న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో విచారణ జరిగింది.
కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, కాబట్టి కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. దీంతో.. మే 20 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు.
మార్చి 21వ తేదీన ఈడీ మనీలాండరింగ్ అభియోగాలతో కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ.. మధ్యంతర బెయిల్ కోసం ఆయన సుప్రీంను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment