judicial custody
-
కన్నడ వర్ధమాన నటి రన్య రావు అరెస్ట్
చందనాన్ని స్మగ్లింగ్ చేస్తాడు. ఈ అందాల నటి నిజ జీవితంలో బంగారాన్ని దొంగ రవాణా చేయసాగింది. తరచూ విమానాల్లో ప్రయాణాలు, చుట్టరికాల మద్దతుతో హాలీవుడ్ సినిమా స్థాయిలో కేజీల కొద్దీ బంగారం బిస్కెట్లు, నగలను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. విధి వక్రించి అరెస్టయ్యింది.బనశంకరి: అరబ్ దేశాలనుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పట్టుబడిన కన్నడ వర్ధమాన నటి, ఓ డీజీపీ బంధువు రన్య రావు విచారణలో డొంకంతా కదులుతోంది. ఆమె నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.17.29 కోట్ల విలువైన పసిడి, నగదును సీజ్ చేశారు. ఈమె దుబాయ్ నుంచి 14.8 కేజీల బంగారాన్ని తీసుకొస్తూ సోమవారం రాత్రి బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో దొరికిపోవడం తెలిసిందే. అప్పటినుంచి ఆమెను డీఆర్ఐ అధికారులు విచారిస్తున్నారు. ఇంటిలో బంగారం నిల్వలు బెంగళూరు ల్యావెల్లీ రోడ్డు నందవాణి మ్యాన్సన్ నివాసంలో నటి రన్య రావు నివసిస్తోంది. ఆమె నెలకు రూ.4.5 లక్షల అద్దె చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఆ ఇంటిలో వెతికేకొద్దీ బంగారు బిస్కెట్లు, కడ్డీలు, ఆభరణాలు లభించాయి. మంగళవారం నుంచి సోదాలు నిర్వహించి రూ.2.06 కోట్ల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.2.67 కోట్ల నగదు కూడా లభించింది. ఆమె నుంచి రూ.12.56 కోట్ల విలువచేసే 14.2 కిలోల విదేశీ బంగారం, రూ.4.73 కోట్ల విలువచేసే ఇతర ఆస్తులను జప్తు చేసుకున్నామని డీఆర్ఐ ప్రకటించింది. 14 రోజుల రిమాండు ప్రత్యేక ఆర్థిక నేరాల కోర్టులో రన్య ను హాజరుపరచగా 14 రోజుల జుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. ఆమెను హెచ్ఆర్బీఆర్ లేఔట్‌లోని డీఆర్ఐ కేంద్రకార్యాలయంలో అధికారులు ప్రశ్నించారు. ఆమె బంగారం స్మగ్లింగ్ దందాకు కొందరు పోలీసులు, పారిశ్రామికవేత్తలు సహకారం అందించినట్లు అనుమానం వ్యక్తమైంది. తరచూ దుబాయ్ టూర్లు నటి రన్యారావ్ తరచూ దుబాయ్‌కి వెళ్లి వస్తోంది. వచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో బంగారు నగలను ధరించి అక్రమంగా తీసుకువచ్చేది. కస్టమ్స్ , భద్రతా సిబ్బంది తనిఖీలు చేయకుండా డీజీపీ పేరును చెప్పేది. అనధికారికంగా పోలీస్ ఎస్కార్ట్ వాహనంలో ఇంటికి వెళ్లేది. తరచూ దుబాయ్‌కి వెళ్లి గుట్టుగా బంగారాన్ని తీసుకు వస్తుండడం వెనుక పెద్ద ముఠానే ఉండవచ్చని డీఆర్ఐ ఆ దిశగా దర్యాప్తు చేస్తోంది. ఇలా తరలిస్తోంది విమానం దిగగానే రన్యను డీఆర్ఐ అధికారులు తనిఖీ చేయగా గుట్టు రట్టయింది, 14 బంగారు బిస్కెట్లను తొడ భాగంలో గమ్‌తో అంటించి టేప్ చుట్టినట్లు గుర్తించారు. ఆ టేప్ పై క్రేప్ బ్యాండేజ్‌ను చుట్టుకుందని తెలిపారు. ఇలాగైతే స్కానర్ల తనిఖీలో దొరకనని అనుకుంది. శ్యాండల్‌వుడ్‌లో స్టార్‌గా ఎదగాలంటే ఆర్ అనే అక్షరంతో పేరు ఉండాలనుకుని ఆమె రన్య రావుగా పేరు మార్చుకుంది. ఆమె అసలు పేరు హర్షవర్ధిని యఘ్నేశ్, మాణిక్య సినిమా టైంలో రన్య అయ్యింది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు ఆర్ అక్షరం పేరుతో స్టార్లు అయ్యారని, తనకూ ఆర్ కలిసొస్తుందని భావించింది.ఒక్కొక్కరు ఎంత బంగారం తేవచ్చు..⇒ దుబాయి నుంచి భారత్ కు వచ్చే పురుష ప్రయాణికులు కస్టమ్స్ ఫీజు లేకుండా 20 గ్రాముల బంగారం, మహిళలైతే 40 గ్రాములు బంగారం తీసుకురావచ్చు. ⇒ ఒకవేళ పురుషులు 50 గ్రాములు తెస్తే 3 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి. 50 గ్రాముల కంటే ఎక్కువైతే 6 శాతం, 100 గ్రాములకు మించితే 10 శాతం కస్టమ్స్ ఫీజును చెల్లించాలి. ⇒మహిళా ప్రయాణికులు 100 గ్రాములు బంగారానికి 3 శాతం, 100 గ్రాములు మించితే 6 శాతం కస్టమ్స్ రుసుమును చెల్లించాలి. 200 గ్రాముల కంటే ఎక్కువైతే 10 శాతం కస్టమ్స్ ఫీజు వేస్తారు. బంగారం కొనుగోలు చేసిన రసీదులను తప్పక చూపించాలి. హీరోయిన్ అరెస్ట్.. నాలుగునెలలుగా ఇంటికి రాలేదన్న తండ్రి డీజీపీ -
పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు
గౌహతి: పరీక్షల్లో అక్రమాలకు ఊతమిచ్చారన్న ఆరోపణలపై యూనివర్సిటీ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేఘాలయ(యూఎస్‌టీఎం) చాన్స్‌లర్ మహబూబుల్ హక్ అరెస్టయ్యారు. అస్సాంలోని షిభుమి జిల్లాకు చెందిన ఓ కోర్టు శనివారం రాత్రి హక్‌తోపాటు, కరీమ్గంజ్ జిల్లా పత్తర్‌కండిలోని ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను కూడా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు గౌహతిలోని నివాసంలో ఉన్న హక్‌ను శనివారం అదుపులోకి తీసుకుని షిభుమికి తరలించారు. యూఎస్‌టీఎం చాన్స్‌లర్‌గా ఉన్న హక్ ఈఆర్డీ అనే ఫౌండేషన్ ద్వారా ఎన్నో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఇందులో పత్తర్‌కండిలోని స్కూలు కూడా ఉంది. ఇతర జిల్లాలకు చెందిన సీబీఎస్ఈ విద్యార్థులను ఎక్కువ మార్కులు వచ్చేలా ప్రిపేర్ చేస్తామంటూ ఈ స్కూలుకు తీసుకువచ్చారు. వీరు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు పథకం వేశారంటూ శుక్రవారం నుంచి అక్కడ వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లతోపాటు చాన్స్‌లర్ హక్ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ..దీని వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్నారు. సీబీఎస్ఈలోనే కాకుండా, మెడికల్ ఎంట్రన్స్‌లోనూ ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘యూఎస్‌టీఎం చాన్స్‌లర్ హక్ పెద్ద ఫ్రాడ్, ఆయన జీవితమే ఫ్రాడ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హక్ దొడ్డిదారిన పొందిన ఓబీసీ సరి్టఫికెట్ తర్వాత రద్దయిందని చెప్పారు. అస్సాం–మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న యూఎస్‌టీఎం క్యాంపస్ కారణంగా గౌహతి నగరానికి వరద ముప్పు పెరిగిందంటూ సీఎం శర్మ గతంలోనే ఆరోపణలు చేయడం తెల్సిందే. -
అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్
-
నటి కస్తూరికి రిమాండ్
సాక్షి, చెన్నై: తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటి కస్తూరికి ఈనెల 29 వరకు రిమాండ్ విధిస్తూ చెన్నై ఎగ్మూర్ కోర్టు ఆదివారం ఆదేశాలిచ్చింది. దాంతో ఆమెను చెన్నై శివారులోని పుళల్ కేంద్ర కారాగారానికి తరలించారు. తెలుగు వారిని, మహిళలను కించపరిలా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కస్తూరిపై తమిళనాడులో ఆరు కేసులు నమోదయ్యాయి.దాంతో కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆమెను హైదరాబాద్‌లో శనివారం రాత్రి అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆదివారం ఉదయాన్నే చెన్నై తీసుకొచ్చారు. చింతాద్రిపేట పోలీసుస్టేషన్లో విచారణ అనంతరం ఎగ్మూర్ కోర్టు న్యాయమూర్తి రఘుపతి రాజ ముందు హాజరు పరిచారు. రిమాండ్ విధించడంతో భద్రత నడుమ కారాగారానికి తరలించారు. -
Jani Master: పక్కా స్కెచ్‌తో.. డోర్ వెనకాల దాక్కొని..!
సాక్షి, హైదరాబాద్/రాజేంద్రనగర్: తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌కు న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. జానీ వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న బాధితురాలు (21) తనపై జానీ మాస్టర్ పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఈనెల 15న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటినుంచి పరారీలో ఉన్న జానీని గురువారం గోవాలోని గ్రాండ్ లియోనీ రిసార్ట్‌లో సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించారు.ఆస్పత్రిలో వైద్య పరీక్షల తర్వాత నార్సింగి పోలీసులు అతడిని శుక్రవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లిలోని కోర్టులో హాజరు పరిచారు. దీంతో జానీ మాస్టర్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. నార్సింగి పోలీసులు న్యాయస్థానానికి సమరి్పంచిన రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన అంశాలను పొందుపరిచారు. చిన్నతనం నుంచే డ్యాన్స్‌పై మక్కువ.. బాధితురాలికి చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే మక్కువ ఉండటంతో ఆమె తల్లిదండ్రులు నృత్య శిక్షణ ఇప్పించారు. తర్వాత వివిధ ప్రాంతాలలో స్టేజ్ షోలు ఇస్తుండేది. ఈ క్ర మంలో 2017లో పదో తరగతి చదువుతున్న క్రమంలో బాధితురాలికి ఢీ–11 డ్యాన్స్ షోలో పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో తల్లితో సహా కలసి తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చింది. ఈ షోకు న్యాయనిర్ణేతగా నిందితుడు జానీ మాస్టరే వ్యవహరించా డు. అనంతరం బాధితు రాలు ఢీ–12లోనూ పా ల్గొంది కానీ మధ్యలోనే ఆమెను తొలగించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు జానీ మాస్టర్ బృందంలోని సభ్యురాలు దర్శిని బాధితురాలికి ఫో న్ చేసి మాస్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేస్తావా? అని అడిగింది. దీంతో ఒప్పుకున్న బాధితురాలు 2019 డిసెంబర్ 15న హైదరాబాద్‌కు వచ్చింది. అల వైకుంఠపురంతో కలిసి.. ‘అల వైకుంఠపురం’సినిమాలోని ఓ పాట చిత్రీకరణ సమయంలో తొలిసారిగా జానీ మాస్టర్‌తో బాధితురాలికి పరిచయం ఏర్పడింది. అదే రోజు మాస్టర్ మేనేజర్ ఒకరు బాధితురాలికి ఫోన్ చేసి జానీ మాస్టర్, మరో ఇద్దరు అసిస్టెంట్లు రాహుల్, మోయిన్లతో కలిసి 2020 జనవరి 10న ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించాడు. ముంబైలోని ఓ హోటల్లో చెకిన్ అవుతున్న క్రమంలో జానీ తన ఆధార్ కార్డు, ఇతరత్రా డాక్యుమెంట్లను బాధితురాలికి ఇచ్చాడు. అదే రోజు రాత్రి 11–12 గంటల సమయంలో జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి ఉదయం తాను ఇచ్చిన ఆధార్, డాక్యుమెంట్లను తీసుకొని గదికి రావాలని ఆదేశించాడు. డోర్ వెనకాల దాక్కొని.. అప్పటికే జానీ మాస్టర్ గది తలుపులు తెరిచి, వెనకాల దాక్కొని ఉన్నాడు. బాధితురాలు గది లోపలికి వెళ్లగానే ఒక్కసారిగా తలుపులు మూసేసి, లాక్ వేసేశాడు. దీంతో భయపడిపోయిన బాధితురాలు తనను వదిలేయాలని ప్రాధేయపడుతూ తలుపులు తెరిచేందుకు ప్రయతి్నంచగా.. జానీ మాస్టర్ ఆమెను అడ్డుకొని, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయట ఎవరికైనా చెబితే అసిస్టెంట్ జాబ్ నుంచి తీసేయడమే కాకుండా చిత్ర పరిశ్రమలో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించాడు. బాధితురాలి నిస్సహాయతను ఆసరా చేసుకున్న జానీ మాస్టర్ షూటింగ్‌ల పేరు చెప్పి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్ గదులు, వ్యానిటీ వ్యాన్లలో అత్యాచారానికి పాల్పడ్డాడు. జానీ మాస్టర్ వేధింపులు, ఆగడాలను తట్టుకోలేకపోయిన బాధితురాలు కొన్ని నెలల పాటు ఇంట్లో ఒంటరిగా ఉండిపోయింది. కానీ, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఏమైనా పని ఉంటే అవకాశం ఇప్పించాలని నిందితుడు జానీ మాస్టర్‌ను సంప్రదించింది. తన లైంగిక వాంఛను తీర్చనన్నందుకు షూటింగ్ సమయంలో అందరి ముందు బాధితురాలిని అవమానపరిచేవాడు. మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటూ..మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ జానీ మాస్టర్ బాధితురాలిని బలవంతం పెట్టాడు. ఒక రోజు జానీ మాస్టర్ బాధితురాలికి ఫోన్ చేసి షూటింగ్‌కు రావాలని సూచించాడు. దీంతో తన తల్లి ఇంట్లో లేదని, ఆరోగ్యం బాలేక ఇంట్లో ఉన్నానని తెలిపింది. దీన్ని ఆసరా చేసుకున్న నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జానీ తన భార్య సుమలత అలియాస్ ఆయేషాతో కలిసి బాధితురాలికి ఇంటికి వెళ్లి ఆమెను భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్ర పరిశ్రమలో జానీకి ఉన్న పరిచయాల కారణంగా బాధితురాలికి ఎక్కడా పని దొరకుండా ఇబ్బందులకు గురి చేశాడు.ఈ క్రమంలో బాధితురాలు ఇంట్లో లేని సమయం చూసి ఓ రోజు ఆమె ఇంటికి వెళ్లి బాధితురాలితో ఉన్న శారీరక సంబంధం గురించి ఆమె తల్లికి వెల్లడించాడు. ఇక, చిట్టచివరికి బాధితురాలు జానీ అసిస్టెంట్ మోయిన్‌కు ఈ విషయాలు తెలిపింది. అతని సూచన మేరకు బాధితురాలు తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ (టీఎఫ్‌టీడీడీఏ) సంఘం అధ్యక్షుడికి ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న జానీ వెంటనే సంఘం డ్రైవర్ రాజేశ్వర్ రెడ్డిని తీసుకొని గోవాకు పరారయ్యాడు. కాగా, కోర్టు వద్ద జానీ మాస్టర్ భార్యను ఈ విషయమై ప్రశ్నించగా అంతా కోర్టులో తేలుతుందని సమాధానం ఇచ్చారు. -
సాక్ష్యాలను నాశనం చేశారు
కోల్‌కతా: దేశవ్యాప్త ఆగ్రహావేశాలకు, ఆందోళనలకు కారణమైన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఉదంతం శనివారం కీలక మలుపు తిరిగింది. ఆర్.జి.కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో ఈ దారుణం జరిగిన సమయంలో ప్రిన్సిపల్‌గా ఉన్న సందీప్ ఘోష్ సాక్ష్యాధారాలను నాశనం చేశారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఆస్పత్రి నిధుల దురి్వనియోగం కేసులో ఆయన ఇప్పటికే జ్యుడీíÙయల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. సాక్ష్యాలను నాశనం చేయడం, ఎఫ్ఐఆర్ నమోదులో ఆలస్యంతో పాటు కేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయతి్నంచారని ఘోష్‌పై అభియోగాలు మోపింది. ఇవే అభియోగాలపై స్థానిక తలా పోలీసుస్టేషన్ సీఐ అభిజిత్ మండల్‌ను కూడా అరెస్టు చేసింది. ఆర్.జి.కర్ ఆసుపత్రి తలా పోలీసుస్టేషన్ పరిధిలోకే వస్తుంది. అభిజిత్ మండల్‌ను శనివారం సీబీఐ తమ కార్యాలయంలో కొన్ని గంటల పాటు ప్రశ్నించింది. సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో మండల్‌ను అరెస్టు చేసింది. అతన్ని ప్రశ్నించడం ఇది ఎనిమిదోసారి అని. ప్రతిసారీ మండల్ భిన్నమైన కథనం చెబుతున్నాడని సీబీఐ వర్గాలు తెలిపాయి. సందీప్ ఘోష్‌ను కస్టడీ కోరుతూ సీబీఐ న్యాయస్థానంలో దరఖాస్తు చేసింది. సీబీఐ కస్టడీ నిమిత్తం ఘోష్‌ను హాజరుపర్చాల్సిందిగా కోర్టు జైలు అధికారులను ఆదేశించిందని సీబీఐ అధికారి ఒకరు శనివారం తెలిపారు. 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ ఆగస్టు 9న ఆస్పత్రి సెమినార్ హాల్లో శవమై కని్పంచడం తెలిసిందే. ఆమెపై పాశవికంగా అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టంలో తేలింది. ఒక రోజు అనంతరం ఆస్పత్రిలో పౌర వాలంటీర్‌గా పనిచేస్తున్న ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణంపై వైద్యలోకం భగ్గుమంది. దీనివెనుక చాలామంది ఉన్నారని, ఆ వాస్తవాలను తొక్కిపెట్టేందుకు మమత సర్కారు ప్రయతి్నస్తోందని డాక్టర్లు ఆరోపించారు. వైద్యశాఖ కీలక డైరెక్టర్లు, కోల్‌కతా పోలీసు కమిషనర్ తదితరుల రాజీనామా కోరుతూ పశి్చమ బెంగాల్ వ్యాప్తంగా నిరసనలతో వైద్యులు హోరెత్తిస్తున్నారు. అనంతర పరిణామాల్లో కేసు దర్యాప్తును సీబీఐకి కలకత్తా హైకోర్టు అప్పగించింది. దర్యాప్తు పురోగతిపై మూడు వారాల్లోగా నివేదిక సమరి్పంచాల్సిందిగా ఆదేశించింది. ఆ మేరకు సెపె్టంబర్ 17లోగా దర్యాప్తు సంస్థ నివేదిక సమరి్పంచనుందని సమాచారం. ఘోష్‌కు నేరగాళ్లతో లింకులు వైద్యురాలిపై దారుణం జరిగిన మర్నాడే సందీప్ ఘోష్ హడావుడిగా ఆస్పత్రిలో మరమ్మతులకు ఆదేశాలు జారీ చేసినట్టు సీబీఐ ఆరోపిస్తోంది. ఆ మేరకు ఘోష్ ఆదేశాలిచి్చ న లేఖను కూడా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కేసు నిందితులతో ఘోష్‌కు నేరపూరిత బంధం ఉందని, వారితో కలిసి పలు తప్పుడు పనులకు కూడా పాల్పడ్డారని సీబీఐ గత వారమే అభియోగాలు మోపింది. -
కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే..!
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే ఎదురైంది. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆయన జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 25 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. అంతకముందు విధించిన క స్టడీ నేటితో ముగియడంతో తీహార్ జైలు అధికారులు కేజ్రీవాల్‌ను నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. వాదనల అనంతరం రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ఇకఇదే కేసులో ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత జూలైలో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. అయితే ఈడీ కేసులో సుప్రీంకోర్టు జూలై 12న కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ కేసులో మాత్రం ఇంకా జైల్లోనే కొనసాగుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత తదితరులు బెయిల్‌పై బయటకి వచ్చారు. -
కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. మనీలాండరింగ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. కేజ్రీవాల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారం తీర్పునిచ్చారు.కాగా సీబీఐ కేసులో ఇంతకుముందు విధించిన కస్టడీ గడువు నేటితో ముగియడంతో కేజ్రీవాల్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోవైపు కేజ్రీవాల్ తోపాటు మరో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ దాఖలు చేసిన నాల్గో అనుబంధ ఛార్జీషీట్ పైన కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్‌లో ఉంచింది. దీనిపై సెప్టెంబర్ 3న విచారణ జరగనుంది.కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈడీ కేసులో బెయిల్ లభించినా సీబీఐ కేసులో బెయిల్ రానందున ఆయన తిహార్ జైల్లోనే ఉంటున్నారు. -
కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆగస్టు 27 వరకు కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం(ఆగస్టు20) కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో జూన్ 26న కేజ్రీవాల్ అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఈ కేసులో ఆయన తీహార్జైలులో రిమాండ్‌లో ఉన్నారు. లిక్కర్ పాలసీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. -
తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటున్నారు
న్యూఢిల్లీ: తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే తక్కువ కేలరీలున్న ఆహారం తీసుకుంటున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆరోపించారు. వైద్యులు సూచించిన మందులను కూడా ఆయన వాడకపోవచ్చని పేర్కొన్నారు. తీహార్ జైలు సూపరింటెండెంట్ నివేదికను ప్రస్తావిస్తూ ఎల్జీ ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌కు లేఖ రాసినట్లు రాజ్‌భవన్ వర్గాలు శనివారం తెలిపాయి. కేజ్రీవాల్‌కు ఇంటి వద్ద నుంచి వచ్చిన ఆహారాన్ని సరిపోను అందజేస్తున్నా కూడా ఆయన కావాలనే తక్కువ కేలరీలున్న ఆహారం తింటున్నట్లుగా ఆధారాలున్నాయన్నారు. గ్లూకో మీటర్ టెస్ట్ రీడింగ్‌కు, కంటిన్యువస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టం రీడింగ్‌కు మధ్య కనిపిస్తున్న భారీ వ్యత్యాసంపై అధికారులు పరిశీలన జరపాలని సూచించారు.ఎల్జీ వైద్యుడనే విషయం తెలియదుఎల్జీ వీకే సక్సేనా రాసిన లేఖపై ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందిస్తూ.. నాకు తెలిసినంత మటుకు ఆయన గతంలో సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వారు. వీకే సక్సేనా డాక్టర్ అని, ఆరోగ్య అంశాల్లో మంచి నిపుణుడనే విషయం నాకు తెలియదు. ఎప్పుడైనా ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే, ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌ను చదివి ఉండేవాళ్లం’ అంటూ ఎద్దేవా చేశారు. తమ నేతను చంపేందుకు బీజేపీ దుర్మార్గపు పథకం పన్నిందని ఆరోపించారు. -
ముగిసిన జ్యుడిషియల్ కస్టడీ.. నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యూడిషయల్ కస్టడీ నేటితో ముగియనుంది. జ్యుడియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు నేడు హాజరుకానున్నారు. మరోసారి కవితకు సీబీఐ కేసులో జ్యూడిషియల్ కస్టడి పొడిగించే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ కవితను అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జ్వరం, గైనిక్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు. -
ముంబై బీఎండబ్ల్యూ కేసు: మిహిర్ షాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ముంబై: ముంబై బీఎండబ్ల్యూ స్పోర్ట్స్ కారు హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షాకు మంగళవారం ముంబై కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కోర్డు ఆదేశాల మేరకు నిందితుడు జూలై 30 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంటారు. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు మిహిర్ షాను పోలీసులు జూలై 9న అరెస్ట్ చేశారు. ఇక ఇదే కేసులో మిహిర్ షా డ్రైవర్ అరెస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగా జూలై 11వ తేదీన అతనికి కూడా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న నిందితుడి తండ్రి రాజేశ్ షాను పోలీసులు జూలై 7న అరెస్ట్ చేయగా.. ఆయన జూలై 8న కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జులై 7 ఆదివారం ఉదయం 5.30 గంటలకు ముంబైలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ షా మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందువెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో 45 ఏళ్ల కావేరీ నఖ్వా మృతి చెందగా.. ఆమె భర్త ప్రదీప్ నక్వా తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. నిందితుడు తండ్రి మహరాష్ట్ర పాల్ఘర్ ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన డిప్యూటీ లీడర్‌గా ఉన్న రాజేష్ షా కావడంతో ఈ ప్రమాదంపై విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో మహరాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే రంగంలోకి దిగారు. నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అతడి ఆచూకీ కోసం 11 పోలీస్ శాఖ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాదం జరిగిన 72 గంటల అనంతరం ప్రధాన నిందితుడు మిహిర్ షాను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చుక్కెదురు..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. సీబీఐ కేసులో కవిత కస్టడీని జులై 18 వరకు పొడగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం తీర్పు వెల్లడించిందిరౌస్ అవెన్యు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను తిహార్ జైలు అధికారులు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసులో విచారణ జరిపిన అనంతరం కవిత కస్టడీనీ జులై 18 వరకు పొడగిస్తున్నట్లు రౌస్ అవెన్యు కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు.అదే విధంగా ఈడీ కేసులోనూ కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఆమెతో పాటు ఈ కేసులో ఉన్న ఆప్ నేత మనిష్ సిసోడియా కస్టడీని జులై 25వ తేదీకి పొడిగిస్తూ బుధవారం రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలిచ్చింది.కాగా, ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో సీబీఐ అధికారులు కూడా విచారించారు. ఏప్రిల్ 11వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు బెయిల్ తిరస్కరస్తూ న్యాయమూర్తి జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ వస్తున్నారు. -
Delhi liquor scam: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను మరో 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల కస్టోడియల్ విచారణ ముగియడంలో కేజ్రీవాల్‌ను సీబీఐ అధికారులు శనివారం రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి సునేనా శర్మ ఎదుట హాజరుపర్చారు. మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం ఆయనను 14 రోజలపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరారు. ప్రత్యేక న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు. కేజ్రీవాల్‌ను వచ్చే నెల 12వ తేదీ దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. జులై 3 దాకా కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.కేసు తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. తన క్లైంట్కు జ్యుడీషియల్ కస్ఠడీ పొడిగించడాన్ని కేజ్రీవాల్ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. కేజ్రీవాల్‌కు గతంలో విధించిన జ్యుడీషియల్ కస్డడీ ముగియడంతో తీహార్ జైలు నుంచి ఆయనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.కేజ్రీవాల్‌తో పాటు ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న వినోద్చౌహాన్ కస్టడీని కూడా కోర్టు జులై 3 దాకా పొడిగించింది. లిక్కర్ స్కామ్‌లో ప్రతి అంశం చివరకు కేజ్రీవాల్‌కే ముడిపడి ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు ముందు వాదనలు వినిపించారు. -
ఈడీ కేసులో కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
ముగియనున్న కవిత జ్యుడీషియల్ కస్టడీ
-
కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ పాలసీలో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది కోర్టు. కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, కాబట్టి కేజ్రీవాల్ కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. దీంతో.. మే 20 వరకు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. మార్చి 21వ తేదీన ఈడీ మనీలాండరింగ్ అభియోగాలతో కేజ్రీవాల్‌ను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. జ్యూడీషియల్ కస్టడీ కింద ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ.. మధ్యంతర బెయిల్ కోసం ఆయన సుప్రీంను ఆశ్రయించారు. -
కవిత బెయిల్ తీర్పులపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఉదయం తీర్పు వెలువడాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గం. సమయానికి వాయిదా వేసింది ట్రయల్ కోర్టు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు. కేవలం ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. బెయిల్ రాకుంటే వెంటనే హైకోర్టుకు.. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా. -
లిక్కర్ కేసు: కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. కేజ్రీవాల్‌ను వర్చువల్‌గా కోర్టు ముందు హాజరుపరిచారు. తిరిగి మే 7న కేజ్రీవాల్‌ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో మార్చ్ 21న ఢిల్లీలోని అధికారిక నివాసం నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. కాగా, తనకు ప్రైవేట్ వైద్యులతో ప్రత్యేక చికిత్స కావాలని కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఇప్పటికే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు -
ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందన్న కేసులో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేయడంతోపాటు సాక్షులను ప్రభావితం చేయడంలో కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోందని... ఆమెను బలిపశువుగా మార్చే యత్నం జరుగుతోందనేందుకు వీల్లేదని వ్యాఖ్యానించింది. కవిత నిస్సందేహంగా పలుకుబడిగల మహిళ అయినందున బెయిల్ ఇస్తే మరోసారి సాక్షులను ప్రభావితం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందిన పేర్కొంది. అందువల్ల ఆమెకు మధ్యంతర బెయిల్ నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేసింది. మైనర్ కుమారుడి వార్షిక పరీక్షల నేపథ్యంలో తల్లిగా తన పర్యవేక్షణ అవసరమైనందున మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు. బెయిల్ నిరాకరణకు కారణాలను 21 పేజీల తీర్పులో పేర్కొన్నారు. చిన్న కుమారుడికి బంధువుల అండ ఉందిగా ‘‘పిటిషనర్ (కవిత) 16 ఏళ్ల మైనర్ కుమారుడికి ఇప్పటికే 50 శాతం పరీక్షలు పూర్తయ్యాయని న్యాయవాదులు తెలిపారు. కానీ కుమారుడి చదువు, మధ్యంతర బెయిల్ కోరిన రోజుల సంఖ్య, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు పొంతన లేకుండా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మైనర్ కుమారుడు అన్నయ్య, తండ్రి, అత్తలను కలిగి ఉన్నాడు. వారంతా అతనికి తగిన మద్దతు ఇవ్వలేరనడానికి ఎలాంటి కారణం కనిపించట్లేదు. చిన్న కుమారుడి పరీక్షల వేళ తల్లి నైతిక మద్దతు ఎంతో అవసరమని న్యాయవాదులు చెబుతున్నారు. కానీ 19 ఏళ్ల వయసున్న కవిత పెద్ద కుమారుడు స్పెయిన్‌లో చదువుతున్నాడు. భౌతికంగా తల్లిదండ్రులు దగ్గర లేకున్నా విదేశాల్లో అతను చదువుకోగలుతున్నప్పుడు బంధువుల సమక్షంలో ఉంటున్న చిన్న కుమారుడు పరీక్షలు రాయలేడనడం సమంజసంగా కనిపించట్లేదు. పిల్లల పరీక్షల ఆందోళన పరిష్కరించడానికి తల్లి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదనడం మధ్యంతర బెయిల్ మంజూరుకు తగిన కారణంగా కనిపించట్లేదు. కవిత కేసు పరిష్కారం విషయంలో మైనర్ తండ్రి బిజీగా ఉన్నారన్న కారణం సైతం ఆమోదయోగ్యం లేదు. అందుకే మైనర్ కుమారుడికి అతని అత్తలు తగిన మద్దతు ఇవ్వాల్సిందిగా కోర్టు సూచిస్తోంది. కేసులో ప్రాథమికంగా ప్రమేయం కనిపిస్తోంది ‘‘మాజీ ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, ఉన్నత విద్యావంతురాలిగా కవిత సమాజంలో పలుకుబడి గలవారని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతేకానీ ఈ కేసులో ఓ నిస్సహాయ మహిళను బలిపశువును చేస్తున్నారని ఏ ప్రమాణాల ప్రకారమూ చెప్పేందుకు వీలు కనిపించట్లేదు. నేరాల విషయంలో కవిత చురుకైన ప్రమేయం, సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నంతోపాటు ఉద్దేశపూర్వకంగా సాక్ష్యాలు ధ్వంసం చేస్తారనే విషయంలో కోర్టు ముందుంచిన అంశాలను పరిశీలిస్తే కవిత ప్రమేయం ప్రాథమికంగా కనిపిస్తోంది. అందువల్ల మహిళ కాబట్టి పీఎంఎల్ఏ చట్టం సెక్షన్ 45 (1) ప్రకారం విచక్షణకు ఆమె అర్హురాలు కాదు. ఈ పరిశీలనలతో బెయిల్ దరఖాస్తు తిరస్కరిస్తున్నా’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. నేడు న్యాయమూర్తి ముందుకు కవిత జ్యుడీషియల్ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవితను తీహార్ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి... తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. -
తిహార్ జైలుకు కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ విధానంలో అక్రమాల కేసులో ఈడీ అరెస్ట్ చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ కోర్టు ఈనెల 15వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 21న ఈడీ అరెస్ట్‌చేశాక మార్చి 28వ తేదీదాకా ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీ సిటీ కోర్టు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీచేయడం తెల్సిందే. తమ విచారణలో కేజ్రీవాల్ ఏమాత్రం సహకరించట్లేడని, మరికొంతకాలం తమ కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరడం, అందుకు కోర్టు సమ్మతిస్తూ ఏప్రిల్ ఒకటో తేదీదాకా కస్టడీని పొడిగించడం తెల్సిందే. ఏప్రిల్ ఒకటిన కస్టడీ గడువు ముగియడంతో సోమవారం ఆయనను జడ్జి బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారణకు సహకరించని ఆయనను 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించారు. ఈ వాదననతో ఏకీభవిస్తూ ఏప్రిల్ 15వ తేదీదాకా జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. కేజ్రీవాల్‌ను రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకొచి్చనపుడు ఆప్ మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్, కేజ్రీవాల్ భార్య సునీత అక్కడికొచ్చారు. ‘‘ కస్టడీలో ఈడీ 11 రోజులపాటు ప్రశ్నించింది. ఇంక ప్రశ్నించాల్సింది ఏమీ లేదు. ఆయనను ఇంతవరకు కోర్టు దోషిగా ప్రకటించలేదు. మరి అలాంటపుడు జైలుకు ఎందుకు పంపించారు?. లోక్‌సభ ఎన్నికల కోసమే బీజేపీ ఆయనను జైలుకు పంపింది’’ అని సునీతా ఆరోపించారు. పార్టీలో సునీతా అత్యత ‘క్రియాశీలక’ పాత్ర పోషించనున్నట్లు ఆప్ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఆదివారం ఢిల్లీలో రాంలీలా మైదాన్‌లో విపక్షాల ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలో పాల్గొనడం ద్వారా సునీతా ఒక రకంగా రాజకీయ అరంగేట్రం చేసినట్లేనని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. ‘‘ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉదంతంలో కేజ్రీవాల్ కీలక పాత్రధారి. లబ్ధిదారులకు లాభం చేకూరేలా మద్యంపాలసీ రూపకల్పన, అమలులో ఈయన ప్రత్యక్ష పాత్ర పోషించారు. మద్యం పాలసీని అమలుచేయకముందే క్విడ్ ప్రో ద్వారా తమకు రావాల్సిన నగదును కిక్‌బ్యాక్ రూపంలో పొందారు’’ అని ఈడీ తన రిమాండ్ దరఖాస్తులో ఆరోపించింది. మూడు పుస్తకాలు, ఔషధాలు, లాకెట్.. జడ్జి ఉత్తర్వుల అనంతరం కేజ్రీవాల్‌ను తిహార్ జైలుకు తరలించారు. కేజ్రీవాల్‌ను జైలుకు తరలిస్తున్నారన్న వార్త తెలిసి ఆప్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తిహార్ జైలుకు చేరుకుని ‘నేనూ కేజ్రీవాల్’ అని టీ–షర్ట్లు ధరించి, ఆప్ జెండాలు పట్టుకుని ఆందోళన చేపట్టారు. రెండో నంబర్ జైలులో కేజ్రీవాల్‌ను ఉంచే అవకాశముంది. వైద్య పరీక్షలు చేస్తున్నాం. తర్వాత ఆయనను ఒంటరిగా ఒక గదిలో ఉంచునున్నారు. గదిలో ప్రతిరోజూ 24 గంటలపాటు సీసీటీవీ పర్యవేక్షణ కొనసాగనుంది. అనారోగ్యం దృష్ట్యా సంబంధిత ఔషధాలు, ప్రత్యేక ఆహారాన్ని ఆయనకు అందించనున్నారు. మతవిశ్వాసాన్ని గౌరవిస్తూ ఒక లాకెట్ ధరించేందుకు ఆయనకు అనుమతి లభించింది. భగవద్గీత, రామయణం, నీరజా చౌదరి రాసిన ‘ హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్’ పుస్తకాలనూ అనుమతించారు. ఉదయం ఆరున్నరకు దినచర్య మొదలు కేజ్రీవాల్ దినచర్య మిగతా విచారణఖైదీల్లాగే ఉదయం ఆరున్నర గంటలకు మొదలుకానుంది. ఉదయం చాయ్, బ్రెడ్ అల్పాహారంగా ఇవ్వనున్నారు. కోర్టులో కేసు విచారణ ఉంటే కోర్టుకు తీసుకెళ్తారు. లేదంటే 10.30 నుంచి 11 మధ్యలో లంచ్ వడ్డిస్తారు. పప్పు, కూరగాయలు లేదంటే ఐదు చపాతీలు లేదా అన్నం వడ్డిస్తారు.తర్వాత మూడు గంటల దాకా గదిలోనే ఉంచుతారు. మూడున్నరకు టీ, బిస్కెట్లు అందిస్తారు. నాలుగు గంటలకు తమ లాయర్లను కలిసేందుకు అనుమతిస్తారు. 5.30గంటలకే డిన్నర్ వడ్డిస్తారు. ఏడింటికల్లా గదికి పంపించి తాళం వేస్తారు. టీవీ సదుపాయం కల్పిస్తారు. వైద్య, సహాయక సిబ్బంది 24 గంటలూ అందుబాటులోఉంటారు. వారానికి రెండుసార్లు కుటుంబసభ్యులను కలవొచ్చు. ఆప్ నేత సంజయ్ సింగ్‌ను గతంలో ఈ సెల్లోనే ఉంచారు. ఇటీవల ఐదో నంబర్ జైలుకు మార్చారు. ఢిల్లీ మాజీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఒకటో నంబర్ జైలులో, బీఆర్ఎస్ నేత కె.కవితను ఆరో నంబర్ మహిళా జైలులో ఉంచారు. -
జ్యుడీషియల్ కస్టడీకి ఎమ్మెల్సీ కవిత
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసు లో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. దీంతో కవితను ఈడీ అధికా రులు తీహార్ జైలుకు తరలించారు. ఏప్రిల్ 9 వరకూ జ్యుడీషియల్ కస్టడీ కొనసాగనుంది. రెండోసారి ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరిచారు. ఈడీ తరఫున న్యాయవాది జొహెబ్ హుస్సేన్ ఆన్లైన్ ద్వారా వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కవిత కీలక కుట్రదారు, లబ్ధిదారు అని ఆరోపించారు. ఇప్పటివరకు ఈడీ జరిపిన విచారణ ఆధారంగా సౌత్ గ్రూప్ లాబీలో కీలకంగా వ్యవహరించిన ఆమె... ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లోని అగ్రనేతలతో కలసి మద్యం కుంభకోణానికి కుట్రపన్నారని తేలిందన్నారు. రూ. 100 కోట్ల లావాదేవీలు, మద్యం విధానంలో మార్పులు, అమల్లో కవిత కీలకపాత్ర పోషించారన్నారు. కవిత చాలా ప్రభావవంతమైన వ్యక్తి అని.. ఆమెను బెయి ల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందని తద్వారా విచారణకు ఆటంకం కల గొచ్చని వాదించారు. కవిత పాత్రపై ఇంకా పరిశోధించా ల్సిన అవసరం ఉందని... నేరంలో చేతులు మారిన మిగి లిన సొమ్ము గురించిన ఆధారాలు వెలికితీస్తున్నట్లు వివ రించారు. నేరం ద్వారా వచ్చిన రాబడితో ప్రమేయం ఉన్న లేదా సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించనున్నా మని, ఆర్థిక నేరాలపై దర్యాప్తు సాధారణ నేరాల దర్యాప్తు కంటే క్లిష్టంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలోనే కవితకు 15 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోరుతున్నామని చెప్పారు. కుమారుడికి పరీక్షలున్నాయి.. మధ్యంతర బెయిలివ్వండి: కవిత లాయర్ కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా వాదనలు వినిపిస్తూ బెయిల్ పిటిషన్ త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు తెలిపిన విషయాన్ని గుర్తుచేశారు. మంగళవారం నుంచి కవిత కుమారుడికి వార్షిక పరీక్షలు మొదలుకానున్నందున మధ్యంతర ఉపశమనం కల్పించాలని కోరారు. అలాగే ఈడీ కస్టడీలో నిర్వహించిన వైద్య పరీక్షల వివరా లను అందించాలన్నారు. దీనికి ఈడీ తరఫు న్యాయవాది అంగీకరించారు. అయితే బెయిల్ పిటిషన్‌కు సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి వారం సమయం ఇవ్వాలని కోర్టును కోరారు. వాదనల అనంతరం కవితను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్నట్లు న్యాయమూర్తి కావేరి బవేజా అదేశాలు ఇచ్చారు. ఏప్రిల్ 9న ఉదయం 11 గంటలకు కవితను తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 1న విచారిస్తామని, ఈలోగా ఈడీ కౌంటర్ దాఖలు చేయాలన్నారు. కవితకు ఇంటి భోజనం, పరుపు, దుప్పటి, చెప్పులు, బట్టలు, పుస్తకాలు, కలం, కాగితాలు, అవసరమైన మందులను నిబంధనల మేరకు అనుమతించాలని తిహార్ జైలు సూపరింటెండెంట్‌కు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కవితకు మద్దతుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, భర్త అనిల్, కొందరు జాగృతి నేతలు కార్యకర్తలు రౌస్ అవెన్యూ కోర్టుకు వచ్చారు. ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు: కవిత కోర్టు హాల్లోకి వెళ్లే సమయంలో కవిత జై తెలంగాణ నినాదాలు చేశారు. ‘ఇది తప్పుడు కేసు. మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. తాత్కాలికంగా నన్ను జైలులో పెట్టొచ్చు కానీ కడిగిన ముత్యంలా బయటకు వస్తా. ఈ కేసు నిందితుల్లో ఒకరు ఇప్పటికే బీజేపీలో చేరితే మరొకరికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మరొకరు బీజేపీకి రూ. 50 కోట్ల నిధులు ఇచ్చారు. జై తెలంగాణ’ అని కవిత వ్యాఖ్యానించారు. -
Delhi liquor scam: జైలు నుంచి ఇంటికెళ్లిన సిసోడియా
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కొద్దిసేపు ఉపశమనం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఓదార్చేందుకు ఆరు గంటలపాటు ఇంటికి వెళ్లేందుకు సిసోడియాకు ఢిల్లీ సిటీ కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. తిహార్ జైలు నుంచి ఢిల్లీలోని మధుర రోడ్డులో గల నివాసానికి శనివారం ఉదయం 10గంటలకు చేరుకున్నారు. సాయంత్రం నాలుగింటివరకు ఆయనకు అనుమతి ఇచ్చింది. కొంతకాలంగా సిసోడియా భార్య సీమా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెల్సిందే. ఇంటికి వెళ్లేందుకు అనుమతి కావాలంటూ సిసోడియా గతంలో కోర్టును కోరిన విషయం విదితమే. దీంతో ఆయనకు కోర్టు ఇలా కొద్దిగంటలపాటు ఉపశమనం కలి్పంచింది. అయితే బయట ఉన్న సమయంలో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని, మీడియాతో మాట్లాడొద్దని, సమావేశాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది. గతంలోనూ భార్యను కలిసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతిచి్చనా ఇంటికొచ్చే సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడంతో కలవలేకపోయారు. -
12 దాకా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ న్యాయస్థానం మే 12వ తేదీ దాకా పొడిగించింది. ఈ మేరకు ప్రత్యేక జడ్జి ఎం.ఎం.నాగపాల్ గురు వారం ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఈ నెల 25న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు అందజేయాలని సీబీఐని ఆదేశించారు. విచారణ పూర్తి కాకుండానే సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని, సిసోడియాకు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది రిషికేశ్ కోరారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసే హక్కు తమకు ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. అనుబంధ చార్జిషీట్ ఈ–కాపీని సిసోడియాకు ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేశారు. -
మనీశ్ సిసోడియాకు మళ్లీ షాక్.. కస్టడీ పొడిగింపు.. బెయిల్‌పై 12న విచారణ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 17వరకు పొడిగించింది ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మరికొన్ని రోజులు కస్టడీలో ఉండటం అనివార్యమైంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు. బెయిల్ కోసం దరఖాస్తు చేసునకున్నప్పటికీ న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే నెల రోజులకుపైగా కస్టడీలోనే ఉండటంతో ఏప్రిల్ 12న బెయిల్‌పై విచారణ చేపట్టేందుకు కోర్టు అంగీకరించింది. సిసోడియాపై మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఆయన ఖాతాలోకి అక్రమంగా రాలేదని అతని తరఫు న్యాయవాది వాదించారు. ఇల్లు, కార్యాలయాలు, బ్యాంకు లాకర్లలో కూడా అధికారులు తనిఖీలు చేశారని, ఒక్క ఆధారం కూడా లభించలేదని గుర్తు చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో దీనిపై ఏప్రిల్ 12న విచారణ చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది. చదవండి: సుప్రీంకోర్టులో విపక్షాలకు షాక్.. సీబీఐ, ఈడీ దుర్వినియోగంపై పిటిషన్ తిరస్కరణ.. -
Delhi Liquor Scam: సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ: లిక్కర్ స్కాంలో అరెస్టయిన(సీబీఐ, ఈడీ ద్వారా) ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ కేసులో కస్టోడియల్ ఇంటరాగేషన్ ముగియడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆయన్ని ఇవాళ(బుధవారం) రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో.. స్పెషల్ జడ్జి ఎంకే నాగ్‌పాల్, సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్ ఆదేశించారు. ఇక సిసోడియాను ఈడీ వారంగా తమ కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన సంగతి తెలిసే ఉంటుంది. మరోవైపు సీబీఐ విచారిస్తున్న లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం ఆయన చేసిన అభ్యర్థనపై విచారణను మంగళవారం ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. బెయిల్ అభ్యర్థనపై శనివారం విచారణ జరగనుంది. ఫిబ్రవరి 26వ తేదీన విచారణ కోసం పిలిపించుకున్న సీఐబీ.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలోనే ఆయన్ని అరెస్ట్ చేయడం తెలిసిందే. ఇక.. మనీల్యాండరింగ్ అభియోగాలకుగానూ ఈడీ, సిసోడియాను మార్చి 9వ తేదీన తీహార్ జైల్లో అరెస్ట్ చేయడం గమనార్హం. ఇదీ చదవండి: మోదీకి వ్యతిరేకంగా వేల ఫ్లెక్సీలు -
తీర్పు వచ్చేవరకు జ్యుడీషియల్ కస్టడీలో నేపాల్ క్రికెటర్
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న సందీప్ లమిచానేను ఇంటర్‌పోల్ సహాయంతో స్వదేశానికి రప్పించిన నేపాల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి పోలీసుల అదుపులో ఉన్న సందీప్‌పై విచారణ కొనసాగుతుంది. తాజాగా కేసులో తుది తీర్పు వచ్చేవరకు లమిచానే జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని ఖాట్మండు జిల్లా కోర్టు స్పష్టంచేసింది. కాగా, సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గత ఆగస్టులో 17 ఏండ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం సెప్టెంబర్ 8న సందీప్ లమిచానే అరెస్ట్ కోసం వారెంట్ జారీచేసింది. అయితే ఆ సమాయానికి సందీప్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ జమైకాలో ఉన్నాడు. దాంతో పోలీసులు లీగ్ నిర్వాహకులకు విషయం తెలియజేయడంతో అతడిని టోర్నీ నుంచి తప్పించారు. జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉన్న సందీప్ లమిచానేను నేపాల్ క్రికెట్ బోర్డు కూడా జట్టులో నుంచి తొలగించింది. చదవండి: డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఆసీస్‌కు ముచ్చెమటలు -
సంజయ్ రౌత్ కస్టడీ మళ్లీ పొడిగింపు
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో రౌత్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ముంబై పట్రా చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకల కేసులో ఆగస్ట్ ఒకటో తేదీన ఈడీ సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. రౌత్ బెయిల్ పిటిషన్‌పై 21న కోర్టు విచారణ చేపట్టనుంది. -
సంజయ్ రౌత్ కస్టడీ 5 వరకు పొడిగింపు
ముంబై: శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్(60) జ్యుడీషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు వచ్చే నెల 5 వరకు పొడిగించింది. ముంబై చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకలపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈనెల ఒకటిన ఈడీ ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో ప్రత్యేక జడ్జి ఎంజీ దేశ్‌పాండే ఎదుట హాజరుపరిచారు. కేసు దర్యాప్తులో ఉన్నందున కస్టడీని పొడిగించాలని ఈడీ విజ్ఞప్తి చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న జడ్జి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఆయన కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు. -
సంజయ్ రౌత్‌కు లభించని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ముంబై: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఇప్పట్లో ఉపశమనం లభించేలా కనిపించటం లేదు. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీనీ మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం. ముంబైలోని పాత్రాచాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై ఆగస్టు 1న సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం కేసుని విచారించిన న్యాయస్థానం ఆగస్టు 8న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ గడువు సోమవారంతో ముగియనుండటంతో సంజయ్ రౌత్‌ను ముంబై ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరించింది ఈడీ. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే.. సెప్టెంబర్ 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? -
జ్యుడీషియల్ కస్టడీకి సంజయ్ రౌత్.. ఆ వినతికి కోర్టు నో!
ముంబై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది ముంబైలోని ప్రత్యేక కోర్టు. ముంబైలోని పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు రౌత్. ఈడీ కస్టడీ ముగియడంతో సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది న్యాయస్థానం. దీంతో ఆయన జైలులో గడపనున్నారు. తనకు ఇంటి నుంచే ఆహారం, ఔషధాలు తీసుకురావాలని సంజయ్ రౌత్ కోరగా.. అందుకు అంగీకరించింది కోర్టు. కానీ, ప్రత్యేక పడక ఏర్పాటును తిరస్కరించింది. పత్రచల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో అవకతవకల ఆరోపణలతో ఆగస్టు 1వ తేదీన సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియటంతో ప్రత్యేక పీఎంఎల్ఏ జడ్జీ ఎంజీ దేశ్‌పాండే ముందు హాజరుపరిచింది. అయితే.. తమ కస్టడీని పొడిగించాలని ఈడీ కొరలేదు. దీంతో జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని ఆదేశించింది కోర్టు. ఇదీ చదవండి: ఎస్పీ నేత కారును ఢీకొట్టి.. 500 మీటర్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు డ్రైవర్.. వీడియో వైరల్ -
ఊహించని షాక్.. జైలుకు పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీలు
కోల్‌కతా: పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీలకు ఊహించని షాక్ ఇచ్చింది కోర్టు. ఈడీ కస్టడీ నేటితో ముగియనుండంతో 14 రోజులు జుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో వారు మరో 14 రోజులు జైలులో ఉండనున్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. పాఠశాల నియామకాల స్కామ్‌లో నటి అర్పితా ముఖర్జీ నివాసాల్లో సోదాని నిర్వహించిన ఈడీ పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుంది. జులై 23న పార్థ ఛటర్జీ, నటి అర్పితా ముఖర్జీలని అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అప్పటి నుంచి వారు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించారు సీఎం మమతా బెనర్జీ. అలాగే.. పార్టీ పదవుల నుంచి సైతం తొలగించారు. మరోవైపు.. తన నివాసంలో దొరికిన డబ్బులు పార్థ ఛటర్జీవేనని ఈడీకి తెలిపారు నడి అర్పితా ముఖర్జీ. ఇదీ చదవండి: Arpita Mukherjee: ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే -
‘ఆల్ట్ న్యూస్’కు విదేశీ విరాళాలు
న్యూఢిల్లీ: ఆల్ట్ న్యూస్ ఆధ్వర్యంలోని ప్రావ్దా మీడియాకు విదేశాల నుంచి రూ.2 లక్షల మేర విరాళాలు అందినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ డబ్బు జమ చేసిన మొబైల్ ఫోన్ నంబర్, ఐపీ అడ్రస్‌లు అన్నీ థాయ్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, మనామా, హాలండ్, సింగపూర్, అమెరికా,, ఇంగ్లాండ్, సౌదీఅరేబియా, స్వీడన్, యూఏఈ, కెనడా, స్విట్జర్లాండ్, పాకిస్తాన్, సిరియా దేశాలకు చెందినవని దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. మొత్తం రూ.2,31,933 ప్రావ్దా మీడియాకు చేరిందని తెలిపారు. జుబైర్ అరెస్ట్ అనంతరం అతడికి మద్దతుగా వచ్చిన ట్వీట్లను విశ్లేషించగా ఎక్కువ భాగం యూఏఈ, బహ్రెయిన్, కువాయిట్, పాకిస్తాన్ వంటి దేశాలవేనని గుర్తించామన్నారు. ఈ మేరకు మరిన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఆల్ట్ న్యూస్ సహవ్యవస్థాపకుడైన జుబైర్ 2018లో హిందూ దేవతపై చేసిన అభ్యంతరకర ట్వీట్‌పై జూన్ 27వ తేదీన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జుబైర్ పోలీస్ కస్టడీ శనివారంతో ముగియడంతో పోలీసులు ఢిల్లీ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్ స్నిగ్ధ సర్వారియా ఎదుట హాజరుపరిచారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతించింది. అయితే, కోర్టు తీర్పు ప్రతి అందకముందే జుబైర్ బెయిల్ పిటిషన్ తిరస్కరించినట్లు, కస్టడీకి అనుమతించినట్లు పోలీసులు మీడియాకు లీకులివ్వడం అవమానకరమని ఆయన తరఫు లాయర్ వ్యాఖ్యానించారు. -
Beef Row: లంచ్‌లోకి బీఫ్.. ప్రధానోపాధ్యాయురాలి అరెస్ట్
దిస్పూర్: తిండి విషయంలో ఎవరి అలవాట్లు వాళ్లవి. పని చేసే చోట నలుగురూ కలిసి భోజనం చేయడం సహజం. అలా లంచ్ చేస్తున్న టైంలో.. తాను ఇంటి నుంచి తెచ్చిన వంటకాన్ని నలుగురికి పంచాలనుకుంది ఓ ప్రధానోపాధ్యాయురాలు. అదే ఆమె చేసిన తప్పు అయ్యింది..కటకటాల వెనక్కి నెట్టింది. అస్సాం గోల్పరా జిల్లా లఖిపూర్‌లోని ముర్కాచుంగి మిడిల్ ఇంగ్లీష్ మీడియం ప్రధానోపాధ్యాయురాలు దలిమా నెస్సా(56).. గొడ్డుకూరను లంచ్ బాక్స్‌లో తీసుకెళ్లింది. అయితే తాను తెచ్చిన వంటకాన్ని తోటి ఉపాధ్యాయులకు పంచాలనుకుంది ఆమె. ఇది కొందరికి నచ్చలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మే 14న స్కూల్లో జరిగిన ఓ పంక్షన్ సందర్భంగా ఇది జరిగింది. బీఫ్‌ను పంచాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కొందరు టీచర్లు ఆమెపై స్కూల్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అటుపై ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో ఆ ప్రధానోపాధ్యాయురాలిని అరెస్ట్ చేశారు. మంగళవారం ఆమెను అరెస్ట్ చేసి..ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆమెకు జ్యూడిషియల్ కస్టడీ విధించారు. ఐపీసీ 153ఏ(విద్వేషాలు రగిల్చే ప్రయత్నం), 295ఏ (మత మనోభావాలు దెబ్బతీయడం) కింద.. ఆమెను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. బీఫ్ తినొచ్చు, కానీ.. ఈశాన్య రాష్ట్రం, పైగా బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో గొడ్డు మాంసం క్రయవిక్రయాలు, తినడంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే కిందటి ఏడాది ప్రభుత్వం ‘అస్సాం క్యాటల్ ప్రిజర్వేషన్ యాక్ట్’ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. హిందువులు, జైనులు, గొడ్డు మాంసానికి దూరంగా ఉండే కమ్యూనిటీలు ఉన్న ఏరియాలకు, హిందూ ఆలయాలకు ఐదు కిలోమీటర్ల అవతల.. బీఫ్ సెంటర్లను నిర్వహించకోవచ్చు. ఆవు అందరికీ అమ్మ. గోమాతను పూజించే గడ్డపై.. గొడ్డు మాంసం తినకపోవడమే ఉత్తమం. అదే సమయంలో తిండి అలవాట్లను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరమూ లేదు: అస్సాం సీఎం హిమంత గతంలో చేసిన కామెంట్లు చదవండి: జాతరలో బీఫ్, పంది బిర్యానీకి నో.. కలెక్టర్‌కు నోటీసులు -
Hanuman Chalisa Row: ఎంపీ నవనీత్ కౌర్ దంపతులకు బిగ్ షాక్
Hanuman Chalisa Row: మాజీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్, ఆమె భర్త రవి రానాలకు బిగ్ షాక్ తగిలింది. వీరిద్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలో పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రేట్ నిరాకరించారు. అయితే, హనుమాన్ చాలీసా చాలెంజ్‌తో ముంబైలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఇంటి ముందు హనుమాన్ చాలీసా పఠిస్తామని నవనీత్ రాణా మొదట్లో దంపతులు ప్రకటించారు. ఆ తర్వాత విరమించుకున్నారు. వీళ్లకు కౌంటర్‌గా శివ సేన కార్యకర్తలు రంగంలోకి దిగడంతో ముంబైలో హైటెన్షన్ నెలకొంది. ఎంపీ నవనీత్ కౌర్ ఇంటి ముట్టడికి శివసేన శ్రేణులు యత్నించగా.. ఏం జరుగుతుందో అనే ఆందోళన ఏర్పడింది. ఈ తరుణంలో.. ఎంపీ నవనీత్ కౌర్ దంపతులను శనివారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 153-ఏ ప్రకారం.. నవనీత్ కౌర్ దంపతులను అరెస్ట్ చేసి ఖార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత నవనీత్ రాణా దంపతులపై దేశద్రోహ అభియోగం మోపారు. ఈ అభియోగంపై వారిద్దరి తరపు న్యాయవాది తప్పుబట్టారు. హనుమాన్ చాలీసా పఠించడం 153 (ఏ) కింది రాదని, ఇదో బోగస్ కేసు అని మండిపడ్డారు. వీరు బెయిల్‌పై వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టే పోలీసులు రెండో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని న్యాయవాది ఆరోపించారు. ఇది చదవండి: డ్రాగన్ దేశం చైనాకు బిగ్ షాక్ -
NSE Co-Location Scam: 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి చిత్ర రామకృష్ణ..!
ఎన్ఎస్ఈ కో-లొకేషన్ కుంభకోణం కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ చిత్ర రామకృష్ణను ఢిల్లీ కోర్టు నేడు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతి నిచ్చింది. చిత్ర రామకృష్ణ తప్పించుకునే సమాధానాలు చెప్తున్నారని, దర్యాప్తుకు సహకరించడం లేదని సీబీఐ కోర్టుకు తెలియజేసింది. జ్యుడీషియల్ కస్టడీ సమయంలో రామకృష్ణ కోసం ఇంట్లో వండిన ఆహారాన్ని తెచ్చుకునేందుకు న్యాయవాది కోరారు. అయితే, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆహారం కూడా మంచిదని న్యాయమూర్తి చెప్పారు. విచారణ సమయంలో వీఐపీ సౌకర్యాలు కల్పించాలని ఆమె న్యాయమూర్తి కోర్టును కోరారు. దీనిని కూడా కోర్టు తిరస్కరించింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో(ఎన్ఎస్ఈ) కో-లొకేషన్ కుంభకోణం కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ చిత్రారామకృష్ణను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొద్ది రోజుల క్రితం అరెస్టు చేసింది. ఎన్ఎస్ఈ కొలోకేషన్ కేసులో సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్ఎస్ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెబీ నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్ఎస్ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్ఎస్ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్ చేసింది. (చదవండి: కో-లొకేషన్ కుంభకోణంలో హిమాలయా యోగి చెప్పారు.. చిత్ర చేశారు..!) -
బుల్లి బాయ్ కేసు: నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్
ముంబై: దేశంలో బుల్లి బాయ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్వేత సింగ్(18), మయాంక్ రావత్(20)లకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు బాంద్రా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని జనవరి 28 వరకు పోలీసులు విచారించనున్నారు. కాగా, దీనిపై నిందితుల తరపు న్యాయవాది ఇప్పటికే బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై జనవరి (17) సోమవారం విచారణ జరగనుంది. బుల్లిబాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడైన నీరజ్ బిష్ణోయ్‌తో పాటు శ్వేత, మయాంక్‌లను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, నిందితుల తరపు న్యాయవాది, తమ క్లయింట్ల ట్విటర్ ఖాతాను హ్యక్ చేశారని కావాలని ఇరికించారని తెలిపారు. ఇప్పటికే శ్వేత, మయాంక్‌లను ఉత్తరాఖండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు విశాల్ కుమార్‌ను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. విశాల్‌కు కోవిడ్ పాజిటివ్ తేలడంతో అతడిని ముంబైలోని కలీనా క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. కాగా, ఈ కేసుతో సంబంధం ఉన్న నీరజ్‌ను భోపాల్‌లోని వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇతడిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. పదిహేను సంవత్సరాల వయసులోనే హ్యకింగ్ నేర్చుకున్నట్లు తెలిపాడు. ఈ బుల్లి బాయ్ యాప్‌తో మహిళలను మార్ఫింగ్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: ‘కోటి రూపాయలు ఇవ్వకపోతే ఏసీబీతో దాడి చేయిస్తా’ -
కస్టడీ మరణాలపై జాతి మేలుకోవాలి
కొన్ని వారాల క్రితం, 22 ఏళ్ల కుర్రాడు అల్తాఫ్ పెళ్లాడతానని చెప్పి ఒక మైనర్ బాలికను అపహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ ఉద్దేశంతోనే అతడు ఆ బాలికను తన స్నేహితుడితో కలిసి ఆగ్రా చేరుకోమని సూచించాడు. వారు అక్కడికి వచ్చాక త్వరలోనే తాను అక్కడికి వస్తానని చెప్పాడు. కానీ అతడా పని చేయలేదు. కారణం అలా చెప్పిన మరుసటి రోజే ఆ అమ్మాయి కుటుంబం చేసిన ఆరోపణలతో పోలీసులు అల్తాఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒక రోజు తర్వాత అతడు చనిపోయాడు. పోలీసు స్టేషన్ వాష్ రూమ్‌లో నేలకు కొన్ని అడుగుల ఎత్తున ప్లాస్టిక్ టాప్కు వేలాడుతూ కనిపించాడు. ఇంటరాగేషన్ చేస్తున్న చోటే అతడు తాను ధరించి ఉన్న జాకెట్ దారం సహాయంతో ఉరివేసుకున్నాడని పోలీసుల ప్రకటన. ఇది విడి ఘటన కాదు. అలాగని విశేష ఘటన అంత కంటే కాదు. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) ప్రకారం గత 20 ఏళ్లలో దేశంలో 1,888 మంది అటు పోలీసు కస్టడీలో లేక జ్యుడీషియల్ కస్టడీలో ఉంటూ చనిపోయారని తెలియడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. పైగా ఇవి అధికారికంగా ప్రకటించిన కస్టడీ మరణాల సంఖ్య మాత్రమే. నిజానికి ఎన్ని మరణాలు చోటు చేసుకుని ఉంటాయన్నది ఎవరికి వారు ఊహించుకోవలసిందే. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు ఈ రకమైన నెత్తుటి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. గుజరాత్ కూడా ఈ జాబితాలో చేరుతోందని ఎన్సీఆర్బీ పేర్కొంది. 2020 లోనే గుజరాత్లో 15 కస్టడీ మరణాలు నమోదయ్యాయి. గతేడాది దేశవ్యాప్తంగా 76 మంది ఇలా చనిపోయారు. సమాజంలోని వెనుకబడిన వర్గాల ప్రజ లకు వ్యతిరేకంగా రాజ్యమే రెచ్చగొడుతున్న ఆగ్రహావేశాల నేపథ్యంలో ఇలాంటి ఘాతుకమైన మరణాల వైపు భారత దేశం శరవేగంగా దూసుకెళుతోంది. పోలీసు కస్టడీలో లేదా విచారణ సమయంలో జరుగుతున్నట్లు అధికారులు చెబు తున్న కారణాలు రోతపుట్టిస్తాయనడంలో సందేహం లేదు. అనారోగ్యం, గుండెపోటు, వ్యాధి కారణంగా ఆసుపత్రిలో చేర్పించినప్పుడు సహజ మరణం లేదా వయసు కార ణంగా సహజమరణం వంటివి కస్టడీ మరణాలకు కారణా లని చెబుతున్నారు. ఇంత హృదయం లేని వివరణల కారణంగానే కస్టడీ మరణాలపై సుప్రీంకోర్టు ధ్వజమె త్తింది. చట్టబద్దంగా పాలన సాగుతున్న పౌర సమాజంలో కస్టడీ మరణాలకంటే మించిన ఘోరనేరాలు మరొకటి ఉండవని కోర్టు కడిగిపారేసింది. జాతి సిగ్గుపడే విధంగా, అమానుషమైన రీతిలో కస్టడీలో జరుగుతున్న మరణాలపై సుప్రీకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలేసినా శాంతిభద్రతల వ్యవస్థలో ఏ ఒక్కరూ లెక్క చేయలేదు. దేశవ్యాప్తంగా ప్రతిపోలీసు స్టేషన్, నిఘా సంస్థ, సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ, ఈడీతో సహా ప్రతి కార్యాలయంలోనూ సీసీటీవీలు నెలకొల్పాలని, నైట్ విజన్, ఆడియో రికార్డింగు సౌకర్యం వీటికి తప్పక కల్పిం చాలని గతేడాది నవంబరులో సుప్రీం కోర్టు ఆదేశించింది. పోలీసు స్టేషన్లలో జరిగే ప్రతి విచారణను తప్పకుండా రికార్డు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇంటరాగేషన్ గదులు, లాకప్ గదులు, పోలీసు స్టేషన్ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలన్నింటిలో భద్రతా కెమెరాలను ఏర్పర్చాలని కూడా కోర్టు ఆదేశించింది. స్టేషన్లు, ఇంటరా గేషన్ కార్యాలయాల్లోని కారిడార్లు, లాబీలు, రిసెప్షన్ ఏరియాలు, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ ఉండే గదులు, బయట ఉండే వాష్ రూముల వద్ద కూడా కెమెరాలు అమ ర్చాలని ఆదేశించింది. అలాగే మాదకద్రవ్యాల నిరోధక బ్యూరో, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, తీవ్రమైన మోసాలపై దర్యాప్తు చేస్తున్న ఆఫీసులు– ఇలా అన్ని చోట్లా సీసీటీవీ రికార్డు చేసి వాటిని 18 నెలలపాటు భద్రపర్చా లని ఏ విచారణ క్రమంలోనైనా మానవ హక్కుల ఉల్లం ఘన జరిగినట్లయితే పర్యవేక్షణకు ఇవి ఉపయోగ పడతాయని కోర్టు స్పష్టం చేసింది. భారత రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ రక్షణ అనే ప్రాథమిక హక్కును పరిరక్షించడానికి ఇవన్నీ తప్పనిసరిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తన ఈ ఆదేశాన్ని అమలు చేయడానికి ఆరువారాల లోపు గడువు విధించుకుని మరీ కార్యాచరణ పూర్తి చేయా లని సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ కోర్టు ఆదేశం ఎంత అపహాస్యం పాలైందంటే ఇదే సమస్యను మనం సంవ త్సరం తర్వాత ఇప్పుడూ చర్చించుకుంటూనే ఉన్నాం. 2018లో పంజాబ్‌లో జరిగిన ఒక కస్టడీ చిత్రహింసల కేసును విచారించిన సందర్భంగా కూడా సుప్రీంకోర్టు ఇదే విధమైన ఆదేశం జారీ చేసింది. కానీ మూడున్నర సంవ త్సరాల తర్వాత కూడా తన ఆదేశాలను అమలు చేయక పోవడంపై అత్యున్నత న్యాయస్థానం అభిశంసించింది. అయినా సరే పోలీసు స్టేషన్లలో ఇలాంటి ఘోరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తమిళనాడులో లాక్డౌన్ నిబం ధనలను ఉల్లంఘించారనే సాకుతో పోలీసులు... తండ్రీ కుమారులను చిత్రహింసలు పెట్టి చంపేసిన ఘాతుక చర్యపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరం నవంబర్ 20న సుప్రీం కోర్టు తాజాగా అవే ఆదేశాలు మళ్ళీ జారీ చేసింది. సంవత్సర కాలంగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది రైతులు ఆందోళన చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు కనీస మద్దతు ధరకు కూడా హామీ ఇవ్వాలన్నది వీరి డిమాండ్. ఈ రైతుల పిల్లలే మన అంతర్జాతీయ సరిహద్దులను పరి రక్షిస్తున్నారు. రైతుల న్యాయమైన డిమాండ్ల పట్ల సాను భూతి ప్రకటించకపోవడం అటుంచి వారి ట్రాక్టర్లను దేశ రాజధానిలో ప్రజలపైకి తోలారంటూ ఆరోపిస్తున్నాం. చివరకు రైతులపైకి వాహనాలు తోలి చంపిన లఖిం పూర్ ఖేరీ ఘటనపై కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాతే విచారణ మొదలెట్టారు. యూపీలో స్థానిక పోలీసు బలగాలు చేపట్టే ఎలాంటి విచారణపైనా తనకు నమ్మకం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. ప్రభుత్వాధికారం గుప్పిట్లో పెట్టుకున్న శక్తుల ఉచ్చులో మనం పడి పోతు న్నాం. తాము అన్ని చట్టాలకూ అతీతమని, ఎవరి ఆదేశా లనూ, సూచనలనూ తాము పాటించబోమంటున్న అధి కార శక్తుల ప్రాబల్య కాలంలో మనం మనుగడ సాగి స్తున్నాం. ఈ రాజ్యాంగేతర శక్తుల ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే మన సామూహిక చైతన్యం సైతం ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. ప్రాథమికమైన, ప్రాణాధా రమైన ఈ చైతన్యాన్ని కూడా మనం కోల్పోతే అది ఎన్నటికీ తిరిగిరాదు. నిజంగానే ఇది మనకు మేలుకొలుపు లాంటి దేనని గ్రహించాలి. – నారాయణ్ రాజీవ్, కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ -
నాగశౌర్య ఫామ్‌హౌస్ కేసు: కస్టడీలోకి ప్రధాన నిందితుడు
హైదరాబాద్: హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్ పేకాట కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్‌ను నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్యపరీక్షలు జరిపిన తర్వాత.. నిందితుడు సుమన్ చౌదరిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. పేకాట, క్యాసినో ఇతర కేసుల వివరాలపై ఆరాతీస్తున్నారు. కాగా, ఫామ్ హౌజ్దేని కోసం తీసుకున్నారు..? ఎవరెవరి పాత్ర ఉంది..? అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి నుంచి కీలక సమాచారం రాబట్టనున్నట్లు తెలుస్తోంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట -
పోలీస్ కస్టడీకి ఆశిష్
లఖీమ్‌పూర్‌ఖేరి/బహ్రెయిచ్: లఖీమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనల కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్‌కు కోర్టు మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఈనెల 3వ తేదీన జరిగిన ఘటనల్లో నలుగురు రైతులు సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఆశిష్ మిశ్రాను పోలీసులు 14 రోజుల రిమాండ్ కోరగా.. 12 నుంచి 15వ తేదీ వరకు అంటే మూడు రోజులపాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించిందని అధికారులు తెలిపారు. 15వ తేదీ ఉదయంతో రిమాండ్ గడువు ముగియనుంది. ఈ సమయంలో ఆశిష్ మిశ్రాను ఇబ్బందిపెట్టరాదనీ, విచారణ సమయంలో లాయర్ ఆయన పక్కనే ఉంటారని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ చింతారాం షరతు విధించారు. అంతకుముందు, ఓ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. టింకోనియాలో నేడు అంతిమ్ అర్థాస్ లఖీమ్‌పూర్ ఖేరిలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులకు మంగళవారం అంతిమ్ అర్థాస్ (అంతిమ ప్రార్థన) జరుపుతామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) తెలిపింది. అసువులు బాసిన రైతులకు నివాళులర్పించేందుకు మంగళవారం షహీద్ కిసాన్ దివస్‌గా పాటించాలని ఎస్కేఎం పిలుపునిచ్చింది. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో దేశవ్యాప్తంగా రైతులు తమ నివాసాల వెలుపల కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించాలని కోరింది. హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న టికోనియా గ్రామంలో జరిగే అంతిమ ప్రార్థన కార్యక్రమానికి రాకేశ్ తికాయత్ సహా రైతు నేతలు తరలిరానున్నారు. ఇలా ఉండగా, లఖీమ్‌పూర్‌ఖేరి బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరగాలంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సోమవారం లక్నోలో జీపీవో పార్కు వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. -
ఆ సమయంలో ఆశిష్ ఎక్కడ?
న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్ ఖేరి హింసాత్మక ఘటనలో హత్య అభియోగాలను ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా సిట్ విచారణలో పొంతన లేని సమాధానాలు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు చాలా ప్రశ్నలకి ఆయన సమాధానమే ఇవ్వలేదని సమాచారం. నలుగురు రైతుల్ని బలిగొన్న వాహనం దూసుకుపోయిన ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఎక్కడ ఉన్నాడనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసుల్లో విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు లఖీమ్‌పూర్ ఖేరిలో హింస చెలరేగినప్పుడు తాను అక్కడికి 4–5 కి.మీ. దూరంలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల వద్ద ఉన్నట్టుగా ఆశిష్ విచారణలో వెల్లడించారు. అజయ్ మిశ్రా స్వగ్రామమైన భవానీపూర్‌లో నిర్వహించిన ఈ రెజ్లింగ్ పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరవడానికి కేంద్ర మంత్రి వెళుతుండగానే అక్టోబర్ 3న హింసాత్మక ఘటనలు చెలరేగి నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో సిట్ ఎదుట లొంగిపోయిన ఆశిష్‌ని 12 గంటల సేపు ప్రశ్నించిన తర్వాత శనివారం అర్ధరాత్రి దాటాక మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా... అతనిని 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు సీనియర్ ప్రాసిక్యూషన్ అధికారి ఎస్పీ యాదవ్ చెప్పారు. తదుపరి విచారణని సోమవారానికి వాయిదా వేశారు. ఆ మూడు పాయింట్లు.. ఈ కేసులో అత్యంత కీలకంగా మారిన మూడు పాయింట్లు గమనిస్తే ఆశిష్ వాస్తవ విరుద్ధంగా మాట్లాడుతున్నారని అర్థమవుతోందని సిట్ పోలీసులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం... ► లఖీమ్‌పూర్ ఖేరిలో వాహనం దూసుకుపోయిన ఘటన జరిగినప్పుడు తాను రెజ్లింగ్ కార్యక్రమంలో ఉన్నానని ఆశిష్ చెప్పారు. అయితే రెజ్లింగ్ కార్యక్రమం దగ్గర పహారాగా ఉన్న పోలీసు సిబ్బంది ఆశిష్ ఆ కార్యక్రమానికి వచ్చినప్పటికీ 2 నుంచి 4 గంటల మధ్య కనిపించకుండా పోయారని వెల్లడించారు. ► ఆశిష్ మిశ్రా సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఆయన ఉండే ప్రాంతాన్ని పరిశీలిస్తే ఆ సమయంలో హింసాకాండ జరిగిన స్థలంలోనే ఉన్నారని తేలింది. ఇదే విషయాన్ని సిట్ అధికారులు నిగ్గదీసి అడిగితే ఆశిష్ మళ్లీ మాట మార్చి ఆ సమయంలో తాను తమ రైస్‌మిల్లుకి కూడా వెళ్లానని, హింస చెలరేగిన ప్రాంతానికి అది దగ్గరలో ఉందని, ఈ రెండు ప్రదేశాలు ఒకే మొబైల్ టవర్ కిందకి వస్తాయంటూ వాదించారు. ఈ రెండు అంశాలూ ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా ఉండబట్టే అరెస్టు జరిగిందని సమాచారం. ► రైతుల ఊసే లేకుండా దాఖలు చేసిన రెండో ఎఫ్ఐఆర్ (డ్రైవర్‌ను, బీజేపీ కార్యకర్తలను ఆందోళనకారులు కొట్టి చంపిన కేసు)లో పరిశీలించినా ఆశిష్ అన్నీ నిజాలు చెప్పడం లేదని అర్థమవుతుంది. రైతుల మీదకి దూసుకుపోయిన వాహనం తనదేనని అంగీకరించిన ఆశిష్ ఆ సమయలో తాను అందులో లేనని మొదట్నుంచి చెబుతూ వస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్లో ఆశిష్ అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డ్రైవింగ్ సీటులో ఉన్నది ఆశిష్ కాదని, అతని డ్రైవర్ హరిఓం అని చెబుతున్నారు. డ్రైవింగ్ సీటులో డ్రైవర్ హరిఓం ఉన్నాడని, అతను తెల్ల చొక్కా లేదంటే కుర్తా ధరించాడని ఎఫ్ఐఆర్లో కూడా రాశారు. వీడియో పరిశీలనలో కూడా తెల్లచొక్కా ధరించిన వ్యక్తే నడుపుతున్న పోలీసులు గుర్తించారు. అయితే ఆస్పత్రికి తీసుకువచ్చిన డ్రైవర్ మృతదేహంపై పసుపు చొక్కా ఉంది. ఇవన్నీ చూస్తుంటే ఆశిష్ వాస్తవాలు దాచి పెడుతున్నారని తెలుస్తోందని సిట్ పోలీసుల వాదనగా ఉంది. -
జ్యుడీషియల్ కస్టడీకి ఆర్యన్
ముంబై: క్రూయిజ్ షిప్లో డ్రగ్స్ స్వాధీనం కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్‌తోపాటు మరో ఏడుగురిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ముంబై మేజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. ఆర్యన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతని న్యాయవాది సతీష్ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని తెలిపింది. నిందితులను తమ కస్టడీకి అప్పగిస్తూ ఇచ్చిన గడువును ఈ నెల 11 దాకా పొడిగించాలని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) కోరింది. డ్రగ్స్ స్వాధీనం కేసులో కుట్రలను వెలికి తీయాల్సి ఉందని, ఈ వ్యవహారంలో అచ్చిత్ కుమార్ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశామని(సరఫరాదారు కావొచ్చని అనుమానం).. అతడిని, నిందితులను కలిపి విచారించాల్సి ఉందని వెల్లడించింది. అయితే, ఎన్సీబీ విజ్ఞప్తిని న్యాయస్థానం కొట్టిపారేసింది. అస్పష్టమైన ఆధారాలను బట్టి నిందితులను మళ్లీ ఎన్సీబీ కస్టడీకి అప్పగించలేమని పేర్కొంది. ఈ నెల 3న ముంబై నుంచి గోవాకు పయనమైన పర్యాటక నౌకలో డ్రగ్స్‌తో కొందరు పార్టీ చేసుకుంటున్న సమాచారం అందడంతో ఎన్సీబీ దాడి చేసింది. వివిధ రకాల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఆర్యన్ ఖాన్, మున్మున్ ధామేచా, అర్బాజ్ మర్చంట్‌ను అరెస్టు చేసింది. షారుక్ మేనేజర్ పూజా దద్లానీ గురువారం కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో ఆమె రోదించారు. 8 మంది నిందితులకు కోవిడ్ నెగటివ్ టెస్టు రిపోర్టు లేకపోవడంతో అధికారులు వారిని జైలుకు తరలించకుండా గురువారం రాత్రి ఎన్సీబీ ఆఫీస్‌లోనే∙ఉంచారు. నిందితులను కలిసి, మాట్లాడేందుకు వారి కుటుంబ సభ్యులను అనుమతించారు. పూజా దద్లానీ ఎన్సీబీ ఆఫీసుకు వచ్చి ఆర్యన్‌ను కలిశారు. -
విస్తుగొలిపే విషయాలు.. దేశంలో జుడీషియల్, పోలీసు కస్టడీ మరణాలు..
జీవితంలో గడిచిపోయిన ప్రతి క్షణం వెలకట్టలేనిది. ఆ కాలాన్ని తిరిగి ఇవ్వాలంటే.. అది ఎవరి వల్లా కాదు.. అయితే మన దేశంలో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్న నిర్దోషులు అనేక మంది ఉన్నారు. ఇంటారాగేషన్ పేరుతో ఒంట్లోని శక్తినంతా లాగేశాక.. చివరికి జీవచ్ఛవాల్లా ఉన్న వారిని నిర్దోషులుగా విడుదల చేయడం పరిపాటి. తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పిన విషయాలు దేశంలో జైళ్ల పరిస్థితిని తెలియజేస్తోంది. సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 3 సంవత్సరాలలో 348 మంది పోలీసు కస్టడీలో మరణించగా.. 5221 మంది జ్యుడీషియల్ కస్టడీలో మరణించినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లోక్ సభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ చెప్పారు. అంతే కాకుండా ఉత్తర ప్రదేశ్‌లో పోలీసు కస్టడీలో 23 మంది చనిపోయారని, అదే సమయంలో జ్యుడీషియల్ కస్టడీలో 1295 మంది మరణించినట్లు ఆయన తెలిపారు. ఎన్హెచ్ఆర్సీ, ఎన్సీఆర్బీ గణాంకాల్లో చాలా తేడాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డుల ప్రకారం గత 10 సంవత్సరాలలో, 1,004 మంది పోలీసుల కస్టడీలో మరణించారు. అందులో 40శాతం మంది సహజంగా లేదా అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోగా.. 29శాతం మంది ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ నివేదికలో దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా చనిపోయారా? లేదా పోలీసుల చిత్రహింసల కారణంగానా..? అనేది స్పష్టం చేయలేదు. అలాగే పోలీస్ కస్టడీ మరణాలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ), నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాల్లో చాలా తేడాలు ఉన్నాయి. నిందుతులు ఎంతటి వారైనా చట్టం ముందు సమానులే..! దీనిపై సామాజిక కార్యకర్త సమీర్ మాట్లాడుతూ.. "ఖైదీలను హింసించడాన్ని వ్యతిరేకిస్తున్న అనేక మంది అధికారులు పోలీసు శాఖలో ఉన్నారు. పోలీసులు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరు. అందువల్ల న్యాయస్థానాల ద్వారా నేరస్తులను విచారించడానికి చట్టపరమైన నిబంధనలను ఉపయోగిస్తారు. తీహార్ జైలులో ఓ ఖైదీ హత్యకు సంబంధించి డిప్యూటీ జైలర్, ఇతర జైలు సిబ్బంది పేర్లు బహిర్గతమయ్యాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ చట్టం అటువంటి విషయాలపై స్పష్టంగా ఉంది. నిందితులు ఏ పదవిలో ఉన్నా ప్రాసిక్యూట్ చేస్తారు.’’ అని అన్నారు. క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వలేదు ఓ మానవ హక్కుల కార్యకర్త స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం.. సంబంధిత పోలీసు అధికారులపై కేసును ప్రభుత్వ అనుమతి తర్వాత మాత్రమే నమోదు చేయవచ్చు. అయితే ప్రభుత్వాలు దీనికి బహిరంగంగా అమలు చేయడానికి ఇష్టపడవు. ఇది ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సిగ్గుచేటు. పోలీసు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను అనుమానిత నేరస్థులుగా మాత్రమే పరిగణించాలి అంతే కానీ వారిని నిర్బంధంలో క్రూరంగా హింసించే హక్కును ఏ చట్టమూ పోలీసులకు ఇవ్వదు. ఈ సమస్యపై దేశంలోని పోలీసులు, పరిపాలనా వ్యవస్థ సున్నితంగా ఉండడం అత్యవసరం’’ అని ఓ సామాజిక కార్యకర్త అన్నారు. కాగా హిందుస్తానీ బిరదారీ వైస్ ఛైర్మన్ విశాల్ శర్మ మాట్లాడుతూ.. ఏదైనా కస్టడీ మరణంపై పోలీసు శాఖ ద్వారానే సరైన నిష్పాక్షిక విచారణ జరగాలని పేర్కొన్నారు. అలాగే ప్రమేయం ఉన్న పోలీసులను చట్ట ప్రకారం శిక్షించాలని సూచించారు. -
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ.. 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ
ముంబై: పోర్నోగ్రఫి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నా రాజ్ కుంద్రా బెయిల్ పిటీషన్ విచారణను తిరస్కరించిన కోర్టు.. అతడికి 14 రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీ విధించింది. రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. రాజ్ కుంద్రా మార్చిలోనే తన అరెస్ట్‌ను ఊహించాడని.. ఈ క్రమంలో తన ఫోన్‌ను మార్చాడని క్రైమ్ బ్రాంచ్ అధికారులు భావిస్తున్నారు. రాజ్ కుంద్రా-శిల్పా శెట్టి దంపతుల బ్యాంక్ ఖాతాలను పరిశీలించడానికి క్రైమ్ బ్రాంచ్ అఫ్టికల్స్ స్వతంత్ర ఆడిటర్‌ను కూడా నియమించుకున్నట్లు సమాచారం. నటనపై ఆసక్తితో వచ్చిన వారిని బెదిరించి అశ్లీల చిత్రాలను తీసి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రాను ఈ నెల 19న పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అశ్లీల చిత్రాలు తెరకెక్కిస్తూ.. వాటిని హాట్ షాట్స్ యాప్ ద్వారా రిలీజ్ చేసేవాడని రాజ్ కుంద్రాపై ఆరోపణలు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రెండు రోజుల క్రితం శిల్పా శెట్టిని కూడా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఆమె పాత్రపై దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ కేసులో వియాన్ ఇండస్ట్రీస్‌కు చెందిన నలుగురు ఉద్యోగులు కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారు. అంతేకాక రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల రాకెట్టుకు సంబంధించి మొదటి నుంచీ వార్తల్లో ఉన్న నటి-మోడల్ షెర్లిన్ చోప్రాకు సమన్లు జారీ అయ్యాయి. జూలై 27, ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ ప్రాపర్టీ సెల్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. -
న్యాయవాదుల హత్య: నేడు కత్తుల వెలికితీత
గోదావరిఖని/వరంగల్: హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు, నాగమణిల హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈ నెల 17న వారిద్దరూ హత్యకు గురైన విషయం తెలిసిందే. కేసులో నిందితులుగా ఉన్న కుంట శ్రీనివాస్, శివందుల చిరంజీవి, అక్కపాక కుమార్‌ను రామగుండం కమిషనరేట్ పోలీసులు గురువారం జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. గురువారం ఉదయం వరంగల్ జైలుకు వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్ మధ్య రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు తరలించారు. జైలు నుంచి నిందితులను రామగుండం తరలించేసరికి సాయంత్రం కావడంతో హత్యకు ఉపయోగించిన కత్తుల వెలికితీతను వాయిదా వేశారు. కత్తులను నిందితులు సుందిళ్ల బ్యారేజీలో పడేసిన విషయం తెలిసిందే. పది మీటర్ల లోతులో ఉన్న వీటిని శుక్రవారం వెలికితీయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు జంటహత్యల్లో ఎవరి పాత్ర ఏమిటి, సహకరించిందెవరనే దానిపై మరింత లోతుగా విచారించనున్నట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జంట హత్యల కేసుపై హైకోర్టు, గవర్నర్ సైతం స్పందించడంతో పోలీసులు ప్రతీదీ సాక్ష్యాధారాలతో సహా సేకరిస్తున్నారు. చదవండి: ప్రశ్నించే గళాలకు ఇదా శిక్ష?! -
అర్నబ్‌కు దొరకని బెయిల్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను గురువారం బాంబే హైకోర్టు తిరస్కరించింది. అరెస్టు అక్రమమనీ, తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలనీ, ముంబై పోలీసుల దర్యాప్తుపై స్టే విధించాలని బెయిల్ పిటిషన్లో అర్నబ్ కోరారు. మహారాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా కక్ష సాధింపునకు పాల్పడుతోందని అర్నబ్ తరఫు లాయర్ హరీశ్ సాల్వే ఆరోపించారు. వాదనలు విన్న బాంబే హైకోర్టు.. వాదనలు వినిపించాలని ప్రతివాదులుగా ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం, అన్వయ్ నాయక్ భార్య అక్షతను కోరింది. శుక్రవారం వాదనలు వింటామని తెలిపింది. అర్నబ్ అరెస్టు చట్ట విరుద్ధం అర్నబ్‌ను అరెస్టు చేయడం ప్రాథమికంగా చట్ట విరుద్ధమని మహారాష్ట్రలోని ఓ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదిని ఆత్మహత్యకు అర్నబ్ కారణమంటూ వచ్చిన 2018 నాటి ఆరోపణలపై బుధవారం ముంబై పోలీసులు అర్నబ్‌ను అరెస్టుచేశారు. అర్నబ్‌తోపాటు అరెస్టు చేసిన ఫిరోజ్ షేక్, నితేశ్ సర్దాలను పోలీసులు రాయగఢ్ జిల్లా అలీబాగ్ కోర్టులో బుధవారం రాత్రి హాజరు పరిచారు. ఈ కేసులో అర్నబ్‌ను 18వరకు అలీబాగ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి అనుమతించింది. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ సునయన.. మృతులకు, నిందితులకు మధ్య ఉన్న సంబంధాన్ని రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందన్నారు. అర్నబ్‌ను పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు రుజువులు లేవన్నారు. తీర్పును సవాల్ చేస్తూ పోలీసులు అలీబాగ్ సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం అర్నబ్‌ను అలీబాగ్ నగర్ పరిషత్ స్కూల్లో కోవిడ్ సెంటర్లో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచారు. -
అర్నబ్ గోస్వామి అరెస్ట్
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని రాయగఢ్ జిల్లా అలీబాగ్ పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయిక్ (53) ఆత్మహత్యకు సంబంధించి అర్నబ్‌ను అరెస్టు చేసినట్టు అలీబాగ్ పోలీసులు పేర్కొ న్నారు. తననెందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నిస్తూ, అరెస్టువారెంటు చూపాలని అర్నబ్ వాదించారని పోలీసులు తెలిపారు. అరెస్టు వారంటును చూపించబోగా, అర్నబ్ భార్య ఆయా పేపర్లను చించేశారని పేర్కొన్నారు. ఆ తర్వాత అర్నబ్‌ను అలీబాగ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచారు. గోస్వామిని అలీబాగ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షల అనంతరం మళ్లీ ఆయనను కోర్టులో హాజరుపరచాలని చెబుతూ ఈనెల 18 వరకూ జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గోస్వామి ని పోలీసులు అరెస్టు చేసే సమయంలో పోలీసులు అర్నబ్‌పై చేయి చేసుకున్నారని, అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్ పార్కర్లు ఆరోపించారు. ఇదిలా ఉండగా, ఆయన్ను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసుల బృందంలో ఉన్న మహిళా పోలీసుపై అర్నబ్ చేయి చేసుకున్నారన్న అభియోగాలతో ఆయనపై మరో ఎఫ్ఐఆర్ దాఖలైంది. మహిళా పోలీసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. తన భర్తకు ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఉంటే నేడు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్ నాయక్ భార్య అక్షతా పేర్కొన్నారు. చట్టం ముందు అంతా ఒక్కటే.. చట్టం ముందు ఎవరూ గొప్పవారు కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. అన్వయ్ కుటుంబీకుల ఫిర్యాదు మేరకే ఈ కేసును తిరిగి విచారణ చేపట్టేందుకు కోర్టులో దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అనంతరం కోర్టు అనుమతితోనే ఈ అరెస్టు జరిగిందని చట్టప్రకారం పోలీసులు తమ పని తాము చేస్తున్నారన్నారని అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. తప్పు ఎవరు చేసినా పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కొన్నారు. -
ఆస్తులమ్మి అప్పులు తీర్చేస్తాం
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న డీహెచ్ఎఫ్ఎల్ సంస్థ తమ చేయి జారకుండా ప్రమోటర్లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా సుమారు రూ. 43,000 కోట్ల విలువ చేసే తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తులను విక్రయించైనా రుణదాతల బాకీలు తీర్చేస్తామని జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ప్రమోటర్ కపిల్ వాధ్వాన్ తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ నియమించిన అడ్మిని స్ట్రేటర్ ఆర్ సుబ్రమణియ కుమార్‌కు ఈ మేరకు లేఖ రాశారు. రుణ బాకీలు తీర్చేసే దిశగా.. తమ కుటుంబానికి వివిధ ప్రాజెక్టుల్లో ఉన్న వాటాలను, హక్కులను బదలాయిస్తామని వాధ్వాన్ ప్రతిపాదించారు. 2018 సెప్టెంబర్ నాటి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా డీహెచ్ఎఫ్ఎల్తో పాటు పలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు కుదేలయ్యాయని ఆయన తెలిపారు. కష్టకాలంలోనూ వివిధ అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా డీహెచ్ఎఫ్ఎల్ దాదాపు రూ. 44,000 కోట్లు చెల్లించిందని వివరించారు. మనీలాండరింగ్, నిధుల గోల్మాల్ వంటి ఆరోపణలపై డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్లు కపిల్, ఆయన సోదరుడు ధీరజ్ వాధ్వాన్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. బాకీలను రాబట్టుకునే క్రమంలో రుణదాతలు .. డీహెచ్ఎఫ్ఎల్ని వేలానికి ఉంచగా ఓక్ట్రీ, ఎస్సీ లోవీ తదితర సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. -
అక్టోబర్ 6 వరకు రియా జైల్లోనే
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. నిందితుల్లో రియా సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు. ఇక సెప్టెంబర్ 11న రియా, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. నిందితులు ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానుంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. రియా చక్రవర్తికి సుశాంత్ మాజీ ప్రియురాలు కావడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు సీబీఐకి చేతికి వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా పరిస్థితి మారింది. ఈక్రమంలోనే బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు సారా అలీ ఖాన్, మరో 15 మంది పేర్లను రియా విచారణలో వెల్లడించినట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. -
సెంట్రల్ జైలుకు నటి రాగిణి
సాక్షి, బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ వ్యవహారంలో అరెస్టయిన ప్రముఖ కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు. మరో నటి సంజన గల్రాని, రాహుల్, ప్రశాంత్ రంకా, లూమ్ పెప్పర్, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టులో హాజరు పరిచారు. సంజనకు మినహా మిగతా వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. నటి సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. బెయిల్ కష్టం రాగిణితో పాటు 14 మంది నిందితులపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్డీపిఎస్) చట్టం కింద కేసులు నమోదు చేయడంతో ఇప్పట్లో బెయిల్ దొరకటం కష్టమని తెలిసింది. మరో నటి సంజనను విచారణకు సహకరించటంలేదని సీసీబీ పేర్కొనగా, మరో 2 రోజుల పాటు వారి కస్టడీకి అనుమతించడంతో మంగళ, బుధవారాలు ప్రశ్నించనున్నారు. అంతకుముందు నిందితులకు కేసీ జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ టెస్టులను, ఇతర వైద్య పరీక్షలను చేయించారు. రాగిణి, సంజనలకు కరోనా నెగిటివ్‌గా వచ్చింది. ప్రముఖులతో నిందితుడు డ్రగ్స్ కేసులో కాంగ్రెస్ బీబీఎంపీ కార్పొరేటర్ కేశవమూర్తి కొడుకు యశస్ కోసం ఎన్సీబీ పోలీసులు ముంబై నుంచి బెంగళూరుకు వచ్చి గాలిస్తున్నారు. ఈ నెల 7న విచారణకు పిలవగా ఒకసారి వచ్చి వెళ్లాడు. తరువాత విచారణకు పిలవగా అదృశ్యమయ్యాడు. త్వరలో వీఐపీలకు నోటీసులు? రాగిణి, సంజన, ఇతర నిందితులు విచారణలో వెల్లడించిన సమాచారం ప్రకారం సీసీబీ పోలీసులు అనుమానితుల జాబితాను రూపొందించారు. ఇందులో నటులతో పాటు రాజకీయ నేతల పుత్రులు, ప్రముఖ కుటుంబాల వ్యక్తులూ ఉన్నట్లు తెలిసింది. విచారణకు రావాలని వారికి నోటీసులు పంపనున్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేల సన్నిహితులు, వ్యాపారవేత్తల పుత్రులు కూడా జాబితాలో ఉన్నారు. అనేకమంది ప్రముఖులు తాము నిర్వహించే డ్రగ్స్ పార్టీల్లో పాల్గొనేవారని రాగిణి, సంజనలు విచారణలో వెల్లడించారు. నేను దొంగ అవుతానా: జమీర్ డ్రగ్స్ కేసులో తనను ఇరికించి రాజకీయంగా అంతం చేయడానికి కుట్ర జరుగుతోందేమోనని కాంగ్రెస్ మాజీ మంత్రి, చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్‌ఖాన్ ఆరోపించారు. ఆయన సోమవారం బెంగళూరులో విలేకర్లతో మాట్లాడారు. నిందితుడు ఫాజల్‌తో నాకు పరిచయం లేదు. ఒక దొంగ నాతో కలిసి ఫోటో తీయించుకుంటే నేను దొంగను ఎలా అవుతానని ప్రశ్నించారు. వీఐపీలతో రాహుల్ చెట్టాపట్టాల్ డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన డ్రగ్స్ డీలర్ రాహుల్‌తో రెవెన్యూశాఖ మంత్రి ఆర్.ఆశోక్, నిర్మాత కె.మంజు కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. నటి సంజనకు అత్యంత సన్నిహితుడైన రాహుల్ సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులతో స్వీట్లు తింటూ దిగిన ఫోటోలు కలకలం సృష్టిస్తున్నాయి. నటుడు ఉపేంద్ర, క్రికెటర్ శ్రీశాంత్, శ్రీనగర కిట్టి, రఘు ముఖర్జీ, సంగీత దర్శకుడు గురుకిరణ్, నటీ ఐంద్రితా రై, ప్రియాంక, హర్షికా పూణచ్చ, ఒక రిటైర్డ్ ఐజీలతో కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. వీరితో ఇతనికి గల సంబంధాలు ఎలాంటివన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. -
నిందితులు తప్పించుకోలేరు : ఖుష్బూ
చెన్నై : పోలసుల కస్టడీలో తండ్రీ కుమారుడు ఒకరి తర్వాత మరొకరు మరణించడం రాష్ర్టవ్యాప్తంగా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ డిమాండ్ చేశారు. ఆలస్యం జరగకుండా దోషులకు త్వరగా శిక్షపడేలా అందరం కలిసికట్టుగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఒక కుటుంబం వారి అత్యంత ఆప్తులను కోల్పోయారు. జస్టిస్ ఫర్ జయరాజ్, ఫినిక్స్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఘటనను అమానవీయ చర్యగా పేర్కొంటూ చట్టానికి ఎవరూ అతీతులు కారని నటుడు జయం రవి పేర్కొన్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సింగర్ సుచిత్ర సహా పలువురు ప్రముఖులు సత్వరమే న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గత కొన్ని రోజులుగా జస్టిస్ ఫర్ జయరాజ్ అండ్ ఫినిక్స్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది. (‘సెల్’ కోసమే దాష్టీకమా? ) Will we and can we see law taking its course and punishing the guilty without any further delay in #Jeyaraj and #Fenix case? The culprits cannot and should not get away. A family has lost their most loved ones. Justice delayed is justice denied. #JusticeForJeyarajAndFenix — KhushbuSundar ❤️ (@khushsundar) June 26, 2020 తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్ కులంకు చెందిన జయరాజ్(63), కుమారుడు ఫినిక్స్(31) జ్యుడీషియల్ కస్టడిలో ఒకరి తర్వాత మరొకరు మరణించడం రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. తాము ఆడిన సెల్ఫోన్లను ఇవ్వలేదన్న ఆగ్రహంతో కక్ష కట్టి జయరాజ్, ఫినిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు గురువారం మీడియా ముందుకు వచ్చిన ఐదు రోజుల క్రితం ఏమి జరిగిందో వివరించారు. ఇక, పోస్టుమార్టం అనంతరం మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. సాత్తాన్ కులం వివాదం నేపథ్యంలో అన్ని జిల్లాల ఎస్పీలు, ఐజీ, డీఐజీలకు డీజీపీ త్రిపాఠి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. (డెత్ వార్ ) ఏదేని కీలక కేసులు ఇకమీద పోలీసుల స్టేషన్లలో విచారించేందుకు వీలు లేదని స్పష్టం చేశారు. డీఎస్పీ లేదా, డీఐజీ కార్యాలయాల్లో విచారణల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా, సాత్తాన్ కులం లాకప్‌డెత్‌కు నిరసగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల బంద్‌కు వర్తక లోకం పిలుపునిచ్చింది. యజమానాలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ దుకాణాల ఎదుట నిరసన చేపట్టారు. Please share & tag fwd so non-tamil-speaking people can understand what happened #JusticeforJayarajAndFenix @bhakisundar @ahmedmeeranoffl pic.twitter.com/nZ7klPzpsO — suchi_mirchi (@suchislife2019) June 25, 2020 -
వివాదాస్పదమైన తండ్రీ కొడుకుల మృతి
సాక్షి, చెన్నై: సబ్ జైల్లో జ్యుడీషియల్ కస్టడిలో ఉన్న తండ్రి కుమారుల మరణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. మదురై ధర్మాసనం సుమోటోగా కేసు నమోదు చేసింది. మద్రాసు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక నగరాల్లో బుధవారం వర్తకులు నిరసనలకు దిగారు. దుకాణాలన్నీ మూసి వేశారు. సెల్ సర్వీసు సెంటర్లు మూతపడ్డాయి. బాధిత కుటుంబానికి రూ. 2 కోట్లు నష్ట పరిహారం ప్రకటించాలని వర్తక లోకం డిమాండ్ చేసింది. తన తండ్రి, సోదరుడిని హతమార్చిన పోలీసులపై హత్య కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించే వరకు మృత దేహాలను తీసుకునే ప్రసక్తే లేదని జయరాజ్ కుమార్తెలు స్పష్టం చేశారు. తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్ కులంకు చెందిన జయరాజ్(63), కుమారుడు ఫినిక్స్(31) జ్యుడీషియల్ కస్టడిలో ఒకరి తర్వాత మరొకరు మరణించడం రాష్ట్రంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. లాక్ నిబంధనలను ఉల్లంఘించారన్న చిన్న కారణంతో పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. ఖాకీల దాష్టీకాన్ని నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వర్తకులు నిరసనలకు దిగారు. వణిగర్ సంఘం పేరవై నేతృత్వంలోని అన్ని దుకాణాలు తూత్తుకుడి, తిరునల్వేలి, మైలాడుతురై, మదురై, కడలూరు, తిరుచెందూరుల్లో నిరసనల్ని హోరెత్తించాయి. యజమానాలు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ దుకాణాల ఎదుట నిరసన చేపట్టారు. సుమోటోగా కేసు ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయగా, మరో పదిహేను మందిని బదిలీ చేశారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనను తీవ్రంగానే కొర్టు పరిగణిస్తోంది. లాకప్ డెత్‌లకు ముగింపు లేదా ..? అని న్యాయమూర్తులు ప్రకాష్, పుగలేంది నేతృత్వంలోని బెంచ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. గంటల వ్యవధిలోనే డీజీపీ, తూత్తుకుడి ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే సీఎం పళని స్వామితో కరోనా నివారణ చర్యలపై డీజీపీ కాన్ఫరెన్స్‌లో ఉండడంతో కుదరలేదు. దీంతో ఆయన తరపున డీఐజీ విచారణకు హాజరు అయ్యారు. తాము చేపట్టిన చర్యలను కోర్టు ముందు ఉంచారు. విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్ 26వ తేదికి వాయిదా వేశారు. అలాగే మృత దేహాలకు పోస్టుమార్టం పూర్తిగా వీడియో చిత్రీకరణ జరగాలని, విచారణను కోర్టు పర్యవేక్షిస్తుందని ఆదేశించారు. చిక్కుల్లో మేజిస్ట్రేట్ ఆ ఇద్దరిని రిమాండ్‌కు తరలించిన కోవిల్పట్టి మేజిస్ట్రేట్ ఈ వివాదంలో ఇరుక్కున్నట్టుగా పరిస్థితి మారింది. చెన్నైకు చెందిన న్యాయవాది సూర్యప్రకాశం మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు సుందరేష్, కృష్ణకుమార్ బెంచ్ ముందు హాజరయ్యారు. తండ్రి కుమారులను రిమాండ్‌కు తరలించే ముందు ఎందుకు వైద్య పరీక్షలకు న్యాయమూర్తి ఆదేశించలేదని ప్రశ్నించారు. దీంతో పిటిషన్ దాఖలు చేయాలని, విచారిస్తామని న్యాయమూర్తులు సూచించారు. కోవిల్ పట్టి మేజ్రిస్టేట్ భాగస్వామ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం విచారణ జరగనుంది. హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ ఇద్దరి మృతదేహాలను తిరునల్వేలి జిల్లా పాళయం కోటై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మధ్యాహ్నం పోస్టుమార్టం జరిగింది. అయితే మృతదేహాలను తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. జయరాజ్ సతీమని సెల్వరాణి , ముగ్గురు కుమార్తెలు కన్నీటి పర్యంతంతో మీడియా ముందుకు వచ్చారు. పోలీసులపై హత్య కేసు నమోదు చేసే వరకు మృతదేహాలను తీసుకునే ప్రసక్తే లేదని తేల్చారు. మరోవైపు తూత్తుకుడి ఘటన రాష్ట్రవాప్తంగా కలకలం రేగుతుంటే సీఎం పళని స్వామి మౌనంగా ఉండడం శోచనీయమని ఎంపీ కనిమొళి ట్విట్టర్లో విమర్శించారు. అలాగే హత్య కేసు నమోదు చేయాలని డీజీపీ జేకే త్రిపాఠికి కనిమొళి ఫిర్యాదు చేశారు. స్పందించిన సీఎం ఈ ఘటనపై సీఎం పళనిస్వామి బుధవారం స్పందించారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తండ్రి కుమారుల మరణానికి సంతాపం తెలిపారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని..రూ. 20 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. సీఎం ఆదేశించడంతో జయరాజ్, ఫినిక్స్ కుటుంబానికి మృతదేహాలను అప్పగించేందుకు తూత్తుకుడి, తిరునల్వేలి జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు. -
అమూల్యపై దేశద్రోహం కేసు
-
అమూల్యకు 14 రోజుల కస్టడీ
సాక్షి బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గురువారం బెంగళూరులో జరిగిన సభలో పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన యువతి అమూల్య లియోనాకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అమూల్య వ్యాఖ్యలను ఖండిస్తూ పలు హిందూ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టాయి. తన కూతురు చేసిన తప్పుకు అమూల్య తండ్రి దేశ ప్రజలకు తాను క్షమాపణలు చెప్పారు. అమూల్య బెయిల్ కోసం న్యాయ పోరాటం చేయనని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్ర జరుగుతోందని కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప ఆరోపించారు. ఆమెకు నక్సలైట్లతో సంబంధం ఉన్నట్లు తెలియవచ్చిందన్నారు. -
గొగోయ్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు
గువాహటి: సమాచార హక్కు కార్యకర్త అఖిల్ గొగోయ్ ఇంట్లో గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. తనిఖీల సందర్భంగా ల్యాప్‌టాప్‌తో పాటు వివిధ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. డిసెంబర్ 12న ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అస్సాంలో నిరసనల నేపథ్యంలో అనేక రైతు సంఘాలకు సలహాదారుగా ఉన్న గొగోయ్‌ను ప్రభుత్వం అరెస్టు చేసింది. గువాహటిలోని నిజరపరా ప్రాంతంలోని గొగోయ్ నివాసంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు చేశారు. అతని పాన్ కార్డు, ఎస్బీఐ డెబిట్ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన తనిఖీలు మూడు గంటలపాటు జరిగాయి. తనిఖీలు ముగిసిన అనంతరం గొగోయ్ భార్య గీతాశ్రీ తములీ స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితాను విలేకరులకు చూపించారు. కజిరంగలోని కేఎంఎస్ఎస్ ఆర్చిడ్ ఎన్విరాన్మెంట్ పార్కుకు సంబంధించిన పత్రాలను కూడా ఎన్ఐఏ బృందం కోరిందనీ, అయితే దానికి సంబంధించిన సమాచారం ఏమీ తన దగ్గర లేదని ఆమె వారికి చెప్పింది. కాగా, గొగోయ్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం ఆదేశించింది. -
జ్యుడీషియల్ కస్టడీకి నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలపై అరెస్టు చేసిన సిద్దిపేట అదనపు డీసీపీ నర్సింహారెడ్డిని గురువారం హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచినట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ రమణకుమార్ తెలిపారు. అనంతరం ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమాస్తులు కూడబెట్టాడనే ఆరోపణలపై బుధ, గురువారాల్లో సిద్దిపేటలోని నర్సింహారెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, జహీరాబాద్, షాద్‌నగర్, అయ్యవారిపల్లె, అతని బంధువులు, ఇతర అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక నర్సింహారెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. అతని నివాసంతోపాటు బంధువుల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో 1.5 కేజీల బంగారం, రూ.5.33 లక్షల నగదు, రూ.6.37 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, గోల్కొండ వద్ద ఒక విల్లా, రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి, గొల్లపల్లిలో 14 ప్లాట్లు, సిద్దిపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 20 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ.5.02 కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ ప్రకారం రూ.10 కోట్ల పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు గుర్తించడంతో నర్సింహారెడ్డిని అరెస్టు చేసినట్లు తెలిపారు. తాండూరులోనూ ఆస్తులు? నర్సింహారెడ్డికి వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోనూ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనకు మండలంలోని ఓగిపూర్‌లో విలువైన నాపరాతి గనులు ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన పేరుతో కాకుండా బినామీ పేర్లపై ఈ గనులు ఉన్నట్లు తెలుస్తోంది. -
‘లలితా’ నగలు స్వాధీనం
టీ.నగర్(చెన్నై): తిరుచ్చి లలితా జ్యువెలరీ నగల దుకాణంలో చోరీ అయిన నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా నేత మురుగన్ పెరంబలూరులో పాతిపెట్టినట్లు బెంగళూరు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు మురుగన్‌ను శనివారం పెరంబలూరు తీసుకువెళ్లి నగలను వెలికితీయించి స్వాధీనం చేసుకున్నారు. తిరుచ్చి సత్రం బస్టాండ్ సమీపంలోని లలితా జ్యువెలరీలో ఈ నెల 2న దొంగలు రూ.13 కోట్ల విలువైన నగలను దోచుకున్న విషయం తెలిసిందే. దోపిడీ మూఠాలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు. గురువారం ముఠాలో కీలకవ్యక్తి సురేష్ ఇటీవల లొంగిపోయాడు. -
తీహార్ జైల్లో చిద్దూ; తొలిరోజు గడిచిందిలా..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తీహార్‌లోని జైలులో మొదటిరోజు నిద్రలేని రాత్రి గడిపారు. కొత్త వాతావరణంలో సరిగా నిద్రపోలేకపోయారు. కోర్టు ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీ పెంచడంతో ఆయనను గురువారం ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. తన కుమారుడు కార్తీ గతేడాది 12 రోజులు గడిపిన ఏడో నంబరు జైలు గదిలోనే ఆయన్ని ఉంచారు. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు 74 ఏళ్ల చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించి కొన్ని సదుపాయాలు కల్పించారు. గురువారం రాత్రి భోజనం చేసిన తర్వాత తలగడ, దుప్పటి అందజేశారు. జైలు గది బయట వాకింగ్ చేసేందుకు శుక్రవారం ఉదయం ఆయనకు అధికారులు అనుమతిచ్చారు. తర్వాత అల్పాహారం, తేనీరు అందించారు. అల్పాహారంగా అంబలి తీసుకున్నట్టు సమాచారం. ఇతర ఖైదీల్లాగే చిదంబరం కూడా లైబ్రరీని వాడుకోవచ్చనీ, నిర్దేశిత సమయంలో టీవీ చూడవచ్చని జైలు అధికారులు వెల్లడించారు. దినపత్రికలు కూడా అందిస్తామన్నారు. ఈరోజు చిదంబరాన్ని ఆయన న్యాయవాది జైలులో కలిసే అవకాశముందని వెల్లడించారు. (చదవండి: తీహార్ జైలుకు చిదంబరం) -
జైలులో చిదంబరం కోరికల చిట్టా..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో 15 రోజుల కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు చిదంబరాన్ని గురువారం కోర్టు ముందు హాజరుపర్చగా, ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ప్రత్యేక జడ్జి ఆదేశాలు జారీచేశారు. దీంతో పోలీసులు ఆయన్ను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా జైలుకు వెళ్లకుండా ఉండేందుకు చిదంబరం విశ్వప్రయత్నాలు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా అవినీతి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమని న్యాయవాది కపిల్ సిబల్ ద్వారా తెలియజేశారు. తనను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీని కోరారు. ఈ కేసులో ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతోందనీ, ఒకవేళ చిదంబరానికి బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అయితే సీబీఐ చిదంబరంపై నిరాధార ఆరోపణలు చేస్తోందనీ, ఆయన నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కపిల్ సిబల్ కోర్టుకు చెప్పారు. ఈడీకి లొంగిపోయేందుకు చిదంబరం సిద్ధంగా ఉన్నారన్నారు. దీతో ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్, చిదంబరాన్ని ఈ నెల 19 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో పోలీసులు నీలిరంగు బస్సులో చిదంబరాన్ని కోర్టు నుంచి 18 కి.మీ దూరంలోని తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చిదంబరం బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్గం సుగమమైంది. 74వ పుట్టినరోజును జరుపుకోవడానికి సరిగ్గా 11 రోజుల ముందు చిదంబరం తీహార్ జైలుకు చేరుకోవడం గమనార్హం. సుప్రీంలో ఎదురుదెబ్బ అంతకుముందు ఐఎన్ఎక్స్ మీడియాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో చిదంబరానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలుచేసిన పిటిషన్‌ను జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నల ధర్మాసనం తిరస్కరించింది. ‘ఈ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం సరికాదు. ఎందుకంటే ఆర్థిక నేరాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా చిదంబరాన్ని అరెస్ట్ చేసేందుకు అవకాశమున్నప్పటికీ ఈడీ చొరవ తీసుకోలేదు. మరోవైపు ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసులో చిదంబరానికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసింది. కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సహాక బోర్డు(ఎఫ్ఐపీబీ) ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.305 కోట్ల విదేశీ పెట్టుబడుల కోసం అనుమతులు జారీచేసింది. ఈ సందర్భంగా ముడుపులు చేతులు మారినట్లు, మనీలాండరింగ్ జరిగినట్లు సీబీఐ, ఈడీ కేసులు నమోదుచేశాయి. ఈ కేసులో గతనెలలో చిదంబరాన్ని సీబీఐ అరెస్ట్ చేసింది. కార్తీ గడిపిన జైలు గదిలోనే.. సీబీఐ కోర్టు ఆదేశాల నేపథ్యంలో చిదంబ రానికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు తీహార్‌లోని జైల్ నంబర్ 7కు తరలించారు. ఈ విషయమై తీహార్ జైలు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు చిదంబరానికి ప్రత్యేక గదిని కేటాయించామనీ, అందులో వెస్ట్రన్ టాయిలెట్‌ను ఏర్పాటుచేశామని తెలిపారు. ఇతర ఖైదీల్లాగే చిదంబరం కూడా లైబ్రరీని వాడుకోవచ్చనీ, టీవీ చూడవచ్చని వెల్లడించారు. రాత్రి భోజనంలో భాగంగా చిదంబరానికి అన్నం, పప్పు, తాలింపును అందజేస్తామన్నారు. ఉదయం 7–8 గంటల మధ్య అల్పాహారం అందజేస్తామని పేర్కొన్నారు. జైలులో ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్ నుంచి చిదంబరం నీరు తాగవచ్చనీ, లేదంటే క్యాంటీన్ నుంచి కొనుక్కోవచ్చని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదుచేసిన కేసులో కుమారుడు కార్తీ గతేడాది 12 రోజులు గడిపిన జైలు గదిలోనే ప్రస్తుతం చిదంబరాన్ని ఉంచడం గమనార్హం. చిద్దూ కోరికల చిట్టా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అప్పగించడంతో చిదంబరం వెంటనే రెండు ప్రత్యేక పిటిషన్లను న్యాయస్థానంలో దాఖలుచేశారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నందున మందులతో పాటు కళ్లద్దాలను తీహార్ జైలులోకి తీసుకెళ్లేందుకు అనుమతించాలని సీబీఐ కోర్టును కోరారు. అలాగే తాను జెడ్ ప్లస్ భద్రత ఉన్న వ్యక్తిని అయినందున ప్రత్యేకంగా ఓ గదిని కేటాయించాలనీ, అందులో పాశ్చాత్య దేశాల్లో వాడే టాయిలెట్‌ను ఏర్పాటుచేసేలా జైలు అధికారుల్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. జైలులో తనకు తగిన భద్రత కల్పించాలని పిటిషన్లో కోరారు. చిదంబరం విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయమూర్తి అజయ్ కుమార్, ప్రత్యేక గది, వెస్ట్రన్ టాయిలెట్ ఏర్పాట్లు చేయాలని తీహార్ జైలు అధికారుల్ని ఆదేశించారు. -
తీహార్ జైలుకు చిదంబరం
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం (73)కి చివరికి ఎదురు దెబ్బ తప్పలేదు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి సీబీఐ కోర్టు భారీ షాకిచ్చింది. ఇప్పటికే 15 రోజులు సిబిఐ కస్టడీలో ఉన్న ఆయన్ను నేడు (గురువారం) కోర్టు ముందు హాజరుపర్చింది. దీంతో సెప్టెంబర్ 19 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మాజీ ఆర్థికమంత్రిని దేశ రాజధానిలోని తీహార్ జైలుకు తరలించారు.14 రోజులు ఆయన తీహార్ జైల్లో గడపాల్సి వుంది. అయితే జైలులో తగిన భద్రత, సౌకర్యాలు కల్పించాలని ఢిల్లీకోర్టును ఆశ్రయించారు చిదంబరం. జెడ్-కేటగిరీ భద్రతలో ఉన్న ఆయనకు అదే తరహా భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇక సౌకర్యాల విషయానికి వస్తే.. చిదంబరం నేలమీద కూర్చోలేరు కనుక వెస్ట్రన్ టాయిలెట్ ఉండాలని కూడా అభ్యర్థించారు. దీంతో జైలు మాన్యువల్‌కు లోబడి చిదంబరం తరఫున న్యాయవాది కపిల్ సిబల్ చేసిన అన్ని అభ్యర్థనలను ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ అనుమతించారు. జైలులో చిదంబరానికి తగిన భద్రత ఉంటుందని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) హామీ ఇచ్చారు. అలాగే మందులను జైలుకు తీసుకెళ్లడానికి అనుమతి లభించింది. కాగాఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో చిదరంబరం తన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో మాజీ మంత్రిని ఆగస్టు 21 రాత్రి సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ఇంజనీర్‌ను వేధించిన ఎమ్మెల్యేకు కస్టడీ
ముంబై : ఇంజనీర్‌పై బురద చల్లి అవమానపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నితీష్ రాణే, 18 మంది ఆయన సహచరులను మహారాష్ట్రలోని కంకవలి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించింది. పీడబ్ల్యూడీ ఇంజనీర్‌ను వేధించి, ఆయనపై బురద విసిరినందుకు అరెస్ట్ చేసిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులను జులై 9 వరకూ పోలీస్ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. కస్టడీ గడువు ముగిసిన అనంతరం మంగళవారం వీరిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా జ్యుడిషియల్ కస్టడీకి న్యాయస్ధానం తరలించాలని ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో వీరు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లభించింది. గత వారం ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న పనులను పర్యవేక్షించేందుకు తన అనుచరులతో కంకవలి హైవేకు ఎమ్మెల్యే చేరుకున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పనులు సాగుతున్న తీరుపై ఇంజనీర్ ప్రకాష్ కదేకర్‌ను ఎమ్మెల్యే దూషించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాణే అనుచరులు ఇంజనీర్‌ను హైవే రెయిలింగ్‌కు కట్టివేసి బకెట్లతో బురుద నీటిని చల్లడం వీడియోలో కనిపించింది. అనంతరం వీరి చర్యపై ఇంజనీర్ ప్రకాష్ ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మిషెల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్ ముందు మిషెల్‌ను ఈడీ ప్రవేశపెట్టి 15 రోజుల కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరింది. దీంతో కోర్టు ముందుగా 15 నిమిషాలపాటు మిషెల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం కోర్టు అనుమతితో ఈడీ మిషెల్‌ను అరెస్టు చేసింది. హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో ముడుపులకు సంబంధించి తమ విచారణలో 3 కోట్ల యూరోల గురించే సమాచారం ఉందనీ, సీబీఐ మాత్రం ఆ మొత్తం 3.7 కోట్ల యూరోలంటోంది కాబట్టి ఈ వ్యత్యాసంపై లెక్క తేల్చేందుకు తాము మిషెల్‌ను అరెస్టు చేయాల్సి ఉందని గతంలో ఈడీ కోర్టును కోరింది. -
ఎంసెట్-2 పేపర్ లీకేజీలో మరో 16 మంది..!
సాక్షి, హైదరాబాద్: 2016లో సంచలనం సృష్టించిన తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీ కుంభకోణంలో నిందితులు వాసుబాబు, శివ నారాయణ గత కొంత కాలంగా సీఐడీ పోలీసుల కస్టడీలో ఉన్నారు. కస్టడీ గడువు ముగియడంతో పోలీసులు వారిని నాంపల్లి కోర్టులో బుధవారం హాజరుపరిచారు. కాగా, కోర్టు నిందితులిద్దరికీ 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. తమ విచారణలో కేసుకు సంబంధించి కీలక సూత్రధారిని గుర్తించినట్లు సీఐడీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఒక కార్పొరేట్ సంస్థకు చెందిన కీలక వ్యక్తికి ఈ లీకేజీ వ్యవహారంలో పాత్ర ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అతన్ని అరెస్టు చేయనున్నట్టు తెలిపారు. ఈ కేసుతో ఎవరెవరికి సంబంధాలున్నాయో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా ఆరు క్యాంపులు నిర్వహించామనీ, మరో 16 మందికి ఈ కేసులో ప్రమేయం ఉందని గుర్తించినట్టు సీఐడీ పోలీసులు వెల్లడించారు. మరో నిందితుడు మెడికో గణేష్ ప్రసాద్‌ను వారం రోజులు కస్టడీలోకి తీసుకునేందుకు సీఐడీ కోర్టులో పిటిషన్ వేసింది. వాసుబాబు, శివ నారాయణలు శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో ఉద్యోగులు అన్న సంగతి తెలిసిందే. -
కోర్టులో మాట మార్చాడు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేశ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, షూటర్ పరశురామ్ వాగ్మారే గురువారం మెజిస్ట్రేట్ కోర్టు ముందు మాట మార్చాడు. ఇంతవరకు గౌరీలంకేశ్‌ను తుపాకీతో కాల్చి చంపింది తానే అని ప్రత్యేక విచారణ బృందం(సిట్) ముందు తెలిపిన వాగ్మారే.. కాల్పులు జరిపింది తాను కాదని జడ్జి ముందు చెప్పడంతో సిట్ అధికారులు కంగుతిన్నారు. సుమారు 9 నెలల పాటు గాలించి సిట్ అధికారులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో వాగ్మారేనే సిట్‌కు హత్యాక్రమాన్ని వివరించాడు. తానే కాల్పులు జరిపానని కూడా తెలిపాడు. ఈ నేపథ్యంలో అతన్ని జ్యుడిషియల్ కస్టడీపై బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు పంపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ విచారణ జరిపారు. వాగ్మారే వాంగ్మూలమిస్తూ గౌరి హత్య కేసుతో తనకు సంబంధం లేదని ఒక్కసారిగా తిరగబడ్డాడు. విచారణ అనంతరం వాగ్మారేకు కోర్టు జూలై 11 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. మరో నిందితునికి నార్కో పరీక్షలు ఈ కేసులో మరో నిందితుడు కేటీ.నవీన్‌కుమార్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు జరపడానికి సిట్ న్యాయవాదులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. గౌరి హత్యకు ఉపయోగించిన తూటాలు, నిందితుడు చెబుతున్న పిస్టల్‌కు సరిపోలడం లేదని సిట్ చెబుతోంది. దీంతో నార్కో పరీక్షల ద్వారా అతని నుంచి సమాచారం రాబట్టాలని సిట్ నిర్ణయించింది. -
24 వరకు కార్తీకి జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసుకు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కొడుకు కార్తీని 24వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. తీహార్ జైల్లో తనకు ప్రత్యేక గది, బాత్రూమ్ ఇవ్వాలన్న కార్తీ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. జైల్లో తనకు ఇంటి భోజనం తినడానికి అవకాశం ఇవ్వాలని, అలంకార వస్తువులు తీసుకెళ్లడానికి అనుమతించాలని కార్తీ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. బెయిల్ పిటిషన్‌ను ఈ నెల 15న విచారించనున్నారు. -
ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలైన ఇంద్రాణి ముఖర్జియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. ఐఎన్ఎక్స్ మీడియా ఆదాయపు పన్ను ఎగవేత, ఇతరత్రా ఆరోపణలపై నమోదైన కేసులకు సంబంధించి విచారణ నిమిత్తం ఇంద్రాణి జ్యుడీషియల్ కస్టడీని 2 వారాలు పొడిగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ ఫిబ్రవరి 5న ప్రత్యేక న్యాయస్థానం ఇంద్రాణిని అరెస్ట్ చేయాని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే షీనాబోరా హత్యకేసులో నిందితురాలైన ఇంద్రాణి ఇదివరకే అరెస్టయి ముంబైలోని బైకుల్లా జైల్లో కస్టడీలో ఉంది. ఐఎన్ఎక్స్ మీడియా ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) నియమాలను ఉల్లంఘించి మారిషస్ నుంచి పెట్టుబడులు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి.మనీ లాండరింగ్ విషయంలో ఐఎన్ఎక్స్ మీడియా అధిపతి పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణిపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. కాగా, 2012 ఏప్రిల్ 23న జరిగిన షీనా బోరా హత్యకు గురికాగా, 2015లో ముంబై సమీపంలోని అడవుల్లో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అదే ఏడాది ఆగస్టులో ఇంద్రాణిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్ అప్రూవర్ గా మారి షీనా బోరా హత్యకేసు గుట్టు విప్పిన విషయం తెలిసిందే.షీనా బోరా హత్య కుట్రలో సవతి తండ్రి పీటర్ ముఖర్జియా పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. -
కర్ణిసేన నేత అరెస్ట్
గుర్గావ్: బాలీవుడ్ చిత్రం పద్మావత్‌కు వ్యతిరేకంగా హింసకు పాల్పడిన కేసులో స్థానిక కర్ణిసేన చీఫ్ ఠాకూర్ కుషాల్పాల్ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. గుర్గావ్లో విధ్వంసానికి కారణమైన వారిలో ఇప్పటివరకూ 24 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పద్మావత్ చిత్ర ప్రదర్శనను నిరసిస్తూ ఆందోళనకారులు బుధవారం గుర్గావ్లో ఓ పాఠశాల బస్సుపై దాడిచేయడంతో పాటు ప్రభుత్వ బస్సుకు నిప్పు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితుల్ని అరెస్ట్‌చేసి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీస్ పీఆర్వో రవీందర్ కుమార్ చెప్పారు. -
తీహార్ జైలుకు దినకరన్....
చెన్నై : రెండాకుల చిహ్నం గుర్తు కోసం ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో అరెస్టు చేసిన టీటీవీ దినకరన్‌ను జ్యుడీషియల్ కస్టడికి ఢిల్లీ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను పోలీసులు సోమవారం సాయంత్రం తీహార్ జైలుకు తరలించారు. అన్నాడీఎంకే(అమ్మ) బహిష్కృత ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. చెన్నైలో మూడు రోజల పాటుగా విచారణ కొనసాగించిన ఢిల్లీ క్రైమ్ పోలీసులు.... ఆదివారంతో కస్టడీ గడువు ముగియడంతో దినకరన్‌ను ఇవాళ కోర్టులో హాజరు పరిచారు. అతడితో పాటుగా స్నేహితుడు మల్లికార్జున్‌ను పదిహేను రోజుల జ్యుడీషియల్ కస్టడికి న్యాయమూర్తి పూనం చౌదరి ఆదేశించారు. అయితే బెయిల్ కోసం దినకరన్ తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. కాగా దినకరన్ ఆరోగ్య విషయంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాదుల విజ్ఞప్తికి కోర్టు స్పందించింది. ఢిల్లీలోని ఆసుపత్రిలో దినకరన్, మల్లికార్జున్‌లకు జరిగిన వైద్య పరిశోధనల అనంతరం గట్టి భద్రత నడుమ తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు దినకరన్‌కు చెందిన అయిదు బ్యాంక్‌ల్లోని ఖాతాల్ని ఢిల్లీ పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే దినకరన్ రూ. 50 కోట్లు ఇసుక కాంట్రాక్టుల ద్వారా సమీకరించి పనిలో పడ్డట్టు విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెల 25న దినకరన్‌ను అరెస్ట్ చేశారు. -
నగరం నుంచి అశ్లీల చిత్రాల అప్లోడ్
వేలకొద్దీ షేర్ చేస్తున్న అమెరికా ఉద్యోగి మాదాపూర్‌లో అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు 29,288 పోర్న్ వీడియోలు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: చిన్న పిల్లల అశ్లీల, నీలి చిత్రాలు, ఫొటోలను సేకరించి వివిధ వెబ్సైట్లు, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్న అమెరికా ఉద్యోగిని సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి నుంచి 29,288 చైల్డ్ పోర్నోగ్రఫీ చిత్రాలున్న ల్యాప్‌టాప్, ఐఫోన్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. అమెరికాకు చెందిన జేమ్స్కిర్క్ జాన్స్ మాదాపూర్‌లో ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలో లీగల్ విభాగంలో కీలక అధికారిగా పనిచేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి చైల్డ్ పోర్నోగ్రఫీకి అలవాటుపడ్డాడు. కొద్ది రోజులుగా చిన్న పిల్లల నగ్న, అశ్లీల చిత్రాలను పోర్న్ వెబ్సైట్ల నుంచి డౌన్లోడ్ చేసి... వాటిని తిరిగి ట్విట్టర్, గిగాట్రైబ్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు పలు వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తున్నట్టు గత నెలలో ఢిల్లీలోని సీబీఐ, ఇంటర్‌పోల్ అధికారులు గుర్తించారు. వారు వెంటనే రాష్ట్ర సీఐడీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఐటీ యాక్ట్ 67 (ఏ), (బి)కింద కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. 490 గిగాట్రైబ్... 24 ట్విట్టర్ ఖాతాలు... ఈ మేరకు సీఐడీ అధికారులు మంగళవారం జేమ్స్ నివాసంలో సోదాలు నిర్వహించారు. అతడు 490 గిగాట్రైబ్, 24 ట్విట్టర్ ఖాతాల్లో చిన్నపిల్లల అశ్లీలచిత్రాలను షేర్ చేసినట్టు గుర్తించారు. వెంటనే జేమ్స్‌ను అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్టు సీఐడీ ఐజీ తెలిపారు. అతడి నుంచి 29,288 అశ్లీల చిత్రాలున్న ల్యాప్‌టాప్, హార్డ్‌డిస్క్, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. -
త్యాగికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
-
త్యాగికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో వైమానికదళ మాజీ అధిపతి ఎస్పీ త్యాగికి ఢిల్లీ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ ఇటీవల అరెస్ట్ చేసిన ఆయన్ను శనివారం పటియాలో కోర్టులో హాజరు పర్చింది. దీంతో త్యాగితో మరో ఇద్దరు సంజీవ్ త్యాగి, న్యాయవాది గౌతమ్ కు డిశెంబర్ 30వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల స్కాంపై దర్యాప్తును ముమ్మరం చేసిన సీబీఐ ఎస్పీ త్యాగి ని అరెస్ట్ చేసింది. భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో ఢిల్లీకి చెందిన న్యాయవాది గౌతమ్ ఖేతాన్‌తో పాటు త్యాగి సోదరుడు సంజీవ్ త్యాగి అలియాస్ జూలీని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అగస్టా వెస్ట్ ల్యాండ్ ఒప్పందంలో ఈ ముగ్గురు అక్రమాలకు పాల్పడినట్టు సీబీఐ ఆరోపించింది. విచారణకు సహకరించకపోవడంతో వీరిని అరెస్ట్ చేసినట్లు సిబిఐ తెలిపింది. -
నేను అమాయకుడిని..
* అబ్బే...స్వాతిని హత్య చేయలేదు * నిందితుడిని కాపాడేందుకు యత్నాలని ఆరోపణ * కోర్టులో రామ్‌కుమార్ బెయిల్ పిటిషన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో అరెస్టయిన నిందితుడు రామ్‌కుమార్ కేసును సరికొత్త మలుపు తిప్పాడు. స్వాతి హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొంటూ చెన్నై సెషన్స్ కోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. చెన్నై నుంగంబాక్కం రైల్వేస్టేషన్లో గత నెల 24వ తేదీన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని ఓ యువకుడు దారుణంగా హతమార్చాడు. హత్యకు వినియోగించిన కత్తిని పట్టాలపై విసిరివేసి ప్రయాణికులు చూస్తుండగానే పారిపోయాడు. రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ టీవీ పుటేజీని పరిశీలించిన పోలీసులు ఓ యువకుడు ఎంతో ఆందోళనగా పరుగెత్తడాన్ని గుర్తించారు. పుటేజీలోని ఫొటో సహాయంతో కేసు విచారణను ప్రారంభించిన పోలీసులు తిరునెల్వేలి జిల్లాలో రామ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీసులను చూడగానే రామ్‌కుమార్ భయంతో గొంతుకోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చికిత్స జరుగుతున్న సమయంలో పోలీసులు అతడి నుంచి వాంగ్మూలం తీసుకోగా స్వాతి హత్యను అంగీకరించినట్లు చెన్నై పోలీస్ కమిషనర్ టీ కే రాజేంద్రన్ స్వయంగా ప్రకటించారు. గొంతు కోసుకున్న గాయంపై చెన్నై రాయపేటలో చికిత్స పొందుతున్న రామ్‌కుమార్‌కు కోర్టు ఈనెల 18వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో రామ్‌కుమార్‌ను మంగళవారం పుళల్ జైలుకు తరలించారు. నిందితుడిని నేను కాదు: రామ్‌కుమార్ స్వాతి హత్యకేసును ఛేదించడంలో పోలీసులకు ముచ్చమటలు పట్టించి ఎట్టకేలకూ నిందితుడు పట్టుబడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చెన్నై సెషన్స్ కోర్టులో మంగళవారం బెయిల్ పిటిషన్ ద్వారా ఇంతలోనే నిందితుడు రామ్‌కుమార్ కొత్త వాదనను లేవనెత్తాడు. స్వాతి హత్యకు నాకు సంబంధం ఏమిటీ, ఆ కేసులో నన్నెందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించాడు. స్వాతి హత్యకేసుకూ తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నాడు. రైల్వేస్టేషన్లో ఇటీవల ఎవరో ఒక యువకుడు స్వాతిని కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఆ యువకుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేయలేదని వాదించాడు. స్వాతిని హతమార్చిన నిందితుడిని కేసు నుంచి కాపాడేందుకు తనను ఇరికించారని అన్నాడు. తిరునెల్వేలిలో పోలీసులు తన ఇంటికి రాగానే తాను గొంతుకోసులేదని, ఆ గందరగోళంలో వేరే ఎవరో తన గొంతును కోశారని చెప్పాడు. అయితే తానే గొంతుకోసుకున్నట్లు పోలీసులు కేసు పెట్టారని ఆరోపించాడు. తాను ఎంతో అమాయకుడిని, పోలీసులు ఉద్దేశపూర్వకంగా తనపై అక్రమంగా హత్యా కేసును బనాయించినందున బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నాడు నిందితుడి తరఫున కృష్ణమూర్తి అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశాడు. -
రామ్ కుమార్‌కు 15రోజులు రిమాండ్
చెన్నై : ఇన్ఫోసిస్ ఉద్యోగిన స్వాతి హత్యకేసు నిందితుడు రామ్ కుమార్‌కు ఎగ్మూర్ కోర్టు 15 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కాగా పాళయం కోట్టై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడిని నిన్న అంబులెన్స్‌లో చెన్నైకి తరలించిన విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం రాయ్పేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బ్లేడ్‌తో గొంతు కోసుకున్నందున రామ్ కుమార్‌కి 18 కుట్లు పడ్డాయి. స్వాతిని తానే హతమార్చినట్టు నేరం అంగీకరిస్తూ రామ్‌కుమార్ ఇప్పటికే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. 14వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి గోపీనాథ్ ఇవాళ ఉదయం ఆస్పత్రిలో రామ్ కుమార్ స్టేట్మెంట్ రికార్డు చేశారు. కాగా రామ్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు రాయ్పేట ఆస్పత్రి డీన్ ఎస్ఆర్ రఘునాథన్ తెలిపారు. కాగా తన ప్రేమను తిరస్కరించడమే కాకుండా, కొండముచ్చు(దేవాంగు) వలే ఉన్నావని స్వాతి పదేపదే హేళన చేయడంతో తనలో ఉన్మాది బయటకు వచ్చినట్టు ఈ కేసును విచారిస్తున్న ఐపీఎస్ అధికారి దేవరాజన్ నేతృత్వంలోని విచారణ బృందం ఎదుట రామ్‌కుమార్ వాంగ్ములం ఇచ్చాడు. -
కస్టడీ నుంచి తప్పించుకున్న నిందితుని అరెస్ట్
న్యాయస్థానం ఆవరణలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పరారైన నిందితుడిని 24 గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మే 23న నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ లైంగికదాడి కేసులో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితులు జితేందర్‌పాల్(20), అరుణ్‌శర్మ(20)ను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మంగళవారం నిందితులిద్దరిని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి ఎనిమిదో మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన తర్వాత ఇద్దరు నిందితులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జితేందర్‌పాల్‌ను అక్కడే పట్టుకున్నారు. అరుణ్ శర్మ పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు. దీంతో రాజేంద్రనగర్ ఏసీపీ పరిధిలోని పోలీసులను నాలుగు టీంలుగా ఏర్పాటు చేసి అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అన్ని రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో గాలిస్తుండగా నార్సింగి పోలీసులకు బుధవారం నాంపల్లి రైల్వేస్టేషన్లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతూ అరుణ్‌శర్మ పట్టుబడ్డాడు. ఈమేరకు జ్యుడీషియల్ కస్టడీ నుంచి తప్పించుకుని పరారైన నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగిరెడ్డి, నార్సింగి సీఐ రాంచంద్రరావు, ఆర్జీఐఏ సీఐ మహేష్ తదితరులున్నారు. -
న్యాయవాదికి సంకెళ్లు
- ఆస్పత్రిలో మంచానికి కట్టేశారు - జ్యుడీషియల్ కస్టడీలోని లాయర్‌పై పోలీసుల చర్య - అడ్వొకేట్ల తీవ్ర ఆగ్రహం.. కర్నూలు జిల్లా నంద్యాలలో రాస్తారోకో - వారంపాటు విధుల బహిష్కరణకు తీర్మానం నంద్యాల: జ్యుడీషియల్ కస్టడీలోని న్యాయవాదికి పోలీసులు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఏపీలోని కర్నూలు జిల్లా నంద్యాలలో న్యాయవాదులు విధులను బహిష్కరించి రాస్తారోకో నిర్వహించారు. వారంపాటు విధులను బహిష్కరించేందుకు తీర్మానించారు. వివరాల్లోకి వెళితే.. ఆళ్లగడ్డలో ఈనెల 7న నవ నిర్మాణ దీక్ష సదస్సులో ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, ఇతర అధికారుల సమక్షంలో ప్రభుత్వ అధికారుల అవినీతిపై వితంతువు విమలారాణి ప్రశ్నించారు. ఆర్డీవో స్పందిస్తూ.. సమావేశం ముగిసిన తర్వాత చర్చిద్దామని చెప్పారు. దీంతో ఈనెల 10న బాధితురాలితోపాటు సీపీఐ నేత మురళి, ఆళ్లగడ్డకు చెందిన న్యాయవాది పాములేటి నంద్యాలలో ఆర్డీవోను కలసి సమస్యపై చర్చించారు. ఆ సందర్భంగా వాగ్వాదం చోటుచేసుకుంది. అయితే, తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఆర్డీవో ఫిర్యాదు మేరకు త్రీటౌన్ సీఐ వెంకటరమణ వీరిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అరెస్టయిన న్యాయవాది పాములేటి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కోర్టు అనుమతితో ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ సందర్భంగా ఆయన కాళ్లకు సంకెళ్లు వేసి మంచానికి కట్టేశారు. ఇది గమనించిన న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనను నిరసిస్తూ సోమవారం కోర్టు ప్రాంగణం నుంచి టూటౌన్ పోలీసుస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడే బైఠాయించారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, సీఐ వెంకటరమణను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీలోని న్యాయవాదికి సంకెళ్లు వేయడంపై సీనియర్ న్యాయవాదులు శ్రీనివాసమూర్తి, దుర్గాప్రసాద్, రమణ, రాజేశ్వరరెడ్డి, మనోహర్‌రెడ్డి, బాలసుబ్బయ్య తదితరులు టూటౌన్ సీఐ గుణశేఖర్బాబుతో వాగ్వాదానికి దిగారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించింది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని సీఐ గుణశేఖర్‌బాబు చెప్పడంతో న్యాయవాదులు రాస్తారోకో విరమించారు. న్యాయవాదిని అవమానిస్తారా? రాస్తారోకో అనంతరం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి అధ్యక్షతన న్యాయవాదులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యాయవాదిని అవమానించడం పట్ల పోరాటానికి కమిటీగా ఏర్పడ్డారు. వారం రోజు లు విధులు బహిష్కరించాలని తీర్మానించారు. ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, సీఐ వెంకటరమణలపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయాలని, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. -
గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీకి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం ఉత్తర్వులిచ్చారు. పటియాలా కోర్టుకు తెస్తే ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని, అందువల్ల అక్కడికి 7 కి.మీ. దూరంలో ఉన్న చాణక్యపురి పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరపాల్సిందిగా పోలీసులు కోరారు. అందుకు అంగీకరించిన మేజిస్ట్రేట్ ఉదయమే అక్కడికి వెళ్లారు. తర్వాత తీహార్ జైలుకు తరలించారు. -
కన్హయ్యకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ : జెఎన్యూ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ జ్యూడీషియల్ కస్టడీ మార్చి 2వ తేదీ వరకూ కోర్టు పొడిగించింది. కాగా దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన కన్హయ్య కుమార్ రిమాండ్ నేటితో ముగియటంతో అతడిని ఢిల్లీ పాటియాల హౌస్ కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు యత్నిస్తుండగా అక్కడే ఉన్న కొందరు న్యాయవాదులు అతడిపై దాడికి దిగారు. అతన్ని చుట్టుముట్టిన పలువురు న్యాయవాదులు పిడిగుద్దులు కురిపించారు. లాయర్ల బారి నుంచి అతడిని తప్పించేందుకు పోలీసులు యత్నించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనలో అతడు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. పాటియాల హౌస్ కోర్టులో తాజా ఘటనలపై విచారణ పరిశీలనకు ఆరుగురు సీనియర్ సభ్యులతో కూడిన బృందాన్ని నియమిస్తూ జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అభయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా అంతకు ముందు జెఎన్యూ విద్యార్థులకు, న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, మరోవైపు న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయి దాడికి దిగారు. ఈ ఘటనలో విద్యార్థులతో పాటు ఓ జర్నలిస్టు కూడా గాయపడ్డాడు. -
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
-
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
ముంబై: షీనాబోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా జ్యుడిషియల్ కస్టడీని పొడగించారు. ఇంద్రాణితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్ రాయ్‌కు ఈ నెల 19వరకు కస్టడీ పొడగిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంద్రాణి ప్రస్తుతం ముంబై జేజే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బైకలా జైల్లో రిమాండ్‌లో ఉన్న ఇంద్రాణి గత శుక్రవారం అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. కాగా ప్రస్తుతం ఇంద్రాణి ఆరోగ్యం మెరుగవుతోంది. రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి చేసే అవకాశముంది. ఆమెను ఆస్పత్రి నుంచి జైలుకు తరలిస్తారు. -
'48 గంటలు గడిస్తే కానీ చెప్పలేం..'
ముంబై: షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జీయా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ముంబై జేజే ఆస్పత్రి వైద్యులు చెప్పారు. 48 గంటలు గడిస్తే కానీ ఆమె పరిస్థితిని చెప్పలేమని వైద్యులు తెలిపారు. షీనాబోరా హత్య కేసులో బైకలా జైల్లో రిమాండ్‌లో ఉన్న ఇంద్రాణి అపస్మారక స్థితికి చేరుకోవడంతో శుక్రవారం జేజే ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. ఆమె మోతాదుకు మించి నిద్రమాత్రలు వాడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జేజే ఆస్పత్రి వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఇటీవలే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
మరో 3 రోజులు ఆస్పత్రిలోనే ఇంద్రాణి
ఆత్మహత్యా యత్నం! ఆస్పత్రిలో అపస్మారకంలో.. ముంబై: జైల్లో ఉండి ఉన్నట్టుండి అపస్మారక స్థితిలోకి చేరుకున్న ఇంద్రాణి ముఖర్జీ మరో మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె సగం స్పృహలో ఉందని.. ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తూ, మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉంచుతామని ముంబై జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే శనివారం ఉదయం తెలిపారు. ఆమెకు అవసరమైన రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలను చేయించామని, ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో సీబీఐ బృందానికి కూడా చెప్పామని ఆయన అన్నారు. తన కూతురు షీనాబోరాను హత్య చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా పరిస్థితి శనివారం అకస్మాత్తుగా విషమంగా మారింది. బైకలా జైల్లో ఉన్న ఆమె కొన్ని మాత్రలు వేసుకున్న వెంటనే ఊపిరి తీసుకోవటం కష్టంగా మారటంతో హుటాహుటిన జేజే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె అపస్మారకంలో ఉన్నారని, పరిస్థితి విషమంగా ఉందని జేజే ఆస్పత్రి డీన్ డాక్టర్ టీపీ లహానే ప్రకటించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసినప్పుడు ఆమె కొన్ని మాత్రలు వేసుకున్నట్లు తేలిందని, వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు వివరించారు. తనకు ఒంట్లో బాగాలేదని ఇంద్రాణి చెప్పటంతో ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు డీసీపీ మోహన్ దహికర్ చెప్పారు. ఆమె కడుపులోని ద్రవపదార్థాలను సేకరించి ఫోరెన్సిక్ దర్యాప్తునకు పంపించినట్లు ఆయన తెలిపారు. ఇంద్రాణి ఆరోగ్యం ఉన్నట్టుండి దెబ్బతినటంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక మరేదైనా తెలియని కారణం ఉందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆమె ఫిట్స్ నిరోధానికి వైద్యం చేయించుకుంటున్నారని జేజే ఆసుపత్రి డీన్ లహానే చెప్పారు. ఆ మాత్రలను ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మాత్రమే, అది కూడా జైలు అధికారుల పర్యవేక్షణలోనే వేసుకోవాలి. అయితే ఆ మాత్రలను అధిక మోతాదులో ఇంద్రాణి వాడారని.. దాని వల్లే అపస్మారక స్థితిలోనికి వెళ్లారని వైద్యులు అంటున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ఆమె ఈ మాత్రలు వేసుకుంటున్నారు. అధిక మోతాదులో మాత్రలు ఆమె దగ్గరకు ఎలా చేరాయో తెలియటం లేదని సీనియర్ డాక్టర్ ఒకరు తెలిపారు. ఇప్పటికే ఆమె కేసును విచారించిన ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను ప్రభుత్వం హఠాత్తుగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ విచారణకు ఆదేశించారు. -
'ఇంద్రాణి పరిస్థితి విషమం'
-
ఇంద్రాణి కస్టడీ పొడిగింపు
ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాని నిందితురాలు షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా కస్టడీ మరింత పొడిగించారు. ఆమెతోపాటు ఆమె భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్‌కు అక్టోబర్ 5 వరకు స్థానిక కోర్టు కస్టడీ విధించింది. 2012 ఏప్రిల్ నెలలో తన కన్న కూతురుని ఇంద్రాణి ముఖర్జీ దారుణంగా చంపేసి అనంతరం రాయఘడ్ అడవుల్లో పాతిపెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో ఈ నెల ఓ రెండు రోజులపాటు సుధీర్ఘంగా ప్రశ్నించిన పోలీసులు అనంతరం ఆమెను సెప్టెంబర్ 7న స్థానిక కోర్టులో హాజరుపరిచారు. దాంతో కోర్టు ఈ నెల 21 వరకు కస్టడీ విధించగా అది నేటితో పూర్తయింది. దీంతో మరోసారి కోర్టుకు హాజరుపరిచి అక్టోబర్ 5 వరకు కస్టడీకి తీసుకున్నారు. -
ఇంద్రాణి, డ్రైవర్‌కు జ్యుడిషియల్ కస్టడీ
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా, కారు డ్రైవర్ శ్యామ్ వర్ రాయ్‌లకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో మరో నిందితుడు, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు పోలీస్ కస్టడీ పొడగించారు. సోమవారం నాటితో నిందితులకు పోలీస్ కస్టడీ ముగియడంతో ముంబై పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు ఇంద్రాణి, కారు డ్రైవర్లను జైలుకు తరలించారు. సంజీవ్ ఖన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు ఖన్నాను కోల్‌కతా తీసుకువెళ్లనున్నారు. ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో కూతురు షీనా బోరాను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన సంగతి తెలిసిందే. ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో అనైతిక విషయాలు వెలుగుచూశాయి. -
ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు 14 రోజుల రిమాండ్
-
'విచారణలో ఇది కీలక దశ.. బెయిలివ్వలేం'
న్యూఢిల్లీ: నకిలీ ఢిగ్రీ పత్రాలు కలిగి ఉన్న కేసులో ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్‌కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆయనకు ఇప్పటికే విధించిన జ్యుడిషియల్ కస్టడీని జూలై 6వరకు పెంచింది. ఆయనపై నమోదైన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, కేసు ప్రభావం రీత్యా బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తాను సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని, అందుకే తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా కోరుతూ తోమర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే, కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలియజేయడంతో వారి వాదనలతో కోర్టు అంగీకరించింది. తోమర్‌కు బెయిల్ నిరాకరించింది. -
పీకే అయ్యర్‌కు 23 వరకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును మోసం చేసిన కేసులో నిందితుడు, డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్‌చైర్మన్ పీకే అయ్యర్‌కు నాంపల్లి కోర్టు ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. ఈనెల 6న భువనేశ్వర్‌లో అయ్యర్‌ను అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు మంగళవారం ఆయన్ను నాంపల్లి పద్నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వై.వీర్రాజు ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. డీసీ బ్రదర్స్ బెయిల్ రద్దు చేయండి.. రుణాల వ్యవహారంలో కెనరా బ్యాంకును మోసం చేసిన కేసులో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డీసీహెచ్ఎల్) యాజమానులు పి.వెంకట్రామిరెడ్డి, పి.వినాయక్ రవిరెడ్డిలకు నాంపల్లి కోర్టు మంజూరు చేసిన చట్టబద్ధ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
15 వరకు రేవంత్‌కు జ్యూడీషయల్ కస్టడీ
-
ఈ నెల 15 వరకు రేవంత్‌కు జ్యూడీ'షియల్ కస్టడీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాలకు ఈ నెల 15 వరకు జ్యూడీషయల్ కస్టడీ విధించారు. మంగళవారం ఏసీబీ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో రేవంత్ రెడ్డితో పాటు నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ కస్టడీకి అప్పగించారు. కస్టడి ముగిశాక నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని ఆదేశించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌కు ముడుపులు ఇస్తూ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. -
నేరుగా పోలీస్ కస్టడీ ఎలా కోరతారు?
పీకే అయ్యర్ కస్టడీపై సీబీఐకి స్పష్టం చేసిన న్యాయమూర్తి సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును మో సం చేసిన కేసులో నిందితుడు డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డెరైక్టర్ పీకే అయ్యర్‌ను 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వై.వీర్రాజు విస్మయం వ్యక్తం చేశారు. నిందితున్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపకుండానే...నేరుగా తమ కస్టడీకి అప్పగించాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. వివరాల్లోకి వెళ్తే... ఓవర్సీస్ బ్యాం కును మోసం చేసిన కేసులో (ఆర్సీ 3ఈ/2014) నిందితునిగా ఉన్న పీకే అయ్యర్‌ను ఈనెల 6న భువనేశ్వర్‌లో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో అయ్యర్‌ను నాంపల్లి పధ్నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వీర్రాజు ఎదుట హాజరుపర్చారు. అయ్యర్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టాల్సి ఉందని, ఈ నేపథ్యంలో ఆయన్ను 14 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. దీనిపై న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేస్తూ సీబీఐ పీపీకి ప్రశ్న లు సంధించారు. గతంలో వెంకటరామిరెడ్డి, వినాయక రవిరెడ్డిలను రిమాండ్ చేసింది ఈకేసులోనేనా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఇది మరోకేసని సమాధానమిచ్చారు. సీఆర్పీసీ నిబంధనలు పాటించారా ? నిందితుని అరెస్టుకు ముందు నేర విచారణ చట్టంలోని నిబంధనలు పాటించారా అని న్యాయమూర్తి సీబీఐ పీపీని ప్రశ్నించారు. సెక్షన్ 41-ఎ కింద అరెస్టుకు కారణాలను స్పష్టంగా పేర్కొనాలని, సెక్షన్ 50-ఎ కింద కుటుంబ సభ్యులు, లేదా మిత్రులకు అరెస్టుకు సంబంధించి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. సీఆర్పీసీ నిబంధనలు పాటించకుండా నిందితున్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఎలా కోరతారని ప్రశ్నించారు. సీఆర్పీసీ నిబంధనలు పాటిస్తూ పిటిషన్ దాఖలు చేయాలని సూచిస్తూ సీబీఐ అభ్యర్థనను తిరస్కరించారు. సాయంత్రం దాదాపు 6 గంటల సమయంలో తిరిగి అయ్యర్‌ను కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకువచ్చారు. అయితే కోర్టు సమయం ముగియడంతో అప్పటికే న్యాయమూర్తి వెళ్లిపోయారు. -
ఎయిమ్స్ డాక్టర్‌కు జ్యుడీషియల్ కస్టడీ
న్యూఢిల్లీ: వైద్యురాలైన తన భార్య మృతికి కారణమైన ఎయిమ్స్ వైద్యుడు కమల్ వేది(34)కి స్థానిక కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. చర్మవ్యాధి నిపుణుడిగా పనిచేస్తున్న కమల్ స్వలింగ సంపర్కుడు. ఎయిమ్స్‌లోనే అనస్తీషియా వైద్యురాలిగా పనిచేస్తున్న ప్రియ(31)ను ఐదేళ్ల కిందట వివాహమాడారు. ఇటీవల గొడవలు పెరిగాయి. భర్త అసహజ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఆత్యహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొంటూ ప్రియ ఆదివారం హోటల్లో ఆత్మహత్య చేసుకుకుంది. పోలీసులు కమల్‌పై సెక్షన్ 498ఏ(క్రూరత్వం), 304బీ(వరకట్న చావు) కేసు నమోదు చేశారు. -
కస్టడీకి కేంద్రమంత్రి.. బెయిల్ మంజూరు
-
జ్యుడీషియల్ కస్టడీకి కేంద్రమంత్రి నఖ్వీ.. బెయిల్ మంజూరు
కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ ప్రాంతంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. 2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు నఖ్వీపై ఆరోపణలున్నాయి. ఆ నేపథ్యంలోనే ఆయనను అదుపులోకి తీసుకుని, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో రాంపూర్ కోర్టు నఖ్వీకి ఏడాది జైలుశిక్ష విధించింది. అయితే వెంటనే కేంద్ర మంత్రి నఖ్వీకి బెయిల్ కూడా మంజూరుచేసింది. -
కస్టడీకి ఉబర్ క్యాబ్ డ్రైవర్
న్యూఢిల్లీ: యువతిపై అత్యాచారం కేసులో నిందితునిగా ఉన్న ఉబర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌కు కోర్టు గురువారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అతడిని ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం లేదని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలపడంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ నిందితుడు యాదవ్‌కు ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు యాదవ్‌ను తీహార్ జైలుకు తరలించారు. గత మూడు రోజులుగా సమ్మె చేస్తున్న లాయర్లు యాదవ్‌ను కోర్టులో ప్రవేశపెట్టగానే పెద్ద పెట్టున గందరగోళం సృష్టించారు. యాదవ్ తరఫున ఓ న్యాయవాది వాదించడాన్ని వారు వ్యతిరేకించారు. లాయర్లందరూ సమ్మెలో ఉన్నారని, కోర్టు విచారణలో ఎవరూ పాల్గొనరాదని వారు డిమాండ్ చేశారు. అయితే కోర్టు వ్యవహారాలలో జోక్యం చేసుకోరాదని మేజిస్ట్రేట్ న్యాయవాదులను మందలించారు. విచారణాధికారిపై కోర్టు ఆగ్రహం: ఉబర్ క్యాబ్ రేప్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి గురువారం కోర్టు ఆగ్రహానికి గురయ్యారు. కోర్టు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సరైన సమాధానాలివ్వలేకపోవడంతో మేజిస్ట్రేట్ తీవ్రంగా మందలించారు. నిందితుడు శివకుమా ర్ యాదవ్ వద్దనున్న డ్రైవింగ్ లెసైన్స్ సరైందేనా లేక నకిలీదా? అతడిని ఉబర్ సంస్థ ఎప్పుడు ఉద్యోగంలో చేరుక్చుంది? అన్న ప్రశ్నలకు దర్యాప్తు అధికారి రేణు మౌనం వహించారు. ఆమె సమాధానం చెప్పలేకపోవడంతో ‘‘ఆమెకేమీ తెలి యదు, ఈ కేసులో ఎవరు నిజమైన దర్యాప్తు అధికారి?’’అని మేజిస్ట్రేట్ ప్రశ్నిం చారు. దీంతో మరో పోలీస్ అధికారి ముందుకు వచ్చి సమాధానం ఇచ్చారు. యాదవ్ లెసైన్స్ నకిలీదని తేలిందని, నెల రోజుల క్రితమే అతడు ఉబర్ సంస్థలో చేరాడని చెప్పారు. ‘‘కంపెనీ అతడి వివరాలను పరిశీలించిందా? పరిశీలించకపోతే... ఎవరిపై మీరు కేసు నమోదు చేశారు’’ అని మేజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారు. దీనికి పోలీసు అధికారులు సమాధానం ఇస్తూ, యాదవ్‌ను అమెరికాకు చెందిన ఉబర్ కంపెనీ డ్రైవర్‌గా చేర్చుకుందని, ఆ సంస్థ అతడి వివరాలను పరిశీలించలేదని, ఆ కంపెనీపై చీటింగ్ కేసు నమోదు చేశామని చెప్పారు.రెండువారాల్లోనే చార్జిషీట్: ‘ఉబ్బర్’ రేప్ ఘటనపై చార్జిషీట్‌ను ఢిల్లీ పోలీసులు రికార్డుస్థాయిలో రెండువారాల్లోనే సిద్ధం చేశారు. డిసెంబర్ 12, 2012 సామూహిక లైంగిక దాడి కేసు చార్జిషీట్‌ను 17 రోజుల్లో దాఖలు చేసిన పోలీసులు, ఈ సారి రెండువారాల్లోనే సిద్ధం చేయడం గమనార్హం. -
జ్యుడీషియల్ కస్టడీకి ఓబులేసు
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపిన ఏఆర్ కానిస్టేబుల్ పుల్లా ఓబులేసును అయిదు రోజుల కస్టడీ అనంతరం బంజారాహిల్స్ పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఈ అయిదురోజుల్లో ఓబులేసును కర్నూలుతో పాటు వైఎస్సార్ జిల్లాలోని ఆయన స్వగ్రామం పోరుమామిళ్ల, గండిపేట సమీపంలోని గ్రేహౌండ్స్ కార్యాలయం, సంఘటన జరిగిన కేబీఆర్ పార్కు వద్ద విచారించారు. గతంలో చేసిన నేరాలపై కూడా ఆరాతీశారు. -
జ్యుడీషియల్ కస్టడీకి రాంపాల్
వివాదాస్పద స్వామీజీని కోర్టులో హాజరుపర్చిన పోలీసులు 28వ తేదీన తదుపరి విచారణ రాంపాల్ అరెస్ట్‌పై సమగ్ర నివేదిక కోరిన కోర్టు చండీగఢ్: హర్యానాకు చెందిన వివాదాస్పద ఆధ్యాత్మిక గురు స్వామి రాంపాల్‌ను పోలీసులు గురువారం పంజాబ్, హర్యానా హైకోర్టులో హాజరుపరిచారు. ఆయనను జ్యుడీషియల్ కస్టడీకి పంపించిన కోర్టు తదుపరి విచారణను నవంబర్ 28వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, 2006 నాటి హత్యాకేసుకు సంబంధించి రాంపాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను కూడా రద్దు చేసింది. రాంపాల్ అరెస్ట్ కోసం నిర్వహించిన ఆపరేషన్ తాలూకు పూర్తి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. రాంపాల్కున్న ఆస్తుల వివరాలతో ఒక నివేదిక అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లలో మత కేంద్రాలైన ‘డేరా’ల్లో అక్రమంగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని నిల్వచేయడంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అనంతరం రాంపాల్‌ను తాజాగా నమోదైన దేశద్రోహం, హత్య, ఆశ్రమం వద్ద హింసాకాండ తదితర నేరారోపణలపై పోలీసులు హిస్సార్ కోర్టుకు తీసుకువెళ్లారు. ఆరుగురు మరణించడం సహా గత రెండు రోజులుగా ఆశ్రమంలో జరుగుతున్న ఘటనలపై తాజాగా రాంపాల్, ఆయన అనుచరులపై పోలీసులు 35 కేసులను నమోదు చేశారు. కొన్ని కేసుల దర్యాప్తునకు గానూ హిస్సార్ ఎస్పీ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. ఆశ్రమ వ్యవహారాల్లో మావోయిస్టుల పాత్ర ఉన్నట్లు దర్యాప్తులో తేలితే.. దానిపై కూడా క్షుణ్ణంగా విచారణ జరుపుతామని హర్యానా డీజీపీ వశిష్ట్ తెలిపారు. తప్పుడు ఆరోపణలు: రాంపాల్ కోర్టుకు హాజరుపర్చేముందు స్వామి రాంపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు తేలింది. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని స్వామి రాంపాల్ పేర్కొన్నారు. కోర్టు హాల్లో మాత్రం ఆయన మౌనంగా ఉన్నారు. బుధవారం వరకు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న రాంపాల్‌కు చెందిన సత్లోక్ ఆశ్రమం నుంచి అనుచరులందరినీ పోలీసులు ఖాళీ చేయించి, క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మీడియాను ఆశ్రమంలోకి అనుమతించారు. స్నానం పాలతో.. ప్రసాదం! హిస్సార్: అరెస్ట్ అనంతరంరాంపాల్ లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. భక్త కబీరు ఆధ్యాత్మిక వారసుడిగా ప్రకటించుకున్న రాంపాల్.. భక్తులకు రోజూ అందించే ప్రసాదం ఏంటో తెలుసా?. పాలతో స్నానం చేసి.. ఆ పాల తో ఖీర్ తయారుచేయించి, భక్తులకు క్షీరామృతంగా అందిస్తా రు. హర్యానాలోని బల్వారాలో 12 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటైనఈ ఆశ్రమం ఆధునిక హంగులతో అలరారుతూ ఉంటుం ది. భారీ స్విమింగ్ పూల్, ఎసీ గదులు, ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ స్క్రీన్లతో లెక్చర్ హాళ్లు ఉన్న ఆధునిక ఆశ్రమం అది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా భారీ గానే సమకూర్చుకున్నారని సమాచారం. తమను అర్థనగ్నంగా ఉండాలనిమేనేజ్మెంట్ వేధించిందని ఆశ్రమం నుంచి బయటకు వచ్చిన మహిళలు తెలిపారు. -
రాంపాల్ కు ఈనెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ
చండీగఢ్: వివాదాస్పద స్వామి రాంపాల్ కు చండీగఢ్-హర్యానా హైకోర్టు నవంబర్ 28 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గురువారం ఆయనను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై తదుపరి విచారణను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ ఈనెల 28కి వాయిదా వేసింది. రాంపాల్ అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో అఫిడవిట్ సమర్పించాలని హర్యానా డీజీపీని కోర్టు ఆదేశించింది. బర్వాలాలోని రాంపాల్ ఆశ్రమం వద్ద ఎంత నష్టం జరిగింది, ఎంతమంది గాయపడ్డారు, ఆశ్రమం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఆస్తినష్టంకు సంబంధించిన వివరాలు అఫిడవిట్ లో పొందుపర్చాలని సూచించింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ రాంపాల్ ను హర్యానా పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేశారు. -
హైవేపై కాల్పుల నిందితులకు 25వరకూ రిమాండ్
గన్నవరం : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పెదఅవుటపల్లి ట్రిపుల్ మర్డర్ కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం ఉదయం గన్నవరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. వారికి ఈనెల 24వ తేదీ వరకూ న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాగా అంతకు ముందు సీపీ ....అయిదు గంటల పాటు నిందితులను విచారించారు. మూడు హత్యల కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను భారీ భద్రత నడుమ ప్రత్యేక బస్సులో కమిషనరేట్‌కు తీసుకు వచ్చారు. గత నెల 24న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. -
‘బాండ్లు చెల్లించలేని అమాయకులకు అండగా నిలవాలనే'
న్యూఢిల్లీ: ఇది వ్యక్తిగత పోరాటం కాదని, బాండ్లు చెల్లించలేని స్థితిలో కారాగారాల్లో మగ్గుతున్న వందలాది మంది అమాయకులకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే తమ అధినేత బాండ్ ఇవ్వకుండా ఉండిపోయారని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఈ మేరకు ఆప్ ఓ ప్రకటన విడుదల చేసింది. నిర్ణయానికి కట్టుబడినందువల్లనే తమ పార్టీ అధినేత మూడో రోజు కూడా కారాగారంలో గడపాల్సి వచ్చిందని పేర్కొంది. తమ పార్టీ అధినేత చర్య న్యాయవ్యవస్థను ఓ గట్టి సవాలు విసిరినట్టయ్యిందని పేర్కొంది. పరువునష్టం కేసుకు సంబంధించి బాండ్ సమర్పించపోవడంతో దిగువకోర్టు తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిం చడాన్ని ఆప్ హైకోర్టులో సవాలు చేయనుంది. కోర్టు ఆదేశాల మేరకు వచ్చే నెల ఆరో తేదీదాకా కేజ్రీవాల్ తీహార్ కారాగారంలో ఉండనున్నారు. మరోవైపు తీహార్ కారాగారంలో రాసిన లేఖను అధినేత అరవింద్ ఆదేశాల మేరకు ఆప్ నాయకులు, కార్యకర్తలు ఢిల్లీలోని ప్రతి ఇంటికీ పంపిణీ చేయనున్నారు. -
కేజ్రీవాల్ కస్టడీ 6 వరకు పొడిగింపు
బెయిల్ బాండ్ ఇవ్వడానికి ఆప్ నేత ససేమిరా న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ రిమాండ్‌ను ఢిల్లీ కోర్టు జూన్ 6వ తేదీ వరకు పొడిగించింది. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ పెట్టిన పరువు నష్టం కేసులో బెయిల్ బాండ్ సమర్పించకపోవడంతో ఈనెల 21న కేజ్రీవాల్‌కు రెండు రోజుల కస్టడీ విధించడం తెలిసిందే. దీంతో అదేరోజు ఆయన్ను తీహార్ జైలుకు తరలించారు. కస్టడీ గడువు ముగియడంతో శుక్రవారం కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచారు. బెయిల్ బాండ్ సమర్పించకూడదన్న తన పాత వైఖరికే కట్టుబడి ఉండటంతో.. కోర్టు ఆయన్ను మందలించింది. ఈ అంశంపై వివేకంతో వ్యవహరించాలంది. ‘‘మే 21న నేను జారీచేసిన ఉత్తర్వులు పునఃసమీక్షించబోను. మీరు కావాలనుకుంటే నా ఉత్తర్వులను సవాల్ చేసుకోవచ్చు. పార్టీ ఇతర నేతలు బెయిల్ బాండు సమర్పిస్తున్నప్పుడు కేజ్రీవాల్ ఎందుకు ఆ పనిచేయడంలేదు’’ అని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గోమతి మనోకా ప్రశ్నించారు. దేశంలో న్యాయపరమైన అంశాల్లో చాలామందికి అవగాహన ఉండటంలేదని, చివరకు విద్యావంతులకు కూడా ఏది బెయిలో ఏది బెయిల్ బాండో తెలియడంలేదన్నారు. అంతకుముందు కేజ్రీవాల్ వాదిస్తూ.. ‘‘ఎంతోమంది రాజకీయ నేతలుు నాపై ఇలాంటి కేసులు పెట్టారు. దీంతో కోర్టులకు అండర్‌టేకింగ్ ఇచ్చిన తర్వాత విడుదలయ్యేవాడిని’’ అని చెప్పారు. అయితే, బెయిల్ కోసం బాండు సమర్పించడం న్యాయపరమైన ప్రక్రియ అని న్యాయమూర్తి పేర్కొంటూ కేజ్రీవాల్‌కు విధించిన కస్టడీని పొడిగించారు. -
ధర్మవరం సబ్జైల్లో పరిటాల శ్రీరామ్
-
జ్యుడీషియల్ కస్టడీలోనే సహారా చీఫ్ సుబ్రతారాయ్
ఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతారాయ్ జ్యుడీషియల్ కస్టడీలోనే కొనసాగనున్నారు. రాయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. 10 వేలకోట్ల రూపాయలు డిపాజిట్ చేయలేమని సహారా గ్రూప్ తెలియజేయడంతో ఆయన కస్టడీలోనే ఉండక తప్పని పరిస్థితి ఏర్పడింది. సుబ్రతారాయ్తోపాటు సహారా గ్రూప్ ఇరువురు డెరైక్టర్లకు తాత్కాలిక బెయిల్ ఇవ్వాలంటే 10 వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సిందేనని సహారా గ్రూప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. కోర్టు తాజా షరతులను కంపెనీ పాటిస్తేనే తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేయడం జరుగుతుందని జస్టిస్ కేఎస్ రాధాకృష్ణన్, జస్టిస్ జేఎస్ కేహార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. గ్రూప్ సంస్థలు రెండు మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా మదుపరుల నుంచి 25 వేల కోట్ల రూపాయలు సమీకరణ - సంబంధిత డబ్బు తిరిగి చెల్లింపులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశం - ఈ ప్రక్రియలో సహారా వైఫల్యం - సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణ వ్యవహారంలో మార్చి 4వ తేదీ నుంచీ రాయ్, ఇరువురు డెరైక్టర్లు- రవి శంకర్ దుబే, అశోక్ రాయ్ చౌదరి జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగుతున్నారు. -
తేజ్ పాల్ బెయిల్ పై నేడు బాంబే కోర్టులో విచారణ
పనాజి: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ బెయిల్ పిటీషన్ పై మంగళవారం బాంబే హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటీషన్ పై ఫిబ్రవరి 18 వ తేదీన వాదనలు విన్న కోర్టు నేటికి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని అందించాలని కోర్టు క్రైంబ్రాంచ్ ను కోరింది. బెయిల్ పిటీషన్ పై తేజ్ పాల్ ను నేడు కోర్టులో హాజరు పరుచనునున్నారు. అంతకుముందు తరుణ్ తేజ్‌పాల్ బెయిల్ పిటిషన్ ను గోవా కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలులుగా తేజ్ పాల్ జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు.అతనిపై లైంగిక వేధింపుల చట్టం క్రింద 354, 354-ఏ సెక్షన్లు, దురద్దేశంతో కూడిన వ్యాఖ్యలు చేసినందకు 341 ,342 సెక్షన్లు, అత్యాచార అభియోగాల క్రింద 376,376(2)(ఎఫ్), 376(2)(కె) సెక్షన్ల ను గోవా క్రైం బ్రాంచ్ పోలీసులు నమోదు చేశారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్‌ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయన ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్‌పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. -
తేజ్ పాల్ జుడిషియల్ రిమాండ్ 14 రోజలు పొడిగింపు
పానాజీ: తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ జుడీషియల్ రిమాండ్ ని 14 రోజుల పాటు పొడిగిస్తూ స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం నవంబర్ లో గోవాలోని రిసార్డులో జరిగిన కాన్పరెన్స్ సందర్భంగా సహ ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై తేజ్ పాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గత రెండు నెలలుగా ఆయన పోలీసు, జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో బెయిల్ కోసం బాంబే హైకోర్టును తేజ్ పాల్ ఆశ్రయించారు. ప్రస్తుతం వాస్కో కు 35 కిలో మీటర్ల దూరంలోని సదా సబ్ జైలులో ఉన్నారు. -
బీఎస్పీ ఎంపీ దంపతుల కస్టడీ పొడిగింపు
న్యూఢిల్లీ: పని మనిషి హత్య కేసులో నిందితులైన బీఎస్పీ ఎంపీ ధనుంజయ్‌సింగ్, అతని భార్య జాగృతి సింగ్‌ల జ్యుడీషియల్ కస్టడీ కోర్టు పొడిగిం చింది. నిందితుల న్యాయవాది ఈ విషయాన్ని ప్రొడక్షన్ వారంట్ జారీ చేసిన మెట్రోపాలిటన్ మేజి స్ట్రేట్ గోమమతి మనోచ తెలిపారు. నిందితులు డిసెంబర్ 3వ తేదీ వాయిదాకు హాజరు కాకపోవడాన్ని ప్రశ్నించిన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు ఈ విషయం తెలిపారు. తీహార్ జైలు మేజిస్ట్రేట్ నిందితుల జ్యుడీషియల్ కస్టడీని డిసెంబర్ 16వ తేదీ వరకు పొడిగించారన్నారు. ధనుంజయ్‌సింగ్ ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్‌కు చెందిన బీఎస్పీ ఎంపీ కాగా, జాగృతి రాంమనోహర్ లోహియా హాస్పిటల్లో దంతవైద్యురాలు. పనిమనిషి రాఖీభద్ర హత్య కేసులో ఈ ఇద్దరిని నవంబర్ 5వ తేదీన అరెస్టు చేశారు. ధనుంజయ్ సింగ్ ఇప్పటికే హత్య, మాఫియా నిరోధక చట్టం కింద కేసులు ఎదుర్కొంటున్నాడు. పనిమనిషి కేసులో సాక్ష్యాలను నిర్మూలించడానికి ప్రయత్నించినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ భార్య జాగృతి మీద ఐపీసీ 302, 307, 344 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తీహార్ జైలులో ఉన్న ధనుంజయ్‌సింగ్ బెయిల్ పిటిషన్‌ను నవంబర్ 20వ తేదీన మెట్రోపాలిటన్ కోర్టు కొట్టివేసింది. తదనంతరం సెషన్స్ కోర్టులో పిటిషన్ వేయగా అదనపు సెషన్స్ జడ్జి ధర్మేశ్‌శర్మ కొట్టివేశారు. -
హత్య కేసులో ఇరికించారు
న్యూఢిల్లీ:పనిమనిషి రాఖీ భద్ర హత్య కేసులో తనను పోలీసులు ఇరికించారని బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్ వాపోయాడు. అనూహ యమైన, హింసాత్మమైన ధోరణిని అనుసరిస్తుండడంతో భార్య జాగృతి నుంచి తాను విడిపోయానని, వేరుగా నివసిస్తున్నానని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు సోమవారం సమర్పించిన బెయిల్ విన్నపంలో ఆయన పేర్కొన్నాడు. మృతురాలు రాఖీ భద్రను ఈ నెల ఒకటో తేదీనుంచే చిత్రహింసలకు గురిచేశారని, నాలుగో తేదీన ఆమె చనిపోయిందని పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారన్నారు. అయితే ఆ సమయంలో తాను తన నియోజకవర్గంలో ఉన్నానని ధనంజయ్ తెలిపారు. అంతేకాకుండా జాగృతి నుంచి విడాకులు కోరుతూ ఇప్పటికే ఓ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానన్నారు. అధిక కోపం వల్ల వచ్చే ఒత్తిడితో తన భార్య జాగృతి బాధపడేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రవర్తనతోపాటు మానసిక ప్రవృత్తిలో మార్పు తీసుకురావడం కోసం గత ఏడాది మే నెలలో ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లానని, అయితే ఆ వైద్యుడు ఇచ్చిన మందులను జాగృతి వాడలేదని తెలిపారు. 175, సౌత్ ఎవెన్యూలోని తన అధికారిక నివాసంలో జాగృతి తన వివేచన మేరకే నివసిస్తోందని, అక్కడ పనివాళ్లకు కేవలం తాను జీతాలు మాత్రమే చెల్లించేవాడినన్నారు. ఈ నెల నాలుగో తేదీన తాను తన నియోజకవర్గం నుంచి నగరానికి వచ్చానని, పోలీసులకే తానే హత్య సమాచారం అందించానని, అంతేకాకుండా ఆ ఇంట్లో కొంతకాలంగా తాను ఉండడం లేదనే విషయాన్ని కూడా తెలియజేశానని బెయిల్ విన్నపంలో పేర్కొన్నారు. జ్యుడీషియల్ కస్టడీకి ఎంపీ దంపతులు పనిమనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, ఆయన భార్య జాగృతిలను స్థానిక న్యాయస్థానం నాలుగురోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. గతంలో విధించిన పోలీసు కస్టడీ గడువు సోమవారం ముగిసింది. దీంతో పోలీసులు వీరిరువురినీ శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గోమతి మనోచా ఎదుట పోలీసులు హాజరుపరిచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించారు. కాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల రాఖీ భద్ర హత్యకు గురవడంతో ఈ నెల ఐదో తేదీన పోలీసులు వీరిరువురినీ అరెస్టుచేసిన సంగతి విదితమే. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించిన కొడుకు పనిమనిషి రాఖీభద్ర మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ఆమె కుమారుడు షెహజాన్ నిరాకరించాడు. ఈ విషయాన్ని పోలీసులు సోమవారం వెల్లడించారు. షెహజాన్ను నగరానికి తీసుకొచ్చేందుకు స్థానిక పోలీసుల బృందం పశ్చిమబెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో తిష్టవేసింది. ఇందుకోసం అక్కడి పోలీసులతోపాటు ఇరుగునపొరుగువారి సహాయం కూడా తీసుకుంటోంది. ఇదిలాఉండగా తల్లి హత్య కేసు నేపథ్యంలో తన ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లొచ్చనే భయంతో షెహజాన్ ఈ నెల ఏడో తేదీన నగరం నుంచి పారిపోయాడు. ఈ హత్యతో తాను ఎంతగానో భయపడ్డానని పోలీసులకు షెహజాన్ తెలియజేశాడు. -
హత్య కేసులో జ్యుడీషియల్ కస్టడీకి ఎంపీ దంపతులు
న్యూఢిల్లీ: పనిమనిషి హత్య కేసులో అరెస్టయిన బీఎస్పీ ఎంపీ ధనంజయ్ సింగ్, భార్య జాగృతిను స్థానిక న్యాయస్థానం నాలుగురోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. పోలీస్ కస్టడీ గడువు ముగియడంతో ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తున్న జాగృతి, ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ ఎంపీ ధనంజయ్లను శుక్రవారం మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి గోమతి మనోచా ఎదుట పోలీసులు హాజరుపరిచారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన 35 ఏళ్ల రాఖీ భద్ర హత్యకు గురవడంతో ఈ నెల ఐదో తేదీన పోలీసులు జాగృతి అరెస్టుచేసిన సంగతి విదితమే. ఈ ఘటనకు సంబంధించి ఫోరెనిక్స్ విభాగం అందజేసే నివేదిక అనంతరం జాగృతి మరికొన్ని రోజులు పోలీస్ కస్టడీని ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
అక్రమ మైనింగ్ కేసులో ఎమ్మెల్యే సురేశ్ బాబుకు రిమాండ్!
కర్నాటకలో బెలికెరి పోర్టు నుంచి అక్రమంగా ఇనుప ఖనిజం తరలించారనే కేసులో బీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సురేష్ బాబుకు సీబీఐ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్ 27 వరకు జుడిషియల్ కస్టడీ విధించింది. అక్రమ మైనింగ్ కేసులో రిమాండ్ లో ఉన్న గాలి జనార్ధన రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సురేశ్ బాబును సీబీఐ గురువారం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం శుక్రవారం ఉదయం కోర్టులో హాజరుపరిచారు. కర్నాటక లోకయుక్తా ఎన్ సంతోష్ హెగ్డే అక్రమ కుంభకోణంపై ఆరోపణలు చేశారు. ఈ కేసులో 2006-2007, 2010-11 సంవత్సర మధ్యకాలంలో 7.74 మిలియన్ల ఖనిజ సంపదను అక్రమంగా తరలించారని ఆరోపణల్ని నివేదికలో పేర్కొన్నారు. -
కటకటాల వెనక్కి ఆశారాం
జోధ్‌పూర్: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడు, ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును సోమవారం జైలుకు తరలించారు. స్థానిక జిల్లా, సెషన్స్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో ఆయన కటకటాల వెనక్కి వెళ్లారు. జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో ఆశారాం ఓ పదహారేళ్ల బాలికను లైంగికంగా వేధించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తెల్లని ధోతీ, కుర్తా.. తలపై ఎర్రని టోపీ ధరించిన ఈ 72 ఏళ్ల వివాదాస్పద ఆధ్యాత్మిక గురువును భారీ బందోబస్తు మధ్య పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఆయన్ను ఈ నెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపాల్సిందిగా మేజిస్ట్రేట్ మనోజ్‌కుమార్ ఆదేశించారు. దీంతో ఆశారాంను జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. అంతకుముందు సుమారు 15 నిమిషాల సేపు ఆయన కోర్టులో గడిపారు. ఆశారాంకు బెయిల్ కోసం ఆశ్రమం తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఒకరోజు పోలీసు కస్టడీలో భాగంగా ఆదివారం అధికారులు ఆయన్ను నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఆయనపై ఆరోపణలకు సంబంధించి తమ వద్ద కీలక సాక్ష్యాధారాలు ఉన్నాయని డీసీపీ అజయ్ లాంబా విలేకరులకు చెప్పారు. సాధువులేమిటి ఎవర్నైనా శిక్షించాల్సిందే: కాంగ్రెస్ ఒక్క సాధువులనే కాదు.. ఇలాంటి నేరాలకు పాల్పడే వారంద రినీ శిక్షించి తీరాల్సిందేనని కాంగ్రెస్ పేర్కొంది. ఈ తరహా నేరాలపై సాధువుల్ని జైలుకు పంపడం మంచిదేనా? అన్న ప్రశ్నకు ఆ పార్టీ స్పందించింది. చట్టం అందరికీ ఒక్కటేనని, చట్టానికి ఎవరూ అతీతులు కారనేదే సందేశమంటూ ఆశారాం అరెస్టుపై అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి జవాబిచ్చారు. -
ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాల్సిందే
న్యూఢిల్లీ: పోలీసు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పు పార్లమెంటు ఔన్నత్యానికి భంగకరమని వివిధ రాజకీయ పక్షాలు అభిప్రాయపడ్డాయి. ఈ తీర్పునకు కారణమైన ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపాయి. ఎంపీలకుగానీ, ఎమ్మెల్యేలకుగానీ ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్లకన్నా ఎక్కువ శిక్ష పడితే.. తక్షణమే వారు వారి పదవులకు అనర్హులవుతారంటూ కోర్టు వెల్లడించిన తీర్పును సైతం రాజకీయపక్షాలు తప్పుపట్టాయి. ప్రజా ప్రతినిధులపై ఈ తీర్పు ప్రభావం లేకుండా చేసేందుకు రాజ్యాంగ సవరణ చేయాలన్న ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. మంగళవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఇందులో బీజేపీ, లెఫ్ట్, బీఎస్పీ, ఎస్పీ తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు వెల్లడించిన పెరైండు కీలక తీర్పులతోపాటు అరెస్టయి ఒక్కరోజు పోలీసుల అదుపులో ఉన్నా సదరు వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడంటూ పాట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఎయిమ్స్ ఫ్యాకల్టీ నియామకాల్లో రిజర్వేషన్లు, ప్రతిపాదిత జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్’ బిల్లుపై ఈ భేటీలో చర్చించారు. జ్యుడిషియల్ కమిషన్ బిల్లును పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలని అఖిలపక్షం ప్రభుత్వాన్ని కోరింది. హర్యానాలో వాద్రా భూముల కొనుగోలు అంశాన్ని బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ సమావేశంలో ప్రస్తావించారు. ఈ విషయాన్ని పార్లమెంటులో ఎందుకు ప్రస్తావించకూడదంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పార్లమెంటు ఔన్నత్యం దెబ్బతినకుండా చూసేందుకు తగిన చర్యలు చేపట్టాలని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని అఖిల పక్షం కోరిందని భేటీ అనంతరం మంత్రి కమల్‌నాథ్ చెప్పారు. ప్రస్తుత సమావేశాల్లోనే జ్యుడిషియల్ కమిషన్ బిల్లును ప్రవేశపెట్టాలని వివిధ పార్టీల నేతలు కోరినట్లు వివరించారు. ఇటలీ వాళ్లకో న్యాయం.. మనకో న్యాయమా: సుష్మ అఖిలపక్ష భేటీలో ఇటీవల కోర్టులు వెలువరించిన తీర్పులను చర్చించినట్లు బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ విలేకరులకు చెప్పారు. ‘కోర్టు తీర్పు ప్రకారం పోలీసు కస్టడీలో ఒక్కరోజు ఉన్నా ఓటేయడానికి వీల్లేదు. ఎన్నికల నామినేషన్ వేయడానికి వీల్లేదు. ఈ పరిస్థితిని నివారించేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరిస్తామని ప్రభుత్వం చెప్పింది. దీనికి మేం మద్దతు తెలిపాం. ఎందుకంటే ఇదే న్యాయవ్యవస్థ... జాలర్ల హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇటలీ నావికులను ఓటేసేందుకు వారి దేశానికి పంపింది. కానీ మనదేశంలో ఒక్కరోజు అరెస్టయిన ఆ వ్యక్తి ఓటేయడానికి వీల్లేదు.. పోటీ చేయడానికి వీల్లేదట! ఇది సరికాదు’ అని ఆమె అన్నారు. కాంగ్రెస్-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్: ఏచూరి సభలో ప్రజా సమస్యలు ప్రస్తావన కు రాకుండా కాంగ్రెస్-బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆరోపించారు. సభ సజావుగా నడవాలంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని పేర్కొన్నారు. -
మంత్రి ధర్మాన, సబితాల జ్యుడీషియల్ కస్టడీకి నో: సీబీఐ ప్రత్యేక కోర్టు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఊరట లభించింది. కేసును ప్రభావితం చేసేలా తరచుగా మీడియాతో మాట్లాడుతున్న వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమోను ప్రత్యేక కోర్టు బుధవారం కొట్టివేసింది. వీరిద్దరూ మీడియాతో మాట్లాడిన సీడీలను పూర్తిగా పరిశీలించామని, వీరి వ్యాఖ్యలు సాక్షులను ప్రభావితం చేసేలా లేవని ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు తన ఉత్తర్వుల్లో అభిప్రాయపడ్డారు. సీబీఐ సమర్పించిన అన్ని రికార్డులను పరిశీలించామని, వారు చేసిన నేరారోపణలకు సంబంధించి ఆధారాలేవీ కనిపించడంలేదని స్పష్టంచేశారు. ధర్మాన, సబితలు చేసిన వ్యాఖ్యల్లో ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. అయినా సాక్షులు వాటిని తప్పుగా అర్థం చేసుకుంటే అందుకు వీరు బాధ్యులు కారని తేల్చిచెప్పారు. వీరిద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ వేసిన మెమోలో సరైన కారణాలేవీ లేవని న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. ‘‘మంత్రివర్గ సమష్టి నిర్ణయాల మేరకే వ్యవహరించామని, తాము ఎటువంటి తప్పు చేయలేదని మీడియా ద్వారా ప్రజలకు వివరించడమే మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలు చేసిన తప్పా? సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ అశోక్‌భాన్ మీడియాతో మాట్లాడితే తప్పు లేనప్పుడు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాట్లాడితే చట్ట విరుద్ధం ఎలా అవుతుంది. దర్యాప్తు చేస్తున్నప్పుడు, చార్జిషీట్ దాఖలు చేసినప్పుడు ధర్మాన, సబితలు సాక్షులను ప్రభావితం చేయనప్పుడు.. ఇప్పుడెలా చేస్తారు? మంత్రులుగా ఉన్నపుడు సాక్షులను ప్రభావితం చేయని వారు మంత్రి పదవులు కూడా లేని ఈ సమయంలో ఎలా చేస్తారు? చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కూడా వీరిని కస్టడీకి తీసుకోవాలని సీబీఐ కోరలేదు కదా!! కోర్టు ప్రశ్నించినప్పుడు సైతం సమన్లు ఇస్తే సరిపోతుందని పేర్కొంది కదా!! అందుకని సహేతుకమైన కారణాలు చెప్పకుండా వీరిని జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన మెమో విచారణార్హం కాదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి, గవర్నర్లను కలిసి కళంకిత మంత్రులంటూ ధర్మాన, సబితలపై ఫిర్యాదు చేశారు. వాటికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా వారిపై ఉంది. ఆరోపణలకు వివరణ ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అందుకే వారు మీడియాతో మాట్లాడారు. తాము ఎటువంటి తప్పు చేయలేదని, తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటామని, న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని మాత్రమే వారు వ్యాఖ్యానించారు’’ అని మంత్రుల తరఫున న్యాయవాది ఉమామహేశ్వర్రావు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. -
ధర్మాన, సబితాలకు సీబీఐ కోర్టులో ఊరట
హైదరాబాద్ : మాజీమంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున వీరిద్దర్ని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలన్న సీబీఐ గతంలో దాఖలు చేసిన మెమోను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ గతంలో కోర్టుకు విన్నవించింది. అలాగే వీరిద్దరు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను కోర్టుకు సమర్పించింది. వ్యక్తిగత పూచికత్తులు సమర్పించినా ..జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపవచ్చంటూ సీబీఐ వాదించింది. అయితే సీబీఐ నిందితులకు రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛను కాలరాస్తుందని ధర్మాన ,సబితా తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసిందని.. కోర్టుకు వ్యక్తిగత పూచికత్తును కూడా సమర్పించారని .. అప్పుడు జ్యుడీషియల్ రిమాండ్ అడగని సీబీఐ ఇప్పుడు ఎలా పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రశ్నించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నిర్ణయాన్ని తన తీర్పును నేటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ధర్మాన, సబితా ఇంద్రారెడ్డి....సాక్ష్యులను బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సిబిఐ కోర్టు పేర్కొంది.