బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే
రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తామని వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరికొన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది.
రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సు«దీర్‌కుమార్ జైన్, జస్టిస్ రవీందర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించడానికి సరైన అవకాశం లభించలేదన్నారు.
తమ వాదనల సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తొందరపెట్టారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ కేసులో వాస్తవాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బెయిల్‌ను రద్దు చేయడానికి ఇంతకంటే మంచి కేసు ఇంకొకటి ఉండదన్నారు. అనంతరం ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
‘‘ట్రయల్ కోర్టు ఆర్డర్‌పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వివరణాత్మక ఆదేశాల నిమిత్తం తీర్పు రిజర్వ్ చేస్తున్నాం. మొత్తం రికార్డులను పరిశీలించాల్సి ఉంది కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తాం. అప్పటివరకూ ట్రయల్ కోర్టు ఆదేశాల అమలుపై మధ్యంతర స్టే విధిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈడీ పిటిషన్‌పై స్పందించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment