
సాక్షి, కరీంనగర్: ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. ధర్మాబాద్ కోర్టు జారి చేసిన అరెస్ట్ వారెంట్‌ను కూడా టీడీపీ రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. బాబ్లీని అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటు తాను పోరాటం చేశానని చెప్పారు. ఈ కేసులో ఏ2గా ఉన్న తనపై 18 కేసులు నమోదు చేశారని తెలిపారు. ఏనాడూ కేసులను పబ్లిసిటీ కోసం తాను వాడుకోలేదని వెల్లడించారు.
తెలంగాణ విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, ఏనాడూ కూడా వారు పబ్లిసిటీ కోసం చంద్రబాబులా వాడుకోలేదని అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని కేసులను టీడీపీ వాడుకుంటోందని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment