స్విస్‌లో సాంగ్‌  | Bhola Shankar movie will release on August 11 | Sakshi
Sakshi News home page

స్విస్‌లో సాంగ్‌ 

Published Fri, May 19 2023 2:44 AM | Last Updated on Fri, May 19 2023 2:44 AM

Bhola Shankar movie will release on August 11 - Sakshi

అసలే ఎండాకాలం.. పైగా కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో కూల్‌ కూల్‌గా ఉండేప్రాంతానికి వెళ్లే చాన్స్‌ వస్తే.. హాయి హాయిగా ఉంటుంది. ప్రస్తుతం ‘భోళా శంకర్‌’ టీమ్‌ ఆ హాయినే అనుభవిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో ల్యాండ్‌ అయ్యాడు ‘భోళా శంకర్‌’. అక్కడి కూల్‌ కూల్‌ క్లైమేట్‌లో ప్రేయసితో ఫుల్‌ స్వింగ్‌లో స్ప్రింగ్‌లాంటి స్టెప్పులేస్తున్నాడట.

చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’. చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన చెల్లెలి పాత్రలో హీరోయిన్‌ కీర్తీ సురేష్‌ నటిస్తున్నారు. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. 

ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ స్విట్జర్లాండ్‌లోప్రారంభమైంది. చిరంజీవి, తమన్నాలపై సాంగ్‌ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను కూడా ప్లాన్‌ చేశారు. సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్‌ స్వరకర్త. ‘భోళా శంకర్‌’ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement