Court case
-
'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?
ఇతడు తెలుగు నటుడు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య వచ్చిన 'సలార్' మూవీలోనూ గుర్తుంచుకోదగ్గ పాత్రలో అలరించాడు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. అంతా బాగానే ఉందనుకునేలోపు.. ఇతడికి ఆలందూర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో అందరూ షాకయ్యారు. నోటీసులు జారీ చేసేంతలా ఇతడు ఏం చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఆలందూర్కు చెందిన జేఎంఏ హుస్సేన్.. బాబీసింహపై కోటి రూపాయలు పరువు నష్టం దావా వేస్తూ ఆలందూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను బాబీసింహ స్నేహితులమని.. చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని పేర్కొన్నారు. జమీర్ కాశీం అనే వ్యక్తి.. తన ద్వారా బాబీసింహకు పరిచయమయ్యారని, అతడు భవన నిర్మాణ రంగంలో ఉన్నారని హుస్సేన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే బాబీసింహ.. కొడైక్కానల్‌లో నిర్మించే భవన నిర్మాణ బాధ్యతలను జమీర్ కాశీంకు అప్పగించారని చెప్పాడు. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) అయితే 90 శాతం భవన నిర్మాణ పనులను పూర్తి చేయగా.. అప్పటివరకు అయిన ఖర్చుని బాబీసింహా చెల్లించలేదని.. ఈ వ్యవహారంలో వారిద్దరి మధ్య గొడవ జరిగిందని హుస్సేన్ చెప్పాడు. దీంతో తన తండ్రి.. వాళ్లిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారని.. కానీ ఆ సమయంలో 77 ఏళ్ల తన తండ్రిని బాబీసింహ బెదిరించారని హుస్సేన్ ఆరోపించారు. గతేడాది సెప్టెంబర్ 27న ప్రెస్ మీట్ పెట్టి మరీ తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో బాబీసింహపై తగిన చర్యలు తీసుకోవాలని హుస్సేన్.. ఆలందూర్ కోర్టులో పిటిషన్లో వేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ను గురువారం విచారించిన న్యాయస్థానం.. వివరణ కోరుతూ ప్రముఖ నటుడు బాబీసింహకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది. (ఇదీ చదవండి: చిరంజీవికి 'పద్మ విభూషణ్'.. ఈ అవార్డుతో పాటు ఏమేం ఇస్తారు?) -
‘గవర్నర్’ కోటాపై మెలిక !
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా కింద ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేయడానికి ముందే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పీటముడి వేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీకి సంబంధించి హైకోర్టులో ఉన్న కేసు పరిష్కారమయ్యే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని గవర్నర్ తమిళిసై నిర్ణయించినట్లు బుధవారం రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్‌కుమార్, కె.సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రతిపాదిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సిఫారసులను సెప్టెంబర్ 19న తిరస్కరిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీచేశారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అభ్యర్థులిద్దరూ వేసిన కేసు ఇటీవల రాష్ట్ర హైకోర్టు ముందుకు విచారణకు వచ్చింది. తొలుత కేసు విచారణార్హతను తేల్చాలని నిర్ణయిస్తూ తదుపరి విచారణను ఈ నెల 24కు హైకోర్టు వాయిదా వేసింది. ఈ కేసు పరిష్కారమయ్యే వరకు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని గవర్నర్ తమిళిసై నిర్ణయించారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, మరొకరి పేరును ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వార్తలు వచ్చాయి. తాజాగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. -
'భోళా శంకర్' సినిమాకు లైన్ క్లియర్..
చిరంజీవి నటించిన 'భోళా శంకర్' సినిమా విడుదలను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసి సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. (ఇదీ చదవండి: 'భోళా శంకర్' టికెట్ ధరలకు బ్రేక్.. కారణం ఇదే) వివాదం ఏంటి? ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు తనకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని గతంలో అనిల్ సుంకర అగ్రిమెంట్ రాసిచ్చారని అందుకు గాను తన నుంచి రూ.30 కోట్లు తీసుకుని మోసం చేశారని కోర్టుకు వైజాగ్ సతీష్ వెళ్లారు. ఈ మొత్తం చెల్లించినట్లు తన దగ్గర ఉన్న పక్కా ఆధారాలను కోర్టుకు ఆయన అందించాడు. అయితే దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం భోళా శంకర్ విడుదలకు అడ్డు చెప్పలేమంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఈ సినిమా రేపు యథాతథంగా రిలీజ్ కానుంది. అగ్రిమెంట్ బ్రేక్ చేశారు 'ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలిశాను. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి, వైజాగ్ వెళ్లిపోయాను. 'సామజవరగమన' వైజాగ్ హక్కులు నాకు ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది' కోర్టులో ఏం జరిగింది? జడ్జి, బుధవారం అడిగిన క్లారిఫికేషన్స్‌పై ఇరు పక్షాలు వాదనలు వినిపించాయి. ఏజెంట్ సినిమాకు ఇస్తామన్న డిస్ట్రిబూషన్ ఇవ్వకుండా ఏకే ఎంటర్టైన్మెంట్ మోసం చేసిందని, తదుపరి సినిమా విడుదలకు 15 రోజుల ముందు డబ్బు తిరిగి ఇస్తామని మరోసారి మోసంచేస్తున్నారని గాయిత్రీదేవి ఫిల్మ్స్ ఓనర్ బత్తుల సత్యనారాయణ చెప్పారు. ఇకపోతే ఏజెంట్ సినిమాతో తమకు కూడా నష్టం వచ్చిందని చెప్పిన ఏకే ఎంటర్ టైన్మెంట్స్, 30 కోట్ల నష్టాన్ని వేరే సినిమా డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ పూరిస్తామని క్లారిటీ ఇచ్చింది. అయితే రూ.28.30 కోట్లు ఇప్పుడే చెల్లించాలని గాయత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పట్టుబడుతోంది. 'సామజవరగమన' ద్వారా గాయత్రి ఫిలిమ్స్ కు రూ.కోటి ప్రాఫిట్ ఇచ్చాం, తమ ప్రతి సినిమాలోనూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని గాయత్రి ఫిల్మ్స్ కు ఇస్తున్నాం అని ఏకే ఎంటైర్టైన్మెంట్స్ వాదన వినిపించింది. భోళా శంకర్ సినిమాలో మొత్తం పెట్టుబడి తమదే 120 కోట్లు పెట్టామని, ఇప్పటికే ప్రీ బిజినెస్ రూ.60 కోట్ల దాకా జరిగిందని తెలిపింది. ఇంకా రూ.60 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది. -
'భోళా శంకర్'కి అడ్డంకులు.. రిలీజ్ వాయిదా?
-
కోర్టు గొడవల్లో 'భోళా శంకర్'.. ఇంతకీ ఏమైంది?
మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' వాయిదా పడనుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే సందేహం వస్తోంది. మరో రెండు రోజుల్లో రిలీజ్ ఉందనగా, ఓ డిస్ట్రిబ్యూటర్ కోర్టుకి వెళ్లాడు. 'భోళా శంకర్' నిర్మాతలపై కేసు పెట్టాడు. మూవీని విడుదల చేయకుండా ఆపాలని కోరాడు. ఇప్పుడు ఈ విషయం కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సదరు డిస్ట్రిబ్యూటర్.. ఓ ప్రెస్ నోట్‌తో పాటు వీడియోని రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: గుండెపోటుతో స్టార్ డైరెక్టర్ కన్నుమూత) ఏం జరిగింది? అఖిల్ హీరోగా నటించిన 'ఏజెంట్' ఏప్రిల్ 27న థియేటర్లలోకి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బయ్యర్లు అందరికీ కోట్లలో నష్టాలు వచ్చాయి. అయితే ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేతలు రూ.30 కోట్లు తీసుకుని తనని మోసగించారని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ అలియాస్ బత్తుల సత్యనారాయణ కోర్టులో కేసు వేశారు. అలానే ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. నన్ను మోసం చేశారు 'ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో అనిల్ సుంకర, గరికపాటి కృష్ణకిశోర్ నన్ను మోసం చేశారు. వారు చేసిన అన్యాయం ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐదేళ్లపాటు నాకు చెందిన గాయత్రి ఫిల్మ్స్‌కు అందజేస్తామని అగ్రిమెంట్ రాసిచ్చారు. రూ.30 కోట్లు తీసుకుని నన్ను మోసం చేశారు. ఈ మొత్తం చెల్లించినట్లు నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి.' (ఇదీ చదవండి: 'భోళా శంకర్'.. ఇక అంతా బోనస్!) అండర్ టేకింగ్ లెటర్! 'అయితే ఏజెంట్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే ఇచ్చి, అగ్రిమెంట్ బ్రేక్ చేశారు. మే 1న హైదరాబాద్ వెళ్లి ఈ విషయమై గరికపాటి కృష్ణ కిశోర్‌ని కలిశాను. ఆయన అనిల్ సుంకరతో మాట్లాడారు. ఏజెంట్ డిజాస్టర్ అయిందని చెప్పి, అండర్ టేకింగ్ లెటర్ ఇస్తామని చెప్పారు. దీంతో డబ్బులు ఎలాగైనా వస్తాయని నమ్మి, వైజాగ్ వెళ్లిపోయాను. 'సామజవరగమన' వైజాగ్ హక్కులు నాకు ఇచ్చారు కానీ కొద్ది డబ్బు మాత్రమే కవర్ అయింది' 'భోళా శంకర్'కు బ్రేక్? 'దీంతో 45 రోజుల్లో నాకు రావాల్సిన మిగతా డబ్బు ఇస్తామని చెప్పారు. లేదంటే తర్వాత విడుదలకు 15 రోజుల ముందు ఇస్తామని అగ్రిమెంట్ ఇచ్చారు. వాళ్ల తర్వాత మూవీ 'భోళా శంకర్'. ఈ విషయమై మాట్లాడాదామని ప్రయత్నిస్తుంటే నాకు సమాధానం ఇవ్వట్లేదు. ఫిలిం ఛాంబర్ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే తప్పని పరిస్థితుల్లో కోర్టుకు వెళ్లాను' అన వైజాగ్ సతీశ్ చెప్పుకొచ్చారు. బుధవారం కోర్టులో హియరింగ్ జరగనుంది. దీనిపై క్లారిటీ రావడంతోపాటు 'భోళా శంకర్' రిలీజ్ విషయంలోనూ స్పష్టత వస్తుంది. (ఇదీ చదవండి: మనవరాలికి మెగాస్టార్ దంపతుల స్పెషల్ గిఫ్ట్.. అదేంటో తెలుసా?) -
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఐఏఎస్ అధికారులపై కేసు
-
కోర్టులో లొంగిపోయిన హీరోయిన్ అమీషా పటేల్!
ఆమె తెలుగులో సినిమాలు చేసిన హీరోయిన్. కాకపోతే చాలా ఏళ్ల క్రితం టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో కలిసి నటించింది. ప్రస్తుతం హిందీ, పంజాబీలో మూవీస్ చేస్తూ బిజీగా ఉంది. రీసెంట్ గానే 'గదర్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఇలా కెరీర్ పరంగా బాగానే ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడుతోంది. తాజాగా ఓ కేసు విషయమై కోర్టులో లొంగిపోయింది. 2000లో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అమీషా పటేల్.. హిందీ, తెలుగులో ఒకేసారి ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు అడపాదడపా మూవీస్ చేస్తూ వస్తోంది. కొన్నేళ్ల ముందు ఓ సినిమా విషయమై ప్రముఖ నిర్మాత వ్యాపారవేత్త అజయ్ కుమార్ దగ్గర రూ.2.5 కోట్ల వరకు డబ్బు తీసుకుంది. ఆ తర్వాత సదరు సినిమా పూర్తి చేయలేదు సరికదా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. ఓసారి చెక్ ఇస్తే అది బౌన్స్ అయింది. దీంతో అజయ్ కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు ఈమెపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై ఈ ఏడాది ఏప్రిల్ 6న అమీషా పటేల్ కు కోర్టు వారెంట్ జారీ చేసింది. దీంతో రాంచీలోని సివిల్ కోర్టులో ఈమె శనివారం లొంగిపోయింది. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ భామకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన టైంలో తలకు పూర్తిగా ముసుగు వేసుకుని మీడియా ప్రతినిధుల నుంచి ముఖం దాచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్‌గా ఉన్నాడా?) -
కూతుళ్ల కోసం ‘తల్లి’గా మారాడు!
క్విటో(ఈక్వెడార్): కన్న కూతుళ్లంటే ఆ తండ్రి ఎంతో ఇష్టం. విడిపోయిన భార్య వద్ద ఉన్న ఇద్దరు కూతుళ్ల కస్టడీ తనకే ఇవ్వాలంటూ కోర్టులో కేసు వేశాడు. అయితే, తల్లి వద్దే కూతుళ్లు ఉండాలంటుంది చట్టం. అందుకే, కూతుళ్లకు తల్లి ప్రేమను పంచేందుకు దుస్సాహసమే చేశాడు ఆ తండ్రి. ఏకంగా లింగమార్పిడి చేసుకుని మహిళగా మారాడు. ఇప్పుడైనా చట్టం కూతుళ్లను తన వద్దకే పంపిస్తుందని ఆశపడుతున్నాడు..! ఈ ఘటన దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం.. రెనె సలినాస్ రమోస్(47), అతని భార్య విడిపోయారు. చట్టం ప్రకారం వీరి సంతానం తల్లి సంరక్షణలోనే ఉండాలి. మహిళ మాత్రమే బిడ్డలకు ప్రేమను అందిస్తుందని చట్టం అంటోంది. భార్య ఐదు నెలలుగా కూతుళ్లను కలుసుకునే అవకాశం లేకుండా చేస్తోందని అంటున్నాడు. తనకెంతో ఇష్టమైన కూతుళ్లు దూరం కావడం తట్టుకోలేని రమోస్ మరో మార్గం ఆలోచించాడు. ఏకంగా లింగమార్పిడి చేయించుకుని, మహిళగా మారాడు. అధికార రికార్డుల్లో మహిళగానే ఉన్నా, నిత్య జీవితంలో పురుషుడిగానే చెలామణి అవుతున్నాడు. మహిళగా మారినందున, కోర్టు కేసు గెలుస్తాననే నమ్మకంతో ఉన్నాడు. తల్లి వద్ద ఇబ్బందులు పడుతున్న తన బిడ్డలకు తల్లిగా మారుతానంటున్నాడు. ఈక్వెడార్ ఎల్జీబీటీఐ హక్కుల సంస్థలు మాత్రం రమోస్ చర్యపై మండిపడుతున్నాయి. -
'మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు'! రేపే శిక్ష ఖరారు చేయనున్న సుప్రీం కోర్టు!
