Summons
-
రేపు కేటీఆర్‌కు ఈడీ నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ‘ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్)’ను నమోదు చేసిన ఈడీ అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులకు సమన్లు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఏ–2గా ఉన్న పురపాలకశాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఏ–3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సోమవారం సమన్లు జారీ చేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఏసీబీ నుంచి ఫార్ములా–ఈ కారు రేసు ఒప్పందాలకు సంబంధించి సేకరించిన పత్రాలు, ఎఫ్ఐఆర్తోపాటు బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. హెచ్ఎండీఏ సాధారణ నిధుల నుంచి యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈఓ)’కు రూ.45,71,60,625 సొమ్మును విదేశీ కరెన్సీలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు. దీంతో సదరు బ్యాంకు అధికారుల వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. ఇందుకు సంబంధించి బ్యాంకు అధికారులను సైతం ప్రశ్నించనున్నారు. ఓవైపు ఈ కేసులో ఈడీ అధికారులు వేగం పెంచగా మరోవైపు తెలంగాణ ఏసీబీ సైతం కీలకాంశాలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. కేటీఆర్‌ను ఈ నెల 30 వరకు అరెస్టు చేయొద్దని.. కానీ దర్యాప్తు కొనసాగించుకోవచ్చని హైకోర్టు ఆదేశించడంతో ఆధారాల సేకరణపై ఏసీబీ దృష్టి పెట్టింది. తొలుత హెచ్ఎండీఏ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ వాంగ్మూలం నమోదుతో దర్యాప్తు ప్రక్రియ ప్రారంభించనుంది. ఈడీ, ఏసీబీ దర్యాప్తులో ఏ విషయాలు వెలుగులోకి వస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ సేకరించే పత్రాలు ఈడీకి ఉపయోగపడినట్లే ఈడీ దర్యాప్తులో మనీలాండరింగ్ కోణంలో ఏవైనా ఆధారాలు లభిస్తే ఈ కేసు మరో మలుపు తిరుగుతుందన్న చర్చ నడుస్తోంది. -
అదానీకి యూఎస్ ఎస్ఈసీ సమన్లు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్లకు యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ కమిషన్(యూఎస్ ఎస్ఈసీ) సమన్లు అందజేసినట్లు పీటీఐ తెలిపింది. అయితే విదేశీ పౌరులకు సమన్లు జారీ చేసి వారిని పిలిపించే అధికారం యూఎస్ ఎస్ఈసీకి లేదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.సోలార్ పవర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి అదానీ సహా మరో ఏడుగురు అధికారులు భారత ఉన్నతాధికారులకు లంచం ఇచ్చారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో సదరు అదానీ గ్రూప్ అధికారులపై అమెరికాలో కేసు నమోదైంది. అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు అదానీ గ్రీన్ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టడంతో యూఎస్ ఎస్ఈసీకి ఈమేరకు ఫిర్యాదు అందింది. దాంతో దర్యాప్తు జరిపి అధికారులకు లంచం ఇవ్వజూపారని ప్రాథమికంగా తేల్చారు. ఈ కేసును మరింత సమగ్రంగా విచారిస్తున్నారు.ఇదీ చదవండి: ‘ఆరోగ్య నిధి’ ప్రాధాన్యం తెలుసా?ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లోని అదానీ శాంతివన్ ఫామ్ హౌస్, ఇదే నగరంలోని సాగర్‌కు చెందిన బోదక్దేవ్ నివాసానికి సమన్లు పంపినట్లు సమాచారం. ఈ సమన్లకు 21 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉందని విశ్వసనీయ సమచారం. ఒకవేళ వీటికి స్పందించకపోతే వారికి వ్యతిరేకంగా తీర్పు వెలువడుతుందని అందులో అధికారులు తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు: విచారణకు బీఆర్ఎస్ నేత గైర్హాజరు
హైదరాబాద్,సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. మొదటిసారిగా ఓ రాజకీయ నాయకుడిని పోలీసులు విచారణకు పిలిచారు. తమ ఎదుట హాజరుకావాలంటూ బీఆర్ఎస్ పార్టీ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. అయితే సోమవారం(నవంబర్ 11) లింగయ్య ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన రాలేదు. అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయానని పోలీసులకు కబురందించారు. ఈ నెల 14వ తేదీన విచారణకు హాజరవుతానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న బృందం.. జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం కేంద్రంగా తమ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేసింది. ఇప్పటిదాకా కేవలం పోలీస్ అధికారులు(మాజీ)లనే విచారణ జరిపిన దర్యాప్తు బృందం.. తొలిసారి ఓ రాజకీయ నేతను ప్రశ్నిస్తుండడం గమనార్హం. లింగయ్యనే కాకుండా పలువురు ఇతర నేతలను కూడా ఈకేసులో విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
విచారణకు రావాలి.. సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణం కేసు కర్ణాటకలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. అయితే.. తాజాగా ముఖ్యమంత్రి సిద్దరామయ్యను లోకాయుక్త పోలీసులు విచారణకు పిలిచారు.అందులో భాగంగా ఆయనకు లోకాయుక్త పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక..బుధవారం (నవంబర్ 6) ఉదయం సీఎం సిద్ధరామయ్య తమ ముందు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో కోరినట్లు లోకాయుక్త సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు.. ఈ విషయంపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు.‘‘ముడాకు సంబంధించి మైసూర్ లోకాయుక్త పోలీసులు నోటీసు జారీ చేశారు. నవంబర్ 6న మైసూర్ లోకాయుక్తకు వెళ్లుతా’ అని అన్నారు. ఇక.. ఇదే కేసులో ఇటీవల సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి లోకాయుక్త ప్రశ్నించిన విషయం తెలిసిందే.సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు మల్లికార్జున స్వామి, దేవరాజు స్వామి కొంత భూమి కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో మైసూరులోని లోకాయుక్త పోలీసులు సెప్టెంబర్ 27న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.Haveri: Karnataka CM Siddaramaiah says, "Yes, Mysore Lokayukta has issued a notice regarding MUDA. I will go to Mysore Lokayukta on 6th November." pic.twitter.com/cWNydSusOR— ANI (@ANI) November 4, 2024ఏమిటీ ముడా భూవివాదం?సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ బోర్డ్‌గా 1904లో ఏర్పాటై తదనంతరకాలంలో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా)గా అవతరించిన సంస్థ ఇప్పుడు భూకేటాయింపుల వివాదంలో కేంద్రబిందువుగా నిలిచింది. కెసెరె గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతికి 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది.ఈ గ్రామంలో దేవనార్ 3ఫేజ్ లేఅవుట్ కోసం ముడా ఈ భూమిని సేకరించింది. నష్టపరిహారంగా 2021లో మైసూర్‌లోని విజయనగర మూడో, నాలుగో ఫేజ్ లేఅవుట్లలో 38,284 చదరపు అడుగుల విస్తీర్ణంలో 14 ప్లాట్లను కేటాయించింది. అయితే పార్వతి నుంచి తీసుకున్న భూముల కంటే కేటాయించిన ప్లాట్ల విలువ రూ.45 కోట్లు ఎక్కువ అని ఆర్టీఐ కార్యకర్త అబ్రహాం లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేటాయింపుల అంశం వార్తల్లోకెక్కింది.కెసెరె భూమిని పార్వతికి ఆమె సోదరుడు మల్లిఖార్జున స్వామి 2010 అక్టోబర్‌లో బహుమతిగా ఇచ్చాడు. ప్రభుత్వం సేకరించాక 2014 జూన్‌లో నష్టపరిహారం కోసం పార్వతి దరఖాస్తు చేసుకున్నారు. ప్లాట్ల కేటాయింపుపై సిద్ధూ గతంలోనే స్పష్టతనిచ్చారు.‘‘2014లో నేను సీఎంగా ఉన్నపుడు పరిహారం కోసం దరఖాస్తు చేసుకుంటే సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కష్టమని అధికారులు చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్నపుడు 2021లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే ఈ ప్లాట్లను కేటాయించారు’’ అని సిద్దూ అన్నారు.అయితే గతంలో ముడా 50: 50 పేరిట ఒక పథకాన్ని అమలుచేసింది. నిరుపయోగ భూమి తీసుకుంటే వేరే చోట ‘అభివృద్ధి చేసిన’ స్థలాన్ని కేటాయిస్తారు. ప్రతీ కేటాయింపు ముడా బోర్డు దృష్టికి తేవాలి. అయితే కొందరు ముడా అధికారులతో చేతులు కలిపి, బోర్డు దృష్టికి రాకుండా, పథకంలోని లోపాలను వాడుకుని సిద్ధరామయ్య కుటుంబం ఎక్కువ ప్లాట్లను రాయించుకుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లోపాలున్న పథకాన్ని 2023 అక్టోబర్‌లో రద్దుచేశారు.అయితే తన భూమికి ఎక్కువ విలువ ఉంటుందని రూ.62 కోట్ల నష్టపరిహారం కావాలని సిద్ధరామయ్య ఈఏడాది జూలై నాలుగున డిమాండ్ చేయడం విశేషం. అయితే అసలు ఈ భూమి పార్వతి సోదరుడు మల్లికార్జున స్వామిది కాదని, అక్రమంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి 2004లో తన పేరిట రాయించుకున్నాడని ఆరోపణలున్నాయి. -
జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆర్జేడీ అధ్యక్షుడు, మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ఇద్దరు కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఇతరులకు ఢిల్లీ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్(ఉద్యోగ కుంభకోణం) కేసులో అక్టోబర్ 7న తమ ఎదుట హాజరుకావాలని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ విశాల్ గోగ్నే ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ కేసులో నిందితుడిగా లేనటువంటి లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమేయాన్ని తోసిపుచ్చలేమని ఈ సందర్భంగా కోర్టు పేర్కొంది.నిందితులపై దాఖలైన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ ఆదేశాలు జారీ చేశారు.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలకాగా 2004 నుంచి 2009 వరకు లాలూ ప్రసాద్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులకు భూమి బదాయింపునకు బదులుగా ఎలాంటి ప్రకటన విడుదల చేయకుండా కొందరు వ్యక్తులకు పలు రైల్వే జోన్లలో ఉద్యోగాలు ఇచ్చినట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేస్తుంది.ఈ కేసులో లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి ఢిల్లీ కోర్టు మార్చి 2023లో బెయిల్ మంజూరు చేసింది. ఇక లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు, 38 మంది అభ్యర్థులతో సహా 77 మందిపై సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను జూన్‌లో సీబీఐ దాఖలు చేసింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ కూడా ఆగస్ట్ 6న తుది నివేదికను కోర్టుకు సమర్పించింది. -
కోల్‌కతా డాక్టర్ కేసు: ఇద్దరు డాక్టర్లు, బీజేపీ నేతకు నోటీసులు
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్దఎత్తున నిసన తెలియజేస్తున్నారు. అయితే మరోవైపు.. హత్యాచార ఘటనప తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది. తాజాగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలపై కోల్‌కతా పోలీసులు ఆదివారం ఇద్దరు ప్రముఖ వైద్యులు, సీనియర్ బీజేపీ నాయకురాలు లాకెట్ ఛటర్జీకి నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలలోపు లాల్‌బజార్‌లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో డాక్టర్ కునాల్ సర్కార్, డాక్టర్ సుబర్ణ గోస్వామి, బీజేపీ నేత లాకెట్ ఛటర్జీ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.హత్యాచారం కేసు దర్యాప్తు, పోస్ట్‌మార్టం నివేదికకు సంబంధించి డాక్టర్ సర్కార్, డాక్టర్ గోస్వామి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ సుబర్ణ గోస్వామి.. ఈ ఘటను సామూహిక అత్యాచారమని పేర్కొన్నారు. 150 మిల్లీగ్రాముల వీర్యం, శరీరంలో పలు ఎముకలు విరిగిపోయినట్లు పోస్ట్‌మార్టం నివేదిక తెలిజేస్తోందని ఆయన మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. హత్యాచార బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేశారనే ఆరోపణలపై బీజేపీ మాజీ ఎంపీ, లాకెట్ ఛటర్జీపై కోల్‌కతా పోలీసులు ఆరోపణలు చేశారు. బాధితురాలి పేరు, చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు పోలీసులు ఆమెను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. పోలీసులు చేసిన నోటీసులపై లాకెట్ ఛటర్జీ స్పందించారు. ‘కోల్‌కతా పోలీసులు బాధితురాలికి న్యాయం చేయడం కంటే సోషల్ మీడియా పోస్ట్‌లను చూడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు’అని ఆరోపించారు.ఇక.. ఇప్పటికే జూనియర్ డాక్టర్‌పై వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారాన్ని కోల్‌కతా పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు. -
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం(పోక్సో) కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప(81)పై బెంగళూరు కోర్టు గురువారం నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ, యడ్యూరప్ప హాజరు కాకపోవడంతో సీఐడీ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, తిరిగివచి్చన తర్వాత సీఐడీ ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐసీసీ సెక్షన్ 354 కింద ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే కర్ణాటక డీజీపీ ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తనపై వచి్చన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు అంతకుముందే రికార్డు చేశారు. పోక్సో కేసులో యడ్యూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు. దీనిపై సీఐడీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. -
స్వాతి మాలీవాల్ ఎపిసోడ్: బిభవ్ కుమార్‌కు ఎన్డబ్ల్యూసీ సమన్లు
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన ఆరోపణలను ఆ పార్టీ సీనియర్ ఎంపీ సంజయ్ సింగ్ నిజమేనని ధృవీకరించారు. దీంతో ఈ వ్యవహారంపై గురువారం జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్కుమార్కు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరై.. స్వాతి మాలీవాల్‌పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సమన్లలో ర్కొంది. ఈ నోటీసులను జాతీయ మహిళా కమిషన్.. సీఎం కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించటం గమనార్హం.సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ తనపై తీవ్రంగా దాడి చేశారని ఎంపీ స్వాతిమాలీవాల్ సోషల్ మీడియా పోస్ట్ చేసింది. అయితే ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా సుమోటోగా తీసుకున్నామని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తనపై దాడి జరిగినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్ సోమవారం బయటపెట్టారు. ఈ ఘటనపై బీజేపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
బెంగళూరు: రిజర్వేషన్లపై సోషల్ మీడియలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యాకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో తమ ముందు విచారణకు హాజరవ్వాలని సమన్లలో కోరారు. కాగా, ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వగా ఆయన తన రాతపూర్వక సమాధానాన్ని న్యాయవాది ద్వారా పంపారు. -
లిక్కర్ కేసు.. ‘ఆప్’ మరో కీలక నేతకు ‘ఈడీ’ సమన్లు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసు ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)ని నీడలా వెంటాడుతోంది. ఏకంగా ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు తగ్గించడం లేదు. ఇదే కేసులో ఈడీ తాజాగా ఆప్ ఎమ్మెల్యే, గోవా ఆప్ ఇంఛార్జ్ దుర్గేష్ పాఠక్‌కు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం తమ ముందు విచారణకు హాజరు కావాలని కోరింది. దుర్గేష్ పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపడం ఇది రెండవసారి. 2022లో కూడా ఇదే కేసు విషయమై పాఠక్‌కు ఈడీ నోటీసులు పంపింది. అప్పట్లో లిక్కర్ కేసు నిందితుడు ఆప్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ విజయ్‌నాయర్ ముంబై ఇంట్లో ఈడీ సోదాలు జరిపినపుడు పాఠక్ అక్కడే ఉన్నట్లు సమాచారం. దీంతో విజయ్‌నాయర్‌తో ఉన్న సంబంధాలు, డిజిటల్ ఆధారాలపై పాఠక్‌ను ప్రశ్నించడానికే ఈడీ తాజాగా సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. కవితకు దక్కని ఊరట -
Delhi liquor scam: అమెరికా జోక్యంపై అభ్యంతరం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై అమెరికా వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ఇది దేశ అంతర్గత, సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని స్పష్టంచేసింది. బుధవారం ఢిల్లీలో అమెరికా దౌత్యవేత్తను పిలిపించి తన అసంతృప్తిని తెలియజేసింది. భారత్‌లో అమెరికా మహిళా దౌత్యవేత్త, యాక్టింగ్ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బేనాకు సమన్లు జారీచేసింది. దీంతో బుధవారం ఆమె ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌లో విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. విదేశాంగ శాఖ అధికారులతో దాదాపు 30 నిమిషాలు సమావేశమయ్యారు. ‘స్వేచ్ఛగా, పారదర్శకంగా, వేగవంతంగా, చట్టపరంగా న్యాయం పొందే అర్హత సీఎం కేజ్రీవాల్‌కు ఉంది’ అని మంగళవారం అమెరికా ఉన్నతాధికారి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. భారత న్యాయప్రక్రియపై అమెరికా వ్యాఖ్యలను తప్పుబడుతూ భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘దౌత్య సంబంధాలకు సంబంధించి దేశాలు తోటి దేశాల సార్వభౌమత్వం, అంతర్గత వ్యవహారాలకు గౌరవం ఇవ్వాలి. తోటి ప్రజాస్వామ్య దేశాల పట్ల ఇదే బాధ్యతతో మెలగాలి. బాధ్యత విస్మరిస్తే బాగుండదు. భారత్‌లో న్యాయవ్యవస్థ స్వతంత్రమైంది. సత్వర న్యాయమే దాని అంతిమ లక్ష్యం. దానిపై ఇతరుల అభిప్రాయాలు అవాంఛనీయం’’ అని ఆ ప్రకటనలో భారత్ తన అసంతృప్తిని తెలిపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై వ్యాఖ్యలు చేసిన జర్మనీ దౌత్యవేత్త, డెప్యూటీ చీఫ్ మిషన్‌కు ఇటీవల భారత్ సమన్లు జారీచేసిన నేపథ్యంలో మళ్లీ అలాంటి ఘటనే జరగడం గమనార్హం. -
కేజ్రీవాల్‌పై స్పందన.. అమెరికా దౌత్యవేత్తకు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై అమెరికా విదేశాంగ శాఖ చేసిన వ్యాఖ్యలకు భారత్.. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు పంపింది. బుధవారం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను.. భారత విదేశి వ్యవహారాల కార్యాలయానికి పిలిపించుకొని సుమారు 40 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అరెస్ట్‌పై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను ఆమెరికా ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సాహిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి చెప్పారు. ‘ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నాం’ అని సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అంతకు ముందు కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన కూడా దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది జర్మనీ. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ దేశ రాయబారికి కూడా సమన్లు పంపిన విషయం తెలిసిందే. -
Delhi Jal Board case: జలమండలి కేసులోనూ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ గైర్హాజరుల పర్వం ఢిల్లీ జలమండలి కేసులోనూ పునరావృతమైంది. మద్యం అవకతవకల కేసులో కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పలుమార్లు సమన్లు జారీచేయడం ఆయన గైర్హాజరవడం తెల్సిందే. తాజాగా ఢిల్లీ జల్‌బోర్డ్‌లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ విచారణ కోసం సోమవారం తమ ఎదుట హాజరుకావాలని ఇప్పటికే సమన్లు జారీచేయగా కేజ్రీవాల్ ఈడీ ఆఫీస్‌కు రాలేదు. తనకు సమన్లు పంపడం చట్టవ్యతిరేకమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మనీ లాండరింగ్ సంబంధించిన సమన్లు అందుకున్న రెండో కేసు ఇది. మద్యం ఎక్సయిజ్ కేసులో ఇప్పటికే ఎనిమిది సార్లు సమన్లు అందుకోవడం, ప్రతిసారీ ఆఫీస్‌కు రాకుండా మిన్నకుండిపోవడం తెల్సిందే. మద్యం కేసులో విచారణ నిమిత్తం మార్చి 21వ తేదీన తమ ఆఫీస్‌కు రావాలని ఈడీ తాజాగా ఆయనకు తొమ్మిదోసారి సమన్లు జారీ చేయడం గమనార్హం. -
Kejriwal: ఈడీ విచారణకు మరోసారి డుమ్మా
న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డు స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. ఇప్పటికే లిక్కర్ కేసులో సమన్లకు స్పందించని కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చిందని, అయినా ఈడీ మళ్లీ ఎందుకు సమన్లు పంపిందో తెలియడం లేదని ఆప్ నేతలు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్ధమని ఆప్ నేతలు పేర్కొన్నారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో సోమవారం(మార్చ్ 18) తమ ముందు హాజరవ్వాలని ఆదివారం ఈడీ కేజ్రీవాల్‌కు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అంతకుముందు లిక్కర్ కేసులో ఈడీ వరుస సమన్లకు స్పందించని కేసులో ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు శనివారం కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి.. లిక్కర్ కేసు.. నేడు కవిత భర్త విచారణ -
‘ఈడీ’ ట్విస్ట్.. కేజ్రీవాల్‌కు ఒకేరోజు రెండు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్(ఈడీ) నీడలా వెంటాడుతోంది. ఆదివారం ఒకే రోజు కేజ్రీవాల్‌కు రెండు కేసుల్లో ఈడీ సమన్లు పంపడం కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో తొమ్మిదోసారి సమన్లు జారీ చేయగా ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలని మరో సమన్లు పంపింది. లిక్కర్ కేసులో మార్చ్ 21 విచారణకు పిలవగా, జల్ బోర్డు కేసులో 18న రావాలని ఈడీ కోరింది. కాగా, లిక్కర్ కేసులో విచారణ కోసం గతంలో ఈడీ పంపిన ఎనిమిది సమన్లకు కేజ్రీవాల్ స్పందించలేదు. విచారణకు హాజరవలేదు. దీంతో ఈడీ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌పై ఫిర్యాదు కూడా చేసింది. అయితే సమన్లకు స్పందించని కేసులో కేజ్రీవాల్‌కు శనివారమే(మార్చ్ 16) కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో బెయిల్ తీసుకున్న మరుసటి రోజే లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ మళ్లీ సమన్లు పంపడం గమనార్హం. ఇదీ చదవండి.. ఈడీ కస్టడీలో కవిత -
నేడు అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ
న్యూఢిల్లీ/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆయనకు సమన్లు జారీచేసింది. సాక్షిగా హాజరైతే వాంగ్మూలం నమోదుచేసుకుంటామని ఆ సమన్లతో పేర్కొంది. ఈ–టెండర్ ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించారని, ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్ లీజుల కేటాయింపుల్లో పాలుపంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్ హైకోర్టు గతంలో ఆదేశించింది. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న 2012–16కాలంలోనే జాతీయ హరిత ట్రిబ్యూనల్ నిషేధించినా ఈ అక్రమ మైనింగ్‌కు తెరలేపారని సీబీఐ పేర్కొంది. 2019లో నమోదైన కేసులో భాగంగా అఖిలేశ్‌కు సమన్లు పంపామని, ఆయన ఈ కేసులో నిందితుడు కాదని, సాక్షి మాత్రమేనని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీబీఐ సమన్లపై అఖిలేశ్ స్పందించారు. ‘‘ఎన్నికలొచి్చనప్పుడల్లా నాకు నోటీసులొస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల వేళా ఇలాగే జరిగింది. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది మా పారీ్టనే. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎంతో అభివృద్ధిచేశామని చెబుతుంటారు. అలాంటపుడు సమాజ్‌వాదీ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత కంగారు?. యూపీలో ఎక్స్‌ప్రెస్‌వేపై హెర్క్యులెస్ రకం విమానంలో మోదీ దిగారు. కానీ ఆ ఎక్స్‌ప్రెస్‌వేలను కట్టింది ఎస్పీ సర్కార్. అలాంటి జాతీయ రహదారులను మీరు వేరే రాష్ట్రాల్లో ఎందుకు కట్టలేకపోయారు?’’ అంటూ బీజేపీపై అఖిలేశ్ నిప్పులు చెరిగారు. ఏమిటీ కేసులు? హమీర్పూర్ జిల్లా గనుల్లో తక్కువ విలువైన ఖనిజాలను లీజుకిచ్చి లీజు హక్కుదారుల నుంచి ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఏడు కేసులు నమోదుచేసింది. 2012–17లో అఖిలేశ్ సీఎంగా ఉంటూనే 2012–13లో గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. అప్పుడే 2013 ఫిబ్రవరి 17న ఒకేరోజు 13 ప్రాజెక్టులకు సీఎం ఈ–టెండర్లను పక్కనబెట్టి పచ్చజెండా ఊపారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుల్లో నాటి హమీర్పూర్ జిల్లా మేజి్రస్టేట్, ఐఏఎస్ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్‌కుమార్ సహా 11 మందిపై సీబీఐ కేసులు వేసింది. -
రాహుల్‌కు త్వరలో అస్సాం సీఐడీ సమన్లు !
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు పంపనున్నట్లు సమాచారం. గత నెలలో గువహతిలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై రాహుల్‌ను అస్సాం సీఐడీ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రాహుల్‌గాంధీతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కేసి వేణుగోపాల్, జైరామ్ రమేష్, శ్రీనివాస్ బివి, కన్నయ్యకుమార్, గౌరవ్ గొగొయ్ తదితరుల పేర్లను పోలీసులు చేర్చారు. కాగా, గత నెలలో అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాజధాని గువహతిలో యాత్ర ప్రవేశిస్తే అరెస్టు చేస్తామని సీఎం హిమంత బిశ్వశర్మ వార్నింగ్ ఇచ్చారు. అయినా రాహుల్‌గాంధీ వెంట ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గువహతి శివార్లలో ఏర్పాటు చేసిన బారికేడ్లను బద్దలు కొట్టి పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు కాంగ్రెస్ నాయకులపై స్వల్ప లాఠీఛార్జ్ కూడా చేశారు. బారికేడ్లను బద్దలు కొట్టినప్పటికీ యాత్ర గువహతిలోకి ప్రవేశించకుండా జాతీయ రహదారి(ఎన్‌హెచ్-27) మీద నుంచి వెళ్లిపోయింది. తాము బారికేడ్లను బద్దలు కొడతాం కాని నిబంధనలను ఉల్లంఘించమని రాహుల్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై సీఎం హిమంత స్పందించారు. తాము రాహుల్ గాంధీని ఈ కేసులో లోక్‌సభ ఎన్నికల తర్వాత అరెస్టు చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయం చేయదలుచుకోలేదన్నారు. హోం మంత్రి కూడా తానే అయిన సీఎం హిమంత ఈ కేసు విచారణను సీఐడీకి అప్పగించారు. ఇదీ చదవండి.. కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. మళ్లీ మొదటికి -
కేజ్రీవాల్ సర్కారు విశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా గైర్హాజరవడంతో శనివారం తమ ముందు హాజరుకావాలని సిటీ కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగడం గమనార్హం. విశ్వాస తీర్మానంపై శనివారం సభలో చర్చించనున్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్షకు సిద్ధపడటం ఇది రెండోసారి. ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయడమే ఇందుకు కారణం. శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన బలపరీక్షకు దిగారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 17న హాజరు కావాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఐదుసార్లు సమన్లు జారీ చేయగా.. ఆయన డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కోర్టును ఆశ్రయించింది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ నిమిత్తం ఈడీ ఎన్నిసార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ విచారణకు హాజరవడం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై బుధవారం విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు.. ఈ నెల 17న కేజ్రీవాల్ హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇక.. తనకు పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవంటూ తొలి నుంచి అరవిండ్ కేజ్రీవాల్ విచారణకు హజరు కావడం లేదు. ఇది రాజకీయ ప్రతీకార చర్యగా.. ఢిల్లీ ప్రభుత్వానికి కూలదోసేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న యత్నంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ విచారణకు ప్రతిగా.. పార్టీ కార్యక్రమాలకు, వ్యక్తిగత కార్యక్రమాలకు కేజ్రీవాల్ హజరవుతూ వచ్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కేజ్రీవాల్‌కు కిందటి ఏడాది నవంబర్ 2వ తేదీన తొలిసారి సమన్లు పంపింది ఈడీ. అప్పటి నుంచి సమన్లు పంపిన ప్రతీసారి(నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 19, ఫిబ్రవరి 2) ఆయన అరెస్ట్ అవుతారంటూ చర్చ తీవ్రంగా నడిచింది. చదవండి: యూసీసీపై ఎంఐఎం చీఫ్ కీలక వ్యాఖ్యలు -
కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ సమన్లు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీచేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇవాళ ఈడీ ఐదోసారీ సమన్లు ఇచ్చింది. ఇప్పటివరకూ ఆయన ఈడీ ఎదుట విచారణకు హాజరుకాని విషయం తెలిసిందే. లిక్కర్ కేసులో మొదటిసారి ఆయన నవంబర్ 2వ తేదీన సమన్లు ఇచ్చింది ఈడీ. ఆపై డిసెంబర్ 21న రెండోసారి, జనవరి 3వ తేదీన మూడోసారి, జనవరి 13వ తేదీన నాలుగోసారి సమన్లు జారీ చేసింది. అయితే పార్టీ వ్యవహారాల పేరిట ఆయన విచారణకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. తాజాగా ఐదోసారి నేడు జారీ చేసిన సమన్లలో ఫిబ్రవరి 2వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ కోరింది. ఈసారి గనుక ఆయన హాజరు కాకుంటే.. అరెస్ట్ వారెంట్ కోసం ఈడీ కోర్టును ఆశ్రయించవచ్చు. మరోవైపు తొలి నుంచి ఆయన ఈడీ నోటీసులను బీజేపీ ప్రతీకార రాజకీయ చర్యగా.. సార్వత్రిక ఎన్నికల ముందు జరుపుతున్న కుట్రగా అభివర్ణిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో ప్రతీకార రాజకీయాలాంటిదేం లేదని.. మాత్రం దర్యాప్తు సంస్థలు స్వేచ్ఛగా తమ పని తాము చేసుకుంటున్నాయని బీజేపీ చెబుతోంది. -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్‌లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్‌ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
సోరెన్‌కు ఈడీ మళ్లీ సమన్లు
రాంచీ: భూ మాఫియాకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌కు సమన్లు జారీ చేసింది. వచ్చే వారంలో 29 లేదా 31వ తేదీల్లో ఎప్పుడు వీలైతే అప్పుడు విచారణకు రావాలంటూ అందులో కోరింది. తేదీని ఖరారు చేయాలని అందులో స్పష్టం చేసింది. అంతకుముందు, ఈడీ అధికారులు ఈ నెల 27 లేదా 31వ తేదీల్లో ఏదో ఒక రోజు విచారణకు రావాల్సి ఉందంటూ సీఎం సోరెన్‌ను కోరగా ఆయన స్పదించలేదు. దీంతో, తాజాగా మరోసారి ఆయనకు సమన్లు ఇచ్చారు. -
మహువా అవినీతి కేసు: జై అనంత్ దేహద్రాయ్కు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: టీఎంసీ నేత, బహిష్కృత లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా అనివీతి కేసులో వాదనలు వినిపిస్తున్న సుప్రీం కోర్టు లాయర్ జై అనంత్ దేహద్రాయ్కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంగళవారం సమన్లు జారీ చేసింది. మహువా అవినీతి కేసుకు సంబంధించి గురువారం విచారణకు హాజరు కావాలని సీబీఐ పేర్కొంది. పార్లమెంట్లో అడిగే ప్రశ్నలకు డబ్బులు తీసుకున్న కేసులో మహువా డిసెంబర్లో లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. కేంద్రం, అదానీ సంస్థలపై విమర్శలు చేయడానికి మహువా.. వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీతో ఒప్పదం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంట్లో పెద్ద చర్చ కూడా జరిగింది. చివరకు ఎథిక్స్ కమిటీ నిర్ణయం మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. మహువా మొయిత్రా లోక్‌సభ నుంచి బహిష్కరించారు. ఎంపీ హోదాలో ఆమెకు కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ (DEO) కూడా ఇటీవలే నోటీసులు పంపింది. అయితే తనకు ఆ బంగ్లాను కొనసాగించాలని మహువా కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఆమె ఎదురుదెబ్బ తగలటంతో తన కేటాయించిన బంగ్లాను ఖాళీ చేశారు. చదవండి: రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత -
సీఎం కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ED) తాజాగా నాలుగోసారి సమన్లు జారీ చేసింది. జనవరి 18 విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లలో పేర్కొంది. జనవరి 3న మూడోసారి ఈడీ ఇచ్చిన సమన్ల విచారణకు సీఎం కేజ్రీవాల్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈడీ పంపిన సమన్లు చట్టపరమైనవి కావని, కేవలం తనను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా జారీ చేసినవి కేజ్రీవాల్ మండిపడ్డ విషయం తెలిసిందే. ఇక గతంలో ఈడీ నవంబర్2, డిసెంబర్ 21న సీఎం కేజ్రీవాల్‌కు.. రెండుసార్లు సమన్లు పంపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 2023 ఫిబ్రవరి నుంచి జైల్లోనే ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌ను అక్టోబర్‌లో ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఈసారైనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ సమన్లకు స్పందించి విచారణ వెళ్లుతారో? లేదో? అని ఆప్ పార్టీలో చర్చజరుగుతోంది. చదవండి: తిరస్కరణ సీఎంను కాదు.. మాజీ సీఎంను: శివరాజ్ సింగ్ చౌహన్ -
అశ్లీల కంటెంట్... యూట్యూబ్‌కు సమన్లు
ఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ యూట్యూబ్ భారత్ విభాగానికి నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సమన్లు జారీ చేసింది. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన కంటెంట్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అటువంటి ఛానెల్‌ల జాబితాతో జనవరి 15న తమ ముందు హాజరు కావాలని యూట్యూబ్ సంస్థ భారత్ విభాగ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ హెడ్‌ని కోరింది. ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో ఈ మేరకు భారతదేశంలోని యూట్యూబ్ ప్రభుత్వ వ్యవహారాలు, పబ్లిక్ పాలసీ అధిపతి మీరా చాట్‌కు లేఖ రాశారు. తల్లులు, కొడుకులకు సంబంధించిన అసభ్యకరమైన చర్యలను చిత్రీకరించే యూట్యూబ్ ఛానెల్‌లలో ఆందోళనకరమైన ధోరణిని కమిషన్ గుర్తించిందని ప్రియాంక కనూంగో అన్నారు. ‘వీడియోలలో’ తల్లులు, కొడుకుల మధ్య అసభ్యకరమైన చర్యలు, తల్లులు, యుక్తవయస్సులో ఉన్న కొడుకుల మధ్య ముద్దులు వంటివి ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. ఈ వీడియోలు లైంగిక నేరాల నుంచి పిల్లలను రక్షించే (పోక్సో) చట్టం- 2012ను ఉల్లంఘిస్తున్నాయి.' అని కమిషన్ గుర్తించిందని తెలిపారు. “యూట్యూబ్ దీన్ని పరిష్కరించాలి. నేరస్థులు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి వీడియోలను కమర్షియల్‌గా మార్చడం అంటే పోర్న్ అమ్మడం లాంటిది. పిల్లలు లైంగిక వేధింపులకు గురైన వీడియోలను ప్రదర్శించే ఏదైనా ప్లాట్‌ఫామ్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది.”అని ఎన్సీపీసీఆర్ చీఫ్ ప్రియాంక్ కనూంగో తెలిపారు. ఇదీ చదవండి: అతిపెద్ద సముద్ర వంతెన.. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం