‘‘నాకు ఒక సిస్టర్ ఉంది. బ్రదర్‌లాంటి ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ‘భోళా శంకర్’ చేశాక మెహర్ రమేష్‌లాంటి అన్నయ్య దొరికారు’’ అన్నారు కీర్తీ సురేష్. చిరంజీవి టైటిల్ రోల్‌లో మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేశారు. ఈ నెల11న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు.
► ‘భోళా శంకర్’లో చిరంజీవిగారి చెల్లెలి ఆఫర్ వచ్చినప్పుడు రజనీకాంత్‌గారి చెల్లెలిగా చేసిన ‘అన్నాత్తే’ (‘పెద్దన్న’) పూర్తి చేశాను. అందుకే వెంటనే చెల్లెలిగా అంటే ఫర్వాలేదా? అని మెహర్ రమేష్‌గారితో అన్నాను. అయినప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్‌గారికి చెల్లెలిగా నటించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవిగారి చెల్లెలిగా అంటే ఇంకేం కావాలి? అనిపించింది. దాంతో పాటు చిరంజీవిగారితో ఒక్క ఫ్రేమ్‌లో అయినా డ్యాన్స్ చేయాలనుకున్న నాకు రెండు పాటలు చేసే చాన్స్ స్క్రిప్ట్‌లో ఉంది. మెహర్ రమేష్‌గారు నా క్యారెక్టర్‌ని కూడా బాగా డిజైన్ చేశారు.
► మా అమ్మ (మేనక) గతంలో చిరంజీవిగారి సరసన ‘పున్నమి నాగు’లో నటించారు. అప్పుడు చిరంజీవిగారు తీసుకున్న కేర్, ఆయన ఇచ్చిన సలహాల గురించి అమ్మ ఇప్పుడు నాతో చెప్పారు. అవి చిరూగారితో చెబితే.. ‘ఈ సలహాలు కూడా ఇచ్చాను’ అంటూ అమ్మ చెప్పనివి కూడా చెప్పారు. ఇన్నేళ్లయినా ఆయన గుర్తుంచుకోవడం ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు నా విషయంలోనూ కేర్ తీసుకున్నారు. అయితే ‘మీ అమ్మలా నువ్వు అమ్మాయకురాలివి కాదు... చాలా స్మార్ట్’ అని నవ్వుతూ అన్నారు. ఆయన ఇంటి నుంచే నాకు ఫుడ్ వచ్చేది. ఈ సినిమా రూపంలో నాకో మంచి ఫ్రెండ్ (చిరంజీవిని ఉద్దేశించి) దొరికారు.
► రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్‌గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో లీడ్‌గా, చెల్లెలి క్యారెక్టర్లు.. ఇలా పలు వేరియేషన్స్ ఉన్నవి చేస్తున్నాను. ఇలా చేయడం అంత ఈజీ కాదు. అయితే ఓ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇలాంటివిæ చేయలేదే అని ఫీల్ కాకూడదు. అందుకే అన్ని రకాల సినిమాలు చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment