Switzerland
-
ఒక్కో గ్రాము ధర రూ. 53 వేల కోట్లు, అంత ‘మ్యాటర్’ ఏముంది?
ప్రపంచంలో అత్యంత ఖరీదైంది అనగానే ముందుగా మనకు గుర్తొచ్చేది ప్లాటినం, వజ్రాలు, బంగారం వగైరా గుర్తొస్తాయి. కానీ వీటన్నింటికి మించి షాకింగ్ ధర పలికే వస్తువు ఒకటి ఉంది. దాని పేరు ఎప్పుడైనా విన్నారా? అంత రేటు పలకడానికి గల కారణాలు ఏంటి? భూమిలో పుడుతుందా? లేకపోతే ల్యాబ్‌లో తయారువుతుందా? తెలుసుకుందాం.ప్రపంచంలో అత్యంత ఖరీదైన పదార్థం పేరు యాంటీమాటర్ (Antimatter) దీని ఒక్కో గ్రాము ధర వింటే నిజంగా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఏదో ఒకటీ, రెండు వేలు, కాదు, కోట్లు అంతకన్నా కాదు. ఏకంగా రూ. 53 వేల కోట్లు (62 ట్రిలియన్ డాలర్లు). ఒక్క గ్రాములో అతి తక్కువ పరిమాణంలో తయారీకి లక్షల సంవత్సరాల సమయం పడుతుంది. మిగతా ఖరీదైన పదార్థాల్లా దీనిని భూమి నుంచి తవ్వి తీయడానికి కుదరదు. దానిని సృష్టించడం, నిల్వ చేయడం అనేది అనేక సవాళ్లతో కూడుకొని ఉంటుంది. దాదాపు అసాధ్యమని చెప్పవచ్చు.. ఇది అందుబాటులోకి వస్తే అంతులేని శక్తి ఉత్పత్తికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.బంగారం, వజ్రాలు లేదా అరుదైన లోహాల మాదిరిగా కాకుండా, యాంటీమ్యాటర్‌ను భూమి నుండి తవ్వలేరు. దీనికి బదులుగా దీనిని అత్యంత నియంత్రిత వాతావరణంలో అణువు ,అణువును కలుపుతూ అత్యంత జాగ్రత్తగా తయారు చేయాలి. ఈ ప్రక్రియలో ఒక గ్రాములో కొంత భాగాన్ని సేకరించడానికి కూడా బిలియన్ల సంవత్సరాలు పట్టవచ్చు. విశ్వంలోని ఆటమ్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, సబ్ ఆటమిక్ కణాలతో కూడిన ‘మ్యాటర్’తో ఆవిర్భవించింది. ప్రతి మ్యాటర్ కణాలకు ప్రతిబింబం లాంటి (Mirror image) యాంటీమ్యాటర్ కణాలు ఉంటాయి. మ్యాటర్ కణాలకు పాజిటివ్ ఛార్జ్ ఉంటే, యాంటీమ్యాటర్ కణాలకు నెగటివ్ ఛార్జ్ ఉంటుంది. దీని తయారీ చాలా క్లిష్టమైన ప్రక్రియ అంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్క గ్రాములో పదోవంతు తయారు చేయడానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. ఫలితంగా ఒక్క గ్రాము యాంటీమ్యాటర్ తయారీకి రూ.53 వేల కోట్లు ఖర్చవుతుందని 1999లో నాసా శాస్త్రవేత్త హరోల్డ్ గెర్రిష్ అంచనా వేశారు. స్విట్జర్లాండ్‌లోని ది యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లిర్ రీసెర్చ్(CERN)లోని కణ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ మైఖేల్ డోజర్ యాంటీమాటర్ నానోగ్రామ్లో 100వ వంతు భాగం తయారీకి దాదాపు ఒక కిలోగ్రాము బంగారం రేటు అంత ఖర్చవుతుందన్నారు.సాధారణ పదార్థంతో దాని పరస్పర చర్య అనేది ప్రధానమైన ఛాలెంజ్. ఎందుకంటే పదార్థం, యాంటీమ్యాటర్ కలిసినపుడు భారీ పేలుడు సంభవిస్తుంది. ఇలా ఒకదానికొకటి నాశనం చేసుకుంటాయి. ఈ సమయంలో అపారమైన శక్తి ఉత్పత్తి అవుతుంది. అలాగే తయారైన వెంటనే ఇది అదృశ్యమైపోతుందని నమ్ముతున్నారు. అందుకే యాంటీమ్యాటర్‌ను భద్రపర్చడం, దీనిపై అధ్యయనం చేయడం చాలా కష్టతరం. తయారీ తరువాత దీన్ని శూన్యంలో ఉంచాలి, సూపర్ కూల్డ్ అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించి భద్రం చేయాలి. మ్యాటర్‌తో కలవకుండా యాంటీమ్యాటర్‌ను భద్రపరిచే ప్రయత్నాలు సాగాలి. ఇది కేవలం ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ క్షేత్రాల్లో మాత్రమే సాధ్యమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెర్న్ ఇప్పుడు యాంటీమ్యాటర్ తయారీకి ప్రయత్నిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నియంత్రిత వాతావరణంలో దీనిని ఉత్పత్తి చేయడానికి, శాస్త్రవేత్తలు అపారమైన శక్తిని ఉపయోగించనున్నారు. CERNలో, పరిశోధకులు శక్తివంతమైన కణ యాక్సిలరేటర్లను ఉపయోగించి ప్రోటాన్లను ఇరిడియం లక్ష్యంతో ఢీకొట్టే ముందు అధిక వేగంతో ముందుకు నడిపిస్తారు. (దున్నకుండా.. కలుపు తీయకుండా.. రసాయనాల్లేకుండానే సాగు!)యాంటీ మ్యాటర్‌పై అధ్యయనాలుయాంటీ మ్యాటర్ అంతులేని శక్తిని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి అంతరిక్ష పరిశోధనలకు దీనిని ఉపయోగించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యాంటీమాటర్ ఉత్పత్తిలో ఉన్న కష్టం, ఖర్చును దృష్టిలో ఉంచుకుని, శాస్త్రవేత్తలు ఈ అంతుచిక్కని పదార్ధంపై తీవ్ర పరిశోధనలను కొనసాగిస్తున్నారు.విశ్వం ప్రారంభంలో సమాన మొత్తంలో పదార్థం, యాంటీమాటర్ సృష్టించబడ్డాయని శాస్త్రవేత్తలు విశ్వాసం. అవి ఒకదానికొకటి పూర్తిగా నాశనం చేసుకుని ఉండి ఉంటే, ఎలాంటి మ్యాటర్ మిగిలి ఉండకపోతే నేడు మనం చూస్తున్న గెలాక్సీలు, నక్షత్రాలు , గ్రహాలు ఎలా ఉండేవి అనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ మనకు కనిపించకుండా యాంటీమ్యాటర్ గెలాక్సీలు దాగి ఉన్నాయా? దీన్ని అర్థం చేసుకోవడానికే ఈ పరిశోధనలు. ఇదీ చదవండి: మదర్స్ ప్రైడ్ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం -
తెలంగాణలో యూనిలీవర్ పెట్టుబడులు
బ్రెన్ : స్విట్జర్లాండ్ దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఇఎఫ్) 2025 వార్షిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం తొలి ఒప్పందం జరిగింది. దావోస్‌లో యూనిలీవర్ సీఈఓ హీన్ షూమేకర్‌తో సీఎం రేవంత్ రెడ్డి బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి.వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిందని చెప్పారు. తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలీవర్ ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అంగీకరించిందని చెప్పారు. తెలంగాణలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసిందని సీఎం రేవంత్ బృందం పేర్కొన్నారు. -
జ్యూరిక్‌లో రేవంత్, చంద్రబాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘రైజింగ్ తెలంగాణ’బృందం సోమవారం ఉదయం ఆ దేశంలోని జ్యూరిక్ పట్టణానికి చేరుకుంది. జ్యురిక్ ఎయిర్‌పోర్టులో సీఎం బృందానికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. మరోవైపు దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం కూడా జ్యురిక్ చేరుకుంది. ఎయిర్‌పోర్టులోనే ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్, చంద్రబాబులతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఫొటోలు దిగాయి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రతినిధి బృందం జ్యూరిక్ నుంచి రైలులో దావోస్ నగరానికి చేరుకుని ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఇందులో పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రణాళికలను వెల్లడించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. -
బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ అంటూ ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్(Davos) వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) వెళ్లడం, దానికి అనుకూల మీడియా బాకా ఊదడం తెలిసిందే. తాజాగా దావోస్(Davos) పర్యటనకు వెళుతున్న చంద్రబాబు(Chandrababu) అనుకూల మీడియాకు అదనంగా జాతీయ మీడియా ఎన్డీటీవీ, సీఎన్‌బీసీ టీవీ18, బిజినెస్ టుడే పత్రికలకు రూ.కోట్లు వెచ్చించి మరీ ప్రచారం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రచారం మాట అటుంచి.. 2014–19 మధ్య దావోస్(Davos) పర్యటనల్లో ప్రకటించిన పెట్టుబడుల ఒప్పందాలు ఏమయ్యాయి.. ఇందులో ఒక్కటైనా మీకు గుర్తుందా బాబు అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు.ప్రపంచంలోని కుబేరులతో ఫొటోలు తీయించుకుని ప్రచారం చేయించుకోవడమే కానీ.. దావోస్(Davos) పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టయినా తీసుకొచ్చినట్టు చంద్రబాబు(Chandrababu) చెప్పగలరా... అని ప్రశ్చిస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు వరుసగా నాలుగుసార్లు చంద్రబాబు(Chandrababu) దావోస్(Davos) పర్యటనకు వెళితే... ఎన్నికల ఏడాది 2019లో అప్పటి ఐటీ మంత్రి నారా లోకేశ్ బృందం దావోస్(Davos) పర్యటనకు వెళ్లింది. మొత్తం దావోస్(Davos) పర్యటనకు రూ.55 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయగా, రూ.ఒక కోటి పెట్టుబడి కూడా రాలేదని అప్పటి దావోస్(Davos) పర్యటనలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి దావోస్(Davos)కు వెళ్లిన అప్పటి సీఎం చంద్రబాబు(Chandrababu) పదేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలుసుకోవడంతో పాటు సీఈవో సత్య నాదెళ్లతో చర్చలు జరిపామని, విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్టు భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రకటన వచ్చి పదేళ్లయినా ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా... తాజాగా సత్య నాదెళ్ల హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వెళ్లారే కానీ.. మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, పెగా సిస్టమ్స్... ఇలా అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నట్టు ఊదరగొట్టారే కానీ... ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు(Chandrababu) హయాంలో తీసుకురాలేకపోయారు.వైఎస్ జగన్ ఒకసారి పర్యటనతో రికార్డుస్థాయి ఒప్పందాలుకేవలం రూ.11.9 కోట్ల వ్యయంతో 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్(Davos) సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో రూ.1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానితో మర్యాదపూర్వక భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు. రూ.200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించేలా చూశారు.అలాగే రూ.60 వేల కోట్లతో అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, గ్రీన్కో రూ.37 వేల కోట్లతో, అరబిందో రూ.28 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు దావోస్(Davos)లో ఒప్పందం కుదుర్చుకుని వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకువస్తే.. 2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయి తెలుగు పచ్చళ్లు, తెలుగు వంటలు గురించి చర్చించారని, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు, బెండ వేపుడును పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారని ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.2014–19 మధ్య దావోస్(Davos)లో చంద్రబాబు(Chandrababu) పర్యటించి ప్రకటించిన కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు ఇవీ... ఇందులో ఒక్కటీ వాస్తవ రూపం దాల్చలేదు 2015లో⇒ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం ⇒ విశాఖకు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటన ⇒ రాష్ట్రంలో భారీ హార్డ్‌వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకొచ్చిందంటూ ప్రచారం2016లో⇒ మియర్ బర్గర్, ఫిస్లోం సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు ⇒ రూ.2 వేల కోట్లతో ఘెర్జి టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు ⇒ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతోపాటు నెస్లే, వెల్సపన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి 2017లో⇒ ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ రూ.43 వేల కోట్ల పెట్టుబడులు ⇒ విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు ⇒ విశాఖ ఫార్మాసిటీలో నోవార్టిస్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు 2018లో⇒ కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగారం ⇒ గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు ⇒ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో హిటాచీ పెట్టుబడులు 2019లో⇒ జేఎస్‌డబ్ల్యూ రూ.3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం ⇒డెలాయిట్, పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి -
గడ్డకట్టే చలిలోనూ... లెహంగాలో స్నాతకోత్సవానికి!
ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగ్గేదేలే అంటారు కొందరు. ఆ విద్యార్థిని సరిగ్గా అలాంటి వారిలో కోవలోకే వస్తుంది. గడ్డ కట్టించే చలిలోనూ వస్త్రధారణలో రాజీ పడలేదు. స్నాతకోత్సవంలో సంప్రదాయ దుస్తులే ధరించింది! స్విట్జర్లాండ్‌లో ప్రస్తుతం చలి వణికిస్తోంది. మైనస్ డిగ్రీలతో సర్వం గడ్డ కట్టుకుపోతోంది. అయినా సరే, లక్ష్మీకుమారి అనే భారతీయ విద్యార్థిని అస్సలు రాజీ పడలేదు. స్నాతకోత్సవానికి లెహెంగా ధరించి ప్రశంసలు అందుకుంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘మైనస్ డిగ్రీల వాతావరణం. బయట ఎటు చూసినా మంచు. ఊహించలేనంతటి చలి! అయినా సరే, లెహంగా ధరించడంలో రాజీపడలేదు’’అని రాసుకొచ్చింది. ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. జీవితంలో ప్రత్యేకమైన మైలురాయిని సంప్రదాయంతో మేళవించిందంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. అంతటిప్రతికూల వాతావరణంలోనూ గ్రాడ్యుయేషన్ కోసం సంప్రదాయ దుస్తులు ధరించడం బాగుంది. ఆమె నిజమైన భారతీయురాలు. అంతర్జాతీయ వేదికపై తన మూలాలను ఇంతందంగా చూపించింది’’అంటూ పొగుడుతున్నారు. View this post on Instagram A post shared by Lakshmi Kumari (@lakshmi.ch) -
భారత్‌కు స్విస్ ఎంఎఫ్ఎన్ హోదా రద్దు..
న్యూఢిల్లీ: ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంలో (డీటీఏఏ) భాగంగా భారత్‌కి అనుకూల దేశంగా ఇచ్చిన హోదా (ఎంఎఫ్ఎన్) నిబంధనను స్విట్జర్లాండ్ ప్రభుత్వం రద్దు చేసింది. భారత్ ట్యాక్స్ ఒప్పందం కుదుర్చుకున్న దేశం ఏదైనా ఓఈసీడీలో (ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ) చేరినప్పుడు, ఎంఎఫ్ఎన్ నిబంధన ఆటోమేటిక్‌గా అమల్లోకి రాదంటూ నెస్లే కేసులో భారత సుప్రీంకోర్టు గతేడాది తీర్పునిచ్చిన నేపథ్యంలో స్విస్ ఫైనాన్స్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.ఇది వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో భారత్‌లో స్విస్ పెట్టుబడులపై ప్రభావం పడనుండగా, ఆ దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కంపెనీలపై అధిక పన్నుల భారం పడనుంది. తమ దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్న భారతీయ కంపెనీలు ఆర్జించే డివిడెండ్లపై స్విట్జర్లాండ్ ఇకపై 10 శాతం పన్ను విధించనుంది. -
నిచ్చెన మెట్లు... చక చకా!
చెట్టులెక్కగలవా? ఓ నరహరి పుట్టలెక్కగలవా?చెట్టులెక్కి.. ఆ చిటారు కొమ్మన చిగురు కోయగలవా?అప్పుడెప్పుడో లక్ష్మీదేవి పెట్టిన వర పరీక్ష ఇది! ఇప్పుడా అవసరం మనిషికి లేదు కానీ.. అన్ని రంగాల్లోకీ దూసుకొస్తున్న యంత్రులకు అదేనండి రోబోలకు కావాలి. ఎందుకంటే.. చెట్టూ పుట్ట ఎక్కే రోబోలను మరిన్ని ఎక్కువ చోట్ల వాడుకోవచ్చు మరి. ఇప్పటివరకూ తయారైన రోబోలు కొంచెం తడబడుతూ మెట్లు ఎక్కగలిగేవి కానీ.. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జూరిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ‘ఎనిమల్’ మాత్రం చాలా వేగంగా నాలుగు కాళ్లతో నిచ్చెన మెట్లు ఎక్కేయగలదు. రెండు కాళ్లపై నుంచోవడం, అడ్డ కూలీల్లా బాక్స్‌లను దూరంగా విసిరివేయడం, ఎక్కినంత వేగంగా మెట్లు దిగగలగడం వంటి పనులన్నీ ఠకీ మని చేసేయగలదీ రోబో. ఏడేళ్ల క్రితం ఈ సంస్థ స్కైస్కాపర్లలో ఎలివేటర్లను వాడుకునే శక్తిగల రోబోలను తయారు చేసింది. అప్పటి నుంచి ఇది ఎనీబోటిక్స్ అనే సంస్థ ద్వారా వాణిజ్యస్థాయిలో అందుబాటులో ఉంది కూడా. తాజాగా ఈ సంస్థే ‘ఎనిమల్’ను అభివృద్ధి చేసింది. ఎనిమల్ నిమిషానికి 0.75 మీటర్ల వేగంతో నడవగలదు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా గంటన్నర నుంచి రెండు గంటల పాట పనిచేస్తుంది. ఇంటా బయట ఎక్కడైనా సరే.. అడ్డంకులను తప్పించుకుని ప్రయాణించగలదు. చుట్టూ జరుగుతున్న విషయాలను చూసి అర్థం చేసుకునేందుకు వీలుగా ఇందులో 360 డిగ్రీ లైడర్ మాడ్యూల్, లోతును అంచనా కట్టేంఉదకు ఆరు సెన్సింగ్ కెమెరాలు, చూపునకు రెండు కెమెరాలు ఉన్నాయి. ఈ సెన్సర్లు, కెమెరాలిచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు అర్థం చేసుకునేందుకు ఇంటెల్-6 కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కొక్కేల్లాంటి కాళ్లు...మెట్లు ఎక్కే ప్రత్యేకమైన శక్తి కోసం ‘ఎనిమల్’ నాలుగు కాళ్లకు కొక్కేల్లాంటి నిర్మాణాలు ఉన్నాయి. ‘సి’ ఆకారంలో ఉండే ఈ నిర్మాణాలు నిచ్చెన మెట్లను గట్టిగా పట్టుకునేందుకు, అవసరమైనప్పుడు వదిలేసేందుకు ఉపయోగపడతాయి. కాళ్లు, చేతులతో పైకి ఎక్కేందుకు మన మాదిరి ప్రయత్నిస్తుందన్నమాట. కంప్యూటర్ మోడళ్ల సాయంతో ఈ కొక్కేలను ఎలా వాడాలో ఎనిమల్కు నేర్పించారు శాస్త్రవేత్తలు. పరిశోధనశాల ప్రయోగాల్లో ఈ రోబో 70 నుంచి 90 డిగ్రీల కోణమున్న నిచ్చెనలను కూడా 90 శాతం కచ్చితత్వంతో ఎక్కగలిగింది. మరీ ముఖ్యమమైన విషయం ఏమిటంటే... ఇలా మెట్లు ఎక్కగల రోబోలతో పోలిస్తే దీని వేగం 232 రెట్లు ఎక్కువ! నమ్మడం లేదా.. వీడియో చూసేయండి మరి... -
భారత్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకరం
జెనీవా: తూర్పు లద్ధాఖ్‌లో భారత్–చైనా సరిహద్దులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం వెనక్కి వెళ్లిపోయే విషయంలో చైనాతో నెలకొన్న సమస్యలు 75 శాతం పరిష్కారమైనట్లు తెలిపారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని పేర్కొన్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ చర్చా కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణలకు పూర్తిగా తెరదించడానికి నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి భారత్, చైనా సైన్యం వెనక్కి వెళ్తుండగా, మరోవైపు అక్కడ మిగిలి ఉన్న రెండు దేశాల సేనలు ఎదురెదురుగా సమీపంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికీకరణ జరుగుతోందని వెల్లడించారు. ఈ సమస్యను కచి్చతంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద సరిహద్దుల నుంచి తమ సేనలను సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం, రెట్టింపు చేయాలని తీర్మానించుకున్నాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని తాము కోరుకుంటున్నామని అజిత్ దోవల్ ఈ సందర్భంగా తేలి్చచెప్పారు. వాస్తవా«దీన రేఖను(ఎల్ఏసీ)ని గౌరవించాలని వాంగ్ యీకి సూచించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎల్ఏసీని గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. -
మన దేశంలోనూ టైమ్ బ్యాంక్
విశాఖపట్నానికి చెందిన సత్యమూర్తి విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తన ఇద్దరు పిల్లలను అమెరికా పంపించి బాగా చదివించారు. ఉన్నతోద్యోగాల్లో వారు అక్కడే సెటిల్ అయ్యారు. ఏడాదికి ఓసారి భార్యతో కలిసి అమెరికాలోని కొడుకుల వద్దకు వెళ్లి కొద్దిరోజులుండి రావడం ఆయనకు అలవాటు. అయితే, ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఇక్కడ ఒంటరైపోయారు. తమ వద్దకు వచ్చేయమని కొడుకులు కోరుతున్నా ఆయన ఒప్పుకోవడం లేదు. తాను టైమ్ బ్యాంక్‌లో కొంత సమయం దాచుకున్నానని, తనకు అవసరం వచ్చినప్పుడు తనను చూసుకునేందుకు మనుషులు వస్తారని చెప్పడంతో కొడుకులు ఆశ్చర్యపోయారు. విలువైన నగలు, డాక్యుమెంట్లను లాకర్లో దాచుకున్నట్టు బ్యాంకులో టైమును కూడా దాచుకోవచ్చా..అలాంటి అవకాశం కూడా ఉందా!! సాక్షి, అమరావతి: ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. జీవితాలు అపార్ట్మెంట్లలో బందీ అయ్యాయి. ఇది ఒంటరిగా ఉన్న వృద్ధులకు పెద్ద సవాలుగా మారింది. విదేశాల్లోనో లేక మరో దూర ప్రాంతంలోనో ఉండటంతో తల్లిదండ్రులను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో పిల్లలు ఉన్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకో లేక ఇంటి వద్దే కొన్ని పనులు చేసిపెట్టేందుకో ఓ వయసు దాటాక ప్రతి ఒక్కరికీ మరొకరి సాయం తప్పనిసరైంది. ఇలాంటి అవసరాలు ఉన్న వారిని చూసుకునేందుకు రోటరీ సంస్థ ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో సామాజిక కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చి కుటుంబ అవసరాల అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.ఏమిటీ టైమ్ బ్యాంక్.. అరవై ఏళ్లు దాటి ఆరోగ్యవంతమైన వ్యక్తి టైమ్ బ్యాంక్ సభ్యుడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సమయంలో సహాయం చేయడం ద్వారా వారి సమయాన్ని కొంత ఇతరులకు వెచ్చించవచ్చు. ఇలా ఎన్ని గంటలు వెచి్చస్తే అన్ని గంటలు సదరు సమయం కేటాయించిన వ్యక్తి పేరుపై అతని ఖాతాలో ఆ సమయం జమ అవుతుంది. దానిని వారు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ సభ్యులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా ఇతర అవసరాలు ఉన్నపుడు ఇంకో సభ్యుడు వీరికి సాయం చేస్తారు. ఇందులో సభ్యులు.. సేవ కోరేవారి మధ్య డబ్బు లావాదేవీ ఉండదు. ఉదాహరణకు, ఒక సభ్యుడు వారానికి నాలుగు గంటలు మరొకరికి సేవ చేస్తున్నట్టయితే, అతను నెలకు 16 గంటలు సంపాదిస్తాడు లేదా ఆదా చేస్తాడు. ఇలా సంవత్సరానికి 192 గంటలు లేదా 8 రోజులు అతని/ఆమె ఖాతాలో జమ అవుతాయి. ఈ సమయాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత విడతల వారీగా లేదా ఒకేసారి తన అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చు. దీనికోసం సదరు బ్యాంకులో నమోదు చేసుకుంటే మరో సభ్యుడు లేదా సభ్యురాలు వచ్చి సేవలందిస్తారు. సరళంగా చెప్పాలంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజి్రస్టేషన్ అనేది జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ ఖాతాను తెరవడం లాంటిది. పెద్దలకు సేవ చేయడం ద్వారా డబ్బుకు బదులు సమయాన్ని జమ చేసుకుంటారు. వారి అవసరాల సమయంలో వారి డిపాజిట్ సమయానికి సమానమైన సమయాన్ని విత్‌డ్రా చేసుకుంటారు. ప్రపంచంలో 34 దేశాల్లో అమలు స్విట్జర్లాండ్‌లో మొదలైన టైమ్ బ్యాంక్ కాన్సెప్‌్టను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాలు అమలు చేస్తున్నాయి. ఇందులో యూకే, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, స్పెయిన్, గ్రీస్, సింగపూర్, తైవాన్, సెనెగల్, అర్జెంటీనా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో 300కు పైగా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే 40 రాష్ట్రాల ప్రభుత్వాలు టైమ్ బ్యాంక్‌ను అమలు చేస్తున్నాయంటే వీటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనూ ఈ తరహా కాన్సెప్ట్ అవసరమని 2018లో జాతీయ మానవ హక్కుల సంఘం కేంద్రానికి సూచించింది. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే 2019లో టైమ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ప్రస్తుతం 50 వేల మంది వలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతోపాటు సామాజిక సేవల్లో ముందుండే రోటరీ క్లబ్ కూడా టైమ్ బ్యాంక్‌ను ప్రారంభించగా, ఇందులో 5 వేల మంది వరకు సభ్యులుగా చేరారు. 2012లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభండబ్బుతో అవసరం లేకుండా ‘మనిíÙకి మనిషి సాయం’ అందించే వినూత్న విధానానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నాంది పలికింది. స్విస్ ప్రభుత్వం వృద్ధులకు ప్రత్యేకంగా పెన్షన్ అందిస్తోంది. అయితే, తమకు డబ్బు కంటే సాయం చేసేవారు అవసరమని, చాలా సందర్భాల్లో ఏ పనీ చేసుకోలేకపోతున్నామని అక్కడి వృద్ధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తమతో మాట్లాడేందుకు మనిíÙని తోడు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన అక్కడి ఫెడరల్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి అధ్యయనం చేసింది. దేశంలో వృద్ధుల్లో అత్యధికులు ఒంటరి జీవితాలు గడుపుతున్నారని, వారు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మనిషి సాయం కోరుతున్నట్టు గుర్తించారు. దాంతో ఇంట్లో ఉండే ఒంటరి వృద్ధులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2012లో ‘టైమ్ బ్యాంక్’ను అక్కడి ప్రభుత్వం ప్రారంభించి ‘టైమ్ ఈజ్ మనీ’ కాన్సెప్‌్టను వర్తింపజేస్తోంది. ఈ కాన్సెప్ట్‌ని కచ్చితంగా ఆచరించడంలో స్విట్జర్లాండ్ ముందడుగు వేసింది. ఆ దేశంలో పౌరులు తమ సమయాన్ని బ్యాంకుల్లో ‘పొదుపు’ చేసేలా ప్రోత్సహించింది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో వలంటీర్‌గా రిజిస్టర్ చేసుకుంటే వారిని అవసరం ఉన్నవారికి అలాట్ చేస్తారు. అలా వారు తోటపని, ఇంటి పని, బయటకి తీసుకెళ్లడం, కబుర్లు చెప్పడం, వృద్ధులు చెప్పే మాటలు వినడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి పనుల్లో సాయంగా ఉంటారు. వీరు ఎన్ని గంటలు కేటాయించారో అంత సమయం సాయం చేసిన వ్యక్తి అకౌంట్లో జమ చేయడం ప్రారంభించారు. -
స్విట్జర్లాండ్ లో రాయ్ లక్ష్మీ సిజ్లింగ్ ఫోటోలు
-
భారత ఈక్విటీల్లో యూబీఎస్ ఏజీ వరుస అమ్మకాలు
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కు చెందిన ఆర్థిక సేవల కంపెనీ యూబీఎస్ గ్రూప్ ఏజీ.. శుక్రవారం ఒక్క రో జే (30వ తేదీన) ఏకంగా భారత ఈక్విటీల్లో భారీ అమ్మ కాలకు దిగింది. ఏడు కంపెనీల్లో రూ.4,961 కోట్ల విలువ చేసే షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీల రూ పంలో విక్రయించింది. యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ ఏషియా రూపంలో బల్‌్కడీల్స్ ద్వారా అమ్మకాలు చేసినట్టు ఎన్ఎస్ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయిల్ ఇండియాలో రూ.972 కోట్లు, డిక్సన్ టెక్నాలజీస్‌లో రూ.904 కోట్లు, ఆర్‌వీఎన్‌ఎల్‌లో రూ.797 కోట్లు, జైడస్ లైఫ్సైన్సెస్లో రూ.756 కోట్ల విలువ చేసే షేర్లను అమ్మేసింది. అలాగే, వొడాఫోన్ ఐడియా, ఒరాకిల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్‌లోనూ రూ.1,531 కోట్ల విలువైన షేర్లను విక్రయించింది. మరోవైపు బంధన్ బ్యాంక్‌లో రూ.384 కోట్ల విలువ చేసే 1.92 కోట్ల షేర్లను యూబీఎస్ ప్రిన్సిపల్ క్యాపిటల్ కొనుగోలు చేసింది. -
ముద్దొచ్చే మర చేప
ఇదేమిటో తెలుసా? రోబోచేప. పేరు ఈవ్. సిలికాన్ తోకను విలాసంగా ఊపుకుంటూ స్విట్జర్లాండ్‌లో జ్యూరిచ్ సరస్సులోని అతి శీతల జలాల్లో ఇలా విలాసంగా విహరిస్తోంది. దీన్ని రూపొందించేందుకు జ్యూరిచ్ ఈటీహెచ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఏకంగా రెండేళ్లు పట్టిందట! ఇతర చేపలు, సముద్ర జీవాలు బెదిరిపోకుండా ఉండాలని దీన్ని అచ్చం చేపలా కని్పంచేలా డిజైన్ చేశారు. సోనార్ టెక్నాలజీ సాయంతో అడ్డొచ్చే వాటన్నింటినీ సునాయాసంగా తప్పించుకుంటూ సాగిపోగలదీ మర చేప. ఇంతకూ దీని పనేమిటంటారా? నీటి లోపలి పరిస్థితులను కెమెరా కంటితో ఒడిసిపట్టడం. సముద్ర జీవుల డీఎన్ఏను (‘ఇ–డీఎన్ఏ’గా పిలుస్తారు) సేకరించడం. ‘‘సముద్రం లోతుల గురించి, అక్కడి జీవుల గురించీ మనకు తెలిసింది నిజానికి చాలా తక్కువ. ఆ జీవులన్నీ నిరంతరం ‘ఇ–డీఎన్ఏ’ను జలాల్లోకి విడుదల చేస్తుంటాయి. దాన్ని సేకరించి ల్యాబుల్లో పరీక్షిస్తే వాటి గురించి మనకిప్పటిదాకా తెలియని విశేషాలెన్నో వెలుగులోకి వస్తాయి’’ అని అధ్యయన బృందం చెబుతోంది. ఈ రోబో చేపలు మున్ముందు సముద్రాల అధ్యయనం రూపురేఖలనే మార్చగలవని భావిస్తున్నారు. సాక్షి, నేషనల్ డెస్క్ -
Switzerland Peace Summit: ఉక్రెయిన్‌లో శాంతికి ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక
బెర్న్: ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఎలాంటి శాంతి ఒప్పందానికైనా ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతే ముఖ్య భూమిక అవుతుందని 80 దేశాలు తేలి్చచెప్పాయి. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమత్వాన్ని తాము గౌరవిస్తున్నామని స్పష్టం చేశాయి. ఉక్రెయిన్‌లో శాంతి సాధన కోసం స్విట్జర్లాండ్‌లో రెండు రోజులపాటు జరిగిన సదస్సు ఆదివారం ముగిసింది. దాదాపు 100 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం 80 దేశాల ప్రతినిధులు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ సహా కొన్ని దేశాలు ఈ ప్రకటనలో పాలుపంచుకోలేదు. తుది డాక్యుమెంట్‌పై సంతకం చేయలేదు. యుద్ధం మొదలైన తర్వాత స్వా«దీనం చేసుకున్న ఉక్రెయిన్ భూభాగాలను వెనక్కి ఇచ్చేయాలని పలుదేశాలు రష్యాకు సూచించాయి. స్విట్జర్లాండ్ సదస్సు పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హర్షం వ్యక్తం చేశారు. తమ దేశంలో శాంతికి ఇదొక తొలి అడుగు అని అభివరి్ణంచారు. అయితే, ఈ సదస్సుకు రష్యా మిత్రదేశం చైనా హాజరుకాలేదు. రష్యాను ఆహ్వా నించలేదు. భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి(పశి్చమ) పవన్ కపూర్ హాజరయ్యారు. -
Euro 2024: యూరో కప్‌లో బోణీ కొట్టిన జర్మనీ, స్విట్జర్లాండ్
ఫుట్‌బాల్ అభిమానులు ఆసక్తికగా ఎదురుచూసిన ప్రతిష్ఠాత్మక యూరో కప్-2024కు తెర లేచింది. ఈ టోర్నమెంట్లో ఆతిథ్య జర్మనీ శుభారంభం చేసింది. శనివారం మ్యూనిక్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్పై 5-1తో జర్మనీ అద్భుత విజయం సాధించింది.ఈ తొలిపోరులో ఏ దశలోనూ పత్యర్ధికి జర్మనీ అవకాశమివ్వలేదు. ఈ మ్యాచ్ 10వ నిమిషంలో ఫ్లోరియన్ విర్ట్జ్ జర్మనీకి తొలి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత జమాల్ ముసియాలా, కై హావర్ట్జ్ ఫస్ట్‌హాఫ్‌లో మరో రెండు గోల్స్‌ను అందించారు. దీంతో ఫస్ట్‌హాఫ్ ముగిసేసరికి జర్మనీ 3-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సెకెండ్ హాఫ్‌లో కూడా జర్మనీ అదరగొట్టింది. ఇక ఈ విజయంతో జర్మనీ ఖాతాలో మూడు పాయింట్లు వచ్చి చేరాయి. అనంతరం జరిగిన మరో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. హంగేరీ జట్టుపై 3-1తో స్విస్ జట్టు ఘన విజయం నమోదు చేసింది. ఇక ఈ మెగా టోర్నీ జర్మనీలోని 10 పట్టణాల్లో జరగనుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్‌లుగా విభజించారు. ఈ టోర్నీ జూలై 14న బెర్లిన్‌లో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఇక గ్రూప్ ‘ఎ’లో జర్మనీ, స్కాట్లాండ్, హంగేరి, స్విట్జర్లాండ్... గ్రూప్ ‘బి’లో స్పెయిన్, క్రొయేషియా, ఇటలీ, అల్బేనియా... గ్రూప్ ‘సి’లో ఇంగ్లండ్, స్లొవేనియా, సెర్బియా... గ్రూప్ ‘డి’లో నెదర్లాండ్స్, పోలాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రియా... గ్రూప్ ‘ఇ’లో బెల్జియం, స్లొవేకియా, రొమేనియా, ఉక్రెయిన్... గ్రూప్ ‘ఎఫ్’లో పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, జార్జియా, టర్కీ జట్లు ఉన్నాయి. -
ఎలక్ట్రిక్ వాహనాలకి ధీటుగా లిక్విడ్ హైడ్రోజన్ మోటార్స్
-
ఇక చౌకగా స్విట్జర్లాండ్ చాక్లెట్లు, వాచీలు
స్విస్ చీజ్, చాక్లెట్, వైన్, వాచీలు, ఇతర ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా లభించనున్నాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) ఎగుమతుల్లో 95.3 శాతం వాటా కలిగిన 82.7 శాతం టారిఫ్ లైన్లపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.అదనంగా, ఈఎఫ్టీఏ దేశాలకు తన సేవల ఎగుమతులను పెంచడానికి ఐటీ, హెల్త్‌కేర్, అకౌంటింగ్ వంటి 105 ఉప రంగాలలో భారతదేశం రాయితీలను అందించింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో భారత్ మార్చి 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి 128, నార్వే నుంచి 114, లైచెన్టెయిన్ నుంచి 107, ఐస్లాండ్ నుంచి 110 సబ్ సెక్టార్లను భారత్ ఈఎఫ్టీఏకు అనుమతించింది.1960లో ఏర్పాటు చేసిన ఈఎఫ్టీఏ అనేది ఐస్లాండ్, లైచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది ఐరోపా అంతటా ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తం 13 మిలియన్ల జనాభాతో, ఈఎఫ్టీఏ దేశాలు ప్రపంచంలోని పదో అతిపెద్ద వాణిజ్య వ్యాపారులు, వాణిజ్య సేవల ఎనిమిదో అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి. -
హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!
జీవితంలో ఒక్కసారి జరిగే మధురమైన ఘట్టం 'పెళ్లి'. అది తమ జీవితంలో మరుపురాని గుర్తులా ఉండేలా గ్రాండ్‌గా చేసుకోవాలనుకుంటోంది యువత. అందుకోసం తమ తాహతకు తగ్గా రేంజ్లో డీజే మ్యూజిక్‌లు లేదా అందమైన టూరిస్ట్ ప్రదేశాల్లోనూ చేసుకుంటారు. విభిన్నంగా ఉండాలని ఆరాటపడుతుంటారు. అలానే ఇక్కడొక జంట ఏకంగా ఎముకలు కొరికే మంచు శిఖరాల్లో పెళ్లి జరగాలనుకుంది. అందుకని ఎక్కడకు వెళ్లారంటే..ఈ జంట ఏకంగా స్విట్జర్లాండ్‌లో జెర్మాట్‌లోని ఆల్ఫైన్ శిఖరాల వద్ద గ్రాండ్‌గా వివాహ వేడుకను జరుపుకుంది. బంధువుల, స్నేహితు ఆశ్వీరాదల నడుమ ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యింది. గజగజ వణికించే చలిలో చక్కటి వయోలిన్ మ్యూజిక్, ఆ చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్లు మిల్కీ వైట్ పెళ్లి దుస్తులతో పైనుంచి భువిపైకి వచ్చిన దేవతాల్లా ఉన్నారు. అక్కడొక పెద్ద మంచు క్యూబ్ సెట్టింగ్‌లో వధువరులిద్దరు చక్కగా కెమరాలకు ఫోజలిలస్తూ నిలబడ్డారు. మంచు శిఖరాలే తమ పెళ్లికి సాక్ష్యంగా.. ఏకంగా రెండు వేలకు పైగా ఎత్తులో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. చుట్టూ ఉన్న తెల్లటి మంచుకి తగ్గట్టూ పూల డెకరేషన్ ఓ రేంజ్లో అదరహో అన్నంతగా అద్భుతంగా ఉంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఈ వెడ్డింగ్ అడ్వెంచర్ అదిరిపోయింది బాస్, నిజజీవితంలో ఇలా మంచులో పెళ్లి చేసుకునే జంటను చూస్తానని అనుకోలేదంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by LEBANESE WEDDINGS (@lebaneseweddings) (చదవండి: ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!) -
పసివాళ్ల ఆహారంతో ఆటలా!
తొమ్మిదేళ్లనాటి మ్యాగీ నూడిల్స్ వివాదం నుంచి బయటపడి రెండు వారాలు గడిచాయో లేదో... నెస్లే కంపెనీ మెడకు కొత్తగా సెరిలాక్ తగువు చుట్టుకుంది. ఈసారి దీని మూలం మన దేశంలో కాదు, స్విట్జర్లాండ్‌లో వుంది. భిన్న రకాల ఉత్పత్తుల ద్వారా లాభాల రూపంలో ఏటా వేలాదికోట్ల రూపాయలు తరలించుకుపోతున్న బహుళజాతి సంస్థలకు ఇక్కడి ప్రజల ఆరోగ్యం విషయంలోగానీ... ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలపైగానీ పెద్దగా పట్టింపు వుండదని చాలామంది చేసే ఆరోపణ. అడపా దడపా వెల్లడవుతున్న అంశాలు వాటిని బలపరిచేవిగానే వుంటున్నాయి. భారత్‌లో పసివాళ్ల ఆకలి తీర్చడానికి తల్లులు ఉపయోగించే సెరిలాక్లో అధిక శాతం చక్కెరవుంటున్నదని స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థ ‘పబ్లిక్ ఐ’ మరో సంస్థ అంతర్జాతీయ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ (ఐబీ–ఫాన్)తో కలిసి గురువారం బయటపెట్టాక దేశం నివ్వెరపోయింది. నెస్లే సంస్థ ఒక్క భారత్‌లో మాత్రమే కాదు, యూరప్ దేశాలతోపాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, దక్షిణాసియా దేశాల్లో కూడా సెరిలాక్ విక్రయిస్తోంది. కానీ యూరప్ దేశాల పిల్లల కోసం తయారుచేసే సెరిలాక్కూ, వేరే దేశాల్లో విక్రయించే సెరిలాక్కూ చాలా వ్యత్యాసం వుంది. యూరప్ దేశాల్లో విక్రయించే సెరిలాక్లో అసలు చక్కెర పదార్థాలే వాడని నెస్లే... ఇతరచోట్ల మాత్రం యధేచ్ఛగా వినియోగిస్తున్నట్టు ‘పబ్లిక్ ఐ’ తెలిపింది. మూడేళ్లలోపు పిల్లలు తినే ఆహార పదార్థాల్లో కృత్రిమంగా తీపిని పెంచే సుక్రోజ్, ఫ్రక్టోజ్ వంటి పదార్థాలేవీ కలపరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది. పసిపిల్లల ఆహారోత్పత్తుల్లో కృత్రిమ తీపి పదార్థాలు, అదనపు చక్కెర వుండరాదన్నది 2022 సంవత్సర ప్రధాన నినాదం కూడా. కానీ దురదృష్టమేమంటే మన దేశం వాటి వినియోగాన్ని అనుమతిస్తోంది. తమ చిన్నారులకు అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు, ఐరన్ తదితర పోషకాలు లభిస్తాయన్న ఆశతో తల్లులు సెరిలాక్ వంటి ఉత్పత్తులను ఆశ్రయిస్తారు. గత అయిదేళ్లుగా సెరిలాక్లో కృత్రిమ తీపి పదార్థాల వాడకాన్ని 30 శాతం తగ్గించామని నెస్లే కంపెనీ తాజా వివాదం తర్వాత సంజాయిషీ ఇస్తోంది. మంచిదే. కానీ అసలు వాడరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్నప్పుడు ఈ తగ్గించటమేమిటి? ఇన్ని దశాబ్దా లుగా వాటిని ఎందుకు కొనసాగించినట్టు? ఇది తప్పించుకునే ధోరణి కాదా? నెస్లే సంస్థ సంగతలావుంచి అసలు మన దేశంలో అమ్ముడవుతున్న బహుళజాతి సంస్థల ఉత్పత్తుల్లో తగిన ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూసి నియంత్రించాల్సిన ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ఏమైనట్టు? ఎక్కడో స్విట్జర్లాండ్‌లోని స్వచ్ఛంద సంస్థలు వివిధ దేశాల్లో విక్రయించే సెరిలాక్ ఉత్పత్తుల నమూనాలను సేకరించి నిగ్గుతేల్చే వరకూ ఆ సంస్థ గాఢ నిద్రపోయిందా అనే సందేహం రావటం సహజం. పసివాళ్లకు అందించే ఆహారంలో పరిమితికి మించి చక్కెర లేదా ఉప్పు ఎక్కువైతే వారి ఆరోగ్యానికి ఎంతో హాని కలుగుతుందనీ, చిన్న వయసునుంచే తీపి పదార్థాలకు వారు అలవాటుపడతారనీ నిపుణులంటారు. ఈ పదార్థాలు ఊబకాయాన్ని పెంచుతాయని, పిల్లలు శ్వాసకోశ వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, కేన్సర్, మధు మేహంవగైరా వ్యాధులకు లోనవు తారని హెచ్చరిస్తారు. మన పిల్లల్లో ఇటీవలకాలంలో ఊబకాయం లక్షణం పెరుగుతున్నదని అనేక సర్వేలు గొంతు చించుకుంటున్నాయి కూడా. అయినా నియంత్రణ వ్యవస్థల చెవులకు సోకలేదు. ఒక అంచనా ప్రకారం కేవలం సెరిలాక్ అమ్మకాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెస్లే సంస్థ ఏటా వంద కోట్ల డాలర్ల (రూ. 8,400 కోట్లు)కుపైగా ఆర్జిస్తోంది. ఇందులో భారత్, బ్రెజిల్ దేశాల వాటాయే 40 శాతం వుంటుందని అంటారు. ఇంతగా లాభాలొచ్చే ఉత్పత్తి విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవాలనీ, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలనీ నెస్లేకు తెలియదా? పోనీ అన్నిచోట్లా ఇలానే చేస్తే అజ్ఞానమో, నిర్లక్ష్యమో అనుకోవచ్చు. కానీ ధనిక దేశాల్లో ఒకరకంగా, వర్ధమాన దేశాల్లో మరో విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటించటం ఏ వ్యాపార నీతి? ఆహార ఉత్పత్తులు, శీతల పానీయాలు తదితరాల విషయంలో ఏమరుపాటు పనికిరాదు. వాటిని ఎప్పుడో ఒకసారి పరీక్షించి చూసి వదిలేయకూడదు. నిర్ణీత కాలపరిమితుల్లో నిరంతరం వాటి నమూనాలను పరీక్షిస్తూ వుండాలి. మనం తినే తిండి ఆరోగ్యదాయకమేనా, సురక్షితమేనా అని మాత్రమే కాదు... ఉత్పత్తిదారు చెప్పుకుంటున్నవిధంగా అందులో పోషకాలున్నాయో లేదో గమనించాలి. ప్రమాణాలకు అనుగుణంగా లేనివాటిని నిర్దాక్షిణ్యంగా మార్కెట్ నుంచి తొలగించాలి. ప్రపంచంలో చైనా తర్వాత మన దేశమే అతి పెద్ద మార్కెట్. అందుకే బహుళజాతి సంస్థలు సినీతారలనూ, క్రీడా దిగ్గజాలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా రంగంలోకి దించి ప్రకటనలతో ఊదరకొడుతూ అచిరకాలంలోనే లాభాల బాట పడుతుంటాయి. ఆ ఉత్పత్తుల్ని వాడటం ఆధునికతకూ, ఉత్తమాభి రుచికీ నిదర్శనమని బ్రాండ్ అంబాసిడర్లు చెప్తే మోసపోవటానికి మన మధ్యతరగతి ఎప్పుడూ సిద్ధంగా వుంటుంది. 2015లో మ్యాగీ నూడిల్స్‌లో అత్యంత హానికరమైన సీసం, మోనోసోడియం గ్లూటామేట్ వంటి పదార్థాలున్నాయని వెల్లడైనప్పుడు గగ్గోలైంది. తీరా తొమ్మిదేళ్లు గడిచాక జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ మ్యాగీ నూడిల్స్ విషయంలో కేంద్రం నిర్ణయం సరికాదని ఈనెల మొదటివారంలో తోసిపుచ్చింది. నెస్లేకు క్లీన్చిట్ ఇచ్చింది. భవిష్యత్తులో సెరిలాక్ విషయంలోనూ ఇదే జరుగుతుందా? ఇతరత్రా అంశాల మాటెలావున్నా హానికారక ఆహార పదార్థాలు మార్కెట్లోకి రాకుండా చూడాల్సిన కనీస బాధ్యత తమకున్నదని కేంద్ర ప్రభుత్వం గుర్తించటం అవసరం. -
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
మంచుకురిసే వేళలో, సీతూ పాప..లిటిల్ఎల్సాలా.. అమేజింగ్ ఫోటోలు
-
ఆవుని ఆస్పత్రికి తరలించడం కోసం ఏకంగా హెలికాప్టర్..!
మనదేశంలో గోమాతలను దేవతగా పూజించడం వంటివి చేస్తారు. అయితే మనవాళ్లు వాటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. కానీ మన కంటే బాగా శ్రద్ధ చూపించే మరో దేశం ఉంది. మనం దేవతలా ఆవుని పూజించినా..ఆస్పత్రికి తీసుకువెళ్లాలంటే మాత్రం ఏ వ్యాన్‌లోనో తీసుకువెళ్తాం కదా!. కానీ వీళ్లు ఆవుని ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి ఏం చేస్తారో వింటే ఆశ్చర్యపోతారు.! ఆవుని హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్తున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇదేంటి ఆవుని ఇలా తీసుకువెళ్తున్నారు అనుకోకండి. ఎందుకంటే దానికి గాయాలు కావడంతో స్విట్జర్లాండ్ అధికారులు ఏకంగా హెలికాప్టర్ని రంగంలోకి దింపి మరి ఆస్పత్రికి తరలిస్తునన్నారు. అయతే ఇలాంటి ఆవులు మన దేశంలో ఉండవు. వీటిని'హెవెన్ ఆన్ ఎర్త్' అని పిలుస్తారు. 23 సెకన్ల నిడివిగల ఈ వీడియో అమెజింగ్ నేచుర్ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటన మనకు వింత గానీ స్విట్జర్లాండ్ వాసులకు మాత్రం కాదట. ఇలా హెలికాప్టర్‌తో ఆవుని తరలించిన ఘటనలు అక్కడ పలుమార్లు జరిగాయట. గాయపడిన ఆవులను పర్వతాల మీద నుంచి హెలికాప్టర్ సాయంతో ఆస్పత్రికి తరలిస్తారట అక్కడ అధికారులు. ఏదీఏమైనా ఆవుల పట్ల ఇంతలా శ్రద్ధని, ప్రేమను చూపడం నిజంగా గ్రేట్ కదూ!. A cow flying to the vet in Switzerland pic.twitter.com/2A5jxTXeAk — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) March 6, 2024 (చదవండి: 'అరుంధతి' సినిమాని తలిపించే కథ ఈ సొరంగం స్టోరీ!) -
తరతరాలకు సరిపడ సంపదలో అత్యుత్తమ దేశం ఇదే!
ఇంతవరకు ఆర్థికంగా, ఆకలి, కాలుష్యం, అక్షరాస్యతల పరంగా ఉత్తమ దేశాల జాబితను ప్రకటించడం చూశాం. అలాగే ఆ జాబితాలో తక్కువ స్థాయిలో ఉన్న దేశాలు మెరుగుపరుచుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడూ తాజాగా తరతరాలకు సరిపడ సంపదను కూడబెట్టే అత్యుతమ దేశాల జాబిత వెల్లడైంది. అందులో ఏ దేశం బెస్ట్ స్థానంలో ఉందంటే.. నిజానికి సంపాదన సంభావ్యత, కెరీర్లో పురోగతి, ఉపాధి అవకాశాలు, ప్రీమియం విద్య, ఆర్థిక చలనశీలత, జీవనోపాధి వంటి ఆరు విభిన్న పారామితుల ఆధారంగా ఆయ దేశాల తరతరాలకు సరిపడ సంపదను అంచనా వేస్తారు. ఈ జాబితను ఇచ్చేది పౌర సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్. ఈ కొత్త సూచీ ప్రకారం మొత్తం పారామితుల్లో సుమారు 85% స్కోర్‌తో స్విట్జర్లాండ్ అత్యుత్తమ స్థానాన్ని దక్కించుకుంది. ఆ పారామితులకు సంబంధించి.. సంపాదన సంభావ్యతలో (100), కెరీర్ పురోగతిలో (93), ఉపాధి అవకాశాల్లో (94) పాయింట్లతో స్విట్జర్లాండ్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతేగాదు అధిక జీవన శైలి, ఆర్థిక చలనశీలపై కూడా స్విట్జర్లాండ్ 75 పాయింట్లు సాధించగా, ప్రీమియం విద్యలో 73 పాయింట్లు స్కోర్ చేసింది. ఇలా ఆయా మొత్తం విభాగాల్లో 82 శాతం స్కోర్ చేసి అమెరికా స్విట్జర్లాండ్ తర్వాతి స్థానానికి పరిమితమయ్యింది. అయితే ఉపాధి అవకాశాల పరంగా యూఎస్ స్విట్జర్లాండ్‌తో సమానంగా 94 పాయింట్లు సంపాదించుకుంది. కానీ సంపాదన సంభావ్యత(93), కెరీర్ పురోగత(86), అధిక జీవనోపాధి(68)లలో క్షీణించింది. ఇక ఉపాధి అవకాశాలు, ప్రీమీయం విద్య పరంగా 74 పాయింట్లు స్కోర్ చేసింది. ఇక తరతరాలకు సరిపడే సంపదలో.. భారతదేశం మొత్తం పారామితుల్లో సుమారు 32% పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఇది గ్రీస్‌తో పోలిస్తే తక్కువ. అలాగే జాబితాలో మొదటి 15 స్థానాల్లో చివరి స్థానానికి పరిమితమయ్యింది భారత్. ఆర్థిక చలనశీలతలో 8 పాయింట్లతో అత్యల్ప స్కోర్ చేయగా, ఇతర పారామితుల్లో 43 పాయింట్లతో అత్యధిక పురోగతిని కలిగి ఉంది. సింగపూర్ 79%తో మూడో స్థానంలో ఉండగా, అత్యధిక ఉపాధి అవకాశాల పరంగా మిగత 15 దేశాల కంటే ఎక్కువ పాయింట్లు స్కోర్ చేసింది. ఆస్ట్రేలియా 75% నాల్గో స్థానంలో ఉండగా, కెనడా 74%తో ఐదో స్థానంలో ఉంది. అలాగే గ్రీస్ 49%తో 15 దేశాల జాబితాలో చివరి స్థానంలో ఉంది. (చదవండి: చేతిలో చేయి వేసుకుని మరణించటం మాటలు కాదు..కన్నీళ్లు పెట్టించే భార్యభర్తల కథ!) -
Swiss: స్విట్జర్లాండ్‌లో ప్రబలుతున్న ‘తట్టు’
జ్యురిచ్: స్విట్జర్లాండ్‌లో తట్టు(మీజిల్స్) వ్యాధి ప్రబలుతోంది. లుసాన్నే ప్రాంతంలోని ఓ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు తట్టు సోకింది. దీంతో ఆ స్కూల్‌ను ఈ నెల 18 వరకు మూసివేస్తున్నట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. అయితే ఎంతమంది విద్యార్థులకు తట్టు సోకిందో స్కూల్ యాజమాన్యం క్లారిటీ ఇవ్వలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో స్కూల్ మూసివేస్తున్నామని మాత్రమే స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. ఈ స్కూల్లో జనవరిలోనే ఆరుగురికి తట్టు సోకినట్లు నిర్ధారణ అయిందని, తాజాగా మరో 20 మందికి వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని స్థానిక మీడియా కథనాలు ప్రచురించింది. మీజిల్స్ అనే అంటు వ్యాధి వైరస్ కారణంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వారు దగ్గినపుడు పడే తుంపర్ల ద్వారా వ్యాధి వ్యాప్తిచెందుతుంది. వ్యాధి సోకిన వారికి జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ముక్కు, గొంతులో మంట, ర్యాషెస్ తదితర లక్షణాలు కనిపిస్తాయి. రెండు డోసుల వ్యాక్సిన్లతో మీజిల్స్ రాకుండా నిరోధించవచ్చు. ఇదీ చదవండి.. ఐస్ లాండ్లో అగ్ని పూలు -
WEF: దావోస్ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి
ఢిల్లీ, సాక్షి: తెలంగాణకు భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్(స్విట్జర్లాండ్) పర్యటనకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఆయన దావోస్‌కు వెళ్తున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 54వ సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని అధికారిక బృందం పాల్గొననుంది. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, బలాబలాలు, ప్రాధాన్యతలను ఈ వేదిక ద్వారా చాటి చెప్పాలని రాష్ట్ర బృందం నిర్ణయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశానికి వెళ్తున్న రాష్ట్ర అధికారిక బృందానికి ముఖ్యమంత్రి నేతృత్వం వహించడం ఇది తొలిసారి. ఈ బృందంలో ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతోపాటు ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రెటరీ కూడా ఉన్నారు. రాష్ట్ర బృందం ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా దేశ, విదేశ పారిశ్రామికవేత్తలను కలసి కొత్త ప్రభుత్వ విజన్, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించనుంది. ఐటీ రంగంలో అగ్రగామిగా, లైఫ్ సైన్సెస్ రంగానికి హబ్‌గా ఉన్న తెలంగాణ బలాలను ప్రపంచానికి చాటి చెప్పి పెట్టుబడులను ఆకర్షించాలని భావిస్తోంది. మూడు రోజుల దావోస్ పర్యటనలో 70మందికిపైగా పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం భేటీ కానుంది. -
పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్.. ఏకంగా బికినీలో!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతిభతో పాటు అందానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్‌ను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు తగిన ఆహారపు అలవాట్లతో పాటు కసరత్తు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో దేశముదురు భామ హన్సిక ఒకరు. 32 ఏళ్ల ఈ ముంబయి బ్యూటీ హిందీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఆ తరువాత పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత తమిళంలో ధనుష్ సరసన మాప్పిళ్లై చిత్రంతో మెప్పించారు. ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. నటిగా అర్ధసెంచరీ కొట్టిన హన్సిక గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సొహైల్ కుతురియాను పెళ్లాడినా ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా నటనకు మాత్రం దూరం కాలేదు. ఒక పక్క మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 105 అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్, మెన్ అనే తమిళ చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న హన్సిక ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. హీరోయిన్గా నటిస్తూ తన గ్లామర్‌పై ప్రత్యేక కసరత్తు చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన ముద్దుగుమ్మ ఫుల్‌గా చిల్ అవుతున్నారు. బికినీ దుస్తుల్లో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!
కొన్ని గాథలు ఆశ్చర్యకరంగానూ, భావోద్వేగంగానూ ఉంటాయి. ఆ కథలు సుఖాంత అనుకునేలోపు కొనసాగింపు వెతుక్కుంటూ వస్తుంటే..కొత్త మలుపుతో రసవత్తరంగా ఉంటుది. కానీ సుఖాంతమైతే బావుండనని మాత్రం అనిపిస్తుంది. అలాంటి తపించే కథే స్విస్ మహిళ గాధ. ఆమె పుట్టింది భారత్‌లో, పెరిగింది స్విస్ దంపతులు వద్ద. తన కన్నవాళ్లు వాళ్లు కాదని తెలిసి ఉద్వేగానికి గురైంది. తను జన్మమూలలను వెతుక్కుంటూ భారత్‌కి వచ్చింది. తన తల్లి ఆచూకీ కోసం తపిస్తున్న ఉద్వేగభరితమైన కథ!. విద్యా ఫిలిప్పన్ ఫిబ్రవరి 8, 1996న భారత్‌లో జన్మించింది. ఐతే ఆమె తల్లి పుట్టిన వెంటనే మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో వదిలేసింది. అక్కడ నుంచి ఆమెను 1997లో స్విస్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత విద్యా ఫిలిప్పన్ స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయింది. అయితే తనను పెంచుతున్న తల్లిదండ్రులు తన వాళ్లు కాదని తెలిసి ఒక్కసారిగా ఉద్వేగం చెందింది. తనకు జన్మనిచ్చిన తల్లిది భారత్ అని తెలిసి వెంటనే తనను వదిలేసిన మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించింది. అక్కడ ఆమె తల్లిది ముంబైలోని దహిసర్ ప్రాంతామని తెలుసుకుంది. కానీ విద్యా తల్లి అక్కడ ఇచ్చిన చిరునామా ఇప్పుడు ఉనికిలో లేదు. దీంతో ఆమెకు సామాజిక కార్యకర్త అడాప్టీ రైట్స్ కౌన్సిల్ డైరెక్టర్ అడ్వకేట్ అంజలి పవార్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయంలో మిషనరీ స్వచ్ఛంద సంస్థ కూడా కొంతసాయం చేసింది. వేగంగా నగరాలుగా మారుతున్న తరుణంలో విద్యా తల్లి ఇచ్చిన చిరునామాని ట్రైస్ చేయడం సాధ్యం కాలేదు విద్యాకు. దీంతో సామాజిక కార్యకర్త విద్యా ఫిలిప్పన్ తల్లిని కనుగొనేలా సాయం చేయాలని దహిసర్ ప్రజలను కోరారు. ఆమె తల్లి ఇంటి పేరు కాంబ్లీ అని ఉంది. కాబట్టి ఆ ఇంటి పేరుతో ఉన్నవాళ్లు గురించి ఏమైన తెలిస్తే తమకు తెలియజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యా ఫిలిప్పన్ మాట్లాడుతూ..నా తల్లికి 20 సంవత్సరాలు వయసులో తనకు జన్మనిచ్చిందని, ఆమె కోసం తాను పదేళ్లుగా వెతుకుతున్నానని ఆవేదనగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను తన తల్లి ఆచూకీ కోసం తన భర్తతో కలిసి భారతదేశానికి వచ్చాను. నా కుటుంబం ఇంటిపేరు కాంబ్లీ అని ముంబైలోని వ్యక్తులు మా అమ్మ ఆచూకీని కనుగొంటే గనుక తనకు సమాచారం అందించాలని వేడుకున్నారు. ఏ కారణాల రీత్యా ఆ తల్లి పేగుబంధాన్ని వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందో గానీ కనీసం ఇప్పటికైనా ఆ విధి కరుణించి ఆ తల్లి కూతుళ్లను కలిపితే బావుండను కదూ. ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లి కోసం తపనపడుతున్న ఆ విద్యా ఫిలిప్పన్కు నిరాశ ఎదరవ్వకుండా ఆ తల్లి ఆయురారోగ్యాలతో జీవించి ఉంటే బావుండు. (చదవండి: కిడ్నీ దానం చేస్తే ఆ వ్యక్తి ఇదివరకటిలా బతకడం కుదరదా? ప్రమాదమా!) -
Nicolas Puech: సంరక్షకుడికి రూ. 91 వేల కోట్ల ఆస్తి
న్యూయార్క్: మలి వయసులో తన బాగోగులు చూసుకున్న వ్యక్తిని దత్తత తీసుకుని ఆస్తి మొత్తం కట్టబెట్టాలని స్విట్జర్లాండ్‌కు చెందిన కుబేరుడు నికోలస్ ప్యూచ్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే ఆయన ఆస్తి అంతాఇంతా కాదు. ఏకంగా 1,100 కోట్ల డాలర్లు. అంటే దాదాపు రూ.91,700 కోట్లు. 80 ఏళ్ల ప్యూచ్ ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ ఉత్పత్తుల సంస్థ థియరీ హెర్మెస్ వారసుల్లో ఒకరు. 220 బిలియన్ డాలర్ల విలువైన ఈ సంస్థలో నికోలస్ ప్యూచ్కు 6 శాతం దాకా వాటాలున్నాయి. ప్యూచ్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోవడంతో వారసులెవరూ లేరు. దాంతో ఆయన తదనంతరం భారీ ఆస్తులు ఎవరికి చెందుతాయి? అన్న సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో, గతంలో తన బాగోగులు చూసుకున్న 51 ఏళ్ల నడి వయసు్కడిని దత్తత తీసుకుని వేల కోట్ల ఆస్తులన్నీ అప్పగించనున్నారాయన. ఇప్పటికే దేశ విదేశాల్లోని కోట్ల రూపాయల విలువచేసే కొన్ని భవంతులను అతని పేరిట రాసేశారట. దత్తత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు!
ఎవరికి ఎవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక.. అని పాత తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. ఇలా అయినవారిపై విసుగు చెందిన ఓ బిలియనీర్ తన యావదాస్తిని తన వద్ద పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇంతకీ ఆస్తి ఎంతనుకుంటున్నారు? ఏకంగా రూ.91 వేల కోట్ల విలువైన ఆస్తి. ఇందు కోసం అతన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించాడు. ఈ వ్యవహారం ఇప్పుడు స్విట్జర్లాండ్ మీడియాలో చర్చనీయాంశమైంది. స్విట్జర్లాండ్‌లో ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ ఉత్పత్తుల కంపెనీ హెర్పెస్ (Hermes)ను స్థాపించిన థియరీ హెర్మెస్ మనవడు 80 ఏళ్ల నికోలస్ ప్యూచ్ (Nicolas Puech) తన దగ్గర పనిచేసే 51 ఏళ్ల తోటమాలిని దత్తత తీసుకుని అతనికి 11 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.91 వేల కోట్లు) సంపదను అప్పగించాలని యోచిస్తున్నట్లు ట్రిబ్యూన్ డి జెనీవ్ ఫార్చ్యూన్ అనే స్విస్ పత్రిక నివేదించింది. ఐదో తరం వారసుడు హెర్మెస్ కంపెనీని థియరీ హెర్మెస్1837లో స్థాపించారు. థియరీ హెర్మెస్ కుటుంబంలో ఐదవ తరం వారసుడే నికోలస్ ప్యూచ్. ఈయన కంపెనీలో 9 బిలియన్ నుంచి 10 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌ల విలువైన 5- 6 శాతం వాటా కలిగి ఉన్నారు. అయితే నికోలస్‌కు పెళ్లి, పిల్లలు లేరు. దీంతో ఆయన తన తదనంతరం సంపదను తన వద్ద పనిచేస్తున్న మాజీ తోటమాలికి రాసిచ్చే ప్రక్రియలో ఉన్నారు. దీని కోసం న్యాయవాద బృందాన్ని సైతం నియమించినట్లు సమాచారం. ఇప్పటికే రూ.49 కోట్లు అయితే నికోలస్ దత్తత తీసుకుని ఆస్తిని రాసివ్వాలనుకుంటున్న వ్యక్తి పేరు మాత్రం వెల్లడి కాలేదు. ఆయన స్పానిష్ మహిళను వివాహం చేసుకున్నట్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యక్తికి నికోలస్ 5.9 మిలియన్ డాలర్లు (రూ.49 కోట్లు) విలువైన ఆస్తిని ఇచ్చినట్లు సమాచారం. ఇందులో మొరాకోలోని మరకేష్‌లోని ఆస్తి, స్విట్జర్లాండ్‌లోని మాంట్రీక్స్లోని ఒక విల్లా ఉన్నాయి. కుటుంబంలో విభేదాలు ఫార్చ్యూన్ కథనం ప్రకారం.. కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా 220 బిలియన్ డాలర్ల విలువైన హెర్మెస్ కంపెనీలో తనకున్న 5-6 శాతం వాటాను తన దగ్గర పనిచేసే వ్యక్తికి రాసిచ్చేందుకు నికోలస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హెర్మెస్ కంపెనీ సూపర్వైజరీ బోర్డు నుంచి నికోలస్ ప్యూచ్ 2014లో తప్పుకొన్నారు. ఆ తర్వాత ఎల్వీఎంహెచ్ అనే మరో ఫ్యాషన్ కంపెనీ హెర్మెస్లో 23 శాతం వాటాను బలవంతంగా దక్కించుకుంది. దీన్ని అడ్డుకునేందుకు ఇతర కుటుంబ సభ్యులు తమ షేర్లతో ఓ హోల్డింగ్ కంపెనీని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ప్యూచ్ మాత్రం తన వాటాను కొనసాగించారు. ఈ విభేదాలే నికోలస్ తన వారసులుగా కుటుంబ సభ్యులను కాకుండా బయటి వ్యక్తిని తన వారసుడిగా చేయడానికి కారణంగా భావిస్తున్నారు. దత్తత సాధ్యమేనా? నికోలస్ ప్యూచ్ తన దగ్గర పనిచేసే వ్యక్తిని దత్తత తీసుకునేందుకు నిర్ణయం తీసుకున్నా ఆయన పెద్దవారు కావడంతో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. పెద్దల దత్తతకు సంబంధించి స్విట్జర్లాండ్‌లో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ఇది ఎంత మేరకు సాధ్యమతుందో చూడాలి. -
అత్యంత విలాసవంతమైన నగరాలు.. ముఖ్యంగా ఆ రెండూ..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో సింగపూర్, స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్లు టాప్‌లో నిలిచాయి. ఈ ఏడాది మెస్ట్ ఎక్స్పెన్సివ్ సిటీస్ లిస్ట్‌లో తర్వాతి స్థానాల్లో జెనీవా, న్యూయార్క్, హాంకాంగ్‌లు ఆక్రమించాయి. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఈ జాబితాను గురువారం వెల్లడించింది. స్థానిక కరెన్సీ పరంగా సగటున, 200 కంటే ఎక్కువ సాధారణంగా ఉపయోగించే వస్తువులు, సేవల కోసం ఈ ఏడాదిలో 7.4శాతం ధరలు పెరిగాయి, గత సంవత్సరం రికార్డు 8.1శాతం పెరుగుదల నుంచి కొద్దిగా తగ్గింది. కానీ ఇప్పటికీ 2017-2021లో ట్రెండ్ కంటే చాలా ఎక్కువ అని నివేదిక తెలిపింది. అలాగే పలు కేటగిరీల్లో అధిక ధరల కారణంగా సింగపూర్ గత పదకొండు సంవత్సరాల్లో తొమ్మిదవసారి ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానాన్ని తిరిగి సాధించింది. కార్ నంబర్లపై కఠినమైన ప్రభుత్వ నియంత్రణల కారణంగా సింగపూర్ప్రపంచంలోనే అత్యధిక రవాణా ధరలు నమోదైనాయి. దుస్తులు, కిరాణా , మద్యం లాంటి ఇతర అత్యంత ఖరీదైనవిగా నిలిచాయి. జెనీవా , న్యూయార్క్‌లు మూడో స్థానంలో ఉండగా, హాంకాంగ్ ఐదు, లాస్ ఏంజెల్స్ ఆరో స్థానంలోనూ నిలిచాయి. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆసియా సగటున తక్కువ ధరల పెరుగుదల కొనసాగింది. జపాన్‌లోని ఒసాకా , టోక్యోతో పాటు, చైనాలోని నాన్జింగ్, వుక్సీ, డాలియన్, బీజింగ్ - ర్యాంకింగ్‌లలో ఈర్యాంకింగ్స్లో పతనమైన అతి పెద్ద నగరాలు. -
కోటక్ ఇన్సూరెన్స్‌లో ‘జ్యూరిక్’కు వాటాలు
ముంబై: సాధారణ బీమా సంస్థ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో (కేజీఐ) స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిక్ ఇన్సూరెన్స్ 51 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఇందుకోసం రూ. 4,051 కోట్లు వెచి్చంచనుంది. తదుపరి అదనంగా మూడేళ్లలో అదనంగా 19 శాతం వాటాలు కూడా జ్యూరిక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయనున్నట్లు కేజీఐ మాతృ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్న కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, కేజీఐ తమకు పటిష్టమైన భాగస్వామి కాగలదని జ్యూరిక్ సీఈవో (ఆసియా పసిఫిక్) తులసి నాయుడు తెలిపారు. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇరు సంస్థల వనరులు, అనుభవం తోడ్పడగలవని కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. ప్రీమియంలపరంగా నాన్–లైఫ్ మార్కెట్లో సెపె్టంబర్లో కేజీఐకి 0.52 శాతం వాటా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 1,148 కోట్ల మేర స్థూల ప్రీమియం సాధించింది. కొత్త పెట్టుబడుల అనంతరం సంస్థ విలువ రూ. 7,943 కోట్లుగా ఉండనుంది. -
ఢిల్లీలో స్విస్ యువతి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణం!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ మృతదేహం లభించడం కలకలం సృష్టించింది. కాగా, ఆమె హత్యకు సంబంధించి ఒక నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఇక, మృతురాలిని స్విట్జర్లాండ్‌కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్గా గుర్తించారు. ఈ కేసులో నిందితుడి ఇంట్లో నుంచి భారీగా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. లీనా బెర్గర్ వారం రోజుల కిందట భారత్‌కు వచ్చింది. అయితే, శుక్రవారం పశ్చిమ ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ప్రభుత్వ స్కూల్ వద్ద ఉన్న చెత్త పడేసే నల్లని ప్లాస్టిక్ బ్యాగ్‌లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఆమెతో సంబంధం ఉన్న గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, గురుప్రీత్ సింగ్ తరచుగా స్విట్జర్లాండ్ వెళ్లి లీనాను కలిసేవాడు. వీరిద్దరి మధ్య కొన్నేళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తోంది. అయితే, ఆమెకు మరొకరితో సంబంధం ఉన్నట్లు అనుమానించాడు. ఈ నేపథ్యంలో లీనాను హత్య చేయాలని ప్లాన్ చేశాడు. భారత్‌కు రావాలని ఆమెను పిలిచాడు. దీంతో అక్టోబర్ 11న లీనా ఢిల్లీ చేరుకుంది. ఐదు రోజుల తర్వాత ఆమెను ఒక గదిలో బంధించాడు. కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశాడు. మరోవైపు ఆమె పేరుతో కొనుగోలు చేసిన పాత కారులో లీనా మృతదేహాన్ని గురుప్రీత్ ఉంచాడు. దుర్వాసన రావడంతో చెత్త పారవేసే ప్లాస్టిక్ బ్యాగ్‌లో మృతదేహాన్ని ఉంచి ప్రభుత్వ స్కూల్ ముందు పడేశాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి గురుప్రీత్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని ఉంచిన కారుతోపాటు మరో కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అతడి ఇంటి నుంచి రూ.2.25 కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ -
భారత్ చేతికి మరిన్ని స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: వార్షిక ఆటోమేటిక్ సమాచార మారి్పడి (ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలకు సంబంధించిన 5వ సెట్‌ను భారత్‌కు స్విట్జర్లాండ్ అందించింది. వీటిలో వందల కొద్దీ ఖాతాల వివరాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో కొందరు వ్యక్తులు, కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన అకౌంట్లు అనేకం ఉన్నట్లు వివరించాయి. భారత్‌కు స్విట్జర్లాండ్ అందించిన వివరాల్లో ఖాతాదారు పేరు, చిరునామా, దేశం, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, ఖాతాల్లో బ్యాలెన్స్ మొదలైనవన్నీ ఉన్నట్లు పేర్కొన్నాయి. గత నెల సెపె్టంబర్లో సమాచార మారి్పడి చోటు చేసుకోగా తదుపరి విడత సెట్‌ను స్విట్జర్లాండ్ 2024 సెప్టెంబర్‌లో భారత్‌కు అందించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రిటర్నుల్లో తమ ఆర్థిక వివరాలన్నీ సక్రమంగా పొందుపర్చారా లేదా అనేది పరిశీలించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుని, పన్నులు ఎగ్గొడుతున్న కుబేరుల ఆటకట్టడానికి ఉద్దేశించిన ఏఈఓఐ కింద భారత్‌కు తొలిసారి 2019 సెపె్టంబర్లో మొదటి సెట్ వివరాలు లభించాయి. మరోవైపు, ఈ ఏడాది మొత్తం 104 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాల మారి్పడి జరిగినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) తెలిపింది. 78 దేశాలతో సమాచారం ఇచి్చపుచ్చుకున్నట్లు పేర్కొంది. 25 దేశాల నుంచి తాము వివరాలు తీసుకున్నప్పటికీ ఆయా దేశాల గోప్యత ప్రమాణాలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో లేనందున తాము తమ సమాచారమేమీ ఇవ్వలేదని వివరించింది. -
4 రాష్ట్రాలను తాకే ఏకైక జిల్లా ఏది? ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ ఎందుకయ్యింది?
దేశంలోని ప్రతి రాష్ట్రంలో అనేక జిల్లాలు ఉన్నప్పటికీ, భౌగోళిక ప్రత్యేకతల విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్‌లోని ఆ జిల్లా పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. యూపీలోని సోన్‌భద్ర జిల్లా అనేక ప్రత్యేకతలను కలిగివుంది. విస్తీర్ణం పరంగా ఉత్తరప్రదేశ్‌లోని రెండవ అతిపెద్ద జిల్లా సోన్‌భద్ర. నిజానికి సోన్‌భద్ర భారతదేశంలోని ఒక ప్రత్యేకమైన జిల్లా. ఇది నాలుగు రాష్ట్రాల సరిహద్దులను తాకుతుంది. ఈ ప్రత్యేకత కారణంగా పోటీ పరీక్షలలో సోన్‌భద్ర జిల్లాకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతుంటారు. సోన్‌భద్ర యూపీలో ఉన్నప్పటికీ దాని సరిహద్దులు మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లను తాకుతాయి. సోన్‌భద్ర మైనింగ్ గనుల పరంగానే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కైమూర్ కొండలలో ఖనిజాలు పెద్ద మొత్తంలో లభిస్తాయి. సోన్‌భద్ర ప్రాంతంలో బాక్సైట్, సున్నపురాయి, బొగ్గు, బంగారం కూడా లభ్యమవుతుంది. 1989కి ముందు సోన్‌భద్ర యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో ఉండేది. అయితే 1998లో దీనిని వేరు చేసి సోన్‌భద్ర అనే పేరు పెట్టారు. ఇక్కడ ప్రవహించే నది కారణంగా ఈ ప్రాంతానికి సోన్‌భద్ర అనే పేరు వచ్చింది. ఇక్కడ సోన్ నది ప్రవహిస్తుంది. ఈ జిల్లాలో కన్హర్, పంగన్లతో పాటు రిహాండ్ నది కూడా ప్రవహిస్తుంది. సోన్‌భద్ర జిల్లా వింధ్య , కైమూర్ కొండల మధ్య ఉంది. ఇక్కడి అందమైన దృశ్యాలు ఇట్టే ఆకట్టుకుంటాయి. పండిట్ నెహ్రూ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ జిల్లాలోని ప్రకృతి అందాలను చూసి, ఈ ప్రాంతానికి ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా’ అనే పేరు పెట్టారు. సోన్‌భద్రలో అడుగడుగునా పచ్చదనం, అందమైన పర్వతాలు కనిపిస్తాయి. ఇక్కడి నదుల ప్రవాహం కనువిందు చేస్తుంది. ఇక్కడ పలు పవర్ ప్లాంట్లు ఉన్నకారణంగా ఈ ప్రాంతాన్ని పవర్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా చదవండి: ఆ బాబాలు ఏం చదువుకున్నారు? -
ఇండియన్ ఫ్యామిలీ చేతికి అద్భుతమైన విల్లా.. ధర ఎన్ని కోట్లంటే?
భారతీయ సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్, అతని భార్య రాధిక ఓస్వాల్ ఇటీవల స్విట్జర్లాండ్‌లో కోట్ల రూపాయల భవనం కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన విల్లాలలో ఒకటి కావడం విశేషం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్విట్జర్లాండ్‌లోని గింగిన్స్ గ్రామంలోని పిక్చర్స్క్యూ వద్ద 4.3 లక్షల చదరపు అడుగుల ఈ విల్లాను వారు సొంత చేసుకున్నారు. ఈ భవనం ఖరీదు 200 మిలియన్ డాలర్లు అని తెలుస్తోంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 1649 కోట్లు. ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత ఖరీదైన టాప్ 10 భవనాల్లో ఒకటి అని నివేదికలు చెబుతున్నాయి. ఈ విల్లా ఒకప్పుడు గ్రీకు షిప్పింగ్ మాగ్నెట్ అరిస్టాటిల్ ఒనాసిస్ కుమార్తె 'క్రిస్టినా ఒనాసిస్' యాజమాన్యంలో ఉండేది. అయితే దీన్ని ఓస్వాల్ కుటుంబం కొనుగోలు చేసిన తరువాత రీడిజైన్ చేసింది. ఈ రీడిజైన్ బాధ్యతలను ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ జెఫ్రీ విల్కేస్కు అప్పగించారు. ఈ విల్లా భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, అదే సమయంలో విశ్వసౌందర్యాన్ని నిలుపుకోవాలని చెబుతూ తమకు అప్పగించారని డిజైనర్ జెఫ్రీ విల్కేస్ అన్నారు. ఈ విల్లాలో ఒక ప్రైవేట్ జిమ్, స్పా, వెల్నెస్ వింగ్, పెద్ద ఫ్రెంచ్ కిటికీలు ఉన్నాయి. ఈ భవనం చుట్టూ తోటలు మంచుతో కప్పబడిన పర్వతాలు ఉన్నాయి. ఇది చూడటానికి ఒక అద్భుతమైన రాజ సౌధం మాదిరిగా కనిపిస్తుంది. (ఇదీ చదవండి: చైనా మిలియనీర్ సాహసానికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. 56 ఏళ్ల వయసులో..) ఇక పంకజ్ ఓస్వాల్ విషయానికి వస్తే.. ఈయన 2016లో మరణించిన ఓస్వాల్ ఆగ్రో మిల్స్ అండ్ ఓస్వాల్ గ్రీన్‌టెక్ వ్యవస్థాపకుడు పారిశ్రామికవేత్త 'అభయ్ కుమార్ ఓస్వాల్' కుమారుడు. తండ్రి మరణించిన తరువాత కంపెనీ బాధ్యతలను పంకజ్ ఓస్వాల్ స్వీకరించాడు. కంపెనీ పరిధిలో పెట్రోకెమికల్స్, రియల్ ఎస్టేట్, ఎరువులకు సంబంధించిన కార్యకలాపాలు జరుగుతున్నాయి. (ఇదీ చదవండి: స్కార్పియో ఎన్ సన్‌రూఫ్ లీక్‌పై ఇంకా అనుమానం ఉందా? ఇదిగో క్లారిటీ!) View this post on Instagram A post shared by RIDI (@realridi) పంకజ్ ఓస్వాల్ మన దేశంలో ఉన్న మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత రాధికా ఓస్వాల్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వారికి వసుందర ఓస్వాల్, రిధి ఓస్వాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2013లో ఓస్వాల్ కుటుంబం ఆస్ట్రేలియా నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. -
స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు..! వయసేమో 11.. షాకైన టీచర్లు
సాధారణంగా మాటలు రాని చిన్నపిల్లలకు డైపర్లు వేస్తుంటారు. వారు టాయిలెట్ వచ్చేటప్పుడు చెప్పలేరనే భావనతో డైపర్లు వాడుతుంటారు. అయితే వారు పెరిగేకొద్దీ డైపర్ల వినియోగాన్ని మానేస్తారు. సాధారణంగా పిల్లలకు 3 లేదా 4 ఏళ్లు వచ్చే వరకూ డైపర్లు వాడతారు. అలాగే ఇతరత్రా సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా డైపర్లు వాడతారు. అయితే 11 ఏళ్ల పిల్లలు కూడా డైపర్లు వాడటాన్ని ఎక్కడైనా చూశారా? పిల్లలకు 2 లేదా మూడేళ్లు వచ్చేసరికి వారి తల్లిదండ్రులు వారికి టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తుంటారు. అప్పటి నుంచి వారే స్వయంగా టాయిలెట్‌కు వెళుతుంటారు. అయితే దీనికి భిన్నంగా ఆ దేశంలోని పిల్లలు 11 లేదా 12 ఏళ్లు వచ్చినా ఇంకా డైపర్లు వాడుతూనే ఉన్నారు. డైపర్లు పెట్టుకునే స్కూలుకు వెళుతుంటారు. పెద్దపిల్లలు కూడా డైపర్లు పెట్టుకుని స్కూలుకు వెళ్లే దేశం స్విట్జర్లాండ్. ఈ దేశం ఎంతో అందమైనదిగా పేరుగాంచింది. అభివృద్ధి పరంగానూ వేగంగా ముందుకు సాగుతోంది. అయితే అక్కడి తల్లిదండ్రులు తమ పిల్లలను డైపర్ల పెట్టి స్కూలుకు పంపుతుంటారు. ఇన్సైడర్ వెబ్సైట్ తెలిపిన వివరాల ప్రకారం పెద్ద వయసుకలిగి, అన్నిరకాలుగా ఆరోగ్యవంతుతైన పిల్లలు కూడా డైపర్లు ధరించి స్కూలుకు రావడాన్ని స్విట్జర్లాండ్ టీచర్లు గమనించారు. నాలుగేళ్లు దాటి, మాటలు వచ్చిన పిల్లలకు కూడా డైపర్లు పెట్టి, వారి తల్లిదండ్రులు స్కూలుకు పంపిస్తున్నారు. 11 ఏళ్ల పిల్లలు కూడా.. స్విట్జర్లాండ్‌కు చెందిన పిల్లల మానసిక వైద్య నిపుణులు రీటా మెస్మర్ మాట్లాడుతూ ఒక 11 ఏళ్ల బాలిక తన దగ్గరకు వచ్చిందని, తాను డైపర్ పెట్టుకుని స్కూలుకు వెళతానని తెలిపిందన్నారు. ఆ చిన్నారికి తల్లిదండ్రులు టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వకపోవడంతోనే ఇలా జరుగుతున్నదన్నారు. స్విట్జర్లాండ్‌లోని చాలామంది పిల్లలకు టాయిలెట్ ఎలా వినియోగించాలో తెలియదన్నారు. పిల్లలకు టాయిలెట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు కూడా వారి తల్లిదండ్రులకు టైమ్ ఉండటం లేదన్నారు. టీచర్లు ఏమంటున్నారంటే.. స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక ఎడ్యుకేషనల్ సైంటిస్ట్ మాట్లాడుతూ డైపర్లు మార్చడం అనేది టీచర్ల పని కాదన్నారు. టాయిలెట్ ట్రైనింగ్ అనేది తల్లిదండ్రుల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రతీతల్లిదండ్రులూ పిల్లలకు సరైన సమయంలో టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలని సూచించారు. పెద్ద పిల్లలు డైపర్లు వాడటం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. -
అమ్మాచిని మించి దైవం ఉన్నదా!
మనం చిన్నవయసులో ఉన్నప్పుడు అమ్మ ఎత్తుకుంటుంది. కుంచెం నడవడం వచ్చిన తరువాత కూడా ఎత్తుకోమని అమ్మ దగ్గర మారాం చేసేవాళ్లం. అలాంటి అమ్మను ఎత్తుకోవడాన్ని మించిన అదృష్టం ఏం ఉంటుంది! కేరళకు చెందిన రోజన్ పరంబిల్ స్విట్జర్లాండ్‌లో ఉద్యోగం చేస్తాడు. అయిదు సంవత్సరాల తరువాత సొంత ఊరు వచ్చాడు. వయసు పైబడి, బలహీనంగా కనిపిస్తున్న అమ్మాచి(అమ్మ)ను చూసి చాలా బాధేసింది. ఎంతో కాలంగా ఇంటి నాలుగు గోడలకే పరిమితమైన అమ్మకు బయటిగాలి తాకేలా ట్రిప్ ప్లాన్ చేశాడు. ఈ చిరు ప్రయాణంలో వారు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. రకరకాల జ్ఞాపకాలను కలబోసుకుని తెగ నవ్వుకున్నారు. నచ్చిన చోట ఆగి సెల్ఫీలు తీసుకున్నారు. గతంలో ఒకసారి రోజన్ తన తల్లిని స్విట్జర్లాండ్ తీసుకువెళ్లి యూరప్‌లోని రకరకాల ప్రదేశాలు చూపెట్టాడు. తల్లిలో అప్పుడు కనిపించిన ఎనర్జీ ఇప్పుడు మరోసారి కనిపించింది. ట్రిప్ కోసం రోజన్ తన తల్లిని భుజాల మీద మోస్తూ కారు దగ్గరికి తీసుకువెళుతున్న వీడియో వైరల్ అయింది. నెటిజనులను కదిలించేలా చేసింది. -
స్విస్‌లో సాంగ్
అసలే ఎండాకాలం.. పైగా కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో కూల్ కూల్‌గా ఉండేప్రాంతానికి వెళ్లే చాన్స్ వస్తే.. హాయి హాయిగా ఉంటుంది. ప్రస్తుతం ‘భోళా శంకర్’ టీమ్ ఆ హాయినే అనుభవిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో ల్యాండ్ అయ్యాడు ‘భోళా శంకర్’. అక్కడి కూల్ కూల్ క్లైమేట్లో ప్రేయసితో ఫుల్ స్వింగ్‌లో స్ప్రింగ్‌లాంటి స్టెప్పులేస్తున్నాడట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన చెల్లెలి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్లోప్రారంభమైంది. చిరంజీవి, తమన్నాలపై సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరకర్త. ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. -
ప్రపంచ దేశాల్లో భారత్‌లో సగటు జీతం, నిరుద్యోగ శాతం ఎంతో తెలుసా?
అవునూ.. మీ జీతమెంత? ఎందుకంటే.. ప్రపంచంలో వివిధ దేశాల ప్రజల సగటు జీతం ఎంత అన్న దానిపై వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఒక నివేదిక రూపొందించింది.. దీని ప్రకారం ప్రపంచంలోని 23 దేశాల్లో సగటు జీతం లక్ష రూపాయల కన్నా ఎక్కువగా ఉందట. 104 దేశాల్లో సర్వే చేయగా.. టాప్‌లో స్విట్జర్లాండ్ (రూ.4,98,567) ఉండగా.. అట్టడుగున పాకిస్థాన్ (రూ. 11,858) ఉంది. మరి మన పరిస్థితి ఏమిటనా.. భారత్‌తో సగటు జీతం రూ.46,861. ఆయా దేశాల్లో ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకొని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. జీతాల సంగతి చెప్పుకున్నాం.. ఇప్పుడు అసలు జీతాలే రాని వారి గురించి చెప్పుకుందాం.. అదేనండీ నిరుద్యోగుల గురించి.. ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగిత శాతాన్ని చూస్తే.. నైజీరియాలో ఇది ఎక్కువగా ఉంది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఖతార్‌లో ఇది అత్యల్పంగా ఉంది. పలు దేశాల్లో నిరుద్యోగిత శాతం సంగతి ఓసారి చూస్తే.. చదవండి: విమానంలో రెచ్చిపోయిన ప్రయాణికుడు.. ఎయిర్ హోస్ట్‌పై లైంగిక వేధింపులు -
స్విస్ సెంట్రల్ బ్యాంక్‌పై ఇన్వెస్టర్ల దావా
లండన్: క్రెడిట్‌సూసే ఇన్వెస్టర్ల బృందం స్విస్ స్విట్జర్లాండ్ ఫైనాన్షియల్ మార్కెట్ సూపర్ వైజరీ అథారిటీ (ఎఫ్‌ఐఎన్‌ఎంఏ/స్విస్ సెంట్రల్ బ్యాంక్)కి వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు. గత నెలలో సంక్షోభంలో పడ్డ క్రెడిట్ సూసేని కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం ఫలితంగా 16 బిలియన్ స్విస్ఫ్రాంకోలు (17.3 బిలియన్ డాలర్లు) విలువైన బాండ్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారు సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. క్రెడిట్ సూసేని యూబీఎస్ 3.25 బిలియన్ డాలర్లకు కొనడం తెలిసిందే. ఇదంతా కేంద్ర బ్యాంకు మార్గదర్శకంలోనే జరిగింది. దీంతో స్విట్జర్లాండ్‌లోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఉన్న క్రెడిట్‌సూసే మునిగిపోకుండా కాపాడినట్టయింది. ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడంతో క్రెడిట్‌సూసే సంక్షోభం పాలైంది. ఎఫ్‌ఐఎన్‌ఎంఏ తీసుకున్న నిర్ణయం స్విస్ ఆర్థిక వ్యవస్థపై ఉన్న విశ్వసనీయత, కచ్చితత్వాన్ని దెబ్బతీసిందని లా సంస్థ క్విన్ ఎమాన్యుయేల్ అర్కుహర్ట్ మేనేజింగ్ పార్ట్నర్ థామస్ వెర్లెన్ తెలిపారు. ఇన్వెస్టర్ల తరఫున ఈ సంస్థే వ్యాజ్యం దాఖలు చేసింది. కోర్టును ఆశ్రయించిన ఇన్వెస్టర్లు సంయుక్తంగా 5 బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను బాండ్లలో కలిగి ఉన్నారు. -
క్రెడిట్ సూసీకి ‘స్విస్ బ్యాంక్’ భరోసా
న్యూఢిల్లీ: ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రెడిట్ సూసీకి స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు అండగా నిల్చింది. వ్యవస్థాగతంగా కీలకమైన బ్యాంకుపై ఇన్వెస్టర్లు, డిపాజిటర్లలో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు, దానిపై నమ్మకాన్ని కలిగించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా 54 బిలియన్ డాలర్ల మేర రుణాన్ని అందించేందుకు అంగీకరించింది. క్రెడిట్ సూసీ గురువారం ఈ విషయం వెల్లడించింది. దీంతో బ్యాంకు షేరు ఒక దశలో ఏకంగా 33% ఎగిసి 2.17 స్విస్ ఫ్రాంకులకు (1 స్విస్ ఫ్రాంకు సుమారు రూ. 89) పెరిగింది. అటు యూరప్ బ్యాంకింగ్ షేర్లు కూడా ఒక మోస్తరుగా పెరిగాయి. మరింతగా పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ ఇన్వెస్టరు నిరాకరించారన్న వార్తలతో క్రెడిట్ సూసీ షేరు బుధవారం 30% కుప్పకూలిన సంగతి తెలిసిందే. అమెరికాలో వారం రోజుల వ్యవధిలో రెండు బ్యాంకులు (ఎస్వీబీ, సిగ్నేచర్) మూతబడటం, క్రెడిట్ సూసీ ఆర్థిక పరిస్థితిపై నీలినీడలు కమ్ముకోవడం తదితర పరిణామాలతో అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభం ముంచుకొస్తోందన్న ఆందోళన నెలకొంది. అయితే, ఈ భయాలను తొలగించేందుకు, అంతర్జాతీయంగా కీలక బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న క్రెడిట్ సూసీని నిలబెట్టేందుకు స్విస్ నేషనల్ బ్యాంక్ రంగంలోకి దిగింది. మూలధనం, లిక్విడిటీపరమైన నిబంధనలకు అనుగుణంగా క్రెడిట్ సూసీ ఉంటే బ్యాంక్‌కు అవసరమైన తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది. -
Credit Suisse: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం!
సాక్షి, బిజినెస్ డెస్క్: దాదాపు పదిహేనేళ్ల క్రితం తరహాలో అంతర్జాతీయంగా మరో బ్యాంకింగ్ సంక్షోభం ముప్పు ముంచుకు రాబోతోందా? అమెరికా, యూరప్‌వ్యాప్తంగా బ్యాంకుల పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బ్యాంకులో మరింతగా ఇన్వెస్ట్ చేసేది లేదంటూ కీలక ఇన్వెస్టరు ప్రకటించడంతో క్రెడిట్ సూసీ షేర్లు బుధవారం 27 శాతం పతనమయ్యాయి. గత రెండేళ్లలో బ్యాంకు షేరు సుమారు 85 శాతం క్షీణించింది. డిఫాల్ట్ అయ్యే అవకాశాలు 40 శాతం మేర ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితులపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. సమస్యలతో సతమతం.. వాస్తవానికి క్రెడిట్ సూసీ గత కొన్నాళ్లుగా సమస్యలతో సతమతమవుతూనే ఉంది. 2019లో సంస్థ సీవోవో పియరీ ఆలివర్ కొందరు ఉన్నత స్థాయి ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకున్నారు. అయితే సదరు డిటెక్టివ్ అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ఆలివర్ను క్రెడిట్ సూసీ తొలగించింది. ఇదంతా బ్యాంకు వ్యవహారంపై సందేహాలు రేకెత్తించింది. అటుపైన 2021లో ఆర్చిగోస్ క్యాపిటల్ అనే అమెరికన్ హెడ్జ్ ఫండ్ సంస్థ మూతబడటంతో దాదాపు 5 బిలియన్ డాలర్ల భారీ నష్టం మూటకట్టుకుంది. ఆ కంపెనీకి క్రెడిట్ సూసీ బ్రోకరేజి సర్వీసులు అందించేది. అటు పైన గ్రీన్‌సిల్ క్యాపిటల్ అనే మరో సంస్థ మూతబడటంతో.. దాని ప్రభావాల కారణంగా ఇన్వెస్టర్లు 3 బిలియన్ డాలర్ల దాకా నష్టపోయారు. గతేడాది ఫిబ్రవరిలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పైగా డిపాజిట్లు ఉన్న 30,000 మంది పైచిలుకు ఖాతాదారులపై మనీలాండరింగ్, అవినీతి తదితర ఆరోపణలు రావడంతో సంస్థ ప్రతిష్ట మరింత మసకబారింది. దీంతో క్రమంగా డిపాజిట్ల విత్‌డ్రాయల్స్ మొదలయ్యాయి. 2019 నుంచి టాప్ లీడర్షిప్ ఇప్పటికి అనేక సార్లు మారింది. గతేడాది క్రెడిట్ సూసీ పెట్టుబడుల కోసం అన్వేషిస్తుండగా.. సౌదీ నేషనల్ బ్యాంక్ 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. సంస్థలో మరింతగా ఇన్వెస్ట్ చేసే యోచన లేదని సౌదీ నేషనల్ బ్యాంక్ చైర్మన్ అమ్మార్ అల్ ఖుదైరీ ప్రకటించడం తాజాగా క్రెడిట్ సూజీ షేర్ల పతనానికి దారి తీసింది. 2018లో 16 స్విస్ ఫ్రాంకులుగా ఉన్న షేరు ప్రస్తుతం 1.70 ఫ్రాంకులకు (ఒక స్విస్ ఫ్రాంక్ విలువ సుమారు రూ. 89). పడిపోయింది. మార్కెట్లలో ప్రకంపనలు.. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూతబడటం, తాజాగా క్రెడిట్ సూసీ పరిణామాలతో ఇతరత్రా బ్యాంకులపైనా ప్రభావం పడింది. బుధవారం పలు యూరోపియన్ బ్యాంకుల షేర్లు రెండంకెల స్థాయిలో క్షీణించాయి. ఫ్రాన్స్‌కు చెందిన సొసైటీ జనరల్ 12 శాతం, బీఎన్పీ పారిబా 10 శాతం, జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్.. బ్రిటన్ సంస్థ బార్క్లేస్ బ్యాంక్ మొదలైనవి సుమారు 8 శాతం పడిపోయాయి. రెండు ఫ్రెంచ్ బ్యాంకుల్లోనూ కొంత సమయం పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అటు అమెరికాలో బ్యాంకులూ అదే బాటలో పయనించాయి. ప్రధానంగా డిపాజిటర్లు ఎకాయెకిన డిపాజిట్లను వెనక్కి తీసుకునే రిస్కులు ఉన్న చిన్న, మధ్య రకం బ్యాంకుల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 17 శాతం, ఫిఫ్త్ థర్డ్ బ్యాంకార్ప్ 6 శాతం, జేపీమోర్గాన్ చేజ్ 4 శాతం పతనమయ్యాయి. -
రైల్వే కానిస్టేబుల్ పాడుపని.. సిట్జర్లాండ్ మహిళలతో అసభ్యంగా..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లో ఓ రైల్వే కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించాడు. తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమెపై భౌతికంగా దాడి చేయబోయాడు. ఆమెకు కాబోయే భర్త పక్కనే ఉన్నా పట్టించుకోకుండా కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అతిథి అని కూడా చూడకుండా విదేశీ మహిళను వేధించిన ఈ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పేరు జితేంద్ర సింగ్. గత ఏడాదిన్నరగా యూపీ ఫిరోజాబాద్‌లోని ఆర్పీఎఫ్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో రూ.6 కోట్లు సీజ్.. కీలక పదవికి రాజీనామా -
ఏపీ విద్యా వ్యవస్థ భేష్.. స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ప్రత్యేకించి విద్యా వ్యవస్థ అద్భుతమని స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ కొనియాడారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అయితే ఇండియాలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఆ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయని కొనియాడారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చుతోందని, ఇది గర్వించదగ్గ విషయం అని అన్నారు. కొంత కాలం తర్వాత ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా నిలుస్తారని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అందరి వల్లా కాదని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి ఉన్న వారికే సాధ్యమవుతుందని చెప్పారు. ఆకట్టుకున్న ఏపీ స్టాల్ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్టాల్ పలువురిని ఆకట్టుకుంది. స్వయంగా దేశాధ్యక్షుడే ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు వ్యక్తం చేయడంతో స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ స్టాల్‌ను సందర్శించారు. ప్రభుత్వ పథకాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఎడ్యుకేషన్ కోసం నాడు–నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాలు మెరుగుదల.. తదితర విషయాలపై ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. డిజిటల్ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్ బోర్డుల ఏర్పాటు, ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన తదితర కార్యక్రమాలన్నీ పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో న్యూట్రిషన్ ఫుడ్ అందించడం మంచి పరిణామం అన్నారు. చదవండి: టీడీపీకి పుట్టగతులుండవని ‘ఈనాడు’ భయం లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ‘ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్’ విధానం చాలా నచ్చిందన్నారు. ఏపీ స్టాల్‌ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. గరŠల్స్ ఎడ్యుకేషన్ విధానంతో అసమానతలను రూపుమాపవచ్చని అభినందించారు. డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా బైజూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో గొప్పగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియా నుండి ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు వున్నవ షకిన్ కుమార్ పాల్గొన్నారు. -
‘దావోస్’ పెట్టుబడులు రూ. 21 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 21 వేల కోట్ల మేర పెట్టుబడులను సాధించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు పేర్కొన్నారు. తనతోపాటు అధికారుల బృందం 4 రోజులపాటు అక్కడి సమావేశాల్లో పాల్గొని తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించినట్లు ఆయన ట్విట్టర్లో వివరించారు. అంతర్జాతీయ, దేశీయ దిగ్గజ కంపెనీలకు చెందిన చైర్మన్లు, సీఈఓలు తదితరులతో 52 సమావేశాలు, 6 రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌ను బహుళజాతి కంపెనీల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు, విధానాల రూపకర్తలు సందర్శించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపం, మౌలిక వసతులు, కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రభుత్వ విధానాలపై రూపొందించిన ప్రత్యేక వీడియోలను ఈ పెవిలియన్‌లో ప్రదర్శించారు. యువతకు భారీగా ఉద్యోగాల కోసం.. వరుసగా ఐదోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరైన కేటీఆర్... దావోస్‌లో అడుగు పెట్టింది మొదలు వరుసగా వివిధ దిగ్గజ కంపెనీల అధినేతలతో ముఖాముఖి చర్చలు జరిపారు. దావోస్ పర్యటన మార్గమధ్యలో స్విట్జర్లాండ్‌లోని అతిపెద్ద నగరమైన జూరిచ్‌లో ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణకు పెట్టుబడులతో రావాల్సిందిగా వారిని ఆహ్వానించారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తెచ్చి పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఆలోచనే నిరంతరం తమను నడిపిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. దావోస్ పర్యటనకు వెళ్లిన కేటీఆర్ బృందం శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. దావోస్‌లో రాష్ట్రం సాధించిన పెట్టుబడులు ►హైదరాబాద్‌లో మరో 3 డేటా సెంటర్ల ఏర్పాటు కోసం మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబడి ప్రకటన. ►హైదరాబాద్‌లో హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు భారతీ ఎయిర్టెల్ గ్రూప్ రూ. 2 వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్. ►రూ. వెయ్యి కోట్లతో హైదరాబాద్ కేంద్రంగా భారతీయ మార్కెట్లోకి ఫ్రాన్స్ ఔషధ పరిశోధన, తయారీ సంస్థ యూరోఫిన్స్ విస్తరణ ూలండన్ తరువాత హైదరాబాద్‌లో అపోలో టైర్స్ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్. ►రూ.210 కోట్ల పెట్టుబడితో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ►తెలంగాణలో పెప్సీకో కార్యకలాపాలు రెట్టింపు ►హైదరాబాద్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక నాలుగో పారిశ్రామిక విప్లవానికి సంబంధించిన కేంద్రం ►హైదరాబాద్‌లో రూ. 150 కోట్లతో రీహాబిలిటేషన్ థెరపీలో రోగులు, వైద్య సంస్థలకు అవసరమయ్యే డిజిటల్ సేవలను అందించే వెబ్‌పీటీ ప్రపంచ సామర్థ్య కేంద్రం. -
ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు
లండన్: వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇతరుల మానసిక వ్య«థ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు. మొదటి గ్రూప్‌లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్‌లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్‌లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు. యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్ ఏజింగ్ పత్రికలో ప్రచురించారు. -
స్విట్జర్లాండ్‌కు మహేశ్‌బాబు ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ గురించి పరిచయం అక్కర్లేదు. వంశీ మూవీ సమయంలో ప్రేమలో పడ్డ మహేశ్- నమ్రత ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా ఈ జంట పిల్లలతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెళ్లింది. అయితే న్యూ ఇయర్ వేడుకల కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మహేశ్ బాబు తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. మహేష్ బాబు అతని భార్య నమ్రతా శిరోద్కర్, పిల్లలు గౌతమ్, సితార ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో క్రిస్మస్ చెట్టు వద్ద ఫోటోకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా మహేశ్ సతీమణి నమ్రత అదే ఫోటోను షేర్ చేస్తూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందే నమ్రత ఒక కప్పు పానీయంతో కుర్చీలో కూర్చుని సితార ఫోన్ బ్రౌజ్ చేస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. కొద్ది రోజుల క్రితమే మహేష్ తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. సెలవులు ఎంజాయ్ చేసేందుకు ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లారు. కాగా.. మహేశ్ బాబు దర్శకుడు త్రివిక్రమ్‌తో తన తదుపరి చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో నటి పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళితో ఒక ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. మహేశ్ చివరిసారిగా సర్కారు వారి పాట సినిమాలో లోన్ ఏజెంట్‌గా కనిపించారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Mahesh Babu (@urstrulymahesh) -
పోర్చు‘గోల్స్’ మోత
దోహా: ఆరంభం నుంచి సూపర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఆడించకపోయినా... తమ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదని నిరూపిస్తూ పోర్చుగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో కళ్లు చెదిరే ప్రదర్శనతో మెరిసింది. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ, పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ రొనాల్డో లేకున్నా పోర్చుగల్ జట్టు భవిష్యత్‌కు ఢోకా లేదని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 6–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్‌ను చిత్తుగా ఓడించి 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోర్చుగల్ తరఫున తొలి ప్రపంచకప్‌లో ఆడుతున్న 21 ఏళ్ల గొన్సాలో రామోస్ (17వ, 51వ, 67వ ని.లో) మూడు గోల్స్‌తో ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... పెపె (33వ ని.లో), రాఫెల్ గెరెరో (55వ ని.లో), రాఫెల్ లియా (90+2వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్విట్జర్లాండ్ జట్టుకు మాన్యుయెల్ అకాంజీ (58వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. చివరిసారి 1954లో ప్రపంచకప్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్విట్జర్లాండ్ ఆ తర్వాత ఐదుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరోవైపు ఎనిమిదోసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 1966లో మూడో స్థానంలో నిలిచిన పోర్చుగల్, 2006లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో పోర్చుగల్ తలపడుతుంది. తొలిసారి సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డో... వరుసగా ఐదో ప్రపంచకప్‌లో ఆడుతున్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి తుది 11 మంది జట్టులో చోటు కోల్పోయాడు. రొనాల్డో స్థానంలో గొన్సాలో రామోస్‌ను తొలి నిమిషం నుంచి ఆడించాలని కోచ్ ఫెర్నాండో సాంటోస్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించిన రామోస్ ఘనా, ఉరుగ్వేలతో మ్యాచ్‌ల్లో సబ్‌స్టిట్యూట్‌గా చివరి నిమిషాల్లో బరిలోకి దిగాడు. అయితే కీలకమైన మ్యాచ్‌లో అత్యంత అనుభవజ్ఞుడు, 37 ఏళ్ల రొనాల్డోను కాదని రామోస్‌ను ఆరంభం నుంచే ఆడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే తన ఎంపిక సరైనదేనని రామోస్ నిరూపించుకున్నాడు. మూడు గోల్స్ చేయడమే కాకుండా గెరెరో గోల్ చేయడానికి రామోస్ సహాయపడ్డాడు. పోర్చుగల్ ఖాతాలో ఐదు గోల్స్ జమయ్యాక.. 74వ నిమిషంలో రొనాల్డోను జావో ఫెలిక్స్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి పంపించారు. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో రొనాల్డో రిజర్వ్ బెంచ్‌కు పరిమితమై మ్యాచ్ మధ్యలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
FIFA WC: రొనాల్డోకు ఘోర అవమానం? బెంచ్ మీద కూర్చుని.. సిగ్గు పడండి అంటూ
FIFA World Cup 2022 Portugal Vs Switzerland- Cristiano Ronaldo: ‘‘శుభాభినందనలు పోర్చుగల్! 11 మంది ఆటగాళ్లు జాతీయ గీతం పాడుతున్న సమయంలో అభిమానుల కళ్లన్నీ నీమీదే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగడం, ఆ 90 నిమిషాలు నీ ఆటను ఆస్వాదించకుండానే ముగిసిపోవడం నిజంగా సిగ్గుచేటు. అభిమానులు నీకోసం వెదుకుతూనే ఉన్నారు. నీ పేరును కలవరిస్తూనే ఉన్నారు. ఆ దేవుడి దయ వల్ల నీ ప్రియమైన స్నేహితుడు ఫెర్నాండో నీతో కలిసి నడవాలి. మరో మ్యాచ్‌లోనైనా నిన్ను చూసే అవకాశం ఇవ్వాలి’’ అంటూ పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ జార్జినా రోడ్రిగేజ్ ఆ జట్టు కోచ్ ఫెర్నాండో సాంటోస్ తీరుపై విరుచుకుపడింది. ఫిఫా వరల్డ్‌కప్-2022లో భాగంగా స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో రొనాల్డోను బెంచ్‌కే పరిమితం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డ జార్జినా.. ఆ తర్వాత తన పోస్టును డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగింది? ఇంతటి అవమానమా? కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ క్రిస్టియానో రొనాల్డో లేకుండా స్విట్జర్లాండ్‌తో మ్యాచ్ ఆడింది పోర్చుగల్. అతడి స్థానంలో పీప్ సారథిగా వ్యవహరించగా.. రొనాల్డో ప్లేస్‌ను 21 ఏళ్ల రామోస్‌తో భర్తీ చేశారు. ఈ నేపథ్యంలో రొనాల్డో అభిమానులు కోచ్ ఫెర్నాండో తీరుపై విరుచుకుపడుతున్నారు. కాగా గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో భాగంగా దక్షిణ కొరియాతో తలపడిన సమయంలో రొనాల్డో ఆ జట్టు ప్లేయర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ విషయం గురించి స్పందిస్తూ.. ‘‘నా స్థానంలో సబ్‌స్టిట్యూట్ వస్తున్న సమయంలో.. సదరు కొరియా వ్యక్తి నన్ను తొందరగా వెళ్లిపోవాలంటూ చెప్పాడు. అదే వివాదానికి దారి తీసింది దీంతో అతడిని సైలెంట్‌గా ఉండాలని చెప్పాను. నన్ను అలా అనడానికి అతడికి అధికారం లేదు కదా. నేను ఎప్పుడు వెళ్లాలో రిఫరీ చూసుకుంటారు. అదే విషయం అతడికి చెప్పాను అంతే’’ అని పేర్కొన్నాడు. అయితే, ఆ సమయంలో మూతి మీద వేలు వేసుకంటూ ష్ అంటూ రొనాల్డో సైగ చేయడం వివాదానికి దారి తీసింది. అయితే, రొనాల్డో మాత్రం ఆ క్షణంలో అలా జరిగిపోయిందని.. ఇందులో వివాదమేమీ లేదని కొట్టిపడేశాడు. కోచ్.. ఫెర్నాండో సైతం.. ‘‘కొరియా ప్లేయర్ అలా అనడంతో రొనాల్డోకు కోపం వచ్చింది. అక్కడ ఏం జరిగిందో ప్రతి ఒక్కరు చూశారు. అతడు రొనాల్డోను అవహేళన చేశాడు. మైదానాన్ని వీడాలని చెప్పాడు’’ అని పేర్కొన్నాడు. అయితే, స్విస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు ఫెర్నాండో మాట్లాడుతూ.. ఆ వివాదం ముగిసింది.. కానీ నాకైతే అదంతా నచ్చలేదని పేర్కొన్నాడు. ఎందుకు పక్కనపెట్టారు? ఈ నేపథ్యంలో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు రొనాల్డోను పక్కనపెట్టడం చర్చకు తావిచ్చింది. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో రొనాల్డో గర్ల్‌ఫ్రెండ్ ఈ మేరకు స్పందించడం గమనార్హం. కాగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎల్లో జెర్సీ వేసుకుని సబ్‌స్టిట్యూట్ బెంచ్ మీద నిర్లిప్తతో రొనాల్డో కూర్చుని ఉన్న దృశ్యాలు చూసి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. ఇక మ్యాచ్ 74వ నిమిషంలో రొనాల్డో.. జొయావో ఫెలిక్స్‌కు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియం పీప్.. రొనాల్డో చేతికి కెప్టెన్ ఆర్మ్‌బ్యాండ్‌ను చుట్టాడు. ఇదిలా ఉంటే.. జట్టు వ్యూహాల్లో భాగంగానే రొనాల్డోను బెంచ్‌కు పరిమితం చేసినట్లు కోచ్ ఫెర్నాండో చెప్పడం కొసమెరుపు. చదవండి: FIFA WC 2022: యువ సంచలనం.. రొనాల్డోను తప్పించి జట్టులోకి తీసుకువస్తే! ఏకంగా 3 గోల్స్‌తో.. IND vs BAN: వారెవ్వా ఉమ్రాన్.. 151 కిమీ వేగంతో బౌలింగ్! బంగ్లా బ్యాటర్‌కు ఫ్యూజ్‌లు ఔట్ -
FIFA WC: యువ సంచలనం.. రొనాల్డోను తప్పించి జట్టులోకి తీసుకువస్తే! ఏకంగా 3 గోల్స్
FIFA World Cup 2022 Portugal Vs Switzerland: స్విట్జర్లాండ్‌తో కీలక మ్యాచ్‌లో పోర్చుగల్ ఫుట్‌బాలర్ గొంకాలో రామోస్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసి ఫిఫా వరల్డ్‌కప్-2022 టోర్నీలో ఇప్పటి వరకు ఈ ఫీట్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. తద్వారా బుధవారం నాటి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌ను చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రొనాల్డోను తప్పించి.. 21 ఏళ్ల రామోస్ మూడు గోల్స్(17, 51, 67వ నిమిషంలో) సాధించి జట్టును గెలిపించాడు. తద్వారా పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను బెంచ్‌కు పరిమితం చేసి.. అతడి స్థానంలో తనను తీసుకువచ్చిన కోచ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక రామోస్‌కు తోడు.. కెప్టెన్ పీప్, రాఫేల్ గెరీరో, రాఫేల్ లియో రామోస్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ స్విస్‌ను 6-1తో చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ముచ్చటగా మూడోసారి స్విస్ ఆటగాళ్లలో మాన్యూల్ అకంజీ ఒక గోల్ సాధించాడు. కాగా ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో పోర్చుగల్ క్వార్టర్స్‌కు చేరడం ఇది మూడో సారి. గతంలో 1966, 2006లో ఈ ఫీట్ సాధించింది. ఇక క్వార్టర్స్ ఫైనల్లో పోర్చుగల్.. మొరాకోతో తలపడనుంది. రొనాల్డో ఫ్యాన్స్ ఆగ్రహం ఈ మ్యాచ్ సెకండాఫ్‌లో (74వ నిమిషంలో) రొనాల్డో మైదానంలోకి వచ్చాడు. జొయావో ఫెలిక్స్‌కు సబ్‌స్టిట్యూట్‌గా రొనాల్డోను తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో రొనాల్డో అభిమానులు కోచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Steps into Ronaldo's shoes & raises the roof 📈 Watch how #Portugal's hat-trick hero Goncalo Ramos 🔥 up the Lusail Stadium in #PORSUI 🙌 Stay tuned to #JioCinema & #Sports18 for all the LIVE action from #FIFAWorldCup 📊#Qatar2022 #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/H9TaLmy7gh — JioCinema (@JioCinema) December 6, 2022 -
Yes Means Yes: రేప్ అర్థం మారిందక్కడ!
మీ పక్కన ఒకరు ఉన్నారు. వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల పర్సు నుంచి డబ్బులు తీసుకోలేరు కదా!. అలాగే.. ఒకరి ఇంటి తలుపు తట్టకుండావాళ్ల ఇంట్లోకి వెళ్లలేం కదా!.. అత్యాచారం విషయంలోనూ అంతే!. సోమవారం స్విట్జర్లాండ్ పార్లమెంట్లో లైంగిక నేరాల చట్టంపై చర్చ సందర్భంగా 32 ఏళ్ల ఓ మహిళా చట్ట సభ్యురాలు ప్రస్తావించిన అంశం ఇది. స్విట్జర్లాండ్‌లో రేప్(అత్యాచారం) నిర్వచనం మారింది. కొన్ని పరిమితులుగా ఉన్న అర్థాన్ని విస్తరించి.. లైంగిక నేరాల చట్టంలో కొత్త నిర్వచనం అందించింది అక్కడి చట్ట సభ. సోమవారం దిగువ సభలో నాటకీయ పరిణామాల నడుమ జరిగిన ఓటింగ్‌లో స్వల్ఫ మెజార్టీతో ఆమోదం పొందింది ఇది. బలవంతంగా స్త్రీ జననాంగంలోకి పురుషాంగాన్ని చొప్పించడం.. లైంగిక దాడి సమయంలో బాధితురాలు ఒక నిర్దిష్ట స్థాయి ప్రతిఘటన ఎదుర్కొంటేనే ఇక నుంచి స్విట్జర్లాండ్‌లో అత్యాచారంగా పరిగణిస్తారు. సాధారణంగా.. రేప్ కేసుల్లో బాధితురాలి విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆ అఘాయిత్యానికి ఓ నిర్దిష్టత అంటూ ఇవ్వలేకపోతుంటారు. అత్యాచారం ఎలా జరిగింది? బాధితులు ఎవరు?.. వాళ్లు ఏ స్థాయిలో ప్రతిఘటించారు?.. ఇలాంటివేం పట్టించుకోరు. అలాగే.. స్విట్జర్లాండ్‌లో ఇంతకు ముందు అన్ని రకాల లైంగిక దాడుల నేరాలను.. అత్యాచారం కింద పరిగణలోకి తీసుకునేవాళ్లు. కానీ, ఇకపై ఒక నిర్దిష్టమైన కొలమానాన్ని ఇవ్వబోతున్నారు. పరస్పర అంగీకారంతో జరిగే లైంగిక చర్యలను కూడా అత్యాచారాలుగా చూపించడం, అవతలి వాళ్లను ఇరికించే యత్నాల కేసులు పెరిగిపోతున్నాయి. ఫలితంగా ఏ నేరమూ చేయని వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలోనే.. అత్యాచారానికి ఒక నిర్దిష్టత ఇవ్వాలని అక్కడి చట్ట సభ భావించింది. అయితే సమ్మతిని ఎలా కొలవాలనే దానిపై స్విట్జర్లాండ్‌లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. ‘‘నో మీన్స్ నో’’ అనే విధానం కోసం వాదించారు కొందరు. ఒకరు స్పష్టంగా అభ్యంతరం వ్యక్తం చేస్తే.. అది అత్యాచారంగా పరిగణించబడుతుంది అనేది ఈ వాదనకు అర్థం. అయితే.. కొత్త నిర్వచనం వల్ల నేరంపై సంక్లిష్టత నెలకొంటుందని చెప్తున్నారు. పార్లమెంటు ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, ఈ ఏడాది ప్రారంభంలో ఈ విధానానికి ఓటు వేసింది. కానీ దిగువ నేషనల్ కౌన్సిల్ సోమవారం ఓటు వేసినప్పుడు, లైంగిక చర్యలకు స్పష్టమైన సమ్మతి అవసరమయ్యే మరింత తీవ్రమైన మార్పును ఎంచుకుంది. అంటే.. పరస్పర అంగీకారం ఉంటే అదసలు అత్యాచారం ఎలా అవుతుందనేది.. ఇక్కడ ప్రధాన చర్చ. తాజా సోమవారం ‘యస్ మీన్స్ యస్’(ఒక రకంగా పరస్పర ఆమోదం.. అంగీకారం అన్నట్లే!) చట్టానికి 99 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. 88 మంది వ్యతిరేకంగా, ముగ్గురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇక సోమవారం చర్చా వేదిక సందర్భంగా దిగువ సభ హీటెక్కింది. మీ పక్క వాళ్ల అనుమతి లేకుండా వాళ్ల పర్సుల నుంచి డబ్బులు తీసుకోలేరు కదా!. అలాగే.. ఒకరి ఇంటి తలుపు తట్టకుండా వాళ్ల ఇంట్లోకి ప్రవేశించలేరు కదా! బలవంతం చేస్తే తప్ప.. అంటూ 32 ఏళ్ల పార్లమెంటేరియన్ తమారా ఫునిసియెల్లో ప్రసంగించారు. నా ఒంటి కంటే.. ఇళ్లు, వ్యాలెట్‌నే ఎందుకు అంత భద్రంగా దాచుకోవాలి.. అంటూ ప్రశ్నించారామె. ఇక గ్రీన్స్ ఎంపీ రాఫెల్ మహిమ్ సైతం తమారాతో ఏకీభవించారు. ఇతరుల శరీరం ఎప్పుడూ ఓపెన్ బార్ కాదు అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారామె. ఇదిలా ఉంటే.. స్విస్ పీపుల్స్ పార్టీ మాత్రం ఈ వాదనతో ఏకీభవించలేదు. ఇది గందరగోళానికి దారి తీయడం మాత్రమే కాదు.. ఆచరణలోనూ కష్టతరమని వాదించారు వాళ్లు. ఇదిలా ఉంటే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్విట్జర్లాండ్ ఓటింగ్ పరిణామాలను అభినందించింది. అయితే.. రేప్ నిర్వచనం చట్టంలో మార్పు రావడానికి ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే.. పార్లమెంట్ ఇరు సభలు దీనిపై ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. ఆపై అది ప్రజా ఓటింగ్‌కు వెళ్తుంది. స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్ మరియు బెల్జియంతో సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా అత్యాచారాన్ని ‘‘స్పష్టమైన అనుమతి లేకుండా లైంగిక చర్య’’గా నిర్వచించే దిశగా అడుగులు వేస్తున్నాయి. -
FIFA WC 2022: ఏడు నిమిషాల ముందు గోల్ చేసి.. ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రెజిల్
FIFA World Cup 2022- Group G- Brazil Vs Switzerland- దోహా: ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ వరుసగా రెండో విజయం సాధించి ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన గ్రూప్ ‘జి’ లీగ్ మ్యాచ్‌లో బ్రెజిల్ 1–0 గోల్ తేడాతో స్విట్జర్లాండ్‌ను ఓడించింది. ఆట 83వ నిమిషంలో కేస్మిరో చేసిన గోల్ బ్రెజిల్‌ను గెలిపించింది. ఈ గెలుపుతో బ్రెజిల్ ఆరు పాయింట్లతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే నాకౌట్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. చివరిసారి 2002లో ఆసియా వేదికపైనే జరిగిన ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్ ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. తొలి మ్యాచ్‌లో సెర్బియాపై 2–0తో నెగ్గిన బ్రెజిల్ జట్టుకు ఈ మ్యాచ్‌లో గట్టిపోటీనే ఎదురైంది. తొలి అర్ధభాగం గోల్స్ లేకుండానే పలుమార్లు స్విట్జర్లాండ్ ‘డి’ ఏరియాలోకి బ్రెజిల్ ఆటగాళ్లు వెళ్లినా ఫినిషింగ్ చేయలేకపోయారు. దాంతో తొలి అర్ధభాగం గోల్స్ లేకుండానే ముగిసింది. రెండో అర్ధభాగంలోనూ బ్రెజిల్ దూకుడుగానే ఆడింది. చివరకు 66వ నిమిషంలో వినిసియస్ కొట్టిన షాట్ స్విట్జర్లాండ్ గోల్‌పోస్ట్‌లోనికి వెళ్లడంతో బ్రెజిల్ ఆటగాళ్లు సంబరం చేసుకున్నారు. ఏడు నిమిషాల ముందు గోల్ చేసి అయితే ‘వీఏఆర్’ రీప్లేలో ఆఫ్‌సైడ్‌గా తేలడంతో రిఫరీ గోల్ ఇవ్వలేదు. ఈ ఘటన తర్వాత బ్రెజిల్ ఆటగాళ్లు నిరాశపడకుండా ఉత్సాహంతోనే ఆడారు. చివరకు నిర్ణీత సమయం ముగియడానికి ఏడు నిమిషాల ముందు గోల్ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. మ్యాచ్ మొత్తంలో బ్రెజిల్ ఐదుసార్లు గోల్ పోస్ట్ లక్ష్యంగా షాట్లు కొట్టగా... స్విట్జర్లాండ్ ఒక్క షాట్ కూడా బ్రెజిల్ గోల్పోస్ట్పైకి సంధించలేకపోయింది. చదవండి: Ruturaj Gaikwad: రుతు విధ్వంసకర ఇన్నింగ్స్! గొప్ప, చెత్త రికార్డు.. రెండూ మనోళ్లవే కదా! ఇక సెమీస్‌లో.. అతడు మసాజ్ చేయమనేవాడు.. చాలా కోపం వచ్చేది: వసీం అక్రమ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Round of 16 ✅ Casemiro was the difference maker today for Brazil 🇧🇷#FIFAWorldCup | #Qatar2022 — FIFA World Cup (@FIFAWorldCup) November 28, 2022 -
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.. 310 వారాలు వరల్ట్ నెం1.. దటీజ్ రోజర్ ఫెడరర్
20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలవడమే అతని ఘనత కాదు... 310 వారాలు వరల్డ్ నంబర్‌వన్ గా ఉండటమే అతని గొప్పతనాన్ని చెప్పదు... పురుషుల టెన్నిస్ ఆట కూడా అందంగా ఉంటుందని, అలా ‘సాఫ్ట్ టచ్’తో కూడా అద్భుతాలు చేయవచ్చని అతను చూపించాడు. ఒక్క పాయింట్ కోల్పోతేనే రాకెట్ నేలకేసి విసిరికొట్టే ఈ తరం ఆటగాళ్లతో పోలిస్తే, దాదాపు పాతికేళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో వివాదాస్పద మాట పెదవి దాటకుండా పనిపైనే దృష్టి పెట్టిన రుషి అతను.. మైదానం బయట కూడా సామాజిక బాధ్యత మరవని మంచితనం అతని సొంతం.. కోర్టులో అతనితో భీకరంగా తలపడిన ప్రత్యర్థులు అందరూ ఆట ముగియగానే అతని అంత మంచివాడు ఎవరూ లేరని ముక్తకంఠంతో చెప్పగల ఒకే ఒక్క పేరు.. రోజర్ ఫెడరర్.. టెన్నిస్ ప్రపంచంలో అన్నీ సాధించిన పక్కా జెంటిల్మన్ . ఎనిమిదేళ్ల వయసులో ఫెడరర్ మొదటిసారి టెన్నిస్ రాకెట్ పట్టాడు. సరదాగా మాత్రమే ఆట మొదలు పెట్టినా, సహజ ప్రతిభ ఎక్కడికి పోతుంది? అందుకే కావచ్చు.. తాను ఎక్కువగా శ్రమించకుండానే వరుస విజయాలు వచ్చి పడ్డాయి. అండర్12 స్థాయిలో రెండు జాతీయ టైటిల్స్‌తో అతను మెరిశాడు. అయితే అసలు కష్టం రోజర్‌కు ఇప్పుడొచ్చింది. స్విస్ జాతీయ టెన్నిస్ సమాఖ్య అతని ఆటను ప్రత్యేకంగా గుర్తించింది. వెంటనే నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో చేర్చించమని తల్లిదండ్రులకు సూచించింది. తానుండే బాసెల్ నుంచి డెవలప్మెంట్ సెంటర్ ఉన్న ఎక్యూబ్లె¯Œ ్స దాదాపు 200 కిలోమీటర్లు. అమ్మా, నాన్నని వదిలి వెళ్లలేనంటూ ఆ చిన్నారి ఏడ్చేశాడు. చివరకు ఒప్పించి అక్కడికి పంపించారు. కానీ తీరా వెళ్లాక ఆ సెంటర్లో అంతా ఫ్రెంచ్ భాషనే! తనకేమో ఇంట్లో నేర్చిన జర్మన్ స్విస్ భాష తప్ప ఏమీ రాదు. పైగా క్యాంప్‌లో అందరికంటే చిన్నవాడు. బాధ మరింత పెరిగింది! కానీ ప్రతిరోజు ఫోన్ లో అమ్మతో మాట్లాడుతూ తెచ్చుకున్న ధైర్యానికి తన పట్టుదల జోడించి అక్కడి గట్టిగా నిలబడ్డాడు. అదే వేదిక భవిష్యత్ అద్భుతాలకు పునాదిగా నిలిచింది. దేశ నిబంధనల ప్రకారం తప్పనిసరి అయిన ‘9 ఏళ్ల స్కూల్ చదువు’ ముగించిన తర్వాత రోజర్ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టి దూసుకుపోయాడు. ఎడ్బర్గ్, బెకర్లను ఆరాధిస్తూ పెరిగిన ఆ కుర్రాడు మునుముందు తాను వారందరినీ మించి శిఖరాన నిలుస్తాడని ఊహించలేదు. వెనక్కి తగ్గకుండా... ‘ఎప్పుడూ కింద పడకపోవడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ పడ్డ ప్రతీసారి పైకి లేవడమే గొప్ప’... కన్ఫ్యూషియస్ చెప్పిన ఈ స్ఫూర్తిదాయక మాట ఫెడరర్‌కు అక్షరాలా వర్తిస్తుంది. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. సుదీర్ఘ కెరీర్లో పదుల సంఖ్యలో అతడు గాయపడ్డాడు. శరీరంలో భుజాల నుంచి కాలి మడమల వరకు వేర్వేరు గాయాలు అతడిని ఇబ్బంది పెట్టాయి. కానీ అతను తన ఆటను ఆపలేదు. ఫెడరర్ పని అయిపోయిందనుకున్న ప్రతీసారి మళ్లీ బలంగా పైకి లేచాడు. మళ్లీ గొప్ప విజయాలతో దూసుకుపోయాడు. అతనిలో ఈ గొప్పతనమే అందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే 36 ఏళ్ల వయసులో అతను మళ్లీ నంబర్‌వన్ అయ్యాడు. 24 ఏళ్లు అంతర్జాతీయ టెన్నిస్ ఆడినా..1526 సింగిల్స్, 224 డబుల్స్ మ్యాచ్‌లలో ఒక్కసారి కూడా గాయం కారణంగా మ్యాచ్ మధ్యలో తప్పుకోలేదు. అది అతని పట్టుదలకు నిదర్శనం. ఒక్కసారి ఆట మొదలు పెడితే అది గెలుపో, ఓటమే తేలిపోవాల్సిందే తప్ప మధ్యలో ఆయుధాలు పడేసే రకం కాదు అతను. డబుల్స్.. మిక్స్డ్ డబుల్స్.. ‘ఆమె లేకపోతే నా ఆట ఎప్పుడో ముగిసిపోయేది. ఎన్నో క్లిష్ట సందర్భాల్లో నేను టెన్నిస్ ప్రయాణం ఆపేయాలని అనుకున్నా, తాను అండగా నిలిచి నాలో స్ఫూర్తి నింపింది’ అని భార్య మిరొస్లావా (మిర్కా) గురించి ఫెడరర్ తరచూ చెప్పేవాడు. ఆమె కూడా అంతర్జాతీయ టెన్నిస్ ప్లేయరే. నాలుగు గ్రాండ్‌స్లామ్‌లతో పాటు 2000 సంవత్సరం.. సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఆటగాళ్లుగా అక్కడే తొలి పరిచయం.. అదే టోర్నీలో తొలి ముద్దు కూడా! అయితే 2002లో గాయంతో ఆటకు దూరమైన మిర్కా ఆ తర్వాత ఫెడరర్ సహాయక సిబ్బందిలో భాగమైంది. ఆ సమయంలోనే ఆమె వ్యక్తిత్వాన్ని దగ్గరగా చూసిన ఫెడరర్ మనసు పారేసుకున్నాడు. 2009లో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు పిల్లలు.. వారిద్దరూ రెండు జతల కవలలు కావడం విశేషం. మైలా, చార్లిన్ అనే అమ్మాయిల జంట.. వారికంటే ఐదేళ్లు చిన్నదైన లియో, లెన్నీ అబ్బాయిల జంటతో రోజర్ కుటుంబ ఆనందం నాలుగింతలైంది. అన్నట్లు ఫెడరర్‌కు రెండేళ్లు పెద్దదైన అక్క డయానా కూడా ఉంది. దాతృత్వంలో మేటి అక్షరాలా 19 లక్షల 80 వేలు.. ఫెడరర్ సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ దేశాల్లో పాఠశాలల్లో సౌకర్యాలు, విద్యా సదుపాయాలను ఉపయోగించుకొని ప్రయోజనం పొందిన విద్యార్థుల సంఖ్య అది. తన ఫౌండేషన్ ద్వారా సొంత దేశం స్విట్జర్లాండ్‌లో పలు విరాళాలు అందించిన ఫెడరర్ అంతకంటే మెరుగైన పని తాను చేయాల్సి ఉందని గుర్తించాడు. అందుకు తన అమ్మమ్మ దేశమైన దక్షిణాఫ్రికాను ఎంచుకున్నాడు. దక్షిణాఫ్రికాతో పాటు పొరుగు దేశాలు లెసొతొ, మలావి, నమీబియా, జాంబియా, జింబాబ్వేలలో పాఠశాల విద్యను మెరుగుపరచడంలో అతని నిధులు ఉపయోగపడుతున్నాయి. ఇందు కోసం గత కొన్నేళ్లలో అతని సంస్థ సుమారు రూ. 569 కోట్లు ఖర్చు చేసింది. దాదాపు 10 వేల పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగుపరచింది. ఫెడరర్‌తో ఉన్న అనుబంధం కారణంగా ఈ యజ్ఞంలో అతని వ్యక్తిగత స్పాన్సర్లంతా భాగం పంచుకొని సహకారం అందించారు. రోజర్ ఆటతో పాటు ఇలాంటి దాతృత్వం అతడిని ఇతర స్టార్లకంటే ఒక మెట్టు పైన ఉంచింది. వివాదమా.. నీవెక్కడ? అంతర్జాతీయ స్టార్ ఆటగాడంటే ఒక రేంజ్లో ఉండాలి. ఆటలోనే కాదు, మాటల్లో కూడా పదును కనిపించాలి. అప్పుడప్పుడు అవసరం ఉన్నా, లేకపోయినా ‘తానేంటో’ గుర్తించేలా నాలుగు పరుష పదాలు వాడటమో, లేదంటే వివాదాస్పద వ్యాఖ్యలో చేస్తుండాలి. కానీ ఫెడరర్ గురించి గూగుల్ చేసి చూడండి. వివాదం అన్న పదం కూడా కనిపించదు! గ్రాండ్‌స్లామ్‌లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నా, ఓడినప్పుడు ప్రత్యర్థిని అభినందించినా ఎక్కడా మాటలో, ప్రవర్తనలో కట్టు తప్పలేదు. అదే అతడి గొప్పతనాన్ని రెట్టింపు చేసింది. కావాలంటే 21 గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన జొకోవిచ్‌ను చూడండి.. 21కి తగ్గని వివాదాలు ఉంటాయి. కానీ ఈ స్విస్ స్టార్ మాత్రం ఎప్పటికీ వాటికి దూరమే. ఫెడరర్ ఎక్స్‌ప్రెస్ ►వరుసగా 237 వారాల పాటు వరల్డ్ నంబర్‌వన్ ► గెలిచిన మొత్తం టైటిల్స్ 103 ► స్విట్జర్లాండ్ దేశం ఫెడరర్ పేరిట పోస్టల్ స్టాంప్‌తో పాటు నాణేలపై కూడా అతని ఫొటోను ముద్రించింది. ఆ దేశంలో బతికి ఉండగానే అలాంటి గౌరవం అందుకున్న ఏకైక వ్యక్తి. ► సొంత నగరం బాసెల్‌లో ‘ఫెడరర్ ఎక్స్‌ప్రెస్’ అని ఒక రైలుకు పేరు పెట్టారు. ► ఆట ద్వారా సుమారు 130 మిలియన్ డాలర్లు ఆర్జిస్తే, ప్రకటనల ద్వారా మరో 100 మిలియన్లకు పైగా రోజర్ సంపాదించాడు. 30 ఏళ్ల ‘ఫోర్బ్స్’ చరిత్రలో నంబర్‌వన్ గా నిలిచిన తొలి టెన్నిస్ ప్లేయర్. -
స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు బ్రెజిల్‌కు భారీ షాక్..
సెర్బియాతో మ్యాచ్‌లో కుడి చీలమండ గాయానికి గురైన బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెమార్ ఈనెల 28న స్విట్జర్లాండ్‌తో జరిగే రెండో లీగ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంలేదని జట్టు వైద్యులు ప్రకటించారు. బ్రెజిల్ తరఫున 122 మ్యాచ్‌లు ఆడిన నెమార్ 75 గోల్స్ చేశాడు. మరో రెండు గోల్స్ చేస్తే బ్రెజిల్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా దిగ్గజం పీలే (77 గోల్స్) పేరిట ఉన్న రికార్డును అతను సమం చేస్తాడు. కాగా సెర్బియాతో తమ తొలి మ్యాచ్‌లో 2-0 తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. బ్రెజిల్ యువ ఆటగాడు రిచర్లిసన్ రెండు గోల్స్‌తో తమ జట్టుకు తొలి విజయాన్ని అందించాడు. ఇక సెర్బియాను చిత్తు చేసిన బ్రెజిల్ గ్రూప్-జి నుంచి అగ్ర స్థానంలో నిలిచింది. చదవండి: FIFA WC 2022: ఆతిథ్య దేశానికి మరో ఓటమి.. ఇక ఇంటికే -
FIFA WC: పాపం.. గోల్ కొట్టినా సెలబ్రేట్ చేసుకోలేక
ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక ఆటగాడు గోల్ కొట్టాడంటే దానిని గొప్పగా చూస్తారు. మాములు మ్యాచ్‌ల్లో గోల్ కొడితే పెద్దగా కిక్ రాదు. కానీ ఫిఫా వరల్డ్‌కప్ మ్యాచ్‌లు అలా కాదు. ఎందుకంటే నాలుగేళ్లకోసారి జరిగే సాకర్ సమరంలో గోల్స్ కొట్టిన ఆటగాడు హీరో అయితే కొట్టనివాడు జీరో అవుతాడు. ఇది మొదటినుంచి వస్తున్న సంప్రదాయమే. ఒక ఆటగాడు గోల్ కొడితే అది చూసిన అభిమానులు కేరింతలు, ఈలలు, గోలతో రెచ్చిపోతారు. మరి గోల్ కొట్టిన ఆటగాడి సెలబ్రేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే తాజాగా గురువారం స్విట్జర్లాండ్, కామెరున్ మ్యాచ్‌లో గోల్ కొట్టిన ఒక ఆటగాడు మాత్రం దానిని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. అతనే స్విట్జర్లాండ్ స్రైకర్ బ్రీల్ ఎంబోలో. ఈ మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0 తేడాతో కామెరున్‌పై విజయం సాధించింది. మ్యాచ్‌లో నమోదైన ఒక్క గోల్ కూడా బ్రీల్ ఎంబోలో చేసిందే. అతని గోల్ పుణ్యానే ఇవాళ స్విట్జర్లాండ్ మ్యాచ్‌ను గెలిచింది. మరి ఇంత చేసిన బ్రీల్ ఎంబోలో ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదా అనే డౌట్ వస్తుంది. కారణం అతను గోల్ కొట్టింది తన స్వంత దేశమైన కామెరున్‌పై కావడమే. బ్రీల్ ఎంబోలో స్వస్థలం కామెరున్.. ఇప్పటికి అతని తల్లిదండ్రులు కామెరున్ వెళ్లి వస్తుంటారు. ఎంబోలో కూడా అక్కడే పుట్టి పెరిగాడు. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల స్విట్జర్లాండ్‌కు రావాల్సి వచ్చింది. ఇక్కడే ఫుట్‌బాల్ కెరీర్‌ను ఆరంభించి ఇప్పుడు స్విట్జర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందుకే జట్టుకు గోల్ అందించినప్పటికి సొంత దేశంపై ఆ గోల్ రావడంతో సెలబ్రేషన్ చేసుకోలేకపోయాడు. Breel Embolo with the opener to give the Swiss the opener against Cameroon The man wouldn’t celebrate against the country of his birth. Respect🤝#Qatar2022 pic.twitter.com/zqonADSKcx — OLT👑 (@CHAMPIONOLT) November 24, 2022 🇨🇲 Born in Cameroon 🇨🇭 Represents Switzerland ⚽️ Scores in #SUICMR Respect, Breel Embolo 🤝#FIFAWorldCup | #Qatar2022 pic.twitter.com/UCpZhx0TCY — FIFA World Cup (@FIFAWorldCup) November 24, 2022 చదవండి: FIFA WC: స్విట్జర్లాండ్ శుభారంభం.. కామెరున్‌పై విజయం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC: స్విట్జర్లాండ్ శుభారంభం.. కామెరున్‌పై విజయం
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో స్విట్జర్లాండ్ శుభారంభం చేసింది. గ్రూప్-జిలో భాగంగా గురువారం కామెరున్తో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 1-0 తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలి అర్థభాగం ఎలాంటి గోల్ లేకుండానే ముగిసింది. అయితే రెండో అర్థభాగం మొదలైన కాసేపటికే ఆట 47వ నిమిషంలో స్విట్జర్లాండ్ ఆటగాడు బ్రీల్ ఎంబోలో తన సహచర ఆటగాడి నుంచి వచ్చిన సూపర్ పాస్‌ను చక్కగా వినియోగించుకొని గోల్‌గా మలిచాడు. దీంతో స్విట్జర్లాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత పలుమార్లు ఇరుజట్లు అటాకింగ్ గేమ్ ఆడినప్పటికి మరో గోల్ రాలేదు. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత ఇచ్చిన అదనపు సమయంలోనూ స్విట్జర్లాండ్‌కు గోల్ చేసే అవకాశమొచ్చినప్పటికి మిస్ అయింది. ఈలోగా సమయం పూర్తవడంతో మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ విజేతగా నిలిచింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5091503545.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
FIFA WC 2022: ఆరో టైటిల్ వేటలో బ్రెజిల్
ఫుట్‌బాల్ అనగానే వినిపించే దేశం పేరు బ్రెజిల్... ప్రపంచవ్యాప్తంగా తమ జాతీయ జట్టుతో సంబంధం లేకుండా బ్రెజిల్‌ను అభిమానించేవారే పెద్ద సంఖ్యలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. ఆటకు పర్యాయపదంగా నిలిచిన బ్రెజిల్ ఐదు సార్లు విశ్వవిజేతగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పీలే కాలంనుంచి రొనాల్డో వరకు ఎందరో బ్రెజిల్ స్టార్లు ఫుట్‌బాల్‌ను సుసంపన్నం చేశారు. 2002లో చివరి సారి చాంపియన్‌గా నిలిచిన తర్వాత ఆ జట్టు తర్వాతి నాలుగు ప్రయత్నాల్లోనూ విఫలమైంది. గ్రూప్ ‘జి’లో ఇతర జట్ల అవకాశాలను చూస్తే... –సాక్షి క్రీడా విభాగం బ్రెజిల్ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: ఐదు సార్లు చాంపియన్ (1958, 1962, 1970, 1994, 2002) ‘ఫిఫా’ ర్యాంక్: 1 అర్హత ఎలా: క్వాలిఫయింగ్ దశలో ఆడిన 17 మ్యాచ్‌లలో 11 విజయాలతో అర్హత సాధించింది. 3 మ్యాచ్‌లలో ఓడగా, మరో 3 డ్రా అయ్యాయి. వరుసగా గత నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్ టాప్–3 లో నిలవడంలో విఫలమైంది. అయితే ఇప్పుడు కోచ్ టిటె జట్టును పటిష్టంగా తీర్చిదిద్దాడు. కొత్తతరం అటాకింగ్ ఆటగాళ్లతో అతను జట్టును నింపడం సత్ఫలితాలు ఇచ్చింది. స్టార్ ప్లేయర్ నెమార్ జట్టును ముందుండి నడిపించగలడు. అలీసాన్ ప్రస్తుతం అత్యుత్తమ గోల్కీపర్లలో ఒకడు. థియాగో, రఫిన్హా ఇతర కీలక ఆటగాళ్లు. గ్రూప్ టాపర్ ఖాయం. సెర్బియా ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: నాలుగో స్థానం (1930, 1962) ‘ఫిఫా’ ర్యాంక్: 21 అర్హత ఎలా: క్వాలిఫయింగ్ టోర్నీలో పోర్చుగల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానంతో అర్హత సాధించడం విశేషం. అటాకింగ్ ప్రధాన బలం కాగా ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. కోచ్ స్టొకోవిచ్ జట్టులో కొత్త స్ఫూర్తిని నింపాడు. దేశం తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్ డ్యుసాన్ టాడిక్ ప్రదర్శనే కీలకం కానుంది. పావ్లొవిక్, ల్యూకిక్ ఇతర ప్రధాన ఆటగాళ్లు. అయితే గ్రూప్‌లో పోటీని బట్టి చూస్తే నాకౌట్ చేరడం అద్భుతమే అవుతుంది. స్విట్జర్లాండ్ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: మూడు సార్లు క్వార్టర్ ఫైనల్ (1934, 1938, 1954) ‘ఫిఫా’ ర్యాంక్: 15 అర్హత ఎలా: క్వాలిఫయింగ్ టోర్నీలో తమ గ్రూప్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 15 గోల్స్ చేసి 2 మాత్రమే ఇచ్చి అనూహ్యంగా అగ్రస్థానంలో నిలిచింది. కొత్త కోచ్ మురాత్ యకీన్ పర్యవేక్షణలో డిఫెన్స్‌లో బలంగా మారింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టితత్వంతో మ్యాచ్‌లు నెగ్గడమే స్విస్ జట్టు ప్రధాన బలం. బ్రెజిల్‌ను వదిలేస్తే రెండో స్థానం కోసం సెర్బియాతో పోటీ ఉంటుంది కాబట్టి ఆ మ్యాచ్‌తోనే ముందంజ వేయడం తేలుతుంది. కామెరూన్ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ప్రదర్శన: క్వార్టర్ ఫైనల్ (1990) ‘ఫిఫా’ ర్యాంక్: 43 అర్హత ఎలా: క్వాలిఫయింగ్ టోర్నీలో ఒక దశలో నిష్క్రమించేలా కనిపించినా...ప్లే ఆఫ్స్‌లో అల్జీరియాపై చేసిన ఏకైక గోల్‌తో గట్టెక్కి అర్హత సాధించింది. అంతర్జాతీయ పోటీల్లో కామెరూన్ చరిత్రను చూస్తే ఎన్నో పెద్ద జట్లను ఓడించిన సంచలన విజయాలు కనిపిస్తాయి. ఆఫ్రికా నేషన్స్ టోర్నీలో గోల్డెన్ బూట్ గెలిచిన అబూబకర్ ప్రమాదకరమైన ఆటగాడు. అయితే స్టార్లు లేని ఈ జట్టు సహజంగానే ఒత్తిడికి చిత్తయిన సందర్భాలూ ఉన్నాయి. అయితే దీనిని అధిగమిస్తే మరో సంచలనాన్ని ఆశించవచ్చు. చదవండి: FIFA WC 2022: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే -
స్విట్జర్లాండ్‌లో అంగరంగ వైభవంగా దీపావళి వేడుకలు
స్విట్జర్లాండ్‌లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారు. ఈ దీపావళి వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి గారు, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గారావు , ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి ,స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టి, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
100 బోగీలు..1.9 కిలోమీటర్ల పొడవు!
జెనీవా: ప్రపంచంలోనే అతి పొడవైన ప్రయాణికుల రైలు తమదేనంటూ స్విట్జర్లాండ్‌కు చెందిన రేషియన్ రైల్వే కంపెనీ ప్రకటించింది. 100 బోగీలతో 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ రైలును ఆల్ఫ్స్ పర్వతాల గుండా అల్బులా/బెర్నినా మార్గంలో నుంచి ప్రీడా నుంచి బెర్గ్యున్ వరకు శనివారం విజయవంతంగా నడిపినట్లు తెలిపింది. సుమారు 25 కిలోమీటర్ల ప్రయాణానికి గంట సమయం పట్టిందని వివరించింది. పర్వతాల దిగువన మెలికలు తిరుగుతూ ఉండే 22 టన్నెళ్లు, 48 వంతెనల మీదుగా సాగే సుందరమైన ఈ మార్గాన్ని 2008లో యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చిందని తెలిపింది. 175వ వార్షిక ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న స్విస్ రైల్వేల ఇంజినీరింగ్ ప్రతిభను చాటేందుకే ఈ ప్రయత్నాన్ని చేపట్టినట్లు రేషియన్ రైల్వే డైరెక్టర్ రెనాటో ఫసియాటి చెప్పారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. -
భారత్ చేతికి 4వ విడత స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయులు, దేశీ సంస్థలకు సంబంధించిన మరిన్ని వివరాలు భారత ప్రభుత్వానికి అందాయి. ఆటోమేటిక్ వార్షిక సమాచార మార్పిడి (ఏవోఈఐ) ఒప్పందం కింద స్విట్జర్లాండ్ నాలుగో విడత వివరాలు (వరుసగా నాలుగో ఏడాది) వీటిని అందజేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో వందల కొద్దీ వ్యక్తిగత, కార్పొరేట్ల, ట్రస్టుల ఖాతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, తదుపరి విచారణలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున పేర్లు, వివరాల విషయంలో గోప్యత పాటిస్తున్నట్లు వివరించారు. తదుపరి విడత స్విస్ ఖాతాల వివరాలు మళ్లీ 2023 సెప్టెంబర్‌లో భారత్‌కు అందనున్నాయి. ఏవోఈఐ కింద ఈ ఏడాది 101 దేశాలకు 34 లక్షల ఖాతాల వివరాలు అందించినట్లు, ప్రతిగా ఆయా దేశాల నుంచి 29 లక్షల ఖాతాల వివరాలు పొందినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) వెల్లడించింది. సంపన్నులు అక్రమంగా సొమ్ము దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు ఉపయోగపడుతున్నాయన్న అపప్రదను తొలగించుకునే ప్రయత్నాల్లో భాగంగా 2018 నుంచి స్విట్జర్లాండ్ ఏఈవోఐ అమలు చేస్తోంది. భారత్‌తో ఒప్పందం 2019 నుంచి అమల్లోకి వచ్చింది. -
బిట్ కాయిన్లతో, మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం
ప్రముఖ దిగ్గజ ఫాస్ట్ ఫుడ్ సంస్థ మెక్ డొనాల్డ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లు బిట్ కాయిన్లతో బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది. స్విట్జర్లాండ్ దేశం లుగానో నగరంలో బిట్‌కాయిన్, అసెట్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్ టెథర్ చెల్లింపులకు మెక్ డొనాల్డ్స్ అంగీకరించింది. ఈ ఏడాది మార్చి నెలలో లుగానో అధికారులు టెథర్ ఆపరేషన్స్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా డిజిటల్ కరెన్సీలను ఉపయోగించి ట్యాక్స్ చెల్లింపులు పన్నులు, వస్తువుల కొనుగోలు చేసేలా లుగానో నివాసితులకు అనుమతించింది. 🇨🇭 Paying at McDonald's with #Bitcoin in Lugano, Switzerland. pic.twitter.com/8IdcupEEKQ — Bitcoin Magazine (@BitcoinMagazine) October 3, 2022 బిట్ కాయిన్ చెల్లింపుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో ప్రకారం..మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్లో ఫుడ్ లవర్స్ డిజిటల్ కియోస్క్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి, ఆపై మొబైల్ యాప్ సహాయంతో బిల్ పే చేస్తున్న దృశ్యాల్ని మనం గమనించవచ్చు. -
మిర్కాతో అలా ప్రేమలో పడ్డ ఫెదరర్! ఫెడ్డీలో మనకు తెలియని కోణం!
Roger Federer- Miroslava Mirka Love Story: ‘‘మా అమ్మ, నాన్న.. మిర్కా సమక్షంలో మీతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. సుదీర్ఘ ప్రయాణం.. ఇంతవరకు ఇలా సాఫీగా సాగుతుందని ఎవరు అనుకుని ఉంటారు. జస్ట్ ఇన్క్రెడిబుల్’’... స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన రిటైర్మెంట్ నేపథ్యంలో శనివారం చేసిన ట్వీట్ ఇది. అవును నిజమే.. సుదీర్ఘ కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్ ప్రయాణం నిజంగా అసాధారణమైనదే. కళాత్మకమైన ఆటకు మారుపేరుగా.. వివాదరహితుడిగా.. జెంటిల్మెన్గా పేరు తెచ్చుకున్న ఫెడ్డీ సాధించిన ఘనతల్లో తన కుటుంబానిది కీలక పాత్ర. తల్లిదండ్రులు రాబర్ట్, లినెట్టె.. ముఖ్యంగా భార్య మిర్కా.. తన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిందని ఫెదరర్ తరచూ చెబుతూ ఉంటాడు. నిజానికి రోజర్ ఫెదరర్ పక్కా ‘ఫ్యామిలీ మ్యాన్’. అమ్మానాన్న.. భార్య మిర్కా, నలుగురు పిల్లలు అతడి ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మలిచి.. ఆటగాడిగా ఫెదరర్ విజయవంతంగా కొనసాగేందుకు భార్యగా తాను చేయగలిగిదంతా చేసింది.. చేస్తోంది మిర్కా. భర్తను అర్థం చేసుకుంటూ అతడికి అండగా నిలుస్తోంది. ఇంతకీ మిర్కా ఎవరు? మిరస్లొవా మిర్కా ఫెదరర్.. 1978 ఏప్రిల్ 1న జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు మిరొస్లొవా వావ్రింకోవాగా నామకరణం చేశారు. ఈమె కూడా టెన్నిస్ ప్లేయరే! స్లొకేవియాలో జన్మించిన మిర్కాకు రెండేళ్ల వయసు ఉన్నపుడే ఆమె కుటుంబం స్విట్జర్లాండ్‌కు వలస వచ్చింది. మిర్కాకు తొమ్మిదేళ్ల వయసున్నపుడు జర్మనీలోని ఓ టెన్నిస్ టోర్నమెంట్‌కు ఆమెను తీసుకువెళ్లాడు తండ్రి. అక్కడే తను మార్టినా నవ్రతిలోవా(చెక్- అమెరికన్ ప్లేయర్)ను చూసింది. చురుకైన మిర్కాను చూసిన నవత్రిలోవా.. ఆమె టెన్నిస్ ప్లేయర్‌గా రాణించగలదని చెప్పడం సహా.. తన రాకెట్‌ను బహుమతిగా పంపింది. అంతేకాదు మిర్కా టెన్నిస్ పాఠాలు నేర్చుకునేలా ఏర్పాట్లు చేసింది కూడా! అలా నవ్రతిలోవా స్ఫూర్తితో తన టెన్నిస్ ప్రయాణం మొదలుపెట్టిన మిర్కా.. 2001లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకు 76 సాధించింది. రోజర్- మిర్కా ప్రేమకథ అక్కడ మొదలైంది! సిడ్నీ ఒలింపిక్స్- 2000 సందర్భంగా రోజర్ ఫెదరర్- మిర్కాలకు పరిచయం జరిగింది. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. అలా కొన్నేళ్ల పాటు ప్రణయంలో మునిగితేలిన ఈ జంట 2009లో వివాహ బంధంతో ఒక్కటైంది. రోజర్ స్వస్థలం బాసెల్‌లో వీరి పెళ్లి జరిగింది. అదే ఏడాది రోజర్- మిర్కా దంపతులకు కవలలు జన్మించారు. మొదటి సంతానంగా జన్మించిన కుమార్తెలకు చార్లెనీ రివా- మిలా రోజ్గా పేర్లు పెట్టారు. ఆ తర్వాత సుమారు ఐదేళ్లకు అంటే 2014లో ఈ జంట కవల కుమారులకు జన్మినిచ్చారు. వీరి పేర్లు లియో, లిన్నీ. పిల్లలతో కలిసి మ్యాచ్ వీక్షిస్తూ.. ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అయిన మిర్కా.. సిడ్నీ ఒలింపిక్స్‌లో స్విట్జర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించింది. పాదానికి గాయమైన కారణంగా అర్ధంతరంగా ఆమె కెరీర్ ముగిసిపోయింది. పెళ్లి తర్వాత కుటుంబానికే పూర్తి సమయం కేటాయించిన మిర్కా.. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పర్ఫెక్ట్ పార్ట్నర్ అనిపించుకుంది. ఇక కేవలం ఇంట్లోనే కాదు.. మైదానంలో కూడా భర్త వెన్నంటే ఉండేందుకు ప్రయత్నిస్తుంది మిర్కా. ఫెదరర్ మ్యాచ్ ఉందంటే తమ నలుగురు పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో కలిసి మ్యాచ్‌లు వీక్షిస్తూ ఉంటుంది. 2017లో రోజర్ వింబుల్డన్ టైటిల్ గెలిచిన సమయంలో.. ఆ అద్భుత క్షణాలకు సాక్షిగా నిలిచింది మిర్కా. మంచి మనసున్న దంపతులు! రోజర్‌కు అన్ని విషయాల్లో అండగా ఉండే మిర్కా.. అతడు చేసే సామాజిక కార్యక్రమాల్లోనూ తోడుగా ఉంటుంది. కోవిడ్ కారణంగా నష్టపోయిన స్విస్ కుటుంబాలకు ఈ జంట 2020లో ఒక మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది. అదే విధంగా రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ ద్వారా ఆఫ్రికాలో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ దంపతులు. ఇందుకోసం మిలియన్ డాలర్లకు పైగా విరాళం అందించారు. ఓ సందర్భంలో రోజర్ మాట్లాడుతూ.. తమ కుమార్తెలు భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తారని భావిస్తున్నానని.. అందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించాడు. కేవలం ఆటలో మాత్రమే కాదు.. సేవా గుణంలోనూ ఫెదరర్ రారాజే! మరి అతడి హృదయపు పట్టపురాణి మిర్కా.. మహారాణి కాక ఇంకేమవుతుంది!? -సాక్షి, వెబ్‌డెస్క్ చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? Ind Vs Aus: టీ20 సిరీస్.. అరుదైన రికార్డుల ముంగిట కోహ్లి! అదే జరిగితే.. It was beautiful to release the news surrounded by my Mum and Dad and Mirka. Who would have thought that the journey would last this long. Just incredible! pic.twitter.com/0rRAMRSaRu — Roger Federer (@rogerfederer) September 16, 2022 -
ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?
స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ గురువారం అంతర్జాతీయ టెన్నిస్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఓపెన్ శకంలో ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడిగా పేరు పొందిన ఫెదరర్ టెన్నిస్‌లో లెక్కలేనన్ని విజయాలు సాధించాడు. 20 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ అందరికంటే ముందుగా సాధించింది రోజర్ ఫెదరర్రే. తన ఆటతో టెన్నిస్‌కు అందం తెచ్చిన ఫెదరర్.. సంపాదన విషయంలోనూ చాలా ముందుంటాడు. ప్రస్తుత తరంలో టెన్నిస్ దిగ్గజాలుగా పిలవబడుతున్న నాదల్, జొకోవిచ్‌లు వచ్చిన తర్వాత ఫెదరర్ హవా కాస్త తగ్గినప్పటికి.. సంపాదనలో మాత్రం ఫెదరర్ వెనకే ఉండడం విశేషం. 41 ఏళ్ల ఫెదరర్ తన కెరీర్లో ప్రైజ్‌మనీగా 13.1 కోట్ల డాలర్లు(సుమారు రూ.1042 కోట్లు) సంపాదించాడు. అయితే కోర్టు లోపల కంటే వెలేపలే అతని సంపాదన ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఎండార్స్మెంట్లు, ఇతర బిజినెస్‌లతో కలిపి ఫెదరర్ ఇప్పటి వరకూ 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8 వేల కోట్లు)కుపైగా సంపాదించినట్లు ఫోర్బ్స్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రతి ఏటా టెన్నిస్ కోర్టు బయట ఫెదరర్ సంపాదన 9 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఈ రిపోర్ట్ తెలిపింది. ఫెదరర్ తన కెరీర్లో ఏకంగా 17 ఏళ్ల పాటు అత్యధిక మొత్తం అందుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. పన్నులు, ఏజెంట్ల ఫీజులు కలిపితే తన కెరీర్లో ఫెదరర్ మొత్తం సంపాదన 110 కోట్ల డాలర్లు. ఇది టెన్నిస్ కోర్టులో అతని ప్రధాన ప్రత్యర్థులైన నదాల్ (50 కోట్ల డాలర్లు), జోకొవిచ్ (47 కోట్ల డాలర్లు)ల కంటే రెట్టింపు కావడం విశేషం. స్విట్జర్లాండ్‌లోని రోజర్ ఫెదరర్‌కు చెందిన గ్లాస్ హౌస్ ప్రపంచంలో 100 కోట్ల డాలర్ల మైల్స్టోన్ అందుకున్న ఏడో క్రీడాకారుడు రోజర్ ఫెదరర్. జాబితాలో ఫెదరర్ కంటే (ముందు..ఆ తర్వాత) లెబ్రన్ జేమ్స్, ఫ్లాయిడ్ మేవెదర్, లియోనెల్ మెస్సీ, ఫిల్ మికెల్సన్, క్రిస్టియానో రొనాల్డో, టైగర్ వుడ్స్లు తమ కెరీర్లలో 100 కోట్ల డాలర్ల సంపాదన మార్క్‌ను అందుకున్నారు. ఇక 24 ఏళ్ల టెన్నిస్ కెరీర్లో రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్, మొత్తంగా 103 సింగిల్స్ టైటిల్స్(ఓపెన్ శకంలో రెండో ఆటగాడు) సాధించాడు. ఖరీదైన రోలెక్స్ వాచ్‌తో ఫెదరర్ చదవండి: రోజర్ ఫెడరర్ వీడ్కోలు.. 'రిటైర్మెంట్ క్లబ్‌లోకి స్వాగతం.. ఫెడ్డీ' 'ఇలాంటి రోజు ఎప్పుడు రాకూడదని అనుకున్నా' -
నీరజ్ చోప్రా స్కై డైవింగ్.. వీడియో వైరల్
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా గతవారం డైమండ్ లీగ్ ట్రోఫీని తొలిసారి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈటెను 88.44 మీటర్ల దూరం విసిరి ట్రోఫీ కొల్లగొట్టాడు. గత గురువారం జరిగిన ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలో ఫౌల్ చేసి డిస్క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్లు దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు, చివరి ప్రయత్నంలో 87 మీటర్లు విసిరాడు. ఇక డైమండ్ లీగ్ మీట్ ముగించుకొని ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉన్న నీరజ్ చోప్రా వెకేషన్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా స్విట్జర్లాండ్‌లో స్కై డైవింగ్ చేసి..ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు.దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన నీరజ్ చోప్రా..'' స్కై ఈజ్ నాట్ ది లిమిట్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక బ్యాక్‌గ్రౌండ్‌లో బాలీవుడ్ సినిమా ''జిందగీ నా మిలేగీ దుబారా'' మ్యూజిక్‌ను ప్లే చేస్తూ.. ఆ సినిమా తరహాలోనే స్కైడైవింగ్ చేయడం విశేషం. ఆకాశం మధ్యలో విమానం నుంచి దూకే సమయంలో నీరజ్ ఎంతో ఉత్సాహంగా కనిపించాడు. చిరునవ్వులు చిందిస్తూ స్కైడైవ్‌ను ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. రెండు రోజుల్లోనే నాలుగు లక్షలకుపైగా లైక్స్ రావడం విశేషం. నీరజ్ చోప్రా స్కై డైవింగ్ ను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినప్పటికి ట్రోఫీ కొట్టేలేకపోయాడు. ఈసారి మాత్రం ట్రోఫీ అందుకున్న నీరజ్ చోప్రా వచ్చే ఏడాది హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ బెర్తును ఇప్పటికే ఖరారు చేసుకున్నాడు. View this post on Instagram A post shared by MySwitzerlandIn (@myswitzerlandin) చదవండి: లియాండర్ పేస్ గురువు కన్నుమూత -
ఎదురులేని నీరజ్ చోప్రా.. పట్టిందల్లా బంగారమే
భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రాకు ఎదురులేకుండా పోతుంది. అతను ఏం పట్టినా బంగారమే అవుతుంది. తాజాగా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో విజయం సాధించిన నీరజ్ చోప్రా ట్రోఫీని ఎగురేసుకుపోయాడు. భారత కాలమాన ప్రకారం జ్యూరిచ్ వేదికగా గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన గేమ్‌లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో ఈటెను 88.34 మీటర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు. అతనికి పోటీగా ఉన్న ఐదుగురు కనీసం దరిదాపులోకి కూడా రాలేకపోయారు. దీంతో ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ట్రోఫీ నీరజ్ సొంతమైంది. ఇక గేమ్ విషయానికి వస్తే.. తొలి ప్రయత్నంలో నీరజ్ చోప్రా ఫౌల్ చేసి డిస్క్వాలిఫై అయ్యాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో ఈటెను 88.44 మీటర్లు దూరం విసిరాడు. మూడో ప్రయత్నంలో 88 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 86.11 మీటర్లు, చివరి ప్రయత్నంలో 87 మీటర్లు విసిరాడు. అయితే నీరజ్‌తో పాటు ఉన్న మిగతా ఐదుగురు వేగాన్ని అందుకోవడంలో విఫలమయ్యారు. ఇక 2017, 2018 డైమండ్ లీగ్ ఫైనల్స్ మీట్‌కు నీరజ్ అర్హత సాధించినా పతకం సాధించలేకపోయాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణంతో సంచలనం సృష్టించిన నీరజ్ ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతంతో మెరిశాడు. Golds,Silvers done, he gifts a 24-carat Diamond 💎 this time to the nation 🇮🇳🤩 Ladies & Gentlemen, salute the great #NeerajChopra for winning #DiamondLeague finals at #ZurichDL with 88.44m throw. FIRST INDIAN🇮🇳 AGAIN🫵🏻#indianathletics 🔝 X-*88.44*💎-86.11-87.00-6T😀 pic.twitter.com/k96w2H3An3 — Athletics Federation of India (@afiindia) September 8, 2022 -
చిన్న గ్యాప్ మాత్రమే.. ప్రపంచ రికార్డుతో ఘనంగా రీఎంట్రీ
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. గజ్జల్లో గాయంతో కామన్వెల్త్ గేమ్స్‌కు దూరంగా ఉన్న నీరజ్ చోప్రా స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగిన డైమండ్ లీగ్ మీట్లో మరోసారి అదరగొట్టాడు. శుక్రవారం(ఆగస్టు 26న) జరిగిన అర్హత రౌండ్లో తొలి ప్రయత్నంలోనే నీరజ్ ఈటెను 89.08 మీట్లర్ల దూరం విసిరి తొలి స్థానంలో నిలిచాడు. ఇది అతని కెరీర్లో మూడో బెస్ట్ త్రో కావడం ఇశేషం. ఇంతకముందు ఇదే సీజన్లో 89.30 మీటర్లు, 89.98 మీటర్ల దూరం ఈటెను విసిరి కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. ఇక నీరజ్ చోప్రా వచ్చే నెలలో 7, 8 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోనే డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో పాల్గొంటాడు. నీరజ్ తన తొలి ప్రయత్నంలో ఈటెను 89.08 మీటర్ల దూరం విసిరాడు. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 85.18 మీటర్లు, మూడో ప్రయత్నంలో ఈటెను విసరలేదు. నాలుగో ప్రయత్నంలో ఫౌల్ చేసిన నీరజ్ చివరి ప్రయత్నంలో 80.04 మీటర్లు మాత్రమే విసరగలిగాడు. అయితే తనకంటే బెస్ట్ ఎవరు వేయకపోవడంతో నీరజ్ తొలి స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ రజతం సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్ సందర్భంగా గాయపడటంతో నీరజ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగాడు. #NeerajChopra 🇮🇳 Top finish with 89.08m at Lausanne Diamond League 🔥 He is back and back with a bang!#IndianAthletics@Diamond_League pic.twitter.com/0zTwDpjhyU — Athletics Federation of India (@afiindia) August 26, 2022 చదవండి: భారత్‌పై ‘ఫిఫా’ నిషేధం ఎత్తివేత Yora Tade: ఫైనల్ మ్యాచ్‌లో తలపడుతూ మృత్యు ఒడిలోకి భారత కిక్ బాక్సర్ -
డైమండ్ లీగ్ మీట్లో నీరజ్ చోప్రా
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా గజ్జల్లో గాయం నుంచి కోలుకున్నాడు. ఈనెల 26న స్విట్జర్లాండ్‌లోని లుసాన్‌లో జరిగే డైమండ్ లీగ్ మీట్లో నీరజ్ బరిలోకి దిగనున్నాడు. ఈ మీట్లో అతను రాణిస్తే వచ్చే నెలలో 7, 8 తేదీల్లో స్విట్జర్లాండ్‌లోనే జరిగే డైమండ్ లీగ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాడు. గత నెలలో అమెరికాలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో నీరజ్ రజతం సాధించాడు. ఫైనల్ సందర్భంగా గాయపడటంతో నీరజ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగాడు. -
ఆసియా లీడర్ల భేటీకి కేటీఆర్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది అక్టోబర్ 4వ తేదీ నుంచి జూరిచ్‌లో జరిగే ఆసియా లీడర్ల సిరీస్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ఆసియా, యూరప్‌లోని అత్యంత ప్రభావశీల నాయకుల నడుమ బహిరంగ చర్చకు వీలు కల్పిస్తూ ఆసియా లీడర్స్ సిరీస్ ఒక తటస్థ వేదికగా పనిచేస్తోంది. దేశాల నడుమ భిన్నత్వం, భాగస్వామ్యాలకు మద్దతు, పరస్పర విశ్వాసంతో కూడిన సంబంధాలు మెరుగు పరచడం వంటి అంశాల్లో చర్చకు ఈ వేదిక అనుసంధానకర్తగా వ్యవహరిస్తోంది. జూరిచ్‌లో జరిగే ఈ భేటీకి ఆసియా, యూరప్ నుంచి సుమారు వంద మంది ప్రముఖ వాణిజ్యవేత్తలు హాజరు కానున్నారు. యూరప్ ఆసియా కారిడార్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెద్ద కంపెనీలపై పెరుగుతున్న రాజకీయ అస్థిరత ప్రభావంపై జూరిచ్ ఆసియా లీడర్ల సిరీస్ వేదికగా చర్చ జరగనుంది. అర్థవంతమైన చర్చకు బాటలు వేయడం లక్ష్యంగా తమ వేదిక నిర్వహిస్తున్న ఈ సమావేశాలకు రావాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రంలో ఆసియా లీడర్స్ సిరీస్ వ్యవస్థాపకుడు కల్లమ్ ఫ్లెచర్ పేర్కొన్నారు. చదవండి: కేంద్రమంత్రిపై కస్సుమన్న హరీష్‌రావు.. స్ట్రాంగ్ కౌంటర్ -
చనిపోవడం కోసం స్విట్జర్లాండ్ వెళ్లిన వ్యక్తి... ఆపేందుకు కోర్టు మెట్లెక్కిన స్నేహితురాలు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని 40 ఏళ్ల ఒక వ్యక్తి గత కొంతకాలంగా మైయాల్జిక్ ఎన్సెఫలోమైలిటిస్ లేదా క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. దీన్ని దీర్ఘకాలిక న్యూరో ఇన్ఫలమేటరీ వ్యాధీ అని కూడా అంటారు. ఇది నరాలను బలహీన పరుస్తూ నెమ్మదిగా మంచానికి పరిమితం చేసే అరుదైన వ్యాధి. అతనికి ఈ వ్యాధి లక్షణాలను 2014లో తొలిసారిగా గుర్తించారు వైద్యులు. అతను ఎయిమ్స్‌లో కొన్నేళ్ల పాటు చిక్సిత తీసుకున్నాడు. దాతల సమస్య, తర్వాత కరోనా రావడం వంటి తదితర సమస్యల నడుమ ఆ వ్యక్తికి చికిత్స కొనసాగించ లేకపోయారు అతని తల్లిదండ్రులు. ప్రస్తుతం ఆ వ్యక్తి మంచానికే పరిమితమయ్యాడు. కేవలం కొన్ని అడుగులు మాత్రమే వేయగలడు. దీంతో ఆ వ్యక్తి అనాయసంగా లేదా కారుణ్య మరణం పొందాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అందుకోసం అతను స్విట్జర్లాండ్ వెళ్లాడు. దీంతో అతడి స్నేహితురాలు అతన్ని ఆపేందుకు ఢిల్లీ హైకోర్టు మెట్టెక్కింది. తన స్నేహితుడికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ మంజూరు చేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఆమె పిటిషన్లో తన స్నేహితుడు అరుదైన న్యూరో ఇన్ఫలమేటరీ వ్యాధితో బాధపడుతున్నాడని, దాతల సమస్య కారణం చికిత్స కొనసాగించలేకపోయమని పేర్కొంది. అతనికి భారత్‌లో లేదా విదేశాల్లో చికిత్స అందించే ఆర్థిక పరిస్థితులు లేవు. కానీ అతను కారుణ్య మరణానికి వెళ్లాలనే గట్టి నిర్ణయంతో ఉన్నాడు. దీన్ని వృధాప్యంలో ఉన్న అతని తల్లిదండ్రులు తట్టుకోలేరు. పైగా వారికి తమ కొడుకుకి ఏదో ఒక రోజు నయమవుతుందన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు చికిత్స కోసం స్విట్జర్లాండ్ వెళ్తున్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి వీసా పొందిన తన స్నేహితుడి వైద్య పరిస్థితిని పరిశీలించేందుకు వైద్య బోర్డును ఏర్పాటు చేయాల్సిందిగా పిటిషన్లో కోరింది. అంతేకాదు ఆమె తమ అభ్యర్ధను మన్నించి అతన్ని ఆపకపోతే తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు తీవ్ర మనో వేదనను, పుత్ర శోకాన్ని మిగిల్చిన వారవుతారని పిటిషన్లో పేర్కొంది. (చదవండి: క్షమాపణలు కోరిని బ్రిటిష్ హై కమిషనర్: వీడియో వైరల్) -
‘చుక్కలు’ చూపించే హోటల్
ఆరుబయట పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం... గ్రాండ్ పేరెంట్స్‌తో కథలు చెప్పించుకోవడం... 80ల్లోని పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం. అలా ముచ్చట్లతోనే నిద్రలోకి జారుకునేవాళ్లు. ఇప్పుడు అట్లాంటి ఆరుబయట పడుకునే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్. దాని పేరు నల్ స్టెర్న్ హోటల్ (జీరో స్టార్ హోటల్). దీని ప్రత్యేకత ఏంటంటే... ఒక ప్లాట్‌ఫామ్ మీద డబుల్ కాట్బెడ్, అటూఇటూ ల్యాంప్స్. అంతే.. గోడలు ఉండవు. తలు పులు ఉండవు. పైకప్పు అసలే లేదు. ఏకాంతం, రక్షణ కలిగించే ఏ సదు పాయమూ ఉండబోదు. హోటలియర్ డానియేల్ కార్బొనియెర్ రూపొందించిన ఈ ప్రాజెక్టు ఆలోచన స్విస్ ఆర్టిస్టులు ఫ్రాంక్ రిక్లిన్, పాట్రిక్ రిక్లిన్ బ్రదర్స్‌ది. ఇక్కడ స్టే చేస్తే.. ‘రాత్రంతా నిద్ర పట్టలేదు...’, ‘ఏం చప్పుళ్లురా బాబోయ్’ అనే ఫిర్యాదులు రావొచ్చు. కానీ ఆ ఆలోచన కల్పించేందుకే దీన్ని తయారు చేశామంటున్నారు రిక్లిన్ బ్రదర్స్. వచ్చిన అతిథులకు ప్రపంచంలో ఉన్న సమస్యలు ప్రత్యేకించి... వాతావరణంలో వస్తున్న మార్పులు, యుద్ధం, మాయమవుతున్న మానవత్వం వంటివన్నీ భూమికెంత నష్టం చేస్తున్నాయో తెలియజెప్పడమే ఈ ‘జీరో స్టార్ హోటల్స్’ లక్ష్యమని చెబుతున్నారు. ఇక హోటల్లో ఒక నైట్ స్టే చేయాలంటే.. దాదాపు రూ. 27 వేలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రింక్స్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ అక్కడికే తెచ్చిస్తారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి సైలన్ గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ పక్కన, మరో వైన్యార్డ్లో, పిక్చర్‌స్క్వేర్ కొండ పక్కన వీటిని ఏర్పాటు చేశారు. -
బ్రితోర్న్ పర్వతాన్ని అధిరోహించిన మహిళలు.. ప్రపంచ రికార్డు..!
కనీవినీ ఎరగని అద్భుతమైన ప్రపంచ రికార్డ్‌కు సుందరదేశం స్విట్జర్లాండ్ వేదిక అయింది. 25 దేశాలకు చెందిన 82 మంది మహిళలు ఒకేసారి ఈ అసాధారణమైన రికార్డ్‌లో భాగం అయ్యారు. ఈ లాంగెస్ట్ ఉమెన్స్ రోప్ టీమ్ 4164 మీటర్ల ఎత్తయిన బ్రితోర్న్ పర్వతాన్ని అధిరోహించి కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ‘పురుషుల వల్ల మాత్రమే అవుతుంది’ అనే అపోహతో కూడిన అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. ఈ మెగా ఈవెంట్లో ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. వీరిలో పర్వతారోహణతో పరిచయం ఉన్నవారితో పాటు, ఇలాంటి కార్యక్రమంలో ఎప్పుడూ పాల్గొనని వారు కూడా ఉన్నారు. మన దేశం నుంచి ముంబైకి చెందిన ఆంచల్ ఠాకూర్, షిబానీ చారత్, చార్మీ దేడియాలు పాల్గొన్నారు. ‘ఇలాంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు మొదట స్విట్జర్లాండ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్కైయర్గా స్విస్ ఆల్ఫ్స్ నాకు కొత్తకాకపోయినప్పటికీ, ప్రపంచం నలుమూలల నుంచి, వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన మహిళలతో కలిసి ప్రయాణించడం అనేది జీవితం మొత్తం గుర్తుండి పోయే జ్ఞాపకం. చాలామంది భద్రజీవితంలో నుంచి బయటికిరారు. తమ చుట్టూ వలయాలు నిర్మించుకుంటారు. అలాంటి వారు ఆ వలయాల నుంచి బయటికి రావడానికి, ప్రపంచ అద్భుతాలలో భాగం కావడానికి ఇలాంటి సాహస కార్యక్రమాలు ఉపయోగపడతాయి’ అంటుంది ఆంచల్ ఠాకూర్. ‘ఇప్పటికీ ఆ ఆనందం నుంచి బయటపడలేకపోతున్నాను. శక్తిని ఇచ్చే ఆనందం అది. ఆల్ ఉమెన్ గ్రూప్‌తో కలిసి చరిత్ర సృష్టించడంలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. ఈ విజయం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇచ్చి కొత్త అడుగులు వేయిస్తుంది’ అంటుంది షిబానీ. ఈ సాహసయాత్ర అనుభవాలను పదేపదే గుర్తు తెచ్చుకుంటుంది ఛార్మీ దేడియా. ‘వివిధ దేశాలు, వివిధ రంగాలు, వివిధ వయసు వాళ్లతో కలిసి సాహసయాత్రలో భాగం కావడం మామూలు విషయం కాదు. సాహసానికి సరిహద్దులు, భాష ఉండవు అని మరోసారి తెలుసుకున్నాను. పర్వతాలు స్ఫూర్తి ఇస్తాయి. సాహసాన్ని రగిలిస్తాయి.. అంతేతప్ప ఎప్పుడూ చిన్నబుచ్చవు అని పెద్దలు చెప్పిన మాట మరోసారి అనుభవంలోకి వచ్చింది’ అంటుంది ఛార్మీ. టూరిజంను ప్రమోట్ చేయడానికి, సాహసిక పర్వతారోహణలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం ‘హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో స్విస్ మౌంటెన్ గైడ్స్ అసోసియేషన్లాంటి సంస్థలు, పర్వతారోహణలో దిగ్గజాలలాంటి వ్యక్తులు పాలుపంచుకున్నారు. చదవండి: హోమ్ క్రియేషన్స్; చీరంచు టేబుల్.. లుక్ అదుర్స్ -
గాల్లోంచి.. మంచినీటి చుక్క, మాంసం ముక్క
ఎక్కడో ఎడారి నడి మధ్యలో ఉన్నారు.. చెట్లూ చేమలు ఏమీ లేవు.. నీటి జాడ అసలే లేదు.. అయినా తినడానికి మాంచి మటన్ లాంటి ఫుడ్డు, కావల్సినన్ని నీళ్లు రెడీ. బయట ఎక్కడి నుంచో తేలేదు.. అక్కడే, ఆ ఎడారిలోనే అబ్రకదబ్ర అన్నట్టు గాలిలోంచి తయారైపోయాయ్. శాస్త్రవేత్తలు నిజంగానే గాల్లోంచి ప్రోటీన్ ఫుడ్‌ను, నీళ్లను తయారు చేసే టెక్నాలజీలను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలివి.. నిరంతరాయంగా నీళ్లొస్తాయి ప్రపంచవ్యాప్తంగా చాలాచోట్ల నీటికి కటకటే. ఎడారుల్లో మాత్రమే కాదు.. కొండలు, గుట్టల వంటిచోట కూడా తాగునీటికి తీవ్ర ఇబ్బందే. అలాంటి ప్రాంతాల్లో ఏమాత్రం ఖర్చు లేకుండా గాలి నుంచి నీటిని తీసే పరికరాన్ని స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ‘సెల్ఫ్ కూలింగ్ కండెన్సేషన్ (తానంతట తానే చల్లబర్చుకుంటూ.. గాలిలోని నీటి ఆవిరిని సంగ్రహించే)’సాంకేతికతతో ఈ పరికరం పనిచేస్తుంది. నిజానికి గాలిలోంచి నీటిని సంగ్రహించగల పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా.. వాటికి విద్యుత్ అవసరం, ఉత్పత్తి అయ్యే నీళ్లు కూడా చాలా తక్కువ. కానీ తాము తయారు చేసిన పరికరానికి ఎలాంటి అదనపు ఖర్చు అవసరం లేదని.. పైగా రోజులో 24 గంటలూ నీటిని పొందవచ్చని ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఎలా పనిచేస్తుంది? గాలిలోంచి నీటిని సంగ్రహించేందుకు ‘సెల్ఫ్ కూలింగ్ కండెన్సేషన్’చేయగల ప్రత్యేక గ్లాస్‌ను శాస్త్రవేత్తలు తయారు చేశారు. పాలిమర్, వెండి పొరలతో కూడిన ఈగ్లాస్ సూర్యరశ్మిని పూర్తిస్థాయిలో ప్రతిఫలింపజేస్తూ.. బాగా చల్లబడుతుంది. ఈ గ్లాస్ దిగువభాగాన చుట్టూ ఉన్న ఉష్ణోగ్రత కంటే.. ఏకంగా 15 డిగ్రీల సెంటీగ్రేడ్ల మేర తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. దీంతో గాలిలో ఉన్న నీటి ఆవిరి గ్లాస్ దిగువ భాగాన నీటి చుక్కలుగా పేరుకుంటూ..దిగువన ఉన్న కంటైనర్‌లో కి చేరుతుంది. ఈ విధానంలో పూర్తి స్వచ్ఛమైన నీరు వస్తుందని.. పది చదరపు మీటర్ల పరిమాణమున్న పరికరంతో రోజుకు 12.7 లీటర్ల నీళ్లు ఉత్పత్తి అవుతాయని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఇవాన్ హెక్లర్ తెలిపారు. మాంసమూ ఊడి పడుతుంది! మటన్, చికెన్, ఫిష్.. ఇలా ఏ మాంసం ఏదైనా జనం లొట్టలేస్తూ లాగించేస్తుంటారు. మరోవైపు ఇది జీవ హింస అనే వాదనలు. ఈ మధ్య మొక్కల ఆధారిత (ప్లాంట్ బేస్డ్) మాంసం కూడా అందుబాటులోకి వచ్చింది. కానీ ఇవేమీ లేకుండా నేరుగా గాలిలోంచే మాంసం తయారు చేయగలిగితే.. ఇంకా బెటర్ కదా. ఎయిర్ ప్రోటీన్ అనే సంస్థ దీనిని నిజం చేసింది. మొదట అంతరిక్ష యాత్ర కోసమని.. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సహా ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు గాలిలోని వాయువులు, రసాయనాల నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయడంపై సుమారు 50 ఏళ్ల కిందే ప్రయోగాలు మొదలుపెట్టారు. అంగారకుడు, ఇతర గ్రహాలపై ఉన్న వాతావరణం నుంచి ప్రోటీన్లను ఉత్పత్తి చేయగలిగితే.. వ్యోమగాములకు ఆహారం సమస్య తీరుతుందనేది దీని ఉద్దేశం. ఈ పరిశోధనలను ఎయిర్ ప్రోటీన్ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు లీసా డైసన్, జాన్ రీడ్ తదితరులు స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎయిర్ ప్రోటీన్‌ను తీసి.. వివిధ పద్ధతుల్లో గాలిలోని వాయువులు, మూలకాలను సేకరించి, అవసరమైన మేర సమ్మిళితం చేసి.. ‘ఎయిర్ ప్రోటీన్’ను రూపొందించారు. దానిని శుద్ధిచేసి, పూర్తిగా ఆరబెట్టి.. ఒక పిండి వంటి పదార్థంగా తయారు చేశారు. ఈ ‘ఎయిర్ ప్రోటీన్’పిండితో.. చికెన్, మటన్, ఫిష్ వంటి వివిధ రకాల మాంసం తరహాలో తయారు చేశారు. తమ ‘ఎయిర్ ప్రొటీన్’రుచి, పోషకాల విషయంలో సాధారణ మాంసంతో సమానమని.. యాంటీ బయాటిక్స్, పురుగు మందుల అవశేషాలూ ఉండవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. గాలిలోని కార్బన వాయువులను తగ్గించడం వల్ల పర్యావరణానికీ మేలు అని స్పష్టం చేస్తున్నారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
దావోస్: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు
-
సీఎం జగన్‌ను కలిసిన స్విట్జర్లాండ్ ప్రవాసాంధ్రులు
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు హాజరై దావోస్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు స్విట్జర్లాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని వారు కితాబునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం చక్కటి కృషి చేస్తోందంటూ తమ అభిప్రాయాలను సీఎం జగన్‌కి తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారంటూ వారు ఏపీ ప్రభుత్వాన్ని కొనియాడారు. చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు -
14 దేశాలు, 100కిపైగా కేసులు
వాషింగ్టన్/లండన్: యూరప్, అమెరికాలను వణికిస్తున్న మంకీపాక్స్ వైరస్ 12 దేశాలకు విస్తరించింది. తాజాగా ఇజ్రాయెల్, స్విట్జర్లాండ్ల్లో మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్టుగా నిర్ధారించాయి. కేవలం 10 రోజుల్లోనే 14 దేశాల్లో 100 పైగా కేసులు నమోదు కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది. భారత్ కూడా ఈ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తమైంది. వైరస్ విస్తరిస్తున్న తీరుని పర్యవేక్షిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నైజీరియా నుంచి బ్రిటన్‌కు వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు తొలుత మే 7న గుర్తించారు. ఆఫ్రికా, పశ్చిమ దేశాల్లో మంకీపాక్ సాధారణమే అయినప్పటికీ గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో విస్తరించలేదు. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, స్వీడన్, యూకే, అమెరికాలలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఏమిటీ మంకీపాక్స్?: స్మాల్ పాక్స్ (మశూచి) తరహా ఇన్ఫెక్షన్ ఇది. మశూచితో పోల్చి చూస్తే తక్కువ తీవ్రత ఉంటుంది. ఆఫ్రికాలో వన్యప్రాణుల నుంచి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ తొలుత వెలుగులోకి వచ్చింది. 1958లో తొలిసారిగా కోతుల్లో దీనిని గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. 1970ల్లో మనుషుల్లో మొదటిసారి మంకీపాక్స్ కనిపించింది. లక్షణాలివే..: జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ, గ్లాండ్స్‌లో వాపు వంటివి మొదట కనిపిస్తాయి. అయిదు రోజులకి మశూచి వ్యాధి మాదిరిగా శరీరమంతా బొబ్బలు వస్తాయి. ఇవి తగ్గడానికి కనీసం నాలుగు వారాలు పడుతుంది. ఎలా వ్యాపిస్తుంది?:తుంపర్ల ద్వారా, మంకీపాక్స్ బాధితులకు అతి సమీపంగా మెలిగినా వ్యాపిస్తుంది. రోగుల దుస్తులు ముట్టుకున్నా, వారితో కలిసి బెడ్‌పై పడుకున్నా సోకుతుంది. చికిత్స ఎలా?:ప్రత్యేకంగా చికిత్స అంటూ ఏమీ లేదు. యాంటీవైరల్ డ్రగ్స్ వాడతారు. స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ కూడా పని చేస్తుంది. వైద్య సదుపాయాలు అంతగా లేని ఆఫ్రికా దేశాల్లో ప్రతీ పది మందిలో ఒకరు ఈ వ్యాధితో చనిపోతున్నారు. -
టూర్లకు డిమాండ్.. హైదరాబాద్ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్‌కు
సాక్షి, హైదరాబాద్: వేసవి టూర్లకు డిమాండ్ పెరిగింది. సాధారణంగా వేసవి సెలవుల్లో దుబాయ్, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపే నగరవాసులు ఈ ఏడాది యూరప్‌కు ఎక్కువగా తరలి వెళ్తున్నారు. గత రెండు నెలలుగా హైదరాబాద్ నుంచి యూరప్ దేశాలకు వెళ్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు పర్యాటక సంస్థల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ రాకపోకలు ఈ సారి గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ నుంచి పలు దేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో నగరవాసులకు ఊరట లభించింది. వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకుల రద్దీ పెరగడంతో టూర్ ఆపరేటర్లు, పర్యాటకసంస్థలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న పర్యాటకులు అక్కడి నుంచి పారిస్, స్విట్జర్లాండ్, వెనీస్, ఆస్ట్రియా, ఇటలీ, జర్మనీ, తదితర దేశాలను సందర్శిస్తున్నారు. ఒకే పాస్‌పోర్టుపైన ఎక్కువ దేశాల్లో పర్యటించేందుకు అవకాశం లభించడం వల్ల కూడా నగరవాసులు యూరప్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. అద్భుతమైన పర్యాటక నగరంగా పేరొందిన పారిస్‌కు ఈ ఏడాది అనూహ్యమైన డిమాండ్ ఉన్నట్లు టూర్ ఆపరేట్లు చెబుతున్నారు. మరోవైపు ఇటలీలోని పురాతన నగరాలు, చారిత్రక కట్టడాలను సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ‘పర్యాటకుల డిమాండ్ పెరగడంతో వీసాలు లభించడం కూడా కష్టంగా మారింది. కనీసం నెల రోజులు ముందే స్లాట్ బుక్ చేసుకొవలసి వస్తుంది.’ అని ప్రముఖ సంస్థకు చెందిన నిర్వాహకులు ఒకరు తెలిపారు. చదవండి: Photo Feature: సినిమా చూపిస్త మామా! చార్జీలకు రెక్కలు... రెండేళ్ల నష్టాలను పూడ్చుకొనేందుకు ఎయిర్‌లైన్స్ బారులు తీరాయి. కోవిడ్ నిబంధనల సడలింపుతో మొదట పరిమితంగా సర్వీసులను ఏర్పాటు చేసిన సంస్థలు క్రమంగా వివిధ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులను పెంచాయి. ప్రయాణికుల రద్దీ పెరగడంతో విమాన చార్జీలకు సైతం రెక్కలొచ్చాయి. యూరప్ దేశాలకు సర్వీసులను నడుపుతున్న పలు ఎయిర్‌లైన్స్ 20 శాతం నుంచి 22 శాతం వరకు చార్జీలు పెంచాయి.అలాగే హోటళ్లు, స్థానిక రవాణా చార్జీలు కూడా కోవిడ్ అనంతరం పెరిగాయి. దీంతో నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు సైతం ప్యాకేజీ చార్జీలను అమాంతంగా పెంచారు. గతంలో రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ప్యాకేజీ ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1.5 లక్షల వరకు పెరిగింది. కోవిడ్ అనంతరం అన్ని ధరలు పెరగడమే ఇందుకు కారణమని ప్రముఖ పర్యాటక సంస్థ నిర్వాహకులు అన్సారీ పేర్కొన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మొద్దు టూర్ ప్యాకేజీల ఎంపిక సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో కనిపించే ప్యాకేజీలను నమ్మరాదు. తెలిసిన సంస్థల వద్దకు స్వయంగా వెళ్లి అన్ని వివరాలు తెలుసుకొని సంతృప్తి చెందిన తరువాత మాత్రమే ప్యాకేజీలు బుక్ చేసుకోవాలి. – వాల్మీకి హరికిషన్, ప్రముఖ టూర్ ఆపరేటర్ -
డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సుకు వైఎస్ జగన్!
న్యూఢిల్లీ/దావోస్: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌వార్షిక సదస్సు మే 22 నుంచి 26 దాకా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనుంది. పలు దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు హాజరవుతారు. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు పలువురు సీనియర్ కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్, కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య థాకరే తదితరులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
Russia War: యుద్ధంలో ఊహించని ట్విస్టులు.. టెన్షన్లో జెలెన్ స్కీ!
కీవ్: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు జరుగుతున్న వేళ భయనక వాతావరణం చోటుచేసుకుంది. ఎటు చూసినా శవాలు గుట్టలుగుట్టలుగా పడిపోయి ఉండటం ప్రపంచ దేశాలను కలచివేస్తోంది. కాగా, మారియుపోల్‌లో పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, రష్యా ఇలాగే దాడులు కొనసాగిస్తే చర్చలకు అవకాశం ఇకపై ఉండదని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మారియుపోల్‌లో మిగిలిన ఉక్రేనియులను రష్యా సైన్యం చుట్టుముట్టిందన్నారు. దీంతో మారియుపోల్ నగరం దాదాపు రష్యా హస్తగతమైనట్లు తెలుస్తోంది. కానీ, తాము తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఇదిలా ఉండగా.. యుద్దం కారణంగా రష్యాపై ఆంక్షలపర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పుతిన్, రష్యాకు చెందిన పలువురు ప్రముఖులపై అనేక దేశాలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా.. రష్యాపై కఠిన ఆంక్షలు విధించడానికి జపాన్, స్విట్జర్లాండ్ అంగీకరించాయి. ఉక్రెయిన్ పౌరులపై దాడులకు రష్యాను జవాబుదారీగా చేయాలని స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిద సోమవారం టోక్యోలో జరిగిన చర్చల్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రష్యా నుంచి బొగ్గు దిగుమతులను దశలవారీగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు కిషిద తెలిపారు. అలాగే, రష్యాకు చెందిన ప్రముఖుల ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. రష్యా సైనిక ప్రయోజనాల కోసం ఉపయోగించే వస్తువుల ఎగుమతులను కూడా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. Cemetery in Irpin#Ukrainian investigators have examined 269 dead bodies in #Irpin, near #Kyiv, since the town was taken back from #Russian forces in late March, a police official said on Monday, as workers dug fresh graves on its outskirts. Video: Reuters pic.twitter.com/Dadl4aPXQz — NEXTA (@nexta_tv) April 18, 2022 మరోవైపు.. ఉక్రెయిన్‌లో రష్యా తరఫున పోరాడేందుకు సిరియా ఫైటర్లు సిద్ధమవుతున్నారు. సుహైల్ ఆల్ హసన్ డివిజన్‌కు చెందిన ఫైటర్లతో పాటు మాజీ సైనికులు, తిరుగుబాటుదారులు రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. జనరల్ అలెగ్జాండర్‌ను ఉక్రెయిన్‌పై యుద్ధ దళపతిగా పుతిన్ నియమించిన సంగతి తెలిసిందే. గతంలో ఈయనకు సిరియాలో పనిచేసిన అనుభవం ఉంది. ఇంతవరకు దాదాపు 40వేలమంది సిరియన్లు రష్యాతో కలిసి పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు మానవహక్కుల కార్యకర్తలు తెలిపారు. ఇది చదవండి: ‘కుటుంబీకులు’ లేకుండా... లంక కొత్త కేబినెట్ -
సూపర్ హిట్స్.. స్విస్ టూర్ యాడ్స్..
యూరప్ దేశాల్లోని ప్లే గ్రౌండ్‌గా తరచుగా పిలవబడే స్విట్జర్లాండ్‌కు పర్యాటకం అత్యంత ప్రధానమైన ఆర్ధిక వనరు. అయితే యూరప్‌లోని మిగతా ప్రాంతాల్లానే... కరోనా ఆంక్షలు ఆ దేశపు ఆర్ధిక మూలాలపై దాడి చేశాయి. అంతర్జాతీయ పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయంలో దాదాపుగా 50శాతం పడిపోయింది. ఈ నేపధ్యంలో తమ పర్యాటకానికి పునర్వైభవం తెచ్చేందుకు స్విట్జర్లాండ్ టూరిజం సరికొత్త పంథాలో దూసుకెళుతోంది. స్విస్ టూరిజమ్ లాగే ఆ దేశపు పర్యాటక శాఖ ప్రచార చిత్రాలు కూడా అద్భుతమైన విజయాలు సాధిస్తుండడం విశేషం. డీనీరో...ఫెదరర్ గత ఏడాది ఒక వినూత్న శైలి వీడియో రూపొందించింది. ఈ ఒకటిన్నర నిమిషాల వీడియోలో స్విట్జర్లాండ్‌కు బ్రాండ్ అంబాసిడర్, టాప్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, ఆస్కార్ అవార్డ్ విజేత రాబర్ట్ డీనీరోలు నటించారు. ఈ వీడియో లో ఉన్నది ఏమిటంటే.. స్విట్జర్లాండ్ గురించి ఒక ఫీచర్ ఫిల్మ్ రూపొందించమని ఫెదరర్ డీ నీరోని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంటాడు. అయితే నువు పేర్కొంటున్న డెస్టినేషన్ మరీ పర్ఫెక్ట్గా ఉందనీ, అందులో ఏమీ డ్రామా లేదంటూ డీనీరో తిరస్కరిస్తాడు. ఈ పరోక్ష ప్రచారపు వీడియో చిత్రం 100 మిలియన్ల సార్లు వీక్షించబడి అత్యంత విజయవంతమైన కమర్షియల్ చిత్రంగా నిలిచింది. దాదాపు 13 మిలియన్ల మంది ట్విట్టర్ ఫాలోయర్స్ ఉన్న ఫెదరర్ పాప్యులారిటీ కూడా ఈ చిత్ర విజయానికి తోడ్పడింది. హాత్వే...ఫెదరర్... అదే విధంగా ఈ ఏడాది ప్రచారం కోసం ఫెదరర్‌తో పాటు అకాడమీ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ విజేత అన్నే హాత్వేని జత కలిపారు.. గ్రాండ్ టూర్ ఆఫ్ స్విట్జర్లాండ్ పేరుతో వీరి ప్రచార చిత్రం సాగుతుంది. ఈ ప్రచార చిత్రంలో నటించిన అన్నా హాత్వే స్వయంగా స్విట్జర్లాండ్‌కు అభిమాని కావడం విశేషం. ఆ దేశానికే కాకుండా ఫెదరర్‌కి కూడా తాను ఫ్యాన్‌ని అని ఆమె చెప్పారు. ఇది 2 నిమిషాల ప్రచార చిత్రం. ఏప్రిల్ 12న యూ ట్యూబ్‌లో విడుదలయ్యి ఒక్కరోజులోనే 3.5 మిలియన్ల వ్యూస్‌ని అందుకుంది. గత ఏడాది ప్రచార చిత్రంలాగే దీన్ని కూడా అత్యంత వినోదాత్మకంగా చిత్రీకరించారు. రోడ్ ట్రిప్...సాగేదిలా... గ్రాండ్ టూర్ ఆఫ్ స్విట్జర్లాండ్ పేరిట సాగే 9రోజుల 8రాత్రుల రోడ్ ట్రిప్... జ్యురిచ్‌లో ప్రారంభమై అక్కడే ముగుస్తుంది. ఆ దేశపు అత్యంత ఆసక్తికరమైన విశేషాలను ప్రకృతి సౌందర్యాలను ఈ టూర్ అందిస్తుంది. దీనిలో భాగంగా 45 ఆకర్షణీయమైన ప్రాంతాలను పర్యాటకులు సందర్శిస్తారు. మొత్తం 22 సరస్సులు, 5 అల్పైన్ పాసెస్, 13 యునెస్కో చారిత్రక కట్టడాలు ఇందులో ఉన్నాయి. మొత్తం టూర్ 1000 మైళ్ల వరకూ కవర్ చేస్తుంది. ఈ టూర్ ఆద్యంతం తమకు తామే గైడ్ చేసుకునేలా పర్యాటకుల ఆసక్తి, ఇష్టాన్ని బట్టి బైక్ మీద గానీ, కార్ లో గానీ ప్రయాణించవచ్చు. పర్యాటక హితంగా ఈ టూర్‌ని రూపొందించారు. కాలుష్యరహితంగా ఎలక్ట్రిక్ వాహనాల్లో పయనించేందుకు వీలుగా టూర్ సాగే ప్రాంతాలన్నింటా ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ సదుపాయం కల్పించారు. అంతేకాకుండా రైలులో కూడా టూర్‌ని ఎంజాయ్ చేసే వీలుంది. -
స్విట్జర్లాండ్‌లో ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ (సీహెచ్) జ్యూరీచ్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుక సాగింది. స్విట్జర్లాండ్‌లో స్థిర పడిన 200 మంది తెలుగు ప్రజలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. ఈ ఉగాది వేడుకలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ గనికాంబ కడలి, జనరల్ సెక్రెటరీ డాక్టర్ దుర్గారావు కారంకి, ట్రెజరర్ మాధురి ముళ్ళపూడి , కల్చరల్ సెక్రెటరీ మాణిక్యవల్లి చాగంటి, స్పోర్ట్స్ సెక్రెటరీ రామచంద్ర వుట్టిలతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో నిర్వహించారు. -
ఏం కష్టం వచ్చిందో పాపం...ఒకే కుటుంబంలోని ఐదుగురు ఏడవ అంతస్తు నుంచి దూకి...
A Family Of 5 Mysteriously Jumped: ఇంతవరకు చాలా మంది ఏవేవో కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని చనిపోవడం గురించి విన్నాం. ఆర్థిక సమస్యల వల్లనో లేక భయంకరమైన సమస్యలకు తాళలేక చనిపోయిన ఘటనలు చూశాం. ఇక్కడ ఒక కుటుంబంలోని సభ్యులు ఏ కారణం లేకుండా అది కూడా ఉన్నత కుటుంబ నేపథ్యం ఉండి ఒకేసారి ఐదుగురు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈఘటన స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...స్విట్జర్లాండ్‌లోని మాంట్రిక్స్‌లో ఫ్రెంచ్ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఏడవ అంతస్తు బాల్కనీ నుంచి దూకేశారు. అయితే వారు తమ కొడుకుని పాఠశాలకు పంపిచంకుండా ఇంటి వద్ద చదివించడానికి గల కారణాలు విచారంచేందుకు పాఠశాల అధికారులు ఇంటికి వచ్చారు. అయితే వారు ఎంత తలుపు కొట్టిన ఎలాంటి స్పందన కనిపించకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. అయితే కాసేపటికి ఒక ఇంటిలోని సభ్యులు బాల్కని నుంచి దూకేశారంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి రాగానే కుటుంబ సభ్యులలోని నలుగురు చనిపోయారు ఆ బాలుడు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబం మొత్తం ఫ్రెంచ్ పౌరులని, వారు స్విట్జర్లాండ్‌లో చాలా ఏళ్లుగా నివసిస్తున్నారని పోలీసులు చెప్పారు. ఈ కుటుంబం చాలా రిజర్వ్డ్ ఉంటుందని పెద్దగా ఎవరితో కలవరని స్థానికులు చెబుతున్నారని అన్నారు. అయితే బాలుడిని పాఠశాలకు పంపిచంకుండా హోం స్కూల్లో చదవించడానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు రావడంతోనే ఈ ఘటన వెలుగు చూసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం మెదటు పెట్టారు. (చదవండి: రక్త ప్రవాహంలో మైక్రోప్లాస్టిక్ కణాలు...నిత్యం వాడే ప్లాస్టిక్కే) -
రష్యా అధ్యక్షుడికి మరో ఊహించని షాక్...!
Demanding Switzerland Hosts Putin lover Expel: ఉక్రెయిన్‌పై రష్యా గత 26 రోజులుగా భయంకరంగా దాడులు చేస్తునే ఉంది. ఆంక్షలను సైతం పక్కనపెట్టి తనదైన యుద్ధ వ్యూహంతో సాగిపోయింది. అంతర్జాతీయ న్యాయస్థాన ఆదేశాలను దిక్కరించి మరీ ఉక్రెయిన్‌పై భీకరంగా విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్ని మూకుమ్మడిగా రష్యా ఆట కట్టించే దిశగా రంగం కూడా సిద్ధం చేసింది. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. గర్ల్‌ఫ్రెండ్‌ని లక్ష్యంగా చేసుకుని మరీ ఆన్లైన్ వేదికగా పుతిన్ అంటే గిట్టని కొంతమంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు change.org అనే వెబ్సైట్లో ఆమెను బహిష్కరించాలంటూ పిటిషన్ వచ్చింది. అంతేకాదు పిటిషన్లో.. 38ఏళ్ల అలీనా కబయేవా మాజీ జిమ్నాస్ట్ అని స్విట్టర్లాండ్‌లో తన ముగ్గురు పిల్లలతో విలాసవంతమైన విల్లాలో ఉన్నారని ఆరోపణలు చేయమే కాక ఆమెను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మనం పుతిన్ భాగస్వామిని ఆయనతో కలిపే సమయం ఆసన్నమైందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పైగా పుతిన్ ఆమె రహస్య ప్రేయసిని అధికారికంగా గుర్తింపు ఇవ్వలేదని తెలిపింది. ఈ యుద్ధ సమయంలో పుతిన్ రహస్య ప్రేయసికి స్విట్జర్లాండ్ ఆతిధ్యం ఇస్తూనే ఉందని పిటిషన్లో పేర్కొంది. పైగా ఆ పిటిషన్‌పై దాదాపు 50 వేలకు పైగా సంతకాలు చేశారు. అయితే ఉక్రెయిన్‌తో రష్యా సాగిస్తున్న భీకరమైన యుద్ధం నేపథ్యంలోనే ఈ పిటిషిన్ రావడం గమనార్హం. రష్యన్ ఫెడరేషన్‌పై విధించిన ఆంక్షల పరిణామాల నేపథ్యంలో రష్యన్ అనుకూల రాజకీయ మీడియా డైరెక్టర్, మాజీ అథ్లెట్ అలీనా కబయేవాని మీ దేశంలో దాచిపెడుతున్నారని ప్రజలు ఇప్పుడే తెలుసుకుంటున్నారని కూడా పిటిషన్లో వెల్లడించింది. అంతేకాదు ఆధునిక చరిత్రలో తొలిసారిగా స్విట్జర్లాండ్ తన తటస్థతను ఉల్లంఘించిందని పిటిషన్లో ఆరోపణలు గుప్పించింది. (చదవండి: 2 వేల మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన రష్యా: ఉక్రెయిన్ విదేశాంగ శాఖ) -
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ స్టార్ హీరోయిన్ని గుర్తు పట్టారా?
పై ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? ముక్కు.. మూతుల్ని చూపిస్తే ఎంతోకొంత గుర్తు పట్టొచ్చు కానీ.. కెమెరాకు వెనకా నుంచి ఫోజులిస్తే ఎలా గుర్తుపడతాం అంటారా? సరే మీకోసం ఈ ఫోటోకి సంబంధించి ఒక క్లూ ఇస్తే గుర్తు పట్టగలరేమో చెక్ చేసుకోండి. ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఇటీవల ఆమె తొలిసారి ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఆ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించింది. ఈ క్లూతో ఈపాటికే మీరు ఆ స్టార్ హీరోయిన్ని గుర్తించే ఉంటారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) కెమెరాకు వెనకా నుంచి ఫోటోకి ఫోజులిచ్చింది సమంతానే. ప్రస్తుతం ఈ బ్యూటీ స్విట్జర్లాండ్‌లో హాలీడే ట్రిప్‌ని ఎంజాయ్ చేస్తోంది. అక్కడి అందాలను ఆస్వాదిస్తూ సేద తీరుతుంది. తాను విడిది కోసం దిగిన హోటల్ బాల్కనీలో ఓ ఫోటో దిగి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘దీనికి అలవాటు పడాలి’అనే క్యాప్షన్ ఇచ్చింది సమంత. జీన్స్ ధరించి ఉన్న సామ్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సామ్ సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే ఆమె గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం మూవీ షూటింగ్‌ని కంప్లిట్ చేసుకుంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమా నటిస్తోంది. దీంతో పాటు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అలాగే ఓ హాలీవుడ్ చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
ఆ ఇద్దరి వల్లే నేనింకా బతికున్నాను : సమంత
Samantha Shares New Pic And Says Still Alive Because Of These Two : నాగ చైతన్య- సమంత విడాకుల విషయం సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండింగ్ టాపిక్. ఈ జంట విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి దాదాపు మూడు నెలలు కావోస్తున్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికీ వారిద్దరి గురించి చర్చ నడుస్తూనే ఉంది. ఇక విడాకుల అనంతరం ఇద్దరి సోషల్ మీడియా అకౌంట్లపై నెటిజన్ల ఫోకస్ మరింత పెరిగింది. సాధారణంగానే చై సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. దీంతో సమంత ఎప్పుడు ఏ పోస్ట్ షేర్ చేసినా అది విడాకుల అంశానికి ముడిపెడుతూ క్షణాల్లో అది వైరల్ అవుతుంది. తాజాగా స్విట్జర్లాండ్ ట్రిప్‌లో ఉన్న సమంత ఓ ఫోటోను షేర్ చేస్తూ.. వీరిద్దరి వల్లే ఇంకా బతికున్నాను అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనికి #skiingisbelieving అనే ట్యాగ్‌ను జత చేసింది. ఫోటోలో ఉన్న వీరిద్దరూ సామ్ స్కై ఇన్స్ట్రక్టర్లు అని తెలుస్తుంది. ఇంతకుముందు కూడా అహం(ఈగో)ని మీ ఇంట్లో వదిలి వెళ్లండి అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. అయితే రీసెంట్గా విడాకుల విషయంపై నాగ చైతన్య కామెంట్స్ అనంతరం సామ్ ఈ విధమైన పోస్టులు చేయడం విశేషం. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
స్విట్జర్లాండ్‌కు గుడ్ బై చెప్పిన ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా?
దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆటోమొబైల్ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ సమకాలీన అంశాలపై స్పందిస్తారు అనే విషయం మన అందరికీ తెలిసిందే. పౌర సమాజంతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటూ అనేక అంశాలపై ప్రజలతో చర్చిస్తుంటారు. తాజాగా జమ్ము & కాశ్మీర్ కు సంబంధించిన కొన్ని చిత్రాలను తన ట్విటర్ వేదికగా షేర్ చేశారు. మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. "హలో శ్రీనగర్.. గుడ్ బై స్విట్జర్లాండ్" అని పేర్కొన్నాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జమ్ము & కాశ్మీర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గతంతో పోలిస్తే ఇప్పుడు ఆ ప్రాంతాలు మరింత ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయి. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన చిత్రాలలో ఆ ప్రాంతం పూర్తిగా మంచుతో కప్పబడి ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ చిత్రాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఒక యూజర్ ఇలా రాశాడు.. "భారతదేశం పెద్ద టైకూన్ స్విట్జర్లాండ్ కంటే హిమాలయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే నేను నిజంగా అభినందిస్తున్నాను.. ఇది మా పర్యాటకాన్ని పెంచుతుంది.." అని అన్నారు. I really appreciate if big tycoon of India promote Himalayan Tourism over Hyped Switzerland…. it will boost our tourism…👏👏👏 — Kuldeep Jaiswal (@jaishkuldeep23) January 16, 2022 Sir, Hello to shimla as well. Pic of last week. pic.twitter.com/iP6WBdh5aG — Varun Walia (@varunwalia) January 16, 2022 (చదవండి: ఎస్బీఐ ఖాతాదారులకు సంక్రాంతి శుభవార్త..!) -
టైమ్ బ్యాంక్లొస్తున్నాయ్.. ఓ 4 ‘గంటలు’వెనకేసుకుందాం!
సాక్షి, సెంట్రల్‌డెస్క్: ప్రస్తుతం ప్రపంచమంతా డబ్బు కోసం పరుగులు పెడుతోంది. ఎవరిని కదిలించినా.. ‘ఎంతో కొంత వెనకేసుకోవాలి కదరా’ అనే మాటే వినబడుతోంది. కానీ అసలు ప్రపంచంలో డబ్బే అవసరం లేకుండా పనులు జరిగిపోతే. మనకు వచ్చే పనులను వేరే వాళ్లకు చేసిపెట్టి.. మనకు అవసరమున్న పనులను అవి వచ్చే వాళ్లతో చేయించుకుంటే. ఈ పనులన్నింటినీ వాటికయ్యే సమయం ప్రకారం లెక్కిస్తే. ఇదేదో బాగుంది కదా! దీన్నే టైమ్ బ్యాంకు విధానం అంటారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. అసలు ఏంటీ విధానం, ఎలా నడుస్తుంది, ఎన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చింది, మన దేశంలో పరిస్థితేంటి.. తెలుసుకుందాం. మీరో కంప్యూటర్ హార్ట్‌వేర్ ఇంజనీర్. మీ ఇంట్లో గార్డెనింగ్ పని చేయాల్సి ఉంది. ఆ పని చేసే వ్యక్తిని పిలిచారు. అతను వచ్చి ఆ పని చేసేశాడు. సుమారు 2 గంటల సమయం పట్టింది. ఆ సమయం ఆ వ్యక్తి బ్యాంకు ఖాతాలో డిపాజిట్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్నిరోజులకు వేరే ఎవరి ఇంట్లోనో షార్ట్ సర్క్యూట్ వల్ల కంప్యూటర్ పాడైతే మీరు వెళ్లి బాగు చేశారు. రిపేర్‌కు దాదాపు 4 గంటలు పట్టింది. ఈ సమయం మీ బ్యాంకు ఖాతాలో చేరిపోతుంది. ఇంతకుముందు మీరు చేయించుకున్న రెండు గంటల పని పోనూ ఇంకో రెండు గంటలు మిగులుతుంది. ఈ సమయాన్ని మీరు వేరే పనులకు వాడుకోవచ్చు. ఇలా మీకు వచ్చిన పనులు చేస్తూ, వాటికి పట్టే సమయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తుండటం.. మీకు కావాల్సిన పనులకు ఆ సమయాన్ని వాడుకోవడం.. డబ్బు అవసరమే లేకుండా పనులన్నీ జరిగిపోవడం.. ఇదే టైమ్ బ్యాంకు విధానం. ఇప్పుడు చాలా దేశాల్లో వాడుకలోకి వస్తున్న సరికొత్త విధానం. ఎక్కడ పుట్టింది ఈ ఐడియా? ప్రజలు తాము చేసే పనులను డబ్బుకు బదులు సమయంతో కొలిచే ఈ కొత్త విధానానికి అమెరికాకు చెందిన ఎడ్గర్ ఎస్. కాన్ అనే వ్యక్తి సృష్టికర్త. ప్రస్తుతం ఇతను అమెరికాలో టైమ్ బ్యాంకులకు సీఈవో. ఈ పద్ధతిలో ఎవరైనా ఒక గంటపాటు తమకు వచ్చిన పనిని అవసరమైన వారికి చేశారనుకోండి.. అతనికి ఓ గంట టైమ్ క్రెడిట్ ఇస్తారు. అలా పని చేసిన మొదటి వ్యక్తికి ఇంకేదైనా పని అవసరమైనప్పుడు ఆ పని చేయగలిని వాళ్లు వచ్చి ఆ గంట చేసి వెళ్తారు. ఇలా టైమ్‌ను క్రెడిట్ చేసుకోవడం, డెబిట్ చేయడం, అవసరమైన పనులకు వ్యక్తులను పంపడం లాంటివి చూసుకునేందుకే టైమ్ బ్యాంకులు ఉంటాయి. ఎన్ని దేశాల్లో నడుస్తోంది? ప్రస్తుతం ఓ ప్రణాళికాబద్ధంగా టైమ్ బ్యాంకులు 30కి పైగా దేశాల్లో నడుస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా లాంటి పెద్ద దేశాలూ ఈ టైమ్ బ్యాంకులను నడిపిస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ టైమ్ బ్యాంకుల ద్వారా 40 లక్షల గంటల పని జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ప్రాంతాలు, దేశాల వరకే పరిమితమైన ఈ టైమ్ బ్యాంకుల సరిహద్దులను చెరిపేసేందుకు టైమ్ రిపబ్లిక్ 2013లో తొలి గ్లోబల్ టైమ్ బ్యాంకును కూడా ప్రారంభించింది. స్విట్జర్లాండ్‌లో వృద్ధుల కోసం.. స్విట్జర్లాండ్‌లో ఈ టైమ్ బ్యాంక్‌ను వృద్ధాప్య పెన్షన్ కార్యక్రమం లాగా ప్రారంభించారు. ఇందులో చేరిన ప్రతి వ్యక్తికీ సామాజిక భద్రత అకౌంట్ ఒకటి, టైమ్ బ్యాంకు కార్డు ఒకటి ఇస్తారు. ఎవరైనా ఎప్పుడైన సాయం అవసరమైతే తమ టైమ్‌ను వాడుకోవచ్చు. ఆ వ్యక్తి కోరే పని చేసే వలంటీర్‌ను ఎంపిక చేసి బ్యాంకు వాళ్లు పంపుతారు. సామాజికంగా కలిసిమెలిసి ఉండే వాళ్లకు, కొత్త పరిచయాలు కోరుకునే వాళ్లకు ఈ టైమ్ బ్యాంకింగ్ ఉత్సాహాన్నిస్తుంది. ఎందుకంటే స్విట్జర్లాండ్‌లో టైమ్ బ్యాంక్ క్లబ్లో చేరిన సభ్యులతో బ్యాంకులు ఎప్పటికప్పుడు సమావేశాలు, పార్టీలను ఏర్పాటు చేస్తున్నాయి. మన దేశంలో ఏంటి పరిస్థితి? స్విట్జర్లాండ్‌లో అమలు చేస్తున్న పథకాన్ని దేశంలో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖకు జాతీయ మానవ హక్కుల కమిషన్ సూచించింది. దేశంలో దాదాపు కోటిన్నర మంది వృద్ధులు ఒంటరిగా జీవిస్తున్నారు. వీళ్లలో ఏదోరకంగా సేవలు పొందుతున్న వాళ్లు కేవలం 20 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్లు ఏపనినైనా తమకుతాముగా చేసుకోవాల్సిందే. మరో 30 ఏళ్లలో దేశంలో 60 ఏళ్ల పైబడిన వాళ్లు మొత్తం జనాభాలో 20 శాతం అవుతారు. ప్రస్తుత సమాజంలో చిన్న కుటుంబాలు పెరగడం, సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తుండటంతో వృద్ధులు ఒంటరిగా గడపాల్సిన సందర్భాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టైమ్ బ్యాంకుల ద్వారా యువకులు ముందుకొచ్చి వృద్ధుల అవసరాలు తీర్చడం, వాళ్ల ఒంటరితనాన్ని పోగొట్టడం, అందుకు యువకులు వెచ్చించిన సమయాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం, ఆ తర్వాత తమ వృద్ధాప్యంలో ఆ సమయాన్ని వాడుకునే వెసులుబాటు పొందడం వంటివి సమస్యలకు పరిష్కారం చూపిస్తాయని కొందరు నిపుణులు అంటున్నారు. లోపాలేమైనా ఉన్నాయా? టైమ్ బ్యాంకులు ప్రస్తుతం కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఉన్నాయి. కాబట్టి సర్వీసులు పొందే, అందించే వెసులుబాటు చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఈ సర్వీసుల్లో సాంకేతికతను చాలా తక్కువగా వాడుతున్నారు. అంటే టైమ్ బ్యాంక్ యాప్ లాంటివి ఇంకా అందుబాటులోకి రాలేదు. పైగా కొన్ని పనులకు విలువ ఎక్కువగా ఉంటుంది. కొన్నింటికి తక్కువగా ఉంటుంది. ఇది కూడా ఒక సమస్యే. అయితే ఒకవేళ ఎవరి పనికైనా మిగతా వాళ్ల పనులతో పోలిస్తే ఎక్కువ విలువ ఉంటుందని, ఎక్కువ డబ్బులు వస్తాయని అనుకుంటే అలాంటి వాళ్లు సమయానికి బదులు డబ్బును కోరే వెసులుబాటును ఈ బ్యాంకుల్లో ఇస్తూ సమస్యను పరిష్కరిస్తున్నారు. పేద దేశాల్లో సాధ్యమా? ఇలాంటి టైమ్ బ్యాంకు విధానం ధనిక దేశాల్లోనే కుదురుతాయని కొందరు నిపుణులు అంటున్నారు. అలాంటి దేశాల్లో ప్రజలకు తిండి, చదువు కోసం పెద్దగా ఆందోళన ఉండదని, కాబట్టి వాళ్లు ఇలాంటి పనులకు ముందుకొచ్చే అవకాశం ఎక్కువని చెబుతున్నారు. పైగా ధనిక దేశాల్లో ఇలాంటి పనులు చేసేవాళ్లకు అక్కడి ప్రభుత్వాలు కావాల్సిన సదుపాయాలు, డబ్బులు కూడా అందించే అవకాశం ఉంటుందన్నారు. కానీ పేద, మధ్య తరగతి దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదని, ఆ దేశాల్లో తిండి కోసమే ప్రజలు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుందని, పిల్లల చదువులకు డబ్బులు అవసరమవుతాయని చెబుతున్నారు. కాబట్టి ఆ దేశాల ప్రజలు ఈ కొత్త విధానానికి ఇష్టపడరని అంటున్నారు. -
Shirley Setia: యూట్యూబ్ సంచలనం.. పుట్టింది డామన్.. పెరిగింది స్విట్జర్లాండ్..
హోమ్మేడ్ ఫిల్మ్స్‌తో ఇంటర్నేషనల్ ఫేమ్ కావచ్చు...అని మరోసారి నిరూపించింది స్వీటువాయిస్ షెర్లీ. డామన్‌లో జన్మించిన షెర్లీ షెటియ స్విట్జర్లాండ్‌లో పెరిగింది. యూనివర్శిటీ ఆఫ్ ఆక్లాండ్‌లో చదువుకునే రోజుల్లో పార్ట్–టైమ్ రేడియో జాకీగా పనిచేసింది. తాను పాడిన పాటలను సరదాగా యూట్యూబ్‌లో పోస్ట్ చేసేది. యూఎస్,యూకే, కెనడా, ఇండియాలలో ఉన్న ఎందరో కళాకారులతో ఆన్లైన్ వేదికగా కలిసి పనిచేసింది. ‘యూట్యూబ్ సెన్సేషన్’గా పేరు తెచ్చుకొంది. ముంబైకి వచ్చేసిన తరువాత... హిందీ యాక్షన్ కామెడి ఫిల్మ్ ‘ఏ జెంటిల్మెన్’లో డిస్కో...డిస్కో, ‘మస్కా’ సినిమాలో ‘ఐవన హ్యాంగ్ విత్ యూ’....మొదలైన పాటలు షెర్లీకి ఎంతో పేరు తెచ్చాయి. ‘బాలీవుడ్ నెక్ట్స్ బిగ్ సింగింగ్ సెన్సేషన్’ అనిపించుకుంది. ప్రసిద్ధ టీ–సిరీస్ మిక్స్‌టేప్, ఎలక్ట్రో ఫోక్లకు పాడింది. ‘మన హృదయం చెప్పినట్లు నడుచుకుంటే విజయం మనదే’ అంటుంది షెర్లీ షెటియ. చదవండి: ఎలాన్ మెచ్చిన మన ఎల్లుస్వామి View this post on Instagram A post shared by Shirley (@shirleysetia) -
నొప్పి తెలియకుండా విముక్తి
మరొకరి సాయంతో జీవితాన్ని చాలించడాన్ని (అసిస్టెడ్ సూసైడ్) సులభతరం చేసేదే ఈ ‘సార్కో మెషీన్’. నయం కాని వ్యాధులతో బాధపడుతూ... నిత్యం నొప్పిని, మానసిక క్షోభనూ అనుభవిస్తూ అనుక్షణం చచ్చేకంటే... ఎలాగూ బతికే అవకాశాలు లేవు కాబట్టి... పలుదేశాలు స్వీయ సమ్మతితో ప్రాణాలు విడవడాన్ని చట్టబద్ధంగా అనుమతిస్తున్నాయి. అందులో స్విట్జర్లాండ్ ఒకటి. అసిస్టెడ్ సూసైడ్‌కు ఈ సార్కో మెషీన్ ఒక సులువైన, బాధ తెలియనివ్వని సాధనం. స్విట్జర్లాండ్‌లో న్యాయ సమీక్షలో దీనికి ఆమోదముద్ర పడిందని తయారీ సంస్థ ఎగ్జిట్ ఇంటర్నేషనల్ (లాభాపేక్ష లేని సంస్థ. స్వచ్చంద సంస్థ లాంటిది) గతవారం వెల్లడించింది. ఎలా పని చేస్తుందంటే... శవపేటిక ఆకారంలో ఉండే సార్కో త్రీడీ ముద్రిత క్యాప్సుల్. ఎవరైనా ఇందులోకి ప్రవేశించి పడుకొంటే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. సమాధానాలు ఇచ్చాక లోపల ఉండే ఒక బటన్‌ను నొక్కడం ద్వారా దీన్ని పనిచేసేటట్లుగా చేయవచ్చు. ఎప్పుడు ప్రారంభం కావాలనే సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నైట్రోజన్‌తో నిండిన ఒక పరికరం ఉపరితలంపై దీని నిర్మాణం జరుగుతుంది. బటన్ నొక్కిన వెంటనే క్యాప్సుల్‌లోకి శరవేగంగా నైట్రోజన్ నిండుతుంది. సెకన్లలో ఆక్సిజన్ స్థాయి 21 నుంచి ఒకటికి పడిపోతుంది. క్యాప్సుల్‌లోని వ్యక్తి వినికిడి శక్తిని కొద్దిగా కోల్పోయిన భావన కలుగుతుంది... ఒకరకమైన ఆనందానుభూతిని పొందుతాడు. శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డయాౖMð్సడ్ స్థాయిలు పడిపోయి మరణం సంభవిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ 30 సెకన్లలో ముగుస్తుందని దీని రూపకర్త డాక్టర్ ఫిలిప్ నిష్కే తెలిపారు. తీవ్ర భయాందోళనలకు లోనుకావడం, ఊపిరి ఆడని ఫీలింగ్, యాతన... ఇవేవీ ఉండవు. ఆటోమేషన్ చేసే ఆలోచన స్విట్జర్లాండ్‌లో అసిస్టెడ్ సూసైడ్ చట్టబద్ధంగా అనుమతించడం పరోక్షంగా జరుగుతుంది. నేరుగా దీన్ని అనుమతించే చట్టాలు లేవు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకొకరు సహాయపడితే... దాని వెనుకగనక అతనికి స్వార్థపూరిత ఉద్దేశాలు ఉన్నాయని రుజువు చేయగలిగితే శిక్షార్హుడని చట్టం చెబుతోంది. అసిస్టెడ్ సూసైడ్‌కు ఒక ప్రొసీజర్ ఉంటుంది. జీవించే అవకాశాల్లేని రోగి... తనువు చాలించాలని నిర్ణయం తీసుకొనేటపుడు మానసిక సమతౌల్యంతో ఉన్నట్లు సైకియాట్రిస్టు ధ్రువీకరించాలి. తర్వాత రోగి నోటి ద్వారా ద్రవరూపంలో ఉన్న సోడియం పెంటోబార్బిటాల్ తీసుకుంటాడు. 2 నుంచి 5 నిమిషాల్లోపే నిద్రలోకి... ఆపై గాఢ కోమాలోకి వెళ్లిపోతాడు. అనంతరం మరణం సంభవిస్తుంది. చాలాదేశాల్లో అసిస్టెడ్ సూసైడ్ డాక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ స్విట్జర్లాండ్‌లో డాక్టర్లు కాని వారు కూడా ఆత్మహత్యలో సహాయపడవచ్చు. సైకియాట్రిస్టు ధ్రువీకరణ కూడా యాంత్రికంగా జరిగేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ని సార్కోకు జోడించే యత్నాలు చేస్తున్నామని డాక్టర్ ఫిలిప్ తెలిపారు. అసిస్టెడ్ సూసైడ్– యుథనేసియా ఒకటేనా! కాదు తేడా ఉంది. యూకే నేçషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం యుథనేసియా/మెర్సీకి ల్లింగ్ (కారుణ్య మరణం)లో ఒక వ్యక్తికి భరింపలేని, నిరంతర బాధ నుంచి విముక్తి ప్రసాదించడానికి డాక్టర్ ప్రాణాలు తీసే మందును తానే ఇంజక్ట్ చేస్తాడు. రోగి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిల్లో ఉంటే మెర్సీకిల్లింగ్లో అతని లేదా ఆమె బంధువులు కూడా రాతపూర్వకంగా సమ్మతి తెలుపవచ్చు. అసిస్టెడ్ సూసైడ్... ఒక బాధిత రోగి ప్రాణాలు తీసుకోవడానికి వైద్యుడు ప్రిస్కిప్షన్ రాస్తాడు.. రోగి స్వయంగా ఇంజక్షన్ లేదా నోటిద్వారా మందును వేసుకుంటాడు. స్విట్జర్లాండ్‌లో మాత్రమే డాక్టర్లు కాని వారు కూడా అసిస్టెడ్ సూసైడ్‌లో సహాయపడవచ్చు. ఏయే దేశాలు అనుమతిస్తున్నాయి... స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, కెనడా, కొలంబియా, స్పెయిన్, న్యూజిలాండ్ (6నెలలకు మించి బతకడని ఇద్దరు డాక్టర్లు ధ్రువీకరించాలి) దేశాల్లో చట్టబద్ధం. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోనూ ఇది అమల్లో ఉంది. అమెరికా లోని కాలిఫోర్నియా, కొలరాడో, హవాయి, న్యూజెర్సీ, ఒరెగాన్, వాషింగ్టన్ స్టేట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మోంటానా, వెర్మోంట్ల్లో చట్టబద్ధం. ఎవరు అర్హులనే విషయంలో నిబంధనలు మాత్రం వేరుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లో రెండు అతిపెద్ద అసిస్టెడ్ సూసైడ్ సంస్థలు... ఎగ్జిట్, డిగ్నిటాస్ల సేవలు ఉపయోగించుకొని 2020లో 1,300 మంది విముక్తి పొందారు. చట్టబద్ధత లేని దేశాల వారు స్విట్జర్లాం డ్ వచ్చి మరీ ప్రాణాలు వదులుతున్నారు. ఇది ‘డెత్ టూరిజం’గా మారుతోందనే విమర్శలున్నాయి. నైతికంగా సబబేనా? జాతస్య మరణం ధృవంః. పుట్టిన వాడు గిట్టక తప్పదు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ, ఇక బతికే అవకాశాలేమాత్రం లేనపుడు నొప్పిని భరిస్తూ బతికుండటానికి బదులు తనువు చాలించడమే మేలని భావిస్తారు బాధితులు. శారీరకంగా నొప్పిని భరిస్తూ, మానసిక క్షోభను అనుభవిస్తూ మృత్యువు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూడటమనేది అన్నింటికంటే పెద్ద నరకం. అలాంటి జీవికి సాధ్యమైనంత తేలికైన మార్గంలో ముక్తిని ప్రసాదించడమే మేలనేది కొందరి వాదన. అందుకే చట్టాలు దీన్ని అనుమతిస్తున్నాయి. భారత్‌లో ఏంటి స్థితి? అసిస్టెడ్ సూసైడ్, యుథనేసియా/మెర్సీ కిల్లింగ్ రెండూ మనదేశంలో చట్ట విరుద్ధం. నేరం. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు అరుణా షాన్‌బాగ్ కేసులో 2011లో ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ముంబైలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే అరుణా షాన్‌బాగ్‌పై వార్డుబాయ్ 1973లో అత్యాచారం చేశాడు. దాంతో కోమాలోకి వెళ్లిన ఆమె కోలుకోలేదు. 37 ఏళ్లు అలా ఆసుపత్రిలో జీవచ్చవంగా బెడ్‌పై ఉండిపోయిన ఆమె తరఫున 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడో న్యాయవాది. ఆమెకు విముక్తి కల్పించాలని కోరాడు. మెడికల్ లైఫ్‌సపోర్ట్ సిస్టమ్‌ను తొలగించడానికి (పాసివ్ యుథనేసియా) సుప్రీంకోర్టు అనుమతించింది. కానీ అది జరగలేదు. 42 ఏళ్లు కోమాలో ఉన్న తర్వాత 2015లో న్యూమోనియాతో అరుణ మరణించారు. అనంతరం 2018లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం... ఒక వ్యక్తిని వైద్య చికిత్సను నిరాకరించే హక్కు ఉందని రూలింగ్ ఇచ్చింది. ‘వయోజనుడైన ఓ వ్యక్తి మానసిక సమతౌల్యంతో నిర్ణయం తీసుకోగలిని స్థితిలో ఉంటే... ప్రాణాలు నిలిపే పరికరాలను తొలగించడంతో సహా ఎలాం టి వైద్య చికిత్సనైనా నిరాకరించే హక్కు అతను లేదా ఆమెకు ఉంటుంది’ అని స్పష్టం చేసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
నరకయాతన లేని చావు.. తిట్టిపోస్తున్న జనం!
Suicide Pods Are Now Legal In Switzerland: హిట్లర్.. నాజీ సైన్యం తమ శత్రువులను గ్యాస్ ఛాంబర్లో పెట్టి చంపేదని, పారిపోయేందుకు ప్రయత్నించే వాళ్లను కిమ్ జోంగ్ ఉన్ గ్యాస్ ఛాంబర్లో తోసేసి శిక్షించేవాడని కథనాలు చదివాం కదా. ఇది అందుకు ఏమాత్రం తీసిపోని విషయం. అందుకే జనాలకు అంతలా తిట్టిపోస్తున్నారు. ‘చావుపుట్టుకలు మన చేతుల్లో ఉండేవి కావు’.. ఇది ఎప్పటికీ అక్షర సత్యం. కానీ, చావును సైతం చెప్పుచేతుల్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది?. ప్రత్యేక చట్టాలు అనుమతితో కారుణ్య మరణాలు కొనసాగుతున్న వేళ.. విమర్శలెన్ని వినిపించినా ‘తగ్గేదే లే’ అంటున్నాయి కొన్ని దేశాలు. తాజాగా స్విట్జర్లాండ్ ప్రభుత్వం చేసిన ఓ ప్రకటన చర్చనీయాంశంగా మారింది. నొప్పి లేకుండా కేవలం నిమిషాల్లో.. అదీ ప్రశాంతంగా చనిపోవచ్చంటూ ప్రత్యేక క్యాప్సూల్స్ వాడకానికి అనుమతులు ఇచ్చింది స్విస్ ప్రభుత్వం. సార్కో క్యాప్సూల్‌గా పిలిచే ఈ పేటికలను లోపల పడుకునే వ్యక్తే ఆపరేట్ చేసుకోగలగడం, ఎక్కడికంటే అక్కడికి మోసుకెళ్లడమే అసలు ప్రత్యేకతలు. ఈ ప్యాడ్‌లో పడుకున్న వ్యక్తిని ముందుగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత యాక్టివ్ బటన్‌ను నొక్కేందుకు ఆలోచించుకోవడానికి కొంత సమయం ఇస్తారు. బటన్ నొక్కగానే నైట్రోజన్ వాయువు రిలీజ్ అవుతుంది. కేవలం 30 సెకన్లలో ఆక్సిజన్ లెవల్ 21 శాతం నుంచి 1 శాతానికి పడిపోతుంది. స్పృహ కోల్పోయిన వ్యక్తి నిమిషాల వ్యవధిలోనే ప్రాణం విడుస్తాడు. ఈ ప్రాసెస్‌లో కణజాలానికి తక్కువ ఆక్సిజన్ పంపిణీ (hypoxia) రక్తంలో కార్బన్ డై యాక్సైడ్ లెవల్ తక్కువ కావడం(hypocapnia) ద్వారా మరణం సంభవిస్తుంది. క్యాబిన్లో ఉన్న వ్యక్తి స్పృహలోకి జారుకునే క్రమంలో.. కంటి చూపు తప్ప శరీర కదలికలు పని చేయవు. తద్వారా ప్రాణం పోయేటప్పుడు గిలగిలలాడేందుకు వీలు కూడా ఉండదు అంటున్నారు డాక్టర్ ఫిలిప్ నిట్స్‌చెకే. ఆస్ట్రేలియాకు చెందిన ఎగ్జిట్ ఇంటర్నేషనల్ (నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేషన్) డైరెక్టర్, డాక్టర్ డెత్‌గా పేరున్న ఫిలిప్ నిట్స్‌చెకే ఈ క్యాప్సుల్‌ను రూపొందించాడు. చట్టబద్ధత ఉంది! అసిస్టెడ్ సూసైడ్‌కు స్విట్జర్లాండ్‌లోనూ చట్టబద్దత ఉంది. కిందటి ఏడాది 1,300 మంది ఇలా చనిపోయారు కూడా(ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు). అదీ లిక్విడ్ సోడియం పెంటోబార్బిటల్ను ఇంజెక్షన్ ద్వారా ఎక్కించి చనిపోయేలా చేసేవాళ్లు. ఇక ఇప్పుడు సార్కో క్యాప్సూల్స్ ద్వారా అనుమతి ఇచ్చారు. అయితే ఈ అనుమతి ఆత్మహత్యలకు వుసిగొల్పేలా ఉందంటూ ఆందోళన సైతం వ్యక్తం అవుతోంది. అయినప్పటికీ స్విస్ ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. ఇక ఎగ్జిట్ ఇంటర్నేషనల్ ఇప్పటికే రెండు మోడల్స్ సార్కో లను తయారు చేసింది. ఇప్పుడు రూపొందించింది త్రీడీ ప్రింట్ టైప్. కాకపోతే వచ్చే ఏడాది నుంచి ఇది స్విస్ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ ఆర్టికల్ కేవలం సమాచారం అందించే ఉద్దేశంతో రాయబడింది -
రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్‌చరణ్
Ramcharan Intresting Comments About Ss Rajamouli: అభిమానులకు సరప్రైజ్ ఇవ్వనున్నారు రామ్‌చరణ్. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో మూడు సరికొత్త లుక్స్‌లో కనిపించనున్నారాయన. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’(రౌద్రం, రణం, రుధిరం). ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని కీలక పాత్రలో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా జనవరి 7న విడుదలవుతోంది. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ‘‘రాజమౌళిగారితో పని చేయడం వల్ల కెరీర్ పరంగానే కాక జీవితంలో కూడా చాలా నేర్చుకోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’లో అల్లూరి సీతారామరాజు పాత్ర చేశాను. ఇందులో కథ పరంగా నా పాత్ర మూడు సరికొత్త లుక్స్‌తో ఉంటుంది.. మామూలుగా రాజమౌళిగారితో ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేయడం అంటేనే ఓ కలలాంటిది. అలాంటిది మూడు క్యారెక్టర్లంటే ఇంతకంటే పెద్దది, ఇంతకంటే గొప్పది నాకు దక్కదనిపిస్తోంది’’ అన్నారు. చిన్న బ్రేక్ ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాల షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిపిన రామ్‌చరణ్ ఇటీవల శంకర్ సినిమా షూట్లో కూడా పాల్గొన్నారు. కాస్త సేద తీరడానికి షూటింగ్స్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి, తన సోదరి శ్రీజతో కలసి స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడి ఎత్తైన మంచు కొండల్లో నిలబడి రామ్‌చరణ్ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటో బయటికి వచ్చింది. -
స్విట్జర్లాండ్‌లో భారత సంస్కృతి ఉట్టి పడేలా..
జ్యూరిచ్: స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన తెలుగు ప్రజలు భారత సంస్కృతి ఉట్టి పడేలా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2021 నవంబర్ 21న తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ సీహెచ్ ఆధ్వర్యంలో జ్యూరీచ్లో దీపావళి వేడుకలను అంగ రంగ వైభవంగా జరిగాయి. వేడుకను తెలుగు అసోసియేషన్ స్విటర్లాండ్ ప్రెసిడెంట్ కడలి గనికాంబ, జనరల్ సెక్రెటరీ కిషోర్ తాటికొండలతో పాటు ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యులు సహకారం అందించారు. దీపావళిని పురస్కరించుకుని సాంస్కృతిక కార్యక్రమాలు ఆట పాటలతో కనువిందుగా ఈ వేడుక సాగింది. స్విట్జర్లాండ్‌లో స్థిరపడిన 150మంది తెలుగు వారు ఈ వేడుకలలో పాల్గొన్నారు. పిల్లలతో సహా అంతా అందరూ వెలిగించిన కాకర పువ్వులు, చిచ్చుబుడ్డులతో ఆ ప్రాంగణమంతా దీపాకాంతులతో వెల్లివిరిసింది. శుభోదయం గ్రూప్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించింది. -
Roger Federer: ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరం.. రిటైర్ అవుతున్నాడా..!
Roger Federer Likely To Miss Australian Open Not Thinking About Retirement: జనవరిలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ ఆడే అవకాశాలు లేవని అతడి కోచ్ లుబిసిచ్ తెలిపాడు. అయితే 2022లోనే ఏదో ఒక టోర్నీ ద్వారా ఫెడరర్ పునరాగమనం చేస్తాడని లుబిసిచ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో చివరిసారిగా ఆడిన ఫెడరర్... అనంతరం మెకాలికి మరోసారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోచ్ లుబిసిచ్ మాట్లాడుతూ.. ‘‘అతడు కోలుకుంటున్నాడు. టోర్నమెంట్లు ఆడాలని భావిస్తున్నాడు. పునరాగమనానికి అవకాశాలు ఉన్నాయి. వందకు వంద శాతం తను తిరిగి కోర్టులో అడుగుపెడతాడు. అయితే, ఆస్ట్రేలియా ఓపెన్‌కు మాత్రం అందుబాటులో ఉండడు. తనకు ఇప్పుడు 40 ఏళ్లు. కోలుకోవడానికి కాస్త సమయం పడుతుంది. అంతేగానీ రిటైర్మెంట్ ఆలోచన లేదు’’అని చెప్పుకొచ్చాడు. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. 5 కోట్ల విలువైన వాచీలు సీజ్! -
కాంక్రీట్ దిమ్మెలే.. బ్యాటరీలు!
ఫొటో చూస్తే ఏమనిపిస్తోంది? భవన నిర్మాణం కోసం ఉంచిన కాంక్రీట్ దిమ్మెలు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే! ఎందుకంటే.. ఇవి స్విట్జర్లాండ్ కంపెనీ ‘ఎనర్జీ వాల్ట్’ గతేడాది సిద్ధం చేసిన 8 మెగావాట్ల బ్యాటరీలు!! కాంక్రీట్‌తో బ్యాటరీ ఏమిటని అనుకోకండి. నిజానికి ఇది చాలా సింపుల్. ఎలాగంటే డ్యామ్‌లలో ఉన్న నీళ్లు వేగంగా కిందకు జారుతూ టర్బయిన్లను తిప్పడం ద్వారా విద్యుదుత్పత్తి అవడం మనకు తెలుసు కదా. ఇది కూడా అలాగే కాకపోతే ఒక్క చిన్న తేడా ఉంది. విద్యుత్‌కు రాత్రిపూట డిమాండ్ ఎక్కువగా ఉంటే సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా పగటిపూట ఎక్కువ విద్యుదుత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఈ అదనపు విద్యుత్ సాయంతో ఒక్కో కాంక్రీట్ దిమ్మెను క్రేన్ల ద్వారా పైకి ఎత్తుతారు. ఒక క్రమంలో పేర్చుకుంటూ వస్తారు. రాత్రిపూట విద్యుత్‌కు డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కో దిమ్మెను కిందకు జారవిడిచి గతి శక్తిని కాస్తా విద్యుచ్ఛక్తిగా మారుస్తారు. ఐడియా బాగుంది కదూ! ఎప్పుడో మూడేళ్ల క్రితమే ఈ ఐడియా వచ్చినా అన్ని అడ్డంకులను దాటుకొని వాణిజ్య స్థాయిలో ఓ టవర్‌ను ప్రారంభించేందుకు ‘ఎనర్జీ వాల్ట్’కు కొంత సమయం పట్టింది. చిత్రంలో ఉన్న ఏర్పాటు ద్వారా దాదాపు 8 మెగావాట్ల విద్యుత్‌ను నిల్వ చేసుకోవచ్చు. -
World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే!
ఫొటోలో ఒక పెద్దమనిషి అరచేతిలో ఇమిడిపోయిన బుల్లి రివాల్వర్ చూశారు కదూ! ఇది పిల్లలు ఆడుకునే టాయ్ రివాల్వర్ కాదు, ట్రిగ్గర్ నొక్కితే తూటాలను వెదజల్లే సిసలైన రివాల్వర్. దీని పనితనం పిట్ట కొంచెం కూత ఘనం అనే స్థాయిలో ఉంటుంది. చూడటానికి మోర్టార్ తూటా సైజులో ఉండే ఈ రివాల్వర్‌లో కూడా సాధారణ రివాల్వర్ మాదిరిగానే ఆరు తూటాలు పడతాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆయుధాల తయారీ సంస్థ ఈ మినీ గన్ను రూపొందించి, ఇటీవల గిన్నిస్ రికార్డును సాధించింది. ఈ రివాల్వర్ పొడవు 5.5 సెం.మీ., ఎత్తు 3.5 సెం.మీ. దీని బరువు 19.8 గ్రాములు. దీని ఖరీదు మాత్రం సాధారణ రివాల్వర్ల కంటే చాలా ఎక్కువే. ఎంతంటే, 6,300 స్విస్ ఫ్రాంకులు (రూ.5.14 లక్షలు). దీనిని కొంటే, దీనితో పాటు ఒక లెదర్ కేసు, 24 తూటాలు ఉచితంగా దొరుకుతాయి. అయితే, దీనిని దిగుమతి చేసుకోవడాన్ని అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు నిషేధించాయి. చదవండి: Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
Roger Federer: నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి...
Roger Federer: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నాలుగేళ్ల తొమ్మిది నెలల తర్వాత తొలిసారి టాప్–10 ర్యాంకింగ్స్‌లో చోటు కోల్పోయాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో 40 ఏళ్ల ఫెడరర్ రెండు స్థానాలు పడిపోయి 11వ ర్యాంక్‌లో నిలిచాడు. కెరీర్లో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ఫెడరర్ ఈ ఏడాది జూలైలో వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి గాయం తిరగబెట్టడంతో మరే టోర్నీలోనూ ఆడలేదు. చదవండి: Mary Kom: ఎవ్వరికీ ఆ ఛాన్స్ లేదు.. కానీ ఆమెకు మాత్రం మినహాయింపు?! -
ఇక నల్లకుబేరుల పని అయిపోయినట్లే!
ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం కింద స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఆ దేశంలోని స్విస్ బ్యాంకులో గల భారతీయుల ఖాతా వివరాలను మూడోసారి కేంద్రానికి అందజేసింది. గోప్యతకు మారుపేరైన స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టిన నల్లధనం వివరాలను భారత్ నిరంతరం పొందడానికి ఈ ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం దోహదపడుతుంది. ఖాతా సంఖ్య, ఖాతాదారుడి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, పన్ను గుర్తింపు సంఖ్య, వడ్డీ, డివిడెండ్, బీమా పాలసీల నుంచి చెల్లింపులు, క్రెడిట్ బ్యాలెన్స్, ఆస్తుల విక్రయం నుంచి లభించిన ఆదాయం తదితర అన్ని విషయాలను పరస్పరం మార్చుకోవచ్చు. ఈ యూరోపియన్ దేశం 96 దేశాలతో దాదాపు 33 లక్షల ఖాతాదారుల వివరాలను పంచుకున్నట్లు పేర్కొంది. ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌టిఎ) ఒక ప్రకటనలో ఈ ఏడాది సమాచార మార్పిడిలో మరో 10 దేశాలు పాల్గొన్నాయని తెలిపింది. ఆ దేశాలు ఆంటిగ్వా, బార్బుడా, అజర్ బైజాన్, డొమినికా, ఘనా, లెబనాన్, మకావ్, పాకిస్తాన్, ఖతార్, సమోవా, వౌటు. ఎఫ్‌టిఎ మొత్తం96 దేశాల పేర్లు, తదుపరి వివరాలను వెల్లడించనప్పటికీ, వరుసగా మూడవ సంవత్సరం సమాచారాన్ని అందుకున్న వారిలో భారతదేశం ఉన్నట్లు తెలిపింది. స్విస్ ఆర్థిక సంస్థలలో ఖాతాలు ఉన్న పెద్ద సంఖ్యలో వ్యక్తులు, కంపెనీలకు సంబంధించిన వివరాలు భారత అధికారులతో పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పిడి గత నెలలో జరిగింది. తదుపరి సమాచార మార్పిడి స్విట్జర్లాండ్ సెప్టెంబర్ 2022లో పంచుకోనుంది. సెప్టెంబర్ 2019లో ఏఇఓఐ(ఆటోమేటిక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్) కింద స్విట్జర్లాండ్ నుంచి భారతదేశం మొదటి సెట్ వివరాలను అందుకుంది. ఆ సంవత్సరం అటువంటి సమాచారాన్ని పొందిన 75 దేశాలలో మన దేశం ఒకటి. రెండు దేశాల మధ్య ఇలాంటి ఒప్పందం కుదిరిన నాటి నుంచి అనేక మంది భారతీయులు స్విస్ బ్యాంకుల్లోని తమ అక్రమ డిపాజిట్లను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం.(చదవండి: ఈ సారి జీమెయిల్, అవుట్ లుక్ యూజర్లను టార్గెట్ చేసిన హ్యాకర్లు) -
స్విస్ ఆల్ఫ్స్ సాహస యాత్రకు సైఅంటున్న ట్విన్ సిస్టర్స్..
స్విట్జర్లాండ్ టూరిజం బోర్డ్ ‘హండ్రెడ్ పర్సంట్ ఉమెన్ పీక్ ఛాలెంజ్’ కార్యక్రమాన్ని చేపట్టింది. సాహసిక బాటలో ‘ఉమెన్–వోన్లీ’ బృందాలను నడిపించడానికి ఈ సవాలుకు శ్రీకారం చుట్టారు. ప్రపంచవ్యాప్తంగా 250 మంది మహిళలు ఈ ఛాలెంజ్‌లో భాగం అయ్యారు. ఈ బృందంలో కాలు తిరిగిన పర్వతారోహకులతో పాటు, ఇప్పుడిప్పుడే సాహసానికి సై అంటున్న ఉత్సాహవంతులూ ఉన్నారు. స్విస్ ఆల్ఫ్స్లో 48కి పైగా ఉన్న నాలుగువేల మీటర్ల ఎత్తయిన పర్వత శిఖరాలను అధిరోహించడం వీరి లక్ష్యం. మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి సౌదీ అరేబియా మహిళ రహ మెహ్రక్ కూడా ఈ బృందంలో ఉంది. ‘ఆల్ఫ్స్ పర్వతశ్రేణులు అంటే భౌగోళిక ప్రాంతాలు కాదు. నిజంగా మనం జీవించే ప్రదేశాలు’ అంటుంది మెహ్రక్. ఇక మనదేశం విషయానికి వస్తే తషి, నుంగ్షీ మాలిక్‌లు ఈ బృందంలో ఉన్నారు. వీరి పేరు కనిపించగానే వినిపించే మాట... ఎవరెస్ట్ ట్విన్స్! మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి ట్విన్ సిస్టర్స్‌గా వీరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ‘ఈ సంవత్సరం మాకు చిరకాలం గుర్తు ఉంటుంది. దీనికి కారణం హండ్రెడ్ పర్సంట్ ఉమెన్ పీక్ ఛాలెంజ్. ఎంతో ఉత్సాహంతో ఇందులో భాగం అయ్యాం’ అంటుంది తషి మాలిక్. ‘కన్న కల త్వరగా సాకారం అయితే ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పడానికి మాటలు చాలవు. నిజానికి పర్వతారోహణ విషయంలో మా ప్రాధాన్యతల జాబితాలో స్విస్ ముందు వరసలో ఉంది. ఈ గ్లోబల్ ఛాలెంజ్‌లో భాగం కావడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాం’ అంటుంది నుంగ్షీ మాలిక్. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్)కు చెందిన మాలిక్ సిస్టర్స్ పద్ధెనిమిది సంవత్సరాల వయసులో సరదాగా పర్వతారోహణ మొదలుపెట్టారు. అయితే మౌంట్ రుదుగైరను తొలిసారి అధిరోహించిన తరువాత వారి దృక్పథంలో మార్పు వచ్చింది. ‘సరదా’ స్థానంలో ‘అంకితాభావం’ వచ్చి చేరింది. ‘ఈ ఛాలెంజ్‌లో భాగం కావడం వల్ల, మాలాంటి భావాలు ఉన్న ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. కొత్త విషయాలు తెలుసుకున్నాం. కొత్త ఉత్సాహం వచ్చింది’ అంటుంది తషి. పర్వతారోహణ... అనగానే అదేదో పురుషులకు మాత్రమే సంబంధించిన అంశంగా చూసేవారు. ఈ ధోరణిని చెరిపేసి మహిళలు రికార్డ్‌లు సృష్టించారు. తమ సత్తా చాటారు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులలో పురుషులతో పోలిస్తే స్త్రీలు చాలా తక్కువగా ఉన్నారు. ‘హండ్రెడ్ పర్సంట్ ఉమెన్ పీక్ ఛాలెంజ్’లాంటివి విరివిగా చేపడితే రానున్న పదిసంవత్సరాల కాలంలో పర్వతారోహణలో స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందనేది ఒక అంచనా. ఇప్పటివరకు మాలిక్ సిస్టర్స్ మూడు శిఖరాలను విజయవంతంగా అధిరోహించారు. వారి కోసం మరిన్ని విజయాలు ఎదురుచూస్తున్నాయి -
సాలీడు పురుగులంటే భయమా? ఈ యాప్‌తో..
గాలి భయం, నేల భయం, నిప్పు భయం, నీరు భయం.. ఇలా మనిషికి అంతా భయంమయం. నల్లిని చూసినా, పిల్లిని చూసినా.. భయంతో, అసహ్యంతో కుంగిపోతుంటాడు. అయితే కొందరు ఆ భయాల్ని పొగొట్టుకునేందుకు రకరకాల థెరపీలను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో సాలీడు పురుగులంటే భయపడేవాళ్ల కోసం ఓ యాప్‌ను రూపొందించారు స్విట్జర్లాండ్ సైంటిస్టులు. స్విట్జర్లాండ్ బాసెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు ‘డబ్బ్‌డ్ ఫోబిస్’ పేరుతో ఓ కొత్త యాప్‌ను డెవలప్ చేశారు. ఇందులో అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో రూపొందించిన సాలీడు పురుగుల బొమ్మలు డిస్ప్లే అవుతాయి. వీటి ద్వారా నిజమైన సాలీడు పురుగుల వల్ల కలిగే భయాన్ని దూరం చేసుకోవచ్చని రీసెర్చర్లు చెప్తున్నారు. సాలీడు పురుగుల వల్ల మనిషికి కలిగే భయాన్ని అరాచ్నోఫోబియా(అరాక్నోఫోబియా) అంటారు. దీని నుంచి బయటపడేందుకు చాలామంది మానసిక వైద్యులు, థెరపిస్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే డబ్బ్‌డ్ ఫోబిస్ పూర్తిగా ఫ్రీ యాప్. అగుమెంటెడ్ రియాలిటీ 3డీ స్పైడర్ బొమ్మల వల్ల.. రియల్ లైఫ్ స్పైడర్లు ఎదురైనప్పుడు కలిగే భయాన్ని ఫేస్ చేయొచ్చు. మొత్తం పది లెవల్స్‌లో ఈ యాప్ ట్రీట్మెంట్(సెల్ఫ్) చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ యాప్ వల్ల అరాచ్నోఫోబియా బయటపడ్డ కొందరి అభిప్రాయాల్ని ‘యాంగ్జైటీ డిజార్డర్స్’ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. వీళ్లంతా సుమారు రెండువారాలపాటు ఆరున్నర గంటలపాటు శిక్షణ తీసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో థెరపీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చాయని రీసెర్చర్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్లేస్టోర్‌లో డమ్మీ ఫోబిస్ యాప్‌లు చాలానే ఉన్నాయి. కానీ, ఏఆర్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌తో కూడిన డబ్బ్‌డ్ ఫోబిస్ యాప్ రావడానికి కొంత టైం పడుతుందని చెప్తున్నారు. చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా! -
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్-2021లో మెరుగైన భారత్ ర్యాంకు
గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021లో భారత్ తన ర్యాంకులను మెరుగుపరుచుకుంది. తాజాగా ప్రపంచ మేధో సంపత్తి సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2021 ర్యాంకింగ్స్‌లో భారత్ 36.4 స్కోరుతో 46వ స్థానంలో ఉంది. గత ఏడాది 2020తో పోలిస్తే భారత్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. అగ్రస్థానంలో 65.5 స్కోరుతో స్విట్జర్లాండ్ ఉండగా, స్వీడన్ 63.1 రెండవ, అమెరికా (61.3) మూడవ, బ్రిటన్ (59.8) నాల్గవ, రిపబ్లిక్ ఆఫ్ కొరియా(59.3) ఐదవ స్థానంలో ఉన్నాయి. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్(జీఐఐ)లో తన స్థానాన్ని వేగంగా మెరుగుపరుచుకుంది. 2015లో 81 ర్యాంక్ నుంచి 2021లో 46కు చేరుకుంది. కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలో కూడా సృజనాత్మకత విషయంలో భారత్ ముందంజలో ఉంది. భారత ప్రధాన మంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ప్రస్తుతం దేశంలో కీలకంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశోధన సంస్థలు చేస్తున్న పనులు, అణుశక్తి శాఖ వంటి శాస్త్రీయ విభాగాలు; డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ; డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ; డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ సంస్థలు నేషనల్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను సుసంపన్నం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అలాగే, ఎలక్ట్రిక్ వాహనాలు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మొదలైన విభిన్న రంగాలలోని విధానాలలో ఆవిష్కరణలను తీసుకొని రావడం కోసం నీతి ఆయోగ్ కృషి చేస్తోంది. ఈ ర్యాంకింగ్స్‌లో అంగోలా దేశం చివరి స్థానం(130)లో ఉంది.(చదవండి: వీటి కోసం గూగుల్‌లో వెతికితే ప్రమాదమే..!) -
ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..!
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిసారించాయి. కొన్ని కంపెనీలు కేవలం ఎలక్ట్రిక్ కార్లపైనే కాకుండా ఎలక్ట్రిక్ ట్రక్కులను కూడా తయారుచేయాలని నిర్ణయించుకున్నాయి. ఎలక్ట్రిక్ ట్రక్కులపై దిగ్గజ కంపెనీలు మెర్సిడెజ్ బెంజ్, వోల్వో వంటి కంపెనీలు దృష్టిసారించాయి. తాజాగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో యూరప్‌కు చెందిన ఫ్యూచరికం కంపెనీ సంచలనాన్ని నమోదు చేసింది. ఒక్కసారి ఛార్జింగ్‌తో ఏకంగా 1,099కి.మీ మేర ప్రయాణించి గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదుచేసింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై స్పష్టతనిచ్చిన ఆపిల్..! డిపీడీ స్విట్జర్లాండ్, కాంటినెంటల్ టైర్స్ భాగస్వామ్యంతో వోల్వో ట్రక్ యూనిట్‌ను మాడిఫై చేసి ఫ్యూచరికం ట్రక్‌ను డెవలప్ చేసింది. కంపెనీ నిర్వహించిన రేంజ్ టెస్ట్‌లో సుమారు ఇద్దరు డ్రైవర్లు పాల్గొన్నారు. ఓవల్ టెస్ట్ ట్రాక్ మీద ట్రక్ సుమారు 23 గంటల్లో 392 ల్యాప్‌లను పూర్తి చేసినట్లు కంపెనీ వెల్లడించింది. ట్రక్ సరాసరి గంటకు 50కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. డీపీడీ స్విట్జర్లాండ్ స్ట్రాటజీ అండ్ ఇన్నోవేషన్ డైరక్టర్ మార్క్ ఫ్రాంక్ మాట్లాడుతూ..ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో ఇదొక సంచలన విజయమని పేర్కొన్నారు. ఫ్యూచరికం కంపెనీ ఎలక్ట్రిక్ ట్రక్‌లో సుమారు 680కేడబ్య్లూహెచ్ బ్యాటరీను ఉపయోగించినట్లు కంపెనీ పేర్కొంది. ట్రక్ పూర్తి బరువు 19 టన్నులు. 680కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో సుమారు 680హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేయనుంది. చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ బైక్ ధర మరింత ప్రియం..! కొత్త ధర ఏంతంటే -
ఓర్కా.. టన్నుల్లో బొగ్గుపులుసును మింగేస్తది
పర్యావరణ కాలుష్యానికి కార్బన్ ఉద్గారాలు ప్రధాన కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహన కాలుష్యంతో పాటు ప్రకృతి వైపరిత్యాల కారణంగా గత రెండేళ్లుగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే గాల్లోని బొగ్గుపులుసు వాయువును సంగ్రహించి.. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు ప్రయత్నాలు అక్కడక్కడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఐస్‌ల్యాండ్‌లో ప్రపంచంలోనే భారీ ఫ్యాక్టరీని నెలకొల్పి సంచలనాలకు తెర లేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద Co2 సంగ్రహణ పరిశ్రమను ఐస్‌ల్యాండ్‌లో బుధవారం(సెప్టెంబర్ 8, 2021) ప్రారంభించారు. దీనిపేరు ఓర్కా(ఆర్కా). ఇది ఐస్‌ల్యాండిక్ పదం. ఇంగ్లిష్ మీనింగ్ ‘ఎనర్జీ’ అని. మొత్తం నాలుగు యూనిట్లు.. రెండు మెటల్ బాక్స్‌ల సెటప్‌తో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. స్విట్జర్ల్యాండ్కు చెందిన క్లైమ్‌వర్క్స్, ఐస్‌ల్యాండ్‌కు చెందిన కార్బ్‌ఫిక్స్ కంపెనీలు సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని భారీ నిధులు వెచ్చించి నెలకొల్పాయి. ఎలా పని చేస్తుందంటే.. ఏడాది నాలుగు వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్ని ఇది సంగ్రహిస్తుంది. ఇది దాదాపు 870 కార్ల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలతో సమానమని యూఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) పేర్కొంది. ఈ ఫ్యాక్టరీ యూనిట్లలోని ఫ్యాన్లు.. వాతావరణంలోని Co2ను సంగ్రహిస్తాయి. ఫిల్టర్ మెటీరియల్ సాయంతో వాయువును ఫిల్టర్ చేస్తుంది. అక్కడ అధిక ఉష్ణోగ్రతల వద్ద గాఢత ఉన్న Co2 గ్యాస్‌గా మారుతుంది. ఆపై నీటిని చేర్చి.. వెయ్యి మీటర్ల లోతులో బాసాల్ట్ బండరాళ్ల మీదకు వదిలేస్తారు. అంటే కార్బన్ క్యాప్చుర్ అండ్ స్టోరేజ్(CCS) ద్వారా కార్బన్ డయాక్సైడ్ను రాళ్లురప్పల్లో కలిపేయడం ఈ ప్రక్రియ విధానమన్నమాట. అయితే విమర్శకులు మాత్రం ఈ సాంకేతికత మంచిది కాదని చెప్తున్నారు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఇది అమలు చేయడానికి సంవత్సరాలు పడుతుందని వాళ్లు విబేధిస్తున్నారు. చదవండి: రియల్మీ ట్యాబ్! ఇవాళ్టి నుంచే.. -
అడుగేస్తేనే కరెంట్ పుడుతుంది మరి!
అడుగేస్తే మాస్, భూకంపం, దడదడా.. ఇలాంటి డైలాగులు అతిశయోక్తి కోసం సినిమాల్లో వాడుతుంటారు. కానీ, అడుగేస్తే నిజంగా కరెంట్పుడితే? ఎలా ఉంటుంది. ‘పవర్ వాక్’.. ఈ పదం ఎప్పుడైనా విని ఉన్నారా? స్విస్ సైంటిస్టుల చొరవతో త్వరలో ఇది నిజం కాబోతోంది. చెక్క ఫ్లోరింగ్, సిలికాన్ కలయిక ద్వారా ఎలక్ట్రిక్ ప్రొడక్షన్ ప్రారంభించే దిశగా ‘అడుగు’లు పడబోతున్నాయి. జూరిచ్(స్విట్జర్ల్యాండ్)కు చెందిన ఈటీహెచ్ జూరిచ్ పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు ఈ ప్రయోగాల్లో తొలి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. నానోజనరేటర్ పేరుతో తయారు చేసిన డివైజ్ ఆధారంగా లో వోల్టేజ్ కరెంట్‌ను ఉత్పత్తి చేయగలిగారు. నానో క్రిస్టల్స్‌ను పొందుపరిచిన చెక్కఫ్లోర్, దానికి సిలికాన్ కోటింగ్‌తో డివైజ్‌ను రూపొందించారు. ఈ డివైజ్‌పై అడుగువేయగానే ఒత్తిడి.. ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఈ కరెంట్‌తో ఎల్ఈడీ బల్బ్స్, చిన్న ఎలక్ట్రిక్ డివైజ్‌లను పని చేసేలా చేశారు. ట్రైబోఎలక్ట్రిక్ ఎఫెక్ట్.. అంటే ఎలక్ట్రాన్లను ఏ మెటీరియల్ అయితే కోల్పోతోందో అది ట్రైబో పాజిటివ్.. ఏదైనా పొందుతుందో అది ట్రైబో నెగెటివ్. ఈ సూత్రం ఆధారంగానే నానోజెనెరేటర్ పని చేస్తుంది. చెక్క ఫ్లోర్ ఎలక్ట్రాన్లను ఆకర్షించడం, వికర్షించడం.. మీద ఆధారపడి ఇది పని చేయనుంది. దీనిని మరింత మెరుగ్గా(మనిషికి ప్రమాదం జరగని స్థాయి) తీర్చిదిద్ది ఇంటి అవసరాలకు, తక్కువ స్పేస్‌లో ఉపయోగించనున్నట్లు ప్రొఫెసర్ గుయిడో పంజరసా చెబుతున్నారు. చదవండి: కరోనా పేషెంట్ల ప్రాణాలను కాపాడే టూల్.. మనోడి సత్తా -
యూఎస్ ఓపెన్: పునరాగమనంపై ఫెడరర్ క్లారిటీ
గ్రాస్ కోర్ట్ సీజన్ సందర్భంగా దురదృష్టవశాత్తు స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ మోకాలికి గాయం మళ్లీ తిరగబెట్టింది. దాంతో ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో ఈ ఆటగాడు మళ్లీ రాకెట్ పట్టలేదు. అయితే తాజాగా తన పునరాగమనంపై ఫెడరర్ స్పందించాడు. మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ఫెడరర్ తాను యూఎస్ ఓపెన్‌లో పాల్గొనే అవకాశలు లేవని సోషల్ మీడియాలో తెలిపాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ ఇటీవల చేసుకున్న శస్త్రచికిత్స కారణంగా వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఫెడరర్ మాట్లాడుతూ.. ఇటీవల గాయం కారణంగా చాలా నెలలు ఆటకు దూరంగా ఉన్నాను. ఇది కొన్ని విధాలుగా కష్టంగా ఉంటుంది, కానీ అదే సమయంలో నేను ఆరోగ్యంగా ఉండడం కూడా చాలా ముఖ్యం. అందుకే ఇంత గ్యాప్ తీసుకుంటున్నా. "నేను వాస్తవాలు మాట్లాడుతున్నా, నన్ను తప్పుగా భావించవద్దు. ఈ వయసులో ఇప్పుడు మరొక శస్త్రచికిత్స చేసి ప్రయత్నించడం ఎంత కష్టమో నాకు తెలుసు, ”అని తెలిపాడు. ఇప్పటికే నేను రిహాబిలిటేషన్ ప్రారంభించాను. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాననే నమ్మకం ఉందంటూ ఫెడరర్ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నాడు. View this post on Instagram A post shared by Roger Federer (@rogerfederer) -
పునరాగమనంపై అనిశ్చితి: ఫెడరర్
ఈనెల 30న మొదలయ్యే యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేది లేనిది ఇప్పుడే చెప్పలేనని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం ఫెడరర్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది కేవలం 13 మ్యాచ్‌లు ఆడిన ఫెడరర్ వింబుల్డన్ టోర్నీ తర్వాత ఆటకు విరామం ఇచ్చాడు. ‘వింబుల్డన్ టోర్నీ తర్వాత మోకాలి నొప్పితో మళ్లీ రాకెట్ పట్టలేదు. ఈ వారంలో డాక్టర్లను కలవాల్సి ఉంది. ఇప్పటికైతే నా పునరా గమనంపై అనిశ్చిత నెలకొని ఉంది’ అని ఫెడరర్ వివరించాడు. -
‘అత్యాచారం జరిగింది 11 నిమిషాలే.. అందుకే శిక్ష తగ్గిస్తున్నాం’
స్విట్జర్లాండ్/బెర్న్: అత్యాచారం.. ఓ బాలిక, యువతి, మహిళ జీవితాన్ని సమూలంగా నాశనం చేస్తుంది. ఇలాంటి దారుణ నేరాల్లో న్యాయం జరగడం అటుంచి.. సమాజం ఆమెను, ఆమె కుటుంబాన్ని చిత్రవధ చేస్తుంది. వారి పట్ల ఏమాత్రం జాలి, సానుభూతి చూపరు. పైగా నేరం చేసినవాడిని వదిలేసి.. బాధితురాలి ప్రవర్తననే తప్పు పడతారు. వీటన్నింటిని తట్టుకుని కోర్టు వరకు వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగకపోతే.. ఇక చట్టాలు, రాజ్యాంగాలు ఎందుకున్నట్లు. సరిగా ఇలానే ప్రశ్నిస్తున్నారు స్విట్జర్లాండ్ వాసులు. అత్యాచారం వంటి దారుణమైన నేరానికి సంబంధించి మీరు ఇలాంటి మతి లేని తీర్పు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నిరసన తెలుపుతున్నారు. ఆ వివరాలు.. ఓ అత్యాచారం కేసులో స్విట్జర్లాండ్ బాసెల్ కోర్టు వివాదాస్పద తీర్పు వెల్లడించింది. ‘‘నిందితుడు కేవలం 11 నిమిషాల పాటే అత్యాచారం చేశాడు.. బాధితురాలిని పెద్దగా గాయపర్చలేదు. కనుక అతడికి విధించిన శిక్షను తగ్గిస్తున్నాం’’ అని తెలిపింది. ఈ తీర్పు పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాసెల్‌లో నిరసన ప్రదర్శన చేపట్టారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో దుమ్మెత్తి పోస్తున్నారు. కేసేంటంటే.. స్విట్జర్లాండ్ వాయువ్య ప్రాంతంలోని ఓ నగరానికి చెందిన బాధితురాలిపై గతేడాది ఫిబ్రవరిలో పోర్చుగల్‌కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఆమె ప్లాట్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణంలో మరో 17 ఏళ్ల మైనర్ అతడికి సహకరించాడు. ఇక బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని కోర్టులో హాజరపరిచారు. ఈ నేరానికి సంబంధించి కోర్టు ఆగస్టు, 2020లో శిక్ష విధించింది. 31 ఏళ్ల వ్యక్తికి 4 సంవత్సరాల 3నెలల శిక్ష విధించింది. మైనర్ని జువైనల్ హోంకి తరలించింది. వివాదాస్పద నిర్ణయం.. తాజాగా కోర్టు గతంలో నిందితుడికి తాను విధించిన శిక్షను తగ్గించింది. 51 నెలల జైలు శిక్షను 36 నెలలకు తగ్గించింది. బాసెల్ కోర్టు ప్రెసిడెంట్ కోర్ట్ ప్రెసిడెంట్ జస్టిస్ లిసెలెట్ హెంజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. స్విస్ న్యూస్ వెబ్సైట్ 20 మినిట్స్ ప్రకారం నిందితుడిని ఆగస్టు 11 న విడుదల చేయవచ్చని తెలిపింది. ఇక శిక్ష కాలాన్ని తగ్గిస్తూ జస్టిస్ హెంజ్ మరింత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘బాధితురాలు కొన్ని తప్పుడు సంకేతాలు పంపి.. నిప్పు రాజేసింది.. పైగా అత్యాచారం జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి నైట్‌క్లబ్‌క్ వెళ్లి ఎంజాయ్ చేసింది.. ఇవన్ని నిందితుడిపై ప్రభావం చూపాయి’’ అన్నారు జస్టిస్ హెంజ్. ఈ కేసులో నిందితుడిది మధ్యస్థమైన నేరంగా పేర్కొన్నారు. పైగా అత్యాచారం కూడా 11 నిమిషాలపాటే సాగిందని.. ఈ ఘటనలో బాధితురాలికి ఎక్కువ గాయాలు కాలేదని.. అందుకే అతడికి శిక్షను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా బాసెల్ నగరవ్యాప్తంగా నిరసన తెలపుతున్నారు జనాలు. ఈ సదర్భంగా పలువురు నెటిజనులు జస్టిస్ హెంజ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘11 నిమిషాల దారుణ చర్య కొన్ని జనరేషన్ల వరకు వెంటాడుతూనే ఉంటుంది.. ఈ దారుణ అనుభవం నుంచి బయటపడటానికి ఆమెకు ఓ జీవితకాలం పడుతుంది. అంటే 11 నిమిషాల వ్యవధి ఆమె జీవితకాలంతో సమానం. కోర్టుకు ఈ విషయం ఎందుకు అర్థం కాలేదు. నైట్‌క్లబ్‌కు వెళ్లడం అనేది ఆమె వ్యక్తిగత అంశం.. దాన్ని కూడా తప్పంటే... అసలు ఆడవారు ఈ భూమి మీద పుట్టడం కూడా నేరమే అవుతుంది కదా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "Rape ONLY lasted for 11 minutes” 11 minutes of rape feels like 16hrs and the effects/trauma last for generations. https://t.co/DRKgjTTqfA — daktari Linnie🇸🇪 🇰🇪 (@ElenaNjeru) August 9, 2021 -
కొత్తగా మూడు దేశాలకు ఐసీసీ సభ్యత్వం
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్తగా మూడు దేశాలకు సభ్యత్వం ఇచ్చింది. దీంతో ఐసీసీ సభ్య దేశాల సంఖ్య 106కు చేరింది. ఆసియా ఖండం నుంచి మంగోలియా, తజకిస్థాన్.. యూరప్ నుంచి స్విట్జర్లాండ్‌కు ఐసీసీ సభ్యత్వాలు ఇచ్చింది. ఆదివారం వర్చువల్‌గా జరిగిన 78వ సర్వసభ్య సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. కొత్తగా సభ్యత్వం లభించిన దేశాలు వారి వారి ప్రాంతాల్లో క్రికెట్ అభివృద్ధికి తోడ్పడాలని ఐసీసీ సూచించింది. అందుకు అవసరమైన మద్దతు తమవైపు నుంచి ఉంటుందని హామీ ఇచ్చింది. Congratulations to Mongolia, Switzerland and Tajikistan, who are now among ICC's 94 Associate Members 👏Know more about their journeys 👉 https://t.co/33UFKEgNZr pic.twitter.com/sw54PsPBir— ICC (@ICC) July 18, 2021 -
ఫెడరర్‌కు షాక్
లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రికార్డుస్థాయిలో 22వసారి బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కథ క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. గతంలో ఎనిమిదిసార్లు చాంపియన్‌గా నిలిచిన 39 ఏళ్ల ఫెడరర్‌ను 14వ సీడ్ హుబర్ట్ హుర్కాజ్ (పోలాండ్) ఇంటిముఖం పట్టించాడు. గంటా 49 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 24 ఏళ్ల హుబర్ట్ 6–3, 7–6 (7/4), 6–0తో ఫెడరర్‌ను బోల్తా కొట్టించి కెరీర్లో తొలి సారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో ఫెడరర్‌పై హుబర్ట్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. హుబర్ట్ దూకుడైన ఆటకు ఫెడరర్ సమాధానం ఇవ్వలేకపోయాడు. సునాయాసంగా గెలవాల్సిన పాయింట్లను కూడా ఫెడరర్ కోల్పోయాడు. ఏకంగా 31 అనవసర తప్పిదాలు చేసిన ఫెడరర్ మూడు డబుల్ట్ ఫాల్ట్‌లు చేశాడు. కేవలం ఒక్కసారి మాత్రమే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 81 కేజీల బరువున్న హుబర్ట్ 10 ఏస్‌లు సంధించడంతోపాటు ఫెడరర్ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. పదోసారి సెమీస్‌లో జొకోవిచ్ మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–4తో ఫుచోవిచ్ (హంగేరి)పై గెలిచి పదోసారి సెమీఫైనల్లోకి చేరాడు. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో పదో సీడ్ షపోవలోవ్ (కెనడా)తో జొకోవిచ్ తలపడతాడు. మరో క్వార్టర్ ఫైనల్లో షపోవలోవ్ 6–4, 3–6, 5–7, 6–1, 6–4తో 25వ సీడ్ ఖచనోవ్ (రష్యా)ను ఓడించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరాడు. పోరాడి ఓడిన సానియా–బోపన్న జంట మిక్స్డ్ డబుల్స్ మూడో రౌండ్లో సానియా మీర్జా–రోహన్ బోపన్న (భారత్) జంట 3–6, 6–3, 9–11తో జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)– క్లెపాక్ (స్లొవేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. తన కెరీర్లో ఫెడరర్ ప్రత్యర్థికి ఓ సెట్‌ను 0–6తో కోల్పోవడం ఇది ఐదోసారి మాత్రమే. గతంలో విన్సెంట్ స్పాడియా (1999లో మోంటెకార్లో మాస్టర్స్ టోర్నీ), ప్యాట్రిక్ రాఫ్టర్ (1999లో ఫ్రెంచ్ ఓపెన్), బైరన్ బ్లాక్ (1999లో క్వీన్స్ క్లబ్ టోర్నీ), నాదల్ (2008లో ఫ్రెంచ్ ఓపెన్) మాత్రమే ఫెడరర్‌ను ఓ సెట్లో 6–0తో ఓడించారు. గ్రాస్‌కోర్టులపై ఫెడరర్‌ను వరుస సెట్లలో ఓడించిన నాలుగో ప్లేయర్ హుబర్ట్ హుర్కాజ్. గతంలో కఫెల్నికోవ్ (వింబుల్డన్ –2000), అన్చిచ్ (వింబుల్డ¯Œ –2002), ఆండీ ముర్రే (లండన్ ఒలింపిక్స్–2012) ఈ ఘనత సాధించారు. -
శ్రమించి ముందుకు...
లండన్: తనకెంతో అచ్చొచ్చిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ 18వసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 22వసారి ఆడుతోన్న ఫెడరర్‌కు మూడో రౌండ్లో గట్టిపోటీనే ఎదురైంది. బ్రిటన్‌కు చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ కామెరాన్ నోరీతో శనివారం జరిగిన మ్యాచ్‌లో 39 ఏళ్ల ఫెడరర్ 6–4, 6–4, 5–7, 6–4తో గెలుపొందాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 27వ ర్యాంకర్ లొరెంజో సొనెగో (ఇటలీ)తో ఫెడరర్ తలపడతాడు. నోరీతో 2 గంటల 35 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ఫెడరర్ ఏడు ఏస్‌లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయలేదు. నెట్ వద్దకు 38 సార్లు దూసుకొచ్చి 30 సార్లు పాయింట్లు గెలిచాడు. 48 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ 33 అనవసర తప్పిదాలు చేశాడు. నోరీ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఈ స్విస్ స్టార్ తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయాడు. మరోవైపు కామెరాన్ నోరీ 12 ఏస్‌లు సంధించడంతోపాటు ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తాజా విజయంతో పాంచో గొంజాలెస్ (అమెరికా–41 ఏళ్ల వయసులో; 1969లో), కెన్ రోజ్‌వెల్ (ఆస్ట్రేలియా–40 ఏళ్ల వయసులో; 1975లో) తర్వాత వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరిన మూడో పెద్ద వయస్కుడిగా ఫెడరర్ గుర్తింపు పొందాడు. ఆండీ ముర్రే పరాజయం మరోవైపు 2013, 2016 చాంపియన్ ఆండీ ముర్రే (బ్రిటన్) కథ మూడో రౌండ్లో ముగిసింది. పదో సీడ్ షపవలోవ్ (కెనడా) 6–4, 6–4, 6–2తో ప్రపంచ మాజీ నంబర్‌వన్ ముర్రేను ఓడించి తొలిసారి వింబుల్డన్ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) 6–7 (3/7), 6–4, 6–3, 7–6 (7/4)తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై నెగ్గాడు. మరో మ్యాచ్‌లో ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ) 6–4, 6–4, 6–4తో బెడెన్ (స్లొవేనియా)పై గెలిచాడు. కోకో గాఫ్ జోరు మహిళల సింగిల్స్‌లో 20వ సీడ్, అమెరికా టీనేజర్ వరుసగా రెండో ఏడాది ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్ మ్యాచ్‌లో కోకో గాఫ్ (అమెరికా) 6–3, 6–3తో కాయా యువాన్ (స్లొవేనియా)పై గెలిచింది. ఇంతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో మాజీ చాంపియన్ కెర్బర్ (జర్మనీ) 2–6, 6–0, 6–1తో సస్నోవిచ్ (బెలారస్)పై, 14వ సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/1), 3–6, 7–5తో సెవస్తోవా (లాత్వియా)పై, 19వ సీడ్ ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–5, 6–3తో పావ్లుచెంకోవా (రష్యా)పై, పౌలా బదోసా (స్పెయిన్) 5–7, 6–2, 6–4తో లినెట్టి (పోలాండ్)పై గెలిచారు. సానియా జంట ఓటమి మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా మీర్జా (భారత్)–బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా) జోడీ 4–6, 3–6తో కుదెర్మెతోవా–వెస్నినా (రష్యా) జంట చేతిలో ఓడిపోయింది. -
స్పెయిన్ వర్సెస్ స్విట్జర్లాండ్
సెయింట్ పీటర్స్బర్గ్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో శుక్రవారం జరిగే తొలి క్వార్టర్ ఫైనల్లో మూడుసార్లు చాంపియన్ స్పెయిన్‌తో స్విట్జర్లాండ్ జట్టు తలపడుతుంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, గత యూరో కప్ రన్నరప్ ఫ్రాన్స్ జట్టును ఓడించి స్విట్జర్లాండ్ ఈ మెగా టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్ చేరింది. అదే జోరును కొనసాగించి సెమీఫైనల్ బెర్త్ దక్కించుకోవాలని స్విట్జర్లాండ్ పట్టుదలతో ఉంది. అయితే స్పెయిన్‌తో జరిగిన 22 మ్యాచ్‌ల్లో స్విట్జర్లాండ్ ఒక్కసారి మాత్రమే నెగ్గి 16 సార్లు ఓడిపోయి, ఐదుసార్లు ‘డ్రా’ చేసుకుంది. క్వార్టర్ ఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ మొత్తం 11 గోల్స్ చేసి టాప్ ర్యాంక్‌లో ఉంది. స్విట్జర్లాండ్ విజయావకాశాలు షాకిరి, సెఫరోవిచ్, గావ్రనోవిచ్ ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. స్పెయిన్ జట్టు తరఫున మొరాటా, సారాబియా, సర్జియో బుస్కెట్స్, ఫెరెన్ టోరెస్ కీలకం కానున్నారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ సిక్స్ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇక్కడ చదవండి: Wimbledon 2021: సానియా జోడీ శుభారంభం -
UEFA EURO 2020: ఫ్రాన్స్ చేజేతులా...
బుకారెస్ట్ (రొమేనియా): జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు... అంతర్జాతీయ టోర్నీలలో ఎన్నో గొప్ప విజయాలు... అయితేనేం తప్పిదాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రస్తుత ప్రపంచ చాంపియన్, యూరో కప్ రన్నరప్ ఫ్రాన్స్ జట్టు విషయంలో ఇలాగే జరిగింది. యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నీలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ జట్టు కథ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ ‘పెనాల్టీ షూటౌట్’లో 5–4తో ఫ్రాన్స్ జట్టును ఓడించి యూరో టోర్నీలో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 3–3తో సమంగా నిలిచాయి. స్విట్జర్లాండ్ తరఫున సెఫరోవిచ్ (15వ, 81వ ని.లో) రెండు గోల్స్... గావ్రనోవిచ్ (90వ ని.లో) ఒక గోల్ చేశారు. ఫ్రాన్స్ జట్టుకు కరీమ్ బెంజెమా (57వ, 59వ ని.లో) రెండు గోల్స్... పోగ్బా (75వ ని.లో) ఒక గోల్ అందించారు. అదనపు సమయంలో రెండు జట్లు గోల్ చేయడంలో విఫలమయ్యాయి. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘పెనాల్టీ షూటౌట్’ను నిర్వహించారు. ఇందులో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు ఐదు షాట్లను లక్ష్యానికి చేర్చారు. ఫ్రాన్స్ తరఫున తొలి నలుగురు ఆటగాళ్లు సఫలమవ్వగా...చివరి షాట్ తీసుకున్న కిలియన్ ఎంబాపె మాత్రం విఫలమయ్యాడు. ఎంబాపె సంధించిన షాట్‌ను స్విట్జర్లాండ్ గోల్‌కీపర్ యాన్ సమర్ కుడివైపునకు డైవ్ చేస్తూ ఎడమ చేత్తో అద్భుతంగా నిలువరించి ఫ్రాన్స్ విజయాన్ని అడ్డుకున్నాడు. 1992 తర్వాత ఫ్రాన్స్ జట్టుపై స్విట్జర్లాండ్ నెగ్గడం ఇదే తొలిసారి. యూరో టోర్నీలో ఏనాడూ స్విట్జర్లాండ్ చేతిలో ఓడిపోని ఫ్రాన్స్‌కు ఈసారీ విజయం దక్కేది. కానీ చివరి 10 నిమిషాల్లో అలసత్వం ఫ్రాన్స్ కొంపముంచింది. ఫ్రాన్స్ రక్షణశ్రేణిలోని లోపాలను సది్వనియోగం చేసుకొని స్విట్జర్లాండ్ చివరి పది నిమిషాల్లో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. ఆ తర్వాత అదనపు సమయంలో ఫ్రాన్స్‌ను నిలువరించి... షూటౌట్లో ఆ జట్టును నాకౌట్ చేసింది. జర్మనీకి ఇంగ్లండ్ షాక్... లండన్‌లో మంగళవారం జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ 2–0 గోల్స్ తేడాతో మూడుసార్లు చాంపియన్ జర్మనీ జట్టును ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇంగ్లండ్ తరఫున స్టెర్లింగ్ (75వ ని.లో), హ్యారీ కేన్ (86వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. -
పాముకే విషమిచ్చి చంపేస్తే!!
సాక్షి, హైదరాబాద్: విషముండే పాములకే విషమిచ్చి చంపేస్తే.. దాని బాడీని ద్రవరూపంలోకి మార్చేసుకుని.. జ్యూస్ తాగినట్లు తాగేస్తే.. ఇవన్నీ చేస్తోంది.. మనం చాలా లైట్ తీసుకునే సాలె పురుగులే. శాస్త్రవేత్తలు కూడా ఈ విషయం తెలుసుకుని డంగైపోయారు. ఇదేదో ఒకట్రెండు సంఘటనలంటే మామూలుగా తీసుకోవచ్చు. వారు ప్రపంచవ్యాప్తంగా పలు పరిశీలనలు చేసిన తర్వాత విడోస్ స్పైడర్ వంటి 90 జాతుల సాలెపురుగులు పాములను చంపేసి తినేస్తున్నాయని గుర్తించారు. స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బేసెల్‌కు చెందిన సాలెపురుగు ఎక్స్పర్ట్ మార్టిన్ నీఫ్‌లర్ జరిపిన పరిశోధనల్లో ఈ ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాములు, సాలెపురుగులు ఎదురై.. ఘర్షణ పడితే.. 87 శాతం కేసుల్లో సాలెపురుగుదే పైచేయి అయిందట. ఇలాంటివి వాళ్లు ఓ 300 ఘటనలను చూశారట. మిగిలిన వాటిల్లోనూ పాములు గెలవడం లేదట. ఎవరైనా వచ్చి వాటిని రక్షించడం ద్వారా అవి బతికిపోతున్నాయట. థెరిడీడే కుటుంబానికి చెందిన సాలెపురుగులు ఉత్పత్తి చేసే సాలె గూళ్ల దారాలు చాలా గట్టిగా ఉంటాయని, పెద్ద పెద్ద పాములు సైతం అందులో ఇరుక్కుపోతాయని పరిశోధకులు చెబుతున్నారు. గూళ్లలో చిక్కుకోగానే అవి తమలోని విషాన్ని పాములకు ఎక్కిస్తాయి. దీంతో అవి పక్షవాతం వచ్చినట్లుగా పడిపోతాయి. తర్వాత వాటి శరీరంలోని భాగాలను ద్రవ రూపంలోకి మార్చుకుని ఆ ద్రవాలను పీల్చుకు తినేస్తున్నాయని మార్టిన్ వివరించారు. స్పైడర్ ఏమో చిన్నది.. పాము కాస్త పెద్దది కదా.. దాంతో వారాలపాటు వాటికి వంటావార్పూ లాంటి పనులు ఉండవట. ఒక్కపామునే రోజులపాటు తింటూ పండుగ చేసుకుంటాయట. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
SpaceBok: మార్స్ జీవం గుట్టు తేల్చే రోబో
మన భూమ్మీదనే కాకుండా ఇంకెక్కడైనా జీవం ఉందా? ఇంతకుముందైనా ఉండేదా..? చాలా కాలంగా శాస్త్రవేత్తలను తొలిచేస్తున్న ప్రశ్నలివి. ఈ ఆసక్తితోనే సౌర కుటుంబంలోని వివిధ గ్రహాల వద్దకు శాటిలైట్లను పంపుతున్నారు. ముఖ్యంగా భూమిని పోలి ఉన్న అంగారక (మార్స్) గ్రహంపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే అక్కడకు రోవర్లను పంపారు. తాజాగా నాలుగు కాళ్లతో నడిచే ఓ రోబోను పంపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా? ఏమిటీ రోబో.. ఎందుకీ ప్రయోగం? ఇప్పటికే అంగారకుడిపైకి పలుమార్లు రోవర్లను పంపారు. చిన్న కారు పరిమాణంలో ఉండి చక్రాలతో కదులుతూ పరిశోధనలు చేసే ఈ రోవర్లకు చాలా పరిమితులు ఉన్నాయి. అవి కదిలే వేగం చాలా తక్కువ, రాళ్లురప్పలు, ఇసుక వంటివి ఉంటే ముందుకు ప్రయాణించలేవు. ఎత్తైన చోట్లకు వెళ్లడం కష్టం. ఈ నేపథ్యంలోనే స్విట్జర్లాండ్‌కు చెందిన ఈటీహెచ్‌జ్యూరిచ్, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం ‘స్పేస్‌బాక్’పేరుతో నాలుగు కాళ్లతో నడిచే ప్రత్యేకమైన రోబోను రూపొందించింది. అంగారకుడిపై జీవం ఉనికిని గుర్తించేందుకు దీనిని త్వరలోనే పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి చంద్రుడిపై పరిశోధనల కోసం ఈ రోబోను రూపొందించారు. తర్వాత మార్స్‌పైకి పంపేందుకు వీలుగా మార్పులు చేశారు. భూమి అవతల ఇలా కాళ్లతో నడిచే రోబోను వినియోగించనుండటం ఇదే తొలిసారి కానుంది. రోవర్లకు సమస్యలు రావడంతో.. మార్స్ పైకి 2006లో పంపిన ఆపర్చునిటీ రోవర్ ఓసారి ఇసుకలో ఐదు వారాల పాటు చిక్కుకుపోయింది. చివరికి మెల్లగా బయటపడింది. ఇక 2009లో పంపిన స్పిరిట్రోవర్కూడా పెద్ద రాళ్లు ఉన్న ఇసుకలో చిక్కుకుపోయింది. అది బయటికి రాలేకపోవడంతో ఆ మిషన్నే ఆపేశారు. ఇలాంటి సమస్య లేకుండా పనిచేసేలా ‘స్పేస్‌బాక్’ను రూపొందించారు. ప్రస్తుతం మార్స్‌పై నాసాకు చెందిన క్యూరియాసిటీ, పర్సవరెన్స్‌రోవర్లు, చైనాకు చెందిన ఝురోంగ్ రోవర్ పరిశోధనలు చేస్తున్నాయి. ‘స్పేస్‌బాక్’.. ఈజీ గోయింగ్ రాళ్లురప్పలు, ఇసుకతో కూడిన ప్రాంతాల్లో అయినా, గుంతలుగా, ఎత్తుపల్లాలతో ఉన్న చోట, చిన్న చిన్న కొండలపైకి ఈ ‘స్పేస్‌బాక్’రోబో సులువుగా వెళ్లగలదు. ఇందుకోసం దీని కాళ్లను ప్రత్యేకంగా డిజైన్‌చేశారు. ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు పడిపోకుండా, ఎక్కువ శక్తి వృథా కాకుండా అటూ ఇటూ వంకరటింకరగా నడిచేలా సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేశారు. మార్స్‌పై ఉండే నేల వంటిదానిని ల్యాబ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి పరీక్షించగా.. ఈ రోబో సులువుగా నడవగలిగింది. అయితే ఈ రోబో రోవర్లకు ప్రత్యామ్నాయం కాదని.. రోవర్లకు వీలుకాని చోట్లకు వెళ్లి పరిశోధన చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చదవండి: Fastskin 4.0: ఆక్వామ్యాన్ లాంటి సూట్.. ఎలా పని చేస్తుందంటే.. -
భారతీయల స్విస్ సంపదపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచిన నల్లధనంపై వచ్చిన వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఖండించింది. భారతీయులు స్విస్ బ్యాంకుల్లో గత 13 ఏళ్లతో పోలిస్తే రికార్డు స్థాయిలో డిపాజిట్లు 2020లో చేసినట్లు ఆరోపణలు రాగా కేంద్రం ఈ వార్తలను తోసిపుచ్చింది. స్విస్ నల్లధనం.. అసలు కథేంటి ఈ వార్తలో ఏముందంటే.. 2019లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల ధనం 6625 కోట్లుగా ఉండగా, గత ఏడాది ఏకంగా 20 వేల కోట్లకు చేరినట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. కాగా ఈ వార్తపై కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాలయం స్పందిస్తూ.. స్విస్ నేషనల్ బ్యాంక్‌కు వివిధ స్విస్ బ్యాంకులు సమర్పించిన మొత్తం లెక్కలు తప్పుగా చిత్రీకరించినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అది కేవలం స్విట్జర్లాండ్‌లో దాచుకున్న భారతీయుల సొమ్ము కాదు అని వెల్లడించింది. ఇదే క్రమంలో 2019 నుంచి స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గినట్లు కేంద్ర ఆర్థిక శాఖ చెప్పింది. అయితే స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన భారతీయల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయం తెలిపింది. డిపాజిట్లు తగ్గినట్లు చెప్తున్న ప్రభుత్వం, ఎంత మొత్తం అనే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా మొత్తం స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో సుమారు 2 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌లకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 600 బిలియన్ డాలర్లు ఫారన్ కస్టమర్ డిపాజిట్లుగా ఉన్నాయన్నారు. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌తో బ్రిటన్ ముందు నిలవగా, 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. ✅Finance Ministry refutes News media reports of alleged black money held by Indians in Switzerland ✅Information sought from Swiss Authorities to verify increase/decrease of deposits Read more➡️ https://t.co/W1fKhlh7LR (1/6) pic.twitter.com/tPUOciARJR — Ministry of Finance (@FinMinIndia) June 19, 2021 చదవండి: మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా జస్ప్రీత్ బుమ్రా..! -
భారతీయుల ‘స్విస్’ సంపద మూడింతలు
న్యూఢిల్లీ/జూరిచ్: భారతీయలు, భారత కంపెనీల సంపద స్విస్ బ్యాంకుల్లో 2020 చివరికి వార్షికంగా మూడు రెట్లు పెరిగి 2.55 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌కు (దాదాపు రూ.20,700 కోట్లు) చేరింది. 2019 ముగిసే నాటికి ఈ విలువ 899 మిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ (దాదాపు రూ.6,625 కోట్లు). రెండు సంవత్సరాల దిగువముఖం తరువాత 2020లో తిరిగి ఇండియన్ క్లైంట్స్ నిధులు ఏకంగా 13 సంవత్సరాల గరిష్టానికి చేరాయి. బాండ్లు, తత్సంబంధ ఇన్స్ట్రుమెంట్లలో (పథకాలు) ఉంచిన సంపద భారీగా పెరగడం దీనికి కారణం. కాగా, కస్టమర్ డిపాజిట్లు మాత్రం 2020లో పడిపోయాయి. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న బ్రాంచీలు, ఇతర ఫైనాన్షియల్ సంస్థల ద్వారా భారతీయులు, భారత్ కంపెనీలు స్విస్ బ్యాంకుల్లో ఉంచిన నిధుల గణాంకాలను స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంక్ గురువారం విడుదల చేసింది. ఇందులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2006లో స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారత కంపెనీల నిధులు 6.5 బిలియన్ డాలర్లు. 2011, 2013, 2017సహా కొన్ని సంవత్సరాలను మినహాయిస్తే మిగిలిన కాలాల్లో ఈ పరిమాణాలు డౌన్ ట్రెండ్‌లోనే నడిచాయి. ► 2020లో కస్టమర్ అకౌంట్ డిపాజిట్లు 503.9 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్ (రూ.4,000 కోట్లు). 2019లో ఈ మొత్తం 550 మిలియన్ ఫ్రాంక్స్. ► గణాంకాల ప్రకారం, 2020 చివరినాటికి స్విట్జర్లాండ్‌లో 243 బ్యాంకులు పనిచేస్తున్నాయి. నల్లధనంపై లేని సమాచారం స్విట్జర్లాండ్‌లో భారతీయులు ఉంచినట్లు పేర్కొంటున్న తీవ్ర చర్చనీయాంశం ‘నల్లధనం’ గురించి గణాంకాల్లో ఎటువంటి ప్రస్తావనా లేదు. పైగా భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉంచిన నిధులను ‘నల్లధనం’గా పరిగణించబోమని ఆ దేశం తరచూ పేర్కొంటోంది. పన్ను ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి కేసుల విషయంలో విచారణకు భారత్‌కు మద్దుతు, సహకారం ఇస్తామని కూడా స్పష్టం చేస్తూ వస్తోంది. ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య 2018 నుంచీ ఒక అవగాహనా ఒప్పందం కూడా అమల్లో ఉంది. ఈ మేరకు తమ దేశంలో భారతీయుల అకౌంట్ల సమాచారాన్ని 2019 సెప్టెంబర్‌లో మొట్టమొదటిసారి అందజేసింది. ప్రతి సంవత్సరం ఈ విధానాన్ని కొనసాగిస్తోంది. తొలి రెండు స్థానాల్లో బ్రిటన్, అమెరికా అన్ని స్విస్ బ్యాంకుల్లో కస్టమర్ల డిపాజిట్లు 2020లో దాదాపు 2 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌లకు చేరాయి. ఇందులో 600 బిలియన్ డాలర్లు ఫారన్ కస్టమర్ డిపాజిట్లు. 377 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్‌తో బ్రిటన్ ముందు నిలిచింది. ఇందుకు సంబంధించి 152 బిలియన్లలో అమెరికా రెండవ స్థానంలో నిలిచింది. 100 బిలియన్ ఫ్రాంక్స్ పైన నిలిచిన దేశాలు ఈ రెండే కావడం గమనార్హం. -
టెన్త్ ఫెయిల్, కానీ మనోడి స్టోరీ రాజమౌళికి తెలిస్తే ఇక సినిమానే!?
బెర్న్: అబ్బో.. మనోడి స్టోరీ మామూలుగా లేదుగా. అచ్చం రాజమౌళి సినిమా బ్యాక్ డ్రాప్ లాగే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ స్టోరీ ఎవరిదా' అని అనుకున్నారా?! ఓ ఆటోవాలాది. టెన్త్ ఫెయిల్. కానీ త్వరలో సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాడు. అదీ ఫ్రాన్స్‌లో జైపూర్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రంజిత్ సింగ్ చిన్నవయస్సు నుంచే అనేక అవమానాల్ని ఎదుర్కొన్నాడు. స్థానికులు తన పేదరికంపై సూటిపోటి మాటలతో వేధించేవారు. పేదవాడిగా పుట్టడం నేరమా..? నేను నా పేదరికంతో పోరాడుతున్నాను. మీరు నన్ను మరింత కిందికి లాగుతున్నారంటూ వేధనకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎంత పేదరికంలో ఉన్నా తాను జీవితంలో ఏదో సాధించాలని కుటుంబ సభ్యులు రంజిత్ కు అండగా నిలిచారు. బాగా చదివించాలని స్కూల్ కి పంపించారు. కానీ రంజిత్ 10 పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం ఆటో డ్రైవర్‌గా మారాడు. కానీ ఏదో ఒకటి చేయాలనే సంకల్పం ఉంది. ఆ సంకల్పమే బిజినెస్ మ్యాన్ గా, ఫేమస్ యూట్యూబర్ గా మార్చేసింది. చదవండి: ఆమెకు 19 మంది భర్తలు..! ప్రతిఏడు జైపూర్‌కు దేశ విదేశాలనుంచి టూరిస్ట్‌లు వస్తుండేవారు. టూరిస్ట్‌లను ఆకట్టుకునేందుకు స్థానిక ఆటో డ్రైవర్లు విదేశీ భాషల్ని నేర్చుకొని, వారికి టూరిస్ట్ గైడ్ గా ఉపాధి పొందేవారు. రంజిత్‌కు ఆ ఐడియా బాగా నచ్చింది. అదే ఐడియాతో విదేశీ భాషల్ని నేర్చుకొని వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. అయితే ఓ రోజు ఫ్రాన్స్ నుంచి ఓ యువతి జైపూర్ చూసేందుకు వచ్చింది. ఆ అమ్మాయి రంజిత్ సింగ్ ఆటో ఎక్కడం. జైపూర్ అంతా తన ఆటోలో తిప్పి చూపించడంతో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ యువతి తిరిగి ఫ్రాన్స్ కు వెళ్లిపోయింది. అప్పుడప్పుడు రంజిత్ ప్రియురాలితో వీడియో కాల్లో మాట్లాడేవాడు. అంతా బాగుందని రంజిత్ సింగ్ తన ఆశయాన్ని మర్చిపోలేదు. ఎలాగైనా ఫ్రాన్స్‌కు వెళ్లాలి. అక్కడే సెటిల్ అవ్వాలి. టెన్త్ ఫెయిల్. చేసేది ఆటోడ్రైవర్. అదెలాసాధ్యం అవుతుందని అనుకున్నాడు. ప్రియురాలి ప్రోత్సాహంతో ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఫ్రాన్స్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లో చదువు లేదన్న కారణంతో వీసా రిజెక్ట్ చేశారు పాస్ పోర్ట్ అధికారులు. అదే సమయంలో ప్రియురాలు ఫ్రాన్స్ నుంచి ఇండియాకి రావడం. ఇండియాకు వచ్చిన వెంటనే ఎంబసీ అధికారుల్ని రిక్వెస్ట్ చేయడంతో రంజిత్‌కు ఫ్రాన్స్‌కు వెళ్లేందుకు మూడు నెలల విజిటింగ్ వీసా ఇచ్చారు. కోటి ఆశలతో విజిటింగ్ వీసాతో ఫ్రాన్స్ లోకి అడుగు పెట్టాడు. అడుగుపెట్టిన వెంటనే రంజిత్ కు అక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్లు బాగా నచ్చాయి. దీంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, యూట్యూబ్ లో ఫ్రాన్స్ గురించి వివరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. మరోవైపు రెస్టారెంట్ లో జాబ్ చేస్తున్నాడు. 2014లో ప్రియురాల్ని వివాహం చేసుకున్న రంజిత్ కు కొడుకు కూడా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో స్విట్జర్ లాండ్ లోని జెనీవాలో రెస్టారెంట్‌ను స్టార్ట్ చేయాలనే కలను నెరవేర్చుకోబోతున్నాడు. ప్రస్తుతం ఈ ఆటోవాలా కథ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దీంతో అబ్బో మనోడి స్టోరీ రాజమౌళి సినిమాను మించిపోయిందే. రాజమౌళికి తెలిస్తే కచ్చితంగా సినిమా తీస్తారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
థర్డ్‌వేవ్ భయాలకు ఇదే సరైన పరిష్కారం!
జెనీవా: నాసల్ వ్యాక్సిన్ వస్తేనే ఇండియాలో విద్యా వ్యవస్థ గాడిన పడుతుందన్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. సాధారణ వ్యాక్సిన్లతో పోల్చినప్పుడు ముక్కు ద్వారా టీకా అందించడం తేలికన్నారు. ఎక్కడైనా ఆ టీకాను సుళువుగా అందించవచ్చని, ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే పిల్లలకు నాసల్ వ్యాక్సిన్లను స్కూళ్లలోనే అందించవచ్చని చెప్పారు. దీనివల్ల దాదాపుగా స్కూల్ అంతా ఒకేసారి ఇమ్యూన్ అవుతుందని చెప్పారు. దీంతో పాఠశాలలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి భయం పోతుందన్నారు. ఫలితంగా పిల్లలు స్వేచ్ఛగా స్కూల్‌కి వెళ్లి చదువుకోగలరని, తల్లిదండ్రులు సైతం ధైర్యంగా పిల్లలను పాఠశాలకు పంపగలరంటూ ఆమె అభిప్రాయడ్డారు. అంతకంటే ముందు ఉపాధ్యాయులు, ఇతర స్కూల్ స్టాఫ్‌కి కూడా వ్యాక్సినేషన్ జరగాలన్నారు. అప్పుడే కరోనా థర్డ్‌వేవ్ భయాలు తొలగిపోతాయన్నారు. అయితే ప్రస్తుతం నాసల్ వ్యాక్సిన్లు ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆ వ్యాక్సిన్లకు అనుమతులు రావొచ్చని... అప్పటి వరకు థర్డ్‌వేవ్ భయాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందనే ప్రచారం సాగుతుండంతో సౌమ్య స్వామినాథన్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. (చదవండి: 20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు) -
Roger Federer: ఫెడరర్‌కు భారీ షాక్...!
జెనీవా: జెనీవా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన ఎనిమిదో ర్యాంకర్ ఫెడరర్‌కు 75వ ర్యాంకర్ పాబ్లో అందుహర్ (స్పెయిన్) షాక్ ఇచ్చాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అందుహర్ 6–4, 4–6, 6–4తో ఫెడరర్‌ను ఓడించాడు. చివరి సెట్లో అందుహర్ 2–4తో వెనుకబడి వరుసగా నాలుగు గేమ్‌లు గెలుపొందడం విశేషం. చదవండి: Serena Williams: 3 నెలల తర్వాత తొలి గెలుపు -
ఐటీ కొలువుల మేళా: భారీగా టెకీల నియామకం!
న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు టిసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ వంటి దేశీయ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ఇప్పుడు ఆ జాబితాలో స్విట్జర్లాండ్ కు చెందిన క్రెడిట్ సూయిస్ వచ్చి చేరింది. అంతర్జాతీయ బ్యాంక్ సేవలకు టెక్నాలజీ కేంద్రంగా భారతదేశాన్ని నిలబెట్టడానికి క్రెడిట్ సూయిస్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నియామకాలను చేపడుతున్నట్లు బ్యాంక్ తెలిపింది. ఐటీ నిపుణులకు డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది ఇండియాలో వేయికి పైగా టెకీల నియామకానికి ప్రణాళికలు రచించినట్లు స్విస్ బ్యాంక్ దిగ్గజం క్రెడిట్ సూస్ వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్లౌడ్, ఎపీఐ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలకు సంబందించిన డెవలపర్లు, ఇంజనీర్లను ఎంచుకొనున్నట్లు తెలిపింది. గత మూడేళ్లలో 2 వేల మంది ఐటి ఉద్యోగులను బ్యాంక్ నియమించుకున్నట్లు పేర్కొంది. క్రెడిట్ సూయిస్ లక్ష్యం భారతదేశంలో అందుబాటులో ఉన్న నైపుణ్యం కలిగిన సాంకేతిక ప్రతిభావంతుల అంతర్గత సామర్థ్యాలను మరింత మెరుగుపరచడం అని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఐటి సిబ్బందిలో భారతీయులు ఇప్పుడు దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉన్నారు. చదవండి: ఈ పోటీలో గెలిస్తే రూ.50 వేలు మీ సొంతం? -
డబ్ల్యూఈఎఫ్ సదస్సు రద్దు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 2021లో నిర్వహించాల్సిన తమ వార్షిక సదస్సును రద్దు చేస్తున్నట్లు వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకటించింది. తదుపరి సదస్సు 2022 ప్రథమార్ధంలో నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించింది. పరిస్థితులను సమీక్షించిన తర్వాత ఎక్కడ, ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని డబ్ల్యూఈఎఫ్‌జీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ తెలిపారు. ఈ సదస్సు ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. రెండు సార్లు వేదిక మారింది. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగాల్సింది. కానీ పలు కారణాలతో స్విట్జర్లాండ్‌లోనే ఉన్న లూసెర్న్ నగరానికి వేదికను మార్చారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో నిర్వహించేలా సింగపూర్‌కి వేదిక మారింది. ఏటా దావోస్‌లో జరిగే ఈ సదస్సును 2002లో న్యూయార్క్ సిటీలో నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు స్విట్జర్లాండ్ కాకుండా మరో దేశంలో నిర్వహించాలని భావించారు. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ప్రణాళికలు మార్చుకోవాల్సివచ్చింది. -
లక్షల మందిని రక్షించిన సింగిల్ రిపోర్ట్!
రెండో ప్రపంచ యుద్ధంలో మృత్యు కుహరాలుగా నిలిచిన నాజీ క్యాంపులు చరిత్రలో మాయని మచ్చను మిగిల్చిన సంగతి తెలిసిందే. శత్రుదేశాల ప్రజలు, సైనికులు, ముఖ్యంగా యూదులను విషవాయువులు నింపిన గ్యాస్ చాంబర్లలోకి తరలించి అత్యంత క్రూరంగా చంపేసే కేంద్రాలే నాజీ శిబిరాలు. అలాంటి ఓ క్యాంపులో నుంచి బయటపడడమే కాక, అక్కడి దారుణాలను ప్రపంచానికి వెల్లడించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడి చరిత్రకెక్కారు.. ఆల్ఫ్రెడ్ వెజ్లర్, రుడాల్ఫ్ వెబా. వీరిద్దరూ స్లొవేకియాకు చెందిన యూదులు. ఒకరికొకరికి పరిచయం లేదు. యుద్ధ సమయంలో జర్మనీ సైనికులకు చిక్కారు. వీరిని అప్పటి జర్మనీ ఆక్రమిత పోలాండ్లోని ఆస్చ్విజ్ డెత్ క్యాంపులోకి తరలించారు. అక్కడ కలసిన వీరు, జర్మన్ సైనికుల చేతుల్లో చిత్రహింసలు అనుభవించారు. ఓ రోజు తప్పించుకొని, శిబిరానికి బయట కొద్ది దూరంలో ఉన్న ఓ కట్టెల కుప్ప మధ్యలో దాక్కున్నారు. ఇలా గంటా రెండు గంటలు కాదు ఏకంగా నాలుగు రోజులపాటు నాజీ సైనికుల కంటపడకుండా అక్కడే ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటపడి, వందలాది మైళ్లు నడిచి స్లొవేకియాకు చేరుకున్నారు. నాజీ క్యాంపుల్లోని దారుణాలపై ఒక నివేదిక తయారుచేశారు. ఇది వెబా-వెజ్లర్ రిపోర్ట్‌గా పేరు పొందింది. ఈ నివేదికను స్విట్జర్లాండ్ వేదికగా మీడియాకు విడుదల చేయడంతో నాజీల అకృత్యాలు ప్రపంచానికి తెలిశాయి. ఫలితంగా గ్యాస్ చాంబర్లలో యూదుల ఊచకోతకు అడ్డుకట్ట పడింది. ఆ విధంగా వెజ్లర్-వెబా(ఆస్చ్విజ్) రిపోర్ట్ లక్షల మంది ప్రాణాలు నిలిపింది. చదవండి: నాలుగు వారాల పాటు ఆ నగరమంతా మత్తులోనే.. -
ఇక నుంచి వారి లోదుస్తులు ఒకేలా ఉండవు!
మహిళలకు అవకాశాలు ఉంటున్నాయి తప్ప అనుకూలతలు ఉండటం లేదన్నది వాస్తవం. ఉదా : డిఫెన్స్. ఇప్పటికీ ఆర్మీలో చేరిన మహిళలు పురుషుల ‘ఆది’ (కొలతలు) లో ఉండే యూనిఫామ్‌నే ధరించాల్సి వస్తోంది. సోల్జర్ మగేమిటి, ఆడేమిటి అనుకోవచ్చు. కానీ సౌకర్యం మాటేమిటి! సౌకర్యంగా ఉండే దుస్తులే ఎవరికైనా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. కార్యోన్ముఖుల్ని, కార్యసాధకుల్ని చేస్తాయి. ఈ సంగతిని మొదటిసారిగా ఇప్పుడు స్విట్జర్లాండ్ గుర్తించింది. సైన్యంలో ప్రస్తుతం ఒక శాతంగా ఉన్న మహిళల్ని పది శాతానికి పెంచేందుకు మహిళల ‘అనుకూలతల్ని’ దృష్టిలో పెట్టుకుని కొత్త యూనిఫామ్ తేబోతోంది. మహిళా సైనికుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన యూనిఫామ్‌ను ప్రయోగాత్మకంగా నేటి నుంచి అమల్లోకి తెస్తోంది. స్విట్జర్లాండ్ ఐరోపా ఖండంలోని ఒక చిన్న దేశం. జనాభా అటూ ఇటుగా 86 లక్షలు. భూభాగ వివాదాలేమీ లేవు. ఎప్పుడో ఉండేవి.. ఓ నూట డెబ్బై ఏళ్ల క్రితం. ఆ కాలంలోనే అవన్నీ సమసిపోయాయి. ఇప్పుడది ప్రేమ దేశం. ప్రశాంతలోకం! ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ సరిహద్దు దేశాలు. వాటితో మంచి సంబంధాలు ఉన్నాయి. దేశం ఎంత పూలతోటైనా, అందులో పక్షులు పాటలు పాడుతున్నా ఆర్మీ అనే కంచె అవసరం. అందుకోసమే అన్నట్లు చిన్న ఆర్మీ ఉంది ఆ దేశానికి. లక్షా 50 వేల మంది సైన్యం. ఆ సైన్యంలో ఓ పదిహేను వందల వరకు మహిళా సైన్యం. అంటే.. ఒక శాతం. ఒక్క శాతమే కాబట్టి, యుద్ధ పరిస్థితులు లేవు కాబట్టి, ఆ ఒక్క శాతం మహిళల అనుకూలతల గురించి పట్టించుకోవాలన్న ఆలోచన సాధారణంగా ఆర్మీ వంటి పురుషాధిక్య రంగానికి కలగదు. యూనిఫామ్ గురించైతే అసలే కలగదు. ఏ దేశంలోని ఆర్మీలోనైనా పురుష సైనికుల కొలతల్లోనే మహిళా యూనిఫామ్‌లూ ఉంటాయి. సమాన అవకాశాలు.. ప్రత్యేక అనుకూలతలు ఈ దేశంలోనూ అంతే. ఉన్నది గుప్పెడు మందే మహిళలు కనుక యూనిఫామ్ ఏమీ పెద్ద సంగతి కాదని స్విట్టర్లాండ్ అనుకోవచ్చు. ఇప్పటి వరకు అలాగే అనుకుంది కానీ, ఇక అనుకోదలచుకోలేదు. మహిళా సైనికుల కోసం ప్రత్యేకంగా యూనిఫామ్‌ను కేటాయించబోతోంది. యూనిఫామ్ అన్నప్పుడు పైన ధరించే దుస్తులు మాత్రమే కాదు. లో దుస్తులు కూడా. వాటిని కూడా మహిళా సైనికుల కోసం ఇప్పటికీ డిజైన్ చేయించి ఉంచింది స్విట్జర్లాండ్. నేటి నుంచి (ఏప్రిల్ 1) అక్కడి మహిళా సైనికులు వాటిని ధరిస్తాను. వాటి ధారణలోని అనుకూలతల్ని, అననుకూలతల్ని చెబుతారు. వారు సూచించిన మార్పులు చేర్పులను బట్టి మళ్లీ డిజైన్ని మార్పు చేసి, సౌకర్యవంతంగా ఉండేలా యూనిఫామ్‌ని స్థిరపరుస్తారు. అంటే.. ఇంతవరకు స్విట్లర్లాండ్ మహిళా సైనికులు యూనిఫామ్‌తో పాటు లోదుస్తులను కూడా పురుషుల కొలతలతో తయారైన వాటినే ధరిస్తూ వస్తున్నారా! అవును. స్విట్జర్లాండ్ ఆర్మీ మహిళా సైనికుల యూనిఫామ్‌లో చేసిన ప్రధానమైన మార్పు.. పురుషుల లోదుస్తులకు, మహిళల లోదుస్తులకు మధ్య తేడా చూపించడం. ప్రస్తుతం ‘అన్నీ అందరివీ’ అక్కడి ఆర్మీలో. లూజ్ ఫిటింగ్‌తో, లార్జర్ సైజులలో ఉండే లోదుస్తులనే మహిళలూ ధరిస్తున్నారు. అవొక్కడే కాదు. కంబాట్ క్లోతింగ్, బ్యాక్‌ప్యాక్స్, ప్రొటెక్టివ్ వెస్ట్స్.. అన్నీ పురుషులవే మహిళలకు. ఇప్పుడు వీటిని కూడా మహిళలకు అనుకూలంగా రీడిజైన్ చేస్తున్నారు. ప్రాథమికంగా వేసవి ధారణకు ఒక రకంగా, చలికాలానికి మరో విధంగా ఉండేలా లోదుస్తుల డిజైన్‌ను మార్పు చేశారు. అవి ఎంత అనుకూలంగా ఉంటున్నాయో పరిశీలిస్తారు. చక్కగా అమరిపోతే ఆ డిజైన్‌నే కొనసాగిస్తారు. అమరిపోవడం అంటే? 27 కిలోల బరువైన సామగ్రిని వీపుపై మోసుకుంటూ నేలపై పాకు కుంటూ వెళ్లేటప్పుడో, లేదా ఆఫీస్ చెయిర్లో కూర్చున్నప్పుడో ఆ లోదుస్తుల వల్ల ఎలాంటి అసౌకర్యమూ కలగపోతే అది అమరిపోవడమే. ‘‘స్త్రీ పురుషుల డ్యూటీ ఒకటే అయినా, ఆ డ్యూటీని సక్రమంగా నెరవేర్చడానికి అవసరమై వస్త్రధారణ మాత్రం ఒకేలా ఉండకూడదు. కచ్చితంగా వేరుగా ఉండాలి. అంటే మహిళలకు అనుకూలంగా..’’ అని.. యూనిఫామ్ మార్పు విషయమై ఏర్పాటైన ప్రత్యేక సమావేశంలో స్విట్జర్లాండ్ రక్షణ శాఖ మంత్రి వయోలా ఆమ్హర్డ్ చక్కగా అర్థమయ్యేలా చెప్పగలిగారంటే ఆమె మహిళ అయినందు వల్లనేనని అనుకోవాలి. గత ఏడాది మార్చిలో యూఎస్ నావికాదళం కూడా ఇలాంటి మార్పునే చేసింది. అక్కడి పురుషులకు అండర్వేర్ రీప్లేస్మెంట్ అలవెన్స్ ఇచ్చేవారు. కొత్త లోదుస్తులను లోపల ఉన్న డిపార్ట్మెంట్లోని స్టోర్‌లో కొనుక్కోడానికి కొంత డబ్బును ఇచ్చేవాళ్లు. దాన్ని రద్దు చేశారు. నేవీలోని మహిళా సిబ్బంది తమ లోదుస్తుల కొనుగోళ్లకు తమ కెరీర్ మొత్తంలో సుమారు ఆరు లక్షల రూపాయల వరకు (8 వేల డాలర్లు) సొంత డబ్బును ఖర్చు చేస్తుండగా పురుషులకు ప్రత్యేకంగా అలవెన్స్ ఇవ్వడం లింగ వివక్ష అవదా ‘గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్’ తన నివేదికలో వేలెత్తి చూపడంతో ఆ అలవెన్స్ రద్దు అయింది. పురుషులకు రద్దు చేసే బదులు, మహిళలకూ అలవెన్స్ ఇవ్వొచ్చు కదా అనే సూచన వచ్చినప్పటికీ యూఎస్ మెరైన్.. రద్దు వైపే మొగ్గు చూపింది. చిన్న మార్పు.. పెద్ద సంస్కరణ వచ్చే పదేళ్లలో సైన్యంలో మహిళల శాతాన్ని ఒకటి నుంచి పదికి పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ ‘మార్పు’ నిర్ణయాన్ని తీసుకుంది స్విట్జర్లాండ్ ఆర్మీ. ఈ చిన్న మార్పు ఏమైనా ప్రభావం చూపుతుందా? నిజానికది చిన్న మార్పేమీ కాదు. ఆర్మీలో చేరాలని ఆశపడే మహిళా అభ్యర్థులకు ప్రతిబంధకంగా ఉన్న అసౌకర్యాన్ని సవరించి సౌకర్యంగా మలచడం పెద్ద మార్పే. ఇదొక ‘సంస్కరణ’ అని కూడా అనుకోవచ్చు. లోకమంతా పురుషుల దేహ పరిమాణాలకు, దేహ అనుకూలతలకు అనుగుణంగా తయారై ఉన్నప్పుడు అందులో స్త్రీ ఇమడడం, కొనసాగడం పైకి కష్టంగా కనిపించని, అనిపించని కష్టం. అది పురుషులకు అర్థం కాదు. సీటు సంపాదించారు కదా.. కూర్చోడానికి కష్టం ఏమిటి అనుకుంటారు! ఆ సీటు ఆమె కాళ్లకు, నేలకు అనుకూలమైనంత ఎత్తులో ఉందా అని ఆలోచించరు. సీటు హ్యాండిల్స్ ఆమె చేతులు ఆన్చుకోడానికి అవసరమైన యాంగిల్లో ఉన్నాయా అని చూడరు. కుర్చీ అనేది చిన్న ఉదాహరణ. పెద్ద ఉద్యోగంలో, పెద్ద బాధ్యతల్లో, పెద్ద విధి నిర్వహణల్లో ఉండే భౌతికమైన అననుకూలతలు మహిళలు చెప్పుకుంటే తప్ప, పురుషులు అర్థం చేసుకుంటే తప్ప సరి కానివి, సవరణకు నోచుకోనివీ! ఈ ఇబ్బందిని గమనించి సరిచేయడంతో పాటు, మరింత మంది మహిళల్ని ఆర్మీలోకి రప్పించేందుకు స్విట్జర్లాండ్ తగిన మార్పులు చేస్తోంది. తనను తను దిద్దుకుంటోంది! -
హెడ్జ్ ఫండ్ డిఫాల్టుతో బ్యాంకులకు భారీ నష్టాలు
బెర్లిన్: అమెరికాకు చెందిన ఓ హెడ్జ్ ఫండ్ డిఫాల్ట్ కావడంతో పలు పెద్ద బ్యాంకులు భారీగా నష్టాలు నమోదు చేయనున్నాయి. మార్జిన్ కాల్స్‌కి అవసరమైన నిధులను సమకూర్చడంలో సదరు సంస్థ విఫలం కావడమే ఇందుకు కారణం. ఆర్చిగోస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే హెడ్జ్ ఫండ్ లావాదేవీలు ఈ పరిస్థితికి దారి తీసినట్లు సమాచారం. ‘మార్జిన్ అవసరాలకు అనుగుణంగా నిధులు సమకూర్చడంలో ఫండ్ విఫలం కావడంతో మా సంస్థ సహా పెద్ద సంఖ్యలో ఇతర బ్యాంకులకు ’గణనీయంగా నష్టాలు’ వాటిల్లాయి అని స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ తెలిపింది. జపాన్ దిగ్గజం నొమురా తమ నష్టాలు 2 బిలియన్ డాలర్ల దాకా ఉంటుందని అంచనా వేసింది. హెడ్జ్ ఫండ్లు తమ స్టాక్స్ పోర్ట్‌ఫోలియోనూ పూచీకత్తుగా ఉంచి, ట్రేడింగ్ అవసరాల కోసం నిధులను సమకూర్చుకుంటూ ఉంటాయి. ఒకవేళ షేర్ల విలువ పడిపోతే నిర్దేశిత మార్జిన్ మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడంలో విఫలమైతే ప్రతికూల పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. తాజాగా ఆర్చిగోస్ కూడా ఇలాంటి పరిస్థితిలోనే చిక్కుకుంది. వయాకామ్సీబీఎస్తో పాటు పలు చైనా టెక్నాలజీ కంపెనీల స్టాక్స్‌లో ఆర్చిగోస్ భారీగా పొజిషన్లు తీసుకుంది. కానీ, వయాకామ్‌సీబీఎస్ షేర్ల ధరలు గణనీయంగా పతనం కావడంతో ఆర్చిగోస్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దానికి నిధులిచ్చిన ఆర్థిక సంస్థలపైనా ప్రతికూల ప్రభావం పడింది. -
అక్కడ సమయానికి వడ్డీ కూడా ఇస్తారు.. ఎలాగంటే!
స్విట్జర్లాండ్‌కి ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇటీవలి కరోనా కాలంలో కూడా ఆ దేశంలో ఒక్క కేసు కూడా రాకుండా జాగ్రత్తపడ్డారు. అన్ని విషయాలలోనూ కొత్తగా ఆలోచిస్తారు ఆ దేశీయులు. ఏ ఆసరా లేని వృద్ధుల గురించి ఒక కొత్త పథకం ప్రవేశపెట్టారు. అదే ‘టైమ్ బ్యాంక్ ’ స్కీమ్. ఒంటరిగా, కుటుంబ సభ్యుల సహకారం లేకుండా నివసిస్తున్న సీనియర్ సిటిజెన్లకు అండగా నిలబడటానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. స్విట్జర్లాండ్‌లో ఒక పాఠశాల దగ్గర 67 సంవత్సరాల ఒంటరి మహిళ ఉండేవారు. ఆవిడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసి రిటైరయ్యారు. తనకొచ్చే పెన్షన్‌తో ఆవిడ హాయిగా కాలం గడపవచ్చు. కాని ఆమె ఖాళీగా కూర్చోవటానికి ఇష్టపడలేదు. తనకంటె 20 సంవత్సరాలు ఎక్కువ వయసున్న ఒక వృద్ధురాలికి సేవ చేసే పనిలో కుదిరారు. డబ్బు కోసం పనిచేయవలసిన అవసరం లేదు ఆమెకకు. తన సమయాన్ని టైమ్ బ్యాంకులో దాచుకోవటానికి పనిచేశారు. అక్కడే మొదలు.. టైమ్ బ్యాంక్‌ను స్విట్జర్లాండ్‌లోని ప్రభుత్వ సామాజిక భద్రతా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అక్కడి ప్రజలు యవ్వనంలో, ఆరోగ్యంగా ఉన్నప్పుడు... నిస్సహాయులైన వృద్ధులకు సేవలందిస్తూ, సమయాన్ని దాచుకొని, తిరిగి వారికి అవసరంలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవచ్చు, ఇందుకోసం వారు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. చక్కగా మాట్లాడే సంభాషణ నైపుణ్యం ఉండాలి. ప్రతిరోజు వారి సేవలను కోరుకునే వారికి కావలసిన సేవలు అందించగలిగే స్థితిలో ఉండాలి. వారి సేవాకాలాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో ‘సామాజిక భద్రత మంత్రిత్వశాఖ’ జమ చేస్తుంది. అలా ఆ 67 సంవత్సరాల మహిళ వారానికి రెండు రోజులు రెండు గంటల చొప్పున వృద్ధులకు సేవలు అందించటానికి వెళ్లేవారు. వారి గదుల్ని శుభ్రం చేయటం, వారికి కావలసిన సరుకులు తేవటం, వారికి ఎండలో స్నానం చేయటానికి సహకరించటం వంటి పనులకు సహాయపడేవారు.. కొద్దిసేపు వారితో సరదాగా ముచ్చటించటానికి సమయం కేటాయించేవారు. వారు దరఖాస్తులో చేసుకున్న ఒప్పందం ప్రకారం. సంవత్సరం తర్వాత ‘టైమ్ బ్యాంక్’ వారు ఆమె సేవాకాలాన్ని లెక్కించి, ‘టైమ్ బ్యాంక్ కార్డు’ జారీ చేసింది. ఆమెకు ఇతరుల సహాయం అవసరం ఉన్నపుడు తన కార్డును ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఉంది. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ వచ్చినట్లుగానే, ఖాతాలో ఉన్న సమయాన్ని వడ్డీతో సహా తిరిగి వాడుకోవచ్చు. దరఖాస్తును పరిశీలించి, టైమ్ బ్యాంక్ ఒక వాలంటీర్‌ను ఆమె ఇంటికి గానీ, ఆస్పత్రికి గానీ పంపుతారు. ఒక టీచర్ తన అనుభవాన్ని, ‘‘ఒకరోజు నేను స్కూల్లో ఉన్నపుడు నాకు పిలుపు వచ్చింది. నేను అక్కడకు వెళ్లాను. ఆవిడ... తాను కిటికీ శుభ్రం చేస్తుంటే స్టూల్ మీద నుంచి జారిపడ్డానని చెప్పింది. నేను వెంటనే స్కూల్‌కి సెలవు పెట్టి, ఆవిడను ఆసుపత్రికి తీసుకువెళ్లాను. ఆవిడకు మడమ దగ్గర ఫ్రాక్చర్ అయ్యిందనీ, కొంతకాలం పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలనీ చెప్పారు డాక్టర్. నేను కొన్ని రోజుల పాటు ఆవిడ ఇంటి దగ్గర ఉండటానికి సిద్ధపడ్డాను. అయితే ఆవిడ నన్ను దిగులుపడద్దని, అప్పటికే తాను టైమ్ బ్యాంక్‌కి దరఖాస్తు చేసుకున్నానని చెప్పారు. ఆసుపత్రిలో చేరిన రెండు గంటలకే, ఆవిడకు సేవలందించడానికి టైమ్ బ్యాంక్ వారు వాలంటీర్లను పంపారు. నెల రోజుల పాటు ఆ వాలంటీర్ ఆమె యోగక్షేమాలు చూసుకున్నారు. ఆమెకు ఇష్టమైన వంటకాలు తయారు చేసి పెట్టారు. మనసుకు ఉల్లాసం కలిగించేలా కబుర్లు చెప్పారు. సకాలంలో మంచి సేవలు అందటం వల్ల, త్వరగా కోలుకుని, తిరిగి తన పనులు తాను చేసుకోవటం మొదలుపెట్టారామె. తాను ఇంత ఆరోగ్యంగా ఉండటానికి టైమ్ బ్యాంక్‌లో మరింత కాలాన్ని నమోదు చేసుకుంటానంది ఆవిడ’’ అని చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన టైమ్ బ్యాంకు సేవలను ఇప్పుడు స్విట్జర్లాండ్‌లో అందరూ ఆనందంగా వినియోగించుకోవటం సర్వసాధారణమైపోయింది. ఈ పద్ధతి వల్ల ఆ దేశంలో బీమా ఖర్చులు బాగా తగ్గాయి. అనేక సామాజిక సమస్యలు కూడా పరిష్కారమవుతున్నాయి. ఆ దేశప్రజలు ఈ విధానాన్ని మనస్ఫూర్తిగా స్వాగతించారు. అక్కడ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఆ దేశ పౌరులలో సగం మంది పౌరులు టైమ్ బ్యాంకు విధులలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ప్రభుత్వం ఈ విధానాన్ని చట్టబద్ధం చేసింది. ప్రస్తుతం ఆసియా దేశాల్లో ఒంటరి గూటి వృద్ధ పక్షుల సంఖ్య బాగా పెరిగిపోతుండటం వల్ల వారి సంక్షేమం ఒక సామాజిక సమస్యగా మారుతోంది. అన్ని దేశాల వారు స్విట్జర్లాండ్ ‘టైమ్ బ్యాంక్ ‘ విధానం గురించి ఆలోచన చేసి, టైమ్ బ్యాంకు విధానాన్ని ప్రవేశపెట్టి, చట్టబద్ధం చేస్తే మంచిదేమో. ఆలోచించాల్సిన విషయమే. టైమ్ బ్యాంకు... ఈ పేరు వినగానే ఇది ఏమిటి అనిపిస్తుంది. మన దగ్గరున్న డబ్బులు మనీ బ్యాంకులో వేస్తాం. ఆ బ్యాంకుల గురించి అందరికీ తెలుసు. అలాగే మనం చేసిన పని సమయాన్ని టైమ్ బ్యాంకులో వేస్తాం. అదే టైమ్‌బ్యాంక్. ఆ టైమ్‌ను, తను కదలలేని పరిస్థితుల్లో వినియోగించుకోవచ్చు. వినటానికి ఈ మాట కొత్తగా అనిపిస్తోందా. ఇది నిజం. స్విట్జర్లాండ్‌లో ఇప్పుడు అందరూ బాగా వినియోగించుకుంటున్న ఏకైక బ్యాంకు టైమ్ బ్యాంక్. -
ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి
అస్సాం అనగానే మనకు ‘అస్సాం టీ’ గుర్తుకు వస్తుంది. అందమైన అమ్మాయి వెదురుబుట్టను వీపునకు కట్టుకుని ముని వేళ్లతో టీ ఆకును కోస్తున్న టీ పౌడర్ యాడ్‌ను మర్చిపోలేం. ఈశాన్య రాష్ట్రాలనగానే అదో కొత్త లోకం అనిపిస్తుంది. కానీ మన తమిళనాడు, కేరళలను తలపించే దృశ్యాలు అక్కడ ఎక్కువగానే కనిపిస్తాయి. మనం ఊటీని నీలగిరులు అన్నట్లుగానే అస్సాంలోని నీలిరంగు కొండలను ‘బ్లూ మౌంటెయిన్స్’ అంటారు. ఇక్కడ హఫ్లాంగ్ అనే చిన్న కొండ ఆ రాష్ట్రానికి ఉన్న ఏకైక హిల్‌స్టేషన్. హఫ్లాంగ్ అంటే తెల్ల చీమల గుట్ట అని అర్థం. తూర్పు స్విట్జర్లాండ్ హప్లాంగ్ చిన్న పట్టణం, జనాభా నలభై వేలకు మించదు. సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో, గువాహటి నగరానికి 355 కి.మీ.ల దూరాన ఉంది. పాశ్చాత్య టూరిస్టులు ఈ ప్రదేశాన్ని స్విట్జర్లాండ్‌తో పోలుస్తూ ‘స్విట్జర్లాండ్ ఆఫ్ ఈస్ట్’ అన్నారు. నాగాలాండ్‌ను కూడా ఇదే విశేషణంతో చెప్పుకుంటారు. హఫ్లాంగ్ టూర్లో ప్రధానమైన విశేషం హఫ్లాంగ్ సరస్సు. ఇది మంచి నీటి సరస్సు. నీళ్లు, పడవ కనిపిస్తే పిల్లలు ఊరుకోరు కాబట్టి పిల్లలతో టూర్‌కెళ్లిన వాళ్లు ఎలాగూ బోటు షికారు చేసి తీరతారు. కానీ మేఘాలు చేతికి అందుతాయేమో అన్నట్లుండే హఫ్లాంగ్ కొండ మీద బోటు షికారు చేయడం పెద్దవాళ్లకు కూడా మధురానుభూతిగా మిగులుతుంది. హప్లాంగ్ పూర్తిగా ఆదివాసీల నేల. మిజో, నాగా, దిమాసా, మిమార్, కుకి, హ్రాంగ్‌కోల్ వంటి తెగల వాళ్లుంటారు. అక్కడి దుకాణాల వాళ్లకు తమ స్థానిక ఆదివాసీ భాషలతోపాటు హిందీ, ఇంగ్లిష్, అస్సామీ కూడా వచ్చి ఉంటుంది. వాళ్లు ఇంగ్లిష్ మాట్లాడినప్పటికీ స్థానిక యాసలోనే ఉంటుంది. కాబట్టి దక్షిణాది వాళ్లకు అంత సులువుగా అర్థం కాదు. అస్సాం పర్యటనను ఎక్కువగా ఏప్రిల్ నెలలో ప్లాన్ చేసుకుంటుంటారు. అస్సామీల క్యాలెండర్ ప్రకారం ఏడాది మొదలయ్యే బోహాగ్ నెల దాదాపుగా మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. మన ఉగాదిలాగ. ఈ పండుగ సందర్భంగా బిహు ఫెస్టివల్ వేడుకగా నిర్వహిస్తారు. అప్పుడు అస్సామీ సంప్రదాయ నృత్యాన్ని చూడవచ్చు. పరిశోధకుల పర్యటన హఫ్లాంగ్ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఉన్న జతింగ గ్రామాన్ని మిస్ కాకూడదు. ఇది చాలా చిన్న గ్రామం. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో పక్షులు వలస వస్తాయి. ఇప్పటి వరకు నలభై నాలుగు రకాల వలస పక్షులను గుర్తించారు. ఇక్కడికి వచ్చే హరికిరి పక్షులు మంటల్లోకి దూకుతాయి. అవి ఎందుకు వస్తాయో, ఎందుకు మంటల్లో దూకుతాయో ఎంతకీ అంతుపట్టని మర్మంగానే ఉంది. పొగమంచులో చక్కర్లు కొడుతూ కాలుతున్న మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి. ఈ పక్షుల మీద అధ్యయనం చేయడానికి యూరప్, అమెరికా, జపాన్‌దేశాల నుంచి ఏటా ఆర్నిథాలజిస్టులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరుకి వచ్చే కొంగలు, పులికాట్ సరస్సుకి గూడబాతులు సీజన్లో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతోపాటు తిరిగి వెళ్లిపోతాయి. అలా చక్కగా వచ్చి వెళ్తుంటే చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ జతింగకు వచ్చే పక్షులు తుదిశ్వాస కోసమే వస్తున్నాయని తెలిసినప్పుడు మనసుకు బాధ కలుగుతుంది. -
200 మంది పర్యాటకుల పరారీ
సాక్షి, న్యూఢిల్లీ : స్విట్జర్లాండ్‌లోని ‘వర్బియర్ స్కై రిసార్ట్’ విదేశీ యాత్రికులను విశేషంగా ఆకర్షించే విలాసవంతమైన విహార కేంద్రం. ఆ కేంద్రానికి ఎక్కువగా బ్రిటీష్ పర్యాటకులే వస్తుంటారు. అందుకని ఆ రిసార్ట్‌కు ‘లిటిల్ లండన్’ అని కూడా పేరు వచ్చింది. బ్రిటన్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి రూపాంతరం చెందిన కొత్తరకం వైరస్ అక్కడ విజృంభిస్తోందన్న వార్తలు రావడంతో బ్రిటిన్ నుంచి ప్రజల రాకపోకలను డిసెంబర్ 14వ తేదీ నుంచి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిషేధించింది. ముందుగానే విమానాలను బుక్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని బయల్దేరిన బ్రిటిష్ ప్రయాణికులు దేశంలో అడుగు పెట్టగానే వారిని పది రోజులపాటు ‘క్వారంటైన్ (స్వీయ నిర్బంధం)’లోకి పంపించాలని నిర్ణయించింది. (ఎంత కాలంలో కరోనా ఖతం...?) అలా స్విట్జర్లాండ్‌కు వచ్చిన 420 మంది బ్రిటన్ ప్రజలను వర్బియర్ స్కై రిసార్ట్‌కు క్వారంటైన్ కోసం అక్కడి స్థానిక ప్రభుత్వాధికారులు పంపించారు. అలా పంపించిన గంటలో దాదాపు 50 మంది తప్పించుకు పారిపోయారు. మిగిలిన 370 మంది బ్రిటీష్ పౌరుల్లో 200 మంది ఆదివారం ఉదయం నాటికి పరారయ్యారు. ఆదివారం మధ్యాహ్నం వరకు వారి గదుల ముందు ఏర్పాటు చేసిన టిఫిన్ క్యారియర్లు అలాగే ఉండిపోవడం, ఫోన్‌కాల్స్‌కు బదులు రాకపోవడంతో బయటి నుంచి తలుపులు తెరవగా గదుల్లో ఎవరూ లేరని హోటల్ సిబ్బంది తెలిపారు. మరో 13 మంది సోమవారం ఉదయం పారిపోయారని ప్రభుత్వ అధికార ప్రతినిధి జీన్ మార్క్ సాండోజ్ మీడియాకు తెలిపారు. వారిలో కొంత మంది ఫ్రాన్స్‌లో కనిపించినట్లు వార్తలు వచ్చాయి. దేశం నుంచి బ్రిటన్‌కు విమాన సర్వీసులను పూర్తిగా నిలిపి వేసిన నేపథ్యంలో వారంతా ఎటు పోయారో అర్థం కావడం లేదని సాండోజ్ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌కు విమానాల రాకపోకలను పలు దేశాలతోపాటు ఫ్రాన్స్ కూడా నిలిపివేసిందని, అలాంటప్పుడు కొందరు బ్రిటీష్ పౌరులు అక్కడికి ఎందుకెళ్లారో అర్థం కావడం లేదని ఆయన చెప్పారు. బ్రిటీష్ ప్రయాణికులను చీకట్లో రిసార్ట్‌కు తరలించారని, వారికి క్వారెంటైన్ గురించి ముందుగా తెలియదని, గదుల ముందు అన్న పానీయాలు ఏర్పాటు చేయడం, గదుల నుంచి బయటకు రాకుండా ఆంక్షలు విధించడంతో వారికి అసలు విషయం అర్థమై ఉంటుందని సాండోజ్ అన్నారు. క్రిస్మస్ సెలవుల సందర్భంగా పెద్ద సంఖ్యలో బ్రిటీష్ పర్యాటకులు వర్బియర్ స్కైరిసార్ట్కు వస్తారు. ఆనందంగా గడపాల్సిన సమయంలో నిర్బంధానికి బయపడి వారు పరారీ అయినట్లు తెలుస్తోంది. దట్టమైన మంచు కురుస్తున్న వేళల్లో వారు ఎంత దూరం వెళ్లగలరన్నది ప్రశ్నగా మిగిలింది. -
పర్యాటకులను అబ్బురపరిచే మంచు గుహ
స్విట్జర్లాండ్: స్విస్ ఆల్ఫైన్ పర్వతాల్లోని ఎత్తైన హిమానీనదం మీద సహజంగా ఏర్పడే మంచు గుహ సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. నీలి రంగులో కనిపించే ఈ ప్రకృతి సోయగం పర్యాటకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ మంచు గుహ పరిమాణం, ఆకారం ప్రతి ఏటా భిన్నమైన ఆకృతిని సంతరించుకుంటుంది. ఇది 5 మీటర్ల ఎత్తు, 20 మీటర్ల పొడవు మందపాటి మంచుతో కప్పబడిన గుండ్రని పైకప్పును కలిగి ఉంటుంది. ఇక ఈ ఏడాది గుహ లోపలి భాగం చాలా చదునైనదిగా పర్యటకుల సందర్శనకు వీలుగా ఉంది. వేసవిలో మంచు కరిగి గుహ నీటితో నిండి ఒక సరస్సులా మారుతుంది. డయబిల్రేట్స్ రిసార్ట్ ముందుగా ఉన్న గ్లేసియర్ 3000 చైర్లిఫ్ట్ నుంచి 15 నిమిషాల్లో కాలినడకన మంచు గుహకు చేరుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. కానీ ఈ ప్రయాణంలో ఎవరికి వారే తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ‘‘మేము అధికారికంగా మొదటిసారి తెరిచాం. గత సంవత్సరంలాగే మంచు గుహ ఉన్నప్పటికీ ఈసారి భిన్నంగా మరింత దృఢంగా ఉంది. మంచు కేథడ్రల్ లాగా ఇది అందంగా ఉంది’’ అని గ్లేసియర్ 3000 సీఈఓ బెర్న్‌హార్డ్ త్చన్నెన్ రాయిటర్స్‌తో అన్నారు. ఇది అద్భుతమైనదని, ఈ గుహ గురించి ఇంకా చెప్పడానికి మాటలు లేవు, నేను ఇలాంటిది జీవితంలో చూడలేదు. కొత్త ప్రపంచం చూసినట్టు చాలా అందంగా ఉంది. మీకు వెళ్ళే అవకాశం వస్తే నేను సిఫారసు చేస్తా అని సమీపంలో నివసిస్తున్న డచ్ మహిళ హెలెన్ ట్రంప్ పేర్కొన్నారు. -
యూరప్‌లో థర్డ్ వేవ్!
కరోనా మహమ్మారి యూరప్ దేశాలను వణికిస్తోంది. తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాలు బెంబేలెత్తిపోతున్నాయి. లండన్: కరోనా వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధతను యూరప్ దేశాలు అసంపూర్తిగా వదిలేశాయని, అందుకే ఈ దుస్థితి దాపురించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రతినిధి డేవిడ్ నబార్రో చెప్పారు. ఆయన తాజాగా స్విట్జర్లాండ్‌లో మీడియాతో మాట్లాడారు. యూరప్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా థర్డ్ వేవ్ మొదలయ్యే ప్రమాదముందని డేవిడ్ అన్నారు. ఈసారి పరిస్థితి ఊహించలేనంత దారుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా మేల్కొంటే మేలు యూరప్ దేశాలు కరోనా ఫస్ట్ వేవ్‌ను త్వరగానే అధిగమించగలిగాయి. వైరస్ వ్యాప్తిని సమర్థంగా అదుపు చేశాయి. ఆ తర్వాత కరోనా నివారణకు వేసవి రూపంలో మంచి అవకాశం వచ్చినా యూరప్ దేశాలు ఉపయోగించుకోలేకపోయాయని డేవిడ్ నబార్రో తెలిపారు. కరోనాను ఎదుర్కొనేందుకు వేసవి అనుకూల సమయమని తెలిపారు. ఆయితే, సన్నద్ధతను యూరప్ ప్రభుత్వాలు మధ్యలోనే ఆపేశాయని ఆక్షేపించారు. మౌలిక సదుపాయాలను కూడా విస్మరించాయని అన్నారు. ప్రస్తుతం సెకండ్ వేవ్‌లోనూ మేల్కోకపోతే థర్డ్ వేవ్ మరింత భీకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికైనా వైద్య సదుపాయాలను మెరుగుపర్చాలని, మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. ఆసియా దేశాలు భేష్ దక్షిణ కొరియా లాంటి ఆసియా దేశాలు కరోనా వ్యాప్తి నియంత్రించడంలో విజయం సాధించాయని డేవిడ్ ప్రశంసించారు. అక్కడ అత్యంత తక్కువ స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. కరోనాపై యుద్ధంలో ప్రజల భాగస్వామ్యం, సహకారంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. పలు ఆసియా దేశాలు లాక్డౌన్ ఆంక్షలను అర్ధాంతరంగా నిలిపి వేయకుండా కరోనా అదుపులోకి వచ్చేదాకా కొనసాగించాయని, ఇది మంచి పరిణామమని అన్నారు. యూరప్‌లో అలాంటి సన్నద్ధత కనిపించలేదని డేవిడ్ నబార్రో తెలిపారు. ఎక్కడ.. ఎలా..? ► జర్మనీ, ఫ్రాన్స్‌లో శనివారం ఒక్కరోజే 33 వేల కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ► స్విట్జర్లాండ్, ఆస్ట్రియాలో నిత్యం వేలాదిగా కొత్తగా కేసులు బయటపడుతున్నాయి. ► టర్కీలో తాజాగా 5,532 కొత్త కేసులు బహిర్గతమయ్యాయి. ► బ్రిటన్ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ డిసెంబర్ 2వ తేదీన ముగియనుంది. దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతుండడంతో లాక్‌డౌన్‌ను కొనసాగించే అవకాశం లేదని తెలుస్తోంది. సాధారణ ఆంక్షలే విధించనున్నట్లు సమాచారం. ► బ్రిటన్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వచ్చే నెలలో ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
భారత్ చేతికి స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతి సాధించింది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్‌ను అందుకుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈవోఐ) కింద 2019 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్ నుంచి మొదటి సెట్‌ను భారత్ అందుకుంది. తాజాగా ఈ ఏడాది భారత్ సహా 86 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) పంచుకుంది. ఈ దేశాలతో గతేడాది స్థాయిలోనే సుమారు 31 లక్షల అకౌంట్ల సమాచార మార్పిడి జరిగిందని ఎఫ్‌టీఏ తెలిపింది. వీటిల్లో భారతీయ పౌరులు, సంస్థల ఖాతాల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. -
ఆవును హెలికాప్టర్లో ఇంటికి చేర్చిన రైతు
స్విట్జర్లాండ్ : మన దేశంలో ఆవును గోమాతగా పూజిస్తూ కుటుంబంలోని వ్యక్తిలా చూస్తాం. ఆవుకు ఏమైనా అయితే విలవిల్లాడిపోతాం. తాజాగా ఇలాంటి ఘటనే స్విట్జర్లాండ్‌లోనూ చోటుచేసుకుంది. ఆవుకు గాయం కావడంతో ఆ రైతు తట్టుకోలేకపోయాడు. దీంతో విమానం తీసుకొచ్చి మరీ ఆవును ఇంటికి తరలించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్ అయ్యింది. వివరాల ప్రకారం..స్విట్జర్లాండ్ స్విస్ ఆల్ప్స్‌లోని ఓ పర్వతం వద్ద మేతకు వెళ్లిన ఆవు గాయపడింది. నొప్పితో కుంటుతూ నడుస్తున్న దృశ్యం రైతు కంట పడింది. దీంతో ఇంటిదాకా నడిస్తే మళ్లీ ఆవుకు నొప్పి ఎక్కువవుతుంది అనుకున్నాడు. వెంటనే హెలికాప్టర్ సాయం కోరగా రెస్క్యూ టీమ్ వచ్చి ఆవుకి తాళ్లు కట్టి క్షేమంగా ఇంటికి చేర్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో తీసి ఓ న్యూస్ ఛానల్‌కి ట్యాగ్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. లక్షలమంది ఈ వీడియోను వీక్షించి రీట్వీట్లు చేస్తున్నారు. ఆవు మీద మీరు కురిపించిన ప్రేమకు ముగ్ధులమయ్యాం అంటూ పలువురు నెటిజన్లు రైతును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. (వైరల్ : అందుకే అవంటే మాకు ప్రాణం! ) WHEN COWS FLY: A Swiss farmer decided to use a helicopter to airlift one of his beloved bovines down the mountain. The farmer says the cow had been walking with a limp and he didn't want to risk further injury to the animal. https://t.co/HSjcKh5oy6 pic.twitter.com/5qZgRdcWWs — ABC News (@ABC) August 19, 2020 -
రన్నరప్ హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్: కరోనా క్లిష్ట సమయంలో నాలుగు నెలల విరామం తర్వాత జరిగిన తొలి ముఖాముఖి అంతర్జాతీయ టోర్నమెంట్ బీల్ చెస్ ఫెస్టివల్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. స్విట్జర్లాండ్‌లోని బీల్ నగరంలో బుధవారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో 34 ఏళ్ల హరికృష్ణ 36.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 37 పాయింట్లతో పోలాండ్ గ్రాండ్‌మాస్టర్ రాడోస్లా వొజ్తాసెక్ ఓవరాల్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్ విభాగాల్లో టోర్నీలు నిర్వహించి... ఈ మూడు కేటగిరీల్లో ఆటగాళ్లు సాధించిన మొత్తం పాయింట్ల ఆధారంగా ఫైనల్ ర్యాంకింగ్స్‌ను నిర్ధారించారు. హరికృష్ణ ర్యాపిడ్ విభాగంలో 10 పాయింట్లు ... బ్లిట్జ్ విభాగంలో 6 పాయింట్లు... క్లాసికల్ విభాగంలో 20.5 పాయింట్లు స్కోరు చేశాడు. బుధవారం జరిగిన చివరిదైన ఏడో రౌండ్ క్లాసికల్ గేమ్‌లో ప్రపంచ 26వ ర్యాంకర్ హరికృష్ణ 31 ఎత్తుల్లో డేవిడ్ గిజారో (స్పెయిన్)పై గెలుపొందాడు. అయితే మరోవైపు వొజ్తాసెక్ కూడా తన చివరి రౌండ్ గేమ్‌లో తన ప్రత్యర్థి నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్)ను ఓడించడంతో హరికృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒకవేళ వొజ్తాసెక్ గేమ్ ‘డ్రా’ అయిఉంటే హరికృష్ణకు టైటిల్ లభించేంది. ఈ టోర్నీ నిబంధనల ప్రకారం క్లాసికల్ విభాగంలో విజయానికి 4 పాయింట్లు, ‘డ్రా’కు ఒకటిన్నర పాయింట్లు... ర్యాపిడ్ విభాగంలో విజయానికి 2 పాయింట్లు, ‘డ్రా’కు ఒక పాయింట్... బ్లిట్జ్ విభాగంలో విజయానికి 1 పాయింట్, ‘డ్రా’కు అరపాయింట్ కేటాయించారు. చాంపియన్ వొజ్తాసెక్కు 10 వేల స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 8 లక్షల 20 వేలు), రన్నరప్ హరికృష్ణకు 7,500 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 6 లక్షల 15 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఓవరాల్ ఫైనల్ ర్యాంకింగ్స్ 1. రాడోస్లా వొజ్తాసెక్ (పోలాండ్–37 పాయింట్లు); 2. పెంటేల హరికృష్ణ (భారత్–36.5 పాయింట్లు); 3. మైకేల్ ఆడమ్స్ (ఇంగ్లండ్–35.5 పాయింట్లు); 4. విన్సెంట్ కీమెర్ (జర్మనీ–28 పాయింట్లు); 5. అర్కాదిజ్ నైదిష్ (అజర్బైజాన్–22.5 పాయింట్లు); 6. డేవిడ్ గిజారో (స్పెయిన్–22 పాయింట్లు); 7. రొమైన్ ఎడువార్డో (ఫ్రాన్స్–17.5 పాయింట్లు); 8. నోయల్ స్టుడెర్ (స్విట్జర్లాండ్–15 పాయింట్లు). ఆడటంలోనే ఆనందం దక్కింది... బీల్ టోర్నీలో రెండో స్థానంలో నిలవడం సంతోషం. త్రుటిలో ఓవరాల్ చాంపియన్‌షిప్ కోల్పోయాను. అయితే ఎలాంటి నిరాశా లేదు. మూడు ఫార్మాట్లలో (ర్యాపిడ్, బ్లిట్జ్, క్లాసికల్) కూడా బాగా ఆడాను. బ్లిట్జ్‌లో మాత్రం కాస్త వెనుకబడటంతో ఓవరాల్ టైటిల్ చేజారింది. మొత్తంగా నా ప్రదర్శన అయితే చాలా బాగుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నీ విజయాలు, ఫలితాలకంటే ముఖాముఖి చెస్ ఆడటంలో నాకు కలిగిన ఆనందం చాలా ఎక్కువ. ఫిబ్రవరిలో చివరి టోర్నమెంట్ బరిలోకి దిగాను. బీల్ నుంచి ‘సాక్షి’తో హరికృష్ణ ► కోవిడ్–19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా మా టోర్నీలు కూడా రద్దు కావడంతో ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ సమయంలో అనేక కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు ఓపెనింగ్స్‌పై ఒక పుస్తకం కూడా రాశాను. త్వరలో అది ప్రచురితమవుతుంది. ► ప్రస్తుతం ప్రాగ్ (చెక్ రిపబ్లిక్ రాజధాని)లో ఉంటున్నా. కరోనాకు సంబంధించి స్విట్జర్లాండ్ ప్రభుత్వ నిబంధనలను నిర్వాహకులు పూర్తిగా పాటించారు. మాకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వారే చూసుకోవడం వల్ల మేం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. బ్లిట్జ్ మినహా మిగిలిన ఫార్మాట్లకు ఇద్దరు ఆటగాళ్ల మధ్య మందమైన ప్లాస్టిక్ తెరలాంటిది ఉంచారు. బ్లిట్జ్ చాలా వేగంగా ముగిసిపోతుంది కాబట్టి మాస్క్‌లు వేసుకొని ఆడామంతే. ► కరోనా విరామం సమయంలో మూడు ఆన్లైన్ టోర్నీల్లో పాల్గొన్నాను. అయితే అవి నాకు సంతృప్తినివ్వలేదు. కంప్యూటర్ ముందు కూర్చుంటే పోటీ పడుతున్నట్లుగా అనిపించలేదు. ఆన్లైన్ ఆడగలిగే అవకాశం చెస్‌కు ఉన్నా... ఎదురుగా మరో ఆటగాడు కూర్చొని ఉంటేనే ఆ అనుభూతి లభిస్తుంది. ప్రత్యర్థిని చూస్తూ, అతని ముఖకవళికలను పరిశీలించడం కూడా చెస్ వ్యూహప్రతివ్యూహాల్లో భాగమే. అందుకే బీల్ నిర్వాహకులు పిలవగానే ఆడేందుకు సిద్ధమయ్యా. ► మొత్తంగా బీల్ టోర్నీ భిన్నమైన అనుభవమే అయినా మరీ కొత్తగా అనిపించలేదు. ఇప్పుడు సంతృప్తిగా వెనుదిరుగుతున్నా. ఇప్పుడు ఒలింపియాడ్ కోసం సన్నద్ధమవుతా. భారత్ ఉన్న గ్రూప్ మ్యాచ్‌లు ఆగస్టు 19 నుంచి ఉన్నాయి కాబట్టి నాకు తగినంత సమయం ఉంది. ఒలింపియాడ్ కూడా తొలిసారి ఆన్లైన్లో నిర్వహించబోతున్నారు. జట్టుగా ఇది ఎలా ఉండబోతోందో అని నేనూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. -
అందరూ చూస్తుండగా జూ ఉద్యోగిని చంపిన పులి
జ్యూరిచ్: జూ ఉద్యోగినిపై పులి దాడి చేసి చంపేసిన ఘటన శనివారం స్విట్జర్లాండ్‌లో చోటు చేసుకుంది. జ్యూరిచ్ జూలో సైబీరియన్ జాతి పులి ఉంది. దాని ఎన్‌క్లోజర్‌లోకి ఓ మహిళా ఉద్యోగి ప్రవేశించింది. దీంతో అక్కడే ఉన్న పులి వెంటనే ఆమె మీద పడి దాడి చేసింది. దీంతో అక్కడ ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురై పెద్ద ఎత్తున అరుపులు, కేకలు పెట్టడంతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. దీంతో అప్రమత్తమైన ఇతర జూ అధికారులు వెంటనే ఎన్‌క్లోజర్ దగ్గరకు ప్రవేశించి పులి దృష్టి మరల్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే సహచర ఉద్యోగిని పులి చేతిలో ప్రాణాలు విడిచింది. దీంతో ఆదివారం నాడు జూను తాత్కాలికంగా మూసివేశారు. (గాయపడిన పులి జాడేది..?) ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా.. పులి మెలకువగా ఉన్న సమయంలో ఆమె ఎన్‌క్లోజర్‌లోకి ఎందుకు వెళ్లింది? అన్న విషయంపైనా ఆరా తీస్తున్నారు. కాగా 2015లో డెన్మార్క్‌లోని జంతుప్రదర్శనశాలలో జన్మించిన ఈ పులి పేరు ఐరినా. దీన్ని గతేడాది జ్యూరిచ్ జూకు తీసుకువచ్చారు. ఇక జూలోని జంతువులు మనుషులపై దాడికి దిగడం కొత్తేమీ కాదు. 2019లోనూ జంతు ప్రదర్శనశాలలో ఉన్న మొసలి అక్కడి ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన ఉద్యోగి చేయి నోట కరిచింది. దాన్ని వదిలించడానికి ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో మొసలిని కాల్చివేశారు. (మహిళపై సింహాల దాడి) -
‘మూడేళ్ల క్రితమే నాకు పెళ్లి అయ్యింది’
తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచే బాలీవుడ్ సింగర్ మోనాలీ ఠాకూర్ ఓ రహస్యాన్ని వెల్లడించి అందరికి షాక్ ఇచ్చారు. మూడు సంవత్సరాల క్రితమే తనకు వివాహం అయ్యిందని తెలిపారు. అయితే దీని గురించి ఎవరికి తెలియదని చెప్పారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనాలి ఈ విషయాన్ని వెల్లడించారు. ‘నా వివాహం గురించి సోషల్ మీడియాతో సహా ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. కానీ మూడు సంవత్సరాల క్రితమే నేను స్విట్జర్లాండ్‌కు చెందిన రెస్టారెంట్ యజమాని మైక్ రిచ్టేను వివాహం చేసుకున్నాను. 2017లోనే మాకు పెళ్లి జరిగింది. మూడేళ్లుగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాం. అయితే కొన్ని సార్లు నా ఇన్స్టాగ్రామ్ ఫోటోల్లో ఉంగరం కనిపించేది. దాంతో జనాలు పెళ్లి చేసుకున్నావా అని ప్రశ్నించేవారు’ అని తెలిపారు. అంతేకాక తన వివాహం గురించి ఇండస్ట్రీలోని స్నేహితులకు కూడా తెలియదని.. ఈ విషయం వారిని నిజంగానే షాక్‌కు గురి చేస్తుందన్నారు మోనాలి. ‘వారిని నేను పెళ్లికి పిలవలేదు. కనీసం వివాహం చేసుకున్నట్లు చెప్పాలి.. పార్టీ ఇవ్వాలి అనుకుంటూనే మూడేళ్లు గడిచిపోయాయి. త్వరలోనే గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేసి.. అందరిని పిలుస్తాను. అప్పుడు ఎవరికి నా మీద కోపం ఉండదు’ అన్నారు. మోనాలి ఠాకూర్ ‘రేస్’ చిత్రంలో ‘జరా జరా టచ్ మి’, ‘లూటెరా’ సినిమాలో ‘సావర్ లూన్’, ‘బద్రీనాథ్ కి దుల్హానియా’ చిత్రంలో ‘బద్రీ కి దుల్హానియా’ వంటి పాటలు పాడారు. 2015లో ‘దమ్ లగా కే హైసా’ చిత్రంలోని ‘మోహ్ మోహ్ కే ధాగే’ పాటకి ఉత్తమ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్‌గా జాతీయ అవార్డును గెలుచుకున్నారు. -
గోడలు లేని హోటల్.. రోజుకు రూ.23 వేలు
బెర్న్(స్విడ్జర్లాండ్) : సకల సదుపాయాలతో ప్రకృతి అందాల నడుమ జీవించాలనుకునే వారిని స్విడ్జర్లాండ్లోని ఓపెన్ ఎయిర్ హోటళ్లు ఆకర్షిస్తున్నాయి. తివాచి పరిచినట్టు ఉండే పచ్చని పచ్చిక బయళ్లు. చల్లని గాలులు వీచే చెట్లు. ఎటుచూసినా రమనీయమైన పర్వతాలు. ఆలపిస్తూ, ఆకృతినిచ్చే అందమైన నదుల మధ్య ఒక్క రోజు గడిపితే ఆ కిక్కే వేరు. ఇలాంటి వారి కోసమే స్విడ్జర్లాండ్‌కు చెందిన సోదరులు ఫ్రాంక్, పాట్రిక్‌లు డేనియల్ చార్బోన్నీర్తో కలిసి ఆల్ఫ్స్ పర్వతాల్లో ‘జీరో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు’ను ప్రారంభించారు. మొత్తం ఏడు ఓపెన్ ఎయిర్ హోటళ్లను రూపొందించారు. ఈ హోటళ్లలో ఒక్కరోజు బసకుగానూ 308 డాలర్లు(దాదాపు రూ.23వేలు)గా నిర్ణయించారు. గోడలు, టాప్లేకుండానే ఉండే ఈ హోటళ్లలో స్థానికంగా ఉండే రైతులే పర్యటకులకు రూమ్ సర్వీస్ చేస్తారు. ఇంత మంచి వెంటిలేషన్ ఉన్న ప్రదేశం బహుశా ఎక్కడా ఉండకపోవచ్చని ఫ్రాంక్, పాట్రిక్ సోదరులు అంటున్నారు. ముఖ్యంగా వేసవి విడిది కోసం ఈ హోటళ్లను రూపొందించామన్నారు. అయితే ఒకవేళ వర్షం గనుక పడితే బదులుగా మరో చోట బసకు ముందే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. చదవండి : ఇటలీపై కరోనా పంజా.. మెడికల్ చీఫ్ కీలక వ్యాఖ్యలు అమెరికా: పోలీసుల చర్యతో తల పగిలింది! -
కరోనా: మూడో రోజుకు ఇలా అవుతుంది
బెర్న్: కరోనా వ్యాధిగ్రస్తులు వాసన గ్రహించే శక్తిని కోల్పోతున్నారట. వైరస్ సోకిన మూడో రోజు నుంచే ముక్కు పని చేయడం లేదని నిపుణులు చెప్తున్నారు. ఈ మేరకు ఒటోలారింగాలజీ మెడ్ అండ్ నెక్ సర్జరీ జర్నల్ అధ్యయనాన్ని ప్రచురించింది. అధ్యయనంలో భాగంగా స్విట్జర్లాండ్‌కు చెందిన సుమారు 103మంది రోగులను ఆరు వారాలపాటు పరిశీలించగా 61 శాతం మందికి వాసన తెలియట్లేదని తేలింది. కరోనా సోకిన మూడో రోజు నుంచి ఈ కొత్త లక్షణం ప్రారంభమవుతోంది. దీన్నే "అనోస్మియా" అంటారు. ఇది ఉన్నవారు శ్వాస ఆడకపోవడం, తీవ్ర దగ్గు, జ్వరంతో బాధపడుతారు. ఈ అధ్యయనం గురించి అమెరికాలోని సిన్సిన్నాటి యూనివర్సిటీకి చెందిన అహ్మద్ సెడఘట్ శాస్త్రవేత్త మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు లేనప్పటికీ వాసన గుర్తుపట్టలేకపోతే వారిని అనుమానించాల్సిందేనన్నారు. (కరోనాపై యుద్ధమంటే..?) అంతేకాక ఈ లక్షణం వల్ల సదరు పేషెంట్లో వైరస్ వ్యాప్తి తొలి దశలో ఉందన్న విషయం నిరూపితమవుతుందని తెలిపారు. అయితే ఇది ప్రమాదకరం కాదని, వాసన కోల్పోవడం వల్ల ఎవరూ చనిపోరని స్పష్టం చేశారు. కాబట్టి ఎవరైనా వాసన గుర్తించలేకపోతున్నారంటే వారిపై ఓ కన్నేయాల్సిందేనని హెచ్చరించారు. పైగా ఈ లక్షణం కరోనా పేషెంట్లను గుర్తించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఇదిలా వుంటే ఈ అధ్యయనంలో 35 శాతం మంది ముక్కు దిబ్బడతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి ఇతరుల నుంచి వైరస్ సోకకుండా రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు మాస్కు ధరించడం అత్యవసరమని తెలిపారు. (కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం) -
బంగారు కల నెరవేరిన వేళ...
ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు ఎనిమిది బంగారు పతకాల స్వర్ణయుగం 1980తోనే ముగిసింది. తర్వాతి మూడు ఒలింపిక్స్‌లలోనూ మన దేశం రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది. ఆ తర్వాత లియాండర్ పేస్, కరణం మల్లేశ్వరి, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ల ప్రదర్శనతో రెండు కాంస్యాలు, ఒక రజతం మాత్రం వచ్చాయి. కానీ వ్యక్తిగత స్వర్ణం... ఇన్నేళ్లయినా అది భారత్‌కు స్వప్నంగా మారిపోయింది. ఎట్టకేలకు 2008లో ఆ రాత మారింది. పాతికేళ్ల కుర్రాడి తుపాకీ నుంచి దూసుకొచ్చిన ఒక బుల్లెట్ సరిగ్గా పసిడి లక్ష్యాన్ని తాకింది. దాంతో విశ్వ క్రీడల్లో మన దేశానికి తొలి వ్యక్తిగత స్వర్ణాన్ని అందించిన అభినవ్ బింద్రా చరిత్రకెక్కాడు. అతని ప్రదర్శన కారణంగా ఆ క్షణాన పోడియంపై వినిపించిన జనగణమన ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేసింది. ‘నా జీవితంలో ఇది ఎప్పటికీ మరిచిపోలేని చీకటి రోజు’... 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో ప్రదర్శన తర్వాత అభినవ్ బింద్రా తన సన్నిహితులతో చేసిన వ్యాఖ్య ఇది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో 7వ స్థానంలో నిలిచిన తర్వాత అతను ఈ మాట అన్నాడు. మరి ఇలా అయితే తర్వాతి లక్ష్యం ఏమిటి... వెంటనే మిత్రులు అడిగారు. ఏముంది, మరో నాలుగేళ్లు శ్రమించడమే అంటూ బింద్రా చిరునవ్వుతో జవాబిచ్చాడు. అంతకుముందు నాలుగేళ్ల క్రితమే 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కూడా అత్యంత పిన్న వయస్కుడైన భారత ఆటగాడిగా బింద్రా పాల్గొన్నాడు. అయితే అప్పుడు క్వాలిఫయింగ్‌లో 11వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయాడు. ఇలాంటి స్థితిలో మరో నాలుగేళ్లు కష్టపడాలంటే ఎంతో ఓపిక, పట్టుదల, పోరాటతత్వం ఉండాలి. కానీ బింద్రా అన్నింటికీ సిద్ధపడ్డాడు. ఒకే లక్ష్యంతో... బింద్రా కలవారి బిడ్డ. డబ్బుకు ఎలాంటి లోటు లేదు. ప్రాక్టీస్‌కు సమస్య రాకుండా ఇంట్లోనే తండ్రి సొంతంగా షూటింగ్ రేంజ్ కూడా ఏర్పాటు చేశాడు. అయితే ఇది మాత్రమే సరిపోదు. ఇంకా బయటకు కనిపించని, తనకు మాత్రమే తెలిసిన ఇతర లోపాలున్నాయనేది బింద్రా గుర్తించాడు. అన్నింటికి మించి తన ఫిట్నెస్ స్థాయికి తగినట్లుగా లేదని అతనికి అర్థమైంది. 4 కిలోల షూటింగ్ సూట్, 5 కిలోల గన్‌తో గురి కుదరడం లేదని తెలిసింది. అంతే... ఆరు నెలలు రైఫిల్‌కు విరామం ఇచ్చి పూర్తిగా ఫిట్‌గా మారడంపై దృష్టి పెట్టాడు. శరీరాన్ని దృఢంగా మార్చుకున్నాడు. బింద్రాకు కోచ్ గాబ్రియేలా అభినందన ఒక దశలో విరామం లేకుండా పది నిమిషాలు పరుగెత్తడమే కష్టంగా కనిపించిన అతను కనీసం గంటన్నర పాటు ఆగకుండా పరుగెత్తసాగాడు. కీలక సమయంలో బింద్రా లోపాలను సరిదిద్ది అతని షూటింగ్‌ను తీర్చి దిద్దడంలో స్విట్జర్లాండ్ మహిళా కోచ్ గాబ్రియేలా బుల్మన్ పాత్ర కీలకమైంది. 1988 నుంచి 2004 వరుసగా ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న గాబ్రియేలా... ముఖ్యంగా బింద్రా వెన్నుపై భారం పడకుండా సరైన పొజిషనింగ్‌తో షూటింగ్ చేయడంలో అతడిని తీర్చిదిద్దింది. ఇక బీజింగ్‌కు అతను ఏమాత్రం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా వెళ్లాడు. ఈసారి ఫలితం గురించి ఆలోచించను, నేను షూటింగ్ చేసేందుకు మాత్రమే వెళుతున్నా అని ముందే చెప్పేశాడు. అలా సాధించాడు... విజయానికి, పరాజయానికి మధ్య వెంట్రుకవాసి తేడా మాత్రమే ఉండే షూటింగ్లో మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు అభినవ్ సిద్ధమయ్యాడు. క్వాలిఫయింగ్‌లో 596 పాయింట్లు సాధించిన భారత షూటర్ నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించాడు. ఫైనల్లో బింద్రా అత్యుత్తమ ప్రదర్శన ముందు మిగతా షూటర్లు వెనుకబడ్డారు. మొత్తం పది రౌండ్లలోనూ ఒక్కసారి కూడా 10 పాయింట్లకు తగ్గకుండా బింద్రా మాత్రమే షూట్ చేయగలిగాడు. ఓవరాల్‌గా 700.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన బింద్రా భారత జాతి గర్వపడే ఘనతను సృష్టించాడు. 9వ రౌండ్ ముగిసేసరికి హెన్రీ హకినెన్ (ఫిన్లాండ్), బింద్రా సమాన పాయింట్లతో ఉన్నారు. చివరి రౌండ్లో బింద్రా 10.8 పాయింట్లు స్కోరు చేయగా... తీవ్ర ఒత్తిడిలో హకినెన్ 9.7 పాయింట్లు మాత్రమే స్కోరు చేసి మూడో స్థానానికి పడిపోయాడు. ఆగస్టు 11, 2008న బింద్రా సాధించిన ఘనతతో భారత్ యావత్తూ పులకించింది. 28 ఏళ్ల తర్వాత సాంకేతికంగా భారత్ ఖాతాలో స్వర్ణపతకం చేరినా... వ్యక్తిగత విభాగంలో బంగారం గెలిచిన ఏకైక అథ్లెట్‌గా అతను చరిత్రలో నిలిచిపోయాడు. ఆ తర్వాత అభినవ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో క్వాలిఫయింగ్ దశలోనే వెనుదిరగ్గా, 2016 రియో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో రెండో పతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే బీజింగ్‌లో అతను స్వర్ణపతకాన్ని అందుకున్న క్షణం మన క్రీడాభిమానుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయం. సాక్షి క్రీడా విభాగం -
స్విట్జర్లాండ్‌కు ఏపీ మామిడి
సాక్షి, అమరావతి: లాక్డౌన్ సమయంలో కూడా వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా తిరుపతి ఏపీ ఆగ్రోస్ ప్యాక్ హౌస్ సంస్థ నుంచి స్విట్జర్లాండ్‌కు 1.2 టన్నుల బంగినపల్లి మామిడి పండ్లను ఎగుమతి చేశారు. రాష్ట్ర ఉద్యానవన శాఖ సహకారంతో రైతులు, వ్యాపారులు కలిసి ఏపీ ఆగ్రోస్ ప్యాక్ సంస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పండే వివిధ పండ్లు, కూరగాయలను ఇది విదేశాలకు ఎగుమతి చేస్తుంది. ఏటా 50 లక్షల టన్నులకు పైగా మామిడి దిగుబడి అవుతుండగా అందులో 1000 టన్నుల వరకు అమెరికా, యూరోప్, దక్షిణాసియా దేశాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా బంగినపల్లి, సువర్ణ రేఖ, ఆల్ఫోన్సా వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది అనడానికి ఇది ఒక శుభసూచికమని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్వీట్ చేశారు. -
మహమ్మారిని మానవత్వమే అధిగమిస్తుంది: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. ఈ తరుణంలో ప్రజల్లో జీవితంపై ఆశను రేకుత్తించేలా ప్రఖ్యాత స్విట్జర్లాండ్ లైట్ ఆర్టిస్ట్ చేసిన ప్రయత్నం విశేషంగా ఆకట్టుకుంటుంది. కోవిడ్-19పై భారత్ చేస్తున్న యుద్దానికి సంఘీభావంగా స్విట్జర్లాండ్‌లోని 14,692 అడుగుల ఎత్తైన మాటర్‌హార్న్ పర్వతం శుక్రవారం భారత త్రివర్ణంతో ప్రకాశించాయి. వీటికి సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ షేర్ చేశారు. కరోనా వైరస్‌ను మానవత్వం ఖచ్చితంగా అధిగమిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. లాక్డౌన్ సందర్భంగా వివిధ మంత్రిత్వశాఖలు ప్రజలకు చేస్తున్న సహకారం, కరోనాపై పోరాటంలో చేస్తున్న ప్రయత్నాలను మోదీ ప్రశంసించారు. ‘కోవిడ్-19కు వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం కలిసి పోరాడుతుంది.. మానవత్వం ఖచ్చితంగా ఈ మహమ్మారిని అధిగమిస్తుంది’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. The world is fighting COVID-19 together. Humanity will surely overcome this pandemic. https://t.co/7Kgwp1TU6A — Narendra Modi (@narendramodi) April 18, 2020 దీంతోపాటు పలు మంత్రిత్వ శాఖలు చేసిన ట్వీట్లకు సైతం ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత రైల్వే బృందాన్ని చూస్తే గర్వంగా ఉంది.. కీలకమైన ఈ తరుణంలో నిరంతరం పౌరులకు సహాయం చేస్తున్నారని.. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ..దేశంలో ఇంధన అవసరాలను తీర్చడానికి నిరంతరాయంగా పనిచేసే వారందరికీ వందనాలు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
గూగుల్‌కు పాకిన కరోనా వైరస్
జ్యురిచ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) అమెరికా టెక్ దిగ్గజం గూగుల్కూ పాకింది. గూగుల్ సంస్థకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా సోకింది. స్విట్జర్లాండ్ జ్యురిచ్‌లోని గూగుల్ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో యాజమాన్యం అతనికి పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఉద్యోగికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని గూగుల్ ప్రతినిధి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే కంపెనీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి ఆరోగ్యం, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. ఇరాన్, ఇటలీ, చైనా దేశాలకు ప్రయాణించొద్దని ఉద్యోగులకు గూగుల్ సూచించింది. ఐతే కార్యాలయాన్ని మూసివేసే ఆలోచన లేదని ఆ సంస్థ పేర్కొంది. మిగతా ఆఫీసుల మాదిరిగానే జ్యురిచ్ కార్యాలయం ఓపెన్ చేసే ఉంటుందని ప్రతినిధి స్పష్టం చేశారు. తమ దేశంలో ఇప్పటి వరకు 15 కేసులను గుర్తించామని, వందలాది మందిని క్వారంటైన్లో ఉంచినట్లు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. కాగా కరోనా వైరస్ కారణంగా దక్షిణ కొరియాలోని హ్యూందాయ్ కార్ల తయారీ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
కోవిడ్-19 : స్విస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం
కోవిడ్-19 (కరోనా వైరస్) ఆటో ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తోంది. చైనాలోని వూహాన్ విస్తరించిన ఈ ప్రాణాంతకమైన వైరస్ 6 ఖండాల్లో తన ఉనికిని చాటుకుని మరణ మృదంగం వాయిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టడానికి అసాధారణమైన చర్యగా 1,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలను నిషేధిస్తూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిర్ణయించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని, మార్చి 15 వతేదీ వరకు ఈ నిషేధం అమల్లో వుంటుందని తెలిపింది. దీంతో జెనీవాలో జరగనున్న అంతర్జాతీయ ఆటో షోను కూడా నిర్వాహకులు రద్దు చేశారు. ఆటో పరిశ్రమకు ప్రధానమైన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో రద్దయిందని స్థానిక అధికారులు శుక్రవారం తెలిపారు. "90వ జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో-2020 జరగదు" అని జెనీవా ప్రాంతీయ కంటోనల్ ప్రభుత్వ అధినేత ఆంటోనియో హోడ్జర్స్ ట్విటర్లో వెల్లడించారు. మరోమూడు రోజుల్లో ఆటో షోలో ప్రధాన వేడుక ప్రారంభం కానుండగా తాజా నిర్ణయం వెలువడింది. ఈ పరిస్థితికి చింతిస్తున్నామనీ, కానీ ఆటో షో పాల్గొనే వారందరి ఆరోగ్యమే తమ ప్రధాన ప్రాధాన్యత అని ఫౌండేషన్ బోర్డు చైర్మన్ మారిస్ తురెట్టిని తెలిపారు. భారీగా పెట్టుబడులు పెట్టిన తయారీదారులకు ఈ నిర్ణయం విపరీతమైన నష్టమే అయినప్పటికీ, అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. (కోవిడ్-19 షాక్‌నకు ఆర్థిక టానిక్ అదే!) ఈ కార్ షో వచ్చే వారం (మార్చి5 -15) ప్రారంభం కానుంది. కరోనా విజృంభిస్తున్న క్రమంలో ఇప్పటికే చాలా దేశాలు కార్ షోలో తాము పాల్గొడంలేదని ఇప్పటికే ప్రకటించాయి. అలాగే హై ప్రొఫైల్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా తన సందర్శనను రద్దు చేసుకున్నారు. ప్రయాణ ఆంక్షలు, కరోనావైరస్ వ్యాప్తి భయాలు బార్సిలోనాలోని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరగనున్న లైట్ , బిల్డింగ్ ఫెయిర్ , బీజింగ్ ఆటో షోతో సహాపలు ముఖ్యకార్యక్రమాలను వాయిదా లేదా రద్దుకు కారణమయ్యాయి. కాగా ప్రపంచాన్ని చుట్టేస్తున్న మహమ్మారి కరోనావైరస్కు సంబంధించి మూడు ఖండాల్లోని దేశాలు మొదటి కేసులను శుక్రవారం నివేదించాయి. స్విట్జర్లాండ్‌లో ధృవీకరించిన కరోనావైరస్ కేసుల సంఖ్య 15కి పెరిగిందని, 100 మందికి పైగా పరిశీలనలో ఉన్నారని ప్రభుత్వ మంత్రి అలైన్ బెర్సెట్ తెలిపారు. చదవండి : 5 నిమిషాల్లో రూ. 5 లక్షల కోట్లు హాంఫట్ ఏప్రిల్ నుంచి పెట్రోలు ధరల మోత? -
పది లక్షలకు ఓ గొర్రె పిల్ల
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ దేశంలో కుక్కల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. విదేశాల్లో కుక్కలతోపాటు పిల్లులను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. పిల్లలాగే అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. దేశ, విదేశాల్లో గొర్రెలను కూడా పెంచుకుంటారు. పెరిగి పెద్దదయ్యాక కోసుకొని దాని మాంసం ఆరగించేందుకే. అయితే నల్ల ముక్కు కలిగిన స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘వలాయిస్’ జాతి గొర్రె పిల్లలను లండన్ లాంటి దేశాల్లో పెంపుడు కుక్కల వలె పెంచుకుంటారు. అందుకు కారణం ప్రపంచ గొర్రెల జాతుల్లోకెల్లా అవి అత్యంత అందంగా ఉండడమే. ఆ జాతికి చెందిన ఓ గొర్రె పిల్ల భారతీయ కరెన్సీలో ఆరున్నర లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పలుకుతుంది. అంటే మామూలు గొర్రె పిల్లలకన్నా వాటి ధర దాదాపు 40 రెట్లు ఎక్కువ. ఈ జాతి గొర్రె పిల్లల నుంచి ఉన్ని ఎక్కువ రావడమే కాకుండా మాంసం కూడా బలే రుచిగా ఉంటుందట. ఇంగ్లండ్‌లోని ఉత్తర డెవాన్‌లో వారం క్రితం ఈ జాతికి చెందిన మూడు గొర్రె పిల్లలు ఫామ్‌లో జన్మించాయి. ఆ మూడు అతి ముచ్చటగా ఉండడంతో ఒక్కో గొర్రె పిల్లకు పది లక్షల రూపాయలు చెబుతున్నారు. ఇప్పుడు అక్కడ గొర్రెల అమ్మకానికి మంచి సీజన్. స్విడ్జర్లాండ్‌కు చెందిన ‘వలాయిస్’ గొర్రె జాతి పిల్లలను ఎప్పుడు ఇంగ్లండ్‌కు తీసుకొచ్చి ఆ జాతి బ్రీడ్‌ను రక్షిస్తునారు. ఏడేళ్ల క్రితమే విదేశాలకు గొర్రెల ఎగుమతిని స్విడ్జర్లాండ్ నిషేధించింది. క్రిస్ స్లీ, టామ్ హూపర్ అనే గొర్రెల పెంపకం దార్లు 2016లో వలాయిస్ జాతి గొర్రెల పిండాలను స్కాట్లాండ్ నుంచి తీసుకొచ్చి డెవాన్ ఫామ్‌లో పెంచుతున్నారు. డిమాండ్, సరఫరా బట్టి తాము ఈ గొర్రెల ధరను నిర్ణయించినట్లు గతంలో ఆర్థికవేత్తగా పనిచేసిన హూపర్ తెలిపారు. లండన్ మొత్తం మీద ఈ జాతి గొర్రెలు కొన్ని వేలల్లోనే ఉంటాయని, స్విడ్జర్లాండ్ ఎగుమితి నిషేధం కారణంగా ఈ జాతి గొర్రెలు ఎక్కువ కావాలన్నా దొరకవని ఆయన చెప్పారు. -
వైరల్ : పాపం చడ్డీమ్యాన్!
-
వైరల్ : పాపం చడ్డీమ్యాన్!
స్విట్జర్లాండ్ : తప్పు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించక తప్పదు. అన్ని సమయాల్లో చట్టం మనల్ని శిక్షించకపోవచ్చు..కానీ, దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. అది ఈ చడ్డీమ్యాన్ విషయంలో రుజువైంది. ఏ తప్పు చేశాడో తెలియదు కానీ, పోలీసుల నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించి చావు తప్పి కన్ను లొట్టపోగొట్టుకున్నాడు. రెండవ అంతస్తు మీదనుంచి కిందపడి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన స్విట్జర్లాండ్‌లోని వాలీసెల్లెన్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. వాలీసెల్లెన్లోని ఓ హోటల్ గదిలో దిగిన ఓ వ్యక్తి పోలీసులు వెంటపడటంతో గదిలోనుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. ఆ తొందరలో చడ్డీ మాత్రమే వేసుకున్నానన్న సోయలేకుండా కిటికీలోనుంచి కిందకు దూకడానికి ప్రయత్నించాడు. అయితే ప్రయత్నం బెడిసికొట్టి బొక్కబోర్లా కింద ఉన్న కారుపై పడ్డాడు ఆ తర్వాత పల్టీ కొట్టి నేలపైకి జారాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఓ వ్యక్తి దాన్ని వీడియో తీసి ఆలస్యంగా ఇంటర్నెట్లో ఉంచాడు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. -
ఓటమి అంచుల నుంచి గట్టెక్కిన ఫెడరర్
ప్రత్యర్థి అనుభవలేమి... సులువుగా ఓటమిని అంగీకరించకూడదన్న నైజం... కాస్తంత అదృష్టం... వెరసి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లో స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెడరర్ మళ్లీ బతికిపోయాడు. తన 22 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లో ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని ఈ మాజీ చాంపియన్ గట్టెక్కాడు. ప్రపంచ 100వ ర్యాంకర్ టెనిస్ సాండ్‌గ్రెన్‌తో మంగళవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ ఐదు సెట్లలో విజయాన్ని అందుకొని 15వసారి ఈ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా)తో ఫెడరర్ తలపడతాడు. మెల్బోర్న్: కెరీర్లో 21వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ వేటలో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో అడ్డంకిని అధిగమించాడు. మంగళవారం 3 గంటల 31 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఫెడరర్ 6–3, 2–6, 2–6, 7–6 (10/8), 6–3తో అన్‌సీడెడ్ టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా)పై తీవ్రంగా చెమటోడ్చి గెలుపొందాడు. ఈ టోరీ్న లోని మూడో రౌండ్లో జాన్ మిల్మన్ (ఆ్రస్టేలియా)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమికి రెండు పాయింట్ల దూరంలో నిలిచి గట్టెక్కిన ఫెడరర్... క్వార్టర్ ఫైనల్లో మాత్రం ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. తన 22 ఏళ్ల కెరీర్లో ఫెడరర్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని విజయాన్ని అందుకోవడం ఇది రెండోసారి మాత్రమే. 2003లో సిన్సినాటి టోర్నీలో స్కాట్ డ్రెపర్తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లోనూ ఫెడరర్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకొని గెలుపొందాడు. ఆరుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన ఫెడరర్ గురువారం జరిగే సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో తలపడతాడు. నేడు జరిగే పురుషుల సింగిల్స్ మరో రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ)తో వావ్రింకా (స్విట్జర్లాండ్); ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆ్రస్టియా)తో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) ఆడతారు. సాండ్‌గ్రెన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్ నాలుగో సెట్లో స్కోరు 4–5 వద్ద తన సర్వీస్‌లో మూడు మ్యాచ్ పాయింట్లను... అనంతరం ఇదే సెట్లోని టైబ్రేక్‌లో 3–6 వద్ద మూడు మ్యాచ్ పాయింట్లను... 6–7 వద్ద మరో మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నాడు. స్కోరు 8–8తో సమంగా ఉన్నపుడు సాండ్‌గ్రెన్ వరుసగా రెండు తప్పిదాలు చేయడంతో చివరకు ఫెడరర్ టైబ్రేక్‌ను 10–8తో గెలిచి సెట్‌ను దక్కించుకున్నాడు. ఏకంగా ఏడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం ఐదో సెట్లో సాండ్‌గ్రెన్ ఆటతీరుపై ప్రభావం చూపింది. చివరి సెట్లో సాండ్‌గ్రెన్ పూర్తిగా డీలా పడ్డాడు. ఆరో గేమ్‌లో సాండ్‌గ్రెన్ సరీ్వస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత తన సర్వీస్‌లను నిలబెట్టుకొని చివరకు 6–3తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకొని విజయాన్ని అందుకున్నాడు. ►ఆ్రస్టేలియన్ ఓపెన్ చరిత్రలో ఫెడరర్ నెగ్గిన మ్యాచ్‌ల సంఖ్య 102. తాజా గెలుపుతో ఫెడరర్ ఒకే గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును (వింబుల్డన్‌లో 101 విజయాలు) సవరించాడు. ►ఓవరాల్‌గా ఫెడరర్ తన కెరీర్లో 46వసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో (ఆ్రస్టేలియన్ ఓపెన్–15; వింబుల్డన్–13; ఫ్రెంచ్ ఓపెన్–8; యూఎస్ ఓపెన్–10 సార్లు) సెమీఫైనల్ చేరాడు. ►కెన్ రోజ్‌వెల్ (42 ఏళ్ల 68 రోజులు–1977లో) తర్వాత ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా ఫెడరర్ (38 ఏళ్ల 178 రోజులు) గుర్తింపు పొందాడు. జొకోవిచ్ ఎనిమిదోసారి... మరో క్వార్టర్ ఫైనల్లో ఏడుసార్లు చాంపియన్ జొకోవిచ్ 6–4, 6–3, 7–6 (7/1)తో 32వ సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా)పై విజయం సాధించి ఎనిమిదోసారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఏడుసార్లూ జొకోవిచ్ టైటిల్‌తో తిరిగి వెళ్లడం విశేషం. ఫెడరర్‌తో ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 26–23తో ఆధిక్యంలో ఉన్నాడు. తొలిసారి సెమీస్‌లో బార్టీ, సోఫియా మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ యాష్లే బార్టీ (ఆ్రస్టేలియా), 14వ సీడ్ సోఫియా కెనిన్ (అమెరికా) తొలిసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరారు. క్వార్టర్ ఫైనల్స్‌లో బార్టీ 7–6 (8/6), 6–2తో ఏడో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై... సోఫియా 6–4, 6–4తో ఆన్స్ జెబూర్ (ట్యూనిషియ)ఫై నెగ్గారు. మిక్స్డ్ డబుల్స్‌లో పేస్–ఒస్టాపెంకో జంట పరాజయం మిక్స్డ్ డబుల్స్‌లో లియాండర్ పేస్ (భారత్)–జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) జంట పోరాటం ముగిసింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో పేస్–ఒస్టాపెంకో ద్వయం 2–6, 5–7తో జేమీ ముర్రే (బ్రిటన్)–బెథానీ మాటెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
రేపటి నుంచి దావోస్ సదస్సు
దావోస్: నటి దీపిక పదుకునే, సద్గురు జగ్గీ వాస్దేవ్, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్, దిగ్గజ పారిశ్రామికవేత్తలు గౌతం అదానీ, కుమారమంగళం బిర్లా, రాహుల్ బజాజ్, సంజీవ్ బజాజ్, ఎన్ చంద్రశేఖరన్, ఆనంద్ మహీంద్రా, సునీల్ మిట్టల్, నందన్ నీలేకని, అజయ్ పిరమల్ సహా 100కు పైగా భారత సీఈవోలు మంగళవారం నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) 50వ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తదితర దేశాధినేతలు కూడా హాజరవుతున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఆదాయ అసమానతలు, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ వైపరీత్యాల విషయంలో దేశాల భిన్న ధోరణులు తదితర అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు రానున్నాయి. వ్యాపారాలు తమ వాటాదారులకే కాకుండా, సామాజిక ప్రయోజనాల కోసం కూడా పనిచేయాలన్న విధానాన్ని 1973 నాటి దావోస్ మేనిఫెస్టో పేర్కొనగా, దీని ప్రగతిపై ఈ సదస్సులో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. రానున్న దశాబ్దంలో లక్ష కోట్ల మొక్కలను నాటాలని, నాలుగో పారిశ్రామిక విప్లవం కోసం 100 కోట్ల మందికి అవసరమైన నైపుణ్యాలు కల్పించాలన్నది సదస్సు లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ సదస్సులో మానసిక ఆరోగ్యంపై నటి దీపిక పదుకునే ప్రసంగం ఇవ్వనున్నారు. సద్గురు ప్రాణాయామ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జీరో ఎమిషన్స్ లక్ష్యానికి కట్టుబడాలి... 2050 లేదా అంతకుముందుగానే కార్బన్ ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించేందుకు(జీరో కార్బన్ ఎమిషన్స్) సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాస్‌ష్వాబ్ కోరారు. ఇందుకోసం నిర్మాణాత్మక చర్యలను ఆచరణలో పెట్టాలని కోరుతూ సభ్య దేశాలను ఓ లేఖ రూపంలో ఆయన కోరారు. కాగా, ప్రకృతిపై వ్యాపార ధోరణి పెరిగిపోతున్నట్టు డబ్ల్యూఈఎఫ్ నివేదిక పేర్కొంది. ప్రకృతిపై పెట్టుబడులు 44 ట్రిలియన్ డాలర్లుగా ఉంటాయని, ప్రపంచ జీడీపీలో ఇది సగానికి సమానమని వార్షిక సదస్సుకు ముందుగా విడుదల చేసిన నివేదికలో డబ్ల్యూటీఎఫ్ తెలిపింది. చైనా, ఈయూ, అమెరికాలు ప్రకృతిపై ఎక్కువ పెట్టుబడులను కలిగిన దేశాలుగా ప్రస్తావించింది. -
స్విట్జర్లాండ్‌లో సినీ సిస్టర్స్
సాక్షి, సిటీబ్యూరో: భారతదేశపు నటీనటులకు స్విట్జర్లాండ్ హాలిడే స్పాట్‌గా మారిందని ఆ దేశపు పర్యాటక సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. తాజాగా బాలీవుడ్ నటీమణులు, తోబుట్టువులు కృతి, నూపుర్ సనన్‌లు స్విట్జర్లాండ్‌లో వెకేషన్‌ను ఉల్లాసంగా గడిపారని, తమ బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకుని వీరిరువురూ అక్కడి బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఎంజాయ్ చేశారని వివరించారు. ల్యూసెర్న్, చాపెల్ బ్రిడ్జ్ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తూ చిన్న పిల్లల తరహాలో వీరు తమ టూర్‌ని ఎంజాయ్ చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకర్షిస్తున్నాయన్నారు. -
‘బయో ఆసియా’లో స్విట్జర్లాండ్
సాక్షి, హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ ప్రపంచంలో ప్రముఖ కేంద్రంగా మారుతోందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి సాగుతున్న నిరంతర కృషితో ఇది సాధ్యమైందని చెప్పారు. సుమారు వంద దేశాల నుంచి లైఫ్ సైన్సెస్ దిగ్గజాలను ఆకర్షించడంలో ‘బయో ఆసియా 2020’సదస్సు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్‌లో జరిగే బయో ఆసియా సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహించేందుకు స్విట్జర్లాండ్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి మంగళవారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బయో ఆసియా సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్ భాగస్వామ్యం ద్వారా అక్కడి కంపెనీలు, ప్రభుత్వంతో బహుముఖ సంబంధాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు. ఆవిష్కరణ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న స్విట్జర్లాండ్.. ప్రముఖ ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలైన నోవార్టిస్, రోచ్, ఫెర్రింగ్ ఫార్మా వంటి వాటికి చిరునామాగా ఉందన్నారు. బయో ఆసియా సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్‌తో తెలంగాణ ఒప్పందం కుదుర్చుకోవడం మంచి పరిణామం అని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వ్యాఖ్యానించారు. హెల్త్ టెక్నాలజీ రంగంలో భారత్‌ను తాము వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నామని స్విట్జర్లాండ్ డిప్యూటీ కాన్సుల్ జనరల్ సిల్వానా రెంగ్లి ఫ్రే ఆకాంక్షించారు. -
ఐఎండీ ర్యాంకింగ్‌లో 6 మెట్లు తగ్గిన భారత్
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్‌కి చెందిన ప్రముఖ బిజినెస్ స్కూల్ ‘ఐఎండీ’ తాజాగా ప్రకటించిన వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్‌లో భారత్ వెనకపడింది. మొత్తం 63 దేశాలతో కూడిన ఈ జాబితాలో భారత్ 6 మెట్లు తగ్గి 59వ స్థానానికి పడిపోయింది. పెట్టుబడి, అభివృద్ధి, సంసిద్ధత ఆధారంగా ఈ ర్యాంకింగ్‌ను విడుదలచేయగా.. చైనా (42), రష్యా (47), దక్షిణ ఆఫ్రికా (50)వ స్థానాల్లో నిలిచి, బ్రిక్స్ దేశాల జాబితాలో భారత్‌ను వెనక్కునెట్టాయి. విద్యపై వ్యయం (ప్రతి విద్యార్థికి) తక్కువగా ఉండడం వంటివి ర్యాంకును గణనీయంగా తగ్గించాయని ఐఎండీ బిజినెస్ స్కూల్ స్విట్జర్లాండ్, సింగపూర్ సీనియర్ ఎకనామిస్ట్ జోస్ కాబల్లెరో వ్యాఖ్యానించారు. జీడీపీతో పాటు శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యం, ఆరోగ్య వ్యవస్థ ప్రభావం కూడా భారత ర్యాంక్ తగ్గడానికి కారణాలుగా నిలిచాయన్నారు. జాబితాలో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో.. డెన్మార్క్(2), స్వీడన్(3), ఆస్ట్రియా (4), లక్సెంబర్గ్ (5) ర్యాంకుల్లో నిలిచాయి. -
ఫెడరర్@103
బాసెల్ (స్విట్జర్లాండ్): సొంతగడ్డపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పదోసారి స్విస్ ఇండోర్స్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)తో ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో ఫెడరర్ 6–2, 6–2తో గెలిచాడు. తాజా విజయంతో ఫెడరర్ కెరీర్ సింగిల్స్ టైటిల్స్ సంఖ్య 103కు చేరింది. జిమ్మీ కానర్స్ (అమెరికా–109 టైటిల్స్) పేరిట ఉన్న ఆల్‌టైమ్ రికార్డును సమం చేయడానికి ఫెడరర్ మరో ఆరు టైటిల్స్ దూరంలో ఉన్నాడు. రాకెట్ పట్టిన తొలినాళ్లలో ఈ టోర్నీలో ‘బాల్ బాయ్’గా పనిచేసిన ఫెడరర్ టైటిల్ గెలిచిన ప్రతీసారి ఈ టోర్నీలో బాల్ బాయ్స్, బాల్ గర్ల్స్‌గా వ్యవహరించిన వారందరికీ పిజ్జాలు కానుకగా ఇస్తాడు. వారితో కలిసి తింటాడు. ఈ టోర్నీలో 15వ సారి ఫైనల్ చేరిన ఫెడరర్‌కు తుది పోరులో ప్రత్యర్థి నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదు. 68 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో 38 ఏళ్ల ఫెడరర్ నాలుగు ఏస్‌లు సంధించడంతోపాటు, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 4,30,125 యూరోలు (రూ. 3 కోట్ల 37 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. గతంలో ఫెడరర్ 2006, 2007, 2008, 2010, 2011, 2014, 2015, 2017, 2018 ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. స్విస్ ఇండోర్స్‌లో టైటిల్ నెగ్గిన ఫెడరర్ వచ్చే సీజన్ కోసం ఫిట్‌గా ఉండేందుకు సోమవారం మొదలైన పారిస్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. -
స్విట్జర్లాండ్ టూర్‌కే భారతీయుల అధిక ప్రాధాన్యత
స్విట్జర్లాండ్ : మంచు ప్రదేశాలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. అందులో భారతీయులైతే మరి ముఖ్యంగా ఇష్టపడుతారు. ఈ విషయాన్నే కొన్ని పర్యాటక సర్వేలు కూడా తేల్చిచెబుతున్నాయి. మంచు ప్రదేశాల పర్యాటక జాబితాలో ముందుండే స్విట్జర్లాండ్‌కు మన భారతీయులు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారంటా. 59 శాతం మంది భారతీయులు సెలవు రోజుల్లో పర్యటించడానికి ఎక్కువగా స్విట్జర్లాండ్‌ను ఎంచుకోవడంలో ఆసక్తిని చూపుతున్నట్లు క్లబ్ మెడ్ చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ క్లబ్ మెడ్ సర్వే ప్రకారం సెలవుల రోజుల్లో భారతీయులు ఎక్కువ మంది స్విట్జర్లాండ్‌లో టూరిస్టులుగా ఉంటున్నారని, దాదాపు 96 శాతం భారతీయ ప్రజలు రాబోయే మూడేళ్లలో యురోపియన్ మంచు ప్రాంతాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో అధిక సంఖ్యలో భారతీయులు విహరయాత్రకు యురోపియన్ మంచు ప్రాంతాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే టూరిజంలో వైవిధ్యమైన, సాహోసోపేతమైన, ప్రయోగత్మకంగా ఉండే మంచు ప్రదేశాల వైపే పర్యటించడానికి భారతీయులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని గ్లోబల్ స్నో హాలిడే లీడర్, ఆసియా-పసిఫిక్ స్నో బ్రాండ్ స్టడీ 2019(ఏపీఏసీ) నివేదిక పేర్కొంది. ఆసియా-పసిఫిక్ మంచు క్రీడలను భారతీయులు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నారు. స్నో బోర్డింగ్, స్కైయింగ్ స్నో రైడింగ్లు అత్యంత ప్రజాదరణ పోందిన మంచు క్రీడలు. స్విట్జర్లాండ్‌లోని సెయింట్-మోర్టిజ్ రోయ్ సోలైల్, ఇటలీలోని సెర్వినియా, ఫ్రాన్స్‌లోని లెస్ డ్యూక్స్‌లోని కోన్ని మంచు ప్రదేశాలు స్నో స్కైయ్ డ్రైవింగ్ పర్యాటక ప్రదేశాలు. ఈ ప్రదేశాలకు ప్రతి ఏటా 75 శాతం భారతీయులు వస్తున్నారని, వారు కేవలం స్నో డ్రైవింగ్ కోసమే ఇక్కడికి రావడానికి ఆసక్తిని చూపుతున్నారని ఏపీఏసీ సర్వే వెల్లడించింది. ప్రయాణంలో కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ప్రయాణ విషయానికి వస్తే భారతీయులు ఎక్కువగా కుటుంబానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కుటుంబంతో కలసి పర్యటించడానికి ఇష్టపడుతున్నట్లు సర్వేలో తెలింది. అన్ని వయసుల వారు సరదగా గడపడానికి, అనుగుణంగా ఉండేటువంటి పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. సోలోగా టూరీస్టుల కంటే 27 శాతం భారతీయులు మూడు తరాలతో కుటుంబీకులతో కలిసి పర్యాటించేందుకు ఇష్టపడే భారతీయులు 27 శాతం ఉన్నారని, ఇది ఆసియా-పసిఫీక్ సగటు 18 శాతాన్ని అధిగమించినట్లు వెల్లడైంది. -
రెండున్నరేళ్ల తర్వాత...
యాంట్‌వర్ప్ (బెల్జియం): ప్రపంచ మాజీ నంబర్‌వన్, బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సాధించాడు. ఆదివారం ముగిసిన యూరోపియన్ ఓపెన్ టోర్నీ ఫైనల్లో ప్రపంచ 243వ ర్యాంకర్ ముర్రే 3–6, 6–4, 6–4తో ప్రపంచ 18వ ర్యాంకర్, మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేత ముర్రేకు 1,09,590 యూరోలు (రూ. 87 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. వావ్రింకాతో ఫైనల్లో తొలి సెట్ కోల్పోయి, రెండో సెట్లో 1–3తో వెనుకబడిన ముర్రే ఆ తర్వాత అద్భుత ఆటతీరుతో పుంజుకున్నాడు. 2017 మార్చిలో దుబాయ్ ఓపెన్ టైటిల్ సాధించాక ముర్రే ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో తుంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న ముర్రే ఆరు నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. ఆగస్టులో సిన్సినాటి మాస్టర్స్ టోరీ్నతో పునరాగమనం చేశాక మరో ఐదు టోర్నీల్లో పాల్గొన్న అతను ఏ టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాడు. అయితే యూరోపియన్ ఓపెన్‌లో అతను ఫైనల్ చేరడంతోపాటు విజేతగా నిలిచాడు. -
స్విస్... స్వీట్ మెమొరీస్
స్విట్జర్లాండ్..సిటీ నుంచి విదేశాలకు క్యూకట్టే పర్యాటకుల జాబితాలో తప్పక ఉండే దేశం. ఈ సీజన్లో నగరం నుంచి మరో మూణ్నెళ్లపాటు స్విట్జర్లాండ్‌కు వెళ్లే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందని ట్రావెల్ ఆపరేటర్లు చెబుతున్నారు. చల్లగా ఉండే ఈ సీజన్లో అద్భుతమైన ప్రకృతి అంందాలతో పాటు శతాబ్ధాల నాటి వంతెనలూ, చారిత్రక ప్రదేశాలకూ నెలవైన స్విట్జర్లాండ్ గొప్ప జ్ఞాపకాలను అందిస్తుందని నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు అంటున్నారు. ల్యూసెన్స్ లేక్ మీదుగా సాగిపోయే ఓడ ప్రయాణం, దానికి సమీపంలోనే ఉండే చాక్లెట్ తయారీ కేంద్రాలు, రిగి, పిలాటాస్ పర్వతాలపై సాహసయాత్రలు, కళ్లు మూయనివ్వని మ్యూజియమ్స్, మంచు పర్వతాల నడుమ గొప్ప అనుభూతులను అందించే ఏంజెల్ బర్గ్, మౌంట్ టిట్లీస్...ఇలా ఎన్నో వైవిధ్యభరిత అనుభవాలు నగరవాసుల్ని స్విట్జర్లాండ్‌ని ఈ సీజన్లో అభిమాన టూరిస్ట్ ప్లేస్‌గా మారుస్తున్నాయి. చలో కూర్గ్... సాక్షి, సిటీబ్యూరో: పర్వత ప్రాంతాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారిని వెస్ట్రన్ ఘాట్స్‌కి రారమ్మంటోంది మడ్డీ ట్రయల్స్ సంస్థ. స్కాట్ లాండ్ ఆఫ్ ఇండియాగా పేరొందిన కర్ణాటకలోని కూర్గ్ హిల్ స్టేషన్‌కు పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ అందిస్తోంది. కూర్గ్‌లోని కుశాయినగర్లో ఉన్న ఒక అరుదైన లేక్‌ని సందర్శించడం, కావేరీ నది సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్ వగైరాలన్నీ ఇందులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 18 నుంచి 3 రోజుల పాటు ఈ ట్రిప్ నిర్వహిస్తున్నారు.