distributor
-
నా కొడుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు..విజయ్ దేవరకొండ తండ్రి ఆవేదన..
-
ఘన్ను భాయ్ వినోదం
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ నామా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఘన్ను భాయ్’. ‘ఇస్మార్ట్ కా బాప్’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా ద్వారా ఆదిత్య గంగసాని హీరోగా పరిచయమవుతున్నారు. ప్రణయ్ మైకల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘ఘన్ను భాయ్’. ఈ సినిమాని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
'భోళా శంకర్' సినిమాకు లైన్ క్లియర్..
చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా విడుదలను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసి సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' టికెట్ ధరలకు బ్రేక్.. కారణం ఇదే) వివాదం ఏంటి? ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు తనకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని గతంలో అనిల్ సుంకర అగ్రిమెంట్ రాసిచ్చారని అందుకు గాను తన నుంచి రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారని కోర్టుకు వైజాగ్ సతీష్ వెళ్లారు. ఈ మొత్తం చెల్లించినట్లు తన దగ్గర ఉన్న పక్కా ఆధారాలను కోర్టుకు ఆయన అందించాడు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం భోళా శంకర్ విడుదలకు అడ్డు చెప్పలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ సినిమా రేపు యథాతథంగా రిలీజ్ కానుంది. అగ్రిమెంట్ బ్రేక్ చేశారు 'ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలిశాను. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి, వైజాగ్ వెళ్లిపోయాను. 'సామజవరగమన' వైజాగ్ హక్కులు నాకు ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది' కోర్టులో ఏం జరిగింది? జడ్జి, బుధవారం అడిగిన క్లారిఫికేషన్స్‌పై ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. ఏజెంట్ సినిమాకు ఇస్తామన్న డిస్ట్రిబూషన్ ఇవ్వకుండా ఏకే ఎంటర్టైన్మెంట్ మోసం చేసిందని, తదుపరి సినిమా విడుదలకు 15 రోజుల ముందు డబ్బు తిరిగి ఇస్తామని మరోసారి మోసంచేస్తున్నారని గాయిత్రీదేవి ఫిల్మ్స్ ఓనర్ బత్తుల సత్యనారాయణ చెప్పారు. ఇకపోతే ఏజెంట్ సినిమాతో తమకు కూడా నష్టం వచ్చిందని చెప్పిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్, 30 కోట్ల నష్టాన్ని వేరే సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ పూరిస్తామని క్లారిటీ ఇచ్చింది. అయితే రూ.28.30 కోట్లు ఇప్పుడే చెల్లించాలని గాయత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పట్టుబడుతోంది. 'సామజవరగమన' ద్వారా గాయత్రి ఫిలిమ్స్ కు రూ.కోటి ప్రాఫిట్ ఇచ్చాం, తమ ప్రతి సినిమాలోనూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని గాయత్రి ఫిల్మ్స్ కు ఇస్తున్నాం అని ఏకే ఎంటైర్టైన్మెంట్స్ వాదన వినిపించింది. భోళా శంకర్ సినిమాలో మొత్తం పెట్టుబడి తమదే 120 కోట్లు పెట్టామని, ఇప్పటికే ప్రీ బిజినెస్ రూ.60 కోట్ల దాకా జరిగిందని తెలిపింది. ఇంకా రూ.60 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. -
భోళా శంకర్ నిర్మాతలతో ప్రాణహాని.. పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: భోళా శంకర్ సినిమాను ఆపాలంటూ కోర్టు మెట్లెక్కిన వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ బుధవారం నాడు పోలీసులను ఆశ్రయించాడు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. పిటిషన్ వెనక్కు తీసుకోవాలని, లేదంటే చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్తో పాటు అడ్వెంచర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ల నిర్మాతలతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరాడు. ఈ వివాదం ఏంటి? అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ ఏప్రిల్ 27న రిలీజైంది. ఈ చిత్రం నిర్మాతలకే కాదు, డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు అందరికీ కోట్ల కొద్ది నష్టాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను తెరకెక్కించిన ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని తనను మోసం చేశారంటున్నాడు డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ.. ఆయన రిలీజ్ చేసిన ప్రెస్‌నోట్ ప్రకారం.. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు సత్యనారాయణకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని నిర్మాతలు అగ్రిమెంట్ రాసిచ్చారు. ఇందుకోసం రూ.30 కోట్లు తీసుకున్నారు. అయితే ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడితే ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి వెళ్లిపోయాడు. తర్వాత 'సామజవరగమన' వైజాగ్ హక్కులు సత్యనారాయణకే ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది. ఇంకా రావాల్సిన డబ్బు గురించి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే సమాధానం రాకపోవడంతో కోర్టుకు వెళ్లారు. తనకు డబ్బు ఇచ్చేవరకు భోళా శంకర్‌ను ఆపాలని కోరాడు. చదవండి: 'భోళా శంకర్'కి అడ్డంకులు.. రిలీజ్ వాయిదా? -
'భోళా శంకర్'కి అడ్డంకులు.. రిలీజ్ వాయిదా?
-
కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' వాయిదా పడనుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే సందేహం వస్తోంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉందనగా, ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టుకి వెళ్లాడు. 'భోళా శంకర్' నిర్మాతలపై కేసు పెట్టాడు. మూవీని విడుదల చేయకుండా ఆపాలని కోరాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సదరు డిస్ట్రిబ్యూటర్.. ఓ ప్రెస్ నోట్‌తో పాటు వీడియోని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత) ఏం జరిగింది? అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' ఏప్రిల్ 27న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లు అందరికీ కోట్లలో నష్టాలు వచ్చాయి. అయితే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని తనని మోసగించారని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టులో కేసు వేశారు. అలానే ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. నన్ను మోసం చేశారు 'ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణకిశోర్ నన్ను మోసం చేశారు. వారు చేసిన అన్యాయం ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు నాకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసిచ్చారు. రూ.30 కోట్లు తీసుకుని నన్ను మోసం చేశారు. ఈ మొత్తం చెల్లించినట్లు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి.' (ఇదీ చదవండి: 'భోళా శంకర్'.. ఇక అంతా బోనస్!) అండర్ టేకింగ్ లెటర్! 'అయితే ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలిశాను. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి, వైజాగ్ వెళ్లిపోయాను. 'సామజవరగమన' వైజాగ్ హక్కులు నాకు ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది' 'భోళా శంకర్'కు బ్రేక్? 'దీంతో 45 రోజుల్లో నాకు రావాల్సిన మిగతా డబ్బు ఇస్తామని చెప్పారు. లేదంటే తర్వాత విడుదలకు 15 రోజుల ముందు ఇస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. వాళ్ల తర్వాత మూవీ 'భోళా శంకర్'. ఈ విషయమై మాట్లాడాదామని ప్రయత్నిస్తుంటే నాకు సమాధానం ఇవ్వట్లేదు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే తప్పని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లాను' అన వైజాగ్ సతీశ్ చెప్పుకొచ్చారు. బుధవారం కోర్టులో హియరింగ్ జరగనుంది. దీనిపై క్లారిటీ రావడంతోపాటు 'భోళా శంకర్' రిలీజ్ విషయంలోనూ స్పష్టత వస్తుంది. (ఇదీ చదవండి: మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) -
నిర్మాత కమలాకర్ రెడ్డి మృతి
నిర్మాత, పంపిణీదారుడు గుండాల కమలాకర్‌రెడ్డి (48) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేఎఫ్‌సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో కమలాకర్ కూడా ఒకరు. నెల్లూరు జిల్లాలో నివాసముంటున్న ఆయన తండ్రి నందగోపాల్‌రెడ్డి (75) ఇటీవల కరోనా బారినపడ్డారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను అంబులెన్స్‌లో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకొస్తుండగా నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కమలాకర్ రెడ్డి, నందగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే ప్రమాదంలో తండ్రీకొడుకులిద్దరూ మృత్యువాత పడటంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల విడుదలైన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాకు కమలాకర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘అర్జు¯Œ రెడ్డి’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి హిట్ చిత్రాలతో పాటు పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ సినిమాలను కూడా ఆయన పంపిణీ చేశారు. కమలాకర్ రెడ్డి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అంబులె¯Œ్స డ్రైవర్ని మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. -
డిస్ట్రిబ్యూటరీ పనులు తక్షణం చేపట్టాలి
అనంతపురం అర్బన్ : హంద్రీ-నీవా ద్వారా నిర్ధేశిత 3.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూటరీ పనులు వెంటనే చేపట్టాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్, ఇతర నాయకులు విన్నవించారు. మంగళవారం జిల్లాకు విచ్చేసిన మంత్రిని స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో కలిసి వినతిపత్రం అందజేసి పరిస్థితి వివరించారు. హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ఈ పనులు పూర్తి ప్రభుత్వం మూడు నెలలు గడువు విధించిందని, పనులు ఇలా సాగితే ఆరునెలలైనా పూర్తి కావన్నారు. పనులు జాప్యంతో జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల తరహాలో పనులు చేపట్టి వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో సీపీఐ నాయకులు సి.జాఫర్, శ్రీరాములు, కేశవరెడ్డి, తదితరులు ఉన్నారు. -
షారుక్...ఇక డిస్ట్రిబ్యూటర్!
షారుక్ ఖాన్ అంటే ఓ స్టార్ హీరోగానే కాదు... సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా అని అందరికీ తెలుసు. దేశ విదేశాల్లో విస్తరించిన అతని వ్యాపార సామ్రాజ్యం చూసి ఓ సర్వే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల జాబితాలో అతనికి రెండో స్థానం కూడా ఇచ్చేసింది. తాజా వార్త ఏంటంటే... షారుక్ ఖాన్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెట్టనున్నారట. ‘దిల్వాలే’ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న షారుక్ ఖాన్ ఈ చిత్రాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇప్పటికే ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిస్సా, రాజస్థాన్‌లలో ఉన్న ఎగ్జిబి టర్లకు ‘దిల్వాలే’ చిత్రాన్ని అమ్మేశారని, ఏకంగా రూ.280 కోట్ల బిజినెస్ జరిగిందని బోగట్టా. -
పీఆర్వో శంకర్ గణేష్ కన్నుమూత
సీనియర్ పీఆర్వో శంకర్ గణేష్ (77) ఆదివారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన సినీ రంగంలో పలు విభాగాల్లో అనుభవం గడించారు. తిరునెల్వేలికి చెందిన శంకర్ గణేష్ చెన్నైకి వచ్చిన తొలి రోజుల్లో వీనస్ మూవీస్ రత్నం వద్ద పని చేశారు. ఆ తరువాత డిస్ట్రిబ్యూటర్‌గా తేన్‌మళై చిత్రం ద్వారా పరిచయమయ్యారు. ఈయన నిశ్చల ఛాయాగ్రాహకుడిగా సందేశమిత్రన్ అనే పత్రిక లో పని చేశారు. ఆ తరువాత సినీ పీఆర్వోగా పని చేశారు. అదే విధంగా కొంతకాలం దివంగత మాజీ మంత్రి మురసోలిమారన్‌వద్ద కొంతకాలం సహాయకుడిగా పని చేశారు. సిల్క్‌కు సినిమా అనే పత్రికను ఆరేళ్లు నడిపారు. అనంతరం సినీ పీఆర్వో సంఘానికి కార్యదర్శిగా పని చేశారు. శంకర్ గణేష్ నాలుగేళ్లపాటు ప్రముఖ దినపత్రిక ఁసాక్షిరూ.లో పని చేశారు. ఈయన భార్య కొద్దికాలం క్రితమే కాలంచేశారు. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో స్థానిక రాయపేటలోని ఆస్పత్రిలో చికిత్స పొందిన శంకర్‌గణేష్ ఆదివారం కన్నుమూశారు. -
కాంట్రాక్టర్ల టెండ‘రింగ్’
గద్వాల న్యూటౌన్, న్యూస్‌లైన్: ఎప్పటిలాగే కాంట్రాక్టర్లు ‘రింగ్’ అ య్యారు. పోటీకి వచ్చిన వారి మధ్య రా జీ ఒప్పందాలు కుదిరి జూరాల పరిధిలో జరిగిన టెండర్లను కలిసి పంచుకున్నారు. వివరాల్లోకెళ్తే..జూరాల ప్రధాన ఎడమకా ల్వ డిస్ట్రిబ్యూటర్ 19 నుంచి 29 వరకు, 40వ డిస్ట్రిబ్యూటరీ పరిధిలో రాతి, మట్టి కట్టడాల లైనింగ్ పనులు, మరమ్మతులకు సంబంధించిన సుమారు 62 పనులకు పీజేపీ ఎగ్జిక్యూటివ్ డివిజన్-2 అధికారులు టెండర్లు ఆహ్వానించారు. సు మారు రూ.రెండుకోట్ల వ్యయంతో చేపట్టే ఈ పనులకు 393 షెడ్యూలు జారీ అయ్యాయి. షెడ్యూలు దాఖలు చేయడానికి బుధవారం చివరి గడువుగా నిర్ణయించారు. మరమ్మతు పనులు కావడంతో పెద్దఎత్తున డబ్బులు మిగులుతాయన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు పెద్ద సంఖ్యలో పోటీపడ్డారు. కార్యాలయం ఆవరణలోనే పెబ్బేరు, వీపనగండ్ల, కొల్లాపూర్ ప్రాంతాలకు చెందినవారు రాజీ ఒప్పందాలు చేసుకున్నారు. అందులో భాగంగా సుమారు 30 పనులకు సిండికేట్ అయ్యి అంచనారేట్లకు షెడ్యూళ్లను దాఖలు చేశారు. మిగిలిన పనులకు కాంట్రాక్టర్ల మధ్య రాజీ ప్రయత్నాలు బెడిసికొట్టి ఎవరికి వారే లెస్రేట్లకు షెడ్యూళ్లను దాఖలు చేసినట్లు తెలిసింది. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో.. గద్వాల, మక్తల్ పరిధిలోని తాగునీటి పైపుల అటాచ్మెంట్ పనులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు బుధవారం టెండర్లు పిలిచారు. రూ.64.64 లక్షల వ్యయంతో చేపట్టే 9 పనులకు 79 షెడ్యూళ్లను జారీ చేశారు. ఈ టెండర్లలో సైతం కాంట్రాక్టర్ల మధ్య రాజీ ఒప్పం దాలు కుదిరాయి. ఆరు పనులకు కాం ట్రాక్టర్లు సిండికేట్ అయ్యి అంచనారేట్లకు షెడ్యూళ్లను దాఖలు చేశారు. మూడు పనులకు కాంట్రాక్టర్ల మధ్య జరిగిన రింగ్యత్నాలు ఫలించలేదు. దీంతో పోటాపోటీగా లెస్ రేట్లకు షెడ్యూలు దాఖలుచేశారు. తప్పుపట్టిన వాహనాల టెండర్లలో రింగ్ అమరచింత : పీజేపీ నందిమల్ల డివిజన్-2 పరిధిలో ఏళ్ల తరబడి తుప్పుపట్టిన వాహనాలకు అధికారులు టెండర్లు ఆహ్వానించారు. నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ ప్రక్రియ బుధవారం ముగిసింది. క్యాంపు పరిధిలో ఆరు వాహనాలకు టెండర్లను ఆహ్వానించగా, ఆయా ప్రాంతాల నుంచి కాంట్రాక్టర్లు షెడ్యూళ్లకోసం భారీగా తరలొచ్చారు. నందిమల్ల, ఆత్మకూర్ పట్టణాలకు చెందిన కాంట్రాక్టర్లు వారితో రహస్య మంతనాలు జరిపి టెండర్లు వేయకుండా గుడ్‌విల్ రూపంలో డబ్బులు పంచిపెట్టారు. చివరికి నందిమల్ల గ్రామానికి చెందిన మణివర్దన్ నాలుగు వాహనాలు, ఆత్మకూర్‌కు చెందిన కోల్ల బషీర్ ఒకటి, సత్యారెడ్డి ఒకటి టెండర్లలో దక్కించుకున్నట్లు పీజేపీ ఈఈ రవీందర్ వివరించారు.