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విజయ్ మాల్యాకు వ్యతిరేకంగా సోమవారం భారత అత్యున్నత న్యాయ స్థానం విచారణ జరపనుంది. జస్టిస్ యూయూ లలిత్, రవీంద్ర ఎస్ భట్, పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించనుంది. 2017లో విజయ్ మాల్యా సుప్రీం కోర్ట్ తీర్పును ఉల్లంఘిస్తూ మాల్యా 40మిలియన్ డాలర్లను తన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ సమాచారాన్ని కోర్ట్‌కు చెప్పే ప్రయత్నం చేయలేదు. పైగా ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాడు. దీంతో మాల్యాపై సుప్రీం కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణ జరిపింది. ఇప్పటికే కేసు విచారణ నేపథ్యంలో పలు మార్లు మాల్యా కోర్ట్‌కు హాజరు కావాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. కానీ మాల్యా సుప్రీం కోర్టు హాజరవ్వలేదు. ఈ తరుణంలో కోర్ట్ ధిక్కారం కేసుకు సంబంధించి ఏప్రిల్11న సుప్రీం కోర్ట్ తుది తీర్పు ఇవ్వనుంది. మాల్యాకు వ్యతిరేకంగా శిక్ష ఖరారు కానుంది. -
కొడుకు మీదే కోర్టుకు.. ఆ తల్లిదండ్రుల డిమాండ్ మీదే చర్చంతా!
డెహ్రాడూన్: పిల్లలను కనడంతోనే తల్లిదండ్రుల బాధ్యత ముగిసిపోదు. వాళ్లను పెంచి.. విద్యాబుద్ధులు నేర్పించి.. ఉన్నతస్థానానికి చేర్చే దాకా సాగుతూనే ఉంటుంది వాళ్ల ప్రయాణం. మరి ఆ తర్వాత.. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కూడా అంతే బాధ్యతతో వ్యవహరిస్తుంటారా?. ఇక్కడ వయసుపైబడ్డ ఓ పెద్దాయన, ఆయన భార్య.. సొంత కొడుకు, కోడలి మీద కోర్టుకు ఎక్కారు. ఎందుకో తెలుసా? తమకు ఓ మనవడినో, మనవరాలినో ఇవ్వమని! ఆశ్చర్యంగా అనిపించే ఈ కేసు ఉత్తరాఖండ్‌లో ఇవాళ(బుధవారం) చోటు చేసుకుంది. ఏడాదిలోగా మనవడో, మనవరాలినో తమ చేతుల్లో పెట్టాలని.. లేకుంటే ఐదుకోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టుకెక్కారు హరిద్వార్‌కు చెందిన ఆ జంట. 2016లో మా అబ్బాయికి వివాహం చేశాం. ఇప్పటిదాకా పిల్లల్ని కనలేదు. ఆడామగా అనే తేడా లేదు. ఎవరో ఒకరిని కనిస్తే చాలు.. అని అంటోంది ఆ జంట. మరి ఇక్కడ డబ్బు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా?. తల్లిదండ్రుల పట్ల ఆ కొడుకు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో సమాజానికి తెలియజేయడానికే అలా చేశారట!. మా దగ్గర ఉన్నదంతా మా అబ్బాయి కోసమే ఖర్చు చేశాం. అమెరికాలో చదివించాం. ఘనంగా పెళ్లి చేశాం. ఆపై బ్యాంక్ లోన్ తీసుకుని ఇల్లు కట్టాం. ఇప్పుడు మా దగ్గర పైసా లేదు. ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. అందుకే కొడుకు కోడలు నుంచి చెరో రెండున్నర కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తూ పిటిషన్ వేశాం అంటున్నారు ఎస్ఆర్ ప్రసాద్. ‘‘మనం పిల్లల కోసం లెక్కలేసుకోం. మంచి ఉద్యోగాలకు తోడ్పాడు అందిస్తాం. తల్లిదండ్రులుగా అది బాధ్యత. కానీ, పిల్లలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కష్టకాలంలో కనీస అవసరాలకు కూడా డబ్బులివ్వడం లేదు. మనవడో మనవరాలో కావాలని కేసు వేయడం వెనుక వాళ్ల ప్రధాన ఉద్దేశం.. అందరి దృష్టిని ఆకర్షించడమే’’ అంటున్నారు ప్రసాద్ తరపు లాయర్ శ్రీవాస్తవ. -
8 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
-
దొంగతనం చేశావ్ అన్నారు!....అంతే ఆమె కోటీశ్వరురాలైంది!!
ఒక్కోసారి మన టైం బాగోలేకపోతే లేదా ఎవరైన మన మీద అసూయ ద్వేషాలతోనో మన పై తప్పుడు ఆరోపణలు చేస్తుంటారు. దీంతో మానసికంగానూ, ఆర్థికంగానూ కుంగిపోతుంటాం. కానీ ఇక్కడొకామెకు ఆ తప్పుడు ఆరోపణ ఆమెను కోటీశ్వరురాలుగా మార్చింది. (చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!) అసలు విషయంలోకెళ్లితే...అలబామా లెస్టీ నర్స్ అనే ఆమె వాల్‌మార్ట్ షాపులో దొంగతనం చేసిందంటూ ఆరోపణలు ఎదుర్కొంటుంది. అంతేకాదు తమ షాపులో 48 డాలర్లు(రూ. 3000) ఖరీదు చేసే తృణధాన్యలు, క్రిస్మస్ లైట్లు వంటి వస్తువులు దొంగలించిందని ఆరోపించింది. పైగా దొంగతనం చేసినందుకుగానూ తమకు 200 డాలర్లు(రూ. 14,000) చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాల్‌మార్ట్ యాజామన్యం బెదిరించింది. దీంతో లెస్సీ జరిగిన విషయాన్ని ఆ షాపు వాళ్లకు వివరించినప్పటికి ఫలితం లేకపోయింది. పైగా ఆమెను అరెస్టు కూడా చేశారు. దీంతో లెస్టీ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకుని కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అంతేకాదు పైగా తీర్పు ఆమెకు అనుకూలంగా రావడమే కాక అందులో ఆమె స్టోర్‌లోని అన్ని వస్తువులకు చెల్లించినట్లు కోర్టు పేర్కొంది. అంతేకాదు ఆమెను దొంగతనం చేశావ్ అంటూ ఆరోపించి మానసిక ఆవేదనకు గురి చేసినందుకుగానూ నష్టపరిహారంగా వాల్‌మార్ట్ 2.1 మిలియన్ డాలర్లు (రూ.15 కోట్లు)ను ఆమెకు చెల్లించవల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. (చదవండి: ఇంట్లో వాళ్లని ఒప్పించి మరీ కొన్నా స్కూటీ!.... ఏం లాభం నడిపేందుకు లేకుండాపోయింది) -
ఫలించిన బ్రిట్ని స్పియర్స్ న్యాయపోరాటం
-
Telangana: జీవో 111 పై హైకోర్టులో విచారణ
హైదరాబాద్: జీవో నంబర్ 111 అంశానికి సంబంధించి ప్రభుత్వ పనితీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. విచారణ చేపట్టి నాలుగేళ్లయినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని హైకోర్టు నిలదీసింది. ఈ జీవోపై గురువారం విచారణ సందర్భంగా.. అసలు నివేదిక జాప్యం వెనక రహస్య అజెండా ఏంటని సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. కాగా, దీనిపై ప్రభుత్వ అదనపు ఏజీ రామచంద్రరావవు.. కరోనా, తదితర కారణాల వల్ల ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందని ధర్మాసనం.. ఉన్నత స్థాయి కమిటీ నివేదికను సెప్టెంబర్ 13 లోగా ఇవ్వాలని సూచించింది. ఒకవేళ నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలపాలని కమిటీకి ఆదేశించింది. నివేదికను వెబ్సైట్లో పెట్టాలని కమిటీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. చదవండి: Work From Home: జనవరి వరకు ఊరట.. ఇప్పుడు ఎంప్లాయిస్ మరో మాట! -
హైకోర్టులో ఏఆర్ రెహ్మాన్‌కు ఊరట
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏఆర్ రెహ్మాన్ 2000 సంవత్సరంలో ఒక సంగీత విభావరిని నిర్వహించారు. చెన్నైకి చెందిన కాళియప్పన్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సంగీత ప్రియులు ఆశించిన స్థాయిలో హాజరుకాలేదు. తాను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా రాలేదని, ఏఆర్ రెహ్మాన్ మాత్రం లబ్ధి పొందారని..తనకు నష్టపరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని కాళియప్పన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును న్యాయమూర్తి ఆర్.సుబ్రమణియం శుక్రవారం విచారించారు. నిర్వాహకుడికి లాభం రాకపోవడానికి తమకు ఎలాంటి సంబంధం లేదని రెహ్మాన్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. లాభం లేదని చెబుతూ నిర్వాహకుడు తమకు ఇస్తానని ఒప్పుకున్న డబ్బు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి పిటిషన్‌దారుడు తరఫు న్యాయవాది వివరణ ఇవ్వకపోవడంతో న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. -
కాకినాడ అమ్మాయి.. హైదరాబాద్ అబ్బాయి..
సింగరేణి(కొత్తగూడెం): కాకినాడకు చెందిన అమ్మాయి.. హైదరాబాద్‌కు చెందిన అబ్బాయి.. వారిద్దరికీ ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి వివాహం చేసుకునేందుకు దారి తీసింది. కొత్తగూడెంలో పెళ్లి చేసుకుని, ఇక్కడే పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ పెళ్లి ఇష్టంలేని అమ్మాయి తండ్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు కానిస్టేబుళ్లు ఈ జంటను తీసుకెళ్లేందుకు కొత్తగూడేనికి వచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. కాకినాడకు చెందిన విత్తనాల వెంకటలక్ష్మీపూజితకు హైదరాబాద్‌కు చెందిన తంగెళ్ల హిమేశ్‌తో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెద్దలు అంగీకరించరని తెలిసిన వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలం వెంకటేశ్‌ఖనిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన వివాహం చేసుకున్నారు. అనంతరం ఏప్రిల్ 18వ తేదీన కొత్తగూడెంలోని రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు. కాగా, కాకినాడ ఎంపీడీఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూజిత తండ్రి వెంకటశ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి తన కూతురు కన్పించడంలేదని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో కోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హిమేశ్, పూజిత కొత్తగూడెంలో వివాహం రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించి ఇక్కడకు వచ్చారు. అనంతరం వన్‌టౌన్ పోలీసుల సహకారంతో వారిద్దరినీ రప్పించి కోర్టుకు అప్పగించేందుకు ఆంధ్రా నుంచి వచ్చిన ఎస్సై బి.శంకర్, కానిస్టేబుల్ రమేశ్‌తోపాటు మరో మహిళా కానిస్టేబుల్‌కు అప్పగించారు. కాగా, ఈ ప్రేమ, పెళ్లి వ్యవహారంపై కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ కుమారస్వామిని వివరణ కోరగా కోర్టు ఆదేశాల మేరకు హిమేశ్, పూజితను అమరావతి నుంచి వచ్చిన పోలీసులకు అప్పగించామని, మంగళవారం కోర్టు సమయం ముగియడంతో బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చే అవకాశముందని వెల్లడించారు. -
ఆ కుర్చీలో కూర్చుంటే అంతే: సాధ్వి ప్రజ్ఞాసింగ్
ముంబై: భోపాల్ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ శువ్రవారం మొదటిసారిగా 2008 నాటి మాలేగావ్ పేలుడు కేసులో కోర్టుకు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటలపాటు కోర్టు హాలులో నిలుచునే ఉన్నారు. జడ్జి పలుమార్లు కూర్చోవచ్చని చెప్పినా ఆమె నిరాకరించారు. విచారణ ముగిసి, జడ్జి వెళ్లి పోయిన తర్వాత ప్రజ్ఞ కోర్టురూమ్‌లో సౌకర్యాలు సరిగా లేవంటూ అసహనం వ్యక్తం చేశారు. తనకు ఇచ్చిన కుర్చీని చూపిస్తూ.. ‘దీనిపై అంతా దుమ్మే. ఇందులో కూర్చుంటే నేను పడక్కే పరిమితమవుతా..’ అని అన్నారు. ‘ముందు కనీసం కూర్చునే చోటు చూపించండి. కావాలనుకుంటే తర్వాత ఉరి తీయండి’ అని వ్యాఖ్యానించారు. -
‘వ్యవస్థలను మేనేజ్ చేయడంలో ఆయన దిట్ట’
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ లభ్ది కోసమే బాబ్లీ కేసును ఉపయోగించుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయని.. వాటిపై స్టేలు ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజే చేయడంలో ఆయన దిట్ట అని అభివర్ణించారు. కింది స్థాయి నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబుకు చుట్టాలేనని తెలిపారు. చిన్న కేసును పట్టకుని రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు నోటీసులు వచ్చినప్పుడు ఎవరైనా హాజరుకావాల్సిందేనని వివరించారు. రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు దేనికైనా వెనుకాడరని ఎద్దేవ చేశారు. కాంగ్రెస హయాంలేనే బాబ్లీ కేసు నమోదయిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఏదోవిధంగా రాజకీయం చేయడం ఆయనకు అలవాటైందని దుయ్యబట్టారు. చట్టం దృష్టిలో అందరూ సమానమనే విషయాన్ని గుర్తుంపెట్టుకోవాలని హితబోద చేశారు. తమ పార్టీని, బీజేపీకి ఆపాదించడం కూడా రాజకీయమేనని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ఎప్పుడూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతుందని స్పష్టం చేశారు. -
వారెంట్‌ను కూడా వాడుకోవడం దుర్మార్గం
సాక్షి, కరీంనగర్: ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. ధర్మాబాద్ కోర్టు జారి చేసిన అరెస్ట్ వారెంట్‌ను కూడా టీడీపీ రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. బాబ్లీని అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటు తాను పోరాటం చేశానని చెప్పారు. ఈ కేసులో ఏ2గా ఉన్న తనపై 18 కేసులు నమోదు చేశారని తెలిపారు. ఏనాడూ కేసులను పబ్లిసిటీ కోసం తాను వాడుకోలేదని వెల్లడించారు. తెలంగాణ విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, ఏనాడూ కూడా వారు పబ్లిసిటీ కోసం చంద్రబాబులా వాడుకోలేదని అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని కేసులను టీడీపీ వాడుకుంటోందని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు. -
కోర్టుకు శేఖర్
సాక్షి, చెన్నై : మహిళా జర్నలిస్టుల్ని కించపరిచిన కేసులో గట్టి భద్రత నడుమ సినీ నటుడు, బీజేపీ నాయకుడు ఎస్వీ శేఖర్ బుధవారం ఎగ్మూర్ కోర్టుకు హాజరు అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. మహిళా జర్నలిస్టులను కించపరిచే విధంగా వ్యవహరించిన ఎస్వీశేఖర్ మీద నాలుగు రకాల సెక్షన్లతో కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. కేసులు పెట్టి రెండు నెలలు అయినా, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిరాకరించడంతో డైలమాలో పడ్డారు. శేఖర్ అరెస్టుకు సర్వత్రా డిమాండ్ చేస్తూ వచ్చినా, ఆందోళనలు సాగినా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ బంధువు కావడంతోనే అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఎస్వీ శేఖర్ అజ్ఞాతంలో ఉన్నట్టుగా పోలీసులు పేర్కొంటూ వస్తున్నా, రెండురోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో ఆయన భేటీ కావడం, మంత్రులు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికార అండదండలతో దర్జాగా తిరుగుతున్నా, పోలీసులు పట్టించుకోకపోవడంపై కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. 20వ తేదీలోపు హాజరు కావాల్సిందేనని ఎగ్మూర్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు కన్నెర్ర చేయడంతో మెట్లు ఎక్కేందుకు బుధవారం ఉదయాన్నే ఎస్వీ శేఖర్ సిద్ధం అయ్యారు. బెయిల్ మంజూరు పది గంటల సమయంలో మైలాపూర్‌లోని ఇంటి నుంచి పోలీసు భద్రత నడుమ శేఖర్ ఎగ్మూర్ కోర్టుకు వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా ఏదేని ఆందోళనలు సాగవచ్చన్న సమాచారంతో పోలీసులు మరీ హడావుడి సృష్టించారు. కోర్టు పరిసరాల్లో గట్టి భద్రత కల్పించారు. పోలీసుల హడావుడి అక్కడి న్యాయవాదుల్లో సైతం ఆగ్రహాన్ని తెప్పించాయి. శేఖర్ అక్కడికి వచ్చిన సమయంలో ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ పలువురు న్యాయవాదులు నినాదాల్ని హోరెత్తించడం గమనార్హం. దీంతో శేఖర్ ముందు గేటు నుంచి కాకుండా వెనుక ఉన్న మరో గేటు ద్వారా భద్రత వలయం నడుమ కోర్టులోకి వెళ్లారు. పదిన్నర గంటలకు న్యాయమూర్తి సమక్షంలో హాజరయ్యారు. విచారణ తదుపరి ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అదే భద్రత నడుమ ఇంటి బాట పట్టారు. -
లతా రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట
చెన్నై: సూపర్‌స్టార్ సతీమణి లతారజనీకాంత్‌కు 'కొచ్చాడయాన్' చిత్ర వ్యవహారంలో ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. రజనీకాంత్ నటించిన యానిమేషన్ చిత్రం 'కొచ్చాడయాన్'. ఈ చిత్రానికి ఫైనాన్స్ చేసిన యాడ్ బ్యూరో సంస్ధ అధినేత అభీర్‌చంద్ నెహర్ బెంగుళూరు కోర్టులో లతారజనీకాంత్‌పై పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ 'కొచ్చాడయాన్' చిత్రం నిర్మాణంలో ఆర్ధిక సమస్యలు తలెత్తిన సమయంలో ఆ చిత్ర నిర్మాణ సంస్థ తన నుంచి రూ.6.84 కోట్లు రుణం పొందిందన్నారు.అందుకు పూచీకత్తుగా లతారజనీకాంత్ సంతకం చేశారని తెలిపారు. అంతే కాకుండా ఆమె స్థల డాక్యుమెంట్స్ ఇచ్చారని అవి నకిలీవని తేలిందని అన్నారు. నకిలీ డాక్యుమెంట్స్టో తనను మోసం చేసిన లతారజనీకాంత్‌పై తగిన చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్‌పై స్పందించిన బెంగుళూరు కోర్టు పిటిషనదారుడిని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించింది. దీంతో పిటిషనదారుడు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కొంత కాలంగా విచారణలో ఉన్న ఈ కేసులో గురువారం న్యాయమూర్తి ప్రదీప్.టీ.వైన్కంకర్ సమక్షంలో విచారణకు వచ్చింది.అభీర్‌చంద్ నెహర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ జరిపిన ఆయన లతారజనీకాంత్‌పై ఆరోపణలకు పిటిషన్‌దారుడు సరైన ఆధారాలు చూపలేకపోయారంటూ కేసును న్యాయమూర్తి కొట్టివేశారు. -
అగ్రిగోల్డ్ ఏజెంట్ ఆత్మహ త్యాయత్నం
నార్పల : నార్పలకు చెందిన అగ్రిగోల్డ్ ఏజెంట్ రహింబీ శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేశారు. అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా వ్యవహరించిన ఆమె పలువురి నుంచి డిపాజిట్లు సేకరించారు. ప్రస్తుతం ఆ సంస్థ వివాదాలు, కోర్టు కేసుల్లో ఇరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాము కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ కొందరు పాలసీదారులు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. దీంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా బంధువులు గమనించి వెంటనే ఆమెను 108లో అనంతపురం పెద్దాస్పత్రికి తరలించారు. -
స్వచ్ఛంద సంస్థగా ఏజేఎల్
లక్నో: కోర్టు కేసులను ఎదుర్కొంటున్న నేషనల్ హెరాల్డ్ దినపత్రిక యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్).. ఇకపై వాణిజ్య సంస్థ కాదు. అది ఇక స్వచ్ఛంద సంస్థ. చాలా కాలం కిందట నిలిచిపోయిన వార్తా పత్రికల ప్రచురణను పునఃప్రారంభించాలని కూడా ఆ సంస్థ భాగస్వాములు నిర్ణయించారు. గురువారం లక్నోలో ఏజేఎల్ భాగస్వాముల అసాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కంపెనీల చట్టం 2013 కింద.. లాభార్జన కోసం కాని సెక్షన్ 8 సంస్థగా మార్చేందుకు ఉద్దేశించిన పలు ప్రతిపాదనలను వాటాదారులు పరిశీలించి ఆమోదించారని ఏజేఎల్ మేనేజింగ్ డెరైక్టర్ మోతీలాల్ ఓరా విలేకరులకు తెలిపారు. మూడు గంటలకు పైగా కొనసాగిన భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంస్థ ప్రచురణలను కూడా పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఏజేఎల్ భాగస్వాములైన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌గాంధీలు కూడా పరోక్షంగా తమ ఓట్లు వేసినట్లు తెలుస్తోంది. ఏజేఎల్‌ను 2010లో యంగ్ ఇండియన్ కంపెనీకి అప్పగించటంలో అవినీతి చోటు చేసుకుందంటూ.. సోనియా, ఆమె కుమారుడు రాహుల్ లతో పాటు మరో ఐదుగురిపై బీజేపీ నేత సుబ్రమణ్యంస్వామి క్రిమినల్ కేసు దాఖలు చేయటం, ఢిల్లీ కోర్టు వారికి సమన్లు జారీ చేయటం, వారు కోర్టుకు హాజరవ్వాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పటం, వారు గత నెలలో కోర్టుకు హాజరవటం.. ఈ కేసుపై రాజకీయ దుమారం రేగటం తెలిసిందే. ఏజేఎల్‌ను స్వచ్ఛంద సంస్థగా మార్చిన నిర్ణయాల ప్రభావం కేసుపై ఎలా ఉంటుందని విలేకరులు ప్రశ్నించగా.. కేసు కోర్టులో ఉందని, తమ నిర్ణయాల ప్రభావం కేసుపై ఉండబోదని ఓరా బదులిచ్చారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, శ్యాంపిట్రోడా, ఆస్కార్ ఫెర్నాండెజ్, షీలాదీక్షిత్, సలీమ్షేర్వాణి, రత్నాసింగ్, జితిన్‌ప్రసాద, సయ్యద్సిబ్తేరజీ తదితరులు హాజరయ్యారు. -
తీర్పు చెప్పని జడ్జీలకు అవకాశమివ్వొద్దు
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సాక్షి, చెన్నై: కోర్టు కేసుల్లో విచారణ ముగిశాక మూడు నెలల్లోపు తీర్పు చెప్పడం తప్పనిసరని, జాప్యం చేసే జడ్జీలకు కొత్త కేసులు విచారించే అవకాశాన్ని ఇవ్వరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూరియన్ జోసెఫ్ వ్యాఖ్యానించారు. శనివారమిక్కడ అఖిల భారత బార్ కౌన్సిల్ సదస్సులో సుప్రీంకోర్టు, మద్రాసు హైకోర్టు జడ్జీలు పాల్గొన్నారు. కేసు విచారణ ముగిశాక తీర్పు చెప్పేందుకు కనిష్టకాలం నెల, గరిష్టకాలం 3 నెలలు అని జడ్జి జోసెఫ్ అన్నారు. మూడు నెలలుదాటినా తీర్పు చెప్పని జడ్జీలకు ఇతర కేసులను సుప్రీం, హైకోర్టు జడ్జీలు ఇవ్వొద్దన్నారు. విచారణ కాలంలో కేసులపై తమ సొంత అభిప్రాయాలను మీడియాకు జడ్జీలు తెలపొద్దన్నారు. సుప్రీంకోర్టు జడ్జి జె.చలమేశ్వర్ మాట్లాడుతూ.. కేసులు దీర్ఘ కాలం కొనసాగడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఒక కారణమన్నారు. -
ఆ ఆర్డినెన్స్‌పై కోర్టులో కేసు వేద్దామా!
లెఫ్ట్ పార్టీలు, హక్కుల సంఘాల చర్చలు 1986 నాటి సుప్రీం తీర్పు ఏపీకి వర్తిస్తుందని అంచనా హైదరాబాద్: భూసేకరణ చట్టం-2013లోని రెండు మూడు అధ్యాయాలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడానికి ఊతమిచ్చిన కేంద్ర ప్రభుత్వ భూ సేకరణ చట్ట సవరణ ఆర్డినెన్స్‌పై ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయాలని లెఫ్ట్ పార్టీలు, హక్కుల సంఘాలు యోచిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకురావాల్సిన ఆర్డినెన్స్‌ను కేంద్రం ఇప్పటికే రెండుసార్లు తీసుకువచ్చి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిందని ఈ సంఘాలు భావిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పటికీ వాస్తవ బాధితుల తరఫున పిల్ దాఖలు చేసే విషయమై సాధ్యాసాధ్యాలను సీపీఐ, సీపీఎం, రైతు సమాఖ్య, పీయూసీఎల్ నేతలు చర్చించారు. మరోసారి హైదరాబాద్‌లో న్యాయప్రముఖులతో కలిసి చర్చించాలని నిర్ణయించారు. బిహార్ ప్రభుత్వానికి, డాక్టర్ డీసీ వాద్వాకు మధ్య నడిచిన కేసులో సుప్రీంకోర్టు 1986లో ఓ చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. చట్టసభలు అస్తిత్వంలో ఉండి, నడుస్తున్నప్పుడు పదేపదే ఆర్డినెన్స్‌లు జారీ చేయడం చెల్లదన్నది ఆ తీర్పు సారాంశం.