ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు | Anantapur court summoned Dhoni | Sakshi

ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు

Oct 5 2015 6:09 PM | Updated on Sep 3 2017 10:29 AM

ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు

ధోనీకి అనంతపురం కోర్టు సమన్లు

టీ మిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది

టీ మిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి అనంతపురం జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. ఓ వాణిజ్య పత్రికలో ఫ్రంట్ పేజి పై ఒక చేత్తో బూటు పట్టుకొని విష్ణు మూర్తి అవతారం లో ఉన్న ధోనీ ఫోటో ముద్రించారు.
 

ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందంటూ.. గత ఫిబ్రవరిలో విశ్వ హిందూ పరిషత్ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాం సుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు స్వీకరించిన కోర్టు ధోనితో పాటు.. పత్రిక ఎడిటర్ కు అరెస్టు వారెంట్ జారీ చేసింది.
 

తాజాగా..  నవంబర్ 7న ధోనీ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని జిల్లా న్యాయమూర్తి ఆదేశించారు. అయితే వివాదానికి దారితీసిన ఈ పత్రిక 2013 ఏప్రిల్ లో విడుదల అయ్యింది.

ఇక మరో వైపు ఇదే ఫోటో పై  కర్ణాటకలోని ఓ సంఘ సేవకుడు జయకుమార్ హిరామత్ సైతం కోర్టులో కేసు వేసాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement