఎల్ హెచ్ఆర్ డైరెక్టర్ ఆదిత్య నారాయణన్ మిశ్రా తెలిపారు. డేటా విశ్లేషణ, ప్రణాళిక, ప్రజలతో సంబంధాలు, మార్కెట్ సర్వే, మీడియా సంబంధాలు, కంటెంట్ డిజైన్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఏఐ స్ట్రాటజీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఈ అవకాశాలు అందివచి్చనట్టు చెప్పారు. 8 నుంచి 13 వారాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రింటింగ్, రవాణా, ఫుడ్, బెవరేజెస్, క్యాటరింగ్, సెక్యూరిటీ, ఐటీ నెట్వర్క్ మేనేజ్మెంట్, అనలిటిక్స్‌లో 4 నుంచి 5 లక్షల మందిని తాత్కాలిక ప్రాతిపదికగా నియమించుకుంటున్నట్టు మిశ్రా అంచనా వేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జీడీపీలో 2 శాతం
న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం ప్రత్యక్ష ప్రభుత్వ పెట్టుబడితో 11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) తాజా నివేదిక పేర్కొంది. మొత్తం ఉపాధి సృష్టిలో దాదాపు 70 శాతం మహిళలకు ప్రయోజనం కలుగుతుందని కూడా విశ్లేíÙంచింది. భారత్ పురోగతికి తీసుకోవాల్సిన అంశాలపై ఎఫ్ఎల్ఓ ఒక రోడ్‌మ్యాప్‌ను కూడా ఆవిష్కరించింది. వీటిలో అంశాలు– లీవ్ పాలసీలు, కేర్ సరీ్వస్ సబ్సిడీలు, కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి, కేర్ వర్కర్లకు నైపుణ్య శిక్షణ, నాణ్యత హామీ కీలకమైనవని నివేదిక పేర్కొంది. -
ఉద్యోగాల భర్తీకి తొలగిన న్యాయ చిక్కులు
తెలంగాణ రాష్ట్రం ఏర్ప డినంక నిరుద్యోగుల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడినట్లు అయింది. నీళ్లు, నిధులు, నియామకాలే ఎజెండాగా సాగిన ఉద్యమంలో నిరుద్యోగులకు గత ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల అమలుపై విధానపరమైన నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం వల్ల వేలాది ఉద్యోగాలు , ఉద్యోగ ప్రకటనలకే పరిమి తమై భర్తీకి నోచుకోలేదు. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌లో 2016లోనే జీవో నెం. 40ని జారీ చేసి ఉద్యోగ నియామకాల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం క్లిష్టమైనటువంటి మహిళా రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఆదేశానుసారంగా నిర్ణయం తీసుకొని ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన మహిళా కోటాకు సంబంధించిన జీవోలను రద్దు చేస్తూ, 3, 35 నంబర్ల జీవోలను జారీ చేసి ఉద్యోగ నియామక ప్రక్రియలు కొనసాగే విధంగా మార్గాన్ని సుగుమం చేసింది. నూతన విధానంలో 100 పాయింట్ల రోస్టర్‌లో మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లను కేటాయించ కుండా ప్రతీ ఉద్యోగ ప్రకటనలో ఓసీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు కలిపి మొత్తం 33.33 శాతం పోస్టు లను కేటాయించనున్నారు. అనగా ప్రతీ కేటగి రిలో ప్రతీ నాలుగు పోస్టుల్లో ఒక్క పోస్టు మహిళ లకు సమాంతరంగా కేటాయించ బడుతుంది. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 1992 నుండి నేటి వరకు ప్రధాన కేసులైన ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా, రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర తీర్పుల్లో వర్టికల్ రిజర్వేషన్లుగాఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాలను; హారిజాంటల్ రిజ ర్వేషన్లుగా మహిళా, దివ్యాంగులు, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ కోటాలను నిర్ధారించింది. అందులో వర్టికల్/ నిలువు/ సామాజిక మరియు హారిజాంటల్/ సమాంతర/ ప్రత్యేక రిజర్వేష న్లను ఏవిధంగా అమలు చెయ్యాలో స్పష్టం చేసింది. వర్టికల్ రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 15(4), 15(5), 15(6), 16(4), 16(6) ద్వారా కల్పిస్తున్నవి. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్యర్థులు జనరల్ కేటగిరీ పోస్టులకు కూడా పోటీపడి ఎంపిక కావచ్చు. ఫలితంగా వారికి కేటాయించిన రిజర్వేషన్ శాతాన్ని మించి ఎంపిక కావచ్చు. ఆర్టికల్ 15(3)ను అనుసరించి సమాంతర రిజర్వేషన్ పద్ధతిలో మహిళలకు మొత్తం ఉద్యోగాల్లో 33.33 శాతం పోస్టులకు మాత్రమే ఎంపిక అవ్వడానికి ఆస్కారం ఉంది. మహిళలు జనరల్ కేటగిరీ పోస్టులకు ఎన్నికైనా వారిని కూడా ఈ 33.33 శాతం కిందకే తీసుకువస్తారు. అంటే మహిళలు 33.33 శాతానికి మించి ఎంపిక కాకూడదన్నమాట. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2009లో జూనియర్ సివిల్ జడ్జీల నియామకా లకు సంబంధించిన కేసు: కె. వెంకటేష్ వర్సెస్ గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్, 2020లో తెలంగాణ హైకోర్టు మాచర్ల సురేష్ వర్సెస్ స్టేట్ అఫ్ తెలంగాణ మధ్య జరిగిన కేసుల తీర్పుల్లో మహిళా రిజర్వేషన్లను సమాంతరంగా అమలు చెయ్యాలని ఆదేశించాయి. దిన పత్రికల్లో 2020 నుండి మహిళా రిజ ర్వేషన్ల సమస్యపై పతాక శీర్షికల్లో వార్తలు వచ్చి నప్పటికీ, గత తెలంగాణ ప్రభుత్వానికి విధాన పరమైన నిర్ణయం తీసుకోవడానికి సమయం లేకపోయింది. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నిర్ణయం తీసుకొని 3, 35 నంబర్ల జీవోలను జారీ చేయడం స్వాగతించ వలసిన అంశం. -కోడెపాక కుమార స్వామి , వ్యాసకర్త తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మొబైల్: 94909 59625