![ED Raids On The Offices Of Raksha Bullion And Classic Marbles - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/15/GoldEd.jpg.webp?itok=TYfbpa3S)
న్యూఢ్లిలీ: బ్యాంకు లోన్ మోసం కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ అభియోగాలపై దర్యాప్తులో భాగంగా బుధవారం రక్ష బులియన్ అండ్ క్లాసిక్ మార్బుల్స్ అనే సంస్థ కార్యాలయాలపై దాడులు చేసిన ఈడీ బృందానికి కళ్లు బైర్లు కమ్మాయి! రహస్య లాకర్లలో ఏకంగా 431 కిలోల బంగారు, వెండి కడ్డీలు బయటపడ్డాయి. వీటిలో 91 కిలోలు బంగారు, 340 కిలోల వెండి కడ్డీలున్నాయి. వీటి విలువ కనీసం రూ.47.76 కోట్లు ఉంటుందని తేల్చారు.
పరేఖ్ అల్యుమినెక్స్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించి కేసు దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి. బ్యాంకుల నుంచి రూ.2,296.58 కోట్ల మేరకు మోసపూరితంగా రుణాలు తీసుకున్నట్టు 2018లో పరేఖ్ సంస్థపై కేసు నమోదైంది. తర్వాత పలు షెల్ కంపెనీల ముసుగులో ఈ మొత్తాన్ని విదేశాలకు తరలించాలన్నది అభియోగం. దీనికి సంబంధించి గతంలోనే కంపెనీ తాలూకు రూ.205 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.
ఇదీ చదవండి: విద్యుత్ బిల్లుపై వెనక్కి తగ్గేదేలే...
Comments
Please login to add a commentAdd a comment