న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచి్చన బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఈ నెల 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment