బనశంకరి: నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ఆయన సోదరుడు, బెంగళూరు రూరల్ ఎంపీ డీకే సురేశ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆదివారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 7వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు పిలిచారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనుగోలు చేసిన యంగ్ ఇండియా ట్రస్ట్‌కు డీకే సోదరులు చెక్ ఇచ్చినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈడీ సమన్లపై శివకుమార్ స్పందించారు. ఈడీకి తనపై చాలా ప్రేమ ఉందని, అందుకే పదేపదే సమన్లు పంపిస్తోందని అన్నారు. ఈ నెల 7వ తేదీన రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో తాను తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉందని, విచారణకు హాజరు కావడానికి మరో గడువు ఇవ్వాలని కోరుతూ ఈడీకి మెయిల్ చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment