ఢిల్లీ మద్యం కుంభకోణంలో అదుపులోకి తీసుకున్న సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ సెంట్రల్ జైలులో జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ బుధవారం అదుపులోకి తీసుకుంది. సీబీఐ అధికారులు తొలుత ఆయనను జైలు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అమితాబ్ రావత్ ఎదుట ప్రవేశపెట్టారు.
మద్యం కుంభకోణం కేసులో అవినీతి వ్యవహారాలపై విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను ఐదు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ విజ్ఞాపన సమరి్పంచారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తన వాదనను కోర్టుకు తెలియజేశారు. మద్యం కుంభకోణంతో తనకు సంబంధం లేదని, తాను అమాయకుడినని పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు, ఆమ్ ఆద్మీ పారీ్టకి ఈ కేసుతో సంబంధం లేదని, ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్‌కు సిసోడియాను బాధ్యుడిని చేస్తూ తాను సీబీఐకి స్టేట్‌మెంట్ ఇచి్చనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, అందులో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. సిసోడియాకు గానీ, ఇతరులను గానీ వ్యతిరేకంగా తాను సేŠట్‌ట్‌మెంట్ ఇవ్వలేదన్నారు.
అరెస్టు ఇప్పుడే ఎందుకంటే..
తాము నిజాలు మాత్రమే బహిర్గతం చేస్తున్నామని, మీడియాకు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని సీబీఐ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. మద్యం కుంభకోణం వెనుక పెద్ద కుట్ర ఉందని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని, ఈ కేసులో కేజ్రీవాల్‌ను ప్రశ్నించి మరిన్ని నిజాలు రాబట్టాల్సి ఉందని తమ విజ్ఞాపనలో సీబీఐ పేర్కొంది.
కేజ్రీవాల్‌ను ఇప్పుడే అరెస్టు చేయాలని ఎందుకు భావిస్తున్నారని న్యాయమూర్తి ప్రశ్నించగా, ఇన్నాళ్లూ సార్వత్రిక ఎన్నికలు జరగడంతో వేచి చూశామని, ఎన్నికలు ముగియడంతో అరెస్టు చేసి, విచారణ కొనసాగించాలని నిర్ణయించినట్లు సీబీఐ తరఫు న్యాయవాది బదులిచ్చారు. నూతన మద్యం విధానంలో భాగంగా ఢిల్లీలో మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించాలని అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సిఫార్సు చేసినట్లు కేజ్రీవాల్ సేŠట్‌ట్‌మెంట్ ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. అనంతరం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి, మూడు రోజులపాటు కస్టడీలో ఉంచి విచారించేందుకు సీబీఐకి రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి అమితాబ్ రావత్ అనుమతి ఇచ్చారు.
బయటకు రాకుండా కుట్రలు: సునీతా
తన భర్త అరవింద్ కేజ్రీవాల్‌ను జైలు నుంచి బయటకు రానివ్వకుండా మొత్తం వ్యవస్థ కుట్రలు సాగిస్తోందని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశంలో చట్టం అమల్లో లేదని, కేవలం నియంతృత్వం రాజ్యమేలుతోందని ఆరోపించారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ
రెగ్యులర్ బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచి్చన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిõÙక్ మనూ సింఘ్వీ బుధవారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరో పిటిషన్ దాఖలు చేస్తామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment