Rouse Avenue Court
-
మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌కు జీవిత ఖైదు
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్(Sajjan Kumar)కు జీవితఖైదు పడింది. అల్లర్లలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయాన్ని నిర్దారించిన ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం.. ఇదివరకే దోషిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆదేశాలు జారీ చేశారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల(Anti Sikh Riots)లో భాగంగా నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. ఆపై ఆ ఇంట దోపిడీకి పాల్పడింది. ప్రత్యక్ష సాక్షి, జస్వంత్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు అయ్యింది.సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని, ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని పేర్కొంటూ ఫిబ్రవరి 12వ తేదీ స్పెషల్ కోర్టు ఆయన్ని దోషిగా తేల్చింది. సజ్జన్ కుమార్‌కు మరణశిక్ష విధించాలన్న జస్వంత్ భార్య పిటిషన్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఆయనకు జీవితఖైదు(Life Imprisonment) విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉంటే.. పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. అయితే 2015లో అమిత్ షా(Amit Shah) చొరవతో అప్పట్లో ఈ కేసును సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. ఎవరీ సజ్జన్ కుమార్?ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.సజ్జన్‌కు శిక్ష-ఎప్పుడు ఏం జరిగిందంటే.. 1991: అల్లర్లలో జస్వంత్, తరుణ్ దీప్ సింగ్‌ల హత్యపై కేసు నమోదు1994: జులై 8 సరైన ఆధారాలు లేవని చెబుతూ సజ్జన్ కుమార్ విచారణకు ఢిల్లీ కోర్టు నిరాకరణ2015 ఫిబ్రవరి 12: సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం2016 నవంబర్ 21: మరింత దర్యాప్తు అవసరమని కోర్టుకు తెలిపిన సిట్2021 ఏప్రిల్ 06: సజ్జన్ కుమార్ అరెస్ట్2021 మే 5 : సజ్జన్‌పై పోలీసుల ఛార్జ్‌షీట్ నమోదు2021, జులై 26: ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం2021, అక్టోబర్ 1: కోర్టులో వాదనలు ప్రారంభం2021, డిసెంబర్ 16: సజ్జన్ కుమార్‌పై అభియోగాలు నమోదు చేసిన కోర్టుజనవరి 31, 2024: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో తుది వాదనలు విన్న కోర్టు2024, నవంబర్ 8: వాదనలు పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ప్రత్యేక కోర్టు2025, ఫిబ్రవరి 12: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు2025, ఫిబ్రవరి 25: సజ్జన్ కుమార్‌కు జీవితఖైదు ఖరారునానావతి కమిషన్ నివేదిక ప్రకారం.. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో మొత్తం 2,733 మంది మరణించారు. మొత్తం 587 ఎఫ్ఐఆర్లలో కేవలం 28లో మాత్రమే 400 మందికి శిక్షలు పడ్డాయి. ఇప్పటికే యావజ్జీవంఇక ఢిల్లీ కంటోన్మెంట్(Delhi Cantonment)లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. -
సిక్కుల ఊచకోత కేసులో దోషిగా మాజీ ఎంపీ
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మాజీ ఎంపీ సజ్జన్ కుమార్‌ను కోర్టు దోషిగా తేల్చింది. బుధవారం రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా.. స్పెషల్ జడ్జి కావేరీ భవేజా ఆయన్ని ఈ కేసులో దోషిగా ప్రకటించారు. అయితే శిక్ష ఖరారుపై వాదనలను మాత్రం ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేశారు. 1984 నవంబర్ 1న సరస్వతి విహార్ ప్రాంతంలో తండ్రీకొడుకుల హత్య కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి పంజాబీ బాఘ్ పోలీసులు కేసు నమోదు చేసుకు దర్యాప్తు చేశారు కూడా. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ ఘటనను సిట్ దర్యాప్తు చేసింది. మరోవైపు.. 2021, డిసెంబర్ 16వ తేదీన సజ్జన్ కుమార్‌పై కోర్టు అభియోగాలను నమోదు చేసింది. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్యానంతరం ఒక పెద్ద గంపు మారణాయుధాలతో విరుచుకుపడింది. సిక్కులను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున లూటీలు, గృహదహనాలకు పాల్పడింది. ఈ క్రమంలో సరస్వతి విహార్ ప్రాంతంలో అల్లరిమూక.. జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్ దీప్ సింగ్‌ను హతమార్చింది. అయితే.. సజ్జన్ కుమార్ కేవలం ఈ అల్లర్లలో పాల్పొనడమే కాకుండా ఆ గుంపునకు నాయకత్వం వహించాడని కోర్టు ఇవాళ్టి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు తగిన సాక్ష్యాలు లభించాయని తెలిపింది. ఈ తీర్పును ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ (డీఎస్‌జీఎంసీ) ప్రధాన కార్యదర్శి జగ్దీప్ సింగ్ కహ్లాన్ స్వాగతించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా సిట్‌ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఢిల్లీ కంటోన్మెంట్లో జరిగిన మరో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో ఆయనకు గతంలోనే యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 1984 సిక్కు అల్లర్ల కేసులో సజ్జన్ కుమార్‌ను దోషిగా నిర్దారిస్తూ 2018లో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది . ఆయనకు యావజ్జీవ జైలుశిక్ష పడడంతో.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.ఢిల్లీలో ఓ బేకరీ ఓనర్ అయిన సజ్జన్ కుమార్‌కు.. సంజయ్ గాంధీతో దగ్గరి సంబంధా ఏర్పడ్డాయి. అలా ఢిల్లీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1980లో ఔటర్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు తొలిసారి గెలిచారు. 1991, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అదే స్థానానికి ఆయన ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లు (8,55,543)పోలైన నేతగా రికార్డు సృష్టించారు. అయితే.. 2018లో సిక్కుల ఊచకోత కేసులో దోషిగా కోర్టు ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: విచారణ నవంబర్ 8కి వాయిదా
ఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. లిక్కర్ కేసు సీబీఐ ఛార్జ్ షీట్ జరిగిన విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా , ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్ హాజయ్యారు. శనివారం సీబీఐ ఛార్జ్ షీట్‌పై విచారణ జరిపిన స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా.. అనంతరం కేసును వాయిదా వేశారు. తదుపరి కేసు విచారణ నవంబర్ 8వ తేదీన చేపట్టనున్నట్లు కోర్టు పేర్కొంది.చదవండి: టమాటాలకు పోలీసు బందోబస్తు -
లిక్కర్ కేసు: కోర్టుకు హాజరైన కవిత, సిసోడియా
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారం(అక్టోబర్ 4) విచారణ జరిపింది. ఈ విచారణకు హాజరయిన ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా ఇతర లిక్కర్ కేసు నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు.తదుపరి విచారణను కోర్టు అక్టోబర్ 19కి వాయిదా వేసింది. కాగా, లిక్కర్ కేసులో కవిత, మనీష్ సిసోడియాతో పాటు అరవింద్ కేజ్రీవాల్ తదితర ప్రధాన నిందితులకు ఇటీవలే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు విచారణకు కోర్టు ఆదేశాల ప్రకారం వీరంతా హాజరవ్వాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: ఇల్లు ఖాళీ చేసిన కేజ్రీవాల్ -
ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం.. వ్యూహాత్మకంగా ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఎమ్మెల్సీ కవిత వెనక్కి తీసుకున్నారు. ఇదే పిటిషన్‌పై సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ తన తరుఫున వాదించే సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో మరో రోజు విచారణ చేపట్టాలని కోరారు. కానీ అనూహ్యంగా ఈ రోజు పిటిషన్‌ను ఉప సంహరించుకున్నారు.అయితే పిటిషన్ విత్‌డ్రాలో కవిత బెయిల్ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం సుప్రీం కోర్టును ఆశ్రయించి.. అక్కడి నుంచి బెయిల్ పొందేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.కవితకు దెబ్బ మీద దెబ్బమరోవైపు మద్యం పాలసీ కేసులో సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కావాలని కోరుతూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్ తిరస్కరించింది. విచారణ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వకూడదని దర్యాప్తు సంస్థలు కోర్టులో తమ వాదనలు వినిపించాయి. ఆమె ప్రభావవంతమైన వ్యక్తి కాబట్టి సాక్ష్యాలు,సాక్ష్యుల్ని తారుమారు అయ్యే అవకాశం ఉందని, బెయిల్ ఇవ్వొద్దని తెలిపాయి. ఈ అంశాలను పరిణగలోకి తీసుకున్న కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది.చివరి అస్త్రంగా డీఫాల్ట్ బెయిల్ పిటిషన్.. అంతలోనే ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా కవితకు చుక్కెదురైంది. దీంతో న్యాయ బద్దంగా బెయిల్ పొందేందుకు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. సీబీఐ ఛార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని జులై 6న కవిత దాఖలు చేసిన డీఫాల్ట్ బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ ఛార్జ్‌షీట్‌లో తప్పులు లేవని సీబీఐ తరుఫు లాయర్లు కోర్టులో వాదించారు. ఇప్పటికే సీబీఐ ఛార్జ్ షీట్‌ను జులై 22న పరిగణలోకి కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో సోమవారం విచారణ జగింది. సుప్రీం కోర్టుకు కవితవిచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని ఆమె తరఫు న్యాయవాది రౌజ్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజాకు విన్నవించారు. దాంతో న్యాయమూర్తి ఈ కేసును చివరిసారి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. బుధవారం విచారణ సమయంలో వాదనలు వినిపించకపోతే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని న్యాయవాదికి సూచించారు. ఈ కేసు విచారణ ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన నేపథ్యంలో న్యాయమూర్తి ఈ వ్యాఖ్య చేశారు. ఆగస్ట్ 9కి వాయిదా వేశారు. రేపు కోర్టులో విచారణ జరగనుండగా.. అనూహ్యంగా డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. త్వరలోనే సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. -
కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా!
ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్టులో విచారణ ఇవాళ జరిగింది. అయితే సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేనందున మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు. మరోవైపు ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితకు బీఆర్ఎస్ నేతలు ధైర్యం చెప్పనున్నారు. రేపు తీహార్ జైల్లో ఉన్న కవితతో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ములాఖత్ కానున్నారు.ములాఖత్‌లో భాగంగా కవితను కలిసి ధైర్యం చెప్పనున్న బీఆర్ఎస్ నేతలు. Delhi Excise policy case | The Rouse Avenue court adjourned the hearing on the bail plea of BRS leader K Kavitha till August 7.Counsel sought time to argue. She has sought a default bail in CBI case linked to Delhi excise policy.— ANI (@ANI) August 5, 2024 -
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?
ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను మార్చి 15న తొలుత ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేశాయి. ఈ రెండు దర్యాప్తు సంస్థలు పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలని గతంలోనే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయల్ కోర్టు) విచారణ చేపట్టింది. విచారణ సమయంలో ఢిల్లీ మద్యం పాలసీలో కవిత ముఖ్యపాత్ర పోషించారని, బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాల్ని తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ, సీబీఐలు తమ వాదనల్ని వినిపించాయి. అందుకు తగిన ఆధారాల్ని కోర్టు ముందుంచాయి. దీంతో ట్రయల్ కోర్టు కవితకు బెయిల్‌ను తిరస్కరించింది. అయితే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కవిత బెయిల్ పిటిషన్‌పై జూలై 22న ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా కేసును సోమవారానికి (ఆగస్టు 5)కి వాయిదా వేశారు. ఇవాళ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగనుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది తీవ్ర ఉత్కంఠంగా మారింది. -
లిక్కర్ స్కాం: కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రిమాండ్ పొడిగించింది ట్రయల్ కోర్టు. రిమాండ్ గడువు ముగియడంతో ఇవాళ(బుధవారం) ఆమెను వర్చువల్‌గా ట్రయల్ కోర్టు(రౌస్ అవెన్యూ కోర్టు) ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు. దీంతో ఆగష్టు 13దాకా జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది ట్రయల్ కోర్టు. ఇదిలా ఉంటే.. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీలను సైతం కోర్టు పొడిగించింది. మరోవైపు సీబీఐ కేసులో.. దర్యాప్తు సంస్థ ప్రవేశపెట్టిన ఛార్జ్‌షీట్‌పై విచారణ ఆగష్టు 9వ తేదీకి వాయిదా పడింది. ఈ కేసులో కవిత ఏ17గా ఉన్నారు. కవితతో పాటు మిగతా నిందితులను కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. అయితే.. సీబీఐ ఛార్జ్‌షీట్‌ను పరిశీలించేందుకు కొంత సమయం కావాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. అయితే ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని జడ్జి కావేరీ బవేజా, కవిత లాయర్‌కు గుర్తు చేశారు. చివరకు.. ఆ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను వాయిదా వేశారు. -
ముగిసిన జ్యుడిషియల్ కస్టడీ.. నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యూడిషయల్ కస్టడీ నేటితో ముగియనుంది. జ్యుడియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు నేడు హాజరుకానున్నారు. మరోసారి కవితకు సీబీఐ కేసులో జ్యూడిషియల్ కస్టడి పొడిగించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కవితను అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జ్వరం, గైనిక్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు. -
కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే.. కస్టడీ పొడిగింపు
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. దీంతో, కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు. కాగా, లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపుపై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాదనల అనంతరం కేజ్రీవాల్ కస్టడీని జూలై 25వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని కోర్డు పొడిగించింది. దీంతో, ఆయన మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు. Delhi Excise policy CBI case: Rouse Avenue Court has extended judicial custody of CM Arvind Kejriwal in the CBI case till July 25.(file pic) pic.twitter.com/HpehzDbDE5— ANI (@ANI) July 12, 2024 ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వీరు ముగ్గురే కీలకమని ఈడీ గట్టిగా వాదిస్తోంది. -
నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవిత కేసు విచారణ
సాక్షి,న్యూఢిల్లీ : నేడు లిక్కర్ స్కాంలో సీబీఐ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. సీబీఐ కేసులో కవితపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసు విచారణకు రానుంది. సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఏముందిఢిల్లీ మద్యం పాలసీలో మార్చి 15న ,2024న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. అదే కేసులో ఏప్రిల్ 11న సీబీఐ అరెస్ట్ చేసింది. ఆ సమయంలో మద్యం కేసులో కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ పలు ఆధారాలతో కూడిన ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో సీబీఐ, ఈడీ కేసుల్లో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.ఈడీ,సీబీఐ ఆధారాల్ని తోసిపుచ్చలేంకోర్టు విచారణ సమయంలో సీబీఐ, ఈడీలు కొత్త ఆధారాల్ని వెలికితీయడం, కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఢిల్లీ హైకోర్టులో బెయిల్ కోరుతూ బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మద్యం పాలసీ కేసులో కవిత ప్రమేయం ఉందని నిరూపించేలా ఈడీ,సీబీఐ ఆధారాలు సేకరించిందని, వాటిని తోసిపుచ్చలేమని స్పష్టం చేసింది. బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది.మరిన్ని ఆధారాలు ఉన్నాయంటూఈ నేపథ్యంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పాలసీ కేసుకు సంబంధించి తమ వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని, మరోసారి విచారించేందుకు అనుమతి కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లో తెలిపింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. ఒకవేళ సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై కోర్టు సానుకూలంగా స్పందిస్తే.. దానికి అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసి.. కేసుకు సంబంధిత కొత్త ఆధారాల్ని కోర్టుకు అందజేయాల్సి ఉంటుంది. -
కవిత జ్యూడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడిషియల్ కస్టడీని కోర్టు మళ్లీ పొడిగించింది. కస్టడీ ముగియడంతో బుధవారం ఉదయం ఆమెనుతీహార్ జైలు అధికారులు వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. దీంతో జడ్జి జులై 25వ తేదీ వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్ నివాసంలో ఆమెను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఈడీ కేసులో కవిత కస్టడీని పలుమార్లు పొడిగించింది. మరోవైపు బెయిల్ కోసం ఆమె చేస్తున్న అభ్యర్థనలను న్యాయస్థానాలు తోసిపుచ్చుతూ వస్తున్నాయి. కవితతో పాటు ఆప్ నేత మనీష్ సిసోడియా కస్టడీని సైతం అదే తేదీ దాకా పొడిగించింది. -
లిక్కర్ కేసులో కేజ్రీవాలే కీలకం: సీబీఐ
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ కేసు విచారణలో భాగంగా.. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇవాళ హైడ్రామా నడిచింది. కోర్టులోనే కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. లిక్కర్ కేసులో కీలక విషయాలు రాబట్టాలంటే ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని వాదించింది. ఈ క్రమంలో ఐదు రోజుల కస్టడీ కోరింది. లిక్కర్ కేసులో సోమవారం నాడు తీహార్ జైల్లోనే సీబీఐ విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. బుధవారం ఉదయం తీహార్ జైలు అధికారులు ఆయన్ని కోర్టుకు తీసుకొచ్చారు. అనంతరం.. కేజ్రీవాల్‌ను సీబీఐ తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. అయితే.. కేజ్రీవాల్‌ను ఇంకా అధికారికంగా అరెస్ట్ చేయని విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. దీంతో కోర్టు అనుమతి కోరారు సీబీఐ తరఫు లాయర్. అయితే.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి అందుకు అభ్యంతరం తెలిపారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ చేయాల్సిన అవసరానికి గల కారణాలను సీబీఐ, న్యాయమూర్తికి వివరించారు.‘‘లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాలే కీలకం. ఆయన నివాసంలోనే మద్యం పాలసీ తయారైంది. సౌత్‌లాబీకి కేజ్రీవాల్ పూర్తిగా సహకరించారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ మధ్య మీటింగ్ ఏర్పాటు చేశారు. కేజ్రీవాల్ గోవా పర్యటనకు నగదును హవాలా మార్గంలో సమకూర్చారు. రూ.338 కోట్లు ేతులు మారినట్లు ఆధారాలున్నాయి. అందుకే ఆయన్ని ప్రశ్నించాల్సి ఉంది’’ అని సీబీఐ వాదించింది. విచారణ జరుగుతున్న సమయంలో.. కేజ్రీవాల్ కళ్లు తిరుగుతున్నాయని, టీ-బిస్కెట్ కావాలని కోరారు. దీంతో ఆయన షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని నిర్ధారించుకున్న అధికారులు.. కోర్టు అనుమతితో ఆయన్ని మరో గదిలోకి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు. #WATCH | Delhi CM and AAP National Convenor Arvind Kejriwal being produced at the Rouse Avenue Court by CBI for a hearing in the liquor policy case. pic.twitter.com/ruFdQNecu4— ANI (@ANI) June 26, 2024 -
Delhi liquor scam: సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తనకు ఇచి్చన బెయిల్‌పై మధ్యంతర స్టే విధిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఈ నెల 20న బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈ నెల 21న ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. మనీ లాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ ఆయనను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
లిక్కర్ స్కాం: కేజ్రీవాల్ బెయిల్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్ కేసులో బెయిల్ కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.కాగా, కేజ్రీవాల్ పిటిషన్‌పై నేడు(గురువారం) రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపిస్తూ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పాత్ర ఉందని స్పష్టం చేసింది. అలాగే, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, ఈ కేసు దర్యాప్తునకు ఆయన సహకరించడంలేదని తెలిపింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొదని కోర్టును కోరింది. #WATCH | Delhi: On Delhi CM Arvind Kejriwal's bail plea hearing, ASG SV Raju says, "Mainly, we have shown his role as pointed earlier, regarding demand of Rs 100 Crores and how the money went to Angadias. We have shown that Angadias sent this money to Goa to Chanpreet Singh of… pic.twitter.com/bkRfliTWsQ— ANI (@ANI) June 20, 2024 బుధవారం జరిగింది ఇది.. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ లంచంగా రూ.100 కోట్లను డిమాండ్ చేశారని ఈడీ ఆరోపించించి. రెగ్యులర్ బెయిల్ కోసం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ బుధవారం ఢిల్లీలోని ప్రత్యేక కోర్టులో వాదనలు వినిపించింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని ముద్దాయిగా చేర్చడాన్ని సమర్ధించుకుంది. రాజకీయ పార్టీ నేరానికి పాల్పడిందంటే దానికి పార్టీ అధినేతే కారణంగా ఉంటారని పేర్కొంది.కాగా, కేజ్రీవాల్‌కు ఇదివరకు విధించిన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో బుధవారం ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. జులై 3 వరకు కస్టడీ గడువును పొడిగిస్తున్నట్లు ప్రత్యేక కోర్టు జడ్జి న్యాయ్ బిందు తెలిపారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్‌పైనా ఇరుపక్షాల వాదనలను జడ్జి విన్నారు. పార్టీకి అవసరమైన నిధుల కోసం రూ.100 కోట్లు ఇవ్వాల్సిందిగా సౌత్గ్రూప్ను కేజ్రీవాల్ డిమాండ్ చేశారని ఈడీ ఆరోపించింది. ఈ మొత్తం హవాలా మార్గంలో గోవాకు చేరిందని తెలిపింది.మరోవైపు.. ఈడీ వాదనలను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. కేజ్రీవాల్ కేసు మొత్తం వాంగ్మూలాలపైనే ఆధారపడి ఉందని, అంతకుమించి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ఆ వాంగ్మూలాలు ఇచ్చిన వ్యక్తులందరూ ఇదే కేసులో నిందితులుగా, అప్రూవర్లుగా ఉన్నారని గుర్తు చేశారు. మరి కొందరైతే అరెస్టు చేయబోమనే హామీని దర్యాప్తు సంస్థ నుంచి పొందారని పేర్కొన్నారు. కేజ్రీవాల్ కస్టడీని పొడిగించడం తగదని వాదించారు. దీంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. -
జులై 3దాకా తీహార్ జైల్లోనే కవిత!
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది స్పెషల్ కోర్టు. ఈడీ కేసులో జులై 3వ తేదీదాకా కస్టడీ పొడిగిస్తున్నట్లు సోమవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దీంతో బెయిల్ వచ్చేదాకా ఆమె తీహార్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో ఈ ఉదయం స్పెషల్ కోర్టుకు తీసుకొచ్చారు తీహార్ జైలు అధికారులు. ఈ సందర్భంగా కవితపై దాఖలైన ఈడీ చార్జిషీట్‌ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ మేరకు ఆ అభియోగ పత్రాలను కవిత తరఫు న్యాయవాదికి అందజేసింది. ఆ వెంటనే ఈడీ కేసులో కస్టడీని మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు జడ్జి కావేరీ బవేజా వెల్లడించారు. ఇక.. కోర్టుకు వచ్చిన కవితను భర్త అనిల్, ఇద్దరు కొడుకులను కలిసేందుకు అనుమతిచ్చారు స్పెషల్ కోర్టు జడ్జి. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. కవితపై ఈడీ చార్జ్‌షీట్‌లో కీలక అంశాలులిక్కర్ కేసులో కవిత పై ఈడీ అభియోగాలను పరిగణనలోకి తీసుకున్న స్పెషల్ కోర్టుఈడి మనీలాండరింగ్ కేసులో కవితను నిందితురాలిగా చేర్చిన స్పెషల్ కోర్టురూ. 1100 కోట్ల నేరం జరిగిందని చార్జ్‌షీట్‌లో పేర్కొన్న ఈడీరూ. 192 కోట్ల లాభాలను ఇండో స్పిరిట్స్ పొందింది100 కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారుకవిత డిజిటల్ ఆధారాలు ధ్వంసం చేసినట్లు పేర్కొన్న ఈడీసీబీఐ కేసులోనూ కస్టడీ పొడిగింపుమరొకవైపు సీబీఐ కేసులో సైతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు. సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 7 వరకు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ క్రమంలో కవిత పై చార్జ్ షీట్‌ను జూన్ 7న సీబీఐ దాఖలు చేయనుంది. సీబీఐ కేసులో భాగంగా నేటి మధ్యాహ్నం కవితను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు జైలు అధికారులు. -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు 5కు వాయిదా
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న తనకు ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో కేజ్రీవాల్ ఆదివారం తీహార్ జైలులో లొంగిపోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. -
ఢిల్లీ లిక్కర్ కేసు: రౌస్ అవెన్యూ కోర్టుకు సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. గురువారం కేజ్రీవాల్ రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపుపై రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పరిగణనలోకి తీసుకునే అంశంపై మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి భవేజా విచారణ జరపనున్నారు.మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజులు పొడిగించాలని కోరుతూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను విచారించే అవకాశం లేదని సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లిస్టింగ్‌కు సుప్రీం రిజిస్ట్రీ నిరాకరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు ఆయనకు స్వేచ్ఛ ఉందని తెలిపింది. అందుకే ఈ పిటిషన్ విచారణార్హమైనది కాదని పేర్కొంది.ఈ నెల మొదట్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం కోసం షరతులతో కూడిన 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు మంజూరు చేసింది. జూన్ 2న మళ్లీ తిరిగి తిహార్ జైలులో లొంగిపోవాలని పేర్కొన్న విషయం తెలిసిందే. గడవు దగ్గర పడుతున్న సమయంలో అనారోగ్యానికి సంబంధించి మరో ఏడు రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ కోరుతూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణార్హమైనది కాదని సుప్రీం కోర్టు బుధవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. -
బ్రిజ్‌భూషణ్‌కు షాక్.. రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ : జాతీయ రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగలింది. లైంగిక వేధింపుల కేసు వ్యవహారంలో బ్రిజ్ భూషణ్ సింగ్‌పై అభియోగాలు మోపాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అందుకు తగిన ఆధారాలు రికార్డుల్లో ఉన్నాయని కోర్టు పేర్కొంది. బ్రిజ్ భూషణ్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 354 (మహిళల నిరాడంబరతకు భంగం కలిగించడం), 354-ఎ (లైంగిక వేధింపులు), 506 (నేరపూరిత బెదిరింపు) కింద అభియోగాలు మోపాలని ఆదేశించింది. ఫెడరేషన్ మాజీ సహాయ కార్యదర్శి వినోద్ తోమర్‌పై కూడా సెక్షన్ 506 కింద అభియోగాలు మోపాలని పోలీస్ శాఖకు కోర్టు సూచించింది. గత ఏడాది జూన్‌లోలైంగిక వేధింపుల కేసులో గత ఏడాది జూన్‌లో బ్రిజ్ భూషణ్,అతని సహచరుడు వినోద్ తోమర్‌పై ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు. ఛార్జిషీట్లో ఐపీసీ సెక్షన్లు 354 (దౌర్జన్యం లేదా నేరపూరిత శక్తి), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంబడించడం), 109 (ప్రేరేపణ), 506 (నేరపూరిత బెదిరింపు) కింద కేసులు నమోదు చేశారు.1,500 పేజీల ఛార్జిషీట్‌లోపోలీసులు 1,500 పేజీల ఛార్జిషీట్లో బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలకు మద్దతుగా రెజ్లర్లు, ఒక రిఫరీ, ఒక కోచ్, ఫిజియోథెరపిస్ట్‌తో సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన 22 మంది సాక్షుల వాంగ్మూలాలను చేర్చారు.నో టికెట్‌ఉత్తర్ ప్రదేశ్ కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి వరుసగా మూడు సార్లు బ్రిజ్‌భూషణ్ ప్రాతినిధ్యం వహించారు. అయితే లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ గతేడాది జనవరిలో సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ సహా అగ్రశ్రేణి రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ సారి కైసర్‌గంజ్ స్థానంలో పార్టీ ఆయన కుమారుడు కరణ్ భూషణ్ సింగ్‌కు అవకాశం కల్పించింది. కాగా, గత నెలలో కరణ్ భూషణ్ సింగ్ ఎంపీగా నామినేషన్ వేసే సమయంలో 10 వేలమంది బ్రిజ్‌భూషణ్ అనుచరులు.. 700 వాహనాలతో తరలివచ్చినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. -
కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, కాబట్టి కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. దీంతో.. మే 20 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 21వ తేదీన ఈడీ మనీలాండరింగ్ అభియోగాలతో కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ.. మధ్యంతర బెయిల్ కోసం ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బెయిల్ కోరుతూ ఆమె వేసిన రెండు పిటిషన్లను ట్రయల్ కోర్టు కొట్టేసింది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులను సవాల్ చేస్తూ కవిత విడివిడిగా బెయిల్‌పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై మూడు రోజులపాటు విచారణ జరిగింది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా.. ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్నారు. చివరకు బెయిల్ నిరాకరిస్తూ ఇవాళ(సోమవారం) తీర్పు ఇచ్చారు.లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన హైదరాబాద్‌లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై జ్యూడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైల్లో ఉన్న కవితను.. సీబీఐ కూడా అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి అక్రమార్జన చేశారని కవితపై అభియోగాలు నమోదు చేశాయి ఇరు దర్యాప్తు సంస్థలు. మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించినందుకుగానూ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల రూపాయల లంచం కవిత ఇచ్చారని, ఆ వంద కోట్లను సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి వసూలు చేశారని ఈడీ, సీబీఐలు ఆరోపించాయి. అంతేకాదు.. ఈ వ్యవహారంలో పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్ లో 33% వాటా కవిత దక్కించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. వాదనలు ఇలా.. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని, ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని ఇటు ఈడీ, అటు సీబీఐ వాదించాయి. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని వాదనలు వినిపించాయి.అయితే కేవలం రాజకీయ కక్షతో ఈ కేసు పెట్టారని, కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకుని కవితను అరెస్ట్ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. అంతేకాదు ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని వాదనలు వినిపించారు. ఇదీ చదవండి: కవిత అరెస్టు అక్రమం కాదు! వాదనలు విన్న న్యాయమూర్తి కావేరీ బవేజా.. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవిస్తూ కవిత పిటిషన్లను డిస్మిస్ చేశారు.రేపటితో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టును ఆమె ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
లిక్కర్ కేసు: కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగనుంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో ఆమె వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును గురువారం ఉదయం వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక స్థానం. లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులపై బెయిల్ కోరుతూ కవిత తరఫున వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ సీబీఐ అరెస్ట్ వ్యవహారంపై ఆమె వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. ఆ తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేసింది ప్రత్యేక కోర్టు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఒకేరోజు వేర్వేరుగా తీర్పులు ఇస్తామని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా స్పష్టం చేశారు. ఇక.. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ చెప్పుకొచ్చింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలులేవని వాదనలు వినిపించారు.ఈడీ బెయిల్ పిటిషన్‌పై వాడీవేడి వాదనలుఇక.. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అయితే వాదనల అనంతరం కోర్టు దానిని తిరస్కరించింది. దీంతో ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. మే 6వ తేదీన వెల్లడిస్తామని తెలిపింది. విచారణ సందర్భంగా.. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే కవితను సెక్షన్ 19 కింద చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. రూ. 581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని... అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారన్నారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కిందని.,. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు. పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని చెప్పారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారన్ నారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని.. అసాధారణ లాభాలు గడించారని కోర్టుకు విన్నవించారు. బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారన్నాు. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కలేదని కోర్టుకు తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం గమనార్హం. -
MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దీంతో, కవిత నేడు జైలు నుంచి బయటకు వస్తుందా? లేదా అనే సస్పెన్స్ నెలకొంది.ఇక, లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గతంలో ఆమె పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తుది తీర్పు వెలువడనుంది. కాగా, కవిత పిటిషన్ విచారణ సందర్భంగా వాడీవేడి వాదనలు కొనసాగాయి. విచారణలో భాగంగా లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ చెప్పుకొచ్చింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలులేవని వాదనలు వినిపించారు. -
MLC Kavitha: కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో నిందితురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమె జ్యుడిషియల్ కస్టడీని మరో 14 రోజులపాటు పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. నేటితో ఆమె జ్యూడీషియల్ కస్టడీ ముగియగా.. తీహార్ జైలు నుంచి ఆమెను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరు పరిచారు. అయితే కస్టడీ పొడిగించాలంటూ ఇటు ఈడీ, అటు సీబీఐ కోరడంతో కోర్టు అందుకు అంగీకరించింది. కవిత బెయిల్‌పై వాదనలు లిక్కర్ స్కాంలో తనను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్రమంగా మార్చి 15వ తేదీన తనను అరెస్ట్ చేసిందని, తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడి వాదనలు కవితను అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఎప్పుడూ చెప్పలేదు మేము కోర్టు ధిక్కరణకు పాల్పడలేదు అరెస్టు చేయమని మేము కోర్టుకు అండర్ టేకింగ్ ఇవ్వలేదు కేవలం పది రోజుల వరకు సమన్స్ ఇవ్వమని చెప్పాం ఈ అంశంపై కవిత తాను వేసిన పిటిషన్ ఉపసంహరించుకున్నారు దీని అర్థం అంతా చట్టబద్దంగా జరిగింది సెక్షన్ 19 ప్రకారం మాకు అరెస్టు చేసే అధికారం ఉంది ఈ స్కాంలో సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చింది కవిత ఆదేశాల మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ 25 కోట్ల రూపాయలు ఇచ్చారు దీనిపై వారు వాంగ్మూలం ఇచ్చారు పాలసీని తమకు అనుకూలంగా మార్చారు ఇండో స్పిరిట్ ద్వారా లంచాల సొమ్ము తిరిగి రాబట్టుకున్నారు ఈడి జాతీయ దర్యాప్తు సంస్థ, దీనికి దేశమంతా పరిధి ఉంది ట్రాన్సిట్ రిమాండ్ లో ఎలాంటి ఉల్లంఘన జరగలేదు అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచాము పిఎంఎల్ఎ ప్రత్యేక చట్టం కనుక ట్రాన్సిట్ రిమాండ్ అవసరం లేదు ఈ చట్టం కింద మహిళలకు ప్రత్యేక హక్కులు ఏమీ లేవు అరుణ్ పిళ్లై కవితకు బినామీ ఇండో స్పిరిట్ లో 33.5% అరుణ్ పిళ్లై పేరు మీద కవిత తీసుకున్నారు ఈ వ్యవహారంలో కవిత, కేజ్రీవాల్ మధ్య రాజకీయ అవగాహన ఉంది డీల్ లో భాగంగా రూ.100 కోట్లు ఇచ్చినట్లు దినేష్ అరోరా దర్యాప్తులో అంగీకరించారు బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో కూడా ఈ విషయం బయటపడింది ఆర్థిక నేరాల కుట్ర గుట్టుగా జరుగుతుంది ఈ కేసుల్లో నేరుగా నగదు వ్యవహారాల ఆధారం దొరికే అవకాశం ఉండదు వివిధరకాల వ్యక్తుల స్టేట్మెంట్స్, ఇతర సాక్షాలు ఆధారంగా అక్రమ సొమ్ము ను గుర్తించవచ్చు అని గతంలో పై కోర్టులు తీర్పు ఇచ్చాయి ఈ కేసులో కూడా కవిత నేరం చేయలేదు అనే దానికి ఎలాంటి ఆధారం లేదు ఈ కేసు ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు దశలోనే ఉంది ఈ కేసులో కవితకు పూర్తి స్థాయిలో సంబంధం ఉందని అనే దానికి సాక్ష్యాలున్నాయి కవిత తరపు లాయర్ వాదనలు మరోవైపు కస్టడీ పొడిగింపు అవసరం లేదని, ఈడీ కొత్తగా ఏ అంశాలను జత చేయలేదని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు విచారణ పురోగతిపైనా ప్రభావం ఉంటుందని ఈడీ తరఫు న్యాయవాది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. సాక్ష్యాలను తారుమారు చేస్తారని అరెస్ట్ చేసిన రోజునుంచి ఆరోపిస్తున్నారు, కొత్తగా ఏమీ చెప్పడం లేదంటూ కవిత తరపు న్యాయవాది రాణా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు పురోగతిని ఈడీ కోర్టుకు అందజేసింది. అంతేకాదు 60 రోజుల్లో కవిత అరెస్ట్ పై చార్జిషీట్ సమర్పిస్తామని ఈ సంద్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో.. మే 7 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు లిక్కర్ కేసులో సీబీఐ ఏప్రిల్ 11వ తేదీన కవితను అరెస్ట్ చేసింది. ఈ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై మే 2 వ తేదీ తీర్పు వెల్లడించన్నారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా. -
నేడు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ
-
మూడు మామిడి పండ్లే తిన్నా.. ఢిల్లీ కోర్టులో కేజ్రీవాల్ వాదన
న్యూఢిల్లీ: జైలులో తాను తీసుకుంటున్న ఆహారాన్ని ఈడీ రాజకీయం చేస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. డయాబెటిస్ బాధితుడినైన తనకు జైలులో ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ రౌస్అవెన్యూ కోర్టులో శుక్రవారం వాదనలు కొనసాగాయి. మెడికల్ బెయిల్ పొందడానికి లేదా చికిత్స పేరిట ఆసుపత్రిలో చేరడానికి వీలుగా రక్తంలో చక్కెర స్థాయిలు పెంచుకోవడానికి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ గురువారం కోర్టు దృష్టికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈడీ వాదనపై కేజ్రీవాల్ శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తనకు ఇప్పటిదాకా 48 సార్లు ఇంటి నుంచి భోజనం పంపగా, కేవలం మూడుసార్లు మాత్రమే మామిడిపండ్లు తిన్నానని కేజ్రీవాల్ తెలిపారు. కేవలం ఒకే ఒక్కసారి ఆలూ పూరీ తీసుకున్నానని, అది కూడా నవరాత్రి ప్రసాదంగా స్వీకరించానని కోర్టుకు తెలియజేశారు. వైట్ రైస్, బ్రౌన్ రైస్ కంటే మామిడి పండ్లలో చక్కెర స్థాయి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. షుగర్ లేని స్వీట్లు ఆరుసార్లు తిన్నానని, షుగర్ లేకుండా టీ తాగుతున్నానని వెల్లడించారు. తనకు చికిత్స అందించే రెగ్యులర్ వైద్యుడు సూచించిన డైట్ చార్ట్ ప్రకారమే ఆహారం తీసుకుంటున్నానని వివరించారు. ప్రతిరోజూ 15 నిమిషాలపాటు డాక్టర్‌ను సంప్రదించడానికి అనుమతి ఇవ్వాలంటూ శుక్రవారం మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇన్సులిన్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌తోపాటు ఈ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. -
‘ఆయనేమైనా నేరస్థుడా? గ్యాంగ్‌స్టరా?’.. కోర్టులో కేజ్రీవాల్ తరుపు న్యాయవాది
న్యూఢిల్లీ : తనకు తీహార్ జైల్లోనైనా డయాబెటీస్ ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజ్వర్‌లో ఉంచింది. ఏప్రిల్ 22న తీర్పును వెలువరించనుంది. మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ పడిపోతున్నాయని, ట్రీట్మెంట్ తీసుకునేందుకు వైద్యుల వీడియో కన్సల్టేషన్ కావాలని ఇప్పటికే పలు మార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వచ్చింది. కేజ్రీవాల్‌పై కుట్ర అయితే కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు,ఆప్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సులిన్ ఇవ్వకుండా కేజ్రీవాల్‌ను చంపేందుకు జైల్లో కుట్రజరుగుతోందని ఆప్ నేత అతిషి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులో కేజ్రీవాల్ మరో పిటిషన్ ఈ తరుణంలో తనకు ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈడీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఈడీ ఆరోపణల్ని తోసుపుచ్చిన న్యాయవాది కేజ్రీవాల్ జైలులో కేవలం మూడుసార్లు మామిడి పండ్లను తిన్నారని, నవరాత్రి ప్రసాదంగా ఆలూ పూరీని సేవించారని కోర్టుకు తెలిపారు. మెడికల్ బెయిల్ పొందేందుకు ఆప్ అధినేత హై షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలను తోసిపుచ్చారు. మూడు మామిడి పండ్లే తిన్నది కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఇన్సులిన్ వేసుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్థనపై సింఘ్వీ కోర్టులో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఇప్పటి వరకు 48 సార్లు ఇంటి నుంచి పంపిన భోజనం చేశారు. గ్లైసెమిక్ ఇండెక్స్ వ్యాల్యూ ఆధారంగా మూడు మామిడి పండ్లను మాత్రమే తిన్నారు. మామిడి (51) ,వైట్ రైస్ (73) లేదా బ్రౌన్ రైస్ (68) కంటే తక్కువగా ఉంది అని సింఘ్వీ కోర్టులో వాదించారు. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న స్వీట్లను తింటున్నారన్న ఈడీ ఆరోపణలపై సంఘ్వీ స్పందించారు. సీఎం ఆరుసార్లు షుగర్ లేని స్వీట్లు తిన్నారని, షుగర్ లేకుండా టీ తాగేవారని, షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లను వాడారని ఆయన అన్నారు. హాస్యాస్పందంగా ఈడీ తీరు మామిడి పండ్లు తిని మెడికల్ బెయిల్ తీసుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాంటూ ఈడీ చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని సింగ్వీ అన్నారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ నేరస్థుడా? గ్యాంగ్‌స్టరా? సంఘ్వీ ప్రశ్నించారు. ఆయన ఇప్పటి వరకు 15 నిమిషాల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుల సాయంతో ట్రీట్మెంట్ తీసుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ఓసారి మీరే వైద్యులు కేజ్రీవాల్‌కు సూచించిన ఆహారాన్ని చూడండి. ఇందులో తియ్యని పండ్లు, లేదా ఇతర తీపి పదార్ధాల గురించి ప్రస్తావించలేదు’ అని కోర్టుకు విన్న వించుకున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఏప్రిల్ 22న వెలవరించనుంది. #WATCH | Delhi: Ramesh Gupta, the lawyer for Delhi CM Arvind Kejriwal in the liquor policy case, says, "We have moved a petition requesting the Court to allow Mr Kejriwal to consult his doctor who has been treating him for the last many years. But that request was opposed by the… pic.twitter.com/FDc50cS04t — ANI (@ANI) April 19, 2024 -
‘నా షుగర్ లెవల్స్ పడిపోతున్నాయ్’.. కోర్టులో సీఎం కేజ్రీవాల్
లిక్కర్ మద్యం పాలసీ కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. తన షుగర్ లెవల్స్ పడిపోతున్నాయని, క్రమం తప్పకుండా తనిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన రెగ్యులర్ డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి కావాలని కోరుతూ రౌన్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. అరెస్టుకు ముందు సీఎం కేజ్రీవాల్‌ను పరీక్షించే వైద్యులతో వర్చువల్ కన్సల్టేషన్‌ను అనుమతించాలని కేజ్రీవాల్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు. ఈడీ కస్టడీ సమయంలో కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్ 46కి పడిపోయిందని తెలిపారు. అయితే కేజ్రీవాల్ అభ్యర్ధనను ఈడీ వ్యతిరేకించింది. తీహార్ జైల్లో అటువంటి రోగులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయని, అందులో ఉండి కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చని వాదించింది. నేను (కేజ్రీవాల్) నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటుంటే ఈడీ ఎందుకు వ్యతిరేకిస్తోంది? అని కేజ్రీవాల్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. దీంతో కేజ్రీవాల్ విజ్ఞప్తికి సమాధానం ఇచ్చేందుకు తమకు తగిన సమయం కావాలని ఈడీ తరుపు న్యాయ వాది కోర్టును కోరారు. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 18న మధ్యాహ్నం 2 గంటలకు రూస్ అవెన్యూ కోర్టులో జరగనుంది. -
కవితకు వార్నింగ్ ఇచ్చిన జడ్జి.. కారణం ఇదే..
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. లిక్కర్ స్కాం కేసులో కవితకు ఈనెల 23వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీంతో సీబీఐ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఉదయం కవితను సీబీఐ అధికారులు ప్రత్యేక కోర్టులో సీబీఐ న్యాయమూర్తి కావేరి బవేజా ముందు ప్రవేశ పెట్టారు. ఆ సమయంలో సీబీఐ తన వాదనలు వినిపిస్తూ.. సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించాం. ఆమె విచారణకు సహకరించలేదని వెల్లడించింది. ఈ క్రమంలో కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని కోరింది. అందుకోసం మరో 14 రోజులు కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరగా.. కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈనెల 23వ తేదీ వరకు కవితకు కోర్టు కస్టడీని పొడిగించింది. ఇదే సమయంలో కవితపై ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై సీరియస్ అయ్యారు. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగినా ఎలా మాట్లాడతారు అంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు. ఇంకోసారి ఇలా మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతరం, కవిత బయటకు వస్తూ సీబీఐపై ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కవిత.. ‘‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ అడిగిందే.. లోపల సీబీఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’’ అని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. మార్చి 15వ తేదీన ఈడీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితను సీబీఐ అధికారులు మూడు రోజుల పాటు విచారించారు. లిక్కర్ స్కాంలో నిందితులు, అప్రూవర్లుగా మారిన వారు వచ్చిన వాంగ్మూలం, వాట్సాప్ చాట్స్‌పై సీబీఐ కవితను ప్రశ్నించింది. ఈ సందర్బంగా కవిత విచారణను సీబీఐ వీడియో రికార్డు చేసింది. మరోవైపు.. ఆమె భర్త అనిల్, సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్‌రావులు నిన్న(ఆదివారం) కవితతో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా, ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్ నిరాకరించింది. ఇక, రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 16న విచారణ జరగనుంది. -
‘కవిత సీబీఐ విచారణ’ కేసు 26కు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ జైలులో విచారించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను బుధవా రం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్లో సీబీఐ రిప్లై ఇవ్వలేదని న్యాయవాది నితీష్ రాణా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రిప్లై ఇవ్వా లని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇవ్వకుండానే కవితను విచారించారన్నారు. శనివారం సాయంత్రం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సీబీఐ బేఖా తరు చేసిందన్నారు. దీనిపై తమ వాదనలు వినాలని కోరారు. అప్పటి వరకూ విచారణ అనుమతిపై స్టే ఇవ్వాలని కోరారు. అనంతరం, సీబీఐ తరఫు న్యాయ వాది వాదనలు విని పిస్తూ కవితను విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతే శనివారం మధ్యాహ్నం జైలులో విచారించామని ఈ నేపథ్యంలో కౌంటరు దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనల తర్వాత... భవిష్యత్తులో విచారణ చేస్తే ముందుగా అప్లికేషన్ దాఖలు చేయాలని సీబీఐకు న్యాయమూర్తి సూచించారు. ఈ నెల 26న విచారణ చేపడతామని న్యాయమూర్తి వాయిదా వేశారు. -
సీబీఐ ఇంటరాగేషన్.. కవిత పిటిషన్‌పై నేడు విచారణ
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంటరాగేషన్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో.. గడువు ఇస్తూ పిటిషన్‌పై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే.. శనివారం తీహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. -
మళ్లీ తీహార్ జైలుకే కవిత
సాక్షి, న్యూఢిల్లీ: జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. కవితకు ఈనెల 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మళ్లీ కవితను తీహార్ జైలుకు ఈడీ అధికారులు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కోర్టు ముందుకు కవితను ఈడీ అధికారులు హాజరుపర్చిచారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితం అవుతుందని జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని, కవిత జ్యుడీషియల్ కస్టడీ 14 పొడిగించాలని కోర్టును ఈడీ కోరింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగించడానికి ఈడీ వద్ద కొత్తగా ఏమి లేవని కవిత తరపు న్యాయవాది రానా పేర్కొన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతుందని, కవిత ప్రభావితం చేసే వ్యక్తి అని మొదటి నుంచి కానీ అలాంటిది ఏమి లేదన్నారు రానా.. కవితను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోరగా, కవితను కోర్టులో నేరుగా మాట్లాడేందుకు జడ్జి కావేరి బవేజా నిరాకరించారు. నేరుగా నిందితురాలు మాట్లాడేందుకు హక్కు కలిగి ఉంటారని కవిత తరపు న్యాయవాది తెలుపగా, అప్లికేషన్ వేసుకోవాలంటూ జడ్జి కావేరి బవేజా సూచించారు. కవితను కోర్టులో భర్త, మామ కలిసేందుకు కవిత న్యాయవాదులు అప్లికేషన్ ఇచ్చారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి.. తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. కాగా, కవితను విచారించాలని కోర్టులో ఇప్పటికే సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎల్లుండి విచారణ జరగనుంది. మార్చి 15వ తేదీన ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయగా, మార్చి 16న ఆమెను కోర్టు ముందు హాజరు పర్చారు. మార్చి 23 వరకు కవితకు ఈడీ కస్టడీ, అనంతరం మరో మూడు రోజులు కవితకు ఈడి కస్టడీని కోర్టు పొడిగించింది. 26వ తేదీన కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు విధించింది. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్‌లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది. ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. -
కవితకు దక్కని ఊరట.. బెయిల్ తీర్పులో కీలక అంశాలు
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఊరట దక్కలేదు. ఆమెకు మధ్యంతర బెయిల్ తిరస్కరిస్తూ సోమవారం ఉదయం రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్‌లోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ మేరకు జడ్జి కావేరి భవేజా 21 పేజీల తీర్పు వెల్లడించారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ విచారణ ఆలస్యం అవుతుండడంతో.. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలంటూ కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో పిల్లవాడికి తల్లి అవసరం ఉందని కవిత తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పరీక్షల నేపథ్యంలో బెయిల్ ఇవ్వానలి కోరారు. అయితే ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని, ఇప్పుడు బెయిల్ అవసరం లేదని కోర్టుకు ఈడీ తెలిపింది. పైగా కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈ క్రమంలో 4వ తేదీన వాదనలు ముగియగా.. తీర్పు రిజర్వ్ చేసి తీర్పు నేటికి వాయిదా వేశారు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ భవేజా. ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ ఇవాళ ఉదయం కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది ఇప్పటికే ఆమె కుమారుడికి ఏడు పరీక్షలు పూర్తి అయ్యాయని, ఇప్పుడు బెయిల్ అవసరం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. పైగా కవిత రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తి బయటకు వస్తే ఈ కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టులో వాదనలు వినిపించింది. ఈడీ వాదనలతో ఏకీభవిస్తూ ఇవాళ ఉదయం కోర్టు మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. కవిత బెయిల్ తీర్పులో కీలక అంశాలు కవితకు ఈడి నోటీసులు ఇచ్చిన తర్వాత తన ఫోన్లో డాటాను ధ్వంసం చేశారు ఫోరెన్సిక్ నివేదికలో ఈ విషయం నిర్ధారణ జరిగింది. బెయిల్ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేయగలరు. బెయిల్ ఇవ్వడానికి ట్రిపుల్ టెస్ట్ పాస్ కాలేదు. కవిత కుమారుడి వయసు 16 సంవత్సరాలు. ఇప్పటికే సగం పరీక్షలు పూర్తయ్యాయి. తండ్రి , పిన్ని తగినంత మానసిక ధైర్యం కుమారుడికి కల్పిస్తారు. పరీక్షల భయం మద్యంతర బెయిల్‌కు తగిన కారణం కాదు. తల్లిదండ్రులు భౌతికంగా అందుబాటులో లేకున్నా, 19 ఏళ్ల కుమారుడు స్పెయిన్‌లో చదువుకుంటున్నాడు. చిన్న కుమారుడు తండ్రి , పిన్ని సమక్షంలో చదువుకోవడానికి, పరీక్షలు రాయడానికి ఇబ్బంది ఏమీ ఉండదు. మహిళ అనే కారణంతో బెయిల్ ఇవ్వాలన్న అంశంపై కోర్టులు అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని జాగ్రత్తగా వ్యవహరించాలి. నేరాలలో బలి కావడానికి కవిత నిస్సహాయు రాయులైన మహిళ కాదు. కవిత సమాజంలో ఉన్నత స్థానంలోని విద్యావంతురాలు. సాక్షులను బెదిరించడం, సాక్షాలను ధ్వంసం చేయడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారని దానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళ అయినంత మాత్రాన పీఎంఎల్ఏ సెక్షన్ 45 (1) కింద బెయిల్ ఇవ్వలేం అందుకే కవిత బెయిల్ పిటిషన్ తిరస్కరిస్తున్నా. ఇదిలా ఉండగా.. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన కవిత మార్చి 26వ తేదీ నుంచి కవిత తీహార్ జైల్లో ఉన్నారు. కవితకు కోర్టు విధించిన 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. ఇవాళ కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించడంతో.. రేపు(మంగళవారం) మళ్లీ కోర్టు ముందు హాజరుపరుస్తారు. మరోవైపు.. కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై మాత్రం ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని కోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ పిటిషన్‌ను త్వరగతిన విచారణ చేప్టాలంటూ ఆమె కోర్టును ఆశ్రయిస్తూ మరో పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. -
లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్.. కవితకు కొత్త టెన్షన్!
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో ఉన్నారు. వారిని ఈ కేసు విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారిస్తోంది. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. కవిత పిటిషన్‌పై ఎప్పుడు విచారణ జరుపుతామో ఈరోజు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఇక, ఈ అంశంలో తన రిప్లై ఇచ్చేందుకు సమయంలో ఇవ్వాలని కోర్టును సీబీఐ కోరింది. దీంతో, సీబీఐ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను ఏప్రిల్ పదో తేదీకి వాయిదా వేసింది. అనంతరం, అప్పటి వరకు స్టేటస్ కో మెయింటైన్ చేయాలని కవిత తరఫు న్యాయవాది కోరారు. వాదనలు విన్న తర్వాతే ఎలాంటి ఆదేశాలైనా జారీ చేస్తామని కోర్టు స్పష్టం చేసింది. సీబీఐకి స్పెషల్ కోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో.. అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. -
తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రి తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఈ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కస్టడీ తాజాగా ముగియడంతో ఈడీ ఆయన్ని ఈ ఉదయం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. కోర్టు ఆయనకు ఏప్రిల్ 15వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అలాగే తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. తీహార్ జైలుకు తరలించే ముందు భార్య సునీత, మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్‌లను కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఇక.. ఇవాళ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ విచారణలో.. కేజ్రీవాల్ ఈ కేసు విచారణలో సహకరించడం లేదంటూ కోర్టుకు నివేదించింది. కేజ్రీవాల్ పొంతన లేని సమాధానాలతో దర్యాప్తును పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారని.. అలాగే తన డిజిటల్ డివైస్‌లను పాస్‌వర్డ్‌లను సైతం ఆయన చెప్పడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు కేజ్రీవాల్‌కు జ్యూడీషియల్ రిమాండ్ విధించినప్పటికీ.. భవిష్యత్తులో ఈడీ ఆయన్ని మరోసారి కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఇంకోవైపు.. తీహార్ జైల్లో కేజ్రీవాల్‌కు ప్రత్యేక వసతులు కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది రిక్వెస్ట్ పిటిషన్ వేశారు. జైలులో ప్రత్యేక ఆహారం, మందులు, అలాగే పుస్తకాలను అనుమతించాలని కోరారు. అదనంగా మతపరమైన లాకెట్ ధరించేందుకు కేజ్రీవాల్‌ను అనుమతించాలని పిటిషన్లో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో విచారణ కోసం రావాలంటూ తొమ్మిది సార్లు ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. ఊరట కోసం కేజ్రీవాల్ కోర్టులను ఆశ్రయించినా లాభం లేకపోయింది. దీంతో.. సివిల్ లేన్స్‌లోని నివాసంలో మార్చి 22వ తేదీన తనిఖీల పేరుతో వెళ్లిన ఈడీ.. కొన్ని గంటలకే ఆయన్ని అరెస్ట్ చేసి తమ లాకప్‌కు తరలించింది. తద్వారా సీఎం పదవిలో ఉండగా అరెస్టైన తొలి వ్యక్తిగా కేజ్రీవాల్ రికార్డుల్లోకి ఎక్కారు. ఇదీ చదవండి: అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటో తెలుసా? -
కవితకు బెయిల్ వచ్చేనా?
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. జ్యుడీషియల్ రిమాండ్ కింద ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. తన పిల్లలకు పరీక్షలున్నాయంటూ ఆమె వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ విచారించనుంది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నాయని, ఈ సమయంలో కుమారుడికి తన అవసరం ఉందని, అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. మద్యం పాలసీ కేసు విచారణలో ఉన్నదని, కవిత పలుకుబడి ఉన్న రాజకీయనేత అని, బెయిల్ ఇస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) విజ్ఞప్తి చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న మరిన్ని వాదనలు వింటామని చెబుతూ.. విచారణ వాయిదా వేసింది. అదే సమయంలో సుప్రీం కోర్టు సూచన మేరకు వేసిన సాధారణ బెయిల్ పిటిషన్‌నూ విచారణ చేపట్టాలని ఆమె తరఫు న్యాయవాదులు కోరే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లోని నివాసంలో కవితను ఈడీ అరెస్టు చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా, ఏడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. మూడురోజులకే అనుమతించింది. కస్టడీ ముగియడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరు పరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. తీహార్ అధికారుల తీరుపై.. ఇదిలా ఉంటే.. కోర్టు ఆమెకు జ్యుడిషియల్ రిమాండ్ విధించే సందర్భంలో కవిత కొన్ని విజ్ఞప్తులు చేశారు. జైల్లో తనకు కొన్ని ప్రత్యేక వసతులు కల్పించాలని న్యాయమూర్తి కావేరీ బవేజాను కోరారు. దీంతో ఇంటి నుంచి భోజనం, దుస్తులు, మంగళసూత్రం ధరించడం, సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లకు న్యాయమూర్తి అనుమతిచ్చారు. అయినప్పటికీ తీహార్ జైలు అధికారులు వాటికి అనుమతివ్వడం లేదంటూ కవిత తరఫు న్యాయవాది ఈనెల 28న మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సోమవారం విచారణ సందర్భంగా కవిత తరఫున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిసింది. ఒకవేళ మధ్యంతర బెయిల్ ఊరట దక్కని పక్షంలో.. జైల్లో రిమాండ్ ముగిసేవరకు ఆ వసతులైనా కల్పించేలా జైలు అధికారులకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరే అవకాశం కనిపిస్తోంది.