![ED Alleged Jacqueline Fernandez Tried To Leave India And Tamper Evidence - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/22/jacquwline.jpg.webp?itok=67psrutY)
రూ.200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌పై ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. ఆమె దేశం విడిచి పారియేందుకు యత్నించిందని.. ఆధారాలను తారుమారు చేసేందుకు యత్నించిందని దర్యాప్తు సంస్థ కోర్టుకు తెలిపింది. ఆమెపై లుక్ అవుట్ నోటీసులు ఉన్నందున విదేశాలకు వెళ్లలేకపోయిందని ఈడీ తెలిపింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ విచారణకు సహకరించడం లేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. ఆమె తన మొబైల్ డేటాను డిలీట్ చేసి సాక్ష‍్యాలు తారుమారు చేసేందుకు యత్నించారని ఈడీ కోర్టుకు వివరించింది. జాక్వెలిన్, మరో నటి నోరా ఫతేహీ ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ నుంచి ఖరీదైన కార్లు బహుమతులుగా స్వీకరించారని ఈడీ తెలిపింది.
మధ్యంతర బెయిల్ పొడిగింపు: మరోవైపు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు కోర్టులో ఊరట లభించింది. ఆమె మధ్యంతర బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు ఢిల్లీ కోర్టు ప్రకటించింది. తాజాగా నటి పిటిషన్‌పై మళ్లీ విచారణ చేపట్టిన ఢిల్లీ న్యాయస్థానం బెయిల్ గడువు తేదీని పొడిగించింది. ఆ బెయిల్ గడువు తేదీని నంవబర్ 10 వరకు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment