
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ‘జామ్ జామ్ జజ్జనక'ఫుల్ సాంగ్ వచ్చేసింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రంలోని రెండో పాట ‘జామ్ జామ్ జజ్జనక’ నేడు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను ప్రముఖ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.
డ్యాన్స్‌తో ఇరగదీసిన మెగాస్టార్
ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్‌కి టాలీవుడ్ స్టార్స్ స్టెప్పులేసి అలరిస్తున్నారు. ఆ మధ్య ధమాకా చిత్రంలో రవితేజ ‘పల్సర్ బైక్’కి అదిరిపోయే స్టెప్పులేసి అలరించారు. ఇక ట్రెండ్‌కి తగ్గట్టుగా వ్యవహరించే మెగాస్టార్ కూడా ట్రెండింగ్‌లో ఉన్న తెలంగాణ ఫోక్ సాంగ్ ‘నర్సపల్లె..’ పాటకు తనదైన శైలీలో స్టెప్పులేసి మరోసారి డ్యాన్స్‌తో తనకు పోటీలేరని నిరూపించుకున్నాడు. 'జామ్ జామ్ జజ్జనక'సాంగ్ మధ్యలో ‘నర్సపెల్లే గండిలోన గంగధారి’పాటను యాడ్ చేశారు. దానికి చిరంజీవి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. భోళా శంకర్ మూవీ తమిళ సూపర్ హిట్ వేదాళం ఆధారంగా తెరకెక్కుతుండగా దీనిని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 11న గ్రాండ్ లెవెల్లో థియేటర్స్ లో విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment