Bhola Shankar Movie
-
సాయిపల్లవి రిజక్ట్ చేసిన సినిమాలు ఏవో తెలుసా?.. అన్ని డిజాస్టర్లే!
దక్షిణాది హీరోయిన్లలో నటి సాయిపల్లవిది ప్రత్యేక శైలి. ఈమె స్వతహాగా వైద్యురాలు. నటనంటే ఇష్టంతో సినీ రంగ ప్రవేశం చేశారు. అందుకే పెళ్లిని కూడా వాయిదా వేసి తన చెల్లెలి పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. సాయిపల్లవి కెరీర్లో మరచిపోలేని చిత్రం ప్రేమమ్. ఆ చిత్రం లేకపోతే ఈమె లేరనే చెప్పవచ్చు. సహజత్వానికి ప్రాధాన్యత ఇచ్చే ఈమె మేకప్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. సాయిపల్లవి చేసే పాత్రలు కూడా అలానే ఉంటాయి. అందుకే పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. పాత్రల ఎంపికలో ఆచి తూచి అడుగేస్తారు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఎంత పెద్ద హీరో చిత్రాన్ని అయినా నిరాకరిస్తారు. అలా ఆమె తిరస్కరించిన చాలా చిత్రాలు అపజయం పాలయ్యాయి. ముఖ్యంగా ఇటీవల చిరంజీవితో భోళా శంకర్ చిత్రంలో నటించే అవకాశం రాగా దాన్ని సాయిపల్లవి నిర్భంధంగా తోసి పుచ్చారు. తీరా ఆ చిత్రం విడుదలై బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. అంతకు ముందు కామ్రేడ్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అయితే అందులో ముద్దు సన్నివేశాలు అధికంగా ఉండడంతో అందులో నటించనన్నారట. ఆ తరువాత ఆ పాత్రలో రష్మిక నటించారు. ఆ చిత్రం నిరాశపరచింది. ఇక తమిళంలో అజిత్ సరసన వలిమై చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టినా, పాత్ర నచ్చకపోవడంతో నో చెప్పారు. ఇటీవల నటుడు విజయ్‌కు జంటగా లియో చిత్రంలోనూ నాయకిగా సాయిపల్లవిని నటింపచేసే ప్రయత్నం జరిగింది. అందులోని పాత్రలో నటనకు అవకాశం లేదంటూ వద్దన్నారు. ఆ చిత్రం భారీ వసూళ్లు రాబట్టినా విమర్శలను ఎదుర్కొంది. ఇక చంద్రముఖి–2 నటి కంగనా రనౌత్ పోషించిన పాత్రలో ముందు సాయిపల్లవిని సంప్రదించారు. ఆ కథ నచ్చకపోవడంతో సారీ చెప్పేశారు. ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఇలా సాయిపల్లవి రిజెక్ట్ చేస్తే.. ఇక అంతే అనే ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. కాగా ప్రస్తుతం కమలహాసన్ నిర్మిస్తున్న చిత్రంలో శివకార్తికేయన్ సరసన సాయిపల్లవి నటిస్తున్నారు. -
2023 రౌండప్: బెడిసికొట్టిన రీమేక్.. భారీ డిజాస్టర్ చిత్రాలివే!
ఒకప్పుడు టాలీవుడ్లో రీమేకులు సర్వసాధారణం. ఇతర భాషల్లో రిలీజై సూపర్ హిట్ అయిన చిత్రాలన్నీ తెలుగులో రీమేక్ చేసేవారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, నాగార్జునతో పాటు స్టార్ హీరోలంతా రీమేక్ చిత్రాల్లో నటించిన వారే. వాటిలో చాలా వరకు సూపర్ హిట్‌గా నిలిచాయి కూడా. కానీ ఓటీటీ రాకతో రీమేక్ చిత్రాల పని అయిపోయింది. ఇప్పుడు ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను చూస్తున్నారు. అందుకే ఈ ఏడాది రీమేక్ చిత్రాలు అన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. భారీ నుంచి ఓ మోస్తరు చిత్రాలవరకు అన్ని రీమేకులు డిజాస్టర్స్‌గా నిలిచాయి. బోల్తా పడిన భోళా శంకర్ ఈ ఏడాది విడుదలై డిజాస్టర్ అయిన చిత్రాల్లో భోళా శంకర్ ముందు వరుసలో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అతిపెద్ద డిజాస్టర్ మూవీ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్. అక్కడ అజిత్ ..ఇక్కడ చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళంలో ఈ కథ సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. విడుదలైన మొదటి రోజే ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ వచ్చింది. చిరు కెరీర్లో దారుణమైన సినిమాల్లో భోళా శంకర్ ఒకటిగా నిలిచింది. భారీ నష్టాలు మిగిల్చిన ‘బ్రో’ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘బ్రో’ మూవీ కూడా రీమేక. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వినోదయ సిత్తం చిత్రాన్ని కొద్దిగా మార్పులు చేసి బ్రోగా తెరకెక్కించాడు దర్శకుడు సముద్రఖని. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటన.. తమన్ సంగీతం ..ఏది ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. పవన్ కోసం చేసిన మార్పులు ఈ సినిమాను మరింత దెబ్బతీశాయి. రవితేజ ఖాతాలో మరో డిజాస్టర్‌గా ‘రావణాసుర’ పైకి చెప్పనప్పటికీ రావణాసుర కూడా రీమేక్ చిత్రమే. ‘విన్సీ డా’అనే బెంగాలీ మూవీకి రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ సినిమాలోని మెయిన్ పాయింట్‌ని మాత్రమే తీసుకొని కమర్షియల్ ఫార్మాట్లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. తొలిసారి రవితేజ నెగెటివ్ షేడ్స్‌లో కనిపించిన చిత్రమిది. భారీ అంచనాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన డిజాస్టర్‌గా నిలిచింది. కృష్ణవంశీ ఆశలపై నీళ్లు చల్లిన ‘రంగమార్తాండ’ చాలా కాలం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మరాఠీ లో క్లాసిక్ అనిపించుకున్న ‘నటసామ్రాట్’కి తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు అయితే వచ్చాయి కానీ.. బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా పడింది. కథ, కథనం, మేకింగ్ పరంగా ఆకట్టుకున్నప్పటికీ ప్రస్తుత ట్రెండ్‌కి విరుద్ధంగా ఈ చిత్రం ఉండడంతో ప్రేక్షకులు తిరస్కరించారు. ఆకట్టుకోలేకపోయిన ‘హంట్’ ఈ ఏడాది సుధీర్ బాబు చేసిన మరో ప్రయోగం హంట్. పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ముంబై పోలీస్' అనే మలయాళ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. మంచి కాన్సెప్ట్ ఉన్నప్పటికీ.. ప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం.. మక్కీకి మక్కీ తెరకెక్కించడం కారణంగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది. ఇవి మాత్రమే కాదు ఫిబ్రవరిలో విడుదలైన బుట్టబొమ్మ(మలయాళ మూవీ ‘కప్పేలా’ తెలుగు రీమేక్), నవంబర్‌లో రిలీజైన కోట బొమ్మాళి పీఎస్(మలయాళ సూపర్ హిట్ ‘నాయట్టు’ తెలుగు రీమేక్) చిత్రాలు కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. -
భగవంత్ కేసరి కలెక్షన్స్: చిరంజీవి డిజాస్టర్ మూవీని దాటలేకపోయిన బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భగవంత్ కేసరి. అందాల చందమామ కాజల్ హీరోయిన్గా నటించింది. కుర్ర హీరోయిన్ శ్రీలీల.. బాలకృష్ణ కూతురి పాత్రను పోషించింది. దర్శకుడు అనిల్ రావిపూడి.. కామెడీ జానర్‌ను వదిలేసి ఎమోషనల్ కంటెంట్‌ను ఎంచుకున్నాడు. బాలయ్యను సరికొత్తగా తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీకి తమన్ సంగీతం అందించాడు. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీ తొలి రోజు వసూళ్ల సంఖ్యను నిర్మాణ సంస్థ బయటపెట్టింది. భగవంత్ కేసరి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.32.33 కోట్లు రాబట్టిందని వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అయితే భగవంత్ కేసరి బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే చప్పుడు చేశాడు.. కానీ మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ మొదటి రోజు కలెక్షన్స్‌ను మాత్రం బ్రేక్ చేయలేకపోయాడు. భోళా శంకర్ మొదటి రోజు రూ.33 కోట్లు రాబట్టగా భగవంత్ కేసరి మాత్రం రూ.32.33 కోట్ల దాకా వచ్చి అడుగు దూరంలో ఆగిపోయింది. హిట్ టాక్ ఉన్న భగవంత్ కేసరి.. డిజాస్టర్‌గా నిలిచిన భోళా శంకర్ వసూళ్లను బ్రేక్ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. భగవంత్ కేసరి విస్ఫోటనం🔥#BhagavanthKesari Grosses 32.33 Crores Worldwide on DAY 1 & emerges as a DASARA WINNER💥 - https://t.co/rrWPhVwU6B Enjoy #BlockbusterDawath in cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @sahugarapati7… pic.twitter.com/C8i2VTpeb5 — Shine Screens (@Shine_Screens) October 20, 2023 ....No caption needed #BhagavanthKesari #BholaaShankar pic.twitter.com/vTmX727xfn — KriShNaᴮᴼˢs (@Ramyaholic) October 20, 2023 చదవండి: ‘భగవంత్ కేసరి’ మూవీ రివ్యూ -
ఖరీదైన తప్పులు చేశాం.. 'భోళా శంకర్' నిర్మాత షాకింగ్ ట్వీట్
సినిమాలన్నాక హిట్, ఫ్లాప్ సాధారణ విషయం. ఈ రోజు ఫెయిల్ అయిన హీరో.. మరో సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వొచ్చు. దర్శకులు, నిర్మాతల విషయంలో ఇలానే జరగొచ్చు. అయితే ఈ ఏడాది నిర్మాత అనిల్ సుంకర మాత్రం స్టార్ హీరోల సినిమాల దెబ్బకు చాలా దారుణమైన నష్టాల్ని చూశారు. ఇక ఆయన తీస్తున్న మరో సినిమా ఉందా? లేదా? అనే రూమర్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈ ప్రొడ్యూసర్ షాకింగ్ ట్వీట్ చేశారు. నిర్మాత అనిల్ సుంకర.. ఈ ఏడాది పలు సినిమాలు రిలీజ్ చేశారు. అయితే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన తీసిన ఏజెంట్, భోళా శంకర్ చిత్రాలు ఈయనకు చాలా నష్టాన్ని మిగిల్చాయి. వీటి నుంచి కోలుకోవడానికి మరికొన్నాళ్ల సమయం పడుతుంది. ఇలాంటి టైంలో ఈయన నిర్మిస్తున్న 'ఊరు పేరు భైరవకోన' మూవీ ఆగిపోయిందనే రూమర్స్ వచ్చాయి. వీటిపై స్పందిస్తూ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు. (ఇదీ చదవండి: హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' రతిక) 'మేం ఖరీదైన తప్పులు చేశాం. అవి రిపీట్ కాకూడదని ప్రయత్నిస్తున్నాయి. అలానే సినిమాకు వీఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసం కావాల్సిన సమయం కేటాయిస్తున్నాం. ఇక వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తి కాగానే 'ఊరుపేరు భైరవకోన' రిలీజ్ డేట్ ప్రకటిస్తాం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని పూర్తి నమ్మకం ఉంది. రెండో పాట త్వరలో రిలీజ్ చేస్తాం' అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో భాగంగా ఖరీదైన తప్పులు అన్నది ఏజెంట్, భోళా శంకర్ గురించే. ఇకపోతే సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'ఊరుపేరు భైరవకోన' చిత్రం.. 2021 సెప్టెంబరులో లాంచ్ అయింది. ఓ ఎనిమిది నెలల ముందు పాట.. ఐదు నెలల క్రితం టీజర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. అందుకే ఈ సినిమా ఆగిపోయిందా అనే రూమర్స్ వచ్చాయి. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) We made some costly mistakes and trying not to repeat any more. Quality of VFX is always proportional to the time we can give. And for a movie like #OoruPeruBhairavakona , we want to announce the date as soon as VFX is complete. We are confident that the movie will reach the high… https://t.co/6f3Ui32u5T — Anil Sunkara (@AnilSunkara1) October 15, 2023 -
ఓటీటీలో రామబాణం, భోళా శంకర్.. ఏ సినిమాకు ఎక్కువ క్రేజ్ అంటే?
గోపీచంద్ రామబాణం గురి తప్పింది. చిరంజీవి భోళా శంకర్.. డీలా పడింది. రెండూ ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్న సినిమాలే! కనీస వసూళ్లు సాధించేందుకు ముప్పుతిప్పలు పడ్డ చిత్రాలే! థియేటర్లో కలెక్షన్స్ రాబట్టడం అయ్యే పనిలా లేదని ఓటీటీని ఆశ్రయించాయి. కనీసం ఇక్కడి ప్రేక్షకులైనా వన్ టైమ్ వాచ్ చేస్తారేమోనని! ఈసారైనా గురి కుదిరిందా? అనుకున్నది జరిగిందా? అంటే అవును, కాదు అని రెండు సమాధానాలు వినిపిస్తాయి. అదెలా అనుకుంటున్నారా? రామబాణం సినిమా ఓటీటీలో సక్సెస్ అయింది. తెలుగు, సౌత్, బాలీవుడ్ సినిమాలను వెనక్కు నెడుతూ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. మరి భోళా శంకర్ అంటారా? కనీసం టాప్ 10 చిత్రాల్లో కూడా చోటు దక్కించుకోలేదు. ఇది మెగా ఫ్యాన్స్‌ను ఎంతగానో నిరాశకు గురి చేస్తోంది. థియేటర్లలోనే అనుకుంటే ఓటీటీలోనూ భోళా శంకర్‌కు కనీస ఆదరణ లేకుండా పోయిందని ఫీల్ అయ్యారు. మరోపక్క రామబాణం ఇంతలా దూసుకుపోతుండటంతో గోపీచంద్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే ఇది నిన్నటి లెక్క. నేడు భోళా శంకర్ తొలి స్థానంలోకి రాకెట్లా దూసుకొచ్చింది. నిన్నటివరకు టాప్ 10లో కూడా లేని చిరు మూవీ నేడు ఏకంగా టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. రామబాణం రెండో స్థానంలో ఉంది. భోళా శంకర్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళా శంకర్. తమిళ హిట్ మూవీ వేదాళం చిత్రానికి ఇది రీమేక్‌గా తెరకెక్కింది. తమన్నా, కీర్తి సురేశ్ ముఖ్య పాత్రలు పోషించగా మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. దీంతో నెలరోజులకే ఓటీటీ బాట పట్టింది. సెప్టెంబర్ 15 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రామబాణం విషయానికి వస్తే.. గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం వంటి హిట్స్ తర్వాత గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా సెప్టెంబర్ 14న ఓటీటీలోకి వచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ఐదు రోజులుగా ఇబ్బందిపడుతున్న అనసూయ, ఈ బూతులేంటి అంటూ ట్వీట్ -
'భోళా శంకర్' దెబ్బతో రూట్ మార్చిన మెహర్ రమేష్
మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమా తీసిన మెహర్ రమేష్ ఈ మధ్య భారీగా ట్రోలింగ్‌కు గురయ్యాడు. దీనికి ప్రధాన కారణం భోళా శంకర్ డిజాస్టర్ కావడమే.. మెహర్ రమేష్‌తో సినిమా అనగానే మొదట్లో మెగా ఫ్యాన్స్ బెంబేలెత్తిపోయారు. వాళ్లు అనుకున్న అంచనాల ప్రకారమే సినిమా తీసి చిరంజీవి కెరియర్లోనే దారుణమైన డిజాస్టర్‌ను మిగిల్చాడు. శక్తి, షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసి ఏడెనిమిదేళ్లుగా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న దర్శకుడికి చిరంజీవి అవకాశం ఇవ్వడమేంటనే అందరిలోనూ ఈ ప్రశ్న కలిగింది. కానీ ఇవన్నీ పక్కనబెట్టి చిరంజీవి లాంటి స్టార్ హీరో అవకాశం ఇస్తే.. పరమ చెత్తగా సినిమా తీశాడనే అపవాదును మెహర్ రమేష్ తెచ్చుకున్నాడు. (ఇదీ చదవండి: సినిమా ప్రకటించిన హర్షసాయి.. నిర్మాతగా బిగ్‌బాస్ బ్యూటీ) భోళా శంకర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మెహర్ రమేష్ కెరీర్ పతనమేనని... ఇక ఇండస్ట్రీలో తేరుకునే అవకాశమే లేదని వార్తలు కూడా వచ్చాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఒక బ్యానర్ నుంచి మెహర్ రమేష్‌కు ఆఫర్ వచ్చిందట.. తక్కువ బడ్జెట్లో ఒక మూవీ నిర్మించాలని కోరిందట. అది కూడా సుమారు రూ. 5 కోట్లలోపు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని కండీషన్ పెట్టిందట. (ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడితో సాయి పల్లవి.. లైన్ క్లియర్) దీంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. కొత్త వారితో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టి మళ్లీ టాలీవుడ్ రేసులో నిలబడాలని పట్టుదలతో ఉన్నారట. భారీ బడ్జెట్లతో సినిమాలు తీసే ఆయన ఇలా తక్కవు ఖర్చుతో సినిమాను తీసేందుకు రూట్ మార్చినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలో సినిమా ప్రకటన ఉంటుందని ఇండస్ట్రీలో టాక్. -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 30 సినిమాలు
ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసేందుకు రెడీ అయిపోయింది. వినాయక చవితి సందర్భంగా ఈ శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్‌కు తొలుత ప్లాన్ చేశారు. అవన్నీ సైడ్ అయిపోవడంతో ఈసారి చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. దీంతో సినీ ప్రేమికుల దృష్టి ఓటీటీలపై పడింది. ఇప్పుడు వీళ్ల కోసమా అన్నట్లు ఏకంగా 30 వరకు కొత్త సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్కి రెడీగా ఉన్నాయి. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' 10వరోజు హైలైట్స్.. వాళ్లని నిద్ర పోనీయకుండా చేశాడు!) సోమవారం ఓటీటీ లిస్టు అనుకున్నప్పుడు 32 వరకు ఉన్నాయి. కానీ వాటిలో కొన్ని సినిమాలు ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేయగా, మరికొన్ని కొత్తగా వచ్చి చేరాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ వీకెండ్ కోసం.. భోళా శంకర్, MY3, రామబాణం, మాయపేటిక, హాస్టలు హుడుగురు బేకాగిద్దరే లాంటి మూవీస్ ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏయే సినిమాలు ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ అమెజాన్ ప్రైమ్ డిజిటల్ విలేజ్ - మలయాళ సినిమా సుబేదార్ - మరాఠీ చిత్రం మిలియన్ మైల్స్ ఎవే - ఇంగ్లీష్ మూవీ వైల్డర్నెస్ - ఇంగ్లీష్ సిరీస్ అనీతి - తెలుగు డబ్బింగ్ మూవీ ద ఫెర్రాగ్నెజ్: సన్రేమో స్పెషల్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) బంబై మేరీ జాన్ - హిందీ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతోంది) హాట్‌స్టార్ Myత్రీ - తెలుగు డబ్బింగ్ సినిమా కాలా - హిందీ సిరీస్ ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ - ఇంగ్లీష్ సినిమా ద అదర్ బ్లాక్ గర్ల్ - ఇంగ్లీష్ సిరీస్ ఆహా మాయపేటిక - తెలుగు సినిమా నెట్‌ఫ్లిక్స్ భోళా శంకర్ - తెలుగు చిత్రం ఎల్ కొండే - స్పానిష్ మూవీ ఇన్సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 - ఇంగ్లీష్ సిరీస్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ - ఇంగ్లీష్ సినిమా మిస్ ఎడ్యుకేషన్ - ఇంగ్లీష్ సిరీస్ సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 - ఇంగ్లీష్ సిరీస్ ద క్లబ్: పార్ట్ 2 - టర్కిష్ సిరీస్ డైరీస్ సీజన్ 2: పార్ట్ 1 - ఇటాలియన్ సిరీస్ (స్ట్రీమింగ్) థర్స్ డేస్ విడోస్ - స్పానిస్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్) ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ - డానిష్ సినిమా (స్ట్రీమింగ్ అవుతోంది) వన్స్ అపాన్ ఏ క్రైమ్ - జపనీస్ మూవీ (ఇప్పటికే స్ట్రీమింగ్) రామబాణం - తెలుగు సినిమా (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: అతిపెద్ద సినిమా స్క్రీన్.. ప్రత్యేకతలు తెలిస్తే మైండ్ పోద్ది!) జీ5 హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే - కన్నడ సినిమా సోనీ లివ్ జర్నీ ఆఫ్ లవ్ 18+ - మలయాళ చిత్రం బుక్ మై షో ఏ హనీమూన్ టూ రిమెంబర్ - ఇంగ్లీష్ చిత్రం మోర్టల్ కంబాట్ లెజెండ్స్: కేజ్ మ్యాచ్ - ఇంగ్లీష్ సినిమా ఈ-విన్ దిల్ సే - తెలుగు సినిమా (సెప్టెంబరు 16) సైనా ప్లే పప్పచన్ ఒలివిలాన్ - మలయాళ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్) (ఇదీ చదవండి: బెండు తీసిన 'బిగ్‌బాస్'.. హౌసులో దొంగతనానికి స్కెచ్!) -
OTT Releases: భోళాశంకర్, రామబాణం సహా బోలెడన్ని చిత్రాలు..
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద సినిమాలు సైతం రిలీజైన నెలలోపే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఈ వారంలో మిమ్మల్ని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఈ వారంలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి. మెగాస్టార్ భోళాశంకర్ మెగాస్టార్ భోళాశంకర్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించగా... తమన్నా హీరోయిన్గా నటించింది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుుకుంది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ సెప్టెంబర్ 15 నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గోపీచంద్ రామబాణం గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో.. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు పోషించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతంగా మెప్పించలేకపోయింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ చిత్రం సెప్టెంబరు 14వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. మాయపేటిక విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, పాయల్ రాజ్‌పుత్‌లు నటించిన చిత్రం మాయపేటిక. ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మొబైల్ ఫోన్ వల్ల చెడు, మంచి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. అనీతి వసంతబాలన్ దర్శకత్వం వహించిన తమిళ రొమాంటిక్ మూవీ అనేతి. ఈ చిత్రంలో అర్జున్ దాస్, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హౌస్ కీపర్‌తో ప్రేమలో పడే ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రేమకథను తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు యువకుల డిజిటల్ విలేజ్ ఫహద్ నందు, ఉల్సవ్ రాజీవ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం డిజిటల్ విలేజ్. ఇందులో హృషికేష్, ఇందిర, ఎంసీ మోహనన్, సురేష్ బాబు కన్నోమ్ నటించారు. తమ గ్రామంలోని ప్రజలకు డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ముగ్గురు స్నేహితుల స్టోరీనే కథాంశంగా చూపించారు. ఈ సినిమా ఈనెల 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. జర్నీ ఆఫ్ లవ్ 18+ నాస్లెన్ గఫూర్, మీనాక్షి దినేష్, మాథ్యూ థామస్, నిఖిలా విమల్ నటించిన మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్ . అరుణ్ డి జోస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ హేలీ లు రిచర్డ్సన్, బెన్ హార్డీ, రాబ్ డెలానీ, సాలీ ఫిలిప్స్, జమీలా నటించిన చిత్రం లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దీనికి వెనెస్సా కాస్విల్ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటికి డ్రామాను ఓ విమానంలో చిగురించిన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ మూవీ ఈ నెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈనెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్ చిత్రాలు వైఫ్ లైక్- నెట్‌ఫ్లిక్స్- 11 సెప్టెంబర్ 2023 ఎలిమెంటల్- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్- 13 సెప్టెంబర్ 2023 ఎ మిలియన్ మైల్స్ అవే- అమెజాన్ ప్రైమ్ వీడియో- 15 సెప్టెంబర్ 2023 -
యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!
తెలుగు ప్రేక్షకులు కామెడీని ఎక్కువగా ఆదరిస్తారు. అది సినిమా అయినా, టీవీ ప్రోగ్రామ్ అయినా బాగుంటే కచ్చితంగా చూసేస్తారు. అయితే ఒకప్పుడు బాగా గుర్తింపు తెచ్చుకున్న 'జబర్దస్త్'కి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోయింది. ప్రోమాలు తప్పితే షో ఎవరూ చూడట్లేదనిపిస్తుంది. సరే అది పక్కనబెడితే ఇప్పుడు అదే షోలో యాంకర్ రష్మీని ఓ కమెడియన్ సరదాగా ట్రోల్ చేశాడు. 20 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన రష్మీ.. ఒకటి రెండు సినిమాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేసింది. ఎప్పుడైతే యాంకర్ అయిందో ఆమె ఫేట్ మారిపోయింది. హీరోయిన్గా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్ల క్రితం పలు మూవీస్ చేసింది గానీ ఇప్పుడు కేవలం షోల్లో మాత్రమే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!) తాజాగా రిలీజైన ఓ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. రష్మీని చూసేందుకని 'భోళా శంకర్' సినిమాకు వెళ్లానని.. కానీ కర్చీఫ్ పడిపోయిందని దాన్ని తీసుకునేలోపు రష్మీ యాక్ట్ చేసిన సీన్ వచ్చి వెళ్లిపోయిందని అన్నాడు. అయితే భాస్కర్ టీజ్ చేసినా సరే.. ఇది సరదాగా కావడంతో రష్మీ.. లైట్ తీసుకుంది. ఏదేమైనా సరే నవ్వుతూనే రష్మీ పరువు తీసేశాడు బుల్లెట్ భాస్కర్. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఫ్లాప్ టాక్ బయటకొచ్చింది. ఇందులో చిరు ఎంట్రీ సాంగ్ లో రష్మీ.. కాసేపు కనిపిస్తుంది. అలానే శ్రీముఖితోనూ చిరు... 'ఖుషి' నడుము సీన్ చేయడంపై అప్పట్లోనే ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా సెప్టెంబరు 15 నుంచి 'భోళా శంకర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు
సోమవారం వస్తే చాలు ఆఫీస్, స్కూల్, కాలేజీలకు వెళ్లేవాళ్లు.. అబ్బ సోమవారం అప్పుడే వచ్చేసిందా అని ఫీలవుతారు. మూవీ లవర్స్ మాత్రం ఈ వారం ఏమేం కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ఏం చూడాలి అని తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. అయితే థియేటర్లో ఈ వారం 'మార్క్ ఆంటోని', 'చాంగురే బంగారురాజ' తప్ప వేరే చిత్రాలు ఏం రిలీజ్ కావట్లేదు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' ఏడోరోజు హైలైట్స్.. హౌసులో ఫస్ట్ ఎలిమినేషన్.. షకీలా కన్నీళ్లు) మరోవైపు ఈ వారం ఓటీటీలో మాత్రం 30కి పైగా సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటిలో భోళా శంకర్, రామబాణం, అనీతి, మాయపేటిక, బార్బీ సినిమాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. మరోవైపు 'కాలా', 'బంబై మేరీ జాన్' వెబ్ సిరీస్‌లు కూడా చూడాలనే ఇంట్రెస్ట్ రేపుతున్నాయి. ఇంతకీ ఈ వీక్ ఏయే మూవీస్.. ఏయే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం. ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ (సెప్టెంబరు 11- సెప్టెంబరు 17) నెట్‌ఫ్లిక్స్ వైఫ్ లైక్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 11 క్లాస్ యాక్ట్ (ఫ్రెంచ్ సిరీస్) - సెప్టెంబరు 13 రెజ్లర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13 ఎరంగార్డ్: ద ఆర్ట్ ఆఫ్ సెడక్సన్ (డానిష్ సినిమా) - సెప్టెంబరు 14 వన్స్ అపాన్ ఏ క్రైమ్ (జపనీస్ మూవీ) - సెప్టెంబరు 14 రామబాణం (తెలుగు సినిమా) - సెప్టెంబరు 14 భోళా శంకర్ (తెలుగు చిత్రం) - సెప్టెంబరు 15 ఎల్ కొండే (స్పానిష్ మూవీ) - సెప్టెంబరు 15 ఇన్సైడ్ ద వరల్డ్స్ టఫస్టె ప్రిజన్స్: సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 లవ్ ఎట్ ఫస్ట్ సైట్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 15 మిస్ ఎడ్యుకేషన్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 సర్వైవింగ్ సమ్మర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 ద క్లబ్: పార్ట్ 2 (టర్కిష్ సిరీస్) - సెప్టెంబరు 15 అమెజాన్ ప్రైమ్ కెల్సీ (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 12 ద కిడ్నాపింగ్ డే (కొరియన్ సిరీస్) - సెప్టెంబరు 13 బంబై మేరీ జాన్ (హిందీ సిరీస్) - సెప్టెంబరు 14 ఏ మిలియన్ మైల్స్ ఎవే (ఇంగ్లీష్ మూవీ) - సెప్టెంబరు 15 వైల్డర్నెస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 అనీతి (తెలుగు డబ్బింగ్ మూవీ) - సెప్టెంబరు 15 ఆహా మాయపేటిక (తెలుగు సినిమా) - సెప్టెంబరు 15 హాట్‌స్టార్ ఎనిమల్స్ అప్ క్లోజ్ విత్ బెర్టీ గ్రెగోరి (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13 ఎలిమెంటల్ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 13 హ్యాన్ రివర్ పోలీస్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 13 వెల్కమ్ టూ ద రెక్సామ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - సెప్టెంబరు 13 కాలా (హిందీ సిరీస్) - సెప్టెంబరు 15 ల్యాంగ్ ల్యాంగ్ ప్లేస్ డిస్నీ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 15 ద అదర్ బ్లాక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - సెప్టెంబరు 15 సోనీ లివ్ జర్నీ ఆఫ్ లవ్ 18+ (మలయాళ చిత్రం) - సెప్టెంబరు 15 బుక్ మై షో బార్బీ (ఇంగ్లీష్ సినిమా) - సెప్టెంబరు 12 ఏ హనీమూన్ టూ రిమెంబర్ (ఇంగ్లీష్ చిత్రం) - సెప్టెంబరు 15 సైనా ప్లే పప్పచన్ ఒలివిలాన్ (మలయాళ మూవీ) - సెప్టెంబరు 14 ఈ-విన్ దిల్ సే (తెలుగు సినిమా) - సెప్టెంబరు 16 (ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్‌కి పెళ్లిపై ఇంట్రెస్ట్.. అలాంటోడే కావాలని!) -
భోళా శంకర్ ఓటీటీ డేట్ వచ్చేసింది.. అప్పటి నుంచే స్ట్రీమింగ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళా శంకర్. కోలీవుడ్ స్టార్ అజిత్ వేదాళం సినిమాకు ఇది రీమేక్ అన్న సంగతి తెలిసిందే! ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటించగా కీర్తి సురేశ్ చిరు చెల్లెలిగా నటించింది. మెగా మూవీపై అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ సినిమా మాత్రం చాలా పేలవమైన కలెక్షన్స్ రాబట్టింది. ఆగస్టు 11న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. మెగాస్టార్‌కు ఫ్లాప్ ఇచ్చినందుకు డైరెక్టర్ మెహర్ రమేశ్‌ను నెటిజన్లు ఓ రేంజ్లో ఆడేసుకున్నారు. భోళా శంకర్‌కు వచ్చిన నెగెటివ్ టాక్ వల్ల చాలామంది ఈ సినిమావైపు కన్నెత్తి చూడలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఓటీటీలో ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ డిజిట్ హక్కులు సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 15 నుంచి భోళాశంకర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. థియేటర్లలో ఈ సినిమా చూడటం మిస్ అయినవాళ్లు ఓటీటీలో ఓసారి పట్టు పట్టేయండి.. #BholaShankar ( Hindi ) Coming to Netflix on 15th September...#BholaShankarOnNetflix pic.twitter.com/YP8QmF6KJC — The South Movies (@TheSouthMovies1) September 10, 2023 చదవండి: సినిమా క్రేజే వేరప్పా.. కానీ డబుల్ మీనింగ్ డైలాగులు, సభ్యత లైన్ చెరిపేయడం.. ఓటీటీలో అయితే.. -
'భోళా శంకర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజేనా!?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మూవీ గురించి మరోసారి మాట్లాడుకునే టైం వచ్చింది. గత నెల అంటే ఆగస్టు 11న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. విడుదలకు ముందు.. చిరు వల్ల ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బిగ్ స్క్రీన్‌పై ఇది ఘోరమైన ఫలితం అందుకుంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: విజయ్-రష్మిక.. ఒకే ఇంట్లో కలిసుంటున్నారా!?) ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే స్ట్రెయిట్ మూవీతో హిట్ కొట్టిన చిరంజీవి.. అదే ఊపుతో 'భోళా శంకర్' చేశారు. అయితే ఇది 'వేదాళం' అనే తమిళ మూవీకి రీమేక్. దీంతో రిలీజ్ కి చాన్నాళ్ల ముందు నుంచే విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కానీ టీమ్ అంతా నమ్మకంగా ఉండేసరికి హిట్ కొట్టచ్చేమో అని అందరూ అనుకున్నారు. కానీ పలువురు నెటిజన్స్ అనుకున్నట్లే 'భోళా శంకర్' ఫ్లాప్ అయింది. రిలీజ్ అయిన రెండో రోజుకే అందరూ ఈ సినిమా గురించి మెల్లగా మర్చిపోయారు. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర డిజిటల్ హక్కులు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ముందు అనుకున్న తేదీలో కాస్త మార్పు చేసి సెప్టెంబరు 15నే స్ట్రీమింగ్‌లోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. (ఇదీ చదవండి: అందుకే ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు: తెలుగు నటి) -
మెగాస్టార్ చిరంజీవి వాచ్ ధర ఎంతో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి ఇంట రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కొణిదెల ఆడపడుచులు మెగా బ్రదర్స్‌కి రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. టాలీవుడ్ ఎంతో మంది స్టార్స్ రాఖీ పండుగ సెలబ్రెట్ చేసుకుంటారు. కానీ చిరంజీవి ప్రతి సంవత్సరం చెల్లెల్లతో చేసుకునే రాఖీ పండుగను ఆయన అభిమానులుచూడాలని కోరుకుంటారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా ఆయన షేర్ చేస్తూ వస్తుంటారు కూడా. మెగాస్టార్ తండ్రి వెంకటరావు, మామ అల్లు రామలింగయ్య ఫోటోలను పూజ గదిలో ఉంచి దేవుళ్లతో సమానంగా ఆయన పూజిస్తున్నారంటూ పలువురు నెటిజన్లు ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: 'జైలర్'కు భారీగా లాభాలు.. రజనీకి మరో చెక్ ఇచ్చిన నిర్మాత.. ఎంతో తెలుసా?) ఆ ఫోటోలతో పాటు చిరు చేతికి ఉన్న వాచ్ కూడా ఇప్పుడు వైరల్ అయింది. ఆయన చేతికి ఉన్న వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్, సహజంగా దాని ధర కూడా భారీగానే ఉంటుంది. దీంతో ఆయన అభిమానులు ఆ వాచ్ ధర ఎంతో తెలుసుకోవాలని ఆన్లైన్లో సర్చ్ చేశారు. దాని ధర రూ. 2.35 లక్షల డాలర్లు అని ఉంది. అదే ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు రూ. 2 కోట్లు. ఆ వాచ్ ధర చూసిన వారందరూ నోరెళ్లబెట్టారు. తనకు కార్ల కంటే కొత్త కొత్త వాచీలు కొనడం అంటేనే ఇష్టం అని ఓ ఇంటర్వ్యూలో చిరు చెప్పిన విషయం తెలిసిందే. అందుకే ఆయన వద్ద భారీగానే వాచ్ కలెక్షన్స్ ఉన్న విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: సర్ప్రైజ్ న్యూస్.. మరో పాన్ ఇండియా సినిమాలో అనుష్క.. గ్లింప్స్ విడుదల) ఎవరి గురించి అయినా ఇలాంటి విషయాలు వైరల్ అయినప్పుడు పలురకాల కామెంట్లు చేయడం సహజం.. కానీ చిరంజీవికి ఈ సంపద ఒక్కరోజులో వచ్చింది కాదు.. కష్టపడి ఒక్కోమెట్టు ఎక్కుతూ సంపాధించుకున్నారు. దీంతో ముచ్చటపడి కొనుకుంటే తప్పేంటని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, మహేశ్ బాబు ఇలా ఎందరో సెలబ్రిటీలు ధరించిన వస్తువుల ధరలపై పలు వార్తలు అప్పడప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య సినీ, వ్యాపార సెలబ్రిటీలు ధరించే వస్తువుల మీద నెటిజన్లు కూడా ఒక లుక్ వేస్తూ.. వాటి ధరలు తెలుసుకుందామనే ఆసక్తి కూడా ఎక్కవేనని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మధ్యే మోకాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఆయన.. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని, కొత్త ప్రాజెక్ట్స్ పెట్టే ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో థియేటర్లలోకి వచ్చిన చిరు.. కెరీర్లోనే ఘోరమైన డిజాస్టర్‌ని అందుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీ వల్ల మెగాస్టార్ చిరు.. తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. చిరంజీవిని కంప్లీట్ యాక్టర్ అనొచ్చు. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా ఆయన సినిమాలు చేస్తున్నారు. హిట్, బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాటే ఫ్లాప్స్‌ని కూడా చూశారు. అయితే అప్పట్లో అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి జనాలకు పెద్దగా తెలిసేది కాదు. కానీ 'ఆచార్య', 'భోళా శంకర్' చిత్రాలు మాత్రం ఫ్లాప్ కావడంతో పాటు విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యాయి. (ఇదీ చదవండి: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న విజయ్ కొడుకు.. సినిమా కన్ఫర్మ్) రీఎంట్రీలో తప్పటడుగులు వేస్తున్న చిరు.. 'ఖైదీ నం.150', 'గాడ్ ఫాదర్', 'భోళా శంకర్' రీమేక్స్‌లో నటించారు. కానీ వాటి ఫలితం ఏంటనేది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా రీమేక్స్ దెబ్బకొడుతున్నా సరే.. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బ్రో డాడీ' రీమేక్ చేయబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే ఇప్పటివరకు లేదు. అయితే 'భోళా శంకర్' రిజల్ట్ చిరుని ఆలోచనలో పడేసిందట. దీంతో ఇకపై రీమేక్స్ చేయకూడదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఓ నిర్మాత.. మలయాళ చిత్ర రీమేక్స్ రైట్స్ పట్టుకుని మెగాస్టార్‌కి దగ్గరకి వెళ్తే.. సున్నితంగా నో చెప్పేశారట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే కాస్త లేట్ అయినా సరే చిరు.. స్ట్రెయిట్ సినిమాలే చేస్తారనమాట. (ఇదీ చదవండి: కేఏ పాల్ని కలిసిన నవీన్ పొలిశెట్టి.. ఏం మాట్లాడారు?) -
సినిమా ఫ్లాప్ అయితే తప్పు ఫ్యాన్స్‌దా? ఇదెక్కడి లాజిక్!
'భోళా శంకర్' సినిమా బాగోలేదు. మొదటిరోజే అందరికీ సీన్ అర్థమైపోయింది. దీంతో ఆ మూవీని పట్టించుకోవడం మానేశారు. ఆల్రెడీ చాలామంది మర్చిపోయారు కూడా. మళ్లీ ఆ సినిమా ఇప్పుడు చర్చల్లో నిలిచింది. దీనికి కారణం నిర్మాత ఎస్కేఎన్. తాజాగా చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఈయన.. 'భోళా' ఫ్లాప్ అవ్వడానికి ఫ్యాన్సే కారణమనే వింత లాజిక్ చెప్పారు. దీంతో ఇది కాస్త మెగాఫ్యాన్స్ మధ్యే డిస్కషన్‌కి కారణమైంది. (ఇదీ చదవండి: 'జైలర్' ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే!) అభిమానం ఉండొచ్చు గానీ అది సదరు హీరో కొంపముంచేలా ఉండకూడదు. ఎస్కేఎన్.. చిరంజీవికి వీరాభిమాని. గతంలో చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. అయినా చిరుకి అభిమాని కానివాళ్లు ఎవరుంటారు చెప్పండి. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలతో అలరిస్తున్నారు. అయితే చేదుగా అనిపించినా సరే కొన్నిసార్లు నిజాలు ఒప్పుకోవాలి. ఎస్కేఎన్ అదే చేయలేదు. ''భోళా శంకర్'లో చిరంజీవి చాలా అందంగా కనిపించారు. కేవలం సోషల్ మీడియాలో ఓ గ్రూప్ ట్రాప్‌లో పడి స్వయంగా ఫ్యాన్సే దాన్ని డిజాస్టర్ చేసుకున్నారు' అని చెప్పడం చాలామందికి విడ్డూరంగా అనిపించింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే.. సినిమా బాగుంటే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. చిరు అందంగా కనిపించారు కాబట్టి హిట్ అవ్వాలని ఎస్కేఎన్ అనుకోవడం మాత్రం వెరైటీగా అనిపించింది. పోనీ ఆయన చెప్పిన థియరీ ప్రకారం మహేశ్ 'బ్రహ్మోత్సవం', పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' కూడా సూపర్‌హిట్ కావాలి కదా! కానీ ఎందుకు సక్సెస్ కాలేదు అంటే కారణం కంటెంట్. సినిమా కరెక్ట్‌గా తీస్తే.. చిన్న హీరో పెద్ద హీరో అనేది ప్రేక్షకుడు అస్సలు ఆలోచించడు. హిట్ ఏంటి కర్మ బ్లాక్‌బస్టర్ చేసి పడేస్తాడు. వందల కోట్ల వసూళ్లకు తెచ్చిపెడతాడు. (ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!) ఎస్కేఎన్ నిర్మాతగా తీసిన 'బేబి' చిత్రాన్నే తీసుకోండి. అందులో పెద్దగా చెప్పుకోదగ్గ యాక్టర్స్ ఒక్కరు కూడా లేరు. కానీ సినిమా హిట్ అయింది. దానికి కారణం స్టోరీ. ఇకపోతే 'భోళా శంకర్' స్టోరీలోనే బోలెడన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని హుందాగా ఒప్పేసుకొని, చిరంజీవి త్వరలో కమ్ బ్యాక్ ఇస్తారని ఎస్కేఎన్ అని చెప్పుంటే సరిపోయేది. అలా కాకుండా అభిమానులపై తప్పు తోసేయడం మాత్రం చాలామందికి కోపం తెప్పించింది. సినిమాలో నటించే స్టార్ హీరోల దగ్గర నుంచి నిర్మాతల వరకు ఎవరెన్ని కబుర్లు, తీయని మాటలు చెప్పినా అది వందల కోట్లతో నడిచే ఓ వ్యాపారం. అభిమాని అయినా, సాధారణ ప్రేక్షకుడు అయినా సొంత డబ్బులు ఖర్చుపెట్టి టికెట్ కొంటాడు. సినిమా చూస్తాడు. బాగుంటే నలుగురికి చెబుతాడు. బాగోలేకపోతే నలభై మందికి చెబుతాడు. కాబట్టి మెగాస్టార్ సినిమా కదా.. ఎలా ఉన్నా నచ్చేయాలని రూల్ ఏం లేదు. తప్పు ఎక్కడుందనేది ఆలోచించడం మానేసి ఫ్యాన్స్దే తప్పు అనడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్షా? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) -
మెగా ఫ్యాన్స్ వల్లే భోళా శంకర్ ఫ్లాప్.. ఆయనకు తెలుసు!: బేబి నిర్మాత
సినిమా అన్నాక జయాపజయాలు సర్వసాధారణమే! పెద్దగా ప్రచారం లేకపోయినా హిట్ కొట్టేవి కొన్నయితే భారీ అంచనాల మధ్య డిజాస్టర్‌గా నిలిచేవి మరికొన్ని.. హీరోలు ఈ రెండిటింనీ సమానంగా స్వీకరించినా సరే అభిమానులు మాత్రం లైట్ తీసుకునేందుకు ఇష్టపడరు. సక్సెస్ అయితే పూనకంతో, ఫ్లాప్ అయితే ఆగ్రహంతో ఊగిపోతుంటారు. సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా వాళ్లను ఆపడం చాలా కష్టం. ఈ మధ్య చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా విడుదలైంది. బాస్ మూవీ అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. కానీ సినిమా అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సినిమాపై విమర్శలే కనిపించాయి. నేను మీలో ఒకడిని తాజాగా దీనిపై బేబి నిర్మాత, మెగా అభిమాని ఎస్కేన్ స్పందించాడు. ఇండస్ట్రీలో ఏ సినిమా వచ్చినా మొదటి టికెట్ తెగేది మెగా ఫ్యాన్ది మాత్రమే! నా కో- మెగా ఫ్యాన్స్‌ను నేను నమ్మాను.. వాళ్లు నా సినిమాకు ఓపెనింగ్స్ ఇస్తారనే బేబి తీశాను. ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టినా దాని క్రెడిట్ ముందుగా మెగా ఫ్యాన్స్‌కే దక్కుతుంది. నేను మీలో ఒకడిని. బాస్ ఇన్స్పిరేషన్తో ఇక్కడికి వచ్చాను. బాస్ చుట్టూ జరుగుతున్న వివాదం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆడిస్తున్నాడు.. ఓడిస్తున్నాడు మన సినిమా నచ్చితే ఫస్ట్ జై కొట్టేది మనమే.. మన సినిమా ఏదైనా నచ్చకపోయినా మొదట దాన్ని తొక్కేసేది కూడా మనమే.. ఫస్టాఫ్ అలా ఉంది, ఇంటర్వెల్ ఇలా ఉంది, సెకండాఫ్ ఇంకోలా.. అని చెప్పేస్తుంటాం. అలా చేయొద్దు. నాలుగు పదులకే నడవలేని హీరోలు ఉన్న ఇండస్ట్రీలో.. సుమారు ఏడు పదుల వయసు దగ్గర పడుతున్నా మెగాస్టార్ ఆడిస్తున్నాడు.. చాలామందిని ఓడిస్తున్నాడు. అది ఆయన విల్ పవర్. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఆయన మోస్ట్ గ్లామరస్‌గా కనిపించిన సినిమా భోళాశంకర్. దాన్ని కూడా మనం నిలబెట్టుకోలేకపోయామంటే దానికి కారణం మనమే. ఏది చేయాలో బాస్‌కు తెలుసు రీమేక్స్ చేయాలా? ఒరిజినల్ చేయాలా? అనేది బాస్‌కు తెలుసు. ఆయనకు సినిమా అంటే అమ్మకం కాదు నమ్మకం. మోకాలికి ఆపరేషన్ చేయించుకుని కూడా స్టెప్స్ వేస్తున్నారు. మనందరి కోసం కష్టపడుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా బాస్ వెంటే ఉండాలి. మనం ఐకమత్యంతో ఉంటే మనల్ని కొట్టేవాళ్లే లేరు. చాలామంది హిట్లర్ ముందు బాస్ పనైపోయిందన్నారు. ఖైదీ 150 ముందు కూడా అలాగే అన్నారు. అలా జరిగిందా.. లేదు.. ఆయన స్థాయి, స్థానం వేరు. ఆగస్టు 11న ఆయన సినిమాను ఎవరు తొక్కేలాయనుకున్నారో తెలుసు.. మనం మళ్లీ హిట్ కొట్టి చూపిద్దాం' అని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు ఎస్కేఎన్. చదవండి: బర్త్‌డే పార్టీలో డ్యాన్స్ చేసేదాన్ని.. ఆ డబ్బుతో పూట గడిచేది.. -
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ మగధీరుడు ఆయనే!
ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు.. స్థానం వేరు చిరంజీవి సినిమారంగంలో ఒక లెజెండ్. ఆయన తుపాన్‌లా రాలేదు. చిరు జల్లులా వచ్చి తుపాన్‌లా మారాడు. ఆయన 'స్వయంకృషి'తో ఎదిగిన నటుడు. తన యాక్షన్, డ్యాన్స్‌లతో ఎందరిలోనో స్ఫూర్తినింపిన 'ఆచార్యు'డు. ఇండస్ట్రీలో ఎదురైన ప్రతి 'ఛాలెంజ్' లను 'మగధీరుడు' లాగా ఎదుర్కుంటూ 'విజేత'గా నిలిచిన 'మగమహారాజు' . అభిమానుల గుండెల్లో ఆయనొక 'ఖైదీ'. బాక్సాఫీసు వసూళ్ల 'వేట'లో 'ఛాలెంజ్' విసిరితే 'రోషగాడి'లా 'జాతర' చూపించాడు. సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు.. వస్తూనే ఉంటారు కూడా.. అలాంటి వాల్లకు ఒక్కరే స్ఫూర్తి ఆయనే మెగాస్టార్ చిరంజీవి. తాజాగా ఆయనకు పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంగా ప్రత్యేక కథనం. చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయి ఉండవచ్చు. కానీ ఇండస్ట్రీలో చిరంజీవి ఎప్పుడూ ఫెయిల్ అవలేదు. ఇప్పటి తరం ట్విటర్లో ఫ్యాన్ వార్ చేసుకునే వారికి తెలియకపోవచ్చు అప్పట్లో కవర్‌పేజీలో వచ్చే చిరంజీవి ఫోటో కోసం అభిమానుల మధ్య జరిగే వార్ గురించి. ఇప్పడు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకుని తిరిగేవారికి తెలియకపోవచ్చు వాళ్ల హీరోలకు కూడా ఫేవరేట్ హీరో చిరంజీవే అని.. మా హీరో రికార్టులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు ఆ రికార్డులను క్రియేట్ చేసిందే చిరంజీవి అని. ఒక రిక్షా కార్మికుడి నుంచి కలెక్టర్ వరకు.. అప్పుడే సినిమాలు చూడటం మొదలుపెట్టిన 10 ఏళ్ల బుడ్డోడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ల దాక అందరూ ఆయన ఫ్యాన్సే.. నటనలో తనకంటూ ప్రత్యేక శైలి, హాస్యంలో తనకంటూ ఒక ముద్ర..కోట్లాదిమందికి అతనొక ఆరాధ్య నటుడు అయ్యాడు. ఫిబ్రవరి 11, 1978 లో పునాదిరాళ్ళు చిత్రంతో సినీ ప్రస్థానం మెదలుపెట్టిన మెగాస్టార్. పునాదిరాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటగా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదు. తొలి సినిమానే ప్లాప్ అయింది. ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరినీ మెప్పించాడు. తర్వాత బాపు దర్శకత్వంలో 'మన వూరి పాండవులు' సినిమాలో చిరంజీవికి ఒక చిన్న పాత్ర దొరికింది. ఆ సినిమా మంచి విజయం సాధించడంతో పాటు చిరుకు మంచి గుర్తింపు తెచ్చింది. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం మొదలైంది. మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ సినిమా ఇదే మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలతో పాటు విలన్‌గా నటించిన చిరంజీవికి ఒక నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. కానీ 1980 వ దశకం నుంచి ఆయనకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. 1980లో వచ్చిన 'మొగుడు కావాలి' సినిమా చిరంజీవికి మొట్టమొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా రికార్డుకెక్కింది. ఈ సినిమాను తమ్మారెడ్డి భరద్వాజ నిర్మించారు. ఆ సమయం నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. 'చిరంజీవి-ఎన్టీఆర్'కు ప్రత్యేకం ఆ తర్వాత వచ్చిన 'తిరుగులేని మనిషి' చిత్రం తన కెరియర్లో చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. అందులో 'చిరంజీవి-ఎన్టీఆర్' కలిసి నటించిన ఏకైకా సినిమా ఇది. ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తే.. చిరంజీవి ఆయన బావమరిది పాత్రలో మెప్పించారు. ఆ తర్వాత 'ఊరికిచ్చిన మాట' సినిమాతో చిరంజీవికి మాస్ ఇమేజ్ బీజం పడినా.. ఆ తర్వాత 'చట్టానికి కళ్లులేవు' చిత్రంతో పూర్తి మాస్ హీరోగా గుర్తింపు దక్కింది. ఈ సినిమాను తమిళ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు. 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా వచ్చింది. ఇది కూడా సిల్వర్ జూబ్లీ లిస్ట్‌లో చేరింది. ఈ సినిమా తర్వాత దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో కట్నం అనే ఇష్యూ మీది శుభలేఖ అనే సినిమాను తీశారు. ఈ రెండు సినిమాలతో చిరంజీవిని ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఓన్ చేసుకున్నారు. శుభలేఖ సినిమాతో మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును చిరు అందుకున్నారు. ఇలా చిరంజీవి నుంచి వచ్చిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్న సమయంలో అసలు సెన్సేషన్ 1983లో మొదలైంది. ఇండస్ట్రీలో సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసిన చిరు సినిమా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో ఖైదీ సినిమా 1983లో విడుదలైంది. అప్పట్లో కమర్షియల్ సినిమాలకు సరికొత్త అర్థాన్ని క్రియేట్ చేసింది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. విజయవాడ శైలజా థియేటర్లో 80రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో కొనసాగింది ఈ సినిమా.. హైదరాబాద్ శాంతి థియేటర్లో 365 రోజులు ఏకదాటిగా కొనసాగింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి, మాధవిలపై సూపర్ స్టార్ కృష్ణ క్లాప్ కొట్టారు.. ఒక యాక్టర్, స్టార్‌కు మధ్య ఉన్న గీతను చెరిపేసి చిరంజీవిని ఓవర్‌నైట్ సూపర్ స్టార్‌ను చేసింది ఈ సినిమా.. ఇందులోని చిరు లుక్‌నే రామ్‌చరణ్ మొదటి సినిమా చిరుతలో కూడా ఆ షాడో ఉండేలా చూపించాడు పూరి. ఇంతలా మెగస్టార్ జీవితంలో ఖైదీ సినిమా పాత్ర ఉంది. అక్కడి నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతుండగా 2007లో శంకర్ దాదా జిందాబాద్‌తో సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి ఎంట్రీ 2008 ఆగష్టు 26న ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించారు. తిరుపతిలో చిరంజీవి పాల్గొంటున్న మొట్టమొదటి బహిరంగ సభ కావడంతో మెగాఫ్యాన్స్ పోటెత్తారు. ఆ సభ కోసం సుమారు పది లక్షల మందికి పైగా హాజరైనట్లు సమాచారం. ఆ సభ రాత్రి 10 గంటలకి పూర్తయితే తిరుపతి నుంచి తెల్లారే వరకూ వాహనాలు వెళుతూనే వున్నాయి. కనీవినీ ఎరుగని ట్రాఫిక్ జామ్ తిరుపతిలో ఏర్పడింది. అంతవరకు ఏ సినీ, రాజకీయ నాయకుడి సభకు రానంత జనం వచ్చారు. ఈ సభలోనే చిరంజీవి పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు. ఆయన పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చే నాటికి ఉమ్మడి ఏపీలో 2004 నుంచి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి మొదటిసారి సీఎం కావడమే కాకుండా ప్రజల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వైఎస్సార్ పాలన కొనసాగింది. అలా ఒక బలమైన రాజకీయ నాయకుడిగా ఏపీలో వైఎస్సార్ ఉన్నారు. 2009లో జరిగే సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీగా ఉమ్మడి ఏపీలో ఉన్నాయి. అలాంటి సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం చేశారు. అప్పటికే ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుని మళ్లీ 2009 ఎన్నికల బరిలో ఉన్న రాజశేఖర్‌రెడ్డి గారిపైనా ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఆయన్ని దింపి చిరంజీవిని సీఎం చేయాలనే జ్వాల, కోరిక జనంలో లేవు. ఆ ఎన్నికల్లో రాష్ట్రంలోని 294 నియోజకవర్గాల్లో ప్రజారాజ్యం నుంచి అభ్యర్థులను చిరంజీవి నిలబెట్టారు. తిరుపతి, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి చిరు పోటీ చేయగా తిరుపతి స్థానం నుంచి మాత్రమే గెలుపొందారు. అలా మొత్తంగా కేవలం 294 స్థానాలకు గాను 18 స్థానాలకు మాత్రమే ప్రజారాజ్యం పరిమితం అయింది. 2009 ఎన్నికల్లో గెలిచిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరోసారి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2011 ఆగష్టులో భారత జాతీయ కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనమయ్యింది. ఆ పార్టీ నుంచి కేంద్రమంత్రిగా కూడా చిరంజీవి కొనసాగారు. తిరుపతి సభ నుంచే చిరుకు మొదటి దెబ్బ పార్టీ ఆవిర్భావ సభరోజు పది లక్షలకు మంది పైగా వచ్చిన జనం అదే తిరుపతిలో చిరంజీవి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. బస్టాండ్‌కు దగ్గర్లో మెగాస్టార్ సభ పెడితే జనం వెయ్యి మంది కూడా లేరు. అప్పుడు ఆయన ఆకాశం నుంచి ఒక్కసారిగా నేలకు దిగారు. ఆ సమయం నుంచే చిరంజీవిపై రాజకీయ విమర్శలు వచ్చాయి. సినిమా వేరు.. రాజకీయాలు వేరని చాలామంది పొలిటికల్ విశ్లేషకులు తెలిపారు. రజనీకాంత్‌కు చిరంజీవి ఇచ్చిన సలహా సినిమా హీరోకు ఉన్న ఇమేజ్, రాజకీయ నాయకుడి ఇమేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇదే విషయాన్ని చిరంజీవి గ్రహించి రాజకీయాల్లోకి రావాలనుకున్న రజీనికాంత్, కమల్ హాసన్‌కు ఒక సూచన ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ మాత్రం ఇవ్వకండని ఆయన ఇలా సూచించారు. 'రాజకీయాల్లోకి రావాలన్న మీ ఆలోచన విరమించుకోండి. సూపర్‌స్టార్‌గా అందరివాడు అనిపించుకున్న మీరు పాలిటిక్స్‌లోకి వచ్చి చెడ్డపేరు తెచ్చుకోవద్దు. మనలాంటి వారు ఈ రాజకీయాల్లో నెగ్గాలంటే చాలా కష్టం. అందుకే రాజకీయాలు వదిలేసి మళ్లీ సినిమాల వైపు వచ్చాను. ఇక నుంచి సినిమాలే నా ఫస్ట్ లవ్.' అని చిరంజీవి అన్నారు. 2017లో రీ ఎంట్రీ రాజకీయాల నుంచి చిరంజీవి పూర్తిగా దూరం అయి తన అభిమానుల కోసం 2017లో 'ఖైదీ 150' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఒక హీరో సినిమా ప్రపంచానికి సుమారు 10 సంవత్సరాలు దూరం అయితే... అదే సమయంలో చాలామంది యంగ్ హీరోలు పోటీపడుతూ బ్లాక్‌బస్టర్ హిట్లు ఇస్తూ కొత్తకొత్త అభిమానులను సంపాధించుకుంటున్న తరుణంలో పదేళ్లు బ్రేక్ తీసుకున్న హీరో వెనక్కు వస్తే మునపటి ఇమేజ్ ఉండదని పలువురు కామెంట్లు కూడా చేశారు. అలాంటి వారందరికీ ఖైదీ 150 సినిమాతో చిరు సమాధానం చెప్పారు. ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసి అప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులను బద్ధలుచేసింది. ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను నిరుత్సాహపరిచాయి. రాజకీయాల్లో చిరంజీవి ఓడిపోవచ్చు కానీ సినిమాల్లో ఎప్పటికీ మెగాస్టారే అని ఆయన సినిమా ఓపెనింగ్స్ చెప్తాయి. ఎందుకంటే నాడు చిరంజీవి ఎంట్రీతో తెలుగు సినీ పరిశ్రమ ఒక్కసారిగా సమూలంగా మారిపోయింది. డ్యాన్స్‌లు, ఫైట్స్, పాటలు ఇలా అన్ని విభాగాల్లో ఆయన కొత్తదనాన్ని తీసుకొచ్చారు. తెలుగు సినిమా ఇంకెంత వృద్ధిలోకి వెళ్లిన.. ప్రపంచం గర్వించే సినిమాలు ఇంకెన్నీ తీసినా వాటి వెనుకాల చిరంజీవి అనే ఒక మహాశక్తి పాత్ర ఎంతోకొంత ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా తెలుగు సినిమాలో ఎన్ని మారినా.. ఎంతమంది వచ్చినా ఆయన స్థాయి వేరు.. ఆయన స్థానం వేరు. భవిష్యత్‌లో మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చిత్రపరిశ్రమకు అందించాలని కోరుకుంటూ పద్మ విభూషణ్ చిరంజీవికి ప్రత్యేక శుభాకాంక్షలు. -సాక్షి వెబ్ డెస్క్ -
'రీమేక్స్'... చిరుకు కలిసొచ్చాయా? ముంచేశాయా?
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా ఓ తమిళ మూవీకి రీమేక్. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు ఇది ఫలానా మూవీకి రీమేక్ అని మెగా ఫ్యాన్స్‌కి తెలిసింది. దీంతో మాకొద్దీ రీమేక్ అని బుర్ర బాదుకున్నారు. కానీ వాళ్ల మాట ఎవరు వింటారు చెప్పండి. ఎంచక్కా షూటింగ్ పూర్తి చేసి, సినిమాని థియేటర్లలో రిలీజ్ చేశారు. కట్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర 'భోళా శంకర్' బోల్తా కొట్టింది. చిరు కెరీర్లోనే పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే రీమేక్స్ చేయొద్దని.. స్వయానా అభిమానులే అంత మొత్తుకుంటున్నా చిరు ఎందుకు రీమేక్స్ చేస్తున్నారు? అసలు ఆయన కెరీర్లో ఓవరాల్‌గా ఎన్ని రీమేక్ సినిమాలున్నాయి? అదంత పక్కనబెడితే రీమేక్ అనేది మెగాస్టార్‌కి కలిసొచ్చిందా? ముంచేసిందా అనేది ఇప్పుడు అలా చూసేద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) రీమేక్స్ ఎన్ని? శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి.. 'మెగాస్టార్' ఎందుకయ్యారు? అని ఎవరినైనా అడిగితే.. ఏముంది డ్యాన్స్, యాక్టింగ్, డైలాగ్స్ ఇలా ప్రతిదానిలోనూ బెంచ్ మార్క్ సెట్ చేశారు కదా అని చెబుతారు. చిరు ఇప్పటివరకు 155 సినిమాలు చేస్తే.. అందులో దాదాపు 38కి పైగా చిత్రాలు రీమేక్స్ అని చాలామందికి తెలియదు. ఓర్ని ఇన్ని రీమేక్సా అని ఆశ్చర్యపోవద్దు. ఇంతకీ ఆ మూవీస్ ఏంటో తెలుసా? ఖైదీ కూడా రీమేక్? చిరు కెరీర్‌ని టర్న్ చేసిన మూవీ అనగానే చాలామంది 'ఖైదీ' అంటారు. డైరెక్టర్ కోదండరామిరెడ్డి తీసిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరు కెరీర్‌కి బ్యాక్ బోన్‌లా మారింది. అయితే ఇది హాలీవుడ్లో సిల్వోస్టర్ స్టాలిన్ చేసిన 'ఫస్ట్ బ్లడ్' అనే చిత్రానికి రీమేక్ అట. పూర్తిగా ఉన్నది ఉన్నట్లు కాకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చి తీసినట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇంకా లిస్టులో చాలా ఉన్నాయి. (ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!) రీమేక్స్- ఒరిజినల్ సినిమాలు పున్నమినాగు- హున్నిమేయ రాత్రియల్లి (మలయాళం) పట్నం వచ్చిన పతివ్రతలు - పట్టణక్కే బంధ పత్నియారు (కన్నడ) అడవి దొంగ - టార్జాన్ (ఇంగ్లీష్) వేట - ది కౌంట్ ఆఫ్ మొంటో క్రిష్ణో (ఇంగ్లీష్) ఆరాధన- కవితోరా కవితైగల్ (తమిళం) పసివాడి ప్రాణం - పూవిన్ను పుతియా పుంతెన్నెల్ (మలయాళం) ఘరానా మొగుడు - అనురాగ అరాలితు (కన్నడ) ఎస్పీ పరశురాం - వాల్టర్ వెట్రివేల్ (తమిళం) హిట్లర్ - హిట్లర్ (మలయాళం) స్నేహం కోసం - నట్పుక్కగ (తమిళం) ఠాగూర్ - రమణ (తమిళం) అంజి - ఇండియానా జోన్స్ (ఇంగ్లీష్) శంకర్‌దాదా ఎంబీబీఎస్ - మున్నాభాయ్ ఎంబీబీఎస్ (హిందీ) ఖైదీ నం.150 - కత్తి (తమిళం) గాడ్‌ఫాదర్ - లూసిఫర్ (మలయాళం) భోళా శంకర్ - వేదాళం (తమిళం) పొరపాటు ఎక్కడ? పైన చెప్పిన సినిమాలన్నీ చిరంజీవి కెరీర్లో కాస్త చెప్పుకోదగ్గ రీమేక్స్. వీటితోపాటు మరికొన్ని కూడా ఉన్నాయి. అయితే అప్పట్లో రీమేక్స్ హక్కులు కొని తీయడం అనే పద్ధతి ఉండేది కాదు. దీంతో దర్శకులు.. సదరు చిత్రాల్ని స్పూర్తిగా తీసుకుని కాస్త చేర్పులు మార్పులు చేసి తీసేసేవారు. కాబట్టి అది రీమేక్, ఒరిజినల్ అనేది చెప్పడం కష్టం. అప్పట్లో ప్లస్ అయినంతగా ఇప్పుడు చిరుకు రీమేక్స్ అస్సలు కలిసి రావడం లేదు. రీమేక్స్.. నాట్ ఇంట్రెస్ట్! ఇప్పటి ప్రేక్షకులు.. ఒరిజినల్ సినిమాలు చూడటానికే కొన్నిసార్లు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. రీమేక్స్ అనేసరికి చూడటం కంటే ట్రోల్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ప్రకటన రావడం ఆలస్యం ఒరిజినల్ చూసేసి, రీమేక్‌ని దాంతో పోల్చుతూ విమర్శిస్తున్నారు. రీసెంట్గా 'భోళా శంకర్' రిజల్ట్ దీనికి కరెక్ట్ ఉదాహరణ అని చెప్పొచ్చు. రీఎంట్రీలో రీమేక్స్ చిరంజీవి.. 'ఖైదీ నం.150' సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఇది తమిళ 'కత్తి'కి రీమేక్. మాస్ కమర్షియల్ అంశాలు ఉండటంతో ఇది మెగాస్టార్‌కి కలిసొచ్చింది. కానీ 'గాడ్ ఫాదర్' (లూసిఫర్), 'భోళా శంకర్' (వేదాళం) చిత్రాలు మాత్రం చిరుకు కలిసి రాలేదు. ఎందుకంటే వాటిని ఆల్రెడీ ఆడియెన్స్ చూసేశారు కాబట్టి. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు.. ఆడియెన్స్ టేస్ట్, ట్రెండ్‌కి తగ్గట్లు చిరు మారితే బెటర్. లేదంటే మాత్రం ఇమేజ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సులే ఎక్కువ! (ఇదీ చదవండి: మితిమీరిన పారితోషికాలు.. లెక్కలు సరిగ్గా చూపుతున్నారా?) -
రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?
90ల్లో పుట్టిన ఓ పిల్లాడు. కాస్త ఊహ తెలిసొచ్చాక నాన్న భుజాలపై కూర్చుని తొలిసారి ఓ సినిమా చూశాడు. ఓ వ్యక్తి డ్యాన్సులు చూసి మెస్మరైజ్ అయిపోయాడు. ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు. కట్ చేస్తే ఆ పిల్లాడు ఇప్పుడు కుర్రాడు అయ్యాడు. ఆ హీరోకి వయసైపోయింది కానీ యాక్టింగ్, డ్యాన్సుల్లో గ్రేస్ మాత్రం తగ్గలేదు. అవును మీరు గెస్ట్ చేసింది కరెక్ట్. ఆ హీరో మెగాస్టార్ చిరంజీవినే. అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన చిరు.. ఇప్పుడు మాత్రం ఎందుకో తడబడుతున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఆ స్థాయి సినిమాలు ఎక్కడ? నటుడిగా మెగాస్టార్ చిరంజీవిని వంక పెట్టడానికి ఏం లేదు. ఎందుకంటే ఆయన ఇమేజ్ ఆకాశంలో ఉంటుంది. ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ నుంచి అత్యధిక రెమ్యునరేషన్ వరకు ఎన్నో విషయాల్లో రికార్డులు సృష్టించారు. దాదాపు అన్ని రకాల జానర్స్ కథల్ని కవర్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఒకప్పుడు చిరంజీవి అంటే మాస్-క్లాస్-ఫ్యామిలీస్ ఇలా అందరినీ ఎంటర్టైన్ చేసేవారు. ఇప్పుడు ఆయన రేంజుకి తగ్గ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా పడటం లేదనేది సగటు మెగా అభిమాని ఆవేదన. (ఇదీ చదవండి: బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!) రీమేక్స్ వల్ల డ్యామేజ్? 'భోళా శంకర్'తో కలిపి చిరంజీవి ఇప్పటివరకు దాదాపు 38 సినిమాలని రీమేక్ చేశారు. ఇదేం అఫీషియల్ నంబర్ కాదు. ఎందుకంటే అప్పట్లో టెక్నాలజీ పెద్దగా లేదు కాబట్టి ఏది ఒరిజినల్ స్టోరీ, ఏది రీమేక్ అనేది ప్రేక్షకులకు పెద్దగా తెలిసేది కాదు. థియేటర్‌కి వెళ్లి మనస్పూర్తిగా చిరుని ఆయా మూవీస్‌లో చూసి ఎంజాయ్ చేసేవాళ్లు. ఇప్పుడు జమానా మారిపోయింది గురూ. రీమేక్స్ అనేవి పెద్దగా వర్కౌట్ కావట్లేదు. ఇంకా చెప్పాలంటే చిరు రీమేక్స్ వల్ల ఆయనకు ప్లస్ కంటే డ్యామేజే ఎక్కువ జరుగుతోందనేది అందరికీ తెలిసిన విషయం. నాడీ పట్టుకోలేకపోతున్నారా? చాలామంది హీరోలు.. అభిమానులకు నచ్చే సినిమాలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకొంటూ ఉంటారు. చిరు కూడా ఇదే ఫాలో అవుతుంటారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఫ్యాన్స్‌ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే దెబ్బ పడటం గ్యారంటీ. ఎందుకంటే ఓ మూవీ బాగుంది-బాగోలేదు అని డిసైడ్ చేసిది ఫ్యాన్స్ కాదు నార్మల్ ఆడియెన్స్. వీళ్లకు నచ్చాలంటే ట్రెండ్‌కి తగ్గట్లు డిఫరెంట్ స్టోరీలు చేయాలి. అప్పుడే కలెక్షన్స్తోపాటు హిట్ అనే మాట వినబడుతుంది. చిరు.. వీళ్ల నాడీ పట్టుకోనేలా సినిమాలు చేస్తే బెటర్. (ఇదీ చదవండి: మితిమీరిన పారితోషికాలు.. లెక్కలు సరిగ్గా చూపుతున్నారా?) ఇంకా అలానే అంటే! చిరంజీవి వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. అయితే తనకు వయసు అయిపోయిందని ఒప్పుకోవట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే రజనీకాంత్, కమల్‌హాసన్, మమ్ముట్టి, మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరోలు వయసు తగ్గ పాత్రలు, డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరంజీవి మాత్రం ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్.. ఇంకా కుర్రాడిలా ఉండేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. అభిమానులని ఇది నచ్చేయొచ్చేమే గానీ.. సాధారణ ప్రేక్షకుడికి మాత్రం ఎబ్బెట్టుగా ఉంటుంది. కాకపోతే బయటకు చెప్పుకోరు అంతే! అసలైన ఫ్యాన్స్ వాళ్లు ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకి సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, ఐకాన్‌స్టార్ తెలిసినంత.. మెగాస్టార్ గురించి తెలియదు. ఎందుకంటే 2007 తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయిన చిరు.. దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. మెగాస్టార్ అసలైన ఫ్యాన్స్ అంటే ఇప్పటి జనరేషన్‌కి నాన్నల తరం. వాళ్లలో చాలామందికి ఇప్పుడు థియేటర్స్‌కి వెళ్లి సినిమాలు చూడాలనే ఆసక్తి ఉండట్లేదు. ఇది కూడా రీఎంట్రీలో చిరు సినిమాలపై టాక్ తేడా కొట్టడానికి ఓ కారణం కావొచ్చు. ఇలా పైన చెప్పిన వాటితో పాటే ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిని ఓసారి దృష్టిలో పెట్టుకుని చిరు ఇకపై సినిమాలు చేస్తే బెటర్. లేదంటే మాత్రం అంతే! (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 కొత్త సినిమాలు) -
బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. భారీ అంచనాల మధ్య ఆగస్ట్11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో చిరు కెరీర్లోనే భారీ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం అందులో పావు వంతు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయిందనే వార్తలు వినిపిస్తునాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం రూ. 30 కోట్లను మాత్రమే వసూలు చేసింది. రూ.50 కోట్ల నష్టం! మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో భోళా శంకర్‌కి భారీగా ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటి వరకు కేలవం రూ.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే ఇంకా 50 కోట్లు కలెక్ట్ చేస్తేగానీ ఈ చిత్రం సేఫ్‌జోన్‌లోకి వెల్లదు. ఈ చిత్రం విడుదలే ఇప్పటికే పది రోజులు దాటింటి. పైగా తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్. కాబట్టి ఇక ఈ సినిమా థియేటర్లలోనుంచి తీసేసే చాన్స్ ఎక్కువగా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ చిత్రానికి రూ.50 కోట్ల నష్టం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర్ నిర్మించిన ఈ చిత్రం కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. కానీ చివరకు నెట్ఫిక్స్ ఓటీటీ రైట్స్‌ని దక్కించుకుంది. అది కూడా రూ. 30 కోట్లకు. అయితే ఇదంతా సినిమా రిలీజ్‌కు ముందు జరిగింది. మెగాస్టార్ గత చిత్రం వాల్తేరు వీరయ్య ఓటీటీ రైట్స్ కూడా ఈ సంస్థే దక్కించుకుంది. దానికి మంచి రిజల్ట్ రావడంతో.. భోళా శంకర్‌కి భారీ ధర చెల్లించి, ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. అయితే సినిమా విడుదల తర్వాత ఫలితంగా దారుణంగా రావడంతో ఆ ఎఫెక్ట్ ఓటీటీపై కూడా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాలి. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు? సాధారణంగా ఏ చిత్రమైనా భారీ విజయం సాధిస్తే.. ఓటీటీలో కాస్త లేట్‌గా స్ట్రీమింగ్ అవుతాయి. మొదట ఫలానా డేట్‌కి స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నా.. సినిమా ఫలితాన్ని బట్టి వాయిదా వేస్తారు. అదే డిజాస్టర్ టాక్ వస్తే మాత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. భోళా శంకర్ విషయంలోనూ అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని తొలుత భావించారట. కానీ టాక్ దారుణంగా రావడంతో అనుకున్నదాని కంటే ముందే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. సెప్టెంబర్ 18న నుంచి నెప్ట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్క్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సింది. -
అక్కడేమో బ్లాక్ బస్టర్స్.. ఇక్కడ చూస్తే డిజాస్టర్స్!
టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు సాలిడ్ హిట్ కొట్టేందుకు పదేళ్లుగా వెయిట్ చేస్తున్నారు. అదే ఉత్సాహంతో ఇటీవలే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కించిన భోళాశంకర్ చిత్రం తెరకెక్కించారు. కానీ ఈ మూవీ అనుకన్నంత స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈ చిత్రంపైనే భారీ ఆశలు పెట్టుకున్న మెహర్ రమేశ్‌కు తీవ్ర నిరాశను కలిగించింది. ఫ్లాపులకు కేరాఫ్ అడ్రస్ మెహర్ రమేశ్ అంటూ నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దర్శకత్వం వహించిన సినిమాలేన్ని? అందులో హిట్ అయిన సినిమాలు ఏవీ? ఫ్లాప్స్ అయినా చిత్రాలేవీ? తెలుసుకోవాలంటే ఓ లుక్కేయండి. (ఇది చదవండి: మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?) మెహర్ రమేశ్ పేరు చెప్పగానే అందరికీ 'శక్తి', బిల్లా, 'కంత్రి', 'షాడో' ఇప్పుడు 'భోళా శంకర్' ఇలా అట్టర్ ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ తొలిసారి నటుడిగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టారాయన. మొదట 2002లో నటుడిగా మహేశ్‌బాబు 'బాబీ' మూవీలో కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చారు మెహర్ రమేశ్. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అనంతరం 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం మెహర్ రమేశ్‌కు వచ్చింది. అలా ఆ చిత్రం ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. అదే ఊపులో 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. దీంతో కన్నడలో తెరకెక్కించిన రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. దీంతో అదే ఉత్సాహంతో తెలుగులోనూ అగ్ర హీరోలతో మెహర్ రమేశ్ చిత్రాలను తెరకెక్కించారు. ఎన్టీఆర్‌తో కంత్రి దీంతో మెహర్ రమేశ్ మరో హిట్ కొట్టాలనే ఉత్సాహంతో 2008లో జూనియర్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించిన కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో హన్సిక , తనీషా హీరోయిన్లుగా నటించారు. ప్రకాష్ రాజ్, ఆశిష్ విద్యార్థి, ముఖేష్ రిషి, సయాజీ షిండే, కోట శ్రీనివాస రావు, వేణు మాధవ్, సునీల్, బ్రహ్మానందం, సుబ్బరాజు, అలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌తో బిల్లా అయితే ఆ తర్వాత మెహర్ రమేశ్.. యంగ్ రెబల్ స్టార్‌తో హిట్ కొట్టాలన్న తన కోరిక నెరవేర్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన బిల్లా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాలేకపోయింది. 2009లో రిలీజైన ఈ చిత్రం అనుష్క, హన్సిక హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, నమిత, జయసుధ తదితరులు నటించగా.. మణిశర్మ సంగీతం అందించాడు. జూనియర్ ఎన్టీఆర్‌తో శక్తి అయితే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో జతకట్టిన మెహర్ రమేశ్.. శక్తి పేరుతో చిత్రాన్ని తెరకెక్కించారు. 2011 ఏప్రిల్ 1న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను మెప్పించలేకపోయింది. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం నిర్మాతలకు భారీ నష్టాలు తెచ్చిపెట్టింది. (ఇది చదవండి: మీరు ఇలా అర్థం చేసుకున్నారా? : నెటిజన్స్‌కు మరో షాకిచ్చిన అనసూయ) వెంకటేశ్‌తో షాడో శక్తి ఫ్లాప్ తర్వాత మెహర్ రమేశ్.. విక్టరీ వెంకటేశ్‌తో జతకట్టాడు. అయితే చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. 2013లో థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సీ, మధురిమ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతమందించారు. చిరంజీవితో భోళాశంకర్ అయితే మొదట పరభాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయాడు. ఆయన అగ్ర హీరోలతో చేసిన ఐదు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేశాయి. దాదాపు పదేళ్ల తర్వాత మెగాస్టార్‌తో తెరెకెక్కించిన భోళాశంకర్ సైతం ఫ్లాప్‌గా నిలవడంతో సోషల్ మీడియా ట్రోల్స్‌కు గురయ్యాడు మెహర్ రమేశ్. -
లైన్లో నలుగురు.. మెగాస్టార్ దారెటు.. బాసూ బీ కేర్‌ఫుల్!
స్టార్ హీరో సినిమా వస్తుందంటే చాలు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తుంటారు అభిమానులు. రిలీజైన రోజు వారు చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. థియేటర్ లోపల, బయట, వీధుల్లో, సోషల్ మీడియాలో చేసే హంగామా ఓ రేంజ్లో ఉంటుంది. సినిమా హిట్టయితే ఈ సంబరాలు రెట్టింపవుతాయి. కానీ ఫ్లాప్ అయితే.. అప్పుడు మొదలవుతుంది అసలు బాధ!సినిమా కోసం పనిచేసిన అందరినీ ఏకధాటిగా తిట్టిపోస్తుంటారు. ఏమాత్రం తేడా కొట్టినా.. చిరంజీవి విషయంలోనూ అదే జరిగింది. మెగాస్టార్ ఈ మధ్య ఎక్కువగా రీమేక్‌ల మీద మనసు పారేసుకుంటున్నాడు. మాతృకలో హిట్టయింది కదా అని ఇక్కడ కూడా అదే టాక్ వస్తుందనుకుంటే తప్పులో కాలేసినట్లే! మనవాళ్ల టేస్ట్‌కు, అంచనాలకు తగ్గట్లుగా తీస్తేనే సినిమా బాక్సాఫీస్ వద్ద నెట్టుకొస్తుంది. లేదంటే కొద్ది రోజుల్లోనే థియేటర్ నుంచి బొమ్మ కనిపించకుండా పోవడం ఖాయం! అదనంగా ట్రోలింగ్ ఒకటి! భోళా శంకర్‌పై విపరీతమైన ట్రోలింగ్ ఇటీవల రిలీజైన చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు. ఈ మూవీ కనీస వసూళ్లు రాబట్టడం కూడా గగనమైపోయింది. ఫలితంగా భోళా శంకర్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశచెందారు. డైరెక్టర్ మెహర్ రమేశ్‌ను ఓ ఆటాడుకున్నారు. కొన్ని సీన్ల గురించి విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలో చిరు నెక్స్ట్ మూవీ ఎవరితో అన్న చర్చ నడుస్తోంది. లైన్లో నలుగురు డైరెక్టర్స్? యూవీ క్రియేషన్స్ బ్యానర్లో బింబిసార డైరెక్టర్ వశిష్టతో ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ కృష్ణతోనూ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడని, దీన్ని మెగా డాటర్ సుష్మిత కొణిదెల నిర్మించనుందంటూ ఓ వార్త వైరలవుతోంది. అంతేకాదు.. ఏఆర్ మురుగదాస్ లేదా వివి వినాయక్తోనూ సినిమా ఉండబోతుందని ప్రచారాలు ఊపందుకున్నాయి. మరి చిరంజీవి ఈ నలుగురిలో నెక్స్ట్ మూవీ ఛాన్స్ ఎవరికిస్తాడు? బర్త్‌డే(ఆగస్టు 22) రోజు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ వదులుతాడా? లేదా? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈసారైనా రీమేక్‌లు పక్కనపెట్టి ఒరిజినల్ స్టోరీ చేస్తే బాగుంటుందని హితబోధ చేస్తున్నారు. చదవండి: షారుక్ కోసం ఆ పని చేసేందుకు సిద్ధమైన నయనతార.. రూల్ పక్కన పెట్టేసి మరీ.. -
రెమ్యునరేషన్ తిరిగిచ్చేసిన మెగాస్టార్.. ఎంతో తెలుసా..?
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' విడుదలైన మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. స్టోరీ, సాంగ్స్, సీన్స్.. ఇలా ఏ విషయంలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా ఘోరంగా వచ్చాయి. ఒకరకంగా నిర్మాత నుంచి బయర్స్ వరకు నష్టం వచ్చినట్లేనని టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని గ్రహించిన చిరంజీవి తన రెమ్యునరేషన్ నుంచి కొంతమొత్తాన్ని నిర్మాతకు తిరిగిచ్చేశాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. చిరంజీవి- అనిల్ సుంకర మధ్య రెమ్యునరేషన్ విషయంలో గొడవలు వచ్చాయని ఈ మధ్య బాగా వైరల్ అయింది. దీంతో అనిల్ రంగంలోకి దిగి ఇందులో నిజం లేదని ఈ పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌లో గ్లామర్ డోస్ పెంచేందుకు హాట్ బ్యూటీస్ ఎంట్రీ ) ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకు చిరంజీవి రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సినిమా భారీ హిట్ అందుకుంది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. దీంతో 'భోళా శంకర్' కు ఆయన రూ. 60 కోట్లు తీసుకున్నాడని టాక్ నడిచింది. ఇందుకు సంబంధించిన రెమ్యునరేషన్‌ను సినిమా నిర్మాతలు షూటింగ్ సమయంలోనే చిరుకు రూ. 50 కోట్లు ఇచ్చేశారట. మిగతా రూ. 10 కోట్లు మెగస్టార్‌కు చెక్ రూపంలో ఇచ్చారట. (ఇదీ చదవండి: శ్రీహరి కట్టిన తాళి మాత్రమే మిగిలింది.. ప్రస్తుతం మా పరిస్థితి ఇదే: డిస్కో శాంతి) కానీ ఆ చెక్‌ను సినిమా విడుదల తర్వాత బ్యాంక్‌కు పంపాలని చిరంజీవి భావించారట. భోళా శంకర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా రిజల్ట్ తెలుసుకున్న మెగాస్టార్.. ఆ చెక్‌ను డిపాజిట్ చేయకుండా అలానే ఉంచారట. తనను నమ్ముకుని సినిమా తీసిన నిర్మాత పరిస్థితిని అర్థం చేసుకుని ఆ చెక్‌ను అనిల్ సుంకరకు రీసెంట్గా తిరిగి ఇచ్చేశారని తెలుస్తోంది. గతంలో కూడా తన సినిమాల వల్ల నష్టపోయిన నిర్మాతలకు చిరంజీవి ఏదో రూపంలో సాయం చేశారని పలువురు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడని చెబుతున్నారు. చిరంజీవి తమకు ఎప్పుడూ అండగానే ఉన్నారని నిన్ననే నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. -
ఆ రూమర్స్‌పై 'భోళా శంకర్' నిర్మాత ఆగ్రహం.. చిరు ఎప్పుడూ!
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. స్టోరీ, సాంగ్స్, సీన్స్.. ఇలా ఏ విషయంలోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా ఘోరంగా వచ్చాయి. ఇవన్నీ పక్కనబెడితే చిరు-నిర్మాత అనిల్ సుంకర మధ్య రెమ్యునరేషన్ విషయంలో గొడవ జరిగిందని, అనిల్ తన ఆస్తుల్ని తాకట్టు పెట్టారని ఇలా చాలా మాట్లాడుకున్నారు. ఇప్పుడు వాటన్నింటిపై స్వయంగా నిర్మాత ట్వీట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు. అది అబద్ధం 'రూమర్స్ అనేది కొందరికి అదో రకమైన ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ ఏళ్లుగా కష్టపడి సంపాదించిన వ్యక్తుల పేరుని దెబ్బతీయడం మాత్రం సహించరాని నేరం. ఇది మా అందరి కుటుంబాల్లోనూ విపరీతమైన ఒత్తిడి, ఆందోళన పెంచేలా చేసింది. చిరంజీవి గారు- నా మధ్య మనస్పర్థలు వచ్చాయనేది పూర్తిగా అబద్ధం. ఆయన ఎప్పుడూ అండగానే ఉన్నారు' (ఇదీ చదవండి: పెళ్లి చేసుకోబోతున్న రానా తమ్ముడు! అమ్మాయి ఎవరంటే?) బలంగా తిరిగొస్తా 'అలానే నాతో ఆయన(చిరంజీవి) ఇప్పటికీ మంచిగానే ఉన్నారు. కావాలనే మా ఇద్దరిపై నెగిటివిటీ స్ప్రెడ్ చేయొద్దు. ఫేక్ న్యూస్ అనేది కొందరికీ ఆనందాన్ని ఇవ్వొచ్చు. కానీ అలా చేసిన ప్రతిఒక్కరినీ అదే చిక్కుల్లో పడేయొచ్చు. నా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన ఇండస్ట్రీలోని శ్రేయోభిలాషులకు థ్యాంక్స్. వారి అందరి ఆశీస్సులతో బలంగా తిరిగి వస్తానని అనుకుంటున్నాను' అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. వరుస షాకులు అయితే నిర్మాత అనిల్ సుంకర పరిస్థితి ప్రస్తుతం ఘోరంగా ఉంది. ఎందుకంటే ఏప్రిల్ చివరలో 'ఏజెంట్' మూవీతో కోట్ల రూపాయలు నష్టపోయారు. ఇప్పుడు 'భోళా శంకర్'తోనూ అలాంటి నష్టమే జరిగింది. ఇలా ఇద్దరు స్టార్ హీరోల మూవీస్‌తో నష్టపోవడం మాటేమో గానీ విమర్శలు, ఫేక్ న్యూసులు ఆయన్ని మరింత ఇబ్బందికి గురిచేసినట్లు తాజా ట్వీట్ చూస్తే అర్థమవుతుంది. Rumors may satisfy the cruel fun of some people, but tarnishing the image built on hardwork for ages is an unacceptable crime. It also gives immense pressure and anxiety to all the families involved. The news spread about the dispute between me and chiranjeevi garu is pure trash.… — Anil Sunkara (@AnilSunkara1) August 17, 2023 (ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో విషాదం.. సితార ఎమోషనల్!) -
చిరంజీవి అలాంటి సినిమాలు చేస్తే బెటర్: స్టార్ ప్రొడ్యూసర్
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యే 'భోళా శంకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. సాధారణ ప్రేక్షకులకే కాదు మెగా ఫ్యాన్స్‌కి కూడా ఇది నచ్చలేదు. దీంతో చిరుతో పాటు దర్శకుడు మెహర్ రమేశ్‌పైనా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. చిరు రీమేక్స్‌పై కౌంటర్స్ వేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా వ్యాపారమైంది 'అప్పట్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లకు పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇప్పటికీ అలాంటి వాళ్లు ఉన్నప్పటికీ.. దాన్ని వ్యాపారంగా చూసేవాళ్లు ఎక్కువైపోయారు. కథ చెప్పమని అడిగితే అప్పట్లో రైటర్స్ సూటిగా సుత్తిలేకుండా చెప్పేవారు. ఇప్పుడేమో 'ఓపెన్ చేస్తే' అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. రైటర్స్ డైరెక్టర్స్ కావడం దీనికి కారణమై ఉండొచ్చు. ప్రేక్షకులకు పనికొచ్చే అంశం, అది కూడా నేచురల్‌గా ఉండాలి. ఇది పక్కనబెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవు.' (ఇదీ చదవండి: చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!) చిరు అలా చేయాలి 'ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోలందరూ కెరీర్ మొదట్లో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరునే తీసుకోండి. శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత లాంటి సినిమాలకే అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. అమిర్ 'దంగల్' లాంటి సినిమా చిరంజీవి చేసినా జనాలు చూస్తారు. భోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటివి చేసి డిసప్పాయింట్ కావడం కంటే నేచురల్ మూవీస్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం' చెప్పాలని ప్రయత్నించా 'అయితే ఇదే విషయాన్ని చిరంజీవితోనూ చెబుదామని ప్రయత్నించాను. కానీ ఎందుకో కుదరలేదు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనిపించేవారు. ఇప్పుడు ఆ చిరంజీవి మళ్లీ కనిపిస్తే చూడాలని ఉంది. అలానే సినిమాలు ఆడుతాయి అనేది నా నమ్మకం' అని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. ఈయనే కాదు చాలామంది అభిమానులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి చిరు రాబోయే సినిమాల విషయంలో ఏం చేస్తారో చూడాలి? (ఇదీ చదవండి: సర్జరీ.. చిరంజీవి ఆరోగ్యపరిస్థితి ఇప్పుడెలా ఉందంటే?) -
చెల్లెలిగా కీర్తి సురేశ్.. చిరు-రజనీ ఇద్దరూ బలైపోయారు!
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమాకు ఊహించని రీతిలో నష్టాలు రాబోతున్నాయనేది ఇండస్ట్రీలో టాక్. ఈ చిత్రం ఫెయిలవడానికి చాలా కారణాలున్నాయి. అవేంటో మీకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అవన్నీ కాదులే గానీ ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ అవుతోంది. ఈ ఫ్లాప్‌కి హీరోయిన్ కీర్తి సురేశ్ కూడా ఓ కారణమని అంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం? హీరోయిన్గా బిజీ కీర్తి సురేశ్ పేరు చెప్పగానే చాలామంది 'మహానటి' సినిమా గుర్తొస్తుంది. కేరళకు చెందిన ఈ బ్యూటీ 'నేను శైలజ' అనే లవ్ స్టోరీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'మహానటి'తో ఈమెకు జాతీయ అవార్డు వచ్చింది. స్టార్ హీరోయిన్ అయిపోయింది. పవన్, మహేశ్ లాంటి హీరోల సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం సౌత్ తోపాటు హిందీలో నటిస్తూ బిజీగా ఉంది. (ఇదీ చదవండి: 'జైలర్' కలెక్షన్స్.. రజనీ దెబ్బకు 'విక్రమ్' రికార్డ్ బ్రేక్) చిరుతో పాటు రజనీ ఓవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు చెల్లిలి పాత్రల్లోనూ యాక్ట్ చేయడానికి ఓకే చెప్పేస్తుంది. అలా 'భోళా శంకర్'లో చిరంజీవికి సిస్టర్ రోల్ చేసింది. వేళా విశేషం ఏంటో గానీ ఈ సినిమా ఘోరమైన ఫ్లాప్‌గా నిలవబోతుంది. అలానే కీర్తి సురేశ్ చెల్లిగా చేయడం చిరుకి కలిసిరానట్లే, సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు అస్సలు కలిసిరాలేదు. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. చెల్లిగా చేస్తే అంతే? 'జైలర్'తో ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఫుల్ జోరు చూపిస్తున్న రజనీకాంత్.. గత సినిమా 'అన్నాత్తే'తో ఘోరమైన ఫెయిల్యూర్ అందుకున్నారు. ఇందులో రజనీకి చెల్లిగా కీర్తి సురేశ్ నటించింది. అలా ఇద్దరు స్టార్ హీరోలకు చెల్లిగా యాక్ట్ చేసిన కీర్తి సురేశ్.. అనుకోని ఫ్లాప్స్ ని నెత్తిమీద వేసుకుంది. దీంతో నెటిజన్స్.. కీర్తి, చెల్లిలి రోల్ చేస్తే ఆమెకు ఏమో గానీ స్టార్ హీరోలకు రిస్క్ తప్పదని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. (ఇదీ చదవండి: 'ఖుషి' ఈవెంట్లో విజయ్ వింత డ్రస్.. ధరెంతో తెలుసా?) -
Chiranjeevi : సర్జరీ @ ఢిల్లీ, వచ్చే వారం హైదరాబాద్ కు చిరంజీవి
మెగాస్టార్ మోకాలికి సర్జరీ మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ పూర్తయింది. గత కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ఆయన.. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో మోకాలికి సర్జరీ చేయించుకున్నారని తెలిసింది. వైద్య పరిభాషలో ఈ సర్జరీని ఆర్థోస్కోపి నీ వాష్ ట్రీట్మెంట్ అంటారని తెలిపారు. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!) ఏమిటీ నీ వాష్ (Knee Wash) ట్రీట్ మెంట్ ? నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పోర్టల్ ప్రకారం నీ వాష్ ట్రీట్ మెంట్ అంటే.. మోకాలి చిప్ప భాగంలో ఏర్పడే ఇన్ ఫెక్షన్ ను తొలగిస్తారు. అదే స్థానంలో రెండు ఎముకల మధ్య కొత్త ఫ్లూయిడ్ ను నింపుతారు. దీని వల్ల మోకాలి చిప్పకు నొప్పి ఉండదు. మోకాలి దగ్గర చాలా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ సర్జరీ పూర్తి చేస్తారు. దీని వల్ల కుట్లు వేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ఎన్నాళ్లు విశ్రాంతి అవసరం ? నీ వాష్ ట్రీట్ మెంట్ తీసుకున్న వ్యక్తులు.. మళ్లీ మామూలుగా పనులు చేసుకోవాలంటే కనీసం 45 రోజుల విశ్రాంతి అవసరం. దీనికంటే త్వరగా కూడా కోలుకోవచ్చు. కానీ వైద్యులు సాధారణంగా 45 రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. చిరంజీవి సంగతేంటీ ? ప్రస్తుతం చిరంజీవి వయస్సు 67 సంవత్సరాలు. అయితే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండే చిరంజీవి వయస్సు 67 ఏళ్లు వచ్చినా.. ఇంకా చలాకీగానే కనిపిస్తారు. అయితే కొన్నాళ్లుగా మోకాలి నొప్పి పెరిగిపోవడంతో శస్త్ర చికిత్స తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఢిల్లీలో ఎప్పటివరకు ? ప్రస్తుతం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న చిరంజీవి.. మరో వారం రోజుల పాటు ఆస్పత్రిలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆ తర్వాత హైదరాబాద్ రానున్నారు. అంటే ఆగస్టు 22న తన పుట్టినరోజు కల్లా ఇంటికొచ్చేస్తారని తెలుస్తోంది. ఇక్కడ ఇంట్లో మరో 5 వారాల పాటు విశ్రాంతి తీసుకుంటారు. చిరంజీవి సినిమాల సంగతేంటీ? ఈ మధ్య 'భోళా శంకర్'గా వచ్చిన చిరు.. తన బర్త్ డే నాడు కొత్త మూవీ ప్రారంభించబోతున్నారు. 'బంగార్రాజు' ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకుడు కాగా చిరు కూతురు సుస్మిత నిర్మాతగా వ్యవహరిస్తుంది. మళయాళంలో హిట్టయిన బ్రో డాడీ సినిమా రీమేక్ పట్ల కూడా చిరంజీవి ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య' అనే స్ట్రెయిట్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టిన చిరు.. రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్నారు. ఈ మధ్య థియేటర్లలో విడుదలైన 'భోళా శంకర్' మాత్రం బోల్తా కొట్టేసింది. భారీ నష్టాలు రాబోతున్నాయని తెలుస్తోంది. ఇది 'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్. త్వరలో చేయబోయే కొత్త ప్రాజెక్ట్ కూడా 'బ్రో డాడీ' అనే మలయాళ చిత్రానికి రీమేక్ అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) -
'భోళా శంకర్' పంచాయతీ.. ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చారు!
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. తొలిరోజుకే టాక్ తేడా కొట్టేసింది. దీంతో రకరకాల విషయాలు బయటకొచ్చాయి. అలానే చిరు రెమ్యునరేషన్ గొడవ కూడా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే నిర్మాత వాట్సాప్ చాట్ అంటూ ఓ ఫొటో తెగ సర్క్యూలేట్ అయింది. ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై నిర్మాణ సంస్థ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఏం జరిగింది? మెహర్ రమేశ్ దర్శకత్వంలో చిరు 'భోళా శంకర్' చేశారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర దాదాపు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. అయితే రిలీజ్‌కి ముందే పలు సమస్యలు ఎదురయ్యాయి. పలు ఏరియాల్లో బయ్యర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో నిర్మాతనే స్వయంగా రిలీజ్ చేశారు. మరోవైపు ఈ మూవీ కోసం చిరుకు ఏకంగా రూ.65 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వాలని అనుకున్నారట. అందులో కొంత ముందు ఇచ్చారట. (ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు) అవన్నీ రూమర్స్ మిగిలిన మొత్తం ఇచ్చేందుకు నిర్మాత అనిల్ సుంకర దగ్గర డబ్బుల్లేక తన ఆస్తులు తాకట్టు పెట్టారని ఓ వార్త బయటకొచ్చింది. అలానే హీరో-నిర్మాత మధ్య ఈ విషయమై మనస్పర్థలు వచ్చినట్లు సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటన్నింటిపై స్వయంగా నిర్మాణ సంస్థ స్పందించింది. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అని కొట్టిపారేసింది. ట్వీట్‌తో క్లారిటీ 'సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవన్నీ బేస్‌లెస్, సెన్స్‌లెస్ మాటలు. వాటిలో ఒక్కశాతం కూడా నిజం లేదు. దయచేసి ఇలాంటి వార్తల్ని నమ్మొద్దు. అనవసర డిస్కషన్స్ పెట్టొద్దని కోరుతున్నాం' అని ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. బయటకు ఇలా చెబుతున్నారు గానీ లోలోపల ఏమైనా ఇవన్నీ నిజంగానే జరుగుతున్నాయా అనే డౌట్ వస్తుంది! The rumours regarding the disputes that are being circulated online are completely BASELESS & SENSELESS and don’t have a single percent of truth in them. We Kindly Request everyone NOT to BELIEVE such kind of news and have unnecessary discussions over it. — AK Entertainments (@AKentsOfficial) August 15, 2023 (ఇదీ చదవండి: స్టార్ హీరో.. ఇన్నాళ్లకు భారతీయుడు అయ్యాడు!) -
'భోళా శంకర్'పై చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈనెల 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించగా మెహర్ రమేష్ డైరెక్షన్ చేశారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో అజిత్ వేదాళం సినిమాను తెలుగులోకి రీమేక్ చేసి ఇక్కడి నేటివిటీకి తగినట్లుగా మెహర్ రమేష్ మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. కానీ ఇప్పుడు హిందీలో రిలీజ్ చేసేందుకు భోళాశంకర్ టీం సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే హిందీలో కూడా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సినిమాకు డివైడ్ టాక్ రావడంతో హిందీలో విడుదల చేయడం వాయిదా వేస్తారని అందరూ అనుకున్నారు. (ఇదీ చదవండి: అందులో అర్ధ నగ్నంగానే నటించాను తప్పేంటి.. నా జీవితంలో అంతకు మించే జరిగాయి) కానీ తాజాగ హిందీలో ఆగష్టు 25వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు రైట్స్ కొనుక్కున్న సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఆపై సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. చిరంజీవికి హిందీ బెల్ట్‌లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా అక్కడ విడుదల చేస్తున్నట్లు ప్రకటన రావడంతో వారు ఫుల్ ఖుషీగా ఉన్నారు. మరీ హిందీలో భోళాశంకర్ ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే 25 వరకు ఆగాల్సిందే. -
మెహర్ రమేశ్.. కమెడియన్‌గా నటించాడని మీకు తెలుసా?
ప్రస్తుతం రెండే సినిమాల గురించి తెలుగు యువత తెగ మాట్లాడుకుంటున్నారు. ఇందులో ఒకటి 'జైలర్'. మరొకటి 'భోళా శంకర్'. రజినీని ఓ రేంజులో లేపుతున్న మనోళ్లు.. చిరుకు ఘోరమైన సినిమా ఇచ్చిన డైరెక్టర్ మెహర్ రమేశ్‌పై తెగ విమర్శలు చేస్తున్నారు. ఫ్లాపుల దర్శకుడిగా ఇంతలా ట్రోలింగ్కి గురవుతున్న మెహర్‌లో ఓ నటుడు ఉన్నాడని, మహేశ్ సినిమాలో కామెడీ కూడా చేశాడని మీలో ఎవరికైనా తెలుసా? (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. మెహర్ రమేశ్ పేరు చెప్పగానే 'శక్తి', 'కంత్రి', 'షాడో' ఇప్పుడు 'భోళా శంకర్' ఇలా అన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలే గుర్తొస్తాయి. అయితే దర్శకుడు కాకముందు అంటే 2002లో తొలుత ఇతడు నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిరంజీవికి వరసకు తమ్ముడు అయ్యే మెహర్.. మహేశ్‌బాబు 'బాబీ' మూవీ సునీల్ అనే కామెడీ రోల్ చేశాడు. ఆ సినిమా ఆడకపోవడంతో మెహర్ యాక్టింగ్ వదిలేశాడు. తొలుత నటుడిగా ఎంట్రీ ఇచ్చిన మెహర్.. తర్వాత పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్‌గా చేరాడు. అయితే ఒకానొక సందర్భంలో అనుకోకుండా 'ఆంధ్రావాలా' కన్నడ రీమేక్ 'వీర కన్నడిగ' తీసే అవకాశం వచ్చింది. అలా బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. అ తర్వాత 'ఒక్కడు' చిత్రాన్ని కన్నడలో 'అజయ్'గా రీమేక్ చేసి మరో హిట్ కొట్టాడు. ఇలా పరభాషలో సక్సెస్ అందుకున్న మెహర్ రమేశ్.. తెలుగులో మాత్రం ఒక్కటంటే హిట్ కొట్టలేకపోయాడు. చేసిన ఐదు సినిమాలు బోల్తా కొట్టేశాయి. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. (ఇదీ చదవండి: ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!) -
ఒక్క వీకెండ్.. నాలుగు సినిమాలు.. రికార్డ్ కలెక్షన్స్!
పెద్ద సినిమాలు ఎప్పుడూ ఒకే టైంలో విడుదల చేయరు. ఎందుకంటే థియేటర్ల సమస్య, కలెక్షన్స్ తగ్గుదల లాంటివి వస్తాయని దర్శకనిర్మాతలు భయపడుతుంటారు. అయితే గత వీకెండ్ మాత్రం ఏకంగా నాలుగు పెద్ద సినిమాలు రిలీజయ్యాయి. వీటి రిజల్ట్ ఏంటనేది పక్కనబెడితే వసూళ్లలో మాత్రం సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఏంటా రికార్డ్? గత వారం రజినీకాంత్ 'జైలర్', చిరు 'భోళా శంకర్', అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2', సన్నీ డియోల్ 'గదర్ 2'. వీటిలో రజినీ, సన్నీ చిత్రాలకు హిట్ టాక్ రాగా.. అక్షయ్ మూవీకి మిక్స్డ్ టాక్, చిరు సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చింది. అయితేనేం వీకెండ్లో మాత్రం దుమ్ముదులిపే వసూళ్లు దక్కించుకున్నాయి. మొత్తంగా ఈ నాలుగు సినిమాలకు ఆగస్టు 11-13 మధ్య రూ.390 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. (ఇదీ చదవండి: హైపర్ ఆదితో పెళ్లి? క్లారిటీ ఇచ్చేసిన వర్షిణి!) దేశ సినీ చరిత్రలో ఓ వీకెండ్ ఇన్ని కోట్ల కలెక్షన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని ఓ నోట్ రిలీజ్ చేసింది. అలానే మూడు రోజుల్లో ఏకంగా 2.10 కోట్ల మంది థియేటర్లలోకి వచ్చారని పేర్కొంది. కరోనా తగ్గుదల తర్వాత థియేటర్లలో సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుండటం ఆనందంగా ఉందని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఏయే సినిమాలకు ఎంత? ఈ నాలుగు సినిమాల్లో 'జైలర్' కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రూ.32 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన రజినీ చిత్రం.. ఓవరాల్‌గా రూ.300 కోట్ల మార్క్ దాటేసినట్లు సమాచారం. మరోవైపు 'గదర్ 2' వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.134 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అలానే అక్షయ్ 'ఓ మై గాడ్ 2' చిత్రం రూ.50 కోట్ల మార్క్‌కి చేరువలో ఉంది. చిరు 'భోళా శంకర్'కు రూ.20 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఏదేమైనా గత వీకెండ్ సినీ ప్రియులకు వినోదం పంచింది. చాలారోజుల తర్వాత బాక్సాఫీస్ బద్దలైపోయేలా చేసింది. BIGGGEST NEWS… ⭐️ #Jailer ⭐️ #Gadar2 ⭐️ #OMG2 ⭐️ #BholaaShankar 🔥 COMBINED Gross BO of ₹ 390 cr+ 🔥 COMBINED Footfalls of 2.10 cr+ 🔥 ALL-TIME Theatrical Gross #BO record in 100+ year history Note: 11 - 13 Aug 2023 weekend Multiplex Association of India and Producers Guild… pic.twitter.com/kofNvtXNpc — taran adarsh (@taran_adarsh) August 14, 2023 (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ కి సర్జరీ.. కారణం అదే!) -
'చిరంజీవి ఇబ్బంది పెడుతున్నారా?'.. వైరలవుతోన్న భోళాశంకర్ నిర్మాత వాట్సాప్ చాట్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. మెహర్ రమేశ్ దర్శకత్వంలో.. అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. తొలిరోజు వసూళ్లు బాగానే రాబట్టినా.. ఆ తర్వాత భారీగా పడిపోయాయి.అదే సమయంలో రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రానికి హిట్ టాక్.. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. (ఇది చదవండి: స్కూల్ ఫ్రెండ్స్‌తో రీ యూనియన్ అయిన టాప్ హీరో.. ఫోటోలు వైరల్) ఈ నేపథ్యంలో రెండు రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ తెగ వైరలవుతున్నాయి. తన రెమ్యునరేషన్ కోసం నిర్మాతను మెగాస్టార్ ఇబ్బంది పెడుతున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. చిరుకు పారితోషికం చెల్లించేందుకు నిర్మాత తన ఆస్తులను తాకట్టు పెడుతున్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో వైరలవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై ఇప్పటికే బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ సైతం క్లారిటీ ఇచ్చాడు. ఈ వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశాడు. ఆయనకు ఇంటికి వెళ్లగా.. దగ్గరుండి మరీ బాగా చూసుకున్నారని ట్వీట్ చేశారు. అయితే తాజాగా భోళాశంకర్ నిర్మాత అనిల్ సుంకర వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. సార్ రెమ్యునరేషన్ విషయంలో మీపై వస్తున్న వార్తలు నిజమేనా అంటూ ఓ మెగా అభిమాని నిర్మాతకు అనిల్‌కు మేసెజ్ చేశారు. ఇది చూసిన అనిల్ సుంకర.. 'అలాంటిదేం లేదు.. నేనే ఫ్లైట్‌లో యూఎస్ వెళ్తున్నా అంటు బదులిచ్చారు. ఇది ఒకసారి చూడండి సార్ అడగ్గా.. దానికి బదులిస్తూ.. 'మీరు అలాంటివేమీ మీరు పట్టించుకోవద్దు.. నేను మెగాస్టార్‌తో మరో సినిమా తీయబోతున్నా. చిరంజీవి చాలా మంచివ్యక్తి. వారి ప్రశ్నలన్నింటికీ సినిమాతోనే సమాధానం చెబుదాం. అంటూ అతనికి రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనిల్ సుంకర వాట్సాప్ చాట్ తెగ వైరలవుతోంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ చాట్ చూస్తే చిరంజీవికి, నిర్మాతకు మధ్య గ్యాప్ పెరిదిందన్న వార్తలు రూమర్స్ అని అర్థమవుతోంది. (ఇది చదవండి: భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్ ) -
భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్
అన్ని రీమేక్‌లు వర్కవుట్ అవుతాయనుకుంటే పొరపాటే! కొన్ని మంచి విజయాలను అందించినా మరికొన్ని మాత్రం దారుణ అపజయాలను తీసుకొస్తాయి. భోళా శంకర్ విషయంలో ఇదే జరిగింది. 2015లో తమిళంలో వచ్చిన వేదాళం మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టిన ఈ సినిమాపై డైరెక్టర్ మెహర్ రమేశ్ మనసు పారేసుకున్నాడు. చిరంజీవితో తీయాలనుకున్నాడు. దెబ్బ కొట్టిన జైలర్ అక్కడ హిట్టంటే ఇక్కడ కూడా హిట్టే అనుకున్న చిరు వెంటనే ఓకే చేసేశాడు. సినిమా తీశారు. ఆగస్టు 11న బాక్సాఫీస్ బరిలో దిగిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. పైగా అప్పుడే రజనీకాంత్ కూడా జైలర్ సినిమాతో బరిలోకి దిగడం, ఆ చిత్రానికి హిట్ టాక్ రావడంతో ఆడియన్స్ అంతా అటువైపు మళ్లారు. ఫలితంగా భోళా శంకర్ ఫ్లాప్ దిశగా అడుగులు వేస్తోంది. పారితోషికం కోసం పట్టుబట్టిన చిరంజీవి? అయితే ఈ సినిమాకుగానూ తన పారితోషికం మొత్తం ఇస్తే కానీ కుదరదని చిరంజీవి బెట్టు చేశాడని, దీంతో నిర్మాత అనిల్ సుంకర తన ఆస్తులు తాకట్టు పెట్టి మరీ అతడికి డబ్బులు ఇచ్చేశాడంటూ ఓ ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై బేబీ డైరెక్టర్ సాయి రాజేశ్ ఘాటుగానే స్పందించాడు. 'నిజం చెప్పులేసుకునేలోపు అబద్ధం ఊరంతా చుట్టి వస్తుంది. ఇంకో వారం రోజులు చిరంజీవి ముక్కు పిండి మరీ డబ్బులు ఎలా వసూలు చేశాడో కథలు కథలుగా వస్తాయి. ఇటు పక్క ఎలాగో నిజం చెప్పే మనిషి ఉండడు. స్వయంగా ఆయన చేత్తో కాఫీ మేము ఉండగా అనిల్ సుంకర గారు వచ్చారని, ఆయన్ను వెయిట్ చేయించాడని స్టాఫ్‌తో చెప్పి, పైకి రాగానే అటు వైపుగా ఉన్న ఐరన్ సోఫాని తన చేతులతో పక్కకు జరిపి మరీ కూర్చోబెట్టారు. పనిమనిషి తీసుకువచ్చిన కాఫీని ముగ్గురికి ఆయనే ఇచ్చారు. నిర్మాతకు ఆయన ఇచ్చే మర్యాద అలాంటిది! బాధాతప్త హృదయంతో నేను అనిల్ సర్ దగ్గర పని చేసే ఓ వ్యక్తికి ఫోన్ చేసి అసలు నిజం తెలుసుకున్నాను.. మా బాస్ మీరనుకుంటున్నట్లు కాదు.. ఆయన వేరే.. మా హీరో చిరంజీవిని చూసి నేను గర్విస్తున్నాను' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌తో చిరు, అనిల్ సుంకర మధ్య ఎటువంటి గొడవ జరగలేదని స్పష్టమవుతోంది. చదవండి: 20 ఏళ్ల తర్వాత ఆ స్టార్ హీరోకు ఓకే చెప్పిన జ్యోతిక -
చిరు కొత్త సినిమా ప్రకటన.. సూపర్ హిట్ డైరెక్టర్‌కు ఛాన్స్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఈ శుక్రవారం (ఆగస్టు 11) రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి నెగెటివ్ టాక్‌ను తెచ్చుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన వసూళ్లను రాబట్టలేకపోవచ్చు. అంతేకాకుండా చిత్ర నిర్మాతలకు భారీగా నష్టాలు రావడం ఖాయం అని తెలుస్తోంది. ముఖ్యంగా మెహర్ రమేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన ఔట్‌డేటెడ్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతనిపై భారీగా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. థియేటర్ల వద్దే ఆయనపై పలు వ్యాఖ్యలతో ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత సినిమాకు డైరెక్ట్ చేయాలంటే చాలా ఘట్స్ ఉండాల్సిందే. వాల్తేరు వీరయ్య మినహా వరసు ప్లాపులతో ఉన్న చిరుకు ఖచ్చితంగా భారీ హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి సమయంలో చిరంజీవి తర్వాత చేయనున్న ఓ సినిమాపై తాజాగా సమాచారం బయటికి వచ్చింది. తన 157వ చిత్రాన్ని సోషియో ఫ్యాంటసీ జోనర్లో మెగాస్టార్ చేయనున్నారు. బింబిసార మూవీ ఫేమ్ డైరెక్టర్ వశిష్ఠ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. తాజాగా, ఈ మూవీ షూటింగ్ ప్రారంభం గురించి సమాచారం బయటికి వచ్చింది. ఎప్పుడు ప్రారంభం చిరంజీవి - డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్లో ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లో మొదలుకానున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం డేట్లను కూడా మెగాస్టార్ కేటాయించారట. ఈ సినిమాకు 'ముల్లోక వీరుడు' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. చిరంజీవి కెరీర్లో మైలురాయి చిత్రంగా నిలిచిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి' తరహాలోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ రీమేక్ సంగతేంటి..? ఈ సోషియో ఫ్యాంటసీ సినిమా కంటే ముందు మలయాళ సినిమా 'బ్రో డాడీ' రీమేక్ మూవీని చిరంజీవి మొదలుపెడతారని తెలుస్తోంది. 'సోగ్గాడే చిన్ననాయన, బంగార్రాజు మూవీస్ ఫేమ్ కల్యాణ్ కృష్ణ ఈ మెగా156 చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. ఇప్పుడు భోళా శంకర్ దెబ్బతో ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టమేనని సమచారం. ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్స్ వరసగా రీమేక్స్ సినిమాలే చేస్తుండటంతో సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా కొంతమేరకు అసహనానికి గురౌతున్నారు. దీంతో బ్రో డాడీని పక్కనబెట్టి... సోషియో ఫ్యాంటసీ సినిమాకే చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. గతంలో రజనీ,కమల్ వంటి వారికి కంటిన్వ్యూగా ప్లాప్‌లు వచ్చాయి. తర్వాత వారిద్దరికి జైలర్,విక్రమ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వారి స్టామినా ఎంటో చూపించాయి. ఇలాగే చిరుకు ఒక్క సినిమా పడితే చాలు టాలీవుడ్లో తన సత్తా ఎంటో చెబుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. -
మెగా బ్రదర్స్‌కు రీమేక్స్ నేర్పుతున్న పాఠాలు!
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం 'రీమేక్'. మంచి కథ చెప్పాలనో లేదా పని ఈజీ అయిపోతుందనో తెలీదు కానీ స్టార్ హీరోల దగ్గర నుంచి దర్శకనిర్మాతల వరకు రీమేక్స్‌పై అప్పుడప్పుడు మోజు పడుతుంటారు. అయితే ఈ మధ్య ఆ సరదా కొంచెం ఎక్కువైంది. మెగాబ్రదర్స్నే తీసుకుంటే.. ఈ మధ్యే వారాల వ్యవధిలో తలో రీమేక్ సినిమాని రిలీజ్ చేశారు. వీటికి పాజిటివ్ కంటే నెగిటివ్ టాక్ ఎక్కువొచ్చింది. చిరంజీవి-పవన్ ఈ రీమేక్స్‌లో నటించడం ఓ కారణమైతే, అవి రెండు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలవడం మరో కారణం. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: 'జైలర్'కి మరో హీరో అనిరుధ్.. రెమ్యునరేషన్ అన్ని కోట్లు!) చిరంజీవి 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం' సినిమాకు రీమేక్. ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడే మెగా అభిమానులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ వాళ్ల బాధ పట్టించుకునే నాథుడు ఎవరు? ఇక మెహర్ రమేశ్ దర్శకుడు అని తెలియగానే గగ్గోలు పెట్టారు. ఏం చేస్తాడో ఏంటో అని భయపడ్డారు. ఇప్పుడు వాళ్లు అనుకున్నదే నిజమైంది. ఎప్పుడో జమానా కాలంలో తీయాల్సిన మూవీ ఇప్పుడు తీశారని, చిరు ఇమేజ్ డ్యామేజ్ చేశాడని బండ బూతులు తిడుతున్నారు! మెగాస్టార్ చిరంజీవి అసలు 'భోళా శంకర్' ఎందుకు చేశారనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కాని ప్రశ్న. ఎందుకంటే కమల్‌హాసన్, రజనీకాంత్, మోహన్‌లాల్, మమ్ముట్టి.. చిరుతో పాటు దక్షిణాదిలో ఆయా భాషల్లో పేరు తెచ్చుకున్న స్టార్ హీరోలు. వాళ్లందరికీ రియాలిటీ అర్థమై, వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. చిరు కూడా ఆ తరహా కథలను ఎంచుకుంటే బెటర్. భోళా.. లాంటి సినిమాలు ఒకప్పుడు ఆడేవేమో కానీ ఇప్పుడు అయితే చాలా కష్టం. ఇప్పుడు అంతా సోషల్ మీడియా జమానా. ఏ చిన్న తప్పు దొరికినా ఏకిపారేస్తారు. ఇప్పుడు వాళ్లకు 'భోళా శంకర్' దొరికింది. ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో యంగ్ హీరో పెళ్లి... డేట్ కూడా ఫిక్స్!) చిరు సంగతి ఇలా ఉంటే పవన్ పరిస్థితి ఇంకా విచిత్రం! రీఎంట్రీ తర్వాత పవన్ మూడు సినిమాలు చేస్తే.. అవన్నీ హిందీ, మలయాళ, తమిళంలో వచ్చిన చిత్రాలకు రీమేక్స్. పని తక్కువ, రెమ్యునరేషన్ ఎక్కువ వస్తుందనే ఆలోచనతో సినిమాలు చేశాడు! ఫ్యాన్స్ ఏమో దీన్ని 'మహా ప్రసాదం' అన్నట్లు హడావుడి చేశారు. కట్ చేస్తే సాధారణ ప్రేక్షకుడు మాత్రం 'మాకేంటి ఈ ఖర్మ' అని తనలో తానే తిట్టుకున్నాడు. అయితే మెగా బ్రదర్స్ చేస్తున్న రీమేక్స్ మెగా అభిమానులని ఎంటర్టైన్ చేయొచ్చు. కానీ సాధారణ ప్రేక్షకుడి మాత్రం వీళ్లకు మెల్లగా దూరమైపోతున్నాడు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. కాస్త లేటయినా సరే స్ట్రెయిట్ కథలతో సినిమాలు చేస్తే పర్లేదు. అలా కాదు మేం రీమేక్స్ చేస్తాం అనుకుంటే మాత్రం మెగాస్టార్, పవర్‌స్టార్ అనే ట్యాగ్స్ హిస్టరీలో తప్ప రియాలిటీలో కనిపించవు! అభిమానులకు బాధగా అనిపించినా సరే ఇదే నమ్మలేని నిజం. (ఇదీ చదవండి: జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు) -
జైలర్ కలెక్షన్స్: టైగర్ కా హుకుం.. రికార్డులే రికార్డులు
రజనీకాంత్ రంగంలోకి దిగితే వార్ వన్‌సైడే! సరైన కంటెంట్ పడాలే కానీ ఆయన్ను ఆపడం ఎవరితరమూ కాదు. చాలాకాలం తర్వాత రజనీ జైలర్ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. అది కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులు కొల్లగొడుతున్నాడు. కొన్ని సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్‌ను సైతం కేవలం రెండు, మూడు రోజుల్లోనే రాబట్టాడు. టైగర్ కా హుకుం అన్నట్లుగా బాక్సాఫీస్ రికార్డులు జైలర్ సినిమాకు దాసోహమవుతున్నాయి. ఆగస్టు 10న జైలర్ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. మొదటి నుంచీ పెద్దగా ప్రచారం లేదు కానీ ప్రీరిలీజ్ నుంచి ప్రచారం జోరందుకుంది. తీరా బాక్సాఫీస్‌లో బొమ్మ పడ్డాక బ్లాక్‌బస్టర్ హిట్ టాక్.. రెండో రోజు వసూళ్లు కాస్త నెమ్మదించినా మూడో రోజుకు ఊపందుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.220 కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలి రోజు కలెక్షన్స్(రూ.70 కోట్లు)తో 2023లో తమిళనాడులో బిగ్గెస్ట్ ఓపెనింగ్, బిగ్గెస్ట్ ఇండియన్ ప్రీమియర్ ఆఫ్ 2023 ఇన్ యూఎస్ఏ, బిగ్గెస్ట్ తమిళ్ ఓపెనర్ ఆఫ్ ఓవర్సీస్ ఇన్ 2023 రికార్డులు జైలర్ హస్తగతమయ్యాయి. రజనీ కేవలం తమిళ హీరోనే కాదు దశాబ్ధ కాలం నుంచి తెలుగులోనూ అతడి చిత్రాలు రిలీజవుతూ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఆయనకు మంచి ఫ్యాన్‌బేస్ ఉంది. ఫలితంగా జైలర్‌కు తెలుగులోనూ కలెక్షన్స్ అదిరిపోతున్నాయి. చాలాచోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడుతున్నాయి. భోళా శంకర్‌కు మిశ్రమ స్పందన వస్తుండటంతో చాలా థియేటర్లలో ఈ సినిమాను జైలర్‌తో రీప్లేస్ చేస్తున్నారు. అటు వసూళ్లు కూడా భోళా శంకర్ కన్నా జైలర్కే ఎక్కువగా వస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ జైలర్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం జైలర్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. 12th August Box Office #Jailer Day 3 AP/TS, TN, KA, KL, India, WW >> #BholaaShankar Day 2 pic.twitter.com/c0j5zKUa9s — Manobala Vijayabalan (@ManobalaV) August 13, 2023 చదవండి: జైలర్ నటుడి కొత్త సినిమా.. ఇద్దరు హీరోయిన్లతో ఆ హీరోని చెంపదెబ్బ కొట్టినా, అతనిపై ఉమ్మినా..రూ.10 లక్షలు నజరానా! -
భోళా శంకర్ సినిమాకు వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు
అనంతపురం: సినిమా చూసేందుకు ఉత్సాహంగా బయలుదేరిన ముగ్గురు మిత్రులు మార్గమధ్యంలోనే రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఇందులో ఇద్దరు దుర్మరణం చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం పావగడ సమీపంలోని కడమలకుంటె గ్రామం గేటు వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రొద్దం మండలం చిన్నకోడిపల్లి గ్రామానికి చెందిన కురుబ అంజినప్ప కుమారుడు ఈశ్వర్ (15), కురుబ ధనుంజయ కుమారుడు జశ్వంత్(15), చాకిల పరమేష్ కుమారుడు రాము మిత్రులు. ఈశ్వర్, జశ్వంత్ పదో తరగతి, రాము ఇంటర్ చదువుతున్నారు. రెండో శనివారం సెలవు కావడంతో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా చూసేందుకు పావగడ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. జశ్వంత్ బైక్‌పై ముగ్గురూ స్వగ్రామం నుంచి బయలుదేరారు. కడమలకుంటె గ్రామం గేటు వద్దకు రాగానే పావగడ నుంచి రొద్దం వైపు వేగంగా వెళ్తున్న బొలెరో (ఏపీ 39టీవీ 2258) వాహనం వీరి బైక్‌ను ఢీ కొంది. ముగ్గురూ కింద పడిపోయారు. బైక్‌పై ఉన్న ఈశ్వర్, జశ్వంత్ తలలు పగిలి తీవ్రరక్తస్రావం కాగా, వారు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రామును స్థానికులు పావగడ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్థానిక సీఐ అజయ్ సారథి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈశ్వర్, జశ్వంత్ మృతితో చిన్నకోడిపల్లిలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన కుమారులు ఇలా అర్ధంతరంగా రోడ్డుప్రమాదంలో దుర్మరణం చెందడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
మొన్న ఏజెంట్.. ఇప్పుడు భోళా.. పాపం సుంకర!
ఏప్రిల్ నెలలో ఏజెంట్,ఆగష్టు లో భోళా శంకర్... ఈ సంవత్సరంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రెండు భారీ డిజాస్టర్స్.ఈ సినిమాల్లో హీరోలు వేరు,డైరెక్టర్స్ వేరు.కానీ పాపం నిర్మాత మాత్రం ఒక్కరే. ఆయనే అనిల్ సుంకర. వీటిలో ఏజెంట్ బడ్జెట్ దాదాపు 70 కోట్లు...వచ్చింది మాత్రం 12 నుండి 13 కోట్లు. ఓటీటీలో ఏం లొల్లి జరిగిందో ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇక భోళా శంకర్ బడ్జెట్ 101 కోట్లు. ఫస్ట్ డే 28 కోట్ల గ్రాస్ కలెక్షన్స్. ఈ సినిమాకి వచ్చిన టాక్ కి 50 కోట్లు రావడం కూడా కష్టమే. చిరంజీవి కూడా ఈ సినిమా డిజాస్టర్ ని తప్పించలేదని నేషనల్ మీడియా కూడా రాసుకొస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు కాకపోవడం. ఇంత దారుణమైన టాక్ వచ్చాక వాళ్ళు కూడా బేరాలు ఆడతారు. అక్కడ కూడ ఎక్కువ ఆశించలేం. (చదవండి: ‘భోళా శంకర్’కు ఫస్ట్‌డే షాకింగ్ కలెక్షన్స్.. ఎంతంటే?) ఇలా రెండు దారుణమైన సినిమాల మధ్యలో ఆ ప్రొడ్యూసర్ కి కాస్త ఊరట అంటే సామజవరగమన సూపర్ హిట్, హిడింబ టేబుల్ ప్రాఫిట్. అయినా కూడా ఆ రెండు సినిమాల మీద వచ్చిన లాభం ఈ రెండు సినిమాల పబ్లిసిటీ కి కూడా సరిపోదు. అయితే ఇక్కడ సదరు నిర్మాత నిస్సహాయుడు. ఎందుకంటే రెండు సినిమాల విషయంలో కూడా నిర్మాత మాట్లాడే అవకాశమే లేదు. ఇక నుంచి స్క్రిప్ట్ ఒక్కటే కాకుండా కాస్త ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ గా ఉండే హీరోలతో సినిమాలు చేస్తే ఆ బ్యానర్ నిలబడి మంచి సినిమాలు అందించే అవకాశం ఉంటుంది. -
‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజే నెగెటివ్ టాక్ లభించింది. మెగాస్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. (చదవండి: భోళా శంకర్ మూవీ రివ్యూ) ‘భోళా శంకర్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ.28 కోట్ల గ్రాస్(రూ.18.61 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా రూ. 15.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ.4.50 కోట్లు, సీడెడ్- రూ.2 కోట్లు, ఈస్ట్-1.50 కోట్లు, వెస్ట్- రూ.1.85 కోట్లు, గుంటూరు- రూ.2.07 కోట్లు, కృష్ణా- రూ.1.02 కోట్లు, నెల్లూరు-రూ.73లక్షలు, కర్ణాటక, ఓవర్సీస్లో మొత్తంగా రూ. 3.1 కోట్లు వసూలు చేసింది. టార్గెట్ రూ.82 కోట్లు భోళా శంకర్ చిత్రానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రిరీలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో అంత స్థాయిలో వసూళ్లను రాబట్టకపోవచ్చునని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రజనీకాంత్ ‘జైలర్’సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కూడా ‘భోళా శంకర్’పై పడే అవకాశం ఉంది. చిరు గత సినిమాల కలెక్షన్స్ ఎంత? ఇక చిరంజీవి గత చిత్రాల వసూళ్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇది కాస్త తక్కువనే చెప్పాలి. చిరంజీవి గత ఐదు సినిమాల ఫస్ట్‌డే వసూళ్లను పరిశీలిస్తే.. వాల్తేరు వీరయ్య-రూ.22.75 కోట్లు, గాడ్ ఫాదర్-రూ.12.83 కోట్లు, ఆచార్య- రూ.28.29 కోట్లు, సైరా- రూ. 36.37 కోట్లు, ఖైదీ నెం 150- రూ. 23.16 కోట్ల వసూళ్లను రాబట్టాయి. భోళా శంకర్‌కు తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. -
చిరంజీవిపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్!
సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ. ఆయన తీసే సినిమాలే కాదు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా వివాదస్పదం అవుతుంటాయి. ఏ అంశంపైనా అయినా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఆయనకు అలవాటు. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ చేశాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వేదాళంగా తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ వినిపించింది. సాధారణ ప్రేక్షకులతో పాటు మెగా అభిమానులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. చిరంజీవి ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేలా ఈ చిత్రం ఉందని కొంతమంది మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రం విడుదలకు ముందు హైపర్ ఆది చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. ప్రిరిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్‌ని పొగడ్తలతో ముంచేశాడు. సినిమా వేదికపై రాజకీయాలు మాట్లాడుతూ..మెగా ఫ్యామిలీపై భక్తిని చాటుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆది స్పీచ్‌పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. (చదవండి: భోళా శంకర్ మూవీ రివ్యూ) రియాల్టీకి దూరమవుతున్నారు: ఆర్జీవీ ఇక భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో నెట్టింట మరోసారి ‘భోళా శంకర్’పై చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో కొంతమంది అతిగా మాట్లాడారనే అభిప్రాయం వ్యక్తం చేస్తునారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కొంతమంది పొగడ్తలకు పడిపోయి, కథల ఎంపిక విషయంలో పొరపాటు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇలాంటి విషయాలపై చాలా చురుగ్గా స్పందించే ఆర్జీవీ.. తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశాడు. పొగడ్తలకు అలవాటు పడిపోయి రియాల్టీకి దూరమవుతున్నారని అనిపిస్తోందంటూ పరోక్షంగా చిరంజీవిని విమర్శించాడు. ‘జబర్ , హైపర్ లాంటి ఆస్థాన విదూషకుల భజన పొగడ్తలకి అలవాటుపడిపోయి , రియాల్టీ కి మెగా దూరమవుతున్నారని అనిపిస్తోంది’అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా ‘పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు ఉండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. పొగడ్తలతో ముంచే వాళ్ళ బ్యాచ్ కన్నా ప్రమాదకరమైన వాళ్ళు వుండరు... రియాల్టీ తెలిసే లోపల రాజు గారు మునిగిపోతారు .. వాళ్ళ పొగడ్తల విషం నుంచి తప్పించుకోవాలంటే ఆ జాతిని మైల్ దూరం పెట్టటమే “Of many a proud structure’s ruin , teeny weeny rain drops have been the cause “… https://t.co/chFBuJHsz1 — Ram Gopal Varma (@RGVzoomin) August 11, 2023 -
హైదరాబాద్ : జువెలరీ షోరూంను ప్రారంభించిన సినీనటి శ్రీముఖి (ఫోటోలు)
-
'భోళా శంకర్' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 'భోళా శంకర్' థియేటర్లలోకి వచ్చేసింది. సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వస్తున్నాయి. అభిమానులు బాగుందని చెబుతుంటే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ఈ వీకెండ్ తర్వాత అసలు విషయం బయటపడుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది. ఇంతకీ ఎందులో ఎప్పుడు రావొచ్చు? (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) కథేంటి? మహాలక్ష్మి (కీర్తి సురేశ్) మంచి పెయింటర్. కోల్‌కతాలో మంచి ఆర్ట్స్ కాలేజీ ఉందని, చెల్లితోపాటు అన్నయ్య శంకర్(చిరంజీవి) అక్కడికి షిప్ట్ అవుతాడు. చెల్లిని కాలేజీలో జాయిన్ చేయిస్తాడు. అక్కడే క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. అయితే ఒకానొక సందర్భంలో అమ్మాయిలని కిడ్నాప్ చేసే ఓ ముఠాతో చిరుకు వైరం ఏర్పడుతుంది. దీంతో శంకర్, మహాలక్ష్మిని విలన్ గ్యాంగ్ టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ఇంతకీ శంకర్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అనేది 'భోళా శంకర్' స్టోరీ. ఆ ఓటీటీలోనే 'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా తీసిన 'భోళా శంకర్'కు మెహర్ రమేశ్ దర్శకుడు. ఈ మూవీలో చిరుకు చెల్లిగా కీర్తి సురేశ్ నటిస్తే, జోడీగా తమన్నా యాక్ట్ చేసింది. సుశాంత్ ఓ పాత్రలో నటించాడు. గెటప్ శీను, శ్రీముఖి, రష్మి తదితరులు సహాయపాత్రలు చేశారు. ఇకపోతే ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. బహుశా 5-6 వారాల తర్వాత అంటే సెప్టెంబరు చివరికల్లా స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ) -
‘భోళా శంకర్’ మూవీ రివ్యూ
టైటిల్: భోళా శంకర్ నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తీ సురేశ్, సుశాంత్, తరుణ్ అరోరా, మురళీ శర్మ, బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిశోర్ గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామబ్రహ్మం సుంకర దర్శకత్వం: మెహర్ రమేష్ సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: డూడ్లీ ఎడిటర్: మార్తాండ్ కే. వెంకటేశ్ విడుదల తేది: ఆగస్ట్ 11, 2023 ‘భోళా శంకర్’ కథేంటంటే.. శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మీ అలియాస్ మహా(కీర్తి సురేశ్) చదువు కోసం హైదరాబాద్ నుంచి కోల్కత్తా వస్తాడు. చెల్లిని ఓ కాలేజీలో జాయిన్ చేసి, అదే నగరంలో టాక్సీ డ్రైవర్ ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ ఓ గ్యాంగ్ నగరంలోని యువతులను కిడ్నాప్ చేసి బయటి దేశాలకు అమ్మేస్తుంటారు(ఉమెన్ ట్రాఫికింగ్). ఈ కేసు చేధించడంలో పోలీసులు ఆటో, క్యాబ్ డ్రైవర్ల సహాయం తీసుకుంటారు. అనుమానితుల ఫోటోలను చూపించి, వాళ్లలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరతారు. శంకర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొంతమంది అమ్మాయిలను రక్షిస్తారు. పోలీసులకు సమాచారం ఇచ్చింది క్యాబ్ డ్రైవర్ శంకర్ అనే విషయం మహిళల అక్రమ రవాణా(ఉమెన్ ట్రాఫికింగ్) చేసే గ్యాంగ్ లీడర్ అలెగ్జాండర్‌కు తెలుస్తుంది. దీంతో అతన్ని శంకర్‌ని టార్గెట్ చేస్తారు. శంకర్ కూడా అలెగ్జాండర్ మనుషులను ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. అసలు శంకర్ నేపథ్యం ఏంటి? హైదరాబాద్‌లో భోళా భాయ్‌గా పిలవబడే శంకర్.. కోల్‌కత్తాకు ఎందుకు వచ్చాడు? ఉమెన్ ట్రాఫీకింగ్ గ్యాంగ్‌తో శంకర్‌కు ఉన్న వైరం ఏంటి? అనేదే తెలియాలంటే థియేటర్లో ‘భోళా శంకర్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ రోజుల్లో రీమేక్ చిత్రాలు చేయడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఒక వేళ రీమేక్ చేసిన ఎలాంటి చిత్రాలు చేయాలి? ఒక భాషలో సక్సెస్ అయి.. ఆ కథ మన ప్రేక్షకులను మెప్పించగలదనే నమ్మకం ఉంటే చేయాలి. అంతేకానీ అక్కడ హిట్ అయింది కదా.. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అనుకుంటే పొరపాటే. ‘భోళా శంకర్’టీమ్ కూడా ఆ పొరపాటు చేశారేమో అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల కిందట రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ సినిమా ‘వేదాళం’చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఈ కథ అప్పట్లో అక్కడి ప్రేక్షకులకు కొత్తగా అనిపించొచ్చు కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం ఈ తరహా సినిమాలు చాలానే చూశారు. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో ఈ ఛాయలు కనిపిస్తాయి. అక్కడ బ్రదర్ సెంటిమెంట్ అయితే.. ఇక్కడ సిస్టర్ సెంటిమెంట్. అంతే తేడా. కథలో మెయిన్ ట్విస్ట్ ‘ఊసరవెళ్లి’ చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది. కథ పాతదైన కథనం అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఇచ్చి పదేళ్లుగా సినిమాలు తీయని మెహర్ రమేష్‌కు మెగాస్టార్ చిరంజీవితో సినిమా అవకాశం ఇస్తే... దానిని ఎంత సద్వినియోగం చేసుకోవాలి? కానీ మెహర్ రమేశ్ మాత్రం ఆ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. రొటీన్ సన్నివేశాలతో బోరింగ్‌గా సినిమాను తెరకెక్కించాడు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఫ్రెష్‌గా, వావ్ అనిపించేలేలా తెరకెక్కించలేదు. ఉమెన్ ట్రాఫికింగ్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. అయితే ఈ ఎంట్రీ కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. ఇక ఆ తర్వాత వెన్నెల కిశోర్‌తో వచ్చే కామెడీ సీన్ అయితే నవ్వించకపోగా, చిరాకుగా అనిపిస్తుంది. బ్రహ్మానందం కోర్టు సీన్ కూడా అంతే. ఒక్క సీన్ తర్వాత ఒకటి వచ్చి వెళ్తుంది కానీ ప్రేక్షకుడు మాత్రం కథలో లీనం కాడు. ఉన్నంతలో ఒకటి, రెండు యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. ఇంటర్వెల్ సీన్ కూడా అంతగా ఆకట్టుకోదు. ఇక సెకండాఫ్‌లో భోళా భాయ్‌గా చిరంజీవి చేసే యాక్షన్ అదిరిపోతుంది. అయితే అక్కడ కూడా కామెడీ వర్కౌట్ కాలేదు. శ్రీముఖి కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతాయి. ‘ఖుషీ’ సీన్ అయితే మరీ ఘోరం. అలాంటి వాటికి మెగాస్టార్ దూరంగా ఉండడమే బెటర్. చిరంజీవితో మాట్లాడించిన తెలంగాణ యాస కూడా అంతగా ఆకట్టుకోదు. దర్శకుడిగా మెహర్ రమేశ్‌ని మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే.. చిరంజీవిని స్టైలీష్‌గా చూపించడంతో పాటు యాక్షన్స్ బ్లాక్స్‌ని చక్కగా తెరకెక్కించాడు. కానీ కామెడీ, ఎమోషన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. మెగాస్టార్ నటన గురించి ఏం చెప్పగలం? ఎలాంటి పాత్రలో అయినా ఆయన పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ చిత్రంలో కూడా శంకర్, భోళా భాయ్‌గా రెండు ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన చిరు... ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. డ్యాన్స్ విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. కానీ అక్కడక్కడ అతని వయసు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లాయర్ లాస్యగా తమన్నా పాటలకే పరిమితం అయింది. ఆమెతో కొన్ని సనివేశాలు ఉన్నా.. అవి అంతగా ఆకట్టుకోలేవు. ఇక ఈ సినిమాలో చిరు తర్వాత బాగా పండించిన పాత్ర కీర్తి సురేశ్‌ది. చిరంజీవి చెల్లెలు మహాగా ఆమె చక్కగా నటించింది. ఆమె వల్లే కొన్ని ఎమెషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కీర్తి సురేశ్‌ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి శ్రీకర్‌గా సుశాంత్ ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేశాడు. అతనికి కూడా స్క్రీన్ స్పేస్ తక్కువే. ఇక విలన్‌గా తరుణ్ అరోరా పాత్ర రొటీన్‌గా ఉంటుంది. వెన్నెల కిశోర్, రఘుభాబు, గెటప్ శ్రీను, హర్ష లాంటి కమెడియన్స్ ఉన్నా కామెడీ అంతగా పండలేదు. ఇక బ్రహ్మానందం ఒక సీన్‌కే పరిమితం అయ్యాడు. జడ్జీగా ఆయన చేసిన కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మహతి స్వరసాగర్ సంగీతం సినిమాకు మైనస్ అనే చెప్పాలి. పాటలు అంతగా ఆకట్టుకోకపోగా కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా చిరంజీవి స్థాయిలో లేదు. డూడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగానే ఉంది. ఎడిటర్ పనితీరు కూడా అంతే. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లు చాలా రిచ్‌గా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
గూగుల్ మ్యాప్స్కెక్కిన చిరంజీవి.. సినీచరిత్రలోనే తొలిసారి!
మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ అప్పటికీ, ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. తన సినిమా వస్తుందంటే చాలు భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు, ర్యాలీలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు అభిమానులు. ఈరోజు (ఆగస్టు 11) చిరంజీవి భోళా శంకర్ సినిమా రిలీజైంది. ఇప్పటికే అభిమానులు థియేటర్ల ముందు సంబరాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవిపై తమకు ఎవరెస్ట్ శిఖరమంత అభిమానం ఉందని నిరూపించారు అభిమానులు. ఏకంగా గూగుల్ మ్యాప్స్‌లో ఆయన చిత్రాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగాస్టార్ ముఖాకృతిని పోలేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. మొత్తం 800 కిలోమీటర్ల చెక్ పాయింట్స్ పెట్టుకుని జీపీఎస్ నావిగేషన్‌తో వాటిని కలుపుతూ చిరు బొమ్మను గూగుల్ మ్యాప్స్పై కనిపించేలా చేశారు. దీన్ని పర్ఫెక్ట్గా జీపీఎస్ వర్చువల్‌గా గీశారు. ఈ ఫీట్ కోసం 15 రోజులు గ్రౌండ్ వర్క్ చేసి మరీ చిరంజీవికి అద్భుత కానుకనిచ్చారు. ఇటీవల మెగాస్టార్ అభిమానులు ఏకంగా 126 అడుగుల భారీ కటౌట్‌ను సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే! సూర్యపేట - విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న రాజు గారి తోట వద్ద దీన్ని పెట్టారు. తెలుగు సినీ చరిత్రలో ఇంత పెద్ద కటౌట్ ఇప్పటి వరకు ఏ హీరోకు ఏర్పాటు చేయలేదు. భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే.. థియేటర్లలో ఇప్పటికే జాతర మొదలైంది. తమిళ బ్లాక్‌బస్టర్ వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. తమన్నా, కీర్తి సురేశ్ హీరోయిన్స్‌గా నటించారు. చదవండి: జేమ్స్‌బాండ్‌లా పోజు కొడుతున్న ఈ స్టార్ హీరోను గుర్తుపట్టారా? -
Bhola Shankar: ‘భోళా శంకర్’ మూవీ ట్విటర్ రివ్యూ
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం భోళా శంకర్. తమిళ బ్లాక్‌బస్టర్ ‘వేదాళం’కు తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేశ్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ చిరంజీవి మాస్ మూవీ చేస్తుండడంతో ‘భోళా శంకర్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు కూడా సినిమాపై హైప్‌ని క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 11)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పలు చోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.‘భోళా శంకర్’ మూవీ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? తదితర విషయాలు ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. ఇది కేవలం ప్రేక్షకుల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. #BholaShankar is a treat to fans and family entertainer. Blockbuster Hit@MeherRamesh @SagarMahati inka my Boss Chiranjeevi garu as usual, never before ever again one and only megastar ❤️❤️❤️❤️❤️❤️❤️❤️@KChiruTweets — vishnusuman (@vishnusumanChin) August 11, 2023 ట్విటర్లో ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది ఈ చిత్రం బాగుందని ట్వీట్ చేస్తే.. మరికొంతమంది యావరేజ్ మూవీ అని కామెంట్ చేస్తున్నారు. కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. సెకండాఫ్‌లో బాస్ తెలంగాణ యాసలో ఇంకా సూపర్. ఖుషీ సీన్లో మెగాస్టార్ ఇరగ్గోట్టేశాడు. సెంటిమెంట్‌తో కూడా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది’అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. Above average entertainer…positive reports 🔥👌 General consensus…INDIA LO SUPER HIT KODTHUNNAM 🔥💥💯🙌#BholaaShankar #BholaaShankarOnAug11 #BholaaShankarUSA https://t.co/Etn1eewK51 — chaiii ☕️ (@chaithu4mega) August 10, 2023 ఫస్టాఫ్‌లో సాంగ్స్, కామెడీ వర్కౌట్ అయింది. కానీ కొన్ని రొటీన్ ఓల్డ్ సీన్స్ ఆకట్టుకోలేదు. ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్. సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలు వేదాళంలో ఉన్నట్లే ఉంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 1st half: Unbearable & Most Irritating Horrible Music , Bgm makes u run away frm theatre @KChiruTweets himself is so Artificial Not even a single scene u wil connect Horrible Cinematography 🙏🏻🙏🏻 Below below average 1st half #BholaShankar https://t.co/kxvesKGiOX — Rayalaseema Chinnodu (@14karthikeya) August 11, 2023 1st half: Unbearable & Most Irritating Horrible Music , Bgm makes u run away frm theatre @KChiruTweets himself is so Artificial Not even a single scene u wil connect Horrible Cinematography 🙏🏻🙏🏻 Below below average 1st half #BholaShankar https://t.co/kxvesKGiOX — Rayalaseema Chinnodu (@14karthikeya) August 11, 2023 2nd Half : Hospital scene with Megastar is absolutely heart wrenching to see, his acting levels have only gone up 🔥🙌 A single drop of tear falls from his eyes and creates goosebumps! Emotional content at its BEST 💯#BholaaShankar #BholaaShankarOnAug11 pic.twitter.com/0XZCBVXpd8 — chaiii ☕️ (@chaithu4mega) August 10, 2023 Megastar Title tho Modhaletti! 1st half lo Boss Comedy, 1st Fight scene is Bibatbsammm!! Boss Mass Fights Racha🔥 Second Half lo Graph ala okesari paiki Legusudii,Boss Looks,Sister Sentiment,Comedy,Jam Jam Song, Telanga Slang Adhiripoyindi🤩#BholaaShankar BlockBuster Loaded 🔥 pic.twitter.com/pWPiu0IIBo — Bharthi (@SunShiine0001) August 10, 2023 Without hype.. Decent hit Boss looks🔥 Don’t ask me about Bgm🥵 Kushi Scean excellent 🔥 Overall Blockbuster bhola#BholaaShankar — JANASAINKUDU🔥 (@Chirupawan3006) August 10, 2023 Finally show completed, except for 2 action sequences and 1 comedy scene nothing worked best part of the movie was End Card. Flop #BholaaShankar — Peter (@urstrulyPeter) August 10, 2023 #Mrugaraju #SDZ disasters ayina kuda TV lo vasthe ippatiki chustam because andulo nee effort kanipistadi... Kani ee madya fans ni audience ni chala granted ga teesukuntunnav @KChiruTweets last year #Acharya ee year #BholaaShankar 🙏 — BAGWELL (@bagwellllllll) August 11, 2023 #BholaaShankar A Commercial Movie with a few alright action blocks/comedy scenes but nothing else works. While the 1st half doesn’t work at all, the 2nd half is somewhat ok but still lacks the punch. An Outdated script/storytelling that ends up being below par. Rating: 2.25/5 — Venky Reviews (@venkyreviews) August 10, 2023 Vedhalam remake ani telusu… Mehar Anna direction ani telusu… Burra intlo petti vellanu… Ainaa ekkala…🙏🏻🙏🏻🙏🏻 Vedhalam ki Ajith and Anirudh duty chesaru…ikkada MegaStar ki Meher Anna vunte inkem vuntadi bokka!!#BholaaShankar https://t.co/HxPfIDCWlg — Akhil Praveen (@akhil_3101) August 10, 2023 Another HIT for MegaStar @KChiruTweets ! Especially 2nd half .. Kummesaadu Basu #BholaaShankar 🫶 Good Job @MeherRamesh !!! — Sreedhar Adabala (@SreedharAdabala) August 11, 2023 -
Fact Check: ‘బోలో’ శంకరా.. నిబంధనలు పాటించరా?
సాక్షి, అమరావతి : సినిమా టిక్కెట్ రేట్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. అదీ.. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి, రూపొందించిన నిబంధనలే. గతంలో విడుదలైన సినిమాలకు ఈ నిబంధనల మేరకు సమాచారాన్ని, ఆధారాలను సమర్పించి, ఆ సినిమాల నిర్మాతలు రేట్లు పెంచుకున్నారు. చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాకు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా సంస్థలకు నచ్చలేదట. వెంటనే అవి ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని ప్రారంభించాయి. నిబంధనలు పాటించకపోయినా, ఆధారాలు సమర్పించకపోయినా సరే.. టిక్కెట్ రేట్లు పెంచాలంటూ అడ్డగోలుగా వాదిస్తున్నాయి. నిబంధనలు పాటించినట్టు ఆధారాలు సమర్పించినందునే గతంలో చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు టిక్కెట్ రేట్లను తొలి వారం రోజుల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అదే రీతిలో నిబంధనలను పాటించినట్టు ఆధారాలు సమర్పించాలని చెబితే మాత్రం భోళా శంకర్ సినిమా నిర్మాణ సంస్థ ముఖం చాటేసింది. పైగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తుండటం విస్మయపరుస్తోంది. ఈ వ్యవహారంలో అసలు నిజాలివీ.. టిక్కెట్ రేట్ల పెంపునకు నిబంధనలు ఇవీ... సినిమా టికెట్ల రేట్లను తొలి వారం, పది రోజులపాటు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలను ఖరారుచేసింది. సినీ పరిశ్రమకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించి చర్చించి మరీ ఈ విధి విధానాలను రూపొందించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 11న మెమో జారీ చేసింది. ఆ ప్రకారం హీరో హీరోయిన్, డైరెక్టర్ల పారితోíÙకాలు కాకుండా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వ్యయం కలిపి రూ.100 కోట్లు దాటాలి. సినిమా షూటింగ్లో కనీసం 20 శాతం ఆంధ్రప్రదేశ్‌లో చేయాలి. సినిమా నిర్మాణ వ్యయానికి సంబంధించిన అఫిడవిట్‌ను సమర్పించాలి. దాన్ని చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా ధ్రువీకరించాలి. సినిమా నిర్మాణానికి చేసిన చెల్లింపులకు సంబంధించి జీఎస్టీ/ ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు సమర్పించాలి. మొత్తం 12 రకాల సాధారణ పత్రాలను సమర్పించాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా టిక్కెట్ రేట్లు పెంచమంటే ఎలా? భోళా శంకర్ సినిమాను నిరి్మంచిన అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ నిబంధనలను ఏవీ పట్టించుకోలేదు. తొలి వారం రోజులు టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వాలని ఆ సంస్థ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ)కి జులై 30న దరఖాస్తు చేసింది. దానిని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ పరిశీలించింది. జీవో నంబర్ 2 ప్రకారం ఇచ్చి న ఉత్తర్వుల్లో నిబంధనలను పాటించాలని, ఆధారాలు చూపాలని ఈ నెల 2న లిఖితపూర్వకంగా చెప్పింది. కానీ అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పటివరకు ఆ ఆధారాలను సమర్పించలేదు. వైజాగ్ పోర్టు, అరకు ప్రాంతాల్లో 25 రోజలపాటు భోళా శంకర్ సినిమా షూటింగ్ చేసినట్టు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అంతకు ముందు దరఖాస్తులో తెలిపింది. అందుకు ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ కోరింది. దీనిని సినిమా నిర్మాణ సంస్థ పట్టించుకోలేదు. నిర్మాణ వ్యయం అఫిడవిట్, జీఎస్టీ చెల్లింపులు, ట్యాక్స్ రిటర్న్‌లు, ఇన్వాయిస్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు వంటి పత్రాలు వేటినీ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పించనే లేదు. ఇవేవీ లేకుండా టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది?. ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఇదే రీతిలో అనుమతి చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య, వాల్తేర్ వీరయ్య సినిమాలకు ఈ నిబంధనల ప్రకారమే టిక్కెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆ సినిమాల నిర్మాణ సంస్థలు నిర్ణీత పత్రాలతో సహా దరఖాస్తు చేశాయి. వాటిని పరిశీలించి సక్రమంగా ఉండటంతో టిక్కెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం భోళా శంకర్ చిత్రం నిర్మాణ సంస్థ కూడా ఇదే రీతిలో నిబంధనలను పాటిస్తే రేట్ల పెంపునకు అనుమతిస్తామని ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ స్పష్టం చేసింది. కానీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దు్రష్పచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భోళా శంకర్ సినిమా టిక్కెట్ రేట్ల పెంపునకు అనుమతినివ్వడం లేదంటూ కొన్ని మీడియాలతోపాటు సోషల్ మీడియాలో దు్రష్పచారం చేస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టేందుకు యత్నిస్తున్నారు. -
'భోళా శంకర్' సినిమాకు లైన్ క్లియర్..
చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా విడుదలను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసి సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' టికెట్ ధరలకు బ్రేక్.. కారణం ఇదే) వివాదం ఏంటి? ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు తనకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని గతంలో అనిల్ సుంకర అగ్రిమెంట్ రాసిచ్చారని అందుకు గాను తన నుంచి రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారని కోర్టుకు వైజాగ్ సతీష్ వెళ్లారు. ఈ మొత్తం చెల్లించినట్లు తన దగ్గర ఉన్న పక్కా ఆధారాలను కోర్టుకు ఆయన అందించాడు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం భోళా శంకర్ విడుదలకు అడ్డు చెప్పలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ సినిమా రేపు యథాతథంగా రిలీజ్ కానుంది. అగ్రిమెంట్ బ్రేక్ చేశారు 'ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలిశాను. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి, వైజాగ్ వెళ్లిపోయాను. 'సామజవరగమన' వైజాగ్ హక్కులు నాకు ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది' కోర్టులో ఏం జరిగింది? జడ్జి, బుధవారం అడిగిన క్లారిఫికేషన్స్‌పై ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. ఏజెంట్ సినిమాకు ఇస్తామన్న డిస్ట్రిబూషన్ ఇవ్వకుండా ఏకే ఎంటర్టైన్మెంట్ మోసం చేసిందని, తదుపరి సినిమా విడుదలకు 15 రోజుల ముందు డబ్బు తిరిగి ఇస్తామని మరోసారి మోసంచేస్తున్నారని గాయిత్రీదేవి ఫిల్మ్స్ ఓనర్ బత్తుల సత్యనారాయణ చెప్పారు. ఇకపోతే ఏజెంట్ సినిమాతో తమకు కూడా నష్టం వచ్చిందని చెప్పిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్, 30 కోట్ల నష్టాన్ని వేరే సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ పూరిస్తామని క్లారిటీ ఇచ్చింది. అయితే రూ.28.30 కోట్లు ఇప్పుడే చెల్లించాలని గాయత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పట్టుబడుతోంది. 'సామజవరగమన' ద్వారా గాయత్రి ఫిలిమ్స్ కు రూ.కోటి ప్రాఫిట్ ఇచ్చాం, తమ ప్రతి సినిమాలోనూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని గాయత్రి ఫిల్మ్స్ కు ఇస్తున్నాం అని ఏకే ఎంటైర్టైన్మెంట్స్ వాదన వినిపించింది. భోళా శంకర్ సినిమాలో మొత్తం పెట్టుబడి తమదే 120 కోట్లు పెట్టామని, ఇప్పటికే ప్రీ బిజినెస్ రూ.60 కోట్ల దాకా జరిగిందని తెలిపింది. ఇంకా రూ.60 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. -
'భోళా శంకర్' టికెట్ ధరల పెంపునకు బ్రేక్.. కారణమిదే
ప్రముఖ నటుడు చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడింది. టికెట్ల ధరలను పెంచాలంటే నిబంధనల ప్రకారం నిర్ణయించిన 11 డాక్యుమెంట్లును ఆ చిత్ర నిర్మాతలు సమర్పించలేదని ప్రభుత్వం తెలిపింది. అందువల్ల 'భోళా శంకర్' టికెట్ల ధరలు పెంచేందకు అనుమతి లేనట్లు పేర్కొంది. 101 కోట్లతో సినిమాను నిర్మించినట్టు నిర్మాతలు పేర్కొన్నారు కానీ అందుకు అవసరమైన పత్రాలను నిర్మాతలు ఇవ్వాల్సి ఉంటుందని ప్రభుత్వం సూచించింది. సినిమా నియంత్రణ చట్టం ప్రకారం ఏపీలో 20 శాతం షూటింగ్ చేసినట్లు నిర్మాతలు ఆధారాలు సమర్పించలేదని ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా డైరెక్టర్, హీరో, హీరోయిన్ల పారితోషికం కాకుండా సినిమా నిర్మాణానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టిన్నట్లు నిరూపించే పత్రాలను దరఖాస్తుతో జత చేయనందున అనుమతి నిరాకరిస్తున్నట్లు ఏపీ తెలియజేసింది. అన్ని వివరాలతో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అన్నీ సవ్యంగా ఉన్నట్లయితే టికెట్ ధరలు పెంచుకొనే విషయం పరిశీలిస్తామని తెలియజేసింది. (ఇదీ చదవండి: Bhola Shankar: భోళాశంకర్ ఆపాలంటూ కేసు.. చంపుతామంటూ డిస్ట్రిబ్యూటర్‌కు బెదిరింపులు) గతంలో చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' సినిమాకు టికెట్ ధరల పెంచుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించిందనే విషయాన్ని గుర్తుచేసింది. అప్పుడు ఆ సినిమాకు సంబంధించిన అన్నీ డాక్యుమెంట్లను ఏపీ ప్రభుత్వానికి నిర్మాతలు అందించారని పేర్కొంది. ఇప్పుడు భోళా శంకర్ నిర్మాతలు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించలేదు. కాబట్టే టికెట్ ధరలను పెంచుకునే వెసులుబాటు ఇవ్వలేదని ప్రభుత్వం పేర్కొంది. -
టికెట్ల ధర పెంచాలని కోరిన భోళా శంకర్ నిర్మాతలు
-
నా దగ్గర ఇలాంటి మాటలే వద్దు: తమన్నా
గ్లామర్‌కు కేరాఫ్ మిల్కీబ్యూటీ తమన్న. ఈమె ఇంత కాలం నటిగా నిలబడ్డారంటే అందాలారబోత ప్రధాన కారణం అనడంలో అతిశయోక్తి లేదు. కాగా కథానాయకిగా నటిస్తూనే మరో పక్క ఐటమ్ సాంగ్‌లకు సై అంటున్న ఈ బ్యూటీ తాజాగా తెలుగులో చిరంజీవి సరసన భోళాశంకర్, తెలుగులో రజనీకాంత్‌తో జైలర్ చిత్రాల్లో నటించారు. విశేషం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదల అవుతున్నాయి. మరో విషయం ఏమిటంటే జైలర్ చిత్రంలో తమన్న రజనీకాంత్‌కు ఫెయిర్ కాదు. ఇక భోళాశంకర్ చిత్రంలో చెల్లెలి పాత్రలో నటించిన కీర్తీసురేష్కే అధిక ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. కాగా ఇద్దరు సీనియర్ హీరోలతో నటించడం గురించి తమన్నపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. సీనియర్ నటులతో జత కట్టడానికి ఎందుకు అంగీకరిస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు? అవకాశాలు రాకా, లేక డబ్బు కోసమా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. (ఇదీ చదవండి: కీర్తి సురేష్ ఉంటే ఆ సినిమా రిజల్ట్ ఇదేనా?) దీనికి స్పందించిన తమన్న నటీనటుల మధ్య వయసు వ్యత్యాసం గురించి ఎందుకు మాట్లాడతారు? నటించే పాత్రలను చూడండి అని ఘాటుగా పేర్కొన్నారు. కాదూ కూడదూ అంటారా వయసు గురించి మాట్లాడాలంటే తాను హలీవుడ్ నటుడు టామ్ క్రూస్ మాదిరి సాహసాలు చేయగలను, డాన్స్ చేయగలను అని పేర్కొన్నారు. ఇకపోతే సీనియర్ నటులతో కలిసి నటించడం తనకు ఎప్పుడూ సంతోషమేనన్నారు. -
భోళా శంకర్ నిర్మాతలతో ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: భోళా శంకర్ సినిమాను ఆపాలంటూ కోర్టు మెట్లెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ బుధవారం నాడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. పిటిషన్ వెనక్కు తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్తో పాటు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల నిర్మాతలతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. ఈ వివాదం ఏంటి? అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 27న రిలీజైంది. ఈ చిత్రం నిర్మాతలకే కాదు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు అందరికీ కోట్ల కొద్ది నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను తెరకెక్కించిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని తనను మోసం చేశారంటున్నాడు డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ.. ఆయన రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు సత్యనారాయణకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని నిర్మాతలు అగ్రిమెంట్ రాసిచ్చారు. ఇందుకోసం రూ.30 కోట్లు తీసుకున్నారు. అయితే ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడితే ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి వెళ్లిపోయాడు. తర్వాత 'సామజవరగమన' వైజాగ్ హక్కులు సత్యనారాయణకే ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది. ఇంకా రావాల్సిన డబ్బు గురించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే సమాధానం రాకపోవడంతో కోర్టుకు వెళ్లారు. తనకు డబ్బు ఇచ్చేవరకు భోళా శంకర్‌ను ఆపాలని కోరాడు. చదవండి: 'భోళా శంకర్'కి అడ్డంకులు.. రిలీజ్ వాయిదా? -
చిరు, రజిని మధ్యలో మహేష్… బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే
-
హైపర్ ఆది ఓవరాక్షన్.. చిరంజీవిని జీరోగా.. మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
భోళా మేనియా మొదలవడానికి ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఒక పక్క చిరంజీవి కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా కామన్ ఇంటర్వూలలో కామెడీ టన్నుల్లో పంచుతున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఫుల్ ఫన్నీ మోడ్‌లో సాగింది. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో హైపర్ ఆది స్పీచ్ ఇప్పుడు భోళా శంకర్‌కు చాలా మైనస్‌గా మారింది. మెగా ఫ్యామిలీకి వీరభక్తుడిని అని చాటుకోవడానికి ఒక రేంజ్లో రెచ్చిపోయాడు. కానీ అత్యుత్సాహంతో చాలా తప్పులు చేశాడు. సినిమా వేదికపై రాజకీయాలు.. ఆది తన స్పీచ్‌తో తమ్ముడిని హీరో చేసే ప్రయత్నంలో భాగంగా అన్నయ్యని జీరో అని డైరెక్ట్‌గానే చెప్పాడు. చిరంజీవి రాజకీయాల్లో జీరో అని ఆయన ఎప్పుడో వదిలేసిన వాటిని మళ్ళీ గుర్తు చేశాడు. దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ హ్యాపీ అయినా మెగా అభిమానులు మాత్రం గుర్రుగా ఉన్నారు. హైపర్ ఆది వేసిన మరో రాంగ్ స్టెప్.. సినిమా వేదికపై నుంచి ఏదో కౌంటర్ వేస్తున్నా అనే భ్రమలో రాజకీయాలు మాట్లాడడం! చిరంజీవి రాజకీయాలు వదిలేసి చాలాకాలమైంది. అంతే కాదు, రాజకీయాలకు అతీతంగా చాలా మంది చిరంజీవిని అభిమానిస్తారు, రిలీజ్ రోజే ఆయన సినిమా చూస్తారు. చిరు కూడా ఎప్పుడూ సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అంటారు. ఆది వ్యాఖ్యలపై సెటైర్స్ పడాల్సిందే! కానీ ఇప్పుడు హైపర్ ఆది సినిమా ఫంక్షన్ లో రాజకీయాల గురించి మాట్లాడాడు. ఇక ఇప్పుడు రాజకీయనాయకులు తమ ప్రెస్ మీట్స్‌లో సినిమాల గురించి మాట్లాడకుండా ఎందుకు ఉంటారు? ఆది సెటైర్స్‌ను మించిన సెటైర్స్ పడకుండా ఎందుకు ఉంటాయి? ఆది కామెంట్స్ చిరంజీవి ఫ్యాన్స్‌ను బాధపెట్టాయి. అలాగే సాధారణ ప్రేక్షకులకు సైతం చాలా ఓవర్ అనే భావనను కలిగించాయి. ఓవరాల్‌గా ఇవన్నీ కలిసి భోళా శంకర్ కలెక్షన్స్‌పై ప్రభావం చూపించే ఆస్కారం ఉంది. ఇకనైనా చిరంజీవి తన సినిమా ఫంక్షన్స్‌లో ఇలాంటి వాళ్ళకి ముందే కొన్ని కండిషన్స్ పెడితే బావుంటుంది. ఇదే కంటిన్యూ అయితే ఇన్నాళ్లు అందరివాడిగా ఉన్న చిరంజీవి కొందరివాడిగా మారడానికి ఎంతో సమయం పట్టదు! చదవండి: 'భోళా శంకర్'కి అడ్డంకులు.. రిలీజ్ వాయిదా? రెండు సినిమాలకే క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్.. అప్పుడే పెళ్లంటూ ఒత్తిడి తెస్తున్న శంకర్ -
'భోళా శంకర్'కి అడ్డంకులు.. రిలీజ్ వాయిదా?
-
కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' వాయిదా పడనుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే సందేహం వస్తోంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉందనగా, ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టుకి వెళ్లాడు. 'భోళా శంకర్' నిర్మాతలపై కేసు పెట్టాడు. మూవీని విడుదల చేయకుండా ఆపాలని కోరాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సదరు డిస్ట్రిబ్యూటర్.. ఓ ప్రెస్ నోట్‌తో పాటు వీడియోని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత) ఏం జరిగింది? అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' ఏప్రిల్ 27న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లు అందరికీ కోట్లలో నష్టాలు వచ్చాయి. అయితే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని తనని మోసగించారని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టులో కేసు వేశారు. అలానే ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. నన్ను మోసం చేశారు 'ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణకిశోర్ నన్ను మోసం చేశారు. వారు చేసిన అన్యాయం ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు నాకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసిచ్చారు. రూ.30 కోట్లు తీసుకుని నన్ను మోసం చేశారు. ఈ మొత్తం చెల్లించినట్లు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి.' (ఇదీ చదవండి: 'భోళా శంకర్'.. ఇక అంతా బోనస్!) అండర్ టేకింగ్ లెటర్! 'అయితే ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలిశాను. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి, వైజాగ్ వెళ్లిపోయాను. 'సామజవరగమన' వైజాగ్ హక్కులు నాకు ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది' 'భోళా శంకర్'కు బ్రేక్? 'దీంతో 45 రోజుల్లో నాకు రావాల్సిన మిగతా డబ్బు ఇస్తామని చెప్పారు. లేదంటే తర్వాత విడుదలకు 15 రోజుల ముందు ఇస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. వాళ్ల తర్వాత మూవీ 'భోళా శంకర్'. ఈ విషయమై మాట్లాడాదామని ప్రయత్నిస్తుంటే నాకు సమాధానం ఇవ్వట్లేదు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే తప్పని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లాను' అన వైజాగ్ సతీశ్ చెప్పుకొచ్చారు. బుధవారం కోర్టులో హియరింగ్ జరగనుంది. దీనిపై క్లారిటీ రావడంతోపాటు 'భోళా శంకర్' రిలీజ్ విషయంలోనూ స్పష్టత వస్తుంది. (ఇదీ చదవండి: మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) -
'భోళా శంకర్'.. ఇక అంతా బోనస్!
‘‘షాడో’ సినిమా తర్వాత దర్శకుడిగా నాకు కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌లో నేను కొన్ని కథలు రెడీ చేసుకున్నాను. ఇక అన్నయ్య (చిరంజీవి) సినిమాల్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చాక నా కమ్‌బ్యాక్ సినిమా ఆయనతో చేయాలనుకున్నాను. అందుకే షాడోలో వున్న నాపై మెగా లైట్ పడిందని ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్లో చెప్పాను’’ అన్నారు దర్శకుడు మెహర్ రమేష్. చిరంజీవి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకర్ల సమావేశంలో దర్శకుడు మెహర్ రమేష్ చెప్పిన విశేషాలు. ∙‘భోళా శంకర్’ సినిమాకు దర్శకుడిగా చేసి, అన్నయ్య ప్రశంసలు అందుకోవడాన్ని పెద్ద అచీవ్‌మెంట్‌లా భావిస్తున్నాను. ఇక దర్శకుడిగా నాకు లభించేది అంతా బోనస్‌గా ఫీలవుతాను. అన్నయ్య, నేను కజిన్స్. సో.. సెట్స్‌లో ఆయన నన్ను ఏరా అని చనువుగా పిలిచేవారు. ∙తరాలు మారినా అనుబంధాలు మారలేదు. ‘వేదాళం’ సినిమాలో అన్నాచెల్లెళ్ల అనుబంధం నాకు బాగా నచ్చింది. ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషనల్ సీన్స్ ఉన్న ఈ తరహా సబ్జెక్ట్‌ని నేనిప్పటివరకూ డీల్ చేయలేదు. తమిళ ‘వేదాళం’ సినిమా తెలుగు రీమేక్‌గా ‘భోళా శంకర్’ చేశాం. గతంలో నా దర్శకత్వంలో కొన్ని రీమేక్స్ వచ్చాయి. సాధారణంగా నేను రీమేక్ రిస్క్ అనుకోను. ఓ టాస్క్‌గా తీసుకుంటాను. వాటికి నా ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. ‘భోళా శంకర్’లో 60 నుంచి 70 శాతం మార్పులు చేశాం. పెద్ద సక్సెస్ అయిన సినిమాను కరెక్ట్‌గా తీయడంతో పాటు జనాలకు నచ్చేలా తీయాలి. ‘భోళా శంకర్’ని ప్రేక్షకులకు నచ్చేలా ప్రజెంట్ చేశాం. ∙ఈ చిత్రంలో చెల్లెలి పాత్రకు కీర్తీ సురేష్‌గారు ఒప్పుకుంటారని అనుకోలేదు. స్వప్న దత్ ద్వారా కీర్తీని అ్రపోచ్ అయ్యాను. కథ విని ఆమె ఈ సినిమా ఒప్పుకున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో రవితేజ పాత్ర ఆ సినిమాకు బిగ్ ఎస్సెట్. అలా ‘భోళా శంకర్’లో కీర్తీ సురేష్ రోల్ సినిమాకు పెద్ద ఎస్సెట్. మణిశర్మగారి కుమారుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు మంచి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇక అనిల్ సుంకరగారు ఫ్యాషనేట్ అండ్ పాజిటివ్ ప్రోడ్యూసర్. నా తర్వాతి చిత్రాన్ని త్వరలో ప్రకటిస్తాను. -
కీర్తి సురేష్ అన్నయ్య అంటుంటే.. గుండె కళుక్కు మంటుంది అందుకే..
-
బోలా శంకర్ అల్టిమేట్ ప్రోమో
-
భోళా శంకర్ ప్రీరిలీజ్ ఈవెంట్: బ్లాక్ డ్రెస్‌లో శ్రీముఖి హోయలు (ఫోటోలు)
-
కీర్తి చెల్లిగా చేస్తే.. ఈమె తల్లి చిరుకు హీరోయిన్గా చేసింది!
మెగాస్టార్ చిరంజీవి మాములోడు కాదు. ఇప్పటికే ఓ జనరేషన్ హీరోయిన్లతో కలిసి నటించారు. ఎంటర్టైన్ చేశారు. హిట్స్ కొట్టారు. ఇప్పుడు వాళ్ల కూతుళ్లతోనూ సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇంతకీ అది ఏ సినిమా? తల్లీ కూతుళ్లు ఎవరు? చిరంజీవి హీరోగా ఇప్పటికే 150 సినిమాల మార్క్‌ని దాటేశారు. రీఎంట్రీలో మంచి జోరు మీదున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'గా అలరించిన చిరు.. ఇప్పుడు 'భోళా శంకర్'గా సందడి చేయబోతున్నారు. ఆగస్టు 11న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్, తమన్నా, సుశాంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇది 'వేదాళం' అనే తమిళ సినిమాకు రీమేక్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు!) ఇకపోతే 'భోళా శంకర్'లో సిస్టర్ సెంటిమెంట్ కీలకం. చిరుకి చెల్లిగా కీర్తి సురేశ్ కీలకపాత్ర పోషించింది. ఈమె సోదరిగా నటిస్తే.. ఈ బ్యూటీ తల్లి మేనక మాత్రం చిరుకు హీరోయిన్గా ఓ సినిమాలో చేసింది. మెగాస్టార్.. తన కెరీర్ ప్రారంభంలో చేసిన 'పున్నమినాగు'లో కనిపించిన అమ్మాయి కీర్తి సురేశ్ తల్లి మేనక. తాజాగా 'భోళా శంకర్' ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్ ఈ విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'చిరంజీవి 'పున్నమినాగు' సినిమాలో అమ్మ నటించింది. అప్పుడు జరిగిన చాలా విషయాలు అమ్మ నాకు చెప్పింది. చిరంజీవి గారి ఎనర్జీ, డెడికేషన్, సెట్ లో ఇచ్చిన సలహాలు, సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్ గా చూసుకునేవారట. చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఇదే విషయం నేను చిరంజీవిగారితో చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ నన్ను చాలా సర్ ప్రైజ్ చేసింది' అని కీర్తి చెప్పుకొచ్చింది. దీనికి బదులిచ్చిన చిరు.. 'మీ అమ్మ చాలా అమాయకురాలు. నువ్వు మాత్రం అలా కాదు. స్మార్ట్' అని కీర్తితో అన్నారు. (ఇదీ చదవండి: వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి) -
భోళా శంకర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
వరుస రీమేక్స్‌పై క్లారిటీ ఇచ్చిన చిరంజీవి
మెగా అభిమానులని ఈ మధ్య కాలంలో బాగా బాధపెడుతున్న విషయం ఒక్కటే. అది రీమేక్స్. మెగా బ్రదర్స్ ఇద్దరూ వరసగా రీమేక్ చిత్రాలు చేస్తున్నారు. వాళ్ల వైపు నుంచి రీజన్ ఏంటనేది పక్కనబెడితే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై వచ్చే ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విమర్శలు ఏకంగా మెగాస్టార్ చెవిన పడ్డట్లు ఉన్నాయి. దీంతో అసలు రీమేక్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఫుల్‌గా క్లారిటీ ఇచ్చేశారు. నచ్చి చేశాను 'అమ్మ ప్రేమ.. అభిమానుల ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టదు. అది చల్లగా మదిని హత్తుకుంటుంది. అందుకే మీరందరూ గర్వపడేలా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటాను. ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ముందుకెళ్తున్నాను. నా మనసుకు నచ్చి చేసిన సినిమా ఇది. రీమేక్స్ చేస్తుంటారేంటని కొందరు తరుచూ అడుగుతున్నారు.' (ఇదీ చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్) రీమేక్.. తప్పేంటి? 'ఓ మంచి కథ దొరికినప్పుడు.. దాన్ని మన ప్రేక్షకులకు చూపించేందుకు రీమేక్ చేస్తే తప్పేంటనేది నాకు అర్థం కాదు. ఈ 'భోళా శంకర్' ఒరిజినల్ 'వేదాళం' ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. ఎవరూ చూడలేదు. అందుకే ధైర్యంగా ఈ మూవీ చేసేందుకు ముందుకొచ్చాను. ఇది కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇది సూపర్‌హిట్ అవుతుందనే భరోసా అందరిలో కనిపించింది' అని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇది మూడో రీమేక్ మెగాస్టార్ చిరంజీవి.. 2007 తర్వాత దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఇక రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నం.150'.. తమిళ సినిమా 'కత్తి'కి రీమేక్. ఇది బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. దీని తర్వాత 'సైరా', 'ఆచార్య' చిత్రాలు చేసిన చిరుకు నిరాశే మిగిలింది. దీంతో మళ్లీ రూట్ మార్చారు. మలయాళ 'లూసిఫర్' రీమేక్‌తో 'గాడ్ ఫాదర్'గా వచ్చారు. ఇది ఓ మాదిరి హిట్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' స్ట్రెయిట్ మూవీ కానీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు చేస్తున్న 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం'కి రీమేక్. మరి దీని టాక్ ఏంటో తెలియాలంటే ఆగస్టు 11 వరకు వెయిట్ చేయాల్సిందే. (ఇదీ చదవండి: వాళ్ల నాన్నకు సర్జరీ జరిగింది.. కానీ: హీరోయిన్‌పై మెగాస్టార్ కామెంట్స్) -
'భోళా శంకర్'పై చిరు గట్టి నమ్మకం.. కామెంట్స్ వైరల్
‘‘రీమేక్స్ చేస్తారేంటి? అని అంటుంటారు. మంచి కంటెంట్‌ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే ప్రయత్నం మన యాక్టర్స్, దర్శకులు చేస్తే తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. ‘వేదాళం’ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో లేదు. ఎవరూ చూసి ఉండరు. ఆ ధైర్యంతోనే మెహర్, అనిల్ నా వద్దకు రావడంతో ‘భోళాశంకర్’ చేశాను’’ అని చిరంజీవి అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘భోళాశంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘భోళాశంకర్’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘భోళాశంకర్’ సినిమా నాకు నచ్చింది కాబట్టే చేశాను. మీకు (ప్రేక్షకులు) కూడా నచ్చుతుందనే ధైర్యంతో విడుదల చేస్తున్నాం. స్వయంకృషితో మెహర్ రమేశ్ దర్శకుడిగా ఎదిగాడు. కొత్తవారి ప్రతిభతో ఇండస్ట్రీ మరింత ఎదగాలి. ఇండస్ట్రీని నమ్ముకుని వస్తే గొప్ప లైఫ్‌ని ప్రసాదిస్తుంది. ఇండస్ట్రీ పుష్పక విమానంలాంటిది.. ఎంతమంది వచ్చినా ఇంకా చోటు మిగిలే ఉంటుంది. ఇండస్ట్రీ అక్షయ పాత్రలాంటిది. ఎంతమంది తిన్నా కూడా ఇంకా భోజనం అందిస్తుంది ఈ కళామతల్లి. కేవలం స్టార్స్ మాత్రమే ఉండే ఈ ఇండస్ట్రీలోకి బిక్కు బిక్కు మంటూ నేను ప్రవేశించాను. నా ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. నా లోపల ధైర్యం ఉంది. ‘కొత్త అల్లుడు’ సినిమాలో ఓ చిన్న వేషం వేయమన్నారు.. బాధగా అనిపించింది కానీ చేశాను. అలాగే ‘కొత్తపేట రౌడీ’ సినిమాలో కృష్ణగారి పక్కన చిన్న వేషం వేయమన్నారు. ఓ వైపు ‘శుభలేఖ’, ‘ఇంట్లో కృష్ణయ్య వీధిలో రామయ్య’ వంటి సినిమాలు చేస్తున్నాను.. ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేస్తే బాగుంటుందా? అంటే.. ‘చేయండి సార్’ అన్నారు. చేయనంటే నా భవిష్యత్ మీద ప్రభావం పడుతుందేమో అనే భయంతో చేశాను. కానీ, ఈ ఇండస్ట్రీ నన్ను ఆదరించిన దానికంటే... నన్ను ప్రోత్సహించి, భుజాన ఎత్తుకుంది, పైకి లేపింది ప్రేక్షకులు. వారికి రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘మీరంతా (అభిమానులు) చిరంజీవిగారి సినిమాలు చూస్తూ పెరిగితే.. నేను చిరంజీవిగారితో సినిమాలు చేస్తూ పెరిగాను’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్ . ‘‘చిరంజీవిగారితో సినిమా చేయడాన్ని లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌గా భావిస్తున్నాను’’ అన్నారు అనిల్ సుంకర్. ‘‘ఒక షాడోలో ఉన్న నా మీద మెగాస్టార్ అన్నయ్య వెలుగు పడింది. ‘భోళా శంకర్’ నాకు దర్శకుడిగా పునర్జన్మలాంటిది’’ అన్నారు. ఈ వేడుకలో పలువురు దర్శక– నిర్మాతలు పాల్గొన్నారు. -
వాళ్ల నాన్నకు సర్జరీ జరిగింది.. కానీ: హీరోయిన్‌పై మెగాస్టార్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన తాజా చిత్రం భోళాశంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కీర్తి సురేశ్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ప్రమోషన్లతో బిజీ అయిపోయింది చిత్రబృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మెగాస్టార్.. తమన్నా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని ప్రశంసలు కురిపించాడు. అదేంటో ఓసారి తెలుసుకుందాం. (ఇది చదవండి: ఆస్కార్ అంటే ఏంటో తెలియదు: ది ఎలిఫెంట్ విస్పరర్స్ నటి ) చిరంజీవి మాట్లాడుతూ..'భోళా శంకర్‌లో మిల్కీబ్యూటీ అనే సాంగ్ ఉంది. ఇది స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించాం.దాదాపు రెండు వారాలు షూటింగ్ జరిగింది. అయితే ఆ సమయంలో తమన్నా ఫాదర్‌కు సర్జరీ జరిగిందని విన్నా. ఆ సమయంలో కూడా తమన్నా వెళ్లలేదు. కెమెరా ముందుకు వచ్చి డాన్స్ వేయడం.. అంతలోనే కెమెరా వెనక్కి వెళ్లి ఫోన్ చేసి కుటుంబసభ్యులతో మాట్లాడుతూ ధైర్యంగా ఉండమని సూచించింది. తనకి బాధను దిగమింగుకుని డాన్స్ చేస్తుంటే సినిమాపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది.' అని అన్నారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ సైతం తమన్నాను అభినందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి మహతి స్వర సాగర సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కించారు. (ఇది చదవండి: తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?) -
Exclusive Interview: చిరంజీవి కామెడీ టైమింగ్ కి పొట్ట చెక్కలు అవ్వాల్సిందే..
-
ఈ సినిమాతో నాకో మంచి ఫ్రెండ్ దొరికారు: కీర్తీ సురేష్
‘‘నాకు ఒక సిస్టర్ ఉంది. బ్రదర్‌లాంటి ఫ్రెండ్ ఒకరు ఉన్నారు. ‘భోళా శంకర్’ చేశాక మెహర్ రమేష్‌లాంటి అన్నయ్య దొరికారు’’ అన్నారు కీర్తీ సురేష్. చిరంజీవి టైటిల్ రోల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేశారు. ఈ నెల11న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. ► ‘భోళా శంకర్’లో చిరంజీవిగారి చెల్లెలి ఆఫర్ వచ్చినప్పుడు రజనీకాంత్‌గారి చెల్లెలిగా చేసిన ‘అన్నాత్తే’ (‘పెద్దన్న’) పూర్తి చేశాను. అందుకే వెంటనే చెల్లెలిగా అంటే ఫర్వాలేదా? అని మెహర్ రమేష్గారితో అన్నాను. అయినప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్‌గారికి చెల్లెలిగా నటించిన వెంటనే మెగాస్టార్ చిరంజీవిగారి చెల్లెలిగా అంటే ఇంకేం కావాలి? అనిపించింది. దాంతో పాటు చిరంజీవిగారితో ఒక్క ఫ్రేమ్‌లో అయినా డ్యాన్స్ చేయాలనుకున్న నాకు రెండు పాటలు చేసే చాన్స్ స్క్రిప్ట్‌లో ఉంది. మెహర్ రమేష్‌గారు నా క్యారెక్టర్ని కూడా బాగా డిజైన్ చేశారు. ► మా అమ్మ (మేనక) గతంలో చిరంజీవిగారి సరసన ‘పున్నమి నాగు’లో నటించారు. అప్పుడు చిరంజీవిగారు తీసుకున్న కేర్, ఆయన ఇచ్చిన సలహాల గురించి అమ్మ ఇప్పుడు నాతో చెప్పారు. అవి చిరూగారితో చెబితే.. ‘ఈ సలహాలు కూడా ఇచ్చాను’ అంటూ అమ్మ చెప్పనివి కూడా చెప్పారు. ఇన్నేళ్లయినా ఆయన గుర్తుంచుకోవడం ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు నా విషయంలోనూ కేర్ తీసుకున్నారు. అయితే ‘మీ అమ్మలా నువ్వు అమ్మాయకురాలివి కాదు... చాలా స్మార్ట్’ అని నవ్వుతూ అన్నారు. ఆయన ఇంటి నుంచే నాకు ఫుడ్ వచ్చేది. ఈ సినిమా రూపంలో నాకో మంచి ఫ్రెండ్ (చిరంజీవిని ఉద్దేశించి) దొరికారు. ► రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్గా, లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో లీడ్‌గా, చెల్లెలి క్యారెక్టర్లు.. ఇలా పలు వేరియేషన్స్ ఉన్నవి చేస్తున్నాను. ఇలా చేయడం అంత ఈజీ కాదు. అయితే ఓ పదేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఇలాంటివిæ చేయలేదే అని ఫీల్ కాకూడదు. అందుకే అన్ని రకాల సినిమాలు చేస్తున్నాను. -
మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్ ఇప్పటికైతే లేదు: –తమన్నా
‘నువ్వు కావాలయ్య...’ అంటూ ‘జైలర్’లో హుషారుగా స్టెప్పులేశారు తమన్నా. ఈ బ్యూటీ కూడా సినిమా ఇండస్ట్రీకి మోస్ట్ వాంటెడ్. అందుకే దాదాపు 20 ఏళ్లయినా ఇంకా ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళంలో ‘అరణ్మణై’, మలయాళంలో తొలి చిత్రం ‘బాంద్రా’, ఓ టీవీ షోతో బిజీగా ఉన్నారామె. చిరంజీవి సరసన తమన్నా నటించిన ‘భోళా శంకర్’ ఈ 11న విడుదల కానుంది. అంతకు ఒక్కరోజు ముందు రజనీకాంత్ ‘జైలర్’తో థియేటర్లకు వస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మించారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ రూపొందింది. రెండు చిత్రాలతో థియేటర్లకు రానుండటం, ఇతర విశేషాలు తమన్నాతో జరిపిన ఇంటర్వ్యూలో ఈ విధంగా... ► ఈ నెల 10న ‘జైలర్’, 11న ‘భోళా శంకర్’ సినిమాలతో వస్తున్నారు. సో.. వచ్చే వారం మీకు స్పెషల్ అనొచ్చు... విషయం ఏంటంటే.. ఒకటి తమిళ సినిమా, మరొకటి తెలుగు సినిమా అయినా రెండు సినిమాలూ అన్ని భాషల్లో థియేటర్లకు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవిగారు, సూపర్ స్టార్ రజనీకాంత్‌గారు.. ఇద్దరూ దేశంలో పెద్ద స్టార్స్. ఇలా ఒక్క రోజు గ్యాప్‌లో ఇద్దరు స్టార్స్‌తో సినిమా అంటే కల నెరవేరినట్లు ఉంది. ఈ రెండు మాత్రమే కాదు.. నేను చేసిన ఇంకో సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. అదొక మంచి ఫీలింగ్. ► చిరంజీవి డ్యాన్స్ మామూలుగా ఉండదు... మీరు డ్యాన్స్‌లో బెస్ట్. అయితే మీ ఇద్దరికీ ‘సైరా’లో డ్యాన్స్ చేసే చాన్స్ రాలేదు.. ‘భోళా శంకర్’లో మీ కాంబో డ్యాన్స్ గురించి... ‘మిల్కీ బ్యూటీ...’ మంచి రొమాంటిక్ మెలోడి సాంగ్. ఈ పాటలో ఒక హుక్ స్టెప్ ఉంటుంది. మిగతా స్టెప్స్ కూడా గ్రేస్‌ఫుల్‌గా ఉంటాయి. చిరంజీవిగారి డ్యాన్స్ చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది. అందుకే మిగతావారికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. పైగా శేఖర్ మాస్టర్ మంచి స్టెప్స్ డిజైన్ చేశారు. స్విట్జర్లాండ్‌లో ఈ పాట షూట్ జరిగింది. పెద్దగా రిహార్సల్స్ చేయలేదు. అక్కడికి అక్కడే నేర్చుకుని చేసేశాం. అలాగే ఇదే సినిమాలో ‘జామ్ జామ్...’ పాట కూడా నాకు చాలా ఇష్టం. ► సీనియర్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు... అంత సీనియర్స్‌తో ఎందుకు? అనే ప్రశ్న ఎదురవుతుంటుంది కదా... ఇప్పుడు నా కెరీర్లో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అన్ని రకాల యాక్టర్స్‌తో నటిస్తున్నాను. నాకన్నా చిన్నవాళ్లకు జోడీగా, నాకు సమానమైన ఏజ్ ఉన్నవాళ్లతో, సీనియర్లతో సినిమాలు చేస్తున్నాను. ఓటీటీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాను. నా కెరీర్లో నేనెప్పుడూ ఏజ్ గురించి పట్టించుకోలేదు. నేను యాక్టర్లను యాక్టర్లగా చూస్తాను. నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను. నా క్యారెక్టర్ ప్రేక్షకులకు నచ్చుతుందా? లేదా అన్నదే నాకు ముఖ్యం. ఏజ్ వల్ల ఈక్వేషన్ ఏం మారదు. ► దాదాపు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నారు. ఇంకా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ రేస్‌లో దూసుకెళ్లడానికి కారణం? అస్సలు నేను ఇది రేస్ అనుకోను. చాలా చిన్న వయసులో కెరీర్ స్టార్ట్ చేశాను. జయాపజయాలనేవి మన చేతుల్లో ఉండవు. టీమ్ వర్క్ ముఖ్యం. ఒక్కోసారి కొన్ని విజయాలకు నేనూ కారణం అవుతాను. ఆ సంగతి పక్కనపెడితే.. కెరీర్లో ముందుకు వెళ్లాలంటే నిరంతరం హార్డ్‌వర్క్ చేయాలి. ఆ ఫోకస్‌తోనే వెళుతున్నాను. ► ఈ మధ్య కొన్ని హద్దులను దాటి, బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు.. ఈ మార్పు గురించి? మారకపోతే నేనెక్కడ మొదలయ్యానో అక్కడే ఆగిపోయినట్లే.. అలా ఆగిపోవాలని ఎవరూ అనుకోరు. ఎవరైనా కెరీర్లో ఎదగాలనే అనుకుంటారు. ప్రతీ జాబ్‌లో ప్రమోషన్ ఉన్నట్లే మా జాబ్ కూడా. ప్రమోషన్ కోసం కొంచెం బ్రాడ్‌గా ఆలోచించాలి.. కొత్త ప్రయత్నాలు చేయాలి. అప్పుడు జర్నీ ఇంకా లాంగ్గా, బెటర్‌గా ఉంటుంది. ► ‘లస్ట్ స్టోరీస్ 2’ వెబ్ సిరీస్‌లో నటించిన అనుభవం గురించి? మన చుట్టూ ఇప్పుడు రకరకాల మాటలు దొర్లుతుంటాయి. వాటిలో ఏది మంచో.. చెడో తెలుసుకోలేం. అందుకే ‘లస్ట్ స్టోరీస్ 2’ గురించి నాతో అభిమానులు, ఇంకా వేరేవాళ్లు బాగుందని అన్నప్పుడు కొత్త ప్రయత్నం రీచ్ అయిందనే ఆనందం కలిగింది. ముఖ్యంగా ఉమన్ వచ్చి బాగుందని అభినందించడంతో చాలా హ్యాపీ ఫీలయ్యాను. ► ఇన్నేళ్లల్లో మీ గురించి రానటువంటి వార్తలు ఇప్పుడు వస్తున్నాయి.. ఫర్ ఎగ్జాంపుల్ నటుడు విజయ్ వర్మ, మీ గురించి ఎక్కువ ప్రచారమవుతోంది... ఎవరో ఏదో మాట్లాడతారు. కానీ నేను ఎప్పుడు మీడియాతో మాట్లాడినా హానెస్ట్‌గానే మాట్లాడాను. ఇక ఎవరెవరో రూమర్స్ క్రియేట్ చేస్తే నేనేం చేయలేను. ► పెళ్లి ప్లాన్ ఏమైనా? ఇప్పటికైతే లేదు. ప్లాన్ చేసుకున్నప్పుడు కచ్చితంగా చెబుతాను. -
మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడం నా అదృష్టం: సుశాంత్
‘మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని ప్రతి ఒక్క నటుడికి ఉంటుంది. కానీ కొద్ది మందికి మాత్రమే ఆయనతో సినిమా చేసే చాన్స్ వస్తుంది. ఆ అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’ అని యంగ్ హీరో సుశాంత్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సుశాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► చిరంజీవి గారితో పని చేయాలనే ఆలోచనే చాలా ఎక్సయిటింగ్ నాకు. చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఆయనకి అభిమానులుగా పెరిగాం. చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్ కి రెండు మూడుసార్లు వెళ్లాను. ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. మెహర్ రమేష్ ఫోన్ చేసి ఈ భోళా శంకర్ సినిమా గురించి చెప్పారు. చాలా నచ్చింది. అందులోనూ ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది. అందుకే మెహర్ రమేష్ చెప్పినప్పుడే చిరంజీవి గారితో డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. ► ఈ చిత్రంలో నాది క్యామియో రోల్. చిరంజీవి గారు, కీర్తి సురేష్, తమన్నా తో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా హీరోయిన్ తమన్నా. భోళాలో మాత్రం బ్రదర్ సిస్టర్ గా చేశాం. కీర్తి సురేశ్‌తో సీన్స్ చేస్తునప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చిరంజీవి గారితో సీన్స్ చేస్తున్నపుడు మాత్రం చాలా ఎక్సయిమెంట్ అనిపించింది. చిరంజీవి గారిలోని ప్రత్యేక ఏమిటింటే .. అందరితో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. ► చిరంజీవితో కలిసి డ్యాన్స్ అనగానే కాస్త భయమేసింది. నా బాడీ యీజ్ కోసం శేఖర్ మాస్టర్ టీంతో రెండు గంటలు ప్రాక్టీస్ చేశాను. సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. చిరంజీవి గారు మాత్రం కూర్చొని మైండ్ లో ప్రాక్టీస్ చేసేస్తున్నారు. తమన్నా కీర్తి కూడా మంచి డ్యాన్సర్స్. నలుగురం ఫ్రేమ్ లో వున్నప్పుడు నా మూలంగా స్టెప్ మార్చకూడదు కదా. అందుకే ప్రతి స్టెప్ ని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది. చాలా కలర్ ఫుల్ గా వుంది. సినిమాలో ఈ పాట ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ► కీర్తి అద్భుతమైన నటి. మహానటి సావిత్రి బయోపిక్ తో అందరి మనసులో చెరగని ముద్ర వేశారు. భోళా శంకర్ లో మా కెమిస్ట్రీ నేచురల్ గా వచ్చింది. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అది మీకు తెరపై కనిపిస్తుంది. ► మెహర్ రమేష్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. దాదాపు మూడేళ్ళు ఈ ప్రాజెక్ట్ తో ప్రయాణించారు. ఆయనపడిన కష్టం చూశా. చిరంజీవి గారిని ఎలా ప్రజంట్ చేయాలి, అభిమానులని ఎలా అలరించాలి, కొత్తగా ఎలా చూపించాలనే ఆలోచనతో వుండేవారు. అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన కోసం ఈ సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ► సోలో హీరోగా రెండు కథల మీద వర్క్ జరుగుతోంది. ఈ సినిమా విడుదల తర్వాత అనౌన్స్ చేస్తాం. -
'భోళా శంకర్'.. అదే అతి పెద్ద సవాల్!
‘‘ఓ భాషలో హిట్ అయిన సినిమాని మరో భాషలో రీమేక్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే.. ఒరిజినల్ని మ్యాచ్ చేస్తే సరి΄ోదు.. దానికంటే ప్రతి విషయంలోనూ ఒక అడుగు బెటర్‌గా ఉండాలి.. అది పెద్ద సవాల్. అందుకే ‘భోళా శంకర్’ విజువల్స్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. ఒరిజినల్ ఫిల్మ్ ‘వేదాలం’ కంటే ‘భోళా శంకర్’ ఇంకా బాగుంటుంది’’ అని కెమెరామేన్ డడ్లీ(రాజేంద్ర) అన్నారు. చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర కెమెరామేన్ డడ్లీ మాట్లాడుతూ– ‘‘నా అసలు పేరు రాజేంద్ర. డడ్లీ నా ముద్దు పేరు. తమిళనాడులోని ఊటీ నా స్వస్థలం. తమిళనాడులో ఫిలిం టెక్నాలజీ చదువుకున్న తర్వాత ముంబైకి షిఫ్ట్ అయ్యాను. మెహర్ రమేష్, నేను పదేళ్లుగా స్నేహితులం. తనే ‘భోళా శంకర్’ అవకాశం ఇచ్చాడు. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఫుల్ ΄ప్యాకేజ్ ఆఫ్ మాస్ ఎంటర్టైనర్గా ఉంటుంది. చిరంజీవిగారు పెర్ఫెక్షనిస్ట్, చాలా పంక్చువల్. ఈ రెండు విషయాలు ఆయన్నుంచి నేర్చుకున్నాను. ‘భోళా శంకర్’లో ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే పెద్ద యాక్షన్ సీన్ తీయడం చాలా కష్టంగా అనిపించింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా అన్నీ సమకూర్చారు’’ అన్నారు. -
సెన్సార్ పూర్తి చేసుకున్న మెగాస్టార్ భోళాశంకర్..!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి కీర్తిసురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా.. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా.. ఈ చిత్రాన్ని తమిళంలో వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కించారు. (ఇది చదవండి: 'ఒక రేంజ్ తర్వాత మనదగ్గర మాటలుండవ్.. కోతలే'.. ఆసక్తి పెంచుతోన్న ట్రైలర్) తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కూడా పూర్తయింది. భోళాశంకర్ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆగస్టు 11 నుంచి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు భోళాశంకర్ సిద్ధమైంది అంటూ ట్వీట్ చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. (ఇది చదవండి: 'భోళాశంకర్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..) Experience Mega 🌟 @KChiruTweets's MASSive Euphoria on the Big screens worldwide💥💥#BholaaShankar Certified with U/A 🔥& All set to entertain you all in Theatres from AUGUST 11th ❤️🔥 A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanthA… pic.twitter.com/TQC37G0GK0 — AK Entertainments (@AKentsOfficial) August 2, 2023 -
చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ స్టిల్స్
-
ఆగస్ట్‌లో ‘మెగా’ సందడి.. వారానికో సినిమా, బరిలో చిన్న చిత్రాలు కూడా!
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. జులై నెలలో ప్రతివారం రెండు, మూడు చిన్న సినిమాలు థియేటర్స్‌లో సందడి చేశాయి. వాటిల్లో కొన్ని హిట్ టాక్ని సొంతం చేసుకున్నాయి. ఇక ‘బేబీ’ చిత్రం అయితే భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బేబీ’తో మరోసారి రుజువైంది. అందుకే ఆగస్ట్‌లో కూడా వరుసగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మొదటి వారం(ఆగస్ట్ 4) ప్రముఖ క్రికెటర్ ధోనీ నిర్మించిన తొలి సినిమా ‘ఎల్జీఎం’విడుదల కానుంది. దీంతో పాటు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘హెబ్బులి’, ‘రాజుగారి కోడి పలావ్’, ‘విక్రమ్ రాథోడ్’, ‘దిల్సే, ‘మిస్టేక్’, ‘మెగ్ 2’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ Vs సూపర్ స్టార్ ఇక ఆగస్ట్ రెండోవారంలో రెండు పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఆ తర్వాతి రోజు అంటే ఆగస్ట్ 11న మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘భోళా శంకర్ ’రిలీజ్ కాబోతుంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించింది. అటు ‘జైలర్’, ఇటు ‘భోళా శంకర్’ ల మధ్య మరో చిన్న చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’ చిత్రం ఆగస్ట్ 12న విడుదల కాబోతుంది. ఇలా ఆగస్ట్ రెండో వారంలో రెండు పెద్ద చిత్రాలతో పాటు ఒక చిన్న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే హిందీ నుంచి కూడా రెండు ఆసక్తికరమైన చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఓ మై గాడ్ 2’, సన్నీదేఓల్ నటించిన ‘గదర్ 2’ చిత్రాలు ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా రెండు సూపర్ హిట్ సినిమాల సీక్వెల్స్ కావడం గమనార్హం. మూడో వారంలో నాలు చిన్న చిత్రాలు ఆగస్ట్ మూడో వారంలో అన్ని చిన్న సినిమాలే విడుదల కానున్నాయి. రెండో వారంలో జైలర్, భోళాశంకర్ లాంటి బడా సినిమాలు రావడంతో మూడో వారం ఎలాంటి పెద్ద సినిమాలు ప్రేక్షకులముందుకు వచ్చేందుకు సాహసం చేయలేదు. దీంతో ఈ వారం మళ్లీ చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆదికేశవ’తో పాటు శ్రీకాంత్ అడ్డాల ‘పెదకాపు 1’, సోహైల్ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’, ‘నచ్చినవాడు’ చిత్రాలు విడుదలకానున్నాయి. ‘మెగా’ సందడి ఆగస్ట్‌లో నెలలో వరుసగా మెగా హీరోలు సందడి చేయనున్నారు. రెండో వారం ‘భోళా శంకర్’తో చిరంజీవి వస్తే... మూడో వారం ఆయన మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’అంటూ అలరించడానికి రెడీ అయ్యాడు. ఇక నాలుగో వారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘గాంఢీవధారి అర్జున’ విడుదల కాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్. ఆగస్ట్ 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే కార్తికేయ హీరోగా నటించిన ‘బెదురులంక 2012’ చిత్రం కూడా అదే రోజు రిలీజ్ కాబోతుంది. వీటితో పాటు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన హిందీ చిత్రం ‘డ్రీమ్ గర్ల్ 2’ కూడా ఆగస్ట్ 25న విడుదల కాబోతుంది. -
చిరంజీవికి ఆ రెండు పాటలు అంటే చాలా ఇష్టం:మహతి స్వరసాగర్
‘‘నాన్నగారి (మణిశర్మ) బర్త్‌డేకి మెహర్ రమేష్‌గారు వచ్చారు. ‘చిరంజీవిగారి ‘భోళా శంకర్’కి నువ్వు సంగీతం అందిస్తున్నావ్’ అంటే జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. ఆ తర్వాతి రోజు కథ చెప్పడంతో షాకయ్యా’’ అన్నారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన చిత్రం ‘భోళా శంకర్’. తమన్నా హీరోయిన్గా నటించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మహతి స్వరసాగర్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా కోసం తొలిసారి నాన్నగారి సలహాలు తీసుకున్నా. ట్యూన్ చేశాక నాన్నగారికి వినిపించాను. చిరంజీవిగారికి తొలిసారి ట్యూన్ వినిపించినప్పుడు ‘చెవిలో తుప్పు వదిలించావ్’ అని అభినందించడంతో మరింత ధైర్యంతో ముందుకు సాగాను. ఈ సినిమాలోని ‘జామ్ జామ్.., మిల్కీ బ్యూటీ..’ పాటలంటే చిరంజీవిగారికి ఇష్టం. నేపథ్య సంగీతంపైనా ప్రత్యేక దృష్టి సారించి, బాగా ఇచ్చాను. నాన్నగారి పాటల్లో ‘ఇంద్ర’లోని ‘రాధే గోవిందా..’ పాటని రీమిక్స్ చేయాలని ఉంది. అది రామ్చరణ్గారికే సరిపోతుంది’’ అన్నారు. -
ఈ పాప ఎవరో చెప్పుకోండి చూద్దాం? 18 ఏళ్లుగా టాలీవుడ్లో
యాక్టింగ్ చూడటానికి ఈజీగానే ఉంటుంది! కానీ చేస్తేనే అది ఎంత కష్టమో తెలుస్తుంది. అలానే ఈ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలబడాలంటే కష్టపడాలి, అదృష్టం కలిసి రావాలి. పైన ఫొటోలో కనిపిస్తున్న పాప కూడా అలానే టాలీవుడ్లో అడుగుపెట్టింది. ప్రారంభంలో చిన్న సినిమాలు చేసింది గానీ స్టార్ హీరోలతో చేసిన ఒకటి రెండు మూవీస్ హిట్ కావడంతో రేంజ్ పెంచేసుకుంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? చెప్పేయమంటారా? ఇండస్ట్రీలో హీరోయిన్లు మహా అయితే ఓ 10 ఏళ్లు వరసగా అవకాశాలు అందుకుంటారు. ఆ తర్వాత మాత్రం కష్టమే. కానీ ఈ హీరోయిన్ మాత్రం అప్పుడెప్పుడో 2005లో 'శ్రీ' సినిమాతో హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టింది. ఇప్పటికీ ఈమె చేతిలో సినిమాలు, వెబ్ సిరీసులు ఉన్నాయి. అవును మీరు గెస్ చేసింది కరెక్టే. పైన ఫొటోలో ఉన్న పాప తమన్నా. త్వరలో ఈమె నటించిన 'జైలర్', 'భోళా శంకర్' సినిమాలు.. ఒక్క రోజు వ్యవధిలో థియేటర్లలోకి రాబోతున్నాయి. (ఇదీ చదవండి: తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!) గతేడాది పరిస్థితి చూసుకుంటే తమన్నా కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయిందనుకున్నారు. ఈ సంవత్సం వచ్చేసరికి మొత్తం మారిపోయింది. 'జీ కర్దా', 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీసుల్లో నటించిన మిల్కీబ్యూటీ.. అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ఎందుకంటే ఇన్నాళ్లుగా స్క్రీన్ పై ముద్దు సీన్‌కి కూడా నో చెబుతూ వచ్చిన ఈ నటి.. ఓటీటీలు అనేసరికి ముద్దులు, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ చేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో విడుదలకు రెడీ అయిపోయింది. మరోవైపు నటుడు విజయ్ వర్మతో ప్రేమ వ్యవహారంతోనూ తమన్నా తెగ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎందుకంటే వీరిద్దరూ ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్ (లస్ట్ స్టోరీస్ 2)లో అవాక్కయ్యేలా కెమిస్ట్రీ పండించేస్తున్నారు. ఇలా తమన్నా కెరీర్ ఖతం అయిందనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమెనే ట్రెండింగ్ లో ఉంటోంది. ఇప్పుడు ఆమె చిన్నప్పుడు ఫొటోలు కొన్ని వైరల్ అయ్యాయి. వాటిని చూసిన నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!
ఈ మధ్య కాలంలో తమన్నా గురించి మాట్లాడుకున్నంతగా మరే హీరోయిన్ కోసం మాట్లాడుకుని ఉండరు. ఎందుకంటే ఇక ఈమె కెరీర్ అయిపోయిందని అందరూ అనుకుంటున్న టైంలో వెబ్ సిరీసులతో తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ముద్దులు, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించడమే దీనికి కారణం. త్వరలో 'జైలర్', 'భోళా శంకర్' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ గురించిన ఓ విషయం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) సాధారణంగా హీరోహీరోయిన్‌గా నటిస్తే, వేరే రిలేషన్ ఉండే పాత్రలు చేయడానికి పెద్దగా సాహసించరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఈ విషయం భయపడట్లేదు. నయనతారని తీసుకుంటే.. 'సైరా'లో చిరుకు భార్యగా నటించింది. 'గాడ్‌ఫాదర్'లో వరసకు చెల్లెలి అయ్యే పాత్రలో నటించి, ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు నయనతార తర్వాత ఈ లిస్ట్‌లోకి మిల్కీబ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది. తమన్నా హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. ఇందులో చిరంజీవికి జోడీగా నటించింది. అయితే ఇదే సినిమాలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేశ్ యాక్ట్ చేయగా, ఆమెకి బాయ్ ఫ్రెండ్‌లా యంగ్ హీరో సుశాంత్ కనిపించబోతున్నాడు. దీన్నిబట్టి చూస్తే తమన్నా, సుశాంత్.. అన్నచెల్లిగా కనిపిస్తున్నట్లే. అయితే గతంలో వీళ్లిద్దరూ 'కాళిదాసు' చిత్రంలో హీరోహీరోయిన్‌గా చేశారు. అంటే కెరీర్ ప్రారంభంలో ప్రేమికులుగా, ఇప్పుడు తోబుట్టువులుగా నటిస్తున్నారు. మరి ఇది విశేషమే కదా! (ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?) -
భోళా శంకర్ కోసం ఒక్క రూపాయి తీసుకోని చిరంజీవి!
ఆచార్యతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదే హిట్‌ను కొనసాగించాలన్న జోష్‌లో ఉన్నాడు చిరు. అందుకే ఈసారి కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రస్తుతం అతడు వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెగాస్టార్‌తో తమన్నా జోడీ కట్టగా ఆయన చెల్లెలిగా కీర్తి సురేశ్ నటించింది. సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, ‘వెన్నెల’ కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెహర్ రమేశ్ దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించాడు. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు వస్తున్న స్పందన కూడా అదిరిపోయింది. రోజురోజుకూ చిరంజీవిలో ఎనర్జీ పెరిగిపోతోందన్న కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాకు మెగాస్టార్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట! మంచి పారితోషికం ముట్టజెప్తామన్నా సరే తీసుకోవడానికి నిరాకరించాడట. అందుకు కారణం లేకపోలేదు. భోళా శంకర్ సినిమాపై బోలెడంత నమ్మకం పెట్టుకున్న చిరు అందులో వాటా కావాలని కోరాడట! ఇప్పటికే సినిమా థియేట్రికల్, ఓటీటీ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. కాబట్టి సినిమా రిలీజయ్యాక వచ్చే లాభాల్లో చిరంజీవి అడిగినంత మొత్తాన్ని ఇచ్చేందుకు మేకర్స్ అంగీకరించారంటూ ఓ వార్త ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇదెంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది. చదవండి: బ్రో మూవీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే? -
మెగా స్టార్ భోళా శంకర్ మూవీ ట్రైలర్ విడుదల
-
చిరంజీవి 'భోళా శంకర్' ట్రైలర్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్' ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌ను నేడు జులై 27న గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ విడుదల చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. (ఇదీ చదవండి: చెక్ బౌన్స్ కేసులో స్టార్ హీరోయిన్‌కు రూ.500 ఫైన్) మొదట టీజర్లో షికారుకు వచ్చిన షేర్నంటూ చిరంజీవి ఊర మాస్ డైలాగ్స్‌తో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు. తాజాగా విడుదలైన ట్రైలర్లో కూడా చిరు పవర్ఫుల్ మాస్ డైలాగ్‌లతో రచ్చచేశాడు. 'భోళా శంకర్' ట్రైలర్లో చిరు మాస్ యాక్షన్ సీన్లతో పాటు అభిమానులు కోరుకునే క్లాస్ స్టెప్లు కూడా ఉన్నాయి. అంతే కాకుండా సినిమాలో మంచి టైమింగ్ ఉన్న కామెడీ సీన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'వేదాళం' సినిమాకు రీమేక్‌గా 'భోళా శంకర్' వస్తున్న విషయం తెలిసిందే. -
ఏపీ ఫైబర్ నెట్.. కేవలం రూ.40కే ఫ్యామిలీతో సినిమా చూసేయండి!
ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మరో వారం రోజుల్లో ఫైబర్ నెట్ వేదికగా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్స్మ్ ప్రారంభించనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్(ఏపీఎస్ఎఫ్ఎల్) డా.పి.గౌతమ్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయంలో 'కాస్ట్లీ కోరికలు' అనే చిత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ చిత్ర బృందంతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్! ) ఫైబర్ నెట్ ద్వారా కాస్ట్లీ కోరికలు అనే సినిమాను కేవలం రూ.40కే విడుదల చేస్తున్నామన్నామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన ఒక యథార్థ ఘటన ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఈ సినిమా తెరకెక్కిందన్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ కావడం, హీరోయిన్ లేకుండా కేవలం యంగ్ స్టర్స్ తో మాత్రమే తీసిన సినిమా కావడంతో ప్రేక్షకులు కూడా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారన్నారు. ఈ చిత్రాన్ని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై బ్లాక్ స్పేస్ ప్రొడక్షన్ లో ఎస్వీ ఝాన్సీలక్ష్మీ నిర్మాతగా.. ఎస్వీవీ సాయి కుమార్ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. గతంలో తొలి సినిమాను రూ.100కు అందించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఈ చిత్రాన్ని కేవలం రూ.40కే అందిస్తున్న విషయాన్ని గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా భవిష్యత్తులో లక్షలాది మంది ప్రేక్షకులకు చేరువయ్యేలా చేయడమే తమ ధ్యేయమన్నారు. ఔత్సాహిక కళాకారులకు ఏపీ ఫైబర్ నెట్ సరైన వేదిక అని ఆయన అభివర్ణించారు. ప్రతి ఏటా 250 చిన్న చిత్రాలు రూపుదిద్దుకుంటే అందులో థియేటర్లలో విడుదలయ్యేవి కేవలం 40 చిత్రాలు మాత్రమే అన్నారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు పడుతున్న ఇబ్బందులు అధిగమించాలనే ఉద్దేశంతో మరింత ప్రోత్సాహమందించేందుకు చిన్న చిత్రాలను తక్కువ ధరకే విడుదల చేస్తున్నామని గౌతమ్ రెడ్డి అన్నారు. సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసిన చిత్రాలను మాత్రమే తాము విడుదల చేస్తామన్నారు. (ఇది చదవండి: కమెడియన్‌తో హీరోయిన్ డేటింగ్.. సోషల్ మీడియాలో వైరల్!) రానున్న రోజుల్లో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. చిరంజీవి భోళాశంకర్ చిత్రాన్ని థియేటర్లో ప్రదర్శించిన వారం, పది రోజుల్లో ఏపీ ఫైబర్ నెట్లో ప్రదర్శించేందుకు ఆ చిత్ర నిర్మాత సూత్రప్రాయంగా అంగీకరించారన్నారు. సినిమా విడుదల రోజే తక్కువ ధరకే కొత్త సినిమాను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో చూడటం మంచి అనుభూతి అన్నారు. పైరసీ చేసేందుకు అవకాశం లేని టెక్నాలజీతో తాము పైబర్ నెట్ వేదికగా సినిమాలను విడుదల చేస్తున్నామన్నారు. -
మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?
మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య 'భోళా శంకర్' పూర్తి చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలు అలరిస్తుండగా, జూలై 27న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే రీసెంట్గా షూటింగ్ పూర్తయిన తర్వాత చిరు.. తన భార్య సురేఖతో కలిసి అమెరికా వెళ్లారు. అయితే అది విహారయాత్ర అనుకున్నారు. కానీ మెడికల్ పనిమీద వెళ్లినట్లు సమాచారం. చిన్న సర్జరీ 'భోళా శంకర్' సినిమాను చిరు పూర్తి చేసినప్పటికీ.. గత కొన్నాళ్ల నుంచి ఆయన కాలి నొప్పితో బాధపడుతున్నారట. ఈ క్రమంలోనే అమెరికా టూర్ ప్లాన్ చేశారు. రిలీఫ్‌తో పాటు చిన్నపాటి సర్జరీ పూర్తి చేసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తొలుత సీక్రెట్‌గా ఉంచినప్పటికీ ఇప్పుడు కాస్త ఆలస్యంగా ఆ విషయం బయటకొచ్చేసింది. (ఇదీ చదవండి: విడాకుల న్యూస్‌పై స్పందించిన కలర్స్ స్వాతి!) నో కంగారు అసలు సమస్య ఏంటి? సర్జరీ ఏం జరిగింది? లాంటి విషయాలు ప్రస్తుతం ఏం తెలియదు. కానీ ప్రాబ్లమ్ మాత్రం ఏమంత పెద్దది కాదని, కంగారు పడాల్సిన అవసరం లేదని చిరు సన్నిహితులు చెబుతున్నారు. అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన ఆయన.. ఎయిర్‌పోర్ట్‌లో హ్యాపీగా నడుచుకుంటూ వెళ్లారు. కాబట్టి కంగారు పడాల్సిందేం లేదని సన్నిహితులు అంటున్నారు. నెక్స్ట్ ఆ సినిమా 'భోళా శంకర్'.. ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది. కాబట్టి త్వరలో చిరు ప్రమోషన్లకు హాజరవుతారు. అలానే కూతురు సుస్మిత నిర్మాణంలో కొత్త సినిమా కూడా మొదలుపెడతారు. ఇందులో మెగాస్టార్‌తో పాటు త్రిష, సిద్ధు, శ్రీలీల నటిస్తారని టాక్ వినిపిస్తుంది. అయితే ఇది మలయాళ సినిమా 'బ్రో డాడీ'కి రీమేక్ అని అంటున్నారు. క్లారిటీ రావాలంటే జస్ట్ వెయిట్ అండ్ సీ. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) (ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) -
'భోళాశంకర్' ట్రైలర్ విడుదల ఎప్పుడంటే..
చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘భోళాశంకర్’ ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 27న ట్రైలర్ విడుదలకానుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. కాగా ‘భోళాశంకర్’ ట్రైలర్‌ను ఈ నెల 27న(గురువారం) విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఆదివారం అధికారికంగా ప్రకటించి, చిరంజీవి లుక్‌ని రిలీజ్ చేసింది. చేతిలో కత్తి పట్టుకుని సీరియస్ లుక్‌లో నడిచి వస్తున్నారు చిరంజీవి. ఈ సినిమాలో సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, ‘వెన్నెల’ కిషోర్, తులసి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్, కెమెరా: డడ్లీ, లైన్ ప్రొడక్షన్: మెహర్ మూవీస్. -
డబ్బింగ్ డన్
‘భోళా శంకర్’కు సొంత డబ్బింగ్ చెప్పారు తమన్నా. చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’.ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. కాగా ఈ సినిమాలో తమన్నా డబ్బింగ్ వర్క్ పూర్తయింది. తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారామె. అనిల్ సుంకర సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. -
శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్కి ఫిదా అయినా తమన్నా
-
మిల్కీ బ్యూటీ... నువ్వే నా స్వీటీ
‘అచ్చ తెలుగు పచ్చి మిర్చి మగాడు వీడే.. బొంబాటు ఘాటు హాటు హాటుగున్నాడే.. కల్లోకి వచ్చేసి కన్నెగుండెల్లో సూది గుచ్చి పిల్లా నీ ముచ్చటేంది అన్నాడే...’ అంటూ రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు హీరోయిన్ తమన్నా. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్, సంజన కల్మంజేతో కలసి ఈ చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్ ఆలపించారు. -
'మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ'.. అంటోన్న మెగాస్టార్!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన తాజాగా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ చిత్రంలో సుశాంత్ కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘భోళా మేనియా ’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. (ఇది చదవండి: భోళా శంకర్: మెగాస్టార్, నందమూరి ఫ్యాన్స్ కోసం భలే స్కెచ్!) తాజాగా మరో లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ' అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ రిలీజైంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11న థియేటర్లలో సందడి చేయనుంది. అన్నా, చెల్లి అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతమందించారు. (ఇది చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!) A delightful melody that weaves a beautiful tapestry of emotions this rainy season❤️#MilkyBeauty Lyrical song out now❤️🔥 - https://t.co/qXFH0C7ghG#BholaaShankar 🔱@SagarMahati thumping musical 🥁 A film by @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial… pic.twitter.com/qw0fkamyVd — Chiranjeevi Konidela (@KChiruTweets) July 21, 2023 -
భోళా శంకర్ సినిమాలో చిరంజీవి,బ్రహ్మానందం సూపర్ హిట్ కామెడీ
-
తెలంగాణ ఫోక్ సాంగ్‌కి మెగాస్టార్ మాస్ డ్యాన్స్
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘జామ్ జామ్ జజ్జనక'ఫుల్ సాంగ్ వచ్చేసింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రంలోని రెండో పాట ‘జామ్ జామ్ జజ్జనక’ నేడు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రముఖ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. డ్యాన్స్‌తో ఇరగదీసిన మెగాస్టార్ ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్‌కి టాలీవుడ్ స్టార్స్ స్టెప్పులేసి అలరిస్తున్నారు. ఆ మధ్య ధమాకా చిత్రంలో రవితేజ ‘పల్సర్ బైక్’కి అదిరిపోయే స్టెప్పులేసి అలరించారు. ఇక ట్రెండ్‌కి తగ్గట్టుగా వ్యవహరించే మెగాస్టార్ కూడా ట్రెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఫోక్ సాంగ్ ‘నర్సపల్లె..’ పాటకు తనదైన శైలీలో స్టెప్పులేసి మరోసారి డ్యాన్స్‌తో తనకు పోటీలేరని నిరూపించుకున్నాడు. 'జామ్ జామ్ జజ్జనక'సాంగ్ మధ్యలో ‘నర్సపెల్లే గండిలోన గంగధారి’పాటను యాడ్ చేశారు. దానికి చిరంజీవి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. భోళా శంకర్ మూవీ తమిళ సూపర్ హిట్ వేదాళం ఆధారంగా తెరకెక్కుతుండగా దీనిని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 11న గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు. -
చిరంజీవి 'జామ్ జామ్ జజ్జనక' కోసం రెడీగా ఉండండి
‘జామ్ జామ్ జామ్ జామ్ జజ్జనక.. తెల్లార్లు ఆడుదాం తైతక్క..’ అంటూ చిందేశారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీలో తమన్నా కథానాయికగా నటించారు. ఏకే ఎంటర్టైన్ మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘జామ్ జామ్ జజ్జనక...’ అంటూ సాగే రెండో పాట ప్రోమోని ఆదివారం విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో చిరంజీవి సంప్రదాయ దుస్తులు ధరించి సూపర్ కూల్‌గా కనిపిస్తున్నారు. ‘‘మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ‘భోళా మానియా...’ అనే మొదటి పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ‘జామ్ జామ్ జజ్జనక...’ అంటూ సాగే పూర్తి పాటని ఈ నెల 11 విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, కెమెరా: డడ్లీ, లైన్ ప్రొడక్షన్: మెహెర్ మూవీస్. -
ఐదుగురు ‘మెగా’ హీరోలు.. 30 రోజులు.. 4 సినిమాలు
ఈ ఏడాది ‘మెగా’ అభిమానులకు చాలా స్పెషల్. మెగా ఫ్యామిలీలో వరుస శుభకార్యాలతో పాటు వరుస సినిమాలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మొదలు.. వైష్ణవ్ తేజ్ వరకు ఈ ఏడాదిలో ఒకటి, రెండు చిత్రాలను ఫ్యాన్స్‌కు అందించబోతున్నారు. కేవలం 30 రోజుల వ్యవధిలో మెగా ఫ్యామిలీ నుంచి నాలుగు సినిమాలు రాబోతున్నాయి. ‘బ్రో’ పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ చిత్రం ఈ నెల 28న విడుదల కాబోతుంది. వినోదయ సీతమ్మకు తెలుగు రీమేక్ ఇది. సముద్రఖని దర్శకుడు. మెగా హీరోలు ఇద్దరు కలిసి నటించిన చిత్రం కావడంతో ‘బ్రో’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భోళాశంకర్ బ్రో సినిమా విడుదలైన రెండు వారాలేకే భోళాశంకర్ సినిమా రాబోతుంది. తమిళ సూపర్ హిట్ వేదాళంకు తెలుగు రీమేక్ ఇది. మోహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న లీజ్ కాబోతుంది. ఆదికేశవ భోళా శంకర్ రిలీజైన వారం రోజులకే అంటే ఆగస్ట్ 18న వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ చిత్రం విడుదల కాబోతుంది. వైష్ణవ్ కెరీర్లో నాలుగో చిత్రమిది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శ్రీలీల హీరోయిన్. ‘గాండీధారి అర్జున’ ఆదికేశవ వచ్చిన మరో వారానికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గాండీధారి అర్జున’ చిత్రం రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మొత్తానికి జులై నెలాఖరు నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు... నెల రోజుల పాటు ఐదుగురు మెగా హీరోలు నాలుగు సినిమాలతో సందడి చేయబోతున్నారు. -
మీ క్యాలెండర్లో ఇది మార్క్ చేసుకోండి: చిరంజీవి
‘భోళా శంకర్’ సినిమాలోని తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశారు హీరో చిరంజీవి. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ‘‘భోళా శంకర్’ రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫైర్ మాస్ ఎంటర్టైనర్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి. థియేటర్స్‌లో కలుద్దాం.. భోళా శంకర్ ఆగస్టు 11’’ అంటూ డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోని షేర్ చేశారు చిరంజీవి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ. -
చిరంజీవి-పవన్ కల్యాణ్.. మధ్యలో అనుష్క!
వేసవితో పాటు గత కొన్నిరోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ డల్‌గా ఉంది. దాదాపు వచ్చినవన్నీ చిన్న సినిమాలు, వాటిలోనూ హిట్ కొట్టినవి తక్కువే. ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాలు పెద్దగా లేవు. మొన్నటివరకు పరిస్థితి ఇది. కానీ రాబోయే కొన్ని నెలలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర హడావుడి మాములుగా ఉండదు. బోలెడన్ని కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమైపోయాయి. వీటిలో ఓ ఫైట్ మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది. 'మిస్ శెట్టి' రిలీజ్ ఫిక్స్ అనుష్క శెట్టి.. చాన్నాళ్ల తర్వాత తెలుగులో చేసిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. 'జాతిరత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన సినిమా ఇదే. కొన్నాళ్ల ముందు టీజర్ విడుదల చేస్తే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో థియేటర్లలోకి ఈ చిత్రం ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఆగస్టు 4న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) మెగా బ్రదర్స్‌తో పోటీ అనుష్క 'మిస్ శెట్టి' సినిమా సోలో రిలీజ్. కానీ దీనికి వారం ముందే అంటే జూలై 28న పవన్ కల్యాణ్-సాయిధరమ్ తేజ్ 'బ్రో' థియేటర్లలోకి వస్తుంది. దీనికి వారం తర్వాత అంటే ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' థియేటర్లలోకి వస్తుంది. అటు చిరు ఇటు పవన్ మధ్యలో అనుష్క తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ఇదంతా చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఈ ఫైట్ ఆసక్తి రేపుతోంది. అనుష్కకే ప్లస్ చిరు, పవన్ సినిమాలతో పోలిస్తే అనుష్క మూవీకే ఎక్కువ ప్లస్ అయ్యే అవకాశముంటుంది. ఎందుకంటే 'బ్రో'.. వినోదయ సీతం రీమేక్, 'భోళా శంకర్'.. వేదాళం చిత్రానికి రీమేక్. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' మాత్రం ఒరిజినల్ కథతోనే తీశారు. అలానే కామెడీని నమ్ముకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏ సినిమా హిట్ అవుతుందా అనే ఒకటే టెన్షన్. ఒకవేళ మూడు సక్సెస్ అయితే మాత్రం కలెక్షన్స్ ఎలా వస్తాయనేది ఇంకా ఇంట్రెస్టింగ్. చూడాలి మరి ఏం జరుగుతుందో? View this post on Instagram A post shared by AnushkaShetty (@anushkashettyofficial) (ఇదీ చదవండి: చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. కోట్లకు కోట్లు!) -
'భోళా శంకర్'కి లైన్ క్లియర్.. ఆ సినిమా వాయిదా వల్ల!
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! ఎందుకంటే కొన్నిరోజుల ముందు విడుదలైన 'భోళా శంకర్' టీజర్ అభిమానులకు నచ్చేసింది. దీంతో సినిమా రిలీజ్ కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇలాంటి టైంలో చిత్రబృందాన్ని సంతోషపరిచే ఓ వార్త ఇప్పుడు వినిపిస్తోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. ఇంతకీ ఏంటది? లైన్ క్లియర్ చిరు 'భోళా శంకర్' సినిమాను తొలుత ఈ ఏడాది ఏప్రిల్ లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ కుదర్లేదు. దీంతో ఆగస్టు 11న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. అదే తేదీన 'అర్జున్‌రెడ్డి' ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన 'యానిమల్' విడుదల చేయాలని అనుకున్నారు. ఆగస్టు 10న సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్' సినిమా విడుదలని ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు పోటీ నుంచి 'యానిమల్' తప్పుకొన్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!) 'యానిమల్' ఎప్పుడు? సినిమాకు సంబంధించిన కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆగస్టు 11న 'యానిమల్'ని తీసుకురావడం కుదరదని తేలినట్లు తెలుస్తోంది. దీంతో సెప్టెంబరులో చేద్దామనుకున్నారు కానీ ఆ నెలలో షారుక్ 'జవాన్' ఉంది. దీంతో అన్నీ ఆలోచించి.. ఏకంగా 'యానిమల్'ని డిసెంబరులో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'భోళా'కు ఇది ప్లస్ పోటీలో ఉన్న మూడు సినిమాల్లో ఒకటి తప్పుకోవడం 'భోళా శంకర్' కు తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్ లోనూ కచ్చితంగా కలిసొస్తుందని చెప్పొచ్చు. రజినీకాంత్ 'జైలర్' సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. ఒకవేళ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప.. చిరంజీవి కొత్త చిత్రానికి కలెక్షన్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చని తెలుస్తోంది. (ఇదీ చదవండి: హీరో ధనుష్‌కి రెడ్ కార్డ్.. అతడి సినిమాలపై నిషేధం?) -
మెగాస్టార్ మాస్ మేనియా... సంధ్య థియేటర్ దద్దరిల్లింది
-
భోళా శంకర్ టీజర్: హద్దుల్లేవ్, సరిహద్దుల్లేవ్.. చిరు మాస్ డైలాగ్స్
చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భోళా శంకర్. శనివారం(జూన్ 24న) ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. 'మొత్తం 33 మందిని చంపేశాడు. ఒక్కడు.. ఏకాకి.. హౌ? కోన్ హై తూ?' అన్న డైలాగ్‌తో టీజర్ మొదలైంది. విలన్ ప్రశ్నకు తన మేనరిజంలో ఆన్సరిచ్చాడు చిరు. షికారుకు వచ్చిన షేర్‌ను బే అంటూ మాస్ డైలాగ్‌లు పలికాడు. టీజర్లో కీర్తి సురేశ్, తమన్నా, సుశాంత్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఈ వీడియోలో యాక్షన్ సీన్లు మరో లెవల్లో ఉన్నాయి. చివర్లో 'ఈ స్టేట్ డివైడ్ అయినా అందరూ నావాళ్లే.. ఆల్ ఏరియాస్ ఆప్నా హై.. నాకు హద్దుల్లేవ్, సరిహద్దుల్లేవ్' అన్న చిరంజీవి డైలాగ్‌తో టీజర్ ముగిసింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తమన్నా చిరుతో జోడీ కట్టగా, కీర్తి సురేశ్ అతడికి చెల్లిగా నటించింది. ఏకే ఎంటర్టైన్మెంట్, క్రియేటివ్ కమర్షియల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి, సంగీతదర్శకుడు: మహతి స్వర సాగర్. చదవండి: పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ విలన్ -
మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే అప్డేట్..
-
మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్‌గా మారుతున్న ఆ పేరు!?
మెగా ఫ్యామిలీకి గత కొన్నాళ్ల నుంచి అన్నీ కలిసొస్తున్నాయి. 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ రావడంతో రామ్ చరణ్ గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. యాక్సిడెంట్ తర్వాత చాన్నాళ్ల సినిమాలకు దూరమైన సాయిధరమ్ తేజ్.. 'విరూపాక్ష'తో హిట్ కొట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కొన్నిరోజుల ముందు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ జరిగింది. ఇప్పుడేమో రామ్ చరణ్ కు కూతురు పుట్టింది. ఇలా ఒకటి తర్వాత ఒకటి గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: చరణ్-ఉపాసన బిడ్డకు ఆ నంబర్ సెంటిమెంట్!?) ఇలా మెగాఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. మరోవైపు హీరోలందరూ సినిమాలు చేస్తూ పుల్ బిజీ. ఇలాంటి టైంలో మెగాహీరోల సినిమా టైటిల్స్ లోని ఓ పేరు సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. 'విరూపాక్ష' తర్వాత సాయితేజ్ నటిస్తున్న మూవీకి 'గాంజా శంకర్' అనే టైటిల్ రిజిస్టర్ చేసినట్లు టాక్ రావడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీకి సంపత్ నంది దీనికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. గతంలో చిరంజీవి హీరోగా 'శంకర్ దాదా ఎంబీబీఎస్', 'శంకర్ దాదా జిందాబాద్' మూవీ చేశారు. పవన్ కల్యాణ్ 'గుడుంబా శంకర్' చేశారు. ఇప్పుడు చిరు మళ్లీ 'భోళా శంకర్' అనే చిత్రం చేస్తున్నారు. తాజాగా సాయిధరమ్ తేజ్.. 'గాంజా శంకర్' అనే మాస్ టైటిల్ ని తన కొత్త మూవీ కోసం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలా అందర 'శంకర్' అనే పేరుని టైటిల్ ఉపయోగించడం సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్గా మారింది. భవిష్యత్తులో మిగతా మెగా హీరోలు కూడా ఈ పేరుతో సినిమాలేమైనా చేస్తారేమో!? (ఇదీ చదవండి: మేనేజర్ మోసం.. రష్మిక షాకింగ్ నిర్ణయం!) -
టిఫిన్ సెంటర్‌కు స్టార్ హీరోయిన్.. ఎవరూ గుర్తుపట్టలేదు!
మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ టాలీవుడ్లో దూసుకెళ్తోంది. ఇటీవలే నాని సినిమా దసరాతో ప్రేక్షకులను అలరించింది. సింగరేణి బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం తమిళంలోనూ ఆమె నటించిన మామన్నన్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే ఆడియో రిలీజ్ ఫంక్షన్లోనూ ఆమె పాల్గొన్నారు. (ఇది చదవండి: తమన్నాకు రజినీకాంత్ గిఫ్ట్.. అదేంటో తెలుసా? ) కాగా.. కీర్తి సురేశ్ ప్రస్తుతం మెగాస్టార్ చిత్రం భోళాశంకర్‌లో నటిస్తోంది. తమిళంలో సూపర్‌హిట్ అందుకున్న ‘వేదాళం’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లిలిగా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లోనే జరిగింది. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తుండగా.. చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌కు వచ్చిన కీర్తి సురేశ్ సిటీలో చక్కర్లు కొట్టింది. ఎవరూ గుర్తు పట్టకుండా తన ఫ్రెండ్స్‌తో కలిసి గచ్చిబౌలిలోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్‌కు వచ్చిన కీర్తి సురేశ్ టిఫిన్ చేశారు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్‌తో కలిసి ఇష్టమైన తందూరీ టీ తాగారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. బయట ఎవరూ గుర్తు పట్టకుండా మాస్క్ ధరించిన కీర్తి సురేశ్ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. (ఇది చదవండి: రామాలయానికి 100 టిక్కెట్లు ఉచితం) -
ఎవరికీ చెప్పొద్దు అంటూ లీక్ చేసిన చిరు
వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ‘చిరు లీక్స్’పేరుతో అభిమానులతో పంచుకున్నారు. సినిమాలోని ఓ పాటకు సంబంధించిన షాట్స్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇంకేముంది మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. వెంటనే దానిని వైరల్ చేయడం కూడా మొదలైంది. (ఇదీ చదవండి: వరుణ్- లావణ్య త్రిపాఠి పెళ్లిపై ఎవరూ స్పందించరేంటి?) వీడియోను గమనిస్తే, సంగీత్ జరుగుతుండగా వచ్చే సాంగ్లా ఉంది. సనిమాలో నటించే ఆర్టిస్టులందరూ ఈ పాటలో హుషారుగా ఉన్నారు. చిరు ఇలా పంచుకున్నారు 'నాతో పాటు నా అభిమానులను కూడా హుషారుగా ఉంచాలని అనుకుంటున్నా. అందుకే ఈ పాట విషయాలు లీక్ చేద్దామనిపించింది. అక్కడ షూట్ చేసిన కొన్ని షాట్స్‌ను ఎడిట్ చేసి, ఇన్‌స్టాలో పంచుకుంటున్నా..ఇది 'చిరు లీక్స్' ఎవరికీ చెప్పొద్దు. మీరు మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి' అని ట్వీట్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సినిమా.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: వారి లిస్ట్ తీయండి.. ఫ్యాన్స్‌కు విజయ్ అదేశం) View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
మాస్ డ్యాన్స్ చేసేద్దాం...
శంకర్ మంచి జోష్ మీద ఉన్నాడు. అందుకే జోరుగా స్టెప్పులు వేస్తున్నాడు. ఒక్కడే కాదు.. ప్రేయసితో, చెల్లెలితో, ఇంకా చాలామందితో కలిసి మాస్ డ్యాన్స్ చేసేద్దాం అంటూ రెచ్చిపోతున్నాడు. చిరంజీవి టైటిల్ రోల్లో రూపొందుతున్న ‘భోళా శంకర్’లోని పాట గురించే చెబుతున్నాం. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా, చెల్లెలి పాత్రను కీర్తీ సురేశ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురితో పాటు చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా హైదరాబాద్‌లో ఓ పాట చిత్రీకరిస్తున్నారు. ఈ పాట కోసం భారీ సెట్‌ని రూపొందించారు. చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్ స్వరపరచిన ఈ మాస్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిషోర్ గరికిపాటి. -
భోళా శంకర్: మెగాస్టార్, నందమూరి ఫ్యాన్స్ కోసం భలే స్కెచ్!
చిరంజీవి - మెహర్ రమేష్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘భోళా మేనియా ’ అంటూ సాగే ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. అన్నాచెల్లి అనుబంధాలతో ముడిపడి ఉన్న ఓ మాస్ యాక్షన్ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి మేకర్స్ తుది మెరుగులు దిద్దుతున్నారు. (ఇదీ చదవండి: పెళ్లి కాకుండానే రెండోసారి తల్లి కాబోతున్న మోడల్, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశముందా?) ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని వైజాగ్ లేదా విజయవాడలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ప్లాన్ చేస్తున్నారట. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ మధ్య మంచి అనుబంధం ఉంది కాబట్టి ప్లాన్ వర్క్ అవుట్ అవుతందని చిత్ర బృందం భావిస్తోందట. ఇదే జరిగితే నందమూరి, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతారని మేకర్స్ స్కెచ్ వేస్తున్నట్లు సమచారం. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేశ్ అతిధిగా రావడం..ఆ తర్వాత మహేశ్ సినిమాకి తారక్ రావడం జరిగింది. ఇలాంటి సందర్భాలు జరిగితే అభిమానుల మధ్య మరింత ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అదుపులో లేని భావోద్వేగాలు.. బ్రేకప్ చెప్పా, కుమిలిపోయా: నటి) -
భోళా మేనియా సాంగ్ రిలీజ్, అదిరిపోయిన చిరంజీవి స్వాగ్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం భోళా శంకర్. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ కీర్తి సురేశ్ చెల్లెలిగా నటిస్తోంది, మెహర్ రమేశ్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి భోళా మేనియా లిరికల్ సాంగ్ విడుదల చేశారు. 'అదిరే స్టైల్ అయ్యా.. పగిలే స్వాగయ్యా.. యుఫోరియా నా ఏరియా.. భోళా మేనియా..' అంటూ పాట మొదలవుతుంది. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా మహతి స్వరసాగర్, రేవంత్ ఎల్వీ ఆలపించారు. ఈ పాటలో మెగాస్టార్ స్వాగ్ అదిరిపోయిందంతే. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. చదవండి: బీచ్‌లో భర్తపై అనసూయ ముద్దుల వర్షం -
బోళా శంకర్ అదిరిపోయే అప్డేట్ ఫాన్స్ కి పూనకాలే..!
-
త్వరలో భోళా మానియా
‘భోళా శంకర్’ ఆగస్ట్ 11న థియేటర్‌కి రానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గరపడే సమయానికి ప్రమోషన్స్ ఆరంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ముందుగా మ్యూజికల్ జర్నీప్రా రంభిస్తారు. ఆ విషయాన్ని తెలియజేసి, ‘భోళా మానియా త్వరలోప్రా రంభమవుతుంది’ అంటూ, చిత్రకథానాయకుడు చిరంజీవి రెండు చేతులను వెనక జేబులో పెట్టుకొని ఉన్న డ్యాన్స్ మూమెంట్ లుక్‌ని రిలీజ్ చేశారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మిపొంస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా, ఆయన సోదరి పాత్రలో కీర్తీ సురేష్ కనిపిస్తారు. ‘‘మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘భోళా శంకర్’. కొంత టాకీ పార్ట్, క్లైమాక్స్, భారీ సెట్ సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. జూన్ నెలాఖరకు షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్‌ప్రొడక్షన్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి మంచి పాటలు ఇచ్చారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మెగాస్టార్ 'భోళాశంకర్'.. ఫోటోలు లీక్ చేసిన చిరు!
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. మహానటి కీర్తిసురేశ్ మెగాస్టార్ చెల్లెలిగా కనిపించనుండగా.. హీరో సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. (ఇది చదవండి: కోల్‌కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?) షూటింగ్‌కు సంబంధించిన అప్డేట్స్ మెగాస్టార్ ఎప్పటికప్పుడు తన ట్విటర్లో పంచుకుంటున్నారు. తాజాగా తమన్నాతో ఓ సాంగ్ షూటింగ్ సంబంధించిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. స్విట్జర్లాండ్‌లోని అందమైన లోకేషన్స్‌లో తీసిన సాంగ్ షూట్ ఎంతో ఆహ్లాదంగా జరిగిందంటూ ట్వీట్ చేశారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న షూటింగ్ ఫోటోలను మెగాస్టార్ అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకొస్తా.. అప్పటివరకు 'చిరు లీక్స్' పిక్స్ నవ్వుతున్న ఏమోజీని జత చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ మీ పాట కోసం వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. (ఇది చదవండి: రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ క్రేజీ అప్డేట్) స్విట్జర్లాండ్ 🇨🇭లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట (Song Shoot ) ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను ! త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం ! అప్పటివరకూ ఈ 'చిరు… pic.twitter.com/VfT8Jx2QNC — Chiranjeevi Konidela (@KChiruTweets) May 23, 2023 -
అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి.. లేట్‌గా అయినా లేటెస్ట్గా
కొన్ని సినిమాలు లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంటాయి. రిలీజ్లు కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకపోవడమే ఈ వాయిదాలకు ఓ కారణం. మరో కారణం ఒకేసారి ఎక్కువ చిత్రాలు విడుదలైతే, థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడటం. కారణాలేమైనా అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి అన్నట్లుగా ఇటీవల పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. ఒకటికి మించి ఎక్కువసార్లు వాయిదా పడిన సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలు, వాటి కొత్త విడుదల తేదీల గురించి తెలుసుకుందాం. ► వేసవికి రావాల్సిన ‘భోళా శంకర్’ ఆగస్టుకు షిఫ్ట్ అయ్యాడు. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమాను ముందు ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆగస్టు 11కు రిలీజ్‌ను వాయిదా వేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ► ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆదిపురుష్’ చిత్రం సిల్వర్ స్క్రీన్‌పైకి రావాల్సింది. కానీ మెరుగైన వీఎఫ్ఎక్స్ కోసం జూన్ 16కు వాయిదా వేశారు. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ దత్తా, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. టి. సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నుంచి ‘జై శ్రీరామ్..’ అనే తొలి పాటను విడుదల చేశారు. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ► మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు. ఫైనల్‌గా జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ‘ఖుషి’ సినిమాను సెప్టెంబరు1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వలో రాజశేఖర్ రెడ్డి, చరణ్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్ 2023 సమ్మర్‌కు వాయిదా పడింది. అయితే ఈ వేసవికి ‘స్పై’ రాలేదు. ఫైనల్‌గా జూన్ 29న విడుదల కానుంది. ► బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ 2022 డిసెంబరులో రిలీజ్ కావాలి. కానీ రాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ వీలుపడలేదు. తాజాగా జూన్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ఇది. ► దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్గా ఈ సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసినప్పటికీ మరోమారు వాయిదా పడి, జూన్ 2న రిలీజ్‌కు రెడీ అవుతోంది. డేట్ ఫిక్స్ కాని చిత్రాలు ► వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఓ సందర్భంలో వెల్లడించింది. అయితే జూలైలో విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ► అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. కానీ రిలీజ్ కాలేదు. ► ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘డీజే టిల్లు స్క్వైర్’ సెట్స్‌పై ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ ప్రకటించింది. అయితే ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్ అయ్యేందుకు రెడీ కానున్నట్లు టాక్. మల్లిక్‌రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ► శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవరగమన’ ఈ నెల 18న రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. రెబా మౌనిక హీరోయిన్గా ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. ► తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను– మాన్’. ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయాలను కున్నారు. కానీ వాయిదా పడింది. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. -
స్విస్‌లో సాంగ్
అసలే ఎండాకాలం.. పైగా కొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి టైమ్‌లో కూల్ కూల్‌గా ఉండేప్రాంతానికి వెళ్లే చాన్స్ వస్తే.. హాయి హాయిగా ఉంటుంది. ప్రస్తుతం ‘భోళా శంకర్’ టీమ్ ఆ హాయినే అనుభవిస్తోంది. ఇటీవల స్విట్జర్లాండ్‌లో ల్యాండ్ అయ్యాడు ‘భోళా శంకర్’. అక్కడి కూల్ కూల్ క్లైమేట్లో ప్రేయసితో ఫుల్ స్వింగ్‌లో స్ప్రింగ్‌లాంటి స్టెప్పులేస్తున్నాడట. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన చెల్లెలి పాత్రలో హీరోయిన్ కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్విట్జర్లాండ్లోప్రారంభమైంది. చిరంజీవి, తమన్నాలపై సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణను కూడా ప్లాన్ చేశారు. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ స్వరకర్త. ‘భోళా శంకర్’ సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది. -
కోల్‌కతాలో భోళాశంకర్.. ఆ సీన్ రిపీట్ కానుందా?
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తోన్న చిత్రం 'భోళాశంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం మెగాస్టార్ కోల్‌కతాకు బయలుదేరారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది చిత్రబృందం. కోల్‌కతాకు ఓ ప్రత్యేకత కోల్‌కతాలో రేపటి నుంచే భోళాశంకర్ మూవీ షెడ్యూల్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిన ‘చూడాలని ఉంది’ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లోనే వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ సినిమాలో మెగాస్టార్ టాక్సీ డ్రైవర్‌గా అలకించారు. మళ్లీ ఇప్పుడు ‘భోళా శంకర్’ టీమ్ కోల్‌కతాకు బయలుదేరడంతో అదే సీన్ రిపీట్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. (ఇది చదవండి: మెగా ఫ్యాన్స్‌కు ఉగాది సర్ప్రైజ్.. భోళాశంకర్ రిలీజ్ అప్పుడే!) కాగా.. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా.. నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. భోళా శంకర్ ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్‌తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. (ఇది చదవండి: అప్పుడు భూమిక.. ఇప్పుడు శ్రీముఖి.. భోళాశంకర్‌లో ఆ సీన్ రిపీట్..!) కాగా.. తమిళ చిత్రం ‘వేదాళం’కు రీమేక్‌గా టాలీవుడ్లో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో అజిత్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమా 2015లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిదేళ్ల తరవాత తెలుగులో రీమేక్ చేస్తున్నారు. The new schedule of Mega 🌟 @KChiruTweets's #BholaaShankar 🔱 will begin in Kolkata from tomorrow💥 A few major sequences will be shot in this schedule at the premises of Yamahanagari❤️ In Theatres on AUG 11th 🤟🏻@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial pic.twitter.com/rUfTaHzn0G — BholāShankar (@BholaaShankar) May 3, 2023 Megastar 🤩😍🔥🔥🔥🔥🔥🔥@BholaaShankar 🔱 “Boss” look as Taxi 🚖 Driver in #Kolkata Tremendous response from everyone 🎉Big thanks to print & web media for their support @AKentsOfficial @AnilSunkara1 @dudlyraj #Mahatiswarasagar @prakash3933 @cinesoul1 @Yugandhart_ #Ramlaxman pic.twitter.com/AM7FDVWA44 — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) May 2, 2023 -
చిరుకు షాకిచ్చిన శ్రీయా
-
ట్యాక్సీ డ్రైవర్‌గా చిరంజీవి.. అదిరిపోయిన 'భోళా శంకర్' పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా భోళాశంకర్. తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకి రీమేక్ ఇది. ఈ సినిమాలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్‌గా కనిపించనున్నారు. మేడే సందర్భంగా.. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు అంటూ భోళాశంకర్ నుంచి స్పెషల్ పోస్టర్లను వదిలారు. ఇందులో కార్మికుడి కాస్టూమ్‌లో టాక్సీ దగ్గర స్టిల్స్ అదిరిపోయాయి. చదవండి: ఇలియానా పాటకు అదిరిపోయిన స్టెప్పులేసిన అదితి శంకర్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తుండగా, కీర్తి సురేష్ చెల్లెలిగా నటిస్తుంది. ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కార్మికులు,కర్షకులు, శ్రమ జీవులకు అందరికి మే డే శుభాకాంక్షలు❤️ Team #BholaaShankar honour & celebrate every worker on this #MayDay💥 Releasing in Theatres on AUG 11th🤟🏻 Mega🌟 @KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @adityamusic pic.twitter.com/nOtkv3AntS — AK Entertainments (@AKentsOfficial) May 1, 2023 -
రప్ఫాడిస్తున్న మెగాస్టార్.. భోళాశంకర్ క్రేజీ అప్డేట్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా.. నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రంలోని ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్‌లో ప్రారంభించింది చిత్రబృందం. చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణంపై ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ పనులకు కూడా గురువారమే శ్రీకారం చుట్టారు. భోళా శంకర్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్‌తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. జూన్‌లో షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ పేర్కొంది. -
అటు యాక్షన్.. ఇటు డబ్బింగ్
హీరో చిరంజీవి బరిలోకి దిగి, విలన్లను రఫ్ఫాడిస్తున్నారు. ఇదంతా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ కోసమే. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించనుండగా, నటుడు సుశాంత్ లవర్ బాయ్ పాత్ర చేస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర ‘భోళా శంకర్’ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఇంటర్వెల్ ఫైట్ చిత్రీకరణను హైదరాబాద్లోప్రారంభించింది యూనిట్. చిరంజీవి, షావర్ అలీ, వజ్ర అండ్ ఫైటర్స్, ఇతర ప్రముఖ తారాగణంపై ఈ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. మరోవైపు డబ్బింగ్ పనులకు కూడా గురువారమే శ్రీకారం చుట్టారు. ‘‘భోళా శంకర్’ ‘కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్‌తో పాటు ఐఫీస్ట్ అనిపించే పాటలు ఉంటాయి. చిరంజీవిని స్టైలిష్ మాస్ అవతార్‌లో చూపిస్తున్నారు మెహర్ రమేశ్. జూన్‌లో షూటింగ్ పూర్తవుతుంది. ఆగస్టు 11న సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
సోగ్గాడుగా చిరు? సస్పెన్స్ లో మెగా ఫాన్స్..
-
చిరంజీవి,శ్రీముఖి లా మధ్య రొమాంటిక్ నడుము సీన్!
-
చిరంజీవి ప్లాన్‌కు కంగారుపడుతున్న మహేశ్‌బాబు ఫ్యాన్స్!
చిరంజీవి ఓ నిర్ణయం తీసుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాడు. తన సినిమాల రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటాడు. చిరు రీ ఎంట్రీ తర్వాత తన అనుభవాన్ని ఉపయోగించి మేకర్స్‌కు సలహాలు ఇస్తున్నాడు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఉగాది రోజు ఎనౌన్స్ చేసిన భోళా శంకర్ రిలీజ్ డేట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. బాక్సాఫీస్ దగ్గర మహేశ్ వర్సెస్ చిరంజీవి వార్ కన్ఫార్మ్ అనుకుంటున్నారు అందరూ. అయితే చిరంజీవి రిలీజ్ డేట్ చెప్పి మెగా ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తే...ఇన్ డైరెక్ట్ గా మహేశ్‌బాబు ఫ్యాన్స్‌కు హింట్ ఇచ్చి కంగారు పెడుతున్నాడు. చిరంజీవి తన మూవీ ఏదైనా బాక్సాపీస్ దగ్గర సింగిల్‌గా రిలీజ్ కావాలనుకుంటున్నాడు. ఇంకో సినిమాతో పోటీ పడితే కలెక్షన్స్‌పై ప్రభావం చూపిస్తుంది. అందుకే భారీ ఓపెనింగ్స్ ఉండాలనే కాన్సెప్ట్ చిరంజీవిది. తొందరపడి రిస్క్ చేయటం చిరంజీవికి ఇష్టం ఉండదు. అందుకని మెగాస్టార్ చాలామటుకు సోలో రిలీజ్‌కే ఇష్టపడతాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సంక్రాంతికి వీరసింహారెడ్డితో పోటీపడ్డాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాను ముందుగా ఏప్రిల్ 14న విడుదల చేయాలనుకున్నారు. అయితే వాల్తేరు వీరయ్యకి చిరంజీవికి డేట్స్ అడ్జెస్ట్ చేయటంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సాధారణంగా మెగాస్టార్ ఫెస్టివల్ సీజన్స్‌లో రావటానికే ఇష్టపడతాడు. పైగా అదే రోజు మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న #SSMB28 విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగ వంశీ ఎప్పుడో చెప్పాడు. దీంతో బాక్సాపీస్ దగ్గర మెగాస్టార్.. సూపర్ స్టార్ వార్ ఫిక్స్ అనుకుంటున్నారు. కానీ మహేశ్ మూవీ ఆగస్టు 11న రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించటం లేదు. ఉగాది అప్డేట్ ఇస్తామంటూ చెప్పిన #SSMB28 మేకర్స్ మహేశ్ ఫ్యాన్స్‌ను డిసప్పాయింట్ చేశారు. ఇక రిలీజ్ విషయంలో కూడా అదే పని చేశారు. ఈ #SSMB28 మూవీ షూటింగ్ ఏప్రిల్ మంత్ ఎండింగ్‌కు ఫైట్స్, సాంగ్స్ మినహా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేలా డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేశాడు. అయినా పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్నవిధంగా పూర్తయ్యేలా కనిపించకపోవటంతో ఈ మూవీ రిలీజ్ ఆగస్టు 11 నుంచి డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మెగాస్టార్ మరో సినిమా ఆ డేట్ ఫిక్స్ చేసుకోకముందే తను లాక్ చేసుకున్నాడు. భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ చేయటానికి మరో రీజన్ కూడా వుంది. ఫోర్ డేస్ లాంగ్ వీకెండ్ వుంది. ఆగస్టు 11 ఫ్రైడే.. ఆ తర్వాత సెకండ్ శాటర్ డే... సండే... మంగళవారం ఆగస్టు 15 హాలీడేస్. కంటిన్యూస్ గా సెలవులు రావటంతో ఈ టైమ్ లో రిలీజ్ చేస్తే... ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయే రేంజ్లో వుండేలా మెగా ప్లాన్ వేశాడు చిరంజీవి. ఈ లెక్కన మహేశ్ మూవీ వెనక్కి వెళ్లటంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంటే... మహేశ్ ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉన్నారు. This Telugu NEW YEAR Begins in Advance with a MEGA upDATE😎 Mega🌟@KChiruTweets #BholaaShankar 🔱 Releasing WorldWide In Theatres on AUG 11th 2023 ❤️🔥#HappyUgadi @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial @adityamusic @dudlyraj @prakash3933 @kishore_Atv pic.twitter.com/cZLpEJFhC3 — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) March 21, 2023 -
మెగా ఫ్యాన్స్‌కు ఉగాది సర్ప్రైజ్.. భోళాశంకర్ రిలీజ్ అప్పుడే!
Bhola Shankar Movie Release Date: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఉగాది పర్వదినం సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. భోళాశంకర్ మూవీని ఆగస్టు 11, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. తెలుగు నూతన ఏడాది సందర్భంగా మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. This Telugu NEW YEAR Begins in Advance with a MEGA upDATE 😎 Mega🌟@KChiruTweets #BholaaShankar 🔱 Releasing WorldWide In Theatres on AUG 11th 2023 ❤️🔥#HappyUgadi @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanth @AKentsOfficial @adityamusic pic.twitter.com/ksqeqldaiA — AK Entertainments (@AKentsOfficial) March 21, 2023 -
మెగాస్టార్ సినిమాలో అక్కినేని హీరో.. ఆ పాత్రకు ఓకే!
చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 మినహాయిస్తే ప్రతి సినిమాలో యంగ్ హీరో సపోర్ట్ తీసుకుంటున్నాడు.సైరా సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తే... ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించాడు. ఇక గాడ్ ఫాదర్ సత్యదేవ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చిరంజీవి స్టామినా ఎంటో బాక్సాఫీస్‌కి చూపించిన వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాలో కూడా ఓ యంగ్ హీరో నటించనున్నాడు. ఈ ఛాన్స్ అక్కినేని హీరో దక్కించుకున్నాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత చిరంజీవికి.. ప్రేక్షకులు తన నుంచి ఏమి కోరుకుంటున్నారో బాగా అర్థమైనట్లుంది. అందుకే తను మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ కావటంతో.. భోళాశంకర్‌పై హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా తమిళ్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరు తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఖుషి సినిమాలోని ఇంటర్వెల్ సీన్‌ను చిరంజీవి- శ్రీముఖి మధ్య రీ క్రియేట్ చేసి షూట్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మ హిట్ సాంగ్‌ను కూడా భోళాశంకర్‌లో రీమిక్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. సిస్టర్‌గా కీర్తి సురేశ్ కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి మరో యంగ్ హీరోతో కలిసి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అక్కినేని హీరో సుశాంత్‌కు దక్కింది. కాళిదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. ప్రజెంట్ హీరోగా సినిమాలు చేస్తూనే.. ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. అలా వైకుంఠపురంలో సినిమాలో నటించిన సుశాంత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇలా తనదైన పాత్రలు చేస్తూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సుశాంత్ రవితేజ రావణసుర మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్లో రోల్ చేయనున్నారు. రావణసుర సినిమాలో రవితేజతో పాటు.. సుశాంత్ రోల్ కూడా కీలకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్‌లో సుశాంత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేశ్ లవర్‌గా సుశాంత్ కనిపించబోతున్నాడట. అయితే వేదాళం మూవీలో ఈ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉంటుంది. అయితే తెలుగులో సుశాంత్ కోసం ఈ పాత్ర లెంగ్త్ కొంచెం పెంచారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సుశాంత్ ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పాడట. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని టాక్ వినిపిస్తోంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి సినిమాలో సుశాంత్ నటించనున్నాడనే విషయం తెలియటంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. -
కూతురితో చిరంజీవి నెక్స్ట్ సినిమా!
హీరో చిరంజీవి, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం మెహర్రమేశ్దర్శకత్వంలో ‘భోళాశంకర్’ సినిమా చేస్తున్నారు చిరంజీవి. ఈ మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. దీంతో తన తర్వాతి సినిమాపై ఫోకస్ పెట్టారు మెగాస్టార్. ఈ క్రమంలోనే ఆయన కొత్త కథలు వింటున్నారు. దర్శకులు పూరి జగన్నాథ్, ప్రభుదేవా వంటి వారు చిరంజీవికి కథలు చెప్పారని టాక్. తాజాగా రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి పేరు తెరపైకి వచ్చింది. బీవీఎస్ రవి కథకు తమిళ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తారట. ఈ సినిమాకు చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల ఓ నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం. అయితే ఈ విషయాలపై పూర్తి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. కాగా చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గతంలో ఓ ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా గురించి మరో అధికారిక అప్డేట్ రావాల్సి ఉంది. -
సక్సెస్ కోసం మెగాస్టార్ దారిలో బాలకృష్ణ!
టాలీవుడ్ లో రీమిక్స్ సాంగ్స్ కొత్తేమీ కాదు.. తమ అభిమాన హీరోలు పాటలను...యంగ్ హీరోస్ రీమిక్స్ చేసి తమ సినిమాకి హైప్ తెచ్చుకుంటారు. అయితే ఇప్పటి వరకు ఏ హీరో తన పాటలనే తను నటించే సినిమా కోసం రీమిక్స్ చేసుకోలేదు. కానీ టాలీవుడ్ ఇద్దరు హీరోలు కొత్త ట్రెండ్ ను సెట్ చేయటానికి ట్రై చేస్తున్నారు. తమ సినిమాల్లోని హిట్ సాంగ్స్‌ని నయా మూవీస్‌లో రీమేక్ చేయబోతున్నారు. వాల్తేరు వీరయ్య మూవీలో తన వింటేజ్ లుక్ ... మ్యానరిజమ్స్ ప్రేక్షకులకి ఒక్కప్పటి చిరంజీవిని గుర్తు చేశాడు. అందుకే బోళాశంకర్ లో వింటేజ్ చిరంజీవి లుక్ ను మాత్రమే కాకుండా...అభిమానులకు కిక్ ఇచ్చేందుకు చిరు మరో ఎక్స్ఫర్మెంట్ కి రెడీ అయ్యాడు. తన సినిమాలోని ఓ హిట్ సాంగ్ ను...బోళాశంకర్ లో రీమిక్స్ చేయిస్తున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి కలకత్తా బ్యాక్ డ్రాప్ లో చూడాలని వుంది సినిమా చేశాడు. ఆ సినిమాలో రామ చిలకమ్మా పాట సూపర్ హిట్ అయింది. బోళాశంకర్ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ ఈ పాటను రీమిక్స్ చేస్తున్నాడు. చిరు బోళాశంకర్ లో తన పాట రీమిక్స్ చేయమని చెప్పటానికి ఒక రీజన్ వుంది. వాల్తేరువీరయ్య సినిమాలో తన ఓల్డ్ సాంగ్ కి శృతిహాసన్ తో కలిసి స్టెప్స్ వేశాడు..ఆ డ్యాన్స్ ను ఫ్యాన్స్ బాగా ఎంజాయి చేశారు. తన సినిమాలోని ఓ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేస్తే అభిమానులు ఇంకా బాగా ఎంజాయి చేస్తారనే ఐడియాతోనే చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇక బాలకృష్ణ కూడా వీరసింహా రెడ్డి తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్ట్ (NBK108) స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ ఫ్యాక్షన్ లీడర్ గా నటించి వింటేజ్ బాలకృష్ణను గుర్తు చేశాడు. దీంతో NBK108 టీమ్ కూడా బాలకృష్ణ ఓల్డ్ మూవీలోని ఓ సూపర్ హిట్ సాంగ్ ను రీమిక్స్ చేసేందుకు రెడీ అవుతుందట. బాలకృష్ణ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన సమరసింహారెడ్డి.. ఈ సినిమాలోని అందాల ఆడబోమ్మ పాటను మళ్లీ రీమిక్స్ చేస్తున్నారనే న్యూస్ నెట్టింట వైరల్ మారింది. తమన్ మ్యూజిక్ లో ఆ సాంగ్ రీమిక్స్ అయితే ఇంకా అదిరిపోతుందని బాలకృష్ణ ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. యంగ్ బ్యూటీ శ్రీలీల డాటర్ గా నటించే ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా కాజల్ నటించనుందట. అయితే అందాల ఆడబొమ్మ రీమిక్స్ చేస్తారా లేదా అనే విషయంపై చిత్ర యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. -
ఎండల్లో హాయ్ హాయ్..అంటున్న స్టార్స్.. సమ్మర్ టార్గెట్‌గా భారీ సినిమాలు
వేసవి వస్తోందంటే సినిమాల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో సినిమాకి వెళుతుంటారు. మండే ఎండల్లో కూల్ కూల్‌గా ఏసీ థియేటర్లో కూర్చుని సినిమాని ఆస్వాదిస్తుంటారు. అందుకే సమ్మర్ టార్గెట్‌గా ఎక్కువ సినిమాలు సిల్వర్ స్క్రీన్‌కి వస్తుంటాయి. ఈ ఏప్రిల్‌లో తొమ్మిది సినిమాలకుపైగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ‘మే’కి మాత్రం ఇప్పటికి విడుదల తేదీ ఖరారైన సినిమా ఒకే ఒక్కటి ఉంది. నాగచైతన్య ‘కస్టడీ’ మే 12న విడుదల కానుంది. మరి.. ఏప్రిల్‌లో విడుదల కానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం... ♦ ‘ధమాకా’ చిత్రంతో వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో రవితేజ. దీంతో ఆయన నటిస్తున్న తర్వాతి సినిమా ‘రావణాసుర’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొం దుతున్న ఈ సినిమాలో రవితేజ లాయర్పాత్రలో కనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. ♦ వైవిధ్యమైన కథలు, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ‘అల్లరి’ నరేశ్. వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్‌లో నటించారు. ప్రస్తుతం నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిర్నా మీనన్ హీరోయిన్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ♦ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ . కదిరేశన్∙స్వీయ దర్శకత్వంలో ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై రూపొం దిన ఈ తమిళ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ సినిమాని గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించినా వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ కాలేదు. ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు కొత్త డేట్ ప్రకటించింది యూనిట్. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 15వ చిత్రం ‘విరూపాక్ష’. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎ న్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్‌లో జరిగే కథాంశంతో ఈ మూవీ రూపొం దుతోందని సమాచారం. ♦ అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నపాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షీ వైద్య కథానాయికగా చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొం దుతోన్న చిత్రమిది. ఈ మూవీ కోసం సిక్స్‌ప్యాక్ దేహం, పొడవాటి హెయిర్ స్టైల్‌తో స్టైలిష్‌గా మేకోవర్ అయ్యారు అఖిల్. ఫారిన్లో చిత్రీకరించే ఓ ఫైట్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. ♦ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ (పీఎస్– 1)’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు మణిరత్నం. తొమ్మిదో శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధానపాత్రల్లో నటించారు. లైకాప్రొ డక్షన్స్ , మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ‘పీఎస్ 1’ గత ఏడాది సెప్టెంబర్ 30నపాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. మలి భాగాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్రయూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ♦ తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు పంజా వైష్ణవ్ తేజ్. ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ తర్వాత తన నాలుగో చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం గత ఏడాది జూన్ల్ ప్రారంభమైంది. తన కెరీర్లో తొలిసారి మాస్, యాక్షన్ మూవీ చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ఏప్రిల్ 29న బాక్సాఫీస్ బరిలో నిలుస్తోంది. ∙ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలిపాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. మరి ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 14న ‘బోళా శంకర్’ రిలీజ్ అవుతుందా? మరో కొత్త డేట్‌ని అనౌన్స్ చేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. సమంత లీడ్ రోల్లో నటించినపాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ గుణశేఖర్. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమకథను ఈ మూవీలో చూపిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
అప్పుడు భూమిక.. ఇప్పుడు శ్రీముఖి.. భోళాశంకర్‌లో ఆ సీన్ రిపీట్..!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరుకు చెల్లెలిగా నటిస్తుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అప్పట్లో పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ ఖుషిలో భూమిక నడుము సీన్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అయితే అలాంటి సీనే భోళా శంకర్‌లో తెరకెక్కించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సీన్‌ను యాంకర్ శ్రీముఖిపై చిత్రీకరించారని సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి-శ్రీముఖిపై నడుము సీన్ తెరకెక్కించారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ పవన్ కల్యాణ్ అభిమానిగా కనిపిస్తారని.. అందుకే పవన్ సీన్ ఒక్కటైనా ఉండాలని ఖుషి సినిమాలోని ఎవర్ గ్రీన్ సన్నివేశం ప్లాన్ చేశారట. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మరిన్ని రోజులు ఆగితే ఈ విషయంపై క్లారిటీ రానుంది. మహా శివరాత్రి సందర్భంగా భోళా శంకర్ సినిమాకు సంబంధించి మేకర్స్ “స్ట్రీక్ ఆఫ్ శంకర్” పేరుతో గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
200 మంది డ్యాన్సర్ల మధ్య చిరు, కీర్తి స్టెప్పులు
అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నారు శంకర్. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తుండగా, ఆయనకు జోడీగా తమన్నా నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన కోల్‌కతా బ్యాక్‌డ్రాప్ సెట్లో చిరంజీవి, కీర్తీ సురేష్‌లతో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా, ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. సత్యానంద్ కథా పర్యవేక్షణ చేస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి. -
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మెగాస్టార్.. ఒక్కో సినిమాకి ఎంతంటే..
చాలా కాలం తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అంతకు ముందు నటించిన చిత్రాలలో ఆచార్య బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాపడగా.. గాడ్‌ఫాదర్ మంచి టాక్ సంపాదించుకున్నప్పటికీ బ్రేక్ ఈవెన్ మాత్రం సాధించలేదు. అయితే సంక్రాంతి సందర్భంగా విడుదలైన వాల్తేరు వీరయ్య మాత్రం భారీ విజయాన్ని సాధించింది. రిలీజైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ.250 కోట్లపై పైగా వసూళ్లను సాధించి మెగాస్టార్ సత్తా ఏంటో మరోసారి నిరూపించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో చిరంజీవి తన రెమ్యునరేషన్ అమాంతం పెంచినట్లు తెలుస్తోంది. పలు వెబ్ సైట్ల కథనాల ప్రకారం.. వాల్తేరు వీరయ్య సినిమా కోసం రూ.50 కోట్లను రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడట చిరంజీవి. అలాగే ప్రస్తుతం నటిస్తున్న బోళా శంకర్ చిత్రానికి కూడా అంతే పారితోషికం అందుకున్నాడట. కానీ ఈ చిత్రం తర్వాత నటించబోయే సినిమాలకు మాత్రం రూ.100 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారట. తన మార్కెట్‌కు తగ్గట్టుగా పారితోషికం తీసుకోవాలని చిరంజీవి భావిస్తున్నాడట. బోళా శంకర్ తర్వాత వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. -
ఆ విషయంలో చిరుపై కోపంగా ఉన్న మెగా ఫ్యాన్స్!
ఒకవైపు రామ్ చరణ్ రీమేక్స్ లో నటించడం రిస్క్ అంటాడు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం రీమేక్స్ అంటేనే ఇంట్రెస్ట్ అంటున్నాడు. చిరంజీవి ఇప్పటికే చాలా రీమేక్స్ లో నటించాడు. ఇప్పుడు మరో రెండు రీమేక్స్ తో తిరిగొస్తానంటున్నాడు. ఈ విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త కోపంగానే ఉన్నారు. తమిళనాడులో అజిత్ సినిమాలు దుమ్మురేపుతుండటం చూసి, చిరు ఈ సినిమాలపై మనసు పారేసుకుంటున్నారు. వీటిని తన ఇమేజ్ తగ్గట్లు మార్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే వేదాళం చిత్రాన్ని చిరు ‘భోళాశంకర్’ పేరుతో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు వినాయక్ చేతికి అజిత్ నటించిన విశ్వాసం తెలుగు రీమేక్ బాధ్యతలు అప్పగించాడట. దాంతో మెగా ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు. ఒక వైపు స్ట్రెయిట్ గా మూవీగా వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.150 కోట్లు వసూళ్లు దాటి పరుగులు తీస్తుంటే, మళ్లీ చిరు రీమేక్స్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటూ బాధపడుతున్నారు. వేదాళం, విశ్వాసం చిత్రాల తర్వాత అజిత్ నటించిన మరో సినిమా ఎంతవాడు గాని తెలుగు రీమేక్ లో చిరు నటించాలనుకున్నాడు. -
హైదరాబాద్‌లో కోల్‌కతా! బోళా శంకర్ కొత్త షెడ్యూల్
హైదరాబాద్‌లో కోల్‌కతా ఏంటీ అనుకుంటున్నారా! చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’ కోసం హైదరాబాద్‌లో కోల్‌కతా సెట్ వేశారు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ఇది. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన కోల్‌కతా సెట్లో ఈ చిత్రం కొత్త షెడ్యూల్ మంగళవారం ప్రారంభం అయింది. ఈ సెట్లో చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని టాక్. ‘‘మాసివ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బోళా శంకర్’. చిరంజీవిని స్టైలిష్, మాస్ క్యారెక్టర్లో అద్భుతంగా చూపిస్తున్నారు మోహర్ రమేశ్. ఇందులో చిరంజీవి సోదరిగా కీర్తీ సురేష్, తమన్నా కథానాయికగా నటిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీతం: మహతి స్వరసాగర్, కెమెరా: డడ్లీ. -
2023: నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాల జాతర.. అన్ని భారీ, పాన్ ఇండియా ప్రాజెక్ట్సే
ఓటీటీలో ఈ ఏడాది కొత్త సినిమాల జాతర నెలకొననుంది. థియేటర్లో సంక్రాంతి పండుగ సందడి ఉండగానే.. ఓటీటీలో కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ సంక్రాంతికి డిజిటల్ ప్రియులను ఆకర్షించే పనిలో పడింది. ఎప్పుడు సినిమాలు రిలీజ్ అనంతరం ప్రకటన ఇచ్చే నెట్‌ఫ్లిక్స్ ఈసారి థియేట్రికల్ రిలీజ్‌కు ముందే కొత్త సినిమాలను వరుస పెట్టి ప్రకటిస్తోంది. చదవండి: Priyanka Jawalkar: పవన్ కల్యాణ్‌తో అసలు నటించను! ఎందుకంటే.. సంక్రాంతి సంందర్భంగా తెలుగులో రాబోయే స్టార్ హీరోల సినిమాలను అనౌన్స్ చేసింది. వాటిలో భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పాన్ ఇండియా సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని రిలీజ్‌కు సిద్దంగా ఉండగా.. మరికొన్ని షూటింగ్ దశలోనే ఉన్నాయి. అవేంటంటే చిరంజీవి భోళా శంకర్, మహేశ్ బాబు ఎస్ఎస్ఎమ్బి 28, వరుణ్ తేజ్ వీటీ 12, అనుష్క ప్రోడక్షన్ నెం. 14, సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష, నాని దసరా, డీజే టిల్లు 2 ఇంకా ఎన్నో కొత్త ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. చదవండి: హృతిక్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు: ఆ కామెంట్స్‌పై జక్కన్న స్పందన ఇక విడుదలైన 18 పేజెస్, ధమాకా చిత్రాలు కూడా త్వరలో ఇక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి. ఒక్క తెలుగు సినిమాలే కాదు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలను కూడా వరుసగా ప్రకటిస్తోంది. అందులో అయినప్పుడు అతి తర్వలో మీ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోయే చిత్రాలు ఇవే అంటూనే థియేట్రికల్ రిలీజ్ అనంతరమే అని స్పష్టం చేసింది. నెట్‌ఫ్లిక్స్ జోరు చూస్తుంటే ఈ ఏడాది సినీ ప్రియులకు సినిమాల జాతర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ చిత్రాలేవో చూద్దాం! View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
మెగా ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్, భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ ఇది. చిరంజీవి కెరీర్లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో రఘుబాబు, రావు రమేశ్, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, యాంకర్ శ్రీముఖి తదితరులు నటిస్తున్నారు. చదవండి: తొలి రెమ్యునరేషన్ ఎంతో చెప్పిన ఆలియా, ఆ చెక్‌తో ఏం చేసిందంటే అయితే రేపు(ఆగస్ట్ 22) చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఈ మూవీ టీం అదిరిపోయే అప్డేట్ను వదలింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసి తాజాగా ప్రకటించింది చిత్ర బృందం. ఏప్రిల్ 14, 2023లో సమ్మర్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చదవండి: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక Wishing The Swagster of INDIAN CINEMA Mega 🌟 @KChiruTweets A Very Happy Birthday ❤️🔥#BholaaShankar 🔱 ARRIVING in theatres Worldwide on 14th April,2023 🤘#HBDMegastarChiranjeevi@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/mxfWLMnrK3 — BholāShankar (@BholaaShankar) August 21, 2022 -
సమ్మర్ వార్ కు సై అంటున్న టాలీవుడ్ స్టార్ హీరోలు
సినిమాలకు మంచి సీజన్ అంటే సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి... ఈ ఏడాది సమ్మర్ ముగిసింది. ఇక 2023 వేసవి బరిలో నిలిచేందుకు భారీ సినిమాలు రెడీ అవుతున్నాయి. డేట్‌ని ఫిక్స్ చేయకపోయినా వేసవి బరిలో నిలిచేందుకు ముందుగానే కర్చీఫ్ వేసేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలు వేసవికి సై అంటున్నారు.. ఆ వివరాల్లోకి ఓ లుక్కేద్దాం. వరుసగా నాలుగైదు సినిమాలకు ఓకే చెప్పి, ఫుల్ స్పీడ్‌లో ఉన్నారు చిరంజీవి. ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘బోళాశంకర్’ ఒకటి. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తమిళ హిట్ ‘వేదాళం’కి రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట చిత్రయూనిట్. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీసురేశ్ నటిస్తున్నారు. ఇక గత ఏడాది ‘అఖండ’ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న బాలకృష్ణ కూడా వచ్చే వేసవికి సందడి చేయనున్నారని టాక్. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబరు నెలాఖరులో ప్రారంభం కానుంది. సినిమా రిలీజ్‌ను వేసవికి టార్గెట్ చేసుకున్నారట. మరోవైపు ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్, ‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘సలార్’ కూడా సమ్మర్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇక తాజా క్రేజీ చిత్రాల్లో మహేశ్‌బాబు–త్రివిక్రమ్ సినిమా ఒకటి. ‘అతడు, ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తారు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇంకోవైపు ‘జనతా గ్యారేజ్’ వంటి హిట్ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రెండో సినిమా రూపొందనుంది. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఆగస్టులో ఆరంభం కానుంది. ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. సమ్మర్ రేస్‌లో రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించనున్న సినిమా కూడా ఉండే అవకాశం ఉంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయిక. దర్శకుడు శంకర్ నేరుగా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ఇది. ఈ సినిమాని కూడా వేసవి బరిలో నిలపనుందట చిత్రబృందం. మార్చిలో విడుదల అవుతుందని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక గత ఏడాది ‘పుష్ప’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన అల్లు అర్జున్–సుకుమార్ తగ్గేదేలే అంటూ ఈ సినిమా రెండో భాగానికి రెడీ అవుతున్నారు. అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్’ రానుంది. వార్తల్లో ఉన్న ప్రకారం ఈ సినిమా 2023 సంక్రాంతి బరిలో దిగాల్సి ఉంది. అయితే ఇప్పటివరకూ షూటింగ్ ఆరంభం కాలేదు. దీంతో వేసవిలో పుష్ప రాజ్ వేట మొదలవుతుందట. మరి.. సమ్మర్ రేస్‌లో ఈ చిత్రాలన్నీ నిలుస్తాయా? కొత్త చిత్రాలు లిస్ట్‌లో చేరతాయా? అనేది చూడాలి. -
జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను..అదే నా భయం : తమన్నా
సెలబ్రిటీలు అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేస్తుంటారు. తాజాగా ‘ఆస్క్ తమన్నా’ అంటూ తమన్నా ఫ్యాన్స్‌కు ఆఫర్ ఇచ్చారు. అంతే.. నెటిజన్లు ప్రశ్నలు సంధించారు. తమన్నా కూల్‌గా జవాబులు చెప్పారు. వాటిలో కొన్ని ఈ విధంగా... జీవితంలో మీరు నేర్చుకున్న ఏ అంశాన్ని ఇతరులతో షేర్ చేసుకోవాలనుకుటున్నారు? నీలో ఉన్న ధైర్యాన్ని నమ్ముతూ జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి. మిమ్మల్ని బాగా భయపెట్టే విషయం? అప్పడప్పుడు నా జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను. ఇది నన్ను చాలా భయపెట్టే అంశం. మీరు చేసినవాటిలో స్పెషల్ రోల్స్‌గా భావించేవి? ‘ధర్మదురై’ చిత్రంలో సుభాషిణి, ‘బాహుబలి’లో అవంతిక. మీ కెరీర్లో చాలెంజింగ్ రోల్? ‘ఎఫ్ 3’లో నేను చేసిన అబ్బాయి పాత్ర. ఫుల్ ప్లెడ్జ్డ్ డ్యాన్స్ ఫిల్మ్ ఎప్పుడు చేస్తారు? నాకు చేయాలనే ఉంది. నాకు ఉన్న డ్రీమ్ ప్రాజెక్ట్స్‌లో ఇదొకటి. ఏ కల్పిత పాత్రలను మీరు మీ జీవితంలో నిజంగా కలవాలనుకుంటున్నారు? షెర్లాక్ హోమ్స్ పాత్రలు సక్సెస్ కావడానికి ఏం ఫాలో అవ్వాలంటారు? మీ ప్యాషన్‌ను ఫాలో అవ్వండి. మీ గోల్‌ను సాధించడానికి తీవ్రంగా శ్రమించండి. ఈ ప్రయత్నంలో విఫలమైనా మళ్లీ ప్రయత్నించండి. అదృష్టం అంటే మీ దృష్టిలో..? మన కష్టానికి విధి సహాయ పడడాన్ని నేను లక్‌గా భావిస్తాను. హాలీవుడ్లో సినిమాలు చేస్తారా? అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. మీ ఫేవరెట్ జానర్ మూవీస్? యాక్షన్ అండ్ రొమాన్స్. కాన్స్ చిత్రోత్సవాల్లో పాల్గొనడం గురించి? కాన్స్ చిత్రోత్సవాల్లో భాగస్వామ్యంగా ఉన్న మన దేశం తరఫున ఓ నటిగా నేను ప్రాతినిథ్యం వహించడం చాలా హ్యాపీగా అనిపించింది. మ్యాజికల్‌గా ఉంది. చాలా గౌరవంగా ఫీలవుతున్నాను. మీ తర్వాతి చిత్రాలు? చిరంజీవిగారితో ‘బోళా శంకర్’ సినిమా చేస్తున్నాను. ‘బబ్లీ బౌన్సర్’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోకు ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. త్వరలో ఓ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించబోతున్నాను. -
Bholaa Shankar: ఊర మాస్‌గా చిరు.. లుక్ అదిరిందిగా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ ఇది. చిరంజీవి కెరీర్లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మెగా అభిమానులు వెండితెరపై చిరంజీవి ఎలా చూడాలనుకుంటున్నారో.. అలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. స్టైల్‌గా జీపుపై కూర్చొని ఊర మాస్ లుక్‌లో చిరంజీవి అదరగొట్టేశాడు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది Happy #MahaSivaratri to All !🙏 Here goes the #VibeOfBHOLAA #BholaaShankarFirstLook #BholaaShankar 🔱@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @dudlyraj #MahathiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/XVxVYP5316 — Chiranjeevi Konidela (@KChiruTweets) March 1, 2022 -
మెగా అభిమానులకు సర్ప్రైజ్.. శివరాత్రికి గుడ్ న్యూస్
Chiranjeevi Bhola Shankar First Look Release On 1 March: మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబినేషన్లో వస్తోన్న మాస్సివ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'భోళా శంకర్'. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'వేదాళం' సినిమాకు రీమెక్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చిరంజీవి 155వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్గా చేస్తున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇదివరకూ ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఈ శివరాత్రికి మెగా అభిమానులకు చిత్రబృందం కానుక ఇవ్వనుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మార్చి 1న ఉదయం 9:05 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. శివుడికి మరొక పేరు అయిన శంకర్ టైటిల్ పాత్రలో చిరంజీవి నటిస్తున్నందున ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసేందుకు ఇదే మంచి సమయమని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. This Maha Shivarathri 🙏 Get ready for the MEGA VIBE of #Bholaa⚡️ MEGA🌟@KChiruTweets #BholaaShankarFirstLook on March 1st @ 9:05 AM 🤘#BholaaShankar 🔱 @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar#MegaEuphoria ✨ pic.twitter.com/L9cpYB5PUd — Meher Ramesh 🇮🇳 (@MeherRamesh) February 27, 2022 -
న్యూ ఇయర్‌కు భోళా శంకర్ టీం మెగా ట్రీట్, అదిరిపోయిన స్పెషల్ వీడియో
కొత్త సంవత్సరం సందర్భంగా ఫ్యాన్స్‌కు మెగా ట్రీట్ ఇచ్చారు ‘భోళా శంకర్’ చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మోహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇటీవల సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో చిరంజీవి చాలా స్టైలిష్‌గా కనపడుతున్నారు. చేతికి తాయత్తులు కట్టుకుని, కొత్త హెయిర్ స్టైల్‌తో, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చిరు సరికొత్తగా కనిపించాడు. 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోను న్యూ ఇయర్ సందర్భంగా ‘స్వాగ్ ఆఫ్ బోళా’ అంటూ విడుదల చేశారు. అలాగే దీనితో పాటు ‘గాడ్ ఫాదర్’ మూవీ షూటింగ్‌తో కూడా చిరు బిజీగా ఉన్నాడు. ఇక శివ కొరటాల దర్శకత్వంలో నటించిన ఆచార్య మూవీ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని ఫిబ్రవరి 4న విడుదలకు సిద్ధమవుతోంది. -
గుడ్ న్యూస్ చెప్పిన యానీ మాస్టర్, మెగాస్టార్ సినిమాలో ఛాన్స్
Bigg Boss Telugu 5 Contestant Anee Master: టాలీవుడ్లో టాప్ లేడీ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్. బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్లో పాల్గొన్న ఆమె 11వ వారంలోనే ఎలిమినేట్ అయింది. షోలో ఎంతో నెగెటివిటీని మూటగట్టుకున్న ఆమె తనపై ట్రోలింగ్‌ను చూసి విస్తుపోయింది. షో ముగిసిందని, ఇంకా తన గురించి తిట్టుకుంటూ టైంపాస్ చేయడం ఆపేయండని చెప్పుకొచ్చింది. తాజాగా తన అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకుంది యానీ మాస్టర్. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటిస్తున్నానని తెలిపింది. ఈ అవకాశం బిగ్‌బాస్‌కు వెళ్లడానికి ముందే వచ్చిందని, ఈ సినిమాలో చిరంజీవి, వెన్నెల కిషోర్ల పక్కనే ఉంటానంటూ తన పాత్ర గురించి చెప్పింది. ఇక ఈ మూవీ కొరియోగ్రఫీ కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చింది. తనకీ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మెహర్ రమేశ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ సినిమాలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ లోబో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే! -
నా కల నిజమైంది, లోబో ఎమోషనల్
ఒకప్పుడు టీవీ షోలు చేస్తూ ప్రేక్షకులని అలరించిన లోబో ఇటీవల బిగ్‌బాస్ ఆఫర్ కొట్టెశాడు. సీజన్ 5లో పాల్గొన్న ఆయన తన కామెడీతో హౌజ్‌మేట్స్‌ని ఫుల్ ఎంటర్టైన్ చేశాడు. సీక్రెట్ రూంలో ఉన్నా కూడా గేమ్‌ని మార్చుకోలేక బయటకు వచ్చేశాడు లోబో. ఈ క్రమంలో అతడికి సినిమా ఆఫర్స్ తలుపుతడుతున్నాయని, ఏకంగా చిరు సినిమాలోనే నటించే చాన్స్ కొట్టేశాడంటూ వార్తలు వచ్చాయి. అయితే దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవి పిలిచి మరి తన సినిమాలో ఆఫర్ ఇచ్చారని స్వయంగా లోబోనే వెల్లడించాడు. చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిరుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘నా కల నిజమైంది. చిరంజీవి సార్ సినిమాలో ఆఫర్ వచ్చింది’ అంటూ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో చిరంజీవి సినిమా ఆఫర్‌పై మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ‘ సినిమాలో నాది చిరు సార్‌ని అంటిపెట్టుకుని ఉండే పాత్ర. మెగాస్టార్ పక్కన నటించడం అంటే తన కల సాకారమైనట్లే’ అని సంబర పడిపోయాడు. దీంతో పాటు ఈ సినిమాకు మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి- మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ చిత్రం వేదాళం రీమేక్‌గా ‘భోళా శంకర్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. చదవండి: ఊహ నన్ను చూసి వణికిపోయింది: శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Lobo (@lobo__619) -
చిరు సినిమాలో రష్మీ స్పెషల్ సాంగ్‌కు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Rashmi Gautam Remuneration Goes Hot Topic In Chiranjeevi Bhola Shankar Movie Special Song: బుల్లితెరపై దూసుకుపోతూ టాప్ యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. తొలుత వెండితెరపై సహానటి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులకి పరిచయమైన రష్మీ ప్రముఖ కామెడీ షోతో తనకంటూ నేమ్, ఫేమ్‌ని సంపాదించుకుంది. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలు చేస్తూ వస్తోన్న రష్మీ తాజాగా అనసూయను ఫాలో అవుతోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఆఫర్ కొట్టేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. చదవండి: ఆ విషయంలో ఇంప్రెస్ అయిన బన్నీ, పుష్ప టీంకు స్పెషల్ గిఫ్ట్స్ ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకత గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అందులో మెగాస్టార్ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్ ఉన్న చిరు సినిమాలో రష్మీ స్సెషల్ సాంగ్ చేయడమంటే బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఈ క్రమంలో ఈ పాటకు రష్మీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ హాట్‌టాపిక్‌గా మారింది. ఐటెం సాంగ్ చేయడానికి రష్మీ భారీగానే పారితోషికం అందుకుంటోందని ఫిలీం దూనియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్‌తో స్టెప్పేసే అవకాశం వచ్చినా రష్మీ రెమ్యునరేషన్ విషయంలో ఏమాత్రం తగ్గలేదట. చదవండి: మరోసారి పెళ్లికి సిద్దమవుతున్న 7/G బృందావన కాలని హీరోయిన్..! ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి భారీగానే డిమాండ్ చేసిందని వినికిడి. దీంతో ఈ ఒక్క పాట కోసం ఆమెకు దాదాపు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అది విని అంతా అవాక్కవుతున్నారు. ఒక్క పాటకే అంత పారితోషికమా? ఇది రష్మీకి గోల్డెన్ ఆఫర్ లాంటిది అంటున్నారు. అంతేకాదు చిరుతో స్టెప్పులేసి థియేటర్లలో రష్మీ గోల పెట్టించబోతోందని చెప్పుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే రష్మీ- చిరంజీవిల కాంబోలో ఈ సాంగ్ సెట్స్ మీదకు రానుందట. దీనికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నారట. ఇక మరో ఆసక్తికర విషయమేంటంటే ఈ సాంగ్ కోసం రష్మీని రిఫర్ చేసింది శేఖర్ మాస్టార్ అట. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. చదవండి: ప్రముఖ యూట్యూబ్ స్టార్ మృతి, దీప్తి సునైనా దిగ్భ్రాంతి -
మెగాస్టార్ చిరంజీవి సినిమాలో లోబో!
Bigg Boss 5 Telugu Contestants Lobo Got Movie Chance: 'హైదరాబాదీ ఎక్స్‌ప్రెస్' అనే మ్యూజిక్ షోతో బాగా పాపులర్ అయ్యాడు లోబో. తనకు అందరిలా ఉండటం నచ్చదు. సమ్‌థింగ్ స్పెషల్ అంటూ వెరైటీ జుట్టుతో, డిఫరెంట్ డ్రెస్సుతో, వినూత్న గెటప్‌తో, హైదరాబాదీ యాసతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత స్క్రీన్ మీద పెద్దగా కనిపించని లోబో ఈ మధ్యే బిగ్‌బాస్ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్‌ను పలకరించాడు. బస్తీ నుంచి వచ్చాను, జనాల సపోర్ట్ వల్లే ఎదిగాను అంటూ నిత్యం చెప్తూ ఉండే లోబోకు బిగ్‌బాస్ షో తర్వాత బంపర్ ఆఫర్ వచ్చింది. అతడికి స్టార్ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనుకుంటున్నారు? మెగాస్టార్ చిరంజీవి. ఈమధ్యే చిరంజీవి లోబోను పిలిచి మరీ నా సినిమాలో ఛాన్స్ ఉంది, వచ్చి చేయమని చెప్పారట! ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో ఈ విషయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనది చిరును అంటిపెట్టుకుని ఉండే పాత్ర అని, మెగాస్టార్ పక్కన ఉండి నటించడం అంటే తన కల నెరవేరినట్లేనని సంబరపడుతున్నాడు. ఈ సినిమాకు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అంటే లోబో.. మెహర్ రమేశ్- చిరంజీవి కాంబోలో వస్తున్న 'భోళా శంకర్' సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. -
మెగాస్టార్ మూవీ.. బంఫర్ ఆఫర్ కొట్టేసిన రష్మీ?
Rashmi Gautham Special Song In Chiranjeevi Movie: జబర్ధస్త్ షో తో మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు బుల్లితెరపైన దూసుకుపోతూ టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరిగా నిలిచింది. కెరీర్ మొదట్లో వెండితెరపై చిన్న పాత్రలతో ప్రేక్షకులకి పరిచయమైనప్పటికీ జబర్ధస్త్ షో ద్వారా టాలీవుడ్లో తనకంటూ నేమ్, ఫేమ్‌ని సంపాదించుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తూనే.. మరోవైపు వెండితెరపై అడపాదడపా సినిమాలో నటిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం. (చదవండి: బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్ ) మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిరు సినిమాలంటే పాటలకి ఉండే ప్రత్యేకతే వేరు. అందులో మెగాస్టార్ ఆ పాటలకు కాలు కదిపితే ఆ రచ్చ మామూలుగా ఉండదనే విషయం ఆయన అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. అంత క్రేజ్ ఉన్న చిరు సినిమాలో రష్మీ గౌతమ్ ఓ సాంగ్ చేయబోతున్నట్లు టాలీవుడ్లో టాక్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో తెరకెక్కుతున్న మాస్ సాంగ్‌లో రష్మికి అవకాశం రావడం నిజంగా అదృష్టమేనని సినీ జనాలు అంటున్నారు. మరో వైపు ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఇప్పటికే చిరు ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: Chiranjeevi Upcoming Movies: చిరు స్పీడ్ మాములుగా లేదుగా.. 2022లో బిగ్గెస్ట్ మెగా ఫెస్టివల్! ) -
చిరు స్పీడ్ మాములుగా లేదుగా.. 2022లో బిగ్గెస్ట్ మెగా ఫెస్టివల్!
ఒకప్పుడు మూడు షిఫ్టులు పని చేసి ఏడాదికి ఎన్ని సినిమాలు విడుదలైతే అన్ని సినిమాలు విడుదల చేసిన ఘన చరిత్ర మెగాస్టార్ చిరంజీవి సొంతం. ఇప్పుడు ఈ సీన్ ను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నారు మెగాస్టార్. 2022లో వీలైతే నాలుగు చిత్రాలు విడుదల చేయాలనుకుంటున్నారట. ఫిబ్రవరిలో కొరటాల దర్శకత్వం వహించిన ‘ఆచార్య’ రిలీజ్ కానుంది. అలాగే సమ్మర్ లో ‘గాడ్ ఫాదర్’ విడుదలకు ముస్తాబవుతోంది. అదే స్పీడ్ లో భోళాశంకర్, బాబి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని కూడా విడుదల చేయనున్నారట. చేతిలో ఉన్న నాలుగు చిత్రాలు కాకుండా మరో రెండు సినిమాలు త్వరలో అనౌన్స్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నారు. డీవీవీ దానయ్య నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల మేకింగ్ లో ఒక మూవీ, అలాగే యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మారుతి దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారట చిరు.ఇదే స్పీడ్ లో మరో నిర్మాణ సంస్థకు డేట్స్ లాక్ చేశారని టాక్. దర్శకుడి పేరు ఖరారు అవ్వగానే ఆ ప్రాజెక్ట్ కూడా లాక్ అవుతుందట. మొత్తంగా 2022 నుంచి మళ్లీ మెగా సందడి మొదలు కాబోతోంది. మెగా స్టార్ ఇదే స్పీడ్ కొనసాగిస్తే, ఏడాదికి మూడు లేదా నాలుగు చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. -
Chiranjeevi: పాత బస్తీలో ‘బోళా శంకర్’ ఫైట్?
పాత బస్తీలో తన ప్రతాపం చూపించనున్నాడు శంకర్. విజువల్‌గా ఈ ఫైట్ ఎలా ఉంటుందనేది వచ్చే ఏడాది సిల్వర్ స్క్రీన్‌పై తెలుస్తుంది. చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘బోళా శంకర్’. ఇందులో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ నేతృత్వంలో హైదరాబాద్‌లో పాతబస్తీ సెట్ వేశారు. ఈ సెట్లో చిరంజీవిపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ నెల 15న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. అయితే చిరంజీవి మాత్రం ఈ నెల 20న షూట్లో జాయిన్ అవుతారని తెలిసింది. దాదాపు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని టాక్. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేశ్, హీరోయిన్గా తమన్నా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్. -
ఘనంగా భోళా శంకర్ ప్రారంభోత్సవం
-
మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’ మూవీ ప్రారంభం ఫోటోలు
-
అంగరంగ వైభవంగా ప్రారంభమైన ‘భోళా శంకర్’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ షూటింగ్ ప్రారంభైమంది. గురువారం ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో భోళా శంకర్ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి సినిమాను ఘనంగా ప్రారంభించారు చిరంజీవి. ఈ పూజా కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్, హరీశ్ శంకర్, బాబీ, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, కొరటాల శివ తదితరులు పాల్గొని, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్ర బృందానికి స్క్రిప్ట్ అందించారు. ముహుర్తపు షాట్లో భాగంగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చిరుపై క్లాప్ కొట్టారు. ఇక భోళా శంకర్ విషయానికొస్తే.. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ ఇది. . చిరంజీవి కెరీర్లో 154వ చిత్రంగా వస్తున్న ఈ మూవీలో హీరోయిన్గా తమన్నా, చిరు చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘భోళా శంకర్’లో తమన్నా ఫిక్స్, హాట్‌టాపిక్‌గా మిల్కీ బ్యూటీ రెమ్యునరేషన్
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా ‘భోళా శంకర్’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. నవంబర్ 11న ఈ మూవీ పూజ కార్యక్రమం జరగనుందని, నవంబర్ 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు ఇటీవల చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో చిరుకు జోడి కట్టనుంది ఎవరన్నది ఆసక్తిగా మారింది. మొదట నయనతార పేరు వినిపించగా కొద్ది రోజుల నుంచి తమన్నా పేరు తెరపై వచ్చింది. చదవండి: అల్లు అర్జున్‌కి షాకిచ్చిన సజ్జనార్, లీగల్ నోటీసులు జారీ తాజాగా మేకర్స్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. తమన్నా హీరోయిన్గా ఖరారు చేసినట్లు తాజాగా మూవీ యూనిట్ అధికారిక ప్రుకటన వెలువరిచింది. అలాగే తమన్నా కూడా తన ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు తమన్నా ట్వీట్ చేస్తూ.. ‘మెగా మాసివ్ సినిమా భోలా శంకర్‌లో నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. చిరంజీవి గారితో కలిసి మరోసారి నటించడానికి ఎంతో ఆతృతగా ఉంది. దర్శకుడు మెహర్ రమేశ్ గారు దీనిని నిజం చేస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఎట్టకేలకు ప్రెగ్నెన్సీ విషయంపై స్పందించిన కాజల్ ఇప్పటికే తమన్నా సైరా నరసింహ రెడ్డిలో చిరుతో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో తమన్నా రెమ్యునరేషన్‌పై కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్ర కోసం తమన్నా సంప్రదించగా మిల్కీ బ్యూటీ ఏకంగా రూ. 3 కోట్లు డిమాండ్ చేసిందని, చిత్ర యూనిట్ కూడా దాని అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇక భోళా శంకర్ సినిమా విషయానికొస్తే ఈ సినిమాను తమిళంలో సంచలన విజయం సాధించిన వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో చిరుకి చెల్లెలిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. Honored and ecstatic to be a part of the MEGA MASSIVE MOVIE #BholaaShankar 🔱 Can't wait to share the screen with @KChiruTweets sir once again! Bring it on @MeherRamesh Gaaru! 😎@AnilSunkara1 @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/YV0fIm3uVp — Tamannaah Bhatia (@tamannaahspeaks) November 9, 2021 -
మారుతి స్టోరీకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్
-
నవంబర్ లో భోళా శంకర్ షూటింగ్ బిగిన్స్
-
మిల్కీ బ్యూటీ పనైపోయిందా? ఆశలన్నీ ఆ సినిమాపైనే!
తమన్నా.. పరిచయం అక్కర్లేని పేరు. మిల్కీ బ్యూటీగా ఫేమ్ సంపాదించిన క్వీన్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టాటస్ సంపాదించిన నటి. సీన్ కట్ చేస్తే... ఇపుడు ఆమె డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకు కొన్ని కారణాలను కూడా చూపెడుతున్నారు ఫిలింనగర్ జనం. ఈ మద్యే ఓ టీవీ ఛానల్ లో హోస్ట్ గా నటించేందుకు తమన్నాకు ఆఫర్ వచ్చింది. ప్రమోషన్స్ కూడా పూర్తయిపోయాయి. ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఆ ప్రొగ్రామ్ నుంచి తమన్నా తప్పుకుంది. (చదవండి: తమన్నా వల్ల రూ. 5 కోట్లు నష్టపోయాం!: మాస్టర్ చెఫ్ నిర్వాహకులు) తమన్నా చెయ్యాల్సిన హోస్ట్ ప్లేస్‌ని అనుసూయ ఆక్రమించింది. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ మూవీలో తమన్నాని హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఐతే.. మూవీ టీమ్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారన్న వార్తలొస్తున్నాయి. మెగాస్టార్ భారీ ప్రాజెక్ట్ నుంచి తమన్నా తప్పుకుంది అని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. ఈమధ్య తమన్నా నటించిన సీటీమార్, మాస్ట్రో చిత్రాలు కూడా జనాదరణ పొందలేదు. ఐతే.. ఎఫ్ 3తో మళ్లీ తన కెరీర్ పుంజుకుంటుందని ఆశపడుతోంది తమన్నా. ప్రస్తుతం తమన్నా చేతిలో గుర్తందా శీతాకాలం తో పాటు ఓ హిందీ చిత్రం కూడా ఉంది. సో.. తమన్నా కెరీర్‌పై వస్తోన్న ఈ రూమర్స్ పై ఆమె ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి. -
మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, నవంబర్‌లో ‘భోళా శంకర్’ వస్తున్నాడు
మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 154వ చిత్రంగా ‘భోళా శంకర్’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. తమిళ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఈ మూవీ రూపొందుతోంది. చిరు బర్త్‌డే(అగష్టు 22) రోజున ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడగా.. ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన కొత్త అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది చిత్ర బృందం. నవంబర్ 11న ఈ మూవీని ప్రారంభం కానుందని, నవంబర్ 15 నుంచి రెగ్యూలర్ షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తాజాగా మేకర్స్ స్పష్టం చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళం’ మూవీ రీమేక్‌గా భోళా శంకర్ రూపొందబోతోంది. ఈ చిత్రం తమిళ వెర్షన్లో అజిత్ హీరోగా నటించాడు. ఇందులో చిరు విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు. ఆయన ఈ సినిమాలో గుండుతో కూడా కనిపించే అవకాశాలున్నట్లు సమాచారం. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేశ్ నటించనుంది. #BholaShankar 𝐏𝐨𝐨𝐣𝐚 𝐂𝐞𝐫𝐞𝐦𝐨𝐧𝐲 𝟏𝟏-𝟏𝟏-𝟐𝟏 𝐌𝐞𝐠𝐚 𝐒𝐡𝐨𝐨𝐭 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 𝐟𝐫𝐨𝐦 𝟏𝟓-𝟏𝟏-𝟐𝟏@KChiruTweets pic.twitter.com/8IeA0teifv — 𝐂𝐡𝐢𝐫𝐚𝐧𝐣𝐞𝐞𝐯𝐢 𝐏𝐫𝐚𝐛𝐡𝐚𝐬 𝐅𝐚𝐧𝐬 (@Santhos43007209) October 27, 2021 -
రూటు మార్చిన కీర్తి.. ఇకపై అలాంటి పాత్రల్లో కూడా..
కీర్తి సురేష్ పేరు చెప్పగానే మహానటి మూవీ మాత్రమే గుర్తుకొస్తుంది. ఆ సినిమా విడుదలై నాలుగేళ్లు అవుతోంది. అయితే ఇంతవరకు మహానటిని మరిపించే మూవీని మాత్రంఅందించలేకపోయింది కీర్తి సురేశ్. మహానటి దారిలోనే మరిన్ని ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేసినా పెద్దగా కలసి రాలేదు. అందుకే ప్లాన్ బి అమలు చేస్తోంది. ‘మహానటి’ కీర్తి సురేశ్‌ను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా మార్చింది. అందుకే మొదట్లో ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ లాంటి చిత్రాలు చేసింది. వీటిల్లో గుడ్ లక్ సఖీ వచ్చే నవంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.పెంగ్విన్, మిస్ ఇండియా నిరాశపరచడంతో గుడ్ లఖ్ సఖి తో మెప్పించాలి అనుకుంటోంది కీర్తి. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ పెద్దగా కలసి రాకపోవడంతో ఇక హీరోయిన్ రోల్స్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటోంది. ఇప్పటికే సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన నటిస్తోంది. అలాగే దసరా మూవీలో నాని కి జోడిగా నటించేందుకు డేట్స్ కేటాయించింది. ఇప్పుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మించబోతున్న ప్యాన్ ఇండియా మూవీలోనూ హీరోయిన్ గా నటించాలనుకుంటోందట. కేవలం హీరోయిన్ రోల్స్ అంటే అన్నిసార్లు పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉండదు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కు వసూళ్లు రావడం లేదు. అందుకే సిస్టర్ రోల్స్ కు బాగా ఇంపార్టెన్స్ ఇస్తోంది కీర్తి. అన్నాత్తే, సాని కాయిదమ్, భోళా శంకర్ ఈ మూడు చిత్రాల్లోనూ కీర్తిసురేష్ సిస్టర్స్ రోల్స్ చేస్తోంది. అన్నాత్తేలో రజనీకాంత్ కు, భోళాశంకర్ లో చిరుకు, అలాగే సానికాయిదమ్ అనే తమిళ సినిమాలో సెల్వరాఘవన్ కు చెల్లెలి పాత్రలో కనిపించనుంది కీర్తి. స్టార్ డమ్ అందుకున్న తర్వాత రిపీటెడ్ గా కీర్తి సిస్టర్ రోల్స్ కు ఇంపార్టెన్స్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. -
కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమాలివే..
-
ఊహించిందే జరిగింది.. చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేష్
Keerthi Suresh Rakhi Video: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే(ఆగస్ట్ 22) సందర్భంగా ఆయన మూవీలకు సంబంధించి వరుస అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. తన ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ల మీద సర్ప్రైజ్ ఇస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు చిరంజీవి. శనివారం నాడు మెగాస్టార్ హీరోగా మోహన్ రాజా తెరకెక్కిస్తున్న లూసిఫర్ రీమేక్ టైటిల్ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ అనే టైటిల్ చిత్రానికి ఫిక్స్ చేసినట్టు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇక ఆదివారం ఉదయం మెహర్ రమేశ్మూవీకి సంబంధించిన టైటిల్‌ని మహేశ్ బాబు చేతుల మీదుగా వదిలారు. చిరంజీవి నటిస్తున్న 154 వ చిత్రం ఇది. ఈ చిత్రానికి ‘భోళా శంకర్’అని టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (చదవండి: అన్నగా పుట్టినప్పటికీ తండ్రిలా సాకారు.. పవన్ ఎమోషనల్ పోస్ట్) తాజాగా ఈ మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది చిత్ర యూనిట్. రాఖీ పండగ సందర్భంగా ఈ చిత్రంలో చిరుకు సోదరిగా నటించబోతున్న హీరోయిన్ని ప్రకటిస్తూ అదరిపోయే వీడియోని వదిలారు. అందరూ ఊహించినట్లుగానే ఇందులో చిరంజీవికి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. చిరుకు కీర్తి సురేష్ రాఖీ కడుతున్న వీడియోను వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.