warrant
-
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హాసీనాపై అరెస్ట్ వారెంట్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్టు వారెంట్ జారీ అయింది. నవంబర్ 18న కోర్టుకు హాజరుకావాలని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆదేశించింది. వచ్చే నెల 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ఆదేశించారు. రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా పదవి నుంచి వైదొలిగారు. ప్రస్తుతం ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు.జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందగా, వాటిపై ట్రైబ్యునల్ ఇటీవల విచారణ ప్రారంభించింది. మరోవైపు ఆమె దౌత్య పాస్‌పోర్టు కూడా రద్దయింది.హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్‌లో ఉండటాన్ని వ్యతిరేకిస్తుండగా, భారత్‌లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తమకు అప్పగించాలని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారత్‌ను ఇటీవల కోరింది.ఆమెను బంగ్లాకు అప్పగించాలని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంగీర్ డిమాండ్ చేశారు. రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాల నేతృత్వంలోని నిరసనలను ఆమె అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ కోటా విషయంలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఆమెపై నమోదైన హత్య కేసుల్లో విచారణ ఎదుర్కొవల్సిందేనని బీఎన్పీ స్పష్టం చేసింది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని ఓవరాక్షన్.. ఖండించిన భారత్ -
ఆకలిని అడ్డు పెట్టుకుని యుద్ధం చేయడం లేదు: నెతన్యాహు
జెరూసలెం: యుద్ధ నేరాల కింద తనకు అరెస్టు వారెంట్ ఇవ్వాలని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ఐసీసీ)లో ప్రాసిక్యూటర్ చేసిన వాదనపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మండిపడ్డారు. అబద్ధాల ఆధారంగా తనపై ఆ వారెంట్ కోరుతున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఆయన బుధవారం(మే22) మీడియాతో మాట్లాడారు. గాజాలో ఆకలి కేకలను అడ్డం పెట్టుకుని హమాస్‌తో యుద్ధంలో ఇజ్రాయెల్ పైచేయి సాధిస్తోందన్న వాదనను ఖండించారు. ఆకలి మంటలను ఇజ్రాయెల్ యుద్ధతంత్రంగా వాడుతున్నట్లు అనిపిస్తోందని గతంలో ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది.ఇదే గనుక నిజమైతే దానిని యుద్ధ నేరం కింద పరిగణిస్తామని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఐక్యరాజ్యసమితి ఆందోళన సరైనదే అనేందుకు కావాల్సిన ఆధారాలున్నాయని ఐసీసీ ప్రాసిక్యూటర్ల బృందం తాజాగా వెల్లడించింది. -
Imran Khan: విద్వేష ప్రసంగం కేసు.. తాత్కాలిక ఊరట
ఇస్లామాబాద్: పాక్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్‌కు తాత్కాలిక ఊరట లభించింది. తాజా విద్వేషపూరిత ప్రసంగం కేసులో క్వెట్టా స్థానిక కోర్టు ఒకటి ఆయన మీద అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. దానిని రెండు వారాల పాటు నిలిపివేయాలంటూ బెలూచిస్తాన్ హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. విద్వేషపూరిత ప్రసంగం కేసుకు గానూ సదరు స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో.. క్వెట్టా పోలీసుల బృందం ఒకటి ఖాన్‌ను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌కు కూడా చేరుకుంది. అయితే ఈలోపే బెలూచిస్తాన్ హైకోర్టు ఆయనకు తాత్కాలిక ఊరట ఇవ్వడం విశేషం. ఇదిలా ఉంటే.. గత ఆదివారం లాహోర్‌లోని ఆయన నివాసం జమాన్ పార్క్ వద్ద భారీ హైడ్రామా నడిచింది. తోషాఖానా కేసులో కోర్టు విచారణకు గైర్హాజరు అవుతుండడంతో ఆయన్ని అరెస్ట్ చేయాలంటూ కోర్టు ఆదేశించడంతో.. పోలీసులు అక్కడి చేరుకున్నారు. అయితే పీటీఐ కార్యకర్తల నిరసన ప్రదర్శనలతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఆ సమయంలోనే పీటీఐ కార్యకర్తలను, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఖాన్.. పాక్ సర్కార్‌ను, దర్యాప్తు సంస్థలను, పోలీసులను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ సంస్థలను విమర్శిస్తూ సంచలన ఆరోపణలు చేసినందుకుగానూ బిజిల్ ఘర్ పోలీస్ స్టేషన్లో ఖాన్‌పై ఓ కేసు నమోదు అయ్యింది. దీంతో క్వెట్టా స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ వెంటనే ఖాన్ బెలూచిస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఖాన్ ప్రసంగించిన చోటుకి.. బిజిల్ఘర్ స్టేషన్ పరిధికి సంబంధం లేదంటూ ఖాన్ తరపు న్యాయవాది వాదించగా.. కోర్టు ఆ వాదనతో ఏకీభవించింది. లోకల్ కోర్టు జారీ చేసిన వారెంట్‌ను రెండు వారాలపాటు సస్పెండ్ చేస్తూ(విచారణ రెండు వారాలు వాయిదా వేసింది).. బెలూచిస్తాన్ ఎస్పీకి, బిజిల్ పోలీస్ స్టేషన్ అధికారులకు సమన్లు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 37 కేసులు నమోదు అయ్యియి. వీటిల్లో నేరుగా ఆయన పేరును నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. -
బండ్ల గణేష్‌కు అరెస్ట్ వారెంట్ జారీ.. కోర్టుకు హాజరు ?
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వివాదాల్లో చిక్కుక్నునారు. ఈ సారి ఆయన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. బండ్ల గణేష్‌పై ఏపీ ప్రకాశం జిల్లా ఒంగోలు రెండో మెజిస్ట్రేట్ కోర్టు సోమవారం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జిల్లాలోని ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి గణేష్ రూ.1.25 కోట్ల చెక్కును అందించినట్లు సమాచారం. అయితే ఆ చెక్కు బౌన్స్ కావడంతో చెక్ బౌన్స్ కేసు నమోదు చేశాడు వెంకటేశ్వర్లు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు ఆదేశించినా బండ్ల గణేష్ స్పందించలేదు. దీంతో అతన్ని అరెస్ట్ చేయాల్సిందిగా న్యాయమూర్తి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. బండ్ల గణేష్ సోమవారం కోర్టుకు హాజరైనట్లు తెలుస్తోంది. గతంలో బండ్ల గణేష్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కేసు నమోదైంది. కడపకు చెందిన మహేష్ అనే వ్యక్తి తనకు రూ.13 కోట్లు ఇచ్చాడని, దానిని నటుడు తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. చివరికి కడపలో డబ్బులు చెల్లించకపోవడంతో బండ్ల గణేష్‌పై మహేష్ ఫిర్యాదు ఇచ్చాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అదే తరహాలో బండ్ల గణేష్ విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో కడప మెజిస్ట్రేట్ ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో పోలీసులు బండ్ల గణేష్‌ను అరెస్టు చేసి కడప జిల్లా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. -
కంగనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కోర్టు
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్ అఖ్తర్ వేసిన డిఫమేషన్ కేసులో గైర్హాజరు కావడంపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తంచేసిన కోర్టు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెస్ట్ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20 కి వాయిదా వేసారు. చదవండి : Terrific Road Accidents: తీరని విషాదాలు జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్ మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. ఇదంతా చూస్తుంటే కావాలనే కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోందని కోర్టు మండిపడింది. ఇకపై ఇదే తరహాలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించింది. వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై అఖ్తర్ తరఫు న్యాయవాది జే భరద్వాజ్ కోర్టులో అభ్యంతరం తెలుపడంతో తాజా హెచ్చరిక చేసింది. కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, కంగనా సినిమా యాక్టింగ్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉండటంతో పా టు, కొన్ని లక్షణాల కారణంగా కోవిడ్ పరీక్ష చేయించుకోనున్నారని, ఒకవేళ పాజిటివ్ వస్తే మరింత మినహాయింపు అవసరం ఉంటుందని కోర్టుకు తెలపడం గమనార్హం కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారని జావేద్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కంగనా. అయితే కంగనా పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
ట్రంప్‌కు మరో షాక్ : అరెస్ట్ వారెంట్
బాగ్దాద్: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి గుడ్‌బై చెప్పనున్న డొనాల్డ్ ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. ఇరాన్ సైనికాధికారిని హత్య కేసులో ఇరాక్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. జనరల్ ఖాసిమ్ సులేమాని, అబూ మహదీ అల్ ముహండిస్‌లను హతమార్చిన డ్రోన్‌దాడిపై దర్యాప్తు చేయాల్సిందిగా బాగ్దాద్ కోర్టు జడ్జ్ ఆదేశించారు. అబూమహదీ అల్ ముహండిస్ కుటుంబంనుంచి వాంగ్మూలాన్ని నమోదు చేసిన తరువాత వారెంట్ జారీ చేసే నిర్ణయం జరిగిందని, హత్యలపై దర్యాప్తు కొనసాగుతోందని సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ గురువారం వెల్లడించింది. బాగ్దాద్‌లో గత ఏడాది జనవరి 3న వైమానిక దాడిలో జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ కేసులో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు మరో 47 మంది ఇతర అమెరికన్ అధికారులను అదుపులోకి తీసుకునేందుకు సహకరించాలంటూ ఇరాన్ ఇంటర్‌పోల్‌ను కోరింది. ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసినా ట్రంప్‌ను వదిలేది లేదని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది. -
నిత్యానందపై అరెస్ట్ వారంట్
యశవంతపుర (బెంగళూరు): అత్యాచారం, మహిళ కిడ్నాప్ కేసుల్లో నిందితుడైన వివాదాస్పద స్వామి నిత్యానందకు రామనగర కోర్టు అరెస్ట్ వారంట్ జారీచేసింది. నిత్యానంద ఇప్పటికే పరారీలో ఉన్నాడు. అతని లాయర్లు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో రామనగర కోర్టు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. నిత్యానందను అరెస్ట్ చేసి తమ ముందు ఉంచాలని రామనగర పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. నిత్యానంద ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. నిత్యానంద అహ్మదాబాద్‌లోని ఆశ్రమం నుంచి విదేశాలకు పరారైనట్లు గుజరాత్ పోలీసులు గుర్తించారు. కొన్నినెలలుగా నిత్యానంద బెంగళూరు శివార్లలోని బిడది ఆశ్రమానికి ముఖం చాటేశాడు. అతడు బెంగళూరులో ఉండి ప్రవచనాలు చేస్తున్నట్లు ఆయన శిష్యులు ఇటీవల ఒక వీడియోను విడుదల చేశారు. బెంగళూరులో లేని వ్యక్తి ఎలా ప్రవచనాలు చేస్తాడని పోలీసులు అనుమానిస్తున్నారు. (చదవండి: నిత్యానందకు నోటీసులపై వింత జవాబు) -
రేణుకా చౌదరికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్
సాక్షి, ఖమ్మం: కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ అయింది. చీటింగ్ కేసుకు సంబంధించి ఆమెకు ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టు ఈ వారెంట్ ఇచ్చింది. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక చౌదరి తన భర్తను మోసగించారంటూ కళావతి బాయి అనే మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై రేణుకా చౌదరిపై ఖానాపురం హవేలీ పోలీసులు సెక్షన్ 420, 417 కింద నాలుగేళ్ల క్రితం కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా కోర్టు పలుమార్లు రేణుకకు నోటీసులు జారీ చేసింది. అయితే ఆ నోటీసులు అందుకోకపోవడంతో పాటు, విచారణకు గైర్హాజరు కావడంతో న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది. -
నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: రూ.13వేల కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో ఆభరణాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో అతడిని స్వదేశానికి పంపించాలన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వినతి మేరకు అక్కడి న్యాయస్థానం స్పందించిందని అధికార వర్గాలు తెలిపాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు మోదీపై ఇటీవలే వారెంట్ జారీ చేసినట్లు అక్కడి దర్యాప్తు విభాగం తమకు సమాచారం అందించిందని అధికారులు తెలిపారు. లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు మోదీని త్వరలోనే అధికారికంగా అరెస్టు చేసే అవకాశాలున్నాయన్నారు. అనంతరం వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరుస్తారు. ఆపైన అతడిని భారత్‌కు అప్పగించే న్యాయ ప్రక్రియ మొదలవుతుందని వివరించారు. అయితే, అతడిని అరెస్టు చేసి, అభియోగాలు మోపే వరకు ఈ పరిణామాలపై స్పందించలేమని లండన్ కోర్టు, స్కాట్లాండ్ యార్డు పోలీసు అధికారులు స్పష్టం చేశారు. మోదీని అప్పగించాలంటూ ఈ నెల ప్రారంభంలో ఈడీ బ్రిటన్ హోం మంత్రిని కోరింది. పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన కేసులో మోదీ, అతని మామ మెహుల్ చోక్సీపై ఈడీతోపాటు సీబీఐ కూడా మనీలాండరింగ్, తదితర నేరాల కింద కేసులు నమోదు చేశాయి. ఈ నేరాల కింద మోదీ, అతని కుటుంబానికి చెందిన సుమారు రూ. 2,300 కోట్ల ఖరీదైన ఆస్తులను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. పారిపోయిన మోదీ లండన్‌లోని ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు ఇటీవల అక్కడి మీడియా వెల్లడించిన విషయం తెలిసిందే. రూ. 9 వేల కోట్ల మేరకు మోసం చేసి బ్రిటన్‌లో ఆశ్రయం పొందుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కూడా చివరి దశలో ఉందని అధికార వర్గాలు తెలిపాయి. మోడీ విషయంలో అనుసరించిన ప్రక్రియనే మాల్యాకు వర్తింపజేస్తామని పేర్కొన్నాయి. ఈడీ వినతి మేరకు లండన్ కోర్టు విజయ్ మాల్యాపై 2017 వారెంట్ జారీ చేయగా ప్రస్తుత ఆయన బెయిల్‌పై ఉన్నారు. -
వారెంట్‌ను కూడా వాడుకోవడం దుర్మార్గం
సాక్షి, కరీంనగర్: ధర్మాబాద్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. ధర్మాబాద్ కోర్టు జారి చేసిన అరెస్ట్ వారెంట్‌ను కూడా టీడీపీ రాజకీయంగా వాడుకోవడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. బాబ్లీని అడ్డుకోవడానికి చంద్రబాబుతో పాటు తాను పోరాటం చేశానని చెప్పారు. ఈ కేసులో ఏ2గా ఉన్న తనపై 18 కేసులు నమోదు చేశారని తెలిపారు. ఏనాడూ కేసులను పబ్లిసిటీ కోసం తాను వాడుకోలేదని వెల్లడించారు. తెలంగాణ విషయంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై ఎన్నో కేసులు నమోదయ్యాయని, ఏనాడూ కూడా వారు పబ్లిసిటీ కోసం చంద్రబాబులా వాడుకోలేదని అన్నారు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి, ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని కేసులను టీడీపీ వాడుకుంటోందని విమర్శించారు. చంద్రబాబు ఎన్ని పన్నాగాలు పన్నినా ప్రజలు తిరస్కరించడం ఖాయమన్నారు. -
దినకరన్ సోదరి, బావలకు పీటీ వారెంట్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ సోదరి సీతలాదేవి, బావ ఎస్ఆర్ భాస్కరన్లకు చెన్నై సిబిఐ కోర్టు పీటి వారెంట్ జారీ చేసింది. 2008లో సీతలాదేవి, భాస్కరన్‌లపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. విచారణలో ఆధారాలతో సహా నిరూపితం కావడంతో సీతలాదేవికి మూడు, భాస్కరన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను సిబిఐ కోర్టు విధించింది. దీనిపై వారు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకోగా చుక్కెదురైంది. దీంతో జైలు శిక్ష అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు వారికి అవకాశం కల్పించారు. అయితే, వారు లొంగిపోని దృష్ట్యా చెన్నై సిబిఐ కోర్టు శుక్రవారం సాయంత్రం పిటీ వారెంట్ జారీ చేసింది. ఆ ఇద్దరిని అరెస్టు చేయాలని సిబిఐను ఆదేశించింది. -
మంత్రి కుమారుడికి అరెస్ట్ వారెంట్
మైసూరు: ఇసుక కాంట్రాక్ట్ ఇవ్వడానికి లంచం తీసుకునేలా భూ విజ్ఞాన శాఖాధికారి అల్ఫోన్సెస్‌పై ఒత్తిడి తెచ్చినట్లు అరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మంత్రి హెచ్.సీ.మహదేవప్ప కుమారుడు సునీల్‌బోస్‌పై గురువారం మైసూరు మూడవ అదనపు సెషన్స్ కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గురువారం విచారణకు సునీల్‌బోస్ గైర్హాజరు కావడంతో మూడవ అదరపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సురేంద్రనాథ్ నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఆదేశాలు జారీ చేశారు. -
విజయధరణికి వారెంట్
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే విజయధరణికి నాగర్‌కోయిల్ కోర్టు పిటీ వారెంట్ జారీ చేసింది. ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలంటూ న్యాయమూర్తి శశికుమార్ ఉత్తర్వులతో కాంగ్రెస్ వర్గాలు విస్మయంలో పడ్డారు. కన్యాకుమారి జిల్లా విలవన్‌కోడు నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి విజయధరణి అసెంబ్లీ మెట్లు ఎక్కుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఆమె కొంత కాలం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఈ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కూడా సాగించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్‌తో కలిసి కన్యాకుమారి జిల్లా కరుంగల్లో జరిగిన బహిరంగ సభకు హాజరైన విజయధరణి నోరు జారారు. సీఎం జయలలితను ఉద్దేశించి ఆధార రహిత ఆరోపణలు గుప్పించారు. తీవ్రస్థాయిలో ఆమెతో పాటు ఈవీకేఎస్ కూడా రెచ్చిపోయి ప్రసంగాన్ని సాగించారు. ఆ ఇద్దరి ప్రసంగాలు సీఎం పరువుకు భంగం కల్గే విధంగా ఉందంటూ ప్రభుత్వ న్యాయవాది జ్ఞానశేఖరన్ రంగంలోకి దిగారు. ఈవీకేఎస్, విజయధరణిలకు వ్యతిరేకంగా వేర్వేరుగా పరువు నష్టం దావాలను నాగర్‌కోయిల్ సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు. కేసు గత విచారణ సమయంలో కోర్టుకు రావాల్సిందేనని విజయధరణికి సమన్లు జారీ అయ్యాయి. బుధవారం పిటిషన్ విచారణకు రాగా, కోర్టుకు హాజరు కావాల్సిన విజయధరణి డుమ్మా కొట్టారు. ఆమె సహాయకుడిగా పేర్కొంటూ, రాజగోపాల్ అనే వ్యక్తి కోర్టుకు ఓ వినతి పత్రం అందజేశారు. న్యాయవాదులు విధుల బహిష్కరణ సాగిస్తున్న దృష్ట్యా, విజయధరణి తరఫున కోర్టుకు హాజరయ్యేందుకు న్యాయవాదులు లేరని, ఈ ద1ష్ట్యా, పిటిషన్ విచారణను వాయిదా వేయాలని కోరారు. ఇందుకు ప్రభుత్వం తరపు న్యాయవాది జ్ఞానశేఖరన్ ఆక్షేపణ వ్యక్తం చేశారు. కుంటి సాకులతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని, విచారణకు గైర్హాజరు కావడమే కాకుండా, న్యాయవాదుల విధుల బహిష్కరణను తమకు అనుకూలంగా వాడుకునే పనిలో పడ్డారని వాదన విన్పించారు. కోర్టు విచారణకు డుమ్మా కొట్టిన విజయధరణిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. చివరకు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శశికుమార్ స్పందిస్తూ విజయధరణి తరఫున రాజగోపాల్ సమర్పించిన విజ్ఞాపనను తిరస్కరించారు. విజయధరణిని కోర్టులో హాజరు పరచాలని ఆదేశిస్తూ పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ వర్గాలు విస్మయంలో పడ్డాయి. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండడం, కాంగ్రెస్ విప్‌గా ఆమె సభలో తప్పనిసరి. ఈ సమయంలో అరెస్టు వారెంట్ జారీ చేసి ఉన్న దృష్ట్యా, గురువారం ఆమె కోర్టుకు పరుగులు తీసేనా లేదా, అసెంబ్లీకి హాజరయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే. -
ధోనికి నాన్ బెయిలబుల్ వారెంట్
♦ ఫిబ్రవరి 25లోపు హాజరు కావాలి ♦ అనంతపురం కోర్టు ఆదేశం ♦ ఇందులో వాస్తవం లేదు: లాయర్ అనంతపురం: భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనిపై స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. ఫిబ్రవరి 25లోపు కచ్చితంగా కోర్టులో హాజరు కావాలని, లేకుంటే అరెస్టు తప్పదని హెచ్చరించింది. గతంలోనే హాజరు కావాలని చెప్పినా స్పందించకపోవడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ధోని వన్డే జట్టుతో ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాడు. వన్డే, టి20 సిరీస్ కోసం ఈనెల 12 నుంచి 31 వరకు అక్కడే ఉంటాడు. 2013, ఏప్రిల్‌లో బిజినెస్ టుడే మేగజైన్ కవర్‌పై విష్ణుమూర్తి ఆకారంలో ధోని ముఖచిత్రం ప్రచురితమైంది. దీంట్లో ధోని చేతుల్లో తను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న వస్తువులతో పాటు షూస్‌ను కూడా ఉంచారు. అయితే ఈ ఫొటో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లోనే అనంతపురం జిల్లా విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకుడు వై.శ్యాంసుందర్ కోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్‌పై కొంత కాలంగా విచారణ సాగుతుండగా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని 2014, జూన్‌లో ధోని, మేగజైన్ ఎడిటర్‌కు బెయిలబుల్ వారెంట్స్ జారీ చేసింది. ఎడిటర్ తన తరఫున లాయర్‌ను పంపినా, ధోని నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజా వారెంట్లు జారీ చేసింది. ఆ కథనాలు నిజం కాదు: ధోని లాయర్ ధోనికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం వాస్తవం కాదని అతడి తరఫు లాయర్ రజనీష్ చోప్రా తేల్చి చెప్పారు. ‘న్యాయ వ్యవస్థపై ధోనికి అపార గౌరవం ఉంది. అయితే ఈ కేసు విషయంలో అతడు ఇప్పటిదాకా ఎలాంటి సమన్లు అందుకోలేదు. అలాంటప్పుడు ఈ వారెంట్ జారీ అవడంలో నిజం లేదు. ఇదే అంశంపై బెంగళూరు కోర్టులో కేసుపై సుప్రీం కోర్టు స్టే విధించింది’ అని రితి స్పోర్ట్స్ మేనేజిమెంట్‌తో కలిసి లాయర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ధోని వ్యక్తిగత మేనేజర్ అరుణ్ పాండే కూడా ఈ విషయాన్ని తోసిపుచ్చారు. -
ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు
టీ మిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వాణిజ్య పత్రికలో ఫ్రంట్ పేజి పై ఒక చేత్తో బూటు పట్టుకొని విష్ణు మూర్తి అవతారం లో ఉన్న ధోనీ ఫోటో ముద్రించారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ.. గత ఫిబ్రవరిలో విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాం సుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు ధోనితో పాటు.. పత్రిక ఎడిటర్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తాజాగా.. నవంబర్ 7న ధోనీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని జిల్లా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే వివాదానికి దారితీసిన ఈ పత్రిక 2013 ఏప్రిల్ లో విడుదల అయ్యింది. ఇక మరో వైపు ఇదే ఫోటో పై కర్ణాటకలోని ఓ సంఘ సేవకుడు జయకుమార్ హిరామత్ సైతం కోర్టులో కేసు వేసాడు. -
దిగ్విజయ్ కు వారెంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు వారెంట్ జారీ చేసింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ దిగ్విజయ్‌పై పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి దిగ్విజయ్ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో న్యాయస్థానం ఆయనకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.