money laundering case
-
ఆప్ నేత సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట.. రెండేళ్లకు బెయిల్
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆప్ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మాజీ మంత్రి అయిన సత్యేందర్ జైన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. కాగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద నమోదైన కేసులో ఆయన దాదాపు 18 నెల జైలులో ఉన్నారు.బెయిల్ మంజూరు సందర్భంగా.. హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పీఎంఎల్ఏ వంటి కఠినమైన కేసుల్లో వ్యక్తిగత స్వేచ్ఛ ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. విచారణలో జాప్యాన్ని ఎత్తిచూపుతూ.. సత్యేందర్ జైన్ సుధీర్ఘ కాలం నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. ఈమేరకు ఆప్ నేత మనీష్ సిసోడియా కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. సత్వర విచారణ అనేది ప్రాథమిక హక్కుగా తెలిపింది. ట్రయల్ ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం పడుతుందన్న న్యాయస్థానం వీలైనంత త్వరగా కేసును ముగించాలని దర్యాప్తు సంస్థకు సూచించింది.కాగా జైన్‌ను రెండేళ్ల కిత్రం మే 2022లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. అయితే ఆరోగ్య కారణాలతో వైద్య కారణాలతో 2023 మేలో సుప్రీంకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఈ ఏడాది మార్చిలో సాధారణ బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో జైన్ ఢిల్లీలోని తీహార్ జైలుకు తిరిగి వచ్చారు.ఇటీవల కాలంలో వివిధ కేసుల్లో బెయిల్ పొందిన మూడో ఆప్ నేత సత్యేందర్ జైన్. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు గత నెలలో బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. ఇక ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఆగస్టులో బెయిల్ లభించింది. -
మనీలాండరింగ్ కేసులో తమన్నా?
-
Tamannaah Bhatia: తమన్నాను ప్రశ్నించిన ఈడీ
గువాహటి: బిట్కాయిన్లు, ఇతర క్రిప్టోకరెన్సీలను సంపాదించవచ్చని హెచ్పీజెడ్ టోకెన్ యాప్‌లో చేసిన ప్రకటనకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి తమన్నా భాటియాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం ప్రశ్నించారు. యాప్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకే తమన్నాను ప్రశ్నించారని, ఆమెపై ఎలాంటి నేరసంబంధ కేసు నమోదుకాలేదని సంబంధిత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యాప్ ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న కేసులో ఇప్పటిదాకా 299 సంస్థలను నిందితుల జాబితాలో చేర్చారు. వీటిలో 76 సంస్థలు చైనా అధీనంలో నడుస్తున్నాయి. వాటిలో పది మంది డైరెక్టర్లు చైనా జాతీయులుకాగా రెండు సంస్థలను విదేశీయులు నడిపిస్తున్నారు. బిట్కాయిన్లు, క్రిప్టో కరెన్సీల మైనింగ్ ద్వారా ఊహించని లాభాలు గడించవచ్చని ఆశపెట్టి కోట్లు దండుకున్నారని యాప్‌పై కోహిమా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు. ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, బిట్‌కాయిన్ మైనింగ్ కోసం పెట్టుబడులు పెడితే భారీ లాభాలు కళ్లజూస్తారని ప్రచారం చేయడంతో ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు. రూ.57వేల పెట్టుబడికి మూడు నెలలపాటు ప్రతిరోజూ రూ.4,000 ఇస్తామని చెప్పి కేవలం ఒకే ఒక్కసారి ఇచ్చి మానేశారని బాధితులు ఆరోపించారు. దీంతో దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఈడీ ఏకంగా రూ.455 కోట్ల విలువైన స్థిర,చరాస్థులను జప్తుచేసింది. అసలు డైరెక్టర్లు లేకపోయినా డొల్ల కంపెనీలు సృష్టించి వాటి పేరు మీద బ్యాంక్ ఖాతాలు, మర్చెంట్ ఐడీలు తీసుకున్నారని తేలింది. -
త్వరలోనే భారత్‌కు ‘మహదేవ్ యాప్’ సూత్రధారి
న్యూఢిల్లీ: మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రధాన ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రశేఖర్‌ను త్వరలో భారత్‌కు రప్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీ లాండరింగ్, మోసం కేసులో ఈడీ వినతి మేరకు ఇంటర్‌పోల్ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఇటీవల దుబాయ్ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. ఈడీ వర్గాల వినతి మేరకు చంద్రశేఖర్‌తోపాటు ఈ యాప్ మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌ను కూడా దుబాయ్ అధికారులు అదుపులోకి తీసుకుని, గృహ నిర్బంధంలో ఉంచారు. మరికొద్ది రోజుల్లో చంద్రశేఖర్ భారత్‌కు వస్తాడని ఆ వర్గాలు వివరించాయి. చంద్రశేఖర్ 2019లో దుబాయ్ పారిపోయేందుకు ముందు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ జిల్లా భిలాయ్‌లో సోదరుడితో కలిసి జ్యూస్ షాపు నిర్వహించేవాడు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌తో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన పలువురు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు, అధికారులతో సంబంధాలున్నట్లు ఈడీ ఆరోపిస్తోంది. రూ.6 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలకు సంబంధించిన ఈ కేసులో ఇప్పటి వరకు 11మందిని అరెస్ట్ చేసింది. -
సిద్ధూపై ఈడీ కేసు
న్యూఢిల్లీ/బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని లోకాయుక్త నమోదు చేసిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) ఆధారంగా ఈ చర్యకు దిగింది. సిద్ధరామయ్య, భార్య పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి తదితరులపై కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు నమోదు చేసింది. పార్వతి నుంచి 3.16 ఎకరాలను సేకరించిన ముడా ప్రతిగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో ఆమెకు 14 ప్లాట్లను కేటాయించింది. దీంట్లో అవినీతి, అధికార దురి్వనియోగం జరిగినట్టు ఆరోపణలున్నాయి. ఈ కేసులో సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ థావర్‌చంద్ గెçహ్లాట్ అనుమతి మంజూరు చేశారు. దీన్ని సిద్ధూ హైకోర్టులో సవాల్ చేసినా చుక్కెదురైంది. అనంతరం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాని ఆధారంగా సిద్ధరామయ్య తదితరులపై ఈడీ సోమవారం కేసు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ ఆయనకు సమన్లు జారీ చేసే వీలుంది. అలాగే ఆస్తులను కూడా అటాచ్ చేయవచ్చు. 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తా ముడా కమిషనర్‌కు పార్వతి లేఖ మైసూరు: భూపరిహారంగా ముడా తనకు కేటాయించిన 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేందుకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి ముందుకు వచ్చారు. ఈ మేరకు ముడా కమిషనర్‌కు సోమవారం ఆమె లేఖ రాశారు. మైసూరు కేసరే గ్రామంలో తనకు చెందిన 3.16 ఎకరాల భూమిని ముడా తీసుకొని.. విజయనగర లేఔట్ ఫేజ్–3, ఫేజ్–4లో తనకు 14 ప్లాట్లను కేటాయించిందని ఆమె వివరించారు. ‘సేల్ డీడ్‌ను రద్దు చేయడం ద్వారా నేనీ 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ముడా ఈ ప్లాట్లను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ దిశగా సాధ్యమైనంత త్వరగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పార్వతి ముడా కమిషనర్‌ను కోరారు. ముడా కేటాయింపుల్లో సిద్ధరామయ్యపై దర్యాప్తునకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, లోకాయుక్త పోలీసుల కేసు నమోదు, తాజాగా సోమవారం ఈడీ కేసు నమోదు నేపథ్యంలో.. ప్లాట్లను తిరిగి ఇచ్చేయాలని పార్వతి నిర్ణయం తీసుకున్నారు. -
సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్
న్యూఢిల్లీ: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన మీద మనీలాండరింగ్ కేసులో (PMLA) కింద కేసు నమోదు చేసింది.ముడా కుంభకోణం కేసులో విచారణ జరిపిన లోకాయుక్త పోలీసులు.. సిద్ధరామయ్య, ఆయన భార్య బీఎం పార్వతి, బావమరిది మల్లికార్జున స్వామి, దేవరాజుల నుంచి భూమి కొనుగోలు చేసి సీఎం భార్యకు కానుకగా ఇచ్చారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా.. సెంట్రల్ ఏజెన్సీ సిద్ధరామయ్యతో పాటు మరికొందరిపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR) ద్వారా కేసు నమోదు చేసింది. తద్వారా.. నిందితులను విచారణకు పిలిచేందుకు, విచారణ సమయంలో వారి ఆస్తులను కూడా అటాచ్ చేయడానికి EDకి అధికారం దక్కినట్లయ్యింది.ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబం లబ్ధి పొందిందని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని సామాజిక కార్యకర్త టీజే అబ్రహం, కర్ణాటక గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అబ్రహంతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రతీప్ కుమార్ కూడా సీఎంపై ఫిర్యాదు చేశారు. దీంతో ముఖ్యమంత్రిని విచారించాలని గవర్నర్ ఆదేశించారు. అయితే మరోవైపు ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానం చేసింది. దానిని గవర్నర్ తోసిపుచ్చగా విషయం న్యాయస్థానానికి చేరుకుంది. అయితే కోర్టులో సిద్ధరామయ్యకు చుక్కెదురైంది. ఆయన్ని విచారించేందుకు గవర్నర్ ఆదేశించడం చట్టబద్ధమేనని వ్యాఖ్యానించింది. లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. తర్వాత సిద్ధరామయ్యపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇప్పుడు ఈ కేసులో మనీలాండరింగ్ అంశంపై ఈడీ కూడా కేసు నమోదు చేయడంతో ఆయనకు మరిన్ని కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. -
మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలు సోదా లు జరిపాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం 5:30 గంటల నుంచి జూబ్లీహిల్స్‌లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో మొత్తం 15 ఈడీ అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.విదేశాల నుంచి ఖరీదైన వాచీల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 28న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కస్టమ్స్, డీఆర్ఐ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల రక్షణలో సోదాలు కొనసాగాయి. పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహా పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్ధికలావాదేవీలపైన ఆరా తీసినట్టు సమాచారం. కేసు వివరాలివీ..: హాంగ్‌కాంగ్‌లో నివాసముండే మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన రెండు లగ్జరీ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్‌ను కస్టమ్స్ అధికారులు విచారించగా, మధ్యవర్తి నవీన్‌కుమార్ పేరు వెల్లడించాడు. ఈ క్రమంలో నవీన్‌కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి ముబీన్ నుంచి దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే ఏడు లగ్జరీ వాచ్‌లను కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై సమాధానం ఇవ్వాలని కస్టమ్స్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతోమనీలాండరింగ్ కోణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈడీ దాడులను ఖండించిన మంత్రి సీతక్క ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ‘ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఈడీ, సీబీఐలను పచ్చిగా దురి్వనియోగం చేస్తోంది. తమకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది’ అని సీతక్క ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులకు సోదాలకు కారణం బీజేపీ కుట్రలేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్
ఢిల్లీ: తమిళనాడు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీకి బెయిల్ మంజూరైంది. క్యాష్ ఫర్ జాబ్స్(మనీల్యాండరింగ్) కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలులో ఉన్న సెంథిల్ బాలాజీకి తాజాగా సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో, ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీని మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గతేదాడి జూన్‌లో అరెస్ట్ చేసింది. ఈ సందర్భంగా తమిళనాడులోని రవాణాశాఖలో ఉద్యోగాలు ఇస్తామని(అన్నాడీఎంకే ప్రభుత్వంలో 2011-15 మధ్య) నిరుద్యోగుల నుంచి సెంథిల్ బాలాజీ భారీగా డబ్బులు వసూలు చేశారని ఈడీ ఆరోపించింది. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై జూన్ 15న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ అరెస్టుతో ఆయన మంత్రిత్వ శాఖను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.అయితే, ఈ కేసులో బెయిల్ కోసం సెంథిల్ బాలాజీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది అక్టోబర్ 19న బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా హైకోర్టు కొట్టివేసింది. స్థానిక కోర్టు కూడా అతని బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కొట్టివేసింది. ఈక్రమంలో బెయిల్ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. Supreme Court grants bail plea to former Tamil Nadu minister V Senthil Balaji in connection with a money laundering case linked to the cash-for-jobs scam. pic.twitter.com/qBnLoArEoj— ANI (@ANI) September 26, 2024 ఇది కూడా చదవండి: బెంగళూరు మహాలక్ష్మి కేసులో షాకింగ్ ట్విస్ట్ -
మనీలాండరింగ్ కేసు: ఆప్ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెబర్ 23వరకు 14 రోజుల జ్యుడీషల్ కస్టడీ విధించింది. అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్‌బోర్డ్‌లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఇక.. ఈ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఈడీ అమానతుల్లా ఖాన్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరించింది. అమానతుల్లా ఖాన్ని విడుదల చేస్తే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసి అకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణకు ఆటంకం కలుగుతుందని ఆయన్ను 14 రోజలు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ అభ్యర్థను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆప్ ఎమ్మెల్యేకు సెప్టెంబర్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం నుంచే ఆప్ ఎమ్మెల్యే నివాసంపై ఈడీ సోదాలు చేపట్టింది. సుమారు ఆరు గంటలు సోదాలు చేసిన అనంతరం ఈడీ అధికారులు అమానతుల్లా ఖాన్ అరెస్ట్ చేశారు. -
Supreme Court: ఇంత కాఠిన్యమా?
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) కేసుల దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అవసరానికి మించిన కాఠిన్యం చూపుతోందంటూ సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నిందితుల నుంచి జప్తు చేసే డాక్యుమెంట్లను వారికిచ్చేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ తలంటింది. ‘‘కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ డాక్యుమెంట్లను నిరాకరించడం సబబా? ఇది జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడం కాదా?’’ అంటూ అక్షింతలు వేసింది. పీఎంఎల్ఏకు సంబంధించిన ఒక కేసును న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఎ.అమానుల్లా, జస్టిస్‌ఏజీ మసీతో ధర్మాసనం బుధవారం విచారించింది. ‘‘నిందితునికి సంబంధించిన వేలాది డాక్యుమెంట్లు మీరు జప్తు చేయొచ్చు. అతనికి అవన్నీ గుర్తుండాలని లేదు కదా! అడిగితే ఇవ్వడానికి ఇబ్బందేమిటి? వేలాది పేజీల డాక్యుమెంట్లనైనా నిమిషాల్లో స్కాన్ చేసిన అందుబాటులోకి తేవచ్చు. దర్యాప్తు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడలేరా?’’ అని ప్రశ్నించింది. ‘‘క్లిష్టతరమైన విచారణ ప్రక్రియను ఎదుర్కొంటున్న నిందితునికి సొంత డాక్యుమెంట్లే ఇవ్వకపోవడం న్యాయమా? అత్యంత హీనం, అమానుషమని భావించిన కేసుల్లోనూ నిందితులను బెయిల్ దొరికిన సందర్భాలు బోలెడు! కానీ ఈ రోజుల్లో అమాంబాపతు కేసుల్లో కూడా బెయిల్ రావడం గగనంగా మారుతోంది. కాలం మారుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కేసుల్లో మేం (ధర్మాసనం) కఠినంగా ఉండొచ్చా? అది భావ్యమేనా?’’ అంటూ ఈడీని జస్టిస్ ఓకా నిలదీశారు. బెయిల్ కోసం, లేదా కేసే తప్పుడుదని నిరూపించేందుకు డాక్యుమెంట్లపైనే ఆధారపడే పరిస్థితుల్లో వాటిని పొందే హక్కు నిందితునికి ఉంటుందని స్పష్టం చేశారు. -
ఢిల్లీ లిక్కర్ కేసు: మరోసారి కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో అరెస్టైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ నేటితో ముగియగా.. తిహార్ జైలులో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. విచారణ జరిపిన కోర్టు కేజ్రీవాల్ సీబీఐ కస్టడీ పొడిగించింది. ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్‌ను సీబీఐ కస్టడీకీ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున ఆయన కస్టడీని మరికొన్ని రోజులు పొడిగించాలని అధికారులు కోర్టును కోరారు. దీంతో కోర్టు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మరో రెండు వారాలు పొడిగించింది. అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కేజ్రీవాల్ మే 10న మధ్యంత బెయిల్ పొందారు. బెయిల్ గడువు ముగిసిన అనంతరం జూన్ 2ను ఆయన మళ్లీ తిహార్ జైలుకు చేరుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను జూన్ 26న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల కస్టోడియల్ విచారణ ముగియడంలో కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ ఎదుట హాజరుపర్చారు. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ఆయనను 14 రోజలపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను వచ్చే నెల 12వ తేదీ దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
హేమంత్ సోరెన్‌కు బెయిల్
రాంచీ: భూకుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్(48)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హేమంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ రంగోన్ ముఖోపాధ్యాయ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. హేమంత్ సోరెన్‌కు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే తరహా అవినీతికి పాల్పడే అవకాశం ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తరఫు న్యాయవాది ఎస్.వి.రాజు పేర్కొన్నారు. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. ఈడీ వాదనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే హేమంత్ ఏ నేరమూ చేయలేదని, బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఆయన నేరం చేసే అవకాశం లేదని, అందుకే బెయిల్ ఇస్తున్నామని స్పష్టంచేసింది. హేమంత్ రూ.50 వేల పూచీకత్తు సమరి్పంచాలని, ఆయనకు ష్యూరిటీ ఇస్తూ మరో ఇద్దరు రూ.50 వేల చొప్పున పూచీకత్తు సమరి్పంచాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని, ఈ బెయిల్ తీర్పుపై 48 గంటలపాటు స్టే విధించాలని ఈడీ తరఫున మరో న్యాయవాది జోహబ్ హుస్సేన్ విజ్ఞప్తి చేయగా ధర్మాసనం తిరస్కరించింది. జార్ఖండ్ రాజధాని రాంచీలో 8.86 ఎకరాల భూకుంభకోణం కేసులో హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులో ఇరికించారు: హేమంత్ తనను తప్పుడు కేసులో ఇరికించి, ఐదు నెలలపాటు జైల్లో పెట్టారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని అధికార బీజేపీపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యర్తలు, జర్నలిస్టుల గొంతులను ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. -
అయిదు నెలల తర్వాత.. బెయిల్‌పై హేమంత్ సోరెన్ విడుదల
రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఎట్టకేలకు విడుదలయ్యారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించడంతో దాదాపు అయిదు నెలల శిక్ష అనంతరం శుక్రవారం సాయంత్రం జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ ముక్తిమోర్చ కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను ఈ ఏడాది జనవరి 31న ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన బిర్సా ముండా జైల్లో ఉన్నారు. అరెస్టుకు కొన్ని గంటల ముందే ఆయన నాటకీయ పరిణామాల నడుమ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. నూతన సీఎంగా చంపాయి సోరెన్ బాధ్యతలు చేపట్టారు. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ సెంట్రల్ జైలులో జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు తొలుత ఆయనను జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఎదుట ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణం కేసులో అవినీతి వ్యవహారాలపై విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ విజ్ఞాపన సమరి్పంచారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన వాదనను కోర్టుకు తెలియజేశారు. మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేదని, తాను అమాయకుడినని పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు, ఆమ్ ఆద్మీ పారీ్టకి ఈ కేసుతో సంబంధం లేదని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్‌కు సిసోడియాను బాధ్యుడిని చేస్తూ తాను సీబీఐకి స్టేట్మెంట్ ఇచి్చనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. సిసోడియాకు గానీ, ఇతరులను గానీ వ్యతిరేకంగా తాను సేŠట్‌ట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. అరెస్టు ఇప్పుడే ఎందుకంటే.. తాము నిజాలు మాత్రమే బహిర్గతం చేస్తున్నామని, మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం వెనుక పెద్ద కుట్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని, ఈ కేసులో కేజ్రీవాల్‌ను ప్రశ్నించి మరిన్ని నిజాలు రాబట్టాల్సి ఉందని తమ విజ్ఞాపనలో సీబీఐ పేర్కొంది. కేజ్రీవాల్‌ను ఇప్పుడే అరెస్టు చేయాలని ఎందుకు భావిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఇన్నాళ్లూ సార్వత్రిక ఎన్నికలు జరగడంతో వేచి చూశామని, ఎన్నికలు ముగియడంతో అరెస్టు చేసి, విచారణ కొనసాగించాలని నిర్ణయించినట్లు సీబీఐ తరఫు న్యాయవాది బదులిచ్చారు. నూతన మద్యం విధానంలో భాగంగా ఢిల్లీలో మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించాలని అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సిఫార్సు చేసినట్లు కేజ్రీవాల్ సేŠట్‌ట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అనంతరం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి, మూడు రోజులపాటు కస్టడీలో ఉంచి విచారించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి అమితాబ్ రావత్ అనుమతి ఇచ్చారు. బయటకు రాకుండా కుట్రలు: సునీతా తన భర్త అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రానివ్వకుండా మొత్తం వ్యవస్థ కుట్రలు సాగిస్తోందని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశంలో చట్టం అమల్లో లేదని, కేవలం నియంతృత్వం రాజ్యమేలుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మనూ సింఘ్వీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు. -
ఇక సీబీఐ వంతు!
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను బుధవారం సీబీఐ అరెస్టు చేసే అవకాశం కని్పస్తోంది. సీబీఐ వర్గాలు మంగళవారం తిహార్ జైల్లో ఆయనను విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నాయి. బుధవారం ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సీబీఐ చర్య ప్రధాని మోదీ కక్షసాధింపులో భాగమేనని ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. అందుకే కేజ్రీవాల్‌ను తప్పుడు కేసులో ఇరికించారన్నారు.ఢిల్లీ హైకోర్టులో నిరాశేమనీ లాండరింగ్ కేసులో బెయిల్ విషయంలో కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురయ్యింది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే ఎత్తివేతకు ఢిల్లీ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సుధీర్‌కుమార్ జైన్ నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. వాదనలకు ఈడీకి ట్రయల్ కోర్టు సమయమివ్వలేదని ఆక్షేపించింది.కేజ్రీవాల్ ప్రమేయంపై సమర్పించిన పత్రాలను, సాక్ష్యాధారాలను పరిగణనలోకి తీసుకోవడంలో, క్షుణ్నంగా పరిశీలించడంలో విఫలమైందని స్పష్టంచేసింది.కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై పూర్తిస్థాయిలో వాదనలు వినిపించడానికి ఈడీకి తగిన సమయమిచ్చి ఉండాల్సిందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బెయిల్ ఉత్తర్వుపై స్టేను రద్దు చేయడం లేదని తేచ్చిచెప్పారు. కేజ్రీవాల్‌కు ఈ నెల 20న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు రూ.లక్ష వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.దీన్ని వ్యతిరేకిస్తూ ఈడీ ఆ మర్నాడే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దాంతో బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లినప్పటికీ ఊరట దక్కలేదు. దాంతో ఆయన కనీసం మరిన్ని రోజులపాటు తిహార్ జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
Delhi liquor scam: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచి్చన బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఈ నెల 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
Delhi liquor scam: జైల్లోనే కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరికొన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సు«దీర్‌కుమార్ జైన్, జస్టిస్ రవీందర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించడానికి సరైన అవకాశం లభించలేదన్నారు. తమ వాదనల సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తొందరపెట్టారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ కేసులో వాస్తవాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బెయిల్‌ను రద్దు చేయడానికి ఇంతకంటే మంచి కేసు ఇంకొకటి ఉండదన్నారు. అనంతరం ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ట్రయల్ కోర్టు ఆర్డర్‌పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వివరణాత్మక ఆదేశాల నిమిత్తం తీర్పు రిజర్వ్ చేస్తున్నాం. మొత్తం రికార్డులను పరిశీలించాల్సి ఉంది కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తాం. అప్పటివరకూ ట్రయల్ కోర్టు ఆదేశాల అమలుపై మధ్యంతర స్టే విధిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈడీ పిటిషన్‌పై స్పందించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసింది. -
కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు ఆధారాలున్నాయి: ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3 వరకు పొడిగించింది. లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. సాధారణ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు బుధవారం విచారించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంను కోర్టు ముందు హాజరుపరిచారు.ఈ సందర్బంగా కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కీలక ఆరోపణలు చేసింది. లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లు తమ ఆధారాలు ఉన్నాయని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు. అరెస్టుకు ముందే ఆధారాలు సేకరించినట్లుగా పేర్కొన్నారు.‘ఈ కేసులో మనీలాండరింగ్ నేరంపై కోర్టు విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా సహ నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ జరిగినట్లు కోర్టు విశ్వసిస్తోంది’ ఆయన పేర్కొన్నారు.పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఛార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరు లేదని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. అంతేగాక సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సైతం కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదన్న విషయాన్ని ప్రస్తావించారు.ఇక కేజ్రీవాల్ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయవచ్చని మే 10న సుప్రీం కోర్టు తమ ఆదేశాల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. మొత్తం కేసు ఆగస్టు 2022లో ప్రారంభమవ్వగా.. ఎన్నికలకు ముందు 2024 మార్చిలో కేజ్రీవాల్ అరెస్టు చేశారని అన్నారు. ఆయన అరెస్టు సమయం వెనుక దురుద్దేశం ఉందన్నారు.మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో కింది కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. -
మనీలాండరింగ్ కేసు: జైలులో ఉన్న జార్ఖండ్ మంత్రి రాజీనామా
రాంచి: మనీలాండరింగ్ కేసులో జైలులో ఉన్న అలంగీర్ ఆలం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలంగీర్ ఆలం మంత్రి పదవికి, కాంగ్రెస్ పక్ష నేత పదవికి రాజీనామా చేసినట్లు ఆయన కుమారుడు తన్వీర్ ఆలం వెల్లడించారు. జూన్ 8 (శనివారం) ఆయన రాజీనామా చేసి.. రిజైన్ లెటర్‌ను అదే రోజు సీఎం కార్యాలయానికి పంపించారు. అయితే ఆయన రాజీనామా లేఖ జార్ఖండ్ సీఎం చంపయ్ సోరెన్ ఆఫీసుకు సోమవారం చేరినట్లు తన్వీర్ తెలిపారు. అలంగీర్ ఆలం రాజీనామా చేసినట్లు జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకూర్ నిర్ధారించారు. మనీలాండరింగ్ కేసులో అలంగీర్‌ను దర్యాప్తు చేయటం కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మే15న అరెస్ట్ చేసింది. మే 6 అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ పని మనిషి జహంగీర్ ఆలం ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీకి సుమారు రూ. 37 కోట్ల భారీ నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. భారీగా నగదు పట్టుబడటం జార్ఖండ్‌లో సంచలనం రేపింది. అలంగీర్ ఆలంతోపాటు సంజీవ్ లాల్‌ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్ మనీలాండరింగ్ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఈడీ జహంగీర్ ఆలం ఇంటిపై సోదాలు చేసింది. వీరేంద్ర కె రామ్ గతేడాది అరెస్ట్ అయ్యారు. రూరల్ డెవలప్మెంట్ డిపార్టుమెంట్‌కు సంబంధించిన పలు స్కీముల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.చదవండి: మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు -
హేమంత్ సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. జనవరిలో ఈడీ సొరెన్‌ను ఆరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరిచుకున్నారు. దీంతో మాజీ సీఎం సొరెన్ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్ మొత్తం 14 లోక్‌సభ సీట్లలో ఇప్పటి వరకు 7 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మరో 7 స్థానాకలు ఆరో విడత( మే 25), ఏడో విడత (జూన్ 1)న పోలింగ్ జరగనుంది. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పాల్గొనడాడికి మధ్యంతర బెయిల్ కోరుతూ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనపై దాఖలైన నగదు అక్రమ చలామణీ కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా సొరెన్ చెడగొట్టేందుకు ప్రయత్నించొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది -
కవిత కస్టడీ జూన్ 3 వరకు పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడగించింది. ఇవాళ(సోమవారం) మధ్యాహ్నం రౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు ప్రవేశపెట్టారు. సీబీఐ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జూన్ 3 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది. -
మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎ మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడినీ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడగించింది. మరో ఐదు రోజుల పాటు.. ఈ నెల 20 వరకు కస్టడీ పొడగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయముర్తి కావేరి బవేజా తెలిపారు.తీహార్ జైల్లో ఉన్న మనీష్ సిసోడియా నేటితో కస్టడీ ముగియగా.. ఆయన వీడియో కాన్ఫరెస్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. నిందితుల్లో ఒకరైన అరుణ్ పిళ్లై దాఖలు చేసిన ఆప్పీల్ ఆధారంగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిసోడియాపై ఉన్న ఆరోపణలపై వాదనలను కోర్టు వాయిదా వేసింది.ఇక.. లిక్కర్ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) గతేడాది మార్చి 9న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన తిహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీపై ఉంటున్నారు.గత నెల 30న సిసోడియాకు రెండోసారి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను జడ్జి బవేజా కొట్టివేశారు. సిసోడియాకు బెయిల్ లభిస్తే ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మార్చడం, సాక్షులను ప్రభావితం చేయడం వంటి వాటికి పాల్పడే అవకాశముందని, ఈ కేసులో మనీష్ సిసోడియా చాలా కీలక నిందితుడని ఈడీ తెలిపింది. -
Delhi liquor scam: కేజ్రీవాల్‌కు ‘ప్రచార’ బెయిల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇందుకు పలు షరతులు విధించింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు వచ్చే నెల 5వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది అభిõÙక్ సింఘ్వీ కోరగా, ధర్మాసనం అంగీకరించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రచారం అనేది ప్రాథమిక హక్కు లేదా రాజ్యాంగపరమైన హక్కు కాదని, మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన కేజ్రీవాల్‌కు ఎట్టిపరిస్థితుల్లోనూ మధ్యంతర బెయిల్ ఇవ్వొద్దని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను ధర్మాసనం తిరస్కరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడం లేదా జైలు నుంచి విడుదల చేయడం వంటి అంశాల్లో సదరు నిందితుడికి సంబంధించిన ప్రాధాన్యతలు, అతడి చుట్టూ ఉన్న పరిణామాలు, పరిస్థితులను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని వెల్లడించింది. వాటిని విస్మరించడం పొరపాటే అవుతుందని ఉద్ఘాటించింది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఈ సంవత్సరంలో చాలా ముఖ్యమైన కార్యక్రమం అని గుర్తుచేసింది. కేజ్రీవాల్ దోషిగా నిర్ధారణ కాలేదు కేజ్రీవాల్‌పై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయనడంలో సందేహం లేదని.. కానీ, ఆయన ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని, ఆయనకు గతంలో నేర చరిత్ర లేదని, సమాజానికి ఆయన వల్ల ముప్పు సంభవించే పరిస్థితి కూడా లేదని వివరించింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం చట్టబద్ధమేనా? అది చెల్లుబాటు అవుతుందా? అని ప్రశి్నస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైందని, దానిపై ఇంకా తుదితీర్పు వెలువడలేదని వెల్లడించింది. కేజ్రీవాల్ కేసు ఇప్పుడు న్యాయ వ్యవస్థ పరిధిలోనే ఉంది కాబట్టి అతడికి బెయిల్ ఇచ్చే అంశాన్ని సానుకూలంగా పరిశీలించామని తెలియజేసింది. నిందితులకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు తనకున్న అధికారాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎన్నో సందర్భాల్లో ఉపయోగించుకుందని ధర్మాసనం గుర్తుచేసింది. ప్రతి కేసుకు సంబంధించిన వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని కోర్టులు మధ్యంతర బెయిల్ ఇస్తుంటాయని పేర్కొంది. 21 రోజులు బెయిలిస్తే పెద్దగా తేడా ఉండదు తన అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ పూర్తిచేసి, తీర్పు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నామని ధర్మాసనం వివరించింది. కేజ్రీవాల్ అప్పీల్ తమవద్దే పెండింగ్‌లో ఉందని, ఈ పరిస్థితుల్లో మధ్యంతర బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లాలంటూ ఆయనను ఆదేశించడం సరైంది కాదని భావించామని పేర్కొంది. తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్ లెక్కచేయలేదని, అందుకే అరెస్టు చేశామంటూ ఈడీ లేవనెత్తిన వాదనపై ధర్మాసనం స్పందించింది. ఇందులో ఇతర కోణాలు కూడా చూడాలని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. కేజ్రీవాల్ ఒక ముఖ్యమంత్రి, ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అని ప్రస్తావించింది. మద్యం కుంభకోణంలో దర్యాప్తు 2022 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉందని, కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న అరెస్టు చేశారని, ఇప్పుడు 21 రోజులపాటు మధ్యంతర బెయిల్ ఇస్తే పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోకేజ్రీవాల్కు వచ్చే నెల 1వ తేదీ దాకా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. షరతులకు కట్టుబడి ఉండాలని ఆదేశించింది. కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇవ్వడాన్ని ఈ కేసు మెరిట్‌పై అభిప్రాయాల వ్యక్తీకరణగా చూడొద్దని సూచించింది. తిహార్ జైలు నుంచి విడుదలసుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు ఎదుట భారీసంఖ్యలో గుమికూడిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేజ్రీవాల్ తన కాన్వాయ్‌తో జైలు నుంచి ఇంటికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, కుమార్తె హర్షితా, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ ఉన్నారు. సుప్రీంకోర్టు షరతులివే.. 1. రూ.50,000 బెయిల్ బాండు సమరి్పంచాలి, అంతే మొత్తం పూచీకత్తును తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు అందజేయాలి. 2. బెయిల్‌పై బయట ఉన్నప్పుడు అధికారిక కార్యాలయంలో గానీ, ఢిల్లీ సచివాలయంలోని గానీ అడుగు పెట్టరాదు. 3.లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోకుండా అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు 4. మద్యం కుంభకోణం కేసు గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని, సాక్షులతో భేటీ కావడం, సంప్రదింపులు జరపడం వంటివి చేయొద్దు. 5. మద్యం కేసుతో సంబంధం ఉన్న అధికారిక ఫైళ్లను చూడొద్దు. -
బెయిల్ ఇస్తే ఫైళ్లపై సంతకాలు చేయొద్దు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయాలని భావించిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ఆశ నెరవేరలేదు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టై ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించలేదు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది.తొలుత కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ కోరడం సరైంది కాదని మెహతా వాదించారు. ‘‘ఇలాంటి వాటికి కూడా బెయిల్ ఇస్తే రాజకీయ నాయకులను ప్రత్యేక తరగతిగా పరిగణించినట్లు అవుతుంది. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఓ రైతు తనకు పంట కోతలున్నాయంటూ మధ్యంతర బెయిల్ కోరవచ్చు. అందుకే రాజకీయ నాయకులకు మినహాయింపులు ఉండొద్దు.నిందితుడు సీఎం అయినంత మాత్రాన ఈ కేసును ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దు’’ అని సుప్రీంకోర్టును కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ఒక పార్టీ అధినేతగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సిన అవసరం కేజ్రీవాల్‌కు ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ఇది నిజంగా అసాధారణ పరిస్థితి. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. తరచూ నేరాలు చేసే వ్యక్తి కాదు. ఐదేళ్లకోసారి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసే అవసరం ఆయనకు ఉంది. ఈ కేసులో ఒకవేళ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తే ముఖ్యమంత్రిగా అధికారిక విధులు నిర్వర్తించేందుకు మేము అనుమతించం.అలా చేయడం విరుద్ధ ప్రయోజనాలకు దారి తీస్తుంది. అందుకే బెయిల్‌పై విడుదలైతే అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు’’ అని స్పష్టం చేసింది. అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ కేజ్రీవాల్ బెయిల్‌పై బయటకు వెళ్లినా ఎలాంటి ఫైళ్లపై, పత్రాలపై సంతకాలు చేయబోరని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పును వాయిదా వేసింది. బుధవారం లేదా గురువారం లేదా శుక్రవారం.. ఎప్పుడైనా సరే దీనిపై తమ నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. మరోవైపు మనీ లాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్‌పై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. దర్యాప్తులో జరుగుతున్న జాప్యంపై అసహనం వ్యక్తం చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు, కేజ్రీవాల్ అరెస్టుకు ముందునాటి ఫైళ్లను అధికారులు కోర్టుకు సమర్పించారు.