చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా విడుదలను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసి సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
(ఇదీ చదవండి: 'భోళా శంకర్' టికెట్ ధరలకు బ్రేక్.. కారణం ఇదే)
వివాదం ఏంటి?
ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక‍్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు తనకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని గతంలో అనిల్ సుంకర అగ్రిమెంట్ రాసిచ్చారని అందుకు గాను తన నుంచి రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారని కోర్టుకు వైజాగ్ సతీష్ వెళ్లారు. ఈ మొత్తం చెల్లించినట్లు తన దగ్గర ఉన్న పక్కా ఆధారాలను కోర్టుకు ఆయన అందించాడు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం భోళా శంకర్ విడుదలకు అడ్డు చెప్పలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ సినిమా రేపు యథాతథంగా రిలీజ్ కానుంది.
అగ్రిమెంట్ బ్రేక్ చేశారు
'ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలిశాను. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి, వైజాగ్ వెళ్లిపోయాను. 'సామజవరగమన' వైజాగ్ హక్కులు నాకు ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది'
కోర్టులో ఏం జరిగింది?
జడ్జి, బుధవారం అడిగిన క్లారిఫికేషన్స్‌పై ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. ఏజెంట్ సినిమాకు ఇస్తామన్న డిస్ట్రిబూషన్ ఇవ్వకుండా ఏకే ఎంటర్టైన్మెంట్ మోసం చేసిందని, తదుపరి సినిమా విడుదలకు 15 రోజుల ముందు డబ్బు తిరిగి ఇస్తామని మరోసారి మోసంచేస్తున్నారని గాయిత్రీదేవి ఫిల్మ్స్ ఓనర్ బత్తుల సత్యనారాయణ చెప్పారు. ఇకపోతే ఏజెంట్ సినిమాతో తమకు కూడా నష్టం వచ్చిందని చెప్పిన ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్, 30 కోట్ల నష్టాన్ని వేరే సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ పూరిస్తామని క్లారిటీ ఇచ్చింది.
అయితే రూ.28.30 కోట్లు ఇప్పుడే చెల్లించాలని గాయత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పట్టుబడుతోంది. 'సామజవరగమన' ద్వారా గాయత్రి ఫిలిమ్స్ కు రూ.కోటి ప్రాఫిట్ ఇచ్చాం, తమ ప్రతి సినిమాలోనూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని గాయత్రి ఫిల్మ్స్ కు ఇస్తున్నాం అని ఏకే ఎంటైర్టైన్మెంట్స్ వాదన వినిపించింది. భోళా శంకర్ సినిమాలో మొత్తం పెట్టుబడి తమదే 120 కోట్లు పెట్టామని, ఇప్పటికే ప్రీ బిజినెస్ రూ.60 కోట్ల దాకా జరిగిందని తెలిపింది. ఇంకా రూ.60 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment