అవునూ.. మీ జీతమెంత? ఎందుకంటే.. ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల సగటు జీతం ఎంత అన్న దానిపై వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక నివేదిక రూపొందించింది.. దీని ప్రకారం ప్రపంచంలోని 23 దేశాల్లో సగటు జీతం లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉందట. 104 దేశాల్లో సర్వే చేయగా.. టాప్‌లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567) ఉండగా.. అట్టడుగున పాకిస్థాన్ (రూ. 11,858) ఉంది. మరి మన పరిస్థితి ఏమిటనా.. భారత్‌తో సగటు జీతం రూ.46,861. ఆయా దేశాల్లో ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు.
జీతాల సంగతి చెప్పుకున్నాం.. ఇప్పుడు అసలు జీతాలే రాని వారి గురించి చెప్పుకుందాం.. అదేనండీ నిరుద్యోగుల గురించి.. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత శాతాన్ని చూస్తే.. నైజీరియాలో ఇది ఎక్కువగా ఉంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఖతార్‌లో ఇది అత్యల్పంగా ఉంది. పలు దేశాల్లో నిరుద్యోగిత శాతం సంగతి ఓసారి చూస్తే..
చదవండి: విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్‌పై లైంగిక వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment