interim stay
-
Delhi liquor scam: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచి్చన బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఈ నెల 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
Delhi liquor scam: జైల్లోనే కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మరికొన్ని రోజులు తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచి్చన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. రెగ్యులర్ బెయిల్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సు«దీర్‌కుమార్ జైన్, జస్టిస్ రవీందర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించడానికి సరైన అవకాశం లభించలేదన్నారు. తమ వాదనల సమయంలో రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తొందరపెట్టారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఈ కేసులో వాస్తవాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదన్నారు. బెయిల్‌ను రద్దు చేయడానికి ఇంతకంటే మంచి కేసు ఇంకొకటి ఉండదన్నారు. అనంతరం ట్రయల్ కోర్టు తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ట్రయల్ కోర్టు ఆర్డర్‌పై స్టే కోరుతూ దాఖలైన పిటిషన్‌పై వివరణాత్మక ఆదేశాల నిమిత్తం తీర్పు రిజర్వ్ చేస్తున్నాం. మొత్తం రికార్డులను పరిశీలించాల్సి ఉంది కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో స్పష్టత ఇస్తాం. అప్పటివరకూ ట్రయల్ కోర్టు ఆదేశాల అమలుపై మధ్యంతర స్టే విధిస్తున్నాం’’ అని వెల్లడించింది. ఈడీ పిటిషన్‌పై స్పందించాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసు జారీ చేసింది. -
ఎలక్టోరల్ బాండ్లపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకం అమలుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎలక్టోరల్ బాండ్లపై లోతుగా విచారించాల్సిన అవసరముందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో పూర్తి వివరాలతో మరో పిటిషన్ దాఖలు చేయాలని ఎన్జీవో సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్)కు సూచించింది. ఏడీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి రాజకీయ పార్టీలకు నిధులు అందుతున్నాయని తెలిపారు. ఈ నిధుల్లో 95 శాతం అధికార పార్టీకే దక్కాయని గుర్తుచేశారు. నిధులపై పారదర్శకత లోపించిన నేపథ్యంలో ఈసీ కూడా దీన్ని వ్యతిరేకించిందన్నారు. ఈ వాదనల్ని ఖండించిన అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్.. నల్లధనాన్ని నియంత్రించేందుకే ఈ బాండ్లను కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. -
ఏ ప్రాతిపదికన తొలగించారు?
సాక్షి, న్యూఢిల్లీ: కళింగ కులాన్ని బీసీ జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలగించారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 4న ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ‘మధ్యంతర స్టే’ ఇచ్చింది. కళింగ కులాన్ని తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి తొలగించడంతో తాము మెడిసిన్‌లో ప్రవేశాలు కోల్పోయామని, తమకు ప్రవేశం కల్పించాలని కోరుతూ ఇద్దరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కేవీ విశ్వనాథన్ వాదనలు వినిపిస్తూ ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పిటిషనర్‌కు రిజర్వేషన్ పొందే హక్కు, అర్హత ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల జాబితా నుంచి కళింగ తదితర కులాలను తొలగించడంతో విద్యార్థులు మెడిసిన్‌లో ప్రవేశం పొందలేకపోయారు’ అని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. కులాల తొలగింపు రాజ్యాంగబద్ధంగానే జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ హెచ్ఎల్ దత్తు స్పందిస్తూ రాష్ట్ర విభజనకు ముందు కళింగ సామాజిక వర్గానికి రిజర్వేషన్ ఉందా? లేదా? అని ప్రశ్నించారు. వారికి రిజర్వేషన్ వర్తించిందని, అయితే ఇప్పుడు తెలంగాణలో ఆ కులానికి చెందిన వారు లేరని రోహత్గీ తెలిపారు. ‘లేరని ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఏదైనా కమిషన్ వేశారా? విభజనకు ముందున్నప్పుడు.. ఇప్పుడు కూడా ఉండాలి కదా?’ అని న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు. పిటిషనర్ అభ్యర్థన లోని ‘సి’ భాగంపై కౌంటర్ దాఖలు చేయాలని, హైకోర్టు ఇచ్చిన తీర్పు(తీర్పు అమలు కాలానికి సంబంధించి)పై ‘మధ్యంతర స్టే’ విధిస్తున్నామని, ఇది పిటిషనర్లకు మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను 18కి వాయిదా వేసింది. -
మున్సిపల్ ఫలితాలపై సుప్రీం తాత్కాలిక స్టే
న్యూఢిల్లీ: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్, ఫలితాల ప్రకటన తేదీపై మళ్లీ సందిగ్దత నెలకొంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 9న ఫలితాలు వెలువడకపోయే అవకాశముంది. రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ లోగా సమాధానం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫలితాలను ఈ నెల 9న ప్రకటించేందుకు అనుమతిచ్చింది. కాగా త్వరలో శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశముందని, కావున వాయిదా వేయాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు హైకోర్టు తీర్పుపై తాత్కాలిక స్టే విధించింది. మండల్, జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలను కూడా సాధరణ ఎన్నికల అనంతరం ప్రకటించాలని ఇటీవల తీర్పు వెలువరించిన విషయం విదితమే.