మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' వాయిదా పడనుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే సందేహం వస్తోంది. మరో రెండు రోజుల‍్లో రిలీజ్ ఉందనగా, ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టుకి వెళ్లాడు. 'భోళా శంకర్' నిర్మాతలపై కేసు పెట్టాడు. మూవీని విడుదల చేయకుండా ఆపాలని కోరాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సదరు డిస్ట్రిబ్యూటర్.. ఓ ప్రెస్ నోట్‌తో పాటు వీడియోని రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత)
ఏం జరిగింది?
అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' ఏప్రిల్ 27న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లు అందరికీ కోట్లలో నష్టాలు వచ్చాయి. అయితే ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని తనని మోసగించారని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టులో కేసు వేశారు. అలానే ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు.
నన్ను మోసం చేశారు
'ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణకిశోర్ నన్ను మోసం చేశారు. వారు చేసిన అన్యాయం ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక‍్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు నాకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసిచ్చారు. రూ.30 కోట్లు తీసుకుని నన్ను మోసం చేశారు. ఈ మొత్తం చెల్లించినట్లు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి.'
(ఇదీ చదవండి: 'భోళా శంకర్'.. ఇక అంతా బోనస్!)
అండర్ టేకింగ్ లెటర్!
'అయితే ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలిశాను. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి, వైజాగ్ వెళ్లిపోయాను. 'సామజవరగమన' వైజాగ్ హక్కులు నాకు ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది'
'భోళా శంకర్'కు బ్రేక్?
'దీంతో 45 రోజుల్లో నాకు రావాల్సిన మిగతా డబ్బు ఇస్తామని చెప్పారు. లేదంటే తర్వాత విడుదలకు 15 రోజుల ముందు ఇస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. వాళ్ల తర్వాత మూవీ 'భోళా శంకర్'. ఈ విషయమై మాట్లాడాదామని ప్రయత్నిస్తుంటే నాకు సమాధానం ఇవ‍్వట్లేదు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే తప్పని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లాను' అన వైజాగ్ సతీశ్ చెప్పుకొచ్చారు. బుధవారం కోర్టులో హియరింగ్ జరగనుంది. దీనిపై క్లారిటీ రావడంతోపాటు 'భోళా శంకర్' రిలీజ్ విషయంలోనూ స్పష్టత వస్తుంది.
(ఇదీ చదవండి: మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